AI ఇంపాక్ట్ సమ్మిట్‌ : వాటికోసం ఎగబడిన జనం వీడియో వైరల్‌ | AI Impact Summit Chaos as visitors rush for free calendars video viral | Sakshi
Sakshi News home page

AI ఇంపాక్ట్ సమ్మిట్‌ : వాటికోసం ఎగబడిన జనం వీడియో వైరల్‌

Feb 20 2026 7:04 PM | Updated on Feb 20 2026 7:12 PM

AI Impact Summit Chaos as visitors rush for free calendars video viral

న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో  మరో  అంశం నెట్టింట చర్చకు దారి తీసింది. ఉచిత క్యాలెండర్‌లు పంపిణీ చేప్పడంతో  ఒక్కసారిగా సందర్శకులు ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

ఇండియా AI సమ్మిట్‌లో భారత్ మండపం వద్ద ఉన్న కౌంటర్ చుట్టూ పెద్ద సంఖ్యలో  జనం గుమిగూడారు. ఉచితంగా అందిస్తున్న క్యాలెండర్ల కోసం క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకున్న వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు.  ఈ వీడియోను ఎక్స్‌ యూజర్‌ డాక్టర్ రంజన్ షేర్‌ చేయడంతో చర్చకు తెరలేచింది. హై-ప్రొఫైల్ టెక్‌ ఈవెంట్‌లో కనీస మర్యాద పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూ కమెంట్‌ చేశారు. క్యాలెండర్‌లో ఉపయోగకరమైన సమాచారం ఉండి ఉండవచ్చు,అలాంటి బహుమతులు కంపెనీలకు బ్రాండింగ్‌గా కూడా పనిచేస్తాయి కదా అన్నారు. 

మరోవైపు వీడియోలో కనిపించే వారిలో చాలామంది నిజమైన AI నిపుణులు లేదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవచ్చు అని కమెంట్‌ చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement