
అధర్వ, నిమిషా సాజయన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మై బేబీ. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి నిర్మించారు. ఈనెల 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.35 లక్షల వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినా కలెక్షన్లపరంగా ఫర్వాలేదనిపిస్తోంది. మూడు రోజులకే రికార్డు స్థాయిలో వసూళ్లు చేసి చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో అమ్మ ప్రేమ, నాన్న బాధ్యతను చూపే కథగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువైంది. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకు చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.