సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కార్మేని సెల్వం’. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ మూవీ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు. "డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలవుతుంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు.. ఇలా నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటోంది.
రిచ్ కావాలంటే..
ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయి. టీజర్ చివర్లో.. “ధవంతుడివి కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకునైనా ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ నేటి మనుషుల పోకడను తెలియజేస్తోంది.
సినిమా
ఈ మూవీని రామ్ చక్రి దర్శకత్వంలో పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.


