ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్‌స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్‌ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్‌స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్‌తో హల్ చల్ చేస్తున్నారు.
ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.
యూజర్ల ఫిర్యాదులు
యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్‌షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్‌స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్‌లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్‌స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట


