క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ.. ఇండియాలో ఏకంగా సెంచరీ..! | Christopher Nolan The Odyssey epic ends first week with this collections | Sakshi
Sakshi News home page

The Odyssey: ది ఒడిస్సీ.. వారం రోజుల్లోనే సెంచరీ..!

Jul 24 2026 6:40 PM | Updated on Jul 24 2026 6:54 PM

Christopher Nolan The Odyssey epic ends first week with this collections

హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ ది ఒడిస్సీ. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. క్రిస్టోఫర్ చిత్రాలకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ దాటేసింది. 

ఏడో రోజు ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా రూ.90.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.107.72 కోట్లకు చేరుకుంది. వీకెండ్‌ లేకపోయినా కూడా ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం చూస్తుంటే నోలన్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. ఈ వసూళ్లతో ఇండియాలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నోలన్ రెండో చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

టెనెట్, ఓపెన్‌హైమర్, ఇంటర్‌స్టెల్లార్ చిత్రాల తొలిరోజు కలెక్షన్లను దాటేసిన నోలన్‌కి అతిపెద్ద ఓపెనింగ్  సినిమాగా ది ఒడిస్సీ నిలిచింది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 332 మిలియన్ డాలర్లు సాధించింది. మరోవైపు వీకెండ్ రానుండడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement