breaking news
Srikakulam
-
పాత్రునివలస దుర్గమ్మ ఆలయంలో చోరీ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస గ్రామంలో గల దుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు మేరకు.. గ్రామస్తులు నిత్యం కొలిచే అమ్మవారి ఆలయంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి తులం బంగారంతో పాటు రెండున్నర కిలోల వెండిని తస్కరించారు. గురువారం ఉదయం గ్రామంలో గల అర్చకుడు తలుపులు తెరిచిచూడగా ప్రధాన ఆలయం ముఖద్వారం వద్ద తాళాలు పగలకొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ సీఐ పైడపునాయుడు ఆదేశాల మేరకు క్లూస్‌టీంతో పాటు వారు డాగ్ స్క్వాడ్‌ను తీసుకొని వచ్చి తనిఖీలు చేపట్టారు. స్థానికంగా గల నూతిలో సీసీ కెమెరాలు బద్దలుకొట్టి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏలూరు డిపో మేనేజర్‌నంటూ హల్చల్
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గురువారం హల్చల్ చేశా డు. తాను ఏలూరు డిపో మేనేజర్‌నని, కొత్తూరు వెళ్లేందుకు సీటు ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బందికి హుకుం జారీ చేశాడు. ఉన్నది కాసేపైనా అక్కడి సిబ్బందిని ఓ అధికారి మాదిరిగానే హడలెత్తించాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కాంప్లెక్స్‌లోకి ఓ యువకుడు సూటూ బూటా వేసుకుని వచ్చాడు. కొత్తూరుకు వెళ్లడానికి సీటు కావాలని నానా హంగామా చేశాడు. అతడి హడావుడి చూసి అనుమా నం వచ్చిన వెంటనే స్టేషన్ మాస్టర్ ప్రసాదరావు, డిపో మేనేజర్ పినకాన సంతోష్‌లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చీ రావడంతోనే యువకుడిని ఏ బ్యాచ్‌కు చెందినవాడివని ప్రశ్నించగా.. 2019 బ్యాచ్‌లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యానని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది. అసలు 2019లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగలేదని, బ్యాచే లేదని గ్రహించి యువకుడిని ఐడీ కార్డు చూపించమన్నారు. తనతో తెచ్చుకున్న సూట్‌కేస్ కాసేపు తెరుస్తున్నట్లు నటిస్తూనే అధికారుల ప్రశ్నల వర్షాని కి తడబడిపోయాడు. దీంతో చేసేదేమీ లేక ‘సార్ తప్పయిపోయింది.. నాపేరు వారాడ సుధీర్, విశా ఖ చిన్నవాల్టేరులో నివాసముంటున్నాను, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్నాను. బస్‌లు ఇరు కుగా ఉండటంతో ఇలా చేశాను..’ అంటూనే సూట్‌కేసు పట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి ఉడాయించేశాడు. దీంతో డిపోమేనేజర్ సంతోష్, స్టేషన్ మాస్టర్ ప్రసాదరావులు రెండో పట్టణ పీఎస్‌ను ఆశ్రయించారు. స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదే శ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుని గా వీవీ రాజును నియ మించినట్లుగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం.దాసు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దయ్యే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని, సెప్టెంబర్ 1 చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని రాజు కోరారు. -
శ్రీకాకుళం
● విద్యార్థుల విన్యాసం శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి కృషి చేయాలని పర్యావరణ సంఘ నాయకులు పేర్కొన్నారు. పల్లిగొల్లగండి గ్రామంలో పర్యావరణ ప్రేమికులు రాఖీపౌర్ణమి విశిష్టత తెలియజేస్తూ, మహిళలకు చెట్లపై అవగాహన కల్పించి, పెద్ద వృక్షాలకు రాఖీలు కట్టించారు. చెట్ల మనుగడతోనే మానవజాతికి మేలు జరుగుతుందని తెలిపారు. – సోంపేటపలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలో గురువారం ముందస్తుగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ ఆకృతిలో ఏర్పడి విద్యార్థులు విన్యాసం చేశారు. – వజ్రపుకొత్తూరు రూరల్ రాఖీ పండగ సందర్భంగా మార్కెట్లలో రాఖీలకు గిరాకీ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో ప్రత్యేక స్టాళ్లు వెలిశాయి. వినూత్నమైన రాఖీలను అందుబాటులో ఉంచాయి. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం మార్కెట్లో రాఖీ కొనుగోలు చేశారు. –పాతపట్నం -
‘కాన రాని దూరంలో’ పాట విడుదల
శ్రీకాకుళం అర్బన్: ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు’ పేరు తో నిర్మించిన సిక్కోలు చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర యూనిట్ బృందం కోరింది. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్ వద్ద ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు‘ చిత్ర బృందం వారి మొదట పాటను లిరికల్ రూపంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం మాట్లాడుతూ కొన్ని పేజీ ల జ్ఞాపకాలు చిత్రాన్ని, పెద్ద సినిమాలకు దీటుగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ చానెల్లో పూర్తి పాటను అందించామన్నారు. ‘కాన రాని దూరంలో’ అనే ఈ పాటలో సాహిత్యం, సంగీతం శ్రోతల్ని అలరిస్తోంద ని తెలిపారు. చిరంజీవి మజ్జి రాసిన పాటను ప్రము ఖ సంగీత గురువు వరద దుర్గరాజు మాస్టారు, హీరో మిధున్, తల్లిదండ్రులు సంయుక్తంగా లాంచ్ చేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పాటకు రచన చిరంజీవి మజ్జి, సంగీతం నిజానీ అంజన్, వయోలి న్ హేమంత్ కశ్యప్, గానం హితేష్ సాయి, దర్శకు లు ప్రేమ్ సుప్రీం అని తెలిపారు. అనంతరం నటు లు బాబూరావు, రమేశ్ నారాయణ్, సాయి సుధాక ర్, తదితరులు చిత్ర విశేషాలను, కాన రాని దూరంలో పాట ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసారు. -
హత్య కేసు నిందితులకు రిమాండ్
నరసన్నపేట: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు హత్య కేసు నిందితులను జిల్లా జైలుకు తరలించారు. వృద్ధురాలి హత్య కేసులో కింతలి ధనలక్ష్మితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి న విషయం విదితమే. గురువారం ఉదయం నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. సివిల్ జడ్జి ఎస్.వాణి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జిల్లా జైలుకు తరలించినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ‘మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి’ శ్రీకాకుళం: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా పరిధిలోని సముద్రతీర మత్స్యకారులు తీవ్ర అప్రమత్తతతో ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకు లు టి.సుమలత తెలిపారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందు న వేటకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ మత్స్యకారుల రక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన సూచనలు చేశారు. జిల్లా పరిధిలో ట్రాన్స్పండర్లు అమర్చిన అన్ని మోటరైజ్డ్ బోట్ల యజమానులు వేటకు వెళ్లే సమయంలో ట్రాన్స్పండర్ను తప్పనిసరిగా ఆన్‌లోనే ఉంచాలని తెలిపారు. లైఫ్ జాకెట్లు విధిగా తీసుకెళ్లాలని సూచించారు. మేళ తాళాల మధ్య గ్రామదేవత తరలింపు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన మూలపేట గ్రామస్తులు సంప్రదాయాల ప్రకారం డప్పులు, వాయిద్వాలు, నృత్యాలు, మేళతాళాల నడుమ గ్రామ దేవత పెద్దమ్మ తల్లితో పాటు పలు దేవతామూర్తులను, రథాన్ని కొత్తగా నిర్మాణం అవుతున్న నౌపడ పునరావాస కాలనీకి ఊరేగింపుగా గు రువారం తరలించారు. గ్రామంలో ఉన్న మహిళలు ముర్రాటలతో పాటు పెద్దలు, యువకులు, చిన్నారులు అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు నడిచి విగ్రహాలను పునరావాస కాలనీలో కేటాయించిన స్థలంలో ప్రతిష్టించారు. కొత్త ఆలయాలు నిర్మాణం అయ్యేంతవరకు పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ‘నల్సా శిక్ష–2026’తో పేద పిల్లలకు సమగ్ర విద్య శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాజంలోని నిరుపే ద, బలహీన వర్గాల చిన్నారులు ఆర్థిక, సామాజిక కారణాలతో విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష–2026’ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో గురువారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నల్సా రూపొందించిన ‘స్కీమ్ ఫర్ హోలిస్టిక్ ఇంక్లూషన్, నాలెడ్జ్ అండ్ స్కూలింగ్ త్రూ హెల్ప్ అండ్ యాక్సెస్’ (శిక్ష) ద్వారా విద్యార్థులకు సమగ్ర విద్యా సహకారాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు. ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చంద్రబాబు డ్రామా’ నరసన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీఓ నంబర్ 176 ను వ్యతిరేకించి కో ర్టుల ద్వారా వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పట్లో బీసీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని నమ్మబలుకుతూ జీఓ ఎంఎస్ నంబర్ 105 జారీ చేసి పాలాభిషేకం చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బీసీల ఆత్మ గౌరవం గురించి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారానికి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజ్యాధికారం వచ్చిందని గుర్తు చేశారు. -
‘ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి’
వజ్రపుకొత్తూరు రూరల్: విద్యాశాఖ నిర్వహిస్తున్న స్పెషల్ టెట్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్ కోరారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో గురువారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ జాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయు లు టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతుంటే ప్రభుత్వం కోర్టు తీర్పుల పేరుతో సాకులు చెబుతోందని అన్నారు. ఒక వైపు విద్యార్థులు పాఠాలను బోధించాలని, మరో వైపు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావడంతో పాటు ఇతర బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నార ని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల కు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని లేనిపక్షంలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, చలో విజ యవాడ కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎల్.బాబురావు,గుంటు కోదండరావు, బల్ల చిట్టిబాబు, ఎల్వీ చలం, టి.జయరాం, కంచరాన జయరాం తదితరులు ఉన్నారు. -
యంత్రం.. కుతంత్రం
నరసన్నపేట: ఎరువు కావాలంటే లైనులో నిలబడమంటున్నారు. విత్తనం ఆశిస్తే నిరీక్షించాలని ఆదేశిస్తున్నా రు. సాగునీరు రాలేదంటే.. ఎల్‌నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆఖరకు యంత్రాలకు దరఖాస్తు చేసినా ఇవ్వలేకపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. రైతులను ఏ కోశానా ఆదుకోని చంద్రబాబు సర్కారు ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, ఎరువులు, విత్తనాలు పంపిణీ, పంటలకు మద్దతు ధర వంటి అన్ని అంశాల్లోనూ తీవ్ర అన్యాయం చేసింది. తాజాగా సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద సబ్సిడీతో కూడిన వ్యవసాయ యంత్రీకరణ పథకానికి అనుగుణంగా పరికరాలు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించి ఇప్పటికీ పరికరాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 7200 దరఖాస్తులు.. జిల్లాలో రూ.4.84 కోట్ల రాయితీతో 1376 యూని ట్లు మంజూరు చేశారు. మే నెల 5 నుంచి 29 వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల రైతుల నుంచి 7200 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ పద్ధతిపై లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, జూన్ నెలాఖరుకల్లా పరికరాలు రైతులకు ఖరీఫ్ పనులుకు వీలుగా అందిస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు. అలాగే రాయితీపై స్ప్రేయర్లు, నూ ర్పిడి, పంటకోత యంత్రాలు, పవర్ టిల్లర్, రోటావేటర్లు, 40 హెచ్‌పీ లోపు ఉండే ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఇస్తామని ప్రకటించారు. రైతులు ఎంతో ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ పరికరాలు మంజూరు చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇస్తారా.. ఎగ్గొడతారా..? కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సబ్సిడీ పై రుణాలు ఇస్తామని పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నారు. వందల మంది ఆశగా సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకూ రుణాలు ఊసేలేదు. ఈ పద్ధతిలోనే వ్యవసాయ పరికరాల పంపిణీకి కూడా ఎగ్గొడతారా అనే అనుమానం రైతుల్లో వ్యక్తం అవుతోంది. దరఖాస్తులు స్వీకరించి మూడు నెలలు అవుతోంది. ఖరీఫ్‌లో ఉబాలు, కలుపు నియంత్రణ, ఎరువుల యాజమాన్యం వంటి పనులు దాదాపుగా అయిపోయే కాలం వస్తోంది. కనీసం కోతల సమయానికైనా పరికరాలు అందిస్తారా.. లేదా రబీ వరకూ వేచి ఉండమంటారా అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అసలు పరికరాల మంజూరుకు ఇంత జాప్యం ఎందుకు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు కాకుండా తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు కాలయాపన చేస్తున్నారా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తామన్నా.. లోపల ఏదో జరుగుతోందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే వ్యవసాయ పరికరాలు పంపిణీ ఇంత జాప్యమా రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్‌లో.. జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన పూర్తి చేసి జిల్లా ఇన్చార్జి మంత్రి లాగిన్‌లో వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు ఉంచారు. ఆయన అనుమ తి ఇచ్చిన తర్వాత జేసీ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వీలున్నంత తొందరగా పరికరాలు అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. అయితే కాలయాపన జరుగుతుండటంతో రైతుల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాయితీ యంత్రాల కోసం దరఖాస్తుదారుల నిరీక్షణ ఖరీఫ్ ప్రారంభానికే ఇస్తామన్నా ఇవ్వని వైనం జిల్లాలో 1328 యూనిట్లకు 7200 దరఖాస్తులు -
అప్పుల బాధతో హోటల్ నిర్వాహకుడు ఆత్మహత్య
పాతపట్నం: పాతపట్నంలో చంటి బిర్యానీ హొటల్ నడుపుతున్న కొల్లి చిన్నారా వు అలియాస్ చంటి (38) గురువారం ఉదయం హొటల్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. పాతపట్నం మేజర్ పంచాయతీ రాళ్ల క్వారీలో కొల్లి చిన్నారావు అలియాస్ చంటి నివసిస్తున్నాడు. పాతపట్నం యూనియన్ బ్యాంకు పక్కన చంటి బిర్యానీ హోటల్‌ను నెల రోజుల కిందట ప్రా రంభించాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి హోటల్‌కు చేరుకుని, హోటల్ షట్టర్ తీసుకుని, లోపలకి వెళ్లి షట్టర్‌ను మూసివేసి, హోటల్ లోపల గదిలోకి వెళ్లి ఫ్యాన్ హుక్కు ఉరివేసుకున్నాడు. రోజూ లాగానే హోటల్‌కు తల్లి కొల్లి వెంకటలక్ష్మి, భార్య రాణిలు చేరుకుని, షట్టర్ తీసి చూడగా ఫ్యాన్ హుక్కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు 104కు ఫోన్ చేసి పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు. అప్పటికే చిన్నారావు మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్ఐ కె.మధుసూదనరావు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారావు ఒడిశాకు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆమె వద్ద కొంత బంగారం తాకట్టు పెట్టి నగదును, బయట కూడా అప్పులు తెచ్చి, హోటల్‌కు పెట్టుబడి పెట్టాడని మృతుడి భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. నీలిమకు తన భర్త చిన్నారావు ఇటీవల మనస్ఫర్థలు వచ్చాయని, నీలిమ తన దగ్గర తీసుకున్న పద్దు పెట్టిన నగదు ఇమ్మని తన భర్తను అడిగిందని, అప్పుల బాధతో తన భర్త మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారా వు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జిల్లా బార్ అసోసియేషన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు రోజులు విధుల బహిష్కరణలో భాగంగా గురువారం విధు లు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. -
బ్యాంకు సిబ్బంది నిరసన
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉమెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశా రు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఆఫీసర్ సంఘ నాయకులు కె.తేజేశ్వరరావు మాట్లాడుతూ 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్‌కు ఐబీఏ అంగీకరించింది. దానికి బదులుగా రోజువారీ పని గంటలను 40 నిమిషాలు పెంచడానికి యూనియన్లు కూడా అంగీకరించాయన్నారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం రాలేదని, దీనివల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
● ప్రారంభించారు.. వదిలేశారు
అత్యంత వెనుకబడిన గిరిజన తెగల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో భాగంగా వసతిగృహాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి హిరమండలం మండలానికి ఒక వసతిగృహాన్ని ఎంపిక చేసింది. రూ.2.75 కోట్లు మంజూరు చేసింది. వసతిగృహ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా జరిగింది. కానీ ఇంతవరకూ అందులో విద్యార్థులకు విద్యాబోధన లేదు, వసతి లేదు. దీంతో ఈ భవనం నిరుపయోగంగా వెక్కిరిస్తోంది. వెనుకబడిన ప్రాంతాల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించడం, నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో జన్మన్ వసతి గృహాలను ఏర్పాటుచేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గిరిజన సంక్షేమ శాఖ వెనుకబడి ఉంది. బాలబాలికలకు వేర్వేరుగా ఉండే ఈ వసతిగృహాల్లో ఈ లెర్నింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఈ వసతి గృహంలో విద్యాబోధన లేదు. నిర్వహణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – హిరమండలం -
‘నీరివ్వండి మహాప్రభో’
నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్ తోట భార్గవ్, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్, సనపల రమేష్, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఈ–ఎస్‌ఆర్‌తోనే సరి.. పని ఎలా మరి?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసుకోవాలని ఆదేశా లు జారీ చేయడం వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రోజుకో కొత్త పని అప్పజెబుతుండ డంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని, యాప్‌లతోనే సమయం సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ–ఎస్ఆర్ ప్రక్రియలో తొలుత నిధి లాగిన్‌లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ ద్వారా నిర్ధారించుకుంటేనే మిగిలిన వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. డీడీఓకు ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీక రించాలి. డీడీఓ కన్ఫర్మేషన్ పూర్తి చేస్తేనే కుటుంబ సభ్యుల వివరాలు వ్యక్తిగత సర్వీసు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగు లు అంటున్నారు. ఇది కొంత మంది ఉద్యోగ ఉపా ధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశమని చెబుతు న్నారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకు న్నా, మరే కారణాలతో అయినా దూరంగా ఉన్నా ఈ వివరాలు నమోదు చేయడం కష్టతరం. అలాగే జీవిత భాగస్వామి మృతి చెందితే కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగితోపాటు డీడీఓ కూడా పని భారం అనే చెప్పాలి. వివాహ వివరాలు నమోదు చేయడం కష్టమే ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు తన వివాహానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేయడం కష్టం కాకపోయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫోటోలు, మరికొన్ని ఆధారాలను పొందుపరచాల ని ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయా వర్గాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చాలామంది 30, 40 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లి ఫొటోలు ఏ విధంగా తీసుకురాగలుగుతారని ఉద్యోగ ఉపాధ్యాయు లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారని కొందరు చెబుతుండగా, గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ను ఏ ఒక్కరూ చేయించుకునేవారు కాదు. ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ పై పలువురు శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో వివాహమైన వారిని ఇలాంటి ఆధారాలను పొందుపర్చాలని కోరడాన్ని తప్పుపడుతున్నారు. ఇందులో కూడా విడాకులు తీసుకున్న వారు వితంతువులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాక మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎస్ ఆర్ విధానాన్ని తీసుకువచ్చారని అప్పట్లోనే తామంతా ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కొత్త కొత్త నిబంధనలను తెచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
వంశధార భూములు కబ్జా
నరసన్నపేట: స్థానిక వంశధార డివిజన్ పరిధిలోని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కిళ్లాం చానెల్‌కు ఆనుకొని నరసన్నపేట ఇందిరానగ ర్ ప్రాంతంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భవనా లు నిర్మించారు. ఇప్పుడు తాజాగా నరసన్నపేట బ్రాంచి కెనాల్‌కు ఆనుకొని జమ్ము కూడలి వద్ద ఉన్న విలువపైన భూమి కబ్జాకు స్థానికులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఈ స్థలం కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ అసోసియేషన్ పేరున ఈ స్థలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారు. గురువారం ఈ స్థలంలో జేసీబీతో మట్టి నెరిపారు. ఇలా వదిలేస్తే ఈ స్థలం ఆక్రమణ అవుతుందని స్థానికులు అంటున్నారు. వంశధార అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విలువైన ఈ స్థలం ఆక్రమణలు కాకుండా చూడాలన్నారు. దీనిపై వంశధార ఈఈ మురళీ మోహనరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌కు లెటర్ రాస్తామని తెలిపారు. -
యాదాద్రిలో జింకిభద్ర యువకుడు మృతి
సోంపేట: మండలంలోని జింకిభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జింకిబద్ర గ్రామానికి చెందిన అంబటి విశ్వనాథం, అప్పలనరసమ్మ తృతీయ పుత్రుడు జానకిరావు. మూడేళ్ల కిందటే వివాహమైంది. సంతానం లేదు. గత ఎనిమిదేళ్లుగా యాదాద్రిలో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలం పనులు లేక పోవడంతో, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. యాదాద్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జానకిరావు మృతితో జింకిభద్ర గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. జానకిరావు అన్నయ్య సోమేశ్వరరావు సుమారు 15 ఏళ్ల కిందట సోంపేట–జింకిభద్ర రహదారిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు. -
సారా విక్రయదారుకు ఏడాది జైలు శిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూదికొండకు చెందిన ముద్దాయి దూలి రాజేశ్వరికి సారా విక్రయించిన కేసులో ఏడాది కాలం జైలు శిక్షతో పా టు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ గురువా రం పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి యు.మాధురి తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు మేరకు.. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 2021 మార్చి 4న ముద్దాయి దూలి రాజేశ్వరి సారా విక్రయి స్తూ పట్టుబడటంతో అప్పట్లో విధుల్లో ఉన్న ఎకై ్సజ్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు లో ముద్దాయి రాజేశ్వరిని ఈ ఏడాది మార్చి 23న కోర్టులో హాజరుపర్చాల్చి ఉండగా ముద్దా యి అందుబాటులో లేకపోవడంతో తీర్పు రిజ ర్వ్ చేశారు. అయితే ముద్దాయి రాజేశ్వరిని గురువారం పలాస జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచామని అన్నారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రణస్థలం: కోష్ట జాతీయ రహదారిలోని పై వంతెనపై ఈ నెల 22న ముందు వెళ్తున్న లారీని ఢీకొని గాయపడిన డ్రైవర్ పొట్నూరు ఎర్రిబా బు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన ఎర్రిబాబు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేటు సమీపంలోని కాశీబుగ్గ పాత జాతీయ రోడ్డులో గరుడఖండి దగ్గర గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అరుదైన నక్క మృతి చెందింది. ప్రధానంగా ఈ నక్కలు కొండ ప్రాంత పరిసర తోటలో సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో ఆహారం కోసం బెండి కొండ నుంచి వస్తూ ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు తెలిపారు. రణస్థలం: లావేరు మండలంలోని లావేటిపా లెం గ్రామానికి చెందిన ఓయిబోయిన గంగు లు, అప్పలసూరిలకు చెందిన సుమారు 20 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. బుధవా రం అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఈ దారుణానికి ఒడికట్టాయి. ఇంతలా నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవా లని వేడుకుంటున్నారు. లావేరు పశువైద్యులు గాయిత్రిదేవి, వీఆర్ఓలు వేణుగోపాల్ పరిశీలించి శవపంచనామా చేశారు. లావేరు వైఎస్సార్సీపీ గ్రామనాయకులు లంకలపల్లి మహే ష్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
సెల్యూట్
డైనా సేవలకు డైనాకు నివాళులు అర్పిస్తున్న పోలీసు సిబ్బందిఎచ్చెర్ల: శ్రీకాకుళం పోలీసు శాఖలో గత ఎనిమిదేళ్లుగా విశిష్ట సేవలందించిన పోలీసు జాగిలం డైనా గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసు క్వార్టర్స్ ఆవరణలోని శ్మశానవాటికలో పోలీసు అధికార లాంఛనాలతో డైనా అంత్యక్రియలు నిర్వహించారు. డైనా సేవలివే.. ● ఈ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందినది. ● డైనా 2017 సంవత్సరంలో జన్మించి 2018 సంవత్సరంలో మంగళగిరిలో డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఎక్స్‌ప్లోసివ్ డిటెక్షన్ స్నిఫర్ డాగ్‌గా ప్రత్యేక శిక్షణ పొందింది. ● 2018 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని విధు లు నిర్వహించి వాసన ఆధారంగా పేలుడు పదార్థాలు, కీలక ఆధారాలను గుర్తించడంలో అసాధారణ ప్రతిభను కనబరిచింది. ● వీఐపీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చెక్‌పోస్టు తనిఖీలు భారీ బందోబస్తు విధుల్లో కీలక పాత్ర పోషించింది. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు సందర్భంగా నిర్వహించే పోలీసు పరేడ్లలో పాల్గొని విన్యాసాలతో అలరించేది. సేవలు చిరస్మరణీయం అదనపు ఎస్పీ ఎల్.శేషాద్రి మాట్లాడుతూ పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, పోలీసు విధుల్లో అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పోలీసు శాఖకు డైనా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్‌ప్రసాద్, అర్ఎస్ఐలు, పోలీసు డాగ్ హ్యాండ్లర్ మాధవరావు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నోటరీ కోసం వెళితే.. చంపేసి బంగారం దోపిడీ
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికెట్ నోటరీ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఈనెల 17న జరిగిన ఈ దురాగతానికి సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వెల్లడించారు. ఆ వివరాలు.. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు (74) ఒంటినిండా బంగారం ధరించి ఈనెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్లింది. ఆమె నుంచి బంగారం దోచుకోవాలనే అత్యా శతో ధనలక్ష్మి తన సోదరుడు బెండి అచ్యుతరావు (స్టాంపు వెండర్), పెద్ద కుమారుడు గణేష్ (న్యాయవాది)తో కలిసి హత్యకు పథకరచన చేసింది. వృద్ధురాలిని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేసిన అనం తరం మరో ఇద్దరి సాయంతో శవాన్ని గోనె సంచిలో పెట్టి అద్దె కారులో హిర మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి తంపర కాలువలో పడేశారు. ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), అచ్యుతరావు కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఘాతుకం బయటపడిందిలాహతురాలు చిన్నమ్మడు కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఈనెల 11న స్వగ్రామైన అల్లాడపేటకు వచ్చిన ఆమె 17న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామంలో బంధువుల ఇంట్లో పెళ్లి రాటవేసే కార్యక్రమం ఉండటంతో నగలు ధరించి వెళ్లిందని, ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫి కెట్ నిమిత్తం నోటరీ చేసేందుకు ఈ ఏడాది మేలో పరిచయమైన న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్తానని కుటుంబీకులకు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దిశగా జలుమూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఈ నెల 17న ఉదయం 11.30 గంటలకు నరసన్నపేట పోలీస్‌స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. ఆ ఫుటేజీలో వృద్ధురాలు తిరిగి రావడం కనిపించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఓ కారు వచ్చింది. సీడీఆర్ విశ్లేషణతో పాటు డాగ్‌స్కా్వడ్ బృందంతో తనిఖీలు చేయగా న్యాయవాది ఇంటి పరిసరాల్లోనే తిరగడాన్ని పోలీసులు గుర్తించారు. కారు ట్రాకింగ్ హిస్టరీ బట్టి పోలీసులు నిందితులను విచారించగా హత్యోదంతం బయటపడింది. న్యాయవాదులు కావడంతో చేసిన నేరాలనుంచి ఎలా తప్పించుకోవాలో ప్రణాళిక రచించి కారును కెమికల్ లిక్విడ్‌తో శుభ్రపరిచారు. రక్తపు ఆధారాలు, ఇతర కీలకమైనవి చెరిపేశారు. ఆ న్యాయవాది జంట హత్యల కేసులో నిందితురాలునిందితుల్లో ఒకరైన ధనలక్ష్మి 2008లో జరిగిన జంట హత్యల కేసులో నిందితురాలని, అప్పుడు కూడా బంగారం కోసం హత్య చేశారని ఎస్పీ చెప్పారు. నిందితుల నుంచి రూ.38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలి
● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు టెక్కలి: యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధనం, సౌర విద్యుత్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం వలన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అభిప్రాయపడ్డారు. అలాగే ఉద్యోగ సాధనతో పాటు స్వయం ఉపాధి, వ్యాపార ఆలోచనలతో సరికొత్త చరిత్ర సృష్టించవచ్చునని తెలిపారు. దేశ ప్రగతికి ఉపయోగపడే విధంగా సరికొత్త ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుమారు 300 మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టాలను అందజేశారు. అలాగే ఉత్తమ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పైలాన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ వి.వి.సుబ్బారావు, కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, కె.మధుకుమార్, కె.రవికుమార్, టి.నాగశేషు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఎస్టేట్ మేనేజర్ పి.రమేష్ పాల్గొన్నారు. -
● భానుడి భగభగ..!
ఎండ ప్రభావంతో చెట్టుకింద ఆటలాడుకుంటున్న చిన్నారులుఎండకు చెట్లు కింద సేదతీరుతున్న మూగజీవాలు వర్షాకాలం కొనసాగుతున్నా భానుడి భగభగలు తగ్గడం లేదు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ఎండ తీవ్రతకు మనుషులు, మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో చిన్నారులు, మూగజీవాలు చెట్టుకింద సేదతీరిన దృశ్యాలు జి.సిగడాం మండలంలోని నాగువలస నుంచి పొగిరి వెళ్లే ప్రధాన రహదారిలో కనిపించాయి. – జి.సిగడాం -
ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శితో వీసీ భేటీ
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేఆర్ రజనీ బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావును అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. సెప్టెంబర్‌లో వర్సిటీలో నిర్వహించతలపెట్టిన మూడో స్నాతకోత్సవం గురించి ఆయనతో చర్చించారు. అభివృద్ధికి ప్రభుత్వపరంగా సహకారం అందజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు రణస్థలం: మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య, మరో వ్యక్తి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఇరువురికీ తీవ్ర గాయాలైనట్లు జేఆర్‌పురం పోలీసులు తెలిపారు. స్థానికులు, జేఆర్‌పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన గుడివాడ అప్పలనర్సయ్య తన ఇంటికి అవసరమైన ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై రణస్థలం వెళ్లి తిరిగి వస్తుండగా కృష్ణాపురం, గుమ్మడాం గ్రామాల జంక్షన్ వద్ద ఒక ట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న అప్పలనర్సయ్య, వెనుక కూర్చొని ఉన్న ఎలక్ట్రీషియన్ లంక ప్రభాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంపై ఒకరిని శ్రీకాకుళం రిమ్స్‌కు, మరొకరిని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. కారు బోల్తా రణస్థలం: మండలంలోని పైడిపేట జాతీయ రహదారిపై బుధవారం ఉదయం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న కొత్త కారు అదుపుతప్పి డివైడర్ ఢీకొని బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న నలుగురు చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. హైవే పెట్రోల్ పోలీసులు వచ్చి సపర్యలు చేసి అక్కడ నుంచి పంపివేశారు. దీనిపై ఎటువంటి పిర్యాదు అందలేదని జేఆర్‌పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. రెండు చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్ పెందుర్తి : సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వివరాలు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్‌రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. – గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్‌కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్‌సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
వెలుగు పంచుదాం..!
కనులు మూసినా..● నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగు ● సెప్టెంబర్ 8 వరకు నేత్రదాన పక్షోత్సవాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు అవగాహన తప్పనిసరి ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, ఎప్పటికప్పుడు నేత్ర వైద్య నిపుణులతో కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా చూపును సంరక్షించుకోవచ్చు. ప్రస్తుతం చిన్నారులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించడం వల్ల చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి. – ఎంఆర్కే దాస్, ఆప్తాల్మిక్ అధికారి, నేత్రదాన మోటివేటర్ ప్రోత్సహించాలి జిల్లావ్యాప్తంగా నేత్రదాన ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. నేత్రదానం మరింత విస్తృతంగా జరగాలంటే కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు సమీపంలోని నేత్రనిధి కేంద్రాన్ని సంప్రదించి, నేత్రదానానికి అనుమతి ఇచ్చి ఇతరులను కూడా ప్రోత్సహించాలి. – డా.ఎస్.పుష్పలత, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాకుళం అర్బన్: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనిషి శరీరంలో అన్ని అవయవాలు కంటే కంటికి ఉన్న ప్రత్యేకత వేరు. ప్రపంచాన్ని చూడాలంటే కళ్లతోనే సాధ్యమవుతుంది. కంటిచూపు ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. అందువలన కంటి చూపు కోల్పోయిన వారికి వెలుగును ప్రసాదించేందుకు నేత్రదానం ఎంతో కీలకమని జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించేందుకు 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కార్నియా అంధత్వం కార్నియా సంబంధిత అంధత్వం కారణంగా ఎంతోమంది దృష్టిని కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. కార్నియా అంధత్వాన్ని నివారించడంలో నేత్రదానం ద్వారా సేకరించే ఆరోగ్యకరమైన కార్నియాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల మరణానంతరం నేత్రదానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అధికారులు సూచిస్తున్నారు. కార్నియా అంధత్వానికి కారణాలు కంటికి గాయాలు కావడం, రసాయనాలు లేదా దుమ్ము, ధూళి పడడం, వరి రేకు, చెరుకు రేకు వంటివి కంటికి తగిలినప్పుడు సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతో కార్నియా దెబ్బతిని శాశ్వత అంధత్వం ఏర్పడే అవకాశం ఉంది. కంటికి ఏదైనా గాయం అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. ఎవరు నేత్రదానం చేయవచ్చు నేత్రదానానికి వయసు, కులం, మతం, లింగం వంటి భేదాలు లేవు. సాధారణంగా చాలా మంది వ్యక్తులు నేత్రదానం చేయవచ్చు. రక్తపోటు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు, గతంలో కంటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు, కళ్లద్దాలు ఉపయోగించే వారు కూడా నేత్రదానం చేయడానికి అర్హులై ఉండవచ్చు. తుది నిర్ణయం నేత్రబ్యాంకు వైద్య నిపుణులదే. అయితే కొన్ని తీవ్రమైన అంటువ్యాధులు, రక్త సంబంధిత వ్యాధులు, ఇతర నిర్దిష్ట పరిస్థితుల్లో మరణించిన వారి నుంచి నేత్రాలను సేకరించడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మరణం సంభవించిన వెంటనే సంబంధిత నేత్ర బ్యాంకు లేదా వైద్య సిబ్బందిని సంప్రదించి వారి సూచనలు పాటించాలి. నేత్రదానం ఎప్పుడు చేయాలి ఒక వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా.. సాధారణంగా 6 నుంచి 8 గంటల్లోపు నేత్రదాన ప్రక్రియను పూర్తి చేయాలి. ముందుగా నేత్రదాన ప్రతిజ్ఞ చేయవచ్చు. ప్రతిజ్ఞ చేయకపోయినా మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించవచ్చు. మరణం సంభవించిన వెంటనే దాత తలను కొద్దిగా ఎత్తి ఉంచాలి. రెండు కళ్లను మూసి, శుభ్రమైన చల్లటి తడి వస్త్రం లేదా తడి దూదిని కళ్లపై ఉంచాలి. వీలైనంత త్వరగా సమీపంలోని నేత్రబ్యాంకు, కంటి ఆస్పత్రి, రెడ్‌క్రాస్ నేత్రనిధి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆస్పత్రిని సంప్రదించాలి. నేత్రదానం ఎందుకు అవసరం దేశంలో ప్రతీ సంవత్సరం అనేక మంది వివిధ కారణాలతో మరణిస్తున్నప్పటికీ, మరణానంతరం నేత్రదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరోవైపు ప్రతి సంవత్సరం కొత్తగా కార్నియా అంధత్వ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల్లో నేత్రదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు మరణానంతరం తమ కళ్లను బూడిదపాలు కాకుండా, మట్టిపాలు కాకుండా, మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపేలా నేత్రదానం చేయాలని అధికారులు పిలుపునిస్తున్నారు. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం ఒక సామాజిక బాధ్యతగా, కుటుంబ సంప్రదాయంగా స్వీకరించాలని కోరుతున్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేత్రదాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్స తర్వాత నల్లగుడ్డు అంధత్వం శస్త్ర చికిత్సకు ముందు అపోహలు తొలగించాలి నేత్రదానంపై ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయి. నేత్రదానంపై మరింతగా అవగాహన కల్పించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దేశంలో కార్నియా సమస్య వలన చూపు కోల్పోయినవారు 12 లక్షల మంది ఉన్నట్లు సర్వే చెబుతోంది. నేత్రదానం ద్వారా ఇటువంటి వారికి చూపు తిరిగి పొందే అవకాశం ఉంది. ఏడాదికి సుమారు 1.5 లక్షలు నుంచి 2 లక్షల కార్నియాలు అవసరం కాగా.. కేవలం 30 వేల కార్నియాలు మాత్రమే సేకరించడం అవుతోంది. – డా.పి.శ్రీకాంతి, కార్నియా ప్రత్యేక నేత్ర వైద్య నిపుణురాలు -
ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడిలోకి...
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా జారిపడి వ్యక్తి దుర్మరణం చెందాడు. కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన తోట వెంకటరావు(47) అనే వ్యక్తి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లేందుకు బుధవారం బయల్దేరాడు. టికెట్ తీసి ఒకటో నంబర్ ప్లాట్ ఫాం మీద ఆగిన రైలును ఎక్కి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇతని కాలి మీద నుంచి ట్రైన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తోట వెంకటరావు భీమవరంలోని ఒక హోటల్లో వంట మనిషిగా 26 ఏళ్లు నుంచి పని చేస్తున్నాడు. మధ్యలో కొన్నాళ్లు స్వగ్రామంలో చిన్న జనరల్ స్టోర్ కూడా నడిపాడు. వ్యాపారం లేకపోవడంతో మళ్లీ వంట పనిచేయడానికి భీమవరం వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇతనికి భార్య సుజాత, కుమారుడు మణికంఠ, కుమార్తె మనీష ఉన్నారు. కుమారుడు మణికంఠ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ కాఫీ హౌస్‌లో పనిచేస్తుండగా, కుమార్తె మనీష సోంపేటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటి యజమాని అకస్మాత్తుగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మృతుని స్వగ్రామం బల్లిపుట్టుగలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై పలాస జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 40 నిమిషాలు నిలిచిపోయిన ట్రైన్ విశాఖ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రయాణికుడు జారిపడి మృతి చెందడంతో ట్రైన్‌ను సోంపేట స్టేషన్లో 40 నిమిషాలు పాటు నిలిపివేశారు. ప్రమాదం జరిగిందని తెలిసి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు స్థానిక స్టేషన్ మేనేజ్మెంట్ సమాచారం ఇవ్వడం, అక్కడి నుంచి మళ్లీ ఆదేశాలు అందిన తర్వాత ట్రైన్‌ను పంపేందుకు సిగ్నల్ ఇచ్చారు. -
నరకానికి నకలు..!
వజ్రపుకొత్తూరు రూరల్: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పూడిగల్లి వద్ద ఆర్అండ్బీ డబుల్ రోడ్డు పరిస్థితి నరకానికి నకలుగా మారింది. బెండి నుంచి నువ్వలరేవు వరకు ఈ డబుల్ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డుపైన తేలిన రాళ్లతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. అలాగే ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ధూళి ఎగిరి ఇళ్లలోకి చేరుతుండడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని రోడ్డు పక్కన నివాసముంటున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.23 కోట్లు వ్యయంతో రేగిలిపాడు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు వరకు డబుల్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అదే ప్రభుత్వ హయాంలో దాదాపుగా 60 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం బెండి నుంచి నువ్వలరేవు వరకు మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతవరకు పనులు హడావుడిగా చేసి అర్ధాంతరంగా వదిలివేయడంతో వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. -
బేస్‌బాల్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం
● బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత ● జిల్లా బేస్‌బాల్ జట్ల ఎంపికలకు పోటెత్తిన క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లాలో సంఘ ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో బేస్‌బాల్ క్రీడను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తామని జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు తమ్మినేని సుజాత పేర్కొన్నారు. జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం శ్రీకాకుళం నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగాయి. ఈ సెలక్షన్ ట్రయల్స్‌కు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు పోటెత్తారు. సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా బేస్‌బాల్ ప్రాబబుల్స్ జట్లకు ఎంపిక చేసినట్టు జిల్లా బేస్‌బాల్ సంఘ ప్రతినిధులు వెల్లడించారు. జిల్లా ప్రాబబుల్స్ జట్లకు సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు గ్రామంలో నిర్వహించనున్న శిక్షణా శిబిరాల అనంతరం, జిల్లా తుది జట్లను ప్రకటిస్తామని కార్యనిర్వహణ కార్యదర్శి కొండపల్లి రవికుమార్ చెప్పారు. పుట్టపర్తిలో రాష్ట్రస్థాయి పోటీలు జిల్లా జట్లను శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్(మెన్, ఉమెన్) బేస్‌బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు పంపించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ సంఘ ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి పతకం సాధించడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, కొండపల్లి కిరణ్‌కుమార్, హెచ్ఎం యాళ్ల పోలినాయుడు, సీనియర్ పీడీలు చల్లా జగదీశ్, సాధు శ్రీనివాసరావు, లకిలీ రాంబాబు, సింహాద్రినాయుడు, రామాంజనేయులు, రవిబాబు, సంఘ సభ్యులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ జంక్షన్ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమ్మరిగుంట పంచాయతీ సింగంవలస గ్రామానికి చెందిన కుంచి సుబ్బారావు (36) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుంచి సుబ్బారావు, అతని బావమరిది పోతల నాగరాజు ద్విచక్ర వాహనంపై పాతపట్నం మండలం తెంబూరు నుంచి పెద్దలంబ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో పెద్దగుజ్జువాడ నుంచి తెంబూరు వైపు వెళ్తున్న ఒక కారు ఢీకొనడంతో సుబ్బారావు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజుకు తీవ్రగాయాలవ్వడంతో 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులిచ్చిన సమాచారం మేరకు ఏఎస్ఐ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ప్రస్తుతం పెద్దలంబలో ఉంటూ వ్యవసాయం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, కుమార్తె డిల్లేశ్వరి, కుమారుడు ప్రభాస్ ఉన్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రైతు మృతదేహం లభ్యం ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య పొలం పనుల్లో భాగంగా మంగళవారం బాహుదానది దాటుతూ నది ఉద్ధృతకు గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. అయితే బుధవారం ఉదయం బాహుదా నది ఒడ్డుకు మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించి, శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గోనెలవారి వీధిలో నివసిస్తున్న తోలేటి మహేష్ (50) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ బుధవారం వెల్లడించారు. మహేష్ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్య రాజేశ్వరితో కలిసి గోనెలవారి వీధిలో నివసిస్తున్నాడు. భార్య రాజేశ్వరి రైతుబజారు సమీపంలోని ఒక టైలర్ షాపులో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలుండగా.. ఒకరికి వివాహమై తన భర్తతో కలసి హరిపురంలో నివసిస్తోంది. రెండో కుమార్తె సౌమ్య రిమ్స్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రెండు సంవత్సరాలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్న మహేష్, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంగళవారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఎదురింటివారు వచ్చి చనిపోయాడని నిర్ధారించారని, ఈ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని భార్య రాజేశ్వరి తెలపడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. -
టీడీపీలో స్థానిక గుబులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘సర్వేలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల మీడియాలు వ్యతిరేక కథనాలు రాయకతప్పడం లేదు. ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కగలమా..?’ ఇప్పుడిదే టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. ఆ నాయకుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగంతో ఏకపక్షంగా స్థానిక సంస్థలను కొట్టేద్దామన్న కలలు సాకారమయ్యేలా లేవు. ప్రతీ గ్రామంలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం పరువు కాపాడుకోగలమా అని టీడీపీ నాయకులు అంతర్మథనంలో పడ్డారు. మోసం.. దగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. అభివృద్ధి, సంక్షేమం ఊసేలేదు. కొత్తవి పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు సైతం పూర్తి చేసే పరిస్థితి లేదు. గతంలో అమలైన సంక్షేమ పథకాలు ఎత్తివేశారు. ఇస్తున్న వాటిలో కోత పెట్టారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా ఇవ్వలేదు. రాయితీలు, ఇన్‌ఫుట్ సబ్సిడీలు అందడం లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో పొలాలు ఎండిపోతున్నాయి. చంద్రబాబు వస్తే ప్రకృతి విపత్తు తప్పదనే పరిస్థితులను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటికే కాదు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. ప్రజల ముంగిటకు వైద్య సేవలు అందడం లేదు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు. సరైన బ్యాగులు కూడా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల ఊసే లేదు. ఉద్యోగ వర్గాల పరిస్థితి మరీ దారుణం. పాలకులు ప్రభుత్వ ఉద్యోగులను పురుగుల్లా చూస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు మద్యం ఏరులై పారుతోంది. ఇంటింటికీ తాగునీటిని అందించలేకపోయినా వీధికొక బెల్ట్‌షాపు పెట్టి విచ్చలవిడిగా మందు అందుబాటులో ఉంచారు. ఫలితంగా ఎక్కడికక్కడ గొడవలు చోటు చేసుకున్నాయి. గంజాయికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. పేకాట, ఇతరత్ర జూదం ఎక్కువైపోయింది. ఏ ఒక్క నిరుపేద, మధ్యతరగతి కుటుంబంలో ప్రశాంతత లేదు. వీటికి తోడు అధికార పార్టీ నాయకుల దాడులు, గొడవలు, విధ్వంసకర ఘటనలతో ప్రజల్లో భయాందోళన ఏర్పడింది. ఇక, తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వేధిస్తున్న ఘటనలైతే చెప్పనక్కర్లేదు. సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. పలాస, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, శ్రీకాకుళంలో లెక్కకు మించి బాధితులు ఉన్నారు. అక్రమాలు, ఆక్రమణలు ఎంఆర్పీకి మించి విక్రయాలతో మద్యం దోపిడీ సాగిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో టీడీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. నదులతో పాటు రోడ్లను కూడా ఛిద్రం చేస్తున్నారు. ఎక్కడ కొండలు కన్పిస్తే అక్కడ తవ్వేస్తున్నారు. కంకర, గ్రావెల్ దోచేస్తున్నారు. విలువైన గ్రానైట్ తవ్వకాలు జరిపి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులు తవ్వి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములే కాదు ప్రైవేటు వ్యక్తుల జిరాయితీ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నాసిరకం రోడ్లు వేసి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేశారు. ప్రజలకు ఉపాధి లేకపోయినా అధికార పార్టీ నాయకులకు మాత్రం దండిగా సొమ్ములు వస్తున్నాయి. ఎక్కడా చూసినా అవినీతి, అక్రమాలు, ఆక్రమణలే. ఇచ్ఛాపురం నుంచి ఎచ్చెర్ల వరకు ఇదే పరిస్థితి. దోపిడీ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి కూటమి పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ఎక్కడా చూసినా ప్రజల్లో వ్యతిరేకతే కనిపిస్తోంది. అభివృద్ధి పబ్లిసిటీ, రీల్స్‌లో తప్ప క్షేత్రస్థాయిలో లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఏమైనా ఉందా? ఇప్పుడదే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంటోంది. సర్వేలన్నీ అదే చెబుతున్నాయి. వైఎస్సార్సీపీని ఆపలేరని, ఇప్పు డు ఎన్నికలొస్తే ఆ పార్టీయే విజయం సాధిస్తుందని సర్వే యాజమాన్యాలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఐఐటీ నిపుణులు చేసిన సర్వేల్లో కూడా వైఎస్సార్సీపీకే పట్టం కడుతున్నాయి. దీంతో స్థానిక సంస్థలన్నీ తమ ఖాతాలో వేద్దామనుకున్న కూటమి పార్టీల కలలు కల్లలవుతున్నాయి. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలపడుతోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ దక్కించుకుంటోంది. పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించినా జనాదరణ అంచనాలకు మించి కనిపిస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన జిల్లా పర్యటన జన సునామీలా సాగింది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైతేనే ప్రతిపక్షానికి ఆ స్థాయిలో ప్రజలు పోటెత్తుతారనేది తెలిసిన విషయమే. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా రాజీపడొద్దని, ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఎన్నికల్లో విజయభేరి మోగించి, సత్తా చాటాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నుంచి బయటపడటానికి కూటమి పార్టీలకు పోలీసు యంత్రాంగం, అధికార మంత్రాంగం తప్ప మరో దారి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీకే పట్టం కడుతున్న సర్వేలు ఇటీవల జన సునామీగా సాగిన వైఎస్ జగన్ పర్యటన ప్రజలు విశ్వాసం చూరగొన్న ప్రతిపక్ష పార్టీ వెన్నుపోటు పార్టీకి చుక్కలు తప్పవంటున్న విశ్లేషకులు -
ఉద్యోగులు, పెన్షనర్లపై నిర్లక్ష్యం తగదు...
టెక్కలి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్లపై నిర్లక్ష్య వైఖరి తగదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యద ర్శి దివ్వల పోలయ్య బుధవారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వైపు నిరుద్యో గ సమస్య, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పడుతున్న అవస్థలు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 5 డీఏలు బకాయి పడిందని పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ నియామకం విషయంలో తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే 30 శాతం వరకు ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ మండలానికి సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్తో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని కోరారు. ఆరోగ్య సేవల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి సేవలు అందజేయాలన్నారు. రైళ్ల ప్రయాణంలో ప్రత్యేక రాయితీ కల్పించాలని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి నిరసన
రణస్థలం: లావేరు మండలంలోని అదపాక గ్రామానికి చెందిన ఒక యువతి, అదే గ్రామానికి చెందిన జడ్డు సురేష్ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని అతని ఇంటి ముందు బుధవారం నిరసన తెలిపింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. తాను, సురేష్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది. సురేష్‌కు ఇద్దరు సోదరులు ఉండడంతో వాళ్లకి పెళ్లైన తర్వాత తనను వివాహం చేసుకుంటానని చెప్పి శారీరంగా దగ్గరయ్యాడని పేర్కొంది. అయితే ఇటీవల తప్పించుకొని తిరుగుతుండడంతో ప్రశ్నించడంతో.. రూ.15 లక్షల కట్నం, 10 తులాల బంగారం, సారె, ఒక బండి తీసుకొస్తే పెళ్లికి తమ ఇంట్లో ఒప్పుకుంటారని సురేష్ చెప్పినట్లు ఆమె తెలిపింది. దీనిపై లావేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. లావేరు ఎస్ఐ నిర్లక్ష్యంగా స్పందించి నామమాత్రపు కేసు రాసి ఇచ్చారని పేర్కొన్నారు. తదుపరి జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు సురేష్ కుటుంబ సభ్యులందరూ పారిపోయి.. దొంగతనంగా పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తనకు న్యాయ చేయాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ వి.సందీప్ కుమార్‌ను వివరణ కోరగా లావేరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసిన రోజే కేసు నమోదు చేశామన్నారు. బుధవారం ఘటనపై ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. -
అక్టోబర్‌లో ఉత్తరాంధ్ర సాహిత్య సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో జరగనున్న ఉత్తరాంధ్ర జిల్లాల సాహిత్య సమ్మేళనం విజయవంతం చేయాలని సాహితీవేత్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. కవిత్వం, కథ, పాట ప్రక్రియల్లో జరిగే ఈ సాహిత్య సమ్మేళనంలో ప్రసిద్ధ రచయితలతో యువ రచయితలకు ముఖాముఖి ఉంటుందని కథా రచయిత అట్లాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు తెలిపారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు, విశ్వసాహితీ ఆమదాలవలస ప్రధాన కార్యదర్శి కర్నేన జనార్దనరావు, కథా నిలయం కార్యదర్శి దాసరి రామచంద్రరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ప్రతినిధి ఎం.ప్రభాకర్‌రావు, పి.సుధాకర్‌రావు, నెట్టిమి రమణారావు, పూజారి దివాకర్, ఉదయ్‌కిరణ్, బాడాన శ్యామలరావు, భోగేల ఉమామహేశ్వరరావు, వాసవి పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి శ్రీకాకుళం: ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ, చట్టంలో సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నాయని గుర్తు చేశారు. ఇక్కడి ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌లో 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చింతాడ దిలీప్, జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మామిడి భుజంగరావు, కార్యదర్శి సుమలత, గున్న ప్రసాదరావు, నవీన్, అనంత ఆచార్యులు, వై.వి.రమణ, జితేంద్ర, కిరణ్, బాలాజీ, లక్ష్మణ్, సూర్యనారాయణ, భాస్కరరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు తరహాలో తీర్మానం చేయాలి టెక్కలి: ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్‌కు సంబంధించి తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ తీర్మానం చేయాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెగ్యులర్ టెట్ రాసిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల అర్హత 60 మార్కులుగా నిర్ణయించి ఉత్తీర్ణత ప్రకటించాలని కోరారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి టెక్కలి : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేలా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం టెక్కలిలో ద్విచక్రవాహనాల జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు శాశ్వతంగా టెట్ నుంచి మినహాయించాలన్నారు. కోర్టు తీర్పు ను సాకుగా చూపుతూ ప్రస్తుత ప్రభుత్వం అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై చేస్తున్న పోరాటాలను నీరుగార్చేందుకు టెట్ వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, కె.దాలయ్య, కె.వైకుంఠరావు, గణపతి, జి.నారాయణరావు, డి.లక్ష్మినారాయణ, డి.పాపారావు, జి.మోహన్‌రావు, గణపతి తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యత చూస్తే నవ్విపోతారు
● కుంగిపోతున్న తారురోడ్డు ● కడపలవానిగెడ్డ వద్ద కల్వర్టు పనుల్లో నాణ్యతాలోపం ● మండిపడుతున్న స్థానికులు హిరమండలం : లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మించారు. అనుసంధానంగా 40 మీటర్ల తారురోడ్డు నిర్మించారు. కానీ నిర్మించిన నాలుగు నెలల వ్యవధిలోనే రోడ్డు పూర్తిగా కుంగిపోయింది. ద్విచక్ర వాహనాలు తప్ప నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా మారింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఎల్‌ఎన్‌పేట మండలంలో అలికాం–బత్తిలి ప్రధాన రోడ్డులో తురకపేట, దబ్బపాడు, మిరియాపల్లి ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రహదారిని ఎల్‌ఎన్‌పేటకు కూడా అనుసంధానించారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ రోడ్డులో తురకపేట, దబ్బపాడు మధ్య కడపలవానిగెడ్డ ఉంది. ఇక్కడ వంతెన నిర్మాణంతో పాటు అనుసంధాన రోడ్డు నిర్మాణానికి రూ.67 లక్షలు కేటాయించారు. పనులు పూర్తై ఈ ఏడాది ఏప్రిల్‌లో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో నాలుగు నెలలకే రోడ్డు కుంగిపోయింది. బెర్ములు కిందకు దిగిపోయాయి. కొంచెం బరువుతో వాహనం వస్తే చాలు రోడ్డు ఉబికిపోయి ముందుకు కదలని దుస్థితి. పనుల్లో నాణ్యతకు, నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత ఘోరమా..? రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదు. నాణ్యతకు తిలోదకాలు ఇచ్చా రు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఈ విషయంలో జిల్లా యంత్రాంగం స్పందించాలి. రోడ్డును సరిచేయకపోతే ఉద్యమిస్తాం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం -
బెట్టింగ్ ఆట..చోరీల బాట
● దొంగతనాలకు పాల్పడిన డిగ్రీ విద్యార్థి అరెస్టు ● 16.25 తులాల బంగారం, రూ.39 వేలు నగదు స్వాధీనం ఇచ్ఛాపురం రూరల్: బెట్టింగులకు బానిసైన ఓ డిగ్రీ విద్యార్థి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే బారువ పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ టీ.భవానీ మంగళవారం సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్సై ఆర్.జనార్దనరావుతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ సొమ్ము అమ్మేందుకు సిద్ధమై.. డొంకూరు గ్రామంలో ఇటీవల రూ.24 వేల నగదు, బంగారు కాసు చోరీకి గురైనట్లు బాధితులు ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించగా సోంపేట మండలం ఇసుకలపాలెం గ్రామానికి చెందిన వాసుపల్లి తాతారావు అనే డిగ్రీ విద్యార్థి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో అతనిపై గతంలోనే ఇచ్ఛాపురం రూరల్, కవిటి, బారువ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. దొంగతనం ద్వారా సంపాదించిన సొత్తును ఒడిశాలోని బరంపురంలో విక్రయించేందుకు విద్యార్థి సిద్ధమయ్యాడు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి జంక్షన్ వద్ద బస్సు కోసం వేచి ఊండగా, రూరల్ ఎస్ఐ ఆర్.జనార్థనరావు తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 16 తులాల పావు బంగారం, రూ.39 వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులే కారణం.. బారువలో డిగ్రీ చదువుతున్న తాతారావు బెట్టింగులకు బానిసై డబ్బులు అవసరం కావడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. యువత ఆన్లైన్ బెట్టింగులు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు. -
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం: విద్యాశాఖ నిర్వహించనున్న స్పెషల్ టెట్‌లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఒకే కనీస అర్హత మార్కులు నిర్ణయించాలని, ఏ సబ్జెట్‌కు వారికి ఆ సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ కనీస ప్రయత్నం చేయకపోవడం సరికాదన్నారు. ఓవైపు పాఠ్యాంశాలు బోధిస్తూ, ప్రభుత్వ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు, కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవుతూ, బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సతమతవుతున్నారని, ఈ క్రమంలో టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బుధవారం నుంచి జిల్లాలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ , అప్పటికీ విద్యాశాఖ మంత్రి చర్యలు చేపట్టకపోతే సెప్టెంబర్ 4 నుంచి రాష్ట్రం, కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామూర్తి, కోశాధికారి పి.సూర్యప్రకాష్, సహాధ్యక్షులు వై.ఉమాశంకర్, బి.ధనలక్ష్మి, ఎస్ నారాయణరావు, స్వర్ణకుమారి, శారద, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గుండెకోత
తీర గ్రామాలకు ● వంశధార తీరంలో కోత భయం ● 50 మీటర్ల వరకు గట్టు కోత ● గ్రోయిన్లు నిర్మించాలని వినతి ప్రమాదం అంచున ఉన్నాం నదికి దగ్గరగా రెండు మీటర్లు దూరంలో ఉన్నాం. చిన్నపాటి వరద వస్తే చాలు ఇళ్లలోకి నీరు వచ్చేస్తోంది. ఒకటి రెండు సార్లు మేకలు, పాడి ఆవులు కూడా వరదకు కొట్టుకు పోయిన సందర్బాలు ఉన్నాయి. – రేగాన శ్యామ్ సుందర్, రామకృష్ణాపురం గ్రోయిన్లు కట్టాలి అర్జెంటుగా గ్రోయిన్స్ నిర్మాణాలు చేపట్టాలి. ఇంకా రెండు మూడు వరదలు వస్తే ప్రమాదం తప్పదు. మాకే కాదు నది తీర గ్రామాలు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలి. – అందవరపు రాము, అంధవరం జలుమూరు: వంశధార నదీ తీర గ్రామాలు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. వానాకాలం నాలుగు నెలల పాటు వీరికి ఈ ఆందోళన తప్పడం లేదు. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు వీరిని వరద భయం వెంటాడుతుంది. ప్రధానంగా ఈ గ్రామాలకు ఆనుకొని కరకట్ట నిర్మాణం జరగక పోవడం, ఆపైన నదిలో ఇసుక ఇష్టారాజ్యంగా తవ్వుకుపోవడంతో పాటు ప్రవాహం ఉన్న చోట గ్రోయిన్లు నిర్మించకపోవడంతో ఏటా వరద ముంచెత్తుతోంది. దీంతో ఇళ్ల వరకు కోత జరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. నదితీర గ్రామాలు 30 వంశధార నదీ తీర గ్రామాలు ఇటు నరసన్నపేట, అటు జలుమూరు, పోలాకి మండలాల్లో 30 వరకూ ఉంటాయి. ఇందులో అత్యంత ప్రమాదకరంగా ఉన్నవి గెడ్డవానిపేట, వెంకటాపురం, కొబగాం, అందవరం, ఉప్పరపేట, రామకృష్ణాపురం, పర్లాం, గొల్లపేట, డోలపేట, బుచ్చిపేట, డోల, గోవిందపురం, రేవు అంప్లాం, వనిత మండలం తదితరవి 20 వరకూ ఉంటాయి. నదిలో ప్రవాహం ఎక్కువైతే చాలు గ్రామాల గట్టు కోరుకుపోయి గ్రామంలోకి నీరు చొరబడుతోంది. కరకట్ట కట్టలేదు వరద నివారణతోపాటు పంటపొలాలు రక్షించేందుకు వంశధార నదికి ఆనుకొని ఉన్న గ్రామాల పక్కన కరకట్ట కడుతామన్న ప్రతిపాదనలు ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. 2011లో కరకట్ట నిర్మాణాలకు సుమారు రూ.52 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 15 శాతం నిర్మాణాలు కూడా జరిగాయి. తర్వాత ఆగిపోయాయి. అధికారులు స్పందించి కరకట్ట నిర్మాణంతోపాటు ముంపు వద్ద గ్రోయిన్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. -
ఆయిల్‌పామ్ సాగు లాభదాయకం
కవిటి: ఉద్యాన పంటల్లో రైతులకు అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం ఇచ్చే పంటగా ఆయిలపామ్ నిలుస్తుందని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ రీజనల్ రీసర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి.మాధవిలత అన్నారు. కవిటి మండలంలోని మాణిక్యపురం, రాజపురం గ్రామాల్లో మంగళవారం పర్యటించి రైతులతో మాట్లాడారు. కవిటి మండలం ఆయిల్‌పామ్ సాగుకు అనువైనదా? కాదా అనే అంశాలతో కూడిన వాస్తవ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆయిలపామ్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయిస్తుందన్నారు. తుఫాన్లను సైతం మొక్కలు తట్టుకుంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఉద్యానశాఖాధికారి, సచివాలయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు. కంచిలి: ఉద్యాన పంటల్లో ఆయిల్‌పామ్ పంట సాగుపై ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జలంత్రకోట, కొల్లూరు పంచాయతీల పరిధిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఆయల్‌పామ్ పంటపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ సహాయకులు ఎస్. లింగరాజు, బి.విద్యాసాగర్, పవన్‌కుమార్, రైతులు పాల్గొన్నారు. -
నేడు ‘ఆదిత్య’కు ఒడిశా గవర్నర్
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నిర్వహిస్తున్న 10వ సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారని కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు మొదలవుతాయని పేర్కొన్నారు. గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి కంచిలి: జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త(డీసీఓ) వై.యశోదలక్ష్మి అన్నారు. కంచిలి గురుకులాన్ని మంగళవారం సదర్శించి సమగ్ర తనిఖీ చేపట్టారు. విద్యాప్రమాణాలు, వసతులపై సమీక్ష నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు తగ్గడంపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు తగ్గకుండా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.వెంకటరమణ, గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నేత్రాలపై శ్రద్ధ అవసరం శ్రీకాకుళం అర్బన్: ‘జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికలు) ఆవరణలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ‘కంటి ఆరోగ్యం–నేత్రదానం‘ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం.కృష్ణవేణి మాట్లాడుతూ జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా కంటి ఆరోగ్యం–నేత్రదానం పై అవగాహన కలిగి గ్రామాల్లో ఈ విషయం అవగాహన కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అధికారి ఎంఆర్‌కె దాస్, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్య పద్ధతులో అధిక దిగుబడులు జి.సిగడాం(పొందూరు): రైతులు ఆధునిక పద్దతిలో వ్యవసాయం సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ స్వాతి అన్నారు. మంగళవారం బాణాం రైతుసేవా కేంద్రం ఆధ్వర్యంలో వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ మొక్కజొన్న, వరి పంటలే కాకుండా వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచి రాబడులు వస్తాయన్నారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే పంటలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్సీ ఏవో రేణుకాసాయి, మండల వ్యవసాయాధికారి శ్రీనివాసుబాబు, ఏఈఓ ప్రవీణ్‌కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు. -
మైరెన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తీర ప్రాంత భద్రతకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మైరెన్ పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తీర ప్రాంత భద్రతపై మైరెన్ పోలీస్, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 193 కిలో మీటర్లు తీర ప్రాంతం విస్తరించి ఉందని, ఇందులో 11 మండలాలు, 142 గ్రామాలు ఉన్నట్లు వివరించారు. తీర ప్రాంతంలో 3 మైరెన్ పోలీసు స్టేషన్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 172 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయన్నారు. తీర ప్రాంత పోలీసు స్టేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ కావాలని మైరెన్ పోలీసులు కలెక్టర్‌కు విన్నవించారు. తీర ప్రాంత ప్రజలకు, బీచ్‌లకు వచ్చే పర్యాటకులకు భద్రపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు సుమలత, ఎన్ఐసీ ఉప సంచాలకులు కిరణ్‌కుమార్, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రాము, మైరెన్ డీఎస్పీ, విశాఖపట్నం ఎస్.కిరణ్ కుమార్, బారువ, భావనపాడు, కళింగపట్నం సీఐలు రమేష్, డి.రాము, బి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
32
కిలోలగంజాయి స్వాధీనం వజ్రపుకొత్తూరు రూరల్: పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు 32.590 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తు న్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానీ మంగళవారం మీడి యా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నిందితులు పెయింటింగ్ ప నులు చేసుకుంటూ ఒకరికొకరు పరిచయమయ్యా రు. సూళ్లురుపేట సమీపంలోని తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బాలాజీ అనే వ్యక్తి వద్ద చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి సే వించేవారు. ఒడిశాలో గల పర్లాకిమిడికి వెళ్లి పినో ష్‌కుమార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తే ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తానని చెప్ప డంతో వారు గంజాయి రవాణాకు సిద్ధమయ్యారు. అక్రమంగా 16 ప్యాకెట్లలో 32.590 కిలోల గంజాయి తరలిస్తుండగా కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసులో ఎ–1గా సర్వసన్ ఫళని, ఎ–2గా భూపాలన్, ఎ–3గా మసన్, ఎ–4గా పినోష్కుమార్, ఎ–5గా బాలాజీ నమోదయ్యారు. -
మాజీ మంత్రి సీదిరి అనుచరుడికి రిమాండ్
● అంపోలు సబ్ జైలుకు తరలింపు ● కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత వజ్రపుకొత్తూరు రూరల్: రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగం మేరకు కేసులో ఏ–4గా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రధాన అనుచరుడైన అల్లు వెంకటరమణకు పలాస జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని అంపోలు జైలుకు మంగళవారం పోలీసులు తరలించారు. అల్లు వెంకట రమణను సోమ వారం రాత్రి ఆయన స్వగ్రామమైన లక్ష్మీపురంలో పోలీసులు అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి పోలీసు అదుపులో ఉన్న రమణను మంగళవారం సాయంత్రం పలాస కోర్టులో హాజరుపరిచారు. దీంతో పలాస కోర్టు అల్లు రమణకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అంపోలు సబ్ జైలుకు తరలించారు. అరెస్టుపై ఉద్రిక్తత వెంకటరమణ అరెస్టుపై పలాస–కాశీబుగ్గలో ఉద్రి క్తత చోటు చేసుకుంది. వెంకటరమణను పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు సోమవారం రాత్రి నుంచి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్లోకి మీడియాను, నాయకులను అనుమతించకపోవడంతో స్టేషన్ లోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. మంగళవారం ఉద యం సైతం నాయకులు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటరమణను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో స్టేషన్ వెలుపల నాయకులు రమణ రాక కోసం ఎదురు చూశారు. అప్పటికే మోహ రించిన పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించేయడంతో వారు వెనుదిరిగారు. కూటమి కక్షపూరిత రాజకీయాలపై నాయకులు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రోడ్డు ప్ర మాదాలకు పోలీసులు ఇదే తీరున వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు. -
కొనసాగుతున్న కష్టాలు
ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. కూలీల సమస్యతో రైతు లు వ్యవసాయాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి పనులను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తే రైతు బాగుపడతాడు. – సిర్ల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు హిరమండలం: వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం.. ఏళ్లుగా రైతులను ఊరిస్తున్న కల. కాలం గడుస్తున్నా కల మాత్రం తీరడం లేదు. ఇన్నేళ్లలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు వీబీజీరామ్‌జీగా మారింది. రోజు వారీ కూలి రేటు పెరిగింది. పొలం పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పెట్టుబడి ఇదివరకెన్నడూ లేనంతా పెరిగింది. అయినా సర్కారుకు ఈ అనుసంధానం గుర్తు రావడం లేదు. పెరుగుతున్న మదుపులు వ్యవసాయ రంగంలో మదుపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రైతుల కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. ఏటా ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో వరి పంటలకు రూ.25 వేలు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసినా కూడా పంటచేతికి వచ్చేంత వరకూ నమ్మకం ఉండదని వాపోతున్నారు. దీనికి తోడు కూలీల రేట్లు పెరుగుపోతున్నాయని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. వీబీజీరామ్‌జీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న కూలీల సమస్య ఏటా పెరుగుతున్న పెట్టుబడులు నష్టపోతున్న అన్నదాతలు ఫలించని వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం కల వెంటాడుతున్న కూలీ సమస్య వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసా యాన్ని (వీబీజీరామ్‌జీ)ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – కె.నవీన్, రైతు, తాయమాంబాపురం -
బాహుదా నదిలో రైతు గల్లంతు
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలం సైదాలపుట్టుగలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు బాహుదా నదిని దాటుతుండగా గల్లంతయ్యారు. సైదాలపుట్టుగ గ్రామానికి చెందిన రైతు నారద గంగయ్య (57)కు బాహుదానదికి అవతల శాసనాం గ్రామ పరిధిలో పంట భూమి ఉంది. సోమవారం నదిని దాటి పొలం గట్టు వేసి, దమ్ము పనులు చేశారు. మంగళవారం ఉదయం గంగయ్య భార్య జానకమ్మ తమ పొలంలో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. గంగయ్య ఆమెకు భోజనం తీసుకొని మధ్యాహ్నం బాహుదా నదిని దాటుతుండగా నది ఉద్ధృతికి నీటిలో కొట్టుకుపోయారు. నదిలో స్నానం చేస్తున్న స్థానికులు ఆ ఘటనను గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ ఎం.చిన్నంనాయు డు, రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు సాయంత్రం వరకు నదిలో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. గంగయ్య భార్య జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ జనార్థనరావు తెలిపారు. నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు తెలిపారు. -
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సహకరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నోడల్ సింగిల్ విండో ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని, ఎలాంటి కాషన్ డిపాజిట్లు, రుసుములు వసూలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. గతేడాది మాదిరిగానే జిల్లావ్యాప్తంగా ఉచిత విద్యుత్ సరఫరా అందించాలని, విగ్రహాల ఎత్తు, పర్యావరణ కాలుష్యం పేరిట నిబంధనలతో ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచనలు ఇవ్వాలని విన్నవించారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు ముందస్తుగా రూట్ మ్యాప్ ఆమోదించి భద్రతా ఏర్పాట్లు చేయాలని, నిమజ్జన ప్రాంతాల్లో జేసీబీలు, క్రేన్లు, పరిశుభ్రత సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు ప్రశాంత వాతావరణం నెలకొనేలా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు బుర్రా ఆదినారాయణ శాస్త్రి, ఉపాధ్యక్షుడు శింతు సుధాకర్, ప్రధాన కార్యదర్శి గొడ్డు భాస్కరరావు, కోశాధికారి ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన ఆటో
నరసన్నపేట: జమ్ము కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని విజయనగరం జిల్లా జామి నుంచి పలాస వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రావణ్‌కుమార్, వెంకటరమణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్‌తో పాటు పక్కనే కూర్చున్న వెంకటరమణ ఇరుక్కున్నారు. వారిని బయటకు తీయడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ అతి వేగంగా వాహనం నడుపుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను కాపాడిన స్థానికులు, ఎస్సై -
సీసీ రోడ్డు పనుల అడ్డగింత
● తమకు చెప్పకుండా పనులు చేశారని టీడీపీ నాయకుల దుశ్చర్య ● అధికారుల తీరుపైనా విమర్శల వెల్లువ కవిటి: మండలంలోని కవిటిరాజపురంకొజ్జిరియా( కేఆర్కే) రోడ్డు నుంచి చండీపురానికి వెళ్లే అనుబంధ రోడ్డు నిర్మాణాన్ని రాజపురం పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తమకు చెప్పకుండా పను లు ప్రారంభిస్తున్నారనే కారణంతో ఈ పనులు అడ్డుకోవడం గమనార్హం. వాస్తవానికి ఈ పనులు దాదాపు 8 నెలల కిందటే జెడ్పీ చైర్పర్సన్ పిరి యా విజయ పరిపాలన అనుమతులతో మంజూరయ్యాయి. అప్పట్లో జంగిల్ క్లియరెన్స్ కోసం రాజపురం–1 ఎంపీటీసీ సనపల కృష్ణారావు రూ. 45 వేలు సాయం కూడా చేశారు. కానీ అప్పట్లో తెలుగు తమ్ముళ్లు అధికార దర్పంతో పనులు జరగనీయలేదు. నెలలు గడుస్తున్నా పనులు కాకపోవడంతో దీని వెనుక కారణాలను ఓ సామాజిక కార్యకర్త వెలికి తీశారు. సమాచార హక్కు చట్టం సాయంతో అన్ని వివరాలు రాబట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే ప నులు ప్రారంభించాలని, లేదంటే చర్యలు తప్పవని ఆదేశించారు. దీంతో పనులకు తీర్మానం, వర్క్ ఆర్డర్ ప్రక్రి యలు పూర్తి చేసి మంగళవారం పనులు ప్రారంభించారు. కానీ మళ్లీ టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. తమకు సమాచారం లేకుండా పనులకు కొబ్బరికాయ కొట్టి ఎలా చేస్తారని పనులు ఆపేశారు. దీంతో చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ నిధులను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మంజూరు చేస్తే వాటిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. చేతనైతే అభివృద్ధి చేయాలని ఇలా అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. దీనిపై అధికారులు నోరు మెదపకపోవడంతో కలెక్టర్ ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. -
విద్యుత్ షాక్‌తో వెల్డర్ మృతి
నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద ఓ పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తున్న చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. గతంలో వంశధార పేపరు మిల్లులో పనిచేసిన రామచంద్రరావు ప్రైవేటుగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దశలో మంగళవారం పరిశ్రమలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పందించి నరసన్నపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు రామచంద్రరావు తల్లి మరణించగా తండ్రి అప్పన్న వృద్ధాప్యంలో ఉన్నారు. భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామచంద్రరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం ఆమదాలవలస/బూర్జ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని తులగాపు శ్రీనివాసరావు(43) మృతి చెందినట్లు జి.ఆర్.పి. పోలీసులు తెలిపారు. బూర్జ మండలం లచ్చయ్యపేట కాలనీకి చెందిన శ్రీనివాసరావు భార్య రమ్య, ఇద్దరు పిల్లలు పూజిత, తరుణ్ ఉన్నారు. మద్యానికి బానిసై రెండురోజుక్రితం ఇంటి నుంచి వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ రైలు కింద పడి మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్య సంతబొమ్మాళి: గోవిందపురం గ్రామానికి చెందిన నీలాపు రమ్య(21) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదువుకున్న రమ్య పలుమార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమైంది. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో దిగులు చెందుతూ గడ్డిమందు తాగడంతో రాగోలు జెమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. రమ్య తల్లి మహాలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్సై వై.సింహాచలం మంగళవారం తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
మందస : కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై సువర్ణాపురం పంచాయతీ నాతుపురం బొడ్డులూరుకు చెందిన పుచ్చ మీనాక్షీ(40) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మీనాక్షి, భాస్కరరావులు దంపతులు. ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం మీనాక్షీ భర్తతో మరోసారి గొడవపడింది. దీంతో భాస్కరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మనస్థాపానికి గురైన మీనాక్షి ఇంట్లో తలుపులు వేసి ఊరి వేసుకుంది. ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. -
బంధువుల వివాహానికి వచ్చి విగతజీవిగా..
● జమ్ము కాలువలో విశాల్ మృతదేహం లభ్యం నరసన్నపేట : ఖరగ్‌పూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న మెండ విశాల్‌కుమార్ (30) సారవకోట మండలం కేలవలస కల్యాణ మండపంలో జరిగిన వివాహనికి వచ్చి ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం విశాల్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి సారవకోట మండలం కిన్నెరవాడ సమీపంలోని వంశధార కాలువలోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉదయం నరసన్నపేట మండలం జమ్ము వద్ద వంశధార బ్రాంచి కెనాల్లో విశాల్ మృతదేహం కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, విశాల్‌కుమార్ ఖరగ్‌పూర్ నాలుగేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ బంధువుల అమ్మాయి వివాహానికి వచ్చి ఇలా విగత జీవిగా మారాడు. కుమారుడు అకస్మాత్తుగా మర ణించడంతో తల్లిదండ్రులు ప్రభాకర్, భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సారవకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ షెడ్యూ ల్డ్ కులాల సహకార ఆర్థిక సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులకు వివిధ సాంకేతిక, వృత్తి విద్యా విభాగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) వినాయకం మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ వెహికిల్ మెయింటెనెన్స్, మొబైల్ ఫోన్ రిపేర్, సోలార్ టీవీ ఇన్స్టాలర్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, స్టిచింగ్ ఆపరేటర్, కంప్యూటర్ అసిస్టెంట్, టెలికామ్ కస్టమర్ కేర్, ఫుడ్ – బెవరేజ్, ఇజ్రాయెల్ హోమ్ మేడ్ హెల్పర్ తదితర 14 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు ను బట్టి 8, 9, 10, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, నర్సింగ్ అర్హతలు ఉండి 18–40 ఏళ్లు (హోమ్ మేడ్ హెల్పర్ కోర్సుకు 25–45 ఏళ్లు) ఉన్నవారు అర్హులు. 60 నుంచి 100 రోజుల వ్యవధితో ఉండే ఈ శిక్షణ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన జిల్లాలోని అర్హులైన ఎస్సీ యువతీ యువకులు తమ దరఖాస్తులను ఆగస్టు 31, 2026 లోగా శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ వద్దగల తారకరామ సముదాయ భవనంలో ఉన్న జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంస్థ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 08942–240598 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు చెప్పండి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన మంగళవారం వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో స్వీకరించిన ఫారాల వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బీఎల్ఓ ద్వారా డాక్యుమెంటేషన్ అప్డేషన్ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు వివరించారు. నియోజవర్గాల్లో అప్డేషన్ చేయాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే వారిని సత్వరమే అప్డేషన్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్.శంకరరావు, దామా మన్మధరావు, టీడీపీ నుంచి పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. గొట్టా బ్యారేజీ పరిశీలన హిరమండలం: గొట్టా బ్యారేజీని మంగళవారం జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్ వేణుగోపాల్ ఎస్ఈ రామచంద్ర పరిశీలించా రు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టా బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో చీఫ్ ఇంజినీర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గొట్టా బ్యారేజీ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. గొట్టా బ్యారేజీ పనితీరును.. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం, వాటి దుస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్వహణలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. కాలువలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. అలాగే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బ్యారేజీలో నీటి స్థిరీకరణ జరపాలని సూచించారు. వారి వెంట స్థానిక అధికారులు ఉన్నారు. -
తప్పు చేస్తే చర్యలు తప్పవు: డీఎంహెచ్ఓ
అరసవల్లి: ఎట్టకేలకు జిల్లా వైద్యారోగ్య శాఖా ధికారిగా డాక్టర్ ఈవీ నరేష్కుమార్ సోమ వారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 13న జిల్లాకు డీఎంహెచ్‌ఓగా నియ మిస్తూ ఉత్తర్వులు వచ్చినా.. విశాఖపట్నంలో రిలీవింగ్ సమస్యల కారణంగా సరిగ్గా 40 రోజుల తర్వాత స్థానిక జిల్లాలో డీఎంహెచ్‌ఓగా నరేష్కుమార్ విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా జిల్లాలో వైద్యారోగ్యశాఖకు చెందిన కీలక అధికారులు, వైద్యులు, ఇతర విభాగాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కోవిడ్ సమయంలో తాను ఇక్కడ నోడల్ అధికారిగా పనిచేశానని, సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ వైద్యాధికారిగా విధులు నిర్వర్తించానని అన్నా రు. ఫైళ్లు నడపడంలో జాప్యం జరిగితే ఎలాంటి మొహమాటం లేకుండా చర్యలకు దిగి ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఉపేక్షించబోనని తేల్చి చెప్పారు. పొలం పనికి వెళ్లి కుప్పకూలిన యువకుడు మందస: మండలంలోని జిల్లుండ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రౌతు తిరుపతిరావు(30) సోమవారం ఉదయం పొలంలో గట్లు వేసేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో పొలంలోనే నేలకు ఒరిగిపోయాడు. తోటి రైతులు చూసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి తిరుపతిరావు చనిపోయినట్లు నిర్ధారించారు. తిరుపతిరావు జీవన ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి పని చేసి తన సొంత గ్రామానికి వచ్చి తన సొంత పనులు చేసుకుంటున్నాడు. తిరుపతికి భార్య రాజేశ్వరి, కుమారుడు ఉన్నాడు. కుమారుడు దివ్యాంగుడు. తిరుపతిరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హెచ్ఎంపై ఆరోపణలు.. డీఈఓకు నివేదిక నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని దేశవానిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిపై అదే స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లు చేసిన ఫిర్యాదుపై విచారణ చేసి నివేదికను డీఈఓ రవిబాబుకు పంపించానని డిప్యూటీ డీఈఓ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయానికే డిప్యూటీ డీఈఓ స్కూల్‌కు ఎంఈఓ యు.శాంతారావుతో కలిసి వెళ్లారు. ముందుగా హెచ్ఎంతో మాట్లాడారు. అనంతరం స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులందరితో సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. తరువాత ఫిర్యాదు చేసిన మహిళా టీచర్లతో వేర్వేరుగా మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వారి సెల్ఫోన్లను కూడా పరిశీలించారు. హెచ్ఎం వేధింపుల సెల్ రికార్డును డిప్యూటీ డీఈఓకు ఒక ఉపాధ్యాయుడు అందజేసినట్లు సమాచారం. శ్రీకాకుళం కల్చరల్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 26న శ్రీకాకుళం నగరంలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని నగర ముస్లిం జమాత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్థానిక జామియా మసీదు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు జమాత్ ప్రతినిధులు తెలిపారు. నగరంలోని అన్ని మసీదుల ఇమాములు, అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పట్టణంలోని ముస్లింలందరూ ర్యాలీలో బాధ్యతగా పాల్గొని ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలకు ర్యాలీలో అనుమతి ఉండదని, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
బతుకుల్లో కారు చీకటి
శ్రీకాకుళంగుడ్లు సరఫరాలో నిర్లక్ష్యంప్రభుత్వ బడులకు గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గుడ్డు బదులు వేరే కూర పెడుతున్నారు. –8లోమంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026సారవకోట: మండలంలోని కిన్నెరవాడ గ్రామానికి సమీపంలో సోమవారం వంశధార ఎడమ కాలువలోకి కారు దూసుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు ప్రకారం.. కేళవలసలో ఉన్న కల్యాణ మండపంలో సోమవారం ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపాలపురం గ్రామానికి చెందిన పీస రాము (46), ఖరగ్‌పూర్‌కు చెందిన రాము మేనల్లుడు మెండ విశాల్(30) వచ్చారు. పీస రాము కుమార్తె శృతి పార్వతీపురంలో చదువుతుండడంతో ఆమెను తీసుకురావడానికి గోపాలపు రం గ్రామానికే చెందిన గొటివాడ నాగరాజు కారు లో బయల్దేరారు. కారు కిన్నెరవాడ సమీపంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని అకస్మాత్తుగా వంశధార ఎడమ కాలువలోకి దూసు కుపోయింది. కారు కాలువలోకి వెళ్లిపోవడాన్ని చూసిన అవలింగి గ్రామానికి చెందిన కూర్మాపు వెంకటరమణ వెంటనే స్పందించి కాలువలోకి దూకి అద్దాలు పగుల గొట్టి కారులో ఉన్న డ్రైవర్ గొటివాడ నాగరాజును ప్రాణాలతో కాపాడారు. కారులో ఉన్న మరో ఇద్దరిని కాపాడాలని ప్రయత్నించినా.. కారు నీటిలో మునిగి పోవడంతో వారిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో కిన్నెరవాడ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరి కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ కోటబొమ్మాళి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో కాలువలో మునిగి పోయిన కారును గుర్తించి బయటకు తీశారు. కారులో పీస రాము మృతదేహం మాత్రమే లభ్యం కావడంతో మెండ విశాల్ మృత దేహం గల్లంతైందని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. పెళ్లింట చావు వార్త.. చనిపోయిన పీస రాము భార్య సోదరి కుమార్తెకే వివా హం జరుగుతోంది. ఆ వివాహానికి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తూ రాము చనిపోయారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి కుమార్తెకు మృతి చెందిన పీస రాము చిన్నాన్న కావడం, గల్లంతైన విశాల్ కూడా బంధువే కావడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు. మద్యపానమే కారణమా.. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం సేందించి వాహనాన్ని నడుపుతున్నాడన్న వాదనలూ వినిపించాయి. వంశధార ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు పెళ్లింట విషాదం డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు -
● ఆదిత్యా.. ఇది రూ.62 లక్షల రోడ్డంట..!
ఒకటి కాదు రెండు కాదు రూ.62.50 లక్షలు ఖర్చు పెట్టారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరై అట్టహాసంగా రోడ్డును ప్రారంభించారు. అక్కడకు సరిగ్గా ఐదు నెలలు గడిచి ఆరో నెల వచ్చాక రోడ్డు అసలు రంగు బయటపడింది. ఎక్కడికక్కడ బీటలు వారిపోయి కట్టిన వారి నైపుణ్యాన్ని బట్ట బయలు చేసింది. అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి సమీపంలో ఉన్న రోడ్డు స్థితి ఇది. రథసప్తమి సందర్భంగా కూట మి పెద్దలే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి పనులు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ రోడ్లు ఇలా కనిపిస్తున్నాయి. ఆదిత్యాలయానికి సమీపంలోని ఈ సీసీ రోడ్డు నాణ్యత చూసి స్థానికులు, భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. – అరసవల్లి -
విన్నపాలు వినవలె..!
● అర్జీలు జిల్లాస్థాయి అధికారులు పరిశీలించాలి ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 171 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీలను జిల్లాస్థాయి అధికారులు స్వయంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 171 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు మాత్రమే హాజరవ్వాలని, సెకండ్ లెవెల్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దని తేల్చిచెప్పారు. మొత్తం 171 అర్జీల్లో అత్యధికంగా రెవెన్యూ (సీసీఎల్ఏ) శాఖకు సంబంధించి 88 వినతులు వచ్చాయి. పంచాయతీ రాజ్ శాఖకు 18, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ 9, సెర్ప్ 9, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 9, విద్యుత్ శాఖ 8, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 6, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 4, ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ 3, సమగ్ర శిక్ష 3 చొప్పున అర్జీలు నమోదయ్యాయి. అదేవిధంగా ఏపీ ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, జలవనరులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖలకు చెరో 2 చొప్పున వినతులు వచ్చాయి. గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణాభివృద్ధి, ఏపీఎస్ ఆర్టీసీ, హౌసింగ్ కార్పొరేషన్, పోలీసు, సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ, మహిళా శిశు సంక్షేమం, టిడ్కో, మత్స్య శాఖ, ఆర్థిక శాఖలకు చెరో 1 చొప్పున అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● పోలాకి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య వినతిపత్రం అందజేశారు. ● ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారిందని కాలనీకి చెందిన వానపల్లి లక్ష్మి, మీసాల వనజాక్షి, కె.మాలతి, కృపా, ఎం.కృష్ణవేణి, జె.ధనలక్ష్మి తదితరులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, దీంతో అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ● సారవకోట మండలం పెద్దలంబ గ్రామానికి చెందిన లుకలాపు చిన్నారావు తన ఆస్తిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. గతంలో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని వాపోయారు. ● జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలు, హాస్టళ్లు నిర్వహిస్తున్నప్పటికీ సంబంధిత ఆర్ఐఓ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టళ్లను వెంటనే మూసివేయాలని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కళాశాలలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ● వృద్ధాప్య పింఛన్ పేరుతో సంతకం చేయించుకొని తన ఆస్తిని తన తమ్ముడు పల్లిసారధి గ్రామానికి చెందిన బెలమర మోహనరావు రాయించుకున్నాడని పలాస మండలంలోని కాశీబుగ్గ పోస్టు తాళభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి ధమయంతి ఫిర్యాదు చేశారు. మాయ మాటలు చెప్పి, పింఛను ఇప్పిస్తానని మోసం చేశాడని వాపోయారు. అధికారులు స్పందించి తన భూమి తన పేరిట మార్చాలని కోరింది. -
న్యాయం చేయండి
● నా కుమార్తె చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోండి ● సీజీఎంను కలిసిన గార ఎస్బీఐ ఉద్యోగిని ఉరిటి స్వప్న తల్లి సరళశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పెద్దపాడు మార్గంలో ఉన్న శ్రీకాకుళం రీజనల్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాను చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్ సోమవారం సందర్శించారు. గార ఎస్బీఐ బ్యాంకులో జరిగిన తనఖా బంగారం మా యం కేసుకు ముందే అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్ఎం రాజు, బ్యాంకు ప్రతినిధులు అకౌంటెంట్ అయిన ఉరిటి స్వప్నప్రియపై ఆరోపణలు చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళాదేవి సీజీఎం రాజేష్ కుమార్ పాటిల్‌ను కలసి తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కన్నీటిపర్యంతమై వివరించారు. దానికి స్పందించిన సీజీఎం జరిగిన విషయాలేవీ తనకు తెలియవని, కచ్చితంగా నిజా నిజాలు తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సరళా దేవికి మద్దతుగా బంధువులు అధికంగా రీజనల్ బ్యాంకుకు చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ సీహెచ్ వివేకానంద కేసు దర్యాప్తు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం
● పాఠశాలల్లో నిండుకున్న గుడ్లు ● విద్యార్థులకు వేరేకూర వండిపెట్టిన వైనంనరసన్నపేట: ప్రభుత్వ పాఠశాలలకు గుడ్లు సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో గుడ్లు స్కూల్స్‌కు చేరవేయడంలో గుత్తేదారు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీంతో మండలంలో ఎప్పటికప్పుడు స్కూల్స్‌లో గుడ్లు నిండుకుంటున్నాయి. ఫలితంగా హెచ్ఎంలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల నుంచి అప్పుగా తీసుకొని విద్యార్థులకు ఇస్తున్నారు. అప్పుగా తీసుకురావడానికి వీలులేని చోట్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. సోమవారం నాటికి సత్యవరం, మడపాం పంచాయతీ కొత్తపేట, నరసన్నపేట పంచాయతీలోని వీడీ కాలనీ, గోపాలపెంట స్కూల్స్లోతో పాటు పలు స్కూల్స్‌లో గుడ్లు నిండుకున్నాయి. శనివారం నుంచీ ఈ పరిస్థితి ఉండగా ఉపాధ్యాయులు గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సోమవారం నాటికీ గుడ్లు సరఫరా మెరుగుపడలేదు. దీంతో సత్యవరం స్కూల్ హెచ్ఎం అప్పలనాయుడు పొరుగున ఉన్న అంగన్వాడీ కేంద్రం నుంచి అప్పుగా తీసుకురాగా, మిగిలిన చోట్ల ఆ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు గుడ్లు లేకుండానే ఆహారం వడ్డించారు. వీడీ కాలనీలో గుడ్డు బదులు మరో కూరను వడ్డించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్య బలహీనతలు మెరుగుపరిచేందుకు వారానికి ఐదు రోజులు గుడ్డు ఇస్తున్నారు. దీంట్లో మూడు రోజులు ఉడికించిన గుడ్డు, మరో రెండు రోజులు గుడ్డు కూరను ఇస్తున్నారు. అయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో విద్యార్థులకు గుడ్డు సక్రమంగా అందడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఎంఈవో యు.శాంతారావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వామ్మో.. వయ్యారిభామ
గార: వినాశకరమైన కలుపు మొక్క వయ్యారిభామ అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు భయపడుతున్నారు. రోడ్లు పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క పొలాల్లో పంటను మించి పెరిగిపోతుంది. ఈ కలుపు మొక్క పొలాల్లో త్వరితగతిన వ్యాపిస్తూ పంటల దిగుబడిని తగ్గిస్తుంది. అంతేకాక జంతువులతో పాటు మానవులకు హాని చేస్తుంది. నిలువెల్లా విషం కలిగిన వయ్యారిభామ శాసీ్త్రయ నామం పార్ధినీయం హిస్టోరోఫోరెస్. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే రోగాలు వెంటే ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దిగుబడిని తగ్గిస్తుంది వయ్యారిభామ అనే కలుపు మొక్క పంట మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చివేస్తుంది. పూత, పిందె దశలో ప్రతాపం చూపి దిగుబడి తగ్గిస్తుంది. మొక్కలను తొలిదశలోనే నియంత్రించాలి. మొక్కజొన్న, పూల తోటలు, కూరగాయల పొలాలు, కొబ్బరి, మామిడి తోటల్లో ఈ కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. మనుషులకూ ప్రమాదమే మొక్క పుప్పోడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి. వయ్యారిభామతో డర్కాటైటిస్, ఎగ్జిమా హైఫీవర్, ఉబ్బసం, బ్రాంకై టీస్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పువ్వుల నుంచి రేణువులు గాలిలో కలిసిపోవడంతో ఆ గాలి పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు పాడవుతాయి. జంతువులకు వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్ పెరగడం జరుగుతుంది. సాధారణంగా పశువులు ఈ మొక్కను తినవు. పొరపాటున గడ్డితో పాటు వయ్యారిభామను తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరకు మరణించే అవకాశాలున్నాయి. నివారణ చర్యలు గ్రామాల్లోనూ, పొలాల్లోనూ ఉన్న వయ్యారిభామను పూతదశ రాకముందే వేర్లతో సహా తొలగించాలి. పూతదశకు రాకముందే 10 లీటర్లు నీటిలో 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన మొక్కలు మొలవవు. వయ్యారిభామ కలుపు మొక్కలు ఇటీవల కాలంలో పొలాల్లోనూ, రోడ్లు వెంబడి ఏపుగా పెరుగుతున్నాయి. వీటివలన పంటలతో పాటు మనుషులు, జంతువులకు ప్రమాదమే. దిగుబడి తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటికి తొలి దశలోనే నివారణ చర్యలు తీసుకోవాలి. ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం, కలుపు మందులు కొట్టడం వలన నివారించవచ్చు. – డి.పద్మావతి, వ్యవసాయాధికారి, గార పంట పొలాల్లో ఏపుగా పెరుగుతున్న కలుపు మొక్క దిగుబడిపై తీవ్రమైన ప్రభావం మనుషులకు సైతం వివిధ వ్యాధులు వేర్లతో సహా తొలగించాలని అధికారుల సూచనలు -
కామ్రేడ్ మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): AüÌS ¿êÆý‡™èl MìSÝ믌S çÜ¿ýæ Ð]l*i E´ë-«§ýlÅ-„ýS$yýl$, EÐ]l$Ãyìl B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ M>{Ðól$yŠæ ÝëÆý‡…-ç³-ÍÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz õÜÐ]lË$ _Æý‡-çÜÃ-Æý‡×îæ-Ķæ$Ð]l$° B…{«§ýl-{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$yýl$ Ð]l¬{Æ>ç³# çÜ*Æý‡Å-¯é-Æ>-Ķæ$׿ A¯é²Æý‡$. }M>-MýS$âýæ… ïÜIsîæÄ¶æÊ M>Æ>ÅÌS-Ķæ$…ÌZ Ð]l$ÌêÏ-Æð‡yìlz _{™èl-ç³-sê-°MìS ç³NÌS-Ð]l*-ÌSË$ ÐólíÜ ÝùÐ]l$ÐéÆý‡… °Ðé-â¶æ$-ÌS-Ç-µ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l*sêÏ-yýl$-™èl*.. OÆð‡™èl$ E§ýlÅÐ]l*-°MìS G¯]lÌôæ° õÜÐ]l ^ólÔ>Æý‡-°, Ð]lÅÐ]l-ÝëĶæ$ Æý‡…VýS…Oò³ çÜ…ç³NÆý‡~ gêq¯]l… MýSÍ-W¯]l Ð]lÅMýS$¢ÌZÏ Ð]l$ÌŒæ-{Ìê-ెyìlz JMýSÆý‡° VýS$Æý‡$¢ ^ólçÜ$-MýS$-¯é²Æý‡$. ÝëVýS$-±sìæ çÜÐ]l$-çÜÅË$, OÆð‡™é…VýS E§ýlÅ-Ð]l*-ÌSOò³ A¯ólMýS Æý‡^èl-¯]lË$ ^ólÔ>-Æý‡°, ºçßæ$âýæ gê† MýS…ò³-±ÌS ò³™èl¢-¯é-°MìS Ð]lņ-Æó‡-MýS…V> fÇ-W¯]l E§ýlÅ-Ð]l$…ÌZ {ç³Ð]l¬Q ´ë{™èl Ð]líßæ…-^é-Æý‡-¯é²Æý‡$. }M>-MýS$âýæ… hÌêÏÌZ ™èl$¸ë¯ŒS çÜ…§ýl-Æý‡Â…V> ÐólÌê¨ Möº¾-Ç, iyìl-^ðlr$Ï ç³yìl´ùƇ$$ OÆð‡™èl$Ë$ ¯]lçÙt´ùƇ$$¯]l-糚yýl$ B {´ë…™éÌZÏ Ð]l$ÌêÏ-Æð‡yìlz ç³Æý‡Å-sìæ…_ ¯]lçÙt-ç³Ç-àÆý‡… MøçÜ… MýS–íÙ ^ólÔ>-Æý‡-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ B…{«§ýl{ç³-§ólÔŒæ OÆð‡™èl$ çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ„ýS, M>Æý‡Å§ýl-Æý‡$ØË$ ´÷…§ýl*Æý‡$ ^èl…{§ýl-Æ>Ð]l#, ´ùÌêMìS {ç³Ýë-§ýl-Æ>Ð]l#, OÆð‡™èl$ çÜ…çœ$… ¯éĶæ$-MýS$Ë$ MðS.Ððl*-çßæ-¯ŒSÆ>Ð]l#, ºV>¨ ÐéçÜ$-§ólÐ]l-Æ>Ð]l#, M>Æý‡-V>¯]l Mö…yýlĶæ$Å, ™ø¯]l…W ¯]l…¨Ðéyýl$, MøÆ>yýl çᑀ ™èl¨-™èlÆý‡$Ë$ ´ëÌŸY¯é²Æý‡$. ఎల్‌నినో నుంచి పంటలను రక్షించుకోవాలి ఆమదాలవలస: ప్రస్తుతం ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితుల నుంచి రైతులు తమ పంటలను రక్షించుకోవాలని, అప్పుడు రానున్న రోజుల్లో పంటల్లో దిగుబడి సాధ్యమవుతుందని ఉత్తర కోస్తా జోనల్ ఎల్‌నినో కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.జోగినాయుడు సూచించారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తీవ్ర ఎల్‌నినో పరిస్థితులు, వర్షపాత లోటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ, ఆత్మ అధికారులతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత జిల్లా పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం వలన వడలిన పంటలను ఏవిధంగా రక్షించుకోవాలి, ముదురు నారు నాటేటప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు, ఎల్‌నినో పరిస్థితులను అధిగమించడానికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ సీహెచ్ ముకుందరావు, జిల్లాల ఎల్‌నినో సమన్వయకర్తలు డాక్టర్ కె.భాగ్యలక్ష్మి, విజయనగరం వ్యవసాయ పరిశోధస్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎస్.ఎస్.కె.పాత్రో, విజయనగరం, అనకాపల్లి, యలమంచిలి, నైర వ్యవసాయ కళాశాల, కొండపూడి, ఆమదాలవలస కేవీకే, వ్యవసాయ పరిశోధన స్థానాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.లక్ష్మణరావు, డాక్టర్ బి.రాజ్ కుమార్, డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి, డాక్టర్ డి.చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. మల్లన్న సన్నిధిలో న్యాయశాఖ కార్యదర్శి టెక్కలి: మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జునస్వామివారిని న్యాయశాఖ విభాగం కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వాహణాధికారి జి.గురునాథరావు ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి చిత్రపటానికి బహూకరించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నందిగాం: మండలంలోని రథజన బొడ్డపాడుకు చెందిన మాజీ సర్పంచ్ అంబలి సోమేశ్వరరావు(65) ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సోమేశ్వరరావు వ్యవసాయం, గొర్రెల పెంపకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్వరరావు ఇటీవల ఆర్థికంగా ఇబ్బందిపడి అప్పులు చేశారు. వీటిని తీర్చే మార్గం లేక ఈనెల 21న ఇంట్లో ఉన్న పురుగుల మందును బాత్రూమ్లోకి తీసుకెళ్లి తాగారు. దీన్ని గమనించిన కుమారులు హుటాహుటిన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. మృతుడికి భార్య పార్వతి, అయిన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేశారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 56 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితులు నుంచి 56 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సూచించారు. టెక్కలి సీఐపై ఫిర్యాదు లారీ ఢీకొట్టిన ఘటనలో తన చేయి విరిగినా నేటికీ సీఐ విజయ్ కేసు నమోదు చేయలేదని టెక్కలి లచ్చన్నపేటకు చెందిన పి.వెంకటరమణ తన తల్లి వసంతకుమారితో కలిసి ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈనెల 6న లచ్చన్నపేటలో ఇంటి వద్ద నుంచి సైకిల్‌పై బయల్దేరి వస్తుండగా లారీ ఢీకొట్టిందని, అదేరోజు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరామని, ఎంఎల్సీ అయినా మీరు ముందు వైద్యం చేయించుకోండని తర్వాత కేసు సంగతి చూద్దామని చెప్పారన్నారు. చేతి ఎముకలు చిట్లి గాయం తీవ్రత ఎక్కువై చేతిని తీసేయాల్సిన పరిస్థితి రావడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా శస్త్ర చికిత్స జరిగిందన్నారు. ఈ జాప్యంతో తర్వాత వెళ్లి సీఐని కలిసి కేసు నమోదు చేయమని కోరగా.. ఢీకొన్న ముద్దాయిని తీసుకురావాలంటే రూ.10 వేలు ఖర్చవుతుందని, అది మీరు ఇచ్చుకోవాలనడంతో అవాక్కయ్యామన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరారు. ఆస్తి కోసం అడ్డదారులు టెక్కలి: తమ తండ్రి నుంచి సంక్రమించే ఆస్తులను కాజేయాలనే దుర్బుద్ధితో రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తూ తన తమ్ముడు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించాడని బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి తెలుకలవీధికి చెందిన కుసుమూరు మల్లేశ్వరరావు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు వేణు, చిన్న కుమారుడు మోహన్‌రావు. అయితే తండ్రి మల్లేశ్వరరావు కొద్దిరోజుల క్రితం మరణించారు. దీంతో అన్న వేణు ఊరులో లేని సమయంలో తమ్ముడు మోహన్‌రావు రెవెన్యూ ఉద్యోగులను మేనేజ్ చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా అన్న పేరును గల్లంతు చేస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను సృష్టించాడు. దీంతో తండ్రి నుంచి వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఆస్తులను తన సొంత పేరుకు మళ్లించుకున్నాడు. ఈ విషయమై కొన్ని రోజులుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ వేణు వాపోయాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మంజూరు విషయంలో ఎటువంటి విచారణ చేయకుండా తప్పుడు పత్రాన్ని ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. ● తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన తమ్ముడిపై అన్న ఫిర్యాదు -
దళితపేటల్లో సౌకర్యాలు కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితపేటల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు కోరారు. కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో ఛలో కలెక్టరేట్ సోమవారం నిర్వహించారు. ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ల ప్రసాద్, గంగారాపు సింహాచలం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరావులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల స్వతంత్ర భారతంలో దళితుల సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పేటల్లో కనీసం మంచినీరు, సరైన డ్రైనేజీ వంటి సౌకర్యాలు కూడా లేవన్నారు. అనేక గ్రామాల్లో శ్మశానవాటికకు రహదారి సౌకర్యం లేక పంట పొలాల మధ్యలో నుంచి భౌతికకాయాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, దళిత పేటల్లో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని, దళిత యువకులకు స్వయం ఉపాధిని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షురాలు కె.నాగమణి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి.ఈశ్వరమ్మ, కొల్లి ఎల్లయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు, ఎన్.షణ్ముఖరావు, ఎన్.గణపతి, హెచ్.ఈశ్వరరావు, అల్లు సత్యనారాయణ, నిమ్మక అప్పన్న, కుప్పిలి గోపి, పనస రమేష్, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
కారుమూరి అరెస్టు సరికాదు
● ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు కవిటి: రాష్ట్రంలోని బీసీ కులాల గొంతును సీఎం చంద్రబాబు నొక్కేస్తున్నారని ఎమ్మెల్సీ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు నర్తు రామారావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా నడిచిందని గుర్తు చేశారు. అక్రమాలే లేని మద్యం విధానంలో కుంభ కోణానికి ఆస్కారం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో నిరూపణ చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయక, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రానున్న రోజుల్లో బీసీలు కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో యువ నాయకుడు నర్తు శివాజీ యాదవ్ తదితరులు ఉన్నారు. -
గంజాయితో ఇద్దరు మహిళలు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన పాయల్పాల్ కలకత్తాలోని గంజాయి వ్యాపారి సమీర్దాస్తో కలిసి కలకత్తా అటవీ ప్రాంతం కుచ్ బీహార్ నుంచి గంజాయి రవాణా చేసేంది. దీనికోసం గంజాయి వ్యాపారి గంజాయి రవాణా చేసిన ప్రతిసారి పాయల్పాల్కు రూ.10 వేలు ఇచ్చేవాడు. ఈవిధంగా కలకత్తా అటవీ ప్రాతం నుంచి పలుమార్లు గంజాయి వ్యాపారి సమీర్దాస్తో కలిసి గంజాయిని కలకత్తాకు తరలించింది. అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారివురు హౌరాజిల్లా బెల్లి దుర్గాపూర్‌కి చెందిన మౌమఖాల్ అలియాస్ తనీష అనే మహిళతో కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దిగపొహండి పద్మనాభపూర్‌లో గంజాయి వ్యాపారం చేసే రంజిత్‌కుమార్ సాహు వద్దనుంచి12.520 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ముగ్గురూ ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కి బస్ ద్వారా గంజాయితో చేరుకున్నారు. మహిళలిద్దరూ గంజాయి కలిగిన సూట్‌కేస్‌లతో రైల్వేస్టేషన్ సమీపంలో వేచి ఉండగా సమీర్‌దాస్ టికెట్లు తీసేందుకు వెళ్లాడు. ఈ ఇద్దరు మహిళలు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు తదితరులు ఉన్నారు. -
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఆన్లైన్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అర్హత గల అభ్యర్థులకు ఏపీఐసెట్–2026 ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆన్లైన్లో సమస్యలుంటే నేరుగా కళాశాలకు వచ్చి పరిష్కరించుకోవచ్చు. వీటికి సంబంధించి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు, రిజి స్ట్రేషన్ ఈ నెల 24 వ తేదీ నుంచి 31 వరకూ చేసుకోవచ్చు. ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈ నెల 25 వ తేదీ నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్ల ఎంట్రీ ఈ నెల 27 వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ చేసుకోవచ్చు. ఆప్షన్లు మార్చుకోవాలంటే వచ్చే నెల 3 వ తేదీలోగా చేసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 7వ తేదీన సీట్ల అలాట్మెంట్ చేయ నున్నారు. సెల్ఫ్ జాయినింగ్లు వచ్చె నెల 8 వ తేదీనుంచి 11 వరకూ నిర్వహించనున్నారు. వచ్చెనెల 8 నుంచి క్లాసులు ప్రారంభించనున్నారు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు మాత్రం నేరుగా ఈ నెల 31 తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకూ విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి వెరిఫికేషన్ చేసుకోవాలి. చిక్కాలవలసలో విరిగిన విద్యుత్ స్తంభాలు నరసన్నపేట: చిక్కాలవలస కుమ్మరివీధిలో శనివారం రాత్రి రెండు విద్యుత్ స్తంభాలు విరిగి రేక్ షెడ్, ప్రహరీలపై పడ్డాయి. అయితే ఎవరికీ ఎ లాంటి ప్రమాదం జరగలేదు. అంబటి రాంబాబు కుమ్మరి శాల, పండూరి తవుడు ప్రహరీలపై పడటంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోల్స్ సక్రమంగా వేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. వర్షాలకే ఇలా పోల్స్ పడిపోతే ఎలా అని గ్రామస్తులు అంటున్నారు. డీఎస్సీ అవకతవకలపై బీజేపీ నాయకుడి నిరసన నందిగాం: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి, బీజేపీ సభ్యత్వానికి మండలం దేవళభద్రకు చెందిన చింతాడ శ్రీనివాస్ ఆదివారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలపై వచ్చిన ఆరోపణలు, అభ్యర్థుల ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన జిల్లా అధ్యక్షునికి సమాచారం అందించారు. ముగిసిన సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అనతి కాలంలో సాఫ్ట్‌బాల్ క్రీడకు గణనీయమైన ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపికలు జరిగాయి. సుమారు 150 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభ నిరూపించుకున్నారు. పాఠశాలస్థాయిలో సాఫ్ట్‌బాల్ క్రీడ పట్ల విద్యార్థుల్లో మక్కువ పెరగడం అభినందనీయమని సంఘ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు సంఘ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఉపాధ్యక్షుడు మెట్ట తిరుపతిరావు పేర్కొన్నా రు. ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన చెరో 20 మంది క్రీడాకారులను జిల్లా ప్రాబబుల్స్ జట్లకు ఎంపికచేశారు. వారికి శిక్షణా శిబిరాలను నిర్వహించిన అనంతరం తుది జట్లను ప్రకటించనున్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.సాంబ మూర్తి, సలహాదారు పి.సుందరరారావు, సాఫ్ట్‌బాల్ సంఘ ప్రతినిధులు అన్నెపు రాజగోపా ల్, ఢిల్లీశ్వరరావు, మహంతి, మధుసూదన్, వెంకటరమణ, హరికృష్ణ పాల్గొన్నారు. -
బీఎల్ఓల పనితీరు పరిశీలన
టెక్కలి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(సర్)లో భాగంగా ముసాయిదా విడుదల అనంతరం వివిధ రకాల క్లెయిమ్స్, అభ్యంతరాలకు సంబంధించి టెక్కలి మేజర్ పంచాయతీలో బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న నమోదు పరిశీలనను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. బూత్ స్థాయిలో బీఎల్ఓల పనితీరును తెలుసుకున్నారు. ముసాయిదా అనంతరం వివిధ రకాల కారణాలతో తప్పిపోయిన ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటు గల్లంతు కా కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఇన్చార్జి తహసీల్దార్ రాంబాబు ఉన్నారు. -
డేటా సెంటర్లతో పర్యావరణ విధ్వంసం
జి.సిగడాం(పొందూరు): విశాఖపట్నంలో పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం డేటాసెంటర్లను ఏర్పాటు చేస్తోందని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ అన్నారు. ఆదివారం పొందూరు మండల కేంద్రంలో శ్రీరామా ఐటీఐ ప్రాంగణంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖను నాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాయని చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 300 మందికే ఉద్యోగాలు వస్తాయన్నారు. 2017న పోలవరం నీటిని ఉత్తరాంధ్ర ప్రజలకు అందిస్తామని చంద్రబాబు చెప్పినా ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ రమణయ్య, రాష్ట్ర మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు మాట్లాడుతూ సామాజిక సంక్షోభంలో చిక్కుకున్న విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం పేడాడ కృష్ణారావు రచించిన వ్యాస సంపుటి ఈ అడుగులు ఏ ప్రస్థానానికి పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ పట్నాన రాజారావు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.హరి, విజయనగరం జిల్లా కన్వీనర్ దుర్గాశి గణేష్, ప్రధాన కార్యదర్శి కుమ్ము అప్పలరాజు, మండల శాఖ అధ్యక్షుడు గురుబిల్లి వెంకటరావు, రాజశేఖరం, బి.గున్ననాయుడు, తమ్మినేని మురళీ, జి.భాస్కరరావు, తమ్మినేని సన్యాసిరావు, జి.బాలకృష్ణ, పార్వదేశం రమణమూర్తి, గండం రామారావు, మధుసూదనరావు, మోహన్‌రావు పాల్గొన్నారు. -
చిన్న వయసులో పెద్ద కష్టం!
● లివర్సిరోసిస్తో బాధపడుతున్న జోష్‌వర్ధన్ ● వైద్యం కోసం రూ.50 లక్షలు అవసరం ● దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు జి.సిగడాం : పదో తరగతి పూర్తి చేసిన ఆ యువకుడికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఇంటర్మీడియెట్‌లో జాయినై ఉన్నత చదువులు చదవాలన్న కలకు అరుదైన వ్యాధి రూపంలో బ్రేక్ పడింది. చికిత్సకు రూ.50 లక్షలకు పైగా డబ్బులు అవసరం పడటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ దాతలపైనే భారం వేశారు. ఏం జరిగిందంటే.. జి.సిగడాం మండలం ఎందువ గ్రామానికి చెందిన కింజరాపు భాస్కరరావు, రమా దంపతులకు కుమారుడు జోష్ వర్ధన్. వయస్సు 15 సంవత్సరాలు. ప్రభుత్వం పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ చదవాలనుకున్న సమయంలో లివర్‌సిరోసిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి నయంకావాలంటే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశలో కూరుకుపోయారు. పేద కుటుంబం కావడంతో ఆపరేషన్ చేయించలేకపోవడంతో జోష్‌వర్ధన్ మంచానికే పరిమితమయ్యారు. ఆస్పత్రుల్లో చూపించినా.. జోష్‌వర్ధన్ రెండేళ్లుగా వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ఆస్పత్రుల్లో చూపించారు. వ్యాధి నివారణ చేయాలంటే ప్రత్యేక ఆపరేషన్ చేయాలని విశాఖలోని ఓ ప్రవేట్ ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి నెలా మందులు, వైద్య పరీక్షల కోసం సమారు రూ.30 వేలు వరకు ఖర్చు అవుతోందని, ఆపరేషన్ కోసం దాతలు స్పందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం కోసం.. దాతలు 99515 95285 నంబర్‌కు ఫోన్‌పే చేయవచ్చు. యూనియన్ బ్యాంకు (ఖాతా నంబరు 016610100122026, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0801666) ద్వారా కూడా సాయం అందించవచ్చు. -
పనితనం.. ఇదే నిదర్శనం!
● మూడుసార్లు కూలిన డ్రైనేజీ ● రూ.12 కోట్ల పనుల నిర్వహణపై ఆరోపణలు ● ప్రారంభించకుండానే కూలుతున్న నిర్మాణాలు సరుబుజ్జిలి: అక్కడ రోడ్డు విస్తరణ పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇంకా ప్రారంభమే కాలేదు.. కానీ మూడుసార్లు కాలువ నిర్మాణం కుప్పకూలింది. రూ.12 కోట్లతో జరుగుతున్న పనుల సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉపాధి నిధులతో సరుబుజ్జిలి జంక్షన్లో అలికాం–బత్తిలి రహ దారిలో సుమారు 2 కిలోమీటర్లు, పాలకొండ– కొమానాపల్లి రహదారిలో సుమారు 600 మీటర్లు రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ శాఖాధికారులకు పనులు అప్పగించడం వల్ల కాంట్రాక్టర్ ఆడిందే ఆట పాడిందే పాటగా పనులు సాగుతున్నాయి. నాలుగు రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించకుండానే కుప్పకూలడంతో నాణ్యత ఇట్టే అర్థమవుతోందని ప్రజలు అంటున్నారు. హిరమండలం రహదారిలో నిర్మిస్తున్న డ్రైనేజీ ఇప్పటివరకు 3సార్లు కూలిపోయింది. అదేవిధంగా నిర్మాణం చేపట్టిన రహదారి కూడా చాలా చోట్ల దిగబడి కుంగిపోయింది. తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు కాంట్రాక్టర్ కూలిన చోట ఆనవాళ్లు లేకుండా పొక్లెయినర్‌తో తవ్వకాలు చేపట్టడం గమనార్హం. ఈ విషయమై వివరణ కోసం ఆర్అండ్బీ ఈఈను సంప్రదించగా స్పందించలేదు. -
● వంశధారలోకి వరద నీరు
హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయానికి స్వల్పంగా వరద నీరు పెరిగింది. ఒడిశా కేచ్‌మెంట్ ఏరియాతో పాటు గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరదనీరు వచ్చిచేరుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద గరిష్టంగా 38.10 మీటర్లు నీటిమట్టం ఉండగా ప్రస్తుతానికి 37.20 మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో శనివారం సాయంత్రానికి 2200 క్యూసెక్కులు నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం నాటికి 19,500 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. సాయంత్రానికి 20,217 క్యూసెక్కులకు పెరిగింది. వచ్చిన నీటిని 10గేట్లు 20 సెంటీమీటర్లు మేర పైకి ఎత్తి దిగువకు 18,437 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి, ఏఈ ఆనందరావు తెలిపారు. అలాగే కుడి ప్రధాన కాలువ ద్వారా 458 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1322 క్యూసెక్కులు నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు. – హిరమండలం -
‘తీర ప్రాంతంలో విధ్వంసకర తవ్వకాలు వద్దు’
టెక్కలి: సముద్ర తీర ప్రాంతాల్లో విధ్వంసకరమైన రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాలు చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కోరారు. ఆది వారం టెక్కలిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి మా ట్లాడారు. గార్నైట్, ఎలిమినైట్, జిర్కాన్, టైటానియం వంటి నిక్షేపాల కోసం సముద్ర తీర ప్రాంతాల్లో తవ్వకాలు చేయడానికి రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాజెక్టు పేరుతో అదానీ సంస్థకు ఆదాయం సమకూర్చడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంద న్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ముఖ్యంగా సంతబొ మ్మాళి మండలంలో సుమారు 38 వేల ఎకరాల్లో బలవంతపు భూసేకరణ చేయడానికి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు కుటుంబాలు నడిరోడ్డున పడతాయనే విషయం మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎన్.షణ్ముఖరావు, కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు పాల్గొన్నారు. -
తైక్వాండో స్టేట్‌మీట్‌లో సిక్కోలు జయకేతనం
శ్రీకాకుళం న్యూకాలనీ: తైక్వాండో సమరంలో శ్రీకాకుళం జిల్లా మరోసారి తన సత్తాచాటుకుంది. సిక్కోలు వేదికగా జరిగిన మూ డు రోజుల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం క్రీడాకారులు అదిరేటి ఆటతీరును కనబర్చి విజయదుందుభి మోగించారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్ జిల్లాల) తైక్వాండో చాంపియన్‌షిప్–2026 పోటీలు ముగిశాయి. కన్నుల పండువలా మూడు రోజులపాటు ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు కేడిట్ విభాగంలో మూడో స్థానం, జూనియర్స్‌లో రెండో స్థానంలో నిలిచారు. పూమ్సే విభాగంలో విజయనగరం జిల్లా విజేతగా నిలిచింది. సబ్‌జూనియర్స్ విభాగంలో విశాఖపట్నం చాంపియన్‌గా నిలవగా, సీనియర్స్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా చాంపియన్‌గా నిలిచింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ టైటిళ్లు, పతకాలు పంపిణీ చేశారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తైక్వాండో రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, జిల్లా కార్యదర్శి కొమర భాస్కరరావు కృతజ్ఞతలు తెలిపారు. -
అండర్–18 రగ్బీ పోటీలు ప్రారంభం
టెక్కలి రూరల్ : చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అండర్–18 ఉమెన్స్ రగ్బీ టోర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రగ్బీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. జిల్లా నుంచి 13 జట్లు పాల్గొన్నాయి. సిక్కోల్ జట్టు గెలుపొందగా, కేజీబీవీ సంతబొమ్మాళి జట్టు ద్వితీయ, జలుమూరు కేజీబీవీ జట్టు తృతీయ బహుమతులు సాధించాయి. ప్రధానోపాధ్యాయుడు కె.నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, జనరల్ సెక్రటరీ పొన్నాడ పార్వతీశం, కోశాధికారి కాపల రఘురాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాడన నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సంఘం కార్యవర్గ ఎన్నిక శ్రీకాకుళం కల్చరల్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మహమ్మద్ అక్బర్ బాషా, జనరల్ సెక్రటరీగా ముజీబుర్ రెహమాన్ (ముజీబ్)లను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీ యాదవ భవనం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల అనుమతితో హాజీ అమీరుల్లా బేగ్ నియమించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఆదిబ్ హసన్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ ముబారక్, ఉపాధ్యక్షులుగా షేర్ అలీబేగ్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, రెహమతుల్లా ఖాన్, రవుఫ్ ఖాన్, జిల్లా కార్యదర్శులుగా సుకుర్ఖాన్, మహమ్మద్ యాసీన్, షేక్ హుస్సేన్, షేక్ ఫిరోజుద్దీన్, కోశాధికారిగా సయ్యద్ రోషన్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా మహమ్మద్ అబ్దుల్ ఉస్మాన్, మహమ్మద్ అబ్దుల్ హబీబుల్లా, షేక్ నిజాముద్దీన్, పబ్లిసిటీ సెక్రటరీగా షేక్ షాన్వాజ్, జాయింట్ సెక్రటరీగా సలీం ఖాన్, మీడియా అధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సత్తార్, ఈసీ మెంబర్లుగా షేక్ యూసుఫ్, జిలానిని నియమించారు. మూలపేట నుంచి భోగాపురం వరకు అభివృద్ధి టెక్కలి: మూలపేట నుంచి భోగాపురం వరకు నాలుగ వరుసల రోడ్లతో అభివృద్ధి చేపడతామని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.650 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. కోరమండల్ పరిశ్రమ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మేఘవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముగిసిన ఎంపీ కప్ చెస్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ : ఎంపీ కప్–2026 చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ భవన్లో రెండురోజులుగా నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా బాలబాలికలు హాజరయ్యారు. విజేతలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బేస్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని సుజాత, వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆరవల రవీంద్రబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, బలగ ప్రహర్ష, దుంగ భాస్కర్, కొర్ను నాగార్జున ప్రతాప్, చెస్ సంఘ ప్రతినిధులు సనపల భీమారావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరు గొర్రెలు మృతి సోంపేట: గొల్లవూరులో మద్దిల మోహన్‌రావు, గజ్జి తేజేశ్వరరావులకు చెందిన ఆరు గొర్రెలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఆదివారం ఉదయం డొంకలూరు, బట్టిగళ్లూరు తీరంలో మంద మేపుతూ సాయంత్రం ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో హఠాత్తుగా కింద పడి మృతి చెందాయి. విషయం స్థానిక పశువైద్యాధికారి శిరీషకు తెలియజేయగా.. పంచనామా నిర్వహిస్తే విషయం తెలుస్తుందని తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
కవిటి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు పిలుపునిచ్చారు. కొత్తపుట్టుగ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ అంశంపై ఇదివరకే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు పోటీకి బలంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.పార్టీకోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సమావేవంలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, దుర్గాసి ధర్మారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ల కక్కుర్తితోనే రెడ్‌జోన్ పరిశ్రమలకు అనుమతులు
● మంత్రి అచ్చెన్నపై పేరాడ తిలక్ మండిపాటు టెక్కలి: జిల్లాలో స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టును తీసుకువచ్చారని.. కూటమి ప్రభుత్వంలో మాత్రం కొన్ని రకాల కెమికల్స్ కంపెనీల నుంచి భారీగా కమీషన్లకు కక్కుర్తి పడి మంత్రి అచ్చెన్నాయుడు ఆయా పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు పరిసర ప్రాంతాల్లో భూములిచ్చేందుకు సిద్ధమవుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఆదివారం టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోర్టు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు గతంలో హల్దియా పెట్రో కెమికల్స్, కళ్యాణి స్టీల్స్, యమునా గ్రీన్ అమోనియా, హెఎంపీఎల్, నాల్కో, విశాఖ పోర్టు ట్రస్టు, గెయిల్, బీపీసీఎల్, ఎగ్జాంబుల్ తదితర కంపెనీలు ముందుకు వస్తే, ఆయా కంపెనీల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు భారీగా కమీషన్లు డిమాండ్ చేయడంతో వారంతా పారిపోయారని చెప్పారు. గతంలో పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు సేకరించిన సుమారు 1800 ఎకరాల భూమి ఆయా కంపెనీ నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కేవలం పుష్కలంగా పంటలు పండిస్తున్న రైతుల భూములపైనే మంత్రి కన్నుపడిందన్నారు. తాము పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, రెడ్‌జోన్‌లో ఉండాల్సిన పరిశ్రమలను కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఈ ప్రాంతంలో విధ్వంసకరమైన దుస్థితికి తీసుకురావొద్దని తిలక్ పేర్కొన్నారు. పోర్టుకు అనుసంధానంగా ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమలు, గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు, ఆక్వా, ఖాదీ, కొబ్బరి, జీడి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలని, అంతే తప్పా భారీగా కమీషన్ల వస్తాయనే ఆశతో రెడ్‌జోన్‌లో ఉండాల్సిన పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒకే ఇంట్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ స్థానిక వనరులకు అనుకూలంగా పరిశ్రమలను తీసుకురాలేని అసమర్థత మంత్రులుగా మిగిలిపోతున్నారని దుయ్యబట్టారు. కెమికల్స్ పరిశ్రమ కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 211పై మరో సారి పునరాలోచన చేసి దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక రైతులు, ప్రజల అభిప్రాయాలతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని స్పష్టం చేశారు. ఈయనతోపాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్నిక జీవన్, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు బి.రాజేష్ ఉన్నారు. -
జింకు లోపంతో జాగ్రత్త
ఆమదాలవలస: మానవ శరీరంలో జింకు కీలక పాత్ర పోషిస్తోంది. జింకు ధాతువు కణజాల వర్ధనంలో ప్రధాన పాత్ర పోషించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరంలో హార్మోన్లను సమతుల్య పరిచే యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. జింక్ ధాతువు మగవారిలో వ్యంధత్వం రాకుండా, ఆడవారికి ప్రసూతి సమయంలో మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పిల్లల్లో చురుకుదనం పెరగడానికి తోడ్పడుతుంది. ఇంత ప్రాముఖ్యం కలిగిన జింకు మానవ ఆహారం ద్వారా సరైన మోతాదులో అందడంలేదు. పంట ఉత్పత్తుల్లో జింకు లేకపోవడం సరైన పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా నేలల్లో జింకు తక్కువ కావడం వల్ల పండించే పంటకు సరైన మోతాదులో జింకు అందక ఆహార పదార్థాల్లో జింకు శాతం తగ్గుతోంది. పంట ఎదుగుదల కూడా కుంటుపడుతోంది. ఆ ప్రభావం దిగుబడులపై పడుతోంది. ఈ నేపథ్యంలో జింకు లోపం రాకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు సూచించారు. లక్షణాలు ఇవే.. వరి: నాటిన 2–4 వారాలలో ముదురాకు చివరలు, ఈనె ఇరుపక్కలా తుప్పు లేదా ఇటుక రంగులో మచ్చలు కనిపిస్తాయి. పైనుంచి 3, 4 ఆకుల్లో ఈనె పాలిపోతుంది. ఆకులు చిన్నవిగా ఉండి పెలుసుగా మారి శబ్దం చేస్తూ విరిగిపోతాయి. వేరుశనగ: ఆకులు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి. మొక్కలు గిడసబారతాయి. మొక్కజొన్న: జింకులోపం వల్ల ఆకులమీద పసుపు వర్ణపు చారలు వరుసల్లో కనిపిస్తాయి. ముదిరేకొద్దీ ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత తెల్లగా రంగు విరిగినట్లు కనిపిస్తాయి. పత్తి: పత్తిలో జింకు లోపించినపుడు ఆకు ఈనెలు పచ్చగా ఉండి మధ్యభాగం పసుపు రంగులోకి మారుతుంది. కమ్మ చివరి ఆకులు చిన్నవిగా ఉండి ముడతలు పడి కణుపుల మధ్య దూరం తగ్గుతుంది. రాగి: ఆకులపై లేత పసుపు వర్ణంలో సన్నని చారలు ఏర్పడతాయి. జింకు ధాతులోపం ఎక్కువగా ముదురు ఆకులలో కనిపిస్తుంది నివారణ చర్యలు.. వరిలో ప్రతి ఖరీఫ్ సీజన్ ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను వేసి కలియదున్నాలి. దీనివల్ల 3 పంటలు వరకు జింకు ధాతు లోపం ఉండదు. పత్తిలో కూడా 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. జింక్లోప సవరణ కోసం 0.2 శాతం జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, 80 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం రైతులు అప్రమత్తంగా ఉండాలి ‘సాక్షి’తో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు -
తంపర, రెండు హృదయాలు పుస్తకాల ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు సంయుక్తంగా ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు వ్యాస సంపుటి ‘తంపర’ను సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు ఆవిష్కరించగా, తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు చెందిన ప్రముఖ రచయిత శిరంశెట్టి కాంతారావు, ప్రసిద్ధ రచయిత గంటేడ గౌరునాయుడులు సంయుక్తంగా రచించిన ‘ఎన్నో ఉదయాలు.. రెండు హృదయాలు’ ప్రయోగశీల కావ్యాన్ని పట్టణానికి చెందిన వైద్యులు డాక్టర్ కణుగుల సుధీర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖులు చీకటి దివాకర్, చిగురుపల్లి ప్రభాకరరావు,, లండ సాంబమూర్తి, కల్లేపల్లి ఉదయ్‌కిరణ్, బాడాన శ్యామలరావు, దాసరి రామచంద్రరావు, పందిరి గోవిందరాజులు, పూజారి దివాకర్, నల్లి ధర్మారావు, బాల సుధాకర మౌళి, పీవీ నరసింహులు, చింతా అప్పలనాయుడు, సిరికి స్వామి నాయుడు, మల్లిపురం జగదీష్, పక్కి రవీంద్ర, కంచరాన భుజంగారావు, చీకటి చంద్రికరాణి, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఓ బొజ్జ గణపయ్య.. జీవనాధారం నువ్వేనయ్యా!
గణపతి విగ్రహాలకు మెరుగులు జగన్నాథుని ఆకృతిలో వినాయకుడు మందస వినాయక చవితి సందడి మరో 20 రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితినాడు ప్రారంభమైన నవరాత్రుల్లో ఎంతో అంగరంగ వైభవంగా హిందువులు మొదటి ఉత్సవంగా ఈ పండగను భావిస్తారు. ఈ క్రమంలో గణనాథుని విగ్రహాలకు కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. వీటినే నమ్ముకొని వేలాది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఏటా ఓసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాల్లో అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను విభిన్న ఆకృతుల్లో తయారుచేసి అమ్మకాలను సాగిస్తారు. ప్రధానంగా మందస కేంద్రంలో తయారు చేస్తున్న మట్టి విగ్రహాలకు మందస, హరిపురం, పలాస, గొప్పిలి, తర్లాకోట, రాజపురం, సారంగిపురం, ఒడిశా తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. ఉత్సవాలకు మూడు నెలలు ముందే విగ్రహాలు తయారీకి అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి గణపతి విగ్రహాలను కళాకారులు ప్రారంభిస్తారు. ఇక్కడ అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు. విభిన్న ఆకృతులు.. ఏటా విభిన్న ఆకృతిలో వినాయకులను తయారుచేస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. స్థానిక కమిటీ సభ్యుల అభిరుచులు, ఆలోచనలకు తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. నాలుగు అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తు వరకు తయారు చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. సైజును బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.4,000 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో విగ్రహాల అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు. మట్టి విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు స్థానికులతో పాటు ఒడిశా ప్రాంతాల నుంచి రాక కమిటీ సభ్యుల అభిరుచులకు తగ్గట్టు విగ్రహాల రూపకల్పన -
18 తులాల బంగారం రికవరీ
● చిన్నమ్మడు అంత్యక్రియలు పూర్తి ● మహిళా న్యాయవాది, ఆమె కుటుంబ సభ్యుల నుంచే బంగారం రికవరీ జలుమూరు: అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. కేసులో అనుమానితులుగా ఉన్న మహిళా న్యాయవాది, ఆమె సోదరుడు అచ్యుతరావు, ఆమె కుమారులు నుంచి సుమారు 18 తులాల వరకూ బంగారం రికవరీ చేశారు. ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లిన చిన్నమ్మడు హత్యకు గురై ఆనవాలు కూడా గుర్తుపట్టలేని విధంగా మూటలో కనిపించే సరికి గ్రామస్తులు గొల్లుమన్నారు. శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అప్పజెప్పారు. అలాగే అనుమానితుల నుంచి బంగారం రికవరీ చేసి చిన్నమ్మడు కుమారులు శంకర్ నారాయణ, సు ధాకర్లకు అప్పజెప్పారు. ఇంతటి దారుణానికి ఒడికట్టిన న్యాయవాది తోపాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుమారుడు సుధాకర్ కోరాడు. వృద్ధ మహిళ అని కనీసం చూడకుండా నమ్మకంగా ఇంటికి పిలిచి ఇలా చేయడం దారుణమని వాపోయాడు. -
భక్తులకు తప్పని వర్షం పాట్లు
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు వర్షం ఇక్కట్లు తప్పడం లేదు. శ్రావణ ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్థానిక పరిస్థితులు సౌకర్యాలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. దర్శనాల వరకు ఏర్పాట్లు బాగానే ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితులు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయలు వెచ్చించి భక్తదాతలు చేయించి ఏర్పాటు చేసిన జింకు రేకుల షెడ్లును కూల్చేసి కమ్మరేకుల శాలను వేయించిన ప్రస్తుత పాలకుల తీరుపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వర్షాలకు పూర్తిగా తడిచి ముద్దయి వర్షపునీరుతో ఉండడంతో ఎప్పటికప్పుడు సిబ్బంది నీటిని తొలిగించే చర్యలు చేపడుతున్నప్పటికీ..భక్తులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ప్రసాదాల విభాగం కూడా ఇక్కడే ఉండడంతో కొనుగోలుతో పాటు తినడానికి కూడా భక్తులు అవస్థలు పడ్డారు. వర్షపునీటిలో బయటకు వెళ్లలేక..ఈ కమ్మ రేకుల శాలలో కూర్చోలేక నిలబడే ప్రసాదాలను తినడం కనిపించింది. ఇప్పటికై నా ఆలయ అధికారులు శాశ్వత ఏర్పాట్లపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
మౌన వేదన
కొత్తూరు: నిబంధనలను కాలరాసి.. నియమాలను తుంగలో తొక్కి పశువులను అక్రమ రవాణా చేస్తున్నారు. రైతుల ముసుగులో ఈ అక్రమాలను దర్జా గా చేస్తున్నారు. కొత్తూరు మండలంలోని బలద సంత పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్‌గా మారుతోంది. ఒడిశాకు ఆనుకుని ఉన్నందున రవాణా సులభంగా జరిగిపోతోంది. జంతు సంక్షేమ కమిటీ వారు కన్నెత్తి కూడా చూడకపోవడంతో మూగజీవాలు సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ● జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ సమన్వయ కమిటీ పనిచేస్తుంది. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ, మండల పశు వైద్యాధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పశువుల అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలి. ● జిల్లా సరిహద్దుల్లో, సంతల సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి. ● నిబంధనలకు వ్యతిరేకంగా పశువులను అక్రమంగా రవాణా చేసిన వారిపై క్రూరత్వ నిరోధక చట్టం(పీసీఎ–1960 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేయాలి. ● పట్టుకున్న పశువులను సమీపంలోని గోసంరక్షణ శాలకు తరలించి, వారి బాగోగులు చూసేందుకు చర్యలు తీసుకోవాలి. ● పశువులను రవాణా చేసినప్పుడు పశువైద్యాధికారి మంజూరు చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ● పశువులకు ఆహారంతో పాటు దాణాను వాహనాల్లో ఏర్పాటు చేసి వాటికి అనుకూలంగా ఉన్న వాహనాల్లోనే తరలించాలి. జిల్లాలో ఏం జరుగుతోంది..? ● కొత్తూరు మండలంలోని బలద, నారాయణవలస, కొల్లివలస, చింతాడ వారపు సంతల్లో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ● ఈ సంతల్లో నుంచి ప్రతి వారం పశువులను గోవధ శాలలకు పంపిస్తున్నట్లు సమాచారం. ● పలు కంపెనీల నుంచి వచ్చిన ఏజెంట్లు సంతలో దళారుల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ● ఒడిశాకు ఆనుకుని ఉన్నందున ఇక్కడకు ఎక్కువగా పశువులను తీసుకువచ్చి అమ్ముతారు. ● ఈ పశువులను కొనుగోలు చేశాక ఇరుకు వాహనాల్లో తీసుకెళ్తూ నరకయాతనకు గురి చేస్తున్నారు. ● జిల్లాలోని వారపు సంతల్లో కొనుగోలు చేసిన పశువులను ఒడిశా రాష్ట్రంలోని గ్రామాలకు తరలించి అక్కడ వాహనాల్లో పశువులను ఎక్కించి గోవధ శాలలకు తరలిస్తున్నట్లు తెలిసింది. ● ఒడిశాలో లోడు చేయడంతో జిల్లా పోలీసులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ● కొత్తూరు మండలం బలద సంతలో రైతుల ముసుగులో కొంత మంది వ్యాపారులు పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. బలదలో దళారీల ద్వారా పశువుల కొనుగోలు విశాఖ, కాకినాడ, హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాలకు తరలింపు ఆరోగ్య సర్టిఫికెట్లు లేకుండానే రవాణా రైతుల ముసుగులో పశువులతో వ్యాపారం జాడ లేని జంతు సంక్షేమ సంఘం జంతు సంక్షేమ సంఘం ఏదీ? సంతల నుంచి పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం నియమించిన జంతు సంక్షేమ సంఘం సక్రమంగా తమ బాధ్యతలను నిర్వహించడం లేదు. సంఘంలో ఉన్న అధికారులు సక్రమంగా తనిఖీలు నిర్వహించాలి. – గేదెల మన్మధరావు, కొత్తూరు విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి అక్రమ రవాణా అరికట్టాలి.. జిల్లా నుంచి పశువులు గోవధ శాలకు ఎక్కువగా తరలిస్తున్నారు. సంతలో కొనుగోలు చేసిన పశువులను కొంత దూరం వరకు తీసుకెళ్లి అక్కడ వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. – పొగిరి రవి, టీటీడీ ధర్మ ప్రచారక్ కొత్తూరు నిఘా పెట్టాం బలద సంతలో పశువుల అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాం. ప్రతి మంగళవారం సంతలో పోలీస్‌లు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారు. బలద సంతలో అక్రమ రవాణా జరిగినట్లు మా దృష్టికి రాలేదు. – కె.వెంకటేష్ ఎస్ఐ, కొత్తూరు మండలం -
‘ఓట్ల తొలగింపు అడ్డుకుందాం’
నరసన్నపేట: అర్హత కలిగిన ప్రతి ఓటునూ కాపాడుకోవడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ కార్యాచరణ వేగవంతం చేసిందని, ఏక పక్ష ఓట్ల తొలగింపును అడ్డుకోవడానికి నియోజకవర్గ ఇన్చార్జిలు పూర్తి బాధ్యత తీసుకోవాలని పార్టీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ కార్యదర్శి హర్హవర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక ఒక ప్రైవేటు హోటల్లో శ్రీకాకుళం, మన్యం, జిల్లాల వైఎస్సార్సీపీ అసెంబ్లీ ఎస్ఐఆర్ వార్ రూమ్ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశం ఆదివారం పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. వార్‌రూం కార్యక్రమాల సమన్వయంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రధానంగా ఓటర్లకు జారీ అవుతు న్న నోటీసులు, వాటికి స్పందించే చట్టబద్ధమైన విధానాలు, సమర్పించాల్సిన ఆధార పత్రాలతో పాటు అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్(ఏఎస్టీడీ) ప్రక్రియ పై సుదీర్ఘంగా చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే మనందరి ధ్యేయమని అన్నారు. బూత్‌స్థాయి బీఎల్ఏలు, వార్‌రూం ఇన్చార్జీలు నిరంతరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని పోలాకి జెడ్పీటీసీ కృష్ణ చైతన్య వివరించారు. సమావేశంలో జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావుతో పాటు నియోజకవర్గ వార్‌రూం ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన బల్లేడ కూర్మనాయుకులు(62), అతని అల్లుడు బెందాళం రాజేష్‌లు విశాఖపట్నంలో నివాసముంటున్నారు. వీరిద్దరూ ఆదివారం కవిటి మండలం రాజపురంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి విశాఖ వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డు వైపు బోల్తాపడింది. ఈ ఘటనలో కూర్మనాయుకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజేష్‌కు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
ఆత్మ విశ్వాసమే ఆయుధం
టెక్కలి: విద్యార్థులు తమ కలలకు రెక్కలు తొడిగేలా ఆత్మ విశ్వాసమే ఆయుధంగా నిరంతరం ప్రణాళికతో చదివి విజయ శిఖరాలను అధిరోహించాలని సినీ నటు డు, మోటివేటర్ ప్రదీప్ కొండిపర్తి ఆకాంక్షించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన అలు మ్నీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయం ఒక్క రోజులో దక్కేది కాదని, నిరంతరం నేర్చుకోవడం, వైఫల్యాలను చవిచూడడం, వాటి ద్వారా పాఠాలను నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ ప్రయాణం గూర్చి కళాశాల యాజమాన్యం వివరించా రు. కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరెక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, మధుకుమార్, నాగశేషు, ప్రిన్సిపా ల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని కో–ఆర్డినేటర్ డి. యుగంధర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులకు మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్
ఆమదాలవలస: ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం అనకాపల్లిలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమా కోర్సు ల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 27వ తేదీన మాన్యువల్ స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీపాన నీలవేణి తెలిపారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలోగల ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం పరిధిలోని మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సిలింగ్‌కు అనుమతి లభించిందని అన్నారు. నార్త్ కోస్టల్ జోన్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ ఈ నెల 27వ తేదీ గురువారం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తొగ రాం ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రైవే టు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో మిగిలిన సీట్లను ఈ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని సీటు పొందలేని వారు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల ని సూచించారు. సందేహాల నివృత్తికి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నంబర్ 77023 94824 కు సంప్రదించాలని కోరారు. -
యూనియన్ బలోపేతమే లక్ష్యం
అరసవల్లి: యూనియన్‌లో గత మరకలను పూర్తిగా తొలిగించేలా చర్యలు చేపట్టామని.. ఎలాంటి విబేధాలు అంతర్యుద్ధాలు లేకుండా సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి పిలుపునిచ్చారు. శనివారం యూనియన్ గుర్తింపు చిహ్నమైన టవర్‌ను స్థానిక యూనియన్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టవర్లా సంఘ సభ్యులంతా క్రమశిక్షణతో ఉంటే మంచిగా సేవ చేసే పవర్ అందిస్తుందని గుర్తుచేశా రు.కార్యక్రమంలో 1104 సంఘ డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, డిప్యూ టీ జనరల్ సెక్రటరీ రాజేశ్వరరావు, రీజనల్ అధ్యక్షుడు టి.వి.సుబ్రహ్మణ్యం, రీజనల్ ప్రధా న కార్యదర్శి ఎన్.లోకేశ్వరరావు, ట్రెజరర్ శ్రీధ ర్, విశాఖపట్నం రీజనల్ కార్యదర్శి నూక రా జు, శ్రీకాకుళం బ్రాంచ్ అధ్యక్షుడు వి.నారాయణరావు, ఉమ, సూర్యనారాయణ, అచ్చెన్నాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: డోకులపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దుమ్ము పాపమ్మ (102) శనివారం మృతి చెందారు. పాపమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈమె భర్త, ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితమే చనిపోయారు. ప్రస్తుతం ఓ కుమారుడు, కుమార్తెతో పాటు మరో 15 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రకటించిన 2024–25 ఆర్థిక సంవత్సరపు వార్షిక పురస్కారాల్లో శ్రీకాకుళం జిల్లా రెండు కీలక అవార్డులను కై వసం చేసుకుంది. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగానికి గానూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎంపిక కాగా, పాత జిల్లాల విభాగంలో ఉత్తమ జిల్లా పురస్కారాల్లో ద్వితీయ స్థానానికి గానూ జాయింట్ కలెక్టర్, ఐఆర్సీఎస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఎంపికయ్యారు. సెప్టెంబరు 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఐఆర్సీఎస్ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) రాష్ట్ర గవర్నర్, సొసైటీ ప్రెసిడెంట్ చేతుల మీదుగా అవార్డులను అందజేయనున్నారు. పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తిగత ఆహ్వాన పత్రికలను ఐఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఈఓ ఎ.కె.పరిడా జిల్లాకు పంపించారు. కవిటి: దేశంలోనే ఏకై క భారత మాత దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన సీహెచ్ కపాసుకుద్ధి భారతమాత ఆలయం 22వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులంతా వేటకు విరామం ప్రకటించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో మహిళలు హాజరై సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఏకాహం భజన కాలక్షేపం నిర్వహించారు. -
సచివాలయ ఉద్యోగి మృతిపై సహచరుల ఆందోళన
ఇచ్ఛాపురం రూరల్: ఒకే ఉద్యోగం చేస్తున్న తమపై పలు కీలక బాధ్యతలు మోపడంతో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రౌతు మెహర్ శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ శనివారం నియోజకవర్గ స్థాయి సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇచ్ఛాపురం తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించి సంబంధిత అధికారులకు వినత పత్రాలు అందజేశారు. విపరీతమైన ఒత్తిడి మృతుడు మెహర్ ఒక్కరిపైనే డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్, మండల సెన్సస్ కో ఆర్డినేటర్, ఆధార్ ఆపరేటర్ వంటి కీలక బాధ్యతలు అప్పగించారని ఉద్యోగులు తెలిపారు. వీటికి తోడు రోజు వారీ సర్వీసులు, వివిధ ప్రభుత్వ సర్వేలు నిర్వహించాల్సి రావడంతో పని భారం విపరీతంగా పెరిగిందన్నారు. నిర్ణీత సమయంలో పలు రకాల విధులు పూర్తి చేయాలన్న ఒత్తిడితో ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు తెలిపారు. ఉద్యోగి మెహర్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర గ్రామ, వార్డు సచివాలయ సంఘం జేఏసీ కో ఆర్డినేటర్ కూన వెంకట సత్యన్నారాయణ, ఏఎస్ఈ స్టేట్ వైస్ ప్రసిడెంట్ షేక్ ఫరూక్, జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్లు ఉప్పాడ జైకృష్ణ. పొల్లాయి అశోక్, విజయకుమారీ, ప్రదీప్, అబ్ధుల్, సర్వేశ్వరరావు, కొప్పల రవిబాబు, వాసుదేవ్, సూర్యకుమారీ, సునీల్ గఫూర్, ప్రవీణ్, మీనాక్షి, కె.నీరజ తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ డాక్టర్ల నిరసన ర్యాలీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్లు శనివారం ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగిస్తూ దారి పొడవునా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా జాప్యం చేయడం తగదన్నారు. నిబంధనల ప్రకారం ఇవన్నీ తమకు రావాల్సి ఉందని, తాము అదనంగా ఏమీ అడగడం లేదని చెప్పారు. సోమవారం నాటికి సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న రాజు, డాక్టర్ రాజ్ సుదర్శన్, డాక్టర్ చాందిని, డాక్టర్ నరేంద్ర నాయక్, డాక్టర్ జాన్ వెస్లీ, డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ మురళి, డాక్టర్ శశిభూషణ్, డాక్టర్ సతీష్, డాక్టర్ దీపిక, డాక్టర్ హేమంత్, డాక్టర్ చానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్‌లో అఖిలభారత బహుభాషా నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్ : కళారంగానికి జీవం పోస్తూ నాటక రంగాన్ని ఆదరించేందుకు నిరంతరం కృషిచే స్తున్న శ్రీసుమిత్రా కళాసమితి పర్యవేక్షణలో సెప్టెంబర్ 17 నుంచి 20వ తేదీ వరకు అఖిలభారత బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. నగరంలోని అవోపా కల్యాణ మండపంలో శనివారం నాటికపోటీల బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బహుభాషా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరంలో నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి నాటిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. కోల్‌కతా, గౌహ తి, ముంబై, బెంగళూరు, రూర్కెలా, రాయ్‌పూర్, గుడివాడ, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల నుంచి కళాకారులు నాటికలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రోజుకు రెండు చొప్పున ప్రదర్శనలు జరుగుతాయ ని చెప్పారు. శ్రీసుమిత్రా కళాసమితి పిలుపుమేరకు పలు రాష్ట్రాల నుంచి ఎంట్రీలు వచ్చాయని, వాటిలో ఎంపిక చేసిన నాటికల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. నాటికలు ఇవే.. 17న బెంగాళీ కళాకారుల జ్వాలా, అస్సామీ బృందం జీవశ్రేష్ఠ్ నాటికలు, 18న మరాఠీ నాటిక సూప్, కన్నడ నాటిక సాంగ్యాచీబాల్యా, 19న ఒడియా నాటిక ఫేసెస్ ఆఫ్ ఉమెన్, ఛత్తీస్‌గఢ్ నాటిక యకీనన్, 20న హిందీ– పంజాబీ భాషలో స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, తెలుగు నాటిక ద్వారబంధాల చంద్రయ్యనాయుడు ప్రదర్శిస్తారని చెప్పా రు. కళాకారులు, కళాభిమానులు నాలుగు రోజులపాటు జరిగే బహుభాషా నాటికపోటీలను తిలకించి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో సుమిత్రా కళాసమితి సభ్యులు కొంక్యాన మురళీధర్, గుత్తు చిన్నారావు, పొన్నాడ వెంకట సత్యనారాయణ, నక్క శంకరరావు, కిల్లాన ఫల్గుణరావు, పీఏఎన్ శాస్త్రి, వీవీఆర్ మూర్తి, బత్తుల జ్యోతి, కర్రి అశోక్‌కుమార్, లాడి చంద్రశేఖర్, రాజు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ కోరితే భయమెందుకు?
కవిటి: డీఎస్సీ–2025 నిర్వహణలో చోటుచేసుకున్న ఆరోపణలు, అవకతవకలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు పట్టుబడతారనే భయంతో పాలకులు సభ నుంచి పారిపోవడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ సభ్యులు నర్తు రామారావు అన్నారు. శనివారం కొత్తపుట్టుగలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నాలుగు రోజులు పాటు జరిగిన శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఎటువంటి ఫలవంతమైన చర్చలకు అవకాశం లేకుండా ముగిసిపోవడం దురదృష్టకరమన్నారు. డీఎస్సీపై చర్చకు ప్రభుత్వాన్ని కోరితే కప్పదాటు ధోరణి అవలంబించిందన్నారు. ఒకవేళ నిష్పాక్షికంగా డీఎస్సీ నిర్వహిస్తే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఈ సమావేశాల ద్వారా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే.. సభను సజావుగా నిర్వహించలేదన్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి ప్రవేశవంతెన కూలిపోయి మూడేళ్లు గడిచిందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిన జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇదేనని ఎద్దేవా చేశారు. కిడ్నీ బాధిత ఉద్దాన ప్రాంతాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించాలన్నారు. దామోదరపురం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంలో టీడీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఓ గర్భిణి తన బిడ్డను కోల్పోయిందన్నారు. ఇచ్ఛాపురం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి ఎల్లో బోర్డు వాహనాలు ఫిట్నెస్ పరీక్షకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
● శ్రావణమాసంలో పెళ్లిళ్ల జోరు ● కళకళలాడుతున్న కల్యాణ మండపాలు ● వచ్చే నెల వరకూ శుభ ముహూర్తాలు ఆగస్టులో 23, 24, 26, 27, 28, 30, 31 సెప్టెంబర్‌లో 3, 4, 5, 6, 7 తర్వాత భాద్రపద మాసం ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్ : శుభ ముహూర్తాల శ్రావణమాసంలో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. నెలంతా మంచి ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలు కళకళలాడుతు న్నాయి. జిల్లా కేంద్రంతో పాటు టెక్కలి, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లో వివాహాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. పెళ్లంటేనే సందడి. జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను చిరకాలం గుర్తుండిపోయేలా కొందరు గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అతిథులను ఆకట్టుకునే విధంగా ఎటుచూసినా మిరుమిట్లు గొలి పే విద్యుత్ దీపాలు, షామియానాలు, ఇంద్రలోకంలో ఉన్నామా అనే తీరుగా సరికొత్త డెకరేషన్లతో అదరగొడుతున్నారు. వీటికి తోడు కడుపునిండా తినేందుకు వివిధ రకాల వంటకాలు, ఆహా అనిపించే ఆతిథ్యం అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకకు రూ.30లక్షల వరకు ఖర్చు చేసారంటే అతిశయోక్తి కాదు. సరికొత్త ఒరవడి.. గతంలో పెళ్లంటే బ్యాండ్‌మేళాలు, భాజాభజంత్రీ లు, పూలమండపాలు, వీడియో షూటింగ్‌లు ఉండేవి. ప్రస్తుతం కొత్త ఒరవడి కనిపిస్తోంది. వివాహ ముహుర్తానికి ముందే సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లకు ప్రకృతి సోయగాలున్న ప్రాంతాలకు వెళ్లడంతో పాటు సముద్రతీరాలకు వెళ్లి కాబోయే వధువరులతో ప్రత్యేక పాటలు రూపకల్పన చేస్తున్నారు. కొంతమంది కల్యాణ మండపంలోనే సెట్టింగులు వేసి షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు. మండపాలలో ఎల్ఈడీ స్క్రీన్లు వంటివి ప్రదర్శిస్తున్నారు. వరుసగా ముహూర్తాలు ఉండటంతో కల్యాణ మండపాలకు డిమాండ్ పెరిగింది. నగరంలో మండపాలతో పాటుగా నగరం వెలుపల ఉన్న రిసార్టులు, ఖాళీ ప్రదేశాలలో సెట్టింగులు, పెద్దపెద్ద ఫంక్షన్ హాళ్లు 25కు పైగా ఉన్నాయి. ఫంక్షన్‌హాలు బట్టి అద్దె వసూలు చేస్తున్నారు. మినీ ఫంక్షన్ హాలుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తుంటే పెద్దవాటికి రూ.3లక్షలకు పైగా అద్దెలు వసూలు చేస్తున్నారు. పూల డెకరేషన్, లైటింగ్, భోజనాల ఖర్చు వంటి వాటితో కలిపి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. -
వాషింగ్‌మిషన్ ప్లగ్ తీసేందుకు వెళ్లి..
శ్రీకాకుళం: పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన వివాహిత గొరకల చామంతి(35) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందింది. చామంతి ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్ మిషన్‌లో దుస్తులు ఉతకడం పూర్తయ్యాక ప్లగ్ తీసేందుకు వెళ్లింది. చేతులు తడిగా ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురైంది. ఆ సమయంలో పక్కనే ఉన్న కిటికీ ఐరన్ గ్రిల్స్‌ను పట్టుకోవడంతో కుడిచెయ్యి కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాతపడింది. చామంతి ఎప్పటికీ బయట కనిపించకపోవడంతో ఎదురింట్లో ఉంటున్న గొరకల హైమావతి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే చామంతి భర్త కృష్ణారావు, ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. బంధువుల సహకారంతో చామంతిని పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చామంతికి గొరకల కృష్ణారావుతో 16 ఏళ్లు కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గీతిక ఇంటర్ చదువుతుండగా, ఢిల్లేశ్వరి తొమ్మిదో తరగతి చదువుతోంది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే జాగ్రత్త అని చెప్పి భర్త కృష్ణారావు సొంత పనులపై బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణారావు ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అణువణువూ సమస్యలే!
రణస్థలం: అణు విద్యుత్ కేంద్రం (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్) ప్రతిపాదిత గ్రామమైన కొవ్వాడ సమస్యలతో సతమతమవుతోంది. ప్రాజెక్టు యాజమాన్య ప్రతినిధులు 2015, 2016 సంవత్సరాల్లో కొవ్వాడ పంచాయతీలో అణువిద్యుత్ కేంద్రం నిర్మిస్తామని సమావేశాలు నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని పెద కొవ్వాడ, చినకొవ్వాడ, గూడెం, రామచంద్రపురంతో పాటు టెక్కలి, జీరుకొవ్వాడ గ్రామాలు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాల్లో సుమారు 4500 మంది జనాభా ఉన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం 2017 ఏప్రిల్ 30 తేదీకి కటాఫ్‌గా నిర్ణయించి అప్పటి వరకు ఉన్న యూత్, జనాభా, ఇళ్లకు నష్టపరిహారం చెల్లించారు. 2016లో ఈ కేంద్రం తరఫున 2061.10 ఎకరాలకు భూమి సర్వే చేశారు. అందులో సుమారు 90 శాతం భూమికి యూత్ ప్యాకేజీ, అర్అండ్ఆర్ పరిహారం చెల్లించారు. ఈ పరిహారాల చెల్లింపునకు అప్పట్లో కేంద్రం రూ.500 కోట్లు నిధులు విడుదల చేసింది. కొన్ని సమస్యల వల్ల పరిహారం కొంతమేర పెండింగ్‌లో ఉంది. 1832 మందికి పునరావాస ప్యాకేజీ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాహకులు కొవ్వాడ పంచాయతీలో 1832 మందికి పునరావాస ప్యాకేజి సర్వే చేసి నష్టపరిహారం చెల్లించారు. ఆ సమయంలో వలస వెళ్లిపోవడం, ఇతర కారణాలతో మరో 33 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇప్పటికి ఎనిమిదేళ్లు గడుస్తున్నా పరిహారం ఊసే లేదు. 1710 ఇళ్లకు పరిహారం.. ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన 1710 ఇళ్లను గుర్తించి నష్టపరిహారం చెల్లించారు. ఇందులో కూడా 32 ఇళ్లకు పరిహారం చెల్లింపు పెండింగ్‌లో ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేకపోవడంతో కొత్తగా ఇళ్లు నిర్మిస్తే పరిహారం వస్తుందా లేదా అనే సంశయంతో కొందరు ఉన్నారు. కానరాని అభివృద్ధి.. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం వల్ల పూర్తిగా గ్రామాలను తొలగిస్తారనే ఉద్దేశంతో గ్రామంలో అభివృద్ధి పనులు సంవత్సరాల తరబడి నిలిపేశారు. దీంతో కాలువలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు ఎప్పుడు నిర్మిస్తారో కానీ అభివృద్ధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ చాలామంది ఊరికి దూరంగా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అణువిద్యుత్ కేంద్రం నిర్వాహకులు ధర్మవరం వద్ద పునరావాస కాలనీని త్వరితగతిన నిర్మించాలి. కొత్తగా ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ, కొత్త ఇళ్లకు సైతం నష్టపరిహారం చెల్లించాలి. గతంలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. ప్రాజెక్టు ఆలస్యం వల్ల గ్రామ అభివృద్ధి లేక, బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – అల్లిపల్లి అప్పన్న, మాజీ సర్పంచ్, కొవ్వాడ పంచాయతీ ధర్మవరం వద్ద పునరావాస కాలనీ నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్ కాంట్రాక్ట్‌కు అప్పగించాం. వారు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. ఇందు కోసం 190.07 ఎకరాలు కేటాయించాం. ఆ గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో అటవీ శాఖ భూములు 49హెక్టార్లు ఉన్నాయి. ఆ భూముల బదలాయింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ అనుమతులు కోసమే ఏళ్ల తరబడి తీవ్ర జాప్యం జరిగింది. అతి త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తయితే పునరావాస కాలనీ నిర్మాణం ప్రారంభమవుతుంది. – రవి కుమార్, చీఫ్ ఇంజినీర్, ఎన్పీసీఐఎల్ పంచాయతీ పరిధిలో 18 ఏళ్లు నిండిన సీ్త్ర, పురుషులు సుమారు 650 మందికి పైగా ఉన్నారు. పునరావాస కాలనీ లేకపోవడంతో కొత్తగా పెళ్లిళ్లు అవుతున్న జంటలకు ఇళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 400 మంది కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నారు. కొత్త ఆర్అండ్ఆర్ ప్యాకేజి, కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని, పెండింగ్ సమస్యలు పూర్తి చేయాలని, ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో పునరావాస కాలనీ త్వరితగతిన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధికి నోచుకోని కొవ్వాడ గ్రామం భూసేకరణ, ప్రహరీ నిర్మాణంతో ఆగిన పనులు పెండింగ్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎదురుచూపులు కొత్త ఇళ్ల నిర్మాణాలకూ పరిహారం అందించాలంటున్న గ్రామస్తులు -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ సంస్థల్లో జరుగుతున్న అన్యాయాలపై వినతులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్య వైఖరి మార్చుకోని పక్షంలో ఉద్యమాలు తప్పవని దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇలిసిపురంలో అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక సమన్వయ సమావేశం జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. దళితులు, కాంట్రాక్టు కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, దళిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. శ్రీకాకుళం రిమ్స్‌లో తొలగించిన 23 మంది పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పాతపట్నం అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో చింతల పూజ అసహజ మరణానికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, మందస మండలం కొంకడాపుట్టి గ్రామానికి చెందిన దళిత మహిళా రైతు ఉరజాన లక్ష్మి భూమిని ఆక్రమించుకున్న గ్రామ పెత్తందారుల నుంచి ఆ భూమిని స్వాధీనం చేసి ఆమెకు తిరిగి అప్పగించాలని, గార కేజీబీవీలో తొలగింపునకు గురైన కాంట్రాక్టు ప్రిన్సిపాల్, అకౌంటెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును సమావేశం తీవ్రంగా ఖండించారు. సమావేశంలో దళిత జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహన్‌రావు, దళిత జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.అనంతరావు, ఆప్కాస్ జాయింట్ సెక్రటరీ పి.ప్రసాదరావు, అంబేడ్కర్ యువజన సంఘం ఇన్చార్జిలు రాకోటి రాంబాబు, జి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
* ఏడాది * సాగు విస్తీర్ణం
● గిట్టుబాటు ధర కల్పించక పంట వేయని రైతులు ● ప్రభుత్వ సహకారం లేక మూతపడుతున్న షుగర్ ఫ్యాక్టరీలు ● ఏటా తగ్గుతోన్న సాగు విస్తీర్ణం ● పాత శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సంకిలి సుగర్ ఫ్యాక్టరీ మూతపడనున్న వైనం 2023● క్రషింగ్ నిలిపివేత శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గత కొన్ని సంవత్సరాలుగా చెరుకు సాగు తగినంతంగా లేకపోవడం వల్ల డిసెంబర్ 2027 నుంచి మార్చి 2028 వరకు ప్రతిపాదించిన చెరకు క్రషింగ్ నిలిపివేయనున్నట్లు ఈఐడీ ప్యారీ ఇండియా లిమిటెడ్ సంకిలి మేనేజ్మెంట్ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం నెలకొన్న సూపర్ ఎల్‌నినో పరిస్థితుల వల్ల ఈ సీజన్లో చెరుకు క్రషింగ్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు గమనించి చెరుకు సాగు చేపట్టకుండా ఉండాలని కోరారు. 1575 హెక్టార్లు 20241102 హెక్టార్లు 2025895 హెక్టార్లు 2026శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పంచదార చేదెక్కింది. వారం రోజుల వ్యవధిలోనే రూ.25 వరకు ధర పెరగడంతో కిలో పంచదార ఏకంగా రూ.75కు చేరుకుంది. దీనికి తోడు చెరుకు రైతులకు ప్రభుత్వ సాయం లేకపో వడంతో పంట వేయడం లేదు. ప్రభుత్వం కూడా వ్యవసాయాధారిత ఫ్యాక్టరీలు షుగర్, జ్యూట్, రైస్ మిల్లర్లకు రుణాలు, సబ్సిడీలు తగ్గించేసి పొమ్మనలేక పొగపెడుతోంది. సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం మొండిచేయి గత 40 ఏళ్లుగా పాలకొండ మండలం సంకిలి సుగర్ ఫ్యాక్టరీ నుంచి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, రవాణా చార్జీలు ఇచ్చేవారు. దీంతో రైతులు చెరుకు పండించేందుకు ముందుకు వచ్చేవారు. సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రాయితీలిచ్చి సహకరించేది. కానీ చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీని కాపాడే పనులు చేయ డం లేదు. దీంతో సంకిలి సుగర్ ఫ్యాక్టరీలో సుగర్‌కి సంబంధించి అన్ని ఉత్పత్తులు ఆపేసి కేవలం ఇథనాల్ మాత్రమే తయారు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం సహకారం అందించకపోవడమే సుగ ర్ ఫ్యాక్టరీల మూతకు కారణమని తేటతెల్లమైంది. తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం చెరుకు పండించే రైతుకు ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడం మానేసింది. రాయితీలు ఇచ్చే కంపెనీలను సైతం ప్రోత్సహించడం లేదు. దీంతో కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి సుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఇటు రైతులు సైతం చెరుకు వేయడానికి ఇష్ట పడడం లేదు. దీని ప్రభావం ధరలపై పడింది. గత వారం రోజుల్లోనే పంచదార ధర రూ.50 నుంచి రూ.75కు చేరుకుంది. నిత్యావసరా ల సరుకుల ధరలు పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని జనం మండిపడుతున్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు మరిచిపోయి జనంలో కూటమి సర్కారు అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇప్పుడు ధరల నియంత్రణ కూడా చేయకపోవడం సామాన్యులకు శరాఘాతమవుతోంది. 560 హెక్టార్లు -
సచివాలయంలో చోరీ
రణస్థలం: జె.ఆర్.పురం–2 గ్రామ సచివాలయంలో గురువారం రాత్రి చోరీ జరిగినట్లు పంచాయతీ కార్యదర్శి వి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ రెవెన్యూ కార్యదర్శి బలివాడ శంకర్ సచివాలయం వద్దకు వెళ్లేటప్పుడు తాళం పగుల కొట్టి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రెండు టీవీలు, ప్రింటర్, రెండు మానిటర్లు, కొత్త కంప్యూటర్ వంటి వస్తువులు కనిపించలేదు. ఇటీవల పాతర్లపల్లి, పిసిని సచివాలయాల్లో ఇలానే చోరీలు జరగడం పోలీసులకు సవాల్‌గా మారింది. జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–పూండి రైల్వే స్టేషన్ పరిధిలో గరుడఖండి సమీపంలో శుక్రవా రం గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 60 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ జాకెట్, లేత గులాబీ రంగు చీర ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వివరాలు తెలిస్తే 9247585738 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. ఇచ్ఛాపురం–జాడుపూడి రైలు నిలయం మధ్య.. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం – జాడుపూడి రైలు నిలయం మధ్య ఆఫ్‌లైన్ ట్రాక్‌లో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ డి.శ్రీనివాసరావు తెలిపా రు. పలాస వైపు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, పసుపు షర్ట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పలా స జీఆర్పీ ఎస్సైని సంప్రదించాలని కోరారు. ‘అర్హుల పేర్లు తొలగకూడదు’ శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అత్యంత పారదర్శకంగా, సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుంటూ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా జాబితా ఆధారంగా, గత జాబితాతో అనుసంధానం కాని లేదా పొరపాట్లు ఉన్న వ్యక్తులకు తక్షణమే ఈఆర్వో ద్వారా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 97.27 శాతం నోటీసులను విజయవంతంగా అందజేశామని కలెక్టర్ వెల్లడించారు. -
సిక్కోలు ఆదరణ మరువలేను
● సినీహీరో సుమంత్ శ్రీకాకుళం అర్బన్: సెప్టెంబరు 11న విడుదల కానున్న మహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆ చిత్ర హీరో సుమంత్ కోరారు. ‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళంలోని ఎస్వీసీ థియేటర్లో ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ చిత్ర యూనిట్‌కు ఎస్వీసీ థియేటర్ మేనేజర్ రవి ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఎస్వీసీ థియేటర్లో ఏర్పాటు చేసిన వారాహి అమ్మవారికి హీరో సుమంత్ పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమంత్ మాట్లాడారు. గతంలో తాను శ్రీకాకుళం వచ్చానని, ఇక్కడి ఆదరణ మరువలేనని అన్నారు. మహేంద్రగిరి వారాహి సిని మా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందన్నారు. చిత్ర హీరోయిన్ మల్లికా గోస్వామి మాట్లాడుతూ తాను శ్రీకాకుళం రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రే క్షకులు చిత్ర ప్రేమికులని, మంచి చిత్రం అయి తే ఎంతో ఆదరిస్తారని తెలిసిందని, ఈ చిత్రం కూడా ఎంతో బాగా వచ్చిందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలన్నారు. నాలుగో రోజుకు చేరిన జూడాల నిరసన దీక్షలు శ్రీకాకుళం: రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన దీక్షలు శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు చెవిలో పూలు పెట్టుకొని వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. శుక్రవారం నాటి నిరసన శిబిరంలో డాక్టర్ మోహిత్, డాక్టర్ మణికుమార్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ రమ్య, డాక్టర్ రిజ్వియా, డాక్టర్ ఆర్సియా, డాక్టర్ హయేషా, డాక్టర్ సంపద తదితరులు పాల్గొన్నారు -
4 నుంచి కూర్మలో కృష్ణాష్టమి వేడుకలు
హిరమండలం: శ్రీకృష్ణాష్టమి వేడుకలకు కూర్మ గ్రామం ముస్తాబవుతోంది. సెప్టెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు హారతితో వేడుకలు ప్రారంభమై అర్ధరాత్రి 12.30 గంటల వరకూ కొనసాగుతాయి. మరుసటి రోజు ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకూ నగర సంకీర్తనలు, ప్రవచనాలు, పాదుకాభిషేకం, మంగళహారతి ఉంటాయి. వేడుకలతో పాటు రెండు రోజులు జరిగే అన్నదాన కార్యక్రమాలకు దాతలు, భక్తులు సహకారం అందించవచ్చని శ్రీకూర్మ వైదిక గ్రామ నిర్వాహకులు కోరారు. ‘ఆదిత్య’లో ప్రత్యేక కార్యక్రమాలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ నెల 22, 26, 29 తేదీలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుత మంగళవారం జరిగే అలుమ్నీ డే కార్యక్రమానికి సినీ నటుడు ప్రదీప్ కొండపర్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. 26న సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ కె.హరిబాబు, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.మధుమూర్తి అతిథులుగా హాజరవుతారని తెలిపారు. 29న సీఐఐ–ఐతం ఇండస్ట్రీ సమావేశానికి సీఐఐ వైస్ చైర్మన్ జి.సాంబశివరావు, శ్రవణ్ షిప్పింగ్ ఎండీ డి.రామకృష్ణ, ఎల్అండ్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సి.జయకుమార్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. ఐఓటీ, ఏఐ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యా ప్రమాణాలు పెరగాలి శ్రీకాకుళం రూరల్ : విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. గురువారం పెదపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వసతులు, విద్యాభ్యాసం, ఇతరత్రా కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏటీఎల్ ల్యాబ్‌ను సందర్శించి విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానం, నూతన ఆవిష్కరణలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా, శ్రీకాకుళం ఆర్డీవో ప్రత్యూష, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపాధి శిక్షణ ఎచ్చెర్ల : మండలం కేంద్రం ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యువతకు సెల్‌ఫోన్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని సంస్థ డైరెక్టర్ రామ్‌జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9553410809, 7993340407 నంబర్లను సంప్రదించాలని కోరారు. బెల్లం ఊట, సారా నిల్వలు ధ్వంసం కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీస్‌సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. సోంపేట, కంచిలి మండలాలకు ఆనుకొని ఉన్న గొంగాపూర్, రామచంద్రపూర్ గ్రామాల సరిహద్దులో నిల్వ ఉంచిన బెల్లం ఊటలు, నాటుసారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు. ఆయా గ్రామాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 7600 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊట, రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 380 లీటర్లు నాటుసారాను ధ్వంసం చేశారు. ఈదాడుల్లో సోంపేట, పలాస, కోటబొమ్మాళి టాస్క్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, సిబ్బంది, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కుమార్, మురళీధర్, సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ, పలాస సీఐ మల్లికార్జునరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ మధుకుమార్, సిబ్బంది, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ సపోర్టు
పరిశ్రమలకు రూటు● మూలపేట పోర్టుతో పరిశ్రమల రాకకు మార్గం సుగమం ● పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోరమాండల్ యాజమాన్యం ● నెరవేరుతున్న సిక్కోలు ప్రజల కల మూలపేట పోర్టుతో తీర ప్రాంత అనుబంధ పరిశ్రమలు, సముద్ర ఆధారిత పరిశ్రమల ఏర్పాటే లక్ష్యంగా వైఎస్ జగన్ ఆలోచన చేశారు. దానిలో భాగంగా పరిశ్రమలు రాబోతున్నాయి. ఇప్పటికే కోరమండల్ యాజమాన్యం ముందుకువచ్చింది. రసాయన పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. 450 ఎకరాల్లో రూ.2,250కోట్ల వ్యయంతో పరిశ్రమ నిర్మించనుంది. రెండు వేల టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్, 650 టన్నుల పాస్పారిక్ యాసిడ్, వెయ్యి టన్నుల జిప్సం ప్లాస్టర్ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమను కోరమండల్ యాజమాన్యం ఏర్పాటు చేయబోతోంది. దీని వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించడమే కాకుండా జిల్లాకు పారిశ్రామిక ఆదాయం పెరుగుతుంది. సహజంగా ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటుకు సముద్ర మార్గంలోనే ముడి పదార్థాలు దిగుమతి అవుతాయి. ఎక్కడైతే తీర ప్రాంతంలో పోర్టు ఉంటుందో అక్కడే ఫెర్టిలైజర్ పరిశ్రమలు ఏర్పాటు అవుతుంటాయి. పోర్టుకు దగ్గరగా ప్లాంట్ ఏర్పాటు జరిగితే రవాణా వ్యయం తగ్గి ఆ ప్లాంట్ అభివృద్ధిలో నడుస్తుంది. ఆ కారణాలతోనే ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఈ రకమైన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడా జాబితాలోకి మూలపేట పోర్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా చేరబోతోంది. ఫెర్టిలైజర్ ప్లాంట్లకు పోర్టులే మూలధారం. వైఎస్ జగన్ కృషితో ఇప్పుడవి వస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్ జగన్ దార్శనికతతో సిక్కోలు కలలు నిజమవుతున్నాయి. దశాబ్దాల పాటు ఎన్నికల హామీగానే మిగిలిపోయిన మూలపేట పోర్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టాలెక్కించిన సంగతి జిల్లా వాసులందరికీ తెలుసు. భూమి సేకరించి, టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టి ఆగమేఘాల మీద ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ఇచ్చిన సపోర్టుతో సిక్కోలుకు పరిశ్రమల రాక మొదలవుతోంది. మూలపేట పోర్టు ఏరియాలో కోరమండల్ రసాయన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా వాసులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వైఎస్ జగన్ నిర్మించిన మూలపేట పోర్టు ఆ కలను సాకారం చేస్తోంది. ఎన్నికల ముందే 70 శాతం పనులు పూర్తి.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో వలసలు తగ్గించేందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టింది. రూ. 4,361.91కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 70శాతం పనులు పూర్తయ్యాయి. ఈ లోగా ప్రభుత్వం మారడంతో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పనులను తీవ్ర జాప్యం చేసింది. వైఎస్ జగన్‌కు క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో తాత్సారం చేసినా మారిటైం బోర్డు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోర్టు మిగతా పనులు పూర్తిగా చేయక తప్పడం లేదు. వైఎస్ జగన్ చొరవతో జిల్లా వాసుల కల నెరవేరబోతోంది. చంద్రబాబు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ పోర్టు ఆలోచన చేయలేదు. బావనపాడు పోర్టు వస్తుందంటూ ఇదిగో అదిగో అని చెప్పుకుని రావడం తప్ప పోర్టు నిర్మాణానికి కృషి చేయలేదు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోర్టు నిర్మాణంపై దృష్టి సారించారు. నిధుల సేకరణకు ప్రత్యేకంగా మారిటైం బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా భూసేకరణ దగ్గర నుంచి పునరావాస కాలనీ వరకు పూర్తి చేశారు. పోర్టుకు శంకుస్థాపన చేసి, పనులు చకచకా చేపట్టారు. పోర్టు పనులకు సమాంతరంగా రోడ్లు, రైల్వే లైన్ పనులు నిర్వహించారు. మొత్తానికి ఆయన అధికారంలో ఉండగానే 70శాతం పనులు పూర్తిచేశారు. మిగతా 30శాతం పనులు పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగా చంద్రబాబు ప్రభు త్వం సమయం తీసుకుంది. ఏదేతైనేమి సిక్కోలు వాసుల కళ్లముందే పోర్టు నిర్మాణం జరుపుకుంది. అందుబాటులోకి రానుంది. -
జీతాలు చెల్లించాలని వాహన సిబ్బంది నిరసన
సంతబొమ్మాళి: జీతాలు చెల్లించాలంటూ మూలపేట పోర్టులో ఫోర్ వీలర్ వాహన సిబ్బంది శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మినరల్ వాటర్ ట్యాంక్, మెస్‌కు పోర్టు ఉద్యోగులు ఎవరూ వెళ్లకుండా తమ వాహనాలను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేశారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, అడిగిన ప్రతి సారి కుంటి సాకులు చెప్పి పోర్టు యాజమాన్యం కాలయాపన చేస్తోందని వాహన సిబ్బంది మండిపడుతున్నారు. ఇలా మూడోసారి నిరసన వ్యక్తం చేశామని అయినా పోర్టు యాజ మాన్యం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆకలి బాధలు తెలియాలని తాగునీరు, ఆహారం పోర్టు యాజమాన్యానికి అందకుండా అడ్డంగా వాహనాలను పెట్టామని తెలిపారు. చివరికి గత్యంతరం లేక పోర్టు యాజమాన్యం ఒక రోజు గడువు కోరి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వాహన సిబ్బంది వెనుతిరిగారు. -
ప్రాణం అలసిపోతోంది..!
● తీవ్ర ఒత్తిడిలో సచివాలయ ఉద్యోగులు ● సర్వేల నిర్వహణ బాధ్యతలన్నీ వీరిపైనే ● ఏకంగా 38 రకాల సర్వేల నిర్వహణలో బిజీబిజీ ● పని ఒత్తిడితో మరణిస్తున్న ఉద్యోగులు అరసవల్లి: సచివాలయం.. ఈ పేరే కొందరు ‘పెద్దలకు’ ఇష్టం లేనట్టు ఉంది. లక్షలాది మంది యువతకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసిన ఈ ఆలయాల్లో ఇప్పుడు చావు డప్పులు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖ రి.. వారి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులన్న కనీస గౌరవం లేకుండా ప్రతి చిన్న పనినీ వారికే అప్పగిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏకంగా 38 రకాల సర్వేలంటూ ఊరంతా తిప్పుతుండడంతో తట్టుకోలేక చాలా మంది ప్రాణా లే వదిలేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఒత్తిళ్లకు తాళలేక గుండెపోటుతో కొందరు, బ్రెయిన్ స్ట్రోక్‌తో కొందరు మృత్యువాతకు గురయ్యారు. తాజాగా గార మండలానికి చెందిన రౌతు మెహర్ అనే డిజిటల్ అసిస్టెంట్ ఇచ్ఛాపురం మండలం మండపల్లి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రాణాలు కోల్పోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇది నాలుగో మరణంగా నమోదై సంచలనమైంది. సచివాలయ వ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 75కు చేరిన మరణాలు జిల్లాలో సచివాలయ ఉద్యోగుల మరణాలు నాలుగుకు చేరాయి. విధుల్లో లేని సమయాల్లో మరో ఇద్దరు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ట్విట్టర్ క్యాంపెయిన్ సమాచారం మేరకు 2024 సెప్టెంబర్ నుంచి ఈ నెల 15వ తేది లోపు సుమారు 75 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని సంఘం సభ్యులు ప్రకటిస్తున్నారు. 30 ఏళ్ల వయస్సులోపు యువ ఉద్యోగులు ఇలా ప్రాణాలను కోల్పోతుంటే, సర్కార్ మొద్దు నిద్ర నటిస్తూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మన జిల్లాలో కూడా ఇప్పటికే నాలుగు మరణాలు సంభవించగా వివిధ కారణాలు చూపి రాజీనామా లు చేసిన వారి సంఖ్య పదుల్లో ఉంది. మరికొందరు లాంగ్ లీవ్ అంటూ సేవలకు దూరమయ్యారు. జిల్లాకు సంబంధించి అయితే లావేరు, శ్రీకాకుళం మండలాల్లో ఇద్దరు గుండెపోటుతో మృతిచెందారు. అయితే గత ఏడాది తీవ్ర ఒత్తిళ్లతో లావేరు మండలం బుడతవలస సచివాలయ సర్వేయర్‌గా పనిచేస్తున్న పొట్నూరు రాఘవరావు గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే జిల్లా కేంద్రంలో నగరపాలక సంస్థ సచివాలయ వార్డు ఎమినిటీ సెక్రటరీ పల్లె దాలినాయుడు అనే ఉద్యోగి కూడా బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన ఘటన చోటుచేసుకుంది. ఒత్తిడితోనే విధులు ప్రతి నెలా ఏకంగా 38 సర్వేలను చేయడం టార్గెట్‌గా చేసుకుంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర సర్వే, పీఎం కిసాన్ డ్రోన్స్ ఓబురేషన్ స ర్వే, ఎన్సీడీసీ సర్వే, ఇ–క్రాప్ బుకింగ్ సర్వే, ఎఫ్ఎం సర్వే, ఆధార్ సర్వే, కౌశలం సర్వే, మనమిత్ర ద్వారా అందిస్తున్న 564 సేవలపై సర్వే, కొత్త రేషన్ కార్డుల సర్వే, బయోమెట్రిక్ అప్డేషన్ సర్వే, పి–4, పాస్‌బుక్స్ సర్వే, ఎహెచ్ఎస్ సర్వే, అభ సర్వే, సెమి ఆర్ఫన్ సర్వే తదితర 38 రకాల సర్వేలతో పాటు నెలవారీ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, ఆఖరికి బూత్‌లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓ) బాధ్యతలను, సెన్స స్ కూడా సచివాలయ ఉద్యోగులు చేపట్టాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. దీంతో పాటు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో తిట్లు, చీవాట్లు నిత్యకృత్యం. ఇలాంటి దుర్భర పరిస్థితుల నడుమ సచివాలయ ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు. దీనికి తోడు చిన్నపాటి కారణాలు చూపుతూ, ఐవీఆర్ఎస్ కాల్స్ సాకుగా చూపుతూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ‘స్థానిక’ ఎన్నికలంటూ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో మరెంత ఒత్తిడి పెరుగుతుందో అని ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సచివాలయ ఉద్యోగులకు ఉన్న విధులతో పాటు 38 సర్వేలను చేస్తూనే ఎన్నికల బీఎల్ఓ విధులను కూడా కట్టబెట్టారు. ఇవే తీవ్ర ఒత్తిడి పెంచి మా ప్రాణాలపైకి తెస్తున్నాయి. బీఎల్ఓ అధికారాలు 14 ప్రభుత్వ ఉద్యోగ శాఖలకు ఉన్నప్పటికీ, కేవలం సచివాలయ ఉద్యోగులకే కట్టబెడుతూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిపోయింది. ఇప్పటికే అధికారికంగా నలుగురు ఉద్యోగులు ఒత్తిళ్లతోనే మృత్యువాత పడ్డారు. తాజాగా రౌతు మెహర్ కూడా డిజిటల్ అసిస్టెంట్ విధులతో పాటు సెన్సస్ టెక్నికల్ మండల కోఆర్డినేటర్ బాధ్యతలు కూడా ఇవ్వడంతో ఒత్తిడి పెరిగి బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యాడు. ఈ మరణాలన్నీ సర్కార్ హత్యలుగానే భావిస్తున్నాం. దీనిపై నిరసన కార్యక్రమాలను నేటి (శనివారం) నుంచి ప్రారంభిస్తాం. – కూన వెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘ జేఏసీ ప్రతినిధి -
తైక్వాండో స్టేట్‌మీట్ ప్రారంభం
● రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు ● మూడు రోజులపాటు నిర్వహణ శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్–2026 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్దగల వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా జరుగుతున్న మూడు రోజుల స్టేట్‌లెవల్ తైక్వాండో పోటీల సమరం ఆరంభమైంది. న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్, కేడిట్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 700 మంది వరకు బాలబాలికలు, సీ్త్ర పురుషులు హాజరయ్యారు. వీరికి నిర్వహణ కమిటీ ప్రతినిధులు సౌకర్యాలు, వసతులు, భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నారు. ఇక్కడ పోటీల్లో విజేతలగా నిలిచిన క్రీడాకారులకు శిక్షణా శిబిరాలను నిర్వహించి.. ఆలిండియా నేషనల్ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు సన్నద్ధం చేస్తామని న్యూ ఏపీ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.వేణుగోపాలరావు వెల్లడించారు. మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ.. మార్సల్ ఆర్ట్స్‌లో తైక్వాండోకు విశిష్టమైన ఖ్యాతి, గుర్తింపు ఉందని.. ఆత్మరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ పోటీలను న్యూ ఏపీ తైక్వాండో అససియేషన్ కార్యదర్శి, సీహెచ్ వేణుగోపాలరావు, అధ్యక్షుడు అచ్చంనాయుడుతో కలిసి సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక వేత్త సూర శ్రీనివాసరావు, ప్రముఖ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొండు గంగాధర్, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణా స్టేట్ కార్యదర్శి కె.శ్రీహరి, తదితరులు ముఖ్య అతిధులగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్జున్‌రాయ్ హారికాప్రసాద్, గేదెల ఇందిరాప్రసాద్, శాసనం జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాలరావు, రెడ్డి శివకుమార్, కొమర మోహన్‌కృష్ణ, సుధీర్, తారక్, వివిధ జిల్లాల తైక్వాండో సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
అదనపు బాధ్యతల ఒత్తిడితోనే..
ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ, సెన్సెస్ మండల సమన్వయకర్తగా, బీఎల్ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రౌతు మెహర్ శుక్రవారం మృతి చెందాడు. విధుల ఒత్తిడి కారణంగానే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తోటి సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గార మండలం ఆరంగిపేటకు చెందిన మెహర్ రెండేళ్ల క్రితం బదిలీపై మండపల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. శుక్రవారం ఎం.తోటూరు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆధార్ క్యాంపు నిర్వహిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సహోద్యోగులు తెలిపారు. అనంతరం ఆయన్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ స్ట్రోక్‌గా పరిగణించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బరంపురం తరలిస్తుండ గా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఉద్యోగులపైనే అదనపు విధులు మోపుతున్నారని అంటున్నారు. -
చిన్నమ్మడు ఏమైనట్టు?
● వృద్ధురాలి అదృశ్యంపై దర్యాప్తు ముమ్మరం ● సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు నరసన్నపేట: జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 17న నరసన్నపేటకు వచ్చిన చిన్నమ్మడు తర్వాత ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు 19న జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియక పోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎవరి ఇంటికీ వెళ్లలేదని తెలియడంతో ఏదైనా ప్రమాదానికి గురైందా.. ఇతర సంఘటన జరిగిందా అని అనుమానిస్తున్నారు. పోలీసులు సైతం రెండు రోజులుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. 17న నరసన్నపేట కాంప్లెక్స్‌లో బస్సు దిగిన చిన్నమ్మడు పాతబస్టాండ్, పోస్టాఫీసు, పోలీసు స్టేషన్ రోడ్డు మీదుగా ఆసుపత్రికి వెళ్లే దారిలో ఓ మహిళా న్యాయవాదిని 12 గంటల సమయంలో కలిశారు. అక్కడి నుంచే హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు చింతు శంకర్‌నారాయణతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత ఆచూకీ కనిపించలేదు. గ్రామంలో చిన్నమ్మడు ఇంటికి పాలు తీసుకువెళ్లే వ్యక్తి ఎప్పట్లా 18న ఉదయం పాలు గడపలో పెట్టాడు. సాయంత్రం కూడా మళ్లీ పాలు తీసుకెళ్లగా ఉదయం పాలు అలానే ఉండటంతో అనుమానంతో గ్రామంలోనే ఉన్న సమీప బంధువు సత్యనారాయణకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇతర కుటుంబ సభ్యులకు, కుమారులకు సమాచారం ఇవ్వగా ఎక్కడికీ రాలేదని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై 12 తులాల ఆభరణాలు.. ఆమె ఇంటి నుంచి బయలుదేరే సమయానికి ఒంటిపై 12 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటి కోసం ఎవరైనా ఏమైనా చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరసన్నపేటకు వచ్చిన ఆమె తిరిగి బస్సులో వెళ్లిన ఆనవాళ్లు కనిపించడం లేదు. పోలీసులు మెయిన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న పలు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శుక్రవారం డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఆస్పత్రి రోడ్డులో ఒక ఇంటికి వచ్చి డాగ్‌స్క్వాడ్ ఆగింది. మేడపైకి ఎక్కి మరెక్కడికీ వెళ్లకపోవడంతో ఆ ఇంటి వద్ద ఏదైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డోన్ కెమెరాతో నరసన్నపేట పరిసరాలను పరిశీలించారు. కాగా, వృద్ధురాలి భర్త పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసి పదవీ విరమణ పొంది ఇటీవల మరణించారు. నరసన్నపేటకు చెందిన ఓ అనుమానితుడు గొట్టిపల్లికి చెందిన రెండు కార్లు అద్దెకు తీసుకొని హిరమండలం వైపు బాగిరెడ్డిపురం వరకూ వెళ్లినట్లు సాంకేతిక ఆదారాలు పోలీసులు సేకరించారు. ఆమె సమీప బంధువు సత్యనారాయణ కూడా ఏఎస్ఐగా పదవీ విరమణ పొందారు. పోలీసుల కుటుంబానికి చెందిన చిన్నమ్మడు ఇలా అదృశ్యం కావడంతో పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి ఎస్సైలు బి.గణేష్, అశోక్‌బాబు, అనిల్‌కుమార్, రంజిత్ తదితరులు నాలుగు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారు. -
డాక్టర్ దానేటి శ్రీధర్‌కు జాతీయ అవార్డు
శ్రీకాకుళం: నగరానికి చెందిన ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణుడు డాక్టర్ దానేటి శ్రీధర్ గురువారం కేంద్ర మంత్రి శశిథరూర్ చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఆన్లైన్ ద్వారా జాతీయస్థాయిలో పలు వర్గాల నుంచి 2047 నాటికి భారత దేశ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అభిప్రాయాలను సేకరించింది. ఇందులో డాక్టర్ శ్రీధర్ ఆరోగ్య సమాజ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తీసుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న సీ్త్రలను సైతం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో తొలిగా ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించానని, తక్కువ ఖర్చుతో ఈ సేవను అందిస్తూ వచ్చానని, సీ్త్రలలో ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తుండగా దానిపై ఉన్న అపోహతో చాలామంది నిరాకరిస్తుండగా తాను సుమారు 150 మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేసి నమ్మకం వచ్చేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. -
మందుల దందా!
అరసవల్లి : జిల్లా వైద్యారోగ్య శాఖలో ఏ విభాగాన్ని కదిపినా అవినీతి కంపే వస్తోంది. పెద్దస్థాయి ఉద్యోగుల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వరకు చాలామందికి తెరవెనుక వ్యాపారాలు, వ్యవహారాలే ప్రాధ్యాన్యతగా కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘అక్రమాల సీను’ వ్యవహారాల్లో కూడా ‘మందుల’ ఏజెన్సీ లీలలు జిల్లా వైద్యారోగ్య శాఖకు అక్రమాల మచ్చను తెచ్చిపెడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రముఖ ఆస్పత్రులతో పాటు మంచి ప్రాక్టీస్లున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు లెక్కకు మించి, అవసరాలకు మించి మందులను కొనుగోలు చేసుకునేలా అత్యధిక ఆస్పత్రుల్లో వ్యవహారాలు నడుస్తున్నాయి. అదో రకమైన దందా అయితే.. అనధికారిక డెమో అవతారమెత్తిన సదరు హెల్త్ అసిస్టెంట్ తనకున్న ఏజెన్సీకే మందుల ఇండెంట్ ఇవ్వాలని..లేదంటే ఆస్పత్రుల్లో సౌకర్యాల లోపాలపై నివేదించి జరిమానాలు విధిస్తా...అంటూ మరో కొత్త దందాకు తెరలేపారు. ఇండెంట్ ఇవ్వకపోతే.. జిల్లాలో పలు పట్టణాలతో పాటు జిల్లా కేంద్రంలో అత్యంత ఆధునిక వసతులతో వందలాది బెడ్లుతో ప్రైవేటు కార్పోరేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం వివిధ రకాల ప్రైవేటు వైద్య కేంద్రాలు 435 వరకు ఉన్నాయి. వీటిలో పోలిక్లినిక్స్ 26, డెంటల్ క్లినిక్స్ 59, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ 172, ల్యాబ్స్ 110, హైఎక్విప్డ్ ల్యాబ్స్ 13, ఫిజియోథెరపీ కేంద్రాలు 06, క్లినిక్స్ 49 వరకు ఉన్నాయి. కొత్త క్లినిక్‌లకు రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌కు..ప్రభుత్వానికి రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. మొదట మూడు నెలలకు అనుమతిచ్చి తర్వాత డెమో అధికారిక బృందం తనిఖీల అనంతరం అన్ని నిబంధనల ప్రకారం ఉంటే ఐదేళ్లకు రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. తర్వాత రెన్యువల్స్ చేయించాల్సి ఉంటుంది. అదే స్కానింగ్ సెంటర్లు అయితే ప్రతి 3 నెలలకు డెమో విభాగమే తనిఖీలు చేసి సర్టిఫై చేస్తుండాలి. ఇదే అదనుగా తెరవెనుక సదరు హెల్త్ అసిస్టెంట్‌తో పాటు డెమో సిబ్బంది అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు ఫిర్యాదులు కూడా చేశారు. మరోవైపు వైద్యశాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చేయాలంటే.. మీ ఆసుపత్రులకు కావాల్సిన మందులను మా ఏజెన్సీకే ఇండెంట్ ఇవ్వాలని, లేదంటే ఫైన్లు వేయిస్తామంటూ కండీషన్ పెడుతూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారనే అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఏజెన్సీతో పాటు మరో కీలక స్నేహితుని ఏజెన్సీల్లో మందులనే మాత్రమే ఇండెంట్లు అధికంగా వచ్చేలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా వైద్య శాఖ ఉన్నతాధాకారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణకు ఆదేశిస్తే...హెల్త్ అసిస్టెంట్ వ్యవహారాలతో పాటు ఎన్హెచ్ఎం విభాగంలో అవినీతి తిమింగళాల వ్యవహారాలు మరిన్ని బయటపడే అవకాశాలుంటాయని వైద్యశాఖ ఉద్యోగుల్లోనే చర్చసాగుతోంది. తమ వద్ద మెడిసిన్ కొనకపోతే ‘ఫైన్’ తప్పదు ప్రైవేటు ఆస్పత్రుల్లో అనధికార ‘డెమో’ హుకుం అటు అక్రమ వసూళ్లు.. ఇటు ‘మందుల’ ఇండెంట్‌పై ఒత్తిళ్లు -
ఆదిత్యాలయ నిత్యాన్నదాన విభాగంలో చోరీ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్కన కలుషిత ఆహారం తిని గోశాలలో ఆవుల మరణాలు, మరో వైపు విధుల్లో ఉన్న మహిళలపై అకృత్యాలు, ఇంకో పక్క హుండీ కానుకల్లో లెక్కింపు సిబ్బంది చోరీకి పాల్పడటం వంటి వరుస ఘటనలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తుంటే.. తాజాగా నిత్యాన్నదాన విభాగంలో వినియోగానికి బయటకు తీసి ఉంచిన వంట నూనె, నెయ్యి, పప్పు దినుసులు చోరీకి గురయ్యాయి. బుధవారమే ఈ ఘటన జరిగినప్పటికీ సమాచారం బయటకు రాకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వంట విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి, అన్నదాన, ప్రసాదాల వినియోగానికి సిద్ధం చేసిన పలు పచారీ సరుకులు మాయం చేశాడని తేలింది. దీంతో ఆగమేఘాల మీద ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ రంగంలోకి దిగి, సరుకులపై ఆరా తీసి ఆ ఉద్యోగిపై చర్యలకు ఉపక్రమించారని సమాచారం. నిత్యాన్నదాన ప్రసాదాల వంటకు విధుల్లో ఉన్న సదరు ఉద్యోగి పూటుగా మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్నట్లుగా కూడా తేలింది. -
శ్రీనివాసరావుకు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జర్నలిస్ట్ పైల శ్రీనివాసరావుకు గోవిందనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.65000 సేకరించి ఆర్థిక సహాయంగా అందించారు. సీనియర్ జర్నలిస్ట్ బిర్లంగి రామ్మోహనరావు ఆధ్వర్యంలో ఈ మొత్తాన్ని సేకరించారు. శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించి ఈ మొత్తాన్ని అందజేశారు. దాతలు సాయం అందించాలనుకుంటే 73307 00496 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో గోవిందనగర్ పరిసర ప్రాంతాల వాట్సాప్ గ్రూప్ సభ్యులు, అక్కులపేట ఎంపీటీసీ బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, సాయి శ్రీనివాస్ పండా, రోణంకి వెంకటరా వు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు నల్లి ధర్మారావు, శాసపు జోగినాయుడు, కొంక్యాన వేణుగోపాల్, సున్నపు చిన్నారావు, సత్యనారాయణ, ఆబోతుల రామ్మోహనరావు, సీపాన రామారావు పాల్గొన్నారు. -
వ్యక్తిగత దూషణ ప్రజాస్వామ్యానికే అవమానం
● బొత్సపై చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు వెనక్కి తీసుకోవాలి ● మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆమదాలవలస: శాసనమండలిలో వైఎస్సార్ సీపీ పక్ష నేత, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నా యకుడు బొత్స సత్యనారాయణపై రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమదాలవలసలో గురువారం ఆయన ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని శాసనమండలి వంటి గౌరవప్రదమైన వేదికపై అసభ్య పదజాలంతో సంబోధించడం అచ్చెన్నాయుడి అహంకారానికి, సంస్కారహీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, శాసనసభా సంప్రదాయాలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చేసిన కృషి ఏమిటో ప్రజలకు చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. సొంత నియోజకవర్గంలో ఓ మహిళా రైతు ఎరువుల కోసం వచ్చి చనిపోతే కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించని మంత్రి, రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు. బీసీల సంక్షేమం, బీసీ రిజర్వేషన్లపై సభల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతను బహిరంగంగా దూషించడం సిగ్గుచేటని త మ్మినేని అన్నారు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాపు సామాజికవర్గానికి జరుగుతు న్న అన్యాయాన్ని ఆ వర్గం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బొత్స సత్యనారాయణకు,రాష్ట్ర బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తమ్మినేని డిమాండ్ చేశారు. -
23న జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సబ్ జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపికలు ఈ నెల 23న జరగనున్నాయని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. బాలబాలికలు 2012 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలని స్పష్టం చేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా జట్లను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎంపికల్లో పాల్గొనాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు ఎం.వి.రమణ(9441011391)ను సంప్రదించాలని కోరారు. -
విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
వజ్రపుకొత్తూరు రూరల్: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పలాస ఆర్డీఓ అప్పలరాజకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని, మూడేళ్లగా ప్రభుత్వాలు మెస్ చార్జీలు పెంచలేదన్నారు. రాష్ట్రంలో మాత్రం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సాధ్యం కాదన్నారు. మెస్ చార్జీలను 49 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్ చార్జీలను తక్షణమే విడుదల చేయాలని, గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టల్లో రెగ్యులర్ వర్కర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో పి.డి.ఎఫ్.యు.నాయకులు విజయ్, దయ, చంటి తదితరులు పాల్గొన్నారు. -
అంతా కట్టుకథ!
చెత్త నుంచి సంపద..పరిశీలించాం.. ఇటీవలే ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు స్వీకరించాను. రెండు రోజుల క్రితం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించాను. ఉన్నతాధికారుల సూచనలతో తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. – జగన్మోహనరావు, ఇన్చార్జి ఈఓ నరసన్నపేట : కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి అనేది అంతా బూటకమేనని నరసన్నపేటలోని ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని’ చూస్తే అర్ధమవుతుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఈ ఏడాది మే నెలలో మరోసారి ముస్తాబు చేశారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు రీ సైక్లింగ్ చేస్తున్నామని, గ్రామాల్లో నిత్యావసర సరుకులు విక్రయించి సేకరించిన చెత్తను ఇక్కడకు తీసుకొస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కొంత మంది నిపుణులను సైతం తీసుకువచ్చి ముఖ్యమంత్రికి సంపద కేంద్రం నిర్వహణ తీరును వివరించారు. ఆహా ఇక్కడ ఏదో జరిగిపోతోందని భావించిన సీఎం అధికారులకు కితాబునిచ్చారు. సీన్ కట్ చేస్తే ఇదంతా కట్టుకథేనని తేలిపోయింది. ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఈ కేంద్రం వద్ద రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులు హడావిడి సృష్టించారు. ఆయన వెళ్లిన మరుక్షణం నుంచే అంతా షరామామూలుగా మారింది. నెల రోజులు ఇక్కడ పనిచేసిన సత్యవరం గ్రామానికి చెందిన మహిళా సంఘం ప్రతినిధులకు జీతాలు ఇవ్వక పోవడంతో వారు రావడం మానేశారు. ప్రస్తుతం ఈ చెత్త నుంచి సంపద కేంద్రం కుక్కలకు, మందుబాబులకు ఆవాసంగా మారింది. వృథాగా విలువైన యంత్రాలు.. ప్లాస్టిక్ వ్యర్థాలు రీ సైక్లింగ్ చేసేందుకు అత్యాధునిక విలువైన యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. వీటి ఖరీదు రూ.30 లక్షలని సమాచారం. ఇవి ప్రస్తుతం వృథాగా పడి ఉన్నాయి. వీటికి రక్షణ లేకపోవడంతో దొంగల నుంచి ముప్పు పొంచి ఉంది. సీఎం రాక కోసం 16 వర్మీ కంపోస్టు పిట్లు, మరో 16 నాడెప్ పిట్స్ నిర్మించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన వర్మీ కంపోస్టును పిట్స్‌లో వేశారు. ఇప్పుడు ఈ కంపోస్టు అంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. అప్పుడు వివిధ పనులు నిర్మాణానికి తీసుకువచ్చిన 60 బస్తాల సిమెంట్ గడ్డకట్టి నిరుపయోగంగా మారింది. ఇలా ప్రజాధనం వృథాకు బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కుక్కలకు ఆవాసంగా నరసన్నపేట సంపద కేంద్రం మే 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం మూడు నెలల్లో పైసా ఆదాయం వస్తే ఒట్టు -
వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం
● ఆత్మహత్యకు సిద్ధమైన బొద్దూరు వాసి ● సకాలంలో స్పందించి రక్షించిన పొందూరు ఎస్ఐ రాజేష్ జి.సిగడాం/పొందూరు : కుటుంబ కలహాల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పొందూరు ఎస్ఐ జి.రాజేష్ చాకచక్యంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరు గ్రామానికి చెందిన గేదెల రవి (50) గురువారం రాత్రి కుటుంబ కలహాలు నేపథ్యంలో పొందూరు–జి.సిగడాం గ్రామాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌పైకి వచ్చి ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఇంతలో రవి కుమార్తె విషయాన్ని రాజాం సీఐకి ఫోన్ ద్వారా తెలియజేసింది. ఆయన అప్రమత్తమై రవి ఫోన్ లోకేషన్ ఆధారంగా పొందూరు ఎస్ఐ జి.రాజేష్‌కు సమాచారం అందించారు. ఎస్ఐ హుటాహుటిన పొందూరు–రాజాం ప్రధాన రహదారిలో ఉన్న వంతెన కింద రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రవిని రక్షించారు. అప్పటికే రవి చెయ్యి రైలు కింద పెట్టడంతో తీవ్ర గాయమైంది. అనంతరం రాజాం స్టేషన్‌కు అప్పగించారు. వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్ఐను రవి కుమార్తెతో పాటు గ్రామస్తులు అభినందించారు. -
బీఎల్ఓ పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
రణస్థలం: మండలంలోని వెల్పురాయి గ్రామంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఓ పనితీరు సక్రమంగా లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆ గ్రామంలో 142 పోలింగ్ బూత్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై గురువారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సంద ర్భంగా 2002 ఓటర్ జాబితాలో లింకు లేని ఓట ర్లు, చిరునామా, పేర్లు తప్పులు, స్వగ్రామంలో ఓటు ఉన్నా ఆ సమయంలో అందుబాటులో లేని ఓటర్లకు నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. అలాగే వీటిని మీరు ఎలా పూర్తి చేస్తున్నారని ప్రశ్నించగా బీఎల్ఓ మేదరమెట్ల రమణమ్మ సమాధానం చెప్పలేకపోవడం, బీఎల్వో అనుమతి పత్రం సక్రమంగా నింపలేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీస్ జారీ చేయమని సిబ్బందికి ఆదేశించారు. -
26న జిల్లా బేస్‌బాల్ సీనియర్స్ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బేస్‌బాల్ జట్ల ఎంపికలను ఈ నెల 26న శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నట్టు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు తమ్మినేని సుజాత, ప్రధాన కార్యదర్శి గుంటముక్కల వీరభద్రరావు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు మొదలువుతాయని చెప్పారు. ఇక్కడ ఎంపికై న జిల్లా ప్రాబబుల్స్ జట్లకు శిక్షణా శిబిరాలు నిర్వహించిన అనతరం తుది జట్లను ప్రకటిస్తామని పేర్కొన్నారు. జిల్లా జట్లను సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని రామలక్ష్మణ క్రీడాప్రాంగణం వేదికగా జరగనున్న 8వ ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ (అంతర్ జిల్లాల) బేస్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణపత్రం, రెండు పాస్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా బేస్‌బాల్ సంఘ కార్యనిర్వాహణ కార్యదర్శి కె.రవికుమార్ (8639000705)ను సంప్రదించాలని కోరారు. గంజాయి నిరోధానికి డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ వినియోగం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను సమర్థంగా అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ (ఎన్సీఓఆర్డీ) జిల్లా స్థాయి కమిటీ స మీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. సరిహద్దు చెక్ పోస్టులైన పురుషోత్తపురం, పాతపట్నం, గొప్పిలి, పైడిభీమవరం వద్ద వేలాది వాహనాలను తనిఖీ చేసి, పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద 1,127 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రిమ్స్‌లోని డి–అడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల భర్తీ ప్ర క్రియను వేగవంతం చేసి, బాధితులకు మెరుగైన కౌన్సెలింగ్, వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ దళాలతో కలిసి సంయుక్త తనిఖీలు నిర్వహించి రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. -
జాబితా నిండా సర్ప్రైజులే!
● ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ(సర్)పై అనుమానాలు ● ముసాయిదాలో మరణించిన వారి పేర్లు ● సక్రమంగా జరగలేదనడానికి నిదర్శనాలెన్నో.. పరిశీలించారా..? వాస్తవంగా 85 ఏళ్లు దాటిన వారి జాబితాను ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా పంపించింది. వాటిని ప్రత్యేకంగా పరిశీలించి బతికున్న వారెవరు, మరణించిన వారెవరు అన్నది గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 35 వేల వరకు ఆ జాబితాలో ఉన్నారు. వాటిన్నింటినీ బీఎల్ఓ వారీగా విభజన చేసి, వారికిచ్చి, 85 ఏళ్లు ఉన్న వారి ఇళ్లకు నేరుగా వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలి. కానీ, ఆ ఆదేశాల మేరకు సవరణ ప్రక్రియ జరగలేదని తాజాగా బయటపడుతున్న విచిత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎమ్మెల్సీలుగా చేశారంటే వారంతా ప్రముఖులే. అలాంటి ప్రముఖులనే గుర్తించలేకపోయారంటే సామాన్యుల పరిస్థితేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జిల్లాలో సక్రమంగా జరగలేదనడానికి నిదర్శనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఉదాహరణల్లో పేర్కొన్న వ్యక్తులు ఎక్కడో శివారు ప్రాంతాలకు చెందిన వారు కారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రానికి చెందిన వారు. మరణించిన వారిని బతికున్నట్టుగా ఎలా చూపించారో జిల్లా కలెక్టర్‌కు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో విధులు నిర్వర్తించిన అధికారులు, ఉద్యోగులకే తెలియాలి. ఇలాంటి ‘సర్’ప్రైజులు ఎన్నో ఈ జాబితాలో ఉన్నాయి. అడుగడుగునా అనుమానాలే.. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తప్పుల తడకగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ దగ్గరి నుంచి తీసుకున్న ప్రక్రియ సక్రమంగా జరగలేదని తొలి నుంచి వినిపించింది. ఇప్పుడా చిత్ర విచిత్రాలు, లోపాలు బయటపడుతున్నాయి. నాటి ఆరోపణలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. డొల్లతనం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది.. మరణించిన వారు బతికున్నట్టుగా ముసాయిదాలో ఓట్లు చూ పించడం మరింత చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా మొదటి డెడ్‌లైన్‌లోపు సవరణ ప్రక్రియ పూర్తిగా జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఆ డెడ్‌లైన్ పొడిగించడంతో జిల్లా అధికారులు బతికి పోయారు. ఈ పొడిగింపు సమయంలో అప్పటికి ఎన్నైతే మిగిలాయో వాటిన్నింటిని టపాటపా కొట్టేశారన్న వాదనలు ఉన్నాయి. లేదంటే మరింత డొల్లతనం బయటపడేది. గడువులో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదని చాలా చోట్ల వినిపించింది. కొన్నిచోట్లైతే ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి తీసుకోలేదనే వాదనలు ఉన్నాయి. మొత్తం పెంచిన గడువులో మమ అనిపించేశారు. ఇప్పుడా సవరణలో లోపాలు బయటపడుతున్నాయి. ఎవరైనా గుర్తించి, అభ్యంతరం వ్యక్తం చేస్తేనే.. లేదంటే మరణించిన వారి ఓట్లు బతికున్నట్టుగానే కొనసాగిపోనున్నాయి. -
మూడో రోజూ కొనసాగిన జూనియర్ డాక్టర్ల సమ్మె
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలో జూ నియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యా ర్థులు, హౌస్ సర్జన్లు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం రాష్ట్రస్థాయిలో అధికారులు జూనియర్ డాక్టర్ల సంఘ నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో శుక్రవారం నుంచి ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం ఉదయం వెల్లడిస్తారు. గురువారం నాటి దీక్షలో డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ ధర్మాకర్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ లావణ్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ హేమంత్, డాక్టర్ రాజ్ మనోహర్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు -
గడువులోగా సమస్యలు పరిష్కరించాల్సిందే: జేసీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సేవల్లో ప్రజా సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, అర్జీల పరిష్కారంలో నాణ్యత పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏడీ సర్వే ఎం.జోషిలా, మండల, గ్రామ సర్వేయర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎఫ్–లైన్ సర్వే, ఆర్ఓఆర్ రీసర్వే ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన జేసీ, గడువులోగా అర్జీలను పరిష్కరించడంలో వెనుకబడిన మండలాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్–లైన్ సర్వే దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించి సరిహద్దులను వేగంగా గుర్తించాలని, క్షేత్రస్థాయి నివేదికలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఆర్ఓఆర్ అర్జీలకు సంబంధించి భూ విస్తీర్ణం హెచ్చుతగ్గులు, రికార్డుల సవరణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని, తిరస్కరించే ఫైళ్లకు స్పష్టమైన కారణాలు తెలపాలన్నారు. దోమలను నిర్మూలిద్దాం అరసవల్లి: ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా మలేరియా నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్యశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఇన్చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ శివరంజిని ర్యాలీని ప్రారంభించగా..దోమల నియంత్రణకు సూచనలు, వ్యాధుల పట్ల అప్రమత్తతపై నినాదాలు చేశారు. స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ప్రతిజ్ఞ చేపట్టి దోమల ఉత్పత్తి పెరగకుండా అవగాహన చర్యలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా విభాగాధికారి పి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమ్మసిగడాంలో చోరీ రణస్థలం: కమ్మసిగడాం గ్రామంలో శీల రమణమ్మ బుధవారం రాత్రి తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి నిద్రపోయేందుకు వెళ్లింది. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలుగొట్టి తులం కాసుల హారం, 7 తులాల వెండి దీపం కుందులు, మొబైల్ ఫోన్, రూ.10వేలు నగదు పట్టుకుపోయారు. రమణమ్మ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండగా.. భర్త అచ్చెయ్య ఏడాది క్రితమే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులు సారవకోట: భర్త, అత్త, ఆడపడుచు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని శివరాంపురం గ్రామానికి చెందిన వివాహిత గురువారం సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. 16 ఏళ్ల క్రితం బుడితి గ్రామానికి చెందిన నక్క జగదీష్‌తో తనకు వివాహమైందని, ఆ సమయంలో కట్నం కింద రూ.2 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఇతర విలువైన వస్తువులు అందించారని చెప్పారు. కొన్ని నెలలగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. సారవకోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
పేరుకు పోతున్న చెత్త..
నరసన్నపేట మేజరు పంచాయతీలో 20 వార్డులు, 120 వీధులు, 40 వేల మంది జనాభా నుంచి సేకరిస్తున్న చెత్త అంతా ప్రస్తుతం ఇదే ప్రాంగణంలో ఐదెకరాల విస్తీర్ణంలో పేరుకుపోతోంది. పరిసరాలు అంతా దుర్వాసన వెదజల్లుతున్నాయి. సమీప జగన్నాథపురం తదితర వీధుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్త నుంచి మోక్షం కలిగించాలని స్థానికులు కలెక్టర్‌ను కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు కూడా చేశారు. సీఎం రాక సందర్భంగా అప్పటి వరకూ ఉన్న సుమారు వంద మెట్రిక్ టన్నుల చెత్తను శ్రీకాకుళంకు తరలించారు. ఇప్పుడు మళ్లీ చెత్త రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చింతల పూజ మృతి ఘటనపై జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరిపై దళిత సంఘాల ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో గురువారం ఆదివారంపేటలోని జిల్లా డీసీవో కార్యాలయంలో విచారణ నిర్వహించారు. విజయనగరం డీసీవో రూపవతి విచారణ అధికారిగా హాజరై దళిత సంఘాల ప్రతినిధుల నుంచి వివరాలు, అభ్యంతరాలు స్వీకరించారు. దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, ఉపాధ్యాయ–విద్యార్థి–దళిత–ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ పేడాడ కృష్ణారావు, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కష్ణయ్య, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా నాయకులు కానుకుర్తి గోవింద్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం అంబేడ్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ హాజరయ్యారు. ప్రిన్సిపాల్‌తో పాటు బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
వాషింగ్‌మిషన్ ప్లగ్ తీసేందుకు వెళ్లి..
● విద్యుత్ షాక్‌తో మహిళ మృతి ● పెద్దమురహరిపురంలో విషాదఛాయలు వజ్రపుకొత్తూరు : పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన వివాహిత గొరకల చామంతి(35) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందింది. చామంతి ఉదయం 11 గంటల సమయంలో వాషింగ్ మిషన్‌లో దుస్తులు ఉతకడం పూర్తయ్యాక ప్లగ్ తీసేందుకు వెళ్లింది. చేతులు తడిగా ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురైంది. ఆ సమయంలో పక్కనే ఉన్న కిటికీ ఐరన్ గ్రిల్స్‌ను పట్టుకోవడంతో కుడిచెయ్యి కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాతపడింది. చామంతి ఎప్పటికీ బయట కనిపించకపోవడంతో ఎదురింట్లో ఉంటున్న గొరకల హైమావతి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించింది. వెంటనే చామంతి భర్త కృష్ణారావు, ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చింది. బంధువుల సహకారంతో చామంతిని పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. చామంతికి గొరకల కృష్ణారావుతో 16 ఏళ్లు కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గీతిక ఇంటర్ చదువుతుండగా, ఢిల్లేశ్వరి తొమ్మిదో తరగతి చదువుతోంది. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే జాగ్రత్త అని చెప్పి భర్త కృష్ణారావు సొంత పనులపై బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కృష్ణారావు ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాతల వద్దకు అధికారుల పరుగులు
ఆమదాలవలస రూరల్: అన్నదాతల వద్దకు అధికారులు పరుగులు తీశారు. ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో ‘సేద్యం అసాధ్యం’ అనే శీర్షికన వార్తా కథనం వెలువడింది. దీంతో కలివరం, తొగరాం గ్రామ రైతులను అధికారులు కలిసి కావాల్సిన విధంగా ఎరువులు ఇస్తున్నామని, సాగునీటి సమస్య కూడా పరిష్కరించేలా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని తెలిపారు. పత్రికల్లో వార్తలు రావడం వల్ల ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందని పేర్కొన్నారు. దీంతో స్పందించిన రైతులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు కాలువల ద్వారా సాగునీరు అందలేదని తెలిపారు. ఒకే కట్ట యూరియా ఇస్తుండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటలో తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు (07037) ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరోసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07038) ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. రైల్వేట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్యాయత్నం కవిటి : ఇచ్ఛాపురం, ఆర్.బెలగాం (జాడుపుడి ఆర్ఎస్) రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తలకు తీవ్రగాయమై రక్తస్రావం జరిగిందని, కాళ్లు నుజ్జుగా మారాయని పలాస జీఆర్పీ పోలీసులు తెలిపారు. సుమారు 50–55 ఏళ్ల వయసుంటుందని, వైద్యం నిమిత్తం సోంపేట సీహెచ్‌సీకి తరలించామని చెప్పారు. తన పేరు రమేష్ అని, రాజాపురం గ్రామమని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం సోంపేట సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడని, వివరాలు తెలిస్తే పలాస జీఆర్పీ ఎస్ఐ డి శ్రీనివాసరావు(9247585743) ను సంప్రదించాలన్నారు. -
సార్.. ఓ పది వేలు ఇస్తారా..!
శ్రీకాకుళం: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా జిల్లా కలెక్టర్ పేరు, ఫొటోలను వాడేస్తూ అక్రమాలకు తెగబడుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేరు, డీపీలో అతని ఫొటోను యాడ్ చేసి థాయ్‌లాండ్ దేశం (ప్లస్ 66) కోడ్ నంబరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బుల కోసం మూడు రోజులుగా అధికారులకు మెసేజ్‌లు పెడుతున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. 40 విభాగాలకు మెసేజ్‌లు.. జిల్లాలో ప్రధానంగా ఉన్న రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలతో కలిపి మొత్తంగా 56 శాఖలుండగా అందులో 40 శాఖల వారికి సైబర్ కేటుగాళ్లు మెసేజ్‌లు పంపడం గమనార్హం. వేరెవరికో ఆరోగ్యం బాగోలేదనో.. రూ.10 వేలు అవసరమనో ఓ వీడియో పెట్టి అభ్యర్థన ధోరణిలో ‘సర్’ అని సంబోధిస్తూ మెసేజ్ పెట్టడంతో అంతా అవాక్కయ్యారు. తమ ఉన్నతాధికారి ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారేంటని అయోమయానికి గురయ్యారు. ఫండింగ్స్ రిలీజ్ చేసే అధికారం ఆయన చేతుల్లో పనే కదా.. ఇలా అభ్యర్థించాల్సిన అవసరమేముందబ్బా అన్న అనుమానంతో కలెక్టరేట్ కార్యాలయంలోనే కీలక వ్యక్తి ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఆ నంబర్‌ను బ్లాక్ చేసేశారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లు సోషల్ మీడియాలో వస్తే స్పందించవద్దని అధికారులకు, ప్రజలకు కలెక్టరేట్ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. -
ప్రజలకు చేరువయ్యేందుకు ‘పోలీసుల పల్లె నిద్ర’
శ్రీకాకుళం క్రైమ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో పోలీసులతో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనిద్వారా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలవుతుందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దానికి తోడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న నేరాలు, మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలైన గంజాయి, పేకాట, అక్రమ మద్యం తదితర వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గార, పొందూరు, టెక్కలి, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంతో పాటు జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది రాత్రి బస చేశారు. -
కిల్లారికి సన్మానం
అరసవల్లి: జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా నాలుగో సారి ఎన్నికై న కిల్లారి నారాయణరావును జిల్లా పరిషత్ సీఈవో ఆర్.వెంకట్రామన్ సత్కరించారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఉద్యోగుల సమస్యలపై చర్చల అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మేరకు ఆప్షన్ ఫారాన్ని సమర్పించేందుకు మరో రెండు రోజులు గడువు పెంచాలని సంఘం తరపున సీఈవో వెంకట్రామన్కు విన్నవించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. తండ్రికి తలకొరివిపెట్టిన తనయ కవిటి: ప్రగడపుట్టుగలో కిడ్నీ మహమ్మారికి మరొకరు బలయ్యారు. బదకల వెంకటరావు(54) అనే వ్యక్తి కిడ్నీవ్యాధులతో బాధపడుతూ బుధవారం మృతిచెందాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తెకు మరో 10 రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన అంత్యక్రియల్లో రెండో కుమార్తె ఝాన్సీ తండ్రికి తలకొరివి పెట్టింది. ద్విచక్ర వాహనం నుంచి మంటలు ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ శివారులోని కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆమదాలవలస – శ్రీకాకుళం రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనం నుంచి మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైంది. ఆమదాలవలస ఫైర్ ఎస్వో శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం గోకర్నపల్లికి చెందిన అన్నెపు దిలీప్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై కుటుంబంతో ఎల్‌ఎన్‌పేట మండలం మల్లికార్జునపురంలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమదాలవలస ప్రాంతంలో బైక్ ఆగిపోయింది. బైక్ స్టార్ట్ చేస్తుండగా స్పార్కింగ్ వచ్చి పెట్రోల్ ట్యాంకుకు తగలగా మంటలు చెలరేగాయని తెలిపారు. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేశారని వెంటనే వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చేసరికి పూర్తిగా బైక్ కాలిపోయిందని తెలిపారు. వాహనదారులు, దిలీప్ ముందుగా మంటలను గమనించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. దళిత యువతిని మోసగించిన కేసులో ఇద్దరికి రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్ : బాపట్ల కారంచేడుకు చెందిన దళిత యువనటి కనుపర్తి దీనమ్మ అలియాస్ దివ్యశ్రీని ప్రేమించి వివాహం చేసుకుని మోసగించిన పాలకొండ అటవీ రక్షణ అధికారి గొల్లంగి తారకేశును మహిళా స్టేషన్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనితో పాటు సాయిరామ్మహా పాత్రో అనే మరో వ్యక్తిని సైతం జైలుకు పంపించారు. ఈ నెల 31 వరకు రిమాండ్‌లో కొనసాగుతారని పోలీసులు పేర్కొన్నారు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు టెక్కలి: శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన గయా వివేకానంద అనే 16 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ మేరకు తండ్రి యుగంధర్ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదని పేర్కొన్నారు. బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. -
మోసపోయామని ప్రజలు గ్రహించారు
గార : కూటమి ప్రభుత్వంలో మోసపోయామని ప్రజలు గ్రహించారని, ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అసత్యాలని ప్రజలు అర్ధం చేసుకున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం తూలుగు పంచాయతీ పెద్ద ఉప్పరిపేటలో టీడీపీ నుంచి పలు కుటుంబాలు వైఎస్సార్ సీపీ పార్టీలో చేరాయి. వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే అన్నీ అమలు చేసేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారుడైన సీదిరి అప్పలరాజును జైల్లో పెడితే పరామర్శించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చారని, ఆ సమయంలో ప్రజలు ప్రవాహంలా వచ్చారన్నారు. అదే చంద్రబాబు పర్యటనలకు మాత్రం ప్రజల్లో స్పందన కరువవుతోందన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు రూ. 200 కోట్లు నష్టం వచ్చిందన్నారు. రూ.280 ఉన్న యూరియా బ్లాక్ మార్కెట్లో రూ.1000కు అమ్ముతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ఇసుక, మట్టి, ఏది దొరికితే అది అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగితే అవన్నీ తామే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మూలపేట పోర్టును సైతం తామే తీసుకొచ్చినట్లు జిల్లాకు చెందిన మంత్రి చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఇటీవల జరిగిన ఓ సర్వేలో వైఎస్సార్ సీపీకి 51 శాతం, కూటమి పార్టీలకు 43 శాతం వచ్చిందని, టీడీపీ ప్రభుత్వానికి పాడి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజల జీవనం భారంగా మారిందన్నారు. ఈ రోజు ప్రారంభమైన చేరికలు పెరిగి పెద్దవై జిల్లా నుంచి టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే వైఎస్సార్ సీపీకి అండగా నిలవాలన్నారు. మాజీ సర్పంచ్ కొయ్యాన నాగభూషణం ఆధ్వర్యంలో పిండి అప్పన్న, తంగెల్లా అప్పారావు, మొగిలి రాంబాబు, గుర్రాల రమేష్ తదితరులు పార్టీలో చేరారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువనాయకుడు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, ఎంపీపీ గొండు రఘురామ్, ఎస్ఈసీ సభ్యుడు గొండు కృష్ణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, బరాటం నాగేశ్వరరావు, పీస శ్రీహరిరావు, అరవల రామకృష్ణ, అందవరపు బాలకృష్ణ, యాళ్ల నారాయణ, రాష్ట్ర పోలినాటి వెలమ విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, తమ్మిన అప్పలరాజు, బరాటం నాగరాజు, గంగు రామారావు తదితరులు పాల్గోన్నారు. పథకాల అమలుపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం పెద్ద ఉప్పరిపేటలో వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు -
వైఎస్సార్సీపీలో చేరికలు
రణస్థలం: లావేరు మండలంలోని పెద్ద లింగాలవలసకి చెందిన బీజేపీ నాయకుడు బొబ్బాది చిన్నారావు, పైడయ్యవలసకు చెందిన జనసేన నాయకుడు ఈసర్ల శివ వైఎస్సార్సీపీలో బుధవారం చేరారు. దీంతో మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ పార్టీ కండువా వేసి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితోనే నాయకులు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ సమష్టిగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, నాయకులు బొబ్బాది శ్రీనివాసరావు, వెంకటరమణ, లుకలాపు చిన్న శ్రీను, ఈసర్ల సూర్యరావు, వలిరెడ్డి భాను, లుకలాపు సుదీర్ కుమార్ పాల్గొన్నారు. -
ఫిక్సిడ్ మోసం
● ఆమదాలవలస ఎస్బీఐలో కలకలం ● ఓ వ్యక్తి పేరిట ఉన్న సొమ్మును కాజేసిన నకిలీ వారసుడు ● టీడీపీ నేత అసలు సూత్రధారి సాక్షి టాస్క్‌ఫోర్స్: సామాన్యుడికి సవాలక్ష నిబంధనలతో బ్యాంకు అధికారులు, సిబ్బంది చుక్కలు చూపిస్తుంటారు. అటువంటిది ఓ ఫిక్సిడ్ డిపాజిట్ విషయంలో నిబంధనలను పక్కన పెట్టేశారు. వారసుల స్థానంలో మరొకరు నకిలీ పత్రాలు సృష్టించి మరీ మోసానికి పాల్పడటం.. ఇందులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర వెలుగుచూడడం సంచలనంగా మారింది. ఆమదాలవలస స్టేట్‌బ్యాంక్‌లో వెలుగుచూసిన ఈ ఘరానా మోసానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఎల్‌ఎన్‌పేటకు చెందిన వైశ్యరాజు నాగేశ్వరరావు ఆమదాలవలస స్టేట్ బ్యాంక్‌లో కొన్నేళ్ల కిందట ఫిక్సిడ్ డిపాజిట్లు చేశారు. ఇటీవల నాగేశ్వరరావు మరణించారు. ఆయన కుమారుడు వైశ్యరాజు సంతోష్‌రాజు ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు సంబంధిత పత్రాలతో బ్యాంకుకు వెళ్లారు. అయితే, అప్పటికే ఈ మొత్తం క్లెయిమ్ చేసుకున్నారని సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. ఎల్‌ఎన్‌పేటకు చెందిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో పలాస ప్రాంతానికి చెందిన ఇదే ఇంటి పేరు వైశ్యరాజు సంతోష్‌రాజు పేరుతో ఉన్న వ్యక్తి.. పాన్ నంబర్, ఆధార్ నంబరుతో ఏమార్చి ఒక ఖాతాను సృష్టించారు. తానే అసలైన వారసుడిగా చూపించి ఫిక్సిడ్ డిపాజిట్ బదలాయించారని తెలుస్తోంది. మరోవైపు ఇదే వైశ్యరాజు నాగేశ్వరరావు పేరుతో ఎల్‌ఎన్‌పేట యూనియన్ బ్యాంక్‌లో ఓ ఖాతా ఉంది. ఆ అకౌంట్లో సుమారు రూ.78 లక్షలు ఉంది. అదే మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు వీలుగా వారసత్వ సర్టిఫికెట్, ఇతర ధ్రువీకరణ పత్రాల పేరుతో నకిలీ వారసుడు దరఖాస్తు చేసుకున్నాడు. అనుమానం వచ్చిన యూనియన్ బ్యాంకు అధికారులు ఎల్‌ఎన్‌పేట గ్రామానికి వెళ్లి ఆరా తీయగా నకిలీ అని తేలినట్టు సమాచారం. అటు ఆమదాలవలస ఎస్బీఐ బ్యాంకులో ఘరానా మోసానికి.. ఇటు ఎల్‌ఎన్‌పేట యూనియన్ బ్యాంకు ఖాతాలో నిధులు పక్కదారి పట్టించేందుకు కుట్ర జరగడం వెనుక హిరమండలానికి చెందిన వ్యాపారి, టీడీపీ నేత లాడె బలరాం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. నాగేశ్వరరావు అనే ఖాతాదారుడు యాక్టివ్‌గా లేని విషయాన్ని గుర్తించి ఈ కుట్రకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అదే వైశ్యరాజు సంతోష్‌రాజు పేరుతో ఆధార్, పాన్ నంబర్ సృష్టించి రూ.17 లక్షలు క్లెయిమ్ చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం పరిణామాలకు సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి టీడీపీ నేత కావడంతో కప్పిపుచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
300 ట్రాన్స్ప్లాంట్లతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రికార్డు
బీచ్‌రోడ్డు: విశాఖపట్నంలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్‌లోని తొలి ఆసుపత్రిగా నిలిచిందని ఆసుపత్రి ఎండీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. బుధవారం ఓ హోటల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రక్త క్యాన్సర్లు, ఇతర సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సేవలు అందించడంలో ఈ మైలురాయి ఆస్పత్రి నైపుణ్యానికి నిదర్శనమన్నారు. 300 ట్రాన్స్ప్లాంట్ల వెనుక వైద్య బృందం నైపుణ్యం, సమన్వయం, అంకితభావం ఉన్నాయని చెప్పారు. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా తదితర వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ బాలస్టాలిన్ చౌదరి మాట్లాడుతూ.. 300 ట్రాన్స్ప్లాంట్ల అనుభవంతో సంక్లిష్ట రక్త సంబంధిత వ్యాధులకు సమగ్ర చికిత్స అందించే సామర్థ్యం మరింత బలోపేతమైందన్నారు. సీనియర్ క్లినికల్ హెమటాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్ బెండి మాట్లాడుతూ.. ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు పరీక్షల నుంచి అనంతర సంరక్షణ వరకు సమగ్ర సేవలు అందిస్తున్నామని తెలిపారు. సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ వూన్నా, మెడికల్ ఆంకాలజిస్ట్, పీడియాట్రిక్ హెమటో–ఆంకాలజిస్ట్ డాక్టర్ రజనీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
● ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన వ్యతిరేక విధానాలను విడనాడాలని, ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఆర్అండ్బీ జంక్షన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని పాలకులు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం యువత చేతుల్లో ఉద్యోగ నియామక పత్రాల కంటే ఉద్యోగ దరఖాస్తులు, హాల్‌టికెట్లు, కోచింగ్ ఫీజు రశీదులు, విద్యా రుణాల పత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకులు, ఫలితాల జాప్యం, నియామక ప్రక్రియలో అవకతవకలు కారణంగా యువత తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ప్రతిఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలని, లేనిపక్షంలో నెలకు రూ.3,000ల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డ్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి యువత వలసలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్.అరవింద్, అన్నాజీ, వసంత్, హరి, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు -
బయ్యన్నపేటలో సినిమా షూటింగ్
రణస్థలం: లావేరు మండలంలోని బయ్యన్నపేట గ్రామంలో బుధవారం ‘నా సినిమాలో నటీనటులు మా ఊరి వాళ్లే’ అనే చిత్రం షూటింగ్ జరిగింది. హీరో, హీరోయిన్లగా భాను, మధుమిత నటిస్తున్నట్లు లావేరు మండలంలోని బడుమూరు గ్రామానికి చెందిన చిత్ర దర్శకుడు సతీష్ పీసా తెలిపారు. కొద్ది రోజులుగా అరిణాం అక్కివలసలో షూటింగ్ జరుపుతున్నామన్నారు. కలిగ గణేష్ యాదవ్, శాంతారామ్ చల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చిలకపాలెం, బుడుమూరు, రాజాం, రణస్థలం, శ్రీకాకుళం ప్రాంతాల్లో జరుగుతోందని వెల్లడించారు. సినిమాలో ప్రధాన నటులుగా చిత్రం శ్రీను, జబర్థస్త్ అప్పారావు, శకుంతలమ్మ, గీతం రాజు, గణేష్ యాదవ్, శాంతారామ్, కృష్ణారావు, రాజులమ్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్రం బృందం తెలియజేసింది. -
బొత్సపై అచ్చెన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
శ్రీకాకుళం క్రైమ్: శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకట సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిశీలకుడు దుంపల రామారావు (లక్ష్మణరావు), పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌తో కలిసి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్యేగా, 15 ఏళ్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన బొత్సపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాల కల్పన, స్పోర్ట్స్ కోటాలో చోటు చేసుకున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ అవినీతిని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ కూటమి ప్రభుత్వానికి, వత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాకి కొత్తేమీ కాదన్నారు. దుంపల రామారావు మాట్లాడుతూ విద్య, వైద్యం, సేధ్యం వంటి రంగాలపై చర్చించే దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. -
హౌస్ కమిటీ రిపోర్టు బయటపెట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖ డెయిరీ అవినీతిపై వేసిన హౌస్ కమిటీ రిపోర్టు వెంటనే బయట పెట్టాలని పాల రైతులు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొందూరు చంద్రరావు, వెలమల రమణలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఏవోకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ డెయిరీకి 6 జిల్లాలకు చెందిన 3.5 లక్షల మంది రైతులు రోజుకి 9 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారని తెలిపారు. పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా డెయిరీ యాజమాన్యం స్వార్థ ప్రయోజనాలు కోసం డెయిరీ ఆదాయాన్ని దారి మళ్లిస్తోందని విమర్శించారు. డెయిరీ అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న చైర్మన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున, ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రయోజనం కంటే, రాజకీయ ప్రయోజనాలకే మొగ్గు చూపుతోందని ధ్వజమెత్తారు. హౌస్ కమిటీ రిపోర్టు బయటపెట్టి, దాని ఆధారంగా అవినీతిపరులను శిక్షించి, డెయిరీ ఆస్తులు కాపాడాలని, డెయిరీకి వస్తున్న మిగులు ఆదాయం రైతుకు బోనస్ ఇవ్వాలని, లీటరు పాలుకి రూ.10 ల సేకరణ ధర పెంచాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. -
రెండోరోజుకు రిలే దీక్షలు
● రిమ్స్ ఆవరణలో జూడాల ర్యాలీ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్లు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. గడిచిన పది రోజులుగా వీరు మూడు న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన దీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు, హౌస్ సర్జన్లు రిమ్స్ ఆవరణలో ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ రోహన్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ లిఖిత, డాక్టర్ సూర్యతేజ, డాక్టర్ గ్రీష్మ, డాక్టర్ లక్ష్మీ చరణ్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ మజ్జి హేమలతా దేవి తదితరులు దీక్షల్లో పాల్గొన్నారు. అవుట్ పేషెంట్ల అవస్థలు జూడాల దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే అవుట్ పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్ సౌలభ్యం చేసుకునే అవకాశం ఉండడంతో వారంతా ఆ సమయానికి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటున్నారు. గతంలో జూనియర్ డాక్టర్లు వార్డుల్లోని రోగులకు ఫాలోఅప్ ట్రీట్మెంట్ జరిపేవారు. ఇప్పుడు వారు లేకపోవడంతో సీనియర్ వైద్యులే వార్డులకు వెళ్లి రోగులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ కారణంగా వారు ఓపీకి వచ్చేసరికి 11.30 గంటలు దాటిపోతుంది. అప్పటివరకు రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. అలాగే ఒంటి గంట తర్వాత మధ్యాహ్న భోజన విరామ సమయం కావడంతో వైద్యులు వెళ్లిపోతున్నారు. వారు తిరిగి 3 గంటలకు వచ్చి రోగులను పరీక్షిస్తున్నారు. ఉదయం పరీక్షలు జరిపించుకోలేని రోగులు, వైద్యుల కోసం సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి పరిస్థితి ఉందని జిల్లావ్యాప్తంగా తెలియడంతో అవుట్ పేషెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈనెల ఒకటి, రెండు తేదీల్లో 2,000 వరకు ఉన్న ఓపీల సంఖ్య, మంగళవారం నాటికి 1870కు తగ్గింది. ఇలా రోజురోజుకు అవుట్ పేషెంట్ల సంఖ్య తగ్గిపోతోంది. అలాగే జిల్లాలోని ఇతర ఆస్పత్రులు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల నుంచి రిఫరల్ కేసులు కూడా రిమ్స్‌కు కాకుండా విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే అక్కడ కూడా ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. -
ఊరు గడప నుంచి..ప్రపంచం గుమ్మం దాకా..!
● ఇక నుంచి ఎక్కడికై నా పోస్టల్ సేవలు ● 192 దేశాలకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ● ఉపయోగించుకోవాలని అధికారుల సూచన హిరమండలం: అమెరికాలో ఉన్న స్నేహితునికి పుట్టినరోజు కానుక పంపించాలనుకుంటున్నారా..? కెనడాలో ఉన్న సోదరునికి రాఖీ అందించాలా..? లండన్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు ఆవకాయ రుచి చూపించాలా.. అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ ఇంటికి సమీపంలోని పోస్టాఫీసు నుంచే వాటిని పంపించేందుకు అవకాశం ఉందంటున్నారు పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ వండాన హరిబాబు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ.. భారత తపాలశాఖ ద్వారా ప్రజలు తమకు సమీపంలోని పోస్టాఫీసు నుంచి ప్రపంచంలోని 192 దేశాలకు వ్యక్తిగత వస్తువులు, పత్రాలు, బహుమతులు, రాఖీలు తదితరాలు సులభంగా పంపుకునే వీలుందని చెప్పారు. వ్యక్తిగత వస్తువులతో పాటు వాణిజ్య ఉత్పత్తులను విదేశాలకు పంపించాలనుకునే చిన్న ఎగుమతిదారులకు కూడా తపాల శాఖ పలు అంతర్జాతీయ సేవలను అందిస్తోందని వెల్లడించారు. సరసమైన ధరలు, విస్తృతమైన పోస్టల్ నెట్వర్క్, ఆన్లైన్ ట్రాకింగ్, వేగవంతమైన కస్టమ్స్ క్లియరెన్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. బల్క్ బుకింగ్ అవసరమైతే పోస్టల్ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి బుకింగ్ చేసే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. పోస్టల్ శాఖ నాలుగు రకాల సేవల ద్వారా విదేశాలకు తమ వస్తువులను పంపించేందుకు అవకాశం కల్పించింది. 192 దేశాలకు కనెక్టివిటీ అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా తదితర దేశాలకు అంతర్జాతీయ పోస్టల్ సేవల ద్వారా వస్తువులను పంపుకోవచ్చని ఆయన తెలిపారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్(యూపీయూ) పరిధిలోని 192 దేశాలకు పోస్టల్ నెట్వర్కు ద్వారా ప్రజలకు అంతర్జాతీయ కనెక్ట్విటీ అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి పంపించాలనుకునే వస్తువు, బరువు, గమ్య దేశం ఆధారంగా సరైన అంతర్జాతీయ సేవను ఎంచుకోవాలని సూచించారు. అంతర్జాతీయంగా పంపేందుకు ప్రధాన సేవలు ఇంటర్నేషనల్ రిజిస్టర్ పోస్టు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆస్తి సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లను పంపేందుకు ఈ సేవను ఉపయోగించుకోవచ్చన్నారు. ఉదాహరణకు అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు 20 గ్రాముల బేస్ ధర రూ.215 ఉండగా.. పన్నుతో కలిపి దాదాపు రూ.258 అవుతుంది. ఎక్స్‌ప్రెస్ మెయిల్ సర్వీస్ డాక్యుమెంట్లును మరింత వేగంగా విదేశాలకు పంపించేందుకు ఈ ఎంఎస్ సేవ ఉపయోగపడుతుంది. అమెరికాకు 250 గ్రాముల వరకు బేస్ధర రూ.1,820 ఉండగా.. పన్నులతో కలిపి దాదాపు రూ.2184 అవుతుంది. ఇంటర్నేషనల్ ట్రాక్ ప్యాకెట్ సర్వీసు రాఖీలు, దుస్తులు, పుస్తకాలు, పూజా సామగ్రి, బహుమతులు తదితర తక్కువ బరువున్న వ్యక్తిగత వస్తువులను పంపించేందుకు ఈసేవ అనుకూలంగా ఉంటుంది. 250 గ్రాముల వరకు బేస్ ధర దాదాపు రూ.500 కాగా.. పన్నులతో కలిపి రూ.600 అవుతుంది. పోస్టల్ ఎయిర్ పార్సెల్ 250 గ్రాములకు మించిన బరువున్న వస్తువులను విదేశాలకు పంపించేందుకు ఎయిర్ పార్సిల్ సేవను వినియోగించుకోవచ్చు. 250 గ్రాముల వరకు బేస్ధర రూ.1,000 కాగా.. పన్నులతో కలిపి 1,180 అవుతుందన్నారు. కాగా అంతర్జాతీయ పోస్టల్ చార్జీలు, పంపే దేశం, వస్తువు, బరువు, సేవ రకం వర్తించే పన్నులు తదితర అంశాల ఆధారంగా ధర మారే అవకాశం ఉంది. -
సొంత శాఖకు సున్నం
ఇదేంటి లోకేశం!సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సకల శాఖల మంత్రిగా చెలామణి అవుతున్న నారా లోకేష్ అసలు శాఖను నిర్వీర్యం చేసేశారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా మిత్ర కిట్ల దగ్గరి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ నుంచి సుద్దముక్కలు, డస్టర్లు వరకు ఇబ్బందులు తెచ్చిపెట్టారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కిట్లు పేరుతో గోల్మాల్! సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పేరుతో ఎంత గోల్మాల్ చేశారో తెలియదు గానీ విద్యార్థులకు ఇచ్చిన నాసిరకం కిట్లు అక్కరకు రాకుండా పోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్‌లు కొద్ది రోజులకే చిరిగిపోయాయి. జిప్పులు పాడైపోయాయి. భుజాలకు తగిలించుకునే బందులు సైతం ఊడిపోతున్నాయి. దీంతో ధాన్యం బస్తాను మోసినట్లు బ్యాగును భుజంపై మోసుకుంటూ రావాల్సిన దుస్థితి ఏర్పడింది. మూడంచెల తనిఖీ తర్వాత బ్యాగులు ఇస్తున్నామని చెప్పినా మూడు వారాలు కూడా మన్నిక రాకుండా చిరిగిపోయాయి. విద్యార్థుల సైజుతో సంబంధం లేకుండా కొందరికి బూట్లు ఇచ్చారు. మరికొందరికి నేటికీ ఇవ్వలేదు. ఒక్కో కిట్టుకు సుమారు రూ.2,300వరకు వెచ్చించినా నిరుపయోగమైన పరిస్థితి ఏర్పడింది. లోకేష్ జమానాలో విద్యాశాఖ పరువు గంగపాలు విద్యార్థులకు చిరిగిన బ్యాగులు, చాలని బూట్లు డొక్కా సీతమ్మ పరువు తీసేలా మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులకు అవే రకమైన ఇబ్బందులు -
జిల్లా పరువు తీస్తున్న మంత్రి అచ్చెన్న
టెక్కలి: శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు ఉన్మాదత్వాన్ని ప్రదర్శించేలా చేసిన వ్యాఖ్యలతో జిల్లా పరువు పోయిందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో తిలక్ మాట్లాడారు. పెద్దల సభలో ఏ విధంగా మాట్లాడాలో, సభ్యులను ఏ విధంగా గౌరవించాలో మంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. మనిషి పెరిగినా అజ్ఞానిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరగలేదని నిరూపించలేకపోతున్నారని, అందుకే ప్రతిపక్ష నాయకులపై తీవ్రమైన పదజాలంతో దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కింజరాపు కుటుంబం చేస్తున్న అవినీతి బయట పడకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు వద్ద మెప్పు కోసం ప్రతిపక్ష నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి అసమర్థత వల్ల వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా నోటిని అదుపులో పెట్టకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డీఎస్సీపై చర్చ జరుగుతుందనే భయంతోనే విద్యా శాఖ మంత్రి లోకేష్ సభకు హాజరు కాలేదన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, సీనియర్ నాయకులు కురమాన బాలకృష్ణ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, ఎంపీటీసీ వాకాడ శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఆట్ల రాహుల్, రౌతు జయమోహన్, మార్పు నాగభూషణ్, చింతాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
అందులోనూ జాప్యం..!
ఇచ్చేదే సగం..● విడుదల కాని పాఠశాలల నిర్వహణ ఖర్చులు ● చేతిచమురు వదిలించుకుంటున్న హెచ్ఎంలు ● గత రెండేళ్లలో సగం నిధులే విడుదల త్వరలో నిధులు పాఠశాలల నిర్వహణకు సంబంధించి నిధుల చెల్లింపు విషయమై ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం వచ్చింది. వచ్చిన వెంటనే ఆయా హెచ్ఎంల ఖాతాల్లో జమ చేస్తాం. – పి.వేణుగోపాలరావు, సమగ్ర శిక్ష ఏపీసీ, శ్రీకాకుళం హిరమండలం: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తలకుమించిన భారంగా మారుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు సమీపిస్తున్నా ఇంతవరకూ పాఠశాలల నిర్వహణకు సంబంధించి నిధులు విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు విద్యా సంవత్సరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అప్పట్లో 50 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో పాఠశాలల నిర్వహణ చాలా కష్టంగా మారింది. ఇప్పుడు పాఠశాలలు తెరిచి మూడు నెలలు అవుతున్నా నిధులు విడుదల కాకపోవడంతో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,015, ప్రాథమికోన్నత పాఠశాలలు 151, ఉన్నత పాఠశాలలు 450 ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 1,53,918 మంది ఉన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.3 కోట్ల వరకు ఖర్చవుతోంది. చాక్‌పీస్‌లు, డస్టర్లు, స్టేషనరీ సామగ్రి, విద్యార్థుల మార్కుల నమోదు పత్రాలు, దస్త్రాలు, చీపుర్లు, ఇతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలోని తరగతుల విద్యార్థులను బట్టి ఈ నిధుల కేటాయింపు ఉంటుంది. 1 నుంచి 20 మంది విద్యార్థులుంటే ఏడాదికి రూ.10 వేలు, 21 నుంచి 50 మంది విద్యార్థులుంటే రూ.15 వేలు, 51 నుంచి 100 మంది ఉంటే రూ.20 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు కేటాయిస్తారు. పాఠశాలలకు సంబంధించి విద్యుత్ చార్జీలను సైతం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. చెల్లింపుల్లో జాప్యం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సొంత చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం 50 శాతం నిధుల చెల్లింపు మాత్రమే జరిగింది. ఈ రెండేళ్లలో కేవలం రూ.3.80 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఈ లెక్కన ఒక విద్యాసంవత్సరంలో నిధులు రానట్టే. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో పాఠశాల నిర్వహణకు సంబంధించి ఇబ్బందులు తప్పడం లేదు. విద్యాశాఖ విషయంలో ప్రచార ఆర్భాటానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
సెప్టెంబర్ 12న లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సెప్టెంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు ఉచితంగా, త్వరితగతిన, స్నేహపూర్వకంగా న్యాయం అందించి సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొల్పాలని, ఇందులో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి వస్తుందని, తీర్పుపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల సమ్మతితో రాజీ కుదరడం వల్ల శతృత్వం శాశ్వతంగా దూరమవుతుందన్నారు. పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రికవరీ, చెక్కు బౌన్స్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్, కుటుంబ కోర్టు, కార్మిక వివాదాలు, విద్యుత్, నీటి బిల్లులు, సివిల్, రాజీకి వీలైన క్రిమినల్, ప్రీ–లిటిగేషన్ కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చని సూచించారు. క్లయింట్లతో మాట్లాడి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి సెప్టెంబరు 12 నాటి లోక్ అదాలత్‌కు పంపాలనన్నారు. జిల్లా న్యాయమూర్తి మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా రికార్డు స్థాయిలో కేసులు పరిష్కరించాలని, ప్రతి బార్ అసోసియేషన్, న్యాయవాది ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. తమ వంతు బాధ్యతగా వ్యవహరించి క్లయింట్లను ఒప్పించాలని రెండో అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎన్.నాగ ప్రసన్న భారతి సూచించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు, ప్రదాన కార్యదిర్శి సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పట్టపగలే ఆటో చోరీ
కొత్తూరు: ఇంటిముందు పార్కింగ్ చేసిన ఆటోను మంగళవారం పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయిన ఘటన కొత్తూరు మండలం నివగాం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆలిబిల్లి నీల్కమల్ తన ఆటోను ఇంటి ముందు నిలుపుదల చేసి గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఆటో వద్దకు వచ్చి అందులోకి వెళ్లాడు. ఆటోను వెనుక నుంచి నెట్టాల్సింగా స్థానికులను కోరాడు. అక్కడున్న వ్యక్తులు ఆటో వెనుక నుంచి తొయడంతో ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. దీంతో దుండగడు ఆటోను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు ఆటో యూనియన్ నాయకుడు జి.నీలంనాయుడు తెలిపారు. పది రోజుల్లో మూడు వాహనాలు.. కొత్తూరు మండలంలో వాహన చోరీలు పోలీసులకు సవాల్‌గా మారింది. పది రోజుల్లో మూడు వాహనాలు చోరికి గురయ్యాయి. ఈ నెల 5న మెట్టూరు–2 ఆర్ఆర్ కాలనీలో బిట్–3 ఆర్ఆర్ కాలనీ చెందిన మాజీ సర్పంచ్ కొయిలాపు శ్రీనివాసరావుకు చెందిన బైక్ చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహసింగి గ్రామంలో ఈ నెల 13న పి.తరుణ్ తన ఇంటి ముందు నిలుపుదల చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకుపోయారు. తాజాగా ఆటో చోరీకి గురికావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలం రావివలస జంక్షన్ జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న బొలెరో వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని స్టేషన్‌కు తరలించారు. -
లారీలు, బొలెరో వ్యాన్ ఢీ: ముగ్గురికి గాయాలు
బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామంలో రాజు చెరువు వద్ద మంగళవారం వేకువ జామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు, బొలెరో వ్యాన్ బలంగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వాహన డ్రైవర్లకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఎస్సై యు.మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన బొలెరో వ్యాన్ డ్రైవర్ మాతా నవీన్ గజపతినగరంలో టమాటోలు దించి మిగతా సరుకును విజయనగరంలో దించేందుకు వెళ్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ ముందు వెళ్తుండగా ఏపీకి చెందిన లారీ ఓవర్ టేక్ చేసే సమయంలో బొలెరో వ్యాన్‌ను, ఛత్తీస్‌గఢ్ లారిని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ నవీన్‌కు తీవ్ర గాయాలై వాహనంలోనే కుడి కాలు, ఎడమ చేయి పూర్తిగా ఇరుక్కుని చిక్కుకు పోగా పోలీసులు చేరుకుని బాధితుడిని రక్షించి బయటకు తీసి జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని, లారీ డ్రైవర్లు స్వల్ప గాయాలుతో బయట పడ్డారని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
వజ్రపుకొత్తూరు రూరల్: అక్రమ కేసులో అంపోల్ జైలులో రిమాండ్‌లో ఉండి ఈ నెల 14న బెయిల్‌పై వచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ఆయన స్వగృహంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపులతో తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్టులు చేస్తోందని మండిపడ్డారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఉర్లాన బాలరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎరుకోల వెంకటరమణ, పల్లి యోగి, పార్టీ నాయకులు హనుమంతు వెంకటరావుదొర, ఎస్.ప్రదీప్, మీసాల రామకృష్ణ, పి.మునిరావు, ఏ.సూర్యం, ఎం.సింహాచలం, బమ్మిడి పున్నయ్య పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదు ఆమదాలవలస: అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ ప్రభుత్వం చూస్తోందని, కేసులకు భయపడేవారు వైఎస్సార్ సీపీలో ఎవరూ లేరని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అక్రమ కేసులో జైలుకు వెళ్లి కోర్టు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మంగళవారం ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు పరుష పదజాలం ఉపయోగించడాన్ని ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష నేతలపై సంస్కారహీనంగా మాట్లాడటం సరికాదన్నారు. అనంతరం రవికుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు బొడ్డేపల్లి అజంతాకుమారితో మాట్లాడి అక్రమ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పెద్దలను గౌరవించే పద్ధతి ఇదేనా?
పోలాకి : గౌరవమైన మంత్రిపదవిలో ఉంటూ సభలో పెద్దలను గౌరవించే పద్ధతి ఇదేనా..? అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు మంత్రి అచ్చెన్నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన నివాసంలో పార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అరాచకాల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఇంతకన్నా దిగజారుడు మార్గం మీకు దొరకలేదా..? అని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర బీసీ బిడ్డగా, కాపు నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన బొత్స సత్యనారాయణను అవమానిస్తే అది వెనుకబడిన వర్గాలందరికీ అవమానించినట్టేనని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మండల పరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, యువజన విభాగం అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి నగరానికి చెందిన కంటుభుక్త చినసూర్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన భార్య సరోజిని, కుమారుడు శ్రీనివాస్‌లు రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్‌కు విరాళం అందజేసి రశీదు పొందారు. కార్యక్రమంలో రిటైర్డ్ తహశీల్దార్ పి.వి.శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం శ్రీకాకుళం కల్చరల్: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తుందని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద ఉన్న ప్రెస్‌క్లబ్‌లో సంఘ 7వ జిల్లా మహాసభ మంగళవారం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డి.ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా టి.భీమారావు, ఉపాధ్యక్షులుగా డి.నందికేశ్వరరావు, జి.రామారావు, బి.సాయి, కోశాధికారిగా కె.శివశంకర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్.ఎస్.ప్రకాశరావు, ఎం.సుదర్శన్, పి.శోభన్, వై.రాముతో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సత్తారు భాస్కరరావు, పేడాడ పరమేశ్వరరావు, కొంక్యాన వేణుగోపాల్, గరుకు లక్ష్మణరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.మురళి, కె.ప్రసాద్, ఎ.వి.రమణ, జి.భాస్కరరావు, కె.సుదర్శనరావు, బి.వాసుదేవరావు, ఎం.ప్రసాద్ ఐ.పోతన్నదొర, వెల్ఫేర్ కమిటీ కన్వీనర్‌గా సదాశివుని కృష్ణ, కో కన్వీనర్‌గా జి.మన్మథరావులను ఎన్నుకున్నారు. అనంతరం జాతీయస్థాయి ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా ఎంపికై న కె.జయశంకర్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎన్ఏజే కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, జాతీయ కార్యవర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మణరావు, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. సారా విక్రయదారుడికి జైలుశిక్ష వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర ఉమాపతికి సారా విక్రయించిన కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 2లక్షల జరిమానా విధిస్తూ పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యూ.మాధురి మంగళవారం తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు చేస్తున్న తనిఖీలలో భాగంగా 2018 మే 21న ఉమాపతి సారా విక్రయిస్తూ పట్టుబడ్డాడు. అప్పట్లో విధుల్లో ఉన్న ఎక్సైజ్ సీఐ బి.మురళీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సంబంధిత శాఖాధికారి కె.మల్లికార్జునరావు తెలిపారు. విదేశాలకు పోస్టల్ పార్శిల్ సేవలు హిరమండలం : పోస్టల్ శాఖ ద్వారా ఇతర దేశాలకు వస్తువులను పార్శిల్ సేవలు అందించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు అన్నారు. మంగళవారం హిరమండలంలోని పలు తపాలా కార్యాలయాలను తనిఖీలు చేశారు. తినుబండారాలు, ఇతర వస్తువులు, గిరిజన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఇతర దేశాలకు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయనతో పాటు శేషాద్రినాయుడు, జగదీష్, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థులకు కవిత, కథల పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కళాశాలల విద్యార్థులకు కవిత, కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాసు, కోశాధికారి నెట్టిమి రమణారావు, కంచరాన భుజంగరావు, పూజారి దివాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగం, అవినీతి, విద్యా విధానంలో లోపాలు, జెన్ జీ ఆందోళనలు, పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలు, పర్యావరణం వస్తువుగా 30 పంక్తులకు మించని కవిత రాయాలని కోరారు. అభ్యుదయకరమైన ఆలోచింపజేసే సంఘటనలు, పరిణామాలు వస్తువుగా రెండు పేజీలకు మించని కథ, జెన్ జీ ఆందోళనలు – నవ్య సమాజం వైపు అడుగులు, అనే అంశంపై రెండు పేజీలకు మించని వ్యాసం రాయాలని కోరారు. సెప్టెంబర్ 10లోగా 94900 98811 నంబర్‌కు వాట్సాప్ ద్వారా గానీ, కేతవరపు శ్రీనివాసు, 8–42/1, తిలక్ నగర్, వంశధార క్వార్టర్స్ వెనుక, ఇలిసిపురం, శ్రీకాకుళం 532001కు పోస్టు ద్వారా గాని పంపించాలని కోరారు. ప్రథమ బహుమతికి రూ.2వేలు, ద్వితీయ బహుమతికి రూ.వెయ్యి, తృతీయ బహుమతికి రూ.500 అందిస్తామని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
లేబర్ కోడ్లతో కార్మికులకు నష్టం
శ్రీకాకుళం పాతబస్టాండ్: లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబులు చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు, కార్మికులు, సంఘాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఆశా, అంగన్వాడీ, ఆర్పీలు తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొత్త పీఆర్సీ అమలు చేయాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వలస కార్మికులకు వలస కార్మిక చట్టం అమలు చేయాలని, గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.అప్పలరాజు, ట్రైమేక్స్ యూనియన్ అధ్యక్షులు వై.సూర్యనారాయణ, టి.జి.ఐ.యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.అప్పలరాజు, హమాలీ యూనియన్ నాయకులు లబ్బరాజు, చిన్నారావు, సివిల్ సప్లయ్ యూనియన్ నాయకులు మెహన్రావు, నారాయణ, స్కూల్ స్వీపర్ల యూనియన్ ప్రతినిధి భాను తదితరులు పాల్గొన్నారు. -
బొత్సపై అనుచిత వ్యాఖ్యలు తగవు
శ్రీకాకుళం అర్బన్: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్మోహనరావు అన్నారు. శ్రీకాకుళంలోనే ఓ ప్రైవేటు అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాలలో బీసీ కులాల నుంచి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా బొత్స సత్యనారాయణ ఎదిగారని చెప్పారు. అటువంటి వ్యక్తిపై మంత్రి వ్యాఖ్యలు చేయడం జుగుప్సాకరమన్నారు. అధికార, ప్రతిపక్ష సీనియర్ రాజకీయ నాయకులు గౌరవించే వ్యక్తి బొత్స అని గుర్తు చేశారు. రాజకీయాలు దిగజారుతున్న సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు రాష్ట్రానికి ఒక రోల్ మోడల్‌గా ఉండాలని, ఇటువంటి వ్యాఖ్యలతో జిల్లా పరువును దిగజార్చవద్దని హితవు పలికారు. లుకలాపు లక్ష్మణరావు, బొడ్డేపల్లి రాజగోపాలరావు, గొర్లె శ్రీరాములునాయుడు, కింజరాపు ఎర్రన్నాయుడు, గుండ అప్పలసూర్యనారాయణ వంటి నాయకులు నీతీ, నిజాయితీతో పాటు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సమస్యలపై, శాశ్వత అభివృద్ధి పనులపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పి గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలని కోరారు. -
సచివాలయంలో చోరీ
రణస్థలం: పిసిని గ్రామ సచివాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి పలు వస్తువులు పట్టుకుని వెళ్లిపోయినట్లు పంచాయతీ కార్యదర్శి లండ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాళం బద్దలుకొట్టి రెండు యూపీఎస్‌లు , సీపీయూ, కీబోర్డు, మానిటర్, వెబ్ కెమెరా, హెడ్ ఫోన్స్, ప్రింటర్, టీవీ వంటివి దొంగిలించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సచివాలయాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు. -
వసతి గృహాలపై సవతి ప్రేమ
● భద్రతా లోపంతో విద్యార్థులకు ఇక్కట్లు ● కురుడు బీసీ బాలుర వసతి గృహం సంఘటనే నిదర్శనం ● వార్డెన్ సస్పెన్షన్, వాచ్మెన్ తొలగింపు చర్యలతో సరిపెట్టేస్తారా..? టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ వసతి గృహాలపై సవతి ప్రేమ చూపిస్తోంది. గత ప్రభుత్వం వరకు సంక్షేమ వసతి గృహాల్లో భద్రతతో పాటు అన్ని రకాల మౌళిక సదుపాయాలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ వసతి గృహాల్లో తరచూ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఘటనలు.. ● వసతి గృహాల్లో భద్రత ఎంత డొల్లతనంగా ఉందో రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి మండ లం కురుడు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థి మృతి ఘటన తేట తెల్లం చేసింది. ● దానికి కొంత కాలం ముందు మెళియాపుట్టి మండలం భరణికోట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మేడ మీద నుంచి కిందకు దూకేసింది. ● జి.సిగడాంలో గల కేజీబీవీ వసతి గృహానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు హాస్టల్ నుంచి ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్లిపోయారు. ● కోటబొమ్మాళి కేజీబీవీలో ఓ విద్యార్థిని మేడ మీద నుంచి కిందకు దూకేసింది. ● గార మండలంలో కేజీబీవీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డయేరియా వ్యాప్తి చెందింది. తొలగిస్తే సరిపోతుందా..? కోటబొమ్మాళి మండలం కురుడు బీసీ బాలుర వసతిగృహానికి చెందిన 6వ తరగతి విద్యార్థి ముద్దాడ దుర్గాప్రసాద్ మృతి కేవలం సిబ్బంది నిర్లక్ష్యమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటికే వార్డెన్ లక్ష్మణరావును సస్పెండ్ చేయడంతో పాటు వాచ్‌మెన్‌ను విధుల నుంచి తప్పించినట్లు ఏబీసీడబ్ల్యూఓ త్రినాథరావు వెల్లడించారు. ప్రస్తుతానికి నిమ్మాడ వార్డెన్ శివప్రసాద్‌కు కురుడు హాస్టల్ బాధ్యతలను అప్పగించా రు. బాధిత కుటుంబానికి వార్డెన్ కొంత మొత్తాన్ని పరిహారంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై వార్డెన్ సస్పెన్షన్, వాచ్మెన్ తొలగింపు చర్యలతో సరిపెట్టేస్తారా లేక భద్రత విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో వార్డెన్‌కు రెండు నుంచి మూడు హాస్టల్స్ బాధ్యతలను అప్పగించడంతో ఆ భారంతో పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. సంఘటనలు జరిగినపుడు హడావుడి చర్యలు తప్ప ఆ తర్వాత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
దగా డీఎస్సీపై ఎమ్మెల్సీల నిరసన
కవిటి: ఏపీ శాసనమండలి రెండో రోజు సమావేశాల నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ చెందిన ఎమ్మెల్సీలు అర్హులైన నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన అన్యాయంపై సమగ్ర న్యాయ విచారణ జరగాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం వర్షాకాల సమావేశాల రెండో రోజు ఇదే అంశంపై ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. శాసనమండలి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తూ సమావేశానికి హాజరయ్యారు. 2025 లో నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక్కో టీచర్ పోస్టు రూ.20 లక్షలకు అమ్ముకోవడం సిగ్గుచేటు అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాసనమండలికి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో నర్తు రామారావు, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్‌తోపాటు సహచర సభ్యులు పాల్గొన్నారు. -
ఈ దుస్థితి మునుపెన్నడూ లేదు
గతంలో ఇలాంటి దుస్థితి లే దు. కౌలుకు ఇవ్వాల్సిన పంట ఫలం ఎలా అందించాలో అర్థం కావడం లేదు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించి ఆదుకోవాలి. – బోనిగి ప్రసాదరావు, కౌలు రైతు, కలివరం గ్రామం, ఆమదాలవలస రూరల్ మండలం వ్యవసాయం వల్ల ప్రయోజనం లేదు విత్తనాల నుంచి ఎరువుల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. కనీసం సాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇలా అయితే వ్యవ సాయం చేయడం చాలా కష్టం. పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. – మన్నెన తవుడు, రైతు, తొగరాం గ్రామం -
అన్నదాతలకు యూరియా కష్టాలు
పాతపట్నం: ప్రభుత్వం ఎరువుల పంపిణీకి సంబంధించి నూతనంగా యాప్‌ను తీసుకొచ్చింది. యాప్‌లో పేరుంటేనే ఎరువులు పంపిణీ చేయాల ని నిబంధన విధించారు. యాప్‌లో పేర్లు లేని వారు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నా బుకింగ్ ఓటీపీ, సర్వర్ డౌన్, తదితర సమస్యలతో ఎరువులు బుకింగ్ సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా, డీఏపీ, ఎరువులు సకాలంలో లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు మూడు బస్తాలు కావాల్సి ఉండగా 75 కిలోల యూరియాను మాత్రమే అందిస్తామని, అది కూడా ఫోన్ యాప్‌లో ఒకే అయితేనని అధికారులు చెబుతున్నా రు. మంగళవారం గంగువాడలో డీఏపీ కోసం గంటల కొద్దీ లైన్లో ఉన్నామని రైతులు వాపోయారు. దీంతో యూరియా, డీఏపీ కోసం పనులు మానుకుని రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


