టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గురువారం(ఫిబ్రవరి 26) పెళ్లి చేసుకోనున్నారు.
ఉదయ్‌పుర్ వేదికగా జరిగే ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరు కానున్నారు.
ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరుగుతుంది. సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది.
మంగళవారం సాయంత్రం జరిగిన సంగీత్ ఈవెంట్‌తో పెళ్లిసందడి మొదలైంది. విజయ్-రష్మిక ఫ్యామిలీస్ సరదాగా ఓ క్రికెట్ మ్యాచ్ ఆడారు.
ఇక పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఆరావళి పర్వాతల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్'ని బుక్ చేశారు. ఇందులోనే పెళ్లి జరగనుంది.
రష్మిక-విజయ్ పెళ్లికి ఏకంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. తమన్నా తదితరులు కూడా విషెస్ చెబుతున్నారు.
విజయ్‌తో పనిచేసిన తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే పెళ్లి వేదికకు చేరుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
విజయ్ విషయానికొస్తే.. తెలంగాణ కుర్రాడు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ఆరంభించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి హిట్స్ అందుకున్నాడు.
రష్మిక విషయానికొస్తే కర్ణాటకకు చెందిన అమ్మాయి. విజయ్ దేవరకొండతోనే గీతగోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్ చేసింది.
స్నేహంతో మొదలైన వీళ్ల బాండింగ్.. తర్వాత ప్రేమ, రిలేషన్ నుంచి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.
ఆస్తుల విషయానికొస్తే.. విజయ్‌కి రూ.50-70 కోట్లు ఉండగా, రష్మికకు కూడా రూ.70 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన సందేశం


