ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్‌ | Against Donlad Trump US Justice Dept unseals Epstein files with fresh allegations | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్‌

Mar 6 2026 2:29 PM | Updated on Mar 6 2026 5:23 PM

Against Donlad Trump US Justice Dept unseals Epstein files with fresh allegations

 ఇరాన్‌పై  భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో  అమెరికా అధ్యక్షుడికి  మరోషాక్‌

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో​ భాగంగా కొత్త ఫైల్స్‌ విడుదల

ట్రంప్‌ మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఇరాన్‌పై  భీకర దాడులు వరుసగా 7వ రోజు కూడా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్‌  తగింది.  ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన మరికొన్ని కీలక పత్రాలను అమెరికా న్యాయశాఖ (Department of Justice) తాజాగా విడుదల చేసింది. దివంగత లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌  (Epstein Files) కేసులో భాగంగా వీటిని బహిర్గతంచేసింది.

తాజాగా విడుదలలైన  ఈ పత్రాలు ప్రకారం ఎప్‌స్టీన్‌ ద్వారా ట్రంప్‌కు పరిచయమైన ఒక మహిళను, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు (13 -15 ఏళ్ల వయస్సులో) ట్రంప్ లైంగికంగా వేధించారని పేర్కొంటున్నాయి.ఎప్‌స్టీన్‌ ఆ బాలికను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడు. 

ఆ సమయంలో ట్రంప్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించగా, తాను అతణ్ని కొరికి  గాయపరిచినట్టు ఆ మహిళ దర్యాప్తు అధికారులకు వివరించిందని 2019లో FBI జరిపిన ఇంటర్వ్యూల ప్రకారం తెలుస్తోంది.అంతేకాదు ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని తనకు, తన కుటుంబ సభ్యులకు  పలు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆమె ఆరోపించింది.

రాజకీయ దుమారం
ఈ పత్రాలు గతంలోనే విడుదల కావాల్సి ఉన్నా, పొరపాటున "డూప్లికేట్" (నకలు) అని మార్క్ చేయబడటం వల్ల అప్పట్లో బయటకు రాలేదని న్యాయశాఖ తెలిపింది. దీనిపై స్పందించిన డెమోక్రాట్లుట్రంప్ ప్రభుత్వం ఎప్‌స్టీన్‌ కేసులో కీలక వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించిందని డెమోక్రాట్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టడానికి అటార్నీ జనరల్ పామ్ బాండీకి సమన్లు (Subpoena) జారీ చేయాలని హౌస్ కమిటీ నిర్ణయించింది.

అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఈ పత్రాల్లో ఉన్నవి అవాస్తవాలు, సంచలనం కోసం సృష్టించిన ఆరోపణలని గతంలోనే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఎప్‌స్టీన్‌ కేసులో వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకు ఇరాన్‌పై దాడులకు పూనుకున్నాడని ట్రంప్‌పై తీవ్ర విమర్శలు  వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!

Advertisement
 
Advertisement
Advertisement