ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్‌' విలన్‌ | Bobby Deol and Wife Tania Firm Buys Five Mumbai Offices | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఐదు ఆఫీసులు కొన్న 'యానిమల్‌' విలన్‌

Mar 6 2026 2:56 PM | Updated on Mar 6 2026 3:33 PM

Bobby Deol and Wife Tania Firm Buys Five Mumbai Offices

రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సినీతారలు ఎప్పటికప్పుడు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. బాబీ డియోల్, ఆయన భార్య తానియా డియోల్ ముంబైలోని అంధేరీలో 3,400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఐదు కమర్షియల్ ఆఫీసులను కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.15.05 కోట్లు అని తెలుస్తోంది.

బాబీ డియోల్ దంపతులు కొనుగోలు చేసిన ఐదు కమర్షియల్ ఆఫీసులు.. అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్‌లో ఉన్న యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2 రెండవ అంతస్తులో ఉన్నాయి. అదే భవనంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, చిత్రనిర్మాత రాకేష్ రోషన్ & ప్రమీలా రోషన్‌తో సహా రోషన్ కుటుంబ సభ్యులకు చెందిన అనేక ఆఫీస్ యూనిట్లు కూడా ఉన్నాయి.

సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన అష్టి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. లావాదేవీ ఫిబ్రవరి 27, 2026న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి రూ. 90 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీతో పాటు దాదాపు రూ.1.50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. 2027 డిసెంబర్ నాటికి బాబీ డియోల్ దంపతులు స్వాధీనం చేసుకోనున్నారు. ఐదు కార్ల పార్కింగ్ స్థలాలతో పాటు.. ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!

Advertisement
 
Advertisement
Advertisement