breaking news
Orissa
-
2029 నాటికి మాదకద్రవ్య రహిత రాష్ట్రమే లక్ష్యం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో శుక్రవారం 13వ బ్యాచ్ క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్ల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మాట్లాడుతూ రెండేళ్ల కఠినమైన ఇండోర్, అవుట్డోర్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 336 మంది కొత్త క్యాడెట్ సబ్ ఇన్స్పెక్టర్లలో 70 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు ఉండడం రాష్ట్రంలో బలపడుతున్న మహిళా సాధికారత, సామాజిక స్వరూపానికి ఒక ప్రకాశవంతమైన ప్రతిబింబంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా 2029 నాటికి ఒడిశాను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక నేరాలు, సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి ఒడిశా పోలీసులు నిరంతరం తమను తాము నవీకరించుకోవాలని ప్రోత్సహించారు. రాష్ట్రంలో మావోయిస్టు, నక్సల్ హింసను పూర్తిగా అణచివేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో పోలీసు శాఖలో 17,794 కొత్త పోస్టులను సృష్టించి 5,817 పోస్టులను భర్తీ చేశారు. పోలీస్ ఠాణాల సామర్థ్యం పెంపుదలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. పోలీసు బలగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ‘స్మార్ట్ పోలీసింగ్’ విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో రాణించిన క్యాడెట్లను ముఖ్యమంత్రి సత్కరించారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించిన పి.నళిని రావుకు ముఖ్యమంత్రి గవర్నర్ పతకం, ట్రోఫీ, రూ.10,000 నగదు బహుమతిని అందజేశారు. పోలీస్ శిక్షణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తేజస్విని మహంత్రాయ్, యుధిష్టర్ బెహరా, లక్ష్మణ్ కుమార్ మహంతో, సస్మిత ఖుంటియా, నిహారిక త్రిపాఠి, అశుతోష్ నాయక్‌లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయతోష్ మిశ్రా, బిజూ పట్నాయక్ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ సాహు, రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులు, ఇండోర్, అవుట్డోర్ శిక్షకులు, కొత్తగా నియమితులైన క్యాడెట్ల సంరక్షకులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. -
పట్టుపురంలో నాగ్ అశ్విన్ సందడి
మెళియాపుట్టి: పట్టుపురంలో జరిగిన ఒక వివా హ వేడుకకు కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ సతీసమేతంగా శుక్రవారం హాజరయ్యా రు. తనతోపాటు డైరెక్టర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నంబాళ్ల వెంకటరమణ తన స్వగ్రామం పట్టుపురంలో(పక్కనే చాపరలో ఉన్న ఒక కల్యాణ మండపంలో) వివాహం చేసుకున్నా రు. దీంతో నాగ్ అశ్విన్‌తో పాటు అతని భార్య ప్రియాంకదత్, మరికొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పలువురు యు వకులు, అభిమానులు ఆయనతో సెల్ఫీలకు ఎగబడ్డారు. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పరాంకుశ్నగర్ కాలనీకి చెందిన యువతి అదృశ్యమైనట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. భర్త చనిపోవడంతో రైతు బజారులో పిండిమిల్లు నడుపుతున్న ఒక మహిళ తన చిన్న కుమార్తెతో కలిసి పరాంకుశ్నగర్లో నివసిస్తోంది. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఆమె కుమార్తె ఒక ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్పత్రి విధులకని బయల్దేరింది. 1.45కి తల్లి ఫోన్ చేస్తే ఆటోలో వెళ్తున్నట్లు చెప్పింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులను ఆస్పత్రి వద్ద కనుక్కోమని పంపింది. అయితే సదరు యువతి విధులకు రాలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడం, రాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పెద్దపాడు వద్ద టాటా మ్యాజిక్ వ్యాన్‌లో పోగొట్టుకున్న 3 తులాలు బంగారమున్న బ్యాగును తిరిగి బాధితునికి అదే వ్యాను డ్రైవర్ పోలీసుల సమక్షంలో అప్పగించారు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం ఆనందపురానికి చెందిన రాము అనే వ్యక్తి బిలాయి వెళ్లేందుకు గురువారం సాయంత్రం బయల్దేరాడు. నందిగాం నుంచి శ్రీకాకుళం చేరి అక్కడి నుంచి బస్సులో విజయనగరం రైల్వేస్టేషన్‌కు వెళ్లి, ట్రైన్లో వెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. దీనిలో భాగంగా నందిగాంలో టాటా మ్యాజిక్ వ్యాన్ ఎక్కి పెద్దపాడు వద్ద దిగి ఆటోకి మారాడు. ఆటో ఎక్కాక గానీ బంగారం, రూ.3 వేలు నగదు, 4 కిలోల జీడిపప్పున్న బ్యాగు మర్చిపోయిన విషయం తెలియరాలేదు. అయితే మ్యాజిక్ వ్యాన్ డ్రైవర్ రవికుమార్ తనకు తానే శుక్రవారం రాత్రి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బ్యాగుతో సహా రావడంతో బాధితుడైన రామును రప్పించిన పోలీసులు బ్యాగును రవి చేత ఇప్పించారు. బీచ్‌రోడ్డు: పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జోన్–1 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వందలాది మంది ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఈ దీక్షలు కొనసాగుతాయని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే జోన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భార్గవ్ సుతేజ్, నిఖిల్ కృష్ణ, అబ్దుల్ రజాక్, శంకర్, మధుబాబు, సుమంత్ అబ్రహం, నాగేశ్వరరావు, బండారు శ్రీనివాస్, పార్థసారథి, శ్రీరామ్ నాయుడు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు
జయపురం: తప్పించుకు తిరగుతున్న అంతర్ ర్రాష్ట్ర దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగ సునా హరిజన్‌ను అరెస్టు చేశారు. నవరంగపూర్, కొరాపుట్, కలహండి జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈయనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే బొరిగుమ్మ పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద ఒక తుపాకీతో పాటు ఎక్కువ తూటాలు స్వాధీన పరచుకున్నట్లు పోలీసు అధికారులు శుక్రవారం వెల్లడించారు. నిందితుడు నవరంగపూర్ జిల్లా కుసిమి గ్రామ వాసి. అతనిపై కలహండి, కోరాపుట్, నవరంగపూర్ జిల్లాల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 30కి పైగా కేసులున్నాయి. గతంలో బొరిగుమ్మ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేయడం, పోలీసులను హత్య చేసేందుకు ప్రయత్నించటం, వివిధ మారణాయుధాలతో దాడి జరపటం మొదలగు కేసులలో నిందితుడు. అతడిని పట్టుకొనేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ వర్య నేతృత్వంలో జిల్లాలో ఇద్దరు అదనపు ఎస్పీలు బొరిగుమ్మ ఎస్డీపీఓ, బొరిగుమ్మ పోలీసు అధికారి, జిల్లాలో కొంతమంది పోలీసులతో స్వతంత్ర టీమ్ ఏర్పాటు చేశారు. అతడిని పట్టుకొనేందుకు ఆ టీమ్ పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్పూర్ పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడులలో నిందితుడుని అతికష్టంపై పట్టుకొని అరెస్టు చేసి బొరిబుమ్మ స్టేషన్‌కు తీసుకు వచ్చి తమదైన పద్ధతిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడులలో కొరాపుట్ అదనపు ఎస్పీలు మనోజ్ పూజారి, అభిషేక్ పాణిగ్రహి, బొరిగుమ్మ పోలీసు సబ్ఇన్స్పెక్టర్ సిద్ధార్థ బెహర, కానిస్టేబుళ్లు అజయ ఖొర,సోను పంగిలు పాల్గొన్నారు. నిందితుడు సునా హరిజన్ ను ఛత్తీస్‌గఢ్‌లోని పోలీసుల సహకారంతో అరెస్టు చేసినట్లు బొరిగుమ్మ పోలీసులు వెల్లడించారు. -
విద్యార్థుల ఆందోళన
పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో ఒక ప్రైవేట్ భవనంలో నడుపుతున్న ప్రియదర్శిని కాన్వెంట్ స్కూల్ అమ్మకానికి పెట్టారని తెలిసిన స్కూల్ ప్రిన్సిపాల్ వి.రమేష్ భార్య శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారితో మాట్లాడారు. నలభై ఏళ్లుగా ప్రియదర్శిని కాన్వెంట్ నడుపుతున్న యాజమాన్యం స్కూల్ భవనం అమ్ముతున్నారని, రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిసినట్టు విలేకరులకు తెలియజేశారు. ఈ విషయంపై భవనం హక్కుదారులు రాజవీధికి చెందిన వైశ్యరాజు సుకుమార్ రాజు, వి.శక్తికుమార్ రాజులు తమకు ఈ విషయం తెలియదని అంటున్నారు. స్కూల్ ఇదివరకు అమ్మకానికి పెట్టినప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ ఇంటి ఓనర్‌తో కోన్నేళ్లకు లీజ్‌కు తీసుకున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా అమ్ముతున్నారని తెలిసి సబ్‌రిజిస్ట్రారు అధికారితో మాట్లాడారు. ఈ భవనం అమ్మితే 250 మంది పిల్లల భవిష్యత్ ఏమవుతుందని ప్రిన్సిపల్ పట్నాయక్ చెబుతున్నారు. ఈ ప్రైవేట్ భవనం యాజమాన్యానికి అన్ని డాక్యుమెంట్లు ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వానికి అభ్యతరం ఉండదని సబ్‌రిజిస్ట్రార్ తెలియజేశారు. -
ఘనంగా వీహెచ్‌పీ వ్యవస్థాపక దినోత్సవం
పర్లాకిమిడి: విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం మరియు పూజ్య స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన దినోత్సవాన్ని రాయఘడ బ్లాక్ బిసంపాడి గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.పి నాయకులు తరిణీ చరణ్ దాస్, అధ్యక్షుడు కై లాస్ చంద్ర గౌడో, కార్యదర్శి శ్యాంసుందర శోబోరో తదితరులు పాల్గొని స్వామి లక్ష్మణానంద సరస్వతీని అన్యాయంగా హతమార్చడాన్ని నిందించారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా భాగవతంలో పలు ప్రవచనములను తరిణీ చరణ్ దాస్ తెలియజేశారు. భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మహేంద్రగిరిలో సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ మహేంద్రరి వద్ద ద్వితీయ రాష్ట్ర ఎం.టి.బి మహిళా సైక్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలను మోహనా ఎమ్మెల్యే దారరథి గోమాంగో శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర స్థాయిలో మహిళా సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో మాట్లాడుతూ.. పర్యాటక కేంద్రం మహేంద్రగిరి వద్ద ఇటువంటి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం వల్ల ఈ ప్రాంతం క్రీడాకారులకు కేంద్రంగా మారునుందన్నారు. ఈ నెల 6 వరకు ట్రెక్కింగ్, వివిధ పోటీలు జరుగనున్నాయని భుభనేశ్వర్ నుంచి విచ్చేసిన అస్మితా ఖేలో ఇండియా అధికారులు తెలియజేశారు. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
● మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్రాయగడ: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాయగడ మున్సిపల్ చైర్మన్ మహేష్ పట్నాయక్ అన్నారు. స్థానిక మజ్జిగౌరి కార్పెంటర్స్ అసోసియేషన్ 45వ వార్షికోత్సవం శుక్రవారం ఆ అసోసియేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన మాట్లాడుతూ.. జిల్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని వివరించారు. ప్రధానంగా కార్మిక వర్గానికి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నార. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులు, వారి కుటుంబాల ఆర్ధికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి బీపీఎల్ కార్డులు అందేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డివిజినల్ లేబర్ కమిషనర్ సురేష్ చంద్ర మండల్ మాట్లాడుతూ.. కార్మికులు తమ లేబర్ కార్డులను సకాలంలో ఆధునీకరించుకోవాలని సూచించారు. లేబర్ కార్డులు సక్రమంగా ఆప్డేట్ చేసుకున్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పఽథకాల ప్రయోజనాలు సులభంగా పొందగలరన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది చందన్ హరేంద్ర నాఽథ్ మాట్లాడుతూ.. కార్మికులంతా ఐక్యంగా ఉంటే సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవచ్చాన్నారు. కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిత్తూరి సొంబాబు మాట్లాడుతూ.. గత 45 ఏళ్లుగా సంఘం కార్మికుల సంక్షేమం కోసం అనేక ప్రజా హిత కార్యక్రమాలను నిర్వహిస్తువస్తుందన్నారు. కార్పెంటర్ వృత్తిపై ఆధారపడి రాయగడలో సుమారు 15 వందల కుటుంబాలకు పైగా జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. కార్మికులందరికీ మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా జిల్లా యంత్రాంగం సహకరించాలన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు సునీల్ కర్, తదితర ప్రముఖులు ప్రసంగించారు. కొలువు దీరిన కొత్త కార్యవర్గం.. మజ్జిగౌరి కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా చిత్తూరి సొంబాబు, ఉపాధ్యాక్షుడిగా పి.ఈశ్వరరావు, కార్యదర్శిగా అరసాడ అనంత్, సహకార్యదర్శిగా తామాడ శ్రీనివాస్, కోశాధికారిగా లక్కొజి సురేష్, సహ కోశాధికారిగా బి.సురేష్, సలహాదారులుగా ఎ.జగన్మోహన్ రావు, సిహెచ్ రామకృష్ణ, ఎ.సత్యనారాయణ, కె.శ్రీనివాస్ రావు, పి.గౌరి శంకరరావు, ఎ.పోలిరాజు, ఎగ్జిక్యూటీవ్ సభ్యులుగా కొవాడ గౌరి, వి.సత్యనారాయణ, ఎ.జగదీష్, కె.రుద్ర, ఎం.శివ, ఎం.గంగరాజు, నాయుడు సతీష్, అశోక్ మాఝి, నాయుడు గౌరి, బి.శంకరరావు, ఎం.గౌరి, కె.ఆచారి, టి.జనార్దన ఎన్నికయ్యారు. -
గుమ్మ ఘాటీలో వరుస ప్రమాదాలు
రాయగడ: సదరు సమితి పరిధిలోని గుమ్మ ఘాట్‌లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం ప్రమాదం కారణంగా సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ నిలిచింది. శుక్రవారం జరిగిన మరో ప్రమాదం కారణంగా జాతీయ రహదారి–326పై దాదాపు ఎనిమిది గంటలుగా రాకపోకలు నిలినిచిపోయాయి. వందలాది వాహనాలు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమాచారం ప్రకారం గుమ్మప్రాంతంలో గల ఘాట్ సమీపంలో ఓ లారీ యంత్రిక లోపం కారణంగా రహదారిపై నిలిచిపొయింది. అదే సమయంలో గుమ్మ ఘాటిలోని మలువు వద్ద వెనుక నుంచి వచ్చిన మరో ట్యాంకర్ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన అర్ధ రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో అప్పటి నుంచి రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ప్రమాదం కారణంగా రాయగడ మీదుగా కాసీపూర్, కోరాపుట్లకు పూర్తిగా రాకపోకలు నిలిచిపొయాయి. సమాచారం అందుకున్న కుంభికోట పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మలుపు వద్ద రహదారిని విస్తరించాలని వాహన చొదకులు కోరుతున్నారు. సాగర్ సౌందర్యీకరణకు రూ. 37 కోట్లతో ప్రతిపాదన జయపురం: జయపురం పట్టణంలో చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ సౌందర్య కరణకు రూ. 37 కోట్లతో రారష్ట్‌ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో జయపురం ప్రసిద్ధ చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ అభివృద్ధి, సుందరీకరణపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగరం చుట్టూ వాకింగ్ ట్రాక్, పార్క్ లైటింగ్, బోటింగ్ సౌకర్యం, పర్యాటక కేంధ్రంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నన్నారు. దీని కోసం రూ.1.37 కోట్ల వ్యయపు అంచనాతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నట్లు మున్నిపల్ పాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ వెల్లడించారు. సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి.సునీత, కొరాపుట్ ఎంపీ ప్రతినిధి హసన్ మధాని,మునిసిపాలిటీ ఇంజనీర్ సుధార్ కుమార్ జాని,సీనియర్ ఇంజనీర్ హేమంత కుమార్ పండ,మునిసిపాలిటీ కౌన్సిలర్లు పాల్గున్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాకుళం క్రైమ్ : ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ, బ్యాంకింగ్, సోషల్ మీడియా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ, పిన్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దన్నారు. ఏటీఎంల వద్ద అపరిచిత వ్యక్తులు ఫోన్ పే చేస్తామన్నా.. లేదా ఫోన్‌పే చేయండన్నా స్పందించవద్దన్నారు. నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు, బాలికల భద్రతకు అందుబాటులో ఉన్న శక్తియాప్ వినియోగించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వాలన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అనర్థాలు జరుగు తాయన్నారు. అభయం హెల్మెట్ కార్యక్రమం ద్వా రా అవగాహన కల్పించి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లు వాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్విచక్రవాహనంపై వెనక కూర్చొన్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలన్నారు. -
ముగ్గురు యువకుల అరెస్టు
జయపురం: బంగారు గొలుసు దొంగిలించిన ముగ్గురు నిందితులను జయపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారు జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి బుటుగుడ గ్రామం సనసాయి హరిజన్, అదే గ్రామస్తులు కమల లోచన బారిక్ ,భుబణ హరిజన్ లు అని జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంధ్ర రౌత్ శుక్రవారం వెల్లడించారు. ముగ్గురు నిందితులు ఆగస్టు 27 వ తేదీన జయపురంలో ఒక మహిళ మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలతో ఉన్న గొలుసును తెంచుకు పోయారని ఆ మహిళ 29 వ తేదీన పట్టణ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయబడిన నిందితులు మహిళ మెడలో బంగారు గొలుసు దొంగిలిచినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసు ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. మరో ముగ్గురు అరెస్టు పర్లాకిమిడి: పర్లాకిమిడిలో ముక్కుడమ్మ మహిళా స్వయం సహాయక గ్రూప్, మైక్రో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సుమారు రెండుకోట్ల రూపాయల రుణాలు తీసుకుని కలెక్షన్ ఎగవేత, నిధులు దుర్వినియోగం, మోసం కేసులో మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు డీఎస్పీ అమితావ్ పండా తెలియజేశారు. శుక్రవారం అరెస్టయిన వారిలో కాళీప్రసాద్ పండిట్ (54)(విక్టరీ కాలనీ), భక్షీవీధికి చెందిన సపన్‌కుమార్ పాణిగ్రాహి (57), రాజవీధికి చెందిన అశోక్‌కుమార్ మహరాణా (37)లను శుక్రవారం సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్ కోర్డులో వారిని హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి ట్రాన్స్‌జెండర్ సిద్ధకుమార్ అలియాస్ లక్కీని గత నెల 29న హైదరాబాదు యూసఫ్గుడలో అరెస్టుచేసిన విషయం తల్సిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఎస్.స్వాతి పరారిలో ఉన్నట్టు తెలియజేశారు. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. -
64 కేసుల్లో నిందితుడిపై చర్యలకు ప్రభుత్వం ఆమోదం
రాయగడ: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 64 కేసులతో సంబంధం ఉన్నట్లు పో లీసులు పేర్కొన్న హడప శివ పై కలెక్టర్ జారీ చేసిన నిర్భంద ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జాతీయ భద్రతా చట్టం–1980 (ఎన్ఎస్ఏ) కింద జారీ చేసిన ఈ ఉత్వర్వులను రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక విభాగం సెప్టెంబరు 3 వ తేదీన ఆమోదించినట్లు వెల్లడైంది. పోలీసుల నుంచి అందిన వివరాల ఆధారంగా హడప శివపై రాయగడ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో 64 కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా చట్టం కింద అతడిని నిర్భంధంలో ఉంచేందుకు రాయగడ జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన నిర్భంధ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినట్లు స్పష్టం చేసింది. దీంతో శివ నిర్బంధ ప్ర క్రియకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అనుమతి లభించినట్టైంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శివను ప్రస్తుతం సంబల్పూర్ సర్కిల్ జైలులో నిర్భంధంలో ఉంచారు. తదుపతి ఉత్తర్వులు వెలువడే వరకు అతడు నిర్బంధంలోనే కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉత్వర్వుల్లో శివ వయసు 40 ఏళ్లుగా, తండ్రి పేరు హడప గుణగా, రాయగడ పట్టణంలోని రెల్లి వీధికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నా రు. జిల్లాలో పలు కేసుల్లో సంబంధం ఉన్న వ్యక్తిపై జాతీయ భద్రత చట్టం కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. -
215 కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: గంజాయి అక్రమ నిల్వల గుట్టురట్టయింది. మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బింబాధర్ పండా ఆదేశాలతో జిల్లా మొబైల్ యూనిట్ అధికారులు బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలో డైక్–2 గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా రవాణా చేసేందుకు గంజాయి సిద్ధంగా ఉంచినట్టు అందిన సమాచారం మేరకు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. బస్తాల్లో నిల్వ ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని చిత్రకొండ సమితిలో మారుమూల గ్రామాల నుంచి పడవల్లో తరలించి ఇతర రాష్ట్రాలకు పంపించేందుకు వీలుగా బస్తాల్లో ప్యాక్ చేసి సిద్ధం చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని శుక్రవారం చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ సమక్షంలో తూకం వేయగా 215 కిలోలు ఉంది. దీని విలువ 22 లక్షల రూపాయలు ఉంటుందని ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బింగరాజ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ టంకధర్ దామీ తెలిపారు. కేసు నమోదు చేసి గంజాయి ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
కృష్ణాష్టమి వేడుకలు
అంగరంగ వైభవంగా రాధాకృష్ణ వేషధారణలో చిన్నారులురాయగడ: స్థానిక డైలీ మార్కెట్లోని శ్రీ కృష్ణ ధ్యాన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. విశ్వ కల్యాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జన్మాష్టమి సందర్భంగా ముందుగా శ్రీకృష్ణ స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అనంతరం శ్రీకృష్ణ ధ్యానమందిరంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు స్థానిక శ్రీసరస్వతీ శిశు విద్యామందిర్‌లో ఘనంగా జరుపుకున్నారు. విద్యాలయంలో రెండు నుంచి ఐదో తరగతి విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణ పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయం కమిటీ పర్యవేక్షకులు సంజయ్ జెన్నా, ముఖ్యఅతిథిగా ఉపకారాగారం సూపరింటెండెంట్ కామాక్షి ప్రసాద్ పాఢి, మహాంత రామానంద దాస్, కోశాధికారి ప్రమోద్చంద్ర పాఢి, సరితా పాణిగ్రాహి, సుజాతా గోమాంగో ప్రముఖులు పాల్గొన్నారు. జయపురంలో.. జయపురం: జయపురంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తితో ఘనంగా జరుపుకున్నాయి. సరస్వతీ శిశుమందిర్ గీతా భవనం, రాధాకృష్ణ ఆలయం, రఘునాథ్ మందిరం తదితర ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పూజలు జరిపారు. గీతా భవనంలో శ్రీకృష్ణ వేషాల పోటీలు నిర్వహించారు. ఆ పోటీలలో అనేక మంది చిన్నారులు పాల్గొన్నారు. -
అంబులెన్స్ ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి కియాంగ్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం అంబులెన్స్ ఢీకొని ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. జనగణన సర్వేకు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. సాలిమ్ పంచాయతీ నూవగుడా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు హనురామ్ నాయక్ ఇంటి నుంచి బయలుదేరి స్కూటీపై కియాంగ్ పంచాయతీ బిజ్పధర్ గ్రామానికి వెళ్తుండగా కియాంగ్ గ్రామం వద్ద ఎదురుగా వచ్చిన అంబులెన్స్ స్కూటీను బలంగా ఢీకొట్టడంతో హన్రామ్ ఎగిరి పడిపోవంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అదే అంబులెన్స్‌లో మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే హనురామ్ నాయక్ చనిపోయినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న మాత్తిలి పోలీసులు ఆరోగ్య కేంద్రానికి చేరుకొని కేసునమోదు చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఐఐసీ దీపాంజలి తెలిపారు. కాగా ప్రమాద సమాచారం తెలిసిన వేంటనే హనురామ్ నాయక్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. -
ఆగని శిశు మరణాలు
రాయగడ జిల్లాలో● నాలుగేళ్లలో 2,765 మంది మృతి ● మూడు నెలల్లోనే 177 మంది చిన్నారుల మృతిరాయగడ: మాతా, శిశు సంరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ జిల్లాలో శిశు మరణాల పరంపర ఆగడం లేదు. గడిచిన నాలుగేళ్లలో జిల్లాలో ఏకంగా 2,765 మంది శిశువులు మృతి చెందగా, కేవలం గత మూడు నెలల్లోనే 0–1 సంవత్సరం వయసున్న 177 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం జిల్లాలో మాతా, శిశు ఆరొగ్యం, పోషకాహారం, వైద్య సేవల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆదివాసీ ప్రాబల్యం గల ఈ జిల్లాలో మహిళలు, చిన్నారుల్లో పొషకాహర లోపం, రక్తహీనత చాలాకాలంగా ప్రధాన సమస్యలుగా కొనసాగుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు, ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన కింద నెలకు 12 గుడ్లు, పుట్టగొడుగు, శనగలు, ఐరన్ పెంపునకు బాదం లడ్డు, ఖర్జూరం వంటి ఆహార పదార్థాలను అందిస్తోంది. అలాగే మమత పథకం ద్వార ఆర్థిక సాయం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతోంది. ఇన్ని పథకాలు, చర్యలు ఉన్నప్పటికీ శిశు మరణాలను నియంత్రించలేకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పొషకాహార లోపం, రక్తహీనత, న్యూమోనియా, ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని చోట్ల గర్భస్థ దశలోనే, మరొకొన్ని సందర్భాల్లో ప్రసవం అనంతరం నవజాత శిశువులు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. కొనారలో అత్యధిక మరణాలు గత మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలోని కొలనార సమితిలో అత్యధికంగా 29 మంది శిశువులు మృతి చెందారు. అలాగే కాశీపూర్, బిసంకటక్లలో చెరో 21 మంది కళ్యాణసింగుపూర్‌లో 25 , రాయగడలో 23, మునిగుడలో 16, గుణుపూర్‌లో 13, రామనగుడలో 10, చంద్రపూర్‌లో 7, గుడారిలో 6, పద్మపూర్‌లో 4 గురు శిశువులు మృతి చెందారు. పట్టణ ప్రాంతంలోనూ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాలుగేళ్ల గణాంకాలు మరింత ఆందోళనకరం 2022–23 లో 19,475 మంది శిశువులు జన్మిస్తే ఇందులో 675 మంది మరణించారు. అదేవిధంగా 2024–25 లో 18,793 మంది శిశువులు జన్మిస్తే 674 మంది శిశువులు మృతి చెందారు. 2025–26 లో 15,976 మంది జన్మిస్తే 755 మంది మృతి చెందారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే జననాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ శిశు మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా 2025–26 లో 15,976 మంది శిశువులు జన్మించగా 755 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ప్రభుత్వం తరచూ ఉన్నత స్థాయి సమీక్షలను నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఆరో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల
● గజపతి జిల్లాలో 47,243 మంది రైతులకు లబ్ధిపర్లాకిమిడి: పీఎం కిసాన్ సహాయత పథకం కింద ఒడిశాలో ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులకు డీబీటీ ద్వారా పర్లాకిమిడి ఆర్.శెఠి భవనంలో శుక్రవారం అందజేశారు. ఆరో విడత పీఎం కిసాన్ నిధులు విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసారం చేసిన కార్యక్రమాన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మోహానా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్తు అధ్యక్షులు గవర తిరుపతి రావు, ఏడీఎం మునీంద్ర హానగ, సీనియర్ వైజ్ఞానికులు, ఆర్.ఉదయగిరి డాక్టర్ సంగ్రాం పరంగురు, వ్యవసాయ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శివచరణ్ శెఠి తదితరులు పాల్గొన్నారు. గజపతి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఎరువులు, ఇతర ఖర్చులకు 47,243 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 9.53 కోట్లు విడుదల చేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారి రవీంద్ర కుమార్ అధెక్, ఆదనపు వ్యవసాయ అధికారి సరోజ్ కుమార్ పాత్రో పాల్గొన్నారు. -
భారత ఉపరాష్ట్రపతితో రాష్ట్ర గవర్నర్ భేటీ
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్‌ను కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఒడిశా అభివృద్ధి, పాలన, సామాజిక, ఆర్థిక సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఉప రాష్ట్రపతితో చర్చించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అమలు వేగవంతం చేసే దిశలో అభివృద్ధి ప్రాధాన్యత, సంక్షేమ పథకాల కార్యక్రమాలపై వీరివురు చర్చించారు. ఒడిశాలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థమైన అమలు, వాటి ప్రయోజనాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందేలా చూడాల్సిన ఆవశ్యకతపై ఈ ఇరువురు ప్రముఖులు చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. డాక్టర్ కంభంపాటి న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులను కూడా కలవనున్నారు.కొండచిలువ హల్చల్ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి పరజాగూడ గ్రామంలో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో ఆరు అడుగుల కొండ చిలువల్ హల్చల్ చేసింది. కోళ్లను తిని ఓచోట ఉన్న కొండచిలువను ఇంటి యజమాని గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ వారు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్ సత్యజిత్ గౌడ్‌కు సమా చారం ఇవ్వడంతో అటవీశాఖ ఉద్యోగి డాంబురు సహాయంతో పామును అతికష్టపై పట్టు కున్నారు. కొండచిలువ మూడు కోళ్లను తినేసింది. వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి అటవీ ప్రాంతంలో విడిచి పెడతామని అధికారులు వెల్లడించారు. వన్యప్రాణులను చూసి బయపడకుండా ఉండడంతోపాటు వాటికి హాని తలపెట్టకుండా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని స్నేక్హెల్ప్లైన్ సత్యజిత్ కోరారు. హై టెక్‌లో అరుదైన శస్త్ర చికిత్స భువనేశ్వర్: ఆరోగ్య సంరక్షణ రంగంలో హై టెక్ వైద్య బోధన ఆస్పత్రి మరో మైలు రాయిని నెలకొల్పింది. కటక్‌కు చెందిన రోగికి అరుదైన శస్త్ర చికిత్స చేసి కోలుకునేలా చేసింది. భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో పలు ప్రముఖ వైద్య సంస్థలు అతడికి నమ్మకమైన చికిత్స పొందేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకువెళ్లమని సలహా ఇచ్చి చేతులెత్తేశాయి. ఈ పరిస్థితుల్లో హై టెక్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుల బృందం గట్టి భరోసా ఇచ్చి సంక్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సకు నడుం బిగించింది. సంకల్పం మేరకు శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో దీర్ఘ కాలిక పీడితుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకుని బంధువులతో కలిసి ఇంటికి వెళ్లాడు. కటక్‌కు చెందిన ఈశ్వర్ రౌత్ చాలా కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో సతమతం అయ్యాడు. నడక, శ్వాస తీసుకోవడంలో నిరవధికంగా పడుతున్న బాధ నుంచి విముక్తి కోసం పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు సందర్శించిన తగిన వైద్యం, చికిత్స అక్కరకు రాలేదు. గుండెకు అనుసంధానం చేసే రక్త నాళం చిట్లి పోవడంతో ఏ ఆస్పత్రి కూడా రోగికి అవసరమైన శస్త్ర చికిత్స చేయడానికి అంగీకరించలేదని ఈశ్వర్ రౌత్ భార్య తెలిపింది. క్రమంగా ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హై టెక్ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్వేతంకర దాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో డాక్టర్ బెరియన్ స్వైన్ శస్త్ర చికిత్స బృందం రోగికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కొద్ది రోజుల్లోనే రోగి పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. -
ఒడిశా గుడిలో 12 అడుగుల నాగు
గంజాం: రోజు మాదిరిగానే వచ్చి గుడి తలుపు తీసిన పూజారికి గుండె ఆగిపోయినంత పనైంది. వెలుతురును చూడగానే లోపలున్న నాగుపాము అంతెత్తున లేచి, పడగవిప్పింది. మరో క్షణమైతే లోపలికి అడుగుపెట్టి ఉండే వాడే! ఆ ఒక్క క్షణమే పూజారి ప్రాణాలను కాపాడింది. ఆయన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులు కూడా చేరుకున్నారు. అందరూ కలిసి, దాదాపు గంటకుపైగా శ్రమించి, 12 అడుగుల ఆ భారీ విషనాగును పట్టుకున్నారు. ఒడిశాలోని గంజా జిల్లా చికిటి సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక రత్నే మాత ఆలయ పూజారి బుధవారం సాయంత్రం పూజల కోసం ఆలయానికి చేరుకున్నారు. ఆయన ఆలయ తలుపులు తెరిసీ తెరువకుండానే లోపలున్న ఓ భారీ నాగు పాము బుసకొడుతూ అంతెత్తున లేచి పడగ విప్పింది. పూజారి ఏం చేయాలో తెలియక బిక్కచచ్చి పోయారు. ఆవరణలోకి వచ్చి, చికిటి అటవీ అధికారులకు విషయం తెలిపారు. హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే బృందం కూడా వచ్చింది. ఆ భారీ పాము, చురుగ్గా కదలుతూ ఒక పట్టాన వారికి లొంగలేదు. కాళ్లకు షూలు ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా కాళ్లకు గోనె సంచులు కట్టుకుని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ పామును బందీని చేసేందుకు ప్రయత్నాలు సాగించారు. దాదాపు గంటపాటు శ్రమించిన తర్వాతే వారి ప్రయత్నం ఫలించింది. చివరికి నాగు పాము వశమైంది. అక్కడి నుంచి దానిని తీసుకెళ్లి, సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు అక్కడ సంచరించడం సాధారణమే అయినా, అంతపెద్ద పాము అదీ అత్యంత ప్రమాదకరం, విషపూరిత నాగుపాము అక్కడ కనిపించడం ఇదే మొదటిసారని స్థానికులు చెప్పారు. పామును పట్టుకెళ్లారని తెలిసి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన ఆరోపణలు
రాయగడ: మూడో తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణల నేపథ్యంలో ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేయడంతో జిల్లాలోని పద్మపూర్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. చర్యను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే ఉండాల్సి వచ్చింది. మరోవైపు అధికారుల చర్యను సమర్థిస్తున్న మరో వర్గం నిష్పక్షపాత దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుతోంది. దీంతో బిరిపదర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. జిల్లాలోని పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరిపదర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో సహాయక ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శివ ప్రసాద్ సాహు పై మూడో తరగతి విద్యార్థిని కుటుంబ సభ్యులు అసభ్య ప్రవర్తనకు సంబంధించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆగస్టు 12 వతేదీ న ఫిర్యాదు అందిన అనంతరం ప్రధానోపాధ్యాయురాలు ప్రణతి పాణిగ్రహి నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదు, తదుపరి దర్యాప్తు ఆధారంగా పద్మపూర్ సమితి ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బిఈఒ) హృషికేష్ రథ్ ఉపాధ్యాయుడు శివ ప్రసాద్ సాహును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ చర్యపై గ్రామంలో ఒక వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సుమారు 15 ఏళ్లుగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరొపణలు ఆ వర్గం ఖండిస్తు సస్పెన్షన్‌ను ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేసింది. డిమాండ్ నెరవేరకపోవడంతో కొందరు విద్యార్థులను ముందుంచి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసినట్లు సమాచారం. దీంతో పాఠశాలలో బోధన కొంతసేపు నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పద్మపూర్ పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం పాఠశాల గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. బీఈఓ హృషికేష్ రధ్, ఏబీఈఓ చంద్రసేన్ లిమ్మ, సీఆర్సీసీ చిత్తరంజన్ సేనాపతి, సర్పంచ్ కిషొరి సబర్, ఎస్ఎంసీ అధ్యక్షుడు గొవర్ధన్ సబర్, పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయురాలి సమక్షంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలోనూ ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఒక వర్గం ప్రధానొపాధ్యారాలిపై కులపరమైన వాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆమెను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. మరొ వర్గం మాత్రం అధికారుల చర్యను సమర్థిస్తూ పూర్తిస్థాయి నిష్పక్షపాత దర్యప్తు అనంతరం మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ విద్యార్థిని, తల్లిదండ్రులు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు, కమిటీ నిర్ణయం మేరకే ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. తనపై చేసిన కులపరమైన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. బీఈఓ హృషికేష్ రథ్ మాట్లాడుతూ దర్యాప్తు నివేదిక ఆధారంగానే ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాఠశాలలో మరొ ఉపాధ్యాయుడికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. -
గర్భోదక నీరాజనం
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026శ్రీమందిరంలో ..భువనేశ్వర్: శ్రీ జగన్నాథ మహా ప్రభువు లీలలు ఎంత అద్భుతమో అంతే గూఢమైనవి. తల్లిగా మారి గర్భవేదనను అనుభవించే జగన్నాథుడు తిరిగి ఆ తల్లి గర్భం నుంచి శ్రీకష్ణునిగా అవతరించడం శ్రీ మందిరంలో జన్మాష్టమి ఘట్టం విశిష్టత. ఆయనకు తల్లి కూడా ఆయనే. తండ్రి కూడా ఆయనే. సంతానం కూడా ఆయనే. జగన్నాథుని లీలలు తర్కానికి అందనివి. అవి అనుభూతి, భక్తి, విశ్వాసానికి సంబంధించినవి. భక్తుని భావనకు అనుగుణంగా అనేక రూపాల్లో దర్శనం ఇచ్చే మహా ప్రభువు లీలల్లో జన్మాష్టమికి ముందు రోజు శ్రీ మందిరంలో జరిగే గర్భోదక నీరాజనం, జెవుటో భోగం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక ఘట్టం. శ్రీ జగన్నాథుని లీలలో త్వమేవ మాతా చ పితా త్వమేవ–నీవే తల్లి, నీవే తండ్రి అని భక్తుని లోతైన భావం ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది. ఒక సందర్భంలో ఆయన తల్లి రూపంలో మరొక సందర్భంలో ఆ తల్లికి పుత్రునిగా స్వామి అవతరిస్తాడు అనే గూఢత్వాన్ని ప్రదర్శిస్తుంది. జన్మాష్టమికి ముందు రోజు పవిత్ర భాద్రపద కష్ణ పక్ష సప్తమి తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో ఈ ప్రత్యేకంగా గర్భోదక నీరాజనం గురువారం రాత్రి పూట నిర్వహించారు. శ్రీ కృష్ణుని జన్మ లీలను పురస్కరించుకుని జగన్నాథ మహా ప్రభువు స్వయంగా శ్రీకష్ణుని తల్లి దేవకీ దేవి రూపాన్ని ధరించి గర్భిణి ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్లుగా ఈ లీలను భావిస్తారు. ఈ సందర్భంగా ప్రసవ వేదన నివారించేందుకు మహా ప్రభువుకు ప్రత్యేకంగా జెవుటో భోగం సమర్పిస్తారు. గర్భకష్టాన్ని అనుభవించే జగన్నాథుడు శ్రీ మందిరంలోని సాయంకాల నిత్య కై ంకర్యాలలో భాగంగా సంధ్యా ధూపం ముగిసిన తరువాత నీరు చల్లి శుద్ధి చేసి ధో పొఖాలో తంతు పూర్తి కావడంతో తెర చాటున నీరాజనం సమర్పించారు. అనంతరం ప్రతిహారి సేవకుడు పోటు ప్రాంగణం నుంచి జెవుటో భోగాన్ని తీసుకువచ్చి శ్రీమందిరంలో పూజా పండా వర్గం సేవకులకు అందజేయడంతో పంచోపచార విధానంలో మహా ప్రభువుకు భోగాన్ని నివేదించడం ఆచారంగా వ్యవహరించారు. అనంతరం పూజా పండా, పతి మహా పాత్రో, ముదిరొస్తొ సేవకులు యదావిధిగా మూడు మూల విరాట్లకు నీరాజనం సమర్పించి మహా ప్రభువు శ్రీ జగన్నాథునికి ప్రత్యేకంగా మరోసారి గర్భోదక నీరాజనం సమర్పించడం ఈ ఘట్టంలో విశిష్టత. ఆ తర్వాత గర్భవతి దేవకీ రూపంగా భావించబడే శ్రీ జగన్నాథ మహా ప్రభువుకు గర్భకష్ట నివారణార్థం రుచికరమైన జెవుటొ భోగాన్ని భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. భోగంలో ఏమేం ఉంటాయి? జెవుటొ ప్రత్యేక భోగంలో భాగంగా వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు, పిండి వంటకాలు, ఝిల్లీ (ప్రత్యేకమైన మిఠాయి), చిన్న అరిసె, ఖిరి (పాయసం) తదితర ప్రసాదాలను సమర్పిస్తారు. మహా ప్రభువు యొక్క మాతృత్వ భావనను, శ్రీకృష్ణుని జన్మలీలను, జగన్నాథ తత్త్వంలోని అపారమైన రహస్యాన్ని ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక సంకేతం జెవుటో భోగ సమర్పణ. దర్శనం నిలిపివేత జన్మాష్టమికి ముందు రోజు శ్రీ కష్ణ జననం ప్రత్యేక ఘట్టం నిర్వహణ పురస్కరించుకుని శుక్ర వారం సాయంత్రం ధూపం సమర్పించిన తర్వాత రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. భాద్రపద కష్ణ పక్ష సప్తమి సందర్భంగా శ్రీ మందిరంలో గర్బోధక నీరాజనం (బొంధాపొణా), జెవుటొ భోగం సమర్పణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
22 నుంచి శాసన సభ సమావేశాలు
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం అవుతాయని శాసన సభ సచివాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమావేశాలు అక్టోబర్ 3 వరకు నిరవధికంగా కొనసాగుతాయి. ఇందులో 1 ప్రైవేట్, 8 ప్రభుత్వ పని దినాలతో కలిపి మొత్తం 9 పని దినాలు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ప్రభుత్వ సెలవుల కారణంగా సెప్టెంబర్ 26, 27 తేదీల్లో సభా కార్యకలాపాలు నిలిచిపోతాయి. అదే విధంగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కూడా సభా కార్యకలాపాలు కొనసాగవని ప్రకటించారు. రోడ్డు పక్కనే చెత్త కుప్పలు పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్.ఎ.సి.లో ఇరవై రోజులుగా రోడ్డు పక్కనే చెత్త డంపింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాశీనగర్ ఎన్.ఎ.సికి అర్బన్ శాఖ ఇచ్చిన నిధులున్నాయి.. కానీ సిబ్బందిని నియమించకుండా అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడో 10 రోజులకు గానీ చెత్త తీయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన కుక్కలు, ఇతర జుంతువుల కళేబరాలు కూడా రోడ్డు పక్కనే వేస్తున్నారు. పేరుకుపోయిన చెత్తను తీయకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తుంది. చెత్తను ఎత్తివేసి పరిశుభ్రంగా ఉంచాలని ఎన్.ఎ.సి చైర్మన్ ఎం.సుధారాణికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సేవల పరిశీలన మల్కన్‌గిరి : కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ రాజశిర్కే గురువారం జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మల్కన్‌గిరి సమితి పరిధిలో వీరలక్ష్మణ్పూర్ పంచాయతీ కార్యాలయం, పాంగం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయం మత్తిలి పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. అక్కడ పరిపాలనా విధానం రికార్డులు, పత్రాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల పనితీరును మెరుగు పరచడం, ప్రభుత్వ సేవలు ఎలాంటి జాప్యం లేకుండా సాధారణ ప్రజలకు చేరేలా చూడటం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. దుకాణాల్లోకి దూసుకొచ్చిన కంటైనర్ బూర్జ: పాలకొండ ప్రధాన రహదారిలో తుడ్డలి గ్రామ కూడలి వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక కంటైనర్ బీభత్సం సృష్టించింది. పాలకొండ వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తూ తుడ్డలి గ్రామ పరిధిలోని ట్రాన్సఫార్మర్ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న దుకాణాలు, ఇళ్లవైపు దూసుకెళ్లింది. రాత్రిపూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధిత షాపుల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య సారవకోట : మండల కేంద్రం సారవకోటలో గార సంతోష్ మృతి చెందగా దివ్యాంగురాలైన భార్య సంతోషి ఆయన చితికి తలకొరివి పెట్టింది. సంతోష్ మూడు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం సారవకోటలో అంత్యక్రియలు నిర్వహించగా దివ్యాంగురాలైన భార్య సంతోషి ఇతర మహిళల సహాయంతో ఆయన చితికి తలకొరివి పెట్టింది. నిరుపేద కుటుంబమైన వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద దిక్కు దూరం కావడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రైలు ఢీకొని ఆవు మృతి టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులోని రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొని ఆవు మృతిచెందింది. గురువారం సాయంత్రం గుణ్‌పూర్ నుంచి నౌపడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆవుకి సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో రహదారి పక్కగా పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నారు. -
ఖరడ జంక్షన్ వద్ద గంధపు చెక్కలు స్వాధీనం
పర్లాకిమిడి: జిల్లాలో కాశీనగర్ బ్లాక్ ఖరడ గ్రామం జంక్షన్ వద్ద ఒక ఆటోను కాశీనగర్ పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలలో 105 కిలోల గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 5.30ల సమయంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు కాశీనగర్–గుణుపురం రోడ్డు ఖరడ గ్రామం వద్ద పోలీసులు ఆటోను తనిఖీచేయగా ఆటోలో 105 కిలోల గంధపు చెక్కలు దొరికాయి. వాటి విలువ మార్కెట్లో పదిలక్షల రూపాయలు ఉంటుందని ఇన్వెస్టిగేషన్ అధికారి పంచానన బెహారా తెలియజేశారు. పోలీసులను చూసిన ఆటో డ్రైవర్ ఖరడ జంక్షన్ వద్ద నుంచి తప్పించుకుని అధిక స్పీడులో వెళుతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్తు చేశారు. వారి వద్ద నుంచి నగదు రూ.4వేలు, 3 చరవాణులు, 105కిలోల గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు ఖరడాకు చెందిన సిరాజ్ ఖాన్, అక్రం ఖాన్, టంగీ, ఖుర్దా, దామోదర్ ప్రధాన్, గ్రామం సన్నసోడా, రామగిరికి చెందినవారు. -
హెచ్ఐవీపై అవగాహన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి కళాశాలలో గురువారం యూత్ రెడ్‌క్రాస్ యూనిట్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చిత్తరంజాన్ బారిక్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రధాన వైద్యులు కృష్ణచంద్ర మాహాపాత్రో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్ఐవీ బాధితుల పట్ల సమాజంలో చాలాచోట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందన్నారు. అనంతరం క్విజ్ పోటీలను నిర్వహించి విజేయతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమరేఖ భత్ర, దీప్తిరేఖ మిశ్రో, విజయలక్ష్మి శేఠి, ఆకాశ్ పడియమి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక సాయం అందజేత
పర్లాకిమిడి: జిల్లాలోని రాయఘడ బ్లాక్ చంపాసాహి గ్రామానికి చెందిన కహ్నూభుయ్యాన్ రాష్ట్రస్థాయి నీట్ పరీక్షా ఫలితాల్లో 21వ ర్యాంకు సాధించినందుకు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం రాంనగర్లో హైటెక్ ప్లాజాలో జ్ఞాపికతో అభినందించారు. అలాగు మొదటి సంవత్సరం కళాశాల ప్రవేశ రుసుము రూ.40 వేలు విద్యార్థికి ఆర్థిక సాయంగా అందజేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత గజపతిలోని ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సహకారం అందించాలని ఆకాంక్షించారు. ట్రక్ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 23 గ్రామం వద్ద టైర్ల లోడుతో వెళ్తున్న ఒక ట్రక్ టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అయితే సమీపంలో ఉన్న స్థానికులు డ్రైవరును వెంటనే బయటకు తీసుకొచ్చి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయన చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కలిమెల పోలీసు ఐఐసీ ప్రభుదత్త బిశ్వల్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. డ్రైవర్‌కు స్పృహ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. పురుగు మందు తాగి మహిళ దుర్మరణం జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి కొలార్ గ్రామ పంచాయతీ హతీపకన గ్రామంలో దశరథ పంగి భార్య మోతీ పంగి(34) పురుగుల మందుతాగి దుర్మరణం చెందింది. బుధవారం ఏదో కారణంతో మోతీ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో కొరాపుట్ సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందిన బొయిపరిగుడ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. దుకాణాల్లో తనిఖీలు పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ నగరపాలక సంస్థ (ఎన్.ఏ.సి.) ఆధ్వర్యంలో గురువారం అధికారులు నిషేధిత పాలిథిన్ కవర్ల వినియోగంపై పలు రెస్టారెంట్లు, కిరాణా, దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి జరిమానాలు విధించారు. కాశీనగర్ ఎన్ఏసీలో ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ చెత్త పెరిగిపోవడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. కాశీనగర్‌లో పాలిథిన్ను బ్యాన్ చేయడం జరిగిందని నగరపాలక సంస్థ అఽధికారులు తెలియజేశారు. -
సామాన్యులకు తలనొప్పులు!
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం సమీపంలోని ఓ నియోజకవర్గానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తుంటారు. ఆన్లైన్లో తక్కువ ధరకే బంగారం (గోల్డ్ ఇన్వెస్ట్మెంట్) యాప్ చూసి ఫోన్ కాల్ చేయడంతో అవతలి వ్యక్తులు ‘మా దగ్గర 24 క్యారెట్ ముక్క బంగారం ఉంది. బిస్కెట్ బంగారం, కాయిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకే ఇస్తాం’ అని చెప్పారు. మోడల్‌గా ఓ కాయిన్ సైతం ఒరిజినల్దేనంటూ వాట్సాప్‌లో ఫొటో పంపించారు. అందులో ఓ వ్యక్తి విశాఖ రమ్మని చెప్పి తక్కువ ధరకే కాయిన్ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో వారిని నమ్మిన చిరంజీవి రూ.1.50 కోట్లకు డీల్ మాట్లాడుకుని బంగారం సిద్ధం చేయమని చెప్పడం, వారు కూడా ఏర్పాటు చేశామని చెప్పి డబ్బుతో బెంగళూరు రమ్మనడంతో చిరంజీవి మరో వ్యక్తితో కలిసి వెళ్లారు. వారు రమ్మన్న చోటకు వెళ్లాక అప్పటికే గ్రూప్‌గా చేరుకున్న అక్కడి అపరిచిత వ్యక్తులు తీసుకెళ్లిన డబ్బులు రూ.1.50 లక్షల విలువైన ఐఫోన్ సహా సర్వం దోచేశారు. సామాన్యులే బలి..! గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ తరహాలోనే గార మండలంలో తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ శాలరీ అకౌంటులో రూ.18,057, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో రూ.8,058 లు మొత్తంగా రూ. 26,115 లు దఫదఫాలుగా సంబంధిత బ్రాంచిలు హోల్డ్‌లో పెట్టినట్లు ఫోన్లో మెసేజ్‌లు వచ్చాయి. సదరు ఉద్యోగి సంబంధిత బ్యాంకు ప్రతినిధులను సంప్రదించగా ‘సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన అమౌంట్ మీ ఖాతాలకు మళ్లాయి. పోలీసుల నుంచి ఎన్వోసీ తెచ్చుకుంటే హోల్డ్ తీసేస్తామని’ వారు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తానేంటి.. సైబర్ ఫ్రాడ్ చేయడమేంటని అనుకుంటూనే జిల్లా సైబర్ సెల్‌ను ఆశ్రయించారు. మోసంతో సంబంధం లేకపోయినా.. అక్కడ తనిఖీ చేయగా ఉద్యోగి భార్య బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు మోసపూరిత సొమ్ము ఈ నెల 10న ఒకరు ఫోన్‌పే ద్వారా మళ్లించినట్లు, ఆమె తన ఖాతానుంచి రూ. 9 వేలు ఒకసారి, రూ.వెయ్యి ఒకసారి భర్త శాలరీ ఖాతాకు అదే రోజు పంపినట్లు తెలుసుకున్నారు. వాటిలో రూ. 5 వేలను ఉద్యోగి తన పోస్టాఫీసు ఖాతాకు పంపించి మళ్లీ పోస్టాఫీసు ఖాతా నుంచి అదే రోజు రూ.8,057లు సెల్ఫ్ స్వీప్ చేసి పంపినట్లు తెలిసింది. ఒకే రోజు మల్టిఫుల్ ట్రాంజెక్షన్స్ మోసపూరిత సొమ్ము నుంచి పలు ఖాతాలకు చేరడంతో తెలంగాణ మిర్యాలగూడలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరిట కేసు నమోదైందని, ఆ మోసపూరిత సొమ్ము మీ భార్య ఖాతానుంచి మీ ఖాతాకు రావడం వల్లే బ్యాంకు హోల్డ్‌లో పెట్టిందని నిపుణులు చెప్పడంతో ఉద్యోగి అవాక్కయ్యారు. ఉద్యోగి భార్య తన స్నేహితురాలి స్నేహితునికి (ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు) అవసరమై రూ. 10 వేలు అప్పుగా ఇవ్వడం, ఆ సొమ్మును ఇటీవలే అతను ఫోన్‌పే చేయడం జరిగిందని తెలుసుకున్న ఉద్యోగి అతనికి ఫోన్ చేసి ఆరా తీశాడు. పని ఒత్తిడిలో ఉన్న ఆ ఐటీ యువకుడు తన బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయగా తనవి కూడా రూ. 60 వేల వరకు లాక్ అయినట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. ఐటీ యువకుడు ఇటీవలే పాత కార్లు కొనుగోలు చేసే వెండర్స్ ఇద్దరికి తన పాత కారు అమ్మాడని.. దానిలో భాగంగా వారు ఫోన్‌పే ద్వారా ఐటీ యువకుని అకౌంట్‌కు కొంత సొమ్ము పంపారని ఆ సొమ్ము గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌కు గురైన సొమ్మని, మొత్తంగా వెండర్ అన్నవాడే గోల్డ్ ఫ్రాడ్ చేసిన వ్యక్తని అనుమానిస్తున్నారు. మోసగాడి ఖాతా నుంచి బదిలీ కావడంతో.. గోల్డ్ ఇన్వెస్టుమెంట్ ఫ్రాడ్ అయిన వెండర్ నుంచి మోసపూరిత సొమ్ము ఐటీ యువకుని ఖాతాకు, ఐటీ యువకుడి నుంచి ఉద్యోగి భార్య ఖాతాకు, ఆమె ఖాతానుంచి ఉద్యోగి శాలరీ అకౌంట్‌కు , దాని నుంచి ఉద్యోగి పోస్టాఫీసు ఖాతాకు, మళ్లీ సెల్ఫ్ స్వీప్ ద్వారా పోస్టాఫీసు ఖాతా నుంచి శాలరీ అకౌంటుకు ఒకే రోజు ఎక్కువ లావాదేవీలు జరగడం.. మిర్యాలగూడలో సైబర్ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు సంబంధిత లావాదేవీల జరిగిన బ్యాంకు ఖాతాలున్న బ్రాంచిలకు ఆదేశాలు పంపడంతో అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. సైబర్ మోసాలకు సామాన్యులు బలైపోతున్నారు. తమకు నేరుగా సంబంధం లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైబర్ ఫ్రాడ్ సొమ్ము వివిధ అకౌంట్ల ద్వారా బదిలీ అయ్యిందంటూ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు సొమ్ము తీసుకోవడానికి వీల్లేదంటూ సదరు సొమ్మును హోల్డ్‌లో పెట్టేస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తాము తీసుకోవడాకి వీల్లేకుండా చేయడం తగదంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. నేరపూరిత సొమ్ము బదిలీ అయ్యిందంటూ ఖాతాలు ఫ్రీజ్ చేస్తున్న వైనం తమకు సంబంధం లేకపోయినా ఇరుక్కుంటున్న ఖాతాదారులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లతో రెచ్చిపోతోన్న సైబరాసురులు జిల్లాలో వెలుగు చూస్తున్న సరికొత్త మోసాలు ఇదే తరహాలో ఎచ్చెర్ల కేంద్రంగా టిఫిన్ షాప్ నడుపుతున్న ఓ వ్యక్తి సైతం రూ. 25 లక్షలు మోసపోయారు. జిల్లాలో ఇటీవలి కాలంలో ఇటువంటి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు ఐదు జరిగాయి. ప్రజలు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవడంతో కాస్త తగ్గుముఖం పట్టినా కొంతమంది సైబరాసురులు సరికొత్త మోసాలతో ఇలా రెచ్చిపోతుండటంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. అపోహలు వద్దు ఆన్లైన్ సైబర్ఫ్రాడ్కు గురైన బాధితుని సొమ్ము ఎవరెఎవరి ఖాతాలకు చేరుతాయో ఆ ఖాతాల్లోని సొమ్మునే అనుమానితంగా ఫ్రీజ్ (హోల్డ్) చేస్తాం. ఖాతాలు రన్నింగ్‌లోనే ఉంటాయి. ఇతర ట్రాంజెక్షన్లన్నీ యథావిధిగా జరుగుతాయి. ఈలోగా వారం రోజుల పాటు ఫ్రాడ్ అమౌంట్ వున్న ఖాతాలను వెరిఫై చేయించి అందులోని సొమ్ము వారిదేనని నిజాయితీగా తేలితే లేయర్ల వారీగా అందరి అకౌంట్ల నుంచి హోల్డ్ తొలగిస్తాం. ప్రజలు అపోహలు చెందాల్సిన పని లేదు. వీరిలో ఫ్రాడ్ సొమ్ము గుర్తించి రికవరీ చేసి బాధితునికి అందజేస్తాం. – కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
ఉసురుతీసిన ఈత సరదా
హిరమండలం: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చి చెరువులో స్నానానికి దిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఎల్‌ఎన్‌పేట మండలం రావిచంద్రిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిచంద్రి గ్రామంలో ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి 20 మంది స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి సరదాగా చెరువులో స్నానానికి దిగారు. అందులో మోహనరావు (16) అనే బాలుడికి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులతో పాటు స్థానికులు కలిసి గాలించి బయటకు తీశారు. వెంటనే ఆటోలో ఎల్‌ఎన్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మోహనరావు స్వస్థలం విశాఖపట్నంలో జ్ఞానాపురం. ఐటీఐ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడు పుట్టిన రోజు వేడుకలకు గురువారం ఉదయం రావిచేంద్రి వచ్చాడు. మోహనరావు తండ్రి జగన్ వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి చిట్టి గృహిణి. సరుబుజ్జిలి పోలీసులు పీహెచ్‌సీకు చేరుకుని వివరాలు సేకరించారు. -
శంకుస్థాపన..
జయపురం: జయపురం జమితి రొండాపల్లిలో గల ప్రభుత్వ పాలిటెక్నికల్ విద్య, శిక్షణ, సిబ్బంది నివాస మొదలగు 5 విభాగాల భవనాలకు జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.194.97లక్షల వ్యయంతో పాలిటెక్నిక్ యంత్ర శాల భవనాలు, రూ.202.83 లక్షల వ్యయంతో కళాశాల కాంపౌండ్ వాల్, కళాశాల పాత భవనాల పునరుద్ధరణ, రూ.208.31 లక్షల వ్యయంతో బాలికల కోసం 50 పడకల నూతన హాస్టల్ నిర్మాణం, కళాశాల ఉద్యోగ సిబ్బందికి రూ.295.13 లక్షల వ్యయంతో రెండు ఈ బ్లాక్‌ల నివాస గృహాల నిర్మాణం, రూ.121.21 లక్షల వ్యయంతో ఉద్యోగుల కోసం 6 ఈ–టైప్ గృహ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యభాన్ మహాజన్, పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు -
సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ వినతులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి రెవెన్యూ అధికారి ఈ–ఆఫీస్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని, సివిల్ కోర్టు కేసులు, వివాదాస్పద భూముల కేసుల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. జిల్లాలో ఆరో విడత కింద 160 గ్రామాల్లోని 97,917.996 ఎకరాల ప్రైవేట్ భూమికి సంబంధించి రీసర్వే ప్రక్రియ కొనసాగుతుండగా, ఇప్పటివరకు 22,252 గ్రౌండ్ ట్రూతింగ్ నోటీసులు జారీ చేశారని, 36,228.292 ఎకరాల్లో ఈ–కేవైసీ పూర్తయిందని సమీక్షలో వెల్లడించారు. కుమారుడికి తలకొరివి పెట్టిన తల్లి శ్రీకాకుళం రూరల్ : కుమారుడికి తల్లి తలకొరివి పెట్టిన ఘటన గురువారం వప్పంగి గ్రామంలో చోటుచేసుకుంది. బాణ్న రాజులు తన కుమారుడు శేషాద్రిని ఇంజినీరింగ్ వరకు చదివించింది. శేషాది జార్ఖండ్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని గురువారం గ్రామానికి తీసుకొచ్చారు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లి రాజులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తలకొరివి పెట్టింది. ఆదిత్యాలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం రేపు శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 5న ఉదయం 10.45 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దేవస్థానంలో చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, ఎక్స్ఆఫీషియో మెంబర్‌తో కలిపి మొత్తం 12 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. -
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొని కంటైనర్ డ్రైవర్ మృతి
నరసన్నపేట: సత్యవరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన కంటైనర్ డ్రైవర్ షేక్ రూఫా(55) మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి టెక్కలి వెళ్లే మార్గంలో సత్యవరం కూడలి సమీపంలో నేషనల్ హైవేకు చెందిన వాటర్ ట్యాంకర్ డివైడర్‌పై మొక్కలకు నీరు పోస్తుండగా అదే మార్గంలో పిడుగురాళ్ల నుంచి కటక్‌కు సున్నం ప్యాకెట్లతో వెళ్తున్న కంటైనర్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ ముందుభాగం పూర్తిగా నుజ్జయ్యింది. అందులో డ్రైవర్ షేక్ రూఫా తీవ్ర గాయాలపాలయ్యాడు. బాధితుడిని అంబులెన్స్‌లో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందాడు. ప్రమాదం నుంచి వాటర్ ట్యాంకర్ డ్రైవర్, మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై బి.గణేష్‌లు ప్రమాద స్థలానికి వెళ్లి సమీక్షించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా మృతి చెందిన కంటైనర్ డ్రైవర్‌కు భార్య హసీనా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.90,930 అందజేత
రెడ్‌క్రాస్ సొసైటీకి..జయపురం: రెడ్ క్రాస్ సొసైటీకి రూ.90,930లను మానవ సేవా కేంద్రం అందజేసిందని ఆర్గనైజర్ జయపురం చాంబర్ ఆఫ్ కామర్ష్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ జైన్ గురువారం వెల్లడించారు. 2026 ఆగస్టు 18 తేదీన స్థానిక జైన్ భవనంలో శ్రావణ మేళా సందర్భంగా మానవ సేవా కేంద్రం నిర్వహించి మేళాలో వస్తువుల అమ్మకాలు రూ.50,200 రెడ్‌క్రాస్ సొసైటీకి నిధిగా జయపురం సబ్‌కలెక్టర్ జాదుమణి నాయక్‌కు అందజేసిందని వెల్లడించారు. 2026 ఆగస్టు 22, 23 తేదీల్లో జయపురం శుభం కల్యాణ మండపం ప్రాంగణంలో మానవ సేవా కేంద్రం నిర్వహించిన శ్రావణ మేళాలో వస్తువులు విక్రయించగా వచ్చిన నగదు రూ.40,730లను రెడ్‌క్రాస్ నిధికి జయపురం తహసీల్దార్‌కు అందజేసినట్లు వెల్లడించారు. సబ్ కలెక్టర్‌కు రెడ్‌క్రాస్ సొసైటీకి నిధిని అందజేసిన వారిలో సంజయ కుమార్ జైన్, మమతా జైన్, సొనాలి జైన్, చాంబర్ డైరెక్టర్లు దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులను ఎదుర్కోవడంపై అవగాహన
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో అకాడమిక్ ఫెకాలటీ డవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నాల్గో ఫెకాలటీ డవలప్మెంట్ ప్రొగ్రామ్ గురువారం నిర్వహించారు. విశ్వ విద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హృశికేష్ శనాపతి ఆదేశం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిడుగులు, ఉరుములతో తుఫాన్లు రావటానికి గల కారణాలపై చర్చ జరిగింది. విక్రమదేవ్ విశ్వవిద్యాలయ జువాలజీ విభాగానికి చెందిన డాక్టర్ ఉదయ కుమార్ దాస్ ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణను వివరించారు. పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్గి ఉంటే ప్రాణ, ఆస్తి నస్టాలను నివారించవచ్చన్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంశల వారీగా చర్చించారు. -
పోరిచ్చా మఠం అభివృద్ధికి నిధులు
పర్లాకిమిడి: స్థానిక మూడో వార్డు, రాజగురు వీధి వద్ద ఉన్న మహాప్రభు రసికరాజ మందిరం (పోరిచ్చా మఠం) ను ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి గురువారం సందర్శించారు. రెండు శతాబ్దాల కిందట మహారాజా నిర్మించిన శ్రీరసికరాజ మందిరం (పోరిచ్చామఠం)శ్రీ రాధాకృష్ణ పురాతన మందిరం ఉంది. మహాంత కృపాల్ మహారాజ్, అనేక మంది సాధుసంతువులు పర్లాకిమిడి వచ్చినప్పుడు ఇక్కడ బస చేస్తుండేవారు. అతి పురాతన, చారిత్రాత్మక ఈ మందిరం ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. ఈ మందిర పుణరుద్ధరణకు ఇన్నేళ్లుగా నోచుకోలేక పోయిందని మురళీ పోరిచ్చా, గజేంద్రపండా, పర్యవేక్షకులు గోపినాధ పోరిచ్చా, పూజారీ హారేరామ క్రిష్ణ చౌదురి, సముటియా వీధి ప్రజలు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి విన్నవించారు. ముఖ్యంగా శ్రీక్రిష్ణజన్మాష్టమి వేడుకలు, కార్తిక మాసంలో నెలరోజుల పాటు సంకీర్తనలు జరుగుతాయి. అలాంటి ఈ మందిర పుణరుద్ధరణకు తన వంతు సహాయం చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇవ్వడంతో రాజగురు, పోరిచ్చా వీధి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మందిరంతో పాటు పక్కన ఉన్న ఫుల్లోసుందరీ మందిరం అభివృద్ధి పనులు కూడా ఎమ్మెల్యే లాడ్ నిధులతో మరామత్తులు చేస్తానని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హామీ ఇచ్చారు. -
గోడ కూలి విద్యార్థిని దుర్మరణం
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి రణస్పూర్ గ్రామ పంచాయతీ జొడాపుట్ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఇంటిగోడ కూలి మీద పడడంతో దుర్మరణం చెందింది. మరణించిన విద్యార్థిని జొడాపుట్ గ్రామానికి చెందిన కమలా తండి(15). కమలా తండి బొరిగుమ్మ సమితి బిసింగపూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం ఎప్పటిలానే లేచి ఇంటి పనులు చేస్తున్న సమయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన బాగా తడిచి ఉన్న ఇంటిగోడ అకస్మాత్తుగా కూలి ఆమైపె పడింది. గోడ కింద ఉండిపోయిన కమలా తండి ఆక్రందనలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బొరిగుమ్మ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత విషమం కావడంతో అక్కడ నుంచి కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు చేర్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కమలా తండి మృతి చెందింది. విషయం తెలియడంతో బిసింగపూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు కన్నీటితో నివాళులర్పించారు. వీరి కుటుంబం నిరుపేదది కావడంతో దహన సంస్కారాలకు బొరిగుమ్మ తహసీల్దార్ శోభన్ కుమార్ బెహర రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంజయ చలాన్ ద్వారా మృతురాలి కుటుంబానికి రూ.5 వేల నగదు అందించారు. -
నవీన్ పట్నాయక్, వీకే పాండియన్‌పై క్రిమినల్ రివిజన్ కొట్టివేసిన కోర్టు
భువనేశ్వర్: మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మాజీ అధికారి వి.కె.పాండియన్న్పై వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను భువనేశ్వర్‌లోని ఖుర్దా సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధీర్ చరణ్ మహంతి దాఖలు చేసిన రివిజన్ ిపిటిషను కొట్టివేస్తూ ఈ ఏడాది మార్చి 25న స్థానిక ఎస్డీజేఎం కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. నవీన్ పట్నాయక్, వి.కె.పాండియన్ హెలికాప్టర్ ప్రయాణం, ప్రజా సమావేశాలకు సంబంధించి ఖర్చుల కోసం రూ.500 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ప్రధాన ఆరోపణ. మూడు కీలక అంశాలను హైలైట్ చేస్తూ, కోర్టు ఎస్డీజేఎం నిర్ణయాన్ని సమర్థించింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(4) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించలేదని సెషన్స్ కోర్టు పేర్కొంది. ఆరోపణలు నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేనట్లు కోర్టు గమనించి ఆరోపణలు అసంబద్ధమైనవిగా పేర్కొంది. ఎస్డీజేఎం కోర్టు ఈ ఏడాది మార్చి 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి చట్ట విరుద్ధత లేదని సెషన్స్ కోర్టు ధృవీకరించి క్రిమినల్ రివిజనన్ను కొట్టివేసింది. -
పాముకాటుతో యువతి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియా సమి తి రోడన్పల్లి గ్రామానికి చెందిన యువతి బుధవారం మృతి చెందింది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి పింకీ భోజ నం చేసి నిద్రపోయింది. మంగళవారం ఉద యం నిద్ర లేచి కాలు తీవ్రంగా నొప్పి పెడుతుందని తల్లికి తెలిపింది. పాము కాటు కనిపిచడంతో పోడియా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. బుధవారం ఉదయం పింకీ మృతి చెందింది. ఈ విషయంపై పోడియా ఐఐసీ దేవేంద్ర భత్రా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంత రం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు. పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలో గీతాంజలి పబ్లిక్ స్కూల్లో పోలీసులు సైబర్ సెక్యూరిటీ, నిషా ముక్త అభియాన్‌పై విద్యార్థుల్లో బుధవా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.వేణుగోపాలరావు, ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. జయపురం: జయపురం సబ్ డివిజన్లోని కుంధ్ర సమితి రాణిగుడ గ్రామ పంచాయతీ ఉన్న త మాద్యమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ పాఠశాల ప్రధాన గేటుకు తాళాలు వేశారు. టెన్త్ వరకు 356 మంది విద్యార్థులు చదువుతున్నారని, గతంలో 11 మంది ఉపాధ్యాయులు ఉండేవారని, వారిలో ముగ్గురిని ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపించ డం తగదన్నారు. అనంతరం బ్లాక్ విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. మందస: మండలంలోని టబ్బగాం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ కానిస్టేబుల్ సవర శేషగిరి (28) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలో ని ఖుర్దా యూనిట్లో విధులు నిర్వహిస్తున్న శేషగిరి ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చా డు. గ్రామ సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో పని ఒత్తిడితో కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం పీహెచ్‌సీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరసవల్లి: జిల్లా విద్యుత్ సర్కిల్లో పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యాలను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఏపీ ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టివి.సూర్యప్రకాష్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఎస్సీ ఎస్టీ ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు కచ్చితంగా సోలార్ రూఫ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ వినియోగదారులు 16278 మంది ఉండగా, ఇంతవరకు 9032 ఇళ్లకు మా త్రమే సోలార్ పథకాన్ని అమర్చారని, మిగిలిన వారికి ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ప్రధాన దేవాలయంలో ఇంద్ర లింగానికి బుధవారం సంప్రోక్షణ, శుద్ధి పూజలు నిర్వహించారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి దేవదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు స్పందించారు. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి పవిత్ర వంశధార నదీ జలాలతో శుద్ధి చేసి భక్తులకు దర్శనాలు కలిగించారు. ఇదిలా ఉండగా ‘సాక్షి’లో వచ్చిన కథనానికి దేవదాయ శాఖ అధికారులు స్థానిక ఈఓ ఏడుకొండలను మందలించినట్లు సమాచారం. దీనిపై ఈఓ, అర్చకులు వాగ్వాదానికి దిగారు. జలుమూరు ఎస్ఐ బి.అశోక్‌బాబు చొరవ తీసుకొని ఆలయ నిర్వహణ సమష్టిగా చూడాలని సర్దిచెప్పడంతో వివాదం సద్దు మణిగింది. శ్రీకాకుళం క్రైమ్ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 27 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి అక్టోబరు 1 నుంచి ట్రైనింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత వీరికి ప్రమోషన్ కల్పించాల్సి ఉన్నా 27 హెచ్‌సీ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఈ ప్రక్రియ జరిపినట్లు పోలీసు వర్గాల సమాచారం. -
గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండున్నర కేజీల గంజాయితో ఒక యువకుడితో పాటు 15 ఏళ్ల బాలుడు పట్టుబడ్డారని సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఏ–వేలిగోడు గ్రామానికి చెందిన మరియా కిల్బెర్ట్ రాజశేఖర్ అనే యువకుడు, ఒక 15 ఏళ్ల బాలుడు ఇరువురూ జల్సాలకు అలవాటుపడ్డారు. వీరికి తమిళనాడు దిండిగల్ జిల్లా ఫలనీ బైపాస్ ప్రాంతంలో గంజాయి వ్యాపారం చేసే కాళిదాస్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో గంజాయి వ్యాపారి సూచించినట్లు ఒడిశాలో బలియాగడ గ్రామం సమీపంలోని హెచ్‌సీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటున్న రామస్వామి దొర వద్దనుంచి 2.500 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం వీరిరువురు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ నుంచి రైలు గుండా తమిళనాడు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్టేషన్‌కు వస్తుండగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్దనుంచి గంజాయి, ఒక సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో యువకుడిని సోంపేట కోర్టుకి తరలించగా, బాలుడుని జువైనల్ కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు సిబ్బంది పాల్గొన్నారు. -
సర్‌పై క్షేత్రస్థాయి పరిశీలన
రాయగడ: ఎస్ఐఆర్–2026లో భాగంగా ఓటరు జాబితా పునః సమీక్ష, ధ్రువీకరణ, సూపర్ చెకింగ్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐడీసీఓ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్నికల జాబితా పరిశీలకుడు డాక్టర్ ప్రశాంత్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లాలో రెండోసారి పర్యటించి, వివిధ ప్రాంతాల్లో ఎస్ఐఆర్–2026 పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. పర్యనటలో భాగంగా తొలుత గుణుపూర్ సమితిలోని న్యూకాలనీని సందర్శించిన డాక్టర్ రెడ్డి సూపర్ చెకింగ్‌కు ఎంపికై న ఫారం–7 దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత బూత్ లెవల్ అధికారులతో మాట్లాడి దరఖా స్తు పరిశీలన విధానం, అవసరమైన పత్రాలు, సూపర్ చెకింగ్ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని పద్మపూర్ సమితిలో పర్యటించారు. సమితిలోని అఖుసింగి–2, రామనగుడ సమితిలోని మోసారిగుడ ప్రాంతాలను సందర్శించి సూపర్ చెకింగ్‌కు ఎంపికై న ఫారం–6 దరఖాస్తులను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. పర్యటన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎస్ఐఆర్–26 ప్రస్తుత దశ, జిల్లాలో జరుగుతున్న పనుల పురోగతి, అభ్యంతరాల స్వీకరణ, విచారణ ప్రక్రియపై చర్చించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతీ దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్ఐఆర్–2026లో ఫారం–6, ఫారం–7 దరఖాస్తు ల పరిశీలన, సూపర్ చెకింగ్ కొనసాగుతున్నాయి. తదుపరి దశంలో అభ్యంతరాల స్వీకరణ, విచారణ పూర్తి చేసి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 21న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్నా, గునుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
పర్లాకిమిడి: గజపతిజిల్లా గుమ్మాబ్లాక్ కార్యాలయంలో దశమ పంచాయతీ సమావేశానికి బరంపురం ఎంపీ ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవ ర తిరుపతిరావు, గుమ్మసమితి అధ్యక్షురాలు సునేమీ మండల్ తదితరులు పాల్గొన్నారు. గుమ్మబ్లాక్లో విద్య, వైద్య, విద్యుత్, గ్రామీణాభివృధ్ధి, సాగునీరు, తాగునీరు, రోడ్లు నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పాణిగ్రాహి అజయగడ–నమ్మనగుడ రోడ్డు, సెరంగో నుండి కుజాసింగి రోడ్డు నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలు వేశా రు. అనంతరం పర్లాకిమిడి చేరుకుని బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఓ దులారాం మరాండి, జిల్లా పరిషత్ సీడీఓ. దయామయా పాడీ, తహసీల్దార్ శరత్ శోబోరో, జెడ్పీటీసీ (గుమ్మ)రేనుకా పాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయండి
రాయగడ: విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని కొలనార సమితి పరిధిలోని రివల్‌కొన ప్రభుత్వ ఎస్ఎస్డీ హైస్కూల్ హాస్టల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర శిశు సంరక్షణ కమిషన్ అధ్యక్షురాలు బబితా పాత్రో బుధవారం పరిశీలించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో కౌన్సిలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగష్టు 3వ తేదీన రివల్‌కొన పాఠశాలలోని హాస్టల్లో ఉంటున్న పదో తరగతికి చెందిన విద్యార్థులు అదే హాస్టల్లో ఉంటున్న జూనియర్ విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలను సందర్శించిన బబితా పాత్రొ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించి సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుని హాస్టల్ నుంచి తొలగించినట్లు తెలిపారు. పాఠశాలలో మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉపాధ్యాయులకు ప్రత్యేక సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల్లో పనిచేయని సీసీ టీవీ కెమెరాల స్థానంలో వెంటనే కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహారం, నిద్ర వసతులు సక్రమంగా ఉన్నప్పటికీ భద్రత చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతీ హాస్టల్లో కౌన్సిలర్.. చిన్నారుల్లో పెరుగుతున్న ప్రతికూల ప్రవర్తనను నియంత్రించడంతోపాటు వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలోని ప్రతీ హాస్టల్లో కౌన్సిలర్‌ను నియమించే ప్రణాళిక ఉందని బబితా పాత్రొ తెలిపారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే కౌన్సిలర్ల లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మలేరియా నివారణకు మెరుగైన దొమతెరలు అందుబాటులో ఉంచాలని, ప్రాథమిక చికిత్స, అవసరమైన మందుల సదుపాయాలు కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు.. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను కూడా బలొపేతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలను గుర్తించి కొత్త భవనాల నిర్మాణానికి రూ.11 లక్షల చొప్పున నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే అదనంగా మరో రూ. 6 లక్షలు కూడా కేటాయించే అవకాశం ఉందన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ప్రహరీ, ప్రత్యేక మరుగుదొడ్లు, వంటగది, తాగునీటి సదుపాయం, పిల్లలు ఆడుకునేందుకు స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సక్షమ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుతోపాటు అద్విక కార్యక్రమం ద్వారా పిల్లలకు పరిశుభ్రత, శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది కొరతతోపాటు ఇతర సమస్యలపై జిల్లా కలెక్టర్, పీడీ, ఐటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌ను సందర్శించిన ఇక్కడ ఉన్న సమస్యలను పరిశీలించారు. రోగులు ఉంటున్న వార్డుల్లో పర్యటించి సౌకర్యాలపై ఆరా తీసారు. ఈ పర్యటనలో ఆమె వెంట ఎస్ఎస్డి ఉపాధ్యాక్షురాలు మంజుల మినియాక, బీజేపీ సేనియర్ నాయకుడు శివ శంకర్ ఉలక, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో లైన్మెన్కు గాయాలు
జయపురం: జయపురం సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తుండగా లైన్మెన్ అజిత్ బెహర(35) షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తోటి సిబ్బంది తరలించారు. అజిత్ బెహర స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటనపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి సిబ్బంది మండిపడ్డారు. బాధితునికి పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, తగిన నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
తీర్థయాత్ర రైలు ప్రారంభం
● వృద్ధులకు ఉచిత ప్రయాణం ● జెండా ఊపి రైలును ప్రారంభించిన డిప్యూటీ సీఎం ప్రభాతి పరిడాభువనేశ్వర్: ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద వయో వృద్ధుల తీర్థ యాత్ర ప్రత్యేక రైలు బుధవారం బయల్దేరింది. ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా జెండా ఊపి న్యూ భువనేశ్వర్ రైల్వే స్టేషను నుంచి దీనిని ప్రారంభించారు. ఇందులో 775 మంది వృద్ధ యాత్రికులు ప్రయాణించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి వారణాసి, అయోధ్యకు బుధవారం ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది తొలి సీనియర్ సిటిజన్ యాత్రా రైలు కావడం విశేషం. పవిత్ర లింగరాజ పుణ్య క్షేత్రం నుంచి కాశీ విశ్వనాథుడు, అయోధ్య వరకు సాగే ఈ యాత్ర వయోవృద్ధులకు ఒక చిరస్మరణీయ అనుభూతినిస్తుంది. వారి ప్రయాణం సురక్షితంగా, ఆధ్యాత్మికంగా సంతృప్తికరంగా ఉండాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్రలో యాత్రికులు కాశీ విశ్వనాథుని దర్శనంతో గంగా హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని ప్రత్యక్షంగా సందర్శిస్తారు. అక్కడ నుంచి అయోధ్యలో శ్రీ రామ్ లల్లా దివ్య దర్శనం పొందుతారని ప్రభాతి పరిడా తెలిపారు. యాత్రా కార్యక్రమం కింద రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వయోవృద్ధులు దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పుణ్య క్షేత్రాలను సందర్శించి గనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఆస్వాదిస్తున్నారన్నారు. బుధవారం బయల్దేరిన తీర్థ యాత్ర ప్రత్యేక రైలులో ఖోర్ధా, జగత్సింగ్పూర్, కటక్, పూరీ, కేంద్రాపడా, ఢెంకనాల్ 6 జిల్లాలకు చెందిన 775 వృద్ధులు పాల్గొన్నారు. జిల్లా వారీగా పాల్గొన్న యాత్రికులలో ఖోర్ధా నుంచి 169 మంది, జగత్సింగ్పూర్ నుంచి 85 మంది, కటక్ నుంచి 197 మంది, పూరీ నుంచి 127 మంది, కేంద్రాపడా నుంచి 108 మంది, ఢెంకనాల్ నుంచి 89 మంది ఉన్నారు. 333 మంది మహిళలు, 432 మంది పురుషులు ఉన్నారు. యాత్ర పొడవునా యాత్రికుల భద్రత, సౌకర్యం 25 మంది ఎస్కార్ట్ అధికారులు కూడా ఉన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చంద్ర స్వంయి, కేంద్రాపడా ఎమ్మెల్యే గణేశ్వర్ బెహెరా, పర్యాటక శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి బల్వంత్ సింగ్, ఖుర్ధా కలెక్టర్ అమృత్ రుతురాజ్, ఖుర్దా రోడ్ డివిజన్ అదనపు డీఆర్ఎం ప్రదీప్ కుమార్ బెహెరా, ఐఆర్సీటీసీ ప్రాంతీయ మేనేజర్ అనుజ్ దత్తా, పర్యాటక శాఖ డైరెక్టర్ దీపాంకర్ మహా పాత్రో ప్రసంగించారు. ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో 10 దశల్లో మొత్తం 8,000 మంది వయోవృద్ధులు తీర్థయాత్రలు చేపట్టనున్నారు. కార్యక్రమంలో అయోధ్య, వారణాసి, హరిద్వార్, రిషికేశ్, రామేశ్వరం, మదురై వంటి గమ్యస్థానాలు ఉంటాయని తెలిపారు. -
యువకుడు ఆత్మహత్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎం.వి.92 గ్రామంలో సాగర్ సర్కార్ (23) అనే యువకుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాగర్ కొద్దిరోజుల కిందట కోల్‌కతాలో పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితను ప్రేమించి తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న సాగర్ తండ్రి గ్రామపెద్దల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి సాగర్‌ను కొట్టి రూ.45 వేలు జరిమానా విధించారు. అనంతరం వివాహిత భర్తను పిలిపించి అతనితో పంపించేశారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సాగర్ మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మల్కన్‌గిరి ఐఐసి ప్రభుదత్త మాలిక్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
చెస్‌లో ఎలెనా మిశ్రా ప్రపంచ రికార్డు
● పిన్న వయసులో ఘనతభువనేశ్వర్: చదరంగం క్రీడలో ఒడిశాకు చెందిన చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఘనత సాధించింది. ఒడిశాకు చెందిన 4 ఏళ్ల ఎలెనా మిశ్రా అధికారిక ఫిడే రేటింగ్ సాధించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా చదరంగం క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన మైలు రాయిని ఆవిష్కరించింది. ఎలెనా మిశ్రా కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సులో ఈ రికార్డు సృష్టించడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ చెస్ పాలక సంస్థ ప్రచురించిన రేటింగ్‌ల ప్రకారం కేవలం 4 సంవత్సరాల 6 నెలల 16 రోజుల వయస్సు గల ఎలెనా 1432 బ్లిట్జ్ రేటింగ్‌తో అధికారిక ఫిడే రేటింగ్‌ను పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. స్థానిక మదర్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఒడిశా స్టేట్ బ్లిట్జ్ ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ చాంపియషిప్ 2026లో ఆమె ఈ ఘనతను సాధించింది. ఈ టోర్నమెంట్లో ఆమె ప్రతిభ అత్యంత చిన్న వయస్సులోనే ఆమెకు అధికారిక ఫిడే రేటింగ్ జాబితాలో స్థానం సంపాదించి పెట్టింది. ప్రస్తుతం 2022, ఆ తర్వాత జన్మించిన వారిలో ఏ ఫార్మాట్లోనైనా అధికారిక ఫిడే రేటింగ్‌ను కలిగి ఉన్న ఏకై క బాలిక, క్రీడాకారిణి ఆమె మాత్రమే కావడం సాధించిన ఘనతకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎలీనా మిశ్రా సాధించిన ఈ మైలు రాయి ఘనత ఒడిశాలోని చిన్న పిల్లల్లో చదరంగం పట్ల మరింత ఆసక్తిని కల్పించి జాతీయ, అంతర్జాతీయ చదరంగ పటంలో రాష్ట్రానికి పెరుగుతున్న ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు. -
సెంచూరియన్ వర్సిటీలో కౌశల్ కృషిమేళా
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం కౌశల్, కృషిమేళా నిర్వహించారు. బరంపురం ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, ఉపకులపతి సుప్రియా పట్నాయిక్, రిజిస్ట్రార్ అనితా పాత్ర్, డైరక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాఢి, ఎం.ఎస్.స్వామినాథన్ వ్యవసాయ కళాశాల డీన్ ఎస్.పి.నందా, ఫిషరీస్, యానిమల్ హాజ్బెండరీ డీన్ డాక్టర్ గిరీష్ మహాంతి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్శిటీలో డ్రోన్ సహాయంతో వ్యవసాయం, గోబర్ గ్యాస్ ప్లాంట్‌ను ప్రారంభించారు. వర్శిటీ ఉద్యానవనాలలో పండిస్తున్న వివిధ రకాల మొక్కలు, డ్రాగన్ ప్రూట్ కల్చర్, ఫిషరీస్ ఆధ్వర్యంలో రొయ్యలు, చేపల పెంపకం, వెటర్నరీ కళాశాలను ఎం.పి.ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి పరిశీలించారు. వ్యవసాయ, ఫిషరీస్, వెటర్నరీ కళాశాలలకు సెంచూరియన్ వర్శిటీ భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని ఎంపీ పేర్కొన్నారు. -
ఖనిజ సవరణ చట్టంపై పునరాలోచన చేయాలి
● ప్రధానమంత్రి మోదీకి ఎంపీ సప్తగిరి లేఖరాయగడ: ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న ఒడిశా రాష్ట్ర రాజ్యాంగ హక్కులు, ఆర్థిక స్వయంప్రతిపత్తి, దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యూలేషన్ ) సవరణ చట్టం–2026 , ప్రధానంగా చట్టంలో చేర్చిన సెక్షన్ 9డీపై పునరాలోచన చేయాలని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతం ఒడిశాకు ఎంత ఆదాయం వస్తుందన్నది మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో రాష్ట్రంలోని ఖనిజ వనరులపై నిర్ణయాలు తీసుకునే అధికారి, వాటి నుంచి ఆదాయం సమీకరించే రాజ్యాంగబద్ధమైన హక్కు ఎవరి వద్ద ఉంటున్నదనే అసలు ప్రశ్న అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల పన్నుల అధికారంపై ప్రభావం సెక్షన్ 9డీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం విధించే నిబంధనలు లేదా పరిమితులకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఖణిజ హక్కులు లేదా ఖనిజాలు కలిగిన భూములపై పన్ను, సెస్ లేదా ఇతర లెవీలను విధించగల పరిస్తితి ఏర్పడుతుందని ఉలక ఆందోళన వ్యక్తం చేశారు. రాయల్టీ, వేలం ప్రీమియం, జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) వంటి వాటి ద్వారా రాష్ట్ర ఆదాయం లభిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పన్నులు లేదా ఇతర లేవీలను రూపొందించే స్వేచ్ఛ తగ్గే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. అక్రమ మైనింగ్‌పై షా కమిషన్ నివేదిక జస్టిస్ ఎంబీ షా కమిషన్ ఒడిశాలో ఇనుప, మాంగనీస్ ఖనిజాల అక్రమ తవ్వకాలపై వివరాలను నమోదు చేసిందని, సుమారు 1,59,200 రూపాయల మేర అక్రమాలకు సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నట్లు నివేదికలొ పేర్కొన్న విషయాన్ని ఎంపీ ఉలక గుర్తు చేశారు. అలాగే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2017లో సుప్రీంకోర్టు అవసరమైన చట్టపరమైన అనుమతులు లేకుండా అక్రమంగా తవ్విన ఖనిజాల పూర్తి విలువను వసూలు చేయాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. కేంఝర్, సుందరఘడ్ వంటి ఖనిజ ప్రభావిత జిల్లాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, అనేక ప్రభావిత గ్రామాలకు ఇప్పటికీ అవసరమైన మౌలిక వసతులు అందలేదని వివరించారు. గనుల కారణంగా నిర్వాసితులు కావడం, నీటి కాలుష్యం ,అటవీ నష్టం, జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ప్రజల కోసం డీఎంఎఫ్ నిధులను సమర్ధవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన హక్కులకు రక్షణ కల్పించాలి ప్రత్యేకించి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులు భూమి హక్కులు, గ్రామ సభల సమ్మతి, పునరావాసం, పరిహారం వంటి అంశాలపై మరింత పారదర్శకత అవసరమని ఉలక తెలిపారు. భూసేకరణ, పునరావాసం, న్యాయమైన పరిహారం, పాదర్శకతకు సంబంధించిన 2013 చట్టం, అలాగే పంచాయతీ చట్టం–1996 (పేసా) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. తన నియోజకవర్గమైన కొరాపుట్ గిరిజన ప్రాంతమని, సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వాటిపై ఆధారపడిన అనేక మంది ప్రజలు తమ భూమి, అటవీ హక్కుల విషయంలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారని ఉలక లేఖలో పేర్కొన్నారు. ఒడిశా నుంచి వెలికితీసే ఖనిజాలు దేశవ్యాప్తంగా పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ ఖనిజ ప్రభావిత ప్రాంతాల్లోని సామాజిక, పర్యావరణ, మానవీయ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్రానికి ఎంపీ పలు సూచనలు సెక్షన్ 9డీ పై పునఃసమీక్ష చేపట్టడంతో పాటు దాని రాజ్యాంగ, ఆర్థిక, పారిశ్రామిక, పర్యావరణ, సమాఖ్య ప్రభావాలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సెక్షన్ 9డీ కింద నిబంధనలు లేదా పరిమితులు విధించే ముందు ఖనిజ సంపద కలిగిన అన్ని రాష్ట్రాలతో అధికారికంగా సంప్రదింపులు జరపాలని, రాష్ట్రాల వారీగా ఆర్థిక ప్రభా వాల అంచనా నివేదికలను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖనిజ ప్రభావిత జిల్లాలపై సవరణ చట్టం ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని, డీఎంఎఫ్ నిధుల వినియోగంలో జవాబూదారీతనాన్ని పెంచాలని, గిరిజనులు, నిర్వాసితుల భూమి సేకరణ, పునరావాస ప్రక్రియల్లో అటవీ హక్కుల చట్టం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సప్తగిరి శంకర్ ఉలక తన లేఖలో ప్రధాన మంత్రిని కోరారు. -
విద్యార్థుల గోడు పట్టించుకోరా..?
● ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థుల నిరసన ● డీఆర్‌వలస కూడలి వద్ద బైఠాయింపు ● పోలీసులు సముదాయించడంతో శాంతించిన విద్యార్థులు జి.సిగడాం: మండలంలోని డీఆర్‌వలస వద్ద విద్యార్థులు బస్సు కోసం బుధవారం రోడ్డెక్కారు. రాజాం–విజయనగరం ప్రధాన రహదారి మధ్యలో డీఆర్‌వలస కూడలి ఉంది. ఈ కూడలికి సర్వేశ్వరపురం, డి.బొండపల్లి, దాలెమ్మరాజువలస, గదబపేట, ముషినివలస, శిరిగిడిపేటకు చెందిన ప్రయాణికులు, విద్యార్థులు వస్తుంటారు. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు ఈ సెంటర్ నుంచే అటు విజయనగరం.. ఇటు రాజాం తదితర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుదల చేయడం లేదు. దీంతో ప్రతిరోజు ఉదయం వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అటు ప్రైవేట్ వాహనాలు లేక, ఇటు ఆర్టీసీ బస్సులు ఆపక తిరిగి ఇంటిముఖం పడుతున్నారు. కాస్తో కూస్తో స్తోమత ఉన్నవారు ఎలాగోలా ప్రైవేట్ వాహనాలు ద్వారా కాలేజీలకు వెళ్తున్నారు. మిగిలినవారంతా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బుధవారం వీరంతా అటు విజయనగరం, ఇటు రాజాం వెళ్లే ఆర్టీసీ బస్సులకు అడ్డంగా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కూడలిలో ఎందుకు బస్సులు ఆపడం లేదు.. బస్సు పాసులు ఇచ్చి ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్లను ప్రశ్నించారు. అయితే బస్సులు ఖాళీ ఉండడం లేదని, కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, ఈ కారణంగానే కూడలి వద్ద ఆపలేకపోతున్నామని సమాధానం చెప్పారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ సర్వీసులు లేవని, తగ్గించేశారని చెప్పడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. తమ సమస్య పరిష్కరించేవరకూ ఏ బస్సును కదలనీయమని రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల రంగ ప్రవేశం డీఆర్‌వలస సెంటర్లో విద్యార్థుల నిరసన విషయాన్ని తెలుసుకున్న జి.సిగడాం పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఈ నిరసన కార్యక్రమం కారణంగా డీఆర్‌వలస కూడలికి రెండు వైపులా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులతో పోలీసులు మాట్లాడారు. ఆర్టీసీ సర్వీసులు ఉదయం, సాయంత్రం సమయాల్లో పెంచడంతో పాటు ప్రతీ ఆర్టీసీ బస్సూ విద్యార్థుల కోసం డీఆర్‌వలస కూడలిలో నిలుపుదల చేయాలని, ఎంత రద్దీగా ఉన్నా బస్సును ఆపాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది అందుకు అంగీకరించడంతో నిరసన తాత్కాలికంగా సద్దుమణిగింది. -
క్షయవ్యాధిపై అవగాహన
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో బుధవారం టీబీ ముక్త భారత్ అభిజాన్ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) ఆదేశాల మేరకు కమాండింగ్ అధికారి లెఫ్టనెంట్ కర్నల్ పీతిరంజన్ దాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యుడు శివసాయి స్వరూప్ (ఎ.పి.పి.హెచ్.ఓ–టీబీ) ముఖ్యవక్తగా పాల్గొని క్షయ వ్యాధి లక్షణాలు, నిరోధక చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్.ఎ.సి బెటాలియన్ 15(ఓ) సుబేదార్, అసిస్టెంట్ కలెక్టర్ అనూప్ నాయిక్, కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన పాంగొలిన్ ప్రత్యక్షం
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి ధమునిపంగ పంచాయతీ డమలిమా గ్రామ సమీపంలో అరుదైన వన్యప్రాణి పాంగొలిన్ (బజ్రకాష్ట)ను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పాంగొలిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు ఫారెస్టర్ బర్కారాణి పాత్ర, గార్డ్ అనుష్క పండా, ఫారెస్టర్ విక్రంనాయుడు తెలిపారు.వంశధార నదిలో వ్యక్తి గల్లంతు రాయగడ: గుణుపూర్‌లోని వంశధార నదిలో బుధవారం స్నానానికి దిగిన ఓ వ్యక్తి నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సముద్రంలో గల్లంతై పర్యాటకుడి మృతి భువనేశ్వర్: పూరీ సముద్రంలో స్నానం చేస్తున్న ఐదుగురు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఓ పర్యాటకుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లైట్ హౌస్ బీచ్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడిని ఉత్తర ప్రదేశ్‌లోని రాణిపూర్‌కు చెందిన సుమిత్ గుప్తాగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన బీహార్‌కు చెందిన పర్యాటకుడు అనీష్ సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు తరలించారు.సుమిత్ గుప్తా, అనీష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుమిత్ గుప్తా మరణించాడు. అనీష్ సింగ్ భువనేశ్వర్ ఆసుపత్రిలో ఉన్నత చికిత్స పొందుతున్నాడు. నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు ● దంపతుల దుర్మరణం భువనేశ్వర్: లోతైన గుంతలో కారు పడిపోవడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన పారాదీప్ గొడొ బజార్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కకు జారి పోయి నీటి గుంతలో మునగడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నారు. మృతులను పారాదీప్ పోర్ట్‌లోని మైరెన్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి బిభూతి భూషణ్ దాస్, అతని భార్య ప్రతిమా దాస్‌గా గుర్తించారు. కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి నీటి గుంతలోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగిపోయిన కారులో ఉన్న ఇద్దరూ అందులోనే చిక్కుకుపోయారు. వారిని సకాలంలో రక్షించలేక పోయారు. లాక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చే సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. 203 కిలోల గంజాయి పట్టివేత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఝాటిగూడ అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధం చేసిన 203 కిలోల గంజాయిని మల్కన్‌గిరి ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అందిన ముందస్తు సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ పొద చాటున ఉన్న 8 గంజాయి బస్తాలు పట్టుకున్నారు. వీటిన మంగళవారం తూకం వేయగా 203 కిలోలుగా గుర్తించారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని దర్యాప్తు అధికారులు తెలిపారు. -
రాయగడలో యంత్రాలతో రోడ్ల శుభ్రత
రాయగడ: పట్టణాన్ని మరింత శుభ్రంగా, సుందరంగా, కాలుష్యరహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ యంత్రాంగం కీలక ముందడుగు వేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులను అత్యాధునిక యంత్రాలతో శుభ్రం చేసే మెకానికల స్వీపింగ్ (యాంత్రిక రోడ్ల శుభ్రత) వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఇకపై రోడ్డుపై పేరుకుపోయిన దుమ్ము, ఇసుక, చెత్తను తక్కువ సమయంలోనే సమర్ధవంతంగా తొలగించే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఉత్వర్వుల మేరకు సంబల్పూర్ మున్సిపాల్ కొర్పొరేషన్, జయపురం మున్సిపాలిటీతో పాటు రాయగడ మున్సిపాలిటీ పరిధిలోయాంత్రిక శుభ్రత పనుల నిర్వహణకు గ్రీన్ ఇన్నొవేటీవ్ పవర్ ప్రైవెట్ లిమిటెడ్ సంస్థను నియమించారు. ఈ సంస్థతోఐదేళ్ల పాటు సేవలు అందించేలా ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక యాంత్రిక శుభ్రత వాహనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలొ రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాగి పైపులు చోరీ
రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలో ఎయిర్ కండీషనర్ (ఏసీ)లకు వాడే చిన్నపాటి రాగి పైపులు దొంగలించిన కేసులో పట్టుబడినవారిని స్టేషన్ బెయిల్‌పై విడిచిపెట్టామని జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. పైడిభీమవరం సిస్కో పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు విషయమై విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18వ తేదీన నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి ప్రసాద్, నీలాపు పరదేశి(మహేష్), నిద్రబంగి దుర్గా ప్రసాద్‌లు పరిశ్రమలో దొంగతానికి పాల్పడ్డారు. దొంగిలించిన రాగి పైపుల 25 కట్టలను పూసపాటిరేగ మండలంలోని కామవరం దగ్గర ఒక తుక్కు దుకాణంలో అమ్మేందుకు ఆటోలో వెళ్లారు. అక్కడ అమ్మకానికి ప్రయత్నించగా జేఆర్‌పురం, పైడిభీమవరం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.8.25 లక్షలు ఉంటుందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై ఇంటికి పంపించామని తెలిపారు. కాగా ఈ ముగ్గురి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జేఆర్‌పురం ఎస్ఐ వి.సత్యనారాయణను వివరణ కోరగా 7 ఏళ్లలోపు కేసులకు రిమాండ్‌కు తరలించకుండా పంపించవచ్చునని, అదే 7 ఏళ్లు దాటిన కేసులకు తప్పకుండా రిమాండ్‌కు తరలిస్తామన్నారు. -
ఆహ్లాదకర వాతావరణంలో..!
● పూరీ మందిరంలో ఏసీ సౌకర్యం ● భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు ● ఆలయ పవిత్రతకు ఇబ్బంది లేకుండా చర్యలుభువనేశ్వర్: పూరీలోని జగన్నాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఉక్కపోత, తేమ నుంచి ఉపశమనం లభించనుంది. ప్రధాన ఆలయం లోపల నాట్య మండపం ప్రాంగణంలో పూర్తిగా ఎయిర్ కండిషన్ (ఏసీ) సౌకర్యం కల్పించారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తులకు దర్శనానికి ఈ సదుపాయం సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తుంది. నాట్య మండపం ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న భక్తులు, యాత్రికుల చిరకాల కోరిక తీరింది. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభమైంది. ముఖ్యంగా భొత్తొరొ కఠొ దర్శనం (లఘు దర్శనం) సమయంలో ఇటువంటి ఏర్పాటు ఉపశమనం కల్పిస్తుంది. ఈ ప్రాంగణంలో దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడిన సమయంలో వేడి, తేమతో కూడిన వాతావరణం అలముకొని తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఏసీ సదుపాయం అందుబాటులోకి రావడంతో జగన్నాథ స్వామి, ఆయన తోబుట్టువుల దర్శనం కోసం నాట్య మండపాన్ని సందర్శించే భక్తులు సౌకర్యవంతమైన వాతావరణంలో సమయం గడపగలుగుతారు. ఈ సదుపాయం ముఖ్యంగా వేసవి కాలంలో మరియు అధిక తేమ ఉండే సమయాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.పటిష్ట జాగ్రత్తలు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ వల్ల దేవతా విగ్రహాలకు, ఆలయ ఆచారాలకు లేదా శ్రీమందిరం వారసత్వ కట్టడాల పవిత్రతకు ఎలాంటి దుష్ప్రభావం కలగకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఆలయ ఆచారాలు, వారసత్వ సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వారసత్వ కట్టడం రక్షణ కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాట్య మండపంలో వేరియబుల్ రిఫ్రిజెరేట్ ఫ్లో (వీఆర్ఎఫ్) టెక్నాలజీతో కూడిన ఆధునిక ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పని చేస్తుంది. ఈ సదుపాయం నిరంతరాయంగా పనిచేసేలా చూసేందుకు దీనికి 5 ఏళ్ల నిర్వహణ మరియు మరమ్మతుల నిబంధనతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
బయో మైనింగ్‌కు శ్రీకారం
రాయగడ: పట్టణాన్ని పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపాలిటీ కీలక ముందడుగు వేసింది. స్థానిక మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని పాత డంపింగ్ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించి, పునర్వినియోగం చేసి వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధి ప్రక్రియ (బయో మైనింగ్)కి మంగళవారం శ్రీకా రం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరై ప్రాజెక్టును ప్రారంభించారు. మజ్జిగౌరి మందిరానికి సమీపంలోని ఈ పాత డంప్‌సైట్‌లో పేరుకుపోయిన లెగసీ వ్యర్థాల బయో మైనింగ్ కోసం మున్సిపాలిటీ యంత్రాంగం టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఈ పనులకు మూడు ప్రైవేట్ సంస్థలు దరఖాస్తు చేయగా నిబంధనల ప్రకారం ఝనేశ్వర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఎంపిక చేసి 2026 ఏప్రిల్ 21న పనుల ఉత్తర్వులను జారీ చేశారు. బయో మైనింగ్ ద్వారా పాత చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో వేరుచేసి, పునర్వినియోగానికి అనువైన పదార్థాలను తిరిగి వినియోగించనున్నారు. మొత్తం 60 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నిర్వహించేందుకు ఈ సంస్థకు 4 నుంచి 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియలో లభించే ఆర్డీఎఫ్ వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలకు పంపించనుండగా, తడి వ్యర్థాలను ల్యాండ్ ఫిల్లింగ్‌కు వినియోగించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అఽధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం
రాయగడ: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ యువతి నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశారని స్థానిక వెబ్ ఛానల్ జర్నలిస్ట్ అనుబ్రత బరాపై సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. తెరువలి ప్రాంతానికి చెందిన యువతి జుబంతి హికక పట్టణంలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సదరు జర్నలిస్టు తన వద్ద నుంచి రూ.లక్ష తీసుకున్నారని ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ వచ్చారని, అనంతరం రూ.లక్షకు సంబంధించిన చెక్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ చెక్‌ను బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ జుబంతీ తన బంధువుతో కలసి మంగళవారం సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇప్పించడంతో జర్నలిస్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. కాగా ఈ విషయంపై పోలీసుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. -
ఆర్థిక సాయం అందజేత
రాయగడ: మృతి చెందిన జర్నలిస్టు రాజీవ్ లోచన్ పండ తల్లిదండ్రులకు రాయగడ ప్రెస్ యూనియన్ మరోసారి ఆర్థిక సాయం అందజేసింది. యూనియన్ అధ్యక్షుడు ఇప్పిలి సర్వేశ్వరరావు నేతృత్వంలో గుముడా ఖిలింగరాయిలోని వారి నివాసానికి వెళ్లి నెలకు రూ.1,000లు చొప్పున 11 నెలలకు సంబంధించిన రూ.11 వేల భత్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి శివాజీ దాస్ మాట్లాడుతూ యూనియన్ ఒక కుటుంబం, సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు సంఘం అండగా నిలస్తుందన్నారు. ప్రతీ సభ్యుడి కుటుంబానికి రక్షణగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంఘం సలహాదారుడు సురేష్ దాస్ కోరారు. ఘనంగా పోషకాహార దినోత్సవం పర్లాకిమిడి: సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే పోషకాహార దినోత్సవం ముఖ్య ఉద్దేశమని నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్.ఎన్.సంధ్య అన్నారు. ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ ఆధ్వర్యంలో గుసాని బ్లాక్ రణదేవి గ్రామంలో పోషకాహార దినోత్సవం 2026ను విద్యార్థులు, ఫ్యాకల్టీ నిర్వహించారు. సరైన పోషకాహారంపై నర్సింగ్ విద్యార్థులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పోషకాహారం శరీరం ఎదుగుదల, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుందని వివరించారు. పోస్టర్ ప్రదర్శించి సమతుల్య ఆహారం వల్ల పిల్లల ఎదుగుదలను వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్లు, సునీత, మధుచందా తదితరులు పాల్గొన్నారు. ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్ మల్కన్‌గిరి: పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 25 ఏళ్ల సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ నేతలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవకు అంకితమైన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేపట్టారు. మహిళల గౌరవం కోసం నరేంద్ర మోదీ చేసిన ప్రతీ పథకం కూడా ప్రజలకు అందేవిధంగా చూడాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు అశోక్ పారిడా వెల్లడించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి, కుశ్ తాతి, శాంతిలత మాఝి, ప్రత్యేక అభివృద్ధి మండలి చైర్మన్ గంగా సోడి, మాజీ ఎమ్మెల్యే డంబరు సీసా, జిల్లా కార్యదర్శి మాణిక్ లాల్ చక్రవర్తి, నవఘన్ లోకేయి తదితరులు పాల్గొన్నారు. సోఫియా ఫిర్దౌస్ రాజీనామా చేయాలి భువనేశ్వర్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తే బారాబటి కటక్ శాసనసభ నియోజక వర్గం సిటింగ్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దౌస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఓపీసీసీ) కోరింది. 2024లో ఆమె కాంగ్రెస్ టికెట్‌పై రాష్ట్ర శాసన సభకు ఎన్నికై న విషయం తెలిసిందే. కాబట్టి మరో రాజకీయ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ముందే పార్టీని వీడాలి అని ఓపీసీసీ చీఫ్ తెలిపారు. తన కుమార్తె ఫిర్దౌస్ బారాబటి కటక్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై తిరిగి పోటీ చేయదు. 2029 ఎన్నికలలో కొత్తగా ఏర్పడిన ఒడిశా జనతా కాంగ్రెస్ (ఓజేసీ) అభ్యర్థిగా పోటీ చేస్తుందని మాజీ శాసన సభ్యుడు మహ్మద్ మోకిమ్ ప్రకటించిన మర్నాడు భక్త చరణ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో సోఫియా ఫిర్దౌస్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రోను సుమారు 8,000 ఓట్ల తేడాతో ఓడించి ప్రతిష్టాత్మకమైన బారాబటి కటక్ శాసన సభ స్థానాన్ని గెలుచుకున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 16న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెతో పాటు మరో 2 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జెనా, దాశరథి గోమాంగోలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. -
మోసం కేసులో నిందితుడు అరెస్టు
పర్లాకిమిడి: ముక్కుడమ్మ మహిళా స్వయం సేవక్ గ్రూపులు సేకరించిన డబ్బులు, మైక్రో ఫైనాన్స్ ప్రైవేటు లిమిటెడ్ అందజేసిన రుణాలు కాజేసి పరారైన సిద్ధకుమార్ అలియాస్ సిద్ధ ఆరాధ్యను హైదరాబాద్‌లో యూసఫ్గుడలోని హైలాం కాలనీలో ఒడిశా పోలీసులు అరెస్టు చేసి పర్లాకిమిడి ఎస్డీజేఎం కోర్టులో సోమవారం హాజరుపరిచారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక బగాతి వీధికి సమీన్ బేగం జూన్ 11న పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధకుమార్ మైక్రోఫైనాన్స్, మహిళా స్వయం సహాయక గ్రూపుల వద్ద నుంచి కలెక్షన్ చేసిన బాకీ సొమ్ము రూ.80 లక్షలు, 110 గ్రాముల గోల్డును కోవిడ్ 2019లో కాజేసి పరారయ్యారు. దీంతో మైక్రోఫైనాన్స్ కంపెనీ ప్రెసిడెంట్ ఎ.పద్మారాజ్, దివంగత అనిల్ కుమార్ పాత్రోకు కంపెనీ లావేదేవీలు అన్ని అప్పగించి అమెరికా వెళ్లిపోయారు. దీంతో అకౌంటెట్ సపన్ కుమార్ పాణిగ్రాహి, సిబ్బంది కాళీప్రసాద్ పట్నాయిక్, అశోక్‌కుమార్ మహాపాత్రోలు మైక్రోఫైనాన్స్‌లో మోసం జరిగిందని గమనించి సిధ్ధకుమార్పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదర్శ పోలీసుస్టేషన్లో ఐఐసీ ప్రశాంత్ భూపతి, ఇతర సిబ్బంది దర్యాప్తు జరిపి సిద్ధకుమార్ను ఎట్టకేలకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. -
బాధ్యతల స్వీకరణ
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే కొత్త అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా బిజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) 1991 బ్యాచ్ అధికారి. రైల్వే ఆర్థిక, పథకాల నిర్వహణ, రైలు కార్యకలాపాల రంగంలో సుదీర్ఘంగా 35 సంవత్సరాలకు పైబడిన విభిన్నమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. భారతీయ రైల్వేలో తన విశిష్టమైన కెరీర్లో ఆయన అనేక ముఖ్యమైన సవాళ్లతో కూడిన బాధ్యతలను నిర్వహించారు. తన ప్రస్తుత బాధ్యతతో పాటు బిజయ్ కుమార్ తూర్పు కోస్తా రైల్వేలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ (పీఎఫ్ఏ)గా కూడా పని చేస్తున్నారు. అక్కడ ఆయన అకౌంట్స్, ఫైనాన్స్, బడ్జెటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్ వంటి కీలకమైన విధులకు బాధ్యత వహిస్తున్నారు. గతంలో ఈశాన్య సరిహద్దు రైల్వేలోని తిన్సుకియా మండలంలో మండల రైల్వే అధికారి (డీఆర్ఎం)గా పని చేశారు. మలేషియాలోని కౌలలాంపూర్‌లో ఉన్న ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో డిప్యుటేషన్‌పై ప్రాజెక్ట్ ఫైనాన్స్ హెడ్‌గా చేరి ప్రధాన అంతర్జాతీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించారు. విద్యాపరంగా బిజయ్ కుమార్ మిశ్రా ధన్‌బాద్ ఐఐటీ నుంచి అప్లయిడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ లీ క్వాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీ (ఎంపీపీ) పట్టాను పొందారు. ఆయన లండన్ మరియు ప్యారిస్‌లోని యూరోపియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, చైనాలోని బీజింగ్ జియావోటాంగ్ యూనివర్సిటీలో హెవీ హాల్ రైల్వే టెక్నాలజీలో ఉన్నత వృత్తిపరమైన శిక్షణను పొందారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి ● నిందితులకు రెండేళ్ల జైలుశిక్ష రాయగడ: విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై అమానుషంగా దాడి చేసిన ఘటనపై జిల్లా కోర్టు ఇద్దరు నిందితులకు రెండేళ్ల పాటు జైలు శిక్షను విధించడంతో పాటు ఒకొక్కరూ రూ.2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ జరిమానా కట్టకుంటే అదనంగా మరో రెండేసి నెలలు జైలు శిక్ష అనుభవించాలని తమ తీర్పులో పేర్కొంది. రాయగడ సివిల్ జడ్డి (సీనియర్ డివిజన్), అదనపు సెషన్ జడ్డి ఆశీష్ పట్నాయక్ ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2023 నవంబర్ 17వ తేదీన బాధితుడు ప్రణవ్ కుమార్ పాఢి ట్రాఫిక్ విధుల్లో ఉండగా అదే సమయంలో నిందితులు జి.అజయ్ అలియాస్ ఎస్కే ఇమ్రాన్, ఎం.మణికంఠలు ఒక బైకుపై ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారు. వెంటనే వారిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి నిలదీశా రు. దీంతో నిందితులిద్దరూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ మేరకు కానిస్టేబుల్ సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. -
హైటెక్‌లో అరుదైన శస్త్ర చికిత్స
● 7 గంటల పాటు నిరవధికంగా శస్త్ర చికిత్స ● రోగి ప్రాణాలు కాపాడిన వైద్యుల బృందం భువనేశ్వర్: హైటెక్ ఆస్పత్రిలో జరిగిన అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ఒక రోగి మృత్యువు నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. గంజాం ప్రాంతానికి చెందిన సూరజ్ నాయక్ వృత్తిరీత్యా డ్రైవర్. అతడు చాలా కాలంగా ఛాతీ, వీపు, మెడలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు. కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చేరిన తర్వాత వ్యాధిని నిర్ధారించినా.. సకాలంలో శస్త్ర చికిత్స చేయలేకపోయారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటిన సూరజ్‌ను హైటెక్ వైద్య బోధన ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు, సిటీ స్కాన్, ఈసీజీ, యాంజియోగ్రఫీ పరీక్షల ఆధారంగా రోగి గుండెలోని ప్రధాన ధమనిలో చీలిక ఏర్పడి దాని నుంచి రక్త ప్రవాహం గుండైపె తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని కనుగున్నారు. దీనికి తక్షణమే అవసరమైన శస్త్ర చికిత్స చేసేందుకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని సిద్ధం చేశారు. డాక్టర్ రితేష్ ఆచార్య, డాక్టర్ శ్వేతా దాస్, డాక్టర్ స్మృతి ప్రకాష్ సాహు, డాక్టర్ సత్య స్వరూప్ పట్నాయక్‌లతో కూడిన బృందం శస్త్ర చికిత్సకు నడుం బిగించింది. డాక్టర్ శ్వేతాంక్ దాస్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. శస్త్ర చికిత్స ఇలా... వీరంతా సుమారు 7 గంటల పాటు నిరవధికంగా కొనసాగించిన శస్త్ర చికిత్సలో దాదాపు 34 నిమిషాల పాటు రోగి శరీరం అంతటికీ రక్త ప్రసరణను తాత్కాలికంగా నిలిపివేసి, కేవలం గుండెకు మాత్రమే కృత్రిమంగా వెంటిలేషన్ అందించారు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా సమగ్ర వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రోగిని మృత్యు ముప్పు నుంచి బతికించడం విశేషం. సాయంత్రం ప్రారంభమైన ఈ శస్త్ర చికిత్స తెల్లవారుజాము వరకు నిరవధికంగా కొనసాగింది. ఇలాంటి వ్యాధులతో 100 మందిలో 70 మంది రోగులు మరణించే ప్రమాదం ఉందని డాక్టర్ శ్వేతాంక్ దాస్ అన్నారు. డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సారధ్యంలో అత్యాధునిక చికిత్సా విధానం అందుబాటులో ఉండడం వలన సూరజ్ నాయక్ ప్రాణాలను కాపాడడం సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా కార్డుపై ఈ శస్త్ర చికిత్స జరిగింది. రోగి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత అతడు యథావిధిగా పనులన్నీ చేసుకోగలుగుతాడని వైద్య బృందం అభయం ఇచ్చింది. -
ఆర్టీసీ బస్ సర్వీసులు రద్దు
శ్రీకాకుళం అర్బన్: పాయకరావుపేటలో బుధవారం జరగనున్న జలహారతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్న నేపథ్యంలో జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు వేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 20, రెండో డిపో నుంచి 20, టెక్కలి డిపో నుంచి 10, పలాస డిపో నుంచి 15 బస్సులు మొత్తం 65 బస్సులు జిల్లాలో రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుడికి రిమాండ్ శ్రీకాకుళం రూరల్: మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో పాఠశాలలో విచారణ చేపట్టగా.. వాస్తవాలు నిజమని తేలడంతో సదరు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. కొట్లాట కేసులో ఐదుగురిపై కేసు నమోదు కొత్తూరు: కొత్తూరులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన కొట్లాటకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ మంగళవారం తెలిపారు. వండంకి మంజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై, సొంట్యాన నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. బైక్ ఢీకొని ఒడిశా యువకుడు మృతి నరసన్నపేట: ఉర్లాం సమీపంలో ఆర్అండ్బీ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా మునిగూడకు చెందిన పప్పు దండసేన(19)గా పోలీసులు గుర్తించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉర్లాం వద్ద కొంతకాలంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులు చేసేందుకు వచ్చిన దండసేన నిత్యావసర సరుకుల కోసం తన స్నేహితుడితో కలిసి ఉర్లాం వచ్చాడు. తిరిగి తమ నివాసానికి వెళ్తుండగా గొనబుపేటకు చెందిన కుంచి రాంప్రసాద్ బైక్‌పై అతి వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన దండ సేనను నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది చికిత్స ప్రారంభించగా అప్పటికే మృతి చెందాడు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వాహనం పడుపుతున్న రాంప్రసాద్‌కు కూడా గాయాలయ్యాయి. వాహనం నడుపుతుండగా కంట్లో పురుగు పడటంతో బండి అదుపు తప్పిందని రాంప్రసాద్ తెలిపారు. ఆవులను తప్పించబోయి.. – బైక్ బోల్తాపడి మహిళ మృతి బూర్జ: వైకుంఠపురం పంచాయతీ అల్లెపల్లిగూడ గిరిజన గ్రామానికి చెందిన మండంగి సుజన(55) శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజన తన అకౌంట్లో ఉపాధి హామీ, హౌసింగ్ డబ్బులు చెక్ చేసేందుకు సోమవారం సాయంత్రం చిన్న కుమారుడు మండంగి సామ్యూల్‌తో కలిసి బైక్‌పై ఉప్పినివలస బయలుదేరింది. మార్గమధ్యలో శ్మశాన వాటిక వద్ద ఆవులను తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. వెనుక కూర్చున్న సుజన రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆటోలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పెద్ద కుమారుడు డానియల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్ఛాపురం: వన్యప్రాణుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు అన్నారు. మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామంలోని ఓ ఇంటికి సమీపంలో గల కంచెలో మంగళవారం రక్తపింజరి పాము చిక్కుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు ఆదేశాల మేరకు సోంపేటకు చెందిన స్నేక్‌క్యాచర్ బాలరాజు సహకారంతో పాముని పట్టుకొని జలంత్రకోట సమీపంలో రక్షిత అటవీశాఖ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్బంగా ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడుతూ.. వర్షాకాలం కావడంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు, తోటలు, పంటపొలాలకు వెళ్లేటప్పుడు చెప్పులు లేదా బూట్లను ధరించి టార్చ్‌లైట్‌ని వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. -
గుణుపూర్‌లో ప్రోటోకాల్ వివాదం
● ప్రారంభోత్సవ ఫలకాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేవని అభ్యంతరం రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలా ఫలకాల్లో స్థానిక కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగోల పేర్లు లేకపోవడంతో వివాదం చెలరేగింది. అంతేకాకుండా వేడుకలకు ముఖ్య అతిథి గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్, గౌరవ అతిథి గుణుపూర్ బీడీవో స్వస్థిక్ జమాదార్లు హాజరవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీ లేదా సమితి పరిధిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సంబంధిత ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించడంతో పాటు ప్రారంభోత్సవ ఫలకాల్లో వారి పేర్లు పొందుపరచాల్సి ఉంటుందని ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో పేర్కొన్నారు. అయితే గుణుపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్యనిర్వాహక అధికారి ఈ నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఈ విషయాన్ని రాయగడ జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభి షేక్ అనిల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే గొమాంగొ తెలిపారు. మరోవైపు ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక మున్సిపాలిటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై స్వాధికార భంగం నోటీసు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు లేఖ..? ఫిర్యాదుల నేపధ్యంలో సబ్ కలెక్టర్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌కు లేఖ రాసి ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ సూచనల అనంతరం కూడా ఎంపీ, ఎమ్మెల్యే పేర్లు లేకుండానే కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం మరింత వివాదానికి కారణమైంది. మరోవైపు సీనియర్ కౌన్సిలర్ దేవీ ఆచార్య మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు ముందుగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సి ఉందన్నారు. సమావేశం నిర్వహించకుండా మున్సిపాలిటీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి ఇబ్బందికర పరిస్ధతులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి స్పందిస్తూ ఇది నా దురదృష్టం అని పేర్కొన్నారు. వివాదం నేపధ్యంలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ దుదూల్, గౌరవ అతిథిగా పేర్కొన్న బీడీవో స్వస్తిక్ జమాదార్ హాజరవ్వలేదు. దీంతో మున్సిపాలిటీ క్యార్యాలయం ప్రాంగణంలో చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివ ప్రసాద్ గౌడో, కార్య నిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్, సమితి వైస్ చైర్మన్ సుదర్శన్ సబర్, కౌన్సిలర్లు దేవీ ప్రసాద్ ఆచార్య, భాగిరథి బొసొయి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ప్రతిపక్షానికి ఆంక్షలు.. అధికార పక్షానికి అనుమతులు
రణస్థలం: రపజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న కార్యక్రమం చేసినా పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అదే అధికార పార్టీ అనుమతులు తీసుకోకపోయినా పక్కన నిలబడి వత్తాసు పలకడం సరికాదని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఏడాది జూన్ 12 నాటికి చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ప్రతిపక్ష పార్టీ బైక్ ర్యాలీ చేపడతామని అనుమతి కోరితే పోలీసులు అనుమతులు మంజూరు చేయలేదు. రణస్థలం ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ చేయడానికి కుదరదంటూ నిలువరించేశారు. అదే అధికార పార్టీలో భాగమైన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం చేపట్టే భారీ బైక్ ర్యాలీకి లావేరు నుంచి సుభద్రపురం, రణస్థలం, కోష్టా మీదుగా పైడిభీమవరం వరకు జాతీయ రహదారిపై దర్జాగా అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీకి వర్తించే నిబంధనలు.. ఇప్పుడు అధికార పార్టీకి వర్తించవా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, లావేరు ఎస్సై వి.సందీప్‌కుమార్ వద్ద ప్రస్తావించగా అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. ఖాళీ పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలి శ్రీకాకుళం: ఆగస్టులో కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేశారని, ఆయా పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, హెచ్ఎం పశువుల జగన్నాథరావు తదితరులు కోరారు. ఈ మేరకు డీఈఓ ఎ.రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. కొన్ని పాఠశాలల్లో 300 మంది విద్యార్థులున్నా ఒక్కరే సబ్జెక్టు టీచర్ ఉన్నారని, బోధించడం కష్టంగా మారిందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బోధన కుంటుపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆస్తి నేరాలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించి కోర్టులో చార్జిషీట్ దాఖలయ్యేలా చూడాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్సు ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆస్తి నేరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతుందన్నారు. నేరం జరిగే ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించి నేరస్థుల కదలికలను గుర్తించాలని, భౌతిక ఆధారాలతో పాటు సాంకేతిక ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నేరస్థుల గత చరిత్ర, నేరం జరిగే విధానం, సాంకేతిక ఆధారాలు సమన్వయం చేసుకోవాలన్నారు. హౌస్ బ్రేకింగ్, చైన్ స్నాచింగ్, రోబరీ, డెకాయిట్, మర్డర్ ఫర్ గెయిన్, ద్విచక్రవాహనాల దొంగతనాలు వంటివి పెండింగ్ కేసులు పూర్తిచేయాలన్నారు. -
పింఛన్లు ఇచ్చేందుకు వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు గాయాలు హిరమండలం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్ర గాయాలపాలయ్యారు. పింఛన్లు పంపిణీ చేసేందుకు మంగళవారం ఉదయం వెళుతుండగా హిరమండల మండలంలోని ధనుపురం మలుపు దాబా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మండలం బూరగాం, రొంపివలస పంచాయతీ కార్యదర్శులు వాడన ఉదయశ్రీ, గేదెల ప్రసన్నలు మంగళవారం ఉదయం స్కూటీపై వెళుతున్నారు. సరిగ్గా ధనుపురం శివార్లలో ఉన్న దాబా వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై తుల్లిపడటంతో కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన బూరగాం కార్యదర్శి ఉదయశ్రీ గాయాల పాలైన రొంపివలస కార్యదర్శి ప్రసన్న -
830 గ్రామాల్లో .. పోలీసుల మెగా పల్లె నిద్ర
శ్రీకాకుశం క్రైమ్ : జిల్లాలో మెగా పల్లెనిద్రలో భాగంగా 830 గ్రామాల్లో పోలీసులు సోమవారం రాత్రంతా బస చేశారు. ప్రజల్లో భద్రతా భరోసాను పెంపొందించడమేకాక రానున్న ఎన్నికల నాటికి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడమే పల్లె నిద్ర ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి పోలీసూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నంం గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఆయనతో పాటు రూరల్ సీఐ పైడపునాయుడు, స్పెషల్ బ్రాంచి సీఐ ఇమ్మాన్యుయల్ రాజు, గార ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెండో పట్టణ పరిధి పుణ్యపువీధి 12వ వార్డులో సీఐ పి.ఈశ్వరరావు, ఒకటో పట్టణ పరిధి కంపోస్టు కాలనీలో ఎస్ఐ ఎం.హరికృష్ణలు తమ సిబ్బందితో పాటు పల్లె నిద్ర చేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో.. కళింగపట్నం గ్రామాన్ని సందర్శించిన ఎస్పీకి అక్కడి స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ న్యూసెన్సు, మాదక ద్రవ్యాల ప్రభావం, రోడ్డు ప్రమాద నివారణ వంటి అంశాలు దృష్టికి తెచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర ఛేదనలో కీలకపాత్ర పోషిస్తాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామాల్లోని ముఖ్యప్రాంతాలతో పాటు వీలైనంతవరకు ప్రతీ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం యువతను తీవ్రంగా ప్రభావం చేస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమాచారం సామాజిక స్పృహతో ప్రజలు పోలీసులకు తెలియపర్చితే నియంత్రణకు సహకరించినట్లువుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం.. ప్రతి గ్రామానికి దత్తత కానిస్టేబుల్‌ను నియమించి 15 రోజులకోసారి గ్రామాన్ని సందర్శించేలా చేసి గ్రామస్తులతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవిధంగా కృషిచేస్తామని ఎస్పీ అన్నారు. పోలీసుల వైపు నుంచి నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. -
శివ.. శివా
● ముఖలింగం అష్ట దిక్పాలకుల గర్భగుడిలో శునకాల విహారం ● పట్టించుకోని దేవదాయ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు జలుమూరు: మహాదేవునికి అపచారం జరిగింది. శ్రీముఖలింగంలోని ఒక శివలింగం పానపట్టంపై శునకం నిద్రించింది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీముఖలింగానికి దక్షిణ కాశీగా పేరుంది. కాశీకి తుల్యమైనదిగా భావించి ఇక్కడకు దేశవిదేశాలతోపాటు ప్రపంచం నలుమూలలు నుంచి భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత గల దేవాలయాన్ని అటు దేవదాయ శాఖతోపాటు కేంద్ర పురావస్తు శాఖ నుంచి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివలింగాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మంగళవారం ప్రధాన దేవాలయంలో ఉన్న అష్ట శివలింగాల్లో ఒకటైన దేవేంద్రుడి ప్రతిష్టితమైన ఇంద్ర లింగం గర్భగుడిలో పానపట్టంపై శునకాలు పడుకుని కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆలయ నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంలోని గర్భగుడిలో శునకాలు ప్రవేశించడం దేవదాయ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంతో విశిష్టత గల ఈ దేవాలయం నిర్వహణ ఇలా గాలికి వది లేయడం మంచి పద్ధతి కాదు. ఎంతో విశ్వాసంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. దేవదాయ శాఖ ఏం చేస్తున్నట్టు? ఇది భక్తులు మనో భావాలను దెబ్బతీయడమే. – బి.ఆనంద్, భక్తుడు, విజయనగరం కేవలం ఇక్కడ అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులు నుంచి ఎంత ఆదాయం వస్తుందో అని చూడడం తప్ప ఆలయంపై కనీస నిర్వహణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి. – కె.సతీష్, భక్తుడు, పాలకొండ -
లోక్ భవన్‌కు ఐజీబీసీ సర్టిఫికెట్
● సర్టిఫికెట్ అందుకున్న గవర్నర్ కంభంపాటి హరిబాబు భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి సమయస్ఫూర్తి, సృజనాత్మకత రాష్ట్రానికి కొత్త వన్నె దిద్దుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఒడిశా లోక్ భవన్ సరికొత్త మైలురాయిని ఆవిష్కరించింది. పర్యావరణహిత కార్యకలాపాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. పర్యావరణహిత మౌలిక వసతుల దిశగా చేసిన కృషికి ఫలితంగా ఒడిశా లోక్ భవన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం సర్టిఫికేషన్ పొందింది. జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించిన తొలి లోక్ భవన్ ఇదే కావడం విశేషం. లోక్ భవన్ నూతన అభిషేక్ హాల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐజీబీసీ జాతీయ చైర్మన్ సి.శేఖర్ రెడ్డి నుంచి గవర్నర్ హరిబాబు సర్టిఫికెట్‌ను స్వీకరించారు. ఐజీబీసీ రేటింగ్‌లో మొత్తం 100 పాయింట్లకు గాను స్థానిక లోక్ భవన్ 88 పాయింట్లు సాధించి అత్యున్నత కేటగిరీలో నిలిచిందని ప్రకటించారు. సమష్టి కృషితోనే గుర్తింపు ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ.. పర్యావరణహిత చర్యల్లో సమష్టి కృషితోనే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమైందన్నారు. ఐజీబీసీ సూచనల మేరకు పచ్చదనం సంరక్షణ, స్వచ్ఛ ఇంధన ఉత్పాదన, విద్యుత్ వాహనాల వినియోగం వంటి చర్యలతో అత్యున్నత రేటింగ్ సాధించగలిగామని వివరించారు. ఈ సర్టిఫికెట్‌ను తన తదుపరి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చూపిస్తానని తెలిపారు. ఈ ప్రేరణతో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పర్యావరణహిత విధానాలను అవలంభించి గ్రీన్ సర్టిఫికేషన్ పొందేందుకు కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలు పర్యావరణహిత కార్యాచరణతో ముందడుగు వేయడంలో వీసీలు కీలక పాత్రధారులు కావాలని పిలుపునిచ్చారు. 635 కిలో వాట్ – పీక్ (కేడబ్ల్యూపీ) సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ వ్యవస్థతో పునరుత్పాదక విద్యుత్ వినియోగంలో లోక్ భవన్ ముందంజలో ఉందని తెలిపారు. భువనేశ్వర్ లోక్ భవన్ తరహాలోనే పూరీలోని లోక్ భవన్‌ను కూడా గ్రీన్ క్యాంపస్‌గా మార్చేందుకు చురుకుగా సన్నాహాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, విద్యుత్ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి విశాల్ కుమార్ దేవ్, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భాస్కర్ జ్యోతి శర్మ, గవర్నర్ కమిషనర్ కమ్ కార్యదర్శి డాక్టర్ రూపా రోషన్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా రెడ్‌క్రాస్‌కు ‘గవర్నర్ గోల్డ్‌మెడల్’
శ్రీకాకుళం కల్చరల్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మానవతా సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అవార్డును కై వసం చేసుకుంది. 2024–25 సంవత్సరానికి గానూ సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలో నిర్వహించిన రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ వార్షిక సాధారణ సమావేశంలో రాష్ట్ర గవర్నర్, ఐఆర్సీఎస్ ప్రెసిడెంట్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ‘గవర్నర్ గోల్డ్‌మెడల్’ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తదాన శిబిరాలు, తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని అందించడం, విపత్తు నిర్వహణ శిక్షణ, ఆరోగ్య అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మారుమూల గ్రామాలకు కూడా రెడ్‌క్రాస్ సేవలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పర్యవేక్షణలో యూత్ రెడ్‌క్రాస్, పర్యావరణ పరిరక్షణ, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్ ప్రతినిధులు, వలంటీర్లు, రక్తదాతల సమష్టి కృషితోనే ఈ పురస్కారం లభించిందన్నారు. జాయింట్ కలెక్టర్ తరఫున రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు అవార్డును స్వీకరించగా ఐఆర్సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు కనుగుల దుర్గ శ్రీనివాస్, నిక్కు అప్పన్న, బి.చిన్మయిరావు, పి.వైకుంఠరావు, నూక సన్యాసిరావు, ప్రతినిధులు కె.సత్యనారాయణ, జి.రమణ, పి.చైతన్యకుమార్, పి.రాజేష్, ఉమా, మాధవకుమార్, సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
మజ్జిగౌరీ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 54.15 లక్షలు
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం.. మజ్జిగౌరీ అమ్మవారికి భక్తులు వేసే కానుకల రూపంలో వచ్చిన హండీ ఆదాయాన్ని అధికారులు సోమవారం లెక్కించారు. ఎండోమెంట్ కమిషన్ ఇన్స్పెక్టర్ పుష్పిత బెహర, మందిరం నిర్వహక కమిటీ సభ్యులు రాధాకృష్ణ దలాయి, పెద్దిన వాసు, దేవేంద్ర బెహర, మంగరాజ్, మందిరం సూపరింటెండెండ్ జానకీ వల్లభ మహాంతి, జేయీ వెంకట్, అకౌంటెంట్ వెంకటరావు తదితరుల సమక్షంలో మందిరం ప్రాంగణంలోని తొమ్మిది హుండీలను ఉదయం పది గంటలకు తెరిచారు. అనంతరం ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం అయిదున్నర గంటల వరకు సాగింది. స్థానికంగా గల సేవా సంస్థలకు చెందిన 80 మంది మహిళలు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. నగదు రూపంలొ అమ్మవారికి 54,15,902 రూపాయలు లభించగా, 64 గ్రాముల బంగారం, 1.764 కిలోల వెండి లభించింది. లెక్కింపులో భాగంగా విదేశీ నాణాలు, విదేశీ కరెన్సీనోట్లు కూడా హుండీలొ లభించాయి. ఈ సందర్భంగా మందిరం నిర్వాహక కమిటీ సభ్యులు రాధాక్రిష్ణ దొలాయి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నెల 29వ తేదీన హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టగా అప్పట్లో ఒకకోటీ 22 లక్షల 29 వేల 623 రూపాయల నగదుతోపాటు 32 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలు, తొమ్మిది విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని వివరించారు. ఇకపై రెండు నెలలకోసారి లెక్కింపు అమ్మవారి హుండీ ఆదాయం ఇదివరకు ప్రతీ మూడు, నాలుగు నెలలకొసారి తెరిచి లెక్కింపు చేపట్టేవాళ్లమని అన్నారు. అయితే లెక్కింపు నిర్వహణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రతీ రెండు నెలలకొసారి హుండీ ఆదాయాన్ని లెక్కించాలని నిర్ణయించామన్నారు. ఈసారి చేపట్టిన హుండీ లెక్కింపులో అమ్మవారికి లభించిన నగదును స్థానిక యూనియన్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి హుండీలో భక్తుడి ఆవేదన లేఖ మజ్జిగౌరమ్మ హుండీ లెక్కింపు సందర్భంగా ఓ భక్తుడి ఆవేదనతో కూడిన ఆరు పేజీల లేఖ బయటపడింది. అప్పుల భారంతో సతమతమవుతున్న ఓ భక్తుడు తన కష్టాలను అమ్మవారికి మొరపెట్టుకుంటూ రాసిన లేఖను చదివిన ఆలయ సిబ్బంది, అక్కడున్న పలువురు భక్తులు భావోద్వేగాలకు గురయ్యారు. కొరాపుట్ జిల్లాకు చెందిన భక్తులు సునీల్ ఖొర ఈ లేఖను అమ్మవారికి సమర్పించినట్లు తెలుస్తోంది. సుమారు 23 మంది వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నానని, ఇప్పటివరకు వాటిని పూర్తిగా చెల్లించలేకపొయానని ఆయన తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పుల కారణంగా తాను, తన కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని, ఈ కష్టాల నుంచి తనను గట్టెక్కించి రుణ విముక్తుడిని చేయాలని మజ్జిగౌరి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిపై అంచంచల విశ్వాసం మనిషి అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు భావించినప్పుడు తన బాధను దేవుడి పాదాల వద్ద చెప్పుకుంటాడనే భావనకు ఈ లేఖ అద్దం పడుతోంది. తన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులను వివరిస్తు భక్తుడు అమ్మవారిపై ఉన్న అచంచల విశ్వాసంతో తన మనసులోని మాటలను లేఖ రూపంలో చెప్పుకున్నాడు. హుండీ నుంచి బయట పడిన ఈ ఆరు పేజీల లేఖ కేవలం ఓ భక్తుడి మొక్కుబడి మాత్రమే కాకుండా.. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి ఆవేదన, కుటుంబంపై ఉన్న ఆందోళన , కుటుంబంపై ఉన్న అపరామైన నమ్మానికి ప్రతిబింబంగా నిలిచింది అనడంలో అతిఽశయోక్తి కాదు. -
ఝార్సుగుడలో 61.280 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపుతున్న ఝార్సుగుడ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీల్లో సుజుకి ఎర్టిగా కారులో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 61.280 కిలోల గంజాయిని పొలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకరం ఆదివారం నాడు ఉదయం ఝార్సుగుడ పోలీస్ స్టేషన్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో చితువాపడ కూడలి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును గుర్తించారు. దీంతో వాహనంలో తనిఖీలు చేపట్టగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కుందన్ సాహు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. -
వెంటాడిన దురదృష్టం
● మరమ్మతులకు గురైన ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ ● ట్రాక్టర్ మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ మృతి టెక్కలి రూరల్/నరసన్నపేట: తన వాహనం మరమ్మతులకు గురవ్వడంతో రహదారి పక్కన ఆపి వాహనాన్ని మరమ్మతులు చేస్తుండగా.. అనుకోకుండా ఓ కంటైనర్ లారీ ఆ వాహనాన్ని ఢీకొనడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో వాహనం మరమ్మతులు చేస్తున్న వ్యక్తి మృతి చెందిన ఘటన కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన కొన్న నవీన్(35) అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో ఇసుక లోడ్‌కు వెళ్లి మడపం నుంచి టెక్కలి వైపు వస్తున్న సమయంలో కోటబొమ్మాళి మండలం జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగుతుండగా టైర్ పంక్చర్ అవ్వడంతో రోడ్డు పక్కగా ఆపి మరమ్మతులు చేపట్టాడు. అయితే అదే మార్గంలో వచ్చిన ఒక కంటైనర్ లారీ మరమ్మతులు చేస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. దీంతో ట్రాక్టర్ సమీపంలోని పంట కాలువలో పడిపోగా.. మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ ట్రాక్టర్ కిందనే ఉండిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం హైవే సిబ్బంది భారీక్రేన్ల సాయంతో ట్రాక్టర్ని బయటకు తీయడంతో నవీన్ మృతదేహం బయటపడింది. కాగా ఈ ఘటనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్ సరిచేసి మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పొలం పనులు చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మృతుడికి భార్య అశ్విని, మూడేళ్ల కుమారుడు ధీరజ్కుమార్లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటబొమ్మాళి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
మానవత్వం చాటుకున్న శ్యాంప్రసాద్‌రెడ్డి
కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా పలాస మండల శాసనం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడివున్న వ్యక్తిని గమనించారు. హైవే మార్గంలో హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ద్విచక్ర వాహనంతో ఢీకొని ప్రమాదానికి గురైన వ్యక్తిగా గుర్తించారు. అక్కడ ఆగి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి పలాస ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి చేయి విరగడంతోపాటు శరీరంపై గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడం వలన తలకు ఎటువంటి గాయాలు కాలేదు. శ్యాం ప్రసాద్‌రెడ్డి ప్రమాదానికి గురైన వ్యక్తికి అందించిన సహాయానికి పలువురు అభినందించారు. విద్యుత్ శాఖ ఉద్యోగి ఆత్మహత్య కాశీబుగ్గ: పలాస విద్యుత్ డివిజన్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఒక ఉద్యోగి అదే కార్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కంచి సంతోష్‌కుమార్ (31) సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చాడు. తన బ్యాగును బయటే ఉంచి నేరుగా డాబాపైకి వెళ్లి, అదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఉద్యోగినికి ఫోన్ చేశాడు. అనంతరం డాబాపై ఉన్న సోలార్ ప్యానల్ బోర్డులకు వేలాడుతున్న వైర్లతో ఉరేసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్న అటెండర్ వెంటనే వచ్చి డాబాపైకి వెళ్లి చూసి కేకలు వేసింది. స్పందించిన కార్యాలయ సిబ్బంది సంతోష్‌కుమార్‌ను పలాస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సారా ప్యాకెట్లతో వ్యక్తి అరెస్టు కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి కాకర్లపుట్టుగ గ్రామంలో సోంపేట ఎకై ్సజ్ శాఖ సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ గ్రామానికి చెందిన కాకర్ల దాలయ్య అనే పాత ముద్దాయి నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు(సుమారు 10 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తికి నాటుసారా సరఫరా చేసిన శ్రీరాంపురం గ్రామానికి చెందిన లండ నవీన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సీఐ జి.వి.రమణ తెలిపారు. గతంలో నాటుసారా కేసులు కలిగి ఉన్న అందరి మీద ప్రత్యేక నిఘా ఉందన్నారు. దాడుల్లో ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది కృష్ణమూర్తి, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు ● టీచర్‌పై పోక్సో కేసు నమోదు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం మండల పరిధిలోని ఓ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గడిచిన ఐదేళ్లుగా ఒకే పాఠశాలలో ఈ టీచర్ పనిచేస్తున్నారు. ఆగస్టు 29న శనివారం వాష్‌రూంకు వెళ్లిన బాలికలపై లైంగిక దాడికి పాల్పడడంతో ఇద్దరు బాలికలు తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో మిన్నకుండిపోయారు. సోమవారం ఉదయం స్కూల్‌కు రాగానే గ్రామస్తులందరూ వెళ్లి ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఇదే విషయంపై రూరల్ పోలీసులకు బాలిక తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారులు, రూరల్ పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
జయపురం: జయపురం జిల్లా కేంద్ర హాస్పిటల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని ముగ్గురు యువకుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి మోసగించిన సంఘటన వెలుగు చూచింది. లక్ష్మీకాంత హల్బా అనే వ్యక్తి యువకులకు నకిలీ నియుక్తి పత్రాలు అందజేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. మోసానికి గురైన యువకులు జయపురం సదర్ పోలీసు స్టేషన్లో లక్ష్మీకాంత హల్వాపై లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. లక్ష్మీకాంత హల్వ జయపురం జిల్లా కేంద్రాస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నానని తెలిపి మొదట వారికి చెప్పి వారిలో తనపై విశ్వాసం కలిగించాడు. కెఆర్పీసీ ఔట్సోర్సింగ్ పేరుగల ఒక ఏజెన్సీ ద్వారా హాస్పిటల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మొదట ఇన్స్యూరెన్స్, ఆధార్ కార్డుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5000 చొప్పున వసూలు చేశాడు. అదేవిధంగా వారి స్నేహితుల నుంచి కూడా ఉద్యాగాలు ఇప్పిస్తానని మొత్తం రూ.2 లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. డబ్బులు తీసుకువెళ్లి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించకపోవటంతో తమ డబ్బులు వాపస్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అతడు డబ్బులు తిరిగి ఇవ్వనందుకు లాయర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు గణనాథుని పూజలకు ముహూర్తపు రాట రాయగడ: స్థానిక రైతుల కాలనీలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మహిళలు నడుం బిగించారు. మహిళా స్వాభిమాన్ మంచ్ మహాగణపతి పూజా కమిటీ పేరిట ఈ ఏడాది వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉత్సవ వేదిక ప్రాంగణంలో మహిళలంతా మూహూర్తపు రాట వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తి శ్రద్ధలతో మూహూర్తపు రాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులు నిర్వహిస్తామని కమిటీకి చెందిన మహిళలు తెలిపారు. ఏటా తమ కాలనీలో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అయితే ఈసారి తమ ప్రాంత మహిళలంతా సమైఖ్యతగా ఉత్సవాలను నిర్వహించేందుకు నడుం బిగించాన్నారు. విదేశీ మద్యం బాటిళ్ల స్వాధీనం రాయగడ: విదేశీ మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లాలోని బిసంకటక్ పోలీసులు శనివారం రాత్రి బిసంకటక్ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 పెట్టెల్లో ఉన్న 190 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. పోలీసుల రాకను గమనించిన అక్రమ రవాణాదారులు మద్యం బాటిళ్ల పెట్టెలను విడిచి అక్కడ నుంచి పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పది అడుగుల మొసలి ప్రత్యక్షం జయపురం: జయపురం సమితి జయంతిగిరి గ్రామ పంచాయతీ మలదా మీదుగా ప్రవహించే బొడొపొడ నదిలో పది అడుగుల మొసలి స్థానికులకు సోమవారం కనిపించింది. మలదా గ్రామ ప్రజల కొంత మంది నదిలో వెళ్లున్న మొసలిని చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేశారు. నదిలో మొసలి కనిపించటంతో తరచూ నది దాటి వెళ్లే మలదా, బొడొపొడ, తదితర గ్రామాల ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త జాతీయ అటవీ కమిటీలకు రూ.560 కోట్లు
భువనేశ్వర్: ఈ ఏడాది స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తగా నగరాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పిలుపునిచ్చారు. యువతకు కొత్త అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తల ఆవిష్కరణ దిశలో నగరాలు విస్తరించాలని ఆకాంక్షించారు. స్థానిక ఓయూఏటీ కృషి శిక్షా సదన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వయం పరిపాలన దినోత్సవం కార్యక్రమంలో కొత్తగా ఏర్పడిన 28 జాతీయ అటవీ కమిటీల్లో (ఎన్ఏసీ) వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రూ. 560 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి జాతీయ అటవీ కమిటీకి (ఎన్ఏసీ) రూ. 20 కోట్లు కేటాయించనున్నారు. ఈ నిధులతో సంబంధిత ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీలు, మార్కెట్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి పథకం కింద 62 పట్టణ ప్రాంతాల కోసం రూ. 323 కోట్ల పెట్టుబడితో 593 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో రూ. 102 కోట్ల విలువైన 423 ప్రాజెక్టులను ప్రారంభించగా రూ. 221 కోట్ల విలువైన 170 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. వివిధ పనుల నిమిత్తం మున్సిపల్ సంస్థలకు వచ్చే పౌరులకు గౌరవప్రదమైన సేవలు అందించాలని మున్సిపల్ పరిపాలన అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృత వినియోగంతో పని విధానాలను సరళీకరించి నిర్ధారిత కాలపరిమితిలో పూర్తి చేసే పని సంస్కృతిని అలవరచుకోవాలని మున్సిపల్ సంస్థలకు ముఖ్యమంత్రి సూచించారు. ఒడిశా ఆర్థికాభివృద్ధికి ప్రతి నగరాన్ని ఒక శక్తివంతమైన చోదక శక్తిగా మార్చాలని కోరారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంస్థల సామర్థ్య పెంపు కోసం ఒడిశా అర్బన్ అకాడమీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనితో పాటు సీఆర్యూటీ, శ్రీ శ్రీ యూనివర్సిటీ మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 115 పురపాలక సంస్థలలో ఓస్వాన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – బంధు, ఒడిశా యాత్రి ఎస్ఓఎస్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇటీవల 28 కొత్త నోటిఫైడ్ ఏరియా కౌన్సిళ్లు, 7 కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడ్డాయి. పూరీకి మెట్రోపాలిటన్ కార్పొరేషన్ హోదా కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కృష్ణ చంద్ర మహా పాత్రో తెలిపారు. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న ఎన్ఏసీ, మున్సిపాలిటీ ప్రాంతాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భువనేశ్వర్ ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, భువనేశ్వర్ నగర పాలక సంస్థ బీఎంసీ మేయర్ సులోచన దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉషా పాఽఢి, పురపాలక పరిపాలన సంచాలకులు అరిందమ్ డకువా పాల్గొన్నారు. -
ఫోర్జరీ పత్రాలతో భూ ఆక్రమణ
శ్రీకాకుళం క్రైమ్: తాతల వారసత్వంగా వచ్చిన తమ ఇనాం భూమిలోని కొంత స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో రావాడ అరుణకుమారి ఆక్రమణ చేస్తున్నారని, అడ్డుకుంటే దాడులకు ఎగబడుతున్నారని కొత్తూరు మండలం కలిగాంకు చెందిన అలికాన శ్రీనివాసరావు ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. కలిగాం బౌండరీలో దాదాపు 70 సెంట్ల స్థలాన్ని ఎం.రాజారావు, అలికాన తులసీదాసుల సహకారంతో అరుణకుమారి ఆక్రమించారని, ఇదే విషయాన్ని సీఎం గ్రీవెన్సులో గత నెల 30న ఫిర్యాదు చేశామని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సులో బాధితుల నుంచి 63 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల వద్ద నుంచి వినతులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. -
స్క్రబ్ టైఫస్ వ్యాప్తి ప్రాంతంపై ప్రత్యేక నిఘా
భువనేశ్వర్: స్క్రబ్ టైఫస్ ప్రభావిత ప్రాంతంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటీవల రాష్ట్రంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు ఖరారు కావడంతో స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన నమూనా పరీక్షల్లో నెగెటివ్ ఖరారు కావడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేనట్లు ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ నిర్ధారణకు ఆరోగ్య శాఖ ఎపిడెమియోలాజికల్ పరీక్షలను ముమ్మరం చేసింది. ఇంతకు ముందు పరీక్షించిన 9 నమూనాల పరీక్షల్లో సోమవారం ఐజీఎం ఎలీసా ఫలితాలు నెగటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. మరో వైపు ప్రభావిత ప్రాంతంలో సామూహిక స్క్రీనింగ్ నిర్వహించి నమూనాలను సేకరించారు. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సందిగ్ధ పీడితులు సకాలంలో పరీక్షలు చేయించుకోవడంపై నిరంతర నిఘా వేసింది. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని ఆరోగ్య శాఖ స్క్రబ్ టైఫస్ అనుమానిత క్లస్టర్‌గా పరిగణిస్తుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం, దట్టమైన వృక్షసంపద, గుబురు పొదలు, గడ్డి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటకు వెళ్లేటప్పుడు చెప్పులు తొడుగుకుని, శరీరం పూర్తిగా కప్పి ఉంచే రీతిలో దుస్తులు ధరించి చర్మం బహిర్గతం కాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. బస్సు నుంచి జారిపడి కండక్టర్ మృతి భువనేశ్వర్: భద్రక్ జిల్లా బేటలిగాంవ్ మార్కెట్ సమీపంలో కదులుతున్న బస్సు నుంచి జారిపడి కండక్టర్ మృతి చెందారు. మృతుడిని ప్రభాత్ మల్లిక్‌గా గుర్తించారు. అతను అరడీ అఖండలమణి నుంచి భద్రక్ వైపు ప్రయాణిస్తున్న అమానత్ బస్సుకు కండక్టర్‌గా పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి కొత్తరోడ్డు సమీపంలోని నాగావళి నది పరివాహక ప్రాంతంలో 2.5 కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎం.సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. నాగావళి నది బ్రిడ్జి కింద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ సనపల బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారిని తనిఖీ చేయగా అలికాన నవీన్ కుమార్, చింతాడ దిలీప్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. మండల డిప్యూటీ తహసీల్దార్, వీఆర్వోల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా నవీన్ కుమార్ వద్ద 1.5 కిలోలు, దిలీప్ వద్ద కిలో గంజాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచామన్నారు. నిందితులిద్దరికీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని అంపోలు జిల్లా జైలుకు తరలించినట్లు వెల్లడించారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి మందస: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి కాంతారావు(43) కంచిలి నుంచి పలాసకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న కాంతారావును హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచిలి మండలంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో మాస్టర్‌గా పనిచేస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాష్ట్రపతి భవన్లో రక్షా బంధన్ వేడుకల్లో రాష్ట్ర బాలలు
భువనేశ్వర్: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ప్రత్యేక రక్షా బంధన్ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సంతోషి మండల్, 7వ తరగతి విద్యార్థిని శుభ సాయి రంజిత పట్నాయక్, ఐఆర్సీ విలేజ్ పీఎమ్ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి బిభు ప్రసాద్ సాహు, లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి రోనక్ త్రిపాఠి ఒడిశా ప్రతినిధులుగా పాల్గొన్నారు. స్థానిక యూనిట్ 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రిన్సిపాల్ రూపాలి సేనాపతి, ఐఆర్సీ విలేజ్ పీఎమ్ శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సహాయ ఉపాధ్యాయుడు తూఫాన్ కుమార్ రౌత్రాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
నందిగాం: టెక్కలి నియోజకవర్గంలో నిత్యం గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా నందిగాం మండలం ఆనందపురం పంచాయతీ మాదిగాపురం కొండపై అక్రమ తవ్వకాలు, తరలింపు చేపడుతుండగా.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై తిరగబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాదిగాపురం పరిధి సర్వే నంబర్ 253లో ఉన్న కొండపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం అందుకున్న నందిగాం డిప్యూటీ తహసీల్దార్ రామారావు, స్థానిక వీఆర్వో మధు అక్కడికి చేరుకున్నారు. అక్కడ యంత్రాలతో తవ్వుతున్నవారిని అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వడం, తరలించడం నేరమని, తక్షణం పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే వారు పట్టించుకోకపోవడంతో యంత్రాల తాళాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగి తిరగబడ్డారు. ఈ క్రమంలో డీటీ రామారావు చేతికి గాయమైంది. దీంతో డీటీ నందిగాం పోలీసులకు విషయం తెలియజేయడంతో కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. దీంతో తవ్వకందారులు తాళాలు అప్పగించారు. డీటీ వాటిని పోలీసులకు అప్పగించారు. రెవెన్యూ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఈ కొండపై 1980 దశకంలో హరిదాసుపురానికి చెందిన 21 మంది దళితులకు 8 ఎకరాల పట్టాలు అందజేసి ఉన్నారు. ఆ పట్టాలకు 1–బీ, అడంగల్ వంటివి రావడం లేదు. కానీ ఆ 8 ఎకరాలు ఆ దళిత కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకున్నామన్నారు. కాగా అక్రమంగా కొండను తవ్వేసి, గ్రావెల్ తరలిస్తూ కూడా.. అధికారులపై తిరగబడ్డారంటే వారి వెనుక అధికార పార్టీ నాయకులు ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
సబర గిరిజనుల శ్రమదానం
రాయగడ: తమ భాష, లిపి, సంస్కృతి పరిరక్షణతో పాటు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల పోషణకు సబర గిరిజనులు చేస్తున్న సామూహిక కృషి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లాలోని గుణుపూర్ సమితి పరిధిలో ఉన్న టిటిమిరి పంచాయతీ ఎంగెర్భ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్పీ మంగాయి ఆశ్రమం నిర్వహణ ఖర్చుల కోసం పరిసర ప్రాంతాల్లోని 14 గ్రామాల సబర గిరిజనులు క్రమం తప్పకుండా శ్రమదానం చేస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం ప్రత్యేకంగా ఉపనియమాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం ప్రతీ గురువారం అక్షర బ్రహ్మ మత్తారావనం పూజ సందర్భంగా 14 గ్రామాలకు చెందిన ప్రజలు ఆశ్రమ ప్రాంగణంలో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో నెలకొన్న సమస్యలు, అవసరాలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా సమస్య పరిష్కారానికి ఆర్థిక అవసరం ఏర్పడితే మరుసటి రోజున గ్రామస్తులు సమూహంగా శ్రమదానం చేసేందుకు బయలు దేరుతారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే సీజన్ కావడంతో 14 గ్రామాలకు చెందిన సబర గిరిజనులు సుదూరంలోని మారిగుడ గ్రామానికి వెళ్లి వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్ల ద్వారా వారు పొందే కూలి మోత్తాన్ని ఆశ్రమ నిర్వహణ కోసం సంఘం అధ్యక్షుడికి అందజేయనున్నారు. ఇలా తమ శ్రమతో సంపాదించిన మొత్తాన్ని ఆశ్రమ నిర్వహణకు కేటాయిస్తు విద్యార్థుల చదువు, వసతి, భోజనం తదితర అవసరాలకు అండగా నిలుస్తున్నారు. తమసొంత భాష, లిపి, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆశ్రమం, హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించేందుకు పేద సబర గిరిజన సమాజం చేస్తున్న ఈ సామూహిక శ్రమదానం, సేవాభావం నిజంగా ప్రశంసనీయంగా పలువురు అభినందిస్తున్నారు. -
స్వపరిపాలన దినోత్సవం
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఘనంగా.. పర్లాకిమిడి: స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పర్లాకిమిడి పురపాలక సంఘం ఆవరణలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, ఈఓ లక్ష్మణ ముర్ము, వైస్ చైర్మన్ లెంకమధు, 15 వార్డుల కౌన్సిలర్లు బబునా బెహరా, అమ్ములమ్మ, నారాయణరావు బెహారా, బాలకృష్ణ పాత్రో తదితరులు పాల్గొన్నారు. తొలుత పర్లాకిమిడి పలు కూడళ్లలో మహారాజా కృష్ణచంద్ర గజపతి విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జాతీయ జెండాను చైర్మన్ నిర్మలా శెఠి ఎగురవేసి మాట్లాడారు. పర్లాకిమిడి పురపాలక సంఘంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నామని, నగరం అందంగా తీర్చిదిద్దటానికి శాయశక్తులా కృషిచేస్తానని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి చైర్మన్ చేతులమీదుగా ఉత్తమ అవార్డులను అందజేశారు. కాశీనగర్ నగరపాలక సంస్థ (ఎన్.ఏ.సి.) స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా త్రివర్ణపతాకాన్ని చైర్మన్ యం.సుధారాణి ఎగురవేసి పలువురికి మిఠాయిలు అందజేశారు. జయపురం: లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాల సందర్భంగా జయపురం మున్సిపాలిటీ అధికారులు పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి జాతీయ పతాకాన్ని ఎగురవేసి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.సునీత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం జయపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి పాల్గొన్నారు. బొరిగుమ్మకు ఎన్ఏసీ హోదా ఎట్టకేలకు జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మకు నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్ఏసీ) గా గుర్తింపు లభించింది. స్వయం పాలక దినోత్సవం సందర్భంగా బొరిగుమ్మను నోటిపైడ్ ఏరియాగా ప్రకటించారు. ఈ సందర్భంగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి జాతీయ పతాకాన్ని ఎగుర వేసి బొరిగుమ్మ నేటి నుంచి నోటిఫైడ్ ఏరియా అయ్యిందని వెల్లడించారు. బొరిగుమ్మ ప్రజలు నిరాహార దీక్షలు, రాస్తారోకోలు మొదలగు ఆందోళనలు జరిపిన కారణంగా నేడు ఈ విజయం దక్కిందన్నారు. తాను శాశనసభలో అనేక సార్లు ధృడంగా డిమాండ్ చేశానని, అందరి పోరాట ఫలితమే గొప్ప విజయం సాధించామన్నారు. రాష్ట్రంలో ఉత్తమ పురపాలక పరిషత్ గా నిలబెట్టేందుకు కృషి చేద్దామని ఆయన బొరిగుమ్మ ప్రజలకు పిలుపు నిచ్చారు. బొరిగుమ్మ ఉన్నతికి రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. గుడారి ఎన్ఏసీకి రాష్ట్ర స్థాయి పురస్కారం రాయగడ: సొంత ఆదాయ వనరుల సమీకరణలో గణనీయమైన పురోగతి సాధించిన గుడారి ఎన్ఏసీ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. కేవలం ఏడాది వ్యవధిలో సొంద ఆదాయ వసూళ్లను దాదాపు 91 శాతం పెంచినందుకు రాష్ట్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వపరిపాలన దినోత్సవంలో గుడారి ఎన్ఏసీకి ప్రశంసనీయ పనితీరు పురస్కారం లభించింది. దీంతో రెండు కోట్ల ప్రోత్సాహక బహుమతి నిధిని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చేతుల మీదుగా అందజేశారు. ఈ నిధులను పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, పౌరసేవలను మరింత బలోపేతం చేసేందుకు వినియోగించనున్నారు. 92 శాతం పెరిగిన సొంత ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో గుడారి ఎన్ఏసి 36.45 లక్షల సొంత ఆదాయాన్ని సమీకరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు గణనీయంగా పెరిగి రూ.70.20 లక్షలకు చేరుకుంది. ఈ అభివృద్ధిని గుర్తించిన పట్టణాభివృద్ధి శాఖ కమండేబుల్ లోకల్ బాడీ పెర్ఫార్మెన్స్ ఇన్ గ్రొత్ ఆఫ్ ఔస్ఆర్ కలెక్షన్ విభాగంలో గుడారి ఎన్ఏసీకి పురస్కారం దక్కింది. ఈ విజయానికి కలెక్టర్ అశుతొస్ కులకర్ణి అందించిన సమర్థమైన పరిపాలన మార్గదర్శకత్వం, జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరక్టర్, అధికారి అక్షయ కుమార్ ఖెముండొ అందించిన ప్రాత్సాహం కీలకంగా నిలిచాయి. -
2,3 తేదీల్లో బాలల హక్కుల కమిషన్ పర్యటన
రాయగడ: జిల్లాలో విద్యార్థుల భద్రత, బాలల హక్కుల పరరిక్షణ అంశాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. కమిషన్ చైర్ పర్సన్ బబితా పాత్రోతో పాటు సభ్యురాలు సుజాత నాయక్ సెప్టెంబరు 2,3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల రివల్‌కోన ఉన్నత పాఠశాల వసతి గృహంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడిన నేపథ్యంలో కమిషన్ ప్రతినిధుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటలో భాగంగా కొలనార సమితి పరిధిలోని రివల్‌కొన లో ఉన్న ఎస్సి, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాలను కమిషన్ చైర్ పర్శన్, సభ్యురాలు సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, భద్రత పరిస్ధితులను తెలుసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించే అవకాశం ఉంది. విద్యార్థులపై దాడి వీడియో వైరల్ ఈ నెల మొదటి వారంలో రివల్‌కోన ఉన్నత పాఠశాలలోని ఓ సీనియర్ విద్యార్థి మరి కొందరి సహచరులతో కలిసి జూనియర్ విద్యార్థులను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై చందిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. అనంతరం ఏడుగురు విద్యార్థులకు టీసీలు ఇచ్చి పాఠశాల నుంచి బహిష్కరించారు. క్రికెట్ ఆటకు సంబంధించి విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఈ ఘటనకు కారణమైందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. కొంతమంది జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులపై ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన సీనియర్లు 20 మందికి పైగా వసతి గృహ విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. గతంలోనూ సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారనే ఆరోపణలు రావడం గమనార్హం. పలు బాలల సంక్షేమ సంస్థల్లో తనిఖీలు రివల్‌కోన పాఠశాల సందర్శనతో పాటు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, శిశు సంరక్షణ సంస్థలు, ఇతర బాలల సంక్షేమ సంస్థలను కమిషన్ ప్రతినిధులు సందర్శించనున్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, టీహెచ్ఆర్ యూనిట్లను కూడా ఆకస్మిక తనిఖీ చేయనున్నట్లు సమాచారం. వరుస ఘటనల నేఽపథ్యంలో ప్రాధాన్యత గత కొంత కాలంగా జిల్లాలోని పలు వసతి పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో కమిషన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిల్లాలోని అంబొదల ఉన్నత పాఠశాల ఘటన, ముకుందపూర్ ఉన్నత పాఠశాలలో పరీక్షల్లో కాపీలు అందించిన ఘటన, డంగసొరొడ విద్యార్థి అదృశ్యం, మలేరియాతో విద్యార్థుల మృతి, బుడాగుడ ఉన్నత పాఠశాల విద్యార్థి నీటిలో మునిగి మృతి వంటి ఘటనలు గతంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ముఖ్యంగా వసతి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రమాణాలు, అధికారుల పర్యవేక్షణ వసతి గృహాల నిర్వహణ తదితర అంశాలపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చట్టపరంగా ఉన్న అధికారాల నేపథ్యంలో ఈ పర్యటనను అధికారులు కూడా కీలకంగా భావిస్తున్నారు. కమిషన్ చైర్‌పర్శన్ పర్యటనకు సంబంధించి రాయగడ కలెక్టర్, ఎస్పీతో పాటు ఇతర జిల్లాస్థాయి అధికారులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది. -
కళ్యాణసింగుపూర్‌లో 63 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. కలెక్టర్ అశుతోస్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 63 వినతులు వచ్చాయి. వీటిలో 49 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించిన అధికారులు మిగత 14 సామూహిక గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన వినతుల్లో గ్రామ సమస్యలను పరిశీలించి సంబంఽధిత శాఖ అధికారులు త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, సబ్‌కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి పాల్గొన్నారు. కాశీనగర్‌లో 18 వినతులు.. పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జిల్లా యంత్రాంగం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్సు సెల్‌కు అతితక్కువ స్పందన లభించింది. గ్రీవెన్సుకు ఏడీఎం మునీంద్ర హానగ అధ్యక్షత వహించగా అదనపు ఎస్పీ బిరంచీ బేగ్, జిల్లా పరిషత్ ఆదనపు సీడీవో ఫృథ్వీరాజ్ మండళ్, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కేవలం 18 వినతులు మాత్రమదే అందగా వాటిలో 13 వ్యక్తిగతం, ఐదు గ్రామసమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. సామిజిక పింఛన్లు, ఇళ్ల పథకం, రేషన్ కార్డులకు సంబంధించి పలు వినతులు అధికారులకు అందాయి. వాటిని సకాలంలో పరిష్కరించాల్సిందిగా ఏడీఎం మునీంద్ర హానగ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాశీనగర్ బీడీవో డుంబురుధర మల్లిక్, తహాసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. -
రిటైనింగ్ వాల్ నిర్మించాలి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గుమ్మా బ్లాక్ అజయగడ–నమ్మనగుడ రహదారిలో కొండ చరియలు, మట్టి రోడ్డుకు అడ్డంగా పడుతున్నాయి. వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడుతున్నారు. గుమ్మఘాటిలో కొండచరియలు విరిగిపడుతున్నందున కొన్నిసార్లు రాకపోకలు బంద్ అవుతున్నాయి. పీడబ్ల్యూడీ, రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్లు స్పందించి అజయగడ, నమ్మనగుడ రోడ్డులో రిటైనింగ్ వాల్, డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర డిజాస్టర్ సర్వే ప్రకారం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించారు. వాటిలో గుమ్మ ప్రాంతంలో అతి ఎక్కువగా 59 గిరిజిన గ్రామాలు, 49 కిలో మీటర్లు రోడ్డు అతి ప్రమాదకరమైన కొండచరియలు విరిగిపడే జోన్‌గా గుర్తించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని గుమ్మ ప్రజలు కోరుతున్నారు. -
అనాథ బాలలకు అండగా..
పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో అనాథ బాలలు, శిశు సంక్షేమం కోసం జిల్లా అధికారులు వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ, సమగ్ర గిరిజనాభివృద్ధి, జిల్లా ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, బాలల అక్రమరవాణా నిరోధక అధికారి కమలా చౌదరి, తదితరులు హాజరయ్యారు. తొలుత జిల్లా శుశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార త్రిపాఠి మాట్లాడారు. గజపతి జిల్లాలో పలు బాలల సంరక్షణ కేంద్రాల్లో నివసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం తల్లులను పోగొట్టుకున్న పిల్లలు, చైల్డ్‌లైన్ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కార్మిక శాఖ తరఫున అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రజుక్త శోబోరో గత ఆరు నెలలుగా అనాథ బాల లను సంరక్షించిన జాబితాను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఇప్పటివరకు గజపతి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలు దంపతులకు దత్తత నిమిత్తం అందజేసిన బాలలతో దృశ్యశ్రవణం ద్వారా వారితో అధికారులు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్జీఓలు, ఇతర శిశు సంరక్షణ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు. -
పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులపాటు ఉత్తర, కోస్తా ఒడిశా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎమ్‌డీ తెలిపింది. ఆదివారం సూర్యోదయం నుంచి రాష్ట్ర రాజధానిలో వర్షం కురుస్తూనే ఉంది. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో అసాధారణమైన చీకటి అలుముకుంది. ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) రాబోయే 4 రోజుల కోసం వివిధ జిల్లాలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ వ్యవధిలో బాలేశ్వర్, భద్రక్, కేంద్రాపడా, మయూర్భంజ్ జిల్లాలకు ఐఎమ్‌డీ రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జగత్సింగ్పూర్, జాజ్‌పూర్, అనుగోల, కెందుఝర్, కటక్ మరియు ఢెంనాల్ ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. నేటి వాతావరణ సూచన సోమవారం బరగఢ్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ వా ర్నింగు జారీ చేశారు. ఆరెంజ్ హెచ్చరిక సుందర్‌గఢ్, ఝార్సుగుడ, సంబల్పూర్, దేవ్గడ్, అంగోలా, కెందుఝర్, సుబర్ణపూర్, నువాపడా, బొలంగీర్ మరియు కలహండి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. పసుపు హెచ్చరిక బాలేశ్వర్, భద్రక్, జాజ్‌పూర్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నబరంగ్‌పూర్, రాయగడ మీదుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాలేశ్వర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, ఢెంకనాల్, మయూర్భంజ్, బౌధ్, కంధమల్, నవరంగ్‌పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, పూరీ, ఖుర్దా, నయాగడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
పూరీ ఆలయంలో ఎలుకలు, బొద్దింకల బెడద
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో తలెత్తిన ఎలుకలు, బొద్దింకలు బెడద సేవాయత్లలో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ బెడదను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆలయ యంత్రాంగం చర్చిస్తోంది. శ్రీ జగన్నా థ ఆలయ పరిపాలన (ఎస్ జేటీఏ) కార్యాలయంలో సీనియర్ సేవాయత్‌లు, ఛొత్తీసా నియోగ నాయక జనార్దన్ పట్టజోషి మహా పాత్రో, దైతపతి నియోగ కార్యదర్శితో పూరీ జిల్లా కలెక్టర్ దిబ్యజ్యోతి పరిడా సవివరంగా చర్చించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆలయం లోపల ఉండే చీకటిని ఎలుకలు, బొద్దింకలు అవకాశంగా తీసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాయని పట్టజోషి మహా పాత్రో తెలిపారు. దేవతామూర్తుల పవిత్ర దేహానికి ఎలాంటి హాని జరగకుండా నివారించడంపై సేవాయత్‌లు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. రాత్రి పూట దేవతా మూర్తులు విశ్రాంతి తీసుకునే సమయంలో జయ, విజయ ద్వారం నుంచి గర్భగుడి వరకు ఉన్న ప్రాంతం చీకటిగా ఉంటుంది. ఇది కీటకాలు తిరగడానికి అవకాశం కల్పిస్తుందని పట్టజోషి మహా పాత్రో అన్నారు. పలు సందర్భాల్లో ఎలుకలు, బొద్దింకలు కనక ముండి చందువాలోకి (దేవతామూర్తుల తలపైన ఉండే పందిరి) కూడా ప్రవేశించినట్లు సమాచారం. ఆలయ సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారం ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎలుకల కోసం బోనులు పెట్టడం, బొద్దింకలను ఆకర్షించడానికి బెల్లం ఉన్న కుండలను ఉంచడం వంటి నిర్దిష్ట చర్యలు సేవాయత్ వర్గం సూచించింది. ఆలయంలోని స్థిరపడిన సంప్రదాయాలను పాటిస్తూనే ఈ సమస్యను పరిష్కరించే చర్యలపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఎస్జేటీఏ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) అధ్యక్షతన త్వరలో మరో సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం రాయగడ: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కల్యాణసింగుపూర్ సమితి పునాఖండి పంచాయతీలోని సనోఘటి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల మధ్య విసిగెత్తిన గ్రామానికి చెందిన విష్ణు కులసి శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిని కుటుంబీకులు ఆపస్మారక స్థితిలో ఉన్న విష్ణు కులసిని చూసి వెంటనే కళ్యాణసింగుపూర్ పీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ సమితిలోని వరద ప్రాంతాలను కొరాపుట్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సస్మితా మెలక ఆదివారం పర్యటించారు. ఇంద్రావతి నది ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు పడటం వలన కొట్‌పాడ్ సమితిలోని 6 గ్రామ పంచాయతీల్లో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. సస్మిత మెలక తన బృందంతో ముంపు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి వారికి ప్రభుత్వ అధికారులు అందించే సహాయంపై అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు, వృద్ధులకు దుప్పట్లు, బియ్యం, అటుకులు, బెల్లం, దుస్తులు పంపిణీ చేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు నిర్మించటం జరుగుతుందన్నారు. బాధితులందరికి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు బొరిగుమ్మ సమితి 1వ జోన్ పరిషత్ సభ్యులు ప్రసాద్ బిడిక, మంత్రి ప్రతినిధి నరేంద్ర బిశాయి, కొట్‌పాడ్ సమితి చైర్మన్ తపన కుమార్ పాణిగ్రహి, జిల్లా పరిషత్ కొట్‌పాడ్ జోన్–2 సభ్యురాలు గీతాంజలి మఝి, మనోజ్ పండా, కొట్‌పాడ్ సమితిలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
సకల కళల సమాహారం..హరికథ
● సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో తోడ్పాటు ● అంతరించిపోతున్న కళను ఆదరిస్తున్న సంస్థలు ● నేడు హరికథా పితామహుడు ‘నారాయణదాసు’ జయంతి శ్రీకాకుళం కల్చరల్ : సకల కళల సమాహారంగా నిలిచే హరికథకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఒకే వ్యక్తితో సందర్భానుసారంగా హావ, భావ, రాగ, తాళ, నాట్య విన్యాసం ఆవిష్కరించడం ఈ కళ గొప్పతనం. ప్రాచీన జానపద కళారూపమైన హరికథను సంస్కరించి సామాన్యుని మనోజన హృదయ రంజకంగా తీర్చిదిద్దిన ఘనత హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసుకే దక్కుతుంది. అందుకే ఆయన హరికథా పితామహుడయ్యారు. కొన్ని గంటల సమయంలో పురాణ కథ, కీర్తనలు, పద్యం, మంజరి, తోహరా, వచనాలతో రసవత్తరమైన గాన, తాళ, భావయుక్త, పరిపూర్ణమైన మహోన్నత కథా కధనం తయారుచేసి నవరస భరితంగా ప్రదర్శించగల గంధర్వుడు ఆదిభట్ల. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా హరికథలను ఆదిరించి జీవింపచేస్తున్నారు. ఆవిధంగా హరికథ ఇప్పటికీ జనాదరణలోనే ఉంటోంది. రేడియోలలో ఇప్పటికీ హరికథకులకు ఆదరణ లభిస్తోందనే చెప్పాలి. ఈ కళకు గుర్తుగా జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ప్రముఖ కళాభిమాని డాక్టర్ నిక్కు అప్పన్న.. నారాయణదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో హరికథకులు.. శ్రీకాకుళం జిల్లా హరికథ చరిత్రలో ఈశ్వర సత్యనారాయణ శర్మ ప్రథములు. ఈయన శర్మద రామాయణం, భక్తనందనార్, సతీసులోచన, వామన చరిత్ర, లక్ష్మీవిజయం, త్యాగరాజ, శ్రీనివాస కల్యాణం, సతీ పరిణయం రచించారు. డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు హరికథలపై పరిశోధన గ్రంథాన్ని రచించి బర్హెంపూర్ యూనివర్సిటీకీ సమర్పించి డాక్టరేట్ పొందారు. జిల్లాలో సీనియర్ భాగవతారులైన దివంగత దూసి బెనర్జీ ఇంగ్లీషులో కూడా హరికథ చెప్పగల దిట్టగా పేరుగాంచారు. బుసకల రంగారావు, యెన్ని రామం, ముగితి వెంకటనారాయణ, బొంతలకోటి యతిరాజులు, వడగ సుబ్రహ్మణ్యం, జయంతి సావిత్రి, రోణంకి మీనాక్షి, సిద్దేశుల శారదాంబ, సరోజిని, పి.వి.సత్యనారాయణ, ఎం.శివదండాసి వంటి ఎందరో భాగవతారులు కళను తమ ప్రదర్శనలతో బతికిస్తున్నారు. ఇంకా ఎందరో హరికథా గానం చేస్తూ జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. సుమిత్రా కళా సమితి ప్రోత్సాహం.. జిల్లాలో సుమిత్రా కళా సమితి నిర్వాహకులు హరికథ కళను ఆదరిస్తున్నారు. ప్రతి ఏడాది హరికథా సప్తాహం నిర్వహిస్తూ కళ కోసం కృషి చేస్తున్నారు. జిల్లా కళాకారులనే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా యువ కళాకారులను తీసుకువచ్చి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 6న బాపుజీ కళామందిర్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు.రంగస్థ కళాకారులు కూడా హరికథ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తు కళను ఆదరిస్తున్నారు. -
ఢిల్లీకి తరలిన కమ్యూనిస్టు నేతలు
జయపురం: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీపీఐ నాయకులు శనివారం రాత్రి తరలివెళ్లారు. కమ్యూనిస్టు పార్టీ జిల్లా నేత ఉత్తమ మల్లాక్ నేతృత్వంలో జయపురం నుంచి హీరాకుద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. వారు భువనేశ్వర్ వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లారని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి తెలిపారు. దేశంలో ధరలు నియంత్రించటంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ సమస్య పరిష్కరించటంలో, విద్య, వైద్య రంగాల వైఫల్యాలు పూర్తిగా విఫలమైన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు, అంబానీ, ఆదానీ మొదలగు పెట్టుబడుదారులకు దేశ సంపదను చౌకగా అప్పగించటానికి నిరసనగా ఢిల్లీలోని రామలీలా మైదానంలో జాతీయ కమ్యూనిస్టు పార్టీ పరివర్తన మహాసభ నిర్వహిస్తుందని నాయకులు చెప్పారు. -
ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
పర్లాకిమిడి: వ్యవహారిక భాష కోసం పోరాడిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక సింహాద్రి అప్పన్న కల్యాణ మండపంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా గోష్టి, తెలుగు భాషపై ఉపోధ్ఘాతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షుడు కోండా రామారావు, కార్యదర్శి బి.జనార్దరావు ఆధ్వర్యంలో గణేష నామ స్తుతిలో మొదలుపెట్టారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. గిడుగు తెలుగునాట పుట్టి పర్లాకిమిడి రాజావారి సంస్థానంలో ఉన్న కృష్ణచంద్ర గజపతి కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఆయన సవరభాష లిపిని కనుగోని ఇంగ్లిష్‌లో బాషలోకి తర్జుమా చేశేవారని వి.వి.రమణమూర్తి పంతులు అన్నారు. అందుకు గుర్తింపుగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వం గిడుగు కృషికి మెచ్చి 1913లో రావుబహదూర్ అని బిరుదును అందజేశారన్నారు. ఈ సందర్భంగా గిడుగు జీవనవిధానం, చరిత్రపై పలువురు మాట్లాడారు. మాతృ భాష దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు చెట్టి వేంకటేశ్వర్లు, శాసనం ధనుంజయ, వి.వి.రమణమూర్తి పంతులును ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన సభలో పాతపట్నంకు చెందిన పారిశెల్లి రామరాజు, జామి పోలిశెట్టి, కోట్ని శోభారాణి, కల్యాణ వినయకుమార్, కోశాధికారి గణేష్ పట్నాయక్, జవ్వాది సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
జేకేపూర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉద్రిక్తత
రాయగడ: జేకేపూర్ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) హాస్పిటల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 13 ఏళ్ల బాలికకు ఇంజెక్షన్ ఇచ్చే సమయంలో, రక్త నమూనా సేకరణలో సరైన విధానాలు పాటింలేదని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో హాస్పిటల్లో కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు ఈఎస్ఐ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జేకేపూర్ ఉద్యోగుల సంఘం కోశాధికారి హేమంత్ కుమార్ జెన్నా కుమార్తె విజయలక్ష్మి అనారొగ్యంతో భువనేశ్వర్ నుంచి చికిత్స అనంతరం తిరిగి వచ్చింది. వైద్యుల సూచన మేరకు ప్రతీ 21 రోజులకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటికే రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. మూడో ఇంజక్షన్ కోసం శుక్రవారం ఆమెను జేకేపూర్ ఈఎస్ఐ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఇంజక్షన్ ఇవ్వడానికి ముందు అవసరమైన పరీక్షల కోసం రక్త నమూనా సేకరిస్తుండగా విధుల్లో ఉన్న నర్సు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సక్రమంగా రక్త నమూనా తీసుకోలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తీవ్ర ఇబ్బందికి గురైందన్నారు. అనంతరం ఇంజక్షన్ ఇచ్చే సమయంలో కూడా సరైన విధానం పాటించలేదని, ఇంజక్షన్ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో సీడీయూ జిల్లా అధ్యక్షురాలు, జేకే పేపర్ మిల్లు, ఇంఫా ఉద్యోగల సంఘం సలహాదరుడు చందనా హరిచందన్.. విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సుపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయని, గతంలో ఓ ఉద్యొగికి బ్రెయిన్ హ్యామరేజ్ జరిగిన ఘటన కూడా ఉందన హరిచందన్ పేర్కొన్నారు. హాస్పిటల్‌పై తరచూ ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. హాస్పిటల్లో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు సొంత ఖర్చులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేసకోవాల్సి వస్తోందన్నారు. మరోవైపు ఈఎస్ఐ అధికారులు స్పందిస్తూ.. విజయలక్ష్మికి అవసరమైన పరీక్షలు నిర్వహించామని, ఈ క్రమంలో ఇబ్బంది కలిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనపై విధుల్లో ఉన్న వైద్యుడు, నర్సు నుంచి వివరణ కోరనున్నట్లు అధికారులు తెలిపారు. -
జీఐఈటీ వర్సిటీకి జాతీయస్థాయి గుర్తింపు
రాయగడ: విద్యార్థులకు మెరుగైన కేరీర్ అవకాశాలు కల్పించడం, ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో బలమైన సంబంధాలు కొనసాగించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మమైన గౌరవం దక్కింది. తూర్పు భారతదేశంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కార్పొరేట్ రిలేషన్స్ విభాగాల్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఇండియా బ్రాండ్ ఐకాన్ అవార్డు–2026ను వర్సిటీ అందుకుంది. ముంబైలో టైమ్ సూఐబర్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవార్డు ప్రదానోత్సవంలో విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్రధ్వజ పండ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. భారత క్రికెట్ దిగ్గజం, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. వి ద్యార్థుల భవిష్యత్ కేరీర్‌ను తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి, పరిశ్రమలతో ఏర్పరుచుకున్న బలమైన అనుబంధాలు, నాణ్యమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు గుర్తింపుగా అవార్డు లభించింది. విద్యా, ఉపాధి అవకాశాలు, కార్పొ రేట్ అనుసంధానం వంటి రంగాల్లో జీఐఈటీ యూనివర్సిటీ సాధిస్తున్న ప్రగతికి ఈ అవార్డు మరో ముఖ్యమైన మైలు రాయిగా నిలిచింది. -
వంశధారలో కాలువలో పడి యువకుడు మృతి
హిరమండలం: కుమారుడికి వివాహం జరిపించాలని ఆ తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే కాలువ రూపంలో మృత్యువు కబళించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలంలోని చిన్నకోరాడ వీధికి చెందిన కొంకి గోవింద (37) ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం కోసం చిన్నకోరాడ సమీపంలోని వంశధార కుడి కాలువలో దిగాడు. కొద్దిసేపటికే గల్లంతయ్యాడు. అక్కడే స్నానం చేస్తున్న స్థానికులు గమనించి గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. వారంతా వచ్చి కాలువలో గాలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొత్తూరు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, దుర్గా రావు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. -
మళ్లీ ఉప్పొంగుతున్న సువర్ణ రేఖ నది
● బాలాసోర్‌లో వరద ముప్పుభువనేశ్వర్: బాలాసోర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సువర్ణ రేఖ నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. మరో వరద ముప్పు పొంచి ఉంది. రెండో వరద తగ్గిన 14 రోజుల లోపే మూడో వరద వచ్చే అవకాశం ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. జార్ఖండ్‌లోని గలుడిహ్ బ్యారేజీ 6 గేట్లను తెరవడంతో దిగువన ప్రవహిస్తున్న సువర్ణ రేఖ నది నీటి మట్టం అనుక్షణం పెరుగుతుంది. పరిస్థితి మరింత తీవ్రమైతే జలేశ్వర్, భొగరాయ్, బలియాపాల్ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు మళ్లీ ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. తాజా వరద ముప్పు సువర్ణ రేఖ నది ప్రమాద స్థాయి 10.36 మీటర్లు కాగా ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి దాని నీటి మట్టం 8.84 మీటర్లుగా నమోదైంది. గత వరద సమయంలో అనేక గ్రామాలు, రోడ్లు, పంట పొలాలు నీట మునిగిపోయాయి. పలు చోట్ల రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. గత వరదల వల్ల కలిగిన నష్టాల నుంచి కోలుకోవడానికి రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి వరదలు వస్తే తమ కష్టాలు మరింత తీవ్రం అవుతాయని ఆందోళన చెందుతున్నారు. నది నీటి మట్టం మరింత పెరిగితే, బలహీన ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వ్యవసాయ భూములపై కూడా ప్రభావం పడవచ్చు. మూడో వరద సంభవిస్తే అంతా నాశనమవుతుందని, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవచ్చని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
● ఘనంగా స్పోర్ట్ డే
రాయగడ: క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో జిల్లాలో మూడు రోజుల పాటుగా జాతీయ క్రీడా దినోత్సవం–2026 ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రవీవద్ర కుమార్ కుహరో పర్యవేక్షణలో మూడు రోజులుగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఏడాది భేలేగా భారత్..జీతేగా భారత్ అనే ప్రధాన సందేశంతో చిన్నారులు, యువతను క్రీడల వైపు ఆకర్షించడం, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్రీడలను నిత్యజీవితంతో భాగంగా చేసుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ క్రమంలో ట్రిబ్యూట్ థీమ్‌తో దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, క్రీడా రంగ ప్రముఖులకు డిజిటల్, సామాజిక కార్యక్రమాల ద్వార ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్లే థీమ్ కార్యక్రమంలో భాగంగా ప్లేగ్రౌండ్‌లో ఒక గంట ఆట అనే సందేశంతో జిల్లాతోని వివిధ పాఠశాలల్లో, విద్యాసంస్థల్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీని కూడా నిర్వహించారు. థీమ్ మూడులో భాగంగా స్పెషల్ సండేస్ సైకిల్ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైకిల్ తొక్కడం, ఇతర శారీరక వ్యాయామాల్లో ప్రజలు, యువత చురుగ్గా పాల్గొనేలా అవగాహన కల్పించారు. ఈ సైకిల్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర కుమార్ కుహరో, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న తదితరులు ప్రారంభించారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారి భద్రత, అవసరమైన నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే చేపట్టారు. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ పర్యవేక్షించారు. -
రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస రైల్వే స్టేషన్లో ఆదివారం రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. కోల్‌కతా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ రైలు పలాస రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో అసోంకు చెందిన మహిళా ప్రయాణికురాలు అజ్మినా ఖాన్ జారిపడటంతో గాయాల పాలైంది. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సత్యం, వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య సంతబొమ్మాళి: భర్తను కోల్పోయిన వేళ కుమారుడు విదేశాల్లో ఉండటంతో భార్యే తలకొరివి పెట్టిన ఘటన సంతబొమ్మాళి మండలం సూరాడవానిపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సూరాడ మోహనరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన కుమారుడు విదేశాల్లో ఉండటంతో స్వగ్రామానికి చేరుకోలేకపోయారు. దీంతో మోహనరావు భార్యే భర్త అంత్యక్రియలను నిర్వహిస్తూ తలకొరివి పెట్టారు. మోహనరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని కొత్తరోడ్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...స్థానిక హడ్కో కాలనీకు చెందిన చుక్క సంతోష్ దొర (36) జూనియర్ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత పనిమీద కొత్త రోడ్ జంక్షన్ వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా పాలకొండ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ హయర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంతోష్‌కు భార్య కళ్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
శ్రీకాకుళం రూరల్: రాగోలు పంచాయతీ రాయిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పొలాల్లోకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. నేరుగా పొలాల్లోకి దూసుకుపోయినప్పటికీ ఎవరికీ ఎటువంటి నష్టం కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కారును ఢీకొట్టిన లారీ రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆదివారం సాయంత్రం రణస్థలం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ముగ్గురూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నేత్రదానంపై అవగాహన ర్యాలీ శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం కల్చరల్: జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహిస్తున్న ‘41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా 80 ఫీట్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నేత్రదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆప్తాలమిక్ అధికారి ఎంఆర్కే దాస్ వాకర్లకు నేత్రదానం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వైశ్యరాజు తిరుమలరాజు, పొట్నూరు మాధవరావుల పిలుపుమేరకు 30 మంది వాకర్ల కుటుంబ సభ్యులకు దాస్ అవగాహన కల్పించారు. మరణానంతరం నేత్రదానం చేస్తామని ప్రతిజ్ఞ పత్రాలు అందజేశారు. రణస్థలం: బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి, బూడిదతో ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లటి బూడిద ఇళ్లపైన, నీళ్లలోనూ, తినే ఆహా రంలో పడుతోందని, సమీప వాణిజ్య పంటలకు సైతం నష్టం వాటిల్లుతోందని వాపోయా రు. వాహనచోదకుల కళ్లలో పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ విఫయమై కాలుష్య నియంత్రణ అధికారి కుసుమశ్రీ వద్ద ప్రస్తావించగా, గతంలో పరిశ్రమకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, మరల పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పార్లమెంటరీ సంయుక్త కమిటీ భువనేశ్వర్ పర్యటన
● ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలపై చర్చలుభువనేశ్వర్: జీతాలు, భత్యాల పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఆదివారం భువనేశ్వర్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభ సభ్యుల జీతాలు, ఇతర భత్యాలు, అలాగే మాజీ ఎమ్మెల్యేల ఫించను, భత్యాలపై స్పీకర్ సురమా పాఢి శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, శాసన సభ కార్యదర్శి సత్యబ్రత్ రౌత్, ఇతర అధికారులతో విడివిడిగా కూలంకషంగా ఈ కమిటీ చర్చలు జరిపింది. రాష్ట్ర ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల జీతాలు, భత్యాలు, అనుబంధ ప్రయోజనాలపై సంయుక్త కమిటీ తులనాత్మక నివేదికను పార్లమెంటులో సమర్పిస్తుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న జీతాలు, భత్యాలను మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ చైర్మన్ ఎంపీ బీరేంద్ర ప్రసాద్ వైశ్యతో పాటు ఎంపీలు విజయ్ కుమార్ దుబే, వీణా దేవి, కె.గోపీనాథ్, బాబు సింగ్ కుష్వాహా, రిచర్డ్ భమిలహమ్నాంగియా, పార్లమెంట్ డైరెక్టర్ భత్శాల జోషి భువనేశ్వర్‌కు విచ్చేసిన బృందంలో ఉన్నారు. -
ఆదిత్యాలయానికి పోటెత్తిన భక్తజనం
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. శ్రావణ మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు, మంచినీటి సౌకర్యాలను కల్పించారు. రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయంలో గోత్రనామాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో భక్తులకు ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచి సర్వదర్శనాలను కల్పించారు. ఆరోగ్యం కోసం రూ.300 చెల్లించి సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఈఓకు ఫిర్యాదులు.. ప్రసాదాల పంపిణీ వద్ద ఆన్లైన్ సమస్య తలెత్తడంతో కొందరికి విక్రయాలు సాధ్యం కాలేదు. కేశఖండన శాలలో ఎప్పట్లాగే అక్రమ వసూళ్లు వ్యవహారం తలెత్తింది. టికెట్ల సొమ్ము కంటే అదనంగా డబ్బులు అడుగుతున్నారంటూ కొందరు భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించకుండా రెగ్యులర్ ఉద్యోగులు సైతం నోరుపారేసుకుంటూ అవమాన పరుస్తున్నారంటూ ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ అవస్థలు..! దేవదాయశాఖ ఆన్లైన్ విధానంలో ఇటీవల మార్పులు చేపడుతున్న క్రమంలో అరసవల్లి ఆలయంలో ఆన్లైన్ విధానంలో సమస్యలు తలెత్తాయి. వివిధ దర్శనాల టికెట్లతో పాటు ఇతరత్రా సౌకర్యాల కల్పనకు ఆలయ ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే భభక్తులకు సేవలందిస్తున్నారు. అయితే టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (టీఎంఎస్) ఆన్లైన్ పోర్టల్‌లో మార్పులు కారణంగా స్థానికంగా ఆలయంలో ఆన్లైన్ పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో విరాళాల రశీదులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ టిక్కెట్లు ఆగిపోవడంతో మాన్యువల్‌గా ఇచ్చిన టికెట్లు, టైం స్లాట్ ఆలస్యమైన టికెట్లతో దర్శనాలకు వెళ్లిన వారు కూడా సిబ్బంది చేష్టలతో ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఈఓ స్పందిస్తూ సాంకేతిక లోపంతో ఆలస్యమయ్యాయని, నకిలీ టికెట్లు కావంటూ ధ్రువీరించారు. ఆన్లైన్ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ గజపతి జిల్లా జడ్జి, డి.ఎల్.ఎస్.ఎ అధ్యక్షుడు జగదీష్ ప్రసాద్ మహంతి ఆదేశాల మేరకు న్యాయ సచేతన కార్యక్రమన్ని కార్యదర్శి బిమల్ రౌళో ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ఆర్.బాబూరావు, సఖీ వన్ స్టాఫ్ సెంటర్ అడ్మిన్‌స్ట్రేటర్ సునీతా రోథో, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు ఇటీవల ఇంగ్లిషులో విడుదల చేసిన వివిధ తీర్పులను (ఏఐ) ఆధారంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ‘విధిక్’ అనువాద సాఫ్ట్వేర్ (సువాస్)ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. దీంతో పాటు ఒడిశా హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ కోర్టు రూల్స్ 2020కి సులభతరమైన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సివిల్ ప్రోసీజ్యూర్స్ ఏ.డి.ఆర్. చట్టాలు 2007పై ఈ సదస్సులో డి.ఎల్.ఎస్.ఎ కార్యదర్శి బిమల్ రౌళో అవగాహన కల్పించారు. -
విచారణకు తమ్మినేని కుటుంబం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిలు శనివారం హాజరయ్యారు. ఒక ల్యాండ్ కేసు విషయమై ఇద్దరూ హాజరైనట్లు రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ విద్యార్థిని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామమైన జయంతిపురానికి చెందిన గిరిజన యువతి కిల్లో సరోజిని యూజీసీ–నెట్ జూన్–2026 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతతో పాటు ప్రతిష్టాత్మక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో ఘనత సాధించినట్లు ఆమె సోదరుడు, శాసనాం ఉన్న త పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బొమ్మిడి ఢిల్లేష్ శనివారం తెలిపారు. తన విజయానికి తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆచా ర్యులు వెలమల సిమ్మన్న, పరిశోధకుడు, సోదరుడు బొబ్మిడి ఢిల్లేష్ అందించిన మార్గదర్వకత్వం, ప్రోత్సాహమే కారణమని సరోజిని తెలిపారు. కవిటి: మండల పరిధిలోని జాడుపుడి ఆర్ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు శనివారం గుర్తించారు. మృతుడు ఎరుపు రంగు టీషర్ట్, నీలంరంగు నైట్‌ప్యాంట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు. అతని చేతిపై ఇంగ్లిష్‌లో జయదేబ్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని గుర్తించినవారు పలాస రైల్వే పోలీ సు ఎస్ఐ డి.శ్రీనివాసరావు(92475 85743) ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్‌లో ఉన్న నోటీసులను సత్వరమే పూర్తి చేయాలని అదనపు ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి శేనాపతి ఢిల్లీరావు తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లతో కలసి ఆయన ప్రత్యేక జాబితా సవరణపై సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక జాబితా సవరణపై కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గల ఎనిమిది నియోజకవర్గాల్లో నోటీసుల పంపిణీ పూర్తయ్యిందా లేదా అని ప్రశ్నించగా పంపిణీ పూర్తయ్యిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మ్యాపింగ్ కాని వివరాలను, ఫార్మ్ 6, 7, 8ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 93,457 విచారణ జరిగాయని, 7184 పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. బందరువానిపేట బీఎల్ఓ రమేష్ మాట్లాడుతూ 150 మంది మత్స్యకార ఓటర్లు జాబితాలో నమోదు కాలేదని, మత్స్యకారులు సముద్రంలో వేటనిమిత్తం వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లినట్లు చెప్పగా మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు వర్చ్వుల్‌గా నమోదు చేయవచ్చని అదనపు సీఈఓ చెప్పారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో చెంచు తెగకు సంబంధించిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ రుణం రూ.8 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శిక్షణ కలెక్టర్ హరి ఓం పాండ్య తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన దొంగలు
సోంపేట: మండలంలో పలాసపురం గ్రామంలోని బెందాళం రాజశేఖర్ ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే అదే గ్రామంలో నౌపడ నారాయణకు చెందిన సెలూన్ షాప్ వద్ద ఉంచిన టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనం సైతం చోరీకి గురైంది. సోంపేట సీఐ బి.మంగరాజు, ఎస్ఐ బి.మోహిని, క్లూస్ టీం సంఘటన స్థలాలను శనివారం పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. పూండిలో 3 తులాలు వజ్రపుకొత్తూరు రూరల్: పలాస నియోజకవర్గంలో వాణిజ్య, వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వజ్రపుకొత్తూరు మండలం పరిధి పూండిలో శుక్రవారం దొంగతనం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూండి సాగర్కాలనీలో భద్రాచలం రామకృష్ణ, మురళి అనే సోదరులు ఒకే ఇంట్లో పైన, కింద గదుల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉపాధి కోసం దుబాయిలో ఉన్నారు. అయితే రాఖీ పండగ రోజున వారి భార్యలైన స్వాతి, బిందులు కలిసి స్కూటీపై చినబడాంలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఉదయం 9.30 గంటలకి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి పైన ఇంటి తాళాలు తీసి ఉండడంతో అందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూసే సరికి బెడ్రూంలో బీరువ పక్కన షూట్‌కేసులో ఉన్న 3 తులాల బంగారు అభరణాలు, రూ.15 వేల నగదు అపహరణకు గురయ్యిందని గుర్తించారు. వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అలాగే బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా పూండిలో గత కొంతకాలంగా కేవలం మహిళలు ఉండే ఇళ్లలోనే దొంగతనాలు జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఇంట్లో దొంగతనం జరగకుండా పైఇంట్లో దొంగతనం జరగడం, అది కుడా కేవలం షూట్ కేసులో ఉన్న ఈ బంగారు అభరణాలు, నగదు చోరీ జరగడంతో తరుచూ ఇంటికి వచ్చి వెళ్లేవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ఉత్సాహంగా జాతీయ క్రీడా దినోత్సవం
పర్లాకిమిడి: అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సంధర్భంగా శనివారం జిల్లా స్థాయి క్రీడా ఉత్సవాలు పర్లాకిమిడి గజపతి స్టేడియంలో ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ అనుప్ పండా, అతిథిగా పురపాలక సంఘచైర్మన్ నిర్మలా శెఠి, సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనామంగరాజ్, విశ్రాంత క్రీడాధికారి త్రినాథసాహు అంతర్జాతీయ ఆటగాడు కిశోర్ చంద్ర రథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా విచ్చేసిన క్రీడాకారులకు అనేక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్, కబడ్డీ, బాలికలకు మ్యూజికల్ చైర్, హాకీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. విజేతలకు సబ్‌కలెక్టర్ అనుప్ పండా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. రెండు రోజులుగా ఈ క్రీడోత్సవాలు జరిగాయి. -
న్యాయవాదులకు శిక్షణ
జయపురం: కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ వివాద పరిస్కార కేంద్రంలో నిర్వహించిన ప్యానెల్ న్యాయవాదుల శిక్షణ శిబిరాన్ని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి ప్రారంభించారు. శిక్షణ శిబిరంలో కొరాపుట్, జయపురం, కొట్‌పాడ్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్ నుంచి వచ్చిన ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి.. ప్యానెల్ న్యాయవాదులకు స్వాగతం పలికారు. శిక్షణ శిబిరం లక్ష్యాలను వివరించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయి సుజాత పాల్గొని ప్యానెల్ న్యాయవాదులకు శిక్షకులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆమె న్యాయ సేవా ప్రదీకరణ సంస్థ నియమావలి, ప్యానెల్ న్యాయవాదుల భూమిక, బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, క్లైంట్తో సంప్రదింపులు, సలహాలు తదితర అంశాలపై ఉద్భోదించారు. జయపురం సివిల్ కోర్టు రిజిస్ట్రార్ మధుశ్మితా సున న్యాయ సేవలో ప్యానెల్ న్యాయవాదుల పాత్రపై ప్రసంగించారు. మరో శిక్షకుడు, జయపురం సెసన్స్ జడ్జి కోర్టు క్యాడర్ పబ్లిక్ ప్యాసిక్యూటర్ మహేంద్ర కుమార్ నాగ్.. క్రిమినల్ కేసులకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానం, అరెస్టు చేసిన వ్యక్తి హక్కులు, బెయిల్,ఽ దరఖాస్తు విచారణ, క్రిమినల్ చట్టం ముసాయిదా, సాక్షుల విచారణ, వాదన, న్యాయ సెక్షన్లను వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం, తాలూకా న్యాయ సేవా కమిటీ కొట్‌పాడ్, కొరాపుట్, బొరిగుమ్మ, లక్ష్మీపూర్, దసమంతపూర్, సెమిలిగుడలలో ప్యానెల్ న్యాయవాదులు, న్యాయ సలహాదారు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. -
ఆర్టీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
పర్లాకిమిడి: స్థానిక ఆర్కే పాడి మార్గం రోడ్డులో ఉన్న రోడ్డు రవాణా కార్యాలయంలో శనివారం ఉదయం పదిగంటల సమయంలో మంటలు చెలరేగటంతో సిబ్బంది అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. ఆర్టీఓ కార్యాలయంలో మంటలు వ్యాపించడంతో సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అగ్నిమాపక దళం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది మొదటి అంతస్తు భవనంలో మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్స్, ఫర్నీచర్, ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ సందర్భంగా ఎంవీఐ విలేకరులతో మాట్లాడుతూ, తొలుత బయోమెట్రిక్ గదిలో మంటలు ఏర్పడి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని, విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఆర్టీఓ కార్యాలయంలో మంటలు ఏర్పడినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. -
ఉపసంహరించాలి
ఎంఎండీఆర్ సవరణ బిల్లు● కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక డిమాండ్ రాయగడ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన గనులు, ఖనిజాల అభివృద్ధి –నియంత్రణ (ఎంఎండీఆర్) సవరణ బిల్లును జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ఒడిశా రాష్ట్ర హక్కులు, ఆదివాసీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎంఎల్ఏ అప్పల స్వామి కడ్రకలు అన్నారు. బిల్లును ఉపసంహరించుకోకపొతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. స్థానిక సర్క్యూట్ హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ సప్తగిరి ఉలక మాట్లాడుతూ.. ఎలాంటి సమగ్ర చర్చ లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఎంఎండీఆర్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిందని ఆరోపించారు. 2024లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఖనిజాలపై పన్నులు, సెస్ విధించే హక్కు రాష్ట్రాలకు ఉన్నప్పటికీ.. తాజాగా సవరణ బిల్లు ద్వారా కేంద్రం ఆ హక్కులను పరిమితం చేసిందని ఆరోపించారు. సవరణ బిల్లు వల్ల ఒడిశా రాష్ట్రానికి రావాల్సిన సుమారు లక్ష కోట్ల రూపాయల బకాయి రాయల్టీపై ప్రభావం పడటంతో పాటు ఏటా రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 22 వేల కోట్ల వరకు రాష్ట్రానికి ఆదాయం నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉలక పేర్కొన్నారు. దీని ప్రభావం జిల్లా ఖనిజ ప్రతిష్టానాల నిధులపైనా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఆదాయ మిగులు రాష్ట్రంగా ఉన్న ఒడిశా భవిష్యత్‌లో ఆదాయలోటు రాష్ట్రంగా మారే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్, రాయి క్వారీలు, ఖనిజ భూములు వంటి రాష్ట్ర పరిధిలోని అంశాలపై కేంద్రం పెత్తనం చేయడానికి ఈ సవరణ మార్గం సుగమం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివాసీ ముఖ్యమంత్రిగా ఉన్న మోహన్ చరణ్ మాఝి ఈ బిల్లుకు ఎలా మద్దతు ఇస్తున్నార ని ఎంపీ ఉలక ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే ఒడిశా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎండీఆర్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఈ బి ల్లును కేంద్రం ఉపసంహరింకోకతోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డీసీసీ సాధారణ కార్యదర్శి సంకర్షణ మంగరాజ్, డీసీసీ మహిళా అధ్యక్షురాలు నంది గౌరీ ఉన్నారు. -
11 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని రామనగుడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ రవీంద్ర నాఽథ్ కుహరో, వివిధ రెవెన్యూ కేసులు, ఆదాయ వసూళ్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉకుంబా గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్‌గా తొలిసారిగా తహసీల్ కార్యాలయానికి వచ్చిన కుహరోను తహసీల్దార్ ప్రాణ కృష్ణ పాణిగ్రహి, అదనపు తహసీల్దార్ గయా డంబురుధర్ బెహర, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. పట్టాల పంపణీ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రీనా బౌరి, మదన్ పండ పాల్గొన్నారు. -
పీహెచ్డీ విద్యార్థులకు ఓరియంటేషన్
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా నియమితులైన పీహెచ్డీ విద్యార్థులకు ఓరియెంటేషన్ (ఇంట్రడక్షన్) కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్డీ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో పరిశోధన వ్యవస్థ, నియమ నిబంధనలు, విద్యా వాతావరణం, పరిశోధనలకు సంబంధించిన వివిధ విధానాలను పరిచయం చేయటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి వివరించారు. పరిశోధన రంగంలో క్రమశిక్షణ, నిబద్ధత, మైళికత, పరిశోధన నీతి, అకడమిక్ ఇంటిగ్రటీ యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. ఉన్నత ప్రమాణాల పరిశోధనల ద్వారా సమాజ ఉన్నతికి, దేశాభివృద్ధికి సహకారం అందించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. రిజిస్ట్రార్ మహేష్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. పరిశోధన పద్ధతలు, సాహిత్య సమీక్ష, పరిశోధన నీతి, డేటా సేకరణ, పరిశోధన వ్యాసం తయారీ, పరిశోధనలో వివిధ దశలను వివరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యువేట్ కౌన్సిల్ (సిపిజిసి)డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో, పరీక్షల నియంత్రణ అధికారి రంజన్ కుమార్ ప్రధాన్, విశ్వవిద్యాలయంలోని రిజిస్టర్డ్ పీహెచ్డీ పరిశోధన గైడ్లు పాల్గొని నూతన పరిశోధన విద్యార్థులకు మార్గదర్శకాలను వివరించారు. డాక్టర్ విజయ కుమార్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. -
పారాదీప్ మత్స్య రేవులో భారీ అగ్నిప్రమాదం
● మంటల్లో ట్రాలర్ దగ్ధంభువనేశ్వర్: పారాదీప్ చేపల రేవులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక చేపల పడవ పూర్తిగా దగ్ధమైంది. సమీపంలో ఉన్న జాలర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేబీ లక్ష్మి అనే పేరు గల చేపల వేట పడవలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే మంటలు చెలరేగి దట్టమైన పొగ మేఘాలు నింగికి ఎగసిపడి ఆందోళన కలిగించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో, సమీపంలో ఉన్న జాలర్లు మండుతున్న ట్రాలర్‌పై నీళ్లు చల్లుతూ మంటలను అదుపు చేసేందుకు విఫల యత్నం చేశారు. తక్షణమే అగ్ని మాపక సిబ్బందిని అప్రమత్తం చేయడంతో కుజంగ్ నుంచి ఒక యూనిట్ అగ్నిమాపక బృందం ఘటనా స్థలానికి చేరింది. సమీపంలో లంగరు వేసి ఉన్న ఇతర నౌకలకు మంటలు వ్యాపించకుండా నివారించేందుకు అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయాలు లేదా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు జరగనట్లు సమాచారం. -
పన్నీరు, కోవా దుకాణాల్లో తనిఖీలు
జయపురం: మార్కెట్లో విరివిగా అమ్ముడు పోతున్న పన్నీరు, పుట్టగొడుగులు, కోవా టోకు వ్యాపార దుకాణాలపై జిల్లా ఆహార భద్రతా విభాగ అధికారులు, జయపురం మున్సిపాలిటీ అధికారులు తమతమ సిబ్బందితో సంయుక్తంగా దాడులు జరిపారు. నేడు పట్టణంలో 7 పన్నీరు దుకాణాలు ప్రాసెసింగ్ యూనిట్ల పైన మస్రూమ్ దుకాణాలపైన దాడులు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పన్నీరు, కోవా, మష్రూమ్ శాంపిళ్లు సేకరించారు. పాలిథీన్ సంచులు వినియోగం, ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం చేయటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మూడు దుకాణాల వ్యాపారు లపై రూ.3 వేలు చొప్పున జరీమానాలు వేశా రు. శాంపిల్స్ రిపోర్టులు వచ్చిన తర్వాత ఏమై నా కల్తీలు జరిగినట్టు వెల్లడైతే తగు చర్యలు తీసుకుంటామని జిల్లాఆహార భధ్రతా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. ఈ దాడుల్లో మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, మునిసిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం మార్గదర్శకాలు
ఒడిశా పోలీసులకు..భువనేశ్వర్: రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత, పౌర కేంద్రీకృత పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. స్థానిక రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో శని వారం జరిగిన రాష్ట్ర స్థాయి డీజీపీ, ఐజీపీల సమావేశంలో ప్రసంగిస్తూ సమర్థమైన నేర నియంత్రణ, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీరప్రాంత భద్రత, శిక్ష విధింపు రేటును మెరుగుపరచడంపై పోలీసు బలగాలు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసు సంస్కరణల అమలు, రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేజేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వనరులు, నిధులు, పరిపాలనాపరమైన మద్దతును అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒడిశా పోలీసులకు ఆయన 10 సూత్రాల ఆదేశాన్ని జారీ చేశారు. సున్నితత్వం ప్రధానం సాధారణ పౌరులపై పోలీసు సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలి, పోలీస్ ఠాణాకు వచ్చే ప్రతి వ్యక్తిని బాధితుడిగా పరిగణించి వారితో సానుభూతితో వ్యవహరించాలని ఆయన అన్నారు. ‘పోలీసులను చూసి నేరస్థులే వణికిపోతారు కానీ, అమాయక పౌరులు కాదు‘ అనే సూత్రాన్ని పోలీసులు పాటించాలని ఉద్ఘాటించారు. మాదకద్రవ్య రహితం 2029 నాటికి రాష్ట్రం మాదకద్రవ్య రహితం కావాలి. నేరస్తుల పట్ల శిక్ష విధింపు రేటు పెంచడం అనివార్యం. ఎన్‌సిఆర్‌బి సమాచారం ప్రకారం రాష్ట్రంలో శిక్ష విధింపు రేటు 40 శాతం కొనసాగుతుంది. దాన్ని కనీసం 75 శాతానికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. ఒడిశా 575 కిలో మీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని సురక్షితం చేయడానికి సముద్ర మార్గాల ద్వారా చొరబాట్లను నివారణ కోసం ప్రత్యేక పోలీసు అధికారులు, మాజీ రక్షణ సిబ్బందిని నియమించినట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్లలో పోలీస్ శాఖలో 17,794 కొత్త పోస్టులను సృష్టించి 5,817 పోస్టులను భర్తీ చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణ కోసం, అవసరమైన పరికరాలతో పాటు రూ. 50 కోట్ల ప్రత్యేక దర్యాప్తు నిధిని కేటాయించారు. పోలీస్ స్టేషన్ల ఆధునీకరణతో సైబర్ నేరాలు, డార్క్ వెబ్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఎన్ఏటీగ్రిడ్, సీసీటీఎన్ఎస్ వంటి వ్యవస్థల ద్వారా నిఘా సామర్థ్యాలను బలోపేతం చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు బలగాలు పూర్తి అంకితభావంతో పని చేస్తాయని పోలీస్ డైరెక్టర్ జనరల్ వినయ్‌తోష్ మిశ్రా హామీ ఇచ్చారు. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్ శర్మ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్. పి. కోచె, డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) సంజీబ్ పండా, రాష్ట్రానికి చెందిన ఇతర డీజీపీలు, ఐజీపీలు హాజరయ్యారు. -
సంస్కృతం అన్ని భాషలకు మూలం
జయపురం: సంస్కృతం అన్ని భాషలకు మూలమని, ఆ భాష మహాసముద్రం వంటిదని పలువురు వక్తలు అన్నారు. శనివారం జయపురం పూజ్య పూజ సంసద్ నిర్వహించిన సంస్కృత భాషా దినోత్సవం, స్వభావకవి గంగాధర మెహర్ జయంతి కార్యక్రమానికి పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జానీ అధ్యక్షత వహించారు. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు సాహిత్య రుచిని సమాజానికి అందేలా సంస్కృతం చేసిందని అన్నారు. అందుకే భాషా సాహిత్యాలకు జనకుడు సంస్కృతం అని వాఖ్యానించారు. హిందీ భాషను విస్తృత ప్రచారం చేసి భాషా పరిరక్షణకు హిందీ భాషాప్రియులు, అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 19వ శతాబ్దానికి చెందిన ఒడియా కవి గంగాధర మెహరను స్వభావ కవిగా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందారన్నారు. ఆయన సాహిత్య మేధావి, ఆయన రచనలు భాషా ప్రగతికి ఎంతో తోడ్పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్య పూజ సంసద్ కార్యదర్శి బైరాగి చరణ సాహు, ఎకంబా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి.నళినీ కుమార్, శోభాగిణి నందా, సంధ్యారాణి సాహు, ప్రీతి కాంచన సాహు, సంఘమిత్రా భుక్త, బిపిన్ కుమార్ మిత్ర, సరస్వతీ సాహు, తపన్ కుమార్ త్రిపాఠీ, సెజల్ కుమార్ సాహు, మహేశ్వర నాయక్, సంజయ కుమార్సాహు, ఆచార్య కౌశిక్, అనీశా కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్తలు, ఇంజినీర్ కేధార్ నాథ్ బెహర, ఇంజినీర్ భాస్కర్ సామంతరాయ్, అనసూయ సామంతరాయ్ ఘనంగా సన్మానించారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి పాఠశాలలో నిర్వహిస్తూ విద్యార్థులలో హిందీ భాష పట్ల ఆసక్తిని పెంచాలని సన్మాన గ్రహితులు విజ్ఞప్తి చేశారు. -
ఆపత్కాలంలో ఆపన్న హస్తం
● రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు కొత్త జీవితంరాయగడ: భర్త మృతి చెందిన అనంతరం మానసిక ఆరోగ్య సమస్యలతో రెండేళ్లుగా గదికే పరిమితమైన మహిళకు ఎట్టకేలకు కొత్త జీవితం దక్కింది. జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది సమన్వయంతో ఆమెకు అవసరమైన మానసిక చికిత్స అందించి, తదుపరి సంరక్షణ, పునరావాసం కోసం మల్కన్‌గిరిలోని పునరావాస కేంద్రానికి తరలించారు. జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి జుగాపదర్ గ్రామానికి చెందిన ఈ మహిళ మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా చాలాకాలంగా కుటుంబ సభ్యుల నుండి, సమాజం నుండి దూరంగా జీవిస్తున్నట్లు అధికారులకు సమా చారం అందింది. కలెక్టర్ అశుతొష్ కులకర్ణి ఆదేశాల మేరకు వైద్య బృందం గ్రామానికి వెళ్లి ఆమె పరిస్థితిని పరిశీలించింది. ఈ బృందంలో జిల్లా కేంద్రాస్పత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాకకేష్ రంజన్ పాఢి, బిసంకటక్ సీహెచ్‌సీ ఇన్చార్జి అధికారి డాక్టర్ హెచ్ బి టుడు, మానసిక ఆరోగ్య సామాజిక కార్యకర్త పూర్ణ చంద్ర కాదాంబాలు, స్థానిక సర్పంచ్ తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులకు మానసిక అనారోగ్యం, దాని చికిత్స, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఒంటరిగా ఉంచడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళను రాయగడ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్ రాకేష్ రంజన్ పండ పర్యవేక్షణలో ఐదు రోజుల పాటుగా మానసిక ఆరోగ్య చికిత్స, అవసరమైన సహాయాన్ని అందించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించడంతో పాటు పరిస్థితి స్థిరపడిందని నిర్ధారించారు. దీంతో ఆమెకు దీర్ఘకాలిక సంరక్షణ, పునరావాసం అవసరమని గుర్తించి తదు పరి ఏర్పాట్లు చేశారు. రాయగడ జిల్లా సామాజిక భద్రత అధికారి ఎలిజబెత్ గొర్డా శ్రీకాంత్ కుమార్ పాణిగ్రహి, సబ్ డివిజనల్ సొషల్ సెక్కూరీటీ ఆఫీసర్ జ్ఞానవర్ధిని, కొలనార సమితి మరి కొంతమంది సహకరించారు. సమన్వయంతో ఆమెను మల్కనగిరి లోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ మానసిక అనారో గ్యం కారణంగా ఎవరినీ బంధించి లేదా సమా జానికి దూరంగా ఉంచకూడదని అన్నారు. సకా లంలో చికిత్స, కుటుంబ సభ్యుల సహకారం, పునరావాసం, సమాజం నుంచి అంగీకారం లభి స్తే మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతు న్న వారు కూడా గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపగలని అభిప్రాయపడ్డారు. -
భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కుమారుడు అరెస్టు
భువనేశ్వర్: భూ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కుమారుడు అజిత్ సాహును స్థానిక నయాపల్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. రాజ్య సభ సభ్యుడు సుజీత్ కుమార్‌కు భూమి ఇప్పిస్తానని వాగ్దానం చేసి మోసం చేశాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో అజిత్‌పై ఒక ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి ఆరోపిత మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. సమన్లు జారీ చేసినప్పటికీ అజిత్ పదేపదే కోర్టుకు గైర్హాజరు కావడంతో ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు అతడిని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. తదనంతరం అతనిపై వారెంట్ జారీ చేసింది. వారెంట్ ఆధారంగా నయపల్లి ఠాణా పోలీసులు అతడిని భువనేశ్వర్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. బైకు చోరీ కేసులో నిందితుడి అరెస్టు రాయగడ: సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన బైకును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టయిన వ్యక్తి కాసీపూర్ పరిధిలోని రౌత్ఘాటి గ్రామానికి చెందిన హేమంత్ గౌడోగా గుర్తించారు. నిందితుడి నుంచి టివిఎస్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆర్.ఉదయగిరి వాసి మృతి పర్లాకిమిడి: తెలంగాణలో హైదరాబాద్‌కు పొట్టచేతపట్టుకుని వలస వెళ్లిన కార్మికుడు ఒక రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు ఆర్.ఉదయగిరి పోలీసు అధికారులు తెలియజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ అనుగురు పంచాయతీ తిలికోరో గ్రామానికి చెందిన బయాన్ రయితో (52) హైదరాబాద్‌లో రోడ్డుపై నడుచుకుని వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అక్కడి స్థానికులు మెడికల్‌కు తరలించగా ఆయన మృతిచెందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బయాన్ రయితో మృత్యువార్త విని స్వగ్రామం తిలికోరో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి. ఆయన మృతదేహాన్ని ఎలాగైనా ఒడిషా తీసుకురావడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. రూ. 1.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెల్టాయి కూడలి నుంచి బోడపోదర్ పంచాయతీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆటో అనుమానాస్పదంగా ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. దీంతో అనుమానంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గమనించారు. 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహరంగ మార్కెట్లో లక్షన్నర రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ నగేష్ హంతాళ్పై కేసు నమోదు చేసి అరేస్టు చేశారు. పట్టుబడ్డ గంజాయిని చిత్రకొండ తహసీల్దార్ ప్రశాంత్ కుమార్ భత్ర సమీక్షంలో తూకం వేశారు. -
కొండబాబు అకాల మరణం తీవ్రంగా కలిచివేసింది
రాయగడ: బీజేపీ నాయకుడు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని రాజ్యసభ మాజీ సభ్యుడు , బిజు స్వాభిమాన్ మంచ్ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనతో ఎంతో సన్నిహిత అనుబంధం కలిగిన కొండబాబు ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపొతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శనివారం నెక్కంటి, అతని అనుచరులు, మద్దతుదారులతో స్థానిక రాణిగుడఫారంలోని కొండబాబు స్వగృహానికి చేరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం తన స్వగృహంలో విలేకర్లతో నెక్కంటి మాట్లాడుతూ.. కొండబాబుతో తనకు నాలుగు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆప్తుడిగా, ఆత్మీయుడిగా తనతో కొనసాగిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరారని.. అయితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కొరుకునే వాడినని నెక్కంటి చెప్పారు. అయితే ఇలా అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమన్నారు. కొండబాబు కుటుంబం ఈ కష్టకాలంలో ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమైనా తాను ముందుండి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను పరామార్శించిన వారిలో నెక్కంటి తనయుడు క్రిష్ణ చైతన్య, పి.వి.పి.రాము, దూడల శ్రీనివాస్, తిరుపతి , ఇప్పిలి సన్యాసిరాజు, సానా జగదీష్, రాయగడ సమితి ఉపాధ్యాక్షులు హరప్రసాద్ హెప్రుక, కౌన్సిలర్ సర్మిష్టపాడి, సంతోష్ దలాయి, గోపి గౌడో ఉన్నారు. -
ఒడిశాలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి
● అనుగోల జిల్లాలో ఒకరు మృతిభువనేశ్వర్: అనుగోల జిల్లాలోని పల్లొలొహడా మండలం పవిత్రాపూర్ పంచాయతీ సనబగడరి గ్రామంలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం. మరో 10 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. మృతుడిని సుమంత్ సెఠిగా గుర్తించారు. అతడు జ్వరం, తల నొప్పి, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురయ్యాడు. తదుపరి దశలో చిగ్గర్ పురుగుల కాటు వల్ల కలిగే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్గా నిర్ధారణ అయింది. 10 మందికి పైగా వ్యాధిగ్రస్తులను చికిత్స కోసం ఖమర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఇతర ఆరోగ్య కేంద్రాలలో చేర్పించారు. ఈ పరిస్థితి గురించి ఖమర్ సీహెచ్‌సీ వైద్య అధికారితో సంప్రదించినట్లు పల్లొలొహడా సబ్ కలెక్టర్ రవీంద్ర కుమార్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా స్క్రబ్ టైఫస్ సోకిన ఒక రోగి మరణించగా 4 నుంచి 5 మంది రోగులు చికిత్స పొందుతున్నారని వైద్య అధికారి తెలిపారు. పరిస్థితి అదుపులో ఉంది. చికిత్స పకడ్బందీగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. వ్యాధి సోకిన వారిని ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందన్నారు. ఆరోగ్య శాఖ నిఘా ఆరోగ్య శాఖ అనుగోల జిల్లాలో నిఘాను ముమ్మరం చేసింది. సందిగ్ధ రోగుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత గ్రామంలో చికిత్స, అవగాహన కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆరోగ్య బృందం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా సందర్శిస్తుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఆరోగ్య శాఖ నిఘాను ముమ్మరం చేసింది గడ్డి, పొదలు, ఆకులు, తదితర వృక్షసంపద ఉన్న ప్రాంతాల్లో కనిపించే చిన్న పేను లాంటి కీటకాల కాటు వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఇది జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులను కలిగిస్తుంది. అనుగోల ముఖ్య జిల్లా వైద్య అధికారి డాక్టర్ మదన్ మోహన్ ప్రధాన్ మాట్లాడుతూ సనబగడరిలో ఇప్పటి వరకు 4 కేసులు నిర్ధారణ అయ్యాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం అని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. వ్యాధి సోకిన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. పాజిటివ్‌గా తేలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు సమగ్ర సరంజామా అందుబాటులో ఉందని అభయం ఇచ్చారు. ఈ వ్యాధి కొత్తది కాదు. చాలా కాలంగా ఉంది. డయాగ్నస్టిక్ కిట్ల ద్వారా దీనిని గుర్తించవచ్చన్నారు. వర్షా కాలంలో చెప్పులు లేకుండా నడిచే వారిని టిక్ లాంటి కీటకాలు కుట్టడం వల్ల ఇది వస్తుందని ఆయన అన్నారు. -
ఖరగ్‌పూర్–అమరావతి హైస్పీడ్ కారిడార్‌కు కేంద్రం ఆమోదం
రాయగడ: తూర్పు భారత దేశాన్ని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతితో అనుసంధానించే ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్–అమరావతి హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టుపై ఆశలు చిగురించాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 1,107 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 457 కిలొమీటర్ల అలైన్మెంటుకు కేంద్రం ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్టు పనుల పురొగతిపై చర్చ ఊపందుకుంది. ఒడిశా పరిధిలో సుమారు 522 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నారు. ఇది రాష్ట్రంలొని మయూర్భంజ్ (86 కిమీ) , కేంఝర్ (86), ఢెంకానాల్ (88), గంజాం (97), కటక్ (21), నయాఘడ్ (53), కొరాపుట్ (17)జిల్లాల మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. గుణుపూర్–రామనగుడకు ప్రత్యేక ప్రాధాన్యం ఈ హైస్పీడ్ కారిడార్ రాయగడ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనుంది. ప్రతిపాదిత మార్గం గుణుపూర్, రామనగుడ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కురుపాం ప్రాంతంతో అనుసంధానం కానున్నట్లు సమాచారం. దీంతో రాయగడ జిల్లాలోని సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కారిడార్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో రాయగడ జిల్లాకు రాకపోకలు, వాణిజ్య సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుణుపూర్, రామనగుడ వంటి గిరిజన ప్రాంతాల్లొ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ కనెక్టివిటీ సులభతరం కావడంతో పాటు రవాణా సమయం ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. రూ.75,629 కోట్ల అంచనా వ్యయం నాలుగు లేన్లుగా నిర్మించనున్న ఈ హైస్పీడ్ కారిడార్‌లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా డిజైన్ చేయనున్నారు. నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.75,629 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. కారిడార్ పూర్తయితే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికులు, సరకు రవాణా మరింత వేగవంతం కానుంది. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో బలిమెల–చిత్రకొండ ప్రధాన్ ఘాట్ రోడ్డులో నూవగూడ గ్రామం వద్ద శనివారం ఉదయం ట్రక్కు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి డ్రైవర్‌ను చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షంచి డ్రైవర్ ఆరోగ్యం విషమించడంతో మల్కన్‌గిరికి రిఫర్ చేశారు. చిత్రకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధిక బరువు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బావించి కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి డ్రైవర్, యజమానా అని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల తనిఖీ మల్కన్‌గిరి: మల్కన్‌గిరి పట్టణంలోని రవాణా కార్యాలయం ఎదుట శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ కంటైనార్ ట్రక్కును మల్కన్‌గిరి ఆర్డీ అధికారులు పట్టుకుని మొత్తం రూ.35,000 జరిమానా విధించారు. తనిఖీల్లో ట్రక్కు అధిక బరువుతో ఉన్నందున ఈ జరిమానా వేశారు. ఓవర్ లోడ్‌తో వాహనాలు నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించారు. ట్రక్కును ఢీకొట్టిన కారు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని ఆదర్శ పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. కారు కలిమెల సమితి కంగురుకొండ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. కారు ముందు భాగం పాడైంది. డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై మల్కన్‌గిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శబరపల్లిలో సౌరా భాష పుస్తకావిష్కరణ రాయగడ: ఆదివాసీ సౌరభాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించి, భావితరాలకు అందించేందుకు జిల్లాలోని రామనగుడ సమితి పరిధి పరిఖితి పంచాయతీలోని శబరపల్లి గ్రామంలొ సౌరా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సౌరా ఎడ్యుకేషన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు 125 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఒడిశా స్కూ ల్ ఎడ్యుకేషనల్ ప్రొగ్రామ్ అథారిటీ బహుభాషా విద్యా కార్యక్రమం రిసొర్స్ పర్శన్, ప్రముఖ రచయిత ఇనాం గమాంగ్ రచించిన ఈ పుస్తకం సౌర భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణకు కీలకమైన ప్రయత్నంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యఅతిథిగా శ్యామఘన్ భుయాన్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూత్ అసోసియేషన్‌కు చెందిన విశ్వనాథ్సబర్, ఉపాధ్యక్షుడు గిరికిమి సబర్, సత్యసావిత్ర సబర్, జగ్గారావు బిడిక పాల్గొన్నారు. జి.సిగడాం(పొందూరు): మండలంలోని మజ్జిలపేట గ్రామానికి చెందిన మొజ్జాడ అసిరినాయుడు, వరలక్ష్మి దంపతుల కుమారులు మొజ్జాడ విష్ణుమూర్తి, రామకృష్ణ ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వీరిలో విష్ణుమూర్తి అగ్నివీర్లో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మాజీ సైనికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రూ.82 వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి శనివారం అందజేసింది. కార్యక్రమంలో చైర్మన్ కల్నల్ ఎం.టి.రాజు, అధ్యక్షుడు సువ్వారి నీలాచలం, జనరల్ సెక్రటరీ అమ్మాజీరావు, కిల్లి వెంకటరమణ, కింతలి రామారావు, అన్నెపు నర్సింహులు, పైడి రంగనాథం, కీర్తి సుశీల, బొడ్డేపల్లి మోహన్, పి.జగన్మోహన్, బి.గోవిందరావు, మల్లేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
జయపురంలో బయో సీఎన్జీ ప్లాంట్
జయపురం: జయపురంలో త్వరలో రూ.70 కోట్ల అంచనాతో బయో సీఎన్జీ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది. జయపురం సమితి బలియ గ్రామ పంచాయతీ పలకాపుట్ గ్రామ ప్రాంతంలో చేపట్టనున్నట్లు జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ వెల్లడించాయి. ఆ ప్లాంట్ లో గోబర్(పేడ)ఇతర వ్యర్థ పదార్థాలు వినియోగించి గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. పలకాపుట్, నువాపుట్ గ్రామాల మధ్య కుంతర్కాల్ మౌజ లో రెవెన్యూ విభాగానికి చెందిన 16.770 ఎకరాల భూమిని బయో సీఎన్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పూజా రౌత్, మునిసిపాలిటీ అమీన్ శుభశ్మిత జెన, భారత పెట్రోలియం కార్పొరేషన్‌కి చెందిన నలుగురు అధికారుల బృందం పలకాపుట్– నువాపుట్ గ్రామాల మధ్య గల కుంతరకాల్ మౌజలో ప్లాంట్‌కు గుర్తించిన భూమిని సందర్శించి ప్లాంట్‌కు ఉపయోగ పడుతుందా లేదా అని సమీక్షించారు. మరోసారి భూమిని సర్వే జరిపిన తరువాత తర్వాత చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
రాయగడ: ప్రయాణికులతోవెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి నియమగిరి కుర్లీ పంచాయతీలోని తువాగుడ ఘాటీ వద్ద ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, బీఎస్పీ కార్యకర్తలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో బిసంకటక్ ఆస్పత్రికి తరలించారు. హజరిడంగ పంచాయతీలోని అంకుల్పదర్ గ్రామం నుంచి కొంతమంది మహిళలు కుర్లీ గ్రామానికి సమీపంలో గల ఒక పర్యాటక స్థలాన్ని చూసేందుకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో మొతం 11 మంది ప్రయాణిస్తుండగా ఇందులో సుకాంతి పడికాక, బబిత పడికాక, నీలావతి కుట్రుక, మహినాబతి టుయిక, రచన కుట్రుకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగత వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హార్డ్‌కోర్ నేరస్తుడు హడప శివపై ఎన్ఎస్ఏ ప్రయోగం రాయగడ: హర్డ్‌కోర్ నేరస్తుడు హడపా శివపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) ప్రయోగించినట్లు ఎస్పీ రాజ్ ప్రసాద్ తెలిపారు. హడపా శివపై రెండు దశాబ్దాలుగా హత్య, దోపిడీ, కిడ్నాప్ వంటి నేరాలకు సంబంధించి సుమారు 64 కేసులు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం హడప శివ సంబల్పూర్ సర్కిల్ జైలులో ఉంచారు. వివిధ నేరాలకు సంబంధించి అతనిపై అనేక కేసులు నమోదై ఉండగా ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నాడు. రాయగడ జిల్లా సబ్ జైలు, మల్కనగిరి జిల్లా సబ్ జైలులో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రభుత్వం అతడిని సంబల్పూర్ జైలుకు తరలించింది. ఇదిలా ఉండగా కొద్ది రొజుల క్రితం అతని కుమారుడు నిఖిల్ హత్యకు గురైన ఘటనతో రాయగడ పట్టణంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హడప శివ పలు నేర కేసులతో సంబంధం కలిగి ఉండటంతో జాతీయ భద్రత చట్టం (ఎన్ఎస్ఏ) పరిధిలోకి తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి.. యువకుడి గల్లంతు రాయగడ: జలపాతం అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువకుడికి సెల్పీ సరదా ప్రాణంపైకి తెచ్చింది. జిల్లాలొని కాసీపూర్ సమితి పరిధిలోని తయాంగీర్ జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి కిందపడిన యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గల్లంతైన యువకుడు గొడిబాలి పంచాయతీ పరిధిలోని జెరేకా గ్రామానికి చెందిన చెంకా బిసోయి కుమారుడు జొక్ బిసాయి (16)గా గుర్తించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జోక్ తన నలుగురు స్నేహితులతో కలసి తయాంగీర్ జలపాతానికి వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి పోయినట్లు తోటి స్నేహితులు తెలియజేశారు. వెంటనే వారంతా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడ నుంచి వారంతా కలసి గ్రామంలోని జోక్ కుటుంబీకులకు తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. యాంత్రిక లోపంతో నిలిచిన భారీ వాహనం రాయగడ: జిల్లాలోని బిసంకటక్ నుంచి గుణుపూర్ కు వెళ్లే రహదారి మలుపులో బంకనాల్ వద్ద భారీ వాహనం యాంత్రిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ఆయా మార్గాల గుండా రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న బిసంకటక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు మధ్యలో ఉన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో పక్కకు నెట్టడంతొ రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.గల్లంతైన జోక్ బిసొయి -
సమరశీల పోరాటాలే విద్యుత్ అమరులకు నివాళి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే విద్యుత్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించడమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో టీడీపీ ప్రభుత్వం బషీరాబాగ్ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అసువులు బాసారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు విద్యుత్ విషయంలో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని పిలుపునిచ్చి, అదానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం మోసం కాదా అని ప్రశ్నించారు. జీడి గిట్టుబాటు ధర, జీడి బోర్డు, రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీగా తీర్చిదిద్దడం, కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం, జిల్లాకు ఐటీడీఏ వంటి హామీలేవీ నెరవేరలేదని గుర్తు చేశారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ‘ఖేలేగా భారత్ – జీతేగా భారత్’ థీమ్‌తో మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు. వర్సిటీ క్రీడా మైదానంలో వీసీ ప్రొఫెసర్ హృషికేష్ శనాపతి క్రీడా శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ మహేష్ చంద్ర నాయిక్, సీపీజీసీ డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
నేపాల్ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు
భువనేశ్వర్: నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో రాష్ట్రానికి చెందిన మరో 3 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. బర్గఢ్ జిల్లా జంపాలి గ్రామానికి చెందిన దంపతులు, వారి రెండేళ్ల కుమార్తె ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన దంపతులు గున్నం జయకృష్ణ, గున్నం సాయి విందు కుమారి. వారి రెండేళ్ల కుమార్తె ఉన్నారు. జయకృష్ణ నేపాల్‌లోని ఒక జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తూ కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, వర్షాల కారణంగా కుటుంబంతో సంబంధాలు తెగిపోవడంతో బర్గడ్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త బర్‌గడ్‌లో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. అదృశ్యమైన ముగ్గురూ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. గల్లంతైన కుటుంబం కోసం ఒక సహాయక బృందం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన తర్వాత నేపాల్ వరదల్లో గల్లంతైన ఒడియా ప్రజల సంఖ్య 5కి పెరిగింది. -
శ్రీ క్షేత్రంలో బలభద్ర స్వామి జన్మ దినోత్సవం
● శ్రీమందిరంలో ప్రత్యేకమైన ఆచారాలు భువనేశ్వర్: శ్రీమందిరంలో, బలభద్రుని జన్మదినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్న వేదికపై కొలువై ఉన్న శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుడు, భూదేవి, శ్రీదేవి అనే ఆరు విగ్రహాలను బంగారు ఆభరణాలతో అలంకరించారు. పూజా పండా, పతి మహా పాత్రో, ముదిరొస్తొ వర్గం సేవాయత్‌ల సహాయంతో శుద్ధ సువార్ సేవకులు బలభద్రుని జన్మ దిన పూజల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఝులణొ (ఊంజల) ఉత్సవం ఆచారాల కోసం శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ప్రతినిధులుగా శ్రీదేవి, భూదేవి, మదన్ మోహన్ శ్రీ జగన్నాథుని పవిత్రమైన ఆజా్ాఞ్మల పొందడంతో యాత్రకు వేంచేశారు. అనంతరం బలభద్ర స్వామి జన్మ దినోత్సవ పూజాదుల కోసం హరిడ మాల అని పిలువబడే బంగారు పూలమాల అలంకరణతో సుదర్శనుడు రత్న వేదిక నుండి దిగి వచ్చి పల్లకి అధిరోహించి ఊరేగింపుగా మార్కండేయ పుష్కరిణి తీరానికి చేరాడు. ఈ తీరంలో శుద్ధొ సువార్ సేవకులు తడి (ఒండ్రు) మట్టితో శ్రీ బలభద్రుని విగ్రహాన్ని తయారు చేయడంతో పూజా పండా వర్గీయులు పవిత్ర మంత్ర పఠనంతో ఆ విగ్రహానికి ప్రాణం పోసే ఘట్టం పరిసరాల్ని ఆధ్యాత్మికమయంగా మలిచాయి. ప్రాణం పోసుకున్న బలభద్ర స్వామి మట్టి ప్రతిమకు భోగం సమర్పించడంతో జన్మ దినోత్సవం పూజాదులు ముగిసినట్లు పరిగణించి మట్టి విగ్రహాన్ని కొలనులో నిమజ్జనం చేయడం ఆచారంగా నిర్వహించారు. నిమజ్జనం అనంతరం సుదర్శన స్వామి నాలుగు ఆశ్రమాలను సందర్శించి నగర పరిక్రమగా శ్రీ మందిరానికి చేరడంతో బలభద్ర స్వామి జన్మ దినోత్సవం వేడుకలకు తెర పడింది. రాఖీ వేడుక నిర్వహణకు అవసరమైన రాఖీలను పటొరా బిసోయ్ సేవకులు తయారు చేస్తారు. ఈ సందర్భం కోసం 4 ప్రత్యేకమైన రాఖీలను తయారు చేస్తారు. శ్రీ జగన్నాథుని రాఖీని ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు పట్టు పోగులతో, బలభద్రుని రాఖీని గాఢమైన నీలం మరియు ఊదా రంగులు పట్టు పోగులతో తయారు చేస్తారు. మార్కండేయ పుష్కరిణికి తరలి వెళ్తున్న సుదర్శనుడు మార్కండేయ పుష్కరిణి తీరంలో బలభద్ర స్వామి మట్టి ప్రతిమ శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో పతిత పావనునికి రాఖీ ధారణ -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
రాయగడ: విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన హాస్టళ్లలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని బుడాగుడ ఎస్ఎస్డి విద్యార్థుల హాస్టల్లో బయటకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, మూతలు లేని జాయింట్ బాక్సులు, రైలింగ్ లేని మెట్లు, శిథిలమైన మెట్లతో పాటు వర్షం పడితే పైకప్పు నుంచి నీరు కారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా విద్యార్థుల వసతి గృహాల్లో విద్యుత్ పరికరాలు, స్విచ్ బోర్డులు పిల్లలకు అందకుండా సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. అయితే బుడాగుడ హాస్టల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్విచ్ బోర్డులు, జాయింట్ బాక్సులు సరైన రీతిలో అమర్చకపోవడంతో వాటికి సంబంధించిన విద్యుత్ తీగలు బహిరంగంగా వేలాడుతున్నాయి. పలు జాయింట్ బాక్సులకు మూతలు కూడా లేకపొవడంతో ప్రమాదం పొంచి ఉంది. నాగావళి హాస్టల్లో ప్రవేశ ద్వారం వద్ద కూడా ఎంసీబీ స్విచ్ బాక్స్ మూత లేకుండా కనిపిస్తుంది. కొంత దూరంలో ఉన్న విద్యుత్ బోర్డు నుంచి స్విచ్‌లు బయటకు వచ్చి తీగలు వేలాడుతున్నాయి. మరోవైపు నల్లా బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్ పంప్‌కు సంబంధించిన విద్యుత్ తీగలు నేలపై పడి ఉన్నాయి. వాటికి పలు చోట్ల జాయింట్లు ఉండటంతో వర్షాకాలంలో నీటితో సంబంధం ఏర్పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హాస్టల్లోని పై అంతస్తుకు వెళ్లే మెట్లకు రెయిలింగ్ లేకపోవడం, మెట్లు కూడా శిథిలావస్థకు చేరుకోవడం మరో సమస్యగా మారింది. వర్షం పడినప్పుడు పై కప్పు నుంచి నీరు కారడంతో భవనం భయపెడుతోంది. ఇటీవల జిల్లాలోని కళ్యాణసింగుపూర్ హాస్టల్ నుంచి ఓ విద్యార్థి అదృశ్యమైన అనంతరం అతడి మృతదేహాం లభ్యమైన ఘటన నేపథ్యంలో జిల్లాలోని హాస్టళ్లలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హాస్టళ్లలో మౌలిక వసతులు, ముఖ్యంగా విద్యుత్ భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలికల హాస్టల్లోకి ప్రవేశానికి అనుమతి లేకపోవడంతో అక్కడ పరిస్థితులు పూర్తిగా వెలుగులోకి రాలేదు. విద్యార్థుల భద్రత, మౌలిక వసతుల సమస్యలపై ఐటీడీఏ, జిల్లా కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తానని రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ను సంప్రదించినప్పటికీ ఆయన నుంచి ఎలాటటి స్పందన లభించలేదు. -
ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు
టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని ఆ క్రీడ కార్యదర్శి కె.చిరంజీవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ జట్లకు జరిగే ఈ ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ ఎంపికలు ఉదయం 9 గంటల నుంచి జరుగుతాయని, ఎంపికై న జట్టు వచ్చే నెల 12, 13 తేదీల్లో కర్నూలులో జరిగే 11వ రారష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్ షిప్ 2026లో పాల్గొంటారని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. యువకుడు అదృశ్యం మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు ‘సి’ గ్రామానికి చెందిన బదకల హరి (17) గురు వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్ రీచార్జ్ చేస్తానని తన తల్లి బదకల ఆదిలక్ష్మిని డబ్బులు అడిగి ఇంటి నుంచి వెళ్లాడు. శుక్రవారం ఉదయానికి కూడా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేశా రు. వారి బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. యువకుడు మెళియాపుట్టి జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం మధ్య లోనే నిలిపి వేసి, మేకలు కాపలా కాసుకుంటున్నాడు. ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదనీ, మొబైల్ రీచార్జ్ అని డబ్బులు తీసుకుని వెళ్లాడనీ, మొబైల్‌కు ఫోన్ చేసినా అవ్వడం లేదని తల్లి దండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్ పరిష్కరించాలి’ శ్రీకాకుళం: రిటైర్డ్ ఉపాధ్యాయులు, రెగ్యులర్ ఉద్యోగుల జిల్లా పరిషత్ పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్స్‌ను త్వరితగతిన పరిష్కరించడంలో జిల్లా ప్రజా పరిషత్, స్టేట్ ఆడిట్ కార్యాలయాల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటరామన్, జిల్లా ఆడిట్ అధికారి కె.అంబేడ్కర్‌ను కలిసి సమస్యలపై చర్చించి మెమొరాండం సమర్పించారు. క్లెయిమ్‌లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం సబబు కాదన్నారు. -
భారీ తనిఖీలు
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026రాష్ట్రంలో ఆహార భద్రతా శాఖ..భువనేశ్వర్: రాష్ట్రంలో పండగ పబ్బాల సీజను ఆరంభమైంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆహార నాణ్యత, భద్రతను నిర్ధారించేందుకు ఆహార భద్రతా శాఖ నడుం బిగించి ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో పలు చోట్ల భారీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆహార భద్రతా కమిషనర్ డాక్టరు పోమా టుడు పర్యవేక్షణలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఉప జిల్లాలు, పట్టణ ప్రాంతాలు మొదలైన చోట్ల ఆహార వ్యాపార సంస్థలు విక్రయిస్తున్న మిఠాయిలు ఇతరేతర తినుభండారాల నాణ్యతని తనిఖీ చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత సంస్థలపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు 475 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించిన మేరకు మొత్తం 3,605 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. దీనితో పాటు సంబంధిత యజమానుల నుంచి రూ. 2,84,500 జరిమానా వసూలు చేశారు. వీటిలో భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలో ఽ61 నమూనాలను సేకరించి అత్యధికంగా 787 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేసి రూ. 68,500 జరిమానా విధించారు. అదేవిధంగా కల్తీ కారణంగా కటక్ నగర పాలక సంస్థ (సీఎమ్సీ)లో 570 కిలోలు, రూర్కెలా నగర పాలక సంస్థ (ఆర్ఎమ్సీ)లో 123 కిలోల కల్తీ ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. జిల్లా స్థాయిలో కొనసాగుతున్న తనిఖీల్లో పూరీలో 120 కిలోలు, బాలాసోర్‌లో 98 కిలోలు, ఢెంకనాల్‌లో 95 కిలోలు, కేంద్రాపడాలో 95 కిలోలు, సుందర్గఢ్లో 70 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. కేంద్రాపడాలో రూ. 44,000, ఽఢెంకనాల్లో రూ.28,000, భద్రక్‌లో రూ. 31,500 జరిమానా విధించారు. వినియోగదారులకు సురక్షితమైన, పరిశుభ్ర ఆహార సరఫరా హామీ నిర్ధారణ ధ్యేయంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు ఆహార భద్రతా ప్రామాణికలపై ఆహార వ్యాపారులలో అవగాహన పెంచడంపై శాఖ దృష్టి సారించింది. ఆహార భద్రతా శాఖ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు, పరిశీలన ప్రచారాలను ముమ్మరం చేస్తుందన్నారు. ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యత, పరిశుభ్రత, లేబులింగ్‌ను తనిఖీ చేయాలని వినియోగదారులను హెచ్చరించారు. -
జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌కు నవోదయ విద్యార్థి
సరుబుజ్జిలి: అహ్మదాబాద్‌లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు జరగనున్న జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వతరగతి విద్యార్థి విద్యాశ్రీమహంతి ఎంపికై నట్లు వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి శుక్రవారం తెలిపారు. మహంతి ఎగ్జిబిషన్ పోటీల్లో చక్కగా రాణించి అత్యుత్తమ ప్రతిభ చూపాలని కోరారు. ఆదిత్యుడిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామిని శుక్రవారం ఉదయం హైకోర్టు జడ్జి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకూర్మంలోనూ స్వామిని దర్శించుకున్నారు. ‘పీ–4లో లక్ష మందిని చేర్చాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన ‘పీ–4’ కార్యక్రమం మంచిదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా లో లక్ష మందికి పైగా లబ్ధిదారులను గుర్తించగా, ఇప్పటికే 51 వేల మందిని మార్గదర్శకులకు అనుసంధానం చేసి వారి ఉపాధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రెండో రోజూ విధుల బహిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన విధుల బహిష్కరణ రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగింది. శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూన రాజారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. చట్టాల అమలు కోసం వాదించి, కృషి చేసే న్యాయవాదులకే తగిన రక్షణ లేకపోవడం విచారకరమన్నారు. రోడ్డు ప్రమాదంలో కూరగాయల వ్యాపారి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: రాఖీ పండగ రోజున ఇంటి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పలాస మండలం చినమామిడి మెట్ట గ్రా మానికి చెందిన కూరగాయల చిరు వ్యాపారి చెల్లూరి బైరాగి(75) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బైరాగి ప్రతి రోజు తన ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగానే ఆయన శుక్రవారం తన కూరగాయల బండితో ఇంటి నుంచి బయల్దేరారు. తన భార్య దమయంతితో కలిసి గ్రామం నుంచి పలాస వస్తుండగా ఎన్‌హెచ్–16 జాతీయ రహదారిపై మాకన్నపల్లి వద్ద లారీ ఢీ కొట్టడంతో బైరాగి అక్కడికక్కడే మృతి చెందగా భార్య దమయంతి తీవ్ర గాయాలకు గురైంది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
గుండెపోటుతో బీజేపీ నాయకుడు కొండబాబు మృతి
రాయగడ: లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల వేంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గురువారం అర్థరాత్రి ఎప్పటిలాగే స్తానిక రాణిగుడఫారంలోని ఆయన స్వగృహంలో భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కొసం తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. శుక్రవారం నాడు ఆయన మరణ వార్త దావాణంలా వ్యాపించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల కోసం.. తెలుగు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్లుగా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కొండబాబు ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తు తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయన బీజేడీలో క్రీయాశీలకంగా పనిచేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అధిష్టానంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండబాబు అకాల మరణానికి రాజకీయ, సామాజిక వర్గాలతో పాటు తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, బీజేపీ నాయకులు కాలీరాం మాఝి, టుటుదాస్, ఎస్డీసీ చైర్మన్ సబర్, వైస్ చైర్మన్ మంజుల మినియాక, బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పి.గౌరీశంకరరావు తదితర ప్రముఖులు కొండబాబు పార్థవ దేహాన్ని సందదర్శించి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. -
నడిమివలస కొండ జోలికి రావద్దు
● మళ్లీ రోడ్డెక్కిన నడిమివలస వాసులు జి.సిగడాం: ‘మా అందరికీ ఈ కొండే ఆధారం. మాకు భూములు లేవు, కొండమీది చెట్లు, చిన్న చిన్న వ్యవసాయ సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. కొంతమంది ఆవులు, మేకలు, గొర్రెలు ఇక్కడే మేపుతారు. మాకు కూడా ఈ కొండే జీవనాధారం. ఈ కొండ జోలికి రావద్దు’ అంటూ నడిమివలస వాసు లు మళ్లీ రోడ్డెక్కారు. నడిమివలస–గదబపాలెం గ్రామ సమీపంలో ఉన్న కొండలో సుమారుగా 202 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ కొండలో ఏపీఐఐసి పరిశ్రమ వాడగా ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం ముందడుగు వేసింది. సర్వే నంబర్ 36.38 లో 202 ఎకరాలపై ఉన్న రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామం సచివాలయంలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందించారు. ఈ కొండను ఎన్ఈఆర్ సివికాన్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస నీరు తీసుకురావాలి గానీ ఇలా పచ్చని భూములను విధ్వంసం చేయరాదని కోరారు. ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మా గ్రామంలో ఉన్న కొండ జోలికి అధికారులు వస్తే ప్రాణాలకు తెగించి మేము కాపాడుకుంటాం. ఎంతవరకై నా పోరాటాలు చేస్తాం. – ఇజ్జిరోతు రమేష్, పోరాట కమిటీ అధ్యక్షుడు, నడిమివలస సెంటు భూమి కూడా వదలం మాకు గత ప్రభుత్వం హయాంలో కొండపై పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి మేమంతా సాగు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నాం. ఈ భూమి తీసుకుంటే మా ఆధారం పోతుంది. సెంటు భూమి కూడా మేము వదులుకోలేము. – యడ్ల గౌరినాయుడు, గదబపాలెం -
నాలుగు కేసుల్లో 9 మంది అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసులు నాలుగు కేసుల్లో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 మోటారు బైక్‌లు, కత్తి, డబ్బు, బాసుమతి బియ్యం బస్తాలు స్వాధీన పరచుకున్నట్లు పట్టణ పోలీసులు ఉల్లాస చంధ్ర రౌత్ వెల్లడించారు. బైక్ ల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు సుండిగుడ గ్రామానికి చెందిన దిలీప్ ఖొర(26), హటపొదర్ గ్రామం రాజు మఝి(23), నువాగుడ గ్రామం జగదీష్ హరిజన్(28). వీరి వద్ద నుంచి 8 బైక్‌లు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా బాసుమతి బియ్యం దొంగతనం కేసులో డెప్పిగుడ వాసి అభి రావు(21), గాంధీ చక్ కెనాల్ రోడ్డు రాజేష్ పాయిక్(25)లను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. వారి వద్ద బాసుమతి బియ్యం ప్యాకెట్లు స్వాధీన పరచుకున్నట్లు వెల్లడించారు. అలాగే మారణాయుధాలు చూపి ప్రజలను భయబ్రాంతులను చేస్తూ దోచుకునే ఆరోపణలపై నమోదైన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు హటపొదర్ రాఖేల్ ఖొర(19), డెప్పుగుడ వాసి ఉత్తమ నాగ్ (21), ప్రసాదరావు పేట వాసి రింకు బాగ్(20) అని వెల్లడించారు. వారి నుంచి రూ.500 నగదు, కత్తి స్వాధీన పరచుకున్నుట్లు వెల్లడించారు. అవి కాకుండా పట్టణ పోలీసు స్టేషన్ కేసులో జయపురం పొరజా వీది నివాసి భగవాన్ మాలీ(21) ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంధ్ర రౌత్ వెల్లడించారు. -
మైనర్‌పై అత్యాచారం కేసులో.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రాయగడ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాయగడ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు చిత్రసేన్ పాలకను దోషిగా నిర్ధారిస్తు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమాన విధించింది. జరిమాన చెల్లించలేని పక్షంలో అదనంగా మరో నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. అలాగే బాధితురాలికి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసును విచారించిన ఏడీజే కమ్ స్పెషల్ జడ్జి సంజీవ్ కుమార్ బెహర ఈ తీర్పును వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. 2023 ఫిబ్రవరి 23వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మైనర్ బాలికపై నిందితుడు పాలక అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి చిత్రసేన్ పాలకాను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 29 మంది సాక్షుల్లో 28 మంది సాక్షుల వాగ్మూలాలను పరిశీలించిన కోర్టు ఈ మేరకు దోషిగా నిర్ధారిస్తు తీర్పును వెల్లడించింది. -
రక్తదాతల కోసం వెబ్సైట్
రాయగడ: అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించేందుకు తాసుబెల్లి ఫౌండేషన్ మరో కీలక ముందడుగు వేసింది. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంతో పాటు.. అవసరమైన రోగులను రక్తదాతలతో అనుసంధానం చేసేందుకు అధికారిక www. thasubellifoundation.com వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తలసేమియా బాధపడుతున్న చిన్నారులు, క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరమయ్యే రోగులకు సకాలంలో రక్తం అందించడం ఎంతో అవసరమని భావిస్తూ అందరి సహకారంతో వెబ్సైట్ ప్రారంభిస్తున్నట్లు జేకేపూర్‌లోని తాసుబెల్లి ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి సకాలంలో రక్తం అందించడమే ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జేకే పేపర్ మిల్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో పనిచేస్తున్న సిద్దా క్రాంతి కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫౌండేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించి రక్తదాతగా నమోదు చేసుకోవాలని కోరారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్ ఎన్‌హెచ్–16పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఐసర్ వ్యాన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో రణస్థలం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ఐసర్ వ్యాన్ రోడ్డు దాటుతున్న గొర్లె తేజేశ్వరరావు (55) అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునిది సంతకవిటి మండలంలోని సిరిపురం గ్రామం. మృతుడి భార్య ఇటీవల చనిపోవడంతో లావేరు మండలంలోని బుడతవలస గ్రామంలో ఉన్న తన కుమార్తె దగ్గర గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. శుక్రవారం ఉదయం కుమార్తె ఇంటి దగ్గర బయల్దేరి సిరిపురం వెళ్తూ బెజ్జిపురం కూడలికి వచ్చారు. రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లావేరు పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుని వివరాలు సేకరించారు. ఎస్ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అండగా నిలుద్దాం
భువనేశ్వర్: నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పూరీలో ఉంటున్న అంతర్జాతీయ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు హృద్యమైన సైకత యానిమేషన్‌ను రూపొందించారు. కరుణ, ఐక్యత, మానవత్వంతో వరద ప్రభావిత పొరుగు దేశంలో కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అండగా నిలవాలని, కేవలం 15 నిమిషాల్లో రూపు దిద్దుకున్న సృజనాత్మక కళా ప్రదర్శనతో కళాత్మకంగా పిలుపునిచ్చారు. మానవత్వంతో మనమందరం కలిసి చేయూతగా నిలబడి నేపాల్ బాధితుల కోసం ప్రార్థిద్దామని కళాకృతితో కోరారు. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు ప్రార్థనలు, మానవతా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
సారా విక్రయదారుకు ఏడాది జైలు శిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల సూదికొండకు చెందిన ముద్దాయి దూలి రాజేశ్వరికి సారా విక్రయించిన కేసులో ఏడాది కాలం జైలు శిక్షతో పా టు రూ. 2లక్షల జరిమానా విధిస్తూ గురువా రం పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయ మూర్తి యు.మాధురి తీర్పు వెలువరించారు. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు మేరకు.. పలాస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 2021 మార్చి 4న ముద్దాయి దూలి రాజేశ్వరి సారా విక్రయి స్తూ పట్టుబడటంతో అప్పట్లో విధుల్లో ఉన్న ఎకై ్సజ్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసు లో ముద్దాయి రాజేశ్వరిని ఈ ఏడాది మార్చి 23న కోర్టులో హాజరుపర్చాల్చి ఉండగా ముద్దా యి అందుబాటులో లేకపోవడంతో తీర్పు రిజ ర్వ్ చేశారు. అయితే ముద్దాయి రాజేశ్వరిని గురువారం పలాస జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరిచామని అన్నారు. ఈ మేరకు కోర్టు తుది తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. రణస్థలం: కోష్ట జాతీయ రహదారిలోని పై వంతెనపై ఈ నెల 22న ముందు వెళ్తున్న లారీని ఢీకొని గాయపడిన డ్రైవర్ పొట్నూరు ఎర్రిబా బు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్ పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలానికి చెందిన ఎర్రిబాబు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వజ్రపుకొత్తూరు రూరల్: బెండి గేటు సమీపంలోని కాశీబుగ్గ పాత జాతీయ రోడ్డులో గరుడఖండి దగ్గర గురువారం గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అరుదైన నక్క మృతి చెందింది. ప్రధానంగా ఈ నక్కలు కొండ ప్రాంత పరిసర తోటలో సంచరిస్తుంటాయి. రాత్రి సమయంలో ఆహారం కోసం బెండి కొండ నుంచి వస్తూ ప్రమాదానికి గురై ఉండవచ్చని స్థానికులు తెలిపారు. రణస్థలం: లావేరు మండలంలోని లావేటిపా లెం గ్రామానికి చెందిన ఓయిబోయిన గంగు లు, అప్పలసూరిలకు చెందిన సుమారు 20 గొర్రె పిల్లలను కుక్కలు చంపేశాయి. బుధవా రం అర్ధరాత్రి సమయంలో కుక్కలు ఈ దారుణానికి ఒడికట్టాయి. ఇంతలా నష్టం వాటిల్లడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. సుమారు రూ. 2లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవా లని వేడుకుంటున్నారు. లావేరు పశువైద్యులు గాయిత్రిదేవి, వీఆర్ఓలు వేణుగోపాల్ పరిశీలించి శవపంచనామా చేశారు. లావేరు వైఎస్సార్సీపీ గ్రామనాయకులు లంకలపల్లి మహే ష్ సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
‘నీరివ్వండి మహాప్రభో’
నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్ తోట భార్గవ్, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్, సనపల రమేష్, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. -
చోరీ సొత్తు స్వాధీనం
రాయగడ: బలంగీర్ జిల్లాలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తు రాయగడ జిల్లాకు చేరింది. కేసులొ కీలక ఆధారాల మేరకు బలంగీర్ పోలీసులు రాయగడ జిల్లాలోని కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగారి పంచాయతీ ఖరయోడా గ్రామంలో బలంగీర్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఇటీవల నమోదైన ఓ భారీ చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సరైన ఆధారాలతో ఖరాయోడా గ్రామానికి చేరుకుని ఇద్దరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు పోలీసులకు లభించినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని తమ వెంట బలంగీర్ జిల్లాకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై కళ్యాణసింగుపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే ఈ దాడి జరిగిన విషయం వాస్తవమని రాయగడ ఎస్డీపీఓ గౌర హరి సాహు ధృవీకరించారు. ఇదిలాఉండగా రాయగడ జిల్లా పోలీసులు ఇటీవల రెండేళ్ల కాలంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులను ప్రత్యేకంగా దర్యాప్తు చేసి సుమారు 240 గ్రాముల బంగారం, 581 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
రాయగడ: జిల్లాలోని సదరు సమితి చందిలి పోలీస్ స్టేషన్ పరిధి పెంట గ్రామ శివాలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయం తాళం పగలుగొట్టి శివుడు, పార్వతి లోహ విగ్రహాలతో పాటు పూజా సామగ్రిని అపహరించిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నిందితులను కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ఆలయం పూజారి సీహెచ్ నాగరాజు పూజలు ముగించి ఆలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళం పగలుగొట్టి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా గర్భగుడిలోని విగ్రహాలు, రెండు గంటలు, రెండు బకెట్లు, రెండు చేతి గంటలు, ఇతర పూజా సామగ్రి కనిపించకపోవడంతో చందిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధమున్న నువాపడకు చెందిన మనోజ్ దుర్గ, పవన్ గంత, బీసీ రోడ్డులో నివాసముంటున్న అమలాభట్టకు చెందిన అల్లు హరికృష్ణలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్డీపీఓ గౌరహరి సాహు, చందిలి ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు తెలిపారు. -
వంశధార భూములు కబ్జా
నరసన్నపేట: స్థానిక వంశధార డివిజన్ పరిధిలోని భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఇప్పటికే కిళ్లాం చానెల్‌కు ఆనుకొని నరసన్నపేట ఇందిరానగ ర్ ప్రాంతంలో విలువైన భూములు కబ్జాకు గురయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భవనా లు నిర్మించారు. ఇప్పుడు తాజాగా నరసన్నపేట బ్రాంచి కెనాల్‌కు ఆనుకొని జమ్ము కూడలి వద్ద ఉన్న విలువపైన భూమి కబ్జాకు స్థానికులు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో లక్షలాది రూపాయల విలువ కలిగిన ఈ స్థలం కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. లారీ అసోసియేషన్ పేరున ఈ స్థలం కాజేయడానికి కుట్రలు చేస్తున్నారు. గురువారం ఈ స్థలంలో జేసీబీతో మట్టి నెరిపారు. ఇలా వదిలేస్తే ఈ స్థలం ఆక్రమణ అవుతుందని స్థానికులు అంటున్నారు. వంశధార అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విలువైన ఈ స్థలం ఆక్రమణలు కాకుండా చూడాలన్నారు. దీనిపై వంశధార ఈఈ మురళీ మోహనరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌కు లెటర్ రాస్తామని తెలిపారు. -
‘కాన రాని దూరంలో’ పాట విడుదల
శ్రీకాకుళం అర్బన్: ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు’ పేరు తో నిర్మించిన సిక్కోలు చిత్రాన్ని ఆదరించాలని ఆ చిత్ర యూనిట్ బృందం కోరింది. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్ వద్ద ‘కొన్ని పేజీల జ్ఞాపకాలు‘ చిత్ర బృందం వారి మొదట పాటను లిరికల్ రూపంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం మాట్లాడుతూ కొన్ని పేజీ ల జ్ఞాపకాలు చిత్రాన్ని, పెద్ద సినిమాలకు దీటుగా నిర్మించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ చానెల్లో పూర్తి పాటను అందించామన్నారు. ‘కాన రాని దూరంలో’ అనే ఈ పాటలో సాహిత్యం, సంగీతం శ్రోతల్ని అలరిస్తోంద ని తెలిపారు. చిరంజీవి మజ్జి రాసిన పాటను ప్రము ఖ సంగీత గురువు వరద దుర్గరాజు మాస్టారు, హీరో మిధున్, తల్లిదండ్రులు సంయుక్తంగా లాంచ్ చేశారు. పూర్తిగా గ్రామీణ వాతావరణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ పాటకు రచన చిరంజీవి మజ్జి, సంగీతం నిజానీ అంజన్, వయోలి న్ హేమంత్ కశ్యప్, గానం హితేష్ సాయి, దర్శకు లు ప్రేమ్ సుప్రీం అని తెలిపారు. అనంతరం నటు లు బాబూరావు, రమేశ్ నారాయణ్, సాయి సుధాక ర్, తదితరులు చిత్ర విశేషాలను, కాన రాని దూరంలో పాట ప్రాముఖ్యతను ప్రేక్షకులకు తెలియజేసారు. -
పాముకాటుతో యువకుడు మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడిగేట పంచాయతీ టెక్‌గూడ గ్రామానికి చెందిన కృష్ణ ఖతేరి(20) అనే యువకుడు పాముకాటుకు గురై మృతిచెందాడు. బుధవారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి వరి నాట్లు వేసి తిరిగి ఇంటికి వచ్చి భోజనాలు చేసి నిద్రపోయారు. కొంత సమయం తర్వాత విషసర్పం కృష్ణను కాటు వేసింది. నొప్పి రావడంతో మెలకువ వచ్చి చూడగా పాము కాటు వేసి రంధ్రంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి కృష్ణను కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ గురువారం వేకువజామున మృతిచెందాడు. భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామా ఆమోదం భువనేశ్వర్: 2013 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు నిరభ్యంతర పత్రాన్ని పంపింది. వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆయన అఖిల భారత సర్వీసులకు రాజీనామా సమర్పించారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సుమారు 3 నెలల క్రితమే తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ విషయం జూలై నెలలో వెలుగులోకి వచ్చింది. భువనేశ్వర్ డీసీపీగా నియమితులు కాకముందు జగ్మోహన్ మీనా మల్కన్‌గిరి, అంగుల్, గంజాం జిల్లాలకు ఎస్పీగా, కటక్ నగర డీసీపీగా పని చేశారు. ఐపీఎస్‌లో చేరడానికి ముందు ఆయన ఐఐటీ కాన్పూర్ నుండి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. ఘనంగా రాధాగోపాలుని ఊయల యాత్ర పర్లాకిమిడి: స్థానిక జగన్నాథమందిరం వద్ద రామస్వామి మందిరంలో రాధాగోపాలునికి ఝులానా యాత్ర ఉత్సవం గురువారం నిర్వహించారు. రాధాగోపాలునికి సువాసన వెదజల్లే పుష్పాలతో అలంకరించి ఊయల సేవ చేపట్టారు. అధిక సంఖ్యలు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నేరడి ప్రాజెక్టుతో కాశీనగర్ గ్రామాలకు ముప్పు పర్లాకిమిడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తూరు మండలం నేరడి వద్ద వంశధార నదిపై రిజర్వాయరు నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో కాశీనగర్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో బూదర, వన్న, గౌరి, కాశీనగర్ ప్రాంతంలో 106 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమవ్వడంతో కాశీనగర్ రైతులు పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహితో గురువారం సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గజపతి జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ తదితరులు హాజరయ్యారు. నేరడి ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే 15 గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి భరోసా ఇచ్చారు. కాశీనగర్ ప్రాంత వాసుల హక్కులు కాపాడటానికి అవసరమైతే అందోళనలు చేపడతామని జెడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు చెప్పారు. శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఉ మెన్స్ కాలేజ్ రోడ్డులో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద సాయంత్రం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసు లు మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీ సమ్మె చేస్తామని, సమస్యలు పరిష్కారం కాకపోతే సె ప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజులు సమ్మె చేస్తామని, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. -
8 మందిపై పిచ్చికుక్క దాడి
రాయగడ: జిల్లాలోని మునిగుడలో వీధికుక్క భీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా రెచ్చిపోయి 8 మందిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రధానంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులపై ఈ కుక్క దాడి చేయడంతో తల్లిదండ్రుల్లో కలకలం రేగింది. మునిగుడ బస్టాండ్ సమీపంలోని త్రికొణియా కూడలి వద్ద శిశు మందిర్‌కు వెళ్తున్న రెండో తరగతి విద్యార్థి సందీప్ కరకరియా, ఎనిమిదో తరగతి చదువుతున్న సచ్చితానంద బెహరలపై వీధి కుక్క దాడి చేసి కరిచింది. గాయాలకు గురైన వారిని హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మునిఖొల్కు చెందిన యాకేసిన కాందరి అనే వృద్ధుడితో పాటు రథ్ హియాల్, తదుపరి మరో నలుగురిపై దాడి చేసింది. కుక్కదాడిలో గాయపడిన మొత్తం 8 మందిని మునిగుడ సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుని వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
గూడ్స్ రైలులో సరుకుల చోరీకి బ్రేక్
రాయగడ : గూడ్స్ రైళ్ల నుంచి కొంతకాలంగా జరుగుతున్న సరుకుల చోరీకి అంబొదల పోలీసులు బ్రేక్ వేశారు. ఇచ్చాపురం, అంబొదళ ప్రాంతంలో గూడ్స్ రైళ్ల నుంచి బియ్యం బస్తాలను దించుతున్న దుండగులను పోలీసులు గుర్తించి దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు 150 బియ్యం బస్తాలు, 10 సైకిళ్లను విడిచి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు చాలా కాలంగా గూడ్స్ రైళ్ల బోగీల నుంచి బియ్యం, చక్కెర, గోధుమలు, సిమెంట్, ఎరువులు తదితర వస్తువులను చోరీ చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాత్రి అంబొదల పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్‌కుమార్ ప్రధాన్ సిబ్బందితో కలిసి ఇచ్ఛాపురం ప్రాంతంలో పెట్రొలింగ్ నిర్వహించారు. ఇఛ్చాపురం పంచాయతీ గడియాజోల గ్రామ సమీపంలో రైల్వే పట్టాల వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి కొందరు వ్యక్తులు బియ్యం బస్తాలను కిందకు దించుతుండటం గమనించి దాడులు నిర్వహించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను టిట్టాఘడ్ రైల్వే పోలీసులకు అప్పగించారు. -
కత్తులతో బెదిరించారు.. 30 పందులను ఎత్తుకెళ్లారు
రాయగడ: పందుల ఫారంలోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తు తెలియని దుండగులు కత్తులతో బెదిరించి ఫారం నిర్వాహకుడిపై దాడిచేసి అతడిని కట్టివేసి పందులను పికప్ వ్యాన్ లో ఎత్తుకెళ్లిన ఘటనను జార్సుగుడ జరగగా.. జిల్లా బ్రజరాజ్ నగర్ పోలీసులు కేసును ఛేదించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 10 పందులు, నేరానికి వినియోగించిన ఆయుధాలు, బాధితుడి మొబైల్ ఫోన్, పికప్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఝార్సుగుడ ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర మీడియాకు విడుదల చేసిన వివరాల ప్రకారం పూర్వాపురాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బరకాండియా ప్రాంతానికి చెందిన ఆయోధ్యా రొహిదాస్ అనే వ్యక్తి గత 5 నెలలుగా పందుల ఫారం నిర్వహిస్తు జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 24,25 తేదీల మధ్య అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పందుల ఫారంలోకి చొరబడి మరణాయుధాలతో రొహిదాస్ అనే వ్యక్తిని బెదిరించి దాడి చేశారు. అనంతరం అతడు ధరించే దుస్తులను విప్పి అతడిని కట్టివేసి ఫారంలో ఉన్న 30 పందులను బలవంతంగా పికప్ వ్యాన్‌లో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘనలో బాధితుడి బొటల వేనికి గాయమైంది. విషయం ఎవరికై నా చెబితే ప్రాణాలు తీస్తామని దుండగులు బెదించారు. అంతే కాకుండా బాధితుడి మొబైల్ ఫోన్‌ను లాక్కుని, సిమ్ కార్డును తొలగించి దూరంగా పారవేశారు. ఈ విషయమై బాధితుడు బ్రజరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ రాఘవేంద్ర ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసుకు సంబంధించి సాహిల్ ఓరం, సునీల్ అలియాస్ కాళీ కలేట్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 10 పందులు, మరణాయుధాలు, పికప్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నోటి ట్యూమర్‌కు విజయవంతంగా చికిత్స
రాయగడ: నోటి కేన్సర్‌తో బాధ పడుతున్న ఆదివాసీ యువతికి ఏడేళ్లుగా పెరుగుతూ వచ్చిన ట్యూమర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం కటక్‌లోని శాంతి మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో ఈ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాయగడ సదరు సమితి హలువా గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి గౌతమీ జకక సుమారు ఏడేళ్లుగా నోటి కేన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తొలుత రాయగడ జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న ఆమె అనంతరం ఇంటికి వెళ్లి సంప్రదాయ వైద్యం తీసుకున్నట్లు సమాచారం. అయితే కాలక్రమేణా నోటిలోని ట్యూమర్ పరిమాణం పెరుగుతూ వచ్చింది. పరిస్ధితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు, బయాప్సి పరీక్షలు నిర్వహించగా నోటి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆస్పత్రిలో ఈ స్థాయి శస్త్రచికిత్సకు అవసరమైన పూర్తి సదుపాయాలు అందుబాటులో లేకపొవడంతో గౌతమిని కటక్‌లోని కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించే వైద్య బృందంలో రాయగడ జిల్లా ప్రధాన ఆస్పత్రి దంత, ముఖ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కూడా భాగస్వామిగా ఉన్నారు. గత ఆదివారం వైద్య బృందం గౌతమికి క్లిష్టమైన నోటి క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఆపరేషన్ అనంతరం ఆమెను మూడు రోజుల పాటు ఐసీయులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. గౌతమికి సంబంధించిన కేన్సర్ చికిత్స మొత్తాన్ని ఆయుష్మాన్ పథకం కింద నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు స్వయంగా ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో పాల్గొనడం, పేద కుటుంబానికి ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా చికిత్స అందడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ హీరా చంద్ పట్నాయక్ కు అభినందించినట్లు సమాచారం. -
హొటళ్లు, బేకరీలపై దాడులు
జయపురం: జయపురం ఆహార భద్రతా విభాగం, మున్సిపాలిటీ హెల్త్ సిబ్బంది సంయుక్తంగా మిఠాయి దుకాణాలు, హొటళ్లు, బేకరీ దుకాణాలపై గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణ ప్రధాన మార్గంలో ఉన్న ఓం ప్రకాశ్ స్వీట్స్ దుకాణం, ఓం ప్రకాస్వీట్స్ తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తనిఖీ చేసి మిఠాయి తయారుకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. అక్కడ పరిశుభ్రత, మిఠాయిల నాణ్యతలను పరిశీలించారు. అనంతరం వారు పట్టణంలో గల పలు మిఠాయి దుకాణాలను, బేకరీ దుకాణాలను, హొటళ్లను తనిఖీ చేసి ఆహార పదార్థాలు పరిశీలించారు. కొన్ని హొటళ్లలో అపరిశుభ్రత గుర్తించి నోటీసులు జారీ చేశారు. పదార్థాల తయారీకి వినియోగిస్తున్న వస్తువులను పరీక్షలకు పంపించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని ఆహార సురక్షా అధికారి పంకజనీ బెహరా వెల్లడించారు. రూ.15వేల వరకు జరిమానాలు వసూలు చేశామని తెలిపారు. దాడుల్లో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిణి పూజ రౌత్ ఆదేశం మేరకు హెల్త్ సిబ్బంది భవానీ హల్వ, సత్యనారాయణ పాత్రో, జగదీష్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రక్షా బంధన్
జయపురం: జయపురం సూర్యమహల్ ప్రాంగణంలో కేశవ ప్రభాత్ శాఖ జయపురం శాఖ గురువారం పవిత్ర రక్షా బంధన వేడుకలు ఘనంగా జరిపింది. ముందుగా పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హేమంత భాయ్ పాల్గొని రక్షాబంధన్ పై ప్రసంగించారు. అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదర భావం, ప్రేమ, ఐక్యత సామాజక సద్భావన సందేశాలను అందించారు. ఐదుగురు మైనర్లకు విముక్తి పర్లాకిమిడి: గజపతి జిల్లా నుంచి ఐదుగురు బాలికలను తరలించిన నిందితుడిని ఆర్.ఉదయగిరి, అడవ పోలీసు స్టేషన్ అధికారులు అరెస్టు చేసి బాలికలకు విముక్తి కల్పించారు. బాలికలను తిరిగి అడవ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. మోహనా బ్లాక్ అడవ పోలీసు స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు, ఇన్స్పెక్టర్ సంతోష్ బిశోయి తదితరులు పాల్గొన్నారు. మైనర్ బాలికలను ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభ పెట్టి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు తీసుకెళ్లడంతో గరడమా సర్పంచు ఈనెల 17 అడవపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేసి హైదరాబాద్ వెళ్లి బాలికలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేసినట్టు విలేకరుల సమావేశంలో ఎస్డీపీఓ రాకేష్ సాహు తెలిపారు. రూ.10 కోట్ల విలువైన గంజాయి పట్టివేత మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగురుకొండ పంచాయతీ సమీప అడవిలో బుధవారం రాత్రి కలిమెల పోలీసులు 1025 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిపై పోలీసులకు సమాచారం అందడంతో.. కలిమెల ఐఐసీ ప్రభుదత్తు తన సిబ్బందితో అడవిపై దాడి చేయగా పోలీసుల రాకను గమనించిన మాఫియా గంజాయి బస్తాలు వదిలి పరారైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని కలిమెల స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ సమక్షంలో తూకం వేయగా 1025 కిలోలు ఉంది. దీని విలువ రూ.10కోట్లు వరుకు ఉంటుంది. సబ్సిడీ ఎరువుల కోసం ఇబ్బందులు పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్ఏసీ(నగరపాలక సంస్థ)లో ప్రాథమిక వ్యవసాయ కో–ఆపరేటివ్ సొసైటీలో ఎరువుల బస్తాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల గడువు చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ కాగా.. ఇప్పటివరకు 474 మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకోగలిగారు. సొసైటీలో ఇంటర్నెట్ సేవలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక మంది రైతులు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో బీజేపీ కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ పాలో డీఆర్‌సీఎస్ హరిహర శెఠికి ఫోన్‌చేసి రైతుల సమస్యలను తెలియజేశారు. గడువులోగా రైతుల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కోరారు. -
బిసంకటక్‌లో 230 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. అక్రమంగా పికప్ వ్యాన్‌లో తరలిస్తున్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సమారు రూ.12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. రాయగడ నుంచి చత్తీస్‌గఢ్ ప్రాంతానికి జగదల్పూర్ మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. బిసంకటక్ సమీపంలో ఒక పికప్ వ్యాన్ వస్తుండటం గమనించి దాన్ని ఆపి తనిఖీ చేసారు. అందులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరేంద్ర సింగ్, కొరాపుట్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రాంతానికి చెందిన సమీర్ దాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ–ఎస్‌ఆర్‌తోనే సరి.. పని ఎలా మరి?
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసుకోవాలని ఆదేశా లు జారీ చేయడం వారికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. రోజుకో కొత్త పని అప్పజెబుతుండ డంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని, యాప్‌లతోనే సమయం సరిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ–ఎస్ఆర్ ప్రక్రియలో తొలుత నిధి లాగిన్‌లో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సర్వీసు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈ కేవైసీ ద్వారా నిర్ధారించుకుంటేనే మిగిలిన వివరాలు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. డీడీఓకు ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీక రించాలి. డీడీఓ కన్ఫర్మేషన్ పూర్తి చేస్తేనే కుటుంబ సభ్యుల వివరాలు వ్యక్తిగత సర్వీసు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఉద్యోగు లు అంటున్నారు. ఇది కొంత మంది ఉద్యోగ ఉపా ధ్యాయులకు ఇబ్బంది కలిగించే అంశమని చెబుతు న్నారు. జీవిత భాగస్వామితో విడాకులు తీసుకు న్నా, మరే కారణాలతో అయినా దూరంగా ఉన్నా ఈ వివరాలు నమోదు చేయడం కష్టతరం. అలాగే జీవిత భాగస్వామి మృతి చెందితే కూడా కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగితోపాటు డీడీఓ కూడా పని భారం అనే చెప్పాలి. వివాహ వివరాలు నమోదు చేయడం కష్టమే ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు తన వివాహానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది నమోదు చేయడం కష్టం కాకపోయినప్పటికీ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫోటోలు, మరికొన్ని ఆధారాలను పొందుపరచాల ని ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయా వర్గాలు తప్పుపడుతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చాలామంది 30, 40 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లి ఫొటోలు ఏ విధంగా తీసుకురాగలుగుతారని ఉద్యోగ ఉపాధ్యాయు లు ప్రశ్నిస్తున్నారు. అలాగే వివాహానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా అడుగుతున్నారని కొందరు చెబుతుండగా, గతంలో వివాహ రిజిస్ట్రేషన్ ను ఏ ఒక్కరూ చేయించుకునేవారు కాదు. ఇటీవల కాలంలోనే రిజిస్ట్రేషన్ పై పలువురు శ్రద్ధ చూపిస్తున్నారు. అలాంటిది ఎప్పుడో వివాహమైన వారిని ఇలాంటి ఆధారాలను పొందుపర్చాలని కోరడాన్ని తప్పుపడుతున్నారు. ఇందులో కూడా విడాకులు తీసుకున్న వారు వితంతువులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, దీనిపై ఏం చేయాలో కూడా అర్థం కాక మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఎస్ ఆర్ విధానాన్ని తీసుకువచ్చారని అప్పట్లోనే తామంతా ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కొత్త కొత్త నిబంధనలను తెచ్చి దాన్ని అప్డేట్ చేసుకోవాలని చెప్పడం సరైన విధానం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
మావోయిస్టుల డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: మత్తిలి సమితి పరిధిలోని కిర్మిట్ల సమీప అడవిలో డీవీఫ్ జవాన్లు బుధవారం కూంబింగ్ నిర్వహించారు. గురువారం ఉదయం తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 3 తుపాకీలు, 6 ఐఈడీలు, క్లెమెరో మైన్లు, కరెంటు వైర్లు ఉన్నాయి. ఇందులో వీటిని ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట ప్రదర్శించారు. నిపుణులైన డాక్టర్లను నియమించాలి జయపురం: స్థానిక పూల్బెడ గ్రామ ప్రాంతంలోని జిల్లాకేంద్ర ఆస్పత్రిలో నిపుణులైన డాక్టర్లను నియమించాలని జయపురం సచేతన నాగరిక కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం సచేతన నాగరిక కమిటీ సభ్యులు అభిమన్య భొటమిశ్ర, తుషార్ మిశ్ర, సనాతన పురోహిత్, సంజీవ కుమార్ సాహు, సుధామ్ మహరాణ తదితరులు జిల్లా ప్రధాన వైద్యాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆస్పత్రిలోని ముఖ్యమైన వ్యాధుల విభాగాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందన్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక ‘న్యాయవాద రక్షణ చట్టం’ తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారా వు డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాకుళం నగరంలో జిల్లా బార్ అసోసియేషన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు రోజులు విధుల బహిష్కరణలో భాగంగా గురువారం విధు లు బహిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరినా ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించి ప్రత్యేక చట్టాలు అమలులోకి తీసుకువ చ్చారని తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. -
పురపాలక జట్టుపై మీడియా గ్రూప్ విజయం
● స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్పర్లాకిమిడి: స్థానిక శ్రీక్రిష్ణ చంద్రగజపతి కళాశాల మైదానంలో ఈనెల 31న స్థానిక సంస్థల స్వపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ బుధవారం ఉత్సాహంగా జరిగింది. మీడియా మిత్రులు, పురపాలక సిబ్బందితో తలపడ్డారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి విచ్చేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. తొలుత టాస్ గెలిచిన పురపాలక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పురపాలక జట్టులో జిల్లా ఎస్పీ ప్రహ్లద్ సహాయ్ మీనా, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ట్రయల్ ఆడారు. ఆనంతరం పురపాలక జట్టు తరఫున తొలి బ్యాట్స్‌మెన్స్‌గా మైదానంలోకి ఉత్సాహంగా అడుగుపెట్టి 14 పరుగులు తీసి క్యాచ్ అవుట్ అయ్యారు. మొత్తం తొమ్మిది ఓవర్లలో 10 వికెట్లు పోగొట్టుకుని 88 పరుగులు తీశారు. మున్సిపల్ జట్టుకు దీటుగా మీడియా జట్టు తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు తీసి విజయం సాధించారు. మీడియా జట్టులో జ్ఞాన్రంజన్ షడంగి 50 పరుగులు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. పురపాలక జట్టు వచ్చే ఏడాది ఇంకొంచెం మెరుగైన ఆటను ప్రదర్శించాలని జిల్లా ఎస్పీ మీనా ఈ సందద్భంగా అన్నారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌కు మీడియా జట్టు కెప్టెన్‌గా జితేంద్ర పట్నాయిక్, వైస్ కెప్టెన్‌గా జ్ఞాన్ రంజన్ షడంగి, పురపాలక జట్టుకు కెప్టెన్‌గా లెంకమధు, బాలక్రిష్ణ పాత్రో, అంపైర్లుగా రాజీవ్ పాఢి, శుభం రౌత్‌లు వ్యవహారించారు. విజేతలకు ఈ నెల 31వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా బహుమతులను ప్రదానం చేయనున్నారు.


