breaking news
Technology
-
భారత్‌లో చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్‌జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్‌ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్‌గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్‌గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్‌ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్‌లో చాట్‌జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్‌జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్‌లో ఉంటోంది. చాట్‌జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్‌ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్‌జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్‌లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్‌ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్‌లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్‌లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్‌లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
ఏఐల మెదడుకు ఇండియన్లే మేత
ఏఐ యాప్‌లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్–బేస్ మార్కెట్‌గా అవతరించిందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్‌లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్‌జీపీటీ’, గూగుల్‌కు చెందిన ‘జెమినై’, పెర్ప్లెక్సిటీ వంటి యాప్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లు భారత్‌లో ఉన్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో.. జెమినైకి 31 శాతం, పెర్ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్స్టాగ్రామ్ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్ డెస్క్ -
అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం
మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.మైత్రి-11981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్‌లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.మైత్రి-1 సాధించిన విజయాలుగత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.ప్రస్తుత స్థితి.. సవాళ్లుకేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు -
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్‌జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్‌లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్‌లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు -
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్‌లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్‌కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్ లైఫ్ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్‌గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్‌లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్‌లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్ -
2025లో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే..
2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్ ఏదైనా ఉందంటే అది స్మార్ట్ ఫోన్. శాంసంగ్ నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్ బ్రాండ్లు ప్రతినెలా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి.అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్ ఫోన్లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్లేవో ఈ కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్.రియల్మీ 14ఎక్స్ 5జీ: మంచి డిస్ప్లే, బ్యాటరీ లైఫ్‌తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్ కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్ వేర్ ఎక్స్‌పీరియన్స్‌తో బ్రాండ్ సపోర్ట్‌తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ పొందింది.వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్.గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్‌ఫోన్ బ్రాండ్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది. -
టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు
భారతీయ టెలికాం వినియోగదారులకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక షాకిచ్చే వార్తను అందించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.ఎంత పెరగవచ్చు?మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. 2026 నాటి పెంపుతో ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరగాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.టారిఫ్‌లు పెంచడానికి కారణాలుదేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఈ పెట్టుబడులపై రాబడిని (ROI) రాబట్టడం ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం’(ARPU) కనీసం రూ.300 దాటాలని సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 - రూ.210 స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర రుణాలను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరం.సామాన్యులపై ప్రభావంనిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ టారిఫ్ పెంపు భారంగా మారనుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. 20% పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఖరీదైనదిగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం ఉంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడం మానేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు.ఇదీ చదవండి: రైల్వే వాలెట్ నుంచి నగదు విత్‌డ్రా కుదరదు -
సరికొత్త టెక్నాలజీ.. ఇదిగో హైబ్రిడ్ ఎలక్ట్రిక్
సాధారణంగా చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలొ ఉంచుకుని పలు ఆటోమొబైల్ కంపెనీలు దాశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. అయితే ఐఐటి బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసింది. ఇది మామూలు వాహనాల కంటే భిన్నంగా శక్తిని వినియోగించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ..ఐఐటీ బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్.. రూపొందించిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు బిబ్యా 1.1 (Bibtya 1.1). ఇది టాటా ఏస్ గోల్డ్. దీనికి సరికొత్త టెక్నాలజీని అమర్చి.. టెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ గమనించవచ్చు.సాధారణంగా ఒక వెహికల్ పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా వాహనం నడుస్తుంది. కానీ ఇక్కడ రైజెన్ టెక్ రూపొందించిన హైబ్రిడ్ ఏలక్ట్రిక్ టాటా ఏస్ గోల్డ్ ట్రక్ దానికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే.. ఇందులోని ఇంజిన్ పెట్రోల్ ఉపయోగించి.. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ శక్తిని నేరుగా చక్రాలకు సరఫరా చేయదు. ఈ శక్తిని బ్యాటరీ తీసుకుని.. ఛార్జ్ చేసుకుంటుంది. ఈ ఛార్జ్ ద్వారా వాహనం నడుస్తుంది. తద్వారా.. పనితీరు కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలునిజానికి ఈ విధానం కొత్తగా ఉంది. టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఇది అన్నింటా సక్సెస్ సాధిస్తే.. ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలు సాధ్యమవుతాయి. అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.పెట్రోల్, బ్యాటరీ రెండూ ఉండటం వల్ల.. పేలిపోయే అవకాశం ఉందా?, ఒకవేళా బ్యాటరీ పనిచేయని సందర్భంగా పెట్రోల్‌తో మాత్రం వాహనం నడుస్తుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది, కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో లేదు. బహుశా దీనిని అన్ని విధాలా.. పరీక్షించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. View this post on Instagram A post shared by Runtime (@runtimebrt) -
చాట్‌జీపీటీ 'అడల్ట్ మోడ్'.. పెద్దల కోసం స్పెషల్ కంటెంట్!
దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.అడల్ట్ మోడ్ ఫర్ చాట్‌జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్‌పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలిఅడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్‌గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్‌ను అన్‌లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.We made ChatGPT pretty restrictive to make sure we were being careful with mental health issues. We realize this made it less useful/enjoyable to many users who had no mental health problems, but given the seriousness of the issue we wanted to get this right.Now that we have…— Sam Altman (@sama) October 14, 2025 -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్‌హౌస్‌లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!
రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్‌ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌కు 18 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్‌స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్ -
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025 -
పైపుల్లో కరెంట్!: ఇంజినీర్ల మ్యాజిక్
ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్ వాటర్ పైప్స్’ మ్యాజిక్! పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి. -
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్‌లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్‌ప్రైజెస్‌కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్‌ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్‌లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది. -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోతోంది.. సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్‌లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్ దుస్తులతో సహా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెట్ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్‌లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. ⇒ ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ⇒ స్మార్ట్ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ⇒ పండుగ వచ్చినా.. ఫంక్షన్ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్ కాల్స్, రీల్స్‌కు బానిసలుగా మారారు.పెరిగిపోతున్న ఒత్తిడి.. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ తక్కువగా వాడేవారు పాజిటివ్ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్‌లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం ప్రధానం నిద్రపోయే గంట ముందే స్మార్ట్‌ఫోన్ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, శ్రీసత్యసాయి జిల్లా -
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్‌లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్‌లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్‌కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్‌ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్‌ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్! -
చాట్‌జీపీటీలో డిస్నీ పాత్రలు
వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్‌ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.ఒప్పందంలోని అంశాలుమిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్‌లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్‌జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్‌జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్, ఇమేజ్ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే.. -
పెద్దవారికీ కావాలి జి.పి.ఎస్.
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్‌లోని జీపీఎస్.మనవడి ముందు చూపువయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్‌లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు. అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి. ధరలు అందుబాటులోనే..జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను
ముంబై: దేశీ ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు వృద్ధి చెందనుంది. 44 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన గణాంకాలకు మార్కెట్‌పై పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా అడెకో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్కరణలు, ప్రైవేట్ రంగం, అంతర్జాతీయ భాగస్వామ్యాల దన్నుతో పరిశోధనల ఆధారిత ధోరణి నుంచి ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగింది. ఈ నేపథ్యంలో స్పేస్ పాలసీ అనలిస్టులు, రోబోటిక్స్ ఇంజనీర్లు, ఏవియోనిక్స్ స్పెషలిస్టులు, జీఎన్సీ (గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్) నిపుణుల్లాంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. వీరంతా అంతరిక్ష రంగంలో దేశ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలుస్తున్నారని వివరించింది. ‘ప్రభుత్వ దార్శనికత, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ దన్నుతో భారత్ అంతర్జాతీయ స్పేస్ హబ్‌గా ఎదగనుంది. దీనితో ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా, బిజినెస్ తదితర విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా అవకాశాలు రానున్నాయి. → ఏవియోనిక్స్, క్రయోజెనిక్స్, ఏటీడీసీ (యాటిట్యూడ్ డిటరి్మనేషన్, కంట్రోల్ సిస్టమ్స్), రిమోట్ సెన్సింగ్ నిపుణులు, స్పేస్ హ్యాబిటాట్ ఇంజనీర్లకు భారీ వేతనాలు లభించనున్నాయి. సాధారణ టెక్నికల్ ఉద్యోగులతో పోలిస్తే 20–30% అధికంగా ఉండనున్నాయి. → భారతీయ అంతరిక్ష పాలసీ 2023 లాంటి సంస్కరణలు, 250 పైచిలుకు స్పేస్ స్టార్టప్‌లు, ఇన్–స్పేస్ కింద రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తాయి. కొత్త ఆవిష్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి. → అంతరిక్ష రంగంలో సిబ్బందిపరంగా వైవిధ్యం పెరగనుంది. ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువికా), విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాం, సమృద్ధ్ లాంటి స్కీములతో ఎంట్రప్రెన్యూర్íÙప్, సాంకేతిక, పరిశోధన విభాగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. → గగన్‌యాన్ మిషన్, యాక్సియోమ్–4 ఐఎస్ఎస్ ప్రోగ్రాంలో భారత్ భాగం కావడం, సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణంపై కసరత్తు చేస్తుండటం మొదలైన వాటి వల్ల ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ మరింతగా పెరగనుంది. → ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా సుమారు 2 శాతంగా ఉంది. 2033 నాటికి 11 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పాటు తన మార్కెట్‌ను 44 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై భారత్ దృష్టి పెడుతోంది. తద్వారా గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 7–8% వాటాను సాధించాలని నిర్దేశించుకుంది. -
సత్య నాదెళ్లకు అదో సరదా..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారతీయ-అమెరికన్ అయిన ఆయన మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థకు ఈసీవో అయ్యారు. అపారమైన తన శక్తి సామర్థ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.ప్రతి మనిషికీ వృత్తితోపాటు ఓ వ్యాపకమూ ఉంటుంది. ‘మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాల’ అంటాడు ఓ సినిమాలో విలన్ రావు గోపాలరావు. కానీ ఈ దిగ్గజ టెక్ సీఈవోది ‘క్రీడా పోషణ’. క్రీడాకారుడు కాకపోయినా క్రికెట్ ఆటను విశ్లేషించే మొబైల్ యాప్ ఒకదానిని సత్య నాదెళ్ల రూపొందించారు. అంతేకాదు.. కాస్త సమయం దొరికినప్పుడల్లా కోడ్ రాస్తుంటారాయన. అది ఆయనకో సరదా...ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. థాంక్స్ గివింగ్ సందర్భంగా తాను చిన్నప్పటి నుండి ఇష్టపడే క్రీడ క్రికెట్ ను విశ్లేషించడానికి ఇంటి వద్ద తాను స్వయంగా డీప్ రీసెర్చ్ ఏఐ యాప్‌ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల ఈ వారం భారత్ వస్తున్నారు. ఇక్కడి వ్యాపార, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ ఇటీవలె భారత్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏఐ, క్లౌడ్ రంగాల్లో 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. -
కీలక టెక్నాలజీల్లో భారత్ స్వావలంబన సాధించాలి
గాందీనగర్: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్ గుజరాత్ గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లాంటి క్రిటికల్ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. -
ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్‌గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్‌గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్‌వర్క్‌లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్పీయూ రూ.167. ఇది ఎయిర్టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.సబ్స్క్రైబర్ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది. -
డేటా సెంటర్లు.. సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే!
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం దేశ డిజిటల్ విప్లవంలో ఒక కీలక ఘట్టం. ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI), ఆన్లైన్ చెల్లింపులు (UPI), ఈ-కామర్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలకు డేటా సెంటర్లు మూలస్తంభాలు. భారతదేశంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సంఖ్య ప్రపంచంలోని వాటితో పోలిస్తే అతి తక్కువగా (కేవలం 3% వాటా) ఉన్నప్పటికీ 2030 నాటికి వీటి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని కీలకమైన పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.డేటా సెంటర్ల ఏర్పాటుతో లాభాలుడేటా సెంటర్ల కోసం భారత్‌లోకి దాదాపు రూ.2.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగి అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, నెట్వర్క్ నిర్వహణ, భద్రత, నిర్వహణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.సప్లయ్ చైన్, రవాణా, హోటల్ వంటి సేవల రంగాలలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ల అవసరాల కోసం ఫైబర్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఇది స్థానిక స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించి, టెక్నాలజీ రంగంలో పురోగతికి దోహదపడుతుంది.డేటా స్థానికీకరణ ద్వారా భారతీయ డేటా భద్రత మెరుగుపడుతుంది.సవాళ్లు లేవా..?డేటా సెంటర్ల కోసం విద్యుత్, నీరు చాలా అవసరం. భారతదేశంలో ఇప్పటికే ఈ వనరుల లభ్యత, వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. డేటా సెంటర్లలో సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని చల్లబరచడానికి, సర్వర్లకు శక్తిని అందించడానికి అధిక విద్యుత్ అవసరం. భారతదేశం అధికంగా థర్మల్ విద్యుత్‌పై ఆధారపడుతున్నందున డేటా సెంటర్ల ఏర్పాటుతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.పెద్ద డేటా సెంటర్లు పట్టణ విద్యుత్ సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్ కొరతకు దారి తీయవచ్చు. అయితే గూగుల్ వంటి కంపెనీలు తమ సెంటర్లకు పునరుత్పాదక శక్తి (Green Energy)వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సానుకూల అంశం. అయితే, మొత్తం డిమాండ్‌ను థర్మల్ విద్యుత్ నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్చడం తక్షణ సవాలు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకోవాలి.నీటి నిర్వహణసర్వర్ల వేడిని తగ్గించడానికి శీతలీకరణ (Cooling) ప్రక్రియకు లక్షలాది లీటర్ల నీరు అవసరం. గూగుల్ వంటి సంస్థలు వార్షికంగా బిలియన్ల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, వ్యవసాయానికి నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల నుంచి నీటి వినియోగంపై పారదర్శకత లేకపోవడం, నియంత్రణ సంస్థల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుందని గుర్తుంచుకోవాలి.సింగపూర్, అమెరికాలో వ్యతిరేకతసింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దేశాల్లో డేటా సెంటర్ల విస్తరణను ప్రజలు, పర్యావరణవేత్తలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు భారతదేశంలోని సమస్యల తరహాలోనే ఉన్నాయి. అధిక విద్యుత్ వినియోగం కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడినప్పుడు కార్బన్ ఉద్గారాలను పెంచుతుండడం. స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెంచి, ఇతర అవసరాలకు కొరత ఏర్పరచడం.అంతా ఆటోమేషన్..డేటా సెంటర్ల నిర్వహణ ఆటోమేటెడ్‌గా ఉంటుంది. దాంతో ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవడం, ఆర్థిక ప్రయోజనం స్థానికులకు తక్కువగా ఉండటంతో ఇప్పటికే ఇవి ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించి అందుకు తగిన విధంగా పాలసీను రూపొందించాలి. సాంకేతిక పురోగతికి డేటా సెంటర్లు అవసరమే అయినా, వనరుల స్థిరత్వం, పర్యావరణ భద్రత విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం
దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’గా పిలువబడే ఈ ఫండ్‌ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌లకు క్యాపిటల్‌ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నిర్వహించే మొదటి అకడమిక్-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్షిప్ సేవలు అందిస్తున్న ఎస్‌ఐఎన్‌ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.విస్తృత రంగాలకు మద్దతురొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్ ఎన్విరాన్మెంట్, టెక్ ల్యాబ్‌లు, వ్యవస్థాపక నెట్‌వర్క్‌ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్‌లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
హైదరాబాద్‌లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్‌గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్‌లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్‌లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్‌ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్‌తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్‌లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్‌ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్‌ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్‌తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్‌లకు సహాయపడుతుంది” అన్నారు. -
భారత్‌లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025 -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్‌తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్‌లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్‌లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్‌లను శాటిలైట్‌ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్‌ఫాంమ్‌లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
చాట్‌జీపీటీలో ప్రకటనలు..?
ఓపెన్ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్‌జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్‌జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్‌లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్‌జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్‌లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025 -
భారత్‌లో స్టార్‌లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్‌వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్‌వేర్ కిట్‌లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్‌లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్‌లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025 -
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్‌కుక్‌కు రిపోర్ట్ చేసేవారు.టిమ్‌కుక్ ప్రయత్నాలు..అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్‌లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్ హార్డ్‌వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.యాపిల్‌కు సమస్యఎగ్జిక్యూటివ్ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్‌కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్., ఓపెన్ఏఐ, వివిధ స్టార్టప్‌లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత -
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్ ఫోన్, ట్యాబ్..
రెడ్మీ తాజాగా ‘రెడ్మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్డీ అడాప్టివ్‌సింక్ డిస్ప్లే, డస్ట్ .. వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్) దీని ప్రత్యేకతలు.మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 వచ్చేసింది దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్‌లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్ ఏ11’’ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 6 ఎన్ఎం ఆధారిత ఆక్టా–కోర్ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.పెద్ద ఫైల్స్‌కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్‌తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. -
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి. -
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్‌లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్‌లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో గేమ్‌లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్‌కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్‌కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్‌ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్‌పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్‌ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్‌టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్‌తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.పనిచేస్తుందిలా..వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్‌నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్‌లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది. -
ఎక్కువ జీతాలిస్తోంది ఇదిగో ఈ జీసీసీలే..
జూనియర్ల నుంచి సీనియర్ల వరకు వివిధ విభాగాలవ్యాప్తంగా అనుభవాన్ని బట్టి అత్యధిక వేతనాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. రిటైల్, కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగ జీసీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ కెరియర్‌నెట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వివిధ రంగాలకు చెందిన 50,000 మంది ప్రొఫెషనల్స్ జీతభత్యాల డేటా ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో డేటా సైంటిస్టుకు రూ. 22.1 లక్షల నుంచి రూ. 46.9 లక్షల వార్షిక ప్యాకేజీ ఉంటోంది. అదే రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌లో చూస్తే వరుసగా రూ. 19.90–44.50 లక్షలు, రూ. 18.40 – 44.30 లక్షల స్థాయిలో ఉంటోంది.ఇక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో జూనియర్ స్థాయిలోని ఫుల్ స్టాక్ డెవలపర్లకు రూ. 20.7 లక్షల స్థాయిలో, సీనియర్లకు రూ. 47.5 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. అటు స్క్రమ్ మాస్టర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్లాంటి ఉద్యోగాలకు ప్రారంభంలో ఒక మోస్తరు వేతనాలు ఉన్నా క్రమంగా, భారీ స్థాయికి చేరుతున్నాయి. -
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్‌ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్‌బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్‌ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్‌గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్‌ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్‌ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్లైన్లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్‌ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం -
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్డేట్ చేసింది. ఐదు యాపిల్ ఉత్పత్తులకు అధికారిక హార్డ్‌వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్డేట్ చేసిన జాబితాలో కింది ఉత్పత్తులు ఉన్నాయి.ఐఫోన్ SE (మొదటి తరం)12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్ఏడేళ్ల గడువు పూర్తియాపిల్ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్‌వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్‌ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.వినియోగదారులకు సవాలుయాపిల్ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్‌గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్‌వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ.. -
భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!
యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. సైనిక వ్యూహాలకు టెక్నాలజీ ఆయుధంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, రోబోల దండుతో ‘మెటల్ వర్సెస్ ఫ్లెష్’ (యంత్రాలు vs మనుషులు) జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చైనా-భారత్ సరిహద్దు వంటి ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ నిఘా గురించిన ఆందోళనలను పెంచుతూ ఈ వీడియో సంచలనం సృష్టించింది. చాలా దేశాలు ఇప్పటికే తమ సైనిక వ్యూహాల్లో కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన భవిష్యత్ పోరుకు ఒక సంకేతంగా నిలుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వైరల్ క్లిప్‌లో ఏముంది?ఎత్తైన ప్రాంతంలో షూట్ చేసిన ఈ వైరల్ క్లిప్‌లో చైనా-భారత్ సరిహద్దు జోన్లో ఒంటరిగా నిలబడి ఉన్న హ్యూమనాయిడ్ రోబో లాంటి ఆకారాన్ని చూడవచ్చు. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదో ఫంక్షనల్ రోబోట్ అని, భారత దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.India🇮🇳 just filmed this: Chinese🇨🇳 humanoid killer robots now patrolling the border. The age of flesh-vs-metal war begins.Who still wants to send sons to the frontline in 2030? https://t.co/zM3Gy7mYJ9 pic.twitter.com/UAB5L4N6gp— PLA_Overwhelm (@junshiguancha) December 2, 2025సోషల్ మీడియా స్పందనఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్‌లు, వేల సంఖ్యలో రీపోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ ‘టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దుకు వచ్చేసింది’ అని, మరికొందరు ‘మోదీగారు చిట్టి 2.0 పంపండి’ అని కామెంట్లు చేశారు.చైనా వ్యూహంలో రోబోటిక్ విప్లవంఈ క్లిప్ ఇంతగా వైరల్ అయ్యేందుకు ప్రధాన కారణం అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా సాధనాల వాడకం, హ్యూమనాయిడ్ రోబోటిక్స్‌లో చైనా వేగవంతంగా పురోగతి చెందుంతుండడంతో రోబో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశ సరిహద్దుల్లో మానవ గస్తీని తగ్గించి అక్కడ పర్యవేక్షణను పెంచడానికి చైనా ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. చైనా ఇప్పటికే టిబెట్‌లో రోబో డాగ్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా, తైవాన్ సరిహద్దు సమీపంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించాలని యోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇది భారత్-చైనా సరిహద్దులో కూడా ఇలాంటివి వచ్చే అవకాశంపై ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ.. -
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ.. -
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్‌ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్‌కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్‌ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్‌లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్‌ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్‌లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్‌ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్‌ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్‌కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు. -
మొబైల్స్‌లో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్‌ను కొత్త హ్యాండ్‌సెట్స్‌లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్స్టాల్ చేయాల్సిందేనని నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. ఇప్పుడున్న ఫోన్లనూ అప్డేట్ చేయాలి .. ఇప్పటికే భారత్‌లో తయారైనవి, విక్రేతల దగ్గర ఉన్నవాటికి సంబంధించి తయారీ సంస్థలు, దిగుమతిదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్‌ను అందించాల్సి ఉంటుందని డాట్ పేర్కొంది. ఈ ఆదేశాల అమలు తీరుతెన్నుల గురించి, ఉత్తర్వులు వెలువడిన 120 రోజుల్లో అన్ని సంస్థలు, దిగుమతిదారులు కాంప్లయెన్స్ రిపోర్టును సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, ఒప్పో, షావోమీలాంటి దిగ్గజాలు భారత్‌లో హ్యాండ్సెట్స్ని తయారు చేస్తున్నాయి. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్) దురి్వనియోగంపై సందేహాలుంటే ఫిర్యాదు చేసేందుకు, మొబైల్ డివైజ్‌లలోని ఐఎంఈఐలు సిసలైనవేనని నిర్ధారించుకునేందుకు సంచార్ సాథీ ఉపయోగపడుతుంది. 15 అంకెల ఐఎంఈఐ నంబరు సహా మొబైల్ ఫోన్‌ని గుర్తించేందుకు ఉపయోగపడే దేన్నైనా మార్చివేయడాన్ని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్షలాంటివి ఉంటాయి. -
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..
ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్‌లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్‌లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్‌గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వద్ద 3K వీడియో రిజల్యూషన్‌లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్‌లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్‌లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
చిన్న ఐడియా.. మూడు రోజుల్లో రూ.కోటి సంపాదన!
ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకుందామని ఓ టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.రెండేళ్ల క్రితం, ఆన్లైన్లో క్యాట్జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్‌ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్‌లైన్ ఫోన్ వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్‌లైన్ ఫోన్ వాడాలంటే కొత్త నంబర్, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్‌షెల్ హ్యాండ్‌సెట్‌ను తీసుకుని, దాన్ని బ్లూటూత్‌తో స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకుని కాల్స్ మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్మెంట్లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్లైన్లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికి ‘ఫిజికల్ ఫోన్’ అని పేరు పెట్టి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఏదో 15–20 ప్రీ–ఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్ బ్రాండ్ కింద 90–110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్ ఉత్పత్తుల షిప్పింగ్ని ప్రారంభించనుంది.ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్‌టైమ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్‌ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్‌ను డయల్ చేయడం ద్వారా లేదా ‘స్టార్’(*) కీని నొక్కి ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు. -
రూపాయికే నెలరోజుల రీఛార్జ్!.. డైలీ 2జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల రూ. 199 ప్లాన్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు మరోమారు రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ అందించనుంది.బీఎస్ఎన్ఎల్ ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీనిని దీపావళి సమయంలో కూడా కొనసాగించింది. ఇప్పుడు మరోమారు ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్కువమంది ప్రజలు ఈ ప్లాన్ కోరుకోవడం వల్లనే దీనిని మళ్లీ తీసుకురావడం జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.Back by public demand - BSNL’s ₹1 Freedom Plan!Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2— BSNL India (@BSNLCorporate) December 1, 2025రూ.199 ప్లాన్ వివరాలుబీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. -
చైనా ప్రభుత్వాన్ని వణికిస్తున్న రోబోలు!
రోబోటిక్స్ టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్డీఆర్సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ కూడా ఇప్పటికే హెచ్చరించారు.చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. -
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అరుదైన ఘనత
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్‌టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్‌గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్‌ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్‌టెక్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్‌గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్‌లకు పుట్టినిల్లు అయింది.స్టార్టప్ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్‌కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్‌కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్‌టెక్ స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్‌ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్‌టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.ఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వివరాలు..ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.105 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్‌ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.దాదాపు 40 శాతం స్టార్టప్‌లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్‌ను అందించింది.రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.కీలక రంగాలపై దృష్టిఐఐటీఎంఐసీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్‌టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్‌ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్‌లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా? -
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. -
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు. -
చలికి చెక్ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్!
చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్ థెరపీ టచ్ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.చలికి చెక్ ఈ దుప్పటి!చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్‌కు ‘టాపిష్ ఎలక్ట్రిక్ దుప్పటి’తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్ ఫ్లీస్ మెటీరియల్‌తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్ డిజైన్‌తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్‌బిల్ట్ థర్మల్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్ప్రూఫ్ సిస్టమ్ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్ డివైజ్ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్ ఆఫ్ చేయడం తప్పనిసరి. దీని రిమోట్‌కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.వెచ్చని పాదాలు!చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్ స్మార్ట్ సాక్స్ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్‌తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీతో ఈ సాక్స్ మరింత హైజినిక్‌గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!స్మార్ట్ బాటిల్!బాటిల్‌ని క్లీన్ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్ స్మార్ట్ వాటర్ బాటిల్’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా సెల్ఫ్–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేషన్‌తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్బీ చార్జింగ్‌తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. ధర రూ. 21,649. -
ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లను కొంత మంది సిమ్ లేకపోయినా వాడుతుంటారు. ఇకపై అలా కుదరదు. ఫోన్లో యాక్టివ్ సిమ్ ఉంటేనే ఆ యాప్‌లు పనిచేస్తాయి. యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు అంటే వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటివి క్రియాశీల సిమ్ కార్డుకు నిరంతరం అనుసంధానమై ఉంటేనే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.గత నవంబర్ చివరలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జారీ చేసిన కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనల్లో ఇది భాగం. ఈ మార్పులను అమలు చేస్తూ సమ్మతి నివేదికలను సమర్పించడానికి సర్వీస్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్స్ విభాగం 90 నుంచి 120 రోజుల సమయం ఇచ్చింది.సిమ్ లింకేజీ తప్పనిసరి ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, అరట్టై వంటివాటితోపాటు జియోచాట్, షేర్‌చాట్ వంటి స్థానిక కమ్యూనికేషన్ యాప్‌లు కూడా వాటిని ఉపయోగిస్తున్న డివైజ్లలొ యాక్టివ్ సిమ్ కార్డు ఉంటేనే పనిచేయాలి.ఇక వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ వర్షన్లను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటి వినియోగానికి సంబంధించి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ సర్వీసులు ఏకధాటిగా పనిచేయవు. ప్రతి ఆరు గంటలకోసారి మొబైల్‌ను ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు, చాలా యాప్‌లు ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే యూజర్ మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించేవి. కొత్త నిబంధనల ప్రకారం, యూజర్ ఇచ్చే మొబైల్ నంబర్ నిరంతరం క్రియాశీలకంగా లింక్ చేయబడి ఉండాలి.ఎందుకీ కొత్త నిబంధన?రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన సిమ్ పక్కన పడేసినా లేదా ఇనాక్టివ్ అయినా కూడా ఆయా యాప్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ లొసుగును సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్.. ట్రిపుల్ 50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ -
మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్..
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తమ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐక్యూ 15ని ఆవిష్కరించింది. డిస్కౌంట్లు పోగా ధర రూ. 64,999 నుంచి ప్రారంభమవుతుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, సూపర్కంప్యూటింగ్ చిప్ క్యూ3, ఆండ్రాయిడ్ 16, ట్రిపుల్ 50 ఎంపీ కెమెరా సిస్టం, 7000 ఎంఏహెచ్ సిలికాన్ ఎనోడ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐక్యూ 15 (iQOO 15) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. రెండు మోడళ్లపై పరిచయ లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి అమెజాన్, ఐక్యూ ఈస్టోర్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ. 7,000 డిస్కౌంటు, అర్హత కలిగిన కస్టమర్లకు అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంటు లభిస్తాయి.ఐక్యూ 15 పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లుస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, Q3 గేమింగ్ చిప్ సెట్లు వేగవంతమైన ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్, యాప్ స్విచింగ్, గేమింగ్ లను అందిస్తాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇందులో ఉంది.ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై నడుస్తుంది. ఐదేళ్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ అందించనుంది.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 50MP అల్ట్రావైడ్ షూటర్‌తో బహుముఖ ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.6.85-అంగుళాల శామ్ సంగ్ M14 అమోల్డ్ LTPO డిస్ ప్లే ప్యానెల్. ఇది 2K రిజల్యూషన్, 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.భారీ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటివి అదనపు ఫీచర్లు.ఇదీ చదవండి 👉 కొత్త రూల్: ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్! -
అలీబాబా ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ
టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ టెక్ గ్యాడ్జెట్లపై ప్రజలకు ఆసక్తి కూడా అధికమవుతోంది. స్మార్ట్ఫోన్ల తర్వాత ఇప్పుడు ఏఐ పవర్డ్ వేరబుల్స్‌పై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్‌లు మార్కెట్ ఏటా పెరుగుతోంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్ 9.6% వృద్ధి చెందింది. చైనాలో 50 మిలియన్ యూనిట్ల స్మార్ట్ గ్లాసెస్ విక్రయించారు. ఈ నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన మొదటి ఏఐ గ్లాసెస్‌ను ఆవిష్కరించింది. ‘క్వార్క్ ఏఐ గ్లాసెస్’ పేరుతో విడుదల చేసిన ఈ గాడ్జెట్ మెటా గ్లాసెస్‌కు పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లాసెస్‌తో అలీబాబా కన్స్యూమర్ ఏఐ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.అలీబాబా క్వెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా క్వార్క్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ గ్లాసెస్‌ను రెగ్యులర్ ఐవేర్లాగా కనిపించే డిజైన్‌తో తీసుకొచ్చారు. బ్లాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో స్టైలిష్‌గా ఉండటం వల్ల ఇవి రోజువారీ ఉపయోగానికి సరిపోతాయని కంపెనీ తెలిపింది. మెటా రేబాన్ డిస్ప్లే గ్లాసెస్ లాంటి హెవీ గ్యాడ్జెట్లకు విరుద్ధంగా ఇవి కేవలం 40 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయని చెప్పింది. ప్రెస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ చేస్తూ వివిధ ఫ్రేమ్ కలర్స్, లెన్స్ ఆప్షన్లతో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.క్వార్క్ ఏఐ గ్లాసెస్‌ను ఫ్లాగ్షిప్ S1, లైఫ్‌స్టైల్ ఫోకస్డ్ G1 మోడళ్లలో ఆవిష్కరించారు. మోడల్‌ను అనుసరించి ఫీచర్లలో తేడాలుంటాయి. ఈ గ్లాసెస్‌లోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.విదేశీ భాషల్లో సంభాషణలు లేదా టెక్స్ట్‌ను ఇన్‌స్టంట్‌గా అనువదిస్తుంది. ప్రయాణికులకు, బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఇది ఎంతో ఉపయోగం.గ్లాసెస్ కెమెరాతో ప్రొడక్ట్‌ను స్కాన్ చేస్తే తావోబా(చైనా ఈకామర్స్ వెబ్సైట్)లో ధరలు, ఆఫర్లు డిస్ప్లే అవుతాయి. షాపింగ్‌ను సులభతరం చేస్తుంది.అమాప్తో లింక్ అయి ఏఆర్ ఓవర్లేలతో రోడ్ డైరెక్షన్లు చూపిస్తుంది.టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఆబ్జెక్ట్ రికగ్నిషన్‌తో చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని తెలుపుతుంది.ఏఐతో మీటింగ్‌లు రికార్డ్ చేసి సమ్మరీలు జనరేట్ చేస్తుంది.క్వార్క్ గ్లాసెస్ ధర S1కు 3,799 యువాన్ (సుమారు రూ.53,600), G1 మోడల్‌కు 1,899 యువాన్ (సుమారు రూ.26,800) వరకు ఉంది.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్‌తో సంచలనం
ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్‌ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్‌ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్‌గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్‌సెట్‌ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్‌ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్‌షహర్‌లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
డిసెంబర్ 11న మరో యాపిల్ స్టోర్: ఈసారి ఎక్కడంటే?
భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్‌ను ప్రారంభించనుంది.డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్‌ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్‌లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్‌తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్లెట్లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్‌లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్లెట్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్ -
రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్‌గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering. Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025 -
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్‌లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
నానోతో పాత ఫొటోలు కొత్తగా!
పాత ఫొటోల్లో అపురూపమైనవి ఉంటాయి. అవి రంగు వెలిసి పాడవుతుంటే అయ్యో అనిపిస్తుంది. పాడైపోతున్న ఫొటోలు కొత్తగా మెరిసి పోవడానికి గూగుల్ నానో బనానా ప్రొ ఉపయోగపడుతుంది.‘ఈ పాత ఫొటోను సహజ రంగులు, స్పష్టమైన వివరాలు, లైటింగ్‌తో రీస్టోర్ చేయండి, ఒరిజినల్ స్టైల్ మిస్ కాకుండా గీతలు, మరకలను తొలగించండి’లాంటి జనరల్ రిస్టోరేషన్ ప్రాంప్ట్‌లతో పాటు పోర్ట్రయిట్ రీస్టోరేషన్, కలర్ కరెక్షన్ ప్రాంప్ట్ రీబిల్డింగ్. టోర్న్ సెక్షన్లాంటి ప్రాంప్ట్‌లు ఇవ్వవచ్చు.కొన్ని టిప్స్:....→ అతిగా మార్పులు చేయడం వల్ల ఫొటో సహజత్వం కోల్పోతుంది → ప్రతి కాలానికీ తనదైన కలర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్‌కు తగ్గ కలర్‌నే వాడితే బాగుంటుంది.→ షాడోస్ ఫొటోలకు సహజత్వాన్ని ఇస్తాయి. పాత ఫొటోలలో టూ మెనీ షాడోస్, హైలైట్స్ తొలగించడం వల్ల ఫొటో ఫ్లాట్‌గా కనిపిస్తుంది → చాలామంది ‘ఫిక్స్ దిస్ ఫొటో’ అని మొక్కుబడిగా ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తుంటారు. దీని వల్ల ఫొటోలో ఫేసియల్ ఫీచర్స్ అసహజంగా కనిపిస్తాయి.→ వోవర్–షార్పెనింగ్ వద్దు.→ ఒరిజినల్, రిస్టోర్డ్ వర్షన్లను పక్కపక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోవాలి. -
‘సేఫ్ సెకండ్ అకౌంట్’తో డిజిటల్ మోసాలకు చెక్
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్‌లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్‌లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్టెల్ సేఫ్ సెకండ్ అకౌంట్ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.ఈ ఖాతా ప్రత్యేకతలు..ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్‌ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది? -
ఉచితంగా ఐటీ కోర్సులు.. 87 వేల మందికి..
అట్టడుగు వర్గాల యువతకు భవిష్యత్ తరపు డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు టెక్ దిగ్గజం ఐబీఎం, నాస్కామ్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ ప్రోగ్రాం కింద 87,000 మందికి శిక్షణనివ్వనున్నాయి. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇచ్చి వారిలో ఉద్యోగ సామర్థ్యాలను పెంపొందించనున్నాయి.ఈ ప్రోగ్రాం కింద కృత్రిమ మేథ (ఏఐ), సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ తదితర అంశాల్లో ఉచితంగా డిజిటల్ కోర్సులు, శిక్షణను అందిస్తారు. మెంటార్స్ నుంచి కూడా మద్దతు ఉంటుంది. 2030 నాటికి 3 కోట్ల మందికి శిక్షణనివ్వాలన్న ఐబీఎం లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు, భారతదేశవ్యాప్తంగా హైబ్రిడ్ విధానంలో అమలవుతుంది.ప్రాజెక్ట్ ప్రభావంఅట్టడుగు వర్గాల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.పరిశ్రమకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయి.భారతదేశంలో డిజిటల్ సమానత్వం పెరుగుతుంది.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు, పెద్ద కంపెనీలకు స్కిల్డ్ వర్క్‌ఫోర్స్ లభిస్తుంది.ఇది కేవలం శిక్షణ ప్రోగ్రాం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు పునాది వేసే ప్రయత్నం. -
డేటా సెంటర్లపై రూ. 60,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల ఆపరేటర్లు వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఇన్వెస్ట్ చేయనున్నారు. 2026–2028 మధ్య కాలంలో రూ. 55,000–రూ. 60,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో డేటా సెంటర్ల సామర్థ్యం రెట్టింపై 2.3–2.5 గిగావాట్ల స్థాయికి చేరనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ఇటు కంపెనీలు, అటు రిటైల్ వినియోగదారులు భారీగా డిజిటల్ టెక్నాలజీలను వినియోగిస్తున్న నేపథ్యంలో 2028 ఆర్థిక సంవత్సరం నాటికి డేటా సెంటర్ ఆపరేటర్ల ఆదాయం వార్షికంగా 20–22 శాతం మేర వృద్ధి చెందుతుందని క్రిసిల్ అంచనా వేసింది. అప్పటికల్లా ఏటా రూ. 20,000 కోట్ల స్థాయికి చేరొచ్చని పేర్కొంది. ‘‘పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించేందుకు పరిశ్రమ 2026–28 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో రూ. 55,000–65,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నిధులు ప్రధానంగా రుణాల రూపంలోనే రానున్నప్పటికీ, స్థూలలాభాలు మెరుగ్గా ఉండటం వల్ల వ్యాపార పరిమాణానికి రుణ నిష్పత్తి స్థిరంగా 4.6–4.7 రెట్ల స్థాయిలో ఉంటుంది’’ అని క్రిసిల్ వివరించింది. మూడు అంశాల దన్ను.. డేటా సెంటర్ పరిశ్రమ వృద్ధికి మూడు అంశాలు దన్నుగా నిలవనున్నాయి. డిజిటల్ పరివర్తన, టెక్నాలజీ పురోగతిలో భాగంగా పబ్లిక్ క్లౌడ్ వినియోగాన్ని కంపెనీలు వేగంగా అందిపుచ్చుకుంటూ ఉండటం, కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీలపై పెట్టుబడులు పెరుగుతుండటం, 5జీ టెక్నాలజీ విస్తృత వినియోగం వీటిలో ఉంటాయి. భారత్‌లో ప్రస్తుతం డేటా సెంటర్ల సాంద్రత ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఎక్సాబైట్కి 65 మెగావాట్లుగా ఉందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు, డిమాండ్‌కి తగ్గ స్థాయిలో సేవలందించేందుకు 2028 మార్చి నాటికి పరిశ్రమ సామర్థ్యం రెట్టింపు కానుందని వివరించింది. -
ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ
మెటా ప్లాట్‌ఫామ్స్ ఇంక్ తన ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టెన్సర్ ఏఐ చిప్‌లను వాడేందుకు బిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ రంగంలో టాప్‌లో ఉన్న ఎన్వీడియాకు గట్టి దెబ్బ తగలబోతుందని కొందరు అంచనా వేస్తున్నారు.2027లో ఏఐ డేటా సెంటర్లలో గూగుల్ టీపీయూలుపరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం మెటా తన ఏఐ డేటా సెంటర్లలో 2027 నాటికి గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లను(TPU) ఉపయోగించేందుకు చర్చలు జరుపుతోంది. దాంతోపాటు వచ్చే ఏడాది గూగుల్ క్లౌడ్ నుంచి కూడా ఈ చిప్‌లను మెటా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే ఆంత్రోపిక్ పీబీసీకి 1 మిలియన్ టెన్సర్ చిప్‌లను సరఫరా చేస్తోంది.గూగుల్ టెన్సర్ఏఐ పనుల కోసం దాదాపు 10 సంవత్సరాల క్రితం టెన్సర్ చిప్‌ను గూగుల్ అభివృద్ధి చేసింది. ఎన్వీడియా చిప్‌లపై అతిగా ఆధారపడటంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఏఎండీ వంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ గూగుల్ టెన్సర్ చిప్స్ ఊపందుకుంటున్నాయి.ఎన్వీడియా చిప్స్ఎన్వీడియా బ్లాక్వెల్ వంటి చిప్‌లు ప్రాథమికంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (GPU). ఇవి గత దశాబ్దంలో వీడియో గేమ్‌లకు కీలకంగా ఉండేవి. లార్జ్ డేటాను నిర్వహించగల సామర్థ్యం కారణంగా ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఇవి చాలా అనుకూలంగా మారాయి.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే.. -
ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్
ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన, వ్యక్తిగత కమ్యూనికేషన్‌కు కీలకంగా ఉన్న ఆన్లైన్ వీడియో కాలింగ్, మీటింగ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ మీట్ (Google Meet) సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. బుధవారం భారతదేశంలో చాలా మంది వినియోగదారులు గూగుల్ మీట్ సేవలు సరిగా పని చేయడంలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా రిమోట్ వర్క్, ఆన్లైన్ సమావేశాల్లో పాల్గొనే వినియోగదారులు ఈ అంతరాయం వల్ల సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.ఆన్లైస్ సేవల అవుటేజ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్ డిటెక్టర్ (Downdetector) ప్రకారం, మధ్యాహ్నం 12:29 గంటల వరకు భారతదేశంలో కనీసం 1,760 మంది వినియోగదారులు గూగుల్ మీట్‌తో సమస్యల ఎదుర్కొన్నట్లు చెప్పారు. చాలా మంది వినియోగదారులు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన సమావేశాల్లో జాయిన్ అవ్వలేకపోయామని ఆందోళన వ్యక్తం చేశారు.ఎర్రర్ ఇదే..ఆన్లైన్ కాల్స్‌లో చేరడానికి ప్రయత్నించిన వినియోగదారులకు స్క్రీన్‌పై ఒక ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. ‘502. దిస్ ఈస్ యాన్ ఎర్రర్. మీ రెక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడానికి దయచేసి 30 సెకన్లలో మళ్లీ ప్రయత్నించండి. మాకు తెలిసింది అంతే’ అనే మెసేజ్ చూపించింది.నెటిజన్ల స్పందనగూగుల్ మీట్ అంతరాయంపై నెజినట్లు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించారు. ‘పని చేయడానికి ఎంతో ఆశగా ఉన్న నాకు గూగుల్ మీట్ చుక్కలు చూపించింది’ అని ఒక నెటిజన్ రాశారు. మరొక వినియోగదారు స్పందిస్తూ.. ‘మా సంస్థలో గూగుల్ మీట్ అందరికీ డౌన్ అయింది’ అని రాశారు. కొంతమంది యూజర్లు మాత్రం టీమ్ సభ్యుల మధ్య సమస్యలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపారు. ‘గూగుల్ మీట్? నాకు సరిగానే ఉంది. కానీ మా బృందంలో ఇతర సభ్యులు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: 1980 తర్వాత పుట్టిన వారికి అలర్ట్! -
రూ.80వేల ఐపాడ్ రూ.1500లకే.. తీరా కొన్నాక..
ప్రస్తుత రోజుల్లో ఏది కావాలన్నా ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్ల కొనుగోలు ఎక్కువగా ఆన్లైన్ వేదికగానే జరుగుతోంది. ఇలా కొంటున్నప్పుడు ఒక్కొక్కసారి వస్తువుల ధర లిస్టింగ్ విషయంలో పొరపాట్లు జరుగుతుంటాయి. వీటిని చూసి దొరికిందిలే ఛాన్స్ అంటూ వెంటనే కొనేస్తుంటారు. ఆ తప్పిదాలను గ్రహించి వాటిని రాబట్టుకునేందుకు విక్రేతలు నానా పాట్లు పడుతుంటారు.అచ్చం ఇలాగే జరిగింది ఇటలీలో. ఇటాలియన్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ మీడియా వరల్డ్ ఇటీవల తన లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులకు 13-అంగుళాల యాపిల్ ఐప్యాడ్ ఎయిర్‌ను పొరపాటున 15 యూరోలకే (సుమారు రూ .1,500) విక్రయించింది. ఈ డివైజ్ అసలు ధర సుమారు రూ .79,990. వార్తా సంస్థ వైర్డ్ కథనం ప్రకారం.. రిటైలర్ 11 రోజుల తరువాత పొరపాటును గ్రహించారు. అయితే అప్పటికే ఆన్ లైన్ ఆర్డర్ లు పంపిణీ అయిపోయాయి. చాలా మంది కస్టమర్లు తమ ఐప్యాడ్ లను స్టోర్‌లో తీసుకున్నారు.ధర లిస్టింగ్ విషయంలో జరిగిన పొరపాటును గ్రహించిన మీడియా వరల్డ్ వాటిని తిరిగి రాబట్టుకునే పనిలో పడింది. పొరపాటు ధరకు ఐపాడ్లను కొనుక్కున్న కస్టమర్లందరినీ సంప్రదించింది. ఆ ఐపాడ్లను తిరిగి ఇవ్వాలని లేదా వాస్తవ ధరకు సరిపోయేలా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోరింది. దీనిపై డిస్కౌంట్ ఇస్తామని, లేదా ఐపాడ్ తిరిగి ఇచ్చేస్తే వారు చెల్లించిన మొత్తం వెనక్కి ఇచ్చి అసౌకర్యానికి పరిహారంగా 20 యూరోల (సుమారు రూ .2,050) వోచర్ కూడా ఇస్తామని వేడుకుంటోంది. -
ఏఐ హైప్ కాదు.. ఎంతో సమయం ఆదా!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అంటే ఏదో హైప్ కాదని, దీని వల్ల ఎంతో సమయం అవుతోందని లాజిస్టిక్స్ టెక్ సంస్థ షిప్‌రాకెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సాహిల్ గోయల్ తెలిపారు. దాన్ని చెడుగా భావించకుండా, సద్వినియోగం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.ప్రతి పరిశ్రమలో కీలక మార్పులు తెచ్చే సత్తా ఏఐకి ఉందనే విషయం గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఏఐ కంపెనీల వేల్యుయేషన్లపై విమర్శలు, ఇది ఎప్పుడైనా పేలిపోయే బుడగలాంటిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏఐ వేల్యుయేషన్స్ అనేవి మార్కెట్‌కి సంబంధించినవని, దీన్ని విస్తృత ఉపయోగాల గురించి వేరుగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీర్ఘకాలంలో ఏఐ సాధనాలు మనకు అనుకూలంగా పని చేస్తాయన్నారు. కృత్రిమ మేథతో రోబోటిక్స్‌లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని గోయల్ తెలిపారు. దీని గురించి ప్రజలు తెలుసుకుని, నేర్చుకుని, ఉపయోగించడం మొదలుపెట్టాలని గోయల్ పేర్కొన్నారు. -
గేమింగ్ సంస్థల డిపాజిట్లు ఫ్రీజ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు చెందిన రూ. 523 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ని నిషేధించిన తర్వాత ఆ మొత్తాన్ని ప్లేయర్లకు రిఫండ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు తమ దగ్గరే అట్టే పెట్టుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. విన్జో, గేమ్స్క్రాఫ్ట్ తదితర గేమింగ్ కంపెనీల డిపాజిట్లు వీటిలో ఉన్నాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా నవంబర్ 18–22 మధ్య ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లోని నిర్దేశ నెట్వర్క్స్ (ఎన్‌ఎన్‌పీఎల్), గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ (జీటీపీఎల్), విన్జో గేమ్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రియల్ మనీ గేమ్స్‌లో (ఆర్ఎంజీ) మనుషులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఆడుతున్న విషయాన్ని కస్టమర్లకు తెలియనివ్వకుండా విన్జో అనైతిక వ్యాపార విధానాలు అమలు చేసిందని, క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ ఆరోపించింది. గేమర్లకు రిఫండ్ చేయాల్సిన మొత్తాన్ని తమ ఖాతాల్లో అట్టే పెట్టుకుందని పేర్కొంది. గేమ్స్‌క్రాఫ్ట్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలున్నట్లు వివరించింది. -
ఐఫోన్ 16పై రూ.13000 తగ్గింపు!
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ రిటైలర్లు ఐఫోన్ 16పై ఆఫర్స్ & డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా ఈ మొబైల్ కొనుగోలుపై రూ. 13,000 తగ్గింపులను ప్రకటించింది.128జీబీ ఐఫోన్16 అసలు ధర రూ. 69900 (ఫ్లిప్‌కార్ట్). ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా.. దీనిని రూ. 13000 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్లో అనేక ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు అన్ని బ్యాంక్ ఆధారిత ఆఫర్లు ఉంటాయి. HDFC, SBI కార్డ్ హోల్డర్లు రూ. 5,000 వరకు తక్షణ 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 25000 వరకు తగ్గింపు (ఈ ధర మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్ స్థితిని బట్టి ఉంటుంది) లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐలో భాగంగా.. 3-24 నెలల్లో చెల్లింపులు చేసుకోవచ్చు.ఫ్లిప్‌కార్ట్ ఇతర ఐఫోన్ మోడళ్లపై కూడా డీల్‌లను అందిస్తోంది. 6.7 ఇంచెస్ పెద్ద స్క్రీన్ & పెద్ద బ్యాటరీ కలిగిన ఐఫోన్ 16 ప్లస్ ధర, డిస్కౌంట్ తర్వాత రూ.69,999 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 15 రూ.49,999కి, ఐఫోన్ 15 ప్లస్ రూ.59,999కి, ఐఫోన్ 14 కేవలం రూ.44,499కే అందుబాటులో ఉంది.ఐఫోన్ 16ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్, 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే కలిగిన యాపిల్ ఫోన్. ఇది 48MP ఫ్యూజన్ లెన్స్‌లతో కూడిన కెమెరా సిస్టమ్ పొందుతుంది. ఐఫోన్ 16 యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా యాక్సెస్ చేయగలదు. కొంత తక్కువ ధరతో ఐఫోన్ 16 కొనడానికి ఇది సరైన సమయం.ఇదీ చదవండి: రూ. లక్ష కంటే ఖరీదైన ఐఫోన్.. సగం ధరకే! -
బిలినీయర్స్ అంతా ఒక్కచోట!
అసాధ్యం అనుకున్న చాలా విషయాలను ఏఐ సాధ్యం చేస్తోంది. టెక్ బిలియనీర్లు అందరూ ఒక్క చోటకు చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ చేసిన ఈ అద్భుతంపై.. నెట్టింట్లో మీమ్స్, జోకులు వెల్లువెత్తుతున్నాయి.1 ట్రిలియన్ స్క్వాడ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో.. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్, జెన్సెన్ హువాంగ్, సామ్ ఆల్ట్మాన్, టిమ్ కుక్, జెఫ్ బెజోస్‌లు అందరూ ఒకేచోట ఉన్నారు. ఈ ఫోటోలు మస్క్ కొత్త గ్రోక్ అప్డేట్ ప్రకటనను తెలియజేయడానికే అని కొందరు చెబుతున్నారు.Trillion Squad assembled pic.twitter.com/tQMjRrfxx5— Ambuj Mishra (@Ambujmishra9090) November 22, 2025ఒక ఫొటోలో.. ఎలాన్ మస్క్ సహా చాలామంది దిగ్గజ వ్యాపారవేత్తలు కార్ పార్కింగ్ వద్ద సమావేశమైనట్లు కనిపిస్తున్నారు. మరో చిత్రంలో అందరూ కలిసి ఒక రూములో ఉన్నట్లు చూడవచ్చు. నిజజీవితంలో వీరంతా కలుసుకోవడం చాలా అరుదు అయినప్పటికీ.. ఏఐ మాత్రం వీరిని కలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.Somewhere in a parallel universe: pic.twitter.com/SFlYRiUpcn— DogeDesigner (@cb_doge) November 22, 2025 -
బైకర్ల కోసం ఎయిర్‌బ్యాగ్: ప్రమాదంలో రైడర్ సేఫ్!
ప్రమాదంలో ప్రాణాలను కాపాడంలో ఎయిర్ బ్యాగులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఎయిర్ బ్యాగ్స్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టే, కారు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు కొన్నిసార్లు ప్రాణాలతో బయటపడతారు. బైక్ రైడర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉంటే?, ఎంతబాగుంటుందో కదా.. దీనిని దృష్టిలో ఉంచుకునే నియోకవాచ్ (NeoKavach) కంపెనీ మొదటిసారి బైకర్స్ కోసం ఎయిర్‌బ్యాగ్ లాంచ్ చేసింది. దీనికి ధర ఎంత?, ఇదెలా ఉపయోగపడుతుంది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.100 మిల్లీ సెకన్లలోపుబైక్ రైడర్ల భద్రత కోసం.. ఇండో-ఫ్రెంచ్ జాయింట్ వెంచర్ అయిన నియోకవాచ్, నియోకవాచ్ ఎయిర్ వెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఇది బైకర్స్ కోసం రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సిస్టం. ప్రమాదం జరిగినప్పుడు రైడర్ ఛాతీ, వెన్నెముక, మెడ వంటి భాగాలను ఇది రక్షిస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్ ప్రమాదం జరిగినప్పుడు కేవలం 100 మిల్లీ సెకన్లలోపు యాక్టివేట్ అవుతుంది. ముఖ్యమైన ప్రాంతాలకు కుషనింగ్ అందిస్తుంది.సాధారణంగా కారులో ప్రయాణించే వారితో పోలిస్తే.. మోటార్‌సైకిల్‌పై ప్రయాణించేవారికి ప్రమాదంలో తీవ్ర గాయలయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి ఇలాంటి వాటిని నివారించడానికే ఈ నియోకవాచ్ ఎయిర్ వెస్ట్ వచ్చింది.భద్రతా ప్రమాణాలకు అనుగుణంగాఎలక్ట్రానిక్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌ల మాదిరిగా కాకుండా.. నియోకావాచ్ ఎయిర్ వెస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు లేదా సబ్స్క్రిప్షన్ల అవసరం లేని సరళమైన మెకానికల్ టెథర్ ట్రిగ్గర్ను ఉపయోగిస్తుంది. దీనిని రీసెట్ చేయవచ్చు. డిప్లాయ్‌మెంట్ తర్వాత తిరిగి ఉపయోగించవచ్చు. దీనిని రోజువారీ ప్రయాణంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది తేలికైనది కావడంతో రైడర్లకు అసౌకర్యంగా ఉండే అవకాశం లేదు. అంతే కాకుండా.. ఇది ప్రపంచ భద్రతా ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.ఇదీ చదవండి: బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..మొత్తం మూడునియోకావాచ్ ఎయిర్ వెస్ట్ (రూ. 32,400) మాత్రమే కాకుండా.. కంపెనీ నియోకవాచ్ టెక్ బ్యాక్‌ప్యాక్ ప్రో (రూ. 40,800), నియోకవాచ్ టెక్‌ప్యాక్ ఎయిర్ (రూ. 36,000) లను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు ఉత్పత్తులు ఇప్పుడు నియోకావాచ్ అధికారిక వెబ్సైట్లో & భారతదేశం అంతటా ఎంపిక చేసిన అధీకృత రిటైలర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. -
రూ.500 కంటే తక్కువ.. 72 రోజుల వ్యాలిడిటీ
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమ అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 72 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.BSNL పోర్ట్‌ఫోలియోలో అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి రూ. 500 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని సంస్థ తెలిపింది.రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన ఈ రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా.. యూజర్ అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్/రోజుకు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 72 రోజులు మాత్రమే.72 Days of Smart Savings in One Recharge!BSNL’s ₹485 Plan gives you 72 days of unlimited calls, 2GB/day data & 100 SMS/day.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNL #BSNLRecharge #BSNL4G pic.twitter.com/t6IyOzc0cA— BSNL India (@BSNLCorporate) November 23, 2025ఇప్పటికే రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు -
శబరిమలలో నెట్‌వర్క్‌ను పెంచిన వొడాఫోన్ ఐడియా
భక్తులకు సౌకర్యార్ధం శబరిమల మార్గంలో కనెక్టివిటీని పెంచే దిశగా తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. అలాగే, యాత్రకు వచ్చే బాలల సంరక్షణ కోసం వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్‌ను మరింతగా అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించింది.శబరిమల యాత్రలో భక్తులు తమ క్షేమ సమాచారాన్ని కుటుంబీకులు, సంబంధీకులతో పంచుకునేలా శబరిమల మార్గంలోని సన్నిధానం, పంపా, నీలక్కల్ అంతటా కనెక్టివిటీని పెంచినట్లు టెల్కో తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా ఎల్ 900, ఎల్ 1800, ఎల్ 2100, ఎల్ 2300, ఎల్ 2500తో సహా వివిధ బ్యాండ్లలో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ను మోహరించింది. అలాగే పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.యాత్రీకుల భారీ రద్దీలోనూ మెరుగైన డేటా, వాయిస్ సేవలు అందించేలా మాసివ్ మిమో టెక్నాలజీతో అధునాతన ఎఫ్‌డీడీ, టీడీడీ లేయర్లను కూడా మోహరించినట్లు వొడాఫోన్ ఐడియా తెలిపింది. దీంతో గణపతి కోవిల్, నడప్పంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం, నీలక్కల్ పార్కింగ్, బస్టాండ్ వద్ద వొడాఫోన్ ఐడియా ద్వారా కనెక్టివిటీ గణనీయంగా బలోపేతం చేసినట్లు వివరించింది.ఇక పిల్లల వీఐ సురక్షా రిస్ట్ బ్యాండ్స్‌కు సంబంధించి ప్రీ–రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. వీఐసురక్ష పోర్టల్‌తో పాటు కేరళవ్యాప్తంగా 25 వీఐ స్టోర్స్, 103 మినీ స్టోర్స్ మొదలైన వాటిల్లో రిజిస్టర్ చేసుకుని, పంబాలో ఏర్పాటు చేసిన వీఐ సురక్షా కియోస్క్‌ల నుంచి వీటిని పొందవచ్చని వివరించింది. -
ఏఐతో సాఫ్ట్వేర్ టెస్టింగ్ వేగవంతం
సాఫ్ట్వేర్ టెస్టింగ్ ప్రక్రియను కృత్రిమ మేథ దన్నుతో స్మార్ట్‌గా, వేగవంతంగా మార్చేందుకు తోడ్పడేలా క్యూమెంటిస్ఏఐ ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు క్వాలిజీల్ వెల్లడించింది. సవాళ్లను వేగంగా గుర్తించేందుకు, టెస్టింగ్ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది.సాఫ్ట్‌వేర్‌లో అత్యంత ముఖ్యాంశాలపై దృష్టి సారించేందుకు ఇది టెస్టర్లకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఈ సందర్భంగా ఎవరెస్ట్ గ్రూప్‌తో కలిసి ‘‘రీఇమేజినింగ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ’’ పేరిట క్వాలిజీల్ నివేదికను విడుదల చేసింది.ఆధునిక సాఫ్ట్వేర్ క్వాలిటీ రిస్కులను అధిగమించడంలో ఇంటెలిజెంట్ ఆటోమేషన్, నిరంతరాయ పర్యవేక్షణ ఉపయోగపడే విధానాన్ని నివేదిక వివరించింది. అలాగే, ప్లాట్‌ఫాం ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేసిన అజమారా క్రూయిజెస్ కేస్ స్టడీస్‌ని ఇందులో పొందుపర్చింది. -
కొత్త ఫోనొచ్చింది.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి నయా కంపెనీ
కన్జూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ ఇండ్కాల్ మొబైల్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్ వన్’ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్అండ్డీ), థర్డ్‌పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మాడ్యుల్, హార్డ్వేర్లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జర్ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్‌లో లభ్యం కాని చిప్‌సెట్‌ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.ఆకట్టుకునే ఫీచర్లు: వూబుల్ వన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు.. కొత్త లేబర్ కోడ్
ఐటీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి.. ఇవి కాక అనేక ఇతర ప్రయోజనాలు.. ఆహా జాబ్ అంటే ఐటీ వాళ్లదే అనుకుంటాం. కానీ వాస్తవంలోకి వెళ్తే ఉద్యోగులకు అరకొర జీతాలు.. అదీ నెలనెలా సక్రమంగా ఇవ్వని ఐటీ కంపెనీలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధితులకు ఉపశమనం కలగనుంది.దేశంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొత్త లేబర్ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లేబర్ కోడ్లను తక్షణం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా 7వ తేదీలోగా జీతం పంపిణీ చేయడం తప్పనిసరి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇకపై జీతాల్లో జాప్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.ఇక మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కూడా కొత్త లేబర్‌కోడ్ పలు అంశాలను నిర్దేశించింది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, వేతనంలో లింగ ఆధారిత అసమానత ఉండదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.అంతేకాకుండా నైట్ షిఫ్టులలో పని చేయడం ద్వారా అందే అధిక వేతనాలు, ఇతర ప్రయోజాలను మహిళలు కూడా పొందవచ్చు. ఇందుకు అనుగుణంగా మహిళా ఉద్యోగులు రాత్రి షిఫ్టులలో పని చేసుకునేలా అన్ని సంస్థలలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.వీటన్నింటితో పాటు పరిశ్రమ-నిర్దిష్ట కోడ్ ప్రకారం.. వేధింపులు, వివక్ష, వేతన సంబంధిత వివాదాలను సకాలంలో పరిష్కరించడం జరుగుతుంది. ఉద్యోగులందరికీ నిర్ణీత కాల ఉపాధి, నియామక పత్రాలు అందించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను ప్రకటించింది.ఇది చదివారా?: కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు -
ఉమెన్ పవర్ ఏ.ఐ కెరీర్
ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్‌కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్).... కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్‌పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్‌కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది రిత్విక.వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్లకు ‘అన్స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్‌కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్‌తో కూడిన ఏఐ మోడల్స్‌ను నిర్మించింది అన్స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్నర్షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.సాంకేతిక కళ!చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్‌కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్‌కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్‌లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్‌ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్‌ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్‌ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్లు) నుంచి ఆమె స్టార్టప్‌కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్‌తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్‌బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్‌ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది -
ఒప్పో నుంచి సరికొత్త ఫైండ్ ఎక్స్9 సిరీస్
ఒప్పో ఇండియా తాజాగా ఫైండ్ ఎక్స్9 సిరీస్‌ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వేరియంట్‌ని బట్టి దీని ధర రూ. 74,999 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 21 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఒప్పో ఈ–స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.హాసెల్‌బ్లాడ్‌తో కలిసి రూపొందించిన కొత్త తరం కెమెరా సిస్టం, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన పనితీరు మొదలైన విశేషాలు ఇందులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే హాసెల్‌బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ రూ. 29,999కి లభిస్తుంది. ఇక, లేటెస్ట్ టీడబ్ల్యూఎస్ ఎన్కో బడ్స్3 ప్రోప్లస్‌ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1,899గా ఉంటుంది.హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యంఫైండ్ ఎక్స్9 సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ హాసెల్‌బ్లాడ్‌తో కలిసి అభివృద్ధి చేసిన నెక్స్ట్ జెన్ కెమెరా సిస్టమ్. ఇది ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనుభవానికి దగ్గరగా ఉండే రంగులు, కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా టెలిఫోటో ఫోటోగ్రఫీ కోసం హాసెల్‌బ్లాడ్ టెలీకన్వర్టర్ కిట్ కూడా పరిచయమైంది.మెరుగైన బ్యాటరీ, పనితీరుఫైండ్ ఎక్స్9 సిరీస్ స్మార్ట్ఫోన్లలో బలమైన ప్రాసెసర్, ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీ, నిరంతర మల్టీటాస్కింగ్ సామర్థ్యం, హై–ఎండ్ గేమింగ్‌కు సరిపడే పనితీరు ఈ డివైస్‌లను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. -
పాకిస్థాన్ వ్యవస్థలకు డిజిటల్ షాక్!
సరిహద్దుల్లో కవ్వింపులకు దిగుతూ, భారత్‌పై పదే పదే విషం చిమ్మే పాకిస్థాన్‌కు ఇప్పుడు దాని సొంత వ్యవస్థలోనే పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. దేశంలోని కీలకమైన ప్రభుత్వ సంస్థల డేటా లీక్ అయినట్లు ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ (Indian Cyber Force) అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలు కూడా బహిరంగంగా వెల్లడిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు, నిర్లక్ష్య వైఖరిని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. భారత సైబర్ నిపుణుల ధాటికి పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల గోప్యత అల్లకల్లోలం అవుతోంది.ఏమేమి లీక్ అయ్యాయి?‘ఇండియన్ సైబర్ ఫోర్స్’(ICF) అందించిన వివరాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు కీలక విభాగాల నుంచి భారీ మొత్తంలో సమాచారం లీక్ అయింది. ఇది కేవలం ఒక సర్వర్ హ్యాక్ కావడం కాదు, ఆ దేశ వ్యవస్థాగత భద్రతపై జరిగిన డిజిటల్ దాడి.పోలీసు రికార్డులు, పాస్‌పోర్ట్ డేటా: పౌరుల వ్యక్తిగత, గోప్యమైన సమాచారం, పోలీసు రికార్డు వెరిఫికేషన్ డేటా (2.2 జీబీ), పాస్‌పోర్ట్ వివరాలు బహిర్గతమయ్యాయి.Pakistan Railway Employee Data (name, father name, mother name, employee, cnic, address ) & Land Management(name, father name, mother name, shop name, cnic, address ) Data Breached! (Maintenance system)Remember the name "Indian Cyber Force" #PakistanRailwayHacked… pic.twitter.com/kWR1eF5srZ— Indian Cyber Force (@CyberForceX) November 20, 2025ఆర్థిక డేటా: ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) ఐరిస్ పోర్టల్ నుంచి 150 జీబీకి పైగా డేటా లీక్ అయింది. ఇందులో పౌరుల CNIC (జాతీయ ఐడీలు), పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, అత్యంత గోప్యమైన ట్యాక్స్ రికార్డులు ఉన్నాయి.Police Record Verification Data OF Pakistan Breached! 2.2 GB Data Le*akedIncluded: Passports, Electricity Bills etc Greetz to: solveig#IndianCyberForce#OperationHuntDownPorkies pic.twitter.com/Z4NtYVl2ZB— Indian Cyber Force (@CyberForceX) November 19, 2025రైల్వే: పాకిస్థాన్ రైల్వే ఉద్యోగుల వివరాలు (పేరు, తల్లిదండ్రుల పేర్లు, CNIC, చిరునామా), ల్యాండ్ మేనేజ్మెంట్ (భూమి నిర్వహణ) డేటా లీక్ అయ్యింది.విద్యుత్తు, ఫార్మసీ: విద్యుత్ బిల్లుల సమాచారం, నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్ వంటి ఫార్మసీ కంపెనీల నుంచి 24 జీబీకి పైగా సున్నితమైన డేటా (బ్యాంకు ఖాతాలు, ప్రైవేట్ ఈమెయిల్స్, పాస్వర్డ్లు) బహిర్గతమైంది.We have breached Pakistan Pharmacy Company, Next Pharmaceutical pk 24 GB+ data exfiltrated. Exposes: Company name, Bank Account, Private Emails, Passwords, Documents Check: https://t.co/fL4C6GJPNW#IndianCyberForce pic.twitter.com/TqXG4Ag4KR— Indian Cyber Force (@CyberForceX) November 5, 2025విద్య: టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ట్రైనింగ్ అథారిటీ (TEVTA) సైట్ కూడా హ్యాక్ చేశారు.ఆపరేషన్ సింధూర్-ర్యాన్సమ్వేర్ దాడి: ఈ బృందం ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ అధికారిక వెబ్సైట్ల సర్వర్లపై రాన్సమ్వేర్ దాడిని కూడా నిర్వహించినట్లు ప్రకటించింది. సిస్టమ్‌లను ఎన్‌క్రిప్ట్ చేసినప్పటికీ దాని తీవ్రతను గోప్యంగా ఉంచింది.వ్యవస్థల నిర్లక్ష్యం: పాకిస్థాన్ వైఫల్యంఈ భారీ డేటా ఉల్లంఘన పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థల డిజిటల్ భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. CNICలు(జాతీయ ఐడీలు), పన్ను రికార్డులు, పోలీసు డేటా వంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడంలో పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదన్నది బహిరంగ రహస్యం.ఆర్థిక అనిశ్చితి ప్రభావంఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ సైబర్ భద్రతా మౌలిక సదుపాయాలపై తగినంత పెట్టుబడి పెట్టడం లేదు. వ్యవస్థలను అప్డేట్ చేయకపోవడం, నిపుణులను నియమించకపోవడం వంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యవస్థలు హ్యాకర్లకు లక్ష్యాలుగా మారుతున్నాయి.పౌరుల గోప్యతకు ప్రమాదంఈ లీక్‌ల ద్వారా పాకిస్థాన్ పౌరుల వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం, వారి గుర్తింపు కార్డుల డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లింది. ఇది ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలు, పౌరుల పట్ల శత్రు దేశాల గూఢచర్య కార్యకలాపాలకు సులభతరం చేసే అవకాశం ఉంది. ఇండియన్ సైబర్ ఫోర్స్ జరిపిన ఈ దాడి భారత సైబర్ నిపుణుల బలం, సామర్థ్యాన్ని చాటుతోంది. భారత్ పట్ల పాకిస్థాన్ కవ్వింపులకు దిగితే, సరిహద్దుల్లోనే కాకుండా డిజిటల్ వేదికపై కూడా దీటైన సమాధానం ఇవ్వగలదని ఈ సంఘటన రుజువు చేసింది.ఈ ఆపరేషన్ పాకిస్థాన్ వ్యవస్థాగత బలహీనతలకు హెచ్చరిక. నిత్యం భారత్‌పై ద్వేషాన్ని పెంచి పోషిస్తూ, ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్.. తమ సొంత దేశ పౌరుల అత్యంత గోప్యమైన డేటాను కూడా కాపాడుకోలేకపోవడం ఆ దేశ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. భారత్ తనపై జరుగుతున్న ప్రతి దాడికి భౌతికంగానే కాకుండా, డిజిటల్ రంగంలో కూడా గట్టి సమాధానం ఇవ్వగలదనే సంకేతాన్ని పంపుతుంది.ఇదీ చదవండి: జీవిత బీమా వెనుక భారీ సంపద రహస్యం -
ఆధార్ డేటాపై హాట్‌మెయిల్ కోఫౌండర్ సంచలన ఆరోపణలు
భారత పౌరుల ఆధార్ డేటా భద్రతపై హాట్ మెయిల్ కోఫౌండర్ సబీర్ భాటియా సంచలన ఆరోపణలు చేశారు. పౌరుల ఆధార్ డేటా దుర్వినియోగం అయ్యి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టో నేరస్తులు ఈ డేటాను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ సబీర్ భాటియా ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.‘మొత్తం ఆధార్ డేటాబేస్‌ను క్రిప్టో నేరస్థులు దొంగిలించినట్లు ఓ కథనం ఉంది. 815 మిలియన్ల మంది డేటాను 80,000 డాలర్లకు అమ్మేసినట్లు చెబుతున్నారు. ఇది నిజమో కాదో నేను ధృవీకరించలేను... కానీ ఇది లోతైన సాంకేతిక నైపుణ్యం లేకుండా సంక్లిష్టమైన వ్యవస్థలను రూపొందించడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేస్తుంది. డబ్ల్యూఈఎఫ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా ఆధార్ సంబంధిత సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘనగా అభివర్ణించింది’ భాటియా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.భారత ఆధార్ డేటా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన పెట్టిన ప్రతిస్పందనల వరదకు దారితీసింది. కొంత మంది ఆయన వాదనను సమర్థించగా మరికొంత మంది విమర్శించారు. ఇలా ఆధారాలు లేకుండా అనుమానాలను కల్పించడం వెనుక ఆయన ఉద్దేశాలను ప్రశ్నించారు. ఆధారాలు లేనప్పుడు పబ్లిక్ ప్లాట్ ఫామ్ లపై రాయడం మానుకోండి అంటూ హితవు పలికారు.సబీర్ భాటియా ఆధార్ వ్యవస్థపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆధార్ డిజైన్, వ్యయంపై ఆయన గతంలోనూ విమర్శలు చేశారు. గత ఫిబ్రవరిలో ఓ పోడ్ కాస్ట్ లో భాటియా మాట్లాడుతూ ఆధార్ నిర్మాణానికి 1.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని, కానీ 20 మిలియన్ డాలర్లతోనే దీన్ని చేసి ఉండవచ్చిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆధార్ కోసం ఉపయోగిస్తున్న బయో మెట్రిక్స్పై అనుమానం వ్యక్తం చేసిన ఆయన వీడియో, వాయిస్ ఆథెంటికేషన్ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలను సూచించారు. There’s a story doing the rounds that the entire Aadhaar database has been stolen by crypto criminals, with data of 815M people reportedly on sale for $80,000. I can’t confirm if this is true… but it does highlight the risks of designing complex systems without deep technical…— Sabeer Bhatia (@sabeer) November 19, 2025 -
100 కోట్లకు 5జీ కనెక్షన్లు
న్యూఢిల్లీ: భారత్‌లో 2031 నాటికి 5జీ సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 100 కోట్లకు చేరవచ్చని ఎరిక్సన్ మొబిలిటీ ఒక నివేదికలో అంచనా వేసింది. స్మార్ట్ఫోన్లలో డేటా వినియోగం గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా నెలకు 36 జీబీగా ఉన్న డేటా వినియోగం 2031 నాటికి 65 జీబీకి చేరనుందని నివేదిక పేర్కొంది. ఈ క్రమంలో 2025 ఆఖరు నాటికి 5జీ సబ్స్క్రిప్షన్లు 39.4 కోట్లకు చేరవచ్చని వివరించింది. మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో వీటి వాటా 32 శాతంగా ఉంటుందని పేర్కొంది. అటు అంతర్జాతీయంగా కూడా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరతాయని, మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో వీటి వాటా మూడింట రెండొంతులుగా ఉంటుందని నివేదిక వివరించింది. భారత్‌లో డిజిటలీకరణను వేగవంతం చేసే దిశగా 5జీ ఇప్పటికే కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తోందని పేర్కొంది. అందుబాటు ధరలో 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సీపీఈ (ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ కస్టమర్ ప్రిమిసెస్ ఎక్విప్మెంట్) లభ్యత, ఎఫ్‌డబ్ల్యూఏ యూజర్లు అత్యధికంగా డేటాను వినియోగిస్తుండటంలాంటి అంశాలు భారత్‌లో డేటా ట్రాఫిక్ వృద్ధికి దోహదపడుతున్నట్లు వివరించింది. నివేదికలో మరిన్ని విశేషాలు... → 2031 నాటికి అంతర్జాతీయంగా 5జీ కనెక్షన్లు 640 కోట్లకు చేరనున్నాయి. ఇందులో 410 కోట్ల కనెక్షన్లు, ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలతో సంబంధం లేకుండా కేవలం 5జీ నెట్వర్క్పైనే పని చేస్తాయి. → 2024 మూడో త్రైమాసికం నుంచి 2025 మూడో త్రైమాసికం మధ్య కాలంలో మొబైల్ నెట్వర్క్ డేటా ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. 2031 వరకు ఇది వార్షిక ప్రాతిపదికన సగటున 16 శాతం మేర వృద్ధి చెందుతుంది. → 2024 ఆఖరు నాటికి గణాంకాలతో పోలిస్తే మొత్తం మొబైల్ డేటా వినియోగంలో 5జీ నెట్వర్క్ వాటా 34 శాతం నుంచి పెరిగి 43 శాతానికి చేరుతుంది. 2031 నాటికి ఇది 83 శాతానికి చేరుతుంది. → ఎఫ్‌డబ్ల్యూఏ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకునే వరి సంఖ్య 2031 ఆఖరు నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకి చేరుతుంది. → అంతర్జాతీయంగా 6జీ సబ్ర్‌స్కిప్షన్లు 2031 ఆఖరు నాటికి 18 కోట్లకు చేరతాయి. ఒకవేళ 6జీ ఆవిష్కరణలను మరింత ముందుగా తీసుకొస్తే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. -
World Television Day: చిత్రలహరి వస్తుంది పద...
కొద్దిగా ఉన్నప్పుడే బాగుండేది. టీవీ ఉన్న ఇంటికి టీవీ లేని వాళ్లంతా వచ్చి కూచునేవారు. ఆదివారం రామాయణం కోసం ప్రతి ఇల్లూ ఆతిథ్యం ఇచ్చేది. చిత్రలహరికి గడప బయట నిలబడి తొంగి చూసే పిల్లల్ని అదిలించేవారు కాదు. ఇంటి పైన యాంటెనా, ఇంట్లో డయనారా అదీ హోదా అంటే. టెలివిజన్ జీవితంలో భాగం అయిన రోజులు బాగుండేవి. ఇవాళ జీవితమంతా టీవీగా మారి ఊపిరి సలపడం లేదు. టీవీ వచ్చిన రోజులకూ ఇప్పటికీ ఎంత తేడా!సినిమా తెర మీద కాకుండా మరో తెర మీద, అదీ ఇంట్లో ఉండే తెర మీద బొమ్మ పడుతుందని ఊహించని రోజుల్లో టెలివిజన్ వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నాటి హైద్రాబాద్, లేదా మద్రాస్ (చెన్నై), లేదా కొండపల్లి నుంచి సిగ్నల్స్ సరిగా ఆ రోజుకి అందాయో ఇక పండగే పండగ. ఎందుకు పండగ? సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు ఆ తెలుపు నలుపు టీవీలో ఏదో ఒకటి ఉచితంగా ప్రసారం అవుతూ ఉంటుంది. చూడొచ్చు. అందుకని.సమయం ఉన్న రోజులుమన దేశంలో 1959లో టెలివిజన్ మొదలైనా సరైన ప్రసారాలు రూపుదిద్దుకోవడానికి 1976కి కాని సాధ్యపడలేదు. నగరాలను దాటి ఊళ్లకు సిగ్నల్ అందే వ్యవస్థ ఏర్పడటానికి మరో పదేళ్లు పట్టింది. కలర్ ప్రసారాలు 1982లో మొదలైనా 1990లకు గాని కలర్ టీవీలు కొనే శక్తి ఊళ్లల్లో ఏ కొద్దిమందికో తప్ప అందరికీ రాలేదు. ఏతా వాతా 1985 నుంచి తెలుపు, నలుపు టీవీ ప్రసారాలు తెలుగు ప్రేక్షకులకు తెలుస్తూ వచ్చాయి. ఆ రోజుల్లో మనుషులందరి దగ్గరా ఎక్కడ లేని తీరిక, సమయం. కాబట్టి టీవీ ఆన్ చేసి అర్థమైనా కాకపోయినా చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. ఇక అందులో ఆసక్తికరమైన కార్యక్రమాలు మొదలయ్యాక అతుక్కుపోయారు. టెలివిజన్ చేసిన మొదటి పని ఏమిటంటే– దేశ వాసులందరికీ ఒకే టీవీ ఒకే వినోదం అనే భావన కలిగించడం. ప్రాంతీయ ప్రసారాలు ఉన్నా ముఖ్యమైన మీట ఢిల్లీలో ఉంటుందని అందరికీ తెలియచేయడం. కేంద్ర శక్తిని స్థాపించడంలో టెలివిజన్ ముఖ్య పాత్ర పోషించింది.రామాయణం సంచలనం1987 నుంచి మొదలైన ‘రామాయణం’ సీరియల్ టెలివిజన్ పవర్ ఏంటో దేశానికి చాటింది. వ్యాపార ప్రకటనలు ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లువెత్తడం కూడా మొదలయ్యాయి. అంతవరకూ టికెట్ ఇచ్చి సినిమా హాల్లో రామాయణం చూసిన జనం ఈ ఉచిత రామాయణాన్ని తండోపతండాలుగా చూశారు. ఆ తర్వాత ‘మహాభారత్’, ‘హమ్‌లోగ్’, ‘నుక్కడ్’, ‘ఉడాన్’, ‘మాల్గుడీ డేస్’... ప్రేక్షకులకు అందమైన డేస్ మిగిల్చాయి.చిత్రహార్–చిత్రలహరిప్రతి బుధవారం వచ్చే హిందీ పాటల ‘చిత్రహార్’, శుక్రవారం వచ్చే ‘చిత్రలహరి’ సూపర్‌హిట్ ఆదరణ పొందాయి. జనం తెలుగు పాటల కోసం టీవీల ముందు కొలువు తీరేవారు. ఆ రోజుల్లో ప్రతివారం ‘ఒక బృందావనం సోయగం’ (ఘర్షణ 1988) పాట తప్పనిసరిగా ఉండేది. పండగల ముందు ఆయా పండగలకు తగ్గట్టుగా పాటలు ఉండేవి. అదే సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ‘ఆనందో బ్రహ్మ’ సూపర్‌హిట్ అయ్యింది. ఆదివారం రోజు అతి పాత తెలుగు చిత్రం వచ్చినా జనం విరగబడి చూసేవారు.అపురూప క్షణాలుఇంటి పైనా యాంటెనా, ఇంట్లో టీవీ ఉండటం ఎంతో గొప్పయిన రోజులు అవి. ఇక కలర్ టీవీ ఉన్న ఇంటికి డిమాండ్ జాస్తిగా ఉండేది. వాన వచ్చినా, గాలి వీచినా నిలువని బొమ్మతో వేగినా అదే పెద్ద సంబరం. ఇన్స్టాల్మెంట్లో కొని ఇంటికి టీవీ తెచ్చిన రోజు పండగ ఉండేది. మధ్యతరగతి జీవులకు తగినట్టుగా ‘మినీ టీవీ’లు కంపెనీలు తెచ్చాక వాటితోనే సర్దుబాటు చేసుకున్న సన్నజీవులెందరో. దూరదర్శన్ సిగ్నేచర్ ట్యూన్‌తో సహా దూరదర్శన్ అందరికీ అభిమాన పాత్రమైంది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా సబ్‌టైటిల్స్‌తో చూసేవారు. అలా ఎన్నో ఉత్తర కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు చూశారు. టీవీ ప్రసారాల వల్ల ఇరుగిల్లు పొరుగిల్లు ఒకే ఇల్లయినట్టుగా అందరూ కలిసి మెలిసి ఉండేవారు. టీవీలో క్రికెట్ లైవ్ చూడటానికి ఎంతో మంచిగా వ్యవహరించాల్సి వచ్చేది. స్నేహాలు చేయాల్సి వచ్చేది.ఇప్పుడు చేతిలో ఫోన్. అనుక్షణం రీల్స్. చేతిలోనే కదిలే బొమ్మ. దేనికీ విలువ లేదు. ఓటీటీల్లో వందల సినిమాలు ఉన్నా దేనిని ఎంపిక చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఏదీ నచ్చదు. కానీ ఆ రోజుల్లో వచ్చిందే నచ్చేది. అతిగా లభ్యమైనది ఏదైనా విలువ కోల్పోతుంది. ఇవాళ విజువల్ ఎంటర్టైన్మెంట్ వేయి రూ పాలు సంతరించుకున్నా, ఇరవై నాలుగ్గంటల న్యూస్ చానల్స్ ఉన్నా అవన్నీ జల్లెడలో జారే ఊకలానే ఉంటున్నాయి. టెలివిజన్ ప్రసారాల ప్రొఫెషనలిజమ్, హుందాతనం, ఆ న్యూస్‌రీడర్లు, ఆ యాంకర్లు... ఆ మాట... ఉచ్చారణ... పలుకు... ఇప్పుడెక్కడ. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
‘1600’ కాలింగ్ సిరీస్‌ను తప్పనిసరి చేసిన ట్రాయ్
ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు(NBFCs), మ్యూచువల్ ఫండ్లతో సహా వివిధ వర్గాల ఆర్థిక సంస్థలు తమ సేవలు, లావాదేవీల కోసం ప్రత్యేకంగా ‘1600’ కాలింగ్ సిరీస్‌ను ఉపయోగించడానికి గడువు ప్రకటించింది. నియంత్రిత ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్‌ను ప్రజలు సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ తెలిపింది. తద్వారా మోసాల కేసులను గణనీయంగా తగ్గించడానికి తోడ్పడుతుందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.సంస్థల వారీగా గడువులురిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రణలో ఉన్న సంస్థలు ‘1600’ నంబరింగ్ సిరీస్‌ను తప్పనిసరిగా పాటించాలని, అందుకు గడువు తేదీలను ట్రాయ్ స్పష్టం చేసింది.సంస్థలుగడువు తేదీవాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు)జనవరి 1, 2026పెద్ద ఎన్బీఎఫ్సీలు, పేమెంట్స్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుఫిబ్రవరి 1, 2026మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీలుఫిబ్రవరి 15, 2026సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు, పెన్షన్ ఫండ్ మేనేజర్లుఫిబ్రవరి 15, 2026మిగిలిన ఎన్బీఎఫ్సీలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుమార్చి 1, 2026క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (QSBలు)మార్చి 15, 2026 గమనిక: బీమా రంగానికి సంబంధించి IRDAIతో గడువుపై ఇంకా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే ఈ తేదీని ప్రకటిస్తామని ట్రాయ్ తెలిపింది.టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI) రంగంలోని సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థల కోసం ప్రత్యేకంగా 1600 సిరీస్‌ను కేటాయించింది. ఇది సాధారణ వాణిజ్య కమ్యూనికేషన్ల నుంచి అధికారిక సర్వీసులను వేరు చేయడానికి సహాయపడుతుంది. జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ద్వారా సంప్రదింపులు జరిపిన తర్వాత దశలవారీగా అమలు షెడ్యూల్‌ను జారీ చేసినట్లు ట్రాయ్ తెలిపింది. ఇప్పటికే 485 సంస్థలు 1600 సిరీస్‌ను స్వీకరించాయని పేర్కొంది. ఇతర సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు వారి రిజిస్ట్రేషన్ వివరాలను ధ్రువీకరించిన తర్వాత స్వచ్ఛందంగా 1600 సిరీస్‌కు మారవచ్చని ట్రాయ్ తెలిపింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం -
పుతిన్ ముందు చిందేసిన రోబో
టెక్నాలజీ పెరుగుతోంది.. ఈ తరుణంలో ప్రపంచంలోని చాలాదేశాలు హ్యుమానాయిడ్ రోబోలను తయారు చేసేపనిలో నిమగమయ్యాయి. ఇందులో రష్యా కూడా ఉంది. ఇటీవల స్బెర్బ్యాంక్ బుధవారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక రోబో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్యాలోని స్బెర్బ్యాంక్ తన సాంకేతిక పురోగతిని ప్రదర్శించడానికి రూపొందించిన ప్రదర్శనలో.. బుధవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదురుగా ఒక రోబో డ్యాన్స్ చేసింది. ఈ ప్రదర్శనలో.. క్రెమ్లిన్ చీఫ్, హ్యూమనాయిడ్ రోబోట్ ఎదురుగా నిలబడి రోబో గురించి వివరించారు.రోబో తనను తాను పరిచయం చేసుకుంటూ.. ''నా పేరు గ్రీన్. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన మొదటి రష్యన్ హ్యూమనాయిడ్ రోబోట్. నేను కేవలం ఒక ప్రోగ్రామ్ కాదు. టెక్నాలజీ యొక్క భౌతిక స్వరూపిని. నేను డ్యాన్స్ కూడా చేయగలను, అని వ్లాదిమిర్ పుతిన్ ముందు డ్యాన్స్ చేసింది''. దాని డ్యాన్స్ చూసి ఆయన ఎంతో ముగ్దుడయ్యాడు.Vladimir Putin visits AI exhibition and is treated to a dance by a Sberbank robot 'Dear Vladimir Vladimirovich thank you for your attention!'Putin is certainly stunned pic.twitter.com/FOCZFhg6w8— RT (@RT_com) November 19, 2025వేదికపై పడిపోయిన రోబోనవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా 'ఐడల్' (Aidol) అనే రోబోను ఆవిష్కరించారు. ఇది ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చి.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025 -
జియో కొత్త ఆఫర్.. 18 నెలలు ఉచితం!
ప్రముఖ టెలికాం సంస్థ జియో ఇప్పుడు తన అపరిమిత 5జీ వినియోగదారులందరికీ జెమిని ప్రో ప్లాన్ ను ఉచితంగా అందిస్తోంది. ఇంకా ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3 మోడల్ కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. గూగుల్ ఇటీవలే తన సరికొత్త, అత్యంత సమర్థవంతమైన ఏఐ మోడల్.. జెమిని 3ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మునుపటి జెమిని కంటే మెరుగ్గా ఉందని, ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ-5.1ను అధిగమిస్తుందని గూగుల్ పేర్కొంది.రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ ను జియో యూజర్లు ఉచితంగా పొందవచ్చు. గతంలో గూగుల్ జెమిని 2.5 ప్రో, తాజా నానో బనానా, వియో 3.1 మోడళ్లతో ఫొటోలు, వీడియోలను సృష్టించడంలో పరిమితులు ఉండేవి. అయితే, ఈ ప్లాన్ లో కొత్త జెమిని 3కు ఉచిత యాక్సెస్ కూడా ఉంది. దీన్ని ఎలా పొందాలో చూద్దామా..?18 నెలలపాటు ఉచితంజియో అన్ లిమిటెడ్ 5G వినియోగదారులందరూ జెమిని ప్రో ప్లాన్ ను 18 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. జెమిని ప్రో ప్లాన్‌కు సాధారణంగా రూ .35,100 ఖర్చు అవుతుంది. అంటే వినియోగదారులు ప్లాన్ లో చేర్చిన అన్ని ప్రయోజనాలను ఉచితంగా యాక్సెస్ చేయగలుగుతారు.ఈ జియో అప్ గ్రేడ్ ఆఫర్ నవంబర్ 19 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో ఈ ఆఫర్ యువ కస్టమర్లకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ జియో దీన్ని ఇప్పుడు అపరిమిత 5G వినియోగదారులందరికీ విస్తరించింది.ఆఫర్ ఎలా పొందాలంటే.. ఈ ఆఫర్ ను పొందడానికి ఫోన్ లో మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5జీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ ఉన్న జియో నంబర్ తో లాగిన్ అవ్వాలి. అప్పుడు యాప్‌లో జెమిని ప్రో ప్లాన్ ఆఫర్‌కు సంబంధించిన బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ క్లెయిమ్ నౌ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు. -
Vreels: టిక్‌టాక్ & ఇన్‌స్టాగ్రామ్‌ను దాటిపోయే కొత్త డిజిటల్ విశ్వం
డిజిటల్ ప్రపంచం ప్రతీ రోజూ మారుతోంది. నేడు మనం వీడియోల కోసం ఒక యాప్, మెసేజింగ్ కోసం మరో యాప్, షాపింగ్ కోసం ఇంకొకటి వాడుతున్నాం.ఈ మధ్యకాలంలో యూజర్లు ఒక ప్రశ్నను తరచూ అడుగుతున్నారు: “ఈ అన్నింటినీ ఒకే వేదికలో పొందలేమా?”ఇదే ప్రశ్న ఒక కొత్త ఆలోచనకు పుట్టుక ఇచ్చింది. ఆ ఆలోచనే నేడు ప్రపంచానికి అందుతున్న – వీరీల్స్ (Vreels) (www.vreels.com).అమెరికాలో ఉండే మన తెలుగువారి ఆలోచన — ప్రపంచానికి కొత్త వేదిక టెక్ ప్రపంచంలో ముందడుగు వేస్తున్న యువతెలుగువారు. అమెరికాలో ఉండి, ప్రపంచం కోసం ఒక అద్భుతమైన యాప్‌ను రూపొందించారు."సురక్షితం, అందరికీ సులభం, ప్రపంచస్థాయి ఫీచర్లతో" భారతీయ సృజనకు కొత్త రూపం ఇచ్చిన మేధస్సు ఇది. వీరి లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది — భారతీయులకు, ముఖ్యంగా క్రియేటర్లకు, యువతకు, ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీ ఇవ్వగల ఒక సరైన వేదికను అందించడం.వీరీల్స్ ఎందుకు ఇతర యాప్‌లను దాటిపోతోంది?1) వీడియోలు, చాట్, షాపింగ్ — అన్నీ ఒకే యాప్‌లో.. - మీరు రీల్స్ చేయాలంటే – Vreels - మిత్రులతో చాట్ చేయాలంటే - Vreels - ప్రోడక్ట్స్ కొనాలంటే - Vreels2) టిక్‌టాక్ & ఇన్స్టాగ్రామ్ కంటే సురక్షితం, స్పష్టత ఎక్కువ AI పెరుగుతున్న ఈ కాలంలో, యూజర్లు డేటా సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో, Vreels ప్రతి డేటాను జాగ్రత్తగా, నిబంధనలకు లోబడి, ఎన్క్రిప్షన్తో రక్షిస్తుంది. ఇక్కడ యూజర్ డేటా అమ్మకం లేదు, లీక్ భయం లేదు. మీరు చూడమంటేనే, మీ డేటా కనిపిస్తుంది.3) Capsules — ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేక ఫీచర్ Vreels లోని Capsules మీ జ్ఞాపకాలను భద్రంగా, సమయంతో తాళం వేసి ఉంచుతుంది. మీరు నిర్ణయించిన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే అవి అన్‌లాక్ అవుతాయి.4) Vreels Shop/Bid — వినోదం దగ్గరే షాపింగ్ యూజర్లు వీడియో చూస్తూ ఉండగానే ప్రోడక్ట్స్ కొనొచ్చు లేదా బిడ్ చేయొచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను నమ్మకంతో విక్రయించొచ్చు.ఇది షాపింగ్ కాదు— భారతీయ డిజిటల్ వ్యాపారానికి ఒక కొత్త దారితీసే ఫీచర్.5) క్రియేటర్ల కోసం ప్రత్యేక అవకాశాలు రిచ్ ఫీచర్లు, వేగవంతమైన పెర్ఫార్మెన్స్, పారదర్శకత — ఇవి అన్ని కలిపి క్రియేటర్లకు TikTok & Instagram కన్నా మెరుగైన వేదికను ఇస్తాయి.22 దేశాల్లో విడుదల… ఇప్పుడు App Store & Play Store లో అందుబాటులోయువ తెలుగువారి ప్రతిభతో పుట్టిన ఈ యాప్ ఇప్పటికే 22 దేశాల్లో బీటా రిలీజ్ అయి, Google Play Store మరియు Apple App Store లో అందుబాటులో ఉంది.ఇది ప్రారంభం మాత్రమే — ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు రానున్నాయి.Vreels — మీ డిజిటల్ ప్రయాణానికి కొత్త స్వరూపం మీరు క్రియేటర్ అయినా, షాపింగ్ ప్రేమికుడైనా, లేదా కొత్త ఫీచర్లు ప్రయత్నించే టెక్-ఎన్తుజియాస్ట్ అయినా — Vreels మీ కోసం. మీ అనుభవం కోసం. మీ భవిష్యత్తు కోసం.ఇప్పుడే ప్రయత్నించండి Vreels — భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comక్రింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్‌లలో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదా డౌన్లోడ్ కోసం క్రింద ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి: -
యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్‌లో కొత్త ఫీచర్లు
ఐఫోన్లు పోయినా, చోరీకి గురైనా కూడా కవరేజీ వర్తించేలా టెక్ దిగ్గజం యాపిల్ భారత్‌లో తమ యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్ పరిధిని విస్తరించింది. ఏడాదిలో రెండు ఉదంతాలకు ఇది వర్తిస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌ని అపరిమిత స్థాయిలో రిపేర్ చేయించుకునేందుకు ప్రొటెక్షన్ ప్లాన్ కింద కవరేజీ ఉంటోంది.యాపిల్‌కేర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే వార్షిక ప్రాతిపదికన ఉండగా, తాజాగా నెలవారీ ప్లాన్‌ని కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇది డివైజ్‌ని బట్టి రూ. 799 నుంచి ప్రారంభమవుతుందని వివరించింది. ఇక డివైజ్ కొనుక్కున్నప్పుడే ప్లాన్ కూడా తీసుకోవాలన్న నిబంధనను సడలిస్తూ, 60 రోజుల వరకు వ్యవధినిస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లుఐఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా కవరేజీ ఉంటుంది.ఏడాదిలో రెండు ఘటనలకు వర్తిస్తుంది.ప్రమాదవశాత్తూ దెబ్బతిన్న డివైజ్‌కి అపరిమిత రిపేర్లు అందుబాటులో ఉంటాయి.ఇప్పటి వరకు వార్షిక ప్రాతిపదికన మాత్రమే ఉండగా, ఇప్పుడు నెలవారీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.నెలవారీ ప్లాన్ ధర రూ.799 నుంచి ప్రారంభం.డివైజ్ కొనుగోలు చేసిన వెంటనే మాత్రమే కాకుండా, 60 రోజుల లోపు యాపిల్‌కేర్ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చుగమనించాల్సిన అంశాలుథెఫ్ట్ & లాస్ కవరేజీ కేవలం ఐఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.సర్వీస్ ఫీజు ఉండే అవకాశం ఉంది. (యాపిల్ సాధారణంగా రీప్లేస్మెంట్ ఫీజు వసూలు చేస్తుంది).ప్లాన్ ధర డివైజ్ మోడల్ ఆధారంగా మారుతుంది. -
డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే..
సముద్ర గర్భంలో కేబుళ్ల ద్వారా నిమిషాల వ్యవధిలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ప్రపంచం నలుమూలలా చేరవేసే శక్తిమంతమైన కేంద్రాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును.. అవే డేటా సెంటర్లు. డేటా సెంటర్లు డిజిటల్ స్టోరేజ్ కోసం ప్రాసెసింగ్ హౌస్‌లుగా పని చేస్తాయి. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పనికి (ఉదాహరణకు, గూగుల్‌లో శోధించడం, యూట్యూబ్ వీడియో చూడటం, జీమెయిల్ పంపడం, ఫొటోను క్లౌడ్‌లో సేవ్ చేయడం లేదా ఆన్లైన్ గేమ్ ఆడటం) మూల కారణం డేటా సెంటర్లే. ఈ విభాగంలో టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని భారత్‌పై కేంద్రీకరించాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి దేశంలో డేటా సెంటర్ల నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి. ఇదొకవైపు డిజిటల్ ఇండియాకు శుభపరిణామం అయినప్పటికీ, మరోవైపు దేశ ఇంధన భవిష్యత్తుకు పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే వాదనలున్నాయి.భారత్ ఎందుకు?భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్‌గా ఉంది. కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లు, పెరుగుతున్న 5జీ విస్తరణ, యూపీఐ లావాదేవీలు, ఓటీటీ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ భారీ డేటా డిమాండ్‌ను తీర్చాలంటే వినియోగదారులకు తక్కువ లేటెన్సీ అంటే వేగవంతమైన సేవలు కల్పించాలంటే డేటా సర్వర్లు భౌగోళికంగా వారికి చేరువలో ఉండాలి.భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం దేశానికి సంబంధించిన సున్నిత డేటాను దేశ సరిహద్దుల్లోనే నిల్వ చేయాలని అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశిస్తున్నాయి. ఇది ఆయా కంపెనీలకు దేశంలోనే డేటా సెంటర్లను స్థాపించేందుకు సిద్ధపడేలా చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సులభతరమైన అనుమతులు కల్పిస్తున్నాయి. భారత్‌లో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత ఇందుకు సానుకూల అంశంగా ఉంది.డేటా సెంటర్లకు ఎంత విద్యుత్ కావాలంటే..డేటా సెంటర్లకు తరచుగా భారీగా విద్యుత్ అవసరం అవుతుంది. దీనికి కారణం వాటిలో నిరంతరం 24/7 పనిచేసే వేలాది సర్వర్లు (కంప్యూటర్లు) ఉంటాయి. డేటాను ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, బదిలీ చేయడం వంటి నిరంతర కార్యకలాపాల కోసం ప్రతి సర్వర్‌కు గణనీయమైన విద్యుత్ అవసరం అవుతుంది. ఈ ప్రక్రియలో సర్వర్లన్నీ అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. వేడి పెరిగితే సర్వర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, సర్వర్లను సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచడానికి భారీ స్థాయిలో కూలింగ్ వ్యవస్థలు పనిచేయాలి. నివేదికల ప్రకారం, ఒక డేటా సెంటర్లోని మొత్తం విద్యుత్ వినియోగంలో సుమారు 40% వరకు కేవలం కూలింగ్ కోసమే ఖర్చు అవుతుంది.ఉష్ణోగ్రత నియంత్రణ ఎలా?సర్వర్లలో ఉత్పత్తి అయ్యే అధిక వేడిని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ రూమ్ ఎయిర్ కండిషనింగ్/హ్యాండ్లర్ యూనిట్లను ఉపయోగించి సర్వర్ల చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తారు. ఇది అత్యంత సాధారణ పద్ధతి.నీటిని ఆవిరి చేసి దాని ద్వారా ఉత్పత్తయ్యే చల్లదనాన్ని ఉపయోగించి వేడి గాలిని చల్లబరచడం ఇంకోపద్ధతి. వేడి వాతావరణం ఉన్న భారత్ వంటి దేశాలకు ఇది మెరుగైన మార్గం అవుతుంది.లిక్విడ్ కూలింగ్ అనేది ఆధునిక పద్ధతి. సర్వర్ చిప్‌లకు నేరుగా ప్రత్యేకమైన ద్రవాలను పంపడం ద్వారా వేడిని తొలగిస్తారు. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. చాలా కంపెనీలు డేటా సెంటర్ల నుంచి వచ్చే వేడి నీటిని సమీపంలోని పారిశ్రామిక అవసరాలకు మళ్లిస్తున్నారు.ఇంధన సవాళ్లు..భారతదేశం 2070 నాటికి ‘నికర-శూన్య కర్బన ఉద్గారాల (Net-Zero Emissions)’ లక్ష్యాన్ని సాధించాలని, 2030 నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50% పునరుత్పాదక వనరుల నుంచి దీన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌లో ప్రస్తుతం అధిక విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన ఆధారం థర్మల్ విద్యుత్ (బొగ్గు). డేటా సెంటర్ల కోసం విపరీతంగా పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం మళ్లీ థర్మల్ విద్యుత్‌పై ఆధారపడాల్సి వస్తే అది మన పునరుత్పాదక లక్ష్యాలను దెబ్బతీస్తుంది. కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.భారత్ ఎంచుకోవాల్సిన పంథా..ఈ సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక సమగ్రమైన, పర్యావరణ అనుకూల విధానాన్ని అనుసరించాలి. భారత ప్రభుత్వం ‘గ్రీన్ డేటా సెంటర్’ విధానాన్ని ప్రవేశపెట్టాలి. డేటా సెంటర్ ఆపరేటర్లు తమకు అవసరమైన విద్యుత్‌లో కనీసం 60% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి పొందాలని (ఉదాహరణకు, సోలార్ లేదా విండ్ పవర్ ప్లాంట్లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్) తప్పనిసరి చేయాలి. విద్యుత్ వినియోగ సమర్థత (Power Usage Effectiveness) వంటి పారామితుల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.లిక్విడ్ కూలింగ్, నేచురల్ ఎయిర్ కూలింగ్ (చల్లని ప్రాంతాల్లో) వంటి అత్యంత సమర్థవంతమైన కూలింగ్ సాంకేతికతలను ఉపయోగించే డేటా సెంటర్లకు అధిక రాయితీలు ఇవ్వాలి. విద్యుత్‌ను వృథా చేసే వ్యవస్థలకు బదులుగా ఆధునిక, పర్యావరణ అనుకూల యంత్రాలను ఉపయోగిస్తే కొన్ని రాయితీలు పరిశీలించవచ్చు. సౌర, పవన విద్యుత్ నిరంతరంగా లభించదు. కాబట్టి, ఈ విద్యుత్‌ను నిల్వ చేయడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి సాంకేతికతలపై పెట్టుబడులు పెంచాలి. ఇది డేటా సెంటర్లకు నిరంతరాయంగా పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
చాట్‌జీపీటీ డౌన్ అయితే పరిస్థితేంటి?
ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల్లో కీలక పాత్ర పోషించే క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare)లో ఇటీవల తలెత్తిన సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విస్తృతంగా అంతర్గత సర్వర్ లోపాలు (Internal Server Errors) ఏర్పడటానికి ఇది దారితీసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన ప్లాట్‌ఫామ్‌ల సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. యూఎస్, యూరప్, ఆసియాలో ఈ అంతరాయం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ అంతరాయం కారణంగా X (గతంలో ట్విట్టర్), స్పాటిఫై.. వంటి కీలక సేవలతో పాటు OpenAI ChatGPT సేవలు కూడా కొద్ది సమయం నిలిచిపోయాయి.క్లౌడ్‌ఫ్లేర్ సమస్య కారణంగా ChatGPTని సందర్శించిన వినియోగదారులకు ‘దయచేసి ముందుకు సాగడానికి challenges.cloudflare.com అన్‌బ్లాక్ చేయండి’ అనే సందేశం దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో జనరేటివ్ ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న చాట్‌జీపీటీ(క్లాడ్‌ఫ్లెయిర్ ఇన్ఫ్రా వాడుతుంది) సర్వీసులు మధ్యంతరంగా నిలిచిపోతే పనులు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయాలు చూద్దాం.గూగుల్ జెమినిగూగుల్ జెమిని అధునాతన మోడల్స్‌తో రూపొందించారు. గూగుల్ సెర్చ్‌కు రియల్ టైమ్ కనెక్షన్ కలిగి ఉంది. దీని కారణంగా ఇది ఎల్లప్పుడూ అప్డేటెడ్, రియల్‌టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది జీమెయిల్, డాక్స్, డ్రైవ్ వంటి గూగుల్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది.ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐక్లాడ్ ఏఐ సెక్యూరిటీ, కచ్చితత్వం, నైతిక ఏఐ మోడల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఇది long context documents నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంది.మైక్రోసాఫ్ట్ కోపైలట్మైక్రోసాఫ్ట్ కోపైలట్ అంతర్లీనంగా చాట్‌జీపీటీలాగే అదే జనరేటివ్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ 365 ఎకోసిస్టమ్‌లో(Word, Excel, PowerPoint, Outlook) ఇంటర్నల్‌గా ఉండే ఏఐ అసిస్టెంట్. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫ్లోలో ఉన్నవారు కార్పొరేట్ పత్రాలను రూపొందించడానికి, డేటాను విశ్లేషించడానికి ఇది అనువైనది.జాస్పర్ ఏఐజాస్పర్ ఏఐ ప్రొఫెషనల్ కంటెంట్ రూపొందించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది బ్లాగ్లు, కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, మార్కెటింగ్ కాపీలు అందిస్తుంది. మార్కెటర్లు, బ్లాగర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
ఏఐతో టాప్: గూగుల్ ప్లేలో బెస్ట్ యాప్‌లు ఇవే..
టెక్నాలజీ పెరిగి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక అన్నీ సులభమైపోయాయి. ప్రతి అంశానికీ, పనికీ పదుల సంఖ్యలో మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి. ఇలా వేలకొద్దీ యాప్‌లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ అయిన గూగుల్ ప్లే 2025 ఏడాదికిగానూ ఉత్తమ యాప్‌లను ప్రకటించింది.గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో 2025లో అందుబాటులో ఉన్న యాప్‌లలో గేమ్స్, పర్సనల్ గ్రోత్, ఎవ్రీడే ఎషన్షియల్.. ఇలా ఒక్కో అంశానికీ కొన్ని ఉత్తమ యాప్‌లను పేర్కొంటూ జాబితాను విడుదల చేసింది. వీటిలో ఏఐ అనుసంధానిత యాప్‌లదే పైచేయి. ఉదాహరణకు ఓవరాల్ బెస్ట్ యాప్‌గా జొమాటోకు చెందిన సోషల్ యుటిలిటీ యాప్ ‘డిస్ట్రిక్ట్’ నిలిచింది. ఇది ఏఐని వినియోగించి వినియోగదారుల అభిరుచులను విశ్లేషించి డైనింగ్‌తో పాటు ఈవెంట్లు, సినిమా టికెట్ల బుకింగ్ వంటి సోషల్ యుటిలిటీ సేవలు రియల్ టైమ్ సమాచారంతో అందిస్తోంది.ఇక పర్సనల్ గ్రోత్ విభాగంలో ‘ఇన్వీడియో ఏఐ’ అత్యుత్తమ యాప్‌గా నిలిచింది. దీంతో టెక్ట్స్ రూపంలో ప్రాంప్ట్ ఇచ్చి నేరుగా మంచి మంచి వీడియోలు రూపొందించవచ్చు.బెస్ట్ హిడెన్ జెమ్‌గా టూన్‌సూత్ర అనే యాప్‌ను గూగుల్ ప్లే పేర్కొంది. ఇది ఏఐ-ఆధారిత సినిమాటిక్ మోడ్ ను ఉపయోగించి భారతీయ ప్రసిద్ధ కథలను డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆసక్తికరంగా మారుస్తుంది.ఫోటో ఎడిటింగ్, నోట్స్ రూపొందించడం వంటి వాటిలో సాయమందించే గుడ్ నోట్స్, లుమినార్ యాప్‌లు ఉత్పాదకత విభాగంలో ఉత్తమంగా నిలిచాయి. ఇవి ఏఐ ఫీచర్లతో ఫొటో ఎడిటింగ్, నోట్స్ టేకింగ్‌ను సులభతరం చేస్తున్నాయి.వ్యక్తగత ఆరోగ్య సంరక్షణ, జీవనశైలికి సంబంధించిన అంశాల్లోనూ కొన్ని యాప్‌లు ఏఐ వినియోగాన్ని విస్తరిస్తున్నాయి. అలాంటివాటిలో ఉత్తమమైనవే డైలీప్లానర్, స్లీపిసోల్బయో యాప్‌లు.ఇక గేమింగ్ విషయానికి వస్తే లెక్కలేనన్నీ ఆండ్రాయిడ్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఏఐ ఫీచర్లతో లోకల్ ఫ్లేవర్ జోడించిన యాప్‌లకు మంచి ఆదరణ ఉంటోంది. అలాంటి యాప్‌లే కుకీరన్ ఇండియా, కమలా, రియల్ క్రికెట్ స్వప్ వంటివి.గూగుల్ కొత్తగా టాప్ ట్రెండింగ్ కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్‌స్టామార్ట్, సీఖో, అడోబ్ ఫైర్ ఫ్లై వంటి యాప్‌లు బెస్ట్‌గా నిలిచాయి.ఆవిష్కరణ, నాణ్యత, యూజర్ ఇంపాక్ట్, సాంస్కృతిక ఔచిత్యం, ఏఐ-ఆధారిత ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఈ బెస్ట్ యాప్‌లను గూగుల్ ప్లే ఎంపిక చేసింది. రోజువారీ ఉపయోగం, స్థానికతను జోడించడం, వివిధ రకాల ఫోన్లు, డివైజ్‌లలో వినియోగించగల వెసులుబాటు ఉన్న యాప్‌లను హైలైట్ చేసింది. వాస్తవానికి, 69 శాతం మంది భారతీయ యూజర్లు ఏఐతో తమ మొదటి ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ యాప్‌ల ద్వారానే పొందుతున్నారని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. -
ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది. కాగా ఇప్పుడు ఇండియా ఇన్నోవేటర్స్ అసోసియేషన్ ద్వారా 2025లో టాప్ 100 ఇండియన్ ఇన్నోవేషన్లలో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని నవంబర్ 13న గోవాలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెన్షన్ ఎక్స్పో (INEX India)లో ప్రకటించారు.సాధారణంగా నీరు నిల్వ ఉండే చోట.. నీటి మొక్కలు పుడతాయి. వీటి సంఖ్య ఎక్కువై.. జలాశయాలను మొత్తం ఆవరించినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఇక్రిశాట్ ఈ వాటర్ హైసింత్ హార్వెస్టర్ రూపొందించింది. వాటర్ హైసింత్ (ఒక రకమైన నీటిలో తేలియాడే మొక్కలు) జలమార్గాలకు ఆటంకాలను కలిగిస్తాయి. ఇవి జలచరాలకు సైతం ఊపిరాడకుండా.. నీటి నాణ్యతను కూడా దిగజారుస్తాయి. ఈ సమస్యలను వాటర్ హైసింత్ హార్వెస్టర్ పరిష్కరిస్తుంది.వాటర్ హైసింత్ హార్వెస్టర్ పనిచేయడానికి కేవలం సూర్యరశ్మి సరిపోతుంది. ఎందుకంటే.. ఇది సోలార్ ప్యానెల్స్ పొందుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా కలుపును తొలగించవచ్చు. మొత్తం మీద ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా ఉపయోగపడుతుందని ఇక్రిశాట్ వెల్లడించింది. -
X సేవల్లో అంతరాయం.. కారణం ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.క్లౌడ్‌ఫ్లేర్ సేవలను ఉపయోగించే వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు "క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్‌లో అంతర్గత సర్వర్ లోపం, దయచేసి కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించండి" అనే సందేశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యను వేలమంది యూజర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెళ్లదీస్తున్నారని డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది. ఈ సమస్యపై కంపెనీ స్పందించలేదు.డౌన్‌డిటెక్టర్ ప్రకారం ఈ సమస్య భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటలకు మొదలైంది. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్ అవ్వడం వల్ల కేవలం ఎక్స్ మాత్రమే కాకుండా.. ఓపెన్ ఏఐ సంస్థల సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే పనిలో మా బృందం నిమగ్నమై ఉందని.. క్లౌడ్‌ఫ్లేర్ టీమ్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు -
సైయెంట్ సెమీకండక్టర్స్.. ఇంటెలిజెంట్ ఎస్వోసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి ఇంటెలిజెంట్ పవర్ చిప్ ప్లాట్‌ఫాం, సిస్టమ్ ఆన్ ఎ చిప్ (ఎస్వోసీ) అయిన ‘అర్క జీకేటీ–1’ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఆవిష్కరించారు. సైయెంట్ సెమీకండక్టర్స్, అజిముత్ ఏఐ కలిసి దీన్ని రూపొందించాయి. సెమీకండక్టర్ల డిజైన్, టెక్ ఆవిష్కరణలకు హబ్‌గా ఎదగాలనే లక్ష్య సాధన దిశగా ఇదొక కీలక మైలురాయని వైష్ణవ్ తెలిపారు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ టెక్నాలజీలను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడంలో భారత్ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. మలీ్ట–కోర్ కస్టమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ అనలాగ్ సెన్సింగ్, మెమొరీ, ఇంటెలిజెంట్ పవర్ మేనేజ్మెంట్ మొదలైన వాటన్నింటిని సమగ్రపర్చి, విద్యుత్ ఆదా చేసే ఎస్‌వోసీగా దీన్ని రూపొందించినట్లు సైయెంట్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. ఇది అత్యధిక వృద్ధి అవకాశాలున్న స్మార్ట్ యుటిలిటీలు, అధునాతన మీటరింగ్, బ్యాటరీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ తదితర విభాగాల్లో ఉపయోగపడుతుందని అజిముత్ ఏఐ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వై తెలిపారు. -
కోటి రూపాయలు జీతం ఇస్తామన్నా చేసేవారు లేరు..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాలను కబళిస్తుందనే భయాలు పెరుగుతున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగులు పోతాయని భయపడుతున్న వైట్‌కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో(Skilled Trades) పని చేస్తున్న వారిపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆనంద్ మహీంద్రా అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఏఐ వల్ల వైట్‌కాలర్ (సాఫ్ట్వేర్, డేటా ఎంట్రీ వంటి డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగులకు భారీగా లేఆఫ్స్ ఉంటాయని భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కొన్ని అంశాలను పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా మనం డెస్క్ ఉద్యోగాలను ఉన్నత స్థానాల్లో ఉంచాం. అదే సమయంలో నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలను ఎక్కువగా ఎదగనివ్వలేదు. అయితే ఏఐకి భర్తీ చేయడం సాధ్యం కాని ఉద్యోగాలు ఇవే అని గుర్తుంచుకోవాలి. ఈ ఉద్యోగాలకు నైపుణ్యం చాలా అవసరం. రియల్‌టైమ్ అనుభవం ముఖ్యం. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, ట్రక్కు డ్రైవర్లు వంటి నైపుణ్యం గల కార్మికులను ఏఐ భర్తీ చేయలేదు’ అని చెప్పారు.అమెరికాలో ఉద్యోగాల కొరతమహీంద్రా హెచ్చరికలకు బలం చేకూర్చేలా ఫోర్డ్ మోటార్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లే కూడా ఇదే తరహా ప్రతిభ కొరతను ఎత్తి చూపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఫార్లే మాట్లాడుతూ.. ఫోర్డ్లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంవత్సరానికి 1,20,000 డాలర్లు (సుమారు కోటి రూపాయలు) వరకు చెల్లిస్తున్నప్పటికీ, వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభించడం లేదని ఆయన తెలిపారు.We’re so busy fearing AI will wipe out white-collar jobs that we’re missing a far bigger crisis: the scarcity of skilled trades.Ford CEO @jimfarley98 made a startling revelation in a recent podcast: Ford has 5,000 mechanic jobs unfilled, many paying $120,000 a year, and still…— anand mahindra (@anandmahindra) November 17, 2025భారీ ఆర్థిక నష్టంఈ సంక్షోభం ఫోర్డ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అమెరికా అంతటా ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ట్రక్కు డ్రైవింగ్, ఫ్యాక్టరీ ఆపరేషన్లతో సహా కీలకమైన రంగాలలో 10 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డెలాయిట్, ది మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం 2030 నాటికి యూఎస్‌లో తయారీ రంగంలోనే 21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. దీని కారణంగా కలిగే మొత్తం ఆర్థిక నష్టం అప్పటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్.. -
రూ.251 రీఛార్జ్ ప్లాన్: 100జీబీ హైస్పీడ్ డేటా
ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ఓ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.దేశంలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంలో భాగంగా ఈ ప్లాన్ ప్రవేశపెట్టడం జరిగిందని.. బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ. రాబర్ట్ జే. రవి పేర్కొన్నారు. కంపెనీ ఇటీవల దేశవ్యాప్తంగా 'మేక్ ఇన్ ఇండియా' అత్యాధునిక 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను విస్తరించిందని అన్నారు. కేవలం 251 రూపాయలకే 100 జీబీ డేటా అందిస్తున్న ఘనత బీఎస్ఎన్ఎల్ సొంతమని అన్నారు.Study, Stream, Succeed with #BSNL !Get BSNL’s Student Special Plan @ ₹251 with Unlimited Calls, 100GB Data & 100 SMS/Day. Offer valid till 14 Dec, 2025. #BSNLLearnersPlan #DigitalIndia #ConnectingBharat pic.twitter.com/GNb3PclKGu— BSNL India (@BSNLCorporate) November 15, 2025 -
జియో కొత్త రీచార్జ్.. 200 రోజుల చౌక ప్లాన్
టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్ప్లాన్ను ప్రవేశపెట్టింది.మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్‌ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.ప్లాన్ ప్రయోజనాలుజియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది. -
ట్రాన్స్‌లేటర్ పెన్.. జేబులోనే థియేటర్!
ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!జేబులోనే థియేటర్!సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్‌లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్‌లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!ఖుషీ ఖుషీగా.. కుషన్! లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్‌తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే! -
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భారత సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికులకు అండగా ఇండియన్ ఆర్మీ మోనోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ సిస్టమ్ ద్వారా గజరాజ్ కార్ప్స్(భారత సైన్యానికి చెందిన ఎత్తయిన ప్రాంతం)లోని సైనికులకు సర్వీసు అందిస్తున్నారు.కఠినమైన వాతావరణంలో..సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో కమెంగ్ హిమాలయాల్లో ఈ మోనోరైలును ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రాంతంలోని శిఖరాలు, అనూహ్య వాతావరణం, హిమపాతం కారణంగా సరఫరా మార్గాల్లో తరచుగా అంతరాయాలు ఏర్పడేవి. దాంతో సైనికులకు ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను పరిష్కరించేలా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.గతంలో ఆహార రవాణా ఎలా జరిగేది?కొత్త మోనోరైల్ వ్యవస్థ రాకముందు కొండలపై ఉన్న సైనికులకు ఆహారం, ఇతర సామగ్రిని అందించడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. చాలా సందర్భాల్లో సైనికులు లేదా స్థానిక కూలీలు తమ వీపులపై భారీ సంచులను మోసుకుని మంచుకొండలపై నడుస్తూ ప్రయాణించేవారు. ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల రవాణా కష్టం అయ్యేది. అత్యంత కీలకమైన సామగ్రిని మాత్రమే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరడం అసాధ్యం అవుతుంది. View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian)మోనోరైల్ వ్యవస్థగజరాజ్ కార్ప్స్కు ఈ మోనోరైలు అవసరాన్ని గుర్తించి పరిష్కారాన్ని రూపొందించారు. ఈ రైలు 300 కిలోల బరువును మోయగలదు. మందుగుండు సామగ్రి, రేషన్ (ఆహారం), ఇంధనం, ఇంజినీరింగ్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రి నిరంతరాయంగా, సురక్షితంగా మారుమూల పోస్టులకు చేరవేస్తున్నారు. దీన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా పనిచేయడానికి తయారు చేశారు. వడగండ్లు, తుపానులు వంటి వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని ఇది పనిచేయగలదు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలు వినియోగదారులను పెంచుకునేందుకు విభిన్న విభాగాల్లో ఏఐ టూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చాలా టూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటున్న కొన్ని ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ టూల్స్‌లోని కొన్ని సదుపాయాలు ఉచితంగా లభిస్తుంటే మరిన్ని ఫీచర్ల కోసం ఆయా సంస్థల నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.కర్సర్ ఏఐకర్సర్ ఏఐ విజువల్ స్టూడియో కోడ్ (VS Code) ఆధారంగా పనిచేసే ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్.కోడ్ రాయడం, డీబగ్గింగ్, రీఫాక్టరింగ్, నేచురల్ ల్యాంగ్వేజీ ఇన్పుట్స్ నుంచి కోడ్ రూపొందించడంలో సహాయపడుతుంది.ప్రత్యేకంగా డెవలపర్లకు కోపైలట్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.ఉచిత ప్లాన్‌తో ప్రారంభించి అవసరాలకు తగ్గట్టు అప్‌గ్రేడ్ చేయవచ్చు.మిడ్ జర్నీ (Midjourney)నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాంప్ట్‌లతో ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించవచ్చు.డిఫ్యూజన్ మోడల్ ఆధారంగా పనిచేసే ఈ టూల్ సృజనాత్మక ఆర్ట్, విజువల్స్, కాన్సెప్ట్ ఆర్ట్‌కి అనువైంది.డిస్క్రిప్ట్ఏఐ ఆధారిత ఆడియో, వీడియో ఎడిటింగ్ టూల్.టెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఆధారంగా మీడియా ఎడిటింగ్ చేయగలదు. ఇది వీడియో, పోడ్కాస్ట్ సృష్టికర్తల కోసం ఎంతో ఉపయోగపడుతుంది.ఏఐ కో-ఎడిటర్ ఆడియో నాణ్యత పెంచుతుంది. బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని తొలగిస్తుంది.క్లాడ్ ఏఐ (Anthropic)రైటింగ్, కోడింగ్, టెక్ట్స్ సమ్మరైజింగ్, డేటా విశ్లేషణలో సహాయం చేస్తుంది.వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంటుంది.రన్ వే ఎంఎల్వీడియో, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం ఏఐ ప్లాట్‌ఫామ్.ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో సాధ్యం అవుతుంది.పర్ప్లెక్సిటీ ఏఐఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్.వాయిస్ సెర్చ్, టాపిక్ డిస్కవరీ, ప్రాజెక్ట్ నిర్వహణకు సాయం చేస్తుంది.ఫ్లికి ఏఐటెక్స్ట్ వాయిస్ఓవర్ వీడియో ప్లాట్‌ఫామ్.మార్కెటింగ్, ఇన్స్టిట్యూషనల్ వీడియోల కోసం ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు -
కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు
భారత్‌లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్ కోసం వాలువోక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్‌ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ విడుదలైంది.ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్ మెంటారింగ్ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్ (కెరీర్లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్‌షైనింగ్ (జాబ్ టాస్క్‌ల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్ నోమడిజమ్ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులను ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. వృద్ధికే ప్రాధాన్యం.. వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు. -
వాడే నాకు కరెక్ట్ : చాట్‌జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్‌జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్‌కాస్టింగ్‌తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్‌జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్‌ని క్లాస్‌గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్‌కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్‌లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్‌లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్' -
రూల్స్ మార్చరూ.. ట్రాయ్‌కు జియో విన్నపం
5జీ సాంకేతికత రాకతో అంతర్జాతీయంగా మార్కెట్లలో మార్పులు, టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను సడలించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని రిలయన్స్ జియో కోరింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణతో, గేమింగ్ కోసం తక్కువ లేటెన్సీ ఉండే విధంగా, అప్లోడ్స్ కోసం వేగం ఎక్కువగా ఉండేలా వివిధ అవసరాలకు తగ్గ వేగంతో ఇంటర్నెట్ లభ్యత ఉండేలా ప్రోడక్టులను రూపొందించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని వివరించింది.బ్రిటన్ నియంత్రణ సంస్థ ఆఫ్కామ్ కూడా ప్రత్యేక సర్వీసులు, ప్రీమియం నాణ్యత గల ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు అనుమతిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా కఠినతరమైన నిబంధనలను సడలించాలని కోరింది. జియో, ఎయిర్‌టెల్‌లాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏ ఒక్క యాప్, వెబ్సైట్ లేదా సర్వీసులపై పక్షపాతం చూపకుండా అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తూ, ఒకే రకమైన వేగంతో అందించాలని నెట్ న్యూట్రాలిటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.అంతేకాక, నెట్ న్యూట్రాలిటీపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో 5జీ, ఎడ్జ్ కంప్యూటింగ్, ఐఓటీ వంటి ఆధునిక సాంకేతికతల వల్ల ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరింత క్లిష్టమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న డేటా వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలంటే నెట్‌వర్క్‌లలో ‘క్వాలిటీ ఆఫ్ సర్వీస్’ (QoS) ఆధారంగా ప్రాధాన్యత కేటాయించే అవకాశాలు పరిశీలించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో, వినియోగదారుల ప్రాథమిక హక్కులు, ఏ యాప్‌కైనా సమాన యాక్సెస్ లభించాలనే సూత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు. -
కలల జాబ్ కనీసం నెల కూడా చేయలేదు..
ఉద్యోగం రావడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో దిగ్గజ కంపెనీలలో జాబ్ దక్కించుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. చదువు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన ఉద్యోగం రానివారు చాలా మందే ఉన్నారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ యువతి వేగంగా కెరియర్ వేగాన్ని చూస్తే ఆశ్చర్యంతో అభినందించాల్సిందే.ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో జాబ్ ఎందరికో కలల ఉద్యోగం. అంతటి ఘనమైన ఉద్యోగాన్ని దక్కించుకున్న యువ టెకీ.. ఒక్క నెల కూడా గడవకముందే వద్దుపో.. అని వదిలేసింది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత మైలురాళ్లు, ప్రస్థానాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు పరిపాటి. అలాగే అనుష్క శర్మ కూడా తన కెరియర్ గమనాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో షేర్ చేశారు.బెంగళూరుకు చెందిన అనుష్క శర్మ 20 ఏళ్ల వయసులో ఓ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ జాబ్‌తో తన కెరియర్ను ప్రారంభించారు. తర్వాత మూడేళ్లకు అది మానేసి మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం 24 ఏళ్లకు అమెజాన్‌లో అంతర్జాతీయ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఏడాదే ఎంబీఏ చేసిన ఆమె 26 ఏళ్ల వయసులో ప్రఖ్యాత గూగుల్‌లో మంచి జాబ్ దక్కించుకున్నారు. కానీ చేరి నెల రోజులు కూడా గడవకుండానే దాన్ని వదిలేశారు. అనంతరం వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కారు. పెళ్లి చేసుకుని 27 ఏళ్లకే సొంతంగా కంపెనీ పెట్టేశారు. ఆమె కంపెనీ పేరు ‘డ్రింక్క్వెంజీ’. ఇదో ప్రోబయోటిక్ సోడా కంపెనీ.అనుష్క శర్మకు పోస్ట్‌కు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. విజయవంతమైన ఆమె కెరియర్ గమనాన్ని నెటిజనులు అభినందించకుండా ఉండలేకపోయారు. ‘మీ అనుభవానికే సంబంధం లేని సోడా కంపెనీని ఎలా ప్రారంభించారు?’ అంటూ ఓ యూజర్ ఆశ్చర్యపోయారు. ‘ గూగుల్ జాబ్‌ను ఎందుకు విడిచిపెట్టారు?’ అని మరో యూజర్ ఆతృతగా ప్రశ్నించగా దానికామె వ్యక్తిగత కారణాలు అని బదులిచ్చారు.ఇదీ చదవండి: నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్ అంబానీ వరాలుఇక అనుష్క శర్మ విద్యార్హతల విషయానికి వస్తే.. ఆమె లింక్డ్ఇన్ బయో ప్రకారం.. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనుష్క శర్మ ఆ తర్వాత ఈఎస్సీపీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.20 -started my investment banking job, lowkey enjoyed itt soo much 23- went for masters24 - got my first international job and my first FAANG job at Amazon25- finished mba 26 - joined google and quit google in less than a month 27 - got married to the love of my life ,… https://t.co/AsRVaAOkJK— Anushka Sharma (@Anushka257) November 12, 2025 -
ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం
భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లో ఒకటైన ఫోన్ పే జనరేటివ్ ఏఐ (Generative AI) కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోన్ పే తన వినియోగదారుల కోసం చాట్ జీపీటీ ఫీచర్లను యాప్‌లో ఏకీకృతం చేయనుంది. ఫోన్ పే ప్లాట్ఫామ్లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.ఈ భాగస్వామ్యం ద్వారా చాట్ జీపీటీ అత్యాధునిక సామర్థ్యాలను నేరుగా ఫోన్ పే యాప్, ఫోన్ పే ఫర్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేయడం నుంచి షాపింగ్ చేయడం వరకు అనేక రోజువారీ అవసరాలపై ఏఐ సహాయంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ..‘వినూత్న కంపెనీల మధ్య సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. పర్సనలైజ్డ్ సిఫార్సుల నుంచి ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వరకు ఫోన్ పే పర్యావరణ వ్యవస్థలో చాట్ జీపీటీని ఏకీకృతం చేయడం ద్వారా యూజర్లు మెరుగైన డిజిటల్ సర్వీసులు పొందవచ్చు’ అని చెప్పారు.మోసాల నివారణకు ఫోన్ పే ప్రొటెక్ట్మరోవైపు, మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఫోన్ పే ఇటీవల ఫోన్ పే ప్రొటెక్ట్ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ టూల్ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) డేటాను ఉపయోగించి పనిచేస్తుంది. దీని ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఫీచర్ ద్వారా DoT ప్రమాదకరమైనవిగా గుర్తించిన ఫోన్ నంబర్లకు చెల్లింపులను గుర్తించి నిరోధిస్తుంది.హై రిస్క్‌గా లేబుల్ చేసిన నంబర్లకు చెల్లింపులను ఫోన్ పే స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. స్క్రీన్‌పై హెచ్చరిక సందేశాన్ని చూపుతుంది. మీడియం రిస్క్ నంబర్ల కోసం లావాదేవీని అనుమతించడానికి ముందు వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది. భద్రతా కారణాల వల్ల లావాదేవీని ఎందుకు నిరోధించారో ఫోన్ పే ప్రొటెక్ట్ వినియోగదారులకు స్పష్టంగా వివరాలు అందిస్తుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు -
డీ2డీ సర్వీసులకు మార్గం సుగమం
దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు టెలికాం కనెక్టివిటీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నారు. డైరెక్ట్-టు-డివైస్ (D2D) శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌పై సిఫార్సులు కోరడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను సంప్రదించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిఫార్సులు అమలులోకి వస్తే ఉపగ్రహాలతో అంతరాయం లేకుండా మొబైల్ కనెక్టివిటీని అందించే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం D2D శాట్‌కామ్ సేవలను అనుమతించడానికి భారతదేశంలో ఎటువంటి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేదు. అయితే యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే ఉపగ్రహ నెట్‌వర్క్‌లతో మొబైల్ కవరేజీని అనుసంధానించడానికి నియమాలను అవలంబిస్తున్నాయి. ఉదాహరణకు, యూఎస్‌లో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ టి-మొబైల్ (T-Mobile)తో భాగస్వామ్యం కుదుర్చుకుని సెల్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందిస్తున్నారు. ఇది ఫోన్లను నేరుగా ఉపగ్రహాలతో కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తోంది. త్వరలో భారత్‌లోనూ ఈ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది.భారతీయ టెల్కోల ఆందోళనభారతీయ టెలికాం సంస్థలు (టెల్కోలు) చాలా కాలంగా D2D సేవలను తమ వ్యాపార నమూనాలకు ముప్పుగా చూస్తున్నాయి. వినియోగదారులకు నేరుగా ఉపగ్రహ ఆపరేటర్లు కనెక్టివిటీని అందించే క్రమంలో వారు సాధారణ టెలికాం సంస్థల మాదిరిగానే నియంత్రణ బాధ్యతలకు లోబడి ఉండాలని వాదిస్తున్నారు. ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి డాట్ టెలికాం సంస్థలు, శాటిలైట్ సంస్థలు, ఇతర నిపుణులతో ట్రాయ్ నేతృత్వంలో సంప్రదింపులు జరపాలని చూస్తోంది.ఈ సంప్రదింపుల్లో D2D సేవలకు అనువైన అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) బ్యాండ్లను గుర్తించనున్నారు. శాటిలైట్ ఆపరేటర్లు, టెలికాం సంస్థల మధ్య సమాన అవకాశాలు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాయ్ అధికారికంగా సిఫార్సులను కోరే ముందు D2D సేవల సాంకేతిక, వాణిజ్య అంశాలను బాగా అర్థం చేసుకోవడానికి DoT ఇప్పటికే కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
రెండేళ్లలో బ్యాంకింగ్ ఆధునీకరణ పూర్తి
అనుబంధ సంస్థ ఎస్బీఐ పేమెంట్స్ సర్వీసెస్‌తో పాటు తమ కోర్–బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల ఆధునీకరణ ప్రక్రియను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం నాలుగు రకాల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు బ్యాంక్ ఎండీ (కార్పొరేట్ బ్యాంకింగ్, సబ్సిడరీస్) అశ్విని కుమార్ తివారీ తెలిపారు.హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం, యూనిక్స్ నుంచి లినక్స్‌కి మారడం, మైక్రోసర్వీసులను ప్రవేశపెట్టడం మొదలైనవి వీటిలో ఉన్నట్లు సింగపూర్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. డేటా భద్రత, నియంత్రణ సంస్థ నిర్దేశిత నిబంధనలను పాటిస్తూనే కార్యకలాపాల విస్తరణకు ఉపయోగపడేలా ప్రైవేట్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తివారీ వివరించారు. సిస్టమ్‌లు అన్ని వేళలా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూసుకుంటూనే వాటిని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు.ఫిన్‌టెక్ వ్యవస్థతో పోటీపడటం కాకుండా వాటితో కలిసి పని చేసే విధానానికి మళ్లుతున్నట్లు వివరించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా శాండ్బాక్స్, ఇన్నోవేషన్ హబ్‌లను ఎస్బీఐ ఏర్పాటు చేసినట్లు తివారీ చెప్పారు. ఫిన్‌టెక్‌లు తమ సొల్యూషన్స్‌ను టెస్ట్ చేసి, ఎస్బీఐ సిస్టమ్‌లకు అనుసంధానించేందుకు వీలుగా 300 పైగా ఏపీఐలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
ఆపిల్ కొత్త ప్రొడక్ట్.. నోరెళ్లబెడుతున్న జనం!
ఆపిల్ ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు ఆపిల్ స్టోర్ల ముందు జనాలు క్యూ కడుతుంటారు. ఐఫోన్లతో పాటు ఆపిల్ స్మార్ట్ వాచీలు, ఇయర్ బడ్స్ లాంటి వాటికి కూడా వినియోగదారుల్లో క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఆపిల్ సంస్థ విడుదల చేసిన యాక్సెసరీపై మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దాని ధర చూసి నోరెళ్లబెడుతున్నారు.ఐఫోన్ పాకెట్ (iPhone Pocket) అనే కొత్త, హై-ఫ్యాషన్ క్లాత్ యాక్సెసరీని ఆపిల్ సంస్థ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జపనీస్ ఫ్యాషన్ డిజైనర్ ఇస్సే మియాకే దీన్ని రూపొందించారు. చూడటానికి షూ సాక్స్ మాదిరిగా ఉన్న ఉంది ఈ పాకెట్. ఐఫోన్, ఇతర పరికరాలను ఇందులో వేసుకుని తగిలించుకునేలా దీన్ని తయారు చేశారు. ఫోన్‌తో పాటు ఇతర వస్తువులను సులువులుగా క్యారీ చేసేందుకు దీన్ని రూపొందించినట్టు టెక్ దిగ్గజం వెల్లడించింది. దీని ధర రూ. 20,379 ($229.95) గా నిర్ణయించింది.నెటిజనుల సెటైర్లు ఐఫోన్ పాకెట్‌పై సోషల్ మీడియాలో నెటిజనులు సెటైర్లు పేలస్తున్నారు. ఇంత ధర పెట్టి ఈ గుడ్డ సంచిని ఎవరు కొంటారని కామెంట్స్ చేస్తున్నారు. ''టెక్ దిగ్గజ కంపెనీలు AI మోడళ్లను తయారు చేస్తుంటే, ఆపిల్ సాక్స్‌తో ఆడుకుంటోంది. @Appleలో ఏమి జరుగుతోంది?'' అని ఓ నెటిజన్ వాపోయాడు. ఐఫోన్ పాకెట్‌ను చూస్తే.. పేరడీలా ఉందని మరొకరు అన్నారు.తాము ఎలాంటి ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేసినా అభిమానులు కొంటారనే అభిప్రాయంతో ఆపిల్ ఉన్నట్టుగా కనిపిస్తోందని ఇంకో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఐఫోన్ పాకెట్‌కు ఆదరణ పెరుగుతుందనే అభిప్రాయాన్ని ఒక నెటిజన్ వ్యక్త పరిచారు. ఆఫీసులకు వెళ్లే ధనిక ఆసియా మహిళలు ఇస్సీ మియాకే డిజైన్లు నచ్చుతాయని పేర్కొన్నారు.చదవండి: వేదికపైనే కుప్పకూలిన రోబోఅయితే ఆపిల్ తన పరికరాల కోసం పౌచ్ లాంటి ఉత్పత్తిని రూపొందించడం ఇదే మొదటిసారి కాదు. 2004లో స్టీవ్ జాబ్స్ (Steve Jobs) 29 డాలర్లకే ఐపాడ్ సాక్స్‌ను ప్రవేశపెట్టారు.Will Apple fanboys defend this too?Apple just dropped the “iPhone Pocket” basically a $230 knitted bag to wear your iPhone😭At this point, it honestly feels like Apple is just testing how far its fans will go to justify anything. pic.twitter.com/ejnoGAppFD— Aares (@aares0205) November 11, 2025 -
వేదికపైనే కుప్ప కూలిన రోబో (వీడియో)
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలా దేశాల్లో ఇప్పటికే హ్యుమానాయిడ్ రోబోలు అందుబాటులో ఉన్నాయి. అయితే రష్యా ఇటీవల తన మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో నడిచే హ్యూమనాయిడ్ రోబోను ఆవిష్కరించింది. కానీ ప్రారంభంలోనే విఘాతం అన్నట్టు.. రోబో కిందపడింది.రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.ఐడల్ రోబోట్ కిందికి పడగానే.. దానికి ఫిక్స్ చేసిన కొన్ని భాగాలు కూడా ఊడిపోయాయి. రష్యన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఐడల్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. ప్రజల సందర్శనార్థం దీనిని ప్రదర్శించాలనుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. కాగా ఇంజనీర్లు ఐడల్.. బ్యాలెన్స్ సిస్టమ్, కంట్రోల్ సాఫ్ట్వేర్ వంటి వాటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.Russia unveils its first humanoid robot in Moscow. The AI-powered android took a few steps to ROCKY music, waved, and immediately faceplanted.The stage was quickly curtained, and the fallen “fighter” was carried backstage. @elonmusk knows how it feels. pic.twitter.com/EE57KR4T2d— Russian Market (@runews) November 11, 2025హ్యుమానాయిడ్ రోబోలుప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ రంగంలో చైనా అగ్రస్థానంలో ఉండగా.. జపాన్, సౌత్ కొరియా, అమెరికా, జర్మనీ దేశాలు సైతం తమదైన రీతిలో పరిశోధనలు చేస్తున్నాయి, రోబోలను ఆవిష్కరిస్తున్నాయి.మన దేశం కూడా హ్యుమానాయిడ్ రోబోలను రూపొందించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ISRO తయారు చేసిన వ్యోమిత్రా (Vyommitra) హ్యూమనాయిడ్ రోబోట్, మానవ అనే 3D ప్రింటెడ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూపొందించిన మల్టీపర్పస్ హ్యూమనాయిడ్ రోబోట్ అల్ఫా1.0 వంటివి ఉన్నాయి. -
ఏఐ వచ్చేసింది... మేల్కోండి!
సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు.. ఆర్జీవీ!విమర్శలకు బెదరడు.. మనసులో ఉన్న చెప్పకా మానడు.తన ట్వీట్లతో తరచూ వివాదాల్లో ఉండే ఈ సినీ దర్శక దిగ్గజం...తాజాగా విద్యా వ్యవస్థపై తన విమర్శలను ఎక్కుపెట్టాడు.కృత్రిమ మేధ అంతకంతకూ విసృ్తతమవుతున్న ఈ తరుణంలో..పాత పద్ధతులనే పట్టుకు వేళ్లాడటం ఆత్మహత్య సదృశ్యమని స్పష్టం చేశాడు.ఈ మేరకు ఆర్జీవీ చేసిన ఎక్స్ పోస్ట్. తెలుగులో మీ కోసం... హే.. స్టూడెంట్స్... మేలుకోండి. చదువు చచ్చిపోతోంది. ఉత్సవాలు జరుపుకోండి!కృత్రిమ మేథ ఎంత వేగంగా పెరుగుతోందో.. అన్ని వర్గాల వారూ దాన్ని వాడటం కూడా అంతే స్పీడుగా జరిగిపోతుంది. ఈ కాలపు చదువులు చచ్చిపోతున్న విషయమే అందుకు రుజువు. వైద్యవిద్యను ఉదాహరణగా తీసుకుందాం...వైద్య విద్యార్థి మానవ శరీరం, దాని పనితీరులను అర్థం చేసుకునేందుకు ఐదేళ్లు ఖర్చు చేస్తాడు. ఆ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఇంకో రెండేళ్లు.. ఆపై స్పెషలైజేషన్ కోసం మరో రెండుమూడేళ్లు పనిచేయాలి. అంటే సుమారు దశాబ్ధకాలం ఆ విద్యార్థి శరీర కండరాలు, నాడులు, అవయవాలు.. వాటి పనితీరు, పనిచేసే విధానం గురించి నెమరేసుకుంటూనే ఉంటాడన్నమాట. వీటన్నింటి ఆధారంగా శరీరంలో ఏది సరిగా లేదో గుర్తించి తగిన చికిత్స ఇస్తాడు. అయితే...కృత్రిమ మేథ మహా శక్తిమంతమైంది. లక్షల మెడికల్ కేసులు అరక్షణంలో చదివేయగలదు. రోగుల సమాచారాన్ని స్కాన్ చేసేసి.. రోగమేమిటో వేగంగా, కచ్చితంగా తేల్చయగలదు. అది కూడా ఎలాంటి వివక్ష లేకుండా ఏ చికిత్స తీసుకోవాలో కూడా సూచిస్తుంది. అలాంటప్పుడు ఒక యంత్రం పది సెకన్లలో చేసే పని కోసం పదేళ్లు వృథా చేయడం ఎంత వరకూ కరెక్ట్?ఓ ప్రముఖ వైద్యుడు నాతో పంచుకున్న విషయాలు చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది!‘‘చాలా బాధేస్తోందండి. చాలామంది పేద పిల్లలు వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. కానీ చదువు పూర్తి చేసి వచ్చేసరికి.. వీళ్లకు చేసే పనేమీ ఉండదు’’ అన్నారు ఆయన. ఇదేదో కల్పన కాదు. ఈ కాలపు వాస్తవం. వైద్యం ఒక్కటే కాదు.. ఏ రకమైన ఇతర కోర్సులకైనా ఇది వస్తుంది.ఏఐ రాజ్యమేలే ప్రపంచంలో సంప్రదాయ విద్యావ్యవస్థను పట్టుకు వేళ్లాడటం వెనక్కు నడవడమే. తెలివితక్కువతనం కూడా. మనదంతా భట్టీ పట్టేసే విద్యా వ్యవస్థ. సమాచారం అన్నది చాలా అరుదుగా దొరికే కాలంలో సిద్ధం చేశారు దీన్ని. కానీ ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా చటుక్కున దొరుకుతోంది. భట్టీ పట్టేడయం, జ్ఞాపకం చేసుకోవడం ఇప్పుడు జ్ఞానం కానేకాదు. మూర్ఖత్వం. నలభై ఏళ్ల క్రితం గుర్తుండి పోయేంతవరకూ ఎక్కాలు అప్పజెప్పేవాళ్లం. ఆ తరువాత కాలిక్యులేటర్లు వచ్చాయి. ఎక్కాలు నెమరేయడం మానేశాం.‘‘మన మెదళ్లు లెక్కపెట్టడం మరచిపోతే ఎలా’’, ‘‘ఏదో ఒక రోజు యంత్రాలూ పనిచేయకపోతే? అని కొందరు డౌట్లూ లేవనెత్తారు. ఇదెలా ఉంటుందంటే... కారు సరిగ్గా పనిచేయదేమో అనుకుని గుర్రపు బగ్గీని రెడీగా పెట్టమన్నట్లు!పాత పద్ధతులే సుఖం అనుకునే వారికి విప్లవాత్మకమైన మార్పులన్నీ కుట్రల్లాగే కనపడతాయి. అదే భయం, అభద్రత, తమల్ని తాము కాపాడుకునేందుకు వాడే అబద్ధాలే ఇప్పుడు కృత్రిమ మేధ విషయంలో మళ్లీ తెరపైకి వస్తున్నాయి.ఈ కాలపు ఏఐ విప్లవం విశ్వవిద్యాలయాల కోసం మంత్రులు లేదంటే పాతవాసన కొట్టే బోర్డుల ఆమోదం కోసం ఎదురు చూడటం లేదు. ఎదగని వాటిని తుడిచిపెట్టేస్తుంది. ఈ లైన్లో మొట్టమొదట ఉండేది విద్యార్థులే. కాబట్టి... విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వెంటనే తీసుకురావడం అనేది అవసరం మాత్రమే కాదు.. మన మనుగడకు కీలకం కూడా. లేదంటే... ఈనాటి విద్యార్థులే బలిపశువులు. ఏమీ తెలియని తల్లిదండ్రులు, అజ్ఞానులైన విధాన రూపకర్తల మోసానికి వీరు బలికాక తప్పదు. వీళ్లే కదా.. ఇప్పటి విద్యార్థులను ‘లేని’ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నది?!తరగతి గదుల్లో ఏఐ టూల్స్ వాడకాన్ని వెంటనే మొదలుపెట్టాలి. ఇదేదో పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు కాదు. విద్యార్థులకు అవసరమైన అసిస్టెంట్లుగా!చదువు చెబుతున్నామన్న భ్రమల నుంచి పాఠశాలలు బయటపడటం మంచిది. విద్యార్థులు కృత్రిమ మేథ టూల్స్‌ను ఎంత తెలివిగా, సృజనాత్మకంగా వాడుతున్నారో పరీక్షించేందుకు మాత్రమే పాఠశాలలు పరిమితం కావాలి. భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్లు.. ‘‘మీకేం తెలుసు’’ అని అడక్కూడదు. ఏఐతో ఎంత వేగంగా, లోతుగా, సృజనాత్మకంగా పనిచేయించుకోగలరో చూడాలి. ఎందుకంటే..... అన్నీ తెలిసినవాడు కాదు. ఏఐని సరైన ప్రశ్న వేయగలిగిన వాడు మాత్రమే జీనియస్!విద్యార్థులూ... ఏఐ సృష్టించే విధ్వంసం ముంగిట్లో ఉన్నారు మీరు. మీ టెక్ట్స'బుక్‌ల కింద పునాదులు కదిలిపోతున్నాయి. గుర్తించండి. మీ డిగ్రీలు.. వాటిని ప్రింట్ చేసేందుకు వాడే కాగితంతోనూ సరిపోవు. చచ్చిపోయిన వ్యవస్థ అవశేషాల మధ్య మీ ప్రొఫెసర్లు మీకు పాఠాలు చెబుతున్నారు.ఇంకా పాత పద్ధతుల్లోనే చదువుకుంటే... మీరు కాలగతిలో కలిసిపోతారు. ఏఐ మిమ్మల్ని తినేయదు కానీ.. మిమ్మల్ని పట్టించుకోకుండా సాగిపోతూంటుంది. అంతే!కాబట్టి... మార్కుల కోసం చదవడం ఆపేయండి. ఏఐని ఎలా వాడాలో నేర్చుకోండి! ఎందుకంటే... ఏఐని వాడకం తెలియని వాళ్లను ఆ ఏఐ మింగేస్తుంది!నోట్: నా ఈ రాతలపై సహేతుక అభ్యంతరాలకు సమాధానం ఇచ్చేందుకు నేను రెడీ! EDUCATION is DEADHey students wake up and CELEBRATE the DEATH of EDUCATION The explosion of A I will be in direct proportion to a public acknowledgement by all concerned, that our present day education system is dead Here’s looking at the medical course for an example A…— Ram Gopal Varma (@RGVzoomin) November 13, 2025 -
వృద్ధుల సంరక్షణకు టీసీఎస్ ఏఐ పరిష్కారం
అనేక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మరో క్లిష్టమైన సామాజిక సమస్యకు ఐటీ పరిష్కారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూరప్‌లోనే అతిపెద్ద స్వతంత్ర పరిశోధనాభివృద్ధి సంస్థ సింటెఫ్తో చేతులు కలిపింది.ప్రస్తుత రోజుల్లో వయసు పైబడిన పెద్దవారిని చూసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తమ ఉద్యోగాలు, వృత్తి రీత్యా ఎక్కడో ఉంటున్నారు. దీంతో వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమను పట్టించుకునేవారు లేరని ఇలు పెద్దవారు, తమవారి బాగోగులను పర్యవేక్షించే అవకాశం ఉండటం లేదని వారి పిల్లలు మథనపడుతుంటారు.ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని అందిస్తూ.. వృద్ధుల సంరక్షణను సరికొత్తగా మార్చే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టీసీఎస్.. యూరప్‌లోని అతిపెద్ద స్వతంత్ర పరిశోధనా సంస్థలలో ఒకటైన సింటెఫ్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.ఈ భాగస్వామ్యం సింటెఫ్ స్మార్ట్ ఇన్‌క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE) ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. ఇది ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్ సాయంతో ఇళ్లలో వృద్ధుల సంరక్షణను, పర్యవేక్షించడానికి, సహకారం ఇవ్వడానికి ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్‌ను ఏకీకృతం చేస్తుంది.ఒంటరిగా ఉంటూ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తమ ఇతర వయో వృద్ధులతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉంటూ ఇంట్లో తమంతట తాము స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు సహాకారం అందించేలా స్మైల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి, ఇది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రానున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో సంరక్షకులకు సమాచారం అందిస్తుంది. -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ బ్రాండ్‌దే హవా
భాతర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా బ్రాండ్ వివో తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లలో (రవాణా) 18.3 శాతం వాటాతో వివో మొదటి స్థానాన్ని కాపాడుకుంది. ఒప్పో 13.9 శాతం, శామ్సంగ్ 12.6 శాతం, యాపిల్ 10.4 శాతం, రియల్మీ 9.8 శాతం, షావోమీ 9.2 శాతం చొప్పున మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి.వన్‌ప్లస్ షిప్మెంట్లు ఇదే కాలంలో 30.5 శాతం తగ్గాయి. మోటరోలా 52 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారెŠక్ట్ పరిశోధనా సంస్థ ఐడీసీ డేటా ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.8 శాతం వృద్ధితో 4.8 కోట్ల యూనిట్లకు చేరుకుంది. యాపిల్ సంస్థ 50 లక్షల ఐఫోన్లను రవాణా చేసింది.ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 43.3 శాతం వృద్ధి నమోదైంది. ప్రీమియం స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం ఫోన్లలో 4 శాతం నుంచి 6 శాతానికి పెరిగింది. ఇందులో 70 శాతం ఐఫోన్ 16, 15, 17 మోడళ్లున్నాయి. ప్రీమియం స్మార్ట్ఫోన్లలో 66 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ టాప్‌లో ఉంది. శామ్సంగ్ 31 శాతం వాటాతో తర్వాతి స్థానంలో నిలిచింది. -
నియంత్రణలేని కృత్రిమ మేధ.. కట్టుతప్పితే..
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) దిశగా ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ ఏఐ చీఫ్ స్తఫా సులేమాన్ (Mustafa Suleyman) కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ అంచనా వేసిన దానికంటే వేగంగా పురోగమిస్తున్నప్పటికీ ఇది మానవ నియంత్రణలో ఉండటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.మైక్రోసాఫ్ట్ ప్రత్యేక MAI సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే సులేమాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సూపర్ ఇంటెలిజెన్స్‌ను నిర్మించే క్రమంలో మానవత్వాన్ని, మనం జీవించాలనుకునే భవిష్యత్తును కోల్పోతే ప్రమాదం. మానవులకు ఈ అంశాలపై నియంత్రణ లేకపోతే ప్రమాదం’ అని చెప్పారు.హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్సులేమాన్ పైవ్యాఖ్యలు చేస్తూనే మైక్రోసాఫ్ట్ ఏఐ అభివృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. దీన్ని ‘ఏఐ సెల్ఫ్ సఫిషియన్సీ’ (ఏఐ స్వయం సమృద్ధి) అని అభివర్ణించారు. కంపెనీ ఓపెన్ ఏఐ (OpenAI)తో భాగస్వామ్యంలో ఉన్న పరిమితులను అధిగమించి భారీ స్థాయిలో ఏఐ వ్యవస్థలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐ మోడళ్లకు విచ్చలవిడిగా శిక్షణనిచ్చే అనియంత్రిత శక్తిని లక్ష్యంగా చేసుకున్న పోటీదారుల మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ ‘హ్యూమనిస్ట్ సూపర్ ఇంటెలిజెన్స్’ (మానవతా దృక్పథంతో కూడిన సూపర్ ఇంటెలిజెన్స్) ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందని సులేమాన్ వివరించారు.ఈ విధానం వల్ల ఏఐను జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. సందర్భోచితంగా పరిమితులకు లోబడి వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రేసులో ప్రత్యర్థుల మాదిరి నియంత్రణ లేకుండా శిక్షణలు ఇవ్వడం లేదని చెప్పారు. మైక్రోసాఫ్ట్ మానవ అవసరాలను తీర్చే ఆచరణాత్మక వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. మానవాళికి సేవ చేయడానికి స్పష్టంగా రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మిస్తున్నామన్నారు.ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన -
పేలుడు ఘటనల్లో సత్య శోధన
ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో నవంబర్ 10న భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ వద్ద నిలిపిన ఐ20 కారు అకస్మాత్తుగా పేలింది. ఈ విస్ఫోటనంతో చుట్టుపక్కల ప్రజలు మరణించడంతోపాటు సమీపంలోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇటువంటి సంఘటనల్లో అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విచ్ఛిన్నమైన సాక్ష్యాలను సేకరించి, వాటిని ఏకం చేయాలి. ఒక సంఘటన ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందో నిర్ణయించడమే కాకుండా కోర్టులో ఫలితాలు నిలబడేలా చూడాలి. ఈ పేలుడు ఘటనతో న్యూదిల్లీలోని అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ విషాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫొరెన్సిక్ ఎక్స్‌పర్ట్‌లు కొన్ని అనుమానిత ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసేందుకు ఎక్స్‌పర్ట్‌లు అనుసరించే అత్యాధునిక పద్ధతుల గురించి తెలుసుకుందాం.ఈ ఘటన జరిగిన అరగంటలోపే ఢిల్లీ ఫోరెన్సిక్ లాబొరేటరీ పేలుడు పదార్థాల విభాగానికి చెందిన నిపుణులు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమికంగా సంఘటన స్థలం నుంచి అనుమానిక సాక్ష్యాలను పరిశీలించి వాటిని విశ్లేషిస్తారు. సాంప్రదాయ నేరాల మాదిరిగా కాకుండా పేలుళ్లు ప్రత్యేకమైన సవాళ్లను కలిగి ఉంటాయి. తీవ్రమైన ఒత్తిడి, వేడి కారణంగా వస్తువులు బూడిదవుతాయి. దాంతో ఆధారాలు సేకరించడం కష్టమవుతుంది.ఫోరెన్సిక్ సైన్స్‌లో ‘లోకార్డ్ మార్పిడి సూత్రం’ అని ఉంటుంది. ఇది ప్రతి నేరస్థుడు సంఘటనా స్థలంలో ఏదో ఆధారం వదిలివేసి లేదా ఏదో తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెబుతుంది. పేలుడు గందరగోళంలో ఒత్తిడికి గురికాకుండా నిపుణులు అనుమానితులను సంఘటన స్థలానికి అనుసంధానించే కోణంలో పరిశోధనలు చేస్తారు. వారు ఉపయోగించిన పేలుడు పదార్థాలు ఏ రకమైనవో, వాటి తీవ్రత ఎలా ఉంటుందో విశ్లేషిస్తారు.కాలి బూడిదైనా...అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిపుణులు ముఖ్యంగా పేలుడు పదార్థాల అవశేషాలు, అగ్ని ప్రమాదానికి కారణమైన పదార్థాల జాడలు, వేడి ప్రభావంతో మారిన వస్తువుల భౌతిక ఆధారాల కోసం వెతుకుతారు. కాలిన శిథిలాల నుంచి చిన్న చిన్న అవశేషాలను చాలా జాగ్రత్తగా కలుషితం కాకుండా ఉండేలా సేకరిస్తారు. సాధారణంగా మండే స్వభావం ఉన్న ద్రవాలు నేలలోకి లేదా ఇతర శోషక పదార్థాలలోకి ఇంకిపోతాయి. కాబట్టి కార్బన్ అవశేషాలు (Soot), కాలిన భాగాల అంచులు, మట్టి నమూనాలను సేకరిస్తారు.ప్యాకేజింగ్సేకరించిన నమూనాలను తక్షణమే గాలి చొరబడని ప్రత్యేక డబ్బాల్లో (Airtight Containers) ప్యాక్ చేస్తారు. ప్లాస్టిక్ సంచులను నివారిస్తారు. ఎందుకంటే అవి మండే ద్రవాల ఆవిరులను (Vapors) పీల్చుకోవచ్చు లేదా కలుషితం చేయవచ్చు.డాక్యుమెంటేషన్సంఘటన స్థలాన్ని చాలా కోణాల నుంచి ఫోటోలు తీస్తారు. లేజర్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా 3డీ స్కెచ్‌లు వేయిస్తారు. ఇది అగ్ని వ్యాప్తి చెందిన విధానాన్ని (Fire Propagation), పేలుడు కేంద్ర బిందువును అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.సంఘటనకు లింక్ చేయడంఅగ్ని ఎంత వేగంగా, ఏ దిశలో వ్యాపించింది అనే నమూనా, అత్యంత ఎక్కువ నష్టం జరిగిన ప్రదేశం ఆధారంగా పేలుడు/ అగ్ని ప్రారంభ స్థానాన్ని గుర్తిస్తారు. కాలిపోయిన లోహపు శకలాల నమూనా, వాటి కదలికను బట్టి అది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదమా లేదా పేలుడు పదార్థాలను ఉపయోగించిన దాడినా అని నిర్ధారిస్తారు.గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీఇది అత్యంత ముఖ్యమైన సాంకేతికత. నమూనాలోని మండే ద్రవాల ఆవిరులను (పెట్రోల్, కిరోసిన్ వంటివి) గుర్తించడానికి ఉపయోగిస్తారు. పేలుడు అవశేషాల రసాయన మిశ్రమాలను కూడా వేరు చేసి ఇందులో గుర్తిస్తారు.ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీకాలిన అవశేషాలు కాంతితో ఎలా చర్య చెందుతాయో విశ్లేషించి అందులోని రసాయన బంధాలను గుర్తిస్తుంది. ఇది పేలుడు పదార్థాల రసాయన కూర్పును తెలుసుకోవడానికి సహాయపడుతుంది.స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీపేలుడు శకలాల ఉపరితల స్వరూప శాస్త్రాన్ని (Morphology) పరిశీలిస్తుంది. ముఖ్యంగా పేలుడు తర్వాత మిగిలిపోయిన మూలకాల జాడలను (ఉదా: సల్ఫర్, నైట్రోజన్, లెడ్) గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది పేలుడు పదార్థం రకాన్ని నిర్ధారిస్తుంది.అంతిమంగా దోషులను కనిపెట్టే మార్గాలుదోషులను గుర్తించడానికి ఫోరెన్సిక్ అధికారులు కేవలం రసాయన ఆధారాలపైనే కాకుండా చాలా పద్ధతులను అనుసరిస్తారు. ప్రయోగశాలలో ఏదైనా ప్రత్యేకమైన లేదా వాణిజ్యపరమైన పేలుడు పదార్థాలను గుర్తిస్తే ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిన, తయారు చేసిన లేదా నిల్వ చేసిన వ్యక్తులపై దర్యాప్తు చేస్తారు.వాహనం పేలుడు ఘటనకు కేంద్ర బిందువు అయితే ట్యాంపరింగ్‌కు గురైన ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను థర్మోకెమికల్ ఎచింగ్ ద్వారా తెలుసుకుంటారు. దీని ద్వారా వాహనం యజమాని వివరాలు తెలుస్తుంది.సంఘటన స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించి సంఘటనకు ముందు అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేస్తారు. అనుమానితుల డిజిటల్ పరికరాలలో (ఫోన్లు, కంప్యూటర్లు) పేలుడు తయారీకి సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారు.ఇదీ చదవండి: అంతా కాకపోయినా కొంత ఊరట! తులం ఎంతంటే.. -
సరికొత్తగా పేటీఎం యాప్
చెల్లింపు సేవల సంస్థ పేటీఎం తాజాగా తమ ఫ్లాగ్షిప్ యాప్ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో యూజర్ల రోజువారీ లావాదేవీలను క్రమబద్ధీకరించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశీ యూజర్లతో పాటు 12 దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా చెల్లింపులు జరిపేందుకు తోడ్పడే 15 కొత్త ఫీచర్లు, వినూత్న ఇంటర్ఫేస్ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.తరచుగా జరిపే లావాదేవీలకు పొదుపు కోణాన్ని కూడా జోడించేలా ప్రతి చెల్లింపుపై యూజర్లకు డిజిటల్ గోల్డ్ రూపంలో రివార్డులిచ్చే విధంగా ‘గోల్డ్ కాయిన్స్’ ఫీచరును ప్రవేశపెట్టినట్లు వివరించింది. నెలవారీ ఖర్చుల వర్గీకరణ, యూపీఐతో అనుసంధానించిన బహుళ బ్యాంకు ఖాతాల్లో నిల్వలను ఒకే చోట చూపించడం, ‘హైడ్ పేమెంట్’ ఆప్షన్, వాట్సాప్ మెసేజీలు.. కాంటాక్టుల నుంచి బ్యాంక్..ఐఎఫ్ఎస్సీ వివరాలను ఆటోమేటిక్‌గా పూరించే మేజిక్ పేస్ట్ టూల్, అంతర్గతంగా కాల్క్యులేటర్ మొదలైన కొత్త ఫీచర్లను యాప్‌లో పొందుపర్చినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా.. -
డేటా సెంటర్లకు ఆకర్షణీయ కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: డేటా సెంటర్లకు భారత్ ప్రపంచంలోనే ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉన్నట్టు టర్నర్ అండ్ టౌన్సెండ్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. డేటా సెంటర్ల నిర్మాణ వ్యయం పరంగా ముంబై ప్రపంచంలో రెండో చౌక కేంద్రంగా ఉన్నట్టు వెల్లడించింది. ఒక వాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ నిర్మాణానికి ముంబైలో 6.64 డాలర్లు ఖర్చవుతోందని, ప్రపంచవ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ముంబైకి 51వ ర్యాంక్ దక్కినట్టు తెలిపింది. ఒకటో ర్యాంక్ వస్తే, మెగావాట్ డేటాసెంటర్ నిర్మాణానికి అత్యధిక వ్యయం అవుతున్నట్టు, 52 వస్తే అతి చౌక అని అర్థం చేసుకోవాలి. టోక్యో, సింగపూర్, జూరిచ్ ప్రాంతాల్లో మెగావాట్ నిర్మాణ వ్యయం ముంబై కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. దీంతో డేటా సెంటర్ పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయంగా ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో విద్యుత్ టారిఫ్‌లు కిలోవాట్ హవర్‌కు 6.71 సెంట్లుగా ఉందని, షాంఘై కంటే 50 శాతం చౌక అని తెలిపింది. దీంతో డేటా సెంటర్ల నిర్వహణ వ్యయాలు ముంబైలో తక్కువని తేల్చింది. నిల్వ సామర్థ్యం 3 శాతమే ప్రపంచంలో 20 శాతం డేటా భారత్‌లో ఉత్పత్తి అవుతుండగా, డేటా సెంటర్ సామర్థ్యంలో కేవలం 3 శాతమే భారత్‌లో ఉందని తెలిపింది. డేటా స్టోరేజీ కోసం భారత్ విదేశీ హోస్టింగ్(నిల్వ)పై ఎక్కువగా ఆధారపడుతోందని, దీంతో స్థానికంగా సామర్థ్య విస్తరణకు అపార అవకాశాలున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్, సింగపూర్‌తోపాటు భారత్ డేటా సెంటర్ మార్కెట్లుగా ఉన్నాయని.. భారత్‌లో డేటా సామర్థ్యాల నిర్మాణానికి 156 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని పేర్కొంది. తక్కువ నిర్మాణ వ్యయానికి తోడు డేటా స్టోరేజీ డిమాండ్ నేపథ్యంలో డేటా సెంటర్ల పెట్టుబడులకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతుందని టర్నర్ అండ్ టౌన్సెండ్ ఎండీ సుమిత్ ముఖర్జీ తెలిపారు. వ్యయపరమైన అనుకూలతలు ఉన్నప్పటికీ.. అవసరమైనంత విద్యుత్, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన సవాళ్లున్నట్టు చెప్పారు. ఇంధన వినియోగం పరంగా మరింత అనుకూలమైన డేటా సెంటర్ డిజైన్లపై సంస్థలు దృష్టి పెట్టాలని, తద్వారా విద్యుత్‌కు సంబంధించి రిస్‌్కను తగ్గించుకోవచ్చని నివేదిక సూచించింది. ఏఐ పరివర్తన ప్రయోజనాలను పూర్తి స్థాయిలో అందుకునేందుకు విద్యుత్, నీటి సరఫరాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. -
జియోటస్ అకాడమీ: క్రిప్టో గురించి తెలుగులో..
13 లక్షల కస్టమర్లతో.. భారతదేశంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన జియోటస్, దేశంలో తమ మొదటి స్థానిక భాషా క్రిప్టో ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. దీనిపేరు జియోటస్ అకాడమీ (Giottus Academy). క్రిప్టో గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం.జియోటస్ అకాడమీలో కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాకుండా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లైవ్ సెషన్స్ ఉంటాయి. స్థానిక భాషల్లో లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల.. క్రిప్టోకు సంబంధించిన ప్రతి విషయం సులభంగా అందరికీ అర్థమవుతుంది. దీనిని అగ్రశ్రేణి ట్రేడర్లు, విశ్లేషకులు కలిసి డిజైన్ చేశారు. కాబట్టి ఇందులో పాల్గొనేవారు ప్రతి దశను అర్థం చేసుకోవడానికి యాక్షన్ బేస్డ్ అభ్యాసంతో రియల్ టైమ్ ట్రేడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.జియోటస్ అకాడమీ ద్వారా.. రిజిస్ట్రేషన్స్, కేవైసీ, అడ్వాన్స్డ్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విషయాలను నేర్చుకోవచ్చు. అంతే కాకుండా విశ్లేషణ, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గైడెన్స్, ఏఐ బేస్డ్ ట్రేడింగ్ సిగ్నల్స్, వ్యూహాత్మక సూచనలను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా, సురక్షితంగా, ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. -
రైతన్నకు చేదోడుగా మార్కెట్లోకి ఏఐ టూల్
భారతదేశంలో వ్యవసాయ రంగం అనిశ్చితి, వాతావరణ మార్పులు, సరైన సమాచార లేమి వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కోసం అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్ ‘ఆర్య.ఏజీ’(Arya.ag)ను ఓ ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది. ఈ సెంటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా టెక్నాలజీల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ నిర్ణయాలను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది.ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ ఫీచర్లుఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కేవలం ఒక టూల్‌గానే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి పరిష్కారాలను అందించే ఒక లోకల్ హబ్‌గా పనిచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఐఓటీ ఆధారిత మట్టి విశ్లేషణనియోపర్క్ సెన్సార్ల వంటి సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల సాంప్రదాయ ల్యాబ్ పరీక్షల కంటే తక్కువ సమయంలోనే భూసార స్థితి, పోషకాల లభ్యత గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది.వాతావరణ అంచనాలువ్యవసాయ క్షేత్రానికి అతి దగ్గరగా ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆన్లైన్లో సమగ్ర సమాచారాన్ని అందిస్తారు. దీనివల్ల రైతులు విత్తనాలు నాటడం, నీటి పారుదల, ఎరువుల వినియోగం, పంట కోత వంటి కీలక నిర్ణయాలను సకాలంలో తీసుకోగలుగుతారు.డ్రోన్ ఆధారిత పంట పరిశీలనడ్రోన్ ఇమేజింగ్, శాటిలైట్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగించి పంట ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తారు. పంటల్లో చీడపీడల దాడిని, వ్యాధులను త్వరగా గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను సిఫార్సు చేస్తారు.రైతులకు మేలు చేస్తుందిలా..ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకురావడం ద్వారా రైతులకు అనేక విధాలుగా మేలు చేస్తున్నాయి. సరైన సమయంలో, సరైన పరిమాణంలో వ్యవసాయం సాగేందుకు ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకు, మట్టి విశ్లేషణ ద్వారా ఎంత ఎరువు వాడాలి.. వాతావరణ అంచనా ద్వారా ఎప్పుడు విత్తనం వేయాలి లేదా ఎప్పుడు పంట కోయాలి అనే విషయాలపై కచ్చితమైన సమాచారం లభిస్తుంది.చీడపీడల తక్షణ గుర్తింపు (డ్రోన్ ఇమేజింగ్ ద్వారా) వల్ల త్వరగా నివారణ చర్యలు తీసుకునే వీలుంటుంది.సకాలంలో వాతావరణ హెచ్చరికలు అందుకోవడం వల్ల రైతులు పంట నిర్ణయం తీసుకుంటారు.అనవసరమైన లేదా అధిక ఎరువుల వాడకం, నీటి పారుదల వంటి వాటిని డేటా ఆధారంగా తగ్గించడం వల్ల రైతులకు ఉత్పాదక వ్యయం తగ్గుతుంది.ఈ కేంద్రాలు ఆర్య.ఏజీ నిల్వ, మార్కెట్ లింకేజీలు, ఫైనాన్స్ సేవలతో అనుసంధానించబడి ఉండడం వల్ల, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల టోల్ పాలసీలో మార్పులు? -
మర్చిపోయారా? గ్యాడ్జెట్ గుర్తు చేస్తుంది!
ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకోలేని వారంతా ఇప్పుడు, టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ మీ జ్ఞాపకాలను జాగృతం చేసే గ్యారంటీ ఇస్తున్నాయి.చంద్రుడి వెలుగులా!చీకట్లో బెడ్‌మీద పుస్తకం చదవాలంటే ఒకవైపు లైట్ కోసం పోరాటం, మరోవైపు ‘స్విచ్ ఆఫ్ చెయ్యి!’ అనే డిస్టర్బ్ చేసే డైలాగులు! ఇవన్నీ దూరం చేయడానికి ఇప్పుడు ఒక హీరో వచ్చేశాడు. అదే గ్లోకుసెంట్ బుక్ లైట్! చిన్నగా కనిపించే ఈ లైట్ పనిలో మాత్రం బాస్ లెవెల్! మూడు కలర్ మోడ్లు, ఐదు బ్రైట్నెస్ లెవెల్స్‌తో కళ్లకు ఇబ్బంది లేకుండా సాఫ్ట్‌గా వెలిగిస్తుంది. పుస్తకానికి క్లిప్‌లా తగిలించుకుని చీకట్లో చంద్రుడి వెలుగులో చదివేయొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనభై గంటల వరకు నిరంతరామంగా వెలుగుతుంది. యూఎస్బీ రీచార్జబుల్, ఫ్లెక్సిబుల్, పోర్టబుల్, క్యూట్ పుస్తకప్రియుల రాత్రుల కోసం పర్ఫెక్ట్ స్నేహితుడు! దీని ధర రూ. 1,449.మాయా ట్యాగ్!తాళాలు ఎక్కడో, వాలెట్ ఏ సోఫా కిందో, బ్యాగ్ ఎవరో తీసుకెళ్లారో? ఇలా మీ రోజూ వివిధ వస్తువుల ‘సర్చ్ మిషన్’లా మొదలవుతుందా? ఇకపై ఏది పోయినా కంగారు పడాల్సిన పని లేదు! ఎందుకంటే నీ వస్తువులకి ఇప్పుడు బాడీగార్డ్ వచ్చేశాడు. అదే అమెజాన్ బేసిక్స్ ఏరో ట్యాగ్! ఇది మీ వస్తువులు ఎక్కడ ఉన్నాయో చెప్తుంది, అది కూడా ఒక్క బీప్తోనే! ఈ చిన్న తెల్ల ట్యాగ్‌లో బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఆపిల్ ఫైండ్ మై నెట్వర్క్ సపోర్ట్, 80 డెసిబెల్స్ సౌండ్ అలర్ట్ ఉన్నాయి. వాలెట్, కీస్, బ్యాగ్ ఇలా దేనికైనా తగిలించుకొని వాడుకోవచ్చు. అవి కనిపించనప్పుడు, ఒక్కసారి ఫోనులో యాప్ ఓపెన్ చేసి బటన్ నొక్కితే చాలు, ఆ వస్తువు ఎక్కడుందో చెప్తుంది. తేలికగా ఉంటుంది, సిమ్ అవసరం లేదు, బ్యాటరీతో పనిచేస్తుంది. ధర రూ. 537 మాత్రమే!టచ్‌తోనే తెలిసిపోతుందిచల్లని నీళ్లు తాగాలనుకుని బాటిల్ ఓపెన్ చేస్తే లోపల మరిగిన నీరు! చేతికి వేడి, ముఖానికి షాక్! ఇక ఆ కన్ఫ్యూజన్ స్టోరీకి ఎండ్! ఎందుకంటే ఎల్ఈడి స్మార్ట్ టెంపరేచర్ బాటిల్ నీళ్లు చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా ముందే చెప్తుంది. ఈ బాటిల్లోని డిస్ప్లేను టచ్ చేస్తే వెంటనే నీళ్ల ఉష్ణోగ్రత చూపిస్తుంది. చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అన్నది సెకన్లలో బాటిల్ ఓపెన్ చేయకుండానే తెలుసుకోవచ్చు. హాట్ డ్రింక్స్‌ను పన్నెండు గంటలు, కూల్ డ్రింక్స్‌ను ఇరవై నాలుగు గంటల వరకు అదే టెంపరేచర్లో ఉంచుతుంది. స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ బాటిల్ తేలికగా, క్యూట్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది. ధర రూ. 295 మాత్రమే! -
‘చంద్రయాన్–2’ నుంచి విలువైన సమాచారం: ఇస్రో
బెంగళూరు: చందమామ ధ్రువపు ప్రాంతాలకు సంబంధించి చంద్రయాన్–2 లూనార్ ఆర్బిటార్ నుంచి విలువైన సమాచారాన్ని సేకరించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డేటాతో చంద్రుడి వాతావరణం, అక్కడి స్థితిగతుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. జాబిల్లి ఉపరితలానికి చెందిన ఫిజికల్, డైఎలక్ట్రిక్ లక్షణాలు తెసుకోవచ్చని పేర్కొంది. భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టబోయే కీలక ప్రయోగాలకు ఈ సమాచారం ఎంతగానో తోడ్పడుతుందని ఇస్రో తేల్చిచెప్పింది.చంద్రయాన్–2 ఆర్బిటార్ 2019 నుంచి చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి తిరుగుతోంది. నాణ్యమైన డేటాను భూమిపైకి చేరవేస్తోంది. ఇందులోని డ్యుయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్(డీఎఫ్ఎస్ఏఆర్) అనే పేలోడ్ చంద్రుడి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించింది. ఈ అడ్వాన్స్డ్ రాడార్ సంకేతాలను నిలువు దిశ, అడ్డం దిశల్లో పంపగలదు, స్వీకరించగలదు. చందమామ ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడుతోంది. చంద్రుడి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువానికి సంబంధించిన సమాచారాన్ని చంద్రయాన్–2లోని 1,400 రాడార్ డేటాసెట్లు సేకరించి, విశ్లేషించాయి. ఈ సమాచారం ఆధారంగా అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) సైంటిస్టులు అడ్వాన్స్డ్ డేటా ప్రొడక్ట్‌లను అభివృద్ధి చేశారు. చంద్రుడిపై మంచు రూపంలోని నీరు, ఉపరితలం పరిస్థితులను సరిగ్గా అంచనా వేయడానికి ఈ ప్రొడక్ట్‌లు సహకరిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. -
ఐఫోన్ 16 కొనడానికి మంచి తరుణం..
మార్కెట్లో యాపిల్ ఐఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ప్రతి ఏటా కొత్త మోడల్ లాంచ్ చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఐఫోన్ 17 పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. ఈ సమయంలో ఐఫోన్ 16 మోడల్ ధర కొంత వరకు తగ్గింది. అంతే కాకుండా.. ఐఫోన్ 16 కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఆఫర్ కూడా తీసుకొచ్చింది.యాపిల్ ఐఫోన్ 16 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79900. కానీ ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 62,999లకే లభిస్తుంది. ఇంకా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డులు ఉన్న వినియోగదారులందరూ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,500 తగ్గింపును పొందుతారు. ఈ ఫోన్ బ్లాక్, పింక్, అల్ట్రామెరైన్, వైట్, టీల్ అనే ఐదు రంగుల్లో లభిస్తుంది.ఐఫోన్ 16 స్పెసిఫికేషన్స్యాపిల్ ఐఫోన్ 16.. 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో జత చేయబడిన ఆపిల్ A18 ప్రాసెసర్ పొందుతుంది. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం ఐపీ68 ధృవీకరణను పొందుతుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్లతో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు 12MP ఫ్రంట్ స్నాపర్‌ను పొందుతుంది. ఇది 3561mAh బ్యాటరీతో పాటు 25W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది.ఇదీ చదవండి: అమల్లోకి IRCTC కొత్త రూల్.. -
బీమా రంగానికి ఏఐ ధీమా
ప్రపంచవ్యాప్తంగా బీమా సంస్థలు కృత్రిమ మేధ(AI)ను కేవలం ఒక సాంకేతిక సాధనంగా మాత్రమే కాకుండా వ్యాపార వృద్ధిని నడపడానికి ఉపయోగిస్తున్నాయి. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి వాడుతున్నాయి. ప్రస్తుతం ఏఐ జీవిత, జనరల్ బీమా డొమైన్లలో అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో విస్తరిస్తోంది.టెస్టింగ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ వరకుగతంలో బీమా పరిశ్రమలో ఏఐను ప్రత్యేక డొమైన్‌ల్లో మాత్రమే పరీక్షించేవారు. కానీ ఇటీవలకాలంలో ఏఐ వాడకం పెరిగింది. జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ పర్మార్ అభిప్రాయం ప్రకారం.. ‘జీవిత బీమాలో ఏఐ పరీక్షల దశ నుంచి వ్యూహాత్మకంగా మారి విభిన్న విభాగాల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. దాంతో పరిశ్రమలో పట్టు సాధించింది’ అన్నారు.పాలసీదారుల రిస్క్ అంచనావిస్తృతమైన డేటాను (సాంప్రదాయ డేటా, IoT పరికరాలు, సామాజిక మాధ్యమాలు, మొదలైనవి) విశ్లేషించడం ద్వారా పాలసీదారుల రిస్క్‌ను అంచనా వేయడానికి ఏఐ సహాయపడుతుంది. దీనివల్ల మరింత కచ్చితమైన ప్రీమియం ధరలను (Pricing) నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఏఐ ఆధారిత టూల్స్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, క్లెయిమ్ ఫైలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలను ఆటోమేట్ చేస్తున్నాయి. దీనివల్ల క్లెయిమ్స్ త్వరగా పరిష్కారం అవుతున్నాయి. క్లెయిమ్స్ డేటాలోని అసాధారణ నమూనాలను, మోసపూరిత స్కీమ్‌లను ఏఐ ఆధారిత టూల్స్‌ను త్వరగా గుర్తిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు నష్టాలు తగ్గుతున్నాయి.నిరంతరం సేవఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు 24/7 అందుబాటులో ఉండి పాలసీ కొటేషన్లు, క్లెయిమ్ స్టేటస్, సాధారణ ప్రశ్నలకు తక్షణమే సమాధానం ఇస్తాయి. సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కువ సమయం తీసుకునే క్లెయిమ్‌లను ఏఐ ఆటోమేట్ చేయడం ద్వారా పాలసీదారులు తక్షణమే పరిహారాన్ని పొందగలుగుతారు. పాలసీదారుని వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా సరైన ప్రీమియం ధరతో (తక్కువ రిస్క్ ఉన్నవారికి తక్కువ ప్రీమియం) అతనికి సరిపోయే పాలసీలను ఏఐ సిఫార్సు చేస్తుంది. చాట్బాట్ల ద్వారా రోజులో ఏ సమయంలోనైనా తమ ప్రశ్నలకు సమాధానాలు, పాలసీ వివరాలు, సపోర్ట్ లభిస్తుంది. పాలసీ కొనుగోలు దగ్గరి నుంచి క్లెయిమ్ చేయడం వరకు మొత్తం ప్రక్రియలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: అధిక పనిగంటలు.. ఉద్యోగుల వెతలు -
యస్...ఈ యాప్‌లు మీకు ఉపయోగపడతాయ్!
స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యత పెరగడం, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ పెరుగుతున్న నేపథ్యంలో శక్తిమంతమైన, ప్రొఫెషనల్ గ్రేడ్ ఎడిటింగ్ సామర్థ్యం ఉన్న ఫ్రీ ఫొటో ఎడిటింగ్ యాప్‌లకు డిమాండ్ పెరిగింది. సెల్ఫీని పాలిష్ చేయడం నుంచి బ్రాండెడ్ పోస్ట్‌ను రూపొందించడం వరకు ఐవోఎస్, ఆండ్రాయిడ్‌లో రెండింటిలోనూ అందుబాటులో ఉన్న రెండు యాప్‌ల గురించి..స్నాప్స్పీడ్: గూగుల్ డెవలప్ చేసిన స్నాప్స్పీడ్ నిపుణులు, ప్రారంభకులు ఇద్దరికీ అనువైన ఎడిటింగ్ సాధనాలు అందిస్తుంది. జెపీఈజీ, రా ఫార్మట్లను సపోర్ట్ చేస్తుంది. నాన్–డిస్ట్రక్టివ్ ఎడిటింగ్‌ను అందిస్తుంది. నాణ్యత కోల్పోకుండా ఫొటోలను చక్కగా ట్యూన్ చేసేలా ఉపయోగపడుతుంది.పిక్స్ఆర్ట్: ఫొటో ఎడిటర్ పిక్స్ఆర్ట్ కొల్లెజ్ మేకర్, డ్రాయింగ్ టూల్లను మిళితం చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ తొలగించడం, రీప్లేస్మెంట్ చేయడానికి సంబంధించి దీని ఏఐ–పవర్డ్ టూల్స్ ఉపయోగపడతాయి. ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ (ఉదా: పాపులర్ కార్టూన్ లుక్), కొల్లెజ్ లేఔట్. వివిధ రకాల ఫాంట్లతో టెక్ట్స్ ఎడిటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఫన్, బోల్డ్, షేరబుల్ ఎడిట్స్‌ను కోరుకునే వారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. -
ఏమిటి ఈ వైబ్‌కోడింగ్.. ఉపయోగాలేమిటి?
ఇటీవలి కాలంలో ‘వైబ్‌కోడింగ్’ అనే మాట బాగా పాపులర్ అయింది. డిక్షనరీలలో కూడా చేరింది. కంప్యూటర్ సైంటిస్ట్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ కోఫౌండర్ ఆండ్రెజ్ కర్పతి (Andrej Karpathy) ద్వారా ‘వైబ్‌కోడింగ్’ అనేది ప్రాచుర్యం పొందింది. కోడర్ల నుంచి సామాన్యుల వరకు ‘వైబ్‌కోడింగ్’ చేస్తున్నారు.ఇంతకీ ఏమిటి ఈ వైబ్‌కోడింగ్? సాఫ్ట్‌వేర్‌ను సృష్టించడానికి చాట్‌బాట్ ఆధారిత విధానాన్ని అనుసరించడమే వైబ్‌కోడింగ్. ఇందులో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ లేదా పనికి సంబంధించి లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)కు వివరిస్తారు. ఇది ప్రాంప్ట్ ఆధారంగా కోడ్‌ను జనరేట్ చేస్తుంది. అయితే డెవలపర్ కోడ్‌ను ఎడిట్, రివ్యూ చేయడంలాంటివేమీ చేయడు. మార్పులు చేర్పులు చేసి మరింత మెరుగు పరచాలనుకుంటే ‘ఎల్ఎల్ఎం’ని అడుగుతాడు. స్థూలంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌లో విస్తృత శిక్షణ. నైపుణ్యం లేని అమెచ్యూర్ ప్రోగ్రామర్స్ కూడా వైబ్‌కోడింగ్ ద్వారా సాఫ్ట్వేర్ సృష్టించవచ్చు. ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ కెవిన్ రూస్ ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించి ఎన్నో స్మాల్ స్కేల్ అప్లికేషన్లను రూపొందించాడు.‘మెనుజెన్’లాంటి ప్రోటోటైప్లను నిర్మించడానికి ‘వైబ్‌కోడింగ్’ మెథడ్‌ను ఉపయోగించాడు. ఏదైనా ఎర్రర్ కనిపించినప్పుడు ఆ ఎర్రర్ మెసేజెస్ను కామెంట్ లేకుండానే సిస్టమ్‌లో కాపీ, పేస్ట్ చేసేవాడు. దీనితో జరిగిన లోపాలను ఏఐ సవరిస్తుంది. వైబ్ మార్కెటింగ్, వైబ్ డిజైనింగ్, వైబ్ అనలిటిక్స్, వైబ్ వర్కింగ్...ఇలా రకరకాలుగా ‘వైబ్‌కోడింగ్’ పాపులర్ అయింది.‘వైబ్‌కోడింగ్’లో సానుకూల విషయాలు ఉన్నా విమర్శలు కూడా ఉన్నాయి. ‘జవాబుదారీతనం లోపిస్తుంది’ ‘భద్రతా సమస్యలు ఏర్పడతాయి’ ‘కార్యాచరణ పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఏఐ సృష్టించిన కోడ్‌ను ఉపయోగించడం వల్ల గుర్తించబడని బగ్‌లు, లో΄ాలు, భద్రతాపరమైన సమస్యలు ఏర్పడతాయి’...అనేవి ఆ విమర్శల్లో కొన్ని. ప్రోగ్రామర్లు కానివారిని కూడా ఫంక్షనల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి ‘వైబ్‌కోడింగ్’ వీలు కల్పిస్తున్నప్పటికీ ఈ మెథడ్ ద్వారా ‘వందశాతం కరెక్టే’ అనుకోవడానికి లేదు. ఊహించినంత ఫలితాలు రాకపోవచ్చు. ఊహించింది ఒకటి అయితే ఫలితం మరోలా ఉండవచ్చు.‘లవబుల్’ అనేది స్వీడీష్ వైబ్ కోడింగ్ యాప్. ఈ యాప్ కోసం రూపొందించిన కోడ్‌లో భద్రతా లోపాలు ఉన్నాయని, లవబుల్ వెబ్అప్లికేషన్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉందని...ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. ఒక ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఫేక్ రివ్యూలు సృష్టించడానికి ఈ మెథడ్‌ను ఉపయోగించుకున్నారు. వైబ్‌కోడింగ్ గురించి ‘ఐ జస్ట్ సీ థింగ్స్, సే థింగ్స్, రన్ థింగ్స్, అండ్ కాపీ థింగ్స్’ అని కాస్త గొప్పగా చెప్పిన ఆండ్రేజ్ కూడా ఈ మెథడ్లోని పరిమితుల గురించి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. కొన్ని బగ్స్ రిపేర్‌కు సంబంధించి టూల్స్ విఫలమయ్యాయి అనేది అందులో ఒకటి. -
రూ .18 వేల జీతం.. రూ.1.8 లక్షలైంది!
మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం. సగటు యువత కోరుకునేది ఇదే కదా..? కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. కొందరే కష్టపడి ఈ కలను సాకారం చేసుకుంటారు. ఎంత తక్కువ జీతంతో ప్రారంభించామన్నది ముఖ్యం కాదు.. ఎంత తక్కువ కాలంలో మంచి జీతానికి చేరుకున్నామన్నదే ప్రధానం.ఐదేళ్లలో పది రెట్లు జీతం పెంపును సాధించిన ఓ భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తన ప్రయాణాన్ని ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ రెడిట్ (Reddit)లో పంచుకున్నారు. “ఒక చిన్న విజయాన్ని పంచుకోవాలనుకున్నాను. ఐదేళ్ల క్రితం నెలకు రూ.18,000 జీతంతో ఒక చిన్న స్టార్టప్‌లో నా కెరీర్ ప్రారంభించాను. అది సులభం కాదు.. గంటల కొద్దీ పని, నిరంతర అభ్యాసం, మధ్యలో ఎన్నో తప్పులు.. కానీ ప్రతీదీ అనుభవం నేర్పింది” అని రాసుకొచ్చారు.React, Node.js, Python, AWS వంటి టెక్ స్టాక్‌లో నైపుణ్యం కలిగిన ఈ ప్రొఫెషనల్ ప్రస్తుతం నెలకు రూ.1.8 లక్షల జీతంతో కొత్త ఆఫర్ అందుకున్నారని తెలిపారు. “ఐదేళ్లలో 10 రెట్లు ఎదుగుదల సాధించాను. ఈ ప్రయాణంపై నాకు నిజంగా గర్వంగా ఉంది. నిద్రలేని రాత్రులు, కఠినమైన ఫీడ్‌బ్యాక్, పట్టుదల.. ఇవన్నీ ఫలించాయి. ఇప్పటికీ కష్టపడుతున్న వారందరికీ నా సందేశం.. ఆగకండి, నేర్చుకుంటూ కొనసాగండి. కచ్చితంగా మెరుగవుతుంది” అని ఆయన అన్నారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. యూజర్ల నుంచి అభినందనల వర్షం కురిసింది. “మీరు ఏమి నేర్చుకునేవారు? ఉద్యోగం, నైపుణ్యాభివృద్ధి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు?” అంటూ కొందరు సలహాలు కోరగా.. తామూ కూడా ఇలాగే పురోగతి సాధించినట్లు మరికొందరు తమ అనుభవాలను కామెంట్ల రూపంలో తెలియజేశారు.👉ఇది చదివారా? టీసీఎస్ షాకింగ్ శాలరీ.. -
రోజుకు 2.5జీబీ డేటా: కొత్త రీఛార్జ్ ప్లాన్
జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటిస్తున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లి రూ. 225 ప్లాన్ ప్రవేశపెట్టింది. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన రూ. 225 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 75 జీబీ డేటా (రోజుకు 2.5 జీబీ), అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. జియో & ఎయిర్టెల్ వంటి టెలికాం బ్రాండ్లు తమ ప్రాథమిక ప్రీపెయిడ్ ప్లాన్లను రూ. 250 కంటే ఎక్కువకు పెంచినప్పటికీ, BSNL తన వినియోగదారులకు చాలా సరసమైన & డబ్బుకు తగిన విలువైన ప్లాన్‌ను అందిస్తూనే ఉంది.రూ. 255 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే నెల రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ అయినప్పటికీ.. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, బీఎస్ఎన్ఎల్ సినిమా, ఎరోస్ నౌ యాప్ వంటి కొన్ని ఫ్రీ యాడ్ ఆన్ సేవలను పొందవచ్చు. అంటే కాలింగ్ & ఇంటర్నెట్తో పాటు వినోదాన్ని ఆస్వాదించడానికి ఈ ప్లాన్ మిమ్మల్ని అనుమతిస్తుంది.బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్బీఎస్ఎన్ఎల్ 50 రోజుల వ్యాలిడిటీతో రూ. 347 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించుకుపోవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు.ఇదీ చదవండి: శివ్ నాడార్.. జాబితాలో అంబానీ కంటే ముందు: రూ.2708 కోట్లు.. -
రైతుల కోసం.. స్మార్ట్ ఫార్మ్ సెంటర్స్
భారతదేశంలోనే అతిపెద్ద ధాన్య వాణిజ్య వేదిక అయిన ఆర్య.ఏజీ.. దేశవ్యాప్తంగా 25 స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు ప్రారంభించింది. ఈ సెంటర్లు రైతుల సమస్యలను పరిష్కరిస్తాయి. దీనికోసం టెక్నాలజీ, డేటా బేస్డ్ వంటి వాటిని ఉపయోగిస్తుంది. లాభదాయక వ్యవసాయ పర్యావరణాన్ని రూపొందించాలనే ఉద్దేశ్యంతో సంస్ట ముందుకు సాగుతోంది.ప్రతి స్మార్ట్ ఫార్మ్ సెంటర్.. ఒక వ్యవసాయ కేంద్రంగా పనిచేస్తుంది. రైతులు ఎదుర్కునే.. పంటలకు సంబంధించిన సవాళ్లను ఇది పరిష్కరిస్తుంది. ఈ సెంటర్లు భూసార పరీక్షలు (సాయిల్ టెస్ట్), స్థానిక వాతావరణ సమాచారం, డ్రోన్ ఇమేజింగ్ వంటివాటికి సంబంధించిన విషయాలను రైతులకు వెల్లడిస్తూ.. వారికి శిక్షణ ఇస్తాయి.ఆర్య.ఏజీ స్మార్ట్ ఫార్మ్ సెంటర్లు రైతులు సాగు చేసే ప్రతిదశలోనూ సహాయపడతాయి. ఇవన్నీ విత్తనాలు, నీటిపారుదల నుంచి పంట ప్రణాళిక & ఫైనాన్సింగ్ వరకు.. మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ఇవి నియోపెర్క్, భారత్‌రోహన్, ఫార్మ్‌బ్రిడ్జ్, ఫిన్హాట్, ఫైల్లో వంటివాటితో పాటు కంపెనీ కమ్యూనిటీ వాల్యూ చైన్ రిసోర్స్ పర్సన్స్ సహకారంతో అభివృద్ధి చేశారు. -
టీసీఎస్ షాకింగ్ శాలరీ.. నెలకు రూ.422 పెరిగితే..
ఒక టీసీఎస్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాలుగేళ్లకు పైగా పనిచేసిన తనకు ఈ సంవత్సరం నెలకు కేవలం రూ.422 ఇంక్రిమెంట్ మాత్రమే వచ్చిందని అతను పేర్కొన్నారు. “టీసీఎస్ నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపు ఇచ్చింది..” అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.2021లో కంపెనీలో చేరినట్లు పేర్కొన్న రెడిటర్ .. “ఇది నా చెడు నిర్ణయాల ఫలితం” అని పేర్కొంటూ, తాను సపోర్ట్ ప్రాజెక్ట్‌లో పనిచేశానని, అక్కడ “జీరో లెర్నింగ్, జీరో గ్రోత్, అంతులేని అరుపులు, మైక్రోమేనేజ్మెంట్” ఉండేదని రాసుకొచ్చారు. తన పెంపు ఆరు నెలల ఆలస్యంగా వచ్చిందని, ఈ పరిస్థితుల్లో టీసీఎస్ వంటి సంస్థలు “పల్లీలు కొనుక్కునే చెల్లింపులు” ఇస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన “మీ విలువ తెలుసుకోండి” అని టీసీఎస్ ఉద్యోగులు, ఫ్రెషర్లకు సూచించారు.వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు విస్తృతంగా స్పందించారు. ‘ఇంక్రిమెంట్ దారుణంగా ఇవ్వడంతో నేను 7 సంవత్సరాల తర్వాత టీసీఎస్ వీడాను’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ సంవత్సరం తనకు జీరో హైక్ వచ్చిందని ఇంకొకరు వ్యాఖ్యానించారు. “ఐటీని విడిచిపెట్టడం ఉత్తమ మార్” అంటూ మరొకరు కామెంట్ చేశారు.ఇక టీసీఎస్ కూడా ఈ ఘటనపై స్పందించింది. “వ్యక్తిగత కేసులపై మేం వ్యాఖ్యానించం. కానీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నవి అవాస్తవాలు” అని టీసీఎస్ ప్రతినిధి పేర్కొన్నారు. “సెప్టెంబర్ 1 నుంచి మా ఉద్యోగుల 80% మందికి వేతన సవరణలు అమలయ్యాయి. సగటు ఇంక్రిమెంట్ 4.5% నుంచి 7% మధ్య ఉంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల పెంపు ఇచ్చాం” అని తెలిపారు -
మస్క్‌లాంటి వారు మాత్రమే సంపన్నులవుతారు!
కృత్రిమ మేధ(AI) వేగంగా అభివృద్ధి చెందడం మొదలైనప్పటి నుంచి ఉద్యోగాల కోత సంచలనంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వాటి కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తూ వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ గాడ్ ఫాదర్‌గా పిలువబడే జెఫ్రీ హింటన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏఐలో వస్తున్న మార్పు భవిష్యత్తులో కోట్లాది మందిని నిరుద్యోగులుగా మారుస్తుందని, ఈలోగా కేవలం ఎలాన్ మస్క్ వంటి కొద్దిమంది మాత్రమే ధనవంతులు అవుతారని జోస్యం చెప్పారు.కంపెనీల వైఖరిఇప్పటికే టెక్ దిగ్గజాలైన ఐబీఎం, టీసీఎస్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఏఐని అమలు చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ధోరణి ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని హింటన్ బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఉద్యోగాలు కోల్పోకుండా ఏఐతో ముందుకు వెళ్లే మార్గం ఉందా అని అడిగినప్పుడు ‘అది సాధ్యం కాదని నమ్ముతున్నాను. డబ్బు సంపాదించాలంటే మానవ శ్రమను భర్తీ చేయాలి. అందుకు ఏఐను వాడుతున్నారు. కంపెనీలు లాభాలు పెంచుకునేందుకు ఈ పంథాను వినియోగిస్తున్నాయి’ అన్నారు.ఏఐ సమస్య కాదు.. సామాజిక సమస్య..ఏఐ అభివృద్ధి వల్ల ఏర్పడే ఆర్థిక అసమానతపై జెఫ్రీ హింటన్ మాట్లాడుతూ.. ‘టెక్ బిలియనీర్లు మాత్రమే ఈ రేసులో విజేతలుగా నిలుస్తారు. గణనీయ సంఖ్యలో ఉద్యోగుల స్థానంగా ఏఐ పని చేస్తుంది. మస్క్ వంటి వ్యక్తులు మాత్రమే ధనవంతులు అవుతారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. ఇది ఏఐ సమస్య కాదు, సామాజిక సమస్య. ఏఐ మన సమాజాన్ని, మన ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్మిస్తుందనేది నిశితంగా గమనించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత -
ఏఐ బూమ్ ఎఫెక్ట్: ఫ్లాష్ మెమరీ కాంపోనెంట్ల కొరత
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వృద్ధి కారణంగా ఏర్పడిన గ్లోబల్ ఫ్లాష్ మెమరీ కాంపొనెంట్ల కొరత వల్ల ఎల్ఈడీ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఈడీ టీవీలు సహా అనేక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఫ్లాష్ మొమరీ కాంపొనెంట్ల తయారీలో కీలకంగా ఉన్న కంపెనీలు అధిక మార్జిన్ కలిగిన ఏఐ డేటా సెంటర్ల వైపు మళ్లడమేనని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫ్లాష్ మెమరీ ధరలు పెరుగుదలLED టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్న ఫ్లాష్ మెమరీ ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరిగాయి. వీడియోటెక్స్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపిన వివరాల ప్రకారం 1GB/8GB మెమరీ ధర ఏప్రిల్‌లో 2.61 డాలర్ల వరకు ఉండగా అక్టోబర్ నాటికి అది ఏకంగా 14.40 డాలర్లకు పెరిగింది. కేవలం మూడు నెలల్లోనే ఈ ధరల పెరుగుదల 50 శాతానికిపైగా చేరాయి. ఇది టీవీ తయారీదారుల ఇన్పుట్ ఖర్చులపై ఒత్తిడి పెంచింది.ఏఐ డిమాండ్: సాధారణ ఎలక్ట్రానిక్స్‌కు అంతరాయంసెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు దృష్టి సారించడమే ఈ కొరతకు మూలకారణం అని తెలుస్తుంది. చిప్ తయారీదారులు ఏఐ డేటాసెట్లలో ఉపయోగించే DDR6, DDR7 చిప్ సెట్ల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని కారణంగా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల్లో సాధారణంగా వాడే DDR3, DDR4 మెమరీ ఉత్పత్తి తగ్గిపోయింది.ఎస్పీపీఎల్(థామ్సన్ బ్రాండ్ లైసెన్స్) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ..‘2021-22 చిప్సెట్ కొరత తర్వాత ఫ్లాష్ మెమరీ అతిపెద్ద సమస్యగా ఉంది. త్వరలో ఎల్ఈడీ టెలివిజన్ ధరలు పెరుగుతాయి’ అన్నారు. ఈ మెమరీ కాంపోనెంట్స్ ప్రధానంగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు 2026 కోసం మెమరీ సెట్లను భద్రపరచడానికి పోటీ పడుతుండటంతో సరఫరా గొలుసు అంతరాయాలు పెరిగి ధరల ఒత్తిడి మరింత తీవ్రమైందని నిపుణులు చెబుతున్నారు.ఈ కొరత ఎప్పటివరకంటే..ఈ కొరత కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల వరకు కొనసాగుతుందని ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (OEMలు) అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీలు తమ ఆర్డర్లను వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇన్వెంటరీని క్రమబద్ధీకరిస్తున్నాయి.టీవీలలో ఫ్లాష్ మెమరీని ఎందుకు ఉపయోగిస్తారంటే..స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్ (webOS), టైజెన్ (Tizen) వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తాయి. ఈ OS కోడ్, టీవీని నడిపించే ఫర్మ్‌వేర్ (firmware) కోడ్ అంతా ఫ్లాష్ మెమరీలోనే శాశ్వతంగా నిల్వ అవుతుంది. టీవీని ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ మెమరీలోని ఈ OS, ఫర్మ్‌వేర్ నుంచి డేటా లోడ్ అవుతుంది. అప్పుడే టీవీ పనిచేయడం మొదలవుతుంది.నెట్‌ఫ్లిక్స్ (Netflix), యూట్యూబ్ (YouTube), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి యాప్‌లను వినియోగదారులు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడానికి ఫ్లాష్ మెమరీ స్థలాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు -
భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాల్లో మార్పులు
భారతదేశం ఇటీవల ఆవిష్కరించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాలనా మార్గదర్శకాలు దేశ సాంకేతిక నియంత్రణ విధానంలో కీలకమైన మార్పును సూచిస్తున్నాయి. తక్షణమే కఠినమైన చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ‘ఇన్నోవేషన్-ఫస్ట్’ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుకూల సవరణలు చేసి ఏఐ వ్యవస్థలను నియంత్రించాలని నిర్ణయించింది.ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త ఏఐ చట్టాన్ని ప్రతిపాదించకుండా ఏఐ వ్యవస్థలను నియంత్రించడంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న చట్టాలను సమగ్రంగా సమీక్షించాలని పిలుపునిచ్చింది. ఏఐ రంగంలో వేగంగా ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.సవరణలు వీటిలోనే..ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP), 2023ఏఐ వ్యవస్థలు స్వయంగా డేటాను సవరించడం లేదా ఉత్పత్తి చేయడం వల్ల ఇంటర్మీడియరీల(మధ్యవర్తుల) ప్రస్తుత రక్షణ నిబంధనలకు సవాలు ఏర్పడుతుంది. ఏఐ-సృష్టించిన కంటెంట్‌కు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై నియంత్రణపరమైన స్పష్టత కొరవడింది. ఈక్రమంలో పైన తెలిపిన చట్టాల్లో ఈమేరకు సవరణలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమస్యను పర్యవేక్షించడానికి ప్రభుత్వం సంస్థాగత ఫ్రేమ్ వర్క్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఏఐ గవర్నెన్స్ గ్రూప్(ఏఐ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే ప్రధాన సంస్థ), టెక్నాలజీ అండ్ పాలసీ ఎక్స్పర్ట్ కమిటీ (TPEC-నిర్దిష్ట చట్టపరమైన లోపాలను గుర్తించడం, సవరణలను ప్రతిపాదించడం, అమలును పర్యవేక్షించడం)వంటి వాటిని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా? -
దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!
దొంగిలించబడిన ఐఫోన్ల వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నంలో టెక్ దిగ్గజం యాపిల్ సహకరించడం లేదని యూకే మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ (Met Police) తీవ్రంగా ఆరోపించింది. దొంగిలించబడిన ఫోన్లకు క్రెడిట్ పొందేందుకు నేరస్థులు యాపిల్ ట్రేడ్-ఇన్ (Trade-in) ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.యూకే పార్లమెంటు సభ్యులకు (MPs) మెట్ పోలీస్ సమర్పించిన నివేదికలో.. యాపిల్ సంస్థకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR)కు అవకాశం ఉందని తెలిపారు. ట్రేడ్-ఇన్ పరికరాల నెట్వర్క్ స్థితిని తనిఖీ చేయడానికి మాత్రమే యాపిల్ ప్రతిరోజూ దీన్ని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో ఫోన్ల దొంగతనానికి సంబంధించిన అంశాలను తనిఖీ చేయడం లేదని చెప్పారు. అంటే ఎవరైనా ఐఫోన్లు దొంగతనం చేసి ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా క్రెడిట్లు పొంది తిరిగి కొత్త ఫోన్‌ను పొందవచ్చు. లేదా యాపిల్ గిఫ్ట్ కార్డులు పొందవచ్చు. యాపిల్ సరైన తనిఖీలు చేయకుండా దొంగిలించబడిన పరికరాలు మళ్లీ చలామణిలోకి రావడానికి సమర్థవంతంగా అనుమతిస్తుందని పోలీసులు చెబుతున్నారు.నేషనల్ మొబైల్ ప్రాపర్టీ రిజిస్టర్ (NMPR) అనేది దొంగిలించబడిన పరికరాలను గుర్తించడానికి, తిరిగి వాటిని బాధ్యులకు ఇవ్వడానికి చట్ట పరంగా అధికారులు ఉపయోగించే డేటాబేస్. యాపిల్ తన ట్రేడ్-ఇన్ పథకంలో ఈ రిజిస్టర్‌ను ఉపయోగించడం లేదని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.క్రెడిట్ పాయింట్లువినియోగదారులు తమ పాత ఐఫోన్‌ను మార్చుకున్నప్పుడు కొత్త ఐఫోన్ కొనుగోలుకు ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్‌లో ఉదాహరణకు సుమారు 670 యూరోల వరకు క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. సరైన దొంగతనం తనిఖీలు లేకుండా దొంగిలించబడిన ఐఫోన్లను ఈ వ్యవస్థలోకి అంగీకరించి తిరిగి విక్రయించడం లేదా పునరుద్ధరిరిస్తున్నట్లు(Refurbished) పోలీసులు చెబుతున్నారు.పెరిగిన దొంగతనాలుమెట్ పోలీస్ అందించిన సమాచారం ప్రకారం 2024లోనే లండన్‌లో 80,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడ్డాయి. ఇది 2023లో నమోదైన 64,000 దొంగతనాల కంటే పెరిగింది. దొంగిలించబడిన ఈ ఫోన్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలంటే 50 మిలియన్ యూరోలు ఖర్చవుతుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఫోన్లలో 75% పైగా విదేశాలకు తరలివెళ్తున్నాయని, అక్కడ వాటిని విడదీసి విడిభాగాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.యాపిల్ ప్రతిస్పందనమెట్ పోలీస్ విమర్శలను యాపిల్ ఖండించింది. దొంగిలించబడిన డివైజ్‌ల కోసం కంపెనీ Stolen Device Protection వంటి చర్యలు తీసుకుంటుందని హైలైట్ చేసింది. ఫోన్ యజమాని ధ్రువీకరణ లేకుండా నేరస్థులు డివైజ్‌లోని డేటాను తొలగించడం లేదా తిరిగి విక్రయించకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: భవిష్యత్తు బంగారు లోహం! -
ర్యాట్.. ఏపీకే..టేకోవర్!
సాక్షి, హైదరాబాద్: ‘నా ఫోన్ హ్యాక్ అయింది... వాట్సాప్‌ను ఎవరో టేకోవర్ చేశారు... ఫేస్బుక్ క్లోన్ అయింది. నా పేరు, ఫొటోలతో మెసేజ్‌లు పంపి కొందరు కేటుగాళ్లు డబ్బు అడుగుతున్నారు. దయచేసి ఇలాంటి సందేశాలను చూసి ఎవరూ మోసపోవద్దు’అంటూ ఇటీవల కాలంలో ఎంతో మంది సైబర్ క్రైం బాధితులు తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను కోరుతున్నారు. కొందరి కేసుల్లో కథ ఇక్కడితో ఆగిపోతే మరికొందరు బాధితులు మాత్రం తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ తరహా సైబర్ నేరాలు పెరగడానికి సైబర్ హ్యాకర్లు పంపే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్), ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్స్‌తోపాటు వాట్సాప్ టేకోవర్లే కారణమని సైబర్ క్రైం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేరాల బారినపడకుండా ఉండాలంటే స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. యాడ్స్ మాటున ర్యాట్... ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో అనేక యాప్స్‌కు సంబంధించి కనిపించే యాడ్స్‌ను చాలా మంది నెటిజన్లు అవసరం లేకపోయినా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరస్తులు ఈ తరహా యాడ్స్ మాటున పంపుతున్న ఆయుధమే ‘ర్యాట్’. యాప్స్, వీడియోలు, అప్డేట్స్ పేరుతో పంపే లింకుల మాటున ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పొందుపరుస్తారు. ఎవరైనా ఆ లింక్‌ను క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ వారి ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఫలితంగా వినియోగదారుడికి తెలియకుండా, ప్రమేయం లేకుండానే సైబర్ క్రిమినల్ పంపే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచే సైబర్ నేరస్తుల అ«దీనంలోకి వెళ్లిపోతుంది. దీంతో చేతిలో సెల్‌ఫోన్ లేకపోయినా దాన్ని రిమోట్ యాక్సెస్ చేస్తూ కేటుగాళ్లు వారికి అవసరమైన విధంగా వాడగలుగుతున్నారు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. ఓటీపీలను సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ర్యాట్ ఫైల్స్ వాడుతున్నారు. ‘డాట్’పేరుతో స్పాట్... ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు తమ పంథా పూర్తిగా మార్చేశారు. డార్క్ వెబ్ నుంచి సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితులను ఎంచుకుంటున్నారు. వారికి ఫోన్లు చేసి క్రెడిట్ కార్డుల ఆఫర్ల పేరిట వలపన్ని ఆసక్తి చూపిన వ్యక్తుల నుంచి చిరునామాలు సేకరిస్తున్నారు. ఈ కార్డుల జారీ కోసం సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి అయినందున టెలికం శాఖ యాప్ లింకును పంపుతున్నామని చెబుతున్నారు. ఇది నిజమేనని నమ్మే బాధితులు వాటిని క్లిక్ చేయగానే రిమోట్ యాక్సెస్ యాప్‌లు సైబర్ క్రిమినల్స్ ఫోన్లలో ఇన్‌స్టల్ అయిపోతున్నాయి. దీంతో బాధితుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు వారికి వెళ్లడం మొదలవుతోంది. దీంతో నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్తోనూ ఎటాక్స్... ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, పెట్టుబడుల అవకాశాలు, పెండింగ్ చలాన్లు, రుణాలు, ఆధార్ అప్డేట్ల పేరుతో ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్స్ (ఏపీకే) ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నకిలీ వెబ్సైట్ల ఆధారంగా లింకుల రూపంలో సైబర్ నేరగాళ్లు ఈ ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. వాటిని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఫోన్లు వారి అ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ రకంగానూ నేరగాళ్లు వినియోగదారుల బ్యాంకు ఖాతాల లాగిన్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం సహా సున్నిత వివరాలు పొందుతున్నారు. సైబర్ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ... – అపరిచిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లు క్లిక్ చేయొద్దు. – ఎవరికీ ఓటీపీలు, యాక్టివేషన్ కోడ్లు చెప్పొద్దు. – ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ మినహా లింక్‌ల ద్వారా వచ్చే యాప్స్‌ను డౌన్లోడ్ చేయకూడదు. – వాట్సాప్ టోకేవర్ బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని అందులో టూ–స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. తద్వారా ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను మరోసారి, మరో ఫోన్లో యాక్టివేట్ చేయాలంటే ఓటీపీతోపాటు యాక్టివేషన్ కోడ్ కూడా అవసరం అవుతుంది. – కొందరు కేటుగాళ్లు మాల్వేర్ను ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు రూపంలో పంపిస్తుంటారు. అందువల్ల వాట్సాప్ సెట్టింగ్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌ను ‘నన్’అని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఆ వైరస్ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంటుంది. – సైబర్ దాడికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అయి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో ఎంత ఆలస్యమైతే రికవరీలు అంత తక్కువగా ఉంటాయన్నది మర్చిపోవద్దు. లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్ బ్లాక్.. ఖాతా ఖాళీ సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడిని (36) డీటీడీసీ కొరియర్ పేరుతో లింక్ పంపి అతని ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు కాజేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఏ కార్యాలయం నుంచి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కోసం వేచి చూస్తున్న యువకుడికి అదే సమయంలో డీటీడీసీ కొరియర్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. పార్సిల్‌ను డెలివరీ చేయడానికి రెండోసారి చేసిన ప్రయత్నం సైతం విఫలమైందనేది దాని సారాంశం. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు వల విసిరారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే ఆయన ఫోన్ స్తంభించిపోయింది. కాసేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు మాయమయ్యాయి. -
లక్షల్లో వేతనాలు.. ఉంటే చాలు ఈ స్కిల్!
నేడు కృత్రిమ మేథ (ఏఐ) వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ప్రతి ఒక్క పనికి ఏఐ చాట్‌బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చాలా తేలిగ్గా, తక్కువ వ్యయంతో అధిక సమర్థతతో పనిచేస్తున్నాయి. నలుగురు చేయాల్సిన పని ఒక్కరితోనే పూర్తవుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలో సమర్థత పెంపులో ఏఐ నైపుణ్యం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది. ఏఐ వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పని విధానాలను సమూలంగా మార్చివేస్తోంది. పని ప్రదేశాన్నే కాదు జీవన విధానాలనే మార్చివేస్తున్న కృత్రిమ మేథ నైపుణ్యం.. తాజా సర్వేల్లో టాప్ స్కిల్‌గా నిలుస్తోంది.ఏఐ స్కిల్ ఉన్న నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. కృత్రిమ మేథపై పట్టున్న వారికి లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటంలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ పరంగా ఏఐ కీలక నైపుణ్యంగా మారింది.మరింత విస్తరణ దిశగామైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు డేటా కేంద్రాలు, ఏఐ మౌలిక వసతులపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఏఐ రంగం మరింతగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలు అదే స్థాయిలో చేపట్టనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో కృత్రిమ మేథ కీలకమైన నైపుణ్యంగా మారనుంది. తాజా నివేదిక అంచనాలుద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్–2025’ ప్రకారం.. అన్ని రంగాలను డిజిటల్ టెక్నాలజీ కమ్మేయనుంది. 2030 నాటికల్లా తమ వ్యాపారాలు పూర్తిగా డిజిటల్‌గా మారతాయని భావిస్తున్నట్లు 60 శాతం మంది పేర్కొనడం విశేషం. అత్యాధునిక సాంకేతికత ముఖ్యంగా ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 86 శాతం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 58 శాతం, ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 41 శాతం డిజిటల్ మార్పులకు కారణం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో ఏఐ, బిగ్‌డేటా, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో.. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్‌లు, బిగ్ డేటా స్పెషలిస్ట్‌లు, ఫిన్‌టెక్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డవలపర్స్, అటానమస్ అండ్ ఈవీ స్పెషలిస్ట్‌లు తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంటుందని తాజా పేర్కొంది. మరోవైపు క్లరికల్, సెక్రటేరియల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా క్యాషియర్స్, టికెట్ క్లర్క్స్, డేటా ఎంట్రీ క్లర్క్స్, బ్యాంక్ టెల్లార్ కొలువుల్లో కోతపడనుంది.అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతున్న నైపుణ్యాల్లో ఏఐ అండ్ బిగ్ డేటా టాప్‌లో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ లిటరసీ నిలిచాయి. ఈ మూడు టెక్ నైపుణ్యాలతోపాటు 2025–2030 మధ్యకాలంలో సృజనాత్మక ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) ఒత్తిళ్లను తట్టుకొనే సామర్థ్యం (రెజిలియెన్స్), సరళత్వం-చురుకుదనం (ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ), కుతూహలం (క్యూరియాసిటీ), జీవితాంతం నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న వారికి కంపెనీలు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.నిపుణుల కొరతఏఐ నిపుణుడిగా మారాలంటే.. ఐఐటీల్లో చదవాలి, టాప్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండాలి అనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.ఓ వైపు ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేరని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మానవ వనరుల నైపుణ్యాలు, కంపెనీల అవసరాల మధ్య తీవ్ర అంతరం నెలకొంది. ఏఐ నిపుణుల కొరత తీర్చేందుకు పెద్ద ఎత్తున అప్‌స్కిల్లింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు.ఏఐ రంగంలో ప్రవేశించాలనుకునే వారు వ్యక్తిగతంగా స్వీయ అసెస్మెంట్ చేసుకోవాలి. జాబ్ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా తమలో నైపుణ్యాలు లేకుంటే వాటిని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మొదట యూట్యూబ్ తదితర ఆన్లైన్ మార్గాల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత బేసిక్ ఆన్లైన్ షార్ట్‌టర్మ్ కోర్సుల ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. స్వయం, ఎన్పీటీఈఎల్ తదితర మార్గాల ద్వారా ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్న ఉచిత కోర్సుల ద్వారా ఏఐపై పట్టు పెంచుకొని జాబ్ మార్కెట్లో అవకాశాల కోసం అన్వేషించొచ్చు!!ఇదీ చదవండి: డిజిటల్ యుగంలో.. ఏఐ హవా! -
భారత యూజర్లకు ఓపెన్ఏఐ బంపర్ ఆఫర్
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) ‘చాట్‌జీపీటీ గో’(ChatGPT Go) సబ్‌స్క్రిప్షన్‌ను భారతీయులకు ఏడాదిపాటు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఈ ప్లాన్‌ను మరో ఏడాదిపాటు డిఫాల్ట్‌గా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారం చివరి నుంచి ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ పొడిగింపునకు సంబంధించి వినియోగదారుల తరఫున ఎటువంటి చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. వారి బిల్లింగ్ తేదీని 12 నెలలకు వాయిదా వేస్తూ చాట్‌జీపీటీ గో అన్ని సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చింది.భారత్‌పై ఓపెన్ఏఐ దృష్టిచాట్జీపీటీ గో (ChatGPT Go)ను భారతదేశంలోని వినియోగదారులకు ఏడాదిపాటు ఉచితంగా అందించనున్నట్లు ఓపెన్ఏఐ ఇటీవల ప్రకటించింది. నవంబర్ 4 నుంచి పరిమిత కాలం పాటు నిర్వహించే ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపింది. భారత్‌లో తొలిసారిగా నవంబర్ 4న బెంగళూరులో డెవ్‌డే ఎక్స్ఛేంజ్ (DevDay Exchange-బైకర్ ప్రోగ్రామ్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే ఈ ఉచిత ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.క్వెరీలు, ఇమేజ్ జనరేషన్ పరిమితులు తక్కువగా ఉండే ఈ చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను భారతీయ వినియోగదారుల కోసం అందుబాటు చార్జీలతో అందించాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐ ఈ ఏడాది ఆగస్టులో దీన్ని ఆవిష్కరించింది.చాట్‌జీపీటీ వర్సెస్ చాట్‌జీపీటీ గోఅంశంచాట్జీపీటీ ఫ్రీచాట్జీపీటీ గోధరఉచితంనెలకు రూ.399 (ప్రస్తుతానికి ఏడాది ఉచితం)ప్రధాన మోడల్GPT-3.5, పరిమిత GPT-5 యాక్సెస్మెరుగైన/ విస్తరించిన GPT-5 యాక్సెస్మెసేజ్ పరిమితులుచాలా పరిమితం, పీక్ అవర్స్‌లో వేగం తగ్గుతుందిఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ మెసేజ్ పరిమితులుఇమేజ్ జనరేషన్పరిమితంగా ఉంటుందిఫ్రీ ప్లాన్ కంటే 10 రెట్లు ఎక్కువ ఇమేజ్ జనరేషన్ఫైల్ అప్లోడ్చాలా పరిమితం (ఎంచుకున్న ఫైల్స్)మరింత ఎక్కువ ఫైల్స్ అప్లోడ్ చేయవచ్చు.డేటా విశ్లేషణప్రాథమిక, పరిమిత యాక్సెస్అడ్వాన్స్డ్ డేటా విశ్లేషణకు మెరుగైన యాక్సెస్కస్టమ్ జీపీటీలుయాక్సెస్ లేదుకస్టమ్ జీపీటీలు, ప్రాజెక్ట్‌లు, టాస్క్‌లకు యాక్సెస్లక్షిత వినియోగదారులుసాధారణ, అప్పుడప్పుడు ఉపయోగించే వినియోగదారులువిద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, మెరుగైన యాక్సెస్ కోరుకునే సాధారణ వినియోగదారులు చాట్‌జీపీటీ గో వర్సెస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్అంశంచాట్జీపీటీ గోమైక్రోసాఫ్ట్ కోపైలట్ప్రధాన ఏకీకరణస్టాండలోన్ చాట్‌బాట్, అన్ని ప్లాట్‌పామ్‌లకు వర్తిస్తుంది (API ద్వారా విస్తృత ఏకీకరణ)మైక్రోసాఫ్ట్ 365 (Word, Excel, Outlook, Teams, GitHub) అప్లికేషన్లలో ఏకీకృతం చేశారు.ప్రధాన లక్ష్యంసాధారణ సంభాషణ, సృజనాత్మకత, కోడింగ్, చిన్న వ్యాపార ఉత్పాదకతమైక్రోసాఫ్ట్ ఎకోసిస్టమ్ (Ecosystem) లోని ఎంటర్ప్రైజ్ ప్రొడక్షన్, పనుల ఆటోమేషన్డేటా సోర్స్ఓపెన్ఏఐ శిక్షణ డేటాసెట్లు + వెబ్ సెర్చ్ఓపెన్ఏఐ మోడల్స్ + బింగ్ సెర్చ్ + వినియోగదారుల సంస్థాగత డేటా (M365 ఫైల్స్)భద్రతయూజర్ డేటాను ఏఐ శిక్షణకు ఉపయోగించకుండా నిలిపివేయవచ్చు (గో, ప్లస్ ప్లాన్లలో)ఎంటర్ప్రైజ్ ప్లాన్లలో స్ట్రక్చరల్ భద్రతాకస్టమ్ టూల్స్కస్టమ్ జీపీటీలను రూపొందించే సామర్థ్యం (గో లో పరిమిత యాక్సెస్)MS 365 యాప్‌లలో నిర్దిష్ట పనులు చేయగల సామర్థ్యం -
అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాబోయే రోజుల్లో ప్రమాదమని చాలామంది.. గతకొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్ 'ముస్తఫా సులేమాన్' కీలక వ్యాఖ్యలు చేశారు.ఏఐ తెలివిగా రోజురోజుకు మారుతోంది. గూగుల్, ఓపెన్ఏఐ, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు.. దీనిని మరింత కొత్తగా మార్చడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అంతేకాకుండా.. ఏఐ ఇప్పటికే మనుషులు చేసే పనులను చేసేస్తోంది. కానీ ప్రస్తుతానికి మనుషులు మాదిరిగా ఆలోచించే జ్ఞానం మాత్రం పొందలేదు. రానున్న రోజుల్లో ఇది మరింత స్మార్ట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. దీనికోసం చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయని ముస్తఫా సులేమాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లనిజానికి.. ఎంత ఖర్చు చేసినా.. మనిషిలా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలు ఏఐకు ఎప్పటికీ రావు. దీనికోసం దిగ్గజ కంపెనీలు చేసే ప్రయత్నాలను ఆపాలని ముస్తఫా సులేమాన్ అన్నారు. ఆఫ్రోటెక్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జీవసంబంధమైన జీవులు మాత్రమే నిజమైన భావోద్వేగం.. బాధలను అనుభవించగలవు. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించాలి అనే ప్రాజెక్టులు మానేసి.. మనిషికి సహాయం చేసే ఏఐ ప్రాజెక్టులపై పనిచేయడం ఉత్తమం అని డెవలపర్లకు సూచించారు. -
డిజిటల్ యుగంలో.. ఏఐ హవా!
‘నేటి డిజిటల్ యుగంలో.. మేనేజ్మెంట్ రంగంలో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. తాజా క్యాంపస్ ఆఫర్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. కాబట్టి మేనేజ్మెంట్ విద్యార్థులు టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది’ అంటున్నారు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరు డైరెక్టర్ (ఇన్ఛార్జ్) ప్రొఫెసర్ యు.దినేశ్ కుమార్. ఐఐటీ–ముంబైలో పీహెచ్డీ, యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పూర్తి చేసి.. దాదాపు మూడు దశాబ్దాలుగా అధ్యాపక రంగంలో కొనసాగుతూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న దినేశ్ కుమార్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..మేనేజ్మెంట్ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రాధాన్యం గురించి చెప్పండి?ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఏఐ ప్రధాన్యం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే కీలకమైన రికార్డ్స్ నిర్వహణ, లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఏఐ ఆధారిత కార్యకలాపాలు మొదలయ్యాయి. మన దేశంలోనూ బిగ్ డేటా, డేటా అనలిటిక్స్‌లో ఏఐ ప్రమేయం ఎక్కువగా ఉంది. మిగతా విభాగాల్లోనూ రానున్న రోజుల్లో ఇది కనిపిస్తుంది. దీంతో మేనేజ్మెంట్ పీజీ విద్యార్థులు అకడమిక్‌గా టెక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.బిజినెస్ స్కూల్స్ ఏఐకు సంబంధించిన బోధన పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?ఇండస్ట్రీ వర్గాలతో చర్చించి డిమాండ్ నెలకొన్న ఏఐ టూల్స్‌ను గుర్తించాలి. విద్యార్థులకు సదరు ఏఐ నైపుణ్యాలు అందించేలా పరిశ్రమ వర్గాలతో కలిసి పని చేయాలి. ఐఐఎం–బెంగళూరు మూడేళ్ల క్రితమే ఎస్ఏపీ ల్యాబ్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఏఐ ఫర్ మేనేజర్స్ పేరుతో 16 నెలల లాంగ్‌టర్మ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చాం. దీనిద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నైపుణ్యాలతోపాటు, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ లభిస్తాయి.మేనేజ్మెంట్ విద్యార్థులకు సలహా?అందుబాటులోని సీట్ల సంఖ్య, పోటీ కారణంగా కొద్దిమందికే ఐఐఎంలలో ప్రవేశం లభిస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందక్కర్లేదు. దేశంలో మరెన్నో ప్రతిష్టాత్మక బి–స్కూల్స్ ఉన్నాయి. విద్యార్థులు తమ దృక్పథాన్ని విస్తృతం చేసుకోవాలి. ఐఐఎంలతోపాటు ఉన్న ఇతర అవకాశాలపై దృష్టి సారించాలి. ఇక కోర్సులో అడుగు పెట్టాక.. విస్తృతమైన ఆలోచన దృక్పథంతో అడుగులు వేయాలి. ఒత్తిడి వాతావరణంలోనూ నిర్ణయాలు తీసుకునే ఆత్మస్థైర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావడం వంటివి సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. అప్పుడే క్లాస్‌రూంలో పొందిన నైపుణ్యాలకు సరైన వాస్తవ రూపం లభించి చక్కటి కెరీర్ సొంతమవుతుంది.నియామకాల్లో ఏఐ నైపుణ్యాలపై కంపెనీల దృక్పథం ఎలా ఉంది?కంపెనీలు సహజంగానే లేటెస్ట్ స్కిల్స్‌పై అవగాహన ఉన్న వారి కోసం అన్వేషణ సాగిస్తాయి. కొన్ని కంపెనీలు.. ఏఐ కార్యకలాపాలు నిర్వహించగలిగే వారిని గుర్తించి వారికి శిక్షణనిచ్చి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. తాజాగా ఐఐఎం– బెంగళూరు సమ్మర్ ప్లేస్‌మెంట్స్‌లో బీసీజీ, బెయిన్ అండ్ కో, టీసీఎస్ వంటి సంస్థలు ఏఐ సంబంధిత విభాగాల్లో ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేశాయి.విద్యార్థుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా దేశంలో సదుపాయాలు ఉన్నాయా?వాస్తవానికి దేశంలో స్టార్టప్స్ కోణంలో గత పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా గత అయిదారేళ్ల కాలంలో స్టార్టప్‌ల దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయం ఉపాధి గురించి ఆలోచించే యువతకు ఎన్నో ప్రోత్సాహకాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. చక్కటి వ్యాపార ఐడియాలు ఉంటే ఆర్థికపరమైన అంశాల గురించి ఆందోళన చెందక్కర్లేదు.స్టార్టప్స్ ఏర్పాటు కోసం అకడమిక్ స్థాయి నుంచే అడుగు వేయాల్సిన అవసరం ఉందా?అకడమిక్ స్థాయిలో స్టార్టప్స్‌కు సంబంధించిన నైపుణ్యాలను బోధించడం వల్ల విద్యార్థులకు థియరీ నాలెడ్జ్ ఏర్పడుతుంది. కాని క్షేత్ర స్థాయిలో అడుగు పెడితేనే వాస్తవాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో స్టార్టప్స్‌కు పెరుగుతున్న ఆదరణ, డిమాండ్ నేపథ్యంలో పలు ఇన్స్టిట్యూట్లు అకడమిక్ స్థాయిలో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులను ప్రవేశ పెడుతున్నాయి. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులతో తమ వ్యాపార ఆలోచనలను సరైన దిశలో కార్యాచరణలో పెట్టేందుకు అవసరమైన మార్గ నిర్దేశం విద్యార్థులకు లభిస్తుంది.ఇటీవల కాలంలో డేటా అనలిటిక్స్ జాబ్ ప్రొఫైల్స్‌కు డిమాండ్ పెరగడానికి కారణమేంటి?విస్తృతంగా ఏర్పాటవుతున్న సంస్థలు, వాటి మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో.. ప్రొడక్ట్ డిజైన్ నుంచి ఎండ్ యూజర్స్ వరకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు.. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తుల పట్ల ఆదరణ ఎలా ఉంది.. సమస్యలు ఏమిటి.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం బిగ్ డేటా అనలిటిక్స్ ఎంతో కీలకంగా మారుతోంది. అందుకే బిగ్డేలా నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ నెలకొంది. ఒకప్పుడు ఆపరేషన్స్ రీసెర్చ్‌లో భాగంగానే ఈ విభాగం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యేక కోర్సుగా రూపొందడమే దీనికి పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనం.మేనేజ్మెంట్ విద్యార్థులు అకడమిక్స్‌తోపాటు ఏఏ అంశాలపై దృష్టి సారించాలి?మేనేజ్మెంట్ విద్యార్థులు అకడెమిక్ నైపుణ్యాల సాధనకే పరిమితమవడం సరికాదు. నైతిక విలువలు, సామాజిక స్పృహ కూడా కలిగుండాలి. కోర్సు, కెరీర్, ఇండస్ట్రీ.. ఏదైనా తుది లక్ష్యం సామాజిక అభివృద్ధికి దోహదపడటమే. కాబట్టి విద్యార్థులు కేవలం క్లాస్ రూం లెక్చర్స్కే పరిమితం కాకుండా.. సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా దృష్టి సారించాలి. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు అనేవి తరగతి బోధనతోనే లభించవు. వీటిని ప్రతి విద్యార్థి సొంతంగా క్షేత్రస్థాయి ప్రాక్టీస్ ద్వారా అందిపుచ్చుకోవాలి.మేనేజ్మెంట్ పీజీలో ఇప్పటికీ టెక్ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి ప్రవేశ పరీక్ష విధానమే కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?ఐఐఎంలలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న క్యాట్ ఇంజనీరింగ్ విద్యార్థులకే అనుకూలం అనే అభిప్రాయం అపోహ మాత్రమే. ఐఐఎంలలోని విద్యార్థుల నేపథ్యాలే ఇందుకు నిదర్శనం. ఐఐఎం– బెంగళూరులో డాక్టర్స్, ఫ్యాషన్ టెక్నాలజీ ఉత్తీర్ణులు, హ్యుమానిటీస్ అభ్యర్థులు.. ఇలా విభిన్న నేపథ్యాలున్న విద్యార్థులు చదువుతున్నారు. క్యాట్ అనేది సామర్థ్యాన్ని పరిశీలించే పరీక్ష మాత్రమే. ఐఐఎంలలో ప్రవేశానికి క్యాట్ కంటే విద్యార్థుల ఆలోచన శైలి కీలకంగా నిలుస్తుంది. -
ఉచితంగా ఏఐ సర్వీసులు ఇస్తే లాభమేంటి?
భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో ఉచితంగా ఏఐ (కృత్రిమ మేధస్సు) సేవలు అందుబాటులో ఉండటం అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఇది వినియోగదారులకు, సాంకేతిక అభివృద్ధికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. మరోవైపు, దేశీయ జనరేటివ్ AI ఆవిష్కరణ, స్థానిక డెవలపర్ల దీర్ఘకాలిక పోటీతత్వానికి ఇది తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తుంది.ఉచిత AI సర్వీసులుఖర్చు లేకుండా ఏఐ సాధనాలను ఉపయోగించే అవకాశం లభించడం వల్ల సామాన్య ప్రజలకు కూడా అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, కంటెంట్ సృష్టికర్తలు తమ పనులను మెరుగుపరచుకోవడానికి, సృజనాత్మకతను పెంచుకోవడానికి దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఉచిత ప్లాట్‌ఫామ్‌లు విద్యార్థులకు, ఔత్సాహిక డెవలపర్లకు ఏఐ మోడల్‌లతో ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి, కొత్త పరిష్కారాలను ఆవిష్కరించడానికి ఒక పరీక్షా వేదికలా పనిచేస్తున్నాయి.ఉదాహరణకు, ఉచిత జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా నివేదికలు రాయడం, ఈమెయిల్‌లకు సమాధానాలు ఇవ్వడం లేదా కోడింగ్‌లో సహాయం పొందడం వంటివి పనిలో వేగం, సామర్థ్యాన్ని పెంచుతాయి.లాభాలు ఉన్నప్పటికీ..ఉచిత సేవలను ఉపయోగించేటప్పుడు వినియోగదారులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన డేటాను ఆయా కంపెనీలకు తెలియకుండానే ఏఐకి ఇస్తున్నారు. ఈ డేటాను ఏఐ మోడల్ శిక్షణకు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఉచిత సంస్కరణలు తరచుగా పరిమిత ఫీచర్లు, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. క్లిష్టమైన పనులకు లేదా మెరుగైన ఫలితాల కోసం వినియోగదారులు తరచుగా పెయిడ్ (చెల్లింపు) సేవలకు మారవలసి వస్తుంది. ఉచితంగా లభించే కొన్ని AI మోడళ్లు ట్రెయినింగ్ డేటాలోని అంశాలను కూడా యూజర్లకు అందించే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారులు తప్పుడు ఫలితాలను పొందవచ్చు.కంపెనీలపై ప్రభావంభారతదేశంలో కొత్తగా జనరేటివ్ ఏఐ మోడళ్లను లేదా ఉత్పత్తులను సృష్టిస్తున్న స్థానిక స్టార్టప్‌లు, డెవలపర్లకు ఇది సవాలుగా మారవచ్చు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు (ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్) తమ ఏఐ సేవలను ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అందించినప్పుడు స్థానిక స్టార్టప్‌లు తమ సర్వీసులకు ధర నిర్ణయించలేవు. అధిక పెట్టుబడి, వనరులు, మెరుగైన మోడళ్లను కలిగి ఉన్న అంతర్జాతీయ సంస్థలతో పోటీపడటం అసాధ్యం. కొత్త కంపెనీ ఉత్పత్తుల ద్వారా లాభాలు సంపాదించడం కష్టమని పెట్టుబడిదారులు గ్రహించినప్పుడు స్థానిక ఏఐ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడం తగ్గిపోతుంది. లాభదాయకత లేకపోవడం వల్ల స్థానిక కంపెనీలు ఆర్ అండ్ డీపై తగినంత పెట్టుబడి పెట్టలేక దేశీయ ఆవిష్కరణకు, ప్రపంచ స్థాయి AI మోడళ్లను నిర్మించడానికి ఆటంకం ఏర్పడుతుంది.ఏఐ సేవలు వాడేటప్పుడు యూజర్లు అనుసరించాల్సినవి..ఉచిత AI సాధనాలు తరచుగా వినియోగదారుల డేటాను శిక్షణ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాయి. కాబట్టి బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు, సున్నితమైన వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ఎప్పుడూ AI సిస్టమ్‌లలో నమోదు చేయకూడదు.ఏఐ సేవలను ఉపయోగించే ముందు ఆ టూల్స్ డేటా వినియోగ విధానాలు తెలుసుకోవాలి. వారు మీ డేటాను ఎలా నిల్వ చేస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఎవరితో పంచుకుంటారు అనే దానిపై అవగాహన కలిగి ఉండాలి.కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పత్రాల్లో ఈ సమాచారాన్ని ఉపయోగించే ముందు ఏఐ డేటాను విశ్వసనీయ మూలాల ద్వారా ధ్రువీకరించాలి.ఇదీ చదవండి: ‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’ -
ఒక్క రూపాయికే జియో హాట్‌స్టార్!?
మనలో చాలా మంది వినియోగించే స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ అదీ ప్రీమియం ఫీచర్లతో ఒక్క రూపాయికే వస్తే.. సూపర్ ఆఫర్ అనుకుంటున్నారు కదా.. ఇలాంటి ఆఫరే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అనేక మంది వినియోగదారులు రూ.1కే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందినట్లు పోస్ట్‌లు చేస్తున్నారు. దానికి సంబంధించిన పేమెంట్ స్క్రీన్షాట్లు కూడా షేర్ చేయడంతో ఈ ఆఫర్‌పై ఉత్సుకత మరింత పెరిగింది.అయితే, జియో లేదా డిస్నీ+ హాట్‌స్టార్ మాత్రం ఇప్పటివరకు ఈ ఆఫర్‌పై అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా జియో ఇలాంటి ఆఫర్లు పరిమితంగా ఎంపిక చేసిన కొంత కస్టమర్లకు మాత్రమే ఇస్తుంటుంది. ఇది కూడా అలాంటి పరిమిత ట్రయల్ లేదా అంతర్గత టెస్టింగ్ దశలో భాగం కావచ్చని అంచనా.ఏముంది ప్లాన్‌లో?ఈ ఆఫర్‌ను పొందిన వినియోగదారుల చెబుతున్నదాని ప్రకారం.. జియోస్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్న అన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, స్పోర్ట్స్, షోలను ప్రకటనలు లేకుండా చూడొచ్చు. డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ 4కే నాణ్యతతో వీడియోలు ఏకకాలంలో నాలుగు డివైజ్‌లలో వరకు చూసే అవకాశం. మొబైల్, టీవీ, టాబ్లెట్, ల్యాప్ టాప్లలో సబ్‌స్క్రిప్షన్‌ను పంచుకునే అవకాశం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోంది.కొన్ని స్క్రీన్షాట్ల ప్రకారం.. 1 రూపాయికి 3 నెలల సబ్స్క్రిప్షన్ అని ఉండగా మరొకొన్నివాటిల్లో వార్షిక సబ్‌స్క్రిప్షన్‌గా కూడా ఉంది. అయితే, ట్రయల్ కాలం 30 రోజులు మాత్రమే ఉండవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ రిన్యూవల్ సమయంలో పూర్తి చార్జీలు వర్తించవచ్చు.ఈ ఆఫర్ జియో సిమ్ వినియోగదారులు మాత్రమే కాకుండా కొంతమంది నాన్-జియో యూజర్లు కూడా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లు రూ.1కే ఒక సంవత్సరం ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ అయినట్లు చెబుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే కనిపించే ప్రమోషన్ కావచ్చని భావిస్తున్నారు. -
ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్
టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్‌బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.క్యూ3లో భారీ లాభాలుగత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్‌లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.ఆంత్రోపిక్ అందించే సేవలుక్లాడ్ (Claude) - జనరేటివ్ ఏఐ అసిస్టెంట్క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్‌ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? -
స్మార్ట్ ఫ్రిజ్: ఫ్రెష్.. ఫ్రెష్‌గా!
ఫ్రిజ్ అంటే కేవలం చల్లగా ఉంచే పెట్టెగా మాత్రమే కాదు. ఇప్పుడది స్మార్ట్, ఫ్రెష్, ఫన్నీ అసిస్టెంట్‌గా కూడా మారింది.రోలింగ్ ఎగ్స్!ఫ్రిజ్ నుంచి గుడ్లను పగిలిపోకుండా బయటకు తీసేటప్పుడు పడే టెన్షన్ కోడి గుడ్డు పెట్టేటప్పుడు కూడా పడి ఉండదేమో అని అనిపిస్తుంటుంది! ఎందుకంటే, ఫ్రిజ్‌లో గుడ్లను పెట్టడం, తీయటం ఒక పెద్ద పని, పైగా వాటికి స్థలం కూడా చాలా కావాలి. ఇక ఆ కష్టాలు మర్చిపోండి! రింకిఫై ఆటోమాటిక్ ఎగ్ రోల్డౌన్ వచ్చింది. ఇది నాలుగు లేయర్ల ఆటోమాటిక్ రోల్డౌన్ సిస్టమ్, గ్రావిటీ ఫీడ్ డిజైన్‌తో వస్తుంది. అందుకే, ఒక చివరి గుడ్డు తీసుకున్న వెంటనే మరో గుడ్డు మీ ముందుకు వస్తుంది. కాబట్టి గుడ్లను తీసుకోవడం చాలా సులభం. ఇందులో ముప్పై గుడ్ల వరకు భద్రంగా నిల్వ చేస్తుంది. వర్టికల్ స్టాక్ డిజైన్ వల్ల ఫ్రిజ్‌లో స్థలం ఎక్కువ సేవ్ అవుతుంది. హై–క్వాలిటీ ప్లాస్టిక్‌తో తయారవడంతో, దీన్ని క్లీనింగ్ చేయడం కూడా సులభం. ధర: రూ. 300.స్మార్ట్ ఫ్రిజ్!రోజూ ఉదయాన్నే పాలు అయిపోయాయి అని ఫ్రిజ్ డోర్ తెరిస్తే కాని తెలియడం లేదా? దీంతో, ఉదయం పాలకోసం వాకింగ్ తప్పడం లేదా. బాధ పడకండి. ఇప్పుడు ఈ విషయాన్ని ఫ్రిజ్ గమనిస్తుంది. ‘బ్రో, ఉదయం కాఫీకి పాలు లేవు!’ అని ఎప్పటికప్పుడు మీకు ఫోన్లో నోటిఫికేషన్ పంపిస్తుంది. ఇంకా పెరుగు, గుడ్లు, కూల్ డ్రింక్స్ అన్నీ చెక్ చేసి, ఏవి లేవో వాటన్నింటితో కలిపి షాపింగ్ జాబితాను కూడా పంపిస్తుంది. ఇలా ఫ్రిజ్ తలుపు తెరవకుండానే, లోపల ఏముందో అన్నది ఫోన్లోనే చూసుకోవచ్చు! అంతేకాదు, ఎవరు చివరి చాక్లెట్ తిన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందంటే? ఇందులో వై–ఫై, టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్ ఉన్నాయి. ‘ఫ్రిజ్, కూల్ చెయ్!’ అని చెబితే అది వినేస్తుంది కూడా! వివిధ బ్రాండ్ల ఆధారంగా ధర రూ. 50,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉండొచ్చు.ఫ్రెష్.. ఫ్రెష్‌గా!ఫ్రిజ్ తెరిస్తే కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇలా ఆకుకూరలు వాడిపోతున్నాయా? పైగా ఎప్పుడూ కొత్త ఆకులు కొనుకోవడం మర్చిపోతుంటారా? టెన్షన్ వద్దు! వేకిజ్ హెర్బ్ కీపర్ తీసుకోండి. ఎందుకంటే ఇది సాధారణ కంటైనర్ కాదు. వేకిజ్ హెర్బ్ కీపర్ ఏబీఎస్ గ్రేడ్ ప్లాస్టిక్ తో తయారైంది, స్ట్రాంగ్ అండ్ సేఫ్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏదైనా ఆకుకూర పెట్టి, కొంచెం నీరు వేసి మూత పెట్టండి అంతే! ఇది ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల లోపల ఏముందనేది స్పష్టంగా చూడొచ్చు. పైగా, ఎయిర్ గ్రూవ్ ఉన్న మూత వల్ల ఆకులు తడిగా, పచ్చగా, ఫ్రెష్‌గా ఉంటాయి. ప్రతి మూడు నుంచి ఐదు రోజుల్లో నీరు మార్చినపుడు, ఆకులు మూడు వారాల వరకు పచ్చగా ఉంటాయి. ధర రూ. 350. -
జియోమార్ట్‌లో ఐఫోన్‌పై భారీ తగ్గింపు!
యాపిల్ హాలిడే సేల్‌ను మిస్ అయ్యారా? ఆందోళన అవసరం లేదు. జియోమార్ట్ ఇప్పుడు ఐఫోన్ ప్రేమికుల కోసం అత్యంత లాభదాయకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) (128బీజీ)మోడల్ ఇప్పుడు జియోమార్ట్‌లో కేవలం రూ.65,990లకే లభిస్తోంది.ఐఫోన్ 16 ప్లస్ 128బీజీ వేరియంట్ అసలు ధర రూ.89,900 కాగా నేరుగా రూ. 23,910 తగ్గింపు అందిస్తోంది. అదనంగా ఎస్బీఐ కో-బ్రాండెడ్ ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ (EMI) లావాదేవీలపై 5% క్యాష్ బ్యాక్ (రూ.1,000 వరకు) లభిస్తుంది. తద్వారా ఫోన్ ధర రూ.64,990 లకు తగ్గుతుంది.అంతేకాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత అదనపు తగ్గింపు పొందవచ్చు. యాపిల్ అధికారికంగా ఐఫోన్ 17 (iPhone 17) విడుదల నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ ధరను తగ్గించినప్పటికీ, జియోమార్ట్ ధరలు అధికారిక స్టోర్ సవరించిన ధర రూ.79,900 కంటే గణనీయంగా తక్కువగా ఉన్నాయి.ఐఫోన్ 16 ప్లస్ ప్రధాన స్పెక్స్డిస్ప్లే: 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ, సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ప్రాసెసర్: యాపిల్ ఏ18 చిప్, 6-కోర్ సీపీయూ, 5-కోర్ జీపీయూకెమెరా సెటప్: 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 2x ఆప్టికల్ క్వాలిటీ టెలిఫోటో జూమ్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా త్వరిత యాక్సెస్బ్యాటరీ: 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్డిజైన్: అల్యూమినియం ఫ్రేమ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్కలర్ ఆప్షన్లు: బ్లాక్, వైట్, పింక్, టీల్, అల్ట్రామెరైన్స్టోరేజ్ ఆప్షన్లు: 128GB / 256GB / 512GB -
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా కొత్త యాప్.. పూర్తి వివరాలు..
డిజిటల్ యుగం మన జీవనశైలిని పూర్తిగా మార్చేసింది. ప్రతి రోజూ మనం ఎన్నో యాప్‌లు ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని చాటింగ్ కోసం, మరికొన్ని వీడియోల కోసం, ఇంకొన్ని షాపింగ్ కోసం.. వాడుతుంటాం. అయితే ఒకే వేదికపై ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వీరీల్స్(Vreels-Virtually Relax, Explore, Engage, Live, Share) రూపొందించారు. ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేశారు.ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా దశలో ఉంది. Play Store, App Storeలో Vreelsను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త అనుభవాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.వెబ్సైట్: www.vreels.comసృజనాత్మకతతో..Vreels ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్‌గా మారొచ్చు. చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీస్‌ను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించుకోవచ్చు. ఇందులోని ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ మరింత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. యాప్‌లోని కొన్ని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.Reels, Pixమీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక క్లిక్‌లో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తి కరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు. ఫిల్టర్లు, టెక్స్ట్, స్టిక్కర్లు, మ్యూజిక్ సపోర్త్‌తో Vreels క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.Pix Pouches.. డిజిటల్ నోట్‌బుక్Pix Pouches అనేది డిజిటల్ నోట్‌బుక్. ఇష్టమైన ఫొటోలను లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవచ్చు. మిత్రులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను ప్లాన్ చేయవచ్చు.Chats, Calls — కనెక్ట్ అయ్యేందుకు..స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్‌లో చాట్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్‌లు అవసరం లేదు. Vreelsలోనే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. వీరీల్స్ క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవచ్చు.V Map — లొకేషన్ షేరింగ్మీ స్నేహితులు లేదా కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో V Mapతో సులభంగా తెలుసుకోవచ్చు. లొకేషన్ షేరింగ్ పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.V Capsules — మధుర జ్ఞాపకాలుఈ ప్రత్యేక ఫీచర్లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక ‘క్యాప్సూల్’లో ఉంచి ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. బర్త్‌డే, యానివర్సరీ, లేదా మైల్స్టోన్.. వంటి ముధుర జ్ఞాపకాలను భద్రపరుచుకొని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం ఆనంద క్షణంగా ఉంటుంది.Vreels Shop/Bid — మీ అవసరాలన్నీ ఒకే చోటVreels షాప్/బిడ్ త్వరలో రాబోతోంది. యూజర్లకు కావాల్సిన ప్రతి ఉత్పత్తిని ఇందులో కొనుగోలు చేయవచ్చు. వెండర్లు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. యూజర్లు నమ్మకంగా ఇందులో బిడ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఇది అంతా ఒకే సురక్షితమైన, సౌకర్యవంతమైన వేదికలో జరుగుతుంది. నమ్మకం, నాణ్యత, విశ్వాసం ఇవే Vreels షాప్/బిడ్ పునాది సూత్రాలని నిర్వాహకులు చెబుతున్నారు.భద్రత.. యూజర్ విశ్వాసమే ప్రాధాన్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు వాడుతారో అన్న సందేహం సహజం. కానీ Vreelsలో మీరు ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూజర్ల డేటాకు అధిక భద్రత ఉంటుంది.టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా యూజర్ పోస్టులు, ప్రొఫైల్, లొకేషన్.. ఎవరు చూడాలో నిర్ణయించే అధికారం పూర్తిగా యూజర్ పరిధిలోనే ఉంటుంది.Vreels ఆవిష్కరణల వేదికVreels ఒక యాప్ మాత్రమే కాదు. అమెరికన్ వ్యాపార స్పూర్తిని, భారతీయ స్వయం ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబించే ఒక వేదిక. ప్రతి అప్డేట్తో కొత్త సాంకేతిక పరిణామాలు, స్థానిక భాషల సపోర్ట్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే మార్పులు తెస్తోంది. ఇది Made for the World అనే స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పటికే Vreels బృందం వినూత్న సాంకేతిక పేటెంట్లను దాఖలు చేసింది. ఇవి ప్రస్తుతం ఆమోద దశలో ఉండగా, త్వరలోనే మంజూరు అవుతాయని అంచనా. ఈ పేటెంట్లు ఆమోదం పొందిన తర్వాత Vreels సాంకేతిక సామర్థ్యం మరింత బలపడటమే కాక, అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు లభించనుంది.Vreels యాప్ డౌన్లోడ్ చేసుకోనే లింక్‌లు కింద ఉన్నాయి.ఆండ్రాయిడ్ యూజర్లుhttps://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsయాపిల్ యూజర్లుhttps://apps.apple.com/us/app/vreels/id6744721098 కింది క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
యాపిల్ ఆదాయం రికార్డ్
వాషింగ్టన్: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ4)లో 102.5 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. వార్షిక ప్రాతిపదికన ఇది 8 శాతం అధికంకాగా.. తద్వారా కంపెనీ చరిత్రలో తొలిసారి ఒక క్వార్టర్లో 100 బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను అధిగమించింది. ప్రధానంగా ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ అమ్మకాలు దన్నుగా నిలిచినట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలియజేశారు. ప్రపంచంలోనే రెండో పెద్ద స్మార్ట్‌ఫోర్ మార్కెట్‌గా నిలుస్తున్న భారత్‌లోనూ రికార్డ్ అమ్మకాలు సాధించినట్లు కుక్ పేర్కొన్నారు. యూఎస్, కెనరా, లాటిన్ అమెరికా, పశి్చమ యూరప్, మధ్యప్రాచ్యం, జపాన్ తదితర పలు ప్రాంతాలలో అమ్మకాలు జోరందుకున్నట్లు వెల్లడించారు. గత కొద్ది నెలలుగా భారత్, యూఏఈ తదితర వర్ధమాన మార్కెట్లలో కొత్త స్టోర్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఆదాయంలో ఐఫోన్ల విక్రయాల ద్వారా 49 బిలియన్ డాలర్లు అందుకున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో కెవన్ పరేఖ్ పేర్కొన్నారు. ఇది 6 శాతం వృద్ధి కాగా.. పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 416 బిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. కంపెనీ అక్టోబర్–సెపె్టంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
దేశంలో డేటా సెంటర్ల దూకుడు.. త్వరలోనే డబుల్..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల (డీసీ) సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్టులను వేగవంతం చేస్తే 2030 నాటికి అయిదు రెట్లకు పెరగనుంది. డేటా లోకలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డీసీ సామర్థ్యం ఉండగా, 1.4 గిగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 5 గిగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది.దీనికి తోడు టీసీఎస్ సైతం 6.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండగా, మెటా–గూగుల్ భాగస్వాములుగా జామ్‌నగర్‌లో సమగ్ర ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జియో ఇటీవల ప్రకటించింది. అలాగే ఏడబ్ల్యూఎస్ భారత్‌లో క్లౌడ్ కెపాసిటీని 2030 నాటికి 13 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టనుంది. -
యూపీఐ లావాదేవీల్లో గుత్తాధిపత్యం!
న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల్లో 80 శాతాన్ని కేవ లం 2 సంస్థలు (ఫోన్‌పే, జీపే) నియంత్రిస్తున్నాయంటూ.. ఈ ఏకాగ్రత రిస్క్‌ను తగ్గించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ, ఆర్బీఐని ఇండి యా ఫిన్‌టెక్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) కోరింది. ఫిన్ టెక్ పరిశ్రమకు స్వీయ నియంత్రణ మండలిగా వ్య వహరిస్తున్న ఐఎఫ్ఎఫ్.. ఇందుకు సంబంధించి వి ధాపరమైన సూచనలు చేసింది. ఐఎఫ్ఎఫ్లో భాగమైన ఫిన్‌టెక్ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపింది. → యూపీఐపై 30 థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (టీపీఏపీలు) ఉండగా.. 80 శాతానికిపైగా లావాదేవీలు రెండు సంస్థల నియంత్రణల్లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీ ధరలతో (భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు)తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. ముఖ్యంగా చిన్న సంస్థలు, దేశీ పోటీదారులను పోటీపడకుండా చేస్తాయి. → ప్రభుత్వానికి చెందిన భీమ్ ప్లాట్‌ఫామ్ సైతం ఈ ద్వందాధిపత్యం దెబ్బకు మార్కెట్ వాటాను కోల్పోయింది. → యూపీఐ లావాదేవీలను నగదుగా మార్చుకునే అవకాశం (ఎండీఆర్ చార్జీలు) లేకపోవడం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఉన్న నిధుల వెసులుబాటు.. కొత్త సంస్థలు, చిన్న సంస్థల ప్రవేశానికి గట్టి అవరోధంగా నిలుస్తాయి. పోటీని అణచివేస్తాయి. → ఒక సంస్థ గరిష్టంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయడంలో ఎన్పీసీఐ జాప్యం చేస్తుండడం నిర్వహణపరమైన సవాళ్లను, ఏకాగ్రత రిస్‌్కను తెలియజేస్తుంది. ఎన్పీసీఐ ఈ పరిమితి అమలు చేయడానికి ముందుగానే ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతించడం.. వ్యూహాత్మకమే అనిపిస్తోంది. → ఈ ఏకాగ్రత రిస్‌్కను తగ్గించేందుకు బడా రెండు యూపీఐ సంస్థలు (టీపీఏపీలు) కాకుండా మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సదరు రెండు అతిపెద్ద టీపీఏపీలు ప్రోత్సాహకాల్లో అధిక భాగాన్ని పొందుతాయి. ఒక టీపీఏపీకి ప్రోత్సాహకాల్లో 10 శాతం గరిష్ట పరిమితి విధించాలి. -
జియో యూజర్లకు బంపరాఫర్: రూ.35000 విలువైన సర్వీస్ ఫ్రీ!
అన్లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్స్క్రైబర్లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్లిమిటెడ్ 5G ప్లాన్లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్లిమిటెడ్ ప్లాన్లకు (ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్ యాక్టివ్‌లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.FREE BENEFITS WORTH ₹35,100 🎉FREE pro plan of Google Gemini for 18-months (worth ₹35,100) for Jio users aged 18–25 years (early access) using an eligible Unlimited 5G plan.Enjoy unlimited chats, 2TB cloud storage, video generation on Veo 3.1, image generation with Nano… pic.twitter.com/O5Pqpo2K4r— Reliance Jio (@reliancejio) October 30, 2025 -
నేటి నుంచి స్టార్‌లింక్ సర్వీసుల డెమో
స్టార్‌లింక్ అక్టోబర్ 30 (నేడు), 31న తమ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవల సెక్యూరిటీ, సాంకేతిక ప్రమాణాల పరీక్షలను ముంబైలో నిర్వహించనుంది. కంపెనీకి ప్రొవిజనల్‌గా కేటాయించిన స్పెక్ట్రం ఆధారంగా ప్రభుత్వ ఏజెన్సీల సమక్షంలో వీటిని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.స్టార్‌లింక్‌కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్‌ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్‌లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్‌లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ‘ఆదాయపన్ను తగ్గించాలి’


