breaking news
Wedding
-
‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు!
చెన్నై: తమిళనాడుకు చెందిన నలుగురు తోబుట్టువులు అనుకోని విషాదాల కారణంగా చిన్నతనంలోనే విడిపోయారు. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఒక పెళ్లి ఫొటో సాయంతో మళ్లీ ఒక్కటయ్యారు. కేరళలోని ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్‌లో కనిపించిన ఈ భావోద్వేగ ఉదంతం అందరినీ కంటతడి పెట్టించింది. తమిళనాడులోని కళ్లకురిచ్చికి చెందిన ఈ కుటుంబంలో తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మద్యానికి బానిస కావడంతో పెద్ద కుమార్తె సరస్వతి (5), శరణ్య (4), కుమారులు సురేష్, ఉమేష్ రోడ్డుపాలయ్యారు.తండ్రి తన కుమార్తె శరణ్యను వేరే కుటుంబానికి విక్రయించి, మిగతా ముగ్గురు పిల్లలతో కేరళకు వలస వెళ్లాడు. 2002లో కన్నూరులో చిన్నారుల దుస్థితిని చూసిన కొల్లంనకు చెందిన అధికారి కలయపురమ్ జోస్, ఆయన భార్య మినీ వారిని చేరదీసి 'ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్'ను ఏర్పాటు చేసి పెంచారు. సరస్వతి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, రెండేళ్ల క్రితం కన్నూరుకు చెందిన నితిన్‌ను వివాహం చేసుకుంది. తమ్ముళ్లు సురేష్, ఉమేష్ ఐటీఐ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.మరోవైపు శరణ్య సేలంలో పెరిగి, ఎం.ఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలిగా స్థిరపడి హైదరాబాద్‌కు చెందిన రఘురామ్‌ను వివాహం చేసుకుంది. తోబుట్టువుల కోసం వెదుకుతున్న తరుణంలో శరణ్యకు రెండేళ్ల క్రితం జరిగిన సరస్వతి వివాహ వార్త, ఫొటోలు దొరికాయి. ఆ ఫొటోలోని మహిళతో తనకు ఉన్న పోలికల ఆధారంగా ఆమె కేరళలోని ఆశ్రయ్ను సంప్రదించింది. చివరకు శరణ్య తన భర్త, పిల్లలతో హైదరాబాద్ నుంచి రాగా, సరస్వతి తన భర్తతో కన్నూరు నుంచి వచ్చి ఆశ్రయ్‌లో కలుసుకున్నారు. 26 ఏళ్ల తర్వాత నలుగురు తోబుట్టువులు ఒకరినొకరు హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన నిర్వాహకులు, స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.ఇది కూడా చదవండి: ‘బిగ్ బీ’ రికార్డు: 83 ఏళ్ల వయసులో 24 గంటల షిఫ్ట్! -
ఈ పెళ్లి కార్డు తులసి మొక్కగా మారుతుంది!
సాధారణంగా పెళ్లి కాగానే కార్డును బయట పడేస్తాం. కానీ, ఈ కార్డును బయట పడేయకుండా మట్టికుండీలో పెట్టి పైన మట్టిని వేసి నీరు పోస్తే వారం రోజుల వరకు కార్డు మట్టిలో కరిగిపోయి అందులోంచి తులసీ మొక్క బయటకు రావడం విశేషం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ గుప్తా వ్యాపారరీత్యా నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నాడు. నిరుపేదల కోసం సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్‌లో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాలు, బాడీ ఫ్రీజర్లు సమకూరుస్తున్న ఆయన కూతురు వివాహానికి వినూత్నంగా ఆలోచించాడు. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా కార్డును తయారు చేయించాడు. పెళ్లి అయిన తర్వాత మంచిరోజు చూసుకుని ఆహ్వానపత్రికను మట్టితో కూడి పాత్రలో పెట్టాలని, వారంరోజులకు తులసీ మొక్క వస్తుందని పేర్కొన్నాడు. పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నట్లు వివరించాడు.– కోనరావుపేట(వేములవాడ) -
హనీమూన్ హత్య.. తెరపైకి క్యాటరింగ్ బిల్లు వివాదం!
ఇండోర్: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వివాహం జరిగి 15 నెలలు గడుస్తున్నా, వేడుకల క్యాటరింగ్ బిల్లు అందకపోవడంతో కేటరర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ మేఘాలయాలో హనీమూన్ సమయంలో హత్యకు గురైన విషయం విదితమే. ఈ సంచలన కేసులో తాజాగా క్యాటరింగ్ బకాయిల వివాదం తెరపైకి వచ్చింది.2025 మే నెలలో రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం ఘనంగా జరిగింది. అనంతరం మేఘాలయ వెళ్లిన రాజా హత్యకు గురయ్యారు. సోహ్రా ప్రాంతంలోని ఓ లోయలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహతో పాటు ముగ్గురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది.కాగా వివాహ వేడుకల నిమిత్తం ఇండోర్‌కు చెందిన క్యాటరర్ హితేష్ రోహిరాకు ఇరు కుటుంబాలు రూ.11,42,550 విలువైన కాంట్రాక్టును అప్పగించాయి. ఇందులో రూ.8,60,000 మాత్రమే చెల్లించగా, ఇంకా రూ.2,82,550 బకాయి ఉందని హితేష్ తెలిపారు. ఈ బకాయిల చెల్లింపు కోసం రాజా సోదరుడు విపిన్ రఘువంశీని, సోనమ్ సోదరుడు గోవింద్ రఘువంశీని సంప్రదించినప్పటికీ ఇరు కుటుంబాలు వారు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు.ఎవరి నుంచి స్పందన లేకపోవడంతో హితేష్ ఏప్రిల్ 1న లీగల్ నోటీసు పంపి, ఆ తర్వాత ద్వారకాపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు, తమ కుటుంబానికి ఎలాంటి బకాయిలు లేవని విపిన్ తెలిపారు. సోనమ్ సోదరుడే క్యాటరర్‌ను బుక్ చేశాడని ఆయన వాదించారు. గోవింద్ స్పందిస్తూ.. 15 నెలల తర్వాత మరో ప్రచారం కోసమే క్యాటరింగ్ బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ విచిత్ర పరిణామం ఇప్పుడు చర్చనీయాంశమైంది.ఇది కూడా చదవండి: బుర్ఖాలో కన్వర్ యాత్ర.. సంభల్‌లో మళ్లీ ఉద్రిక్తత! -
మెడలో తాళితో 'బిగ్‌బాస్' ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్.. మెడలో తాళిబొట్టుతో కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈమెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరిని పెళ్లి చేసుకుందా అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: గృహహింస.. సీరియల్ నటికి అత్తారింట్లో వేధింపులు)శ్రీకాకుళానికి చెందిన సాయితేజ తర్వాత కాలంలో లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. కానీ ఈ విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచానని గతంలో ఓసారి ప్రియాంక చెప్పుకొచ్చింది. అయితే బిగ్‌బాస్ 5లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో తానొక ట్రాన్స్‌జెండర్ అనే విషయం తన తండ్రికి తెలిసేలా బయటపెట్టింది.ఈ షో నుంచి బయటకొచ్చేసిన తర్వాత పలు రియాలిటీ షోల్లో కనిపించిన ప్రియాంక సింగ్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గానే ఉంటుంది. వ్రతాలు, పూజాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మెడలో తాళిబొట్టుతో కనిపించేసరికి సరదాగా ఇది పెట్టిందా? లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుందా అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: మిడిల్ క్లాస్ తండ్రిగా రవితేజ.. 'ఇరుముడి' మరో సాంగ్ రిలీజ్) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
పూజా హెగ్డే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి?
రీసెంట్ టైంలో రష్మిక పెళ్లి చేసుకుంది. మరో ఒకరిద్దరూ హీరోయిన్లు కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా త్వరలో కొత్త జీవితం ప్రారంభించనుందని, పెద్దల కుదిర్చిన సంబంధానికి ఓకే చెప్పిందని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలివి ఎందుకొచ్చాయ్?(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్)ఒకప్పుడు తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్డమ్ సొంతం చేసుకున్న పూజాహెగ్డే.. ప్రస్తుతం హిందీ, తమిళంలో మాత్రమే చేస్తోంది. ఈమె నటించిన 'జన నాయగన్' వారం క్రితమే రిలీజైంది. కానీ ఈమెకే పెద్దగా పేరు రాలేదు. అంతకు ముందు హిందీలో ఓ మూవీ చేసింది. ఇందులోనూ గ్లామర్ చూపించినప్పటికీ సక్సెస్ అందుకోలేదు.ప్రస్తుతానికైతే పూజా చేతిలో కాంచన 4, దుల్కర్ సల్మాన్ చేస్తున్న తెలుగు మూవీ 'శ్రీశ్రీ'లో నటిస్తోంది. అయితే ఈమెకు ఆఫర్స్ తగ్గిపోవడంతో మూవీస్ చేయడం మునుపటిలా లేదు. ఈ క్రమంలోనే పూజా.. ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకోనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదనిపిస్తోంది. లేదంటే ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ) -
ఈ వయసులో మళ్లీ పెళ్లి!
తాతకు మళ్లీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఓ మనవడి చిలిపి ఆలోచన ఆరు దశాబ్దాల వివాహ జీవితాన్ని ఒక్కసారిగా నెమరేసుకునేలా చేసింది.అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఫిలిప్ విన్హామ్ తన తాతయ్య అమ్మమ్మలకు జీవితాంతం గుర్తుండిపోయే సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. డేవిడ్, బెకీ రోచ్‌లకు 1967లో పెళ్లయింది. అప్పటి పెళ్లి ఫొటోలను ఎప్పుడు చూసినా వారిరువురు మురిసిపోతుంటారు.ఇది గమనించిన విన్హామ్ ఆ పాతబడ్డ ఫొటోలను తీసుకుని వారిరువురు ఇప్పుడు ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా... అని ఆలోచించాడు. ఆ ఫొటోలను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలా షేర్ చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఫొటోలకు వేలకొద్దీ కామెంట్లు వచ్చిపడ్డాయి. వయసు శరీరానికే కాని ప్రేమకు కాదని, ఆరు దశాబ్దాలైనా బంధం ఇంకా దృఢంగానే ఉందంటూ నెటిజెన్లు మెచ్చుకున్నారు. -
వైరల్ అవుతున్న తండ్రి–కూతురు బంధం..
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు. ఈ పద్ధతిని అక్కడ ఫస్ట్ లుక్ అని పిలుస్తారు.పక్క రూమ్‌లో లూయిస్ వాళ్ల నాన్న గ్యారీ మెక్అఫే కూడా ఎప్పుడెప్పుడు కూతురు తన ముందుకొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు. అలంకరణ పూర్తయిన తర్వాత లూయిస్ తన తల్లితో పాటు గ్యారీ వద్దకు వచ్చింది. తండ్రి చేతులను తీసుకుని తన వెడ్డింగ్ గౌనును స్పృశింపజేసి డిజైన్ ఎలా ఉందని అడిగింది. గ్యారీకి మాటల్లేవు. తర్వాత లూయిస్ శిరోజాలను, తన ఆభరణాలను తాకుతూ బాగుందని గ్యారీ చెబుతుండగా, లూయిస్ ‘మీ పెళ్లికి అమ్మ వేసుకున్న గౌన్ డిజైన్‌లానే నా గౌన్ని కూడా డిజైన్ చేయించా నాన్న’ అంటూ చెప్పింది.మరి చెప్పాలి కదా.. కన్నరోజు నుంచి కంటిరెప్పలా కాపాడుకుంటున్న ఆ తండ్రికిప్పుడు చూపు లేదు మరి..! లూయిస్ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో గ్యారీ ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడు. పోయింది చూపే కానీ ప్రేమ కాదు కదా! అందుకే. తన చేతుల్లో పెరిగిన బిడ్డను కళ్లారా చూడలేకపోయినా మనసారా స్పృశిస్తూ కళ్లనిండా ఆనంద బాష్పాలు నింపుకున్నాడు ఆ తండ్రి. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది. -
పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం
హైదరాబాద్: త్వరలో పెళ్లి జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వివాహం నిశ్చయమై జీవితాంతం కలిసి ఉండాల్సిన కాబోయే దంపతులు దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందింది. హైదరాబాద్‌లోని శాస్త్రీపురం ప్రాంతానికి చెందిన సానియాబేగం (20), ఫలక్‌నుమాకు చెందిన మునీర్ (24)కు ఇటీవల వివాహం నిశ్చయమై, ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ క్రమంలో మొక్కు చెల్లించుకునేందుకు కాబోయే దంపతులిద్దరూ శనివారం ఇళ్లలో చెప్పి బైక్‌పై జేపీదర్గాకు వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని హెచ్ఐఎల్ పరిశ్రమ వద్ద వెనుక నుంచి అతివేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సానియాబేగం తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మునీర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఖైరాఉనీ్మసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు
-
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్‌లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్‌లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
పెళ్లి చేసుకున్న ఫేమస్ యూట్యూబర్.. ఏడాదికి రూ.600 కోట్ల సంపాదన
ప్రపంచంలో ఫేమస్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. రకరకాల గేమ్స్ పెడుతూ దానధర్మాలు చేస్తూ సదరు వీడియోలని పోస్ట్ చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వీడియోలు, దానికి వచ్చే యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.300 కోట్లు, ఇతర బిజినెస్‌లతో మరో రూ.300 కోట్లు సంపాదించే ఈ ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు సింపుల్‌గా తన ప్రేయసి థియాని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్, థియా బూయ్‌సెన్.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2022లో దక్షిణాఫ్రికాకి వెళ్లినప్పుడు గేమర్, రైటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అయిన థియాని బీస్ట్ తొలిసారి కలిశాడు. తర్వాత ట్విటర్లో మాట్లాడుకున్నారు. తర్వాత స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే ఏడాది జరిగిన కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమంలో తొలిసారి వీళ్లిద్దరూ జంటగా కనిపించారు. ఇక 2024 క్రిస్మస్ నాడు కుటుంబ సభ్యుల సమక్షంలో జిమ్మీ థియాకు ప్రపోజ్ చేశాడు.వారం క్రితం అంటే జూలై 14న ప్రముఖ బిజినెస్‌మ్యాన్ రిచర్డ్ బ్రాన్సన్‌కి చెందిన నెకర్ ఐలాండ్‌లో జిమ్మీ-థియా పెళ్లి చేసుకున్నారు. బీస్ట్ చాలా పెద్ద యూట్యూబర్ అయినప్పటికీ పెద్దగా హడావుడి లేకుండా దాదాపు 70 మంది కుటుంబ సభ్యులు, బంధవులు, స్నేహితులు సమక్షంలో ఈ వివాహం చేసుకున్నాడు.వారం పాటు ఈ వేడుకలు సాగినట్లు తెలుస్తోంది. తన పెళ్లి ఫొటోలని బీస్ట్ పోస్ట్ చేయగా.. అభిమానులతో పాటు పలువురు ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు, స్నేహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రపంచంలోనే చాలా ఫేమస్ యూట్యూబర్లలో ఒకడైన మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్ సన్.. తన పెళ్లిని మీడియా హడావుడికి దూరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వ్యక్తిగతంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు గతంలో పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అలానే చేసుకోవడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
పెళ్లిలో ప్రాంక్ తెచ్చిన తంట..! పాపం ఆ వధువు స్నేహితురాలు..
పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది. గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు. వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..) -
విదేశీయుడితో సీరియల్ నటి రెండో పెళ్లి (ఫొటోలు)
-
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్
తెలుగులో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ షర్మిలా మాండ్రే పెళ్లి చేసుకుంది. తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలని కాస్త ఆలస్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తోటీ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన షర్మిలా మాండ్రే..2007 నుంచి దక్షిణాదిలోని తెలుగు, కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తోంది. తెలుగులో 2013లో వచ్చిన అల్లరి నరేశ్ 'కెవ్వు కేక' మూవీలో హీరోయిన్గా చేసింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు చిత్రాల్లో నటించింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్షిప్ మెంటైన్ చేసింది.గత నెల 28న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఈ నెల 12వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఫొటోలని వారం రోజులు ఆలస్యంగా షర్మిలా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ సుందరం అని క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం షర్మిలా తమిళంలో ఓ మూవీ చేస్తుండగా, సుధాన్ తన ప్యాషన్ స్టూడియోస్ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే విజయ్ సేతుపతితో 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో ప్రిన్స్) -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరో
వైజాగ్ కుర్రాడు ప్రిన్స్ పెళ్లికి రెడీ అయ్యాడు. తెలుగులో బస్ స్టాప్ సహా పలు సినిమాల్లో హీరోగా నటించాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో సహాయ నటుడిగా మారి నేను శైలజ, డీజే టిల్లు తదితర చిత్రాలు చేశాడు. చివరగా ఈ ఏడాది మార్చిలో రిలీజైన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీలో కనిపించాడు. గతంలో బిగ్‌బాస్ తొలి సీజన్లోనూ పాల్గొన్న ప్రిన్స్.. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్నాడు.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)గత నెల ప్రారంభంలోనే సాయి మాచిరాజు అనే అమ్మాయితో ప్రిన్స్ నిశ్చితార్థం జరిగింది. ఈ మేరకు ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను ఓ ఇంటివాడిని కాబోతున్న సంగతి బయటపెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఓ ఫ్రెండ్ పెళ్లి తామిద్దరం కలుసుకున్నామని అలా స్నేహితులం అయ్యామని చెప్పాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నట్లు ప్రిన్స్ చెప్పుకొచ్చాడు.ఇక ప్రిన్స్‌ని చేసుకోబోయే సాయి మాచిరాజు కుటుంబం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉంటోంది. ఈమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెల 24వ తేదీన పెళ్లి కూడా న్యూజిలాండ్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్, సాయికి కామన్ ఫ్రెండ్ నటుడు ప్రియదర్శి. తాజాగా ప్రిన్స్ తాను ప్రపోజ్ చేసిన వీడియోని పోస్ట్ చేయగా అందులో ప్రియదర్శితో పాటు ఇరువురి సన్నిహితులు కూడా కనిపించారు.(ఇదీ చదవండి: విదేశీయుడిని పెళ్లి చేసుకున్న హిందీ సీరియల్ నటి) View this post on Instagram A post shared by Stone Photography ® (@stonephotography.in) -
విదేశీయుడిని పెళ్లి చేసుకున్న సీరియల్ నటి
మన దేశంలో సినిమాల కంటే సీరియల్స్‌కే క్రేజ్ ఎక్కువ. అందుకు తగ్గట్లే వాటిలో నటించేవాళ్లు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. అలా భారతీయ టీవీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్లలో హిందీ నటి జెన్నిఫర్ వింగెట్ ఒకరు. 'కసౌటీ జిందగీ కే', 'సరస్వతీ చంద్ర', 'బేహద్', 'బేపన్నా', 'కోడ్ ఎం' తదితర సీరియల్స్‌తో ఈమెకు మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడీమె రెండో పెళ్లి చేసుకుని అభిమానులని సర్ప్రైజ్ చేసింది.(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)జెన్నిఫర్ గతంలో 'దిల్ మిల్ గయే' సీరియల్ చేసింది. ఇందులో నటిస్తున్న టైంలోనే సహ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ని ప్రేమించింది. 2012లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థలతో రెండేళ్లకే అంటే 2014లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న జెన్నిఫర్ గురించి కొన్నాళ్ల ముందు మళ్లీపెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఈమె స్పందించలేదు. దీంతో అవి పుకార్లు మాత్రమేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారికంగా తన వివాహం గురించి ప్రకటన చేసింది.గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పెడుతూ జెన్నిఫర్ వింగెట్.. తన పెళ్లి వీడియోని షేర్ చేసింది. సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్ని తన భర్తగా పరిచయం చేస్తూ వివాహం సంగతి అధికారికంగా ప్రకటించింది. యూకేలోని ఓ చర్చిలో సన్నిహితుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది.నూతన దంపతులుగా మొదటిసారి కలిసి నడవడం, ఉంగరాలు మార్చుకోవడం, తొలి ముద్దు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలను ఆస్వాదించడం లాంటి మధుర క్షణాలని ఈ వీడియోలో పంచుకుంది. ఇక జెన్నిఫర్ పెళ్లి గురించి పోస్ట్ పెట్టడంతో సహ నటీనటులు కొత్తజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి) View this post on Instagram A post shared by Jennifer Winget (@jenniferwinget1) -
ట్రెండ్ మారుతోంది! పెళ్లంటే ఒకప్పుడు...
పెళ్లంటే ఒకప్పుడు బంధు మిత్రుల కోలాహలం మధ్య సొంత ఊరిలో ఇంటి ముందర పచ్చని పందిరిలో ఘనంగా జరుపుకునే వేడుక. కానీ నేడు వివాహ వేడుకల శైలి వేగంగా మారిపోతోంది. గతంలో కేవలం సంపన్నులకే పరిమితమైన డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి.. ఇప్పుడు మధ్యతరగతి వర్గాల్లోనూ ఒక ముఖ్యమైన ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం వివాహాల్లో దాదాపు 25 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావడం విశేషం.వివాహ వేడుకలు క్రమక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయి. విలాసవంతమైన రిసార్టులు, అందమైన బీచ్‌లు, చారిత్రక కోటల వేదికగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు నేటి తరం యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్ వెడ్‌మీగుడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు వివాహాలలో ఒకటి డెస్టినేషన్ వివాహం కావడం.. వివాహాల్లో మార్పులు జరుగుతున్న తీరును కళ్లకు కడుతోంది.పర్యాటకానికే ప్రాధాన్యంగతంలో వేలాది మంది అతిథులను పిలిచేవారు. కానీ ఈ డెస్టినేషన్ మ్యారెజ్‌లో అతిథుల సంఖ్య పరిమితం. వచ్చిన వారికి ఒక గొప్ప పర్యాటక అనుభూతిని అందించేలా వేడుకలను ప్లాన్ చేసేందుకే యువ జంటలు మొగ్గు చూపుతున్నారు. గతంలో సగటున ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే సాగే ఈ వేడుకలు, ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా సాగుతున్నాయి.తగ్గేదే లేదు!అయితే ఈ తరహా వివాహాల కోసం ఖర్చు చేసేందుకు కూడా జంటలు ఏమాత్రం వెనుకాడటం లేదు. దేశంలో జరిగే డెస్టినేషన్ వివాహాలలో పెళ్లిళ్ల సగటు బడ్జెట్ సుమారుగా రూ. 58 లక్షలు ఉంటుంది. అదే విదేశాలలో జరిగే వివాహాల సగటు బడ్జెట్ రూ. 1.5 కోట్లు దాటుతోంది. అయినప్పటికీ యువత డెస్టినేషన్ వివాహాల వైపే మొగ్గుచూపుతోంది.హాట్‌స్పాట్‌గా శ్రీలంకవిదేశీ గమ్యస్థానాలలో థాయిలాండ్ ముందంజలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం శ్రీలంక భారతీయ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ డెస్టినేష¯Œ గా అవతరించింది. శ్రీలంక భారతదేశానికి చాలా దగ్గరగా ఉండటం ఒక కారణమైతే భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం, అద్భుతమైన బీచ్‌లు, లగ్జరీ హోటళ్లు, తక్కువ ఖర్చుతో కూడిన ΄్యాకేజీలు అందుబాటులో ఉండటం మరొక అంశం. శ్రీలంకతో పాటు బాలీ, వియత్నాం, మలేషియా వంటి దేశాలు కూడా రేసులో దూసుకుపోతున్నాయి.మన దగ్గర టాప్ డెస్టినేషన్స్ ఇవే..డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో సుమారు 90 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి. వీటిలో ఉత్తరాది హిల్ స్టేషన్లు, రాజస్థాన్ రాజభవనాలు ముందంజలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఉన్న డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ పర్వతప్రాంతాలు, అలాగే ఉదయ్‌పూర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, గోవా వంటిప్రాంతాల్లోని రాజభవనాలు, బీచ్‌లు డెస్టినేషన్ వెడ్డింగ్లకి వేదికలుగా మారుతున్నాయి. అంటే ప్రస్తుత తరం పెళ్లిని ఒక బాధ్యతగా కాకుండా, జీవితంలో గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ప్రయాణంగా మలుచుకుంటోంది.ప్రస్తుతం భారతదేశంలో దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల మార్కెట్ ఉన్న వివాహ పరిశ్రమలో.. కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ విభాగమే సుమారు రూ. 2.5 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌గా ఎదగడం డెస్టినేషన్ ట్రెండ్‌కు అద్దం పడుతోంది.ప్రస్తుతం 25 శాతంగా ఉన్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాటా, 2028 నాటికి 30 నుంచి 32 శాతానికి పెరగనుందని అంచనా.కోటి రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించే ధనిక జంటలలో దాదాపు 60 శాతం మంది స్వదేశీ వేదికల కంటే విదేశీ గమ్యస్థానాలకే ఓటు వేస్తున్నారు.2025లో భారతీయ జంటలు శ్రీలంకను ఎంచుకునే రేటు 25 శాతం పెరగగా, రాబోయే రోజుల్లో ఇది ఏటా 20–25 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.ప్రస్తుతం 38 శాతం మంది జంటలు పెళ్లికి ముందే ప్రత్యేకంగా ప్రీ–వెడ్డింగ్ ట్రిప్స్‌కి వెళ్తున్నారు. అంతేకాకుండా, కేవలం హనీమూన్ కోసమే సగటున రూ. 3.41 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. -
కూతురి పెళ్లి.. ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన నిర్మాత (ఫొటోలు)
-
దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)
-
కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి
హీరో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని షేర్ చేసిన నమ్రత.. స్పెషల్ పోస్ట్ పెట్టింది. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది.(ఇదీ చదవండి: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్)మహేశ్ సోదరి పద్మావతి-బావ గల్లా జయదేవ్‌కి ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దవాడు అశోక్ ఇప్పటికే హీరోగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'విసా' అనే మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక చిన్నకొడుకు సిద్ధార్థ్ ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు కొరియన్ అమ్మాయి హయిన్/ జిన్నీతో నిశ్చితార్థం చేసుకున్నాడు.మహేశ్ బాబు ఫ్యామిలీ, బంధువులు అంతా ఈ ఎంగేజ్మెంట్ వేడుకల్లో పాల్గొన్నారు. మరి సిద్ధార్థ్-జిన్నీ ఎక్కడ ఎప్పుడు ఎలా కలిశారు? వీళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మహేశ్ బాబు మేనల్లుడు దేశాంతర వివాహం చేసుకోబోతుండటం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే రాజమౌళి 'వారణాసి'తో బిజీగా ఉండిపోవడం వల్ల ఈ నిశ్చితార్థానికి మహేశ్ బాబు హాజరు కాలేదని అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)
-
అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)
-
ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!
భారతీయ వివాహాలు అంటే ఏ రేంజ్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ పెళ్లి కూతురు అలంకరణ అంటే..అందరి దృష్టి ఆమెపైనే అన్నంత అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కళ్లు చెదిరిపోయే రేంజ్ ఆభరణాలు, మిరుమిట్లు గొలిపే వస్త్రాలంకరణ తప్పనిసరి. అలాంటిది ఈ కంటెంట్ క్రియేటర్ పెళ్లి కూతురు రూపానికి సరికొత్త అర్థం ఇచ్చేలా రెడీ అయ్యింది. స్వచ్ఛతకు మరో రూపంలా కనిపించిన తీరు అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కేరళకు చెందిన కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్ట్ హర్ష పత్తు నజీమ్ మహమ్మద్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఆమె తన బ్రైడల్ షూట్, వివాహా వేదికకు సంబంధిచిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అవి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఎందుకంటే ‘క్లీన్ గర్ల్’ లుక్‌లో కనిపించడం విశేషం. కనీసం ఆ లుక్‌లో కూడా చెవికి ఇయర్ స్టడ్స్ అయినా ఉంటాయి. కానీ ఈ మేకప్ ఆర్టిస్ట్ హర్ష అవి కూడా ధరించలేదు. కేరళకు చెందిన ఈ వధువు ఎలాంటి బంగారం, వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించకుండా పెళ్లి పీటల మీద నడచి తన చిరకాల ఆచారాన్ని సవాలు చేసింది. చాలా నిరాడంబరంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కనీసం ఝంకాలు, మాంగ్ టిక్కా, లేదా ఒక సాధారణ బిందీ వంటి ప్రాథమిక ఆభరణాలకు కూడా చోటివ్వలేదామె. స్వచ్ఛమైన పెళ్లికూతురు ఇలానే ఉంటుంది అని చాటిచెప్పేలా ముస్తాబైంది. ఆఖరికి మేకప్ విషయంలో కూడా నేచురల్‌గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాంటి ఆభరణాలు ధరించకపోయినా..పెళ్లికూతురు దుస్తులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉండగలవని తన ఆహార్యంతో నిరూపించిందామె. ఆమె పెళ్లి కూతురు లుక్‌ని హైలెట్ చేసింది ధరించిన చీర. హర్ష ధరించిన శారీ రిచ్‌గా డిటైల్డ్‌గా ఉండటమే దీనికి కారణం. సాధారణంగా నవవధువు ధరించే ఎరుపు రంగునే ఎంచుకుంది. ఇక్కడ హర్ష్ దానిపై క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ, ఫుల్-స్లీవ్ బ్లౌజ్‌తో స్టైల్ చేశారు. అలాగే ఆభరణాలు, మేకప్ లేకుండా కనిపించినప్పటికీ..ఓ విలక్షణమైన పెళ్లి కూతురు లుక్‌తో అక్కడున్న వారందర్నీ ఆకట్టుకోవడం విశేషం. ప్రీ వెడ్డింగ్ షూట్లో సైతం ఇలానే నిరాడంబరమైన లుక్‌తో అలరించింది. నెటిజన్లు సైతం ఆమె లుక్‌కి ఫిదా అవుతూ..ఆభరణాలు లేని అందమైన వధువు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Harsha Pathu (@harsha_pathu_)(చదవండి: పాటలు పాడటం.. నిజంగానే ఊపిరితిత్తులకు మంచిదా?) -
ఫొటోలో చూసి... ప్రేమలో పడి...
జానకి మామయ్య చంద్రశేఖర్ ‘ఫన్ డాక్టర్’. ఆయన సూచన మేరకు చెన్నై చేరుకుని, గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు జానకి. ఇదిలా ఉంటే... ఒక వేదికపై జానకి పాడిన పాట విని, ముగ్ధులయ్యారు వి. రామ్‌ప్రసాద్. కాగా, ఓసారి చంద్రశేఖర్ జేబులోంచి ఒక ఫొటో కింద పడితే, ఆ ఫొటోలోని వ్యక్తిని ఇష్టపడ్డారు జానకి. ఆ వ్యక్తి ఎవరో కాదు... వి. రామ్‌ప్రసాద్. కానీ, ఆ ప్రేమను బయపెట్టలేదు. అయితే ఒక సందర్భంలో చంద్రశేఖర్ స్వయంగా జానకిని రామ్‌ప్రసాద్‌కి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ ఇద్దరి వివాహం 1959లో జరిగింది. 1997లో రామ్‌ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటివరకూ కూడా జానకి ఏ పాటల రికార్డింగ్‌కి వెళ్లినా ఆమె వెన్నంటే ఉండేవారు. జానకిని బాగా ప్రోత్సహించారు. భర్త మరణానంతరం జానకి ‘రంగు’ చీరలు కట్టుకోకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఆయనకు నా ప్రతి పాట ఎంతో ఇష్టం. నా రికార్డింగ్ సెషన్ ్సలో కూడా ఆయన నన్ను అస్సలు వదిలిపెట్టేవారు కాదు. నేను కూడా ఆయన్ను వదిలి ఉండలేకపోయేదాన్ని. ఆయన తన జీవితమంతా నా కోసమే గడిపారు. ఆయన మద్దతు లేకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. ఆయన నాతో ఉన్నారు, నాతోనే ఉన్నారు, ఇకపై కూడా నా ఆలోచనల్లో ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు!’’ అంటూ భర్త దూరమైన తర్వాత ఓ సందర్భంలో జానకి ఎంతో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ దంపతుల కుమారుడు మురళీకృష్ణ భరతనాట్యంలో ప్రవీణుడు. కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు కూడా. ఈ ఏడాది జనవరిలో మురళీకృష్ణ మరణించారు. అలాగే కొన్ని రోజుల క్రితం అమెరికాలోని తన మనవడు చనిపోవడంతో జానకి చాలా మనోవేదనకు గురయ్యారు. -
పెళ్లిలో వధువు కొంగులాగిన కొంటె మరిది : రచ్చ రచ్చ
తమ్ముడు చేసిన అభ్యంతకర చర్య అన్నయ్య పెళ్లికి చేటు తీసుకొచ్చింది. పెళ్లి ఆచారాలు జరుగుతున్న సమయంలో వధువు కొంగు (పల్లూ) లాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పెళ్లి కొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, పలువురు గాయపడ్డారు. దీంతో పెళ్లి కాస్తా తాత్కాలికంగా ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.పోలీసుల సమాచారం ప్రకారం.. అనుకున్న సమయానికి పెళ్లి జరిపించేందుకు పెద్దలు, పురోహితులు సిద్ధంగా ఉన్నారు. అటు పెళ్లి బరాత్ కూడా షెడ్యూల్ ప్రకారమే కల్యాణ మండపానికి చేరుకుంది. వేడుకలు కూడా సజావుగానే సాగుతున్నాయి. అయితే, పెళ్లి చివరి ఘట్టానికి చేరుకున్న సమయంలో, పెళ్లికొడుకు తమ్ముడు పిచ్చి వేషం వేశాడు. కాబోయే వదిన అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె కొంగు పట్టుకొని లాగాడు. అంతే దుమారం రేగింది. వధువు బాబాయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అలా మొదలైన వివాదం మధ్య తీవ్ర రూపం దాల్చింది. మద్యం సేవించిన మరికొంతమంది బంధువులు దీనికి మరింత ఆజ్యం పోశారు. అంతే ఈ మాటల యుద్ధం కాస్తా క్షణాల్లోనే పరస్పర దాడులుగా మారింది. వరుడు, వధువు తరఫు బంధువు (కజిన్) కూడా గాయపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో పెళ్లి ఆచారాలను మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చింది. ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఇదీ చదవడి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!గురువారం నాడు గ్రామ సర్పంచ్ సమక్షంలో ఇరు కుటుంబాల వారు పోలీస్ స్టేషన్లోనే సుదీర్ఘంగా చర్చలు జరిపారు.ఎట్టకేలకు ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చాయి. గాయపడిన వారి వైద్య ఖర్చుల కోసం రూ. 4,500 చెల్లించేలా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తానికి ఇరు కుటుంబాలు శాంతించి, ఆ తర్వాత అదే రోజు సాయంత్రం వధూవరులను ఒకటి చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఇరువర్గాలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నాయని, ఎవరూ కూడా ఒకరిపై ఒకరు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: దత్తత హిందూ సోదరికి, ముస్లిం వ్యక్తి కన్యాదానం, వైభవంగా పెళ్లి -
ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు)
-
బోనీ కపూర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత తిరుపతికి వస్తా.. హింట్ ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. గత కొన్నాళ్లలో చూసుకుంటే రష్మిక, సమంత తదితరుల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఓ పక్క సినిమాలు చేసుకుంటూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చేరేలా కనిపిస్తోంది. తాజాగా తన పెళ్లి గురించి హింట్ ఇచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: ఈ సినిమాకు A సర్టిఫికెట్ కూడా తక్కువే!)ఓ మొబైల్ స్టోర్ ఓపెనింగ్ కోసం తాజాగా తిరుపతిలో సందడి చేసిన నిధి అగర్వాల్.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత తిరుపతికి వస్తాను. ప్రస్తుతానికి వివాహం గురించి ప్లాన్స్ ఏం లేవు. ఇంకా పెళ్లి కొడుకు దొరకలేదు. ప్రస్తుతం హిందీ, తెలుగులో తలో రెండు సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ కెరీర్ విషయానికొస్తే.. హిందీలో తొలుత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అయితే సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, రాజాసాబ్, హరిహర వీరమల్లు తదితర మూవీస్ చేసింది. కానీ వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' తప్పితే ఈమెకు మరో సక్సెస్ అనేది లేకుండా పోయింది. గతేడాది రిలీజైన హరిహర వీరమల్లు, ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన రాజాసాబ్ చిత్రాలపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కానీ అవి డిజాస్టర్స్ అయ్యాయి. చూస్తుంటే త్వరలో పెళ్లి వార్త ఏమైనా చెబుతుందేమో?(ఇదీ చదవండి: అవి మాత్రమే పోస్ట్ చేస్తా.. 'సబ్స్క్రిప్షన్'పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్)Actress #NidhhiAgerwal's comments about her marriage are going viral on social media. pic.twitter.com/ubHaVt9Cgo— Filmyscoops (@Filmyscoopss) July 9, 2026 -
మళ్లీ పెళ్లి చేసుకున్న 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్
'కలర్స్' స్వాతిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరోయిన్ మళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ దర్శకుడినే కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే)తెలుగమ్మాయి అయిన స్వాతి.. 'కలర్స్' ప్రోగ్రాంతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2005లో విడుదలైన 'డేంజర్' అనే తెలుగు సినిమాతో నటిగా పరిచయమైంది. 'అష్టాచమ్మా' మూవీతో హీరోయిన్ అయిపోయింది. తర్వాత గోల్కొండ హైస్కూల్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, కార్తికేయ, స్వామి రారా, పంచతంత్రం, మంత్ ఆఫ్ మధు తదితర మూవీస్ చేసింది.చివరగా ఈమె 2023లో 'మంత్ ఆఫ్ మధు' మూవీ చేసింది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ నాగోతితో ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ ఇప్పుడు బుధవారం(జూలై 08) ఇతడిని పెళ్లి చేసుకుంది. ఇంట్లోనే సింపుల్‌గా ఈ వేడుక జరిగినట్లు ఈమె పోస్ట్ చేసిన ఫొటోల బట్టి అర్థమవుతోంది. 2018లో ఈమె వికాస్ వాసు అని పైలెట్‌ని వివాహం చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న విషయం బయటకు రాలేదు. ఇప్పుడు మళ్లీపెళ్లి చేసుకుని అందరికీ స్వాతి షాకిచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ) View this post on Instagram A post shared by Swati (@swati194) -
పెళ్లి రోజున సర్ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు: సెలీనా జైట్లీ
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగా స్పందించింది. సెలీనా ఆస్తులన్నింటినీ తన భర్త పీటర్ హాగ్ బదలాయించుకున్నారని ఆమె ఆరోపించింది. తన వైవాహిక బంధం అత్యంత వివాదాస్పదమైంది. దాంతో పెళ్లి చేసుకునే యువతులకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. సెలీనా జైట్లీ మాటల్లో.. మీకు సొంతంగా ఆస్తులు ఉంటే దయచేసి పెళ్లికి ముందే అతడితో ఓ ఒప్పందం చేసుకోండి. మీ ఆస్తులను ఎప్పుడూ విడిగానే ఉంచుకోండి. ఎందుకంటే చివరికి అంతా ఆస్తుల చుట్టూనే తిరుగుతుందని చెప్పింది. 2010లో ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను సెలీనా వివాహం చేసుకుంది. వీరికి విన్స్టన్, విరాజ్, ఆర్థర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో కుమారుడు షంషేర్ గుండె సమస్యతో చిన్న వయసులోనే మరణించాడు. తన 15వ వివాహ వార్షికోత్సవం రోజే విడాకుల పత్రాలు “బహుమతి”గా అందాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా రూ. 20 కోట్ల విలువైన ఆస్తులను హాగ్ తన పేరిట రాయించుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్నీ కూడా హాగ్ బదలాయించుకున్నాడని సెలీనా ఆరోపిస్తోంది. ఇక సెలీనా సినీ రంగంలో ఆరేళ్ల విరామం తర్వాత ‘సిస్టర్ నివేదిత’ సినిమాతో బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది. సెలీనా గతంలో తెలుగు, కన్నడ సినిమాల్లోనూ నటించింది.ఈ సందర్భంలో ఆమె ఇచ్చిన సలహా పెళ్లి చేసుకునే ముందు ముఖ్యంగా సొంత ఆస్తులు ఉన్న యువతులు, తప్పనిసరిగా ప్రీ-నప్షియల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. తద్వారా భవిష్యత్తులో భర్తతో మోసపోకుండా ఉండగలరని సూచించింది. -
నా ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్నా.. ఇది ఖరీదైన ప్రక్రియే కానీ
పిల్లల్ని కనేందుకు సహజ ప్రక్రియ, ఐవీఎఫ్, సరోగసి లాంటి పద్ధతులున్నాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి 'ఎగ్ ఫ్రీజింగ్' అనేది కూడా వెలుగులోకి వచ్చింది. అంటే వయసులో ఉన్నప్పుడు మహిళలు తమ అండాల్ని భద్రపరుచుకుంటారు. తర్వాత పిల్లల్ని కనాలనే ఆలోచన వచ్చినప్పుడు వాటిని తమ శరీరంలోకి ప్రవేశపెట్టి తల్లి అవుతారు. రీసెంట్ టైంలో పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు ఇలానే చేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.(ఇదీ చదవండి: బతికుండగా పట్టించుకోలేదు.. ఇప్పుడు నెరవేర్చారు)'ఈ విషయాన్ని మొదటిసారి మీతో పంచుకుంటున్నాను. నా అండాల్ని భద్రపరుచుకున్నాను. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. పెళ్లి, పిల్లలు అనేది మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడు మాత్రమే జరగాలి. సమాజం లేదా వయసు ఒత్తిడి వల్ల కాదు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా కాస్ట్ లీ. కానీ నేను దాన్ని భరించగలిగినందుకు అదృష్టవంతురాలిని. ప్రతి ఒక్కరికీ ఈ అవకాశం ఉండదు''మిమి సినిమా కోసం బరువు పెరగాల్సి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేశాను. హార్మోన్ చికిత్స వల్ల శరీరం ఉబ్బినట్లు అనిపించడం, బరువు పెరగడం లాంటివి ఉంటాయి. అప్పటికే మూవీ కోసం బరువు పెరుగుతున్నందున అదే సరైన టైం అని భావించి నా ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నాను. ఇది అంత సులభం కాదు. హార్మోన్ల మార్పుల కారణంగా మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే భవిష్యత్తులో పిల్లల విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది' అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కృతి సనన్.. తర్వాత తెలుగులో 'దోచేయ్' అని మరో మూవీ చేసింది. ప్రభాస్ 'ఆదిపురుష్'లోనూ సీతగా నటించింది. ఈమె చేసిన లేటెస్ట్ చిత్రం 'కాక్టెయిల్ 2' గత నెలలో రిలీజైంది. కలెక్షన్స్ వచ్చాయి గానీ మూవీ మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది)Kriti Sanon revealed for the first time that she has frozen her eggs 👀She did it coz she doesn't want to marry soon but wanted to preserve her biological clock. She did it cleverly during the period when she had to gain weight for Mimi, while her hormones were disruptive 👀 pic.twitter.com/KY9W6pxGiU— Chota Don (@choga_don) July 7, 2026 -
ఘనంగా టేలర్ స్విఫ్ట్, కెల్సే వివాహం
న్యూయార్క్: అమెరికన్ పాప్ సింగర్, గేయ రచయిత టేలర్ స్విఫ్ట్ వివాహం ఫుట్‌బాల్ ఆటగాడు ట్రావిస్ కెల్సేతో న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వైర్ గార్డెన్లో శనివారం వైభవంగా జరిగింది. హాలీవుడ్ నటుడు, కమిడియన్ ఆడమ్ శాండ్లర్ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. సింగర్ కామిలా కాబెల్లో, నటులు హ్యూగ్ గ్రాంట్, ఈథన్ హాక్, జేసన్ సుడైకిస్, మోడల్ కార్లీ క్లాస్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.ట్రావిస్ కెల్సే టీమ్ మేట్ కరీమ్ హంట్, రన్నింగ్ బ్యాక్‌లు, సియాటెల్ సీహాక్స్ ఆటగాడు, తాజా సూపర్ బౌల్ ఛాంపియన్ కూపర్ కుప్, న్యూయార్క్ జెయింట్స్ ఆటగాడు జుజు స్మిత్ షూస్టర్, ఎన్ఎఫ్ఎల్ అనౌన్సర్ జో బక్, ‘ద సమ్మర్ ఐ టర్న్డ్ ప్రెట్టీ’ పుస్తక రచయిత జెన్నీ హ్యాన్ తదితరులూ వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. మాన్హటన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక భారీ టెంట్లో వివాహమైన తరువాత ‘జస్ట్ అండ్ టీ మ్యారీడ్’ అన్న బోర్డు ప్రత్యక్షమైంది. తోడు పెళ్లి కూతురు, తోడి పెళ్లి కొడుకు లాంటి (బ్రైడ్స్‌మెయిడ్, గ్రూమ్స్మెన్ అంటారు) వారు ఎవరూ లేకుండా వివాహం జరగడం గమనార్హం.క్రిస్టియన్ డియోర్ హాటే కౌచర్కు చెందిన జోనథన్ ఆండెర్సన్ డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులిద్దరూ ధగధగ మెరిసిపోయారు. ఇద్దరి కాలిజోళ్లను క్రిస్టియన్ లౌబౌటిన్ ప్రత్యేకంగా తయారు చేశారు. టేలర్ స్విఫ్ట్ కార్టీయర్ బ్రాండ్ నగలతో అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక పక్క ఎండలు మండిపోతున్నా స్విఫ్ట్, ట్రావిస్ అభిమానులు చాలామంది మాడిసన్ స్కై్వర్ గార్డెన్ బయట భారీ ఎత్తున గుమికూడారు. అయితే వివాహం తాలూకూ దృశ్యాలు కొంచెం కూడా కనిపించకపోవడం వారిని నిరాశ పరిచిందని చెప్పాలి. వివాహం మొత్తాన్ని రహస్యంగానే నిర్వహించాలని అనుకున్నా ఈ వారం ‘ద అసోసియేటెడ్ ప్రెస్’ తీసుకున్న ఒక పరి్మషన్ ఈ హై ప్రొఫెల్ వివాహం గురించి అందరికీ తెలిసేలా చేసింది. స్విఫ్ట్, ట్రావిస్ల పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలు అమెరికాలోనే అత్యంత పాపులర్ ఎన్బీఏ గేమ్స్ కంటే ప్రాచుర్యం పొందడం గమనార్హం. -
లేడీ సింగర్ పెళ్లి.. రూ.191 కోట్ల ఖర్చు.. రూ.248 కోట్ల విరాళం
ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పెళ్లి చేసుకుంది. అమెరికన్ ఫుట్‌బాలర్ ట్రావిస్ కెల్సేతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఒక్కటయ్యారు. టేలర్ స్విఫ్ట్ ప్రతినిధి ట్రి పైన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. పెళ్లి తర్వాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్ బయటున్న భారీ డిజిటల్ స్క్రీన్‌పై 'JUST&T MARRIED!' అని ప్రదర్శించారు.(ఇదీ చదవండి: 'నాగబంధం' సినిమా.. ఒక్కరోజులోనే కట్ చేసిపడేశారు)న్యూయార్క్ నగర అనుమతుల విభాగం ప్రత్యేక కార్యక్రమానికి బుధవారం అధికారిక అనుమతి ఇచ్చింది. గురువారం సాయంత్రం 100 మంది అతిథులతో రిహార్సల్ డిన్నర్ నిర్వహించగా, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రధాన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అయితే ఈ వేడుకకు రూ.191 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.ఈ పెళ్లి వేడుకకు హాలీవుడ్, సంగీత, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హ్యూ గ్రాంట్, ఈథన్ హాక్, బ్రాడ్లీ కూపర్, డకోటా జాన్సన్, బ్రాడ్ పిట్, కింబర్లీ విలియమ్స్-పైస్లీ తదితరులు సందడి చేశారు. అయితే పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా వేదిక దగ్గర మొబైల్ ఫోన్లపై నిషేధం విధించారు.ఇకపోతే పెళ్లికి ముందు టేలర్ స్విఫ్ట్, ట్రావిస్ కెల్సే.. దేశవ్యాప్తంగా పలు సేవా సంస్థలకు సుమారు 26 మిలియన్ డాలర్లు(రూ.248 కోట్లు) విరాళంగా అందించినట్లు వారి ప్రతినిధి వెల్లడించారు. ఫుడ్ బ్యాంక్స్, ఆర్ట్స్ కాలేజీలు, చిన్నారుల క్యాన్సర్ చికిత్సా కార్యక్రమాలకు ఈ మొత్తం అందనుంది. డాలీ పార్టన్‌కు చెందిన 'ఇమాజినేషన్ లైబ్రరీ' కూడా రెండు మిలియన్ డాలర్ల విరాళం అందుకోగా, ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. కొత్త కారు కొన్న యంగ్ హీరో)Taylor Swift and Travis Kelce are officially got married.#Tranvis #Taylorswift #Tranviswedding pic.twitter.com/XRGGOzOkg9— Nizam Tellawi (@nizamtellawi) July 4, 2026 -
వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు
ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ నటుడు రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?) -
గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురి పెళ్లి.. మెగాస్టార్, వెంకీమామ సందడి
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ కూతురు కృష్ణమోహన - అనిరుధ్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. చిరంజీవికి దగ్గర బంధువైన మెహర్ రమేశ్.. పూరీ జగన్నాథ్ దగ్గర తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ టైంలోనే అంటే 2002లో రిలీజైన 'బాబీ' సినిమాలో నటించారు. ఎన్టీఆర్ 'ఆంధ్రావాలా'ని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో 'వీర కన్నడిగ' అని తీసి దర్శకుడిగా పరిచమయ్యారు. మహేశ్ 'ఒక్కడు'ని 'అజయ్' పేరుతో కన్నడలో రీమేక్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు. అయితే ఎన్టీఆర్ 'కంత్రి'తో తెలుగులోకి మెహర్ రమేశ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ కూడా ఒకదానికి మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్‌తో తీసిన 'బిల్లా' మాత్రం ఆయనకు పేరు తీసుకొచ్చింది. Megastar @KChiruTweets graced the grand wedding reception of director @MeherRamesh's daughter, #KrishnaMohana, and Anirudh. #chiranjeevi #Meherramesh pic.twitter.com/lLxXfxYTUQ— Aithagoni Raju off (@AithagoniRaju) July 1, 2026 -
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
-
బట్టలు ఆరేస్తూ ప్రాణాలు కోల్పోయిన నవవధువు
నాలుగు నెలల క్రితం ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కోటి ఆశలతో మెట్టింట్లో అడుగు పెట్టింది. ఆనందంగా సాగిపోతున్న వైవాహిక జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. విద్యుత్ రూపంలో మరణ శాసనం లిఖించింది. నిర్మల్ : బోరిగాం గ్రామానికి చెందిన నల్ల రేఖ(23)కు నాలుగు నెలల క్రితం మహారాష్ట్రలోని అప్పారావుపేట్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. భర్త సోదరి వివాహం గురువారం లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో జరిగింది. ఈ వివాహానికి రేఖ, ఆమె కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాత్రి వధువును అత్తారింటికి సాగనంపి బోరిగాం గ్రామానికి తిరిగి వచ్చారు.బట్టలు ఆరేస్తుండగా శుక్రవారం ఉదయం ఇంటి దాబాపై బట్టలు ఆరేస్తుండగా చీర అనుకోకుండా సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. షాక్‌కు గురైన రేఖ పెద్దగా అరిచి పడిపోయింది. కుటుంబ సభ్యులు పరుగెత్తుకొచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. నాలుగు నెలల క్రితం కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించిన తల్లి దండ్రులు ఆమె మృతదేహం వద్ద గుండెలు పగిలేలా రోదించారు. భార్యను విగతజీవిగా చూసిన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..సమాచారం అందుకున్న నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలకు వేసిన రక్షణ పైపులు పగిలిపోవడం వల్లే చీర నేరుగా తీగలకు తగిలి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
ఘనంగా కూతురి పెళ్లి.. ఫొటోలు షేర్ చేసిన ఖుష్బూ
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఖుష్బూ.. పెళ్లి ఫొటోలని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. గొర్రెలు డిటెక్టివ్స్ అయితే? తెలుగు రివ్యూ)'ప్రస్తుతం మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. కుటుంబమే ఎప్పుడూ మా జీవితంలో అత్యంత విలువైనది. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయిస్తారని మేం నమ్ముతాం. మా కుమార్తె అవంతిక, శ్రవణ్‌ల వివాహం మా జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. పెద్దల ఆశీస్సులు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల ప్రేమాభిమానాల మధ్య ఈ వివాహ వేడుక ఎంతో ఆత్మీయంగా జరిగింది. వధూవరుల కోరిక మేరకు అత్యంత సాదాసీదాగా, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక నిర్వహించాం''కొన్ని సందర్భాల్లో అత్యంత అందమైన క్షణాలు మనకు అత్యంత దగ్గరైన వారితో కలిసి గడిపేవే. అవంతిక, శ్రవణ్‌లు తమ వైవాహిక జీవితంలో ఆనందం, అనుబంధం, ప్రేమతో కూడిన చిరకాల సంతోషాన్ని పొందాలని కోరుకుంటున్నాం. వారిద్దరికీ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, శుభాకాంక్షలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం" అని ఖుష్బూ దంపతులు తమ పోస్టులో రాసుకొచ్చారు. అవంతిక ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)
-
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షన్ను
యూట్యూబ్ నుంచి ఫేమస్ అయి ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న 'బిగ్‌బాస్' ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: 'ఓజీ 2' అప్డేట్.. ఆ డైరెక్టర్ని పవన్ పక్కనబెట్టేశారా?)అయితే కొన్నిరోజుల క్రితం వైష్ణవితో కలిసి గృహప్రవేశం చేయడంతో రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోల్లో పెళ్లి మండంపై నూతన వధూవరులిద్దరూ కనిపించారు.వైజాగ్‌కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్) -
వైభవంగా ఎంపీ సుప్రియా సులే కుమార్తె వివాహం..హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ.. ఏ భాషలో అయినా సరే నటీనటుల ప్రేమ పెళ్లిళ్ల గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాయి. ఈ ఏడాది టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక ఒక్కటయ్యారు. ఇప్పుడు వీళ్ల బాటలో తమిళ సీరియల్ జంట ఏడడుగులు వేశారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లు.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' రమ్యకృష్ణ సెకండ్ లవ్)తమిళంలో ప్రసారమవుతున్న అయలి సీరియల్ ఫేమ్ ఆనంద్ సెల్వన్.. ఒన్నా ఇరుక్కు కత్తుక్కణం సీరియల్ ఫేమ్ షియామంత కిరణ్‌ని పెళ్లి చేసుకున్నాడు. కోయంబత్తూరులో గురువారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. తమిళ సీరియల్ నటీనటులు చాలామంది విచ్చేశారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.2019లో వచ్చిన ఆయుధ ఎళుత్త సీరియల్లో ఆనంద్, షియామంత కలిసి నటించారు. ఇందులో ఆనంద్ హీరో కాగా షియామంత ఓ సహాయ పాత్ర చేసింది. ఇది చేస్తున్నప్పుడు ఇద్దరు మధ్య మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆనంద్ కంటే షియామంత ఏడేళ్ల పెద్ద అని తెలుస్తోంది. అయినా సరే వయసు.. ఈ వివాహానికి అడ్డంకి కాలేదని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్) View this post on Instagram A post shared by Jerusha - Celebrity Makeup Artist (@jeru_bridal_studioo) -
రూ.4 కోట్ల నగల దోపిడీ వెనుక అసలు కథ..
గాజియాబాద్: యూపీలోని గాజియాబాద్ తనిష్క్ షోరూమ్ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుకాణంలో పనిచేస్తోన్న వ్యక్తే.. తన ప్రియురాలితో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. పెళ్లి కోసం ఆ వ్యక్తి.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి రూ.4కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఈ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారుతనిష్క్ ఉద్యోగి నితిన్ వర్మ (23), అతని ప్రియురాలు కాజల్ వర్మ (22), అతని తండ్రి సంజయ్ వర్మ (52). జూన్ 12న రాజ్ నగర్ డిస్ట్రిక్ట్ సెంటర్లోని తనిష్క్ షోరూమ్ నుండి రూ. 4 కోట్లకు పైగా విలువైన నగలను దొంగిలించినట్లు పోలీసులు నిర్థారించారు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.నితిన్ ఆ షోరూమ్‌లో చేరి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే అయింది.. కానీ ఈ కొద్ది సమయంలోనే అతను స్టోర్ భద్రతా ఏర్పాట్లు, అత్యంత విలువైన నగలు ఎక్కడ ఉంచుతారనే విషయాలను తెలుసుకున్నాడు. ఘటనకు ఒక రోజు ముందే కాజల్‌తో తన పెళ్లి నిశ్చయమైందని చెబుతూ స్టోర్ సిబ్బందికి పార్టీ ఇచ్చాడు. ఆ వేడుకలో షోరూమ్ తాళాలు తన వద్దే ఉంచుకునే క్యాషియర్ గౌతమ్ రాజ్‌తో ఎక్కువగా మద్యం తాగిపించాడు. అనంతరం అతన్ని ఇంటి దగ్గర దింపుతానని చెప్పి.. అతని బ్యాగ్ నుండి షోరూమ్ మెయిన్ ఎంట్రన్స్ తాళాన్ని దొంగిలించాడు.మరుసటి రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నితిన్ తన అనుచరుడితో కలిసి షోరూమ్‌కు వచ్చాడు. వారు దొంగిలించిన తాళంతో షట్టర్ తెరిచి.. ఎలాంటి అనుమానం రాకుండా లోపలికి వెళ్లడం సీసీటివి ఫుటేజీలో రికార్డయింది. డీసీపీ ధవళ్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ దొంగతనం పూర్తి చేయడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. వారు గ్రౌండ్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లను వదిలేసి.. బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన నగలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌ను టార్గెట్ చేశారు. నితిన్ లోపలికి వెళ్లినప్పుడు ఓ అనుచరుడు బయట నిలబడి నిఘా ఉంచాడని పోలీసులు తెలిపారు. వారు సుమారు రూ. 4 కోట్ల విలువైన నగలను సర్దుకుని, ఎవరికీ దొరక్కుండా దూరంగా పార్క్ చేసిన వాహనంలో పరారయ్యారు.ఈ దర్యాప్తులో షోరూమ్‌లోని తీవ్రమైన భద్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. రూ.50 కోట్లకు పైగా విలువైన నగలు ఉన్నప్పటికీ.. అక్కడ ఎలాంటి అలారం సిస్టమ్ లేదు. రాత్రి వేళల్లో కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ గార్డును నియమించారు. అతను కూడా ఉదయం 7 గంటలకే డ్యూటీ నుంచి వెళ్లిపోయాడు. సీసీటీవీ విజువల్స్‌ను కంపెనీ హెడ్ ఆఫీస్ నుండి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిందితులు 25 నిమిషాలకు పైగా లోపలే ఉన్నా ఈ చొరబాటును ఎవరూ గమనించలేకపోయారు.నితిన్, కాజల్ కలిసి ఈ దొంగతనానికి ప్లాన్ చేయగా.. దొంగిలించిన నగలను అమ్మడంలో సంజయ్ వర్మ సహాయం చేశాడు. తమకు వైద్య ఖర్చుల కోసం డబ్బు కావాలని అబద్ధాలు చెప్పి నిందితులు కొన్ని నగలను తక్కువ ధరలకే విక్రయించారు. ప్రస్తుతం అధికారులు రూ. 3.1 కోట్ల విలువైన దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ. 6.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఉపాధి హామీ కూలిలు ఏం చేశారో చూడండి..! వైరల్ అవుతున్న వీడియో
-
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్‌గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది.నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది.(ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ఉపాసన) -
మా కుటుంబానికి ఇది ప్రత్యేకమైన రోజు
సినీ నటి ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి త్వరలో జరగనుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని అతడి స్వగృహంలోనే కలిసి పెళ్లి కార్డ్ అందజేశారు. ఈ క్రమంలోనే ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా)'ఇది మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను ఆయన నివాసంలోనే కలిసి శ్రీ శ్రవణ్ శ్రీనివాసన్‌తో జరగనున్న నా కుమార్తె పెళ్లికి ఆహ్వానించాం. విజయ్ను కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా నా కూతుళ్లు ఆయనని చూసి ఎంతో ఉత్సాహానికి గురయ్యారు. ఆయనతో గడిపిన క్షణాలను ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్లోనూ విజయ్ ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే తన చిరునవ్వుతో మమ్మల్ని ఆత్మీయంగా పలకరించారు. విజయ్ అందించిన ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు మా కుటుంబానికి ఎంతో విలువైనవి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘ఆరంభం’ అనే చిత్రంలో ఆమె యాక్ట్ చేస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.(ఇదీ చదవండి: 'ఇరుముడి' గ్లింప్స్.. కొత్తగా కనిపించిన రవితేజ) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు
పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్‌గా మారింది.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా! తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా లైఫ్ పార్ట్నర్తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! -
త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి?
సౌత్‌లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్‌తో విలన్‌గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
వరుడు కుటుంబం రిటర్న్ గిఫ్ట్ అదుర్స్..! మొత్తం గ్రామానికి రూ. 34.6 కోట్ల..
వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్లో ఫలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లిని నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు.. కళ్లు చెమర్చాయ్. ఆహా..! మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్‌పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అపురూపమైన రిటర్న్ గిఫ్ట్‌లు అందించింది వరుడి కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చింది.అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం..పేఠ్కర్ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవ్వరూ మినహాయించబడకుండా ఉండేలా గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి. అయితే, పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంను వెల్లడించకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ మేరకు వరుడు కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. "మన సంస్కృతిలో దానధర్మాల గురించి అందరికీ చాటింపు వేయం. అందుకే ఎవ్వరికీ ఆ మొత్తం సొమ్ము గురించి చెప్పాలనుకోవడం లేదు. మాకు కేవలం ఆశీర్వాదం చాలు. చప్పట్లు పొగడ్లతో పనిలేదు. ఆకస్మిక ప్రమాదాలు గ్రామీణ కుటుంబాలను ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో ప్రత్యక్షంగా చూడటం వల్ల తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పాముకాట్లు, పిడుగుపాటు, వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు సర్వసాధారణం, పైగా బీమా సౌకర్యం చాలా అరుదుగా ఉంటుంది. మా ఆనందం మా ఇంటికే పరిమితం కాకూడదనే ఇలా చేశాం. ఈ పెళ్లి కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాకుండా రక్షణగా మారాలని ఆశించే ఇలా చేశామని అన్నారు" వరుడు సిద్ధేశ్వర్ కుటుంబీకులు. అక్కడి గ్రామస్తులు సైతం ఇప్పటివరకు ఇలాంటి పెళ్లి కానుకను చూడలేదని.. మొత్తం గ్రామానికే సాముహిక సంరక్షణను అందించే ఆర్థిక భద్రతను అందించిందంటూ సదరు వరుడి కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య.. -
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
ఈ ఏడాది టాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్‌ను ఫాలో కావాలని విరోష్ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
పెళ్లి మండపంలో స్విగ్గీ బాయ్ వీడియో వైరల్
-
ఎంతమందితోనైనా డేటింగ్.. నాకు అలానే జరిగింది
భరత్ అనే నేను, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న హీరోయిన్ కియారా అడ్వాణీ.. త్వరలోనే 'టాక్సిక్'తో రాబోతుంది. ప్రస్తుతం గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శకనిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. ఇప్పుడు ఏడాది కూడా నిండని తన కూతురి భవిష్యత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. వాటిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ బాబుకి హిందీ రాదు.. అందుకే)తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా అడ్వాణీ.. కూతురు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఆమె (సరయూ) పూర్తి జీవితం చూడాలని అనుకుంటున్నాను. ఒక్కరితో డేటింగ్ చేయాలని రూలేం లేదు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఓకే లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలానే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. ఎదిగే క్రమంలో ఈ బంధాలు.. అన్ని పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ వాటి నుంచే నేర్చుకుంటారు' అని కియారా స్టేట్మెంట్ ఇచ్చింది.కియారా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం ఏడాది పూర్తి కాని కూతురి గురించి మాట్లాల్సిన మాటలేనా ఇవి అని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం ఫెమినిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సంస్కృతి అని ఫైర్ అవుతున్నారు. కియారా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని కియారా ప్రేమించి 2023లో పెళ్లి చేసుకుంది. గతేడాది జూలైలో వీళ్లకు కూతురు పుట్టింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు మన దేశంలో ఓటీటీకి 'ధురంధర్ 2'.. అధికారిక ప్రకటన)#KiaraAdvani Bold STATEMENT about her Daughter left Everyone SHOCKED 😳 She Said , - I will let My Daughter to DATE as many MAN she Wants . No Need to Marry a Guy You Date . EXPLORE Yourself with them . Earlier #RamKapoor Wife Giving SE*X and VIB*R*A*T*OR to her Daughter as… pic.twitter.com/uMqeOgxFOm— Manoz Kumar (@ManozTalks) May 15, 2026 -
‘నేను మాట్లాడిన వ్యక్తి ఇతను కాదు’
హర్దోయ్: ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ వివాహ వేడుక రణరంగంగా మారింది. తను ఆన్లైన్లో ఎవరితోనైతే మాట్లాడిందో.. పెళ్లి పీటల మీద ఉన్నది ఆ వ్యక్తి కాదని వధువు గుర్తించడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో వరుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. వరుడు దేవేంద్ర సింగ్ పరిమార్ (23)కు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యువతి పరిచయమైంది. ఫోన్లలో మాట్లాడుకున్న వీరిద్దరూ ప్రేమలో పడి.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో ఈ నెల మే 12న వివాహానికి ముహూర్తం కుదిరింది. వరుడి తరపు వారు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు వృత్తిరీత్యా లాయర్. పెళ్లి పీటల మీద ఉన్న వరుడిని చూడగానే ఆమె కంగుతింది. తను గత కొంతకాలంగా రాహుల్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నానని.. కానీ అక్కడ ఉన్నది అతను కాదని ఆమె తేల్చి చెప్పింది. వధువు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు.వరుడు దేవేంద్ర సింగ్‌తో పాటు పెళ్లికి వచ్చిన అతిథులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దేవేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ అలోక్ రాజ్ నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆన్లైన్ మోసం, ఫోటోల మార్పిడి కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. -
అంతా క్షణాల్లో..ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి
‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.’’ అని ఓ సినీకవి అన్నట్టుగా పెళ్లి వేడుకలు, బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, వధూవరుల కోటి కలల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగాల్సిన పెళ్లి ముచ్చట ఉన్నట్టుండి విచారంగా పోయింది. వేద మంత్రాల మధ్య వైభవంగా వధువుకు తాళి కట్టాల్సిన ముచ్చట ఆసపత్రి ఐసీయూకి చేరింది. ఇంతకీ ఏమైంది తెలుసుకుందాం ఈ కథనంలో.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఈ భావోద్వేగపూరితమైన వివాహం జరిగింది. పెళ్లి రోజునే వధువు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో బరాత్‌ను ఆసుపత్రికే తీసుకువచ్చి, వధువు నుదిట సింధూరం అద్ది పెళ్లి చేసుకున్నాడు.అసలేం జరిగింది అంటే గోరఖ్‌పూర్ జిల్లా బాన్స్‌గావ్ ప్రాంతానికి చెందిన పూజా యాదవ్ అనే యువతికి, సన్ని యాదవ్ అనే యువకుడితో మే 13న పెళ్లి జరగాల్సి ఉంది. పూజ ఎల్.ఎల్.బి (LLB) చివరి సెమిస్టర్ చదువుతోంది. పెళ్లి రోజు ఉదయం ఆమె తన సోదరుడితో కలిసి పరీక్ష రాయడానికి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరీక్ష రాసి బైక్‌పై తిరిగి వస్తుండగా, పూజకు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో బైక్ మీద నుండి కింద పడి పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూ (ICU)కి తరలించి చికిత్స అందించారు.పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. చివరికి వధూవరుల కుటుంబాల భారమైన హృదయాలతోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిని వాయిదా వేయకుండా, నిర్ణయించిన ముహూర్తానికే ఆసుపత్రిలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.వరుడు సన్ని యాదవ్ పెళ్లి బట్టల్లో, బంధుమిత్రులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఐసీయూ బెడ్ మీద ఆసుపత్రి దుస్తుల్లో చికిత్స పొందుతున్న పూజ నుదుట సింధూరం దిద్దాడు. అక్కడున్న పండితుడు వేద మంత్రాలు పఠిస్తూ, ఏడు అడుగుల (సప్తపది) ప్రమాణాలను చేయించారు. సింధూర ధారణ ముగిసిన తర్వాత వరుడు తిరిగి గ్రామానికి చేరుకుని మిగిలిన పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేశాడు. వరుడు సన్ని యాదవ్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆపద సమయంలో వధువును వదిలేయకుండా, ఆమెకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న వరుడి గొప్ప మనసును చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టు కున్నారు. ప్రస్తుతం పూజ కోలుకుంటోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.నెటిజన్ల ప్రశంసలుపెళ్లి ఇంట్లో జరగాల్సిన వేడుక ఆసుపత్రికి మారినప్పటికీ, ఆపదలో ఉన్న వధువుకు తోడుగా నిలిచిన వరుడిని, అతని కుటుంబాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. "నిజమైన ప్రేమ అంటే ఇదే" అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'హాస్పిటల్ వెడ్డింగ్' ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. UP: अस्पताल बना मंडप, आईसीयू में भरी मांग, फेरों से पहले निभा दिया वचन; इसलिए दुल्हन को कराना पड़ा था भर्तीhttps://t.co/xBpkJDPLOt— Amar Ujala (@AmarUjalaNews) May 14, 2026ఇదీ చదవండి: మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్! -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెపె్టంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ మాసమంతా ఆగాల్సిందేఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
నవ వధూవరులను ఆశీర్వదించిన YS జగన్
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటుడు
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగు సీరియల్ నటుడు కృష్ణారెడ్డి కూడా చేరిపోయాడు. సొంతూరు బలభద్రపురంలో జరిగిన ఈ వేడుకలో సంధ్య అనే అమ్మాయి మెడలో మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు తోటి సీరియల్ నటీనటులు హరిత, జాకీ, పవన్ సాయి, సునంద తదితరులు హాజరై నూతన వధూవరుల్ని దీవించారు.(ఇదీ చదవండి: విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్)బిగ్‌బాస్ 9 ఫేమ్ తనూజ గతంలో నటించిన 'ముద్దమందారం' సీరియల్‌తో కృష్ణారెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం 'ముత్యమంతా ముగ్గు' సీరియల్ కూడా చేశారు. ప్రస్తుతం 'జానకి పరిణయం' ధారావాహికతోపాటు పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు.అయితే 2023లోనే కృష్ణారెడ్డి.. స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ అది రద్దయినట్లు ఉంది. ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త క్లారిటీ వచ్చింది.(ఇదీ చదవండి: 'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు) View this post on Instagram A post shared by SunandhaMala Setti_Official👸 (@sunandhamalasetti_official) -
'లవ్ టుడే' నటి ప్రేమ వివాహం.. దర్శకుడితో ఏడడుగులు
'లవ్ టుడే' ఫేమ్ ప్రముఖ నటి రవీనా రవి పెళ్లి చేసుకుంది. గతంలో కలిసి పనిచేసిన దర్శకుడు దేవన్ జయకుమార్తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం ఈ శుభకార్యం జరగ్గా.. పలువురు నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కేరళకు చెందిన రవీన్ రవి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ నటి. తల్లి శ్రీజ కూడా నటి కావడంతో ఆరేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 2012 నుంచి పూర్తిస్థాయిలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయింది. 'జవాన్'లో దీపికా పదుకొణెకు తమిళ-తెలుగు వెర్షన్స్‌లో, తమిళ 'గేమ్ ఛేంజర్'లో కియారా అడ్వాణీకి ఈమెనే డబ్బింగ్ చెప్పింది. ఓకే బంగారం, ప్రేమమ్ (మడోన్నా సెబాస్టియన్), 2.0 (అమీ జాక్సన్), నవాబ్ (ఐశ్వర్యా రాజేశ్), శ్యామ్ సింగరాయ్ (మడోన్నా సెబాస్టియన్) తదితర తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.కేరళలో పుట్టినప్పటికీ తెలుగు, తమిళ, మలయాళంలో డబ్బింగ్ ఆర్టిస్టుగా బోలెడన్ని మూవీస్ చేసింది. 2017 నుంచి నటిగా అడపాదడపా కనిపిస్తూనే ఉంది. ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే' మూవీలో హీరోకి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఇకపోతే 2023లో 'వాలాట్టి' అనే కుక్కల సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. ఆ టైంలో ఈ చిత్ర దర్శకుడు దేవన్ జయకుమార్తో ప్రేమలో పడింది. ఇప్పుడు పెద్దల్ని ఒప్పించి పెళ్లితో ఒక్కటయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్
రష్మికకు ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లయిపోయింది కదా! ఈ రష్మిక ఎవరు? ఏ దర్శకుడిని పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తున్నారా? కంగారు పడొద్దు. గతేడాది 'సు ఫ్రమ్ సో' అనే కన్నడ సినిమా తెలుగులోనూ రిలీజైంది. ఉన్నంతలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతోనే హిట్ కొట్టిన దర్శకుడు జేపీ తుమినాడు.. మూడు రోజుల క్రితం ప్రేయసి రష్మికని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్మెంట్.. ఆశీర్వదించిన చిరు)కేరళలో పుట్టి పెరిగిన జేపీ తుమినాడు.. గత పదేళ్లుగా కన్నడ సినిమాల్లో నటుడు, రచయిత, దర్శకుడిగా చేస్తున్నాడు. 2017లో వచ్చిన 'ఒండు మొట్టెయ కథే'లో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేశాడు. తర్వాత తులు భాషలో దర్శకుడిగా 'కటపడి కట్టప్ప' అనే మూవీ తీశాడు. అనంతరం గరుడ గమన వృషభ వాహన, స్వాతి ముత్తిన మలే హనియే, సప్త సాగర ఎల్లో దాచే రెండు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు.గతేడాది రిలీజైన 'సు ఫ్రమ్ సో' అనే విలేజ్ కామెడీ మూవీతో తెలుగు, కన్నడలో మంచి స్పందన అందుకున్నాడు. ఇకపోతే నాటక రంగంలో ఉన్నప్పుడే పరిచయమైన రష్మిక అనే అమ్మాయిని జేపీ తుమినాడ్.. 14 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దల్ని ఒప్పించి ఈ బుధవారం(మే 06) మంగళూరులో వీళ్లిద్దరి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో తోటి సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా) View this post on Instagram A post shared by Onelove Production (@oneloveproductions.in) -
పెళ్లి భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..!
అనంతపురం జిల్లా: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు.అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
ప్రముఖ నిర్మాత వీఆర్కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)
-
మాయమైన హారం
పెళ్లి పందిరంతా పూల వాసనలు, బాజాభజంత్రీలతో సందడిగా ఉంది. కానీ పెళ్లి కూతురు దివ్య ముఖంలో మాత్రం కళ లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు మదన్ ప్రవర్తన ఏదో తేడాగా ఉందని తన స్నేహితురాలు, లేడీ డిటెక్టివ్ సుగాత్రికి ముందే చెప్పింది.‘కట్నం అక్కర్లేదు. అబ్బాయికి పెద్ద బిజినెస్ వుంది. అందగాడు’... మధ్యతరగతి తండ్రి ఆలోచన... అందుకే కూతురిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు.పెళ్లి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం మొదలైంది.పెళ్ళికి వచ్చిన కనకం మెడలోని కోటి రూపాయల విలువైన వజ్రాలహారం మాయమైంది. పెళ్లి పెద్దలు కంగారు పడుతుంటే, సుగాత్రి లోపలికి అడుగు పెట్టింది.దివ్య తండ్రిలో ఆందోళన. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ అపశకునం ఏమిటని...?పోలీసులు పెళ్లి మండపాన్ని చుట్టుముట్టారు. అన్ని గదులూ వెతికారు.పెళ్ళికొడుకు రూమ్ మిగిలి వుంది. దివ్య తండ్రి అడ్డు చెప్పబోయాడు. ‘కాబోయే అల్లుడిని సోదా చేస్తే బాగుండద’ని...సుగాత్రి నచ్చచెప్పింది. పెళ్ళికొడుకు గది సోదా చేస్తే తను క్లీన్ చిట్‌తో బయటకు వస్తాడని చెప్పింది.మదన్ రూమ్ అణువణువూ వెతికారు. ఎక్కడా హారం దొరకలేదు.పెళ్ళికొడుకు మదన్ సీరియస్ అయ్యాడు. ‘అసలు హారం పోయిందో నాటకం ఆడుతున్నారో’ అంటూ అరిచాడు.‘‘నిజమే హారం పోలేదు కానీ, దొంగ దొరికాడు.’’ అంది సుగాత్రి. ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మదన్.‘‘హారం పోతే రికవరీ చేసుకోవచ్చు.. కానీ జీవితం పోతేనో?’’... అంటూ సుగాత్రి మదన్ సూట్‌కేస్ తెరిచి, అందులో ఉన్న రహస్య అరను పగులగొట్టింది. అందులో వేర్వేరు దేశాల పాస్‌పోర్టులు, వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు బయటపడ్డాయి.‘‘ఇప్పుడేమంటావ్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మదన్?’’ అంటూ పెళ్లికి వచ్చిన అందరి వైపు, దివ్య తండ్రి వైపు చూసి, ‘‘ఇతడు అంతర్జాతీయ స్థాయిలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే మ్యారేజ్ ఫ్రాడ్. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలాగే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిలను అమ్మేసి పరారయ్యాడు. చాలా చోట్ల ఇతని మీద కేసులు వున్నాయి. మధ్యతరగతి అమ్మాయిలే ఇతడి టార్గెట్. కూతురు పెళ్ళైతే చాలు, అనుకునే మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతలను, ఆశలను క్యాష్ చేసుకునే ఘరానా మోసగాడు ఇతను. నిజానికి హారం పోలేదు. కానిస్టేబుల్ కనకంతో నేను ఆడించిన నాటకం.దివ్య పెళ్ళికొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మదన్ ఫోటోను డేటాబేస్‌లో చెక్ చేశాను. ఇతని నేరాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో మోసాలు చేస్తాడు.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి.మదన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.‘‘నాలాంటి మధ్య తరగతి తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు తల్లీ! బిడ్డ పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి’... చేతులు జోడించి చెప్పాడు దివ్య తండ్రి.‘‘థాంక్యూ మై ఫ్రెండ్ లేని హారాన్ని పోయిందని చెప్పి ఆధారాలు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్తుడిని పట్టుకుని... నా జీవితాన్ని నాలాంటి అమ్మాయిల జీవితాలను కాపాడావు’’ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది దివ్య.‘‘మ్యాట్రిమోనీలలో సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. అబ్బాయిల ఆస్తిపాస్తులు, అర్హతల కన్నా వ్యక్తిత్వం, అసలు స్వరూపం తెలుసుకోవాలి.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి. -
చెప్పు శ్రీని.. కొత్త కోడలి వీడియో వైరల్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రియురాలు కావ్యని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుమల వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న నూతన వధూవరులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకునే సరికి చిన్నపాటి ఆటపట్టించడం లాంటివి జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ తమ పేర్లు చెప్పే ఇంట్లోకి అడుగుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి కూడా అలానే చేశారు. ముందుగా కొత్త కోడలు కావ్య మాట్లాడుతూ.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని చెప్పింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ .. మా ఇంటికి మా ఆవిడని తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి' అని నవ్వేశాడు. కావ్య కూడా తన భర్తను 'చెప్పు శ్రీని' అడగడంతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టేసరికి.. నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను అని అనేశారు.ఇకపోతే నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు గానీ చెప్పుకోదగ్గ హిట్స్ ఏం లేవు. గతేడాది 'కిష్కింధపురి'తో వస్తే ఇది యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం హైందవ, టైనస్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)After wedding at Tirumala, the newlyweds #BellamkondaSreenivas and his wife Kavya have gracefully arrived at their home in Hyderabad, marking the beginning of a beautiful new chapter in their lives.❤️🔥✨@BSaiSreenivas pic.twitter.com/PvUQUqRgA0— H A N U (@HanuNews) April 30, 2026 -
హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు
-
తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యల పెళ్లి (ఫోటోలు)
-
పెళ్లి వేడుకలో ఘోర విషాదం.. డాన్స్ చేస్తూ నవ వధువు మృతి!
-
హనీ ఈజ్ ది బెస్ట్.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్ (ఫోటోలు)
-
పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకుంది. గతంలో మాజీ సీఎం మనవడితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకున్న ఈమె ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగ్గా.. ఆ ఫొటోలని ఇప్పుడు పంచుకుంది. తన భర్త అర్ష్ ఔలక్ని పరిచయం చేసింది. ఈమె భర్తకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఇవి ఉన్నాయి.. అవి వదిలేశా.. సమంత పోస్ట్ వైరల్)పంజాబ్‌కి చెందిన మెహ్రీన్.. నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత ఎఫ్ 2, ఎఫ్ 3, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, పంతం, కవచం, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వద్ధామ, మంచి రోజులొచ్చాయి, స్పార్క్ లైఫ్ మూవీస్ చేసింది. తమిళ, హిందీ, పంజాబీ, కన్నడలో పలు చిత్రాల్లో నటించింది.ఇకపోతే హరియాణాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భజన్ లాల్ మనవడు అయిన భవ్య బిష్ణోయ్‌తో 2021 మార్చిలో మెహ్రీన్‌కి నిశ్చితార్థం జరిగింది. కానీ ఏమైందో ఏమో దీన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య పరి అనే ఐఏఎస్ అధికారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా అర్ష్ అనే వ్యక్తితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతానికైతే మెహ్రీన్ చేతిలో కొత్త సినిమాలేం లేవు. చూస్తుంటే నటనకు రిటైర్మెంట్ ఇచ్చేలానే ఉంది.(ఇదీ చదవండి: అషురెడ్డి వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన తండ్రి) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ల క్రితం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. రీసెంట్గా భార్యభర్తలిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విషయాలు మాట్లాడారు. అయితే ఓ సందర్భంలో తన వైవాహిక బంధాన్ని జాకీ భగ్నానీ.. 'సిట్యుయేషన్‌షిప్' అనడం కాస్త వింతగా అనిపించింది. శారీరక లేదా తాత్కాలిక సంబంధం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. దీంతో ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో స్వయంగా రకుల్.. తన భర్త చెప్పిన ఉద్దేశం గురించి క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: కిస్ సీన్.. చాలా అసౌకర్యంగా అనిపించింది: హీరోయిన్ కాజోల్)ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడుతూ.. మేం పెళ్లి చేసుకున్నాం కానీ మా మధ్య ఉన్నది ఓ సిట్యుయేషన్‌షిప్ లాంటిది. మేం ఒకరికొకరం అంకితమయ్యాం. నేను ఆమెతో దేని గురించైనా స్వేచ్ఛగా మాట్లాడగలను. అంతెందుకు రకుల్ పక్కనే ఉన్నప్పుడు నా ఎక్స్(మాజీ ప్రేయసి) నుంచి కాల్ వచ్చినా ఏ మాత్రం ఇబ్బందిపడకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతాను. నా భార్య దగ్గర దాచడానికి ఏం లేదు. అందుకే ఈ బంధంలో నాకు ఎప్పుడూ ఊపిరాడనట్లు అనిపించలేదు. తామిద్దరం చాలా ఫ్రీగా ఉంటాం అని చెప్పుకొచ్చాడు.ఇక సిట్యుయేషన్‌షిప్ అనే పదంపై ట్రోల్స్ ఎక్కువగా వస్తుండేసరికి రకుల్.. తన ఇన్ స్టా వేదికగా స్పందించింది. ఓ గంటపాటు జరిగిన సంభాషణలోని ఒక లైన్ తీసుకుని హెడ్ లైన్‌గా మార్చడం మాకు నవ్వు తెప్పించింది. కానీ అలా చేయడం సరైంది కాదు. సందర్భం ముఖ్యం. మా మాటల్ని క్లిక్ బైట్ చేయడం కరెక్ట్ కాదు అని పేర్కొంది. సిట్యుయేషన్‌షిప్ వ్యాఖ్యని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగిందని.. తమ బంధాన్ని స్వేచ్ఛగా, పరస్పర నమ్మకంతో కొనసాగిస్తున్నామని చెప్పడమే రకుల్-జాకీ ఉద్దేశంలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్)Jackky Bhagnani calls marriage with Rakul Preet Singh 'situationship' 😳😱“Rakul and I are married, but we are like in a situationship, which is, of course, we are exclusive to each other because that’s why we are married. But the most important thing is that I can talk to her… pic.twitter.com/4a3xBLl3Tv— FILMYNEWS (@filmynewsnetwrk) April 24, 2026 -
పెళ్లి భోజనం చేసిన 400 మందిలో అలజడి
దాహోద్: పెళ్లి వేడుకను సాధారణంగా స్నేహితులు, కుటుంబం సభ్యులు, బంధువులతో ఎంతో హుషారుగా, రుచికర వంటకాలతో జరుపుకుంటాం. వివాహం అంటే బాగా గుర్తుకువచ్చేది పెళ్లి వంటకాలు కూడా. అదే ఆహారం వందల మంది అనారోగ్యానికి కారణమైతే? గుజరాత్‌లోని దాహోడ్, అబ్లోడ్ గ్రామంలో బాజా భజంత్రీల మధ్య ఎంతో సందడిగా ఓ పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి సుమారు 300-400 మంది హాజరయ్యారు. వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారము, కడుపు నొప్పి, డయేరియాతో బాధపడ్డారు. వారిలో 50-60 మందిని స్థానికులు జైడస్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.జైడస్ ఆసుపత్రి ఆర్ఎమ్వో డాక్టర్ రాజీవ్ దామోర్ తెలిపిన వివరాల ప్రకారం.. రోగులకు గత రాత్రి 11 గంటల సమయంలో లక్షణాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ముందుగానే సమాచారం రావడంతో 150-200 మంది రావచ్చని అంచనా వేసి పడకలు, అత్యవసర సేవలు సిద్ధం చేశామని తెలిపారు. సుమారు 50-60 మంది రోగులు చేరారని, చికిత్స పొందుతున్నారని చెప్పారు. అధికారులు అత్యవసర దర్యాప్తు ప్రారంభించి ఆరోగ్య బృందాలను అప్రమత్తంగా ఉంచారు.పెళ్లి కార్యక్రమానికి వచ్చివారికి ఇలాంటి అనుభవం ఏర్పడడంతో ఆ గ్రామంలోని వారంతా షాక్ అయ్యారు. పెళ్లిలో అందించిన ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. ఆహారం తయారీ, వడ్డించే సమయంలో పాటించిన పరిశుభ్రత ప్రమాణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రూపొందించిన ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తే ఎటువంటి సమస్యలూ ఉండవు. పరిశుభ్రతను గాలికి వదిలేసి వండితే సమస్యలు తప్పవు.‘దాహోద్‌లో 400 మందికిపైగా పెళ్లి భోజనం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటన ఆందోళనకర విషయం. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. दाहोद में 400 से ज़्यादा लोगों का शादी का खाना खाकर बीमार पड़ना चिंता का विषय है। इस घटना की निष्पक्ष जांच होनी चाहिए। मैं सभी के जल्द स्वस्थ होने की प्रार्थना करता हूँ। फ़ूड सेफ़्टी में लापरवाही कभी भी हेल्थ इमरजेंसी का रूप ले सकती है। देश भर में मिलावटी खाद्य सामग्री पकड़ी जा… https://t.co/fpRTSue7vu— Arvind Kejriwal (@ArvindKejriwal) April 21, 2026 -
పెళ్లి కాకుండానే తల్లిని చేసిన ఘనుడు!
జైపూర్: పెళ్లికి ముందే ఓ యువతి బాబుకు జన్మని చ్చింది. ఇందుకు కారణమైన యువకుడు పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. నాలుగు రోజుల బా బుతో యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని ముదిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ముదిగుంటకు చెందిన బాధితురాలు నీలిమ మాట్లాడుతూ.. తమ గ్రామానికే చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సాయిరాజ్ తనను రెండుళ్లుగా ప్రేమించాడని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకో గా గర్భం దాల్చానని పేర్కొంది. డెలివరీ సమయంలో తనతో ఫోన్లో మాట్లాడాడని, బాబు పుట్టాక వీడియా కాల్ కూడా మాట్లాడినట్లు ఆరోపించింది. బాబు పుట్టిన నుంచి తనను దూరం పెట్టాడని తెలిపింది. పెళ్లికి నిరాకరిస్తున్నాడని, ఫోన్లో కూడా స్పందించడం లేదని వాపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరాజ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
మాటిమాటికీ రసగుల్లా తిన్నాడని..తందూరీ పొయ్యిలో పడేశాడు
బస్తీ(యూపీ): వివాహ శుభకార్యంలో అతిథుల కోసం సిద్ధంచేసి రసగుల్లాలను మాటిమాటికీ తినేస్తున్నాడన్న కోపంతో ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ 11 ఏళ్ల పిల్లాడిని తందూరీ పొయ్యిలో పడేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఉదంతంలో పిల్లాడికి ఛాతీ నుంచి ముఖందాకా తీవ్రస్థాయిలో కాలినగాయాలయ్యాయి. వెంటనే బంధువులు పిల్లాడిని అయోధ్య వైద్య బోధనాస్పత్రిలో చేరి్పంచారు. బస్తీ జిల్లాలోని ఛవానీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మలౌలీ గోసాయ్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 11 ఏళ్ల పిల్లాడు ఛమన్ అలియాస్ అమర్ స్వస్థలం గోంఢా పరిధిలోని దుర్జాన్‌పూర్. కానీ తన అమ్మ సొంతూరు బఘానాలాలో అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటున్నాడు. బంధువుల పెళ్లి కావడంతో అమ్మమ్మతో కలిసి మలౌలీకి వచ్చాడు. పెళ్లి వేడుకలో బంధువుల కోసం కౌంటర్ వద్ద రసగుల్లా సిద్ధంచేశారు. రసగుల్లాలను పదేపదే పిల్లాడు తీసుకోవడం చూసి అక్కడి క్యాటరింగ్ సర్వీస్ కాంట్రాక్టర్ పిల్లాడిని కోప్పడ్డాడు. అయినాసరే పిల్లాడు మరో రసగుల్లా తీసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో పిల్లాడిని కాంట్రాక్టర్ వెంటనే మండుతున్న తందూరీ పొయ్యి మీద కూర్చోబెట్టాడు. తీవ్రమైన వేడిమికి తాళలేక పిల్లాడు పట్టుతప్పి లోపల పడిపోయాడు. కాలినగాయాలతో కేకలువేయడంతో బంధువులు వచ్చి బయటకుతీసి వెంటనే అయోధ్య ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం లక్నో బోధనాస్పత్రిలో చేర్పించారు. మేనమామ దేవిదీన్ నిషద్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు సెక్షన్ 109(1)(హత్యా ప్రయత్నం) నేరం కింద పలువురిపై కేసు నమోదుచేశారు. పారిపోయిన కాంట్రాక్టర్ కోసం వేటమొదలెట్టామని సర్కిల్ ఆఫీసర్ హరయా స్వనిమా సింగ్ చెప్పారు. -
పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్
వివాహ వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్.అలాగే పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది. అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్, ఆపిల్స్ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు. రొటీన్‌గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by FeelKarkeDekho (@feel_karkedekho) ఒక మేరకు పళ్లు వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్ ప్యాకెట్లతో డెకరేట్ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట సందడి చేస్తోంది. 2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు. ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. -
గ్రాండ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లగ్న పత్రిక వేడుక (ఫొటోలు)
-
ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ఆ ఆచారం!
మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్ పిలాయ్ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.రాజస్థాన్‌లోని భార్మర్కు చెందిన ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ మార్చి 29న జోధ్‌పూర్ ఐపీఎస్ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్ అధికారి దూద్ పిలాయ్ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. ‘దూద్ పిలాయ్’ అంటే..దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం. ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!) -
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్‌ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు -
పెళ్లి కోసం.. బరువు తగ్గే ఇంజెక్షన్లు..
-
పెళ్లికి ముందు సూది మందు
సాక్షి, హైదరాబాద్: పెళ్లికి ముందు బరువు తగ్గే సులభమైన మార్గాల వెతుకులాటలో యువతీ యువకులు నిమగ్నమవుతున్నారు. వెయిట్లాస్కు సంబంధించిన ప్రత్యేక ఇంజెక్షన్లు, మందులపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో భారత్‌లో వీటి వినియోగం వేలంవెర్రిగా పెరిగిపోతోంది. పెళ్లికి ముందు వ్యాయామం, ఆహార నియమాలతో ఆశించిన ఫలితాలు రాలేదంటూ సడన్‌గా బరు వు తగ్గేందుకు ‘మౌంజారో’(టిర్జెపాటైడ్) ఇంజెక్షన్ తీసుకోవడం ఇటీవల పెళ్లీడు యువతలో బాగా పెరిగింది. పెళ్లి రోజు న నాజూగ్గా, అందంగా కనిపించాలనే తాపత్రయం కారణంగా భారత్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారింది. ఇది ఎక్కడివరకు వెళ్లిందంటే... ఢిల్లీలోని ఓ క్లినిక్ ఏకంగా ‘మౌంజారో బ్రైడ్’పేరిట ఓ ప్రత్యే క ప్యాకేజీని ప్రకటించింది. మరికొన్ని క్లినిక్‌లు.. చర్మ, కేశాలంకరణతోపాటు ఈ ఇంజెక్షన్లను ప్రీ–వెడ్డింగ్ ప్యాకేజీల్లో చేర్చే వరకు పరిస్థితి ఏర్పడింది. మనదేశంలో మధుమేహం, బరువు తగ్గుదల కోసం అను మతి పొందిన తొలి జీఎల్పీ–1 మందు ‘మౌంజారో. దీన్ని ఎలి లిల్లీ సంస్థ ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది. దీని పోటీ దారు నోవో నార్డిస్క్ తయారుచేసిన ‘వెగోవీ’కూడా అందుబాటులోకి వచ్చింది. శారీరక రూపానికి ప్రాధాన్యంతో... భారత్‌లో సంప్రదాయ వివాహాల్లో వధువు, వరుడి శారీరక రూపం, ఆర్థిక స్థితికి సంబంధించి అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయి. పెళ్లిలో ఒక నిర్దిష్ట పద్ధతిలో కనిపించాలనే సామాజిక ఒత్తిడి దీనికి కారణం. గతేడాది భారత్‌లో ఈ రెండు సంస్థలు తమ ఊబకాయ నివారణ మందులను విడుదల చేయగా, కొన్ని నెలల్లోనే మౌంజారో అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఈ మందులోని క్రియాశీల పదార్ధమైన సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో, భారతీయ ఔషధ తయారీదారులు ఇటీవల నోవో మందు చౌక వెర్షన్ల విక్రయాలు ప్రారంభించి, దాని లభ్యతను విస్తృతం చేశారు. ఈ మందులు ఊబకాయం ఉన్నవారిగా వర్గీకరించిన పెద్దలు లేదా మధుమేహం, అధిక రక్తపోటు లేదా స్లీప్ అప్నియా వంటి బరువు సంబంధిత వైద్య పరిస్థితితో అధిక బరువు ఉన్నవారి కోసం ఉద్దేశించినవిగా ఉన్నాయి. భారత్‌లో మౌంజారో ఇంజెక్షన్ పెన్ అత్యల్ప డోస్ ధర నెలకు రూ.13,125, గరిష్ట డోస్ ధర రూ. 25,781గా ఉంది. వెగోవీ అత్యల్ప డోస్‌ను నెలకు రూ.5,660, గరిష్ట డోస్‌ను రూ.16,400కి విక్రయిస్తున్నారు. ఇమ్యునో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఎలాంటి వెయిట్‌లాస్ చికిత్స అయినా మెటబాలిక్ సిండ్రోమ్‌తో సడన్‌గా బరువు తగ్గితే రోగ నిర్ధారణ శక్తికి నష్టం జరుగుతుంది. అందువల్ల వైద్యుడిని సంప్రదించకుండా ‘ఓవర్ ద కౌంటర్’గా ఈ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్లను మెడిసిన్‌గా వాడాలే తప్ప జ్వరం, ఒళ్లు నొప్పులకు క్రోసిన్ టాబ్లెట్‌గా వాడకూడదు. ఈ మందులతో సడన్‌గా బరువు తగ్గితే తీవ్రమైన ఇమ్యునో డిప్రెషన్‌తో క్షయ, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదముంది. సడన్ వెయిట్‌లాస్‌తో యాంగ్జయిటీ ట్రమెర్స్, తీవ్రమైన వెన్నునొప్పుల బారిన కూడా పడే అవకాశాలున్నాయి. ఈ బరువు తగ్గుదల మందులు కూడా శాశ్వత పరిష్కారంకాదు. ఈ ఇంజెక్షన్లను తీసుకోవడం ఆపేస్తే వెంటనే బరువు పెరుగుతారు. సాధారణంగా అయితే 6 నెలల నుంచి ఏడాది వరకు ఈ మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చి ఏడాదే అవుతోంది. అందువల్ల వీటి దీర్ఘకాల ప్రభావాలు, దు్రష్పభావాలు ఏమిటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియడం లేదు. తగిన డైట్, వ్యాయామానికి ఇది ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. –డా. బూర నర్సయ్యగౌడ్, బేరియాట్రిక్ సర్జన్ -
సైలెంట్‌గా వైష్ణవిని పెళ్లి చేసుకున్న షన్ను.. ఫొటోలు వైరల్
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను పెళ్లి చేసేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించిన ఇతడు.. ఇప్పుడు ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.(ఇదీ చదవండి: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)అయితే షన్ను పెళ్లి అయిన సంగతి అతడు గానీ, వైష్ణవి గానీ వెల్లడించలేదు. పెళ్లి ఫొటోలని షేర్ చేసిన ఫొటోగ్రాఫర్.. తన స్నేహితుడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడని చెప్పుకొచ్చాడు. దీంతో షణ్ముఖ్-వైష్ణవి పెళ్లి అయిందనే విషయం తెలిసింది. ఈ ఫొటోల్లో వధూవరులిద్దరూ కనిపించారు గానీ తాళి కడుతున్న ఫొటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.వైజాగ్‌కి చెందిన షణ్ముఖ్ జస్వంత్..యూట్యూబర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. 'వైవా' షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు. కానీ సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య తదితర యూట్యూబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. ఈ షో నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పటికే ప్రేమలో ఉన్న సహ యూట్యూబర్ దీప్తి సునైనాతో బ్రేకప్ అయింది. తర్వాత కొన్నాళ్లకు వైష్ణవి చోడిశెట్టితో ప్రేమలో పడ్డ షన్ను.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్) -
టాలీవుడ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. నిశ్చితార్థం కూడా
తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. గత నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశాడు. ఇంట్లోనే చిన్నపాటి వేడుక నిర్వహించి టాలీవుడ్ సెలబ్రిటీలని పిలిచాడు. ఇది నిశ్చితార్థం అని చాలామంది భావించారు. అయితే ఇది ఇరు కుటుంబాల పరిచయ వేడుక అని త్వరలో ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలని వెల్లడిస్తానని అన్నాడు. ఇప్పుడు అదే చేశారు.(ఇదీ చదవండి: 'రామాయణ' కోసం రెహమాన్‌కి అన్ని కోట్ల పారితోషికమా?)కొన్నాళ్ల క్రితం రూమర్స్ వచ్చినట్లే ఈ నెల 29న తిరుపతిలో పెళ్లి జరగనుంది. అంతకు ముందు అంటే ఈ ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగనుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోనే టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్(వివాహ విందు) ఏర్పాటు చేయనున్నారు.శ్రీనివాస్ విషయానికొస్తే ప్రముఖ నిర్మాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు. 'అల్లుడు శీను' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు గాన సరైన సక్సెస్ దక్కట్లేదు. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు చేస్తున్నాడు. కావ్య రెడ్డి విషయానికొస్తే హైదరాబాద్ అమ్మాయి. ఈమె తండ్రి, తాత న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన శర్వానంద్.. విడాకులు నిజమేనా?) -
పెళ్లి పందిట్లో బిర్యానీ లెగ్ పీస్ చిచ్చు
-
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ తమన్నా
తెలుగు బిగ్‌బాస్ 3వ సీజన్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పెళ్లి చేసుకుంది. ఏడాది క్రితమే ఇది జరిగినప్పటికీ.. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు భర్త ఫొటోని బయటపెట్టింది. సొంతూరికి వెళ్లినట్లు, భర్తతో సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్ స్టాలో పోస్టులు పెట్టింది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఫ్రెండ్స్‌తో పాటు పలువురు నెటిజన్లు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ సెటైరికల్ సినిమా)విజయవాడకు చెందిన తమన్నా సింహాద్రి.. బిగ్‌బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో రెండు వారాలు మాత్రమే ఉన్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అయిన యాంకర్ శ్రీముఖికి ఫ్రెండ్ అయిపోయింది. షో అయిపోయినా సరే దాదాపు ఆరేళ్లుగా ఇప్పటికీ వీరిద్దరి మధ్య ఆ స్నేహం కొనసాగుతూనే ఉంది. శ్రీముఖి ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో తమన్నా కూడా ఒకరు.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు శ్రీముఖితో స్నేహం గురించి చెప్పిన తమన్నా.. నా నిజాయితికి శ్రీముఖి ఫిదా అయిందని, నా జీవితంలో శ్రీముఖి లాంటి స్నేహితురాలని చూడలేదని, ఆమెలో నా కూతురిని చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. నా బంధువులు, రక్త సంబంధీకులు నన్ను దూరం పెడితే.. శ్రీముఖి మాత్రం నన్ను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకుందని చెప్పింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తమన్నా.. భర్త ఎవరు? అతడి పేరు ఏంటి? తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు.పుట్టడమే అబ్బాయిగా పుట్టిన తమన్నా అసలు పేరు మస్తాన్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్పిన ఈమె.. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా ఉంది. నాన్నకు అబ్బాయి కావాలని, అమ్మకు అమ్మాయి పుట్టాలని ఉండేది. ఇద్దరూ దర్గా వద్ద మొక్కుకున్నారు. దేవుడు కన్ఫ్యూజ్ అయ్యాడో ఏమో నేను పుట్టాను. నాకు తెలిసి నేను మా అమ్మ కోరిక తీర్చాను.ముంబై వెళ్లి లింగ మార్పిడి చేయించుకున్నాను. హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీకి రాక ముందే నేను ఆ పేరు పెట్టుకున్నాను. ఆమెని చూసి పెట్టుకున్నా పేరు కాదు, ఆపరేషన్ తర్వాత నా పేరు మస్తాన్ నుంచి తమన్నాగా మార్చుకుని ఇంటి పేరు సింహాద్రిని కలుపుకున్నానని చెప్పుకొచ్చింది.ఈమె పెదనాన్న సింహాద్రి సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు. తమన్నాకి కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. దీంతో 2019లో లోకేశ్‌పై మంగళగిరిలో పోటీ చేసింది. 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీగా నిలబడింది. కానీ కనీస ఓట్లు కూడా ఈమెకు పడలేదు.(ఇదీ చదవండి: ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు) View this post on Instagram A post shared by Tamanna Simhadri official (@tamannasimhadri) -
పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)
-
సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్
హీరోయిన్గా తమిళంలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ జనని అయ్యర్ (Janani Iyer) ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. గతేడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసుకోగా.. దాదాపు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు పైలట్ సాయి రోషన్‌తో ఏడడుగులు వేసింది. తమిళ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని జనని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)2011లో వచ్చిన విశాల్-ఆర్య 'వాడు-వీడు' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన జనని.. తర్వాత మలయాళ, తమిళంలో వరస మూవీస్ చేస్తూనే ఉంది. చివరగా 2024లో 'హాట్ స్పాట్'లో ఓ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అలానే తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది గానీ 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా నటిగా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు వాళ్లకు నచ్చితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు) -
వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారులు కేకే బిష్ణోయ్ (K.K.Bishnoi) , అన్షికా వర్మ(IPS Anshika) వివాహం (2026 మార్చి 29) వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జోధ్‌పూర్‌లో రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు. కేకే బిష్ణోయ్ అన్షికా వర్మల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. తాజగా ఐపీఎస్ అన్షికా వర్మ తన ప్రీ-వెడ్డింగ్షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లవ్ బర్డ్స్‌కు చెందిన రొమాంటిక్ ఫోటోలు నెటిజనులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఐపీఎస్ లవ్ స్టోరీఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ లవ్‌బర్డ్స్ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. హల్దీ, మెహందీవేడుకలనుఘనంగా నిర్వహించు కున్నారు. ఈ జంట మార్చి 29న వివాహం తరువాత మార్చి 30న జోధ్‌పూర్‌లో పలువురు వీఐపీల సమక్షంలో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Anshika Verma (@anshikaverma.ips) యూపీలో యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరి ప్రేమకథ వైరల్ అవుతోంది. సంభాల్ హింస తర్వాత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకొన్న డైనమిక్ బిష్ణోయ్ సీఎం మెడల్ అందున్నారు. రూ. 100 కోట్ల విలువైన బీమా కుంభకోణం బయటపెట్టి, 69 మందికి పైగా మాఫియాను కటకటాల వెనక్కి నెట్టారు. రౌడీ గ్యాంగ్‌లకు, అల్లరిమూకలకు చుక్కలు చూపించి ‘‘లేడీ సింగం’’గా అన్షికా వర్మ పేరు తెచ్చుకున్నారు. SP कृष्ण बिश्नोई - SP अंशिका बिश्नोई का #विवाह सम्पूर्ण #बिश्नोई_समाज के रीति रिवाज़ द्वारा हुआ सम्पन्न #KKBishnoi#AnshikaVerma#IPSWedding#IPSWedding#WeddingVibes#ipsanshikaverma#IPSOfficer#SPKKBishnoi#SambhalSp#NewsFlash https://t.co/46TU4SFLE1 pic.twitter.com/tPQfkatl3P— Goldy Srivastav (@GoldySrivastav) March 30, 2026ఐపీఎస్ అధికారిణి,లేడీ సింగం అన్షిక వర్మఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారుతండ్రి రిటైర్డ్ యూపీపీసీఎల్ ఇంజనీర్బీ.టెక్ తరువాత, కోచింగ్ లేకుండా యూపీఎస్సీలో ఉత్తీర్ణత 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం బరేలీలో ఎస్పీ సౌత్‌గా పనిచేస్తున్నారుగోరఖ్పూర్లో ఏఎస్పీగా కూడా పనిచేశారుఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్ ఐపీఎస్ కేకే బిష్ణోయ్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా నివాసిపూర్తి పేరు కృష్ణ కుమార్ బిష్ణోయ్రైతు కుటుంబానికి చెందినవారుఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బీఏ పట్టా పొందారు24 ఏళ్ల వయసులో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారుగతంలో ముజఫర్‌నగర్‌లో ఏఎస్పీగా పనిచేశారు -
ప్రియురాలిని పెళ్లాడిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్లో విరోష్ జంటతో అల్లు శిరీష్ కూడా ఓ ఇంటివాడయ్యారు. మరో టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ రజత్ దలాల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలిని ఆయన పెళ్లాడారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకున్న రజత్ దలాల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. మీ అందరి ఆశీస్సులు కావాలంటూ కోరారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.రజత్ దలాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు..పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారు. బిగ్‌బాస్-18 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ది 50 అనే రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. -
తిరుపతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్న తెలుగు హీరో
ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే వేరే ఊరికి వెళ్లిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం అనమాట. గత నెలలో ఇలానే హీరో విజయ్ దేవరకొండ-రష్మిక.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వెళ్లి అక్కడ గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అయితే ఇలాంటి హడావుడి ఏం లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.(ఇదీ చదవండి: ‘యూత్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఈ నెల ప్రారంభంలో కావ్య అనే అమ్మాయి తన జీవితంలో ఉందని చెప్పి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పరిచయం చేశాడు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యేసరికి ఇదేదో ఎంగేజ్మెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఇది కేవలం కుటుంబాల కలిసిన సందర్భం అని సదరు హీరో చెప్పుకొచ్చాడు. త్వరలో శుభవార్త గురించి, పెళ్లి డేట్ బయటపెడతానని అన్నాడు. ఇప్పుడు ఆ తేదీల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.వచ్చే నెల 5వ తేదీన బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య.. హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. వచ్చే నెల 29న తిరుపతిలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకోనున్నారు. మే 01న హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.(ఇదీ చదవండి: పదిరోజుల్లోనే ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా) -
అత్తమామల ఆశలు… ఒక్కరాత్రిలో కూలిపోయాయి!
కర్ణాటక: ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంటిలో అడుగుపెట్టిన కోడలు వంశోద్ధారకున్ని కానుకగా ఇస్తుందని అత్తమామాలు ఆశపడ్డారు. కానీ పెళ్లయిన 2 నెలలకే కోడలు ఇంటి నుంచి పరారు కావడంతో మామ గుండె ఆగిపోయింది. సమాజంలో పెరిగిపోతున్న పెడ ధోరణులకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. వివరాలు.. కొప్పళలో గౌరిఅంగల నివాసి నాగరాజ్‌కు, రాయచూరు జిల్లా సింధనూరువాసి సంజనతో ఫిబ్రవరి 8 న కొప్పళలో ఓ కళ్యాణ మండపంలో ఘనంగా పెళ్లి జరిపించారు. కొప్పళలో ఇంటి కింది అంతస్తులో అత్తమామలు, పై అంతస్తులో కొత్త జంట కాపురం ఉంటున్నారు. మార్చి 21న రాత్రి 8 గంటలకు సంజన తనకు సుస్తీగా ఉందని, మెడికల్ షాపుకెళ్లి మాత్రలు తెచ్చివ్వాలని భర్తను కోరింది. సరేనని అతడు వెళ్లి మాత్రలు తీసుకువచ్చాడు, కానీ భార్య కనిపించలేదు. అప్పటి నుంచి పలుచోట్ల గాలించినా జాడ లేదు. ఆరోజు నుంచి కొత్త కోడలు ఇంటి పరువు తీసిందని, కొడుకు జీవితం బజారుపాలైందని తీవ్రంగా బాధపడుతున్న మామ ఖండప్ప గురువారం గుండెపోటుతో కన్నుమూశాడు. -
నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్ బాద్షా (ఫోటోలు)
-
రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)
-
పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)
-
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
-
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
-
పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా
మహబూబాబాద్ జిల్లా: పెళ్లి, ఇతర శుభకార్యాలను తమ హోదాతోపాటు బంధుమిత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఫంక్షన్‌హాల్‌ను ఎంచుకుంటారు. ముక్కూమొహం తెలియని వారు ఫంక్షన్‌కు రావడం వల్ల అతిథులు ఇబ్బంది పడడం, చివరగా భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుండడంతో ఆ ఫంక్షన్‌హాల్‌కు పెద్దగా గిరాకీ ఉండకపోవడంతో ఆ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ‘ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు లోనికి వచ్చి పట్టుబడితే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా’అంటూ ఫంక్షన్‌హాల్ ముందు ఫ్లెక్సీ పెట్టాడు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ‘ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్లకండి.. భోజనం లాగిద్దామని వెళ్తే..లాగి లోపలేస్తారు.. తస్మాత్ జాగ్రత్త’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వృథాగాగోదావరి జలాలు ఎయిర్ వాల్వ్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు చేర్యాల (సిద్దిపేట): గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. తపాసుపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేసే పైప్‌లైన్ ఎయిర్ వాల్‌్వను గుర్తుతెలియని వ్యక్తులు ఓపెన్ చేశారు. దీంతో గోదావరి జలాలు పెద్దఎత్తున వృథాగా పొలాల్లోకి వెళ్తున్నాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడం వల్ల దేవాదులకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీటి వృథా కొనసాగుతూనే ఉంది. -
'విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. చిన్నారి క్యూట్ వీడియో'
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గతనెల ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన ఈ జంట ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఓ చిన్నారి విజయ్ దేవరకొండకు అభిమానినని.. తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన హీరో విజయ్.. బుజ్జి తల్లికి రిప్లై ఇచ్చాడు. మా ఇంటికి లంచ్‌కి వచ్చేయ్.. నీకిష్టమైన స్వీట్స్, ఫుడ్ ఇంట్లోనే చేయించి వడ్డిస్తానని చిన్నారికి బదులిచ్చాడు. ఇది చూసిన చిన్నారి నన్ను మీ ఇంటికి పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ.. రష్మిక అక్కా.. మీరు నాకు రిప్లై ఇచ్చి.. నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.. బై బై అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నన్ను ఇంటికి పిలిచినందుకు @TheDeverakonda మామకు & @iamRashmika కు థాంక్స్ #ViRoshWeddinghttps://t.co/Bgm2voxks6 pic.twitter.com/Ipv5Qg4hz1— greatandhra (@greatandhranews) March 8, 2026 -
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
-
మిమ్మల్ని కలిసే ఛాన్స్ రాలేదు.. ఆ ప్రేమని జీవితాంతం కొనసాగిస్తూ
అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. నయనిక మెడలో శుక్రవారం రాత్రి మూడు ముళ్లు వేశాడు. ఏడడుగులు నడిచాడు. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. అయితే నయనికతో పెళ్లి తర్వాత శిరీష్.. తొలిసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈమె తండ్రి శరత్ చంద్రారెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)'మావయ్యా.. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. కానీ నేను ఇప్పుడు భార్యగా పిలుచుకునే ఆ మహిళని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టారు. ఈ భూమిపై నేను ఉన్నంత వరకు ఆ ప్రేమని నేను ఆమెకు అందిస్తాను' అని శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. అలానే ఆయన ఫొటోతో పాటు కొన్ని పెళ్లి ఫొటోలని కూడా షేర్ చేశాడు.శిరీష్ విషయానికొస్తే నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు. ఇతడి సోదరుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరో కాగా బాబీ నిర్మాతగా ఒకటి రెండు సినిమాలు చేశారు. శిరీష్ కూడా హీరోగా పలు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. నయనిక విషయానికొస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఈమెది బిజినెస్ ఫ్యామిలీ. ఈమె కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనే. వరుణ్-లావణ్య బ్యాచిలర్ పార్టీ టైంలో శిరీష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
సీరియల్ నటి చెల్లిని పెళ్లి చేసుకున్న ఆర్జే సూర్య
ఆర్జేగా కొందరికి తెలిసిన సూర్య.. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని మరింతగా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు శుక్రవారం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ నటి సుధీర చెల్లి, ఆర్జే శౌర్యతో సూర్య ఏడడుగులు వేశాడు. ఈ శుభకార్యానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?)ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సూర్య.. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుంచి పలు పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పిన బాధలో ఉన్నప్పుడు ఆర్జేగా ఆఫర్ రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల గొంతులని మిమిక్రీ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆర్జేగా ఫేమస్ అయిన ఇతడు.. బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని 8 వారాల పాటు హౌసులో ఉన్నాడు. తర్వాత తన తోటి కంటెస్టెంట్ ఫైమాతో కలిసి బీబీ జోడీ తొలి సీజన్(డ్యాన్స్ కాంపిటీషన్) లో పాల్గొని విజేతగానూ నిలిచాడు. తన తోటి ఆర్జే, సీరియల్ నటి సుధీర చెల్లి శౌర్యతో ప్రేమలో పడ్డ సూర్య.. గతేడాది అక్టోబరులో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వేడుకకు సీరియల్ బ్యూటీస్ అన్షు, ఆషికా తదితరులు వచ్చారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: విజయ్‌తో కలిసే ఉంటా.. మరో షాకిచ్చిన సంగీత) -
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)
-
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్‌ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్‌తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్‌కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
చాన్నాళ్లకు ఓ ఫొటో పోస్ట్ చేసిన రక్షిత్ శెట్టి.. రష్మిక పెళ్లి ఎఫెక్టేనా?
హీరోయిన్ రష్మిక పెళ్లి తంతు ముగిసింది. వారం-పదిరోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన ఈమె.. తర్వాత రిసెప్షన్స్‌లో పాల్గొంటూ బాగానే సందడి చేసింది. ఓ వారం గ్యాప్ తీసుకుని 'రణబాలి' షూటింగ్లో భార్యభర్తలిద్దరూ పాల్గొంటారు. సరిగ్గా ఈ టైంలోనే రష్మిక మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ రష్మిక పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఇలా ఫొటో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి, రష్మిక కలిసి నటించారు. రష్మికకు హీరోయిన్గా ఇదే తొలి మూవీ. దీని షూటింగ్ టైంలోనే వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో గానీ పెళ్లి రద్దు చేసుకున్నారు. అప్పటి నుంచి కెరీర్ పరంగా ఎవరికి వాళ్లు బిజీ అయిపోయారు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మిక స్థాయి మారిపోయింది. పాన్ ఇండియా రేంజుకి వెళ్లిపోయింది. అలా విజయ్ దేవరకొండతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.మరోవైపు రక్షిత్ శెట్టి మాత్రం 42 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయాడు. అప్పుడెప్పుడో 2023లో 'సప్త సాగర ఎల్లో దాచే' అనే సినిమా రెండు భాగాలతో వచ్చాడు. తర్వాత నుంచి కొత్తగా మరో మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇతడు స్నేహితుడు రిషభ్ శెట్టి.. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం రక్షిత్.. అమెరికాలో ఉన్నాడని, కొత్త సినిమా కోసం స్టోరీ రాసుకుంటున్నాడని అన్నాడు. తాజాగా రక్షిత్ శెట్టి.. ఫేస్బుక్లో తన 'చార్లీ' మూవీకి సంబంధించిన ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో ఇతడి అభిమానులు.. రష్మిక పెళ్లిని లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి రక్షిత్, సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉన్నట్లుండి ఇప్పుడీ ఫొటో పెట్టడం చర్చనీయాంశమవుతోంది.రక్షిత్ శెట్టి స్నేహితులైన రిషభ్ శెట్టి 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'జై హనుమాన్' మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత ఛత్రపతి శివాజీ బయోపిక్‌లోనూ నటించబోతున్నాడు. మరో స్నేహితుడు రాజ్ బి శెట్టి కూడా తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లోనూ నటుడిగా పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రక్షిత్ మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించక, నిర్మాతగానూ కొత్త చిత్రాలేం చేయక సైలెంట్ అయిపోవడం అతడి ఫ్యాన్స్‌ని ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్) -
అల్లు శిరీష్ పెళ్లి.. నయనిక ఇంట సందడి.. ఫొటోలు వైరల్
అల్లు అర్జున్ సోదరుడు శిరీష్.. ఈ రోజే నయనికని పెళ్లి చేసుకోనున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇకపోతే గురువారం, నయనిక ఇంట్లో పెళ్లి కూతురు వేడుక, పసుపు దంచడం తదితర కార్యక్రమాలు జరిగాయి. ఆ ఫొటోలని నయనిక తన సోషల్ మీడియాలో పంచుకుంది.(ఇదీ చదవండి: క్యూటీ.. నీ వల్లే ఇదంతా సాధ్యం.. భార్యపై బన్నీ ప్రేమవర్షం)నయనిక ఇంట్లో జరిగిన ఈ శుభకార్యానికి అల్లు అరవింద్, తన సతీమణి, అల్లు అర్జున్, స్నేహ కుటుంబం హాజరైంది. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నయనిక అక్కాచెల్లితో పాటు కుటుంబ సభ్యులందరూ ఫొటోల్లో కనిపించారు. ప్రీ వెడ్డింగ్ పార్టీ, రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగినప్పటికీ వివాహం మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా జరగనుంది.(ఇదీ చదవండి: విజయ్, శిరీష్ దారిలో టాలీవుడ్లో మరో హీరో ప్రేమ పెళ్లి) View this post on Instagram A post shared by Nayanika Reddy (@nayanika_reddy) -
పెళ్లి వేడుకలో విజయ్, త్రిష సందడి.. ఫోటోలు వైరల్
-
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్‌లో కనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్‌వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్‌తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్‌తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్‌గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్‌ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్‌గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్‌ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్‌నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
-
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
అభిమానులతో 'విరోష్' జోడీ బంతి భోజనాలు (ఫొటోలు)
-
వైఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన (ఫొటోలు)
-
విరోష్ వెడ్డింగ్.. సూపర్ హిట్
-
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో గ్లామరస్ హీరోయిన్ సందడి (ఫొటోలు)
-
సంగీత్ పార్టీలో విరోష్ జోడీ.. ఫోటోలు షేర్ చేసిన విజయ్ (ఫోటోలు)
-
ఒక భార్య... ఇద్దరు భర్తలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ దువాంగ్‌దువాన్ కెట్సారో వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కనుల పండువగా జరిగినందుకో లేక అట్టహాసంగా జరిగినందుకో కాదు..పెళ్లి జరిగిన తీరు విచిత్రంగా ఉండటమే అందుకు కారణం. కెట్సారో ఇటీవల జరిగిన వేడుకలో ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మనువాడింది. వీరిద్దరితో ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధం నిజాయతీ, పరస్పర అంగీకారమే మూలమని ఆమె అంటోంది. గాయని, పాటల రచయిత అయిన కెట్సారో మొదటగా ఆస్ట్రియా వాసి రోమన్‌తో స్నేహం చేసింది. రిటైర్డు పోలీసు అధికారి అయిన రోమన్‌తో కలిసి పట్టాయా నగరంలో ఐదేళ్లపాటు కలిసి సహజీనం సాగించింది. ఆ సమయంలో వారి బంధం బలపడింది. తర్వాత, ఆస్ట్రియాకే చెందిన పోలీసు అధికారి మ్యాకీతో పరిచయమేర్పడింది. ఇతడికి దగ్గరైంది. వీరి ముగ్గురి మధ్య బంధం క్రమంగా ఒక అసాధారణ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ముగ్గురూ కలిసి కూర్చుని భవిష్యత్తులో కలిసి ఎలా ఉండాలనే విషయం చర్చించుకుని, ఒక నిర్ణయం తీసుకున్నారు. కాగా, కెట్సారోకు మొదటి వివాహం ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు మనవలు ఉన్నారు. తల్లిదండ్రులు, కుమార్తెలతోపాటు ఇతర కుటుంబసభ్యులకు సైతం ఆస్ట్రియా వాసులతో కొనసాగుతున్న బంధాన్ని గురించి తెలిపింది. పాటలు రాయడం, పాటడం ద్వారా ఆర్థిక కష్టాలు తీరక ఇబ్బందులు పడుతున్న సమయంలో రోమన్, మ్యాకీలు తనకెంతో బాసటగా నిలిచారని కెట్సారో అంటోంది. తన కుటుంబానికి కూడా సాయపడ్డారని తెలిపింది. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని చెప్పగా కుటుంబసభ్యులు కూడా అంగీకారం తెలిపారని, వారు తన పట్ల చూపే శ్రద్ధ, అంకితభావమే ఇందుకు కారణమని పేర్కొంది. సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ పెళ్లికి ఆస్ట్రియా వరులు చెరో లక్ష బహాట్లు, మన కరెన్సీలో సుమారు రూ.29 లక్షలను కెట్సారోకు సమర్పించుకున్నట్లు సమాచారం. సమాజంలో మారుతున్న వివాహ సంబంధాలకు వీరి పెళ్లి తాజా ఉదాహరణగా భావిస్తున్నారు. -
'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ
హీరోయిన్ రష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ.. సోమవారం తన సొంతూరు అయిన తుమ్మనపేటకు వచ్చాడు. ఈ గ్రామం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలంలో ఉంది. సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో నూతన వధూవరులిద్దరూ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలందరికీ వెజ్-నాన్ వెజ్ భోజనాలు కూడా పెట్టారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్)సొంతూరితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊర్లో పొలం కొందాం వ్యవసాయం చేసుకుందాం ఇల్లు కట్టుకుందామని నాన్న ఎప్పుడూ అడిగేవాడు. ఆ కోరిక నెరవేరినందుకు సంతోషంగా ఉంది . ఊరిలో ఇల్లు కట్టుకోవడం పెళ్లి చేసుకోవడం ఒకేసారి జరగడంతో హ్యాపీ. ఇకనుంచి గ్రామానికి రెగ్యులర్‌గా వస్తాం. తమ్ముడు ఆనంద్ పెళ్లి గ్రామంలోని అందరి సమక్షంలో చేస్తాం. ఊరికి చేసేది చాలా ఉంది. అందరం కలిసి ఊరిని అభివృద్ధి చేసుకుందాం. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.ఇకపోతే నిన్న అనగా ఆదివారం.. దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం 'విరోష్' జంట అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల స్వీట్ల పంపిణీ కూడా చేశారు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్‌కి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)విరోష్ పెళ్లికానుక.. విద్యార్థులకు విజయ్ దేవరకొండ శుభవార్తవిజయ్ దేవరకొండ తన 'విరోష్' పెళ్లికానుకగా విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా మొదట అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతి ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు అందజేయనున్నారు. భవిష్యత్తులో ఈ… pic.twitter.com/nwMlm0M7sI— ChotaNews App (@ChotaNewsApp) March 2, 2026 -
భర్తని చూస్తూ సిగ్గుపడిపోతూ.. రష్మిక వీడియో వైరల్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక.. గతవారం పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన కొత్త జంట.. తెలంగాణలోని తుమ్మనపేట అనే గ్రామానికి వెళ్లారు. విజయ్ దేవరకొండ సొంతూరు ఇది. సోమవారం ఉదయం అక్కడే సత్యనారాయణ వ్రతం చేశారు. అలానే ఊరి వాళ్లందరికీ భోజనాలు కూడా పెట్టించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్)అయితే ఈ మొత్తం వాటిలో ఒక్క వీడియో మాత్రం విరోష్ (ViRosh) అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇందులో రష్మిక.. తన భర్త విజయ్‌ని చూస్తూ సిగ్గుపడుతూ కనిపించింది. విజయ్ తనని చూసేసరికి రష్మిక ముఖాన్ని పక్కకు తిప్పుకొని మురిసిపోయింది. పూజ చేస్తున్న టైంలో ఈ క్యూట్ మూమెంట్ కనిపించింది.విజయ్ దేవరకొండ స్వస్థలం తెలంగాణలోని అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం తుమ్మనపేట. తన వివాహం తర్వాత తొలిసారి సతీమణి రష్మికతో సొంతూరికి వచ్చాడు. తన ఫామ్ హౌస్‌లోనే సత్యనారాయణ వ్రతం జరిపించాడు. అలానే ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశాడు. ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)#VijayDeverakonda & #RashmikaMandanna ❤️pic.twitter.com/9S7AW5b0Zw— cinee worldd (@Cinee_Worldd) March 2, 2026 -
కాటికి చేరిన నవ దంపతులు
ఇంకా పెళ్లి బట్టలు కూడా మాసిపోలేదు. గోరింటాకు చెదిరిపోలేదు. పెళ్లింట బంధువుల సందడి అలాగే ఉంది. నవ దంపతులు చిలకా గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారని ఊరంతా సంబరపడ్డారు. కానీ విధికి మాత్రం కన్నుకుట్టింది. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని అందరూ కన్నీరు పెట్టారు.బెంగళూరు: నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని బంధుమిత్రులు చేసిన దీవెనలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా.. వివరాలు.. శిగ్గావ్ నివాసులు కార్తీక్ హుగార్ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దంపతులు గాయాలతో అక్కడే కన్నుమూయగా, మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్ ఆస్పత్రికి తరలించారు. శోకసంద్రం.. ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు' వేడుక.. ఫొటోలు, వీడియో వైరల్
రీసెంట్‌గానే టాలీవుడ్‌కి చెందిన విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ వివాహం.. ఈ శుక్రవారం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. నయనిక అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొన్నిరోజులుగా బ్యాచిలర్ పార్టీ, కాక్టెయిల్ పార్టీలంటూ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు శిరీష్‌ని పెళ్లి కొడుకుగా తయారు చేసిన వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఈ పెళ్లి వేడుకలో అల్లు ఫ్యామిలీ అంతా సందడి చేశారు. అలానే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. కొత్తగా పెళ్లయిన విజయ్ దేవరకొండ-రష్మిక కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమయ్యారు. హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఈ శుభకార్యంలో కనిపించారు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
విరోష్ వెడ్డింగ్.. పాన్ ఇండియా ఫ్యాన్స్‌కు కొత్త జంట సర్ప్రైజ్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.తాజాగా అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మార్చి 1వ తేదీన ఆదివారం మిఠాయిలు పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఆలయాల వద్ద అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.❤️ pic.twitter.com/zXPGxIxHz7— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026 -
విశేషాలకు కొదవ లేని కొడవ కళ్యాణం
అక్కడ పురోహితులు ఉండరు... వేద మంత్రోచ్చారణలు వినిపించవు... వధూవరులు ఏడడుగులు వేయరు... ‘కొడవ’ సంప్రదాయ పద్ధతిలో జరిగే వివాహ వేడక ఇలానే ఉంటుంది. అంతేనా? ఇంకా చాలా విశేషాలుంటాయి. తెలుగు సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఈ వేడుక ఉంటుంది. టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ఈ రెండు పద్ధతుల్లోనూ పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అదే రోజు సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి జరిగింది. దీంతో కొడవ తెగకు సంబంధించిన వేడుక ఎలా జరిగి ఉంటుందా?! అనే చర్చలు మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం...విజయ్ దేవరకొండది తెలంగాణలోని నాగర్‌కర్నూలు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్ పేట. కొడగునే కూర్గ్ అని కూడా పిలుస్తారు. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, సంప్రదాయాలు మిగతా వారితో పోల్చితే భిన్నంగా ఉంటాయి. వారి పూర్వీకులను గౌరవిస్తూ వివాహ వేడుకలను జరుపుతారు. మామూలుగా జరిగే తెలుగు వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించవు. అరిటాకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ వివాహ వేడుకను వాళ్లు ‘మంగళ’ అని పిలుస్తారు. అంతా పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా జరుగుతుంది. వేదికను అరిటాకులతో పచ్చదనానికి ప్రతీకగా అలంకరిస్తారు.భిన్నమైన కట్టుకొడవ పెళ్లిలో వధూవరులిద్దరూ అభ్యంగన స్నానం చేస్తారు. అనంతరం తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తారు. పెళ్లి కొడుకు ‘కుష్య’ అనే నల్లని కోటు, ‘చేలే’ అని పిలిచే నడుముకు కట్టే పట్టీ, ‘పీచే కత్తి’ (చిన్న కత్తి) ధరిస్తాడు. ఇక వధువు చీరకట్టు సంప్రదాయం మిగతా చీరకట్టులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. సాధారణంగా భారతీయ వస్త్రధారణలో చీర పల్లూను ముందు నుంచి వెనక వైపుకు వేస్తారు. కానీ కొడవ సంప్రదాయంలో చీర కొంగును వెనక నుంచి ముందుకు తీసి, వేస్తారు. అలాగే, వెనక వైపు కుచ్చిళ్లు వచ్చేలా కట్టుకునే ప్రత్యేకమైన కట్టు ఈ కమ్యూనిటీలో కనిపిస్తుంది. ఇక వేడుక అంతా డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలు చేస్తారు. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. ఈ పద్ధతిని అనుసరిస్తూ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా కూడా ఈ నృత్యాలు చేశారు.కొడవలు ఎవరు కొడవలను ‘కూర్గులు’ అని కూడా అంటారు. వీరిది కర్ణాటక రాష్ట్రంలోని కొడగు (కూర్గ్) ప్రాంతం. వీరు సుమారు 1.6 లక్షల దాకా ఉన్నారని అంచనా. గతంలో వీరు వ్యవసాయం, ఇతర పనుల మీద ఆధారపడి జీవించేవారు. 19వ శతాబ్దంలో కాఫీ సాగు ద్వారా వీరి పనికి ప్రాధాన్యం లభించింది. మొదట వ్యవసాయ ఆధారిత పండుగలు జరుపుకునే వీరు అనంతరం ఇతర పండుగలూ జరుపుకోవడం మొదలుపెట్టారు. కావేరి నది వీరికి ప్రాధాన్యమైనది. బ్రిటిష్ పాలన సమయంలో వీరు ఇతర రంగాల్లోకి ప్రవేశించారు. వీరి నైపుణ్యాలను గమనించి బ్రిటిష్ అధికారులు వీరిని మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వినియోగించారు. కొడవల్లో అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు.బంగారు నాణేల మూటపెళ్లి వేదికకు వచ్చే మార్గంలో అరటి చెట్టు నాటుతారు. వరుడు దీని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, అనంతరం ఆ చెట్టు కాండాన్ని నరకడం ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. ఇది వరుడి పరాక్రమానికి, అడ్డంకులను తొలగించడానికి ప్రతీకగా నిలుస్తుంది. తర్వాత వరుడు పెళ్లి పీటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, తూర్పు ముఖంగా కూర్చుంటాడు. ఆ సమయంలో ముందుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు వరుడిని ఆశీర్వదిస్తారు. తర్వాత వధువు అక్కడికి చేరుకుని వరుడికి పాలు, బహుమతులు, బంగారం, వెండి, రాగి నాణేలను అందిస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతంగా భావిస్తారు.12 గులకరాళ్లతో వధువుపై సర్వహక్కులువధూవరులిద్ద్దరూ మల్లెపూల దండలు మార్చుకుంటారు. పవిత్ర దీపం ఎదురుగా నిలబడి వధువు బాధ్యత వరుడికి అప్పగిస్తున్నామని పెద్దలు చెబుతారు. దీంతో పాటు వధువు తరఫు పెద్దలు 12 గులకరాళ్లు వరుడి పెద్దలకు ఇచ్చి, వధువుపై సర్వహక్కులు ఇస్తున్నామని చెబుతారు. అయితే వరుడి వైపు పెద్దలు 11 రాళ్లు తీసుకొని ఒకటి తీసుకోకుండా వదిలేస్తారు. అవసరమైన సందర్భంలో వధువుపై వారికీ హక్కు ఉందనే అర్థంలో ఇలా చేస్తారు. పుట్టింటివారికి కూతురి పట్ల కొంత బాధ్యత ఉంటందని సూచించడానికే ఇలా చేస్తారని చెప్పవచ్చు.నీళ్ల బిందె తలపై పెట్టుకొని..పెళ్లి తర్వాత వధువు తమ అత్తగారి ఇంటి వద్ద గంగా పూజ చేస్తుంది. ఈ పూజ కోసం వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను ఆటపట్టిస్తూ, ఆమె నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమె సహనాన్ని, ఓర్పును పరీక్షించడానికే ఈ ఘట్టం. ఇతర హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ పెళ్లిళ్లలో మాంసాహారాన్ని వడ్డిస్తారు. అందులో ప్రధానంగా పంది మాంసం, మద్యం తప్పనిసరిగా ఉంటాయట. దీంతో విజయ్–రష్మిక పెళ్లి వేడుకలో ఈ వంటకాన్ని కూడా వడ్డించారు. ఇలా ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో, సాయంత్రం కొడవ సంప్రదాయ పద్ధతిలో జరిగిన విజయ్–రష్మికల వివాహ వేడుకలు ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అయ్యాయి. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.విరోష్ సెలబ్రేషన్స్‘‘దేశంలోని ప్రజలందరూ ఎప్పుడూ మా ప్రయాణం, ప్రేమలో భాగమయ్యే ఉన్నారు. అందుకే మీ అందరితో మా వెడ్డింగ్‌ను సెలబ్రేట్ చేసుకోవడం మాకెంతో సంతోషం. ప్రతి వేడుకను ఇండియా ఎలా అయితే ఫుడ్ అండ్ మిఠాయిలతో సెలబ్రేట్ చేసుకుంటుందో అలా మా జీవితంలోని ఈ బిగ్ మూమెంట్‌ను మీతో కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు మార్చి 1న దేశవ్యాప్తంగా ఫుడ్ అండ్ స్వీట్ ట్రక్స్‌ను పంపిస్తున్నాం (కొన్ని నగరాల్లో మాత్రమే). అలాగే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రేమతో విజయ్ అండ్ రష్మిక’’ అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక ‘ఎక్స్’ లో శనివారం రాత్రి ఓ పోస్ట్ షేర్ చేశారు. అలాగే ‘విరోష్ సెలబ్రేషన్స్’ అంటూ, ఏయే నగరాల్లో స్వీట్స్ పంచనున్నారు, ఏయే దేవాలయాల్లో అన్నదానం నిర్వహించనున్నారన్న జాబితాను కూడా ఈ ఇద్దరూ షేర్ చేశారు.స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్... ∙తెలంగాణ – హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ∙ఢిల్లీ (ఎన్సీటీ) – ఢిల్లీ ∙చండీఘర్ (యూటీ)– చండీఘర్ ∙ఉత్తరప్రదేశ్ – నోయిడా, గజియాబాద్ ∙గుజరాత్ – అహ్మదాబాద్ ∙మధ్యప్రదేశ్ – భోపాల్ ∙మహారాష్ట్ర – ముంబై ∙రాజస్థాన్ – జైపూర్ ∙ఆంధ్రప్రదేశ్ – వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి ∙కేరళ – కొచ్చి ∙కర్ణాటక – మైసూర్, కూర్గ్, బెంగళూరు ∙తమిళనాడు – కోయంబత్తూర్, చెన్నై ∙పాండిచ్చేరి (యూటీ) – పాండిచ్చేరి ∙బిహార్– (ట్రైన్ యాక్సిడెంట్ కారణంగా సోమవారానికి వాయిదా). -
ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్' జోడీ (ఫొటోలు)
-
విరోష్... ఓ రికార్డ్
బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు వసూళ్లపరంగా రికార్డ్ బ్రేక్ చేయడం కామన్. అయితే ఇప్పుడు ‘విరోష్’ (విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా) వివాహం ఓ రికార్డ్ బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా ఉయం 10 గంటల 10 నిమిషాలకు విరోష్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి ఫొటోలను ‘విరోష్’ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ఒకరిçపట్ల మరొకరికి ఉన్న ప్రేమను చెబుతూ, ఓ పోస్ట్‌ని కూడా షేర్ చేశారు. కాగా... రష్మికా మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు అత్యధిక లైక్స్ దక్కాయి. దీంతో ‘విరోష్’ వివాహ ఫొటోలు రికార్డ్ సాధించాయి. బాలీవుడ్ కపుల్ పిద్ధార్థ్ మల్హోత్రా–కియారా అద్వానీల పెళ్లి ఫొటోలు అత్యధిక లైక్స్ దక్కించుకున్న రికార్డ్‌ని సొంతం చేసుకున్నాయి. ఆ రికార్డ్‌ని తాజాగా విరోష్ ఫొటోలు బ్రేక్ చేశాయి. షేర్ చేసిన తక్కువ సమయంలో ఎక్కువ లైక్స్ (15.8 మిలియన్లు) సాధించిన సిద్ధార్థ్–కియారాల రికార్డ్‌ని 18.5 మిలియన్ల లైక్స్‌తో ‘విరోష్’ పెళ్లి ఫొటోలు బ్రేక్ చేశాయి. ఈ నంబర్ ఇంతటితో ఆగలేదు... లైక్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటుతున్న సమయంలో ఈ సంఖ్య 20 మిలియన్లకు పైగా దాటింది. అంటే... దాదాపు రెండు కోట్లకు పైనే లైక్స్ దక్కాయి. దీన్నిబట్టి విజయ్–రష్మికల జోడీకి ఎంత క్రేజ్ ఉందో ఊహించుకోవచ్చు.ఉదయ్‌పూర్ టు హైదరాబాద్: పెళ్లి ఫొటోల్లో బ్యూటిఫుల్ కపుల్‌లా కనిపించిన విజయ్–రష్మిక శుక్రవారం ఎయిర్‌పోర్టులో క్యూట్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శుక్రవారం ఈ నూతన జంట హైదరాబాద్ చేరుకుంది. కాగా ఎయిర్‌పోర్టులో ఈ జంటని చూసి, ‘కంగ్రాచ్యులేషన్స్’ అంటూ ఫ్యాన్స్ అభిమానం చాటుకోగా... ‘విరోష్’ శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ... చిరునవ్వులు చిందించారు. మార్చి 4న హైదరాబాద్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రధానికి ఆహ్వానం... వైరల్భారత ప్రధాని నరేంద్ర మోదీని గత వారం విజయ్–రష్మిక స్వయంగా కలిసి, తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జంటను ఆశీర్వదిస్తూ... మోదీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా... మోదీని విజయ్–రష్మిక కలిసిన ఫొటోలు తాజాగా బయటకు రాగా... అవి కూడా వైరల్‌గా మారాయి. -
నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు నా వైఫ్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
-
సాగర తీరాన సప్తపది
విజయవాడకు చెందిన రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. విశాఖకు చెందిన అంజలి హైదరాబాద్‌లో ఆర్కిటెక్ట్. వారిద్దరూ తమ వివాహం కేవలం ఒక ఫంక్షన్ హాల్కే పరిమితం కాకుండా కుటుంబ సభ్యులందరితో కలిసి మూడు రోజులపాటు పండుగలా చేసుకోవాలని విశాఖపట్నం తీరాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా ఎంచుకున్నారు.సాక్షి, సెంట్రల్ డెస్క్: ఒకప్పుడు ఆకాశమంత పందిరి.. పెళ్లికి నెల రోజుల ముందు నుంచే హడావుడి. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమారుడి ఇళ్లల్లో ఉరుకులు పరుగులు కనిపించేవి. ఇప్పుడు పెళ్లిళ్ల ట్రెండ్ మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సెలబ్రిటీలు చేసుకుంటున్నట్టుగా బాలి, మాల్దీవులు, రాజస్థాన్, కశ్మీర్ వంటి ప్రాంతాలకు వెళ్లడం లేదు. మన మధ్యే.. మన రాష్ట్రంలోనే ప్రకృతి అందాల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడం నయా ట్రెండ్‌గా మారింది. సంప్రదాయబద్ధంగా.. ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపిస్తున్నారు. వధూవరుల తరఫు సమీప బంధువులతో పాటు అత్యంత ఆత్మీయుల సమక్షంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. వివాహానికి ముందు బ్యూటీ సెషన్లు, స్థానిక సంస్కృతిని తెలుసుకునే వర్క్‌షాప్‌లు వంటి వినూత్న కార్యక్రమాలు 2026లో ట్రెండ్‌గా ఉన్నాయి. సంపన్నులు, మధ్యతరగతి వారు సైతం డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కే జై కొడుతున్నారు. వధువు తరఫున 40–50 మంది.. వరుడి తరఫున మరో 40–50 మందితో ప్రశాంతంగా పెళ్లి వేడుకను ముగిస్తున్నారు. ఆ తరువాత సొంతూళ్లలో బంధుమిత్రుల కోసం రిసెప్షన్లు ఏర్పాటు చేస్తున్నారు.చుట్టూ ప్రకృతి అందాలు.. సెలయేటి సవ్వళ్లు.. పక్షుల కిలకిలా రావాల మధ్య అడుగులో అడుగేస్తూ.. వధూవరుల ‘సప్తపది’ తంతు ఆహా.. అన్నట్టు ఉంటోంది. మొదటి రోజు: పెళ్లి సందడి రుషికొండ సమీపంలోని విలాసవంతమైన రిసార్ట్‌లో బంధువులందరికీ స్వాగతం పలికారు. సాయంత్రం సముద్రపు గాలుల మధ్య జరిగిన ’మెహందీ’ వేడుక కన్నుల పండువగా సాగింది. రెండవ రోజు: పసుపు సంబరం ఉదయాన్నే బీచ్ ఎదురుగా ఉన్న తోటలో ’హల్దీ’ వేడుక జరిగింది. పసుపు రంగు బట్టల్లో అతిథులందరూ ఒకరిపై ఒకరు పూల రెక్కలు, పసుపునీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. సాయంత్రం ‘సంగీత్’ వేడుకలో సముద్రపు అలల హోరు మధ్య డీజే పాటలకు అంజలి, రమేష్ కుటుంబ సభ్యులు నృత్యాలతో హోరెత్తించారు. మూడవ రోజు: కల్యాణ ఘట్టం తెల్లవారుజామున సముద్రపు ఒడ్డున మంటపం పచ్చని మామిడి ఆకులు, మల్లెపూల అలంకరణలతో దివ్యంగా ఉంది. బాలభానుడి కిరణాలు సముద్రాన్ని తాకుతున్న వేళ.. వేద మంత్రాల సాక్షిగా రమేష్ అంజలి మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం ఆధునిక డెస్టినేషన్ వెడ్డింగ్ శైలిలో అతిథులకు మర్చిపోలేని అనుభూతినిచి్చంది. ఇలా వీరేకాదు అత్యధికులు ఈ తరహా వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ హితంగానూ.. ప్లాస్టిక్ రహిత అలంకరణలతో స్థానిక కళాకారులు, స్థానిక వంటకాలకు స్థానం కల్పిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా వివాహాలు చేసుకోవడం కూడా కొత్త బాధ్యతాయుతమైన ట్రెండ్‌గా మారింది. 2026 నాటికి భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మార్కెట్ విలువల 18 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. 2033 నాటికి 55 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఏపీలోనూ ఆదరణ మన రాష్ట్రంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పెరిగాయి. విశాలమైన తీర ప్రాంతాలు, కొండకోనల నడుమ రిసార్ట్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. బెంగళూరు వంటి ప్రాంతాలకు చెందిన వారు సైతం విశాఖపట్నం, భీమిలి, చీరాల, బాపట్ల వంటి తీరాలతోపాటు దిండి, కోనసీమలోని రిసార్ట్స్, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను వివాహ వేదికలుగా మార్చుకుంటున్నారు.దోహదం చేస్తున్న అంశాలివీ » జెన్ జెడ్ అభిరుచులకు డెస్టినేషన్ వివాహాలు అద్దం పడుతున్నాయి. » విహార యాత్రలా మాత్రమే కాకుండా.. వధూవరుల కుటుంబాల మధ్య అనుబంధాలను మరింతగా పెనవేస్తాయని జెన్ జెడ్ భావిస్తోంది. » డెస్టినేషన్ వెడ్డింగ్స్‌తో ఏర్పాట్ల కోసం పడే శ్రమ, ఖర్చులను కూడా పరిమితం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో వివాహాలు జరిపించి మధురానుభూతి పొందుతున్నారు. » సముద్ర తీరాలు, చారిత్రక కట్టడాలు, కొండ ప్రాంతాల వంటి ప్రకృతి అందాల నడుమ పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం గుర్తుండిపోయే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు లభిస్తున్నాయి. » ఆదాయం పెరగడంతో చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్‌ను సామాజిక హోదాకు గుర్తింపుగా భావిస్తున్నారు.మధురానుభూతి గతంలో పెళ్లి అంటే ఎంతో హడావుడి ఉండేది. ఏర్పాట్ల కోసం కుటుంబ సభ్యులంతా హైరానా పడాల్సి వచ్చేది. అందుకే మా అబ్బాయి అమర్ శంకర్ వివాహం విశాఖలోని రిసార్ట్స్‌లో ప్లాన్ చేశాం. ఆత్మీయుల సమక్షంలో చేసిన పెళ్లి మధురానుభూతి ఇచ్చింది. వచ్చిన బంధువులంతా మినీ ట్రిప్‌లా ఎంజాయ్ చేశారు. మేము కూడా అతిథుల మాదిరిగా సరదాగా గడిపాం. – యు.ఉషాదేవి, విజయనగరంబడ్జెట్ ఫ్రెండ్లీగానే.. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే చేసుకోవచ్చు. వధూవరుల అభిరుచి మేరకు అన్ని రకాల ఏర్పాట్లు ఎక్కడైనా సరే మేం చేస్తాం. స్టేజి ఎంపికపైనే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఆర్కెస్ట్రా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా సమకూరుస్తున్నాం. – టి.రవళి, తలశిల వెడ్డింగ్ ప్లానర్స్, విజయవాడఅతిథుల్లా వస్తే చాలు వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అతిథుల్లా వస్తే చాలు. వివాహానికి సంబంధించిన అన్ని వస్తువులతో పాటు, నచ్చిన మెనూ, డెకరేషన్, ఫొటో, వీడియో గ్రఫీ, ఘట్టానికి తగ్గట్టు స్టేజి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం అందరూ వివాహాన్ని గ్రాండ్‌గా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టు సరీ్వసు అందిస్తున్నాం. – అభి, అభి ఈవెంట్స్ అండ్ ఫుడ్ కేటరర్స్, రాజమండ్రి -
వైభవంగా... ఆహ్లాదకరంగా విరోష్ వివాహం
‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి, ఫిబ్రవరి 26న ‘విరోష్’ (ఫ్యాన్స్ ఈ ఇద్దర్నీ అలానే పిలుస్తారు. తమ వివాహ వేడుకకు ఆ పేరునే పెట్టారు విజయ్–రష్మిక) భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది.ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేసి, ఒకరిపట్ల మరొకరికి ఉన్న మమకారాన్ని, నమ్మకాన్ని, ఇష్టాన్ని పంచుకున్నారు.ప్రాణ స్నేహితురాల్ని భార్యను చేసుకున్నాను: విజయ్ ‘‘ఒక రోజు ఆమెను నేను మిస్ అయ్యాను... ఆమె పక్కన ఉండి ఉంటే ఈరోజు ఇంకా బాగుండేది కదా అన్నంతగా ఆమెని మిస్ అయ్యాను. ఒకవేళ ఆమె నా పక్కన కూర్చుని ఉంటే.. నా భోజనం ఇంకా పరిపూర్ణంగా అనిపించేది కదా అనిపించింది... అలాగే నాతో కలిసి ఆమె వర్కవుట్స్ చేస్తే అది పనిష్మెంట్లా కాకుండా ఫన్‌లా ఉండేది అనిపించింది. నా జీవితానికి ఆమె అవసరం అనిపించింది. నేను ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్న అనుభూతిని, ప్రశాంతతను ఇచ్చే ‘ఇల్లు’ అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నేను నా ప్రాణ స్నేహితురాల్ని నా భార్యను చేసుకున్నాను... 26.02.2026’’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) విజ్జూ... మాటలు సరిపోవడం లేదు: రష్మికహాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు ‘నా భర్త’ని పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. ప్రతి రోజూ పెద్ద కలలు కనడం మంచిదే అనీ, ఆ కలను సాకారం చేసుకునే సామర్థ్యం నీకు ఉందని చెప్పిన వ్యక్తి. ఎవరూ నన్ను చూడడంలేదనుకుంటూ నేను డ్యాన్స్ చేస్తుంటే నన్ను ఆపని వ్యక్తి. అలాగే స్నేహితులతో ప్రయాణం చేయడం ఎంత బాగుంటుందో చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి... ఈ వ్యక్తి గురించి ఓ పుస్తకం రాయొచ్చు. నేను ఎలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో అలా ఉండేలా నువ్వు నన్ను మార్చావు.విజ్జూ... నీ గురించి ఎప్పుడు ఏం చెప్పాలన్నా నాకు మాటలు సరిపోవు. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం... ఇవన్నీ హఠాత్తుగా నాకు అర్థవంతంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నందుకు.... వీటన్నింటికీ సాక్ష్యంగా నువ్వు ఉన్నందుకు... నేను నీ భార్యను కావడం, నీ భార్యగా పిలవబడడం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది పూర్తిగాపార్టీ టైమ్. మనిద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యు. -
ఇదిగో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
-
గ్రాండ్‌గా విరోష్ పెళ్లి.. విజయ్ దేవరకొండకు భారీ కట్నకానుకలు?
టాలీవుడ్ పవర్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న చుట్టూ ఇప్పుడు భారీ హైప్ నడుస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లి ఈ రోజు(ఫిబ్రవరి 26) ఉదయం ఉదయపూర్‌లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో కట్న, కానులకు సంబంధించి పలు గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ రష్మిక నుంచి భారీ కట్నం తీసుకుంటున్నాడనే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ నిజమా? లేక ఓవర్ హైప్‌నా?విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య లింకప్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సీక్రెట్ ఎంగేజ్మెంట్ జరిగిందని సోర్సెస్ చెబుతున్నాయి. కానీ ఇద్దరూ ఓపెన్‌గా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెడ్డింగ్ హడావిడి బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ డీటైల్స్ నెటిజెన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని చెబుతున్నారు. ఈ వెడ్డింగ్‌ను 'విరోష్ వెడ్డింగ్' అని పిలుస్తున్నారు . ఇక్కడ విరోష్ అంటే విజయ్ + రష్మిక = విరోష్ అని అర్ధం.ఇకపోతే వీళ్ళ పెళ్ళి వార్తల్లో మెయిన్ కాంట్రవర్సీ డౌరీ క్లెయిమ్స్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం, రష్మిక సైడ్ నుంచి విజయ్‌కు భారీ డౌరీ ఇస్తున్నారని... గోల్డ్, లగ్జరీ ప్రాపర్టీలు, ఇండియాలో హై-ఎండ్ హోమ్స్, కార్లు, క్యాష్ వంటివి ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని పోస్టుల్లో "150 కోట్ల డౌరీ" అని కూడా రాస్తున్నారు! ఇది 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్' అని, టాలీవుడ్లో ఎప్పుడూ లేనంత గ్రాండ్‌గా జరగబోతోందని ట్రెండ్ అవుతోంది.కానీ ఈ క్లెయిమ్స్ ఎంత వరకు నిజం? చాలా ముఖ్యంగా – ఇవన్నీ *అన్‌వెరిఫైడ్* అలాగే *వైరల్ రూమర్స్* మాత్రమే! విజయ్ లేదా రష్మిక ఎవరూ ఈ డౌరీ గురించి కాదు కదా కనీసం వాళ్ళ పెళ్ళి గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. డౌరీ అనేది చట్టవిరుద్ధం, ఈ రకమైన రూమర్స్ సెలబ్రిటీల చుట్టూ తరచూ వస్తాయి – కొన్ని ట్రోల్స్, కొన్ని ఫేక్ న్యూస్ కోసం. గతంలో కూడా ఫిబ్రవరి 2 లేదా ఇతర డేట్స్‌పై ఫేక్ వీడియోలు వచ్చాయి, కానీ అవి తప్పు అని తేలాయి.ఈ కట్నకానుకలతో పాటు ఇంకా కొన్ని హాట్ రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ వీళ్ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 260 కోట్లు కూడా ఆఫర్ చేసిందని, కానీ విజయ్ రిజెక్ట్ చేశాడని చెబుతున్నారు .ఎందుకంటే తమ వెడ్డింగ్ మెమరీస్ పర్సనల్ అని వాటిని పబ్లిక్ డొమైన్ లో ఉంచడం తమకు ఇష్టంలేదని విజయ్ చెప్పాడట. అంతేకాదు ఈ పెళ్ళికి సంబంధించి సెక్యూరిటీ టీమ్ 3 వారాలు ట్రైనింగ్ తీసుకుందని, స్టార్ గెస్ట్స్ లిస్ట్ భారీగా ఉందని కూడా లీక్ అయ్యాయి. అయితే పెళ్లి గురించి అయితే కొంతవరకు ఓకే కాసీ డౌరీ లాంటి సెన్సిటివ్ టాపిక్స్‌పై కూడా రూమర్స్ వ్యాప్తి చేయడం మంచిది కాదు. -
అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే ‘పెళ్లి’?.. అ నోటీసుల్లో నిజమెంత?
న్యూఢిల్లీ: నగరంలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నోటీసుపై క్లారిటీ ఇచ్చింది. ఆ నోటీసులో పవిత్ర రమజాన్ నెలలో విద్యార్థులపై కొన్ని పరిమితులు విధించారని పేర్కొనబడింది. ప్రధానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే పెళ్లి చేసేస్తామంటూ సదరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటీసుపై స్పష్టత ఇచ్చింది. అది నిజం కాదని, ఆ నోటీసు నకీలీ నోటీసు అని పేర్కొంది.దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు ఈ నోటీసును పూర్తిగా నకిలీది అని ఖండించారు. వారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. ఈ నోటీసుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే యత్నం చేశారని, దీనిపై సైబర్ విభాగానికి అధికారిక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కలిసి ఉన్నందుకు ఎలాంటి పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే జామియా మిల్లియా ఇస్లామియా ప్రతినిధులు ఒక విన్నపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ‘కేవలం అధికారిక వెబ్సైట్ లేదా విశ్వ విద్యాలయం నుండి విడుదలైన ప్రకటనలే నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల తప్పుదారి పట్టవద్దు’ అని సూచించారు.పవిత్ర రంజాన్ నెలలో అబ్బాయి-అమ్మాయి కలిసి నిలబడి ఉన్నప్పుడు నికా ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి 20 తేదీన.. ఒక నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది నోటిఫికేషన్లో ఉన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. విశ్వవిద్యాలయ అధికారులు అలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. అందువల్ల దానిని సీరియస్‌గా తీసుకోవద్దని అందరిని కోరుతున్నాము. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే ఆ నోటిఫికేషన్‌ను ప్రచారం చేశారు. విశ్వవిద్యాలయ పరిపాలన అలాంటి నోటిఫికేషన్‌ను ఖండిస్తోంది. ఈ విషయమై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాం’ అని సదరు యూనివర్శిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. -
విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!
ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive A 'Sweet' gesture!❣️Team #VIROSH share joy with the media at Udaipur!!🤩✨#VijayDeverakonda #RashmikaMandanna #TeluguFilmNagar pic.twitter.com/6PryBXwsEp— Telugu FilmNagar (@telugufilmnagar) February 26, 2026 -
నెల్లూరులో జనసందోహం.. కొత్త జంటకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు (ఫొటోలు)
-
Rashmika Mandanna: నా కాబోయే భర్త అలానే ఉండాలి..!
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం బయటకు చెప్పకపోవడంతో.. ఈ ఇద్దరూ ఎక్కడ కనిపించినా.. రకరకాల పుకార్లు, గాసిప్స్ చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం వాటిన్నింటికీ చెక్పెట్టేస్తూ..ఈ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనుంది ఈ జంట. ఇంకొన్ని గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటికానుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అవేంటో ఈ సందర్భంగా చూద్దామా..!ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయి. అది సహజం. ఇక్కడ నటి మదన్న కూడా అలానే భావించారు. ఈ ముద్దుగుమ్మ సైతం సగటు అమ్మాయిలా..తన కాబోయే వాడు అలానే ఉండాలని అలా ఉంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఆమె తన భాగస్వామి ఎలా ఉండాలందంటే..ప్రేమలో దయ, గౌరవం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని అంటోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో సహచరుడు తప్పక ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి తన కాబోయే జీవిత భాగస్వామి చాలా స్పెషల్‌గా ఉండాలి. ఏవిధంగా అంటే..ఆ అమ్మాయి ప్రతి బాధ, కష్టం, ఆనందంలోనూ తన పక్కనే ఉండాలి . ఆ భాగస్వామిని చూడగానే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఇట్టే ఎదుర్కొనగలను అనే ధైర్యం, నమ్మకం కలగించేలా ఉండాలి.అతడే ఆమెకు ఓదార్పు, భద్రత, సానుభూతి.. అన్ని అవ్వాలి. అవే ఏ అమ్మాయైనా తన కాబోయే భర్తలో కోరుకునేది. అలాంటి వ్యక్తి లభిస్తే ఏ అమ్మాయి అయినా..అదృష్టవంతురాలే అంటూ తన కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాలా చక్కగా వివరించింది రష్మిక. అంతేగాదు ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు, శ్రద్ధ వహిస్తున్నప్పుడు, బాధ్యత వహిస్తున్నప్పుడు..ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అంటోంది. చివరగా..ఇలాంటి లక్షణాలే తన భర్తలో ఉండాలని కోరుకుంటానని నవ్వుతూ చెప్పింది రష్మిక. మరి అలాంటి లక్షణాలే విజయ్‌లో ఉన్నాయి కాబోలు..అందుకే ఈ క్రేజీ బోయ్తో ఇంకొన్ని గంటల్లో ఏడుగుగులు వేసి..కొత్త జీవితాన్ని ఆరభించనుంది ఈ బ్యూటీ. కాగా, విజయ్ రష్మికలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 50 కి.మీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ మెమెంటోస్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నారు.(చదవండి: ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..) -
తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారంటే?
తెలుగు హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్‌కి టాటా చెప్పేశాడు. హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. ఉదయ్‌పుర్ వేదికగా ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే విజయ్ వయసు 36 కాగా రష్మిక వయసు 29. ఈ సందర్భంగా తెలుగు హీరోలు.. ఎవరు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరెప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారంటే?(ఇదీ చదవండి: ఎట్టకేలకు సొంతిల్లు కట్టుకున్న 'బిగ్‌బాస్ 8' విజేత నిఖిల్)చిరంజీవి కొడుకు రామ్ చరణ్.. 27 ఏళ్లకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు, ఓ బాబు ఉన్నాడు.ఎన్టీఆర్ తన 28వ ఏట లక్ష్మీ ప్రణతిని వివాహమాడాడు. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు.హీరో నాని కూడా తనకు 28 ఏళ్లున్నప్పుడే వైజాగ్‌కి చెందిన అంజనని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.అల్లు అర్జున్ తన 29 ఏళ్లకు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమిది. వీళ్లకు ఓ బాబు, పాప ఉన్నారు.మహేశ్ బాబు కూడా తన 29 ఏటనే నమ్రతతో ఏడడుగులు వేశాడు. వీళ్లది ప్రేమ వివాహమే. ప్రస్తుతం ఓ కొడుకు, కూతురు ఉన్నారు.నాగచైతన్య 30 ఏళ్ల వయసులో సమంతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. ఏడాదిన్నర క్రితం శోభితని పెళ్లాడాడు.మెగాహీరో వరుణ్ తేజ్ 33వ ఏట హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహమాడాడు. ఇది ప్రేమ వివాహం. వీళ్లకు ఓ కొడుకు ఉన్నాడు.హీరో నిఖిల్.. తనకు 34 ఏళ్లున్నప్పుడు పల్లవి వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.రానా తన 35వ ఏట మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.విజయ్ దేవరకొండ 36 ఏళ్ల వయసులో ఇప్పుడు రష్మికని పెళ్లి చేసుకున్నాడు. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు.హీరో నితిన్ 37 ఏళ్లకు షాలినీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు కూడా ఓ కొడుకు పుట్టాడు.హీరో శర్వానంద్ అయితే 38 ఏళ్లకు రక్షితా రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఓ కూతురు ఉంది.ఇంతమంది హీరోలు పెళ్లిచేసుకుంటున్నారు గానీ ప్రభాస్ మాత్రం 47 ఏళ్లొచ్చినా ఇప్పటికే సింగిల్‌గానే ఉండిపోయాడు. పెళ్లి చేసుకుంటాడో లేదో?(ఇదీ చదవండి: #Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్) -
#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
#Virosh : పెళ్ళి సందడి.. ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్?) -
ఉదయపూర్ లో విరోష్ పెళ్లి హంగామా
-
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌లో ఫుల్‌గా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్‌లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్‌లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)
-
ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్
Wedding of ViRosh నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్‌కు వెళ్లారు. తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తాజా నివేదికల ప్రకారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి.విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతిసంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో సంగీత నైట్ ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట. తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు. సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుందివిరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులుమరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్‌బస్టర్ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్‌లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్ లవ్‌బర్డ్స్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
'జీన్స్' మూవీని తలపించే పెళ్లి వేడుక..!
సోషల్ మీడియాలో ఓ పెళ్లి వేడుక అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా పెళ్లి వేడకల్లో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటేనే బంధుమిత్రులు మురిసిపోతారు. అలాంటిది ఒకేలా ఉండే ఇద్దరు వరులు అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు వధువులను పెళ్లి చేసుకుంటే ఆ సందడి, హడావిడే వేరు. అచ్చం అలానే ఇక్కడ ఒకేలా ఉండే ఇద్దరు కవల సోదరిమణులు..ఒకేలా ఉండే కవల సోదరులను పెళ్లాడారు. ఇది తెలంగాణలోని కామారెడ్డిలో జిల్లా ఘన్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఒకే పోలికలతో ఉన్న ఈ రెండు జంటలు, మూడు ముళ్ల బంధంతో ఒకటవ్వడం అక్కడున్నవారందర్నీ ఆకట్టుకుంటోంది. వారే ట్విన్ బ్రదర్స్ అయిన దుంపటి విజయ్, వినయ్‌లు, ట్విన్ సిస్టర్స్ అయిన కుమ్మరి కీర్తన, కీర్తీలను పెళ్లాడారు. ఆ ఇరు జంటలు పెళ్లిపీటల మీద కూర్చున్న దృశ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఇలా ఇద్దరు కవలలు, మరో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతంది. అక్కడి గ్రామస్తులు ఇలాంటి పెళ్లి ఘట్టాన్ని కనులారా వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నామని చెబుతుండటం విశేషం. (చదవండి: జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..) -
రష్మిక పెళ్లికి పిలిచిందా? రిషభ్ శెట్టి సమాధానమిదే
హీరోయిన్ రష్మిక పెళ్లి మరికొన్ని గంటల్లో జరగనుంది. హీరో విజయ్ దేవరకొండతో ఉదయ్‌పుర్ వేదికగా ఏడడుగులు వేయనుంది. గతంలోనే రష్మిక.. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకోవాల్సింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది రద్దయింది. అప్పటినుంచి రక్షిత్ శెట్టి అతడి స్నేహితులకు రష్మిక అంటే ఎందుకో కోపం? తాజాగా రష్మిక పెళ్లికి పిలిచిందా అనే ప్రశ్న 'కాంతార' రిషభ్ శెట్టికి ఎదురైంది. మరి అతడేం సమాధానమిచ్చాడో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని)కర్ణాటకకు చెందిన రష్మిక.. రిషభ్ శెట్టి దర్శకత్వం వహించిన 'కిరిక్ పార్టీ' సినిమాతోనే హీరోయిన్ అయింది. ఇందులో రక్షిత్ శెట్టి హీరో. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే రక్షిత్-రష్మిక ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో పెళ్లి రద్దయింది. అప్పటినుంచి రిషభ్ శెట్టి, రక్షిత్ శెట్టితోపాటు అతడి స్నేహితులు.. రష్మిక గురించి మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు కూడా అదే జరిగింది.మంగళవారం ఉదయం మంత్రాలయంకి వచ్చిన రిషభ్ శెట్టి.. రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న టైంలోనే.. రష్మిక మిమ్మల్ని తన పెళ్లికి పిలవలేదా? అని ఓ రిపోర్టర్ అడిగాడు. ప్రశ్న మధ్యలో ఉండగానే థ్యాంక్యూ అని చెబుతూ రిషభ్ శెట్టి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రష్మిక పెళ్లి విషయానికొస్తే.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి చేసిన విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గురువారం ఉదయం పెళ్లి చేసుకోనున్నారు. ఉదయం తెలుగు పద్ధతిలో, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన కొడవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)#RishabShetty ignored #RashmikaMandanna’s marriage invitation questionpic.twitter.com/gwUFUpj9AC— cinee worldd (@Cinee_Worldd) February 25, 2026 -
విజయ్-రష్మిక పెళ్లి.. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్‌పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!) -
చిగురాశలపై పిడుగుపాటు
సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్‌తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి. గత వారం గుజరాత్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం! ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు. -
విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లికి రెడీ అయిపోయారు. రెండు రోజుల క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నుంచి పెళ్లి సందడి మొదలైపోయింది. ఇదలా ఉండగానే పెళ్లి జరగబోయే సంప్రదాయ పద్ధతులు, పెళ్లి జరిగే చోటు, అతిథుల లిస్ట్, మెనూ అని చెప్పి సోషల్ మీడియాలో చాలానే విషయాలు వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)కలిసి రెండు సినిమాలు చేసిన విజయ్-రష్మిక.. చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాకపోతే ఎప్పుడూ బయటకు చెప్పలేదు. తమ పెళ్లిని గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఇప్పుడు ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్‌పుర్‌లోని ఆరావళి పర్వతాల మధ్యలో ఉన్న 'ద మెమొంటోస్' అనే లగ్జరీ హోటల్లో ఈ శుభకార్యం జరగనుంది. ఈ వివాహానికి విరోష్(VIROSH) అని పేరు కూడా పెట్టారు.ఇకపోతే మంగళవారం(ఫిబ్రవరి 24) సాయంత్రం సంగీత్ జరగనుంది. బుధవారం(ఫిబ్రవరి 25) ఉదయం హల్దీ.. సాయంత్రం మెహందీ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోనున్నారు. గురువారం(ఫిబ్రవరి 26) ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది. ఇదే రోజు సాయంత్రం కొడవ స్టైల్లో మరోసారి విజయ్-రష్మిక వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. శుక్రవారం నాడు అంతా కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.అలానే ఈ పెళ్లికి కేవలం 100 మంది లోపే హాజరు కానున్నారని, అతిథుల కోసం తెలుగు సంప్రదాయ ఆహారంతో పాటు జపనీస్ వంటకాలు కూడా మెనూలో ఉండనున్నాయని తెలుస్తోంది. వివాహం ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు 'నో-ఫోన్' కాన్సెప్ట్ కూడా అమలు చేయనున్నట్లు టాక్.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?) -
రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?
అనుకున్నట్లే టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారు. చాన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ నిజం చేస్తూ రెండు రోజుల క్రితమే అధికారికంగా తమ వివాహం విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఉదయ్పుర్లో పెళ్లి హడావుడి మొదలైపోయింది. ఈ గురువారమే(ఫిబ్రవరి 26) విజయ్-రష్మిక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. అయితే తమ ఇంటికి రాబోయే కోడలి గురించి విజయ్ తల్లిదండ్రులు గతంలో మాట్లాడారు. ఒకటి రెండు కండిషన్స్ కూడా పెట్టారు. ఇంతకీ అవేంటి?(ఇదీ చదవండి: 'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)విజయ్ తెలంగాణ అబ్బాయి కాగా.. రష్మిక కన్నడ అమ్మాయి. వీళ్లిద్దరూ తొలుత 'గీతగోవిందం' అనే సినిమా కోసం కలిసి పనిచేశారు. ఆ టైంలోనే వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. అయితే అదే మూవీ ఈవెంట్లోనే విజయ్ తల్లిదండ్రులు తమ కోడలి ఎలా ఉండాలి అనే విషయాల్ని కొన్ని చెప్పారు. ఇప్పుడు రష్మిక వాటిని నిజం చేసినట్లు కనిపిస్తోంది.'గీతగోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారు? అని విజయ్ తల్లిదండ్రులని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన తల్లి మాధవి.. మా బాబుని(విజయ్ దేవరకొండ) బాగా చూసుకునే కోడలు వస్తే చాలు, అతడిని ప్రేమించాలి అంతే. ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె, అతడిని బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి గోవర్థన్ ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కులం, మతం గురించి పట్టింపులు లేవు. భారతీయురాలిని, ముఖ్యంగా దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అని అన్నారు.మరో మూవీ ఈవెంట్లో విజయ్ కూడా తనకు కాబోయే భార్య గురించి మాట్లాడుతూ.. తనకు అరేంజ్డ్ మ్యారేజ్ వర్కౌట్ కాదని, చేసుకుంటే లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. కానీ ఆ అమ్మాయి నా తల్లిదండ్రులకు కూడా నచ్చాలి అని కండిషన్ పెట్టాడు. మరో సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. మాధవి(విజయ్ తల్లి) ఆంటీ తనకు మరో అమ్మలాంటిది అని చెప్పుకొచ్చింది. చూస్తుంటే విజయ్ దేవరకొండ పేరెంట్స్ పెట్టిన కండిషన్స్‌కి తగ్గట్లే రష్మిక.. వీళ్ల ఇంటి కోడలు కాబోతోంది. గతంలో పలుమార్లు వీళ్లు హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ కలిపి ఉన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ, రష్మిక జోడీ.. ఏజ్ గ్యాప్ ఎంతంటే?)They imagined the perfect daughter-in-law… Rashmika is their dream come true ❤️#VijayDeverakonda #RashmikaMandanna #Virosh pic.twitter.com/eq3a1NwyTd— Lilly ✨ (@therwdygirl) February 21, 2026 -
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. పెళ్లిపై స్పందించిన విజయ్, రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి విషయమై స్పందించారు. అభిమానులు వీరిని ఎంతో ఇష్టంగా “విరోష్” అని పిలుస్తున్నారు. అదే పేరును తమ వివాహ వేడుకకు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. “మేం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నా, ముందే అభిమానులు ఆ పనులు చేసి పెడుతున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలోనూ చాలా ప్రేమతో ఒక పేరు పెట్టారు. అందువల్ల మా వివాహ వేడుకకు ‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ విజయ్, రష్మిక పేర్కొన్నారు. ఈ జంట వివాహ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరగనుందని సమాచారం. ఫిబ్రవరి 26న విజయ్ – రష్మిక మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో రాత్రి 7 గంటలకు గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.వీరిద్ధరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచే ఈ జంటపై రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు పెళ్లి వార్తలతో ఆ రూమర్స్‌కు ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘రణబలి’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. దీనికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కపుల్‌గా పేరుగాంచిన విజయ్, రష్మిక వివాహం కోసం వీరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
-
బ్యాండ్ లేదు.. బరాత్ లేదు..సింపుల్‌గా పెళ్లిచేసుకున్న ఐఏఎస్ జంట
ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఏ రేంజ్లో గ్రాండ్‌గా జరుగుతున్నాయో తెలిసిందే. అందులోనూ అత్యున్నత హోదాలో ఉన్నవాళ్ల పెళ్లిళ్లు కళ్లు చెదిరిపోయే రేంజ్లో వీఐపీలతో అత్యంత కోలహలంగా జరుగుతాయి. అలాంటిది ఈ ఐఏఎస్ దంపతులు ప్రేమకు సరికొత్త అర్థం చెప్పేలా చాలా సింపుల్‌గా పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మధురమైన దాంపత్యానికి ఆడంబరంతో పనిలేదని ఎలుగెత్తి చాటారు. ప్రస్తుతం ఈ దంపతుల పెళ్లి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.ఆ దంపతులే మాధవ్ భరద్వాజ్-అదితి వర్ష్నీలు. ఎలాంటి హంగు ఆర్భాటం జోలికి పోకుండా సింపుల్‌గా రాజస్థాన్ అల్వార్ సచివాలయంలో పెళ్లిచేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నెల (ఫిబ్రవరి) 18న బుధవారం ఆ జంట వివాహం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బంది సైతం ఆ వివాహాన్ని చూసి విస్తుపోయారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తమ వివాహానికి వేదికగా, రాజస్థాన్ జిల్లా కలెక్టర్ అర్పితా శుక్లా సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. దాంతో ఈ జంట వివాహం వార్తల్లో నిలిచింది. బ్యాండ్ లేదు, బరాత్ లేదు, వీఐపీ అతిథులు లేరు. కేవలం తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలో కలెక్టర్ ఛాంబర్లో దండలు మార్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం సచివాలమయే వివాహ వేదికగా మారింది. ఈ ఇద్దరూ కూడా 2023 బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్‌లు. ముస్సోరీకి చెందిన మాధవ్, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన అదితిలిద్దరూ ఐఏఎస్ శిక్షణ సమయంలోనే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వారి మధ్య బంధం కొనసాగుతోంది. అయితే ఇరు కుటుంబాల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా రెండు కుటుంబాలు పెళ్లికి గ్రీన్‌సిగ్నల్స్ ఇచ్చేశాయి. దీంతో ఎగిరి గంతేసిన జంట.. పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా ముగించేశారు. కాగా, మాధవ్ భరద్వాజ్ యూపీఎస్సీ 2022లో లోకోమోటర్ డిజేబిలిటీ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంక్ 536ని కైవసం చేసుకుని ఐఏఎస్ అయ్యారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి MBA పూర్తి చేసిన ఆయన, భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి శారీరక సవాళ్లను అధిగమించారు. మాధవ్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగం నుంచి సివిల్ సర్వీసెస్‌కు మారారు.ఇక అదితి వర్ష్నీ 2022లో యూపీఎస్సీ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 57 ర్యాంక్‌ని సంపాదించి ఐఏఎస్ అయ్యారు. తండ్రి వ్యాపారవేత్త. అయితే మాధవ్ భరద్వాజ్ ప్రస్తుతం రాజస్థాన్ అల్వార్‌లో SDM (సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. భార్య అదితి వర్ష్నీ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో SDM(సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్)గా ఉన్నారు.(చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
ఈ వధువరులది ఎంత గొప్ప మనసు..!
చిన్న చిన్న పనులు కూడా మానవత్వానికి అద్దం పడతాయని చెప్పకనే చెప్పిన ఈ వీడియో నెటిజనుల మనసు దోచుకుంది. ‘వేడుకలలో మనం కూడా ఇలాగే చేయాలి’ అనిపించేలా చేసింది. సాధారణంగా వివాహ వేడుకల్లో ఎవరి బిజీలో వారు ఉంటారు. వేరే వ్యక్తుల గురించి పట్టించుకోరు. ఇక ఈ వివాహం విషయానికి వస్తే....క్యాటరింగ్ స్టాఫ్ పెళ్లికి వచ్చిన వారికి రుచికరమై పదార్థాలు వడ్డించారు. విందు కార్యక్రమం పూర్తయింది.ఈలోపు వధూవరులు...‘క్యాటరింగ్ స్టాఫ్ ఎక్కడా?’ అంటూ వచ్చారు. ‘వడ్డించడంలో ఏదైనా పొరపాటు దొర్లిందా?’ అని వారు భయపడ్డారు. ‘సర్, ఎనీ ΄ప్రాలాబమ్?’ అని వినయంగా అడిగారు. ‘ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇంతకీ మీరు భోజనం చేశారా?’ అని అడిగారు.‘లేదు’ అని చెప్పడంతో వధూవరులు వారికి ఆప్యాయంగా ఆహారపదార్థాలు వడ్డించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. వధూవరులకు పాన్ఇండియా నుంచి ప్రశంసలు వచ్చాయి. View this post on Instagram A post shared by @Cinematographer🎬 (@aarush7069)


