షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌! | Centre Says No Need To Share Your Mobile Numbers At Malls Or Retail Stores Shopping Bills, More Details Inside | Sakshi
Sakshi News home page

షాపింగ్‌ బిల్లుకు నో ఫోన్‌నెంబర్‌!

Feb 26 2026 8:37 AM | Updated on Feb 26 2026 10:41 AM

dont want your shopping bills tied to phone number

షాపింగ్‌ మాల్స్‌ ఎంట్రీ వద్ద.. రిటైల్‌ స్టోర్లలో బిల్లింగ్‌ దగ్గర మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ అడుగుతున్నారా..? వారు అడిగిన వెంటనే చెప్పేస్తున్నారా..? అవసరం లేదు. వ్యక్తిగత మొబైల్‌ నంబర్‌ను వాణిజ్య కేంద్రాల వద్ద ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయాన్ని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. షాపింగ్‌ మాల్స్, రిటైల్‌ స్టోర్లకు ఈ విషయమై ప్రభుత్వం ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అంటూ లోక్‌సభ ఎంపీ జనార్థన్‌ సింగ్‌ సిగ్రివాల్‌ లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా లెవనెత్తగా.. కేంద్రం బదులు ఇచ్చింది.

రిటైలర్లకు వాటి అసోసియేషన్ల ద్వారా ఈ విషయంలో 2023 మే 26న సూచలను జారీ చేసినట్టు చెప్పారు. వీటి ప్రకారం.. వినియోగదారుల అభీష్టం మేరకే మొబైల్‌ నంబర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్‌ నంబర్‌ వెల్లడించాలని ఏ నిబంధన కూడా నిర్దేశించడం లేదు. నంబర్‌ వెల్లడించేందుకు వినియోగదారులు తిరస్కరించొచ్చు. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2023, డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ రూల్స్‌ 2025 అన్నవి పౌరుల వ్యక్తిగత డేటా (మొబైల్‌ నంబర్లు సహా) దుర్వినియోగం కాకుండా, తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయినట్టు గురిస్తే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు.

ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement