అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది! | Conjoined Twin Carmen Andrade Gets Married Reveals About Wedding | Sakshi
Sakshi News home page

అవిభక్త కవలలు : అవును ఆమె ప్రియుడ్ని పెళ్లాడింది!

Jul 15 2025 3:22 PM | Updated on Jul 15 2025 4:40 PM

Conjoined Twin Carmen Andrade Gets Married Reveals About Wedding

25 ఏళ్ల అవిభక్త కవలల్లో ఒకరైన  కార్మెన్‌  ఆండ్రేడ్‌ (Carmen Andrade )న చిరకాల ‍ప్రియుడు డేనియల్‌ (Daniel McCormack, 28)ని వివాహ మాడింది.  గత  ఏడాది అక్టోబర్‌లో తామిద్దరం వివాహ బంధంలోకి అడుగుపెట్టామని వెల్లడించిఅభిమానులను ఆశ్చర్చపరిచారు. తన ప్రియుడు డేనియల్ మెక్‌కార్మాక్‌ను అక్టోబర్ 2024లో వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారాకార్మెన్ వెల్లడించింది.  ఇరు కుటుంబాల సమక్షంలోవివాహం చేసుకున్నారు.

డైలీ మెయిల్ ప్రకారం, డేటింగ్ యాప్ హింజ్‌లో కలుసుకున్న  ఈ జంట నాలుగేళ్లపాటు డేటింగ్‌ చేశారు. తరువాత కనెక్టికట్‌లో న్యూ మిల్‌ఫోర్డ్‌లోని లవర్స్ లీప్ బ్రిడ్జ్‌లో ఉంగరాలు మార్చుకున్నారు. ‘ఓవర్‌డ్యూ అప్‌డేట్' అంటూ తమ పెళ్లి కబురును అందించింది కార్మెన్‌. 

పెళ్లి దుస్తుల్లో ఒక వీడియోను షేర్‌ చేసింది కార్మెన్‌ కొత్త వధువు  తన షేర్‌ వీడియోలో వెడ్డింగ్‌ రింగ్‌ను  చూపించింది, అలాగే ఇపుడు నేను భర్తని అంటూ  వరుడు-డేనియల్‌ కూడా  ఈ వీడియోలో జతయ్యాడు.  నల్లటి టక్సేడో ధరించిన డేనియల్‌తో పోజులివ్వగా వధువు కార్మెన్ సాంప్రదాయ తెల్లటి వివాహ దుస్తులకు బదులుగా  గ్రీన్‌ గౌను ధరించింది.   తనకు తెల్లని దుస్తులు నచ్చవని తెలిపింది.  

నాకు పెళ్లికాలేదు
అయితే మరో కవల లుపిటా తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. “ఎందుకంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,” అని ఆమె ప్రకటించింది. మరోవైపు ‘అమెరికాకు ఇష్టమైన జంట’  పోటీలో ఈ జంట కూడా ముందు వరుసలో ఉన్నారని, ప్రస్తుతం వారు 9వ స్థానంలో ఉన్నారని డైలీ మెయిల్ తెలిపింది. 

చదవండి: సింపుల్‌ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్‌ టాప్‌లు

కాగా  కార్మెన్ ఆండ్రేడ్, లుపిటా సోదరీమణులు సోషల్ మీడియాలో చాలా పాపులర్‌. ఇద్దరికీ వారి యూట్యూబ్ , టిక్‌టాక్ హ్యాండిల్స్‌లో మంచా ఫాలోయింగ్ ఉంది.  ఈ కవలలు మెక్సికోలో జన్మించారు. ఎవరి గుండెవారిదే, ఊపిరితిత్తులు ఇద్దరికీ వేర్వేరుగా ఉన్నాయి. వారి అవయవాలు ఛాతీ నుండి కటి వరకు కలిసి ఉంటాయి. భావోద్వేగాల పరంగా ఇద్దరు భిన్నంగా ఉంటారు. ఇద్దరు సోదరీమణులకు ఎండోమెట్రియోసిస్ ఉంది, కానీ హార్మోన్ బ్లాకర్లు తీసుకుంటారట, ఫలితంగా, గర్భం దాల్చడం అసంభవమని కార్మెన్ గతంలో  వెల్లడించింది. 

ఇదీ చదవండి: Tipeshwar అటు పులి, ఇటు చిరుత...చూడాలంటే అదృష్టం ఉండాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement