న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌ | West Asia conflict Nuclear watchdog sounds alarm says no response Iran | Sakshi
Sakshi News home page

న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌

Mar 2 2026 4:23 PM | Updated on Mar 2 2026 5:26 PM

West Asia conflict Nuclear watchdog sounds alarm says no response Iran

US-Iran War పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తల  నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ మరియానో గ్రాస్సీ (Rafael Mariano Grossi)   కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు జరిగితే, ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉందని, ఆ అవకాశాన్ని తాము తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు.


ఇరాన్ సరిహద్దు దేశాలలో సాధారణ నేపథ్య స్థాయిలకంటే రేడియేషన్ స్థాయిలు పెరగనప్పటికి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ప్రధాన నగరాల కంటే పెద్దవిగా లేదా పెద్దవిగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరంతో సహా తీవ్రమైన పరిణామాలతో కూడిన రేడియోలాజికల్ విడుదల ప్రమాదం ఉందన్నారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండాలంటే గరిష్ట సంయమనం పాటించాలి. తిరిగి దౌత్య చర్చలు జరగాలని కోరారు.  (భీకర దాడుల వేళ, దుబాయ్‌ సంచలన నిర్ణయం)

అణు ప్రమాదం లేకపోలేదు 
ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై ప్రభావం పడిందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి అణుశక్తి విభాగం చీఫ్ రాఫెల్ గ్రోసీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం, ఇరాన్‌లోని ఏ అణు కేంద్రం కూడా దెబ్బతినలేదు" అని పునరుద్ఘాటించారు. ఒకవేళ అణు వికిరణం (Radiation) సంభవిస్తే, అది అత్యంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని గ్రోసీ హెచ్చరించారు. దీనివల్ల పెద్ద నగరాలు,  పెద్ద ప్రాంతాల నుండి ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ అణు నియంత్రణ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ వారి నుండి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని గ్రోసీ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ అనివార్య మైన కమ్యూనికేషన్ ఛానెల్‌ను పునరుద్ధరించగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యంగా బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ లేదా ఇతర అణు ఇంధన చక్ర సౌకర్యాలు దెబ్బతిన్నట్లు తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేడియోధార్మిక విడుదల జరిగే అవకాశాన్నికొట్టిపారేయలేం, తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా గ్రోసీ హెచ్చరించారు.

ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్‌ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!

Advertisement
 
Advertisement
Advertisement