breaking news
collections
-
దురంధర్ అరుదైన రికార్డ్.. పుష్ప-2, బాహుబలి-2 తర్వాత..!
రణ్వీర్ సింగ్ నటించిన స్రై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'దురంధర్'. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-2 చిత్రాలను అధిగమించింది.తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్-2 చిత్రాన్ని దాటేసింది. పుష్ప-2, బాహుబలి-2 సినిమాల తర్వాత స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇండియాలో రూ.1002 కోట్ల వసూళ్లు సాధించింది. మనదేశంలో వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి బాలీవుడ్ మూవీగా అవతరించింది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్'(రూ.760) పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.అరుదైన రూ.1000 కోట్ల క్లబ్రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్' మూవీతో పాటు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరాయి. ఈ జాబితాలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్'(రూ.1,471 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి- 2: ది కన్‌క్లూజన్ (రూ.1417 కోట్లు) రెండోస్థానంలో ఉంది. ఈ జాబితాలో మూడో చిత్రంగా దురంధర్(రూ.1002) నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2(రూ.1001) కోట్లతో నాలుగో ప్లేస్ దక్కించుకుంది.కాగా.. ఈ స్పై థ్రిల్లర్‌కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణ్వీర్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురందర్ -2 మార్చిలో విడుదల కానుంది.భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు1 పుష్ప 2 -రూ.1471 కోట్లు2 బాహుబలి 2- రూ.1417 కోట్లు3 ధురందర్- రూ.1002 కోట్లు4 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.1001 కోట్లు5 ఆర్ఆర్ఆర్- రూ.916 కోట్లు6 కల్కి 2898 ఏడీ- రూ.767 కోట్లు7 జవాన్- రూ.760 కోట్లు8 కాంతార చాప్టర్ 1- రూ.741 కోట్లు9 ఛావా- రూ.716 కోట్లు10 స్త్రీ 2- రూ.713 కోట్లు -
మనశంకర వరప్రసాద్‌గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!
మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.ఈ విషయాన్ని నిర్మాత సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటూ ట్వీట్ చేసింది. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్లో రాసుకొచ్చింది. కేవలం రిలీజైన ఎనిమిది రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. బాక్సాఫీస్ బద్దలైపోయింది💥💥💥Megastar @KChiruTweets garu is breaking box office records with his SWAG and STYLE 😎🔥#ManaShankaraVaraPrasadGaru grosses ₹300+ crores worldwide and becomes an ALL-TIME INDUSTRY RECORD as the FASTEST regional film ❤️🔥… pic.twitter.com/9wmeDz9lKR— Sushmita Konidela (@sushkonidela) January 19, 2026 -
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్‌బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026 -
ది రాజాసాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆదిపురుష్ కంటే తక్కువే..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్‌ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్‌గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. -
'మన శంకరవరప్రసాద్ గారు' ఫస్ట్ డే.. భారీ కలెక్షన్స్
చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో చిరంజీవితో పాటు వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు నటించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత చిరుకు భారీ హిట్ పడిందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.'మన శంకరవరప్రసాద్ గారు' ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 84కోట్లు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ చిత్రంగా 'మన శంకరవరప్రసాద్ గారు' నిలబడింది. 'సైరా నరసింహా రెడ్డి' చిత్రానికి మొదటిరోజు రూ. 85 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఖైదీ నంబర్ 150'కి (రూ. 51 కోట్లు), వాల్తేరు వీరయ్య (రూ. 49.10 కోట్లు), గాడ్ ఫాదర్ (రూ. 32.70 కోట్లు), ఆచార్య ( రూ. 52 కోట్లు), భోళా శంకర్ (రూ. 28 కోట్లు) వచ్చాయి. మన శంకరవరప్రసాద్ గారు బాక్స్ఆఫీస్ బద్దలుకొట్టేసారు 💥💥💥₹84 CRORES+ WORLDWIDE GROSS for#ManaShankaraVaraPrasadGaru (Premieres + Day 1) ❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD OPENINGS EVERYWHERE 🔥🔥🔥#MegaBlockbusterMSGMegastar @KChiruTweetsVictory @VenkyMama@AnilRavipudi #Nayanthara… pic.twitter.com/qId5atqw8T— Shine Screens (@Shine_Screens) January 13, 2026 -
ప్రేమమ్ హీరో సినిమా.. పది రోజుల్లోనే వంద కోట్లు..!
మలయాళ సినిమా 'ప్రేమమ్' హీరో నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు.తాజాగా ఈ చిత్రం వసూళ్ల పరంగా వందకోట్ల మార్క్ చేరుకుంది. రిలీజైన పది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా.. మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త లోకా టాప్ ప్లేస్‌లో ఉంది. సర్వం మాయ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశముంది. BIGGEST EVER COMEBACK IN MOLLYWOOD 🏆🏆🏆🏆#SarvamMaya 100 Crores + Worldwide Gross Done & Dusted in 10 Days 🔥🔥 First #NivinPauly Movie to Gross 100 Cr 👏👏 Just a Feel Good Family Movie 💥 When He is in his safe zone then no one can even touch him once again Proved 🔥🔥🔥🔥 pic.twitter.com/1T0i530cs3— Kerala Box Office (@KeralaBxOffce) January 3, 2026 100 CRORES CLUB :#SarvamMaya enters 100 Crores Club Worldwide in 10 days . Truly , A Dream Comeback For #NivinPauly 🔥 pic.twitter.com/BUsNtMwfJO— Friday Matinee (@VRFridayMatinee) January 3, 2026 -
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025 -
జేమ్స్ కామెరూన్ అవతార్-3.. ఇండియాలో క్రేజీ రికార్డ్..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్. ఈ సిరీస్‌లో వచ్చిన పార్ట్-3 ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 19న ఇండియా వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా అవతరించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.ఈ క్రమంలోనే అవతార్ -3.. హాలీవుడ్ మూవీ ఎఫ్1 ఇండియా ఆల్‌టైమ్ వసూళ్లను అధిగమించింది. దీంతో ఈ ఏడాది హాలీవుడ్ చిత్రాల లిస్ట్‌లో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. అవతార్-3 ఇప్పటివరకు ఇండియావ్యాప్తంగా రూ. రూ. 131 కోట్లు వసూలు చేసింది. ఈ క్రమంలోనే 2025లో విడుదలైన బ్రాడ్ పిట్ మూవీ ఎఫ్1 రూ. 129 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఇప్పటివరకు భారతదేశంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన విదేశీ చిత్రంగా అవతార్-3 నిలిచింది.అవతార్ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ చిత్రానికి ఇండియాలో అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. తొలి రోజు కేవలం రూ. 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ బరిలో ఉండడం అవతార్-3కి కలిసి రాలేదని చెప్పాలి. కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 400 మిలియన్ డాలర్ల మార్క్‌కు దగ్గర్లో ఉంది. -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారిందా? అనేది తెలుసుకుందాం.ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్‌గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ విమర్శలు..బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్‌కు మరింత ప్లస్‌గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్‌కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది. -
దురంధర్ మరో రికార్డ్.. ఆ లిస్ట్‌లో షారూఖ్ ఖాన్ జవాన్ కంటే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. -
టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు.. గత పదేళ్లలో ఏ సినిమాలంటే?
మరో కొద్ది రోజుల్లోనే మరో ఏడాది కాల గర్భంలో కలిసి పోనుంది. కొత్త ఏడాది కోసం ఎన్నో కొత్త ఆశలతో ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏటా ఏదో ఒకటి సాధించాలని గట్టిగా సంకల్పంతో నిర్ణయించుకుంటారు. అలా సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ఏడాది మన సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకోవడం సహజం. ముఖ్యంగా ఈ ఏడాదిలోనైనా విజయాలు దక్కాలని టాలీవుడ్లో దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. అనుకున్నవన్నీ జరగకపోయినా.. మనకంటూ ఒక రోజు ఉంటుందని ముందడుగు వేస్తూనే ఉంటాం.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఈ ఏడాది మన టాలీవుడ్‌కు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క సంక్రాంతికి వస్తున్నాం, ఓజీ చిత్రాలు మినహాయిస్తే ఏ ఒక్కటి కూడా రూ.500 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో రూ.500 కోట్లు అనేది కష్టసాధ్యమైన పనేమి కాదు. గత పదేళ్లలో ప్రతి ఏటా ఏదో ఒక బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్న టాలీవుడ్.. ఈసారి ఎందుకో వెనకంజలో ఉంది. గతేడాది పుష్ప-2 ప్రభంజనంతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దంగల్ తర్వాత ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.బాహుబలి-2 ప్రభంజనం.. గత పదేళ్లుగా పరిశీలిస్తే టాలీవుడ్ పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. 2016లో వచ్చిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ మూవీగా అవతరించింది. ఆ తర్వాత 2017లో వచ్చిన బాహుబలి-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో విడుదలైన రామ్ చరణ్ రంగస్థలం ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.బాహుబలి-2 తర్వాత వచ్చిన ప్రభాస్ మూవీ సాహో. ఈ చిత్రం 2019లో రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్ సత్తా చాటింది. ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత 2020లో వచ్చిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే.ఆ తర్వాత ఏడాది 2021లో రిలీజైన బన్నీ- సుకుమార్ మూవీ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం ఏకంగా రూ.390 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. 2022లో దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక 2023లో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.701 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 రికార్డ్..గతేడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా అవతరించింది. ఇక 2025లో వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ.303 కోట్లతో టాలీవుడ్ నుంచి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆల్ ఇండియా వైడ్ చూస్తే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 మొదటి ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ దురంధర్ ఈ రికార్డ్ బ్రేక్ అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న దురంధర్.. రణ్వీర్ సింగ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్వీర్ సింగ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్లో శుక్రవారం రూ34.70 కోట్లు, శనివారం రూ.53.70 కోట్లు, ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో అరబ్ దేశాల్లో దురంధర్‌పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.The story of The Unknown Men is now known globally.Book your tickets. 🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/zvxEJqbrvv— Jio Studios (@jiostudios) December 15, 2025 -
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు.. (ఫొటోలు)
-
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్‌తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్ అంటూ పోస్టర్‌ను షేర్ చేసింది.అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥🎟️ https://t.co/HHe863GdbEA @SandeepRaaaj CinemaA @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY— People Media Factory (@peoplemediafcy) December 14, 2025 -
బాక్సాఫీస్ వద్ద దురంధర్.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే మొదటి వారం కలెక్షన్స్ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బిగ్ హిట్స్ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ లిస్ట్‌లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్ రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్వీర్ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. HISTORIC... 'DHURANDHAR' OVERTAKES 'PUSHPA 2', 'CHHAAVA', 'ANIMAL' ON *SECOND FRIDAY*... #Dhurandhar is rewriting the record books 🔥🔥🔥.First, take a look at the *second Friday* numbers...⭐️ #Pushpa2 #Hindi: ₹ 27.50 cr⭐️ #Chhaava: ₹ 24.03 cr⭐️ #Animal: ₹ 23.53 cr⭐️… pic.twitter.com/AYRjQia5sF— taran adarsh (@taran_adarsh) December 13, 2025 -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది. -
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడో రోజులైనా అంతేనా?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్‌ను దాటేసింది.అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్ కాలేకపోయాడు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా ఆ మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. -
రాజు వెడ్స్ రాంబాయి.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్!
ఈ రోజుల్లో కంటెంట్ కింగ్ అనే మాట అక్షరాల నిజమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్దపెద్ద స్టార్స్ ఉంటేనే మార్కెట్ ఉంటుందనే భ్రమలోనుంచి బయటికి రావాల్సిందే. చిన్న సినిమా అయినా సరే.. జనాలకు కనెక్ట్ అయితే కాసుల వర్షం కురిపించడం ఖాయమే. అదే నిజం చేస్తోంది ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా. అదేనండి రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి.ఈనెల 21న థియేటర్లలోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్‌కు ముందే తన కథపై నమ్మకంతో డైరెక్టర్ ఛాలెంజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. మొదటి రోజే ఈ మూవీకి దాదాపు కోటిన్నర కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కలిసి రావడంతో కేవలం మూడు రోజుల్లోనే రూ.7.28 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఒక్క నైజాంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కేవలం మౌత్‌టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కాగా.. ఈ మూవీలో తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతు సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.ఈ మూవీ కథేంటంటే..'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ. -
కాంతకు కలిసొచ్చిన వీకెండ్.. మూడు రోజుల్లో ఊహించని కలెక్షన్స్!
దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ బోర్సో జంటగా వచ్చిన తాజా చిత్రం కాంత(Kaantha collections). పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. ఫస్ట్ డే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.ఇక వీకెండ్ కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.24.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలకపాత్రలుపోషించారు. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాపై నిర్మించారు.తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎం.కె త్యాగరాజ భాగవతార్ జీవితం ఆధారంగా కాంత సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారని త్యాగరాజ భాగవతార్ మనవడు ప్రభుత్వ విశ్రాంత జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ (64) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. దీంతో న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చింది. RETRO BLOCKBUSTER AMAZES ALL ❤️🔥Kaantha continues to charm audiences on Day 3 💎In cinemas now. Book your tickets! 🎟️https://t.co/HI2qK0r7G3A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #Kaanthafilm #Kaanthafilmfrom14th@dulQuer @RanaDaggubati… pic.twitter.com/tLVXJU6aHh— Wayfarer Films (@DQsWayfarerFilm) November 17, 2025 -
శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్‌టైమ్ వసూళ్లు!
నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ మూవీ శివ. తెలుగు సినీ ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఈ చిత్రమిది. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీతోనే రాం గోపాల్ వర్మ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ కల్ట్ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.ఈ మూవీని తాజాగా 4కె వర్షన్లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 14న వచ్చిన ఈ చిత్రం కోసం నాగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త 4కె వర్షన్లో రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పట్లోనే రూ.4 కోట్లు రాబట్టిన శివ.. రీ రిలీజ్లోనూ సత్తా చాటడం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.#SHIVA THANDAVAM at the box office 👊🔥#Shiva4K grosses 3.95Crore worldwide in 2 days 💥💥💥Enjoy the weekend with cult in cinemas now!— https://t.co/vdUYG2JnoqExperience it in 4K DOLBY ATMOS with Music engineered by Artificial Intelligence. #50YearsOfAnnapurna… pic.twitter.com/xMV6otcgk3— Annapurna Studios (@AnnapurnaStdios) November 16, 2025 -
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్‌కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్‌గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్‌లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్‌గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
ఛావాను బీట్ చేసిన కాంతార చాప్టర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్-2 తర్వాత ఈ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా (రూ.807 కోట్లు) రికార్డ్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విటర్లో పోస్ట్ చేశారు. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలిచిందన్నారు. తమిళనాడులోనూ 3వ అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ఘనత సొంతం చేసుకుంది.ఇంగ్లీష్‌లోనూ కాంతార చాప్టర్-1ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. #KantaraChapter1 is now the Highest Grossing Indian Film of 2025.. 🔥 Joining the elite league after #KGF2…#KantaraChapter1 becomes only the 2nd dubbed film to storm past ₹100 Cr in Telugu States!3rd highest Dubbed film in TN..And its worldwide roar now crosses… pic.twitter.com/gCzgfUL8l9— Ramesh Bala (@rameshlaus) October 24, 2025 -
సెంచరీకి చేరువలో డ్యూడ్.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం డ్యూడ్(Dude Collections). కోలీవుడ్ హీరో నటించిన ఈ సినిమాకు తెలుగులోనూ రిలీజైంది. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలకు తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది.అయితే తొలి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా అదరగొట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. గతంలో రిలీజైన డ్రాగన్ కంటే ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.83 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే సెంచరీకి చేరువలోకి వచ్చేసింది. వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో రూ.95 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించగా.. ఆర్. శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. DUDE continues the festivities at the box office 💥💥✨#DUDE grosses over 95 CRORES in 5 days worldwide ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n⭐ing 'The Sensational' @pradeeponelife🎬 Written and… pic.twitter.com/Jo9f1ukrW8— Mythri Movie Makers (@MythriOfficial) October 22, 2025 -
కాంతార చాప్టర్-1 మరో రికార్డ్.. ఆ దేశంలోనూ ఘనత!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది.తాజాగా మరో రికార్డ్‌ను కాంతార చాప్టర్-1 తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.The divine roar echoes across oceans! 🌊#KantaraChapter1 emerges as 2025’s Highest-Grossing Indian Film in Australia 🇦🇺❤️🔥#BlockbusterKantara running successfully in cinemas near you ✨#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms… pic.twitter.com/658jFJTaQz— Hombale Films (@hombalefilms) October 20, 2025 -
'డ్యూడ్' ఫస్ట్ డే కలెక్షన్స్.. ప్రదీప్ కెరీర్లోనే రికార్డ్
డ్యూడ్ సినిమాతో తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఫస్ట్ డే నాడు లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల కలెక్షన్స్ కంటే డ్యూడ్ ఎక్కువే కొల్లగొట్టాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇందులో మితా బైజు, శరత్ కుమార్, రోహిణి,హృదు హరూన్,నేహా శెట్టి తదితరులు నటించారు. ప్రదీప్ గత రెండు చిత్రాలు భారీ విజయం అందుకోవడంతో డ్యూడ్ మూవీకి బాగానే కలిసొచ్చింది.తొలిరోజే డ్యూడ్ దుమ్ములేపాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటాడు. ప్రదీప్ రంగనాథ్ కెరీర్లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డ్యూడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రదీప్ గత చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ డే రూ. 14 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, ఆ సినిమా విజయం ఇప్పుడు ప్రదీప్‌కు బాగా కలిసొచ్చింది. ఆపై ఈ మూవీకి మొదటి రోజు కంటే రెండో రోజు బుకింగ్స్ బాగున్నాయని సమాచారం. దీపావళి సెలవు కూడా ఉండటంతో డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ మార్క్‌ను చేరుకోవచ్చని తెలుస్తోంది.సినిమా విడుదల కంటే ముందే సోషల్‌మీడియాలో ఈ మూవీకి బజ్ క్రియేట్ అయింది. ఆపై యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాల్లోనే డ్యూడ్ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, డ్యూడ్ యూనిట్ నేడు అభిమానులను కలవనుంది. హైదరాబాద్‌లోని మల్లిఖార్జున థయేటర్ వద్దకు సాయంత్రం 6:30 షో టైమ్‌లో రానున్నారు. అక్కడి నుంచి మైత్రీ విమల్ థియేటర్‌కు రాత్రి 10:20గంటల షో టైమ్‌లో చేరుకుంటారు.The DUDE DIWALI BLAST takes off on a BLOCKBUSTER note at the box office 🎇#Dude collects a gross of 22 CRORES WORLDWIDE on Day 1 ❤🔥A massive festive weekend loading 💥💥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️… pic.twitter.com/SjFiSw1cuq— Mythri Movie Makers (@MythriOfficial) October 18, 2025 -
కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్ రికార్డ్స్ బ్రేక్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్' (రూ. 118.5 కోట్లు), పుష్ప: ది రైజ్ - పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..పుష్ప -2: రూ. 812.14 కోట్లుబాహుబలి- 2: రూ. 511 కోట్లుకెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లుకల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లుఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లురోబో2: రూ 188.23 కోట్లుమహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లుకాంతార చాప్టర్-1: రూ. 155.5 కోట్లుసలార్ - పార్ట్ I: రూ. 152.65 కోట్లుసాహో : రూ. 145.67 కోట్లు -
కాంతార మరో రికార్డ్.. ఏకంగా రాజమౌళి బాహుబలినే!
రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాహుబలి ది బిగినింగ్ ఆల్‌టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది.ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్‌ను సాధించడం విశేషం.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన రూ. 11.18 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం, రిఫండ్లు నెమ్మదించడం ఇందుకు కారణం. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు రిఫండ్ల జారీ 16 శాతం తగ్గి రూ. 2.03 లక్షల కోట్లకు పరిమితమైంది.నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుంచి రూ. 5.02 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు రూ. 5.94 లక్షల కోట్ల నుంచి రూ. 6.56 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక సమీక్షాకాలంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) వసూళ్లు రూ. 30,630 కోట్ల నుంచి రూ. 30,878 కోట్లకు చేరాయి. రిఫండ్లను సర్దుబాటు చేయకముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2.36 శాతం పెరిగి రూ. 13.92 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా! -
కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ జోరు.. జైలర్, లియో రికార్డ్స్ బ్రేక్!
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ జైలర్(రూ.605 కోట్లు), విజయ్ లియో(రూ.606 కోట్లు) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీకంటే విక్కీ కౌశల్, రష్మిక నటింటిన ఛావా (రూ.808 కోట్లు) తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డ్‌ను సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.439 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.525 కోట్ల గ్రాస్ రాబట్టింది.అంతేకాకుండా ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
కాంతార చాప్టర్ 1.. రజినీకాంత్ కూలీ రికార్డ్ బ్రేక్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
కాంతార చాప్టర్-1.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ వన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్, కాంతార రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా హాలీవుడ్ సినిమాలనే అధిగమించింది. ఈ వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కాంతారా చాప్టర్ -1 నిలిచింది. ఈ క్రమంలో ఏకంగా రెండు హాలీవుడ్ చిత్రాలను అధిగమించింది. టేలర్ స్విఫ్ట్ సినిమా పార్టీ ఆఫ్ ఏ షో గర్ల్, లియోనార్డో డికాప్రియో నటించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్' చిత్రాల వసూళ్లను దాటేసింది. కాంతార చాప్టర్-1 ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ డాలర్ల పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ మొదటి వారంలో దాదాపు 53 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్ట్ చేసింది. ఈ వారాంతంలో 50 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన టేలర్ స్విఫ్ట్ చిత్రం పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్ను దాటేసింది. లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాను కూడా కాంతార చాప్టర్-1 బ్రేక్ చేసింది. ఈ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇటీవలే రీ రిలీజ్ అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ కూడా కాంతార కంటే వెనకే ఉంది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ..379 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.451 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ (రూ.431 కోట్లు), 3 ఇడియట్స్ (రూ.450 కోట్లు) వంటి సూపర్ హిట్ సినిమాల జీవితకాల కలెక్షన్స్ అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలోనే రూ.500 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్‌బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్‌వుడ్‌లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
కేజీఎఫ్‌ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
పవన్ కల్యాణ్ ఓజీ.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ మూవీని సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.1000 టికెట్ ధరల వల్లే వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.( OG Movie Box Office Collections )మొదటి ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా.. ఓవరాల్‌గా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ. 90.25 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.100 కోట్లకు గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఓజీ వసూళ్లకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చత్రంలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
రజినీకాంత్ కూలీ.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్‌ను కూలీ అధిగమించింది.కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ బుధవారం అన్ని భాషల్లో కలిపి రూ.6.50 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఈ మూవీ ఇండియాలో మొదటి రోజే రూ.65 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే రెండో రోజే రూ. 54.75 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలివారంలో రూ.200 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు పరిశీలిస్తే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలో రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. -
థగ్ లైఫ్ డిజాస్టర్.. నాన్న మూవీపై శృతిహాసన్ రియాక్షన్!
కోలీవుడ్ భామ శృతి హాసన్ తాజాగా కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేని కీలక పాత్రలో కనిపించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శృతి హాసన్ తన తండ్రి మూవీ థగ్ లైఫ్‌పై స్పందించింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడింది.తన తండ్రికి డబ్బు ముఖ్యం కాదని శృతి హాసన్ తెలిపింది. సినిమా సక్సెస్ కావడానికి కేవలం కలెక్షన్ నంబర్స్ ప్రామాణికం కాదని వెల్లడించింది. నేను కూడా ఒక నటిగా ఆ విషయం గురించి ఎప్పుడు ఆలోచించలేదు.. ఇది రూ. 200 కోట్ల సినిమానా, రూ.300 కోట్ల సినిమానా అని తాను కూడా పట్టించుకోనని పేర్కొంది. నాకు చివరి విడత చెల్లింపులు వచ్చాయన్నదే మాత్రమే చూస్తానని తెలిపింది.నాన్న సంపాదించిన డబ్బునంతా సినిమాల్లో పెట్టేందుకు వెనకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి అని శృతిహాసన్ అన్నారు. సినిమాల్లో వచ్చిన డబ్బును ఆయన రెండో ఆస్తిగానో.. లేదంటే మూడో కారు కొనేందుకో ఖర్చు చేయలేదని తెలిపారు. తన తండ్రి డబ్బు అంతా తిరిగి సినిమాల్లోనే పెట్టారని వెల్లడించారు. మీరు ఊహించిన విధంగా బాక్సాఫీస్ నంబర్స్ ఆయనను ఎలాంటి ప్రభావితం చేస్తాయని తాను అనుకోవడం లేదన్నారు.కాగా.. దాదాపు 38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. నాయకన్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో అభిమానులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, నాజర్, జోజు జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల కంటే తక్కువ వసూళ్లు సాధించి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. -
రజినీకాంత్ కూలీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కావడంతో తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీంతో కోలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది. కూలీ విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.410 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా పోస్ట్ చేశారు. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తొలి మూడు రోజులతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది.మరోవైపు దేశవ్యాప్తంగా కూలీ మూవీ దూసుకెళ్తోంది. ఇండియాలో నాలుగు రోజుల్లోనే రూ.194.25 కోట్లు నికర వసూళ్లు సాధించింది. తొలి రోజు రూ.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన కూలీ.. రెండు వందల కోట్ల మార్క్ దిశగా ప్రయాణిస్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.200 కోట్ల నికర వసూళ్ల మార్క్ చేరుకోనుంది. ఈ చిత్రంలో నాగార్జున, శృతిహాసన్, అమిర్ ఖాన్, సత్యరాజ్, చార్లీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు.ఇండియాలో నెట్ కలెక్షన్స్..1వ రోజు: రూ.65 కోట్లు2వ రోజు: రూ.54.75 కోట్లు3వ రోజు: రూ.39.5 కోట్లు4వ రోజు: రూ.35 కోట్లుమొత్తం: రూ.194.25 కోట్లు #Coolie 's 1st extended weekend WW gross will be around 410 Crs.. This is All-time No.1 opening for a Kollywood movie.. 🔥 #SuperstarRajinikanth pic.twitter.com/qBlhtFQZR3— Ramesh Bala (@rameshlaus) August 18, 2025 -
'కూలీ' కలెక్షన్స్ ప్రకటించిన మేకర్స్.. తమిళ్లో ఇదే టాప్
రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన 'కూలీ' (Coolie) సినిమా భారీ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ్ సినిమాగా కూలీ నిలిచిందంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రీమియర్ షోలు లేకుండా ఆపై తమిళనాడులో టికెట్ ధరలు పెంచకుండానే బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.151+ కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ది రికార్డ్ మేకర్, రికార్డ్ బ్రేకర్ అంటూ షోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన తమిళ చిత్రాలు వరుసుగా ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో 'కూలీ' సినిమా ఉండగా రెండో స్థానంలో విజయ్ నటించిన లియో (రూ. 148 కోట్లు ) ఉంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (రూ. 110 కోట్లు), రోబో 2.O (రూ. 100 కోట్లు), కబాలి (రూ. 87.5) కోట్లు, జైలర్ (రూ. 87 కోట్లు), పొన్నియన్ సెల్వన్1 (78. 30 కోట్లు), సర్కార్ ( రూ. 75 కోట్లు), బీస్ట్ (రూ. 72.67 కోట్లు), విక్రమ్ (రూ. 66 కోట్లు) టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కలెక్షన్స్ అన్ని కూడా గ్రాస్ రూపంలో చెప్పబడింది.Superstar Rajinikanth The Record Maker & Record Breaker 🔥🔥🔥#Coolie becomes the Highest ever Day 1 worldwide gross for a Tamil film with 151 Crore #Coolie in theatres worldwide🌟@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj… pic.twitter.com/k3wLtIMqPn— Sun Pictures (@sunpictures) August 15, 2025 -
రజినీకాంత్ కూలీ తొలి రోజు కలెక్షన్స్.. ఆ సినిమా కంటే తక్కువే!
రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం కూలీ. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తొలిరోజు అదరగొట్టింది. రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ కావడంతో కోలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో కోలీవుడ్ హిస్టరీలోనే రెండో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూలీ నిలిచింది. కూలీ కంటే ముందుగా విజయ్ నటించిన లియో మొదటి రోజే రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఇండియాలోనూ కూలీ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తొలి రోజే దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడులో రూ. 30 కోట్లు, కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లోనూ దాదాపు రూ.75 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ వసూళ్ల పరంగా చూస్తే విజయ్ నటించిన 'లియో'ను అధిగమించలేకపోయింది. ఇండియావ్యాప్తంగా దళపతి విజయ్ నటించిన లియో దేశవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు రూ. 76 కోట్లు వసూలు చేసింది. అయితే వరుసగా సెలవులు రావడంతో కూలీ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. -
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్‌లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
'మహావతార్ నరసింహ' థియేటర్స్ హౌస్‌ఫుల్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్ (ఎమ్.సి.యు) పేరుతో తొలి చిత్రంగా జులై 25న విడులైంది. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాలను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తుంది. చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. అయతే, హరిహర వీరమల్లు వల్ల పెద్దగా ఈ చిత్రానికి థియేటర్స్ దొరకలేదు. కానీ, మొదటిరోజునే మంచి టాక్ రావడంతో మెల్లిగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంటుంది.యానిమేటెడ్ రూపంలో తెరకెక్కిన భారతీయ చిత్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారని సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు. 'మహావతార్ నరసింహ' విడుదలైన మొదటిరోజు రూ. 1.75 కోట్ల నెట్ రాబట్టింది. రెండోరోజు రూ. 5.20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే కలెక్షన్స్ గ్రాస్ పరంగా చూస్తే రూ. 10 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, నేడు ఆదివారం కావడంతో బుక్‌మైషోలో ఏకంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు టికెట్లు తెగడం పెరుగుతుందని చెప్పవచ్చు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దానికి తాజా నిదర్శనం 'మహావతార్ నరసింహ'. నరసింహ స్వామి, భక్త ప్రహ్లాదుడు ఇతివృత్తాలతో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి కూడా. అదే ఇతిహాసంతో యానిమేషన్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే నమ్ముకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి జయ పూర్ణ దాస్ కథను, అశ్విన్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. సీఎస్ శ్యామ్ సంగీతాన్ని, అందించిన ఈ భక్తి రస చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. శ్రీమహావిష్ణువు భక్తులను రక్షించడానికి ఎత్తిన అవతారాల్లో ఒకటి నరసింహ అవతారం. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మహావతార్ నరసింహ. ఇది పూర్తిగా యానిమేషన్లో రూపొందడం విశేషం. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
హరి హర వీరమల్లు మొదటిరోజు కలెక్షన్స్..!
-
బర్త్‌డే స్పెషల్: సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలివే! (ఫొటోలు)
-
టాలీవుడ్ చిన్న సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్!
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మై బేబీ. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి నిర్మించారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.35 లక్షల వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినా కలెక్షన్లపరంగా ఫర్వాలేదనిపిస్తోంది. మూడు రోజులకే రికార్డు స్థాయిలో వసూళ్లు చేసి చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అమ్మ ప్రేమ, నాన్న బాధ్యతను చూపే కథగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైంది. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. -
జురాసిక్ వరల్డ్.. పునర్జన్మలోనూ అదరగొట్టేసింది!
గతంలో సినీ ప్రియులను మెప్పించిన జురాసిక్ వరల్డ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. జురాసిక్ వరల్డ్: రీ బర్త్ పేరిట సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 2న రిలీజైన ఈ చిత్రం ఇండియాలోనే అరుదైన రికార్డ్ సాధించింది. దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. దీంతో ఈ ఏడాది జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన తొలి వారాంతంలోనే రికార్డ్ స్థాయిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 49.3 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ, మహర్షలా అలీ కీలక పాత్రల్లో నటించారు.జురాసిక్ ప్రాంఛైజీలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన రీతిలో ఆడియన్స్‌ను మెప్పించాయి. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్: డొమినియన్కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌కు మొదటి రెండు భాగాలకు జురాసిక్ మూవీస్‌కు కథ అందించిన డేవిడ్ కోప్ స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గరేత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఇక మార్వెల్ బ్యూటి బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్‌లో మెయిన్ లీడ్ రోల్లో కనిపించారు. -
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్ వద్ద కుబేర.. వరల్డ్ వైడ్‌గా ఏకంగా 9వ స్థానం!
ధనుశ్, నాగార్జున కీలక పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తందా మూడు రోజుల్లోనే రూ.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఈ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. హాలీవుడ్ హీరో డకోటా జాన్సన్ నటించిన మెటీరియలిస్ట్స్ మూవీని అధిగమించింది. ఇండియా వ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో కుబేర మూవీ రూ.48.60 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 57 గ్రాస్ కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.23 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. ఓవరాల్‌గా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే నాగ చైతన్య చిత్రం తండేల్ రూ.88.25 కోట్ల వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ప్రధాన పాత్ర పోషించారు.మరోవైపు అదే రోజు విడుదలైన ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా రూ.88 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలపరంగా చూస్తే హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్, 28 ఇయర్స్ లేటర్, ఎలియో వంటి చిత్రాలు ఈ జాబితాలో ముందంజలో ఉన్నాయి. బాలేరినా మూవీ సితారే జమీన్ పర్కు కాస్తా దగ్గరగా ఉంది. -
ఫేక్ కలెక్షన్స్‌నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు: సన్నీ డియోల్
ఈ ఏడాది జాట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సన్నీ డియోల్. టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీ డియోల్ ప్రస్తుతం బోర్డర్-2 మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా నితీశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలోనూ కనిపించనున్నారు.అయితే తాజా ఇంటర్వ్యూకు హాజరైన సన్నీ డియోల్ మూవీ కలెక్షన్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానులు ఫేక్ కలెక్షన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఎలాంటివారో తనకు అర్థం కావడం లేదన్నారు. నకిలీ బాక్సాఫీస్ నంబర్స్ చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. సినీ పరిశ్రమ ప్రమాణాల కంటే కేవలం హైప్‌పైనే ఆధారపడడంపై సన్నీ డియోల్ తప్పుబట్టారు.సన్నీ డియోల్ మాట్లాడుతూ.. 'ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అభిమానులు వాస్తవికతను నమ్మడానికి ఇష్టపడరు. బాక్సాఫీస్ సంఖ్యలను పెంచి కానీ వాస్తవానికి భిన్నంగా చూపిస్తారు. టిక్కెట్లను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం.. నకిలీ బాక్సాఫీస్ సంఖ్యలు చూపించడం సరైంది కాదు. అది అలా ఉండకూడదు. మిమ్మల్ని మీరు హిట్ చేసుకోవడానికి ఇది మార్గం కాదు. అందువల్లే చాలా మంది యువకుల కథలు బయటకు రావడం లేదు. ప్రజలు కూడా మంచి కథకు విలువ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కథ ప్రభావం కంటే ఫేక్ కలెక్షన్స్ ద్వారా విజయం డిసైడ్ చేస్తున్నారు' అని అన్నారు.సన్నీ డియోల్ చివరిసారిగా 'జాట్' చిత్రంలో కనిపించాడు. ఈ మూవీ ద్వారానే గోపీచంద్ మలినేని హిందీలో అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో రెజీనా , రణదీప్ హుడా, సయామి ఖేర్, రమ్య కృష్ణన్ కూడా నటించారు. -
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలివే!
ఇండియన్ సినిమా పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. హాలీవుడ్ రేంజ్లో సినిమాలు తెరకెక్కించే స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. త్వరలోనే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిని అందుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలాగే దేశవ్యాప్తంగా సైతం అత్యధిక వసూళ్లతో రికార్డ్ సృష్టించిన టాప్-10 చిత్రాలేవో చూసేయండి.ప్రపంచవ్యాప్తంగా అమిర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లతో మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా దాటలేకపోయింది. తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి-2 నిలవగా.. మూడోస్థానంలో అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, జవాన్, పఠాన్, కల్కి, భజరంగీ భాయిజాన్, యానిమల్ ఉన్నాయి. బాలీవుడ్‌తో సమానంగా సౌత్ ఇండియా చిత్రాలు సత్తా చాటాయి.ప్రపంచవ్యాప్తంగా దంగల్ ఎక్కువ వసూళ్లు సాధించినప్పటికీ భారత్‌లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది మాత్రం బాహుబలి 2 మూవీయే! 2017లో బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు దాటిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కేవలం 21 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్'.. బాహుబలి 2 రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది.బాహుబలి-2 కంటే కేవలం రూ. 46 కోట్ల తక్కువ వసూళ్లు సాధించింది. అయితే రూ. 1,000 కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రంగా తిరుగులేని రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్-2 మూవీతోనే కన్నడ సినిమా పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో చిత్రాలు తెరకెక్కించే స్థాయికి ఎదిగిపోయింది.ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన టాప్-10 ఇండియన్ సినిమాలు -
కమల్ హాసన్ థగ్ లైఫ్.. ఇండియన్-2 కంటే తక్కువ వసూళ్లు!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించినా ఆ తర్వాత పెద్దగా ఆశించినస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.30 కోట్ల లోపే నెట్ వసూళ్లు సాధించింది.ఇక వీకెండ్ చివరి రోజు ఆదివారం కలెక్షన్లతో కలిసి నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా రూ.43 నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే థగ్ లైఫ్ నాలుగు రోజుల్లో రూ.73 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ చేరుకుంది. ఈ సంఖ్య అంతకుముందు కమల్ హాసన్ నటించిన ఇండియన్-2 కంటే చాలా తక్కువగా నమోదైంది. గతేడాది విడులదైన ఇండియన్-2 నాలుగు రోజుల్లో రూ.113.55 కోట్ల నికర వసూళ్లు సాధించింది.అయితే థగ్ లైఫ్ వసూళ్లు తగ్గడానికి కన్నడ భాష వివాదం కూడా ఓ కారణం. బెంగళూరు ఆడియో లాంఛ్ ఈవెంట్లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమాను నిషేధించారు. కమల్ కామెంట్స్‌తో ఈ చిత్రం షెడ్యూల్ కర్ణాటకలో విడుదల కాలేదు. దీనివల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడిందని చెప్పవచ్చు. కాగా.. ఈ చిత్రంలో శింబు, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాసర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
కమల్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ వద్ద థగ్ లైఫ్ కష్టాలు!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ యాక్షన్ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఊహించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.29 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది.తొలి రోజు రూ.15 కోట్లకు పైగా రాబట్టిన థగ్ లైఫ్.. రెండో రోజే ఏకంగా సగానికి పడిపోయింది. అయితే మూడో రోజు వీకెండ్ కావడంతో శనివారం రూ. 7.5 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజుల్లోనే రూ. 30 కోట్ల మార్కును దాటలేకపోవడంతో కమల్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే 'థగ్ లైఫ్' 3వ రోజు దాదాపు రూ. 60 నుంచి 65 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మణిరత్నం గత విజయాలతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువ. 'పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 మరియు పార్ట్ 2', రెండూ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 నుంచి 400 కోట్లకు పైగా వసూలు చేశాయి. థగ్ లైఫ్ వసూళ్ల పరంగా రాణించకపోవడంతో కమల్ ఖాతాలో ఈ మూవీ డిజాస్టర్‌గానే మిగలిపోయేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, శింబు, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటించారు. -
అజయ్ దేవగణ్ రైడ్-2.. ఛావా తర్వాత రెండో చిత్రమిదే!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన చిత్రం 'రైడ్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1న థియేటర్లలో విడుదలైంది. గతంలో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. దీంతో ఈ సంవత్సరం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.ఈ సినిమాకు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 201.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమే రూ. 177.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్' కారణంగా రైడ్-2 కలెక్షన్స్ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 151.50 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.కాగా.. 'రైడ్ 2' ఊహించిన దానికంటే థియేటర్లలో బాగానే నడుస్తోంది. అజయ్ దేవగణ్ కెరీర్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రైడ్-2 నిలిచింది. గతేడాది నవంబర్‌లో దీపావళికి విడుదలైన 'సింగం ఎగైన్' తర్వాత ఈ మూవీ రికార్డ్ సాధించింది. అయితే 2018లో విడుదలైన 'రైడ్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 154 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్గా నటించగా.. రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు. -
జలియన్ వాలాబాగ్ నేపథ్యంగా కేసరి-2.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్-2. ఈ మూవీలో లైగర్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇటీవల గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన కేసరి-2.. వసూళ్లపరంగా రాణించలేకపోతోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.7.84 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. శని, ఆదివారాల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేవలం రూ.4.50 కోట్లకే పరిమితమైంది.ఈ లెక్కన కేసరి-2 విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.34.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ధైర్యవంతుడైన భారతీయ న్యాయవాది సి శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్నీ డియోల్ 'జాట్' నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. థ్రిల్లర్ సినిమా కావడంతో వసూళ్ల పరంగా నిలకడగా రాణిస్తోంది. కాగా.. ఈ సినిమాలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు.కాగా..'కేసరి చాప్టర్ 2' చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్ నిర్మించారు. ఏప్రిల్ 13, 1919న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయవాది సి శంకరన్ నాయర్ చూపించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. Truth spoke. Theatres roared. Numbers soared. Book your tickets NOW.🔗 - https://t.co/YSydXCA78f#KesariChapter2 in cinemas now, worldwide pic.twitter.com/MaCWzgncsU— Dharma Productions (@DharmaMovies) April 22, 2025 -
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ సినిమా ఛావా(Chhaava Movie). ఈ ఏడాది ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఛావా సినిమాకు బాలీవుడ్లో హిట్ టాక్ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. టాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. కేవలం హిందీలో దేశవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. పుష్ప-2, స్త్రీ-2 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన మూడో చిత్రంగా ఛావా చోటు దక్కించుకుంది. స్త్రీ-2 తర్వాత ఈ రికార్డ్ కొల్లగొట్టిన రెండో బాలీవుడ్ మూవీగా అవతరించింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తండ్రి, బాలీవుడ్లో దర్శకుడైన శామ్ కౌశల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 600 నాట్అవుట్ అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడంలో మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీలో టాప్- 10 నెట్ వసూళ్లు సాధించిన చిత్రాలు..1 పుష్ప: ది రూల్ - పార్ట్ 2- రూ.812.14 కోట్లు2 స్ట్రీ- 2 - రూ.597.99 కోట్లు3 ఛావా- రూ.585.43 కోట్లు4 జవాన్ -రూ.582.31 కోట్లు5 గదర్ 2- రూ.525.7 కోట్లు6 పఠాన్ -రూ.524.53 కోట్లు7 బాహుబలి 2 ది కన్‌క్లూజన్- రూ.510.99 కోట్లు8 యానిమల్- రూ.502.98 కోట్లు9 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.435.33 కోట్లు10 దంగల్ - రూ.374.43 కోట్లు View this post on Instagram A post shared by Sham Kaushal (@shamkaushal09) -
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమాల విడుదలైంది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.తాజాగా ఈ మూవీ వసూళ్లను మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్వీట్ చేసింది. ఈ మార్క్ చేరుకునేందుకు దాదాపు 11 రోజులు పట్టింది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లకే పరిమితమైంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు. The celebration of mass commercial cinema. A feast for the Single Screens continues 💥💥#JAAT collects 102.13 CRORES GROSS WORLDWIDE ❤🔥Book your tickets for the MASS FEAST now!▶️ https://t.co/sQCbjZ5zOEStarring Action Superstar @iamsunnydeolDirected by @megopichand… pic.twitter.com/akWwV9tApq— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025 -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఫస్ట్ డే కలెక్షన్స్
‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) సినిమా మొదటిరోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మూవీని తెరకెక్కించాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చని అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలిపారు.బింబిసార సినిమా తర్వాత కల్యాణ్‌రామ్ మరో రెండు చిత్రాలు చేశారు. కానీ, వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రానికి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వినిపిస్తుంది. దీంతో మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.15 కోట్లు రాబట్టింది. బింబిసార ఫస్ట్ డే నాడు రూ. 6.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన ఏ రెండు సినిమాలు కూడా మొదటిరోజు రూ. 5 కోట్ల మార్క్‌ను అందుకోలేదు. అయితే, అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఇప్పుడు రూ. 5.15 కోట్లు రాబట్టి ఆ లోటును భర్తి చేసింది.ఈ సినిమాకు ప్రధాన బలయం విజయశాంతి, కల్యాణ్ రామ్ అని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ వారిద్దరూ పోటీపడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో విజయశాంతి దుమ్మురేపారు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది. -
అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ... ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను అధగమించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. దేశవ్యాప్తంగా కలెక్షన్స్ చూస్తే ఆరు రోజుల్లో రూ.108.30 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సా ఫీస్ వద్ద రూ.127.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు.గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. సూపర్ హిట్ మూవీ రికార్డ్ బ్రేక్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ.. రెండొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.170 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రదీప్ రంగనాథన్ తమిళ సూపర్ హిట్ మూవీ డ్రాగన్ సాధించిన లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం ఐదు రోజుల్లోనే ఆ సినిమాను అధిగమించింది. డ్రాగన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.152 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలవనుంది. కాగా.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీకెండ్ తర్వాత సోమవారం రూ. 15 కోట్ల నెట్ వసూలు చేసి.. ఐదు రోజుల్లోనే రూ. 101.3 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్ )కాగా.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో అలరించదగా.. అర్జున్ దాస్ ప్రతినాయకుడిగా మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.(ఇది చదవండి: 'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు)అయితే ఊహించని విధంగా జాట్ మూవీకి కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోతోంది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా ఇప్పటి వరకు యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో(Day 3 Collection) కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు. A SENSATIONAL FIRST WEEKEND for #Jaat at the box office ❤️🔥#JAAT collects 49.3 CRORES+ DOMESTIC GBOC in 4 days 💥💥Book your tickets for the MASS FEAST now!▶️ https://t.co/sQCbjZ5zOE#BaisakhiWithJaat Starring Action Superstar @iamsunnydeolDirected by @megopichand… pic.twitter.com/BNlBTSjYZX— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2025 -
అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ థ్రిల్లర్ వఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపపరంగా దూసుకెళ్తోంది.ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును చేరుకుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' భారీ అంచనాల థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు మగిజ్ తిరుమేని 'విదాముయార్చి' తర్వాత ఈ ఏడాదిలో అజిత్ కుమార్‌కి ఇది రెండో మూవీ కావడం విశేషం. ఈ చిత్రం అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, రఘు రామ్, కార్తికేయ కీలక పాత్రలు పోషించారు. -
ఎల్2 ఎంపురాన్ మరో రికార్డ్.. 15 రోజుల్లోనే వంద కోట్ల మార్క్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. తొలిరోజే ఏకంగా రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.తాజాగా ఎల్2: ఎంపురాన్ విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్లో రూ.102.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.120 కోట్లకు గ్రాస్‌తో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.262.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే గురువారం రోజు మాత్రం కలెక్షన్స్ పరంగా చాలా అతి తక్కువగా నమోదైంది. కేవలం రూ. 70 లక్షలను మాత్రమే రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. -
బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. మంజుమ్మెల్ బాయ్స్ రికార్డ్ బ్రేక్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'ఎల్2: ఎంపురాన్'. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటేసిన లూసిఫర్ సీక్వెల్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. గతేడాది సూపర్‌హిట్‌గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్లతో సాధించి మలయాళ మూవీ ఇండస్ట్రీలో రికార్డుకెక్కింది. తాజాగా ఆ రికార్డ్‌ను లూసిఫర్-2 అధిగమించింది. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో లూసిఫర్2 చిత్రాన్ని తెరకెక్కించారు.ఇక దేశీయంగా వసూళ్లు పరిశీలిస్తే రూ.88.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అలాగే ఓవర్సీస్లోనే ఎెంపురాన్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఏకంగా రూ.103 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్లో ఖాయంగా కనిపిస్తోంది. -
మోహన్ లాల్ 'ఎల్2- ఎంపురాన్'.. ఆ విషయంలో తొలి సినిమాగా రికార్డ్!
మలయాళ సూపర్ స్టార్ నటించిన చిత్రం ఎల్2 ఎంపురాన్. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా ఈనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో పృథ్వీరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా ఎంపురాన్ నిలిచిందని ట్వీట్ చేశారు. దీంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ప్రథమ స్థానంలో మంజుమ్మెల్ బాయ్స్ ఉంది. గతేడాది విడుదలైన ఈ సినిమా ఆల్‌టైమ్ కలెక్షన్స్ రూ.240 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ జాబితాలో ఎంపురాన్ రెండోస్థానంలో కొనసాగుతోంది.వివాదంలో ఎంపురాన్..ఇటీవల ఎంపురాన్ మూవీపై వివాదం తలెత్తింది. గుజరాత్ అల్లర్ల సీన్స్ ఈ మూవీ ఉంచడంపై కొందరు విమర్శలు చేశారు. ఎంపురాన్‌ను బాయ్ కాట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాత అభ్యంతరం ఉన్న సన్నివేశాలు తొలగిస్తామని మేకర్స్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ❤️ https://t.co/VaI6EsvZbQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 🙂❤️❤️❤️ https://t.co/QpRIuhJ9oQ— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 31, 2025 -
బాక్సాఫీస్ వద్ద ఛావా దూకుడు.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్!
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 14 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఛావా రిలీజైన ఐదో వారంలో మరో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. హిందీ బాక్సాఫీస్ వద్ద ఐదో వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఛావా రూ.22 కోట్లు రాబట్టగా.. గతేడాది విడుదలైన స్త్రీ-2 రూ.16 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప-2 రూ.14 కోట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఐదో వారాంతంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ఛావా నిలిచింది. పుష్ప 2 తర్వాత రష్మిక కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.కాగా.. ఈ చిత్రం ఇప్పటికే రణబీర్ కపూర్ చిత్రం యానిమల్‌ను దాటేసింది. ఈ సినిమా రిలీజైన 31 రోజుల్లో ఇండియా వ్యాప్తంగా నెట్ కలెక్షన్ 562.65 కోట్లు రాగా.. అందులో హిందీ వెర్షన్ రూ.548.7 కోట్లు, తెలుగు వెర్షన్ మరో రూ.13.95 కోట్లు రాబట్టింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 661.3 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఛావా 750.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కాగా.. ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా.. మాడాక్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దినేష్ విజన్ నిర్మించారు. View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
చరిత్ర తిరగరాస్తోన్న ఛావా.. ఏకంగా బాహుబలి-2 రికార్డ్‌ను కూడా!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హిస్టారికల్ చిత్రం ఛావా. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదట హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా తిరుగులేని వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల తెలుగులోనూ విడుదలైన ఛావా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది.తాజాగా ఈ చిత్రం హిందీలో క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించింది. ప్రభాస్ నటించిన బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఛావా చిత్రం ఆ రికార్డ్‌ను దాటేసింది. కేవలం హిందీలోనే రూ.516 కోట్ల వసూళ్లు చేసింది. కేవలం విడుదలైన 25 రోజుల్లోనే బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హిందీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా నిలిచింది. దీంతో విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.తెలుగులోనూ దూసుకెళ్తోన్న ఛావా..బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఛావా తెలుగు వర్షన్ కలెక్షన్స్‌తో పాటు సినిమాలోని క్లైమాక్స్ సీన్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఈ మూవీ కోసం ఎంతలా కష్టపడ్డారో అందులో చూపించారు. ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా మేకింగ్ విధానాన్ని కూడా చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 530 కోట్ల మార్క్‌ను ఛావా చేరుకుంది. తెలుగు వర్షన్లో మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు గీతా ఆర్ట్స్ పేర్కొంది. -
బాక్సాఫీస్ వద్ద 'డ్రాగన్'.. పది రోజుల్లోనే రికార్డ్‌స్థాయి వసూళ్లు!
లవ్ టుడే మూవీతో తెలుగు వారికి దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది.తాజాగా ఈ చిత్రం మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పోస్టర్‌ను షేర్ చేశారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#Dragon crosses 100crs pic.twitter.com/RVvQetBy2u— Pradeep Ranganathan (@pradeeponelife) March 2, 2025 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న డ్రాగన్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
లవ్ టుడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Movie)తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు 'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కాయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేశారు హీరో ప్రదీప్ రంగనాథన్. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. దీంతో ప్రదీప్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.డ్రాగన్ మూవీ కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. #Dragon Opening pic.twitter.com/BJyckrx1FA— Pradeep Ranganathan (@pradeeponelife) February 24, 2025 -
'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప 2'.. కలెక్షన్స్ ఎంతంటే?
-
డిజాస్టర్ దిశగా అజిత్ పట్టుదల.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే విడాముయర్చి (తెలుగులో పట్టుదల) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంచనాలను అందుకోవడంపై విఫలమైంది. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విడాముయర్చి అధిగమించలేకపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ రిలీజైన వారం రోజులైనా కేవలం రూ.రూ. 71.3 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఏడో రోజు కేవలం రూ. 2.50 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీంతో వందకోట్ల నెట్ వసూళ్లు సాధించాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి రెండో వారంలోనైనా విడాముయర్చికి కలిసొస్తుందేమో చూడాలి. అయితే ఈనెల 14న లవర్స్ డే రోజున మరిన్ని కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. దీంతో ఈ సినిమాకు తీవ్రమైన పోటీ తప్పేలా లేదుకాగా.. ఈ సినిమాను భారీ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కించారు. 1997 అమెరికన్ చిత్రం బ్రేక్‌డౌన్ ఆధారంగా విడాముయర్చిని రూపొందించారు. ఈ మూవీ షూటింగ్ అంతా అజర్ బైజాన్‌లో జరిగింది. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణియన్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
అజిత్ కుమార్ విదాముయార్చి.. ఆ సినిమా కంటే తక్కువగా తొలి రోజు కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్ కలెక్షన్స్‌కే పరిమితమైంది. అయితే వీకెండ్స్‌లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. -
వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. 12 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈనెల 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది.సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోటీపడి రాణిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో సంగీతమందించారు.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)ఈ సినిమా కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. #BlockbusterSankranthikiVasthunam continues it's Box Office Sambhavam 💥💥💥260crore worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥 ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025 -
'సంక్రాంతి వస్తున్నాం' మూవీ.. వారం రోజుల్లోనే క్రేజీ రికార్డ్!
వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన టాలీవుడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vastunnam Movie) బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పొంగల్ బరిలో నిలిచిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన ఈ సినిమా మరో క్రేజీ మార్క్‌ను అధిగమించింది.ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఐదు రోజుల్లోనే రూ.165 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.203 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ చిత్రంలో వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. వెంకటేశ్ కుమారుడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు(రేవంత్) ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్..గతంలో ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.The OG of Sankranthi has conquered every region with unanimous dominance 💥💥💥#SankranthikiVasthunam grosses a sensational ₹203+ crores in its first week❤️🔥❤️🔥❤️🔥ALL TIME RECORD FOR A REGIONAL FILM 🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam in cinemas now. Victory @venkymama… pic.twitter.com/QFg59gZ7Ri— Sri Venkateswara Creations (@SVC_official) January 21, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5వ రోజు కలెక్షన్స్
-
'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్.. మూడు రోజుల్లోనే క్రేజీ మార్క్!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా ఈ మూవీ దూసుకెళ్తోంది. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.కాగా.. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మూడు రోజులకే వందకోట్ల మార్క్‌ను అధిగమించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఓవర్సీస్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓవర్సీస్ ఆడియన్స్ కోసం అదనపు షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ కాగా.. ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. బాలయ్య డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సైతం పొంగల్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రక్షించాాలకుంటాడు.చదవండి: కట్టెల పొయ్యిపై చేపల పులుసు వండిన నాగ చైతన్యఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.Any centre, single hand ~ Victory @venkymama 🔥🔥🔥106Cr+ Gross worldwide in 3 Days for #BlockbusterSankranthikiVasthunam ❤️🔥❤️🔥❤️🔥The OG of Sankranthi has set the box office on fire, bringing festive celebrations alive in theatres 💥— https://t.co/ocLq3HYNtH… pic.twitter.com/AR5ZlaPvjR— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025 -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. అందరికంటే భిన్నంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఏ విషయమైనా సరే తన మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తారు. అందువల్లే ఆర్జీవీకి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు. తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాజాగా ఓ టాలీవుడ్ మూవీ గేమ్ ఛేంజర్‌పై తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ లెక్కన రాజమౌళి ఆర్ఆర్ఆర్కు రూ.4500 కోట్లు అయి ఉంటుందని రాసుకొచ్చారు. అలా గేమ్ ఛేంజర్‌కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ పుష్ప-2 రూ.1860 కోట్లు రావాల్సిందని ట్విటర్లో రాశారు. ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి.. అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి అంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.తొలి రోజు రూ.186 కోట్లు..రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వసూళ్లను ఉద్దేశించి రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. If G C costed some 450 cr then RRR in its extraordinary never before seen visual appeal should have costed 4500 cr and if G C film’s first day collections are 186 cr on day 1 , then PUSHPA 2 collections should have been 1,860 cr ..The point is that the fundamental requirement of…— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025 -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్‌లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
డాకు మహారాజ్‌కు హిట్ టాక్. తొలిరోజే ఓవర్సీస్లో క్రేజీ రికార్డ్
నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj Movie). బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో దిగిన డాకు మహారాజ్ తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.(ఇది చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ)తమన్ బీజీఎంపై ప్రశంసలు..తొలిరోజు డాకు మహారాజ్ వీక్షించిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమన్ బీజీఎం అదిరిపోయిందని కామెంట్స్ చేశారు. మరోసారి తమన్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూఎస్‌లో 10 లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అమెరికాలో రికార్డ్ ప్రీ సేల్స్..ఈ సారి డాకు మహారాజ్ సినిమాకు అమెరికాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్స్‌లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు. అనంతపురంలో సక్సెస్ మీట్డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్ మీట్‌ను అనంతపురంలో నిర్వహిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ప్రకటించారు. ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వల్ల సక్సెస్ మీట్ అక్కడే నిర్వహించనున్నట్లు నాగవంశీ వెల్లడించారు. టికెట్ ధరల పెంపునకు అనుమతి..డాకు మహారాజ్ మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్ రూ.500 కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.#DaakuMaharaaj crosses $1M+ Gross in the USA and continues its BLOCKBUSTER HUNTING spree! 💥💥This is just the start of NBK’s storm! 🦁#BlockbusterHuntingDaakuMaharaaj 🔥USA Release by @ShlokaEnts Overseas Release by @Radhakrishnaen9 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/82Kkd5ZnHN— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
గేమ్ ఛేంజర్‌కు ఊహించని కలెక్షన్స్ .. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్.. రెండో రోజు కాస్తా తగ్గనట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ మూవీ.. రెండవ రోజు రూ. 21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో కలిపి రూ. 72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ దూసుకెళ్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు తెలుద రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తోంది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 12.7 కోట్లు, హిందీలో రూ. 7 కోట్లు, తమిళం రూ. 1.7 కోట్లు, కన్నడలో రూ. 10 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు తెలుగులో థియేటర్లలో మొత్తం 31.19 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. ఉదయం షోలకు 20.66 శాతం ఆక్యుపెన్సీతో నడవగా.. సాయంత్రం షోలలో 36.48 శాతానికి పెరిగింది. సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.కాగా.. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రలో అదరగొట్టారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు.రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఆ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. కాగా... చిత్రంలో కోలీవుడ్ హీరోలు ఎస్జే సూర్య, జయరామ్ కీలకపాత్రలో కనిపించారు. వీరితో పాటు శ్రీకాంత్, సముద్రఖని, అంజలి, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ కూడా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.పాటలకే రూ.75 కోట్లు..దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు వెచ్చించినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో గేమ్ ఛేంజర్ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి. -
Pushpa 2 Collection: రప్పా రప్పా సరికొత్త రికార్డప్పా
పుష్పరాజ్ (‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్పాత్ర పేరు) అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో రప్పా రప్పా అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. కేవలం 32 రోజుల్లోనే ‘పుష్ప 2 : ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1831 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేకపాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదలైంది.అయితే డిసెంబరు 4 నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్ లలో ‘పుష్ప 2: ది రూల్’ విడుదలైంది. సినిమా రిలీజైన 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రూ.1810 కోట్లు వసూలు చేసిన ‘బాహుబలి–2’ సినిమా వసూళ్లను ‘పుష్ప 2’ అధిగమించి, సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఆమీర్‌ఖాన్ నటించిన హిందీ సినిమా ‘దంగల్’ ప్రపంచవ్యాప్తంగా రూ.2 వేల కోట్లకుపైగా వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రూ.1831 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ నిలిచింది. కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం ‘పుష్ప 2: ది రూల్’ మొదటి స్థానంలో నిలిచింది. -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. బాహుబలి -2 రికార్డ్ బ్రేక్
బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ దాడి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా రిలీజై నెల రోజులు దాటినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలోని మునుపెన్నడు లేని రికార్డులు సృష్టించింది. అత్యంత వేగంగా రూ.1000 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ది రూల్(pushpa 2 the rule) నిలిచిన సంగతి తెలిసిందే.తాజాగా పుష్ప-2 మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ విడుదలైన 32 రోజుల్లోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2(bahubali-2) రికార్డ్‌ను అధిగమించింది. ప్రస్తుతం రూ.1831 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత బాహుబలి-2 (రూ.1810) కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రికార్డ్‌ను పుష్ప-2 బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లతో సెకండ్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. దీంతో రాజమౌళి బాహుబలి-2ను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.ఇండియాలో టాప్-8 చిత్రాలివే..ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అమిర్ ఖాన్ దంగల్ మాత్రమే రూ.2 వేల కోట్ల మార్కును దాటింది. ఆ తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప- 2 ది రూల్ నిలిచింది. ఇక రాజమౌళి చిత్రం బాహుబలి -2 మూడో స్థానానికి పరిమితమైంది. తర్వాత వరుసగా ఆర్ఆర్ఆర్ (రూ.1387 కోట్లు), కన్నడ మూవీ కేజీయఫ్ -2 (రూ.1250 కోట్లు), ప్రభాస్ కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. వీటిలో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలు ఉండడం మరో విశేషం.(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరోసారి పోలీసుల నోటీసులు)హిందీలో పుష్ప-2 సరికొత్త రికార్డ్..అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో తెరకెక్కించిన పుష్ప- 2 హిందీలో తిరుగులేని వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే నార్త్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్‌లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసిన మూవీగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. వందేళ్ల ఏళ్ల హిందీ సినీ పరిశ్రమ చరిత్రలో కేవలం 15 రోజుల్లోనే రూ. 632 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.పుష్ప-2 ఓటీటీకి ఎప్పుడంటే..బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పుష్ప-2 ఓటీటీపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. రిలీజ్‌కు ముందే దాదాపు రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలొచ్చాయి. గతంలోనే ఓటీటీ విడుదల తేదీపై పుష్ప టీమ్ క్లారిటీ ఇచ్చింది. పుష్ప-2 రిలీజైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీకి రానుందని పుష్ప మేకర్స్ ప్రకటించారు.కాగా..2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంతో పుష్పకు సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్ర పోషించాడు.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్)#Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE— Pushpa (@PushpaMovie) January 6, 2025 -
చైనాలో మహారాజా జోరు.. నెల రోజుల్లోనే రికార్డ్!
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన చిత్రం మహారాజా. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నితిలన్ సామినాథన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా వచ్చిన మహారాజా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం చైనాలోనూ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ చైనాలోనూ విడుదలైంది. రెండు రోజుల్లోనే రూ.20 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వంద కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ విడుదలైన నెల రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కుకు చేరువైంది. గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించింది. ఈ విషయాన్ని చైనా రాయబార కార్యాలయ అధికారి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇండియాలోని చైనా ఎంబసీ ప్రతినిధి యు జింగ్ ట్వీట్ చేశారు.చైనా అధికారి ట్వీట్.. 2018 తర్వాత చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచిందని యు జింగ్ పోస్టర్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం రూ.91.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వెల్లడించింది. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసన తర్వాత చైనాలో విడుదలైన మొదటి భారతీయ చిత్రం మహారాజానే కావడం మరో విశేషం. చైనాలో ఈ చిత్రం తొలిరోజే రూ. 15.6 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రముఖ చైనీస్ మూవీ రివ్యూ సైట్ డౌబన్‌లో ఈ చిత్రానికి 8.7/10గా అత్యధికంగా రేటింగ్ ఇచ్చింది. చైనాలో మహారాజా రెండు రోజులకు రూ. 20 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని స్థానిక బాక్సాఫీస్ ట్రాకర్ అయిన ENT గ్రూప్ ప్రకటించింది. రెండు రోజులకు 2.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. అలాగే ఇటీవల చైనాలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రాలలో ఒకటిగా మహారాజా ఘనతను సొంతం చేసుకుంది. ఇదే జోరు కొనసాగితే మహారాజా త్వరలోనే చైనాలో సుమారు రూ. 300 కోట్లు రాబట్టవచ్చని అక్కడి ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా.. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి నటరాజ్ కూడా నటించారు. ఈ కథ చెన్నైలోని మహారాజా అనే వ్యక్తి తన డస్ట్‌బిన్ కోసం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కించారు. ఇండియాలో జూన్ 14న విడుదలైన మహారాజా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. కాగా.. గతంలో అమీర్ ఖాన్ దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్, రాణి ముఖర్జీ చిత్రం హిచ్కీ వంటి భారతీయ చిత్రాలు మాత్రమే చైనాలో మంచి ప్రదర్శన కనబరిచాయి.Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done👍👍 pic.twitter.com/sq9SUY8D5F— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025 -
పుష్పరాజ్ మరో రికార్డ్.. అరుదైన క్లబ్లో చేరిన పుష్ప-2
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే నెల రోజులు పూర్తియినప్పటికీ వసూళ్ల రాబట్టడంలో మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. తొలి రోజు నుంచి రికార్డుల సునామీ సృష్టిస్తోన్న పుష్పరాజ్.. మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిందీలో మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.బాలీవుడ్లో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో పుష్ప-2 హిందీలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఈ వసూళ్లు కేవలం 31 రోజుల్లోనే పుష్ప-2 సాధించింది. ఈ కలెక్షన్లతో రూ.800 కోట్ల అరుదైన క్లబ్లో చేరింది. ఇప్పటికే హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది.ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.వివాదంలో పుష్పరాజ్..అయితే ఈ మూవీ విడుదలకు ముందు రోజు విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన అల్లు అర్జున్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల నాంపల్లి కోర్టు సైతం బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.ఆస్పత్రిలో మహిళ కుమారుడు..సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ కుమారుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే పుష్ప నిర్మాతలు, అల్లు అరవింద్ ఆ బాలుడిని పరామర్శించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల సాయం ప్రకటించారు. ఇప్పటికే వారి ఫ్యామిలీకి చెక్కులు కూడా అందజేశారు. Brand #Pushpa inagurates 𝟖𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄 CLUB in Hindi ❤🔥#Pushpa2TheRule has a RECORD BREAKING COLLECTION in Hindi with 𝟖𝟎𝟔 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐍𝐄𝐓𝐓 in 31 days 💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/bRAgO99ygp— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2025 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. ఆ ఒక్కటి వచ్చుంటే?
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఇంకా కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన నాలుగు వారాల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. 28 రోజుల్లో రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.హిందీలో రికార్డ్ స్థాయి వసూళ్లు..సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.770 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగానూ ఘనతను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లోనూ హవా..ఓవర్సీస్లోనూ పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 15 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలోనూ, నేపాల్ పుష్ప-2 కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుకింగ్స్ చేసిన మూవీగానూ ఘనతను సొంతం చేసుకుంది.కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది.#Pushpa2TheRule is RULING THE INDIAN BOX OFFICE with its record breaking run 💥💥The WILDFIRE BLOCKBUSTER GROSSES 1799 CRORES WORLDWIDE in 4 weeks ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/n5k1aSWQ0N— Mythri Movie Makers (@MythriOfficial) January 2, 2025 -
రికార్డులు తిరగరాసిన పుష్ప.. చిన్న చిత్రాలకు పెద్ద విజయం
తెలుగు సినిమా తగ్గేదే లే అన్నట్లుగానే 2024 సాగింది. విజయాల శాతం తక్కువే అయినప్పటికీ... కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రూ. 1700 కోట్లతో ‘పుష్ప: ది రూల్’ బాక్సాఫీస్‌ని రూల్ చేసింది. రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో ‘కల్కి2898 ఏడీ’ సత్తా చాటింది. యువ హీరోలు తేజ సజ్జా ‘హను–మాన్’, కిరణ్ అబ్బరం ‘క’ చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలూ ఆకట్టుకున్నాయి. ఇక 2024 రౌండప్లోకి వెళదాం...ఈ ఏడాది తెలుగు తెరపై అనువాద చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. తమిళ చిత్రాలు రజనీకాంత్ ‘వేట్టయాన్: ది హంటర్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’, శివ కార్తికేయన్ ‘అమరన్’ కార్తీ–అరవింద్ స్వామిల ‘సత్యం–సుందరం’, విక్రమ్ ‘తంగలాన్’, ధనుష్ ‘రాయన్’, విజయ్ ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, తమన్నా–సుందర్ .సి ‘బాకు’ (అరణ్మణై 4) చిత్రాలకు తెలుగులో ఆదరణ దక్కింది. ఈ ఏడాది తెలుగులో మలయాళ చిత్రాల హవా కూడా కనిపించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’, మమ్ముట్టి ‘భ్రమయుగం’, నస్లెన్ ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’, టొవినో థామస్ ‘ఏఆర్ఎమ్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. కన్నడ చిత్రాలు ఉపేంద్ర ‘యూఐ’, కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’లకు అలరించాయి.తెలుగు సినిమా అసలు సిసలైన పండగ సంక్రాంతితో ఆరంభం అవుతుంది. ఈ పండగకి వచ్చే పెద్దా చిన్నా సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతాయి. అలా 2024లో సంక్రాంతికి వచ్చిన సినిమాలతో థియేటర్లు పండగ చేసుకున్నాయి. సినీ లవర్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జా ‘హను–మాన్’, వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ వరుసగా విడుదల అయ్యాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ ఫిల్మ్ ‘హను–మాన్’ భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోలతో పాటు యువ హీరో తేజ విజయం అందుకోవడం విశేషం. ఇక వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన ‘సైంధవ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది. సంక్రాంతి పండగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ ‘నా సామి రంగ’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘సర్కారు నౌకరి’, హన్సిక ‘105 మినిట్స్’ నిరాశపరిచాయి. జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చినా ఆకట్టుకున్నవి తక్కువే. ఇక ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి. కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’కి కొద్దిపాటి ప్రేక్షకాదరణ దక్కింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. సీక్వెల్ కూడా మహి దర్శకత్వంలోనే రూపొందింది. ఈ నెలలో రవితేజ ‘ఈగిల్’ సినిమా ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఈ మాస్ ఫిల్మ్‌కి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇంకా సందీప్ కిషన్ హారర్ ఫిల్మ్ ‘ఊరి పేరు భైరవకోన’ ఫర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రానికి వీఐ దర్శకుడు. అలాగే ప్రియమణి ‘భామాకలాపం 2’ ఫర్వాలేదనిపించుకుంది. ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే, అలరించినవి మాత్రం ఐదారు సినిమాలే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’కి ఆశించిన ఫలితం దక్కలేదు.శివ కందుకూరి మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’, అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ‘గామి, అనన్య నాగళ్ల హారర్ మూవీ ‘తంత్ర’, హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘రజాకార్’ చిత్రాలు ఆడియన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ–అనుపమా పరమేశ్వరన్ల ‘డీజే టిల్లు స్క్వేర్’, శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘ఓం భీమ్ బుష్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ‘డీజే టిల్లు స్క్వేర్’ రూపొందగా, ‘ఓం భీమ్ బుష్’కి హర్ష కొనుగొంటి దర్శకుడు. ఇదే నెల ఆరంభంలో వచ్చిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘వ్యూహం’ చర్చనీయాంశమైంది.ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి వచ్చిన చిత్రాలు ఇరవైలోపే. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ ఓ మోస్తరుగా అలరించింది. ఇదే నెలలో నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో వచ్చిన అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ నవ్వించింది. ఇక మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ ‘భజే వాయు వేగం’, ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’, మోహన్ భగత్ ‘ఆరంభం’ ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి.‘భజే వాయు వేగం’తో దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా, ‘ఆరంభం’తో అజయ్ నాగ్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. సత్యదేవ్ ‘కృష్ణమ్మ’తో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ‘అల్లరి’ నరేశ్ ‘ఆ... ఒక్కటి అడక్కు..!’, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు. జూన్‌లో దాదాపు పాతిక సినిమాలు రాగా, అందరి దృష్టి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పైనే నిలిచింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఇదే నెలలో వచ్చిన సుధీర్‌బాబు ‘హరోంహర’, శర్వానంద్ ‘మనమే’ వంటివి అంచనాలను అందుకోలేకపోయాయి. అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ మెప్పించింది. జూలైలో మీడియమ్ చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి. వీటిలో నవదీప్ ‘లవ్‌మౌళి’, ప్రియదర్శి–నభా నటేశ్ల ‘డార్లింగ్‘, రక్షిత్ శెట్టి ‘ఆపరేషన్ రావణ్‘, రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది. ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నాని ‘సరిపోదా శనివారం’ సూపర్ హిట్‌గా నిలవగా, అల్లు శిరీష్ ‘బడ్డీ’, రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు నిరాశపరిచాయి. అయితే చిన్న చిత్రాలుగా రిలీజైన దర్శకుడు అంజి మణిపుత్ర– హీరో నార్నే నితిన్ ‘ఆయ్’, యదు వంశీ దర్శకుడిగా పరిచయమై, నూతన నటీనటులు చేసిన ‘కమిటీ కుర్రోళ్ళు’ హిట్‌గా నిలిచాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేశ్ లీడ్ రోల్లో నటించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రం మెప్పించింది. ఎన్టీఆర్ ‘దేవర’ మేనియాతో సెప్టెంబరులో పెద్దగా సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్టు 1’ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది. ఇదే నెలలో వచ్చిన నివేదా థామస్ ‘35: చిన్న కథ కాదు’, శ్రీ సింహా–హాస్యనటుడు సత్య–ఫరియా అబ్దుల్లా చేసిన ‘మత్తు వదలరా 2’ చిత్రాలు అలరించాయి.ఈ ఏడాదికి అక్టోబరు కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. ముందుగా శ్రీవిష్ణు ‘స్వాగ్’ సినిమా రిలీజైంది. శ్రీవిష్ణు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక దసరాకి వచ్చిన సుధీర్‌బాబు ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ ‘విశ్వం’, సుహాస్ ‘జనక అయితే గనక’ చిత్రాలకు ఓ మోస్తరు ప్రేక్షకాదరణ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘విశ్వం’ దసరా హిట్ సినిమాల్లో ముందు నిలిచింది. దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన రూరల్ డ్రామా ‘పొట్టేల్’ ప్రేక్షకుల అటెన్షన్‌ను గ్రాబ్ చేయగలిగింది. అక్టోబరులో దీపావళి సందర్భంగా విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్‘, కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ‘లక్కీ భాస్కర్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే దర్శక ద్వయం సుజిత్–సందీప్ పరిచయం అయిన ‘క’ సూపర్ హిట్ అయింది. నవంబరులో భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. విడుదలైన వాటిలో కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘మెకానిక్ రాఖీ’, సత్యదేవ్–ధనంజయల ‘జీబ్రా’, కొత్త దర్శకుడు విక్రమ్ రెడ్డి తీసిన ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలు అలరించాయి. వరుణ్ తేజ్ ‘మట్కా’, నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నిరుత్సాహపరచాయి. ఇక డిసెంబరు తొలి వారంలోనే హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్‌ల ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లుగా యూనిట్ ప్రకటించింది. హిందీలో ‘పుష్ప 2’కు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ విధంగా ఇప్పటికే ‘పుష్ప 2’ పలు రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితమవుతోంది. నెలాఖరులో అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’, ‘వెన్నెల’ కిశోర్–అనన్య నాగళ్ల నటించిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’, ధర్మ ‘డ్రింకర్ సాయి’ వంటి చిత్రాలు వచ్చాయి. విజయాల శాతం తక్కువ, అపజయాల శాతం ఎక్కువ అన్నట్లుగా 2024 సాగింది. స్ట్రయిట్, డబ్బింగ్ చిత్రాలతో కలిపి దాదాపు 250 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే పెద్దా... చిన్నా... అనువాద చిత్రాలు సాధించిన విజయాలు పది శాతం లోపే. 2025లో సక్సెస్ రేట్ పెరగాలని కోరుకుందాం.మిస్సింగ్: ఈ ఏడాది వెండితెరను మిస్ అయిన సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, యువ హీరోల్లో నాగచైతన్య, రానా (సోలో హీరోగా..), అఖిల్, నితిన్, మంచు విష్ణు, నందమూరి కల్యాణ్‌రామ్, నాగశౌర్య, అడివి శేష్, సాయి దుర్గా తేజ్, నవీన్ పొలిశెట్టి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఉన్నారు. -
2024లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 లిస్ట్‌లో నాలుగు తెలుగు సినిమాలు (ఫొటోలు)
-
తగ్గిన పుష్పరాజ్ కలెక్షన్స్.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా రూ.1000 కోట్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. హిందీలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని రికార్డ్ స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పుష్పమానియా కొనసాగుతోంది.తాజాగా పుష్పరాజ్ మరో రికార్డ్ సృష్టించాడు. ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే రూ.1719 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన మొదటి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినప్పటికీ.. తాజా వసూళ్లు చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం కాస్తా కష్టంగానే అనిపిస్తోంది.కాగా.. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1 చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ పార్ట్-3 కూడా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.There is no stopping #Pushpa2TheRule at the box office 💥💥Becomes the fastest Indian film to cross 1719.5 CRORES WORLDWIDE in 22 days ❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/CztMIusNBW— Mythri Movie Makers (@MythriOfficial) December 27, 2024 -
పుష్ప-2 వసూళ్ల సునామీ.. తొలి విదేశీ చిత్రంగా రికార్డ్!
బన్నీ- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన పుష్పరాజ్.. మరో అరుదైన ఘనతను సాధించాడు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.నేపాల్‌లో విడుదలైన 20 రోజుల్లోనే రూ.24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీంతో నేపాల్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి విదేశీ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా నేపాల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఘనతను సొంతం చేసుకుంది. నేపాల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్-3లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ పోస్టర్ ద్వారా వెల్లడించింది.కాగా.. ఈనెల 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 రిలీజైంది. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే రూ.294 కోట్లతో మొదలైన ప్రభంజనం కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్కును చేరుకుంది. తాజాగా విడుదలైన కలెక్షన్స్ చూస్తే 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇదో జోరు కొనసాగితే త్వరలోనే రూ.2000 వేల కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2TheRule is now the HIGHEST GROSSING FOREIGN FILM EVER IN NEPAL with a gross of 24.75 CRORES in 20 days 💥💥It is one of the biggest blockbusters at the Nepal Box Office and is among the TOP 3 GROSSERS OF ALL TIME ❤️🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/c6DD3mlPSm— Pushpa (@PushpaMovie) December 26, 2024 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్.. మూడు వారాల్లో మరో రికార్డ్
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.తాజాగా పుష్ప-2 వసూళ్లపై నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా 2024లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన మూవీగా ఘనత సాధించింది. తొలి రోజే రూ.294 కోట్లతో ప్రభంజనం సృష్టించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాసింది.THE HIGHEST GROSSER OF INDIAN CINEMA IN 2024 continues to topple records 💥💥#Pushpa2TheRule is the FASTEST INDIAN FILM EVER to collect 1700 CRORES with a gross of 1705 CRORES WORLDWIDE in 21 days ❤️🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vrL2RHqcSq— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2024 -
థియేటర్లలో 200 రోజులు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది: మోహన్ బాబు
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తనదైన నటనతో వెండితెరపై అభిమానులను అలరించారు. ఆయన తన కెరీర్లో నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల తన బ్లాక్ బస్టర్‌ను చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అందులో డైలాగ్స్, సీన్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా మరో మూవీకి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.1991లో మోహన్ బాబు నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఈ మూవీ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. థియేటర్లలో 200 రోజులు ఆడి కలెక్షన్ కింగ్ అనే బిరుదును మోహన్ బాబుకు అందించింది. బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించిన అసెంబ్లీ రౌడీ చిత్రానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. పి.వాసు, పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు కథను అందించారు. కేవీ మహదేవన్ సంగీమందించిన ఈ చిత్రాన్ని మోహన్ బాబు తాజాగా గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తన కెరీర్లో గొప్ప మెలురాయిగా నిలిచిపోయిందన్నారు.మోహన్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' అసెంబ్లీ రౌడీ (1991) నా సినీ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్, కామెడీ డ్రామాలో శక్తివంతమైన పాత్రను పోషించాను. ఆకట్టుకునే కథాంశంతో పి.వాసు, పరుచూరి బ్రదర్స్ అందించిన ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమాకు నా కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. థియేటర్లలో 200 రోజులు ఆడి రికార్డుల మోత మోగించింది. కలెక్షన్ కింగ్ అనే బిరుదు అందించిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలోని కేవీ మహదేవన్ మ్యూజికల్ హిట్లు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి' అంటూ పోస్ట్ చేశారు. 🌟 Assembly Rowdy (1991) – A cherished milestone in my journey! 🌟Playing such a powerful role in this action, comedy-drama, directed by Sri. B. Gopal, was truly memorable. With an engaging storyline by Sri. P. Vasu and impactful dialogues from the Paruchuri Brothers, the film… pic.twitter.com/SX9vHm580D— Mohan Babu M (@themohanbabu) December 25, 2024 -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. ఆ భాషలో బాక్సాఫీస్ షేక్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే పలు ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రెండు వేల కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తోంది. తాజా వసూళ్లు చూస్తే మరికొద్ది రోజుల్లోనే ఈ అరుదైన మైలురాయిని పుష్ప-2 మూవీ చేరుకునేలా కనిపిస్తోంది.అయితే నార్త్‌లో పుష్పరాజ్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. తాజాగా హిందీ పుష్ప-2 మరో రికార్డ్ సాధించింది. రిలీజైన 19 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త సృష్టించింది. దీంతో అత్యంత వేగంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి చిత్రంగా పుష్ప-2 నిలిచింది. హిందీ సినీ చరిత్రలోనే పుష్ప-2 అరుదైన ఘనత సాధించింది. Pushpa Raj introduces the 700 CRORE CLUB to HINDI CINEMA 💥💥 The FIRST EVER FILM to collect 700 CRORES in HINDI ✨#Pushpa2TheRule collects massive 704.25 CRORES NETT in Hindi ❤🔥❤🔥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star… pic.twitter.com/9Mg6plgJyE— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2024 -
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం.. వందేళ్ల చరిత్రను తిరగరాశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లోనే రూ.632 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. దీంతో హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా అత్యధిక నెట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.అంతేకాకుండా వసూళ్ల పరంగా గత వందేళ్ల బాలీవుడ్ చరిత్రలోనే నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 తొలి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. రూ.294 కోట్లతో మొదలైన పుష్ప రాజ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోనూ అత్యధిక వసూళ్లు తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. అటు యూఎస్‌లోనూ తిరుగులేని కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ— Pushpa (@PushpaMovie) December 20, 2024 The NUMBER ONE BLOCKBUSTER in the HISTORY OF HINDI CINEMA 🔥🔥#Pushpa2TheRule collects 632.50 CRORES NETT in Hindi - THE HIGHEST EVER FOR ANY HINDI FILM ❤🔥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/LWJa7W2JxT— Pushpa (@PushpaMovie) December 20, 2024 -
పుష్ప రాజ్ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకున్న పుష్ప-2 కలెక్షన్ల మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే నార్త్‌లో ఏకంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు పుష్పరాజ్.ఇప్పటికీ పుష్ప-2 రిలీజై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప-2 వసూళ్లను రివీల్ చేశారు. ఈ మూవీ విడుదలైన 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా 1500 కోట్ల వసూళ్ల సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించింది. COMMERCIAL CINEMA REDEFINED 🔥HISTORY MADE AT THE BOX OFFICE 💥💥#Pushpa2TheRule collects 1508 CRORES GROSS WORLDWIDE - the fastest Indian Film to reach the mark ❤🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa… pic.twitter.com/vk0qnXLOt0— Pushpa (@PushpaMovie) December 19, 2024 The HISTORIC RULE at the box office continues 💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to Gross 1500+ CRORES WORLDWIDE in 14 Days ❤🔥1508CR & counting 🔥#Pushpa2HitsFastest1500crBook your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon… pic.twitter.com/AQueWAv9Gp— Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2024 -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్..!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్‌గా పుష్ప-2 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తోన్న పుష్పరాజ్.. ఏకంగా ఆస్ట్రేలియాలో కలెక్షన్ల వర్షం కురిపించాడు. దాదాపు 4 మిలియన్ డాలర్ల వసూళ్ల రాబట్టినట్లు పుష్ప టీమ్ పోస్టర్‌ను షేర్ చేసింది.ఈ వసూళ్లతో ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 ఘనత సాధించింది. గతంలో ఏ సినిమా సాధించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ఇండియాలో మాత్రమే కాదు.. పుష్పరాజ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని అర్థమవుతోంది. ఈ వసూళ్లు చూస్తుంటే ఈ సినిమాలో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అనే డైలాగ్‌ను మరిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1400 కోట్లకు పైగా పుష్ప-2 వసూళ్లు రాబట్టింది. ఇదే ఊపు కొనసాగితే మరో కొద్ది రోజుల్లోనే రెండు వేల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ చిత్రాన్ని పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.పుష్పకు వీరాభిమాని డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ అంటే వార్నర్‌కు పిచ్చి అభిమానం. ఆయన సినిమాలో మేనరిజం, డైలాగ్స్‌ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు వార్నర్. చాలాసార్లు బన్నీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ వీడియోలు కూడా చేశారు. THE HIGHEST GROSSING INDIAN FILM IN AUSTRALIA in 2024 ❤🔥#Pushpa2TheRule hits A$ 4 MILLION gross and going strong at the Australian Box Office 💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/gYxgLbrzrv— Pushpa (@PushpaMovie) December 18, 2024 -
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
పుష్ప-2 మరో రికార్డ్.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)అయితే పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన పది రోజుల్లోనే నార్త్‌లో రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది. ఇప్పటికే హిందీలో తొలిరోజు రూ.74 కోట్లతో మొదలైన పుష్పరాజ్ ఊచకోత ఇంకా కొనసాగుతోంది. తాజాగా టెన్ డేస్‌లో రూ.507 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.#Pushpa2TheRule breaches another record-breaking milestone ❤️🔥Crosses 500 CRORES NETT in Hindi in just 10 days - THE FASTEST FILM IN HINDI to do so 💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/CwpYUbf2o7— Pushpa (@PushpaMovie) December 15, 2024 -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్‌లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
బాక్సాఫీస్ బాద్షాగా పుష్పరాజ్.. ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు దాటేశాడు!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డ్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)తొలిరోజు రూ.294 కోట్లతో మొదలైన పుష్ప ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతోంది. హిందీలో ఏ బాలీవుడ్ చిత్రం సాధించిన రికార్డులు సృష్టిస్తోంది. భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌లో ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ చిత్రంగా పుష్ప -2 రికార్డులకెక్కింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.375 కోట్లు కలెక్ట్ చేసిన తొలి నాన్ హిందీ చిత్రంగా నిలిచింది. THE BIGGEST INDIAN FILM rewrites history at the box office 💥💥💥#Pushpa2TheRule becomes the FASTEST INDIAN FILM to cross 1000 CRORES GROSS WORLDWIDE in 6 days ❤🔥#PUSHPA2HitsFastest1000CrSukumar redefines commercial cinema 🔥Book your tickets now!🎟️… pic.twitter.com/c3Z6P5IiYY— Pushpa (@PushpaMovie) December 11, 2024 -
'పుష్ప2' ఫస్ట్ వీకెండ్ పూర్తి.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
పుష్ప2 రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వీకెండ్లో ఇంత వరకు ఎవరూ సాధించలేని కలెక్షన్లను పుష్ప2 నమోదు చేసింది. విడుదల రోజు నుంచి మొదలైన ఈ జాతర ఎక్కడ వరకు కొనసాగుతుందో ఊహించడం కాస్త కష్టమేనని చెప్పవచ్చు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు 'పుష్ప'గాడి రూల్ ఏలా ఉంటుందో బాక్సాఫీస్ లెక్కలతో చూపిస్తున్నాడు. ఒక రికార్డు పోస్టర్ వేసేలోగా ఇంకో రికార్డు క్రియేట్ చేస్తూ.. అల్లు అర్జున్ సత్తా చాటుతున్నాడు.అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి వీకెండ్‌లోని కేవలం నాలుగురోజుల్లో రూ. 829 కోట్లు రాబట్టి భారీ రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ఫస్ట్ వీకెండ్లో కేజీఎఫ్2 రూ.442 కోట్ల గ్రాస్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను పుష్ప అందుకున్నాడు. ఇలా రికార్డ్ ఏదైనా సరే అంటూ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలెట్టాడు. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డ్స్ అన్నీ పుష్ప దెబ్బకు తుడిచిపెట్టుకుపోయాయి.అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో సూపర్ హిట్ సినిమాగా పుష్ప2 ఉండనుంది. తొలిరోజు రూ.294 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 8 ఆదివారంతో మొదటి వీకెండ్ పూర్తి చేసుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్లు రాబట్టి పలు రాష్ట్రాల్లోనూ అనేక రికార్డులను నెలకొల్పింది. మొదటి వారం పూర్తి అయ్యే సరికి కేవలం బాలీవుడ్లోనే రూ. 291 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఎవరూ అందుకోలేనంత రేంజ్లో రికార్డ్‌ను సెట్ చేశాడు. -
పుష్పరాజ్ ఊచకోత.. అత్యధిక వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డ్!
ఇటీవల థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐకాన్ స్టార్ మూవీ తొలిరోజే ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల కలెక్షన్స్‌తో పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు.నార్త్‌లో వసూళ్ల ఊచకోత..ఇక హిందీ విషయానికొస్తే మొదటి రోజే అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డ్ సాధించింది. మొదటి రోజే ఏకంగా రూ.72 కోట్ల వసూళ్ల షారూఖ్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు రూ.74 కోట్లతో తన రికార్డ్‌ను తానే తిరగరాశాడు. ఇక నాలుగోరోజు ఆదివారం కావడంతో అన్ని రికార్డులు బద్దలయ్యాయి. ఏకంగా రూ.86 కోట్ల నెట్ వసూళ్లతో ప్రభంజనం సృష్టించాడు పుష్పరాజ్. దీంతో నాలుగు రోజుల్లోనే రూ.291 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. హిందీలో అత్యంత వేగంగా వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇప్పటికే జవాన్, పఠాన్, యానిమల్, గదర్- 2 సినిమాలను అధిగమించింది. డిసెంబర్ 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే పలు రికార్డులను బద్దలు కొట్టింది. పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులుఅత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్:పుష్ప 2 హిందీ వర్షన్ భారతదేశంలో రూ. 72 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్ల వసూళ్లను రాబట్టిన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని అధిగమించింది.అత్యధిక నాన్-హాలిడే ఓపెనింగ్: నాన్ హాలీడే గురువారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓ ప్రత్యేక మైలురాయిని సాధించింది.అత్యధిక నాన్-ఫెస్టివల్ ఓపెనింగ్: ఈ మూవీ విడుదల సమయంలో ఎలాంటి పండుగ లేకపోయినా ఆల్‌టైమ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టగలిగింది.హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్: హిందీ వెర్షన్లో భాగంగా ఇండియాలో కేవలం నాల్గో రోజు(ఒక్క రోజు) రూ. 86 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.అత్యంత వేగంగా రూ.250 కోట్లు: భారతదేశంలో అత్యంత వేగంగా రూ.250 కోట్ల మార్కును అధిగమించిన హిందీ వర్షన్ చిత్రంగా పుష్ప- 2 నిలిచింది. డిసెంబర్ 8 (ఆదివారం) నాడు ఈ మైలురాయిని సాధించింది.అత్యధిక వీకెండ్ ఒపెనింగ్: పుష్ప 2 హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 291 కోట్ల నెట్ వసూళ్లు ఆర్జించింది.A HISTORIC SINGLE DAY in Hindi ❤️🔥#Pushpa2TheRule collects a Nett of 86 CRORES on Day 4 - creating an all time record of the HIGHEST Hindi collection in a single day 🔥The Wildfire Blockbuster also becomes the fastest Hindi film to reach 291 CRORES NETT in just 4 days 💥💥… pic.twitter.com/Jarw91cHNk— Pushpa (@PushpaMovie) December 9, 2024 -
ఊహించని కలెక్షన్స్‌తో భారతీయ సినిమాని ఏలుతున్న అల్లు అర్జున్
-
'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్ప-2 సినిమాపై సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు లేని రికార్డులు సృష్టిస్తోందని పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ క్రియేట్ చేస్తోన్న రికార్డులపై ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రావడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ.. 'హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అత్యధిక వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది.. అలాగే బాలీవుడ్ యాక్టర్ కాకుండా మన అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు.. పుష్ప-2 పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మీరు స్టైలే వేరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సత్తా అంటే ఇది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలిరోజే రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టిన పుష్పరాజ్.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు సాధించింది. దీంతో హిందీలో బన్నీ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. The BIGGEST HINDI FILM ever in HISTORY of BOLLYWOOD is a DUBBED TELUGU FILM #Pushpa2 The BIGGEST HINDI FILM ACTOR in HISTORY of BOLLYWOOD is a TELUGU ACTOR @alluarjun who CAN’T SPEAK HINDI So it’s not PAN INDIA anymore , but it is TELUGU INDIA 💪💪💪— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2024 -
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
పుష్ప రాజ్ హవా.. మూడు రోజుల్లోనే హిందీలో మరో రికార్డ్!
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది.అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిందీలో మూడు రోజుల్లోనే రూ.205 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది.#Pushpa2TheRule is setting new benchmarks in Indian Cinema ❤🔥Registers the highest single day collection in Hindi with a 74 CRORES NETT on Day 3 🔥The BIGGEST INDIAN FILM is the fastest to 200 CRORE NETT film in Hindi with a 3 day figure of 205 CRORES 💥💥… pic.twitter.com/AMLH5EXu2Z— Pushpa (@PushpaMovie) December 8, 2024 -
Pushpa 2: పుష్ప-2 ప్రభంజనం.. నైజాంలో తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్!
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.మొదటి రోజే కలెక్షన్స్‌లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్‌ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్‌ను విడుదల చేసింది. నైజాం రీజియన్‌లో ఒపెనింగ్ డే ఆల్‌టైమ్ రికార్డ్‌తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.ALL TIME RECORD in Nizam ❤️🔥WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024 -
ఇండియన్ బాక్సాఫీస్ రూలర్‌గా 'పుష్ప'రాజ్.. తొలిరోజు ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప2 చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. భారత సినీ చరిత్రలోనే భారీ రికార్డ్‌ను బన్నీ క్రియేట్ చేశాడు. ఇండియాలో ఇప్పటి వరకు మొదటిరోజు కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఆర్ఆర్ఆర్ రూ. 223 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. ఈ రికార్డ్‌ను ఇప్పుడు పుష్ప కొట్టేశాడు. బాక్సాఫీస్ వద్ద తన బ్రాండ్ సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా బన్నీ చూపించాడు.డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో పుష్ప రూల్ ప్రారంభమైంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్, బాలీవుడ్, ఓవర్సీస్లలో టాప్‌లో కొనసాగుతోంది. ప్రీ సేల్ బుకింగ్స్‌లో కూడా తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శించింది. ఇలా తొలిరోజు పుష్ప2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాటా ఉంటే ఆ తర్వాత బాలీవుడ్ ఉంది. అమెరికాలోనే సుమారు రూ. 35 కోట్ల వరకు రాబట్టినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్‌గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.బాలీవుడ్ కింగ్ షారుఖ్‌ను దాటేసిన అల్లు అర్జున్బాలీవుడ్లో ఇప్పటి వరకు మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా షారుఖ్‌ఖాన్ 'జవాన్' రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఇప్పటి వరకు ఉంది. అయితే, తాజాగా 'పుష్ప2' ఆ రికార్డ్‌ను దాటేసింది. హిందీలో ఫస్ట్ డే రూ.72 కోట్ల నెట్ రాబట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి పుష్ప2 చేరిపోయింది. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలీవుడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి పుష్ప2 చిత్రం మాత్రమే ఉండటం విశేషం. పుష్ప తర్వాతే బాహుబలి2 ( 41 కోట్లు), ఆదిపురుష్ ( రూ 37.25 కోట్లు), సాహో ( రూ.24.4 కోట్లు), కల్కి (రూ. 22.5 కోట్లు) వంటి చిత్రాలు ఉన్నాయి.(ఇది చదవండి: Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ)బుక్‌మైషోలో 'పుష్ప'గాడి రికార్డ్'పుష్ప 2'ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేశారు. బన్నీ (అల్లు అర్జున్) దెబ్బకు ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్ అన్ని బద్దలైపోతున్నాయి. బుక్ మై షోలో ఒక గంటలో అత్యధికంగా లక్షకు పైగానే టికెట్లు విక్రయించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ప్రభాస్ 'కల్కి' పేరుతో ఉన్న రికార్డ్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ అధిగమించింది. 'పుష్ప 2' భారతదేశంలో 2,51,9266 టికెట్లను అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించడం ద్వారా రూ. 73 కోట్లు వసూలు చేసి ‘బాహుబలి 2, జవాన్, ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ల అడ్వాన్స్ బుకింగ్‌ను అధిగమించింది. ఫైనల్‌గా ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి.THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️🔥#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema 💥💥💥#Pushpa2BiggestIndianOpenerRULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/uDhv2jq8dc— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 -
Pushpa2: ఇదెక్కడి మాస్‌రా మావ.. అప్పుడే సెంచరీ దాటేశాడు!
