ల్యాండింగ్ సమయంలో ఊడిన చక్రం.. తప్పిన ప్రమాదం | Air India Express Flight Makes Hard Landing In Phuket Airport, Nose Wheel Detaches And All 133 Passengers Safe | Sakshi
Sakshi News home page

ల్యాండింగ్ సమయంలో ఊడిన చక్రం.. తప్పిన ప్రమాదం

Mar 11 2026 2:38 PM | Updated on Mar 11 2026 3:16 PM

 Air India Express Makes Hard Landing At Phuket Airport

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుండి పుకెట్‌కు బయిలుదేరిన ఎయిర్‌ఇండియా విమానం పుకెట్‌ విమానాశ్రయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. రన్‌వే పై దిగుతుండగా విమానం యెుక్క ముందు చక్రం ఊడింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

విమాన ప్రమాదంతో ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. బోయింగ్ 737 మాక్స్ 8 అయితే విమానం హర్డ్ ల్యాండింగ్ అవడంతోనే ప్రమాదం జరిగిఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 133 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందరిని క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు

అయితే ఈ ప్రమాదంపై ఎయిర్‌ఇండియా స్పందించింది. " హైదరాబాద్-ఫుకెట్ విమానంలో ముందుభాగంలోని చక్రంలో సమస్య ఎదురైంది. అనంతరం సిబ్బంది తక్షణమే స్పందించి ప్రయాణికులను విమానం నుండి దింపారు. ఈ ప్రమాద సమయంలో సహకరించినందుకు, ప్రయాణికులతో పాటు ఫుకెట్ విమానాశ్రయ అధికారులకుకృతజ్ఞతలు తెలుపుతున్నాము" అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటనలో  విడుదల చేసింది.

అయితే ఇటీవల తరచుగా విమాన ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాయాన సంస్థలు ప్రయాణానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement