హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే? | Bellamkonda Sreenivas Girlfriend And Engagement Details | Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: చాన్నాళ్లుగా ప్రేమలో.. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌కి రెడీ

Mar 6 2026 2:52 PM | Updated on Mar 6 2026 3:56 PM

Bellamkonda Sreenivas Girlfriend And Engagement Details

గత వారం పదిరోజుల్లోనే హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా ఉదయ్‌పుర్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. సొంతూరి వాళ్లకు, అభిమానులకు, సినీ-రాజకీయ ప్రముఖులకు వేర్వురుగా రిసెప్షన్స్ ఏర్పాటు చేశారు. ఆ సందడి అంతా అయిపోయింది. ఇకపోతే ఈరోజు అల్లు శిరీష్, నయనిక మెడలో మూడు మూళ్లు వేయనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో హీరో కూడా ప్రేమ వివాహానికి సిద్ధమైపోయాడు.

(ఇదీ చదవండి: రీల్స్‌ పేరుతో ఇలాంటి ఫోటోలా.. రుక్మిణి వసంత్‌ ఫైర్‌)

నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలానే సినిమాలు చేశాడు గానీ 'రాక్షసుడు' తప్పితే మరేవి హిట్ కాలేదు. ప్రస్తుతం హైందవ, టైసన్ నాయుడు తదితర చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇతడు గత కొన్నేళ్లుగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం(మార్చి 8) కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది.

కావ్య రెడ్డి విషయానికొస్తే ఈమెది హైదరాబాదే. తాత జడ్జి కాదా తండ్రి లాయర్‌గా చేస్తున్నారు. ఈమెకు ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఎప్పుడు ఎలా పరిచయమయ్యారో గానీ శ్రీనివాస్-కావ్య ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అనుమతితోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. వేసవిలో లేదంటే ఈ ఏడాది చివరలో పెళ్లి ఉండే అవకాశముంది.

(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)

Advertisement
 
Advertisement
Advertisement