సారా నిర్మూలనకు కృషి
పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సారా రహిత గ్రామాలున్న మండలంగా పాతపట్నం ఎంపికై ందని శ్రీకాకుళం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా–ఆంధ్ర చెక్‌పోస్ట్, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్‌పోస్ట్‌లను బుధవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటు సారా, మద్యం రవాణాకు ఆస్కారమున్న ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అనంతరం పాతపట్నంలోని మద్యం షాపును తనిఖీ చేశారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.


