ఇచ్ఛాపురం రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు గాలి హామీలు ఇవ్వడం తప్ప పనులు చేయడం లేదు.
– దక్కత నూకయ్యరెడ్డి, రైతు సంఘ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం
సీఎం హామీకే పత్తా లేదు
2024 నవంబర్ 1న ఈదుపురం గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్ఛాపురం రైతాంగాన్ని ఆదుకున్నట్లు, ఆదుకోబోతున్నట్లు అబద్ధపు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అటు గ్రోయిన్స్ నిర్మాణాలు గానీ, ఇటు ఈదుపురం ఎత్తిపోతల పథకం మరమ్మతు చేయలేదు.
– డాక్టర్ పూడి కిరణ్‌కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గం


