వాషింగ్టన్: ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభం కొనసాగుతుండగానే బుధవారం (మార్చి 11, 2026) తెల్లవారుజామున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద తీవ్ర కలకలం రేగింది. వైట్ హౌస్ సమీపంలో భద్రతా బారికేడ్లను దాటి ఒక వ్యాన్ దూసుకు వచ్చింది. పర్యాటకులు, ఉద్యోగులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని భద్రతా గేటును వ్యాన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని ప్రాంతాన్ని మూసివేసినట్టు పోలీసులు తెలిపారు.
వైట్ హౌస్‌కు ఉత్తరాన ఉన్న లఫాయెట్ స్క్వేర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని అధ్యక్ష భద్రతను నిర్వహించే సీక్రెట్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపారు. వాహన వివరాలను పరిశీలిస్తున్నామని సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్ క్రూ రీల్, ఎయిరిండియా విచారణ
వైట్ హౌస్ చుట్టూ ఉన్న అనేక ప్రధాన వీధులను పోలీసులు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, నగర కార్మికులు తమ కార్యాలయాలకు రాకుండా చేశారు. ట్రాఫిక్ రద్దీ ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. పర్యాటకులు, నివాసితులు వీధులు తిరిగి తెరవడానికి వేచి ఉన్నారు.
ఇదీ చదవండి: అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్ పైలట్ ఆవేదన వైరల్


