సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు

Feb 13 2026 5:25 AM | Updated on Feb 13 2026 5:25 AM

సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు

సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు

బీఎస్పీ నాయకుల ఆరోపణ

రాయగడ: రాయగడ వంటి వెనుకబడిన జిల్లాలో సమస్యలు తిష్టవేసినప్పటికీ ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం విచారకరమని బహుజన్‌ సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్ర టకిరి అన్నారు. స్థానిక హోటల్‌ తేజస్వీలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యధికశాతం మంది ఆదివాసీ, హరిజనులు నివసిస్తున్న జిల్లాలో తాగునీటి సమస్య ప్రతీ గ్రామంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. జిల్లాలో 18 మేగా తాగునీటి ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉండగా.. ఇందులో ఒకటి మాత్రమే పనిచేస్తుందని వివరించారు. 2024వ ఏడాది నాటికి మేగా తాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేవిధంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినప్పటికీ వాటి దాఖలాలే కరువయ్యాయని అన్నారు. జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలతో పాటు కొరాపుట్‌ ఎంపీ స్థానంలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ ఏనాడుకూడా జిల్లా లొ ఉన్న సమస్యలకు సంబంధించి అసెంబ్లీ, లోక్‌సభలో ప్రస్తావించలేదని ఆరొపించారు. ఇదిలాఉండగా జిల్లాలొని నియమగిరి పర్వత ప్రాంతాల్లొ ఉన్న డొంగిరియా ప్రజల ఆర్ధిక,సామాజిక రంగాల అభివృధ్దిని దృష్టిలొ పెట్టుకుని ఒపిలిపి సంస్థను ఏర్పాటు చేశారని అయితే దాని కాలపరిమిత పూర్తవ్వడంతో సంస్థను మూసివేశారని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జాడలు కనుమరుగవుతున్నాయని అన్నారు. అదేవిధంగా గత బిజేడి ప్రభుత్వం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్పిల్‌ (ఎస్‌డీసీ )ని ఏర్పాటు చేసిందని ఆ ప్రభుత్వం పరాజయం పాలవ్వడంతో ప్రస్తుతం గల బీజేపీ ప్రభుత్వం దాని ఊసే తీసుకురావడం లేదని అన్నారు. ప్రత్యేకంగా ఆదివాసీల అభివృద్ధి కోసం ఆవిర్భవించిన సంస్థను పునహా ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మనోరేగ పథకంలో గాంధీ పేరును తొలగించిన విషయమై కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ఆ పేరు గురించి ఆందోళనలు చేస్తున్నారే తప్పా ప్రజలకు అవసరమ్యే సమస్యల గురించి పట్టించుకోకపొవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు శూన్యం

జిల్లాలో ఇండాల్‌, ఇంఫా, జేకేపేపర్‌ మిల్‌, వేదాంత్‌ , ఉత్కల అలూమిన వంటి బృహత్తర పరిశ్రమలు ఉన్నా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకపొవడంతో వారు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని బీఎస్పీ రాష్ట్ర శాఖ సాధారణ కార్యదర్శి గంగాధర్‌ పువ్వల అన్నారు. పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న నిరుద్యోగ యవతీ, యువ కులు అక్కడ నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయమైన ప్రజా ప్రతినిధులు పట్టించుకొకపొవడం , ప్రస్తావించకపొవడం ప్రజలు చేసుకున్న దుర్భాగ్యమని అన్నారు. సమావేశంలొ ఆ పార్టీ రాష్ట్ర శాఖ కన్వినర్‌ జితు జకసిక, జిల్లా పరివేక్షకులు రామ్‌దాస్‌ టకిరి, జిల్లా ఉపాధ్యాక్షులు జగం బెనియాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement