ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్‌ని.. | Bengaluru woman built a wine brand in Bordeaux | Sakshi
Sakshi News home page

ఎవరీ నమ్రత స్టాన్లీ..? ఏకంగా వైన్ బ్రాండ్‌ని..

Mar 8 2026 2:35 PM | Updated on Mar 8 2026 2:36 PM

Bengaluru woman built a wine brand in Bordeaux

మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్‌ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్‌ బిజినెస్‌లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..

ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్‌ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 

2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్‌ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అ‍త్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. 

మార్కెట్‌కి వెళ్తున్నా అని ఫ్రెంచ్‌ క్లాస్‌లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్‌ఫోన్‌లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్‌ని ఒక జాబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్‌కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్‌ ఐటీ సంస్థ ఆమెను పారిస్‌లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్‌కి మాత్రమే పంపించారు స్టాన్లీని. 

అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్‌ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్‌కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్‌లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్‌పోర్ట్‌ని మాయం  చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్‌ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్‌ బోర్డియక్స్‌లో వైన్ మార్కెటింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ MBA ప్రోగ్రామ్‌లో చేరింది. 

చెప్పాలంటే ఆ క్లాస్‌లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్‌ పెట్టేది స్టాన్లీ. వైన్‌ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్‌గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్‌లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్‌గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్‌ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. 

ఆ తర్వాత వైన్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్‌ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్‌ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్‌లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్‌ 'సోలికాంటస్‌' పేరుతో వైన్‌ని విక్రయించే రేంజ్‌కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్‌ అంటే లాటిన్‌లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్‌ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్‌ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. 

(చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్‌ స్కాలర్‌ విజయ గాథ)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement