టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇవాళ నారా రోహిత్ బర్త్ డే కావడంతో టైటిల్‌తో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈసారి నారా రోహిత్ కాస్తా డిఫరెంట్ కంటెంట్‌తో పలకరించబోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ సినిమాకు కపాలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు నేపథ్యంతో సాగే ఈ కథలో మైండ్-బెండింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ మూవీకి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత పట్నాయక్, లావణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.
A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1
— Rohith Nara (@IamRohithNara) July 24, 2026


