స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో ‘పోకో ఎం8 5జీ’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మిడ్‌రేంజ్ ధర విభాగపు కస్టమర్లే లక్ష్యంగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. 6.77 అంగుళాల 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో తడిచేతులతో ఉపయోగించినా, తేలికపాటి వర్షంలోనూ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్ అందించారు.
ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,520ఎంహెచ్‌ఏ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, అలాగే 18డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఉంటాయి. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.
6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.21,999గా.. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.


