మన నిద్రలో వచ్చే కలలు కేవలం పిచ్చి ఊహలు కావు, అవి మన Subconscious Mind మనతో మాట్లాడుతున్న భాష. సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని Wish Fulfillment అని పిలిస్తే, కార్ల్ యుంగ్ Messages from the Psyche అని చెప్పారు.
మనం మేల్కొని ఉన్నప్పుడు సమాజం కోసం ఒక ముసుగు (Mask) వేసుకుంటాం. కానీ నిద్రపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయి మన అసలైన భయాలు, కోరికలు, మరియు పరిష్కారం కాని సమస్యలు బయటకు వస్తాయి. మీ కలలు మీ పర్సనాలిటీకి ఒక 'రిఫ్లెక్షన్' లాంటివి. మీరు పదే పదే ఒకే రకమైన కలలు కంటున్నారంటే, మీ మనసు ఏదో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
1. ఫ్రాయిడ్ vs యుంగ్: కలల వెనుక ఉన్న సైకాలజీ
Sigmund Freud ప్రకారం, మన కలలో వచ్చే ప్రతిదీ మన లోపల అణిచిపెట్టబడిన కోరికల ప్రతిరూపం. మనం పగలు బయటపెట్టలేని కోపాలు, ఆశలు అన్నీ కలల రూపంలో బయటపడతాయి.
Carl Jung దీనిని ఇంకా లోతుగా చూశారు. కలలు మనలోని లోపాలను, మనం మర్చిపోయిన మన 'Shadow Self' (చీకటి కోణం) ను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాయి. ఒక వ్యక్తికి పదే పదే ఎత్తు నుండి పడిపోతున్నట్లు కల వస్తుందంటే, అది అతను తన జీవితంలో నియంత్రణ (Control) కోల్పోతున్నాడని అర్థం.
2. కలల్లో కనిపించే సింబల్స్
మీరు కలలను విశ్లేషించడం ద్వారా మీ పర్సనాలిటీలో ఉన్న బలాలు, బలహీనతలను తెలుసుకోవచ్చు.
పారిపోవడం: ఇది మీ జీవితంలోని సమస్యల నుండి లేదా ఒక బాధ్యత నుండి మీరు పారిపోవాలని చూస్తున్నారని అర్థం. ఇది మీ 'Avoidant Personality' కి సంకేతం.
పరీక్షలో ఫెయిల్ అవ్వడం: మీ పర్సనాలిటీలో మీకు 'పర్ఫెక్షనిస్ట్' భయం ఎక్కువగా ఉందని, ఎక్కడ తప్పు చేస్తానో అన్న ఆందోళన ఉందని అర్థం.
నీటిలో మునిగిపోవడం: మీ ఎమోషన్స్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారని అర్థం. మీ Emotional Intelligence తక్కువగా ఉందని ఇది సూచిస్తుంది.
3. "కలలు కనండి.. విజయం మీదే"
మోటివేషనల్ స్పీకర్లు 'కలలు' అంటే కేవలం 'గోల్స్' అని చెప్తారు. కానీ సైకాలజీలో కలలు అంటే 'సెల్ఫ్-రిఫ్లెక్షన్'. కలలను కేవలం విజయం కోసం మెట్లుగా కాకుండా, మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దే 'గైడ్' లా చూడండి.
4. కలలను మీ పర్సనాలిటీకి అద్దంగా మార్చుకోండి
Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కలల నుండి మీరు నేర్చుకోవాల్సింది ఇదే.
Step 1: కలల డైరీ రాయండి
ప్రతిరోజూ ఉదయం లేవగానే మీరు కన్న కలలను ఒక డైరీలో రాయండి. అది ఎంత పిచ్చిగా ఉన్నా సరే. ఆ కలలో మీకు కలిగిన 'ఎమోషన్' (భయమా? ఆనందమా? కోపమా?) ఏంటో గుర్తించండి. కలలోని సంఘటనల కంటే ఆ 'ఎమోషన్' చాలా ముఖ్యం. ఇది మీ పాత ప్రోగ్రామింగ్‌ను 'Break' చేసి, నిజమైన మీరు ఎవరో చూపిస్తుంది.
Step 2: కలల వెనుక ఉన్న మూలాన్ని వెతకండి
ఆ కల మీ పగటిపూట జీవితానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో విశ్లేషించండి. మీరు పగలు దేని గురించి భయపడుతున్నారో, అదే కలగా వస్తుంది. అక్కడ మీరు ఎక్కడ తగ్గుతున్నారో, దాన్ని మీ పర్సనాలిటీలో 'Build' చేయండి.
Step 3: మాస్టరీ
ఒక్కసారి మీ కలల భాష (Dream Language) మీకు అర్థమైతే, మీరు మీ సబ్-కాన్షియస్ మైండ్‌ను కూడా కంట్రోల్ చేయగలరు. అదే Lucid Dreaming కి పునాది. మీరు మీ అంతరాత్మతో నేరుగా సంభాషిస్తున్నప్పుడు, మీ వ్యక్తిత్వం ఒక 'హైయర్ లెవెల్' కి చేరుకుంటుంది.
5. కలల విశ్లేషణ
ఈ రోజు ఒక చిన్న పని చేయండి:
* ఈ వారం మీకు వచ్చిన అతి ముఖ్యమైన కలని రాసుకోండి.
* ఆ కలలో మీరు ఏ పాత్ర పోషించారు? (బాధపడేవారా? పోరాడేవారా? పారిపోయేవారా?)
* మీ నిజ జీవితంలో మీరు కూడా ఆ పాత్రనే పోషిస్తున్నారా?
కలలు మీ అంతరాత్మ ప్రతిబింబాలు!
బ్రో, కలలు మనకు భవిష్యత్తును చెప్పవు, కానీ అవి మన వర్తమానాన్ని, మన అస్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేయకండి. మీరు ఎవరో తెలుసుకోవాలంటే, మీరు నిద్రపోయినప్పుడు మీ మనసు ఏం చెప్తుందో వినండి.
"The dream is the small hidden door in the deepest and most intimate sanctum of the soul."
-Carl Jung
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com
(చదవండి: The Biology of Behavior: మీ హార్మోన్లు మీ వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తున్నాయి?)


