బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే.
చైనాకు చెందిన ఒక కుటుంబానికి ఊహించని అదృష్టం వరించింది. తాము పెంచుకున్న బాతును విందుకోసం వధించారు. అనూహ్యంగా దాని పొట్టలో బంగారాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని అంచనా. మెయిన్‌ల్యాండ్ మీడియా అవుట్‌లెట్ జిన్‌వెన్‌ఫాంగ్ నివేదించిన ప్రకారం, ఆ ముక్కలు మొత్తం 10 గ్రాముల బరువు కలిగి ఉన్నాయి. వాటి అంచనా విలువ దాదాపు 12,000 యువాన్లు, అంటే దాదాపు రూ. 1.6 లక్షలు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన ఫిబ్రవరిలో హునాన్ ప్రావిన్స్‌లోని లాంగ్‌హుయ్ కౌంటీలో జరిగింది. లియు అనే గ్రామస్థుడు, బాతును వధించిన తర్వాత దానిని శుభ్రం చేస్తున్నప్పుడు చిన్న చిన్న బంగారు ముక్కల్ని గమనించాడు. దీంతో ఇది నిజంగా బంగారమేనా అని నిర్ధారించుకునేందుకు, ఇంట్లోనే బర్నింగ్ టెస్ట్ నిర్వహించాడు. నిజమైన బంగారమే అని తెలిసి సంతోషంగా ఉబ్బితబ్బిబ్బైనాడు. రాబోయే అదృష్టానికి సంకేతంగా లియు తండ్రి అభిప్రాయపడగా, ఇది కొత్తేమీ కాదనీ, ఇంత పెద్ద మొత్తంలో లభించడం మాత్రం ఇదే తొలిసారని కొడుకు లియూ చెప్పాడు.
(రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్)
అయితే బాతులు, ఇతర పక్షులు ఆహారం తీసుకునేటప్పుడు చిన్న రాళ్ళు, ఇసుక లేదా గ్రిట్ మింగడం చాలా కామన్. అలా ఒకప్పుడు బంగారు తవ్వకాలతో ముడిపడి ఉన్న నది దగ్గర ఆహారం తీసుకుంటుండగా ఈ బాతు పొట్టలోకి బంగారం చేరి ఉంటుందని విశ్వసిస్తున్నారు.అ యితే ప్రస్తుతం బాతు పొట్టలో దొరికిన బంగారం ఎవరిది అని నిర్ణయించడం కష్టమంటున్నారు అధికారులు. 1970-1990ల మధ్య కాలంలో, ఈ నది దగ్గర బంగారం కోసం వేట చాలా జోరుగా సాగేది. అయితే, తరువాత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రైవేట్ బంగారు తవ్వకాలను నిషేధించింది.
ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య


