హైదరాబాద్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాలంలోనూ ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే సామెతను గుర్తు చేసేలా..హైదరాబాద్ నాలెడ్జి సిటీలో ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో ఆర్‌ఎంజెడ్ నెగ్జిటీ వద్ద వింటేజ్ కార్ల ర్యాలీ, షో ఆదివారం నిర్వహించారు.
ఆర్‌ఎంజెడ్ నెగ్జిటీ, క్లాసిక్ మోటార్ వెహికిల్ అసోసియేషన్(సీఎంవీఏ) ఆధ్వర్యంలో.. 1920 – 1988 వరకు ఉపయోగించిన 55 రకాల కార్లు, మోటార్ సైకిళ్లను ప్రదర్శించారు. ఇందులో బిటిష్ ఐకానిక్, జర్మన్, యూరోపియన్, అమెరికన్ రవాణా సాధనాలు అబ్బురపరుస్తున్నాయి.
70 ఏళ్ల క్రితం వినియోగించిన 33 పురాతన కార్లు, 14 మోటారు సైకిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 200 మంది సీఎంవీఏ సభ్యులు, 100 మంది ఆర్‌ఎంజెడ్ కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు.