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి' అనే సినిమా డైలాగ్ కూడా సరిపోదేమో. అంతలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది పుష్ప-2. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్స్ సృష్టించాయి. అంతేకాకుండా ఓవర్సీస్లో ఏ భారతీయ సినిమా సాధించని అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ సాధించింది.తాజాగా మరో క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది ఐకాన్ స్టార్ మూవీ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాలుగా నిలవనుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫ్యాన్స్ కోసం ఒక రోజు ముందే బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు.#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB— Pushpa (@PushpaMovie) December 3, 2024 -
కంగువా మరో డిజాస్టర్ కానుందా?.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే మొదటి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. భారీ అంచనాల మధ్య రిలీజైన కంగువా తొలి రోజు కేవలం ఇండియావ్యాప్తంగా రూ.22 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఆ తర్వాత రెండో రోజు కంగువా వసూళ్లు మరింత తగ్గిపోయాయి. రెండో రోజు కేవలం రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శనివారం వీకెండ్ కూడా కంగువాకు కలిసిరాలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల కలక్షన్స్ మాత్రమే సాధించింది. దీంతో మూడు రోజుల్లో కేవలం రూ. 42.75 కోట్లకే పరిమితమైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండో రోజుల్లోనే రూ.89.32 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.కాగా.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మించారు. దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సూర్య కెరీర్లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా కంగువా నిలిచింది. ఈ మూవీ విడుదలైన మూడు రోజులైనప్పటికీ ఇంకా రూ.100 కోట్ల మార్క్ చేరుకోకపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. -
బాక్సాఫీస్ వద్ద కంగువా.. మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్స్ సూర్య ఫ్యాన్స్ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. దసరాకు రావాల్సిన కంగువా నెల రోజుల ఆలస్యమైనప్పటికీ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కంగువా తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే కంగువాపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిసైడ్ అయిపోయారు. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతుందని భావించారు. కానీ తొలిరోజు వసూళ్లూ చూస్తే.. ఊహించనిదానికి భిన్నంగా వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ కంగువా అంచనాలను మించి రాణించిందా? లేదా అన్నది కలెక్షన్స్ చూస్తే తెలిసిపోతుంది.తాజా సమాచారం ప్రకారం తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.22 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్‌గా కంగువా నిలిచింది. గతంలో ఆయన నటించిన సింగం-2 తొలిరోజు రూ.12 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. తాజాగా కంగువా ఆ రికార్డ్‌ను అధిగమించింది. ఇక దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ తొలిరోజు 40శాతం ఆక్సుపెన్సీతో నడిచినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్, విజయ్ ది గోట్ చిత్రాలు మొదటిరోజు 50 నుంచి 60శాతం ఆక్సుపెన్సీతో నడిచాయి.అయితే వసూళ్ల పరంగా చూస్తే కంగువా కోలీవుడ్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల జాబితాలో ది గోట్, వెట్టయాన్ చిత్రాలను అధిగమించలేకపోయింది. మొదటి రోజే అంచనాలను అందుకోవడంతో కంగువా విఫలమైందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సూర్య అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం(రూ.350 కోట్లు) కావడంతో అంచనాలు కూడా అదేస్థాయిలో నెలకొన్నాయి. మరి రాబోయే రోజుల్లో కంగువా కాసుల వర్షం కురిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, దిశాపటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.కోలీవుడ్‌లో ఓపెనింగ్ డే కలెక్షన్స్-2024ది గోట్- రూ.39.15 కోట్లువేట్టయాన్- రూ.27.75 కోట్లుకంగువా- రూ.22 కోట్లుఅమరన్- రూ.17 కోట్లుఇండియన్2- రూ.16.5 కోట్లుతంగలాన్- రూ.12.4 కోట్లురాయన్- రూ.11.85 కోట్లుకెప్టెన్ మిల్లర్- రూ.8.05 కోట్లుకల్కి 2898 ఏడీ- రూ.4.5 కోట్లుఅరణ్మనై 4- రూ.4.15 కోట్లు -
అమరన్ మూవీ.. ఆరు రోజుల్లోనే ఆ మార్కు దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అమరన్ కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. కాగా.. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజే రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అమరన్‌లో మేజర్ ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ కనిపించగా.. ఆయన భార్యగా ఇందు పాత్రలో సాయిపల్లవి నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వచ్చిన అమరన్.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్ల పరంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ వారంలో ఆ రికార్డ్‌ను అధిగమించే అవకాశముంది.కాగా.. ఈ చిత్రాన్ని మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. 2014లో కాశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ అమరుడయ్యారు. ఆయన జీవితాన్ని అమరన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. -
శివ కార్తికేయన్ అమరన్.. తొలి రోజే రజనీకాంత్ సినిమాను దాటేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న అమరన్ థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతోంది.తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.21 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు తమిళనాడులో సెలవుదినం కావడంతో రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. తమిళ వర్షన్లో మొదటి రోజు థియేటర్లలో 77.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. (ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన అమరన్ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. అయితే విజయ్ ది గోట్, రజనీకాంత్ వేట్టయాన్ చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను మాత్రం అధిగమించలేకపోయింది. అయితే తమిళనాడులో కమల్ హాసన్ చిత్రం ఇండియన్ -2 ఓపెనింగ్ డే కలెక్షన్స్‌ను దాటేసింది. కాగా.. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. -
రవాణాలో భారీగా రామప్రసాదం
‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు..! పిల్లలకు చాలు పప్పు బెల్లాలు..!’ అంటూ దసరా పాట ఒకప్పుడు వినిపించేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకున్నా రవాణా శాఖలో కొత్త పాట వినిపిస్తోంది. ‘అయ్యగారికి చాలు 10 కోట్ల రూపాయలు..!’ అని అంటున్నారు!! అన్నట్టుగానే బదిలీలకు ముడుపులు వసూలు చేసి కీలక నేతకు సమర్పించారు. రవాణా శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా కీలక నేతే స్వయంగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి మరీ మీ పోస్టులు ఉండాలంటే ముడుపులు చెల్లించాలని హుకుం జారీ చేయడం.. వసూళ్ల కోసం ఏకంగా ముగ్గురు అధికారులను వినియోగించడం విభ్రాంతి కలిగిస్తోంది. – సాక్షి, అమరావతిపోస్టు ఉండాలంటే ముడుపులు చెల్లించాల్సిందే రవాణా శాఖలో ఉన్నతాధికారుల బదిలీల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా జిల్లా రవాణా శాఖ అధికారులు (డీటీసీ), ఆర్టీవోల బదిలీల్లో భారీ దందా సాగింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రవాణా శాఖలో కీలక నేత ఉన్నతాధికారుల బదిలీల పేరిట హైడ్రామాకు తెరతీశారు. ప్రాధాన్యమున్న కేంద్రాల్లో పోస్టులు కావాలంటే భారీగా సమర్పించుకోవాలని తేల్చి చెప్పారు.ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో కొనసాగాలన్నా... ప్రాధాన్యత పోస్టులకు బదిలీ కావాలన్నా పేషీకి ముడుపులు సమర్పించుకోవల్సిందేనని.. లేదంటే శంకరగిరి మాన్యాలు తప్పవని సెలవిచ్చారు. అందుకోసం రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కేంద్రాన్ని బట్టి డీటీసీ పోస్టుకు రూ.25 లక్షలు, ఆర్టీవో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేసి మొత్తంగా రూ.10 కోట్లు వరకు కీలక నేత పేషీకి సమర్పించారు. ముడుపులు ఇవ్వని ముగ్గురిపై వేటు కీలక నేత పేషీ నుంచి ఫోన్లు చేసినా ముగ్గురు డీటీసీలు ముడుపులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమకు ఎక్కడ పోస్టింగు ఇచ్చినా విధులు నిర్వహిస్తామని, ముడుపులు ఇవ్వలేమని డీటీసీలు పురేంద్ర, రాజారత్నం, మీరా ప్రసాద్ చెప్పినట్టు సమాచారం. దాంతో ఆ ముగ్గురిపై బదిలీ వేటు వేశారు. వారికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయడం గమనార్హం. సీనియర్ అధికారిపై కక్ష సాధింపు.. రవాణా శాఖలో కమిషనర్ తరువాత అత్యంత కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. నిబంధనల ప్రకారం సీనియారిటీలో మొదటి స్థానంలో ఉన్న జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(జేటీసీ) రమాశ్రీకి ఆ పోస్టు ఇవ్వాలి. సర్వీసు రికార్డులో ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు కూడా లేవు. అయితే ఆమెను అదనపు కమిషనర్‌గా నియమించేందుకు మంత్రి పేషీ ససేమిరా అంది. నిబంధనల మేరకు వ్యవహరించే ఆమె కీలక స్థానంలో ఉంటే తమ అక్రమాలకు సాగవని భావించింది. ఈ నేపథ్యంలో రమాశ్రీని హఠాత్తుగా విశాఖ జేటీసీగా బదిలీ చేసి ఆమె కంటే జూనియర్ అధికారి వద్ద రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. భారీ అవినీతికి రంగం సిద్ధం చేస్తున్న కీలక నేత అందుకు వత్తాసు పలికే అధికారులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటున్నారని రవాణా శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రజినీకాంత్ వేట్టయాన్.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయాన్. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం దసరా సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. తొలిరోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది.విడుదలైన నాలుగు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 240 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రూ.104.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రజినీ కెరీర్లో రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ఏడో చిత్రంగా వేట్టయాన్ నిలిచింది. అంతకుముందు తలైవా చిత్రాలైన పెట్టా, దర్బార్, ఎంథిరన్, కబాలి, జైలర్, రోబో 2.0 చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్లో చేరాయి. కాగా.. ఈ ఏడాదిలో రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.605 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇదో జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే పెట్టా (రూ. 223 కోట్లు), దర్బార్ (రూ. 226 కోట్లు) చిత్రాలను వేట్టయాన్ అధిగమించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ హీరో రానా కీలక పాత్రలు పోషించారు. -
'కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నా నమ్మట్లేదు'.. దేవరపై నాగవంశీ కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే దేవర కలెక్షన్స్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఫ్యాన్స్ కోసమే మేము పెద్ద హీరోల సినిమాల వసూళ్లపై పోస్టర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అభిమానులు సంతోషంగా ఉంటేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నారు. తొలిరోజు కలెక్షన్స్ గురించి మేము చెప్పిన నంబర్లను చాలామంది నమ్మలేదన్నారు. మేము డబ్బులు వచ్చాయని చెబుతున్నా మీరు నమ్మట్లేదని అన్నారు. దేవర కలెక్షన్స్ నిజమేనా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారు.నాగవంశీ మాట్లాడుతూ.. 'దేవర మిడ్నైట్ షో సినిమాకు ప్లస్ అయినట్టే. దేవర వల్ల నాకొక విషయం తెలిసింది. మిడ్నైట్ షోలో టాక్ ఎలా ఉన్నా.. కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. గుంటూరు కారంతోనూ అదే జరిగింది. దేవరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం ఒరిజినల్ నంబర్స్ మాత్రమే ఇచ్చాం. సినిమా కలెక్షన్స్ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్ కోసమే. ఈ కల్చర్ హాలీవుడ్‌లోనూ ఉంది. కలెక్షన్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దేవర సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్ చేశానని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని' చెప్పారు. -
తగ్గేదేలే అంటోన్న దేవర.. పది రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇప్పటికే దసరా సెలవులు రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.దేవర విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.466 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని దేవర టీమ్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది.మరోవైపు నార్త్ అమెరికాలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు 5.8 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే ఆరు మిలియన్లకు చేరుకోనుంది. ఇక వరుసగా దసరా సెలవులు ఉండడంతో త్వరలోనే రూ.500 కోట్ల మార్క్‌ను దాటేయనుంది.కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దేవర.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.(ఇది చదవండి: దేవర అభిమానులకు అదిరిపోయే శుభవార్త)దేవర రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. వీక్ డేస్‌లోనూ దేవరకు ఏమాత్రం క్రేజ్ తగ్గట్లేదు. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ దేవరకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకోనుంది. కాగా.. ఈచిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. He’s the Dark Cloud of FEAR looming over all rivals 🔥See it. Feel it. Fear it in Cinemas now.#Devara #DevaraBlockbuster pic.twitter.com/v707pr9GGZ— Devara (@DevaraMovie) October 4, 2024 -
బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడు.. ఆరు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రూ.170 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దేవర.. ఆరో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.396 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని దేవర చిత్ర బృందం ఎక్స్ వేదికగా పంచుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్లింది. కేవలం ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.207.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే రూ.45.87 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వారంలోనే మూడు వందల కోట్ల మార్క్ దాటిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే రోజు కొనసాగితే త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో దేవర చేరడం ఖాయంగా కనిపిస్తోంది.(ఇది చదవండి: ఇలాంటి నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం: అల్లు అర్జున్, వెంకటేశ్)కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు.BIZ JUMPS ON WEDNESDAY... A national holiday can significantly impact #Boxoffice numbers, provided the film has merits... The #JrNTR-starrer #Devara makes a big splash on Wednesday, capitalizing on the #GandhiJayanti holiday, further solidifying its status.The numbers of… pic.twitter.com/LdUycX7PPq— taran adarsh (@taran_adarsh) October 3, 2024 It’s his Brutal Massacre…Box office is left shattered and bleeding 🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/4kjvrQpUYo— Devara (@DevaraMovie) October 3, 2024 -
సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే..
అక్టోబర్ 1న విడుదలైన ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారతదేశ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో రూ. 1.73 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో (2023 సెప్టెంబర్) జీఎస్టీ వసూళ్లు మొత్తం 1.62 లక్షల కోట్లు.2023 సెప్టెంబర్ కంటే కూడా 2024 సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 2024 ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు 1.75 లక్షల కోట్లు. గత నెలలో వ్యాపార కార్యకపాల ద్వారా ఆదాయం 5.9 శాతం (రూ.1.27 లక్షల కోట్లు) పెరిగింది. వస్తువుల దిగుమతుల ద్వారా కూడా ఆదాయం 8 శాతం (రూ.45,390 కోట్లు) పెరిగింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్ కంటే కూడా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
Devara Day 1 Advance Booking: 60కోట్లు కొల్లగొట్టిన దేవర
-
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్ మూవీ రికార్డ్ బ్రేక్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2 అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్ రూ.640.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- అట్లీ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ జవాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. -
శ్రద్ధాకపూర్ మూవీ రికార్డ్.. ఏకంగా యానిమల్‌ను దాటేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ మూవీ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అంతేకాకుండా గతంలోనే టాలీవుడ్ మూవీ బాహుబలి ది బిగినింగ్ వసూళ్లను దాటిన స్త్రీ-2.. సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్ దేశవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌ను సైతం దాటేసింది.కాగా.. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ గతేడాది విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.553 కోట్లు వసూళ్లు సాధించింది. తాజాగా స్త్రీ-2 రూ.583 కోట్ల వసూళ్లతో యానిమల్ చిత్రాన్ని దాటేసింది. అంతేకాకుండా బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో షారూఖ్ ఖాన్ జవాన్ (రూ.640 కోట్లు) తర్వాత రెండోస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: బాహుబలిని దాటేసిన చిన్న సినిమా.. జవాన్‌పై గురి!)అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం కంటెంట్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న విడుదలైన ఈ హారర్ కామెడీ సినిమా.. బాలీవుడ్లో స్టార్ హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చింది. శ్రద్ధాకపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. -
తగ్గిన జీఎస్టీ ఆదాయం
‘ఎన్నికల ముందు నా అనుభవంతో సంపద సృష్టిస్తా’ అన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్తగా ఒక రూపాయి ఆదాయం కూడా సృష్టించలేకపోయారు. రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలైతే పూర్తిగా క్షీణించాయి. గత రెండు నెలలుగా నమోదవుతున్న జీఎస్టీ వసూళ్ల గణాంకాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత వరుసగా రెండో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం నేలచూపులు చూసింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే.. ఈ ఏడాది ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 5 శాతం క్షీణించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2023 ఆగస్టులో రూ.3,479 కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 2024 ఆగస్టులో 5 శాతం తగ్గి రూ.3,298 కోట్లకు పడిపోయింది. మహారాష్ట్రలో 13 శాతం, కర్ణాటక 11 శాతం, ఒడిశా 11 శాతం, కేరళ 9 శాతం, తమిళనాడు 7 శాతం, తెలంగాణ రాష్ట్రాల్లో 4 శాతం చొప్పున వృద్ధి నమోదైతే.. ఒక్క ఏపీలో మాత్రమే జీఎస్టీ ఆదాయం తగ్గింది. జూలైలో కూడా ఏపీలో 7 శాతం క్షీణత నమోదైంది. – సాక్షి, అమరావతినాడు కోవిడ్ సంక్షోభంలోనూ రెండంకెల వృద్ధికోవిడ్ సంక్షోభం తర్వాత కూడా రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పరుగులు తీసింది. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే అధికంగా.. రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది. 2019–20లో రూ.28,241.33 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం.. కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా ఐదేళ్ల కాలంలో 2023–24 నాటికి 59.35 శాతం వృద్ధితో రూ.45,002.73 కోట్లకు చేరింది. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో సగటున జీఎస్టీ ఆదాయం ఏడాదికి 11.87 శాతం చొప్పున వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఏకంగా 15.86 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.45,002.73 కోట్లుగా నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో 16 శాతం, ఏప్రిల్ 12 శాతం, మే నెలలో 15 శాతం వృద్ధిని నమోదు చేసిన ఏపీ.. కోవిడ్ తర్వాత తొలిసారిగా బాబు పాలనలో తిరోగమనం వైపు పరుగులు తీస్తోంది. బాబు నిర్వాకంతో కొనుగోలు శక్తి తగ్గుదల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షం మీద వేధింపులకే ప్రాధాన్యత ఇవ్వడంతో.. వాణిజ్య కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉంచగా.. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే వాటిని దోచుకొని పక్క రాష్ట్రాలకు తరలించేశాయి. దీంతో ఇసుక కొరత ఏర్పడి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి.ఇది జీఎస్టీ ఆదాయంపై గణనీయంగా ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ఎప్పటికç³్పుడు ప్రజల జేబుల్లో నగదు నింపడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచేదని వారు గుర్తు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని పేర్కొన్నారు.ఇది కూడా జీఎస్టీ ఆదాయం తగ్గడానికి ముఖ్య కారణమని వెల్లడించారు. ప్రభుత్వ తీరుతో ఆదాయ వనరులు నేలచూపులు చూస్తున్నాయని.. ఇది రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ది గోట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్పై థ్రిల్లర్ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 170.75 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరుకోనుంది. మొదటి రోజు రూ.44 కోట్లు రాబట్టిన ది గోట్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే అత్యధికంగా రూ.126 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ లియో రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. రాజకీయాలకు ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ది గోట్ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
రూ.500 కోట్ల క్లబ్లో చిన్న సినిమా.. ఏకంగా ఆ జాబితాలో టాప్!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా అరుదైన క్లబ్లో చేరింది. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 22 రోజుల్లోనే రూ.502.9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. షారూఖ్ ఖాన్ జవాన్ తర్వాత అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే గదర్-2 ఆల్ టైమ్ వసూళ్లను దాటేయనుంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన గదర్-2 బాక్సాఫీస్ వద్ద రూ. 525 కోట్లు నికర వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన 'స్త్రీ 2 మొదటి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది రూ. 500 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా ఘనత సాధించింది. అయితే ఈ నెలలో బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశముంది. దేశవ్యాప్తంగా హిందీలో ఈ మూవీ కంటే ముందు జవాన్(రూ. 640 కోట్లు), పఠాన్(రూ.543 కోట్లు), యానిమల్(రూ.553 కోట్లు), గదర్-2 (రూ. 525 కోట్లు) ముందున్నాయి. -
విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇండియన్-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్సీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్-2ను అధిగమించిన విజయ్ చిత్రం!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో కమల్ హాసన్'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. -
వీకెండ్లో దూసుకెళ్లిన సరిపోదా శనివారం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం సరిపోదా శనివారం. ఆగస్టు 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.23.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.9 కోట్లకు కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.52.18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పోస్టర్ ద్వారా పంచుుకంది. కాదా.. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లతో ఉత్తర అమెరికాలో తొలి బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొదటి రోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరిపోదా శనివారం వీకెండ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఈ మూవీ కమర్షియల్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషించారు. హీరోయిన్గా ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు.Bhaga Bhaga Bhaga..Bhaga Bhaga Bhaga 🔥#SaripodhaaSanivaaram pic.twitter.com/zsVDRl772X— DVV Entertainment (@DVVMovies) September 1, 2024 -
సరిపోదా శనివారం బాక్సాఫీస్.. నాని మూవీకి ఊహించని కలెక్షన్స్!
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన తాజా చిత్రం 'సరిపోదా శనివారం'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే తొలి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో హిట్స్ కొట్టిన నాని తన ఖాతాలో మరో సూపర్‌హిట్ ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన సరిపోదా శనివారం మూవీకి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టింది. గురువారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.24.11 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే అత్యధికంగా రూ.12 కోట్ల నెట్ రాట్టింది. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రం కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా అభిరామి, అదితి బాలన్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, అజయ్ ఘోష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి జేక్స్ బేజాయ్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ వద్ద అదే జోరు.. కేజీఎఫ్-2 రికార్డ్ బద్దలయ్యే ఛాన్స్!
శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రల్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా రిలీజై 12 రోజులైనప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.589 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.498 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.422 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఏకంగా రూ.20.2 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.విడుదలైన రెండోవారం మొదలైన స్త్రీ-2 చిత్రానికి థియేటర్లలో ఆదరణ దక్కించుకుంటోంది. హిందీ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్-2 సాధించిన వసూళ్ల కంటే కేవలం 12 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది. ఇదే జోరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టనుంది. ఈ చిత్రం త్వరలోనే అత్యధిక వసూళ్లు చేసిన ఆరో భారతీయ చిత్రంగా నిలవనుంది. మూడో వారాంతం నాటికి రూ.500 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో అపర్శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. ఈ వారంలోనూ బాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో స్త్రీ-2 ప్రభంజనం కొనసాగించే అవకాశముంది. ఆగస్ట్ 30న శుక్రవారం బీటౌన్‌లో బిగ్ స్టార్స్ చిత్రాలు ఏవీ రావడం లేదు. ఇది కూడా ఈ చిత్రానికి వసూళ్లుపరంగా కలిసి రానుంది. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
తగ్గేదేలే.. దంగల్, అవతార్-2ను వెనక్కినెట్టిన స్త్రీ-2!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.560 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ దెబ్బతో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా రూ.474 గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. రూ.402 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.అమర్ కౌశిక్ దర్శకత్వంలో హారర్ కామెడీగా వచ్చిన స్త్రీ-2 రెండో వారాంతంలో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' (రూ. 373.05 కోట్లు), 'జైలర్' (రూ. 348.55 కోట్లు), 'సంజు' (రూ. 342.57 కోట్లు), 'దంగల్' (రూ. 387.38 కోట్లు), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (రూ. 391.4 కోట్లు) చిత్రాలను అధిగమించింది.ఇదే జోరు కొనసాగితే త్వరలోనే సలార్ పార్ట్-1(రూ. 406.45 కోట్లు), 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 421 కోట్లు), '2.0' (రూ. 407.05 కోట్లు) వసూళ్లను దాటేయనుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 'గదర్ 2' (రూ. 525.7 కోట్లు), 'పఠాన్' (రూ. 543.09 కోట్లు), 'యానిమల్' (రూ. 553.87 కోట్లు) చిత్రాల నెట్ కలెక్షన్స్‌ను అధిగమించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, వరుణ్ ధావన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న మూవీ.. పది రోజుల్లోనే రూ.500 కోట్లు!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన హారర్-కామెడీ చిత్రం స్త్రీ-2. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. 2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్‌గా రూపొందించారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.426 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి ఐదొందల మార్కును దాటేసింది.ఈ చిత్రం సక్సెస్ కావడం డైరెక్టర్ అమర్ కౌశిక్ ఆనందం వ్యక్తం చేశారు. స్త్రీ 2 కోసం దాదాపు రెండున్నరేళ్లు కష్టపడ్డామని తెలిపారు. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని తెలిపారు. షూటింగ్ మొదటి రోజు నుంచే స్త్రీ 2 కథతో పూర్తిగా నిమగ్నమై తెరకెక్కించామని అన్నారు. కాగా.. అన్యాయానికి గురైన ఓ స్త్రీ.. దెయ్యంగా మారి ఏం చేసిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదేవిధంగా వసూళ్లు కొనసాగితే త్వరలోనే ఈ మూవీ మరిన్ని పెద్ద చిత్రాల రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ మూవీ.. వారం రోజుల్లోనే రికార్డ్!
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.అమర్ కౌశిక్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇండియావ్యాప్తంగా రూ.342 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్‌గా రూ.401 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్లో మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న స్త్రీ-2.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్త్రీ-2. గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 15న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రక్షాబంధన్ రోజు సోమవారం సైతం రూ.45 కోట్ల కలెక్షన్స్‌తో హవా కొనసాగించింది.ఇండియా విషయానికొస్తే ఐదో రోజు సైతం రూ. 38.4 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే ఇండియావ్యాప్తంగా రూ. 242.4 కోట్ల వసూళ్లు సాధించింది. ఇదే జోరు కొనసాగితే ఈ వారాంతంలో పెద్ద సినిమాల రికార్డులు బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. అదే రోజు బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలతో స్త్రీ-2 పోటీ పడుతోంది. ఆ రెండు సినిమాల కలెక్షన్లను బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్, అపర్ శక్తి, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. -
కమిటీ కుర్రోళ్ల కాసుల వర్షం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కొత్తవాళ్లతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాను నిహారిక సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందించారు. ఈ సినిమాను యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.మొదటి మూడు రోజుల్లో రూ.6 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లోనే రూ.8.49 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రం ద్వారా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఇప్పటికే ఈ మూవీపై టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, రామ్ చరణ్ సైతం ప్రశంసలు కురిపించారు.అసలు కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.గత జాతర సమయంలో కమిటీ కుర్రోళ్లు(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.#CommitteeKurrollu Phenomenon Continues at the Box Office! 💥🥳The nostalgic blockbuster has collected Rs. 8.49 crore gross worldwide in 5 days❤️🔥Enters into Profit Zone😎🎟 https://t.co/IpUpchEhNd pic.twitter.com/UAQSUEmhgz— Telugu Film Producers Council (@tfpcin) August 14, 2024 -
కల్కి కలెక్షన్స్.. షారూఖ్‌ను దాటేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా మార్కెట్ రేంజ్ ఏంటో బాలీవుడ్‌కు చూపించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్ కొల్లగొట్టాడు. జూన్ 27న విడుదలైన కల్కి.. 40 రోజులు దాటినా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఇండియా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో కల్కి చేరిపోయింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీని కల్కి 2898 ఏడీ దాటేసింది. జవాన్ లైఫ్‌టైమ్ రికార్డ్‌ను కల్కి 40 రోజలు కలెక్షన్లతో దాటేసింది.షారూఖ్ లైఫ్ టైమ్ రికార్డ్ దాటేసిన ప్రభాస్నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. బాహుబలి 2: ది కన్‌క్లూజన్, KGF 2, RRR తర్వాత భారతీయ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా కల్కి సత్తా చాటింది. ఇప్పటి వరకు భారత్‌లో నాలుగో స్థానంలో ఉన్న షారుఖ్ జవాన్ చిత్రాన్ని ఈ చిత్రం అధిగమించింది. జవాన్ మొత్తం రూ.640.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే.. కల్కి భారత్‌లో రూ. 641.13 కోట్ల నెట్ మార్క్‌ను అధిగిమించింది. ప్రస్తుతానికి, కల్కి నెట్, గ్రాస్ కలెక్షన్లలో ముందుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్‌లో మాత్రం జవాన్ ఇంకా రేసులో ఉంది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1160 కోట్లు రాబడితే.. కల్కి రూ. 1100 కోట్లు సాధించింది. మరో రూ. 60 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో కూడా ప్రభాస్ ముందుంటాడు.ఏ వారంలో ఎంత కలెక్షన్కల్కి 2898 AD మొదటి వారంలో రూ. 414.85 కోట్లు, రెండో వారంలో రూ. 128.5 కోట్లు, మూడో వారంలో రూ. 56.1 కోట్లు, నాలుగో వారంలో రూ. 24.4 కోట్లు వసూలు చేసి ఐదవ వారంలో రూ.12.1 కోట్ల వసూళ్లను కొనసాగించింది. ప్రస్తుతం ఆరో వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 5.18 కోట్లతో మొత్తం దేశీయ కలెక్షన్ రూ. 641.13 కోట్లు అని ఒక సంస్థ నివేదించింది. మరో రెండు వారాల పాటు కల్కి కలెక్షన్స్ కొనసాగుతాయని ఆ సంస్థ తెలిపింది.కల్కికి ఉన్న పోటీ ఏంటి..?జవాన్ థియేట్రికల్ రన్ ఎనిమిది వారాల వరకు కొనసాగింది. కల్కి 2898 AD ఇంకా ఆరవ వారంలో ఉంది. మరికొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఆగస్ట్ 15న విడుదలవుతున్న స్ట్రీ 2, వేదా, ఖేల్ ఖేల్ మే వంటి కొత్త సినిమాలతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్‌పూల్ అండ్ వుల్వరైన్ సినిమాతో పోటీ పడుతూ కల్కి ముందుకు సాగింది. కల్కి 2898 AD హిందూ పురాణాలను ప్రధాన అంశంగా తీసుకుని దానికి సాంకేతికత జోడించి సైన్స్ ఫిక్షన్ రూపంలో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్,అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి బలమైన తారాగణం ఉంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలలో కనిపించారు. -
కల్కి ఖాతాలో మరో మైలురాయి.. ఆ మార్కును దాటేసింది!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లోనూ అత్యధిక వసూళ్లతో సత్తా చాటింది. విడుదలైన రెండువారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.తాజాగా కల్కి మూవీ మరో రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ విడుదలైన నెల రోజుల్లోపే రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ అంటూ కల్కి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం అతిథి పాత్రల్లో మెరిశారు. 𝐀 𝐫𝐞𝐬𝐨𝐮𝐧𝐝𝐢𝐧𝐠 𝐩𝐡𝐞𝐧𝐨𝐦𝐞𝐧𝐨𝐧 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐛𝐨𝐱 𝐨𝐟𝐟𝐢𝐜𝐞...❤️🔥1100 CRORES and counting… #Kalki2898AD continues its epic run into the 5th week! @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms… pic.twitter.com/WQOeT9a3Zf— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 25, 2024 -
దారుణంగా ఇండియన్-2 కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. భారతీయుడు సీక్వెల్‌గా తీసుకొచ్చిన ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలి రెండు కలెక్షన్స్ ఫర్వాలేదనిపించినప్పటికీ... ఆ తర్వాత దారుణంగా పడిపోయాయి. వీక్ డేస్‌లో ఊహించనా కలెక్షన్స్ రాలేదు. తాజాగా ఏడు రోజుల్లో ఇండియన్-2 సినిమాకు ఇండియా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఏడో రోజు ఇండియాలో కేవలం రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూళ్లు సాధించింది. ఇండియన్ 2 మూవీపై మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడం కలెక్షన్స్‌ను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వారం రోజుల్లో రూ. 121.65కిపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇలాగే కొనసాగితే ఇండియాలో రూ.100 కోట్ల మార్కును చేరుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. కాగా.. ఇండియన్ 2 సినిమాకు మొదటి రోజు రూ. 25.6 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో నటించారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలు పోషించారు. -
బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు.. భాజా భజంత్రీలతో సంబురాలు!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. రిలీజైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో చిత్రబృందం ఫుల్ ఖుషీ అవుతున్నారు.తాజాగా కల్కి మూవీ సక్సెస్ వేడుకను చిత్రబృంద సభ్యులు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ భాజాభజంత్రీలతో సందడి చేశారు. నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Fans of Rebel Star #Prabhas celebrated the success of #Kalki2898AD with Producer @AshwiniDuttCh garu ❤️🔥#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/5IeNZx3DZr— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2024 -
భారతీయుడు 2 కలెక్షన్స్.. ఆ సినిమాకు దరిదాపుల్లో కూడా లేవు
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్లో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా జులై 12న ఈ మూవీ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్‌తో పాటుగా సిద్ధార్, రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలకపాత్రలలో నటించారు. అయితే, సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సినిమాకు మొదటిరోజు కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదని తేలుతుంది.(చదవండి: : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ)ఇండియన్ 2 మూవీ తొలిరోజు రూ. 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమిళ్ వర్షన్లో రూ. 16 కోట్లు వస్తే.. తెలుగులో రూ. 8 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అయితే మరీ దారణంగా కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్లో మొదటిరోజు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. శంకర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్లో ఇంత తక్కువ కలెక్షన్స్ రావడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.2022లో విడుదలైన విక్రమ్ సినిమా మొదటిరోజు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, భారతీయుడు 2 మూవీ మాత్రం విక్రమ్ కలెక్షన్స్‌కు దరిదాపుల్లో కూడా చేరుకోలేకపోయింది. ఇదే క్రమంలో డైరెక్టర్ శంకర్ చివరి సినిమా రోబో 2.ఓ తొలిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా రాబట్టింది. భారతీయుడు 2 సినిమా బాగాలేదంటూ ఇప్పటికే మోత్ టాక్ పబ్లిక్‌లోకి వెళ్లిపోయింది. అంతేకాకుండా తెలంగాణలో ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచారు. ఈ ప్రభావం భారతీయుడు 2 కలెక్షన్ల మీద భారీగా పడనుంది. ఒక డబ్బింగ్ సినిమాకు టిక్కెట్ల ధరలు పెంచుకోవడం ఏంటి..? అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కమల్ హాసన్ లాంటి స్టార్ హీరో సినిమా కదా చూసేద్దామని కుటుంబంతో వీకెండ్లో సినిమా ప్లాన్ చేసుకునే వారు కూడా భారతీయుడు వైపు వెళ్లకుండా చేసేలా టికెట్ల ధరలు ఉన్నాయిని నెటిజన్లు వాపోతున్నారు. -
కల్కితో కాసుల వర్షం.. 11 రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. అంతేస్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్క్‌ను చేరుకుంది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరనుంది.సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. మూడు ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్ హాసన్‌తో సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్-2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/xbbZpkX7g0#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/r27Dybw58B— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2024 -
ప్రభాస్ కల్కి.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఆరు రోజుల్లో దాదాపు రూ.680 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కల్కి.. ఏడో రోజు సైతం అదే జోరును కొనసాగించింది.గత నెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం వారం రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వీక్ డేస్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కల్కి.. వీకెండ్లో మరింత భారీగా రాబట్టే అవకాశముంది. ఇదే జోరు కొనసాగితే కల్కి కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
వీక్ డేస్‌లోనూ తగ్గేదేలే.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు రికార్డులను తన పేరున లిఖించుకుంది. మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా కల్కి ఆరు రోజుల్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.680 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మంగళవారం ఒక్కరోజే రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో రూ.700 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఓవర్సీస్లో పలు రికార్డులు సృష్టించిన కల్కి.. మరికొద్ది రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
బాక్సాఫీస్ వద్ద కల్కి ప్రభంజనం.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.625 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు.అరుదైన ఘనతతాజాగా ఈ సినిమా ఓవర్సీస్లోనూ దూసుకెళ్తోంది. కల్కి మరో ఘనతను సాధించింది. ఉత్తర అమెరికాలో 12 మిలియన్ల డాలర్ల వసూళ్లను అధిగమించింది. ఈ ప్రాంతంలో అత్యంత వేగంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. కాగా.. హిందీ వర్షన్లో ఇప్పటి వరకు మొత్తం రూ.135 కోట్లు వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ లోపే ఈ సినిమా ఆ మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది .


