తెలంగాణా సహా 22 రాష్ట్రాల్లో ‘సర్‌’ : నోటిఫికేషన్‌ జారీ చేసిన ఈసీ | Sir across the 22 states including Telananga by EC | Sakshi
Sakshi News home page

తెలంగాణా సహా 22 రాష్ట్రాల్లో ‘సర్‌’ : నోటిఫికేషన్‌ జారీ చేసిన ఈసీ

Mar 6 2026 3:14 PM | Updated on Mar 6 2026 3:54 PM

Sir across the  22 states  including Telananga by EC

తెలంగాణాలో ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ (SIR)కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు  కేంద్ర న్నికల సంఘం (సీఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో SIR తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌కు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. 

ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను, శిక్షణా కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ఈసీఐ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  సిసుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. 

కాగా దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్‌ దశలవారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement