ఏడేళ్ల డ్యాన్స్‌ లిటిల్‌ స్టార్‌..! ఏకంగా మూడు మిలయన్ల మంది.. | Barkat Arora Shes a Viral Dance Star With 3.3M Insta Fans | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల డ్యాన్స్‌ లిటిల్‌ స్టార్‌..! ఏకంగా మూడు మిలయన్ల మంది..

Mar 4 2026 12:20 PM | Updated on Mar 6 2026 11:00 AM

Barkat Arora Shes a Viral Dance Star With 3.3M Insta Fans

ఈ చిన్నారి వీడియో సోషల్‌ మీడియాని ఏ విధంగా షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నగా రెండు నిమిషాల నిడివి వీడియో అయినా కళ్లు తిప్పకోనివ్వనంత ఆకర్షణీయంగా నృత్యం చేస్తుంది. ఇంత చిన్న వయసులో అంత టాలెంట్‌ ఎలా వచ్చింది ఆమెకు అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆమె డ్యాన్స్‌.  ఈసారి ఏం డ్యాన్స్‌ వీడియో అప్‌లోడ్‌ చేస్తుంది అని ఆత్రంగా అభిమానులు నిరీక్షించేలా ఆదరాభిమానాలు, గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నారి. ఏడేళ్ల వయస్సుకి సోషల్‌ మీడియా డ్యాన్స్‌ స్టార్‌గా సెన్సేషన్‌ క్రీయేట్‌ చేసింది. ఎవరా క్యూట్‌ గర్ల్‌ అంటే..

ఆ చిన్నారే బర్కత్‌ అరోరా. అందరు ఆమెను ‘మినీ మాధురి’ అని పిలుచుకుంటారు. ఆమె డ్యాన్స్‌ని మాధురి దీక్షిత్‌ చేసినట్లు అద్భుతంగా ఉంది అని కొనియాడుతుంటారు అభిమానులు. ఇంతలా ప్రాణంపెట్టి నృత్యం చేస్తోంది, ఆమెలోని అపారమైన నృత్య ప్రతిభకు ఎవర్వైనా ఫిదా అయిపోవాల్సిందే కాదనడం లేదు గానీ మరి చదువు సంగతేంటని పలువురు విమర్శలు గుప్పిస్తుంటారు ఈ చిన్నారిపై. 

అయితే ఆమె డ్యాన్స్‌ ఎంత బాగా చేసి గుర్తింపు తెచ్చుకుంటుందో అలానే చదువుని కూడా నిర్లక్ష్యం చేయలేదు. అందులో కూడా సూపర్‌ టాలెంటెడ్‌ ఈ చిన్నారి. అంతేకాదండోయ్‌ బర్కత్‌ తాను సైంటిస్టు అవ్వాలని కోరుకుంటుందట. తన చదువుని డ్యాన్స్‌ని సమానంగా బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగాలన్నదే ఆమె ధ్యేయమట. పైగా ఆ రెండు తన రెండు కళ్లలాంటివని, దేన్ని నిర్లక్ష్యం చేయనని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది బర్కత్‌. 

పైగా బర్కత్‌కి ఇన్‌స్టాలో ఏకగా 3.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలా స్టేజ్‌పై ధైర్యంగా నాట్య ప్రదర్శన చేయడం వల్ల కాన్ఫిడెన్స్‌ బ్యాలెన్సింగ్‌పై పట్టు వస్తాయట, అవి ఎడ్యుకేషన్‌ కెరీర్‌కి ఎంతో హెల్ప్‌ అవుతాయని అంటోంది బర్కత్‌. అందుకే ఈ రెండిటిని వదలనని..అవి తన లైఫ్‌లో భాగమని చెప్పేస్తోంది ఈ లిటిల్‌ స్టార్‌.

 

(చదవండి: ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చ..! స్కిన్‌ క్రీములతో జర భద్రం..)

 

Advertisement
 
Advertisement
Advertisement