breaking news
Odisha News
-
అదృష్టం వరించేనా..!
● నేడు ఐపీఎల్–19 మినీ అక్షన్ ● జిల్లా నుంచి రేసులో ఎస్డీఎన్వీ ప్రసాద్ త్రిపురాన విజయ్ఎస్డీఎన్వీ ప్రసాద్ శ్రీకాకుళం న్యూకాలనీ: భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకసారైనా ఐపీఎల్‌కు ఎంపికై తే చాలని సగటు క్రికెటర్ కలగంటాడు. ఐపీఎల్‌కు ఎంపికై తే వారి దశ, దిశ తిరిగిపోవడం ఖాయం. ఇందుకు భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం ఆడుతున్న పలువురు క్రికెటర్లే నిలువెత్తు సాక్ష్యం. 2026 మార్చి నుంచి మే నెలల్లో జరగనున్న ఐపీఎల్ సీజన్–19కు మినీ వేలం మంగళవారం యూఏఈలోని అబుదాబి వేదికగా షురూ కానుంది. వివిధ ప్రాంచైజీలు వేలంలో క్రీడాకారులను కొనుగోలు చేసే ప్రక్రియ జరగనుంది. ఈ వేలంలో జిల్లాకు చెందిన సింగుపురం దుర్గా నాగవర(ఎస్డీఎన్వీ) ప్రసాద్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ రేసులో ఉన్న యువ క్రికెటర్ జలుమూరు చెందిన సింగుపురం దుర్గా నాగ వర (ఎస్డీఎన్వీ)ప్రసాద్. గత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అనంతరం జరిగిన కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీ, టీ–20 టోర్నీ అనేక టోర్నీల్లో విశేషంగా రాణిస్తూ వచ్చాడు. ఏపీఎల్ సీజన్–4లో అమరావతి రాయల్స్ జట్టుకు రికార్డు స్థాయిలో రూ. 9.50 లక్షలకు అమ్ముడయ్యాడు. తాజాగా బీసీసీఐ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ సీనియర్స్ టీ–20 క్రికెట్ టోర్నీలో కీపర్ కమ్ బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్ షార్ట్ లిస్టులో ఉండడంతో ఎంట్రీ దొరుకుతుందని భావిస్తున్నాడు. జలుమూరు పోలీస్‌స్టేషన్ వీధిలో నివాసం ఉంటున్న ఎస్డీఎన్వీ ప్రసాద్.. తండ్రి సింగుపురం ఉపేంద్రం కారు డ్రైవర్‌గా పనిచేస్తు 2019లో అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి రేవతి జలుమూరు ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్–18లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి జాక్‌పాట్ కొట్డాడు త్రిపురాన విజయ్. శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ 23 ఏళ్ల కుర్రాడిని గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ లెవన్‌లో చోటు దక్కనప్పటికీ.. పలు మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలో అలరించాడు. ఐపీఎల్ అనంతరం ఈ ఏడాది అనేక రంజీ మ్యాచ్‌ల్లో అటు రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్లోను మెరిశాడు. ఈ ఏడాది జూలైలో జరిగిన ఏపీఎల్ 4వ సీజన్లో రాణించాడు. విజయ్ను రూ.7.55 లక్షలకు వైజాగ్ లయన్స్ కొనుగోలు చేసింది. టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి త్రిపురాన వెంకటకృష్ణరాజు సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. ఈ సీజన్లో విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి రిటైన్ చేసుకుంది. -
తీర్థ యాత్రకు బయలుదేరిన సీనియర్ సిటిజన్లు
జయపురం: సీనియర్ సిటిజన్ల తీర్థ యాత్రల పథకంలో భాగంగా జయపురం పట్టణం నుంచి 15 మందిని పంపుతున్నారు. వీరు తమిళనాడు రాష్ట్రం రామేశ్వర్‌కు సోమవారం బయలుదేరారు. వీరికి జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి వారికి వీడ్కోలు పలికారు. తీర్థ యాత్రల కు జయపురం నుంచి బయలు దేరిన వారిలో నలుగురు పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు. ఒక ప్రత్యేక వాహనంలో వీరు కొరాపుట్ మీదుగా రాయగడకు బయలుదేరివెళ్లారు. వీరందరికీ అవస రమైన పత్రాలు సమకూర్చారు. వీరు రాయగడలో ట్రైన్ ఎక్కి దక్షిణ భారత దేశ యాత్రకు బయలుదేరారని అధికారులు వెల్లడించారు. వీరు తమిళనాడులో రామేశ్వర్, మధురై, తదితర పుణ్యక్షేత్రాలను దర్శిస్తారన్నారు. -
ప్రావీణ్యం సంపాదించాలి
సారవకోట: నూతన గృహోపకరణాల తయారీలో కార్మికులు మరింత ప్రావీణ్యం సంపాదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండలంలోని బుడితి గ్రామానికి చెందిన కంచు, ఇత్తడి కార్మికులు తయారు చేసిన నూతన గృహోపకరణాలను సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు అందజేశారు. కంచు, ఇత్తడి కార్మికులకు ఇటీవల లేపాక్షి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వగా, వారిచ్చిన శిక్షణలో సూచించిన వస్తువులు తయారు చేశారు. లేపాక్షి ద్వారా వాటిని విక్రయించేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు శ్రీకాకుళం క్రైమ్: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలో అభ్యుదయ సైకిల్ యాత్ర మంగళవారం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్రలో ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు అత్యధికంగా పాల్గొనాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. యాత్ర అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగ అవగాహన సభ జరుగుతుందన్నారు. యాత్ర సాగే మార్గం సింహద్వారం – ఎర్రంనాయుడు ఆర్చి కూడలి – డే అండ్ నైట్ కూడలి – రామలక్ష్మణ కూడలి – సూర్యమహల్ కూడలి – జీటీ రోడ్డు – ఏడురోడ్ల కూడలి చోరీలు చేసిన వ్యక్తి అరెస్టు పొందూరు: మండల కేంద్రంలోని గాంధీనగర్–1, 2 వీధుల్లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనాలకు సంబంధించి దొంగను ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జరజాపుపేటకు చెందిన అవనాపు అప్పలస్వామి పొందూరు బస్టాండ్‌లో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. పొందూరులో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలిందని, గాంధీనగర్ వీధుల్లో దొంగతనాలు చేసిన వ్యక్తిగా గుర్తించామని ఎస్ఐ సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో దొంగతనం చేసిన సొత్తును అప్పలస్వామి నుంచి రికవరీ చేసినట్లు తెలిపారు. ఒక కేసుకు సంబంధించి అరతులం బంగారం, వెండి, రెండో కేసుకు సంబంధించి 30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. పొందూరు కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. పంచ్ అందిరింది శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో శ్రీకాకుళం పంచ్ అదిరింది. ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా 9వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి సీనియర్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్–2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, మూడు రజత, మరో మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి శభాష్ అనిపించారు. అలాగే రాష్ట్ర ఛాంపియన్షిప్ రన్నరప్ టైటిల్‌ను సాధించారు. బంగారు పతకం సాధించిన పి.విశ్వేశ్వరరావు ఆలిండియా సీనియర్స్ నేషనల్ బా క్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా క్రీడాకారుల రాణింపునకు ప్రధాన కారణం డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అని జిల్లా బాక్సింగ్ సంఘ పెద్దలు కొనియాడారు. క్రీడాకారులు ఉన్నతమైన రాణింపునకు కోచ్ అందిస్తున్న కఠోర శిక్షణే కారణమని డీఎస్డీవో ఎ.మహేష్‌బాబు, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్ (అను), వంగా మహేష్ పేర్కొన్నారు. -
ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకోవాలి
జయపురం: ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలు, కళలను కాపాడుకోవాలని వక్తలు అన్నారు. వీటి కోసం ఉద్యమిస్తున్న తరుణ ప్రజ్ఞాభారతి సంస్థ కార్యక్రమాలు కొనియాడ దగ్గవని స్థానిక విక్రమదే వ్ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అన్నారు. ఆదివారం రాత్రి జయనగర్ గ్రామంలోని సంఘం కళ్యాణ మండపంలో జరిగిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి 37వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షులు తపన్ కిరన్ త్రిపాఠీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తరుణ ప్రజ్ఞాభారతి వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ గంగాధర నందో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐదు ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీ ల్లో విజేలకు ముఖ్యఅతిథి డాక్టర్ దేవీప్రసాద్ మిశ్ర తో పాటు గౌరవ అతిథి బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చందనకుమార్ నాయిక్, సమాజ సేవక్ ప్రకాశ్ చంద్రనాయిక్, పతాంజలీ యోగాపీఠ రాష్ట్ర సహాయ ప్రహారీ జానకీ పాణిగ్రహిలు బహుమతులు అందజేశారు. ప్రజ్ఞాభారతి కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్ సంస్థ నివేదికను సమర్పించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను నిర్వా హకులు దుశ్శాలువలతో సత్కరించి గౌరవించాుర. ప్రఖ్యాత నేత్ర వైద్యులు డాక్టర్ డి.హరికృష్ణ, సంధ్యారాణి దంపతులను డాక్టర్ గంగాధర నందో ఆదర్శ దంపతులు సత్కరించారు. అలాగే వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని కూడా సత్కరించి గౌరవించారు. సభ్యులు సబిత శతపతి, లిపిక దొలాయ్, ఉపాధ్యక్షులు రామశంకర షొడంగి, క్షేత్ర మోహణ నాయిక్, న్యాయ సలహాదారు జి.మహేష్, జగన్నాథ్ పాణిగ్రహి, కృష్ణకేశవ షొడంగి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. -
మొక్కజొన్నపై మక్కువ..!
● అధిక విస్తీర్ణంలో ఈ ఏడాది సాగు ● ఎరువుల కొరతపై ఆందోళన జలుమూరు: ఆరుతడి పంటల్లో మొక్కజొన్న రైతులకు ప్రధాన పంట. ఈ పంట సాగులో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చు. అందువలన సాగుకు రైతులు అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇదివరకు జిల్లావ్యాప్తంగా అధికంగా లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, పోలాకి, జలుమూరు మండలాల్లో సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి నరసన్నపేట, సారవకోట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, గార, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లోనూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. చాలా వరకూ ఇప్పటికే మొక్కజొన్న వేయగా.. మరికొన్ని మండలాల్లో సైతం ప్రస్తుతం సాగుకు సమయాత్తమవుతున్నారు. ఇప్పటికే ఆయా పొలాలను ట్రాక్టర్, రోటావేటర్తో సిద్ధం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రబీలో 70.319 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయనున్నట్లు అంచనా. యూరియాకు డిమాండ్ గడిచిన ఖరీఫ్‌లో వరిపంటలో యూరియాకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ప్రస్తుత రబీకు కూడా ఇదే దుస్థితి నెలకొందని రైతులు అందోళన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రధాన ఎరువు యూరియా కాగా.. కాంప్లెక్స్ తదితర ఎరువుల అవసరం కూడా ఉంటుంది. ఎకరాకు సుమారు ఎనిమిది నుంచి పది బస్తాలు వరకు ఆయా ఎరువులు తప్పనిసరి. మొదటి దశలో మొక్కజొన్న వేసిన రైతులు యూరియా ఇప్పటికే మొదటి ఎరువుగా వేయడం జరిగింది. ఇక రెండోసారి కోసం లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల తదితర మండలాల్లో ఎరువుల షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు రైతులకు వివిధ రకాల ఎరువులను అంటగడుతున్నారు. దీంతో వాటి అవసరం లేకపోయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు కొందరు ధాన్యం వ్యాపారులు కూడా ఎటువంటి లైసెన్స్ లేకుండా గ్రామాల్లో లారీలతో యూరియా తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. తెగుళ్లపై అప్రమత్తత అవసరం మొక్కజొన్నను లద్దె(కత్తెర) పురుగు ఆశిస్తుంది. ఇది తిరగబడిన వై ఆకారాంలో తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఉదర భాగంలో నల్లటి నాలుగు చుక్కలు చతురుస్ర ఆకారంలో ఉంటుంది. ఈ విధంగా వీటిని గుర్తించవచ్చు. వీటి లార్వాలు పంట ఆకు, కాండను తింటాయి. మొదటి దశలో ఆకు పత్రహరితాన్ని పూర్తిగా తింటాయి. ఆకులు తిన్న అనంతరం కాండం తింటూ పూర్తిగా మొక్క లేకుండా చేస్తాయి. అందువలన వీటిని గుర్తించిన వెంటనే లార్వాను ఏరివేసి నాశనం చేయాలి. పురుగు, గుడ్ల సముదాయాన్ని గుర్తించి వెంటనే వేప సంబంధిత మందులు వాడుకోవాలి. ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరి ఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు, క్విన్లాల్ ఫాస్ 2.0 మిల్లీ లీటర్ల మందు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎక్కువగా ఉన్నప్పుడు ఎమాక్సిన్ బెంజొయట్ 0.4 గ్రామాలు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అలాగే విషపు ఎరలతో కూడా తెగుళ్లను నివారించుకోవచ్చు. మొక్కజొన్న పంట మొక్క దశ నుంచి పంట ఏపుగా పెరిగే వరకు కత్తెర పురుగు తీవ్రత ఉంటుంది. పంటను ఒకటి రెండు రాత్రుల్లోనే పూర్తిగా తినేసేవిధంగా వ్యాప్తి చెందుతుంది. ఇదే సమయంలో రైతులు ఆప్రమత్తంగా ఉంటే వీటి దాడి నుంచి పంటను రక్షించుకోగలము. అలాగే ఒకే ఏరియాలో సుమారు 10 నుంచి 15 ఎకరాల వరకు సాగు చేస్తే పంట నష్టం తగ్గించడం సులభమవుతుంది. – కింజరాపు రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి, జలుమూరు -
సెంచూరియన్ విద్యార్థి ప్రతిభ
పర్లాకిమిడి: స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎన్.కుమార్ భరద్వాజ్ ప్రతిష్టాత్మకమైన 18వ యంగ్ ఆస్ట్రానమర్ టాలెంట్ సెర్చ్ పోటీల్లో 30 మంది ఫైనలిస్టులలో ఎంపికై బహుమతి గెలుచుకున్నాడు. భువనేశ్వర్‌లో జయదేవ్ భవన్లో ఈ నెల 13న రాష్ట్ర ఆహార శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో చేతుల మీదుగా బహు మతి అందుకుఆన్నరు. కుమార్ భరధ్వాజ్‌కు ఇస్రో సంస్థకు చెందిన ఒక కేంద్రాన్ని సందర్శించే అరుదై న అవకాశం లభించనుంది. అంతరిక్ష ఖగోళ శాస్త్రంపై భరద్వాజ్‌కు మరింత ఆసక్తిని పెంపొందించి భవిష్యత్తులో ఆ రంగంలో కేరీర్‌ను ఎంచుకునేందు కు ప్రేరణగా నిలవనున్నట్టు ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి అన్నారు. సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంతీయ అడ్మిషన్స్ డైరెక్టర్ సంబిత్ పాత్రో, ఫ్యాకల్టీ భరధ్వాజ్‌కు అభినందనలు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష పరిధిలో జిల్లాలో పనిచేస్తున్న సీఆర్ఎం టీచర్లు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆత్మగౌరవ దీక్షను సోమవారం నిర్వహించారు. ముందుగా ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా చేరుకొని దీక్షను నిర్వహించారు. ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంపూర్ణ మద్ద తు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫారం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షు డు పోలాకి తవిటినాయుడు, ప్రధాన కార్యదర్శి బి. గిరిధర్, కోశాధికారి ఎన్.ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్సుల్లో ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. 2016లో పీఏబీ ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నారని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని కోరారు. సీఆర్ఎంటీల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి, అందరికీ ఒకే విధమైన హోదా, పనిని కల్పించాలన్నారు. ఫీ ల్డు లెవల్లో పనిచేస్తున్నవారికి అలవెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్‌లో డీఆర్వోకు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, డి. శ్రీనివాసరావు, టి.ప్రసాదరావు, పి.వైకుంఠరావు, జయలక్ష్మి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. -
గుండెలు మండయ్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 వేదిక మీద దూషణ పర్వం అందరినీ విస్తుగొలిపింది. ఆదివారం రాత్రి నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రం సమీపంలో మండయ్ వేదిక మీద 3వ రోజు సాంస్కృతిక ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. వేదిక మీద జిల్లాకు చెందిన ప్రతిపక్ష బీజేడీ డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి ప్రసంగం కొనసాగింది. అకస్మాత్తుగా రంధారి ఆగ్రహవేశాలకు లోనయ్యారు. అదే వేదిక మీద ఉన్న కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ ని నేరుగా ఉద్దేశిస్తూ నిలదీశారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని గుర్తు చేశారు. తనను కలెక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో కలెక్టర్‌ను ఏకవచనంతో సంబోధించారు. జిల్లాలో సుమారు 200 గ్రామాలకు కనెక్టవిటీ లేదని, జిల్లాలో వరి, మొక్కజొన్న రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నారన్నారు. ఈ పరిస్థితి చూసి వేదిక మీద బీజేపికి చెందిన మంత్రులు రబి నాయక్, నిత్యానంద గొండో అవాక్కయ్యారు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల ఆగ్రహావేశాలు బీజేడి ఎమ్మెల్యే రంధారి ప్రసంగం పై ప్రజలలో ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ వేదిక కిందకు దూసుకు వచ్చారు. అప్పటికీ రంధారీ తన విమర్శలు కొనసాగించారు. బీజేపీకి చెందిన కను దాస్, అర్జున్ త్రిపాఠి తదితరులు రంధారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంధారి స్పందిస్తూ తను పులి నని ఇలాంటి నినాదాలకు భయపడనని పదే పదే ఉద్ఘాటించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు రంధారిని పులి కాదని పిల్లి అని కేకలు వేశారు. చివరకు ఈ పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వైపులా బూతు పురాణం ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఇరు వర్గాలను సుమదాయించేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ వేదిక కింద ఉన్న బీజేపీ కార్యకర్తలకు సముదాయించారు. వేదిక మీద ఉన్న రంధారిని అధికారులతో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ పరశురాం మజ్జి, ఇతర నాయకులు సముదాయించి బలవంతంగా తీసుకువెళ్లారు. చివరలో రంధారి మాట్లాడుతూ ఇది బీజేపీ మండయ్ కాదని ప్రజల మండయ్ అంటూ నిష్క్రమించారు. ఇదే వేదిక మీద ఉన్న మంత్రి నిత్యానంద గోండో మాట్లాడుతూ ఎవరూ పులి,పిల్లి కాదన్నారు. అభివృద్ధి మార్గంలో ప్రతిభ చూపి పులి అనిపించుకోవాలని హితవు పలికారు. -
మజ్జి గౌరి మందిరానికి గుర్తింపు తీసుకువస్తాం
రాయగడ: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరానికి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చేలా చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడ అన్నారు. ఆమె సోమవారం రాయగడలో పర్యటించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారని, వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసిందన్నారు. టెండర్లు కూడా పిలిచారని త్వరలోనే పనులు మొదలవుతాయని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి ప్రభాతీ పరిడకు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ రాయసింగి బిడిక, ట్రస్ట్ సభ్యులు తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి, బాబు దళాయి, వడ్దాది శ్రీనివాస్‌రావు, పెద్దీన వాసు, బాబు దళాయి, దేవేంద్ర నాథ్ బెహర, ఇంజనీర్ వెంకట్ తదితరులు ఆమెను సన్మానించి అమ్మవారి ఫొటోను అందజేశారు. -
దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చోయితీ జిల్లాస్థాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీతోత్సవాలను పురస్కరించుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పోటీలను ఉత్సవ కమిటీ సోమవారం నిర్వహించింది. స్థానిక అంబేడ్కర్ కూడలి నుంచి పోటీలను ప్రారంభించారు. జిల్లా సామాజిక సురక్షా అధికారి అనిల్‌కుమార్ పాణిగ్రహి ముఖ్యఅతిథిగా పచ్చజెండా ఊపి పోటీలను ఆరంభించారు. పోటీల్లో మొత్తం 12 మంది పాల్గొనగా నీలకంఠం ప్రథమ, అభిరాం కొరొకొరియా ద్వితీయ, సంజయ్ సేనాపతి తృతీయస్థానంలో నిలిచారు. అలాగే చిరంజీవి పట్రిక, కె.రామారావు, జానకీ సాహులు ప్రోత్సాహక బహుమతులను గెలుచుకున్నారు. జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ విజేతలను అభినందించారు. జిల్లాస్థాయి చొయితీ ఉత్సవ వేదికపై వీరికి బహుమతులు అందజేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు. -
కన్నబిడ్డను బలిచేయబోయిన తల్లి..?
జయపురం: జయపురం ఇరిగేషన్ కాలనీలో ఒక తల్లి తన కన్నకుమార్తెను క్షుద్ర పూజలకు బలి చేయాలని చూసింది. స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని బిడ్డను కాపాడారు. ఆ తల్లి అంబిక ఖోశ్ల ఓ వితంతువు. ఆమె స్థానిక ఇరిగేషన్ కాలనీలోని మారుమూల బస్తీలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో ఉంటోంది. కొన్ని రోజులుగా అంబిక తన ఇంటిలో క్షుద్ర శక్తికి, కాళికా మాతకు పూజలు చేస్తోంది. క్షుద్ర శక్తికి పూజలు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించినా ఆమె వినలేదు. అంబిక మనస్తత్వం మరో విధంగా ఉండటం క్షుద్ర శక్తికి పూజలు చేయటం వల్ల ఆమె జోలికి ఎవరూ వెళ్లేవారు కాదు. అంబిక కాళీమాతకు పూజలు చేస్తుండగా ఆమె కుమార్తె నిఖిత చర్చ్‌కు వెళ్తూ బైబిల్ చదువుతుండేది. దీంతో ఆమె కుమార్తెను తీవ్రంగా వ్యతిరేకించేది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ ఇంటి నుంచి కుమార్తె అరుపులు వినిపించాయి. అరుపులు విన్న ఆ వీధి వారు ఇంటికి వెళ్లి చూడగా నిఖిత అచేతనంగా పడి ఉంది. కాళ్లు చేతులు కట్టి ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాగా నిఖితను పోలీసులకు అప్పగించారు. కుమార్తె చర్చికి వెళ్తోందనే అనుమానంతో ఆమెను బలి చేయాలని అంబిక తలిచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా ఉండే వీధిలో ఆమెను ఉంచడం ప్రమాదకరమని తెలిపారు. అనంతరం పోలీసులు నిఖిత తమ అదుపులో ఉంచుకున్నారు. నిఖితను విచారించాకే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ ఢీకొని 9 జీవాలు మృతి
పర్లాకిమిడి: రాణిపేట రోడ్డులో పవర్ స్టేషన్ వద్ద ఒక ట్రాక్టర్ సోమవారం వేకువ జామున 4.30 గంటలకు విపరీత మంచు కారణంగా రోడ్డుపై మేతకు వెళ్తున్న మేకలపై ఎక్కించడంతో 9 జీవాలు మృతి చెందాయి. పాతపట్నం మండలం గంగువాడ పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన కిర్రాయి ఆనంద్, చిన్ని సోమేష్‌లు తమ యాదవ కుల సంఘానికి ఈ విషయం తెలియజేయడంతో క్రిష్ణ గొల్ల సంఘం అధ్యక్షుడు ఎ.కులవర్ధన రావు సంఘటనా స్థలంకు విచ్చేసి ట్రాక్టరు యజమాని నుంచి రూ. 50వేలు వసూలు చేసి కిర్రాయి ఆనంద్, సోమేష్లకు నష్టపరిహారం కింద అందజేశారు. ఈ ట్రాక్టరు దుర్ఘటనలో రెండు మేకలు, 7 గొర్రెలు మృతి చెందాయి. -
జిరంగో వద్ద ఫైవ్‌స్టార్ హొటల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్ జిరంగో వద్ద టిబెటియన్ల బౌద్ధ మందిరం సమీపంలో టూరిస్టుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి ఇండోనేషియా నుంచి ఎండీ ప్రత్యకాష్ ఆర్కిటెక్ట్, ఎస్టేట్స్ సోమవారం పర్యటించారు. ఇక్కడకు వచ్చే టూరిస్టుల కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి తెలియజేశారు. ఎండీ ప్రత్యకాష్ సబ్ కలెక్టర్ అనుప్ పండా, మోహన తహసీల్దార్‌తో టిబెటియన్ శరణార్థుల గెస్టు హౌస్‌లో బసచేసి అధికారులతో మాట్లాడారు. చంద్రగిరి సమీపంలో ఉన్న జిరంగోలో ఐదు నక్షత్రాల హోటళ్లు నిర్మిస్తే ఈ ప్రాంతం పర్యాటక రంగంలో కొత్త రూపం దాల్చడమే కాకుండా పలువురికి ఉపాధి కలుగుతుందని ప్రత్యకాష్ తెలిపారు. -
పద్మపూర్‌లో ఘనంగా చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌లో సమితి స్థాయి చొయితీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. గుణుపూర్ ఎంఎల్ఏ సత్యజీత్ గొమాంగో ముఖ్యఅతిథిగా ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు బీడీవో కురేష్ చంద్ర జాని, సమితి అధ్యక్షురాలు మణిమాల సబర్‌లు సమీపంలోని ఖమాపదర్ నది జలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ వేదిక వద్ద ఉంచారు. అనంతరం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంఎల్ఏ గొమాంగో మాట్లాడుతూ.. మన ప్రాంత ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించేందుకు ఇలాంటి ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని అన్నారు . దీనితోపాటు ఈ ప్రాంత కళాకారులను ప్రొత్సాహించేందుకు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు వారికి చేదోడుగా నిలుస్తాయన్నారు. వారికి కళారంగంపై మరింత ఆసక్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలు ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. వారిలో దాగిఉన్న ప్రతిభను కనబరిచేందుకు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పత్రికారంగంలొ విశేష సేవలు అందిస్తున్న కొంతమంది పాత్రికేయులు, సమాజ సేవకులను వేదికపై సత్కరించి గౌరవించారు. -
రగ్గుల పంపిణీ
జయపురం: ఒడిశా బలిజి సంఘం జయపురం వారు సోమవారం 40 కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా మాట్లాడుతూ జయపురంలో బలిజిల ఆర్థిక, సామాజిక వికాసమే లక్ష్యంగా సంఘం పని చేస్తుందన్నారు. త్వరలోనే బ్లడ్ గ్రూపింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు రగ్గుల వితరణకు జిసాగడం రంగనాథ్ ట్రస్టు వారు సహకరించినట్లు తెలిపారు. రగ్గుల వితరణ అనంతరం సంఘ నేతల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘ అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నాతో పాటు ఉపాధ్యక్షులు బల్లిడి ఛత్రపతి శివాజీ, పుప్పాల లక్ష్మీ, కార్యదర్శి బరిగెడ శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శులు మహాదాశ్యం నారాయణ రావు, పల్లా తవిటమ్మ తదితరులు పాల్గొన్నారు. పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా బ్లాక్ గులుబ పంచాయతీ కార్యాలయంలో సోమవా రం గ్రామముఖిపరిపాలన, గ్రీవెన్స్‌కు స్పంద న లభించింది. ఈ జాయింట్ గ్రీవెన్స్‌కు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హనగ, జిల్లా పరిష త్ అదనపు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, బీడీఓ రాజీవ్ దాస్, తదితరులు హాజరయ్యారు. గులుబ పంచాయతీ తో సహా డెంగాస్కల్, బిరికోట్, మండిమర, గ్రామ పంచాయతీల నుంచి 146 వినతులు అందాయి. వీటిలో వ్యక్తిగతం 44, గ్రామ సమ స్యలకు సంబంధించినవి 102 ఉన్నాయి. నాలుగు వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కరించారు. ముఖ్యంగా పీఎం ఆవాస్ యోజనా, సామాజిక పింఛన్లు, ఉపాధి పథకంపై అనేక వినతులు అందినట్టు అధికారులు తెలియజేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. పర్లాకిమిడి: ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంచడానికి స్థానిక సరస్వతీ శిశువిద్యామందిర్లో గణితంలో పోటీలను నిర్వహించారు. పోటీలు రామశంకర్ గంతాయత్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. గణితమంటే భయం వీడాలన్నారు. 17 విద్యాలయాల నుంచి 147 విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానం చేస్తామని ప్రధాన అచార్యులు సరోజ్ పండా తెలియజేశారు. రామానుజం మాథమెటిక్స్ క్లబ్ సభ్యులు రమాకాంత పట్నాయక్, మనోజ్‌కుమార్ పండా, హరినాథ పాత్రో, తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
మహేంద్రగిరి, చంద్రగిరిలో రవాణా శాఖ మంత్రి పర్యటన
పర్లాకిమిడి: రాష్ట్ర రవాణా, ఖనిజ శాఖ మంత్రి బిభూతీ జెన్నా గజపతి జిల్లాలోని మహేంద్రగిరి, చంద్రగిరి టిబెటియన్ శరణార్ధుల బౌద్ధ మందిరాన్ని సోమవారం దర్శించుకున్నారు. ఆయన వెంట పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, గంజాం జిల్లా రాజకీయ ప్రతినిధులు ఉన్నారు. తొలుత మంత్రి బిభూతీ జెన్నా మహేంద్రంలో కుంతీ మందిరం వద్ద రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి జిరంగో వద్ద వున్న టిబెటియన్ల బౌద్ధ మందిరాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి బిభూతి జెన్నాను బౌద్ధ మెనాస్ట్రీ గురుజీ ఖెంపో సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి బిభూతీ జెన్నా, గంజాం జిల్లా బీజేపీ ప్రతినిధులకు కండువా, కొమ్ముతో చేసిన జ్ఞాపికలను అందజేశారు. -
సిక్కోలు మాస్టర్స్ అథ్లెట్స్ హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మా మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పతకాలతో సత్తాచాటారు. బాపట్ల వేదికగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు 7వ ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2025 పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి తొమ్మిది మంది వెటరన్ అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించగా 24 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు, తొమ్మిది రజత, పది కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిలో జి.అర్జున్‌రావురెడ్డి (మూడు పతకాలు), జేవీఎస్ జగన్నాథం (మూడు పతకాలు), ఎం.గోవిందరావు (నాలుగు పతకాలు), పి.రామచంద్రరావు (మూడు పతకాలు), బి.జానకిరావు (కాంస్యం), కె.సింహాచలం (కాంస్యం), జి.హైమావతి (మూడు పతకాలు), ఎస్.రమాదేవి (మూడు పతకాలు), ఎ.వాణి (మూడు పతకాలు) ఉన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించడం పట్ల శ్రీకాకుళం మా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆదివారం అభినందించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎండీ కాసంఖాన్, కళావతి, ప్రధాన కార్యదర్శి గాలి అర్జున్రావరెడ్డి మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు. హౌస్ సర్జన్ల నిర్వాకంపై విచారణకు ఆదేశంశ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో అదపాక అలివేలు అనే రోగికి ‘బీ’ పాజిటివ్ రక్తానికి బదులుగా ‘ఓ’ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్ విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న ఆయన శనివారం రాత్రి రిమ్స్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ఘటనపై ఓ కమిటీని నియమించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. -
గురుభక్తిని చాటుకున్న శిష్యుడు
ఎచ్చెర్ల: తనకు డిగ్రీలో ఫిలాసపీ పాఠాలు బోధించిన గురువును గుర్తుంచుకున్న శిష్యుడు తాను రచించిన పుస్తకాన్ని గురువుకు అంకితమిచ్చారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న చీపురుపల్లి మండలం వంగపల్లిపేటకు చెందిన డాక్టర్ కె.హరీష్కిషన్ తాను రాసిన ‘పోర్ట్రయల్ ఆఫ్ విమెన్ ఇన్ ఠాగూర్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని తన గురువు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిలాసపీ డిఫార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.వి.రాజుకు గరివిడిలోని ఆయన నివాసంలో ఆదివారం అంకితం జేశారు. ఈ సందర్భంగా హరీష్కిషన్ మాట్లాడుతూ తనతో పాటు వేలాది మందికి ఉన్నత చదువులకు ప్రేరణ ఇచ్చారని, పరిశోధనకు మార్గదర్శకులుగా వ్యవహరించారని పేర్కొన్నారు. వరి కుప్ప దగ్ధంపై ఆరా మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామమైన కేరాసింగిలో చీడిగుడ్డి గవిరేసు అనే రైతుకు సంబంధించి రెండెకరాల వరికుప్ప కాలిపోయిన ఘటనపై మెళియాపుట్టి ఎస్సై రమేష్‌బాబు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైతుతో మాట్లాడి వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గిరిజన గ్రామాల్లో ప్రజలు కలసిమెలిసి ఉంటారని, ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని అన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో ఇటువంటివి జరిగితే రైతుకు శోకం మిగులుతుందన్నారు. ఇంటర్‌విద్య ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిలా అధ్యక్షుడిగా జొన్న పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గురుగుబెల్లి రేవంత్‌కుమార్, కోశాధికారిగా పొన్నాడ వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడిగా కె.నరేష్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎస్.మధుబాబు, మహిళా కార్యదర్శిగా కె.యశోద, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్.రాజశేఖర్, కార్యవర్గ సభ్యులగా బి.ప్రశాంత్, కె.మనోజ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పారావు, కమలాకర్, ఏపీ ఎన్జీవో సంఘం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు బొత్స శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, పొందూరు తాలూకా సెక్రటరీ నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతతో జీవితం సార్థకం శ్రీకాకుళం కల్చరల్ : మనిషి మనుగడకు భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని విశ్రాంత ఉపాధ్యాయుడు తుమరాడ జగన్నాథశాస్త్రి అన్నారు. నగరంలోని ఉపనిషన్మందిరంలో మానవ జీవితంలో భగవద్గీత అనే అంశంపై ఆదివారం ప్రవచనాలు చెప్పారు. భగవద్గీతలో కర్మ, భక్తి, మోక్ష యోగాల ఆవశ్యకతను వివరించారు. ప్రతి శ్లోకంలో ఐహిక జీవనానికి సంబంధం, సమస్య, సమాధానం తెలిపారు. జ్ఞానోపదేశం, శ్రవణ, మనన వినియోగం వల్ల జీవితం ఏ విధంగా సార్ధకమవుతుందో వివరించారు. అనంతరం వక్తను మందిర సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ కోమలరావు, నరసింహమూర్తి, విశ్వేశ్వరరావు, ఈశ్వరరావు, బాబూరావు, పట్నాయక్, వెంకటరావు, వెంకటరమణ, సూరిబాబు, పద్మావతి, సరస్వతి, అరుణ పాల్గొన్నారు. విద్యార్థిని మృతితో విషాదం శ్రీకాకుళం రూరల్ : సింగుపురం గ్రామానికి చెందిన కొత్తకోట లాస్యశ్రీ (14) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. ఈమె కొన్ని నెలలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూరగాయలు వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. శిబిరాన్నిపురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, సీడీఎంవో డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. రక్తదానం వల్ల ఎంతోమంది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి కాపాడకలుగుతున్నారని, ఇదొక మహోత్తర కార్యక్రమమని చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. శిబిరంలో 54 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు తరలించారు. కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ కుమార్, గజపతి బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు గవర నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు ఎస్.రుషి, సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహరా, కె.శరత్‌కుమార్, క్రాంతి బెహరా, సస్మితా బెహరా పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలంలో పాగా!
● టెక్కలి కాటాబందలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు ● మంత్రికి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన టెక్కలి : టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని కాటాబందలో అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులను స్థానికులు ఆదివారం అడ్డుకున్నారు. ఇటీవల పాత జాతీయ రహదారి నుంచి భవానీనగర్ మీదుగా జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలపై కొంత మంది కన్నుపడింది. ఈ క్రమంలో అయ్యప్పనగర్‌కు వెళ్లే దారిలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. వాస్తవానికి, గతంలో పునాదుల స్థాయిలో ఉన్నప్పుడే అయ్యప్పనగర్‌కు చెందిన స్థానికులంతా ఈ అక్రమ నిర్మాణం విషయమై మంత్రికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిర్మాణాలను ఆపే విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయా అక్రమ నిర్మాణాలు అధికార పార్టీ కార్యకర్తలే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు పట్టణంలో ప్రభుత్వ స్థలాలకు రక్షకుడిగా ఉంటానంటూ మంత్రి బహిరంగ సభల్లో ప్రస్తావిస్తూ, మరో వైపు పట్టణం నడిబొడ్డున ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణానికి ఆనుకుని అయ్యప్పనగర్ రోడ్డు నిర్మాణానికి గతంలో ఇదే మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయా శిలాఫలకాలకు ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిపై మంత్రితో పాటు స్థానిక రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాము తన సిబ్బందితో నిర్మాణ స్థలం వద్దకు చేరుకుని ఆయా పనులు ఆపాలని ఆదేశించారు. అయ్యప్పనగర్‌కు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఆనుకుని అక్రమంగా దుకాణాల నిర్మా ణం చేస్తున్నారు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ రోజు శ్లాబ్ నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యా రు. కాలనీవాసులంతా కలిసి వాటిని అడ్డుకున్నాం. – టి.వైకుంఠరావు, అయ్యప్పనగర్, టెక్కలి కాలనీకు వెళ్లే మార్గంలో దర్జాగా ప్రభుత్వ స్థలంలో అక్రమంగా దుకాణాలు నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. గతంలో మంత్రి అచ్చెన్నాయుడుకూ ఫిర్యాదు చేశాం. అక్రమ నిర్మాణాలు ఆపకపోతే ఊరుకునేది లేదు. – ఎం.హేమసుందర్, అయ్యప్పనగర్, టెక్కలి -
ఉత్సాహంగా మోడరన్ పెంటాథ్లెన్ పోరు
● రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పోటీలకు భారీగా క్రీడాకారులు రాక ● విజేతలకు బహుమతులు ప్రదానంశ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగిన రాష్ట్ర మోడరన్ పెంటాథ్లెన్ పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 69వ ఏపీ రాష్ట్రస్థాయి మోడరన్ పెంటాథ్లెన్ (రన్నింగ్, స్విమ్మింగ్) చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ పోరులో అత్యద్భుతమైన ఆటతీరుతో బాలబాలికలు ఆకట్టుకున్నారు. ● అండర్–17 విభాగంలో 1600 మీటర్ల పరుగు, 50 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్, అండర్–19 విభాగంలో రెండు కిలోమీటర్ల పరుగు, 100 మీటర్ల స్విమ్మింగ్ ఈవెంట్స్ నిర్వహించారు. పరుగుపందాలను కోడిరామ్మూర్తి స్టేడియంలో, స్విమ్మింగ్ పోటీలు శాంతినగర్‌కాలనీలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా నిర్వహించారు. విజేతలగా నిలిచిన బాలబాలికలకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు తదితరులు బహుమతులు ప్రదానం చేశారు.మెజారిటీ విజేతలు ఆతిథ్య జిల్లాకు చెందినవారు కావడం విశేషం. విజేతలు వీరే అండర్–17: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.వాసుదేవరావు, ఎ.మహేష్, జి.రమేష్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎ.సంతోషిని (శ్రీకాకుళం), బి.సాన్విత (కర్నూలు), జి.కావ్య (శ్రీకాకుళం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అండర్–19: బాలురు విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.కార్తీక్, బి.ఉదయ్‌కుమార్, జి.ఉదయ్‌కిరణ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎన్.శ్రావణి(శ్రీకాకుళం), జి.జ్యోతిక (శ్రీకాకుళం), కె.కళ్యాణి (వైఎస్సార్ కడప) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. -
విజ్ఞాన ప్రదర్శనలో సెంచూరియన్ ప్రతిభ
రాయగడ: విద్యార్థుల్లో ప్రతిభను కనబరిచేందుకు విజ్ఞాన ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ అన్నారు. స్థానిక మహిళా కళాశాలలో యువజనోత్సవాల పేరిట ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యువజనోత్సవాల పేరిట వివిధ పొటీలను నిర్వహిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చనా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లా నుంచి వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పితామహల్లో గల సెంచురియన్ విశ్వవిద్యాలయానికి చెందిన 12 వ తరగతి విద్యార్థుల బృందానికి ప్రథమ బహుమతి లభించింది. సీనియర్ విభాగంలో గెలుపొందిన సెంచూరియన్ విద్యార్థులు ప్రథమ బహుమతితో పాటు పది వేల నగదు బహుమతిని సంపాదించుకున్నారు. అదేవిధంగా జూనియర్ విభాగంలో మూడోస్థానం కూడా సంపాదించారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు
రాయగడ: ఐటీ రంగంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని, దీనికి అనుగుణంగా ఆ రంగంలో విద్యాభాస్యం చేస్తున్న విద్యార్థులు నిరంతరం సాధన చేయడం ఎంతో అవసరమని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యంజయ మహాపాత్రో అభిప్రాయడ్డారు. జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జీఐఈటీ)లో ఆదివారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించాలంటే ప్రతి విద్యార్థి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజపండా మాట్లాడుతూ దేశం సైన్ అండ్ టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాన్ని అధిగమించాలంటే అందుకు సాధన ఎంతో అవసరమన్నారు. పరిశోధనల ద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయని, వాటికి పదును పడితే టెక్నాలజీ రంగం మరింత ముందుకు వె వెళ్తుందన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ స్వాగతోపన్యాసంలో భాగంగా వార్షిక నివేదికను చదివి వినిపించారు. విశ్వవిద్యాలం సాధించిన విజయాలను తెలియజేశారు. దొరాగుడలో వైద్య శిబిరం రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి వద్ద గల దొరగుడలో ఉత్కళ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబరం జరిగింది. కర్మాగారం యూనిట్ హెడ్ రవి నారాయణ మిశ్రో ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్ఆర్ విభాగం తరఫున చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు . కర్మాగారం ద్వాకా పరిసర గ్రామాల్లో గల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకు గ్రామస్తుల సహకారం లభిస్తుందన్నారు. ఉత్కళ అలూమిన హస్పిటల్ సీఎంఓ డాక్టర్ రాజేంద్ర లెంక, డాక్టర్ రాజేంద్ర మండల్, సిబ్బంది ఈ శిబిరానికి హాజరైన రొగులకు వివిధ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు దిగజారుతున్న నేపథ్యంలో పెరుగుతున్న చలికి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు తమ సంఘం ద్వారా దుప్పట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించామని సంఘం అధ్యక్షులు కింతలి అమర్నాథ్ తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండు, రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి దుప్పట్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
దశలవారీ పోరాటాలకు సిద్ధం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని యూనియన్ గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి.ఉత్తర పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచాలని కోరారు. స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటు తక్షణమే విరమించాలన్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నా వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి కార్మికులకు కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కనీస వేతనం రూ.10వేలు, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు, ప్రతి నెల 5లోపు వేతనాలు, బిల్లుల చెల్లింపు తదితర డిమాండ్లు నెరవేర్చాలన్నారు. పెరిగిన ధరలకగుణంగా బడ్జెట్ పెంచాలన్నారు. రాజకీయ జోక్యం, అక్రమ తొలగింపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక తరహాలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రవీణ, బి.కన్యాకుమారి, జయలక్ష్మి, పద్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
చిత్ర లేఖన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం
జయపురం: జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నవంబర్ 23వ తేదీన జిల్లాలోని వివిధ కోర్టులలో నిర్వహించిన చిత్ర లేఖన పోటీలలో విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం సభాగృహంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి బిష్టు ప్రసాద్ దేవత, జిల్లా జడ్జి, ప్రదీకరణ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోటీలలో జూనియర్ విభాగంలో జయపురం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని అపరాజిత మహాపాత్రో ప్రథమ, సైంట్ జాబియర్స్ పాఠశాల విద్యార్థి ఎన్.సాయి ద్వితీయ, బొయిపరిగుడ సమితి సిరిగుడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సమర మఝి తృతీయ బహుమతులు సాధించారు. సీనియర్ గ్రూపులో బొయిపరిగుడ సమితి సిరిబెడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి సురేంద్రచలాన్ ప్రథమ, జయపురం సమితి టంకువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి గోపీనాథ్ బిశాయి ద్వితీయ, కొట్‌పాడ్ సరస్వతీ విద్యామందిర విద్యార్థి భిగ్న జిత్ బెహర తృతీయ బహుమతులను దక్కించుకున్నారు. వీరికి ముఖ్యఅతిథితో పాటు ఫ్యామిలీ కోర్టు జడ్జి నిశిత్ నిశంకో, జయపురం చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ పి.సుజాతలు మెమెంటోలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు. బహుమతుల ప్రధాన ఉత్సవంలో జడ్జి స్వయం ప్రకాశ దాస్, సబ్ డివిజన్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్, న్యాయ అధికారులు హరమణ దాస్, డాక్టర్ రౌత్ రాయ్, ప్రజ్ఞా సుమన్ మహాపాత్రో పాల్గొన్నారు. -
అపూర్వ సమ్మేళనం
పర్లాకిమిడి: మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన 1985 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం బంధుమిలన్ పేరిట కలుసుకున్నారు. చైన్నె, ముంబై, విశాఖపట్నం, హైదరాబాదు, భువనేశ్వర్, ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో కలుసుకుని ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు డి.సూరప్పడు, ప్రఫుల్ల పాణిగ్రాహి, కుముద్ రంజన్ దాస్, రామ్మోహన్రావు పట్నాయక్, తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు ఎన్ని రవికుమార్, శాసనపురి వాసు, మాజీ పురపాలక చైర్మన్ తిరుపతి నాయక్, లింగరాజు, తదితరులు సహకరించారు. -
కళాకారులను ప్రోత్సహించాలి
● బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికకచొయితీ వేదికపై ముఖ్య అతిథితో నిర్వాహకులురాయగడ: ప్రతిభ ఉన్న కాళాకారులు ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహం లభించకపోవడంతో వారు ఉన్నత స్థాయికి చేరుకోలేకపొతున్నారని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో శనివారం సాయంత్రం జరిగిన చొయితీ సమితి స్థాయి ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళలకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందిన మన రాష్ట్రంలో కళాకారులకు ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉందన్నారు. కళాకారులను ప్రోత్సాహించేందుకు చొయితీ వంటి ఉత్సవాలు నిర్వహిస్తుండటం కళాకారులకు కొంత ఊరట కలుగుతుందన్నారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం విరివిగా నిర్వహించి, వారిని ప్రోత్సాహిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుని వారి ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుందన్నారు. అంతకు ముందు బీడీఒ కృష్ణ చంద్ర దలపతి, జితేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఉత్సవాల్లో భాగంగా ఉదయం కలశ యాత్ర, మషాల్ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం కళాకారులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే ఆదివాసీ నృత్యాలు, సంబల్పూరి వేషధారణలో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులకు ప్రోత్సాహక బహుమతులను ముఖ్యఅతిథిగా హాజరైన హికక అందించారు. -
ముగిసిన పెన్కాక్ సిలాట్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడలతో శారీరక ఉల్లాసంతోపాటు మానసిక ఆనందం లభిస్తుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా జిల్లాస్థాయి పెన్కాక్ సిలాట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. విజేతలకు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులతోపాటు పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్‌నాయుడు, ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ రన్
కొరాపుట్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ రన్ పోటీలు జరిగాయి. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో బీఎస్ఎఫ్ సెక్టార్ ఆవరణలో బీఎస్ఎఫ్ డీఐజీ సత్యవాన్ కంచి జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025 నేపథ్యంలో ఈ పోటీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 900 మంది ఈ పరుగు పందెంలో పాల్గొన్నారు. 5 కిలో మీటర్ల దూరంలో పోలీస్ గ్రౌండ్స్ వరకు ఈ పరుగు సాగింది. బాలురు, బాలికల విభాగాల్లో ప్రథమ రు.10వేలు, ద్వితీయ రు.8 వేలు, తృతీయ రు.5 వేలు నగదు పురస్కారం అందజేశారు. విజేతలకు కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎస్పీ రోహిత్ వర్మ పురస్కారాలు అందించారు. -
అలరించిన స్వరగానామృత లహరి
పర్లాకిమిడి: ఘంటసాల 103వ జయంతి వేడుకలు పురస్కరించుకుని చైతన్య మెలోడీస్ ఆధ్వర్యంలో రాజవీధిలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో స్వరగానామృత లహరిని ఆదివారం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 54 మంది గాయనీ గాయకులు పాల్గొని ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సోలో పాటలు పాడారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖఅతిథి, పాడుతా తీయగా విజేత నరసన్నపేట మండళం, గెద్దవానిపేటకు చెందిన ముద్దాడ స్వా తి, జగన్‌లకు చైతన్య మెలోడీస్ సంస్థ అధ్యక్షులు కె.చిరంజీవులు, పారిశెల్లి రామరాజు (పాతపట్నం) ఘనంగా దుశ్శాలువ, మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమాన్ని కడురమ్యంగా నిర్వహించడంలో ఉపాధ్యక్షులు కె.చిరంజీవులు, కార్యదర్శులు పి.శ్రీనివాస్ స్వామి, కె.శివకుమార్, తిరుపతిరావు, పి.మోహన్‌రావు, డాక్టర్ లీలాకృష్ణ, భుజంగరావు తదితరులు సఫలీకృతులయ్యారు. -
గిరిజన గ్రామాల్లో సత్యసాయి ట్రైబల్ హెల్త్‌కేర్
శ్రీకాకుళం కల్చరల్: గిరిజన గ్రామాల్లో ‘శ్రీ సత్యసాయి ట్రైబల్ హెల్త్‌కేర్’ అనే నూతన సేవకు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతున్న సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని సత్య సాయి సేవా సమితి పెద్ద మందిరంలో జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు అధ్యక్షతన సత్యసాయి సేవా సంస్థల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ హెల్త్ కేర్ వాహనం ద్వారా నెలకు ఒకటి రెండు సార్లు గ్రామాలను సందర్శిస్తామన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ తదితర వ్యాధులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సూత్రాలు వివరించి దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కృషి చేస్తామన్నారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని సాయిగణేష్ మందిరంలో ఇప్పటికే సత్యసాయి ఆశ్రిత సేవ ప్రారంభించి విద్యావంతులైన గ్రామీణ యువకులకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇస్తూ ఉద్యోగం సాధించే వరకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి సేవా రథం ద్వారా రానున్న ఐదేళ్లలో 1000 గ్రామాలలో సత్య సాయి భజన మండళ్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. కమలా త్రివేణి మాట్లాడుత సత్య సాయి 100వ పుట్టినరోజు వేడుకల్లో మహిళల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద మందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ, జిల్లా, జోనల్ పదాధికారులు, కన్వీనర్లు, బాల వికాస్ గురువులు, యువత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
దీర్ఘకాల సమస్యలపై చర్చ
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాల ఉత్కళ సమ్మిళిణీ శాఖల కార్యకర్తల సమావేశం ఆదివారం జయపురంలో నిర్వహించారు. ఉత్కళసమ్మిళిణీ కొ రాపుట్ జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్కళ సమ్మిళిణీ కేంద్ర కమిటీ కార్యదర్శి బిరెన్ మోహన్ పట్నాయిక్, బీజేడీ నేత బృగు బక్షీపాత్రో, రాయగడ జిల్లా అధ్యక్షులు బ్రజసుందర నాయిక్, సమ్మిళిణీ రాష్ట్ర కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్రో తదితరులు పాల్గొని అవిభక్త కొరాపుట్ జిల్లాలు కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరిలో సమస్యలపై చర్చించారు. నాలుగు జిల్లాల ఉన్నతికి ఉత్కళ సమ్మిళిణీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న దానిపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల వివాదం, వంశధార నదీ సమస్య, ఖనిజ సంపద తవ్వకాలు, విద్యా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, రైల్వే సౌకర్యాల విస్తరణ తదితర విషయాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉత్కళ సమ్మిళిణీ కేంద్ర కమిటీ నాయకత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ శాఖలు ఏర్పాటు చేసి ఉత్కళ సమ్మిళిణీని బలోపేతం చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. 2026 ఫిబ్రవరి 28, మార్చ్ 1వ తేదీల్లో జయపురంలో ఉత్కళ సమ్మిళిణీ రెండు దినాల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఆ సమావేశానికి రాష్ట్ర మంత్రిని ఆహ్వానించాలని తీర్మానించారు. ఈ సందర్బంగా భృగు బక్షీపాత్రో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉత్కళ సమ్మిళిణీ కార్యకర్తలు అందరూ ఇక ముందు పని చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిళినీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పరమేశ్వర పాత్రో, రాయగడ జిల్లా కార్యదర్శి అరుణ పాణిగ్రహి, కిశోర్ పండ, రాష్ట్ర కమిటీ సభ్యులు హరహర కరసుధా పట్నాయిక్, బాలా రాయ్, దుర్గా ప్రసాద్ మిశ్ర, రమాకాంత రౌళో, దేవేంధ్ర బాహిణీపతి, తేజేశ్వర పండ తదితరులు పాల్గొన్నారు. -
రాయగడలో ఉప ముఖ్యమంత్రి పర్యటన నేడు
రాయగడ: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడా సొమవారం రాయగడలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8.50 గంటలకు ఆమె భువనేశ్వర్‌లో గల బిజుపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రమం నుంచి హెలీ కాప్టర్లో బయల్దేరుతారు. జిల్లాలోని చందిలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో ఆమె ఉదయం 10.20 గంటలకు చేరుకుంటారు. అనంతరం 10.30 గంటలకు స్థానిక రైల్వే స్టేషన్లో జరగనున్న వయోవృద్ధుల తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.35 గంటలకు స్థానిక మజ్జిగౌరి మందిరానికి హాజరై అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు జిల్లాలొ కొనసాగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మిషన్ శక్తి, పర్యాటక రంగానికి సంబంధించి అధికారులతో సమావేశమై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి హెలీకాప్టర్‌లో భువనేశ్వర్ వెళ్తారు. -
పరబ్–2025లో పర్వతారోహణ పోటీలు
కొరాపుట్: కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025 నేపథ్యంలో పర్వతారోహణ పోటీలు జరిగాయి. కొరాపుట్ జిల్లా నారాయణ పట్న సమితి బిజా ఘాటీ గ్రామ పంచాయతీ కలియా మాలి పర్వతంపై కలెక్టర్ సత్యావాన్ మహాజన్ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఔత్సాహికులు కొండ పైకి ఎక్కారు. వారితో పాటు కలెక్టర్ కూడా పర్వతారోహణ చేయడం గమనార్హం. ఇంత వరకు దేవమాలిపై పర్వతారోహణ జరిగేది. కానీ కలియామాలిని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి కలెక్టర్ తొలిసారిగా ఇక్కడ పర్వతారోహణ పోటీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం శశ్యా రెడ్డి, సిఆర్పిఎఫ్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. విజేతలకు కొండ మీద బహుమతి ప్రధానం జరిగింది. -
కామ్రేడ్ కొండయ్య ఆశయ సాధనకు కృషిచేద్దాం
ఆమదాలవలస: సీఐటీయూ జిల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ మెట్ట కొండయ్య ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో కొండయ్య స్వగృహం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. 1970వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆవిర్భవించినప్పుడు జిల్లాలో ఆమదాలవలస చక్కెర కర్మాగారంలో దివంగత చాపర అప్పారావు, దిగుమర్తి విశ్వనాథం, మెట్ట కొండయ్య సీఐటీయూ యూనియన్ను ఏర్పాటు చేశారన్నారు. సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని 56 రోజులపాటు నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా సమ్మె పోరాటాలు చేసి విజయవంతం చేశారని కొనియాడారు. సమ్మె కాలంలో కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే, తన భార్య వద్ద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి కార్మిక కుటుంబాలకు సహాయం చేసిన గొప్ప మానవతావాది అని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీ, కామ్రేడ్ కొండయ్య కుటుంబ సభ్యులు, సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, భవిరి కృష్ణమూర్తి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీనియర్ జర్నలిస్ట్ సువ్వారి మురళీధర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు పంచాది లతాదేవి, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి జనార్ధనరావు, ప్రజా సంఘాల నాయకుడు బొడ్డేపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
● ముగిసిన వార్షిక క్రీడోత్సవాలు
● ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులుజయపురం: జయపురంలోని తెలుగు సంస్కృతిక సమితి ఆధ్వర్యంలో స్థానిక సిటీ ఉన్నత పాఠశాలలో రెండు రోజులు నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. పాఠశాల మాజీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించి స్థానిక ఛౌడేశ్వరి దేవి మందిరంలో పూజలు చేసి క్రీడాజ్యోతిని వెలించారు. మందిరం నుంచి క్రీడా జ్యోతితో విద్యార్థులు ర్యాలీగా పాఠశాలకు చేరుకోగా.. పీఈటీ ఉపాధ్యాయురాలు రీటా సామంతరాయ్ క్రీడా జ్యోతి స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో, క్రమశిక్షణతో విద్యార్థినీ విద్యార్థులు పోటీలలో పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా 100 మీటర్ల పరుగు, డిస్కస్‌త్రో, స్లోసైకిలింగ్, లెమన్ స్పూన్, లాంగ్ జంప్, హైజంప్, కబడ్డీ, త్రీ లెగ్డ్ రేస్ మ్యూజికల్ చైర్ పోటీలను నిర్వహించారు. క్రీడా పోటీల నిర్వహణ కమిటీ సభ్యులు పి.శ్రీనివాసరాజు, కె.రామకృష్ణ, ప్రతాప్ కుమార్ పట్నాయక్ పాల్గొన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి జనవరి 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే ఉత్సవాల్లో బహుమతులు ప్రదానం చేస్తామని ప్రధాన ఉపాధ్యాయురాలు బి.సుజాత వెల్లడించారు. -
మత్తుతో జీవితం చిత్తు
రాయగడ: మత్తు పదార్థాల వినియోగంతో యువత జీవితం నాశనమవుతోందని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి అన్నారు. రాయగడలోని వివేకానంద విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసగా మారితే బంగారు భవిష్యత్ బుగ్గిపాలవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశా విముక్తి అభిజాన్ వంటి పథకాలతో ప్రజలను చైతన్యం చేస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలు సైతం పోరాటం సాగించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బిజయ్ చౌదరి, రాయగడ అటా నమస్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి.జ్యోతి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర శాఖ కో ఆర్డినేటర్ సరస్వతి నంది తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వదిలి వేతనాలు పెంచుకుంటారా?జయపురం: ప్రజా సమస్యలు పరిష్కరించడం వదిలేసి విధానసభ సభ్యులు తమ వేతనాలు మూడింతలు పెంచుకోవడాన్ని ప్రజా ఉద్యమకారుడు బి.హరిరావు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయమై సీఎం మోహన్‌చరణ్ మాఝీ పునరాలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుతూ శనివారం జయపురం సబ్ కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు, నిరుపేదలు, నిస్సహాయులు పింఛన్లకు నోచుకోక దుర్భర జీవితం గడుపుతున్నారని, అటువంటి వారికి ఆర్థిక సహాయం అందించకుండా ఎమ్మెల్యేలకు జీతాలు మూడింతలు పెంచటం ఆమోద్య యోగ్యం కాదన్నారు. ఇస్రో సందర్శనకు సాయిశ్రీ పండిట్ ఎంపికపర్లాకిమిడి: స్థానిక సరస్వతి శిశు విద్యామందిర్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని సాయిశ్రీ పండిట్ ఇస్రో ట్రిప్‌కు ఎంపికై ంది. ఆమె తయారుచేసిన భవిష్యత్తు గగణయాన్ మిషన్‌పై తయారుచేసిన నమూనా రాష్ట్రంలో 60 మంది విద్యార్థుల్లో ఎంపికై ఇస్రో సందర్శన ఆవార్డును గెలుచుకున్నది. శనివారం భువనేశ్వర్‌లో పఠానిసామంతరే ప్లానిటోరియంలో జరిగిన సభలో.. రాష్ట్ర ఆహార సరఫరా, సైన్సు శాఖ మంత్రి జయనారాయణ పాత్రో చేతులమీదుగా సాయిశ్రీకి బహుమతి అందజేశారు. యంగ్ ఆస్ట్రోనమర్ టాలెంటు సెర్చ్(యాట్స్) పోటీని టాటా స్టీల్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. సాయిశ్రీ పండిట్ తండ్రి గురుజీ గోపాల కృష్ణ పండిట్, సరస్వతీ శిశు విద్యామందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్పండా, ఉపాధ్యక్షులు సంజయ్ జెన్నా సాయిశ్రీ పండిట్‌కు అభినందనలు తెలిపారు. -
శాంతి పునరుద్ధరణకు చర్యలు
మల్కనగిరి: జిల్లాలోని ఎం.వి–26 గ్రామంలో శాంతిని పునరుద్ధరించేందుకు మల్కనగిరి పోలీసులు పలు కీలక చర్యలు చేపట్టారు. మహిళ హత్య ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఇందులో సంబంధం ఉన్న నిందితుడు సుకరంజన్ మండల్‌ను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి చెందిన తల భాగాన్ని పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు బీఎస్ఎన్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఏపీఎఫ్‌తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో శాంతి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకుంటామని మల్కనగిరి పోలీసులు హామీ ఇస్తున్నారని తెలిపారు. పౌరులు శాంతియుతంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియా, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని సూచించారు. ఏమైనా స్పష్టీకరణ కోసం, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించేందుకు సమాప పోలీస్ స్టేషన్‌ను నేరుగా సంప్రదించాలని, అత్యవసర హెల్ప్‌లైన్ 112కు డయల్ చేయాలని ఎస్పీ వినోద్ పాటేల్ తెలిపారు. -
అక్రమ లే అవుట్లు..!
పుట్టగొడుగుల్లా.. ● నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ● చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా యి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా ప్లాట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్ల పక్క న ప్రభుత్వ భూములు, చెరువులు, వరద కాలువలు ఉన్నా వాటిని సైతం అందులో కలిపేస్తున్నారు. ఈవిధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. మున్సిపాలిటీలో ఇటువంటి అక్రమ లే అవుట్లు సుమారు 22 ఉన్నాయి. ఇందులో అత్యధిక శా తం టీడీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ లో కీలక స్థానాల్లో ఉన్నవారివేనని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు పలాస పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఉదయపురం రెవెన్యూలోని సర్వే నంబరు 221/13లో ఇటీవల వేసిన సీతమ్మ గుడి వద్ద లే అవుట్ స్థానికంగా వివాదాస్పదమైనా అధికారు లు స్పందించ లేదు. వ్యక్తుల సదుపాయం కోసం కూర్చోడానికి వేసిన చిన్న చిన్న బల్లలను సైతం తొలగించడంతో ఆ బల్లలు వేసిన తాళాసు మన్మథరావు, అదే ప్రాంతానికి చెందిన నౌగాపు మల్లి, స్థానిక ప్రజలు అడ్డుకున్నప్పటికీ ఆగలేదని, అంతేకాకుండా ఆ పక్కన ఎప్పుటినుంచో ఉన్న వంశధార కాలువ గట్టును లే అవు ట్ వేసిన వ్యక్తి రోడ్డులో కలిపేశాడని స్థానికులు మండిపడుతున్నారు. అలాగే కాశీబుగ్గ సూదికొండ పక్కన ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయం పక్కన సుమారు 4 ఎకరాల వరకు కబ్జా జరిగిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం పేదలు నిర్మించిన ఇళ్లను సైతం కూల్చేశారు. అలాగే 200 పడకల కిడ్నీ ఆస్పత్రి పక్కన సర్వే నంబరు 253లో 300 మూరల భూమిని దోపిడీ కాజేశారు. పద్మనాభపురం శనీశ్వరుడి మెట్ట ప్రాంతంలో రెండెకరాలు భూమిని టీడీపీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్ ఆక్రమించుకొని చదును చేసుకున్నాడు. ఈవిధంగా ఒకపక్క అక్రమ లేఅవుట్లు.. మరో పక్క భూకబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తు న్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా తాను కొత్తగా వచ్చానని.. మొత్తం లే అవుట్లు 22 ఉన్నమాట వాస్తవమేనన్నారు. వీటి వివరాలు తెలుసుకుంటానని పేర్కొన్నారు. -
ఇద్దరబ్బాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు
నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద అబ్బాయి దిలీప్‌కుమార్ సీఆర్పీఎఫ్ లో గడిచిన పదేళ్లుగా ఉద్యో గం చేస్తున్నాడు. చిన్నబ్బాయి రాజా కూడా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఇటీవలే మంచి ఉద్యోగం సంపాదించాడు. ఇలా మా గ్రామంలో ఎక్కువ మంది యువత ప్రభు త్వ కొలువులు పొంది శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే వీరి కృషితో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తు లు కూర్చోడానికి రచ్చబండ నిర్మించారు. స్కూల్ అభివృద్ధి చేశారు. గ్రామంలో 16 సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. – దాసరి కృష్ణారావు, గొనబుపేట -
చోరీ కేసులో ముద్దాయికి జైలు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ద్విచక్ర వాహనం చోరీ చేసిన కేసులో పట్టుబడిన ముద్దాయి గొల్లకంచిలి గ్రామానికి చెందిన డొక్కరి రవికి 8 నెలల జైలు శిక్షతోపాటు, రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చిన ట్లు స్థానిక ఎస్ఐ పి.పారినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట ఏజేఎంఎఫ్‌సీ జడ్జి కేసును విచారించిన తర్వాత ఈ మేర కు తీర్పు వెలువరిచినట్లు తెలిపారు. ఈ కేసు వాదనలో ఏపీపీగా పి.నరేష్, దర్యాప్తు అధికా రిగా తాను వ్యవహించినట్లు పేర్కొన్నారు. సముద్రంలో మత్స్యకారుడు మృతి సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు గ్రామానికి చెందిన కొమర రాజయ్య (63) అనే మత్య్సకారుడు శనివారం సముద్రంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే రాజయ్య చేపల వేట కోసం సముద్రపు ఒడ్డుకు వెళ్లాడు. సముద్రపు ఒడ్డున ఒక కర్రను పాతి.. దానికి ఒకవైపు వలను కట్టాడు. మిగిలిన వలను కట్టడానికి సముద్రపు లోపలికి నడుచుకుంటూ వెళ్లాడు. సముద్రపు లోపల వల కడుతున్న సమయంలో పెద్దపెద్ద కెరటాలు రావడంతో ఆ వలలో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయాడు. ఇది చూసిన మత్య్సకారులు రాజయ్యను కాపాడే లోపే మృతి చెందడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. నౌపడ ఎస్ఐ జి.నారాయణస్వామి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పొదల్లో నవజాత శిశువు మృతదేహం కవిటి: మండలంలో కవిటి – గొండ్యాలపుట్టుగ రోడ్డు మార్గంలోని కొబ్బరితోటల పొదల్లో శనివారం ఉదయం నవజాత మగ శిశువు మృతదేహం కనిపించింది. వేకువజామున వాకింగ్‌కు వెళ్లే పాదచారులు గుర్తించి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్ఐ వి.ర వివర్మ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహానికి ఖననం చేశారు. ధాన్యం బస్తాలు దగ్ధం టెక్కలి రూరల్: మండలంలోని బొరిగిపేట గ్రామం నుంచి మేఘవరం వైపు వెళ్లే మార్గంలో పొలంలో ఉంచిన చింతాడ బుడ్డు అనే రైతుకు సంబంధించిన ధాన్యం బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోని ధాన్యం బస్తాల్లో ఎక్కించి సుమారు 15 బస్తాల ధాన్యం పొలంలో ఉంచగా.. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి సమీపంలో ఉన్న గడ్డిని కాల్చడంతో ధాన్యం బస్తాలకు సైతం మంట అంటుకుంది. ఇది గుర్తించి స్థానికులు హుటాహూటిన మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే నాలుగు ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేయండి శ్రీకాకుళం రూరల్: లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్ పిలుపునిచ్చారు. స్థానిక తంగివానిపేట గ్రామంలో శనివారం నిర్వహించిన ఐఎఫ్టీయూ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చారన్నారు. కార్పొరేట్ వ్యవస్థలు, బడా పెట్టుబడుదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేయడమే వీటి ఉద్దేశమని మండిపడ్డారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా సభ్యురాలు ఎస్.కృష్ణవేణి, ఎస్.అప్పన్న, నాగమణి, రమణ, లక్ష్మీ సుజాత పాల్గొన్నారు. -
గంజాయితో ఇద్దరు వ్యక్తులు అరెస్టు
కంచిలి: ఒడిశా నుంచి ముంబాయికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంతోపాటు 24 కిలోల 700 గ్రాముల గంజాయిని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలోని కంచిలిలో ఎస్ఐ పి.పారినాయుడు, తన సిబ్బంది పట్టుకున్నట్లు సోంపేట సీఐ బి.మంగరాజు వెల్లడించారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా మోహన గ్రామ సమీపంలోని ఉదయగిరి గ్రామానికి చెందిన ఆర్.రాజు అనే వ్యక్తి వద్ద అదే జిల్లాలోని పనగుడి గ్రామానికి చెందిన మిలన్ మిచెన్ బిరా అనే వ్యక్తి 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అనంతరం శుక్రవారం రెండు బ్యాగుల్లో 24 ప్యాకెట్లను సర్ది, ముంబాయికి చెందిన శంకర్‌కి కోణార్క్ ట్రైన్లో వెళ్లి ఇవ్వడానికి తన ద్విచక్ర వాహనంపై వరుసకు పిన్ని అయ్యి దీపా లిమా అనే మహిళతో కలిసి కంచిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరాడు. అయితే అదే సమయంలో కంచిలి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ పి.పారినాయుడు తన సిబ్బందితో సోంపేట రైల్వేస్టేషన్ జంక్షన్లో వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు. అలాగే ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ మంగరాజు తెలిపారు. -
డొంగాశిలి విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి డొంగాశిలిలో గల ఉన్నత మాధ్యమిక విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. విద్యాలయం మెయిన్ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అదేవైపుగా వెళ్తున్న జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి విద్యార్థులు చేస్తున్న ఆందోళనను చూసి వారి దగ్గరకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. 1957లో డొంగాశిలిలో స్థాపించిన ఈ విద్యాలయం అప్పటి నుంచి ఇంతవరకు కేవలం 8వ తరగతి చదువుకునేంత వరకు ఉందని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం పై చదువులకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీని ఫలితంగా కొందరు ఆయా ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువును నిలిపి వేస్తున్నారని వివరించారు. పదో తరగతి వరకు ఈ విద్యాలయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని వారంతా కోరారు. దీనిపై ప్రభుత్వ సంబంధిత శాఖ అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ సరస్వతి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అదిరిందోయ్!
మండయ్..కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 వైభవంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రం సమీపంలో బెహరాగుడ మార్గంలో మోడల్ స్కూల్ వద్ద మండయ్ మైదానంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఈ నెల 17 వరకు కొనసాగనున్నాయి. స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కళాకారులు తరలివచ్చారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులోని మా బండారు ఘరణి శక్తి పీఠంలో కలెక్టర్ మహేశ్వర్ ప్రారంభోత్సవ పూజలు చేశారు. అనంతరం గిరిజన సంప్రదాయ కళాకారులతో భారీ ర్యాలీ చేపట్టారు. మైదానంలో 400కు పైగా వాణిజ్య స్టాల్స్ ఏర్పాటు చేశారు. తొలి రోజు మహారాష్ట్రకు చెందిన లవణి, ఒడిశా రాష్ట్ర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. జిల్లాకు చెందిన గిరిజన సాంస్కృతిక మంత్రి నిత్యానంద గొండో వేదికపై మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కాలేజీ తెప్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ మున్నాఖాన్, ఎమ్మెల్యేలు గౌరీ శంకర్ మజ్జి, మనోహర్ రంధారీ, నర్సింగ్ బోత్రా తదితరులు పాల్గొన్నారు. -
భారీగా బెల్లం ఊటలు ధ్వంసం
సోంపేట: ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించి 10 వేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ తెలిపారు. ఒడిశా పోలీసులతో కలిసి ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లోని నాటుసారా తయారు చేసే గ్రామాల్లో శ్రీకాకుళం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామచంద్రకుమార్, ఎన్పోర్స్మెంట్ సూపరింటెండెంట్లు మురళీధర్, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపట్టారు. గంజాం జిల్లాలోని గంగాపూర్ గ్రామంలో 4,500 లీటర్ల బెల్లం ఊటలు, రాంచంద్రాపూర్ గ్రామంలో 5,500 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో 2,753 కేసులు పరిష్కారం
పర్లాకిమిడి: జాతీయ న్యాయ సేవా ప్రాధికరణ (న్యూ ఢిల్లీ) ఆదేశాల మేరకు జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రాధికరణ అధ్యక్షులు జగదీష్ ప్రసాద్ మహాంతి శనివారం నాలుగో లోక్ అదాలత్‌ను పర్లాకిమిడి జిల్లా కోర్టు, మోహానా, ఆర్.ఉదయగిరి, గ్రామన్యాయలయం, కాశీనగర్‌లలో నిర్వహించారు. లోక్ ఆదాలత్‌లో మొత్తం 3,542 కేసులకు 2,753 వివిధ కేసులు పరిష్కరించారు. 25,20,679 రూపాయల రెవెన్యూ వివిధ జరిమానాలు, ఒన్‌టైం సెటిల్మెంట్ అయినట్టు కోర్టు అధికారులు తెలియజేశారు. లోక్ అదాలత్‌లో ఆదనపు జిల్లా జడ్జి బిభుప్రసాద్ పండా, నరోత్తమ శెఠి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జీబనానంద పాఢి, డి.ఎల్.ఎస్.ఎ కార్యదర్శి బిమల్ రవుళో, మహిళా కోర్టు బిష్ణుప్రియా సామంతరాయ్, జ్యోతిపాణి (జేఎంఎఫ్‌సీ), బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్ర పట్నాయక్ పాల్గొన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారం రాయగడ: స్థానిక జిల్లా సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో వివిధ కేసులను పరిష్కరించారు. గుణుపూర్, బిసంకటక్, కాసీపూర్, పద్మపూర్, మునిగుడ కోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 191 కేసులను పరిష్కరించి జరిమానా కింద రూ.66, 01,843 వసూలు చేశారు. రెవెన్యూకు సంబంధించి 20,585, ప్రిలిటిగేషన్కు సంబంధించి 52 కేసులు పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా రూ.14,36,058 వసూలు చేశారు. జిల్లా జడ్జి సత్యనారాయణ షొడంగి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి సంజిత్‌కుమార్ బెహరా, అదనపు జిల్లా జడ్జి అపర్ణ మహాపాత్రో, మహిళా కోర్టు న్యాయమూర్తి సుస్మిత మిశ్రొ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
రాయగడ: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 3,523 మంది విద్యార్థులు హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో గల 11 సమితుల్లో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం జిల్లా నుంచి 4,225 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా ఇందులో 3,523 మంది పరీక్షలకు హాజరయ్యారు. 16 నుంచి ధనుర్మాస పూజలు రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని శ్రీకళ్యాణవేంకటేశ్వర ఆలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు శనివారం తెలిపారు. 16న మధ్యాహ్నం 12.31 గంటల సమయంలో ధను సంక్రమాణం ప్రవేశం జరుగుతుందన్నారు. దీన్ని అనుసరించి మొదట పాశుర విన్నపం పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ధనుర్మాసంలో భాగంగా ఈ నెల 30 వ తేదీన వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం, శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం నమ్మాళ్లార్ అధ్యయన ఉత్సవం నిర్వహిస్తామన్నారు. 31వ తేదీన ఉదయం ఏడు గంటలకు నాయగనాయ్ ద్వార పాలక పూజలు, సాయంత్రం ద్వాదశి కారణంగా సహస్ర దీపాకంకృత ఊంజల్ సేవ వంటి విశేష పూజలు ఉంటాయన్నారు. జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం కొనసాగుతోందని చెప్పారు. -
ఆరామ ద్రావిడ సంఘం ఆత్మీయ కలయిక
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆరావ ద్రావిడ బ్రాహ్మణ సంఘం సభ్యులు 80 అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా ఆఫీసు వద్ద శనివారం ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా వైదిక సాంప్రదాయాలతో, సనాతన సంస్కృతి వైభవాలతో, సమాజ హితాన్ని కాంక్షిస్తూ అందరూ మార్గదర్శకంగా ఉండాలని సమావేశానికి అధ్యక్షత వహించిన అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు, ఆరామ ద్రావిడ సంఘం కేంద్ర అధ్యక్షుడు ఇప్పిలి శంకర్ శర్మ పిలుపునిచ్చారు. చిన్నారులకు ఆటల పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా బంకుపల్లి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో కచేరి కార్యక్ర మం చేపట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, సంఘం గౌరవ అధ్యక్షుడు వేమ కోటి సూర్యనారాయణ శర్మ, అంపోలు రుద్రకోటి శర్మ, వేమకోటి నరహరశాస్త్రి, అమ్ములు ఉమామహేశ్వర శర్మ, భాస్కరభట్ల శ్రీరామశర్మ, పెంటా శ్రీనివాస్ శర్మ, ధర్మపురి గౌరీశంకర్ శాస్త్రి, బంకుపల్లి సత్యనారాయణ శర్మ, రేజేటి వెంకటరమణ, సత్య ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం ఆరామ ద్రావిడ సంఘం నూతన కార్యవర్గాన్ని రేజేటి రామాచార్యులు, వేమకోటి నరహరి శాస్త్రి, వేమకోటి సూర్యనారాయణ శర్మల అధ్యక్షతన చేపట్టారు. దీనిలో భాగంగా కేంద్ర అధ్యక్షుడిగా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, కార్యదర్శిగా జోస్యుల శివప్రసాద్‌శర్మ, కోశాధికారిగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి, శ్రీకాకుళం అధ్యక్షుడిగా సుసరాపు గణపతి శర్మ, కార్యదర్శిగా దార్లపూడి రవి ప్రతాప్శర్మ, కోశాధికారిగా లక్ష్మీధనుంజయశర్మ, విజయనగరం అధ్యక్షుడిగా అంపోలు ఉమామహేశ్వరశర్మ, కార్యదర్శిగా పులఖండం కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
గుడారిలో చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాలోని గుడారిలో చొయితీ ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. సమితి అధ్యక్షురాలు లక్ష్మీ సబర్, బీడీవో సుచిస్మిత బెహర, తహసీల్దార్ ఎ.స్నేహలత, గుడారి పోలీస్ స్టేషన్ ఐఐసీ సమర్పిత స్వయి, ఎన్ఏసీ కార్యనిర్వాహక అధికారి ప్రశన్నకుమార్ పాఢి, వైస్ చైర్మన్ విశ్వనాథ్ సబర్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు సమీపంలోని వంశధాన నది నుంచి శుద్ధ జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చొయితీ ఉత్సవ వేదికపై ఉంచారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మన ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అందరి కర్తవ్యమని అన్నారు. భిన్న సంస్కృతులు ఉన్న మన రాష్ట్రంలో కళాకారులను ప్రోత్సాహించడం అందరి బాధ్యతనన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు సన్మానించారు. -
గిర్లలో వారపుసంత ప్రారంభం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి గిర్లా పంచాయతీ ప్రజల కోసం గిర్ల గ్రామంలో వార సంతను శనివారం ప్రారంభించారు. కొట్‌పాడ్ సమితి ఉపాధ్యక్షులు తోపన్ పాణిగ్రహి, పంచాయితీ వార్డుల సభ్యులు ముందుగా మా మవుళీ మందిరంలో ఘనంగా పూజలు చేసిన తరువాత తోపన్ పాణిగ్రహి వారసంతకు ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీలో మార్కెట్ కోసం సిమెంట్ అరుగులు ఏర్పాటు చేసినప్పటికీ వ్యాపారులెవరూ అక్కడ దుకాణాలు పెట్టలేదు. గిర్ల గ్రామం మధ్యలో రోడ్డు పక్కన సాయంత్రం దుకాణాలు పెట్టి వ్యాపారం చేయటం వలన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. అందుచేత గిర్ల గ్రామంలో వారపు సంత, మార్కెట్ ఏర్పాటు చేయాలని పంచాయతీ ప్రజలు ఎంతో కాలం నుంచి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరింది. తాజాగా ప్రారంభించిన వార సంతకు పలు గ్రామాల నుంచి చిరు వ్యాపారులు కాయకూరలు, ఇతర సరుకులతో దుకాణాలు పెట్టారు. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటెత్తారు. ఇంతవరకు గిర్ల పంచాయతీ ప్రజలు కాయకూరలతో పాటు నిత్యావసర వస్తువుల కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కొట్‌పాడ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు ఆ కష్టం తప్పిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వారపు సంత ప్రారంభంలో జిల్లా పరిషత్ సభ్యులు గీతా మఝి, త్రిపతి చలాన్, యువజన కాంగ్రెస్ నాయకుడు కురమ్నాత్ మఝి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
కొరాపుట్ రైల్వేమార్గంలో జీఎం పర్యటన
కొరాపుట్: కొరాపుట్–రాయగడ రైల్వే మార్గంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంఖ్వాల్ శనివారం పర్యటించారు. కొరాపుట్ రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ ప్రాజెక్ట్ ద్వారా చేపడుతున్న నిర్మాణాలను పరిశీలించారు. కక్కిరిగుమ్మ రైల్వే స్టేషన్ భవన నిర్మాణం పురోగతిపై సమీక్షించారు. లక్ష్మీపూర్ రైల్వేస్టేషన్లో పనులపై ఆరా తీశారు. క్వార్టర్స్ భవనాల నిర్మాణం, సిగ్నల్ వ్యవస్ధ పరీక్షించారు. 354 నెంబర్ వంతెన వద్ద ఐదు డిగ్రీల మలుపు పరిశీలించారు. ఆయనతో పాటు వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోరా, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
జయపురం : జాతీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ – 2025 సందర్భంగా శనివారం జయపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో అథ్లెటిక్స్ మీట్ నిర్వహించారు. కొరాపుట్ జిల్లాలో 14 సమితులు, 3 మునిసిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా(ఎన్.ఎ.సి)ల నుంచి వందలాది మంది క్రీడాకారులు హాజరయ్యారు. 100 మీటర్ల పరుగు బాలురు విభాగంలో అశోక్‌కుమార్ బెహరా(జయపురం), బాలికల విభాగంలో జానకీ చలాన్(కొరాపుట్), 200 మీటర్ల పరుగు బాలురు విభాగంలో ధనరాజ్ ముదులి(కుంద్రా), జాహన్ హరిజన్(జయపురం), బాలికల విభాగంలో రంజిత మండంగి(నారాయణపట్న) గెలుపొందారు. ఇతర విభాగాల్లోనూ క్రీడాకారులు సత్తాచాటారు. ఈ సందర్భంగా జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో మెలగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి జ్ఞానజిత్ త్రిపాఠీ, సబ్ డివిజన్ అథ్లెటిక్ అసియేషన్ కార్యదర్శి రబి నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 138 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ.18,600 వేతనం ఇవ్వాల్సి ఉన్నా అంతమొత్తం చెల్లించడం లేదన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే పని మానేయాలని చెబుతున్నారని వాపోయారు. కారణం చెప్పకుండానే కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు, వేలిముద్రలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడి క్రాంతి, ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, సభ్యురాలు కృష్ణవేణి, కార్యదర్శి దుమ్ము సింహాచలం, కన్వీనర్ చిన్నారావు, జయప్రద, తంగి ప్రభ, కొర్లకోట విజయ, ఆర్.జి.మాధవ, సాధు శ్రీనివాస్, చంద్రకళ, ఎల్లమ్మ, అప్పలనాయుడు, భాస్కరరావు, బాలసుందరం, శ్రీదేవి, భూదేవి, పోలమ్మ, కావ్య పాల్గొన్నారు. -
బాక్సింగ్ పోటీల్లో సిక్కోలు పంచ్
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రపోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు శ్రీకాకుళం జిల్లా తరఫున రికార్డుస్థాయిలో పదిమంది బాక్సర్లు జె.తారక్, పి.ప్రసాదరావు, సీహెచ్ జ్ఞానేశ్వరరావు, పి.మణికంఠ, పి.విశ్వేశ్వరరావు, ఎం.లోకేష్, ఎస్.ఏసు, డి.మనోజ్‌కుమార్, ఎం.సతీష్, ఎం.లోకేష్ ఎంపికయ్యారని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంతలక్ష్మణ్ దేవ్(అను) తెలిపారు. జిల్లా బృందానికి కోచ్‌గా పి.అప్పలరాజు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. వీరంతా శుక్రవారం సాయంత్రం ఇక్కడి నుంచి పయనమై విజయవాడ వెళ్లారు. కార్యక్రమంలో డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు, రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం బుగ్గిపాలు
మెళియాపుట్టి : గిరిశిఖర గ్రామం కేరాసింగిలో రెండెకరాలకు సంబంధించిన వరి ధాన్యం దగ్ధమైంది. చీడిగుడ్డి గవిరేసు తన భార్య భారతితో కలిసి రెండురోజుల క్రితం రెండెకరాల్లో వేసిన ధాన్యాన్ని కోతకోసి కల్లానికి చేర్చాడు. గురువారం రాత్రి వరకు యంత్రంతో నూర్చి కుప్పగా వేసి దానిపై టార్పాలిన్లు కప్పి ఇంటికిచేరాడు. కొద్దిసేపటికే పొలంలో మంటలు రావడంతో అక్కడికి వెళ్లి చూసేసరికి ధాన్యం కాలిపోయింది. ఎవరో గిట్టనివారు నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. -
ముందు జాగ్రత్తలే మేలు..
చలికాలంలో ముందు జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా రోగులు చల్లని గాలిలో, మంచు పట్టిన సమయంలో బయట తిరగటం మంచిది కాదు. అలర్జీలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. – డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరిటెండెంట్, పాతపట్నం చలి నుంచి రక్షణకు చిన్నారులకు స్వెటర్లు, వేడి నీటితో స్నానం చేయించాలి. వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ వి.మన్మధరావు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, సీహెచ్‌సీ, పాతపట్నం -
చలికాలం.. జరభద్రం!
● జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం మానుకోవాలి. అందుబాటులో ఉన్న డాక్టర్‌ను సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడాలి. ● కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ● వంట పాత్రలపై మూతలు తప్పనిసరిగా వేయాలి. ● చేతులు పరిశుభ్రత చాలా ముఖ్యం. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఆహారం తీసుకోకూడదు. ● శీతల పానీయాలు, ఐస్క్రీంలకు దూరంగా ఉండాలి. ● చిన్నారులను స్వెటర్లు లేకుండా బయట తిరగనీయకూడదు. శ్వాస సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో సమస్యలకు ఆస్కారం అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు -
ఉత్సాహంగా అంతర్ కళాశాలల పోటీలు
ఎచ్చెర్ల : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని కింజరాపు ఎర్రంనాయుడు వ్యవసాయ కళాశాలలో శుక్రవారం అంతర్ కళాశాలల క్రీడా పోటీలు, సాంసృతిక, సాహిత్య సమావేశాలను శుక్రవారం ప్రారంభించారు. స్థానిక కళాశాలతో పాటు 18 వ్యవసాయ కాలేజీలకు చెందిన 486 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ ఎల్.నారంనాయుడు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణకు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.జోగినాయుడు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బుడుమూరు శ్రీరామ్మూర్తి, వి.వి.ఎస్.ఎన్.మూర్తి, దుర్గాశ్రీనివాస్, ఐ.కిషోర్, డాక్టర్ ఆర్.రవికాంత్‌రెడ్డి, జి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక మార్పులకు అనుగుణంగా పరిశోధనలు
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై పరిశోధనలు చేయాలని విజయనగరం జేఎన్టీయూ డైరెక్టర్ జి.స్వామినాయుడు అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఐసీఈఎంటీఏ–25 పేరిట నిర్వహించిన రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మెటీరియల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ ఇంటిగ్రేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులు ఇంజినీరింగ్ విద్యకు నూతన దిశలను చూపుతున్నాయన్నారు. ఎమర్జింగ్ మెటీరియల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తు టెక్నాలజీలకు బాటలు వేస్తున్నాయని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక నిపుణులు పాల్గొని తాజా పరిశోధనలు, అభివృద్ధి అంశాలు, ఏఐ డేటా సైన్స్ అన్వయాలు వంటి అంశాలపై 188 పత్రాలు అందగా అందులో 110 ఎంపిక చేసినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు, బి.వి.రమణ, టి.నరేష్, రత్నమణి, ఎం.రమణయ్య, జయంతి, సంతోషకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వందేభారత్ రైలు ఢీకొని విద్యార్థిని మృతి
కంచిలి: మండల కేంద్రం కంచిలి వద్ద రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని సాలిన గంగోత్రి(తనూజ) మృతిచెందింది. బలియాపుట్టుగ కాలనీలో నివాసం ఉంటున్న ఈమె గొల్లకంచిలి గ్రామంలో ఉన్న తన మేనత్త ఇంటికి రైల్వే ట్రాక్ దాటి వెళుతుండగా గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని మృతిచెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్‌రావు శుక్రవారం తెలిపారు. తండ్రి పురుషోత్తం కళాసీ పనిచేస్తున్నాడు. ముగ్గురు కుమార్తెల్లో తనూజ పెద్దమ్మాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థిని మృతిచెందడంతో ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణిక్య, సహోపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. మృతురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. వ్యక్తి ఆత్మహత్య జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన బొమ్మాళి ఎండువాడు (61) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్షవాతం, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు భరించలేక మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ అశోక్‌బాబు తెలిపారు. కుమారుడు బొమ్మాళి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై డి.రాము, డి.శ్రీను, బి.గణేష్ శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా.. అతివేగంతో ముందువెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారా? అనే విషయం తెలియడం లేదు. గణేష్ అనే వ్యక్తికి కాళ్లు విరిగిపోయి, ఎడమ చెయ్యి తెగిపడటంతో గుర్తు తెలియని వాహనం పైనుంచి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునిస్వల్పగాయాలైన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్ర గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. -
పదోన్నతుల్లో అవకతవకలౖపై విచారణ!
అరసవల్లి/సారవకోట: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడుతుండటం పట్ల ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. జిల్లా డీఎంహెచ్ఓ శాఖలో పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించి, ఏడు రోజులు పూర్తి నివేదిక ఇవ్వాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కు జాతీయ ఎస్టీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 159 గ్రేడ్ 3 ఏఎన్ఎం ప్రమోషన్ విషయంలో అవకతవకలు జరిగాయని దళిత ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. దీనిపై కలెక్టర్ కమిటీ వేసి విచారణ చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది అధికారులు ముడుపులు తీసుకుని పదోన్నతుల జాబితా సిద్ధం చేశారని దళిత ఆదివాసీ సంఘాల ఆరోపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిగితే అర్హులైన గ్రేడ్–3 ఏఎన్ఎంలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 నుంచి అభ్యుదయ యాత్ర శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు, వాటి నిర్మూలనే లక్ష్యంగా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 15 నుంచి అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రజలంతా ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జె.ఆర్. పురం సర్కిల్ పరిధి నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ యాత్ర డిసెంబరు 29 వరకు కొనసాగనుందని వివరించారు. రెవెన్యూ, విద్యా, మెడికల్ అండ్ హెల్త్, ఉమెన్ అండ్ ఛైల్డ్‌లైన్, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొనేలా విద్యాసంస్థలు చొరవ తీసుకోవాలని, పట్టణాలతో పాటు ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమర్థ పోలీసులుగా తీర్చిదిద్దాలి శ్రీకాకుళం క్రైమ్: కానిస్టేబుల్ అభ్యర్థులకు సమగ్ర శిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి సమర్ధ పోలీసులుగా తీర్చిదిద్దాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, పోలీసు శిక్షణా కేంద్రం సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు అండగా నిలవాలన్నారు. నూతన చట్టాలు, పోలీసు నిబంధనలపై అవగాహన కల్పించాలని, నేరపరిశోధనల్లో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఆకట్టుకున్న మాక్ పోలింగ్ నరసన్నపేట: సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎస్ఎస్ఏ ఆదేశాల మేరకు విద్యార్థులతో యాక్టిజన్ క్లబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించామని హెచ్ఎం వకులా రత్నమాల తెలిపారు. వీరి ఎన్నిక పోలింగ్ పద్ధతిలో నిర్వహించారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్ధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.లక్ష్మణరావు, లీలారాణి, కేశవరావు, సుభాషిణి, లక్ష్మీ భవానీ, భీమారావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఖోఖో జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలబాలికలు, సీనియర్స్ పురుషులు మహిళల ఖోఖో జట్ల ఎంపికలు ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణం, కార్యదర్శి సీహెచ్ ఫాల్గుణరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సాదు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా ఉదయం 9 గంటలకు ఎంపికల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఎంపికై నవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. సీనియర్స్ విభాగానికి వయస్సుతో సంబంధం లేదని, జూనియర్స్‌కు మాత్రం 2025 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లులోపు బాలబాలికలు అర్హులని చెప్పా రు. వయస్సు, ఎత్తు, బరువు కలిపి 250 పాయింట్ల(ఇండెక్స్ 250)కు మించి ఉండకూడ దని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు 94419 14214 నంబర్‌ను సంప్రదించాలన్నారు. సోలార్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబునాయుడు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సాగర్‌నగర్‌లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసు మ్, పీఎం సూర్యఘర్, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. -
చేపల వేట కోసం దేనికై నా సిద్ధం
● పోర్టు, మత్స్యశాఖ అధికారులకు తేల్చిచెప్పిన మత్స్యకారులు బాట తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణంలో భాగంగా ఏ ఒక్క మత్స్యకారుడికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇప్పుడు చేపల వేట కూడా చేయవద్దంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. మా సమస్యలు చెప్పుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే తిరిగి వారి సమస్యలను చెప్పడం భావ్యం కాదన్నారు. పోర్టుతో పాటు ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో తమకు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, టెక్కలి మత్స్యశాఖ అధికారి ధర్మరాజు పాత్రో, మైరెన్ సీఐ రాము, మత్స్యకార సంఘ అధ్యక్షుడు గొరకల ఆదినారాయణ, మత్స్యకార నాయకులు కారాడ చిన్నబాబు, ఆలుపిల్లి పోతయ్య, రాజేష్, కారాడ చిన్నయ్య, కారాడ పోతయ్య తదితరులు పాల్గొన్నారు. రాజీపడలేం.. భద్రత విషయంలో రాజీపడితే మత్స్యకారులకే ప్రమాదమని పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. డ్రెడ్జింగ్ సమయంలో బోట్లు వస్తే ప్రమాదం జరిగి అందరూ బాధపడాల్సి వస్తుందన్నారు. ఆ ప్రాంతంలో కాకుండా మిగతా చోట వేట సాగించుకోవచ్చన్నారు. డ్రెడ్జింగ్ జరిగే ప్రాంతానికి బోట్లు వస్తే క్షణాల్లో ముక్కలైపోతాయని చెప్పారు. అయినప్పటికీ సమస్యను పోర్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో తమ జీవనాధారమైన సముద్రంలో చేపల వేట కోసం చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమేనని మత్స్యకారులు తెగేసిచెప్పారు. శుక్రవారం సంతబొమ్మాళి మండలం భావనపాడు జట్టి ప్రాంతంలో మత్స్యకారులతో పోర్టు, మత్స్యశాఖ, మైరెన్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రంలో చేపలు పడే ప్రాంతాన్ని ఆక్రమించుకొని గ్రిడ్జింగ్ పనులు చేపడుతున్నారని, ఇప్పుడు ఈ ప్రాంతంలో చేపల వేట చేయకూడదని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి10 గంటల వరకు సముద్రంలో డ్రెడ్జింగ్ పనులు ఆపేస్తే ఆ సమయంలో వేట చేసుకుంటామని చెప్పారు. పోర్టు నిర్మాణంలో భావనపాడు సముద్రం ముఖద్వారాన ఇసుకమేటలు వేయడం వల్ల మూడేళ్లుగా వేట సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇప్పుడు కోనేం, ఇతర చేపలు సమృద్ధిగా దొరికే అవకాశముందని, 45 రోజులు పాటు వేట చేయడానికి అవకాశం కల్పించాలని కోరారు. వేట సాగనివ్వకపోతే సుమారు 836 కుటుంబాలు వలస -
పర్మినెంట్ బీడీఓ కోసం విజ్ఞప్తి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో పర్మినెంట్ బీడీఓను నియమించాలని ఆ సమితి ప్రతినిధులు శుక్రవారం పంచాయతీ రాజ్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సమితి మాజీ అధ్యక్షుడు నరేంధ్ర కందాలియ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం భువనేశ్వర్ వెళ్లి పంచాయతీ రాజ్ మంత్రి రబి నాయిక్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. బొయిపరిగుడ సమితిలో కొత్త బీడీఓ బాధ్యతలు స్వీకరించలేదని, పనులు ఆగిపోతున్నాయని ఆయన తెలిపారు. జయపురం బీడీఓ శక్తి మహాపాత్రోకు బొయిపరిగుడ సమితి బీడీఓ బాధ్యతలు అదనంగా అప్పగించారని కానీ ఆయనకు సమయం సరిపోవడం లేదన్నారు. వెంటనే కొత్త బీడీఓను నియమించాలని కోరారు. సెంచూరియన్ వర్సిటీలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేపర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో నర్సింగ్ స్కూల్ విద్యార్థులు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే (యు.హెచ్.వి.) శుక్రవారం జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నర్సింగ్ ఫ్యాకల్టీ సభ్యులు రశ్మి జెన్నా అన్నారు. కార్యక్రమం జి.కాంచన అనే విద్యార్థి ప్రారంభించారు. ప్రజల్లో జీవనవిధానం మార్పులు అవసరం అని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ పథకం సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి శుభశ్రీ పాణిగ్రాహి, జి.అఖిల్, వి.ఈశ్వర్లు సహాయ సహకారాలు అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రిలయన్స్ మార్ట్ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మల్లిగాం గ్రామానికి చెందిన కూర్మారావు జిలకర (35)గా గుర్తించగా గాయాలు తగిలిన వారిలో అదే గ్రామానికి చెందిన బాబారావు హుయిక, తేజారావు హుయికలు ఉన్నారు. చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి స్థానిక రిలయన్స్ మార్ట సమీపంలో కూర్మారావు, బాబారావు, తేజారావులు మోటార్ సైకిల్ పార్కింగ్ చేసి దాని పక్కన నిలబడి ఉన్నారు. అదే సమయంలో జేకే పూర్ నుంచి వస్తున్న ఒక లారీ అదుపు తప్పి ఆగి ఉన్న మోటార్ సైకిల్‌ను ఢీకొనడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గాయాలు తగిలిన ముగ్గురినీ విశాఖపట్నం తరలించారు. అయితే మార్గమధ్యంలో కూర్మారావు మృతి చెందగా అతని మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకువచ్చారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారని, అందుకు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు చికిత్స పొందుతున్న ఇద్దరికీ సంబంధించిన ఖర్చులు లారీ యజమాని భరించాలని డిమాండ్ చేస్తూ మల్లిగాం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. -
పేదలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు శుక్రవారం నాడు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతీ నెల ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులతోపాటు రగ్గులను పంపిణీ చేశామన్నారు. విష ప్రయోగంతో చిరుత మృతి..?భువనేశ్వర్: సుందర్‌గఢ్ జిల్లా బొణై తమొడా రేంజ్లో చిరుత పులి మృతి చెందినట్లు గుర్తించారు. విషం పెట్టిన మృత ఎద్దుని పులి తినడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఖేసర అటవీ ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటనపై బొణై డీఎఫ్‌వో దర్యాప్తు చేపట్టారు.బార్లో అగ్ని ప్రమాదం భువనేశ్వర్: స్థానిక సత్యవిహార్ ప్రాంతంలోని ఒక బార్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆస్తి నష్టం మినహా ప్రాణహాని వంటి విషాద ఘటనలు చోటు చేసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపు ఒక గంట సేపు నిర్విరామంగా శ్రమించి మంటలు అదుపు చేసినట్లు చీఫ్ పైర్ ఆఫీసర్ రమేష్ మాఝి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య భువనేశ్వర్: స్థానిక సాహిద్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలోని ఆనంద్ బజార్ సమీపంలో చెట్టు కొమ్మకు వేలాడుతున్న యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. సాహిద్ నగర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ట్రక్కు ఢీకొని హెల్పర్ మృతి భువనేశ్వర్: పూరీ బట్టొగాంవ్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుకతో నిండిన హైవా అదుపు తప్పి సిమెంట్ ఇటుకలు రవాణా చేస్తున్న ట్రాక్టర్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో సహాయకుడు మరణించాడు. మృతుడు భాస్కర్ జెనా (40)గా గుర్తించారు. సదర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
● పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● రాష్ట్రంలో 16 చోట్ల 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతభువనేశ్వర్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతూ.. చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాదాపు 16 నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైందని ప్రాంతీయ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాగల 2 వారాల పాటు తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతాయని ముందస్తు సమాచారం జారీ చేశారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం చాలా చోట్ల ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు దిగజారింది. ఈ నెల 18 వరకు రాష్ట్రంలో చలి గజగజలాడిస్తుంది. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 25 వరకు రాత్రి పూట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. సెమిలిగుడలో కనిష్ట ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్‌గా, జి.ఉదయగిరిలో కనిష్ట రాత్రిపూట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జంట నగరాలు భువనేశ్వర్ మరియు కటక్‌లలో 14 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం సమాచారం. -
5 ఇ మోడల్ పుస్తకం ప్రజలకు అంకితం
జయపురం: స్థానిక విక్రమ విశ్వవిద్యాలయ నూతన అధ్యయన తృతీయ సభాగృహంలో 5 ఇ మోడల్ విద్యాదాన పద్ధతి పుస్తకం ప్రజలకు అంకితం చేశారు. 5 ఇ మోడల్ విద్యాదాన విశ్వవిద్యాలయ శిక్షక శిక్షణ విభాగం(బిఇడి) చీఫ్ ప్రభుత్వ ప్రొఫెసర్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్, ప్రభుత్వ ప్రొఫెసర్ లోకేష్ ప్రదాన్ రచించిన 280 పేజీల విశిష్ట పరిశోధన పుస్తకాన్ని ముఖ్య అతిథి విశ్వవిద్యాలయ కులపతి మహేహేశ్వర చంద్ర నాయిక్, స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రోల సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కులపతి, స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షులతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర కుమార్ మహరాణ, పుస్తక రచయితలు వేదికపై ఆశీనులయ్యారు. రచయిత ప్రొఫెసర్ లోకేష్ ప్రధాన్ పుస్తకంలో పొందుపరచిన అంశాలపై వివరించారు. ఈ పుస్తకం ఎలా గుణాత్మక విద్య దానం అందజేసేందుకు ఉపయోగపడుతుందో వివరించారు. ముఖ్యఅతిథి మహేశ్వర చంద్ర నాయిక్ మాట్లాడుతూవిశ్వ విద్యాలయ ప్రొఫెసర్లు అమూల్యమైన పుస్తకం రచించినందుకు పుస్తక రచయితలను ప్రశంసించారు. ఈ పుస్తకం ద్వారా విక్రమ విశ్వవిద్యాలయం దేశమంతా పరిచయం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పుస్తకం రచన సాధారణమైన విషయం కాదన్నారు. పుస్తకాన్ని ప్రజలకు అంకితం చేసినందుకు రచయితలను ఆయన అభినందించారు. ఇక ముందు ఈ పుస్తకం ప్రచురిస్తే రంగులతో ముద్రించాలని ఆయన సూచించారు. రచయితల్లో ఒకరైన ప్రొఫెసర్ మనోరంజన్ ప్రధాన్ పుస్తకంలో అంశాలను వివరిస్తూ ఈ పుస్తకం బిఇడి,శిక్షా స్నాతకోత్తర(యం.ఇ.డి)ఎడ్యుకేషన్ హానర్స్, ఎంఏ ఎడ్యుకేషన్, కోర్సులతో పాటు అందరికీ ఉపయోగకరమన్నారు. పుస్తకంలో 10 విభాగాలు ఉన్నాయని 5 ఇ మోడల్ విద్యాదాన పద్ధతి పుస్తకంలో తాంత్రిక, ప్రయోగాత్మక ఆలోచనతో పాటు, భౌతిక విజ్ఞానం, రసాయనిక విజ్ఞానం, ఆంగ్లం, ఒడియా భాషలతో పాటు చరిత్ర, అర్ధనీతి, విద్యా బోధన పద్ధతి, విద్యా బోధన పద్ధతుల నమూనాలు పుస్తకంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయిక్, అనుపమ మిశ్ర, పరచిత మహాపాత్రో, సుజాత బేజ్, ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు చందన మహారాణ, శుభశ్రీ పట్నాయిక్, సత్యనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు. -
సెంచూరియన్ యూనివర్సిటీ–చత్తీస్‌గఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ మధ్య ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
గజపతి క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం
పర్లాకిమిడి: రాష్ట్రస్థాయి 69వ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలలో విజేతగా నిలిచి కప్పుతో తిరిగొచ్చిన పర్లాకిమిడి క్రికెట్ జట్టుకు స్థానిక రైల్వేస్టేషన్లో శుక్రవారం స్థానికుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ విజయం సమగ్ర గజపతి జిల్లాలో ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు నబకిశోర్ శోబోరో కితాబునిచ్చారు. జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా శిక్షవిభాగం పాఠశాల పీఈటీ సురేంద్ర పాత్రో, తదితరులు రైల్వేస్టేషన్‌కు విచ్చేసి ట్రోఫీతో వచ్చిన క్రికెట్ ఆటగాళ్లను అభినందించారు. -
నగదు విత్ డ్రా చేసుకోవచ్చు
పర్లాకిమిడి: బ్యాంకు డిపాజిటర్లు, బ్యాంకు మ్యూచువల్ ఫండ్లు, జీవిత బీమా సంస్థల్లో పెట్టుబడులు పెట్టి కొన్నేళ్లుగా ఫ్రీజ్ అయిన సొమ్ములు ప్రస్తుతం ఆర్బీఐ సరళీకృత విధానంతో తిరిగి విత్ డ్రా చేసుకోవచ్చని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారి రితేష్ కుమార్ పాత్రో తెలిపారు. స్థానిక టౌను హాలులో బ్యాంకర్స్, బీమా సంస్థలు, సెబీ ఆధ్వర్యంలో ‘మీ సోమ్ము.. మీ అధికారం’ అభియాన్‌ను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్య అతిథిగా శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్, ఏడీఎం మునీంద్ర హానగ, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు పాల్గొనగా, గజపతి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ మండల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధికి చెక్కులు పంపిణీ చేశారు. -
సాంకేతికత అట్టడుగు వర్గాలకు చేరాలి
● గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్: సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మానవ సంక్షేమానికి దోహదపడాలని, వరదల నుంచి దుర్భల గ్రామాలను రక్షించడం, రైతులకు పంటల సాగు ప్రణాళిక రూపకల్పన, సంద్రం నడి బొడ్డున వేటలో నిమగ్నమైన మత్స్యకారులు సకాలంలో సురక్షితంగా తీరం చేరడం, నగరాల్లో వాయు కాలుష్య నివారణ తదితర దైనందిన కార్యకలాపాల్లో సాంకేతికత అణువణువుగా అండగా నిలిచి సార్థకం కావా లని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. ఐఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన ఐఈఈఈ ఇండియా జియోసైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ సింపోజియం (ఐఎన్జీఏఆర్ఎస్ఎస్ 2025) ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైజ్ఞానిక ఆవిష్కరణలు నిరంతరం ప్రజా సంక్షేమానికి సేవ చేయాలని గవర్నర్ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, యువ మేధావులకు ఈ సమావేశం మెరుగైన భవిష్యత్ ఆవిష్కరణకు అవసరమైన ఉత్సుకత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని దేశ, విదేశాల నుండి విచ్చేసిన నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సింపోజియం ఉత్తమం విశ్వం, ఉజ్వలం భవిష్యం–మెరుగైన ప్రపంచం, ప్రకాశవంతమైన భవిష్యత్తు ఇతివృత్తంతో సంకల్పించిన ఈ కార్యక్రమం జియోసైన్స్, రిమోట్ సెన్సింగ్ రంగాలు విపత్తులను అంచనా వేసి వ్యవసాయానికి మద్దతు కల్పించడం, అడవులను సంరక్షణ, పట్టణ ప్రణాళికకు మార్గనిర్దేశాల్ని ఖరారు చేసి దైనందిన జీవితాన్ని ప్రత్యక్షంగా దోహదపడేలా జయప్రదం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రం చేసిన ప్రయాణం ప్రపంచ గుర్తింపును పొందడం విశేషం. ఉపగ్రహ సమాచారం, రాడార్ ఇమేజింగ్ మరియు జియోస్పేషియల్ అనలిటిక్స్, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసి ఫైలిన్, ఫణి, యాస్ మరియు ఇటీవల మొంథా వంటి తుఫానుల సమయంలో పెద్ద ఎత్తున తరలింపులను చేపట్టి అపార ప్రాణ హాని నివారించడం సాంకేతికతని సకాలంలో వాస్తవ కార్యాచరణకు సానుకూలంగా మలచుకోవడం విపత్తు నిర్వహణలో దక్షతకు నిదర్శనంగా పేర్కొన్నారు. రాష్ట్రం అటవీ, వ్యవసాయం, ఖనిజ పదార్థాల తవ్వకాల నియంత్రణ, నీటి నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణలో జియోస్పేషియల్ సాధనాలను సద్వినియోగపరచుకుంటుందన్నారు. డిజిటల్ మహా సముద్ర పటాలు మరియు రిమోట్ సెన్సింగ్ ఆధారిత ఫిషింగ్ జోన్ అంచనాలు తీరప్రాంతంలో జీవనోపాధిని గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సు ప్రయోగంతో ఉపగ్రహ చిత్రాల ఏఐ–ఆధారిత విశ్లేషణ వాతావరణ పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, నీటి సంరక్షణ మరియు వ్యవసాయ కార్యకలాపాల్ని మరింత మెరుగుపరుస్తుందని గవర్నర్ అన్నారు. పరిశోధనల ద్వారా ఉత్పత్తి చేయబడిన జ్ఞానం చివరికి చేరుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. ‘సాంకేతిక పరిజ్ఞానం అట్టడుగు వర్గాలకు చేరుకని కలు పుకొనిపోయినప్పుడే అర్థవంతంగా పరిణతం అవు తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రముఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ అహుజా, ఎలక్ట్రానిక్, సాంకేతిక సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ కుమార్ రౌత్, జీఏఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ సైబున్ థుట్జా, నాసా శాస్త్రవేత్త డాక్టర్ పాల్ ఎ. రో సెన్, ఐఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్ ఘోష్, జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫె సర్ సుస్మితా ఘోష్ తదితరులు ప్రసంగించారు. -
● హిమాలయాలను ఎక్కేసింది..
● జయపురం విద్యార్థిని ఘనతజయపురం: జయపురంలోని విక్రమదేవ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని హీరాశీశ హిమాలయాల్లోని గోరిచిన్ శిఖరాన్ని అవరోహించి రికార్డు సృష్టించి కొరాపుట్ జిల్లాకు పేరు తెచ్చింది. ఆమె విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో +3లో రెండో సంవత్సరం చదువుతోంది. ఎన్సీసీ కేడెట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. సముద్ర మట్టానికి 21 వేల అడుగుల (7 వేల మీటరు) ఎత్తుకు చేరి రికార్డు సృష్టించింది. హీరాశీశది కొరాపుట్ జిల్ల లక్ష్మీపూర్ సమితి గున్నయపడ గ్రామం. తల్లిదండ్రులు సమర శీశ, ఉల్లాష శీశ వ్యవసాయ కార్మికులు. హిమాలయ పర్వత్వాన్ని సునాయాశంగా ఎక్కేసి విక్రమదేవ్ విశ్వవిద్యాలయానికిపేరు తెచ్చిన హీరా శీశను రిజిస్టార్ మహేశ్వరకుమార్ నాయిక్ తదితరులు శుక్రవారం సత్కరించి అభినందించారు. -
వణుకుతున్న కొరాపుట్
కొరాపుట్: కొరాపుట్‌పై చలిపులి దాడి చేస్తోంది. గురువారం కొరాపుట్ జిల్లా దమంజోడి లోని భారత అల్యూమినియం కేంద్రం వద్ద 2.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కశ్మీర్‌ని తలపిస్తూ కొన్ని చోట్ల మంచు కురుస్తుండడం విశేషం. సిమిలిగుడ పట్టణం సమీపంలోని డొంగుడ ప్రాంతంలో క్రిస్టియన్ శ్మశానం ప్రాంతంలో ఉదయం పొలాల్లో వస్త్రాలపై మంచు ముక్కలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తలుపులు తీయడానికే భయపడుతున్నారు. రాత్రి పూట ప్రయాణాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ జిల్లాలో జాతీయ రహదారులపై కూడా రాత్రి పూట వాహనాలు అలికిడి లేకుండా పోయింది. ఈ ప్రాంతం నుంచి సుదూరంగా వెళ్లే రాత్రి పూట అంతర్రాష్ట్ర బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి. -
రామనగుడలో ఘోర రోడ్డు ప్రమాదం
● ఇద్దరు విద్యార్థుల మృతి రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధిలో గల రామనగుడ సమితి పాలుపాయి మలుపు వద్ద గురువారం నాడు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు జిల్లాలోని గుడారిలో గల సౌరా వీధికి చెందిన దేవేంద్ర సబర్ (21), ఢెప్పాగుడ వీధికి చెందిన విష్ణు సబర్ (21) లుగా గుర్తించారు. రామనగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. దేవేంద్ర, విష్ణులు రామనగుడ సమీపంలో గల బడిషాల ప్రాంతంలో గల ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నారు. గురువారం తమ స్వగ్రామమైన గుడారి నుంచి ఒక బైకుపై పాఠశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో రామనగుడ సమితిలోని పాలపాయి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సును అదుపు తప్పి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రగాయాలకు గురై సంఘటన స్థలంలో మృతి చెందారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
సూరీడి ఇంటి గుట్టు
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇసుక పొరల మాటున.. ● కోణార్క్ గర్భ గృహంలో ఏముందో..? ● 122 ఏళ్ల తర్వాత బృహత్తర ప్రయత్నం పూర్వాపరాలు రాష్ట్ర స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ కప్ కై వసం భువనేశ్వర్: కోణార్క్ సూర్యదేవాలయం గర్భగుడి రహస్యం వీడే సమయం దగ్గరపడుతోంది. గత 122 సంవత్సరాల నుంచి ఈ ఆలయ గర్భ గుడి నాట్య మండపం మూత బడి ఉంది. నల్ల పగోడాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యునెస్కో వారసత్వ కట్టడం గుర్తింపు పొందింది. అపురూపమైన శిల్ప కళకు కోణార్క్ సూర్య దేవాలయం ప్రతీతి. ఆబాలగోపాలానికి నిరంతరం ఆకట్టుకునే సూర్య దేవాలయం లోపల ఏం ఇమిడి ఉందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అతి త్వరలో ఈ ఉత్కంఠ తొలగే సంకేతాలు బలపడుతున్నాయి. గర్భగుడి లోపల ఇసుక నింపి మూసి వేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఇసుకను తొలగించి లోపల ఉన్న కళాకృతులు వగైరా వివరాల ఆచూకీ తేల్చేందుకు భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) రంగంలోకి దిగింది. 13వ శతాబ్దపు స్మారక చిహ్నం నిర్మాణ పరిరక్షణలో కోణార్క్ సూర్య దేవాలయం ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. 122 ఏళ్ల తర్వాత 122 ఏళ్ల తర్వాత భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) దేవాలయం గర్భగుడిలో నింపిన ఇసుక నిక్షేపాన్ని తొలగించే సున్నితమైన ప్రక్రియను ప్రారంభించింది. దీర్ఘకాలంగా మూసి ఉన్న గది లోపల ఏమి ఉందో అనే ప్రపంచ వ్యాప్త ఉత్సుకతను రేకెత్తిస్తుంది. కోణార్క్ సూర్య దేవాలయం నిర్మాణం కూలిపోకుండా నిరోధించడానికి బ్రిటిష్ వారు 1903, 1909 మధ్య గర్భగుడిని ఇసుకతో నింపారు. గర్భగుడి పైకప్పునకు దన్నుగా నిలిపిన ఇనుప దూలాలు, రాళ్లు పేరిక సడలినట్లు గమనించడంతో బృహత్తర అపురూప కళాఖండం కుప్పకూలిపోకుండా దీర్ఘ కాల సంరక్షణ కోసం ఇసుకతో నింపినట్లు నిపుణులు ధ్రువీకరించారు. పైకప్పు కూలిపోకుండా ఉండటానికి వారు గర్భగుడి చుట్టూ 15 అడుగుల ఎత్తైన లోపలి రాతి ప్రాకారం నిర్మించి ఇసుక, రాతి ముక్కలతో నింపారు. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పూరీ సర్కిల్ సూపరింటెండెంట్ డీబీ గొడొనాయక్, ప్రాంతీయ డైరెక్టర్ దిలీప్ ఖమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 10 మంది సభ్యుల నిపుణుల బృందం కోణార్క్ సూర్య దేవాలయం సమగ్ర నిర్మాణ శైలిని పరిశీలించి సమీక్షించింది. ఆలయం రాతి గోడల స్థితిని ముందస్తుగా పరిశీలించి గర్భగుడి మొదటి వేదిక యొక్క పశ్చిమ వైపున 4 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో చతురస్రాకారం సొరంగం తవ్వకానికి రంగంలోకి దిగింది. పెద్ద పరిమాణంలో ఇసుకను తొలగించే ముందు అంతర్గత స్థిరత్వాన్ని అంచనా వేయడానికి వీలుగా గర్భగుడి కుడి వైపున 9 మీటర్ల పొడవు, 16 సెంటీమీటర్ల వెడల్పుతో కోర్ డ్రిల్లింగ్ చేశారు. ఈ సన్నాహం ఫలప్రదమై ఇసుక పొరను తాకింది. ఈ దశలో గర్భగుడి గోడలు ఎనిమిది మీటర్ల మందంతో ఉన్నాయని ఏఎస్ఐ ఇంజనీర్లు ధ్రువీకరించారు. కొనసాగుతున్న వెలికితీత ప్రక్రియ ప్రాచీన ఆలయ నిర్మాణాత్మక శైలికి ఏమాత్రం ముప్పు లేకుండా చేపడుతున్నట్లు నిపుణుల వర్గం భరోసా ఇచ్చింది. క్రమంగా ఆలయంలో నిండిన ఇసుక పొర తొలగించడం సాధ్యం అవుతుండగా నిపుణులు ఆలయం పైకప్పు రాళ్ల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రాచీన ఆలయం దీర్ఘకాలిక భద్రత నిర్ధారణకు సుస్థిర ప్రణాళిక రూపకల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇసుక వెలికితీత ప్రయత్నం విజయవంతమైతే శతాబ్దానికి పైగా మూతబడిన గర్భగుడిలోకి పర్యాటకులు ప్రవేశించి గర్భ గుడిలో ఇసుక పొరల మధ్య దాగిన అపురూప శిల్పాలను వీక్షించే దీర్ఘకాల కల సాకారం అవుతుంది. 13వ శతాబ్దానికి చెందిన పూర్వపు కళింగ రాతి శిల్పాలు, సంక్లిష్టమైన వాస్తుశిల్పం యొక్క గొప్పతనాన్ని కలిగి ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం భారీ నాట్య మండపం, జగమోహన్ను ప్రపంచ ప్రజలు వీక్షించగలుగుతారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క తదుపరి దశ పరిరక్షణ ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నారు. కోణార్క్ సూర్య దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ స్మారక చిహ్నం నుంచి ఇసుక తొలగింపు మా కలల ప్రాజెక్ట్. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏఎస్ఐ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ జనరల్ మేము చాలా జాగ్రత్తగా ఆచి తూచి దీనిపై పని చేస్తున్నామని సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డీబీ గొడొనాయక్ అన్నారు. ఏఎస్ఐ సాహస కృత్యం ప్రపంచ వారసత్వ కోణార్క్ సూర్య దేవాలయం గర్భ గుడిలో నిక్షిప్తంగా ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చేందుకు భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ రంగంలోకి దిగడం సాహసోపేత చర్యగా యునెస్కో అభినందించింది. ఇదో ఆరోగ్యకరమైన సంకేతంగా యునెస్కో పేర్కొంది. గర్భగుడిలో నిండిన ఇసుక తొలగించడం వల్ల పురాతన ఆలయ ఇంజినీరింగ్ నైపుణ్యత వెల్లడవుతుందని యునెస్కో భావిస్తుంది. ధాన్యం కుప్పలు దగ్ధం నిర్మాణాత్మక నష్టాన్ని నివారించడానికి 1903 సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు ఈ గర్భగుడిని ఇసుక, రాళ్లతో నింపిన 122 ఏళ్ల తర్వాత అంతర్గత స్థితిని అంచనా వేయడానికి రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) లేజర్ స్కానింగ్, ఎండోస్కోపిక్ అధ్యయనాలను నిర్వహించి సీలు చేసిన స్థలం లోపల రోబోటిక్ కెమెరాలను మోహరించింది. అలాగే 2011 సంవత్సరంలో పరిరక్షణ వ్యూహాలను చర్చించడానికి ఒక అంతర్జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. దీని తర్వాత ఒడిశా ఉన్నత న్యాయ స్థానం స్మారక చిహ్నం యొక్క పరిస్థితిని పరిశీలించడానికి అమికస్ క్యూరీని నియమించింది. 2020లో జరిగిన ఉన్నత స్థాయి భారత పురావస్తు సర్వే ఏఎస్ఐ సమావేశం చివరకు ఇసుక తొలగింపు ప్రక్రియను కొనసాగించాలనే నిర్ణయాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం ప్రాథమిక డ్రిల్లింగ్ తర్వాత గర్భ గృహం లోపలి ఇసుక, రాతిని సేకరించారు. వాటి నమూనా పరీక్ష కోసం ఐఐటీ మద్రాస్, ఐఎంఎంటీ భువనేశ్వర్‌లకు పంపారు. -
రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు మృతి
జయపురం: ఒడియా దినపత్రిక ‘సంబాద్’ జయపురం పాత్రికేయులు అశోక్ పొలాయ్(49) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బుధవారం ఆయన నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ సమీప అత్తగారి గ్రామం ధొహణ లో బందువు దహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. నవరంగపూర్ జిల్లా డాబుగాం సమీప జయగురు సమీపంలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానిక ప్రజలు అతడిని డాబుగాం కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తలరించారు. అతడిని పరీక్షించిన డాక్టర్ అశోక్ పొలాయి మరణించినట్లు ప్రకటించారు. అతని మృతదేహాన్ని గురువారం జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పోస్టుమార్టం జరిపి బంధువులకు అప్పగించారు. అశోక్ మరణ వార్త విన్న జయపురం పాత్రికేయులు అతడి ఇంటికి వెళ్లి కన్నీటి నివాళులు అర్పించారు. అశోక్ పాత్రికేయుడే కాదు మంచి రచయిత,సాహిత్యకుడు, సమాజ సేవకుడు కూడా. -
ఢిల్లీకి కాంగ్రెస్ నాయకులు
రాయగడ: ఈనెల 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఓట్ చోరీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు గురువారం ఢిల్లీకి పయనమయ్యారు. రాయగడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక నేతృత్వంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు కార్తిక్ నాయక్, బప్పీ పట్నాయక్, అస్లామ్ ఖాన్, హరీష్ పట్నాయక్ తదితరులు ఢిల్లీ వెళ్లినవారిలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు తామంతా ఆందోళనలొ పాల్గొనేందుకు పయనమైనట్లు ఎమ్మెల్యే కడ్రక తెలియజేశారు. పర్లాకిమిడి బైపాస్ రోడ్డుకు సర్వే పర్లాకిమిడి: ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పర్లాకిమిడి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు 4 కిలోమీటర్ల దూరంతో రూ.39 కోట్లతో నిర్మించనున్న బైపాస్ రోడ్డు పర్లాకిమిడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజిపూర్ రోడ్డు నుంచి హత్తిబడి మీదుగా గుమ్మా గెడ్డ వరకు చేపట్టనున్నారు. దీనికోసం డెంకనాల్ నుంచి అరుణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎఫైర్స్ ఇంజినీరు మనోరంజన్ మిశ్రా జాజిపురం గ్రామానికి విచ్చేసి సర్వే కోసం రైతులతో మాట్లాడారు. బైపాస్ రోడ్డు నిర్మిస్తే పర్లాకిమిడిలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణానికి 33 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉందని మిశ్రా పేర్కొన్నారు. రెండు రోజులు పాటు ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. లారీ – పికప్ వ్యాన్ ఢీ రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరానికి వెళ్లే రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున లారీ, పికప్ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పికప్ వ్యాన్ ముందరి భాగం నుజ్జునుజ్జయ్యింది. అదేవిధంగా లారీ ముందరి భాగం కొంత దెబ్బతిన్నది. పికప్ వ్యాన్ డ్రైవరు స్పల్పగాయాలతో బయటపడ్డాడు. మంచు వలన రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అక్కడివారు చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అదేవిధంగా పికప్ వ్యాన్, లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రీ జగన్నాథునికి మహా స్నానం భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న వేదికపై శ్రీ జగన్నాథ స్వామికి మహా స్నానం నిర్వహించారు. గురువారం మధ్యాహ్న ధూపం తర్వాత లోపలి వాకిలి దగ్గర వాంతి తారసపడింది. దీంతో ఆలయ ఆచారం ప్రకారం శుద్ధి వగైరా తంతు ముగించి సర్వ దర్శనాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో సుమారు 4 గంటలపాటు శ్రీ జగన్నాథుని సర్వ దర్శనానికి అంతరాయం ఏర్పడింది. వ్యర్థాల వినియోగంపై అవగాహన రాయగడ: వ్యర్థాలను వినియోగించి వాటి ద్వారా అవసరమైన సేంద్రియ ఎరువులను రూపొందించే ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు మున్సిపాలిటీ యంత్రాంగం అవగాహన కల్పించింది. స్థానిక సెంట్జేవియర్స్కు చెందిన సుమారు 500 మంది విద్యార్థులకు మున్సిపాలిటీ యంత్రాంగం వంటిగుడలో నిర్వహిస్తున్న వెల్త్ సెంటర్, ఎఫ్ఎస్టీపీ కేంద్రాలను చూపించారు. వ్యర్థాల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేశామని మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తెలియజేశారు. -
మాస్టర్స్ పోటీల్లో సత్తాచాటాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: మాస్టర్స్ అథ్లెటిక్స్ రాష్ట్రపోటీల్లో పతకాల పంట పండించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని జిల్లా మా మాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేష న్ హైస్కూల్ వేదికగా మా అథ్లెటిక్స్ అధ్యక్షుడు ఎండీ కాసింఖాన్ కళావతి ఆధ్వర్యంలో ఎంపికై న అథ్లెట్లకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాపట్లలో ఈ నెల 12 నుంచి జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్న మాస్టర్స్ అథ్లెట్స్ తుది జాబితాను ప్రకటించారు. వివిధ విభాగాల్లో పురుషులు, మహిళలు కలిపి 21 మందిని ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెస్సార్ మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాష్ట్రపోటీల్లో పతకా ల మోద మోగించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులందరికి కాసీంఖాన్ దంపతుల మనమరాలు సఫి యా కమల్ పేరున క్రీడా దుస్తులు, ట్రాక్ షూట్, టీ షర్ట్లు అందజేసినట్లు తెలిపారు. డీఎస్ఏ కోచ్ అర్జున్‌రావు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపోటీల్లో మొద టి రెండుస్థానాల్లో నిలిచినవారు జాతీయ పోటీలకు ఎంపికవుతారని చెప్పారు. కార్యక్రమంలో పలువు రు మాస్టర్ అథ్లెట్లు, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. -
కన్ను పడిందా.. స్థలం గోవిందా!
నరసన్నపేట : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం అన్న చందంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేస్తున్నారు. దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. అనుమతులు లేకుండా పలుచోట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలు స్థలాలను కబ్జా చేసిన అధికార పార్టీ కార్యకర్తలు తాజాగా జాతీయ రహదారికి ఆనుకొని తామరాపల్లి వద్ద పాత సర్వే నంబర్ 3/15ఎ (ఎల్పీ 11)లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తామరాపల్లి, జమ్ములకు చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఈ స్థలంలో నిర్మాణ పనులు చేపడుతున్నారు. విలువైన ఈ స్థలాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వ యంత్రాంగం కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీరి కన్ను పడటంతో స్థలం కబ్జాకు గురవుతోందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఈ స్థలం లక్షలు విలువ చేస్తుందని చెబుతున్నారు. ఈమేరకు తామరాపల్లికి చెందిన ముచ్చ గణేష్ సంబంధిత అదికారులకు ఈ స్థలం ఆక్రమణల గురించి తెలియజేశారు. వెంటనే తహసీల్దార్ స్పందించి వీఆర్వో లుకలాపు శ్రీనును పంపించి పరిస్థితిని తెలుసుకున్నారు. పనులు తాత్కాలికంగా నిలుపుద ల చేశారు. ఈ స్థలంలో ఎటువంటి పనులు చేయవద్దని వీఆర్వో ఆక్రమణదారులకు సూచించారు. ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారని, స్థలాన్ని పరిరక్షించి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని గణేష్ విజ్ఞప్తి చేశారు. బొడ్డవలస రెవెన్యూ పరిధిలో.. మరోవైపు, నరసన్నపేట పంచాయతీ బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 46/1ఎలో ఉన్న జిరాయితీ భూమికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలా న్ని ఆక్రమించుకోవడానికి పట్టణానికి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి దిబ్బలను చదును చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వీఆర్వో శ్యామ్ ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే జిరాయి తీ పేరిట శ్మశానం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాజేసే అవకాశం ఉందని, సర్వే చేసి శ్మశాన స్థలం నిర్ధారించాల స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే రాతికర్ర చెరువులో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌కు నరసన్న పేట ఎంపీపీ ఆరంగి మురళీ తదితరులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇందిరానగర్‌లోని బిల్డింగ్ సొసైటీ స్థలంలో నిబందనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోంది. సుడా అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చి తర్వాత స్టాప్ ఆర్డర్ఇచ్చారు. తదుపరి అనుమతులు పొందే వరకూ పనులు చేపట్టవద్దని ఆదేశించినా పనులు యథేఛగా జరుగుతున్నాయి. ఇలా అధికార పార్టీ వర్గీయులు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మాజీ మంత్రిని కలిసిన కోడూరు
పర్లాకిమిడి: కేంద్ర మాజీ మంత్రి బిశ్వేశ్వర్ తుడును ఒడిశాలోని గజపతి జిల్లా బీజేపీ ఇన్ చార్జిగా నియమించారు. ఆయనను భువనేశ్వర్ లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు నబకిశోర్ శోబో రో, మోహనా నియోజకవర్గ నాయకులు ప్రశాంత్ మల్లిక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. గజపతి జిల్లా పర్యటనకు ఆహ్వా నించారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని త్రిముఖ వ్యూహాంతో ఎలా పనిచేయాలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించాలని కోడూరు నారాయణరావు కోరారు. పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో గురువారం పశువైద్యం, జంతు సంరక్షణ నూతన విద్యార్థుల ఫ్రెషర్స్ డేను సీనియర్ విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆహ్వానం పలికారు. ‘వెటోరియా–2025’ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాళ్ విశ్వవిద్యాలయం యానిమల్ హజ్బెండరీ, వైస్‌చాన్సలర్ తీర్థ కుమార్దత్త ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. నూతన పశువైద్య విద్యార్థులకు వైట్‌కోట్ అందజేసి వారికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ డాక్టర్ బిశ్వజిత్ మిశ్రా, అజయ్ కుమార్‌నాయక్, రిజిస్ట్రార్ అనితా పాత్రో, వెటర్నరీ స్కూల్ డీన్ ఆర్.కె స్వయిని, డైరెక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, కోఆర్డినేటరు దంగే టి దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సెంచూరియన్ వెటర్నరీ స్కూల్ పశు వైద్యశాలలో మేకలకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించారు. ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని కాళింగ మన్నయ్యపేటలో సువ్వారి స్వామినాయుడు, కూన మోహనరావులకు చెందిన వరి కుప్పలకు బుధవారం అర్ధ రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిద య్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంట లను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 90 సెంట్లకు సంబంధించిన వరి కుప్పలు మొత్తం కాలిబూడిదయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కాలిపోవడంతో బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విష యం తెలుసుకున్న ఏఎస్ఐ టి.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన వరికుప్పలను పరిశీలించారు. అగ్నిమాపక అధికారి బొడ్డేపల్లి హరినారాయణ, వీఆర్వో ఇంద్ర పాల్గొన్నారు. గత ఏడాది కూడా.. ఇదే గ్రామంలో గురుగుబెల్లి రాజశేఖర్ అనే రైతుకు చెందిన వరి కుప్పలను గత ఏడాది దగ్ధం చేశారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించ డంతో ఈ ఏడాది కూడా అదే మాదిరిగా వరికుప్పలను దగ్ధం చేశారని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో చొక్కాకుల బంధ ఆక్రమణలు తొలగించడం వల్లే ఈ విధంగా వరికుప్పలను దగ్ధం చేస్తున్నారని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రణస్థలం: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు పైడిభీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో అఖిల భారత మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సీఐటీయూ అగ్రభాగాన నిలి చిందన్నారు. దేశంలో వివిధ రంగాల కార్మికులను, సంఘాలను ఐక్యం చేసి బలమైన కార్మిక వర్గ పోరాటాలను నిర్మించేందుకు ఆర్.కె. బీచ్ లో జరిగే మహాసభలు దోహదపడతాయన్నా రు. సమావేశంలో కార్మికులు, అంగన్వాడీ, ఆశ,మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్క ర్స్ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెలమల రమణ, వెంప డాపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా నడక పోటీలు
రాయగడ: ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్థానిక కొరాపుట్ కూడలిలో సీనియర్ సిటిజన్ల మధ్య నడక పోటీలను నిర్వహించారు. 50 నుంచి 60 ఏళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారి మధ్య నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు కూడా పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా 50 నుంచి 60 ఏళ్ల లోపు వారికి మధ్య జరిగిన పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో ప్రథమ బహుమతిని చిత్తరంజన్ రఽథ్, ద్వితీయ బహుమతిని బుద్దురాం మహాంతి, తృతీయ బహుమతిని హరీష్ చంద్ర సాహు సాధించారు. ప్రోత్సాహక బహుమతులను సుభాష్ చంద్రబారిక్, హరప్రసాద్ నల్ల సాధించారు. ఇదే కేటగీరీలో మహిళల మధ్య జరిగిన పోటీల్లో సుజాత మదల ప్రథమ బహుమతిని, సుజాత బారిక్ ద్వితీయ, సులుత ప్రధాన్ తృతీయ బహుమతులను పొందారు. 60 ఏళ్ల పైబడిన వారి మధ్య జరిగిన పోటీల్లో ట్రపతి పండా ప్రథమ బహుమతి, మహమ్మద్ అబ్దుల్ ఆలీజాన్ ద్వితీయ, సత్యానారాయణ మిశ్రో తృతీయ బహుమతిని సాధించారు. గుల్ల వేనకతారస్, డాక్టర్ బాబూరావు మహంతి ప్రోత్సాహక బహుమతులు పొందారు. విజేతలకు స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే జిల్లా స్థాయి చొయితీ ఉత్సవాల్లో బహుమతులను అందజేస్తామని క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ తెలియజేశారు. -
ఏకలవ్య ఆదర్శ పాఠశాల విద్యార్థి మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి దమణహండిలో గల ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి బుధవారం మృతి చెందాడు. విద్యార్థి మృతికి విద్యాలయ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి శ్రీరామ భూమియ(12) అని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అతడిది ఘుమర గ్రామ పంచాయతీ గుడియగుడ గ్రామం. నవంబర్ 24వ తేదీన జ్వరం వచ్చింది. స్కూలు అధికారులు 25న తల్లికి పద్మ భూమియకు కబురు చేశారు. విద్యార్థిని ఇంటికి పంపించి ఊరుకున్నారు. విద్యార్థి తల్లి జయపురం జిల్లా కేంద్ర హాస్పిట్‌కు, అనంతరం కొరాపుట్ జిల్లా సాహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు మెరుగైన చికిత్స కోసం తరలించింది. స్కూలు అధికారులు విద్యార్థి ఆరోగ్య స్థితిని పట్టించుకోలేదు. శ్రీరామ్ భూమియ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి మరణానికి ప్రధాన కారణం ఏకలవ్య విద్యాలయ విద్యాధికారులే కారణమని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. పాత్రికేయులు కొందరు ప్రజల ఆరోపణను ఏకలవ్య ఆదర్శ విద్యాలయ ప్రిన్స్‌పాల్ నిరంజన్ నిరోల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆరోపణలను ఆయన ఖండించారు. శ్రీరామ భూమియకు జ్వరం రాగా పాఠశాల నర్స్ చికిత్స చేసిన తరువాత అతడి ఇంటికి కబురు చేసి పంపామని వెల్లడించారు. విద్యార్థి మరణించినట్లు సమాచారం అందిన ఆదివాసీ భొత్ర వికాశమంచ్ నేతలు, సమాజ సేవకుడు రంజన్ కుమార్ పట్నాయిక్, కె.రాజ శేఖరరావు, తదితరులు తల్లిని కలిసి సంతాపాన్ని తెలిపారు. తమవంతు సహాయం అందిస్తామని తెలిపారు. తన కుమారునికి జ్వరం అని తనకు తెలిపారని, కానీ మెరుగైన చికిత్స చేయించలేదని తల్లి పద్మ భూమియ ఆరోపించింది. బుధవారం విద్యాలయ అధికారులు తనకు కబురు చేసి రూ.5 వేలు పంపారని తెలిపింది. -
నృత్యోత్సవ వేడుక
సిక్కోలు వేదిక.. ● రేపు బాపూజీ కళామందిర్లో ‘సప్తమీ నాట్యోత్సవం’ ● ప్రదర్శనకు సిద్ధమైన ఐదుగురు ప్రపంచస్థాయి కళాకారులు ● సంగీత గురు రఘునందన్‌కు లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు శ్రీకాకుళం కల్చరల్ : మరో మహత్తర వేడుకు సిక్కోలు సిద్ధమైంది. ఈ నెల 13న శ్రీకాకుళం నగరానికి చెందిన శివశ్రీ నృత్యకళానికేతన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఐదుగురు ప్రపంచస్థాయి కళాకారులు ‘సప్తమీ నాట్యోత్యోత్సవం’ పేరిట అద్భుత నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు సురేంద్రనాథ్(కూచిపూడి), బిజీనా సురేంద్రనాథ్(మోహినీయాట్టం), సౌరవ్‌రాయ్(కథక్), పరిమళ(భరతనాట్యం), ప్రీతీప్రియ(ఒడిస్సీ) ప్రదర్శన ఇవ్వనున్నారు. అనంతరం వీరికి శివశ్రీ నాట్య పురస్కరాలు ప్రదానం చేయనున్నారు.నల్లాన్ చక్రవర్తుల రఘునందన్ -
సందేశాత్మక ‘యూనివర్సిటీ’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్య, వైద్య రంగాలు నడవాల్సి ఉన్నా అవేమీ కానరావడం లేదని, తల్లిదండ్రుల నుంచి లక్షలు సొమ్ము దోచేస్తుండటంతో వారంతా అప్పులపావుతున్నారని జిల్లా బార్ అసోషియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇదే ఇతివృత్తంతో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి సందేశాత్మకంగా ‘యూనివర్శిటీ’ చిత్రం తీసి ప్రభుత్వాల తీరుని ఎండగట్టేలా చేశారని చెప్పారు. దర్శక నటుడు ఆర్.నారాయణమూర్తి గురువారం శ్రీకాకుళంలోని ఎస్.వి.సి. థియేటర్లో చిత్రం విడుదల సందర్భంగా రావడంతో ఆయన్ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. సినిమా వృత్తాంతం నేటి సమాజానికి అద్దంపడుతోందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివ ప్రసాదరావు, వాన కృష్ణచంద్, గేదెల వాసుదేవరావు, ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు, మామిడి క్రాంతి, ఆగూరు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి, రెడ్డి విశ్వేశ్వరరావు, కడగల రాంబాబు, బొత్స సుదర్శనరావు, వాన ప్రమోద్, రచయిత అట్టాడ అప్పలనాయుడు, సాహిత్యాభిలాషి దాసరి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంవీ–26 గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటు
మల్కనగిరి: కోరుకొండ సమితిలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం శాంతి కమిటీ ఏర్పాటుకు కృషి చేసింది. ఇరువర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన అధికారులు, రాజకీయ నాయకులు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం శాంతి కమిటీ ఏర్పాటు ద్వారా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ క్రమంలో సన్నాహాలు మొదలుపెట్టింది. గత శుక్రవారం నాడు సమితిలోని రకూల్‌గుడ గ్రామానికి చెందిన లక్కీ పొడియాని అనే 55 ఏళ్ల వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు కొందరు దారుణంగా హత్య చేసి ఆమె శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహాన్ని సమీపంలో గల పోటేరు నదిలొ పారేసిన సంగతి విధితమే. దీనిపై రకూల్‌గుడ గ్రామస్తులు పక్కనే ఉన్న ఎంవీ–26 గ్రామానికి చెందిన కొందరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని భావించి శనివారం నాడు గ్రామంలో ఆకస్మిక దాడులను చేసి కొన్ని ఇళ్లను దగ్ధం చేయగా మరి కొన్ని వాహనాలను తగుల బెట్టారు. దీంతో ఆ గ్రామంలొ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు గురైన మహిళ మృతదేహం లభించినప్పటికీ ఆమెకు సంబంధించిన తల లభించకపొవడంతో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఆమె తల సుమారు 40 కిలోమీటర్ల దూరంలో గల నదిలో లభించింది. దీనిని సేకరించిన పోలీసులు దక్షిణాంచల్ డిఐజి, ఇరువర్గాలకు చెందిన కొంతమంది ప్రతినిధుల సమక్షంలొ లభించిన తలను అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఎస్పీ వినోద్ పటేల్, కలెక్టర్ సొమేష్ ఉపాధ్యాయ నేతృత్వంలో బుధవారం నాడు శాంతికమిటీకి సన్నాహాలు చేశారు. సమావేశంలో చిత్రకొండ ఎమ్మెల్యే మంగు కిలొ, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నరసింగ్ మడ్కామి లతొ పాటు ఆ ప్రాంత ప్రముఖులు, ఇరువర్గాల ప్రతినిధులతో సమావేశమై శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. -
పాఠశాల గేటు వద్ద విద్యార్థుల ఆందోళన
రాయగడ: జిల్లాలోని రామనగుడలో గల ప్రభుత్వ మాధ్యమిక ఉన్నత పాఠశాలలో అధిక ఫీజులు వసూ లు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల మెయిన్ గేటును మూసి వేసి ఆందోళన చేశారు. పాఠశాలలో గల ప్లస్ టూ ఆర్ట్స్ విభాగంలో పేర్ల నమోదు, రీ అడ్మిషన్, ఫారం నింపే విషయంలో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థు లు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవ్వరూ తగిన రీతిన స్పందించకపోవడంతో ఆందోళన చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ గౌరి ప్రసాద్ సాహు సకాలంలో పాఠశాలకు హాజరుకావడం లేదని, అదేవిధంగా హాజరైనా ఎక్కువ సమయం ఉండటం లేదని దీంతో తమ సమస్యలను తెలియజేసేందుకు ఇబ్బందిగా మారుతుందని వివరించారు. ఇదే విషయమై ప్రశ్నిస్తే తమను పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరిస్తుండటం ఎంతవరకు సమంజసమని అన్నారు. విద్యార్థుల ఆరోపణలు ఏ మాత్రం నిజం కాదని ప్రిన్సిపాల్ పండ కొట్టిపారేశారు. -
తాత్కాలిక విరమణ
ప్రాథమిక ఉపాధ్యాయుల సమ్మె ● 7 రోజుల్లోపు స్పందించకుంటే సామూహిక సెలవు హెచ్చరికభువనేశ్వర్: గత ఐదు రోజులుగా స్థానిక గాంధీ మార్గ్‌లో ఆందోళన చేస్తున్న ప్రాథమిక ఉపాధ్యాయులు బుధవారం తాత్కాలికంగా వైదొలిగినట్లు ప్రకటించారు. ఆందోళన ప్రాంగణంలో ఏకామ్ర నియోజక వర్గం ఎమ్మెల్యే బాబూ సింగ్, కేంద్ర మాజీ మంత్రి విశ్వేశ్వర టుడుతో చర్చల తర్వాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు బుధవారం నుంచి అందరూ సెలవుపై వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఏకామ్ర ఎమ్మెల్యే బాబూ సింగ్, కేంద్ర మాజీ మంత్రి విశ్వేశ్వర టుడు ప్రభుత్వం తరఫున నిరసన స్థలానికి చేరి ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియజేయడంతో నిరసనకారుల వర్గం తాత్కాలికంగా ఆందోళన నిర్మించేందుకు అంగీకరించింది. ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి నిరసన స్థలం నుంచి వెళ్లిపోయిన తర్వాత నిరసనకారుల మధ్య విభేదాలు తలెత్తాయి. వాదనలు, తోపులాటలు జరిగాయి. వారి మధ్య వాదులాట తోపులాటకు దారి తీసి ఆందోళన ప్రాంగణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. నిరసనకు అనుమతి లేకపోయినా వారు ఆందోళన సృష్టిస్తుండటంతో పోలీసులు వారిని తరిమికొట్టడంతో నిరసన స్థలం నుంచి వైదొలిగారు. అనంతరం ప్రముఖ సభ్యులు అత్యవసరంగా సమావేశమై నిరసనను ఏడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని తీర్మానించారు. ప్రభుత్వం 7 రోజుల్లోగా డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రంలోని అందరు ఉపాధ్యాయులు ఏక కాలంలో సెలవుపై వెళ్తారని షరతు విధించారు. 2001 నుంచి పని చేస్తున్న ఉపాధ్యాయులకు 4200 గ్రేడ్ పే, ఆరు నామ మాత్రపు ఇంక్రిమెంట్లు డిమాండ్ చేస్తూ గత శుక్రవారం నుంచి ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం (నూతన పెన్షన్) సమ్మె చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు రాత్రింబవళ్లు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. 7వ తేదీన రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి అభ్యర్థించినప్పటికీ ఉపాధ్యాయులు నిరసన నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. ఉపాధ్యాయులు నిరసనలో చేరినప్పటి నుంచి ప్రాథమిక విద్యా డైరెక్టరేట్ అన్ని జిల్లా విద్యా అధికారులను నిరసనకు దిగిన ఉపాధ్యాయుల గురించి సమాచారం అందించాలని ఆదేశించింది. పోలీసుల అనుమతి లేనందుకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. -
శ్రీ మందిరంలో దివ్యాంగుల సులభ దర్శనం కోసం సన్నాహాలు
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో దివ్యాంగులకు సులభ దర్శనం కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి అధ్యక్షతన ఆలయంలో దివ్యాంగుల సులభ దర్శన వ్యవస్థపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు, సీనియర్ సేవకులు, ఆలయ సీనియర్ అధికారులు హాజరయ్యారు. దివ్యాంగుల సౌలభ్యం కోసం సమావేశంలో చర్చించిన ప్రతిపాదిత మార్గదర్శకాలను త్వర లో జరగనున్న ఛొత్తీషా నియోగ్ సమావేశంలో ప్రవేశ పెడతారు. పాలక మండలి ఆమోదంతో దివ్యాంగుల సులభ దర్శనం మార్గదర్శకాలు వాస్తవంగా అమలు చేస్తామని ప్రధాన నిర్వాహకుడు అరవింద్ కుమార్ పాఢి తెలిపారు.వికాస పరిషత్ ఉచిత వైద్య శిబిరంజయపురం: జయపురం సరస్వతీ శిశు విద్యామందిర ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా ఆయుర్వేద వికాస పరిషత్ జయపురం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు పరిసరప్రాంతాలలో ఉండే పిల్లలకు, పెద్దలకు వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. సరస్వతీ విద్యామందిరానికి చెందిన 300 మందికి పైగా పిల్లలకు వైద్య పరీక్షలు జరిపి వారికి మందులు అందజేసినట్లు హోమియోపతిక్ డాక్టర్ సుదర్శణ గౌఢ వెల్లడించారు. వైద్య శిబిరంలో కవిరాజ్ పరమేశ్వర ప్రధాన్, డాక్టర్ సత్యనారాయణ పొరిచ, డాక్టర్ శ్రీనివాస పాత్రో, డాక్టర్ లిలు పాత్రో, డాక్టర్ శశికాంత పాత్రో వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో సరస్వతీ విద్యామందిర ప్రధాన ఆచార్య సత్యనారాయణ సెఠి, ఉపాధ్యాయులు దిలీప్ కుమార్ శతపతి సహకరించారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం రాయగడ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జగన్నాధ కాశీ (17)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మంగళవారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జగన్నాధ కాశీ, అనంత మినియాక, దేవరాజ్ ప్రస్కాలు బైక్‌పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కాశీ సంఘటనా స్థలం వద్దే మృతి చెందగా బైక్‌పై ప్రయాణించే మినియాక, దేవరాజ్‌లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అందరికీ ప్రాథమిక హక్కులు
రాయగడ: మన రాజ్యాంగం ప్రతిఒక్కరికీ ప్రాథమిక హక్కులను కల్పించి సమానత్వం చాటి చెప్పిందని, ఇతరుల హక్కులను భంగపరిచే హక్కు ఎవరికీ లేదని డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి అన్నారు. స్థానిక అటానమన్ కళాశాలలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా మానవహక్కుల కౌన్సిల్ బుధవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తమ హక్కుల కోసం పోరాడాలని హితవు పలికారు. కౌన్సిల్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సస్మిత మహాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈస్ట్ ఇండియా జోనల్ కార్యదర్శి లీనా సనాపతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సరస్వతిరే, బచ్పన్ స్కూల్ డైరెక్టర్ శుశ్రీత దాస్, అధ్యాపకుడు అరుణ్‌కుమార్, దక్షిణ ఒడిశా అధ్యక్షుడు బి.వెంకటరమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా సమాజానికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న కుమారి బడిత్య, సుకృ సాహు, రచయిత, పాత్రికేయుడు భళ్లమూడి నాగరాజు తన చైతన్య వంతమైన రచనలతో జాగృతి కల్పిస్తున్నందుకు సన్మానించారు. -
మహానది జల వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
భువనేశ్వర్: దీర్ఘకాలంగా ఊగిసలాడుతున్న మహానది జలాల పంపిణీ వివాదం పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. మహానది జలాల కోసం ఉభయ చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహానది ఎగువ భాగంలో చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అనధికారిక బ్యారేజీలు తదితర కట్టడాలు చేపట్టి దిగువ ఒడిశా ప్రాంతాలకు అన్యాయం చేసిందని ప్రధాన ఆరోపణ. ఈ వివాదాన్ని సామరస్యంగా తెర దించేందుకు ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన మహానది జల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ పార్టీ చీఫ్, అధికార భారతీయ జనతా పార్టీ, విపక్ష బిజూ జనతా దళ్ మరియు కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు వంతున ముగ్గురు ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. మహానది జలాలకు సంబంధించిన అన్ని సంబంధిత అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీలో మంత్రులు సురేష్ కుమార్ పూజారి, పృథ్వీరాజ్ హరిచందన్, సంపద స్వంయి, ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్, ఎమ్మెల్యేలు నిరంజన్ పూజారి (బీజేడీ), జయనారాయణ మిశ్రా (బీజేపీ), సోఫియా ఫిర్దౌస్ (కాంగ్రెసు) సభ్యులుగా ఉన్నారు. -
రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం, అలవెన్సులు పెంపు
భువనేశ్వర్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతం, భత్యాలు పెరుగుతాయి. మాజీ ఎమ్మెల్యేల ఫించను కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. మంగళ వారం శాసన సభ వ్యవహారాల విభాగం మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ శాసన సభ్యులు, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మరియు మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు, పింఛన్‌కు సంబంధించిన ఈ ముఖ్యమైన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ జీతం రూ. 40,500 నుంచి రూ. 98,000కి, సమావేశం భృతి రూ. 800 నుంచి రూ. 2,000 కు పెంచారు. కార్ అలవెన్స్ నెలకు రూ.17,000 నుంచి రూ.89,000 కు, వ్యక్తిగత ఖర్చుల అలవెన్స్ రూ. 40,000 నుంచి రూ.1,81,000 కు పెంచారు. వసతి భత్యం నెలకు రూ.100 నుంచి రోజుకు రూ. 2,000 కు పెంచారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జీతభత్యాల బిల్లు ప్రకారం ఎమ్మెల్యే మరణిస్తే అతని కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇక నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు, పెన్షన్ పెంచుతారు. దీని ప్రకారం శాసన సభలో బిల్లు రూపంలో తీసుకురాకుండానే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతం, భత్యాలు మరియు ఫించను నేరుగా ఆర్డినెన్స్ ద్వారా పెంచవచ్చు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పింఛన్‌కు రూ. 30,000 నుంచి రూ. 80,000కి పెంచారు. పలుమారులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై న వారికి అదనంగా రూ. 3000 ఫించను అందుతుంది. మాజీ ఎమ్మెల్యేలకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.12,000, వైద్య ఖర్చుల కోసం రూ. 2,000 బదులుగా రూ. 2,500 లభిస్తుంది. డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలు డిప్యూటీ స్పీకర్ నెలవారీ జీతం రూ. 38,000 కు బదులుగా రూ. 94,000 అవుతుంది. సమావేశ భత్యం రూ. 800 కు బదులుగా రూ. 2,000కి పెరుగుతుంది. కారు భత్యం రూ. 17,000 కు బదులుగా రూ. 85,000 అవుతుంది. వ్యక్తిగత భత్యం రూ. 40,000 కు బదులుగా రూ. 1,77,000 అవుతుంది. తాజా బిల్లు ఆమోదంతో సరికొత్తగా వసతి భత్యం ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం ఎమ్మెల్యేలకు రోజుకు రూ. 2,000 లభిస్తుంది. వాహన ప్రయాణ ఖర్చులు పెంపు రాష్ట్రం వెలుపల జరిగే సమావేశాలకు రోజుకు రూ.2,000కి బదులుగా రూ. 10,000 పొందుతారు. రాష్ట్రంలోపు కారు ప్రయాణానికి కిలో మీటరుకు రూ. 25కి బదులుగా రూ.35, నెలవారీ రవాణా భత్యం రూ.15,000కి బదులుగా రూ.50,000 లభిస్తుంది. పుస్తకాలు కొనుగోలు చేసినందుకు నెలకు రూ. 2,000కి బదులుగా రూ.10,000 లభిస్తుంది. విద్యుత్ బిల్లులకు రూ. 5,000కి బదులుగా రూ. 20,000, వైద్య ఖర్చులకు రూ.5,000కి బదులుగా రూ. 35,000 లభిస్తాయి. క్వార్టర్లు ఇవ్వని ఎమ్మెల్యేలకు వసతి కోసం రోజుకు వెయ్యి రూపాయలకు బదులుగా రెండు వేల రూపాయలు, వాహనం కొనడానికి ఐదు లక్షలకు బదులుగా పది లక్షల రూపాయలు లభిస్తాయని తెలిసింది. -
నకిలీ యాప్‌తో రూ. 10 లక్షలు లాగేశారు!
జయపురం: నకిలీ యాప్‌తో బ్యాంక్ అకౌంట్ల నుంచి పది లక్షల రూపాయలు కాజేశారు. ఈ సంఘటన జయపురంలో చర్చనీయాంశమైంది. జయపురం వాసులు సదానంద సామంతరాయ్, కె.వెంకటేశ్‌ల బ్యాంక్ అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ ద్వారా డబ్బు దొంగిలించినట్లు ఆరోపణ. దుండగులు సదానంద అకౌంట్ నుంచి రూ. 8.97 లక్షలు, కె.వెంకటేశ్ అకౌంట్ నుంచి రూ. 1.83 లక్షలు మాయం చేశారు. బాధితులు ఇరువురికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నాయి. వారి అకౌంట్ల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేసినట్లు వారు జయపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జయపురం సమితి టంకువ గ్రామం పంచాయతీ తొరిడిపుట్ గ్రామంలోని పాఠశాలలో సదానంద సామంతరాయ్ పనిచేస్తున్నారు. అతడు కేన్సర్ వ్యాధికి గురయ్యారు. అతడికి ఈ నెల పదో తేదీన ఆపరేషన్ చేసేందుకు విశాఖలోని ఆస్పత్రి వైద్యులు నిర్ణయించారు. ఆపరేషన్ కోసం అతడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ. ఐదు లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ నెల ఏడో తేదీన అతను విశాఖపట్నంలో ఉన్న సమయంలో సదానంద ఫోన్‌కు ఒక యాప్ వచ్చింది. యాప్ డౌన్‌లోన్ చేసిన కొన్ని నిమిషాలలో అతడి అకౌంట్ నుంచి రూ. 8.97 లక్షలు మాయమయ్యాయి. వెంటనే సదానంద విశాఖ నుంచి జయపురం వచ్చి బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే బ్యాంక్ వారు అతడి అకౌంట్‌ను లాక్ చేశారు. వెంటనే వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదానంద సోదరుడు సంతోష్ సామంతరాయ్ కొరాపుట్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలాగే వ్యాపారి కె.వెంకటేశ్ రూ. 1.83 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. సోమవారం అతని మొబైల్‌కు ప్రాంతీయ ట్రాన్స్‌ఫోర్టు కార్యాలయం నుంచి ఫేక్ యాప్ అప్లికేషన్ వచ్చింది. వెంకటేశ్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయగా కంపెనీ ఓటీపీ అడిగింది. వెంకటేశ్ ఓటీపీ చెప్పకుండా మిన్నకున్నాడు. అనుమానం వచ్చి మంగళవారం టంకువ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ పరిశీలించగా రూ. 1.83 లక్షలు మాయమైనట్టు అయినట్లు వెల్లడైంది. -
నేడు సెంచూరియన్ వర్సిటీలో..వెటర్నరీ టెక్నో కల్చరల్ ఈవెంట్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో గురువారం వెటర్నరీ టెక్నో కల్చరల్ ఈవెంట్ (వెటోరియా– 2025) పేరిట పశుసంవర్థక, జంతుశాస్త్ర స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సెమినార్ నిర్వహించనున్నారు. ఈ మేరకు డీన్ డాక్టర్ ప్రొఫెసర్ గిరీష్ మహంతి తెలియజేశారు. ముఖ్య అతిథులుగా తీర్థకుమార్ దత్త, వైస్ చాన్సలర్ బిశ్వజిత్ మిశ్రా, అజయ్‌కుమార్ నాయక్ హాజరవుతారన్నారు. రాయగడ: జిల్లాలోని గుణుపూర్ గాంధీ పబ్లిక్ స్కూల్లో బుధవారం ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో 67 మంది మహిళలు పాల్గొని వివిధ వర్ణాలతో ముగ్గులు వేసి అందరిని ఆకట్టుకున్నారు ప్రథమ బహుమతిని బి.సుక్షమ రెడ్డి, ద్వితీయ బహుమతిని మహేశ్వేత మహాంతి, తృతీయ బహుమతిని భక్తి దాస్, మీనాక్షి పండాలు గెలుపొందారు. పబ్లిక్ స్కూల్ అధ్యక్షులు సుభ్రత్ రంజన్ విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయాలను రక్షించుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. భువనేశ్వర్: రాష్ట్రంలో దృష్టి లోపం క్రికెటర్లకు వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో పేరొందిన హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి వర్గం ముందుకు వచ్చింది. హైటెక్ 22 మంది దృష్టి లోపం ఉన్న బాలురు, బాలికలకు ఉచిత ఆహార, హాస్టల్ వసతిని కల్పించడంతో క్రికెట్ అభ్యాసం, సాధన కోసం మైదానాన్ని కల్పిస్తుందని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ప్రకటించారు. స్థానిక హైటెక్ వైద్య బోధన ఆస్పత్రి సముదాయంలో బుధవారం ఏర్పాటు చేసిన నిరాడంబర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన నలుగురు దృష్టి లోపం మహిళలు ఫుల్ సొరేన్, బాసంతి హంసద, యమునా రాణి టుడు, పార్వతి మరాండి, ఒడిశా అంధుల క్రికెట్ జట్టు సారథి మహ్మద్ జాఫర్ ఇక్బాల్‌కు రూ. 20,000 వంతున నగదు పురస్కారంతో ప్రత్యేకంగా సత్కరించారు. క్రీడల నుంచి విరమణ పొందిన క్రికెటర్లకు హైటెక్‌లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్పీఎఫ్ బ్యారక్ బుధవారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూర్పు కోస్తా రైల్వే ఐజీ అలోక్ బెహర ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యారక్ పరిసరాల్లో మొక్కలను నాటారు. కార్యక్రమంలో సంబల్పూర్ రైల్వే డివిజన్ డీఎస్పీ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రైల్వే సిబ్బందితో మాట్లాడారు. రాయగడ: క్రీడలు మానసిక వికాసానికి దోహదపడతాయని ఏబీడీవో కాళూచరణ్ నాయక్ అన్నారు. స్థానిక గాయత్రీనగర్‌లోని సరస్వతి శిశుమందిర్ విద్యాలయం వార్షిక క్రీడోత్సవాలు రైల్వే మైదానంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి కబరిచేలా పిల్లలకు పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, విద్యాలయం పరిశీలన కమిటీ సాధారణ కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహాంతి, కోశాధికారి మనోజ్ కుమార్ చౌదరి, ప్రధానోపాధ్యాయులు మనోరంజన్ దాస్ పాల్గొన్నారు. రాయగడ: స్థానిక మున్సిపాలిటీ పరిధిలో గల 18, 19 వార్డుల మధ్య గల ఒక స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని అనధికారికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించింది. కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం వార్డుల్లో సందర్శించి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆక్రమణ కట్టడాన్ని జేసీబీతో కూల్చివేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా బోర్డును ఏర్పాటు చేశారు. ఈ విషయమై మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నాళ్ల క్రితం ఆయా వార్డుల్లో గల మున్పిపాలిటీకి చెందిన స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుని తాత్కాలికంగా మందిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆదేశాల ప్రకారం ఆక్రమ కట్టడాన్ని తొలగించామన్నారు. రహదారిని నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నామని వివరించారు. -
ఢెంకనాల్ తహసీల్దార్ కారు జప్తు
● భూమి పరిహారం చెల్లింపు జాప్యం భువనేశ్వర్: భూసేకరణ పరిహారం చెల్లించకపోవడంతో న్యాయస్థానం అసాధారణమైన చర్యల అమలుకు ఆదేశించింది. న్యాయ స్థానం ఆదేశాలతో ఢెంకనాల్ తహసీల్దార్ కార్యాలయం ఫర్నిచర్, అధికారిక ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో బొలేరొ వాహనం జప్తు చేశారు. బాజిచౌక్కు చెందిన సత్యబాది బెహరా దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని ఢెంకనాల్ సివిల్ జడ్జి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. బాజిచౌక్ సమీపంలోని పిటిషనర్‌కు చెందిన 12 దశాంశాల (డెసిమల్) భూమిని ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణం కోసం స్వాధీ నం చేసుకున్నారు. దీని కింద అతనికి రూ. 6 లక్షల పరిహారం చెల్లించాల్సింది. ఈ మేరకు పరిహారం ముట్టకపోవడంతో సముచిత చెల్లింపు అభ్యర్థనతో బాధిత పిటిషనరు 2013లో న్యాయ స్థానానికి ఆశ్రయించాడు. విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం పూర్వాపరాలు పరిశీలించిన మేరకు 2023 సంవత్సరంలో సివిల్ జడ్జి భూమి యజమానికి వడ్డీతో సహా రూ. 13 లక్షలు చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదు. బాధితునికి పరిహారం మొత్తం చెల్లించలేదు. ఇంతలో భూ యజమాని కన్నుమూయడంతో అతని కుమారుడు ప్రమోద్ బెహరా న్యాయ స్థానానికి వాస్తవ పరిస్థితిని వివరించడంతో ఘాటుగా స్పందించింది. ఈ అభ్యర్థనపై చర్య తీసుకుంటూ భూసేకరణ అధికారి, తహసీల్దార్ నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో అధికారిక కార్యకలాపాలకు వినియోగించే ప్రభుత్వ చరాస్త్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా బుధవారం అధికారులు తహసీల్దార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ బొలెరో వాహనం, బీరువా, కంప్యూ టర్, టేబుల్, కుర్చీలు, ఇతర కార్యాలయ ఫర్నిచర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్య తీవ్ర కలకలం రేపింది. ఢెంకనాల్ సివిల్ జడ్జి ఆదేశాలు వాస్తవ కార్యరూపం దాల్చడంతో బాధితునికి భూ పరిహా రం కింద న్యాయ స్థానం ఆదేశించిన మొత్తం చెక్ రూపంలో విడుదల చేశారు. -
రాయగడలో చొయితీ క్రీడోత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్థానిక రిలియన్స్ బంక్ కూడలి నుంచి బుధవారం ఉదయం మారధాన్ రేస్‌ను ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, జిల్లా క్రీడాధికారి షేక్ ఆలీనూర్, ఏడీఎం నిహారి రంజన్ కుహరో, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్ర కాంత్ మాఝి, జిల్లా పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బసంత కుమార్ ప్రధాన్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులనుద్దేశించి అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్ మాట్లాడారు. ఏటా చొయితీ ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. అదేతరహా ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తుందని.. అందుకు అంతా సహకరించాలని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఇదే చక్కని వేదికగా భావించి క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని అన్నారు. పది కిలోమీటర్ల నిడివి గల హలువ తోట వరకు ఈ మారధాన్ రేస్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పోటీల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. యువకుల విభాగంలొ శ్రీకాంత్ ప్రస్కా ప్రథమ, రంజన్ ధొని ద్వితీయ, బలభద్ర హికక తృతీయ బహుమతిని గెలుపొందారు. ప్రొత్సాహక బహుమతులను మనోజ్ కుమార్ నాయక్, కంసం మాఝిలు సంపాదించుకున్నారు. యువతుల మధ్య జరిగిన పోటీల్లొ లలిత తాయాక ప్రథమ, సమీరా మాఝి ద్వితీయ, పింకి హిమిరక తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. ప్రొత్సాహక బహుమతిని సౌమ్యశ్రీ మాఝికి అందజేశారు. -
ధాన్యం, మొక్కజొన్న మండీలు ఏర్పాటు చేయాలి
జయపురం: ధాన్యం, మొక్కజొన్నలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే మండీలు తెరచి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొరాపుట్ జిల్లా కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ ప్రదాన్ నేతృత్వంలో పలువురు మంచ్ సభ్యుడు బుధవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్ ప్రదాన్ పత్రికల వారితో మాట్లాడుతూ ధా న్యం నూర్పులు పూర్తయి రైతులు ధాన్యం అమ్మేందుకు మండీల కోసం వేచి ఉన్నారని వెల్లడించారు. ఏ రోజు మండీ ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని, మండీలు ప్రారంభానికి రెండు రోజుల ముందు టోకెన్ అందజేయాలన్నారు. ధాన్యం కొనుగోలు సంస్థలు, మిల్లు యజమానులు, సివిల్ సప్లై కార్పొరేషన్ విభాగం ప్రతినిధులు రైతులకు గోనె సంచులను సమకూర్చాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం అమ్మి కొనుగోరుదారుల గోనెలలో నింపి తమ గోనులు తీసుకెళ్తారని వెల్లడించారు. మండీల్లోనే ధాన్యం తూకం వేయాలని తూకం మేరకు రైతులకు రశీదులు ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభు త్వం క్వింటా ధాన్యానికి రూ.69 పెంచిందని గుర్తుచేశారు. ఈ మేరకు పెంచిన ధరలో రైతుల నుంచి ధాన్యం కొనా లని నరేంద్రకుమార్ ప్రదాన్ డిమాండ్ చేశారు. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. నేటికీ మండీలు ప్రారంభించక పోవటంతో క్వింటా ధాన్యం రూ.1,600, మొక్కజొ న్న క్వింటా రూ.1,700 రైతులు విక్రయిస్తున్నారని వెల్లడించా రు. క్వింటా ధాన్యం వద్ద రూ.1500, క్వింటా మొక్కజొన్న వద్ద రూ.800 రైతులు నష్ట పోతున్నారని వివరించారు. రైతు సమ్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించి సమస్యలను పరిష్కరించాలన్నారు. రబీ పంటలకు సకాలంలో అప్పర్ కొలాబ్, తెలింగరి సాగునీటి ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడవాలని, అవినీతికి పాల్పడుతున్న మహిళా స్వయం సహాయక గ్రూపులను ధన్యం కొనే బాధ్యతల నుంచి తప్పించాలని వినతిపత్రంలో డిమాండ్ చేసినట్లు జిల్లా కృషక్ మంచ్ కార్యదర్శి నరేంద్రకుమార్ ప్రధాన్ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్కాపంగ పంచాయతీ హెంబు గ్రామ సమీపంలో గల మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలొ ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు సుభాష్ పాలిక (61), గాయపడిన వ్యక్తి భాస్కర్ కౌసల్యలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మునిగుడ హాస్పటల్‌కు సోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రుడిని అంబెలెన్స్‌లో చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం పిస్కాపంగ నుంచి స్కూటీపై సుభాష్, భాస్కర్లు గుడారిలో జరిగే హోమ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న బైకును హెంబు మలుపు వద్ద అదుపుతప్పి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుభాష్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడి భాస్కర్‌ను మునిగుడ హాస్పటిల్‌కు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ హాస్పటిల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హక్కుల పరిరక్షణతో సామాజికాభివృద్ధి
భువనేశ్వర్: సమిష్టి నిబద్ధతతో మానవ హక్కులను పరిరక్షించుకోవాలని వక్తలు అన్నారు. ఈ హక్కులు కేవలం చట్టాల ద్వారా మాత్రమే కాకుండా పౌరులు, సంస్థలు, సంఘాలు చురుకై న భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో ఫలప్రదం అవుతాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి. ఒడిశా మానవ హక్కుల కమిషన్ సంబల్పూర్ తపస్విని హాల్లో బుధవారం నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం –2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి. వివక్షకు సమాజంలో చోటు లేకుండా ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే అవకాశం ఉండాలని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం గుర్తు చేస్తుందన్నారు. ఈ ఏడాది మానవ హక్కులు: మన రోజువారీ అవసరాలు అనే ఇతివృత్తం విద్య, స్వేచ్ఛపూర్వక భావ వ్యక్తీకరణ, సురక్షితమైన పని పరిసరాలు, ఆహారం, నీరు, ఆరోగ్యం మరియు భద్రత వంటి హక్కులు మానవ గౌరవానికి బలమైన పునాదిగా ప్రతిబింబిస్తుంది. మానవ హక్కులు తిరస్కరించబడితే సమాజం యొక్క ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు.1948లో మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (యూడీహెచ్‌ఆర్) మానవ నాగరికతలో ఒక మలుపు. ప్రతి వ్యక్తికి గౌరవం, స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయాన్ని ధృవీకరించింది. ఈ దిశలో ఐక్యరాజ్య సమితి కృషిని ప్రశంసించారు. యూడీహెచ్‌ఆర్ ముసాయిదాను రూపొందించడంలో మన దేశం వర్ణవివక్ష వంటి సమస్యలను ప్రారంభంలోనే లేవనెత్తి మహిళా ప్రాతినిథ్యం ప్రాముఖ్యతని ప్రతిపాదించి ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ప్రధాన భాగస్వామిగా కొనసాగిందని గుర్తు చేశారు. ఆహార భద్రత, గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు మరియు దివ్యాంగులకు ప్రాప్యతను నిర్ధారించే పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను బలోపేతం చేసిందన్నారు. జల్ జీవన్ మిషన్, పీఎంజీకేఏవై, పీఎంఏవై ఆయుష్మాన్ భారత్ మరియు సుగమ్య భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు లక్షలాది మంది జీవన నాణ్యతను మెరుగుపరిచాయని పేర్కొన్నారు. జస్టిస్ శత్రుఘ్న పూజాహరి ఆధ్వర్యంలో ఒడిశా మానవ హక్కుల కమిషన్సత్వర ఫిర్యాదుల పరిష్కారం మరియు బలహీన వర్గాలను రక్షించడానికి ప్రయత్నాలను ప్రశంసించారు. ఆహార భద్రత, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత మరియు గిరిజన సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తార్కాణంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒడిశా మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్, జస్టిస్ శత్రుఘ్న పూజాహరి, మానవ హక్కుల కార్యకర్త మరియు రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజ్వాడ విల్సన్, మాజీ డీజీపీ మరియు ఒడిశా పబ్లిక్ సర్వీసు కమిషను చైర్మన్ డాక్టర్ సత్యజిత్ మహంతి, ఒడిశా మానవ హక్కుల కమిషన్ సభ్యుడు అసిమ్ అమితాబ్ దాస్, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు చిత్తరంజన్ మహా పాత్రో ప్రసంగించారు. -
ఆదివాసీల సంప్రదాయాలను పరిరక్షిస్తాం
డొంగిరియా మహిళల సంప్రదాయ నృత్యం రాయగడ: భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో ఆదివాసీల సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించేందుకు చొయితీ పేరిట లొకమహోత్సవం ఉత్సవాలను జిల్లా యంత్రాంగం నిర్వహించి, ప్రోత్సాహిస్తోందని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో మంగళ, బుధవారాల్లో జరిగిన సమితి స్థాయి చొయితీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్యాణసింగుపూర్ సమితి పరిధిలో గల నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదిమ తెగకు చెందిన డొంగిరియాల భాష, వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. కొండల్లో, కోనల్లో నివసించేవారు కేవలం వారి ప్రాంతాలకే పరిమితమయ్యేవారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారిలో కొత్త ఆశలను నింపాయన్నారు. ప్రస్తుతం వారు కట్టు, బట్టలో ఎంతో చైతన్య వంతులయ్యారని, అదేవిధంగా స్వయం ఉపాధి మార్గాలు వెతుకులాటలో ముందుకు వెళుతున్నారని, ఇది మనకు ఎంతో ఆనందించే విషయమని అభిప్రాయపడ్డారు. పర్వత ప్రాంతాల్లో నివసించే డొంగిరియాల్లో నేడు యువత అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని, విద్యావంతులు కూడా ఉన్నారన్నారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే స్థాయికి చేరుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం వివిధ సంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డొంగిరియా తెగకు చెందిన మహిళల నృత్యాలు వారి చైతన్యానికి మార్గదర్శకాలుగా నిలిచాయి. బీడీఓ మీనాక్షి దాస్ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా పరిషత్ సభ్యులు బరాటం ప్రసాద్ రావు, కందకులం సమితి అధ్యక్షుడు జొగేంద్ర వడక తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షించాయి. -
రాష్ట్రంలో మత్తుపూరిత దగ్గు సిరప్ రవాణాకు కళ్లెం
భువనేశ్వర్ : రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి భారీ మొ త్తంలో మత్తుపూరిత దగ్గు సిరప్ సీసాలను స్వాధీ నం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు. మత్తు పూరిత దగ్గు సిరప్ అక్రమ రవాణా కింద రాష్ట్ర పోలీసులు మొ త్తం 61 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల ఆధారంగా 73,181 మత్తు పూరిత దగ్గు సిరప్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ లావాదేవీలో పాల్గొన్న 181 మంది నిందితులను అరెస్టు చేశారు. భువనేశ్వ ర్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అత్యధికంగా 26,658 దగ్గు సిరప్ సీసాలను స్వాధీనం చేసుకుంది. సంబల్పూర్ జిల్లా పోలీసులు 13 కేసులు నమో దు చేసి 19,908 బాటిళ్ల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బర్గఢ్ జిల్లా పోలీసులు 17 కేసులు నమోదు చేసి 12,856 సీసాలు, బొలంగీర్ 12 కేసులతో 5,468 సీసాలు, సువర్ణపూర్ జిల్లా 6 కేసులతో 451 సీసాలు, బౌధ్ జిల్లా 4 కేసులతో 1886 సీసాలు మరియు సుందర్‌గఢ్ జిల్లా 3 కేసులతో 595 సీసాల దగ్గు సిరప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంబల్పూర్ జిల్లా పోలీసులు 66 మందిని, బర్గఢ్ పోలీసులు 64 మందిని, బొలంగీర్ పోలీసులు 23 మందిని, సుబర్ణపూర్ పోలీసులు ఏడుగురిని, సుందర్‌గఢ్ ఆరుగురిని, కెంజొహర్ జిల్లా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించడంలో పోలీసుల చొరవని ప్రదర్శిస్తుందని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యకలాపా లు కొనసాగుతాయని, మాదక ద్రవ్యాల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలియజేశారు. -
బెనాడంగలో రెండు గుడిసెలు దగ్ధం
రాయగడ: సదరు సమితి పరిధిలోని బైరాగి హలువ పంచాయతీ బెనాడంగ గ్రామంలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పసయ్య పువ్వల అనే ఆదివాసీ రైతుకు చెందిన రెండు పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపొవడంతో రెండు గుడెసలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే సామగ్రి, ధాన్యం బస్తాలు కాలి బూడి దయ్యా యని బాధితుడు పసయ్య పువ్వల ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. ముగిసిన మహాలక్ష్మి నిమజ్జనోత్సవాలు రాయగడ : మునిగుడలోని పాయికొ వీధిలో గత నెల 22 నుంచి కొనసాగుతున్న మహాలక్ష్మీ పూజలు సోమవారంతో ముగిశాయి. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించి నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. 38 ఏళ్లుగా ఇక్కడ పూజలు నిర్వహిస్తుండటం విశేషం. గంజాయి స్వాధీనం రాయగడ : స్థానిక రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 6.140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన అనంత సుభాష్‌చంద్ర బొష్, నిషాంతలుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రైల్వే డీఎస్పీ ప్రభాత్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ బి.ప్రకాష్, అలొక్ నాయక్, ఏఎస్ఐ మానిక్ చంద్రగౌడొ, సుభేందు పాల్గొన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ ఎన్ఏసీలో వారణాసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బడిక మహి (15) తరగతి గదిలోనే మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపాస్మరక స్థితిలో పడిపోవడంతో క్లాస్ టీచర్ గమనించి వెంటనే ప్రధాన ఉపాధ్యాయునికి తెలియజేసి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి బడిక మహి తన తల్లితో ఏదో విషయంపై గొడవ పడి ఉదయం అల్పాహారం తినకుండా కాశీనగర్‌లో వారణాసి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిపోయింది. తరువాత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న తల్లి 11 గంటల సమయంలో పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం బడిక మహి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలియజేశారు. దీనిపై కాశీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లిగాం వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు కళ్యాణసింగుపూర్ సమితిలోని చాంచల్యగుడ గ్రామానికి చెందిన అనంతరావు కడ్రక(43)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనసొంత పనిమీద వస్తున్న కడ్రకను ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. -
రహగిరి ఉత్సవానికి సహకరించాలి
జయపురం: జయపురంలో ఈ నెల 14వ తేదీన మున్సిపాలిటీ వారు నిర్వహంచనున్న ‘రహగిరి’ ఉత్సవానికి సంబంధించి మున్సిపల్ సభాగృహంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. జయపురం సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కళాకారులతో రహగిరి పదోత్సవం సర్దార్ వల్లభాయి రోడ్డులో(మైన్ రోడ్డు)నిర్వహించేందుకు నిర్ణయించినట్లు శొశ్యా రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిద ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాల తరఫున 42 స్టాల్స్ ఏర్పాటు చేసి వస్తు ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. రహగిరి నిర్వహణలో పోలీసులు పూర్తి రక్షణ ఏర్పాట్లు చేపట్టడంతో పాటు డ్రోన్లతో పర్యవేక్షిస్తారన్నారు. పట్టణ కళాకారులను ఉత్సా పరచడంతోపాటు పట్టణ ప్రజల్లో సోదరభావం పెంపొందించటమే రహగిరి పదోత్సవ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ రహగిరి ఉత్సవానికి పట్టణ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ సహాయ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్, జయపురం సబ్‌డివిజన్ సమాచార, ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, సమాజ సేవి సంజయ జైన్, మున్సిపల్ స్టెనో గోపాల కృష్ణ సాహు, కౌన్సిలర్ విష్ణువర్దన్ రెడ్డి, నిరంజన్ పాణిగ్రహి, సత్యనారాయణ పాత్రో, సంజయ మార్త, జగదీష్ రావు, తదితరులు పాల్గొన్నారు. -
లారీ, బైకు ఢీ
● యువకుడి దుర్మరణం ● నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామస్తుల ఆందోళన రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలియాపొడ ఘాటీ మలుపులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు శంకరడ పంచాయతీలోని ఎస్.డొంగశిలి గ్రామానికి చెందిన ప్రశాంత్ మాఝి (26) గా గుర్తించారు. ఉదయం తన గ్రామం నుంచి ప్రశాంత్ బైక్‌పై టికిరి పనిమీద వెళుతున్నాడు. కలియాపొడ ఘాటి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీని అదుపుతప్పి బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో ప్రశాంత్ సంఘటనా స్థలం వద్దే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని బాధితుడి కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో రెండు గంటలు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో పోలీసుల పాత్ర నిర్లక్ష్యంగా ఉందని భావించిన డొంగాశిలి గ్రామానికి చెందిన మహిళలు పోలీసులపై తిరగబడ్డారు. రహదారిపై నిరసన తెలుపుతూ ఆందోళనకారులు చెట్టు కొమ్మలను రోడ్డుకు అడ్డంగా వేసి రహదారిని దిగ్బంధించారు. బాధిత కుటుంబానికి నష్టం పరిహారం చెల్లించాలని వారంతా డిమాండ్ చేశారు. కొద్ది సమయం వరకు ఉద్రిక్తత పరిస్థితి నెలకోవడంతో రాయడ ఎస్డీపీవో గౌరహరి సాహు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను బుజ్జగించారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
నిరుద్యోగ యువతకు వడ్డీ లేని రుణం
పర్లాకిమిడి: నిరుద్యోగ యువతీ యువకులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణం అందిస్తున్నామని టాటా స్పైన్ అసోసియేట్ మేనేజరు ప్రఫుల్ల కుమార్ సాహు అన్నారు. ఇప్పటివరకూ 29 మందికి లక్ష రూపాయల రుణం నానో యూనికార్న్ ద్వారా అందించినట్టు వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ హాల్–2లో నమో యూనికార్న్ అసెస్మెంట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నైపుణ్య శిక్షణ అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా తదితరులు హాజరయ్యారు. రెండవ విడత శిక్షణకు 11 మందిని ఎంపిక చేసి వారికి స్వయం ఉపాధిపై అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున రుణం అందజేస్తామన్నారు. అభ్యుర్థులు కనీసం మెట్రిక్లేషన్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. -
ఆశలు సమాధి చేస్తూ..!
● రబీ పంటకు సాగునీరు ఇవ్వలేమని చెప్పిన మంత్రి అచ్చెన్న ● భగ్గుమంటున్న జిల్లా రైతులు జలుమూరు: ఈ ఏడాది రబీలో సాగుకు సిద్ధమవుతున్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాక్ ఇచ్చారు. రబీకి సాగునీరు ఇవ్వలేమని ఆయన ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన నెల రోజులుగా రబీ పంటలకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దీనిలో భాగంగా వరికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నాట్లు, వరి వెదలు వేయగా.. మరి కొంతమంది రైతులు వరినారు కూడా పోశారు. ఇతర పంటలు వేయకున్నా ఆయా పంట పొలాలను ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా రబీకి సంబంధించి వరి సుమారు 48 వేల హెక్టార్లలో.. ఇతర పంటలు పంటలు 70.32 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అంచనా. మండిపడుతున్న రైతులు రబీసాగుకు నీరు ఇవ్వలేమని మంత్రి ప్రకటించడంపై జిల్లా రైతులు మండిపడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి నారుమడులు, వెదలు, నాట్లు, మొదటి ఎరువు సైతం వేశారు. ఈ నేపథ్యంలో సాగుకు నీరు ఇవ్వలేమని మంత్రి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. వంశధార కుడి, ఎడమ కాలువల పరిధిలో కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, ఆమదాలవలస, జలుమూరు, సారవకోట, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి తదితర మండలాల్లో అత్యధికంగా వరి రెండో పంటగా సాగు చేస్తున్నారు. ఇదే సమయంలో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ ఏడాది రైతులు విత్తనాలు, ఎరువులు, ధాన్యం అమ్మకాలకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సాగునీరుకు కూడా అవస్థలేనని వాపోతున్నారు. ముందే ఎందుకు చెప్పలేదు ఈ ఏడాది రబీ వరికి నీరు అందించలేమని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులైనా కనీసం ముందే ప్రకటన చేయాల్సింది. నెల రోజుల నుంచి వరికి సంబంధించి నాట్లు, వెదలు, నారుపోత, దుమ్ము, దుక్కి తదితర పను లు చేపట్టాము. ఇప్పటికే అప్పలు తీసుకొచ్చి పెట్టు బడులు పెట్టడం జరిగింది. చివరికి ఈ సమయంలో సాగునీరు అందించలేమని చెప్పడం సరికాదు. – చింతు సూర్యనారాయణ, కరవంజ, జలుమూరు రైతుపై ఇంత చిన్నచూపా కూటమి ప్రభుత్వానికి రైతుపై ఇంత చిన్నచూపు తగదు. రైతు బాగుంటేనే అంతా బాగుంటారు. రైతులను ఇబ్బందులకు గురిచేసినవారు బాగుపడరు. ఇంత ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. మేము ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాము. ఇప్పుడు సాగునీరు ఇవ్వడం కుదరదు అంటే నష్ట పరిహారం అందజేయాలి. – బండి కృష్ణారావు, హుస్సేనుపురం, జలుమూరు -
బాల కార్మికుడి గుర్తింపు
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ సెరంగో బస్టాండ్‌లోని హోటల్లో బాలకార్మికుడిని అధికారులు గుర్తించి మంగళవారం సాయంత్రం పోలీసు అధికారుల సహయంతో పర్లాకిమిడి జిల్లా శిశు సురక్షా విభాగం తీసుకువచ్చారు. కొందరు ఇచ్చిన సమాచారం మేరకు ఈ బాల కార్మికుడిని చైల్డ్ లైన్‌కు అప్పగించారు. పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, కౌన్సిలింగ్‌ను అధికారులు చేపట్టారు. పట్టుకున్న బాలకార్మికుడి వయస్సు 13 సంవంత్సరాలు, ఏడో తరగతి చదువుతూ మధ్యలో డ్రాపౌట్ అయ్యాడు. మరిన్ని వివరాలను జిల్లా శిశు సంక్షేమ సమితి అధికారులు సేకరిస్తున్నారు. 47 వినతుల స్వీకరణ జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి మిలిత జన సునాని శిబిరం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 47 వినతులు స్వీకరించారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, ఎస్పీ రోహిత్ వర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం పర్లాకిమిడి: పర్లాకిమిడి పట్టణంలో బుధవారం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్టు టాటా పవర్ డిస్టిబ్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు మంగళవారం తెలిపారు. 132/133 కేవీలైన్ మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందు సరఫరాను నిలిపి వేస్తామని.. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు. ఆదిత్యలో అంతర్జాతీయ సదస్సు టెక్కలి: సాంకేతిక అప్లికేషన్స్‌పై టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్, టెక్ ఇన్నోవేషన్ తదితర విభాగాల్లో తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో పరిశోధనలు, విద్యార్థుల సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. -
మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆందోళన
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీలోని గొరఖ్పూర్లో విద్యుత్, సాగు, తాగునీరు, రహదారి వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ పేరిట తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రాన్ని సమర్పించారు. అధికారులు స్పందించకపొతే తాము ఆందోళన బాట పడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అయితే అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో మంగళవారం ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న టికిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. -
ఉత్సాహంగా హాకీ, ఫుట్‌బాల్ పోటీలు
రాయగడ: బిజూ కన్యా రత్న యోజన పథకంలో భాగంగా బేటీ బచావో –బేటీ పడావో అభిజాన్ కింద బాలికల సాధికారత కోసం రాయగడ జిల్లా బాలికల సంరక్షణ విభాగం మంగళవారం హాకీ, ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా జిల్లా గ్రామీణ సమగ్రాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్ర కాంత్ మాఝ, జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్, డీసీపీవో మహాదేవ్ చిచువాన్ తదితరులు పాల్గొన్నారు. పొటీల్లో బాలికలు, డీపీపీయూ సహచరులు, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు. ఫుట్‌బాల్ విభాగంలో పీఎంసీ జగదాంబ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ సెంటర్‌కు చెందిన బాలికలు విజయం సాధించగా.. హాకీ పోటీల్లో రాయగడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. -
అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధి సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–3 ఏఎన్ఎంల పదోన్నతుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా దళిత ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జేఏసీ ప్రతినిధులు డి.గణేష్, మిస్కా కృష్ణయ్యలతో కలిసి డీఎంహెచ్‌వో కార్యాలయ ఏవో బాబూరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. పదోన్నతుల కల్పనలో దళితులు, ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంతో అన్యాయం జరిగిందన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని, లేకుంటే విచారణకు ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్‌ను సైతం తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడినట్లుగా తమకు సమాచారం ఉందని, ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. వీరితో పాటు మహిళా ప్రతినిధులు జెన్ని ఆరుద్ర, ఐలా కుమారి, సవర కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా చొయితీ ఉత్సవాల నిర్వహణ
● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రాయగడ: స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 26వ తేదీన జరగనున్న జిల్లాస్థాయి చొయితీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. ఉత్సవాల నిర్వహణపై స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షించారు. చొయితీ ఉప కమిటీల ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటు కానున్న సన్సాహాలపై అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది చొయితీ ఉత్సవాల జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అదేతరహా ఈ ఏడాది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్సవాలకు సంబంధించి ఆహ్వానించాల్సిన ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరుల వివరాలు తెలుసుకున్నారు. ఆహ్వానించే విషయంలో సబ్ కమిటీ తగిన రీతిన స్పందించి వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐదు రోజులు జరగనున్న ఉత్సవాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆరా తీశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కుటీర పరిశ్రమగా ఉన్న చేనేతపరిశ్రమను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే చర్య లను విరమించుకోవాలని అలికాం, పరిసర గ్రామాల చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర చేనేత కార్మిక సంస్థ డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లు కలిసి కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను గ్రామంలోకి తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు సహకరించాలని కోరడంలో అర్ధం లేదన్నారు. ఇక్కడి మాస్టర్ వీవర్లు నేసిన చీరలకు దేశ విదేశాల్లో గుర్తింపు ఉందని, ఇంతటి నైపుణ్యం కలిగిన నేత సంస్కృతిని కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు తాము సానుకూలంగా లేమని స్పష్టం చేశారు. గ్రామానికి సంబంధం లేని ఓ కార్పొరేట్ సంస్థకు ఐదు ఎకరాల భూమి కేటాయించడం తగదన్నారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లకు వినతిపత్రాలు అందజేశారు. -
ఒడిశా వాసి గోవాలో ఆత్మహత్య..!
పర్లాకిమిడి: ఉపాధి కోసం మోహనా బ్లాక్ లిల్లిగుడ పంచాయతీ డెంగోఅంబో గ్రామానికి చెందిన సనియా మల్లిక్ కుమారుడు జయ మల్లిక్ (18) గోవా వెళ్లి అక్కడ హోటల్ బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందింది. మృతుడు జయ మల్లిక్ టవల్‌తో బాత్ రూమ్‌లో తక్కువ ఎత్తులో ఎలా ఆత్మహత్య చేసుకున్నాడో సందేహంగా ఉందని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోహనా బ్లాక్ డెంగోఅంబో గ్రామానికి చెందిన జయా మల్లిక్ ఉపాధి కోసం కోద్ది రోజుల క్రితం గోవా వెళ్లి ఒక హోటల్లో చేరాడు. నెలరోజులు తిరక్కముందే కుటుంబ సభ్యులు ఈ దుర్వార్త వినాల్సివచ్చింది. జయా మల్లిక్ మృతి వార్త విని డెంగోఅంబో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతదేహం గజపతి జిల్లా మోహనాలోని స్వగ్రామానికి తీసుకురావడానికి తండ్రి ఏర్పాట్లు చేస్తున్నాడు. -
రోడ్డెక్కిన రైతన్న
భువనేశ్వర్ : మండీల మూసివేతను నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన ప్రదర్శించారు. వందలాది మంది వరి బస్తాల్ని జాతీయ రహదారిపై వేసి రాకపోకలను అడ్డుకున్నారు. బర్గడ్ జిల్లా గొడొభాగా వద్ద మంగళవారం జాతీయ రహదారి దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండీల మూసివేతకు సంబంధించి అధికారులతో చర్చలు విఫలమైన తర్వాత రైతులు రోడ్డును దిగ్బంధించారు. వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య ఘర్షణతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బర్గడ్ ఉప జిల్లా కలెక్టర్ ప్రసన్న కుమార్ పాండే, బర్గడ్ సబ్ డివిజినల్ పోలీసు అధికారి రైతులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అటాబిరా మండలం గొడొభాగా వరి సేకరణ మండి మూతపడింది. రైతాంగం వరి విక్రయానికి టోకెన్ల జారీ నిలిచిపోయింది. టోకెన్లు లభించినా మండీ తాళం పడడంతో పంట విక్రయానికి అవకాశం లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కంచిలి: మండలంలోని జలంత్రకోట నుంచి కంచిలి వచ్చే మార్గంలో జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోకర్ణపురం గ్రామానికి చెందిన యువకుడు సీర సాయికుమార్(28) దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ మార్గంలో రోడ్డు పక్కన డివైడర్లపైన మొక్కలు వేసిన చోట పిచ్చిమొక్కలు తొలగించే ప్రక్రియలో భాగంగా నిర్వహణ పనులు చేపట్టేవారు అక్కడ స్టాపర్స్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. మృతుడు సాయికుమర్ స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై వీటి పక్కనుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్టాపర్స్ పెట్టడంతో కొంత అయోమయానికి గురై ప్రమాదానికి గురవ్వడంతో, అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో, కంచిలి పోలీసులు వెంబడించి ఒడి శా పరిధి గిరిసోల వద్ద పట్టుకున్నట్లు సమాచారం. దుబాయి నుంచి వచ్చి.. మృతుడు సాయికుమార్ ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. మూడు నెలల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చి, తండ్రి వ్యవసాయ పనులకు తోడుగా ఉంటున్నాడు. మధ్యాహ్నం సోంపేటలో సెలూన్ షాపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేని మృతుని తల్లిదండ్రులు చంద్రమ్మ, శ్యామ్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా సాయికుమార్ తమ్ముడు రామకృష్ణ ఏడాదిన్నర క్రితం సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో రైలు ప్రమాదానికి గురై మృతి చెందాడు. తమ్ముడు మృతి చెందిన ఏడాదిన్నరకే అన్న కూడా మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీముఖలింగంలో భక్తుల అవస్థలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం మాడవీధుల్లో రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. స్వామివారి మాడ వీధుల్లో ధాన్యం ఆరబోయడంతో వాహనాలు నిలిపేందుకు స్థలం లేకుండాపోయింది. దీంతో ఆలయం ఎదురుగా రోడ్డుమీద వాహనాలు పార్కింగ్ చేయడంతో భక్తులు ఆలయానికి వెళ్లి వచ్చేందుకు అవస్థలు పడ్డారు. వాహనాలు నిలిపేందుకు గుత్తేదారుడు పార్కింగ్‌కు డబ్బులు కూడా వసూలు చేసి సరైన పార్కింగ్ స్థలం చూపకపోవడంతో ఇలా నిర్లక్ష్యంగా భక్తులు రోడ్డు మీదనే నిలిపివేశారు. దీనిపై దేవదాయ శాఖ అధికారులు కనీసం చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
బంగారు శంఖం పేరిట టోకరా
కొరాపుట్ : నకిలీ బంగారం శంఖం అమ్ముతున్న ముఠాను నబరంగ్‌పూర్ జిల్లా మైదల్‌పూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లాలో ఈ ముఠా తమకు తవ్వకాలలో పురాతన బంగారు శంఖం దొరికిందని అమాయకులను నమ్మబలుకుతున్నారు. అనంతరం తక్కువ ధరకి అమ్ముతున్నామని చెప్పి దొరికిన డబ్బుతో ఉడాయిస్తున్నారు. ఈ ముఠాపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తాజాగా శంఖంతో అమ్మకానికి వస్తున్న ఈ ముఠాను నీలాద్రిగుడ అటవీ ప్రాంతంలో అంపానీ మార్గంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రామ్చలన్, గోపాల్మజ్జి, కృష్ణ పంకా, అస్త మజ్జి, త్రిపుపతి బిందాని, ఉమేష్ ఉన్నారు. నాయకుడు బలరాం హరిజన్ పరారయ్యాడు. నిందితులంతా నబరంగ్‌పూర్ జిల్లా వాసులేనని ఏఎస్పీ ఆదిత్య సేన్ ప్రకటించారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు. -
ఏనుగుల హల్చల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మ బ్లాక్‌లో పరిడా పంచాయతీ జన్నిగుడ, అధంగుడ, రాధాకాంత పూర్ ఏజెన్సీలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకుడిని వెంబడించింది. దీంతో బైక్ వదిలి పారిపోయాడు. బైక్‌ను తొక్కి నాశనం చేశాయి. వేటగాళ్ల ఉచ్చులో చిరుత భువనేశ్వర్: అంగుల్ ప్రాంతంలో ఓ చిరుత పులి ఉచ్చులో చిక్కుకుని మృతిచెందిది. కొరొతొపొట్టా సెక్షన్‌లోని హిడిసింఘి అడవిలో వేటగాళ్లు పన్నిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతి చెందిందని ప్రకటించారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూన రవికుమార్, సూర శ్రీనివాసరావులు పేర్కొన్నారు. నగరంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో జాతీయ సాఫ్ట్ బాల్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడాకారులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నారు. క్రీడాకారులంతా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెహ్రూ యువకేంద్రం కో–ఆర్డినేటర్ వెంకట ఉజ్వల్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లాలో సాఫ్ట్‌బాల్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. క్రీడాకారుల కోసం త్వరలో సాఫ్ట్ బాల్ క్రీడా పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, అసోసియేషన్ నాయకులు మెట్ట తిరుపతిరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఎరువుల పంపిణీ గందరగోళం సరుబుజ్జిలి: రబీ మొక్కజొన్న పంటల ఎరువుల పంపిణీకి సంబంధించి తెలికిపెంట సచివాలయం ఎరువుల గోదాం వద్ద మంగళవారం గందరగోళం నెలకొంది. సుమారు 444 ఎరువు బస్తాల పంపిణీకి వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఆ సమయంలో అధికార పక్షానికి చెందిన కొంతమంది వ్యక్తులు పంపిణీకి సంబంధించిన టోకెన్ల జారీ వద్ద ఉండడంపై వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బెవర మల్లేశ్వరరావు, చెంచల ముఖలింగం అభ్యంతరం తెలిపారు. అధికారులు ఎరువులు పంపిణీ చేయాల్సిన ప్రదేశంలో కూటమికి చెందిన నేతలు పర్యవేక్షణ చేస్తుంటే మీరేం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతీ రైతుకూ ఎరువులు అందించాల్సిన బాధ్యత అధికారులదేన్నారు. దీంతో ఇరుపక్షాలు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు వచ్చి ఇరుపక్షాలను శాంతింపజేశారు. ఇదే విషయమై అగ్రికల్చర్ అసిస్టెంట్ కె.అశోక్ వద్ద ప్రస్తావించగా సాగు విస్తీర్ణం మేరకు రైతులకు ఎరువులు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతీ రైతుకు విస్తీర్ణం మేరకు ఎరువులు అందిస్తామని, త్వరలో రెండో విడత ఎరువుల పంపిణీ ఉంటుందని వెల్లడించారు. ఆటోను ఢీకొన్న కారు టెక్కలి రూరల్: మండలంలోని పరశురాంపురం కూడలి సమీప జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కూరగాయల ఆటోను వెనుక నుంచి అదే మార్గంలో వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా, కారు ముందరి భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనపై టెక్కలి పోలీసులకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. మొదలైన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలల్లోని ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సులకు చెందిన మూడో సెమిస్టర్ పరీక్షలు క్యాంపస్ కేంద్రంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. స్కిల్ డవలప్మెంట్ సబ్జెక్టుకు ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి 319 మందికి గాను 17 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా సైన్స్ కోర్సులకు సంబంధించి 395 మందికి గాను 8 మంది పరీక్ష రాయలేదు. సైన్స్ కోర్సులకు ఆర్అండ్ డీన్ డాక్టర్ ఎన్.లోకేశ్వరి, ఆర్ట్స్ కోర్సులకు అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్రమ్మణ్యంలు పరీక్షల చీఫ్లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్‌లో జరిగిన పరీక్షలను వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.స్వప్నవాహిని పరిశీలించారు. అదేవిధంగా డీపీఈడీ, బీపీఈడీ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. తొలిరోజు ఈ పరీక్షలకు 369 మంది హాజరయ్యారు. -
అపరాల కొనుగోళ్లపై దృష్టిసారించాలి
పర్లాకిమిడి: అపరాల కొనుగోళ్లపై సిబ్బంది దృష్టిసారించాలని అధికారులు అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ల్లో గజపతి జిల్లా స్థాయి రాగులు, పప్పుదినుసుల ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ముఖ్యఅతిథిగా ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీవో అంశుమాన్ మహాపాత్రో, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, డీడబ్ల్యూవో సాల్మన్ రైకా, జిల్లా ఇండస్ట్రీస్ జీఎం సునారాం సింగ్, జిల్లా జీవనోపాదుల శాఖ డీఎం టిమోన్ బోరా, మహిళా ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో రాగులు పంట అత్యధిక మోహానా, గుమ్మ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, నువాగడ సమితిల్లో సాగు చేస్తున్నారని ఐటీడీఏ అధికారి అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర రూ.48.86 పైసలు ఉందని వివరించారు. కందులు, బొబ్బర్లు, చిక్కుడుగింజలు, మినప, పెసర తదతర పప్పుదినుసులను టీడీసీసీ ద్వారా కొనుగోలు చేసి మహిళా ఎస్హెచ్జీకి అప్పగించాలన్నారు. సమితి స్థాయిలో రాగులు ఎంత ధర పలుకుతున్నాయో బీడీవోల ద్వారా సమాచారం సేకరించాలని ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ సూచించారు. -
సీనియర్ సిటిజన్ జాతీయ అథ్లెటిక్స్‌లో పతకాలు
పర్లాకిమిడి: తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టేడియంలో ఈనెల 7న జరిగిన ఏడో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2025 పోటీలలో పర్లాకిమిడికి చెందిన సీనియర్ క్రీడాకారుడు, విశ్రాంత ఎకై ్సజు ఎస్ఐ కిశోర్‌చంద్ర రథ్‌కు రెండు పతకాలు లభించాయి. వందమీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్, ట్రిపుల్ జంప్ లో సిల్వర్ మెడల్ సాధించినట్టు ఆయన తెలిపారు. ఆయన విజయానికి పర్లాకిమిడి సీనియర్ సిటిజన్ ఫోరం, ధర్మ నారాయణ మెడికల్ పైడిశెట్టి లక్ష్మణరావులు అభినందించారు. ఈ పోటీలకు ఒడిశా నుంచి 12 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. గతంతో కిషోర్ చంద్ర రథ్ పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలో అనేక బహుమతులు సాధించారు. -
ఖో–ఖో అసోసియేషన్ కోశాధికారిగా శ్రీనివాస్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖో–ఖో అసోసియేషన్ నూతన కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట లభించింది. సోమవారం ఏలూరు వేదికగా జరిగిన ఏపీ రాష్ట్ర ఖో–ఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర కోశాధికారిగా జిల్లాకు చెందిన సాధు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ (ఎస్ఏ పీఈ)గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్ధాలుగా జిల్లా కబడ్డీ, ఖో–ఖో క్రీడాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కబడ్డీ, ఖోఖో అసోసియేషన్‌లో కీలకభూమిక పోషిస్తున్నారు. ఈయన ఎన్నికపై జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టి నాగభూషణరావు, కార్యదర్శి ఫల్గుణరావు, కబడ్డీ సంఘ జిల్లా చైర్మన్ ఎమ్మెల్యే గొండు శంకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆకట్టుకున్న చిత్రకళా ప్రదర్శన
జయపురం: జాతీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ 2025 సందర్భంగా స్థానిక విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కళాశాలలో స్వర్గీయ సింహాద్రి మహరాణ భవనంలో జిల్లా స్థాయి చిత్ర కళా ప్రదర్శణ సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన జిల్లా స్థాయి చిత్రకళా పోటీల్లో విద్యార్థులు వేసిన చిత్రాల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం వారంతా ఫొటో ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఫొటోలు తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రదర్శనలో జయపురం సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి, కొరాపుట్ జిల్లా ప్రణాళిక బోర్డు అధికారి, జిల్లా సాంస్కృతిక అధికారి సూర్యకాంత బెహర, జయపురం మున్సిపాలిటీ సహాయ కార్యనిర్వాహక అధికారి పూజ రౌత్ ప్రసంగించారు. -
రాయ్‌పూర్–విశాఖపట్నం కారిడార్
● మారుమూల జిల్లాల అనుసంధానం భువనేశ్వర్: ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్, విశాఖపట్నం ఆర్థిక కారిడార్ (ఆర్వీఈసీ) నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. ఈ కారిడార్ రాష్ట్రంలో మారుమూల జిల్లాలను అనుసంధానపరచి వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. రోడ్డు రవాణా–రహదారుల శాఖ రూ. 16,482 కోట్ల వ్యయంతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి దార్శనికతకు అనుగుణంగా మారుమూల ప్రాంతాలను ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలో జోడించి పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరంతర వృద్ధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. చత్తీస్‌గఢ్ అడవులు, ఒడిశాలోని ఖనిజ సంపద కలిగిన ప్రకృతి దృశ్యాలు, ఆంధ్రప్రదేశ్ కొండల నడుమ విస్తరించి ఉన్న రాయ్‌పూర్, విశాఖపట్నం ఆర్థిక కారిడార్ 26వ నంబరు జాతీయ రహదారి గుండా రాయ్‌పూర్, విశాఖపట్నం మధ్య నిర్మితం అవుతుంది. ఈ పనులు పూర్తి అయితే ప్రస్తుత దూరాన్ని 597 కిలో మీటర్లు నుంచి 465 కిలో మీటర్లకు తగ్గిస్తుంది. ప్రయాణ సమయం సుదీర్ఘ 12 గంటల నుంచి కేవలం 5 గంటలకు తగ్గుతుంది. ఈ తగ్గుదల గణనీయమైన ఇంధన ఆదాతో ప్రజలకు, సరుకు రవాణా ఆపరేటర్లకు రవాణా ఖర్చులను తగ్గిస్తుంది. ఈ కారిడార్ బొరిగుమ్మ, నవరంగ్‌పూర్, కొరాపుట్ వంటి గిరిజన, అభివృద్ధి చెందని జిల్లాల గుండా వెళుతుంది. మార్కెట్లు, ఓడ రేవులు, పారిశ్రామిక కేంద్రాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తెచ్చి స్థానిక పరిశ్రమల ప్రోత్సాహానికి దోహదపడుతుంది. విశాఖపట్నం ఓడ రేవు ద్వారా ఎగుమతులను సులభతరం చేస్తుంది. లాజిస్టిక్స్, వాణిజ్యం మరియు రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక లాభాలతో గిరిజన వర్గాల సాధికారితకు బలమైన సోపానంగా నిలుస్తుంది. ప్రస్తుత 2 వరుసల 26వ నంబరు జాతీయ రహదారిపై రవాణా ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రహదారి ప్రయాణికులకు, సరుకు రవాణా ఆపరేటర్లకు బహుముఖ ప్రయోజనకారిగా నిలుస్తుంది. -
దివ్యాంగులకు చేయూత
భువనేశ్వర్: దివ్యాంగుల సంక్షేమం, ప్రోత్సాహానికి హైటెక్ చేయూతనిచ్చి ఆదుకుంటుందని హైటెక్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు తిరుపతి పాణిగ్రాహి ప్రకటించారు. స్థానిక బిపిన్ బిహారీ చౌదరి స్కూల్ డెఫ్ ఆట స్థలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ మహోత్సవం– 2025లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జట్నీ ప్రాంతానికి చెందిన మో పొరిబార్ తదితర సాంఘిక సంక్షేమ సంస్థల ప్రతినిథులకు ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. హృదయపూర్వక ఆదరణతో దివ్యాంగులు దివ్యంగా వెలుగొందే అవకాశం మెండుగా ఉంటుందని సత్కార గ్రహీతలు తెలిపారు. కుటుంబం, సమాజం దివ్యాంగుల పట్ల ప్రోత్సాహకరంగా ఆదుకుని ఎదుగుదలకు దోహదపడాలని డాక్టరు తిరుపతి పాణిగ్రాహి అన్నారు. హైటెక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. -
గ్రీవెన్స్‌లో 69 వినతుల స్వీకరణ
పర్లాకిమిడి: జిల్లాలో నువాగడ బ్లాక్ కె.జలార్సింగ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జాయింట్ గ్రీవెన్సుసెల్, గ్రామ ముఖిపరిపాలనకు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్‌సెల్‌కు ఇన్చార్జి కలెక్టర్ మునీంద్ర హానగ, జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్ విచ్చేశారు. సమితిలో బోడోపద, తిత్తిసింగి, ఖోజురిపద గ్రామపంచాయతీల నుంచి 69 వినతులు అందాయి. వాటిలో గ్రామ సమస్యలు 35, వ్యక్తిగత అభియోగాలు 34 ఉన్నాయి. ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హానగ వినతులు పరిశీలించి సంబంధిత విభాగాల అధికారులకు అందజేశారు. అనంతరం ఐసీడీఎస్ విభాగం ఏర్పాటు చేసిన పోషక ఆహారాల స్టాల్‌ను సందర్శించారు. బీడీవో లోకనాథ ప్రధాన్, తహసీల్దార్ మోనాలిసా ఆచారి, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మృతులకు పరిహారం ఇప్పించండి
కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి చిల్లపుట్టుగ గ్రామంలో మే 26వ తేదీన జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పి.వి.సూర్యప్రకాశ్‌కు వినతిపత్రం సోమవారం అందజేశారు. దీనికి సూర్యప్రకాష్ స్పందించి నష్ట పరిహారం మంజూరు కు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. యువతి ఆత్మహత్య రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన శీల కీర్తి(16) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని జే.ఆర్.పురం పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన ఇంట్లో టీవీ చూస్తోందని తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన కీర్తి పురుగుల మందు తాగి పడుకొనిపోయింది. రాత్రి సమయంలో వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు గమనించి రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతురాలు కీర్తి రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తల్లి రుణం తీర్చుకున్న తనయ నరసన్నపేట: స్థానిక పురుషోత్తం నగర్‌కు చెందిన మన్నిక రమణమ్మ తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. అనారోగ్యంతో బొమ్మాళి రాములమ్మ (65) సోమవారం మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నప్పటికీ అదృశ్యమై ఏడాది పైనే అవుతోంది. కుమార్తె రమణమ్మ భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటుంది. ఈ దశలో తల్లి మరణించడంతో రమణమ్మ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది. చీటింగ్ కేసులో వ్యక్తి అరెస్ట్ పాతపట్నం: చీటింగ్ కేసులో టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన వై.గోపిని నాన్ బెయిలబుల్ వారెంట్‌పై అరెస్ట్ చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నంలోని ప్రశాంతినగర్‌లో నివాసముంటున్న సీహెచ్ శ్రీనివాసరావుకు 2014 సంవత్సరంలో పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధి అమ్మవారి ఆలయం సమీపంలోని ఇంటి స్థలం అమ్ముతామని చెప్పి, నకిలీ అగ్రిమెంట్ చూపించి, నగదు టోకెన్‌గా తీసుకున్నారని అప్పట్లో శ్రీనివాసరావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు గతంలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఇప్పుడు వై.గోపిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ తెలిపారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్: మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన అన్నెపు సరస్వతి(80) సోమవారం మృతి చెందారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు వి.పద్మావతి, బి.నాగలక్ష్మి, వి.లిఖిత నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ పూతి సుజాత, ఉమా శంకర్ల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సెక్రటరీ బి.మల్లేశ్వరరావు, ట్రెజరర్ కె.దుర్గా శ్రీనివాస్ తదితరులు అభినందించారు. నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని, అంధత్వ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్లో బాల్య వివాహాల అనర్థాలపై పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అంబులెన్స్‌కు ప్రమాదం
రాయగడ: కొరాపుట్–రాయగడ ప్రధాన రహదారి కొట్లాగుడ వద్ద జననీ ఎక్స్‌ప్రెస్ ఆంబులెన్స్ ఆదివారం ప్రమాదానికి గురైంది. ఆంబులెన్స్ ముందు టైర్లు పేలిపొవడంతో అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గర్భిణిని ఆస్పత్రిలో చేర్పించి తిరిగి వస్తుండగా సదరు సమితి కొట్లాగుడ గ్రామ సమీపంలో టైర్లు పేలిపొవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న కారును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి దిగజారాయి. సోమవారం కొరాపుట్ జిల్లా దమంజోడిలో భారత అల్యూమినియం కేంద్రం (నాల్కో) టౌన్ షిప్ సమీపంలో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే కనిష్టం కావడం విశేషం. దేవమాలి, తొలమాలి, పుట్షీల్, పుంజషీల్, గుప్తేశ్వరం, డుడుమ, రాణి డుడుమ, మాచ్‌ఖండ్ ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ పెరిగింది. ఎన్సీఆర్టీలో శిక్షణకు జిల్లా ఉపాధ్యాయులు పర్లాకిమిడి: నూతన విద్యావిధానం (ఎన్ఈపీ–2020)లో భాగంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు ఉపాఽధ్యాయులు (ఎన్సీఆర్టీ) రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్వహించే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సు ట్రైనింగ్ ఎంపికయ్యారు. వారిలో గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ జీబ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సైన్ టీచర్ రామక్రిష్ణ బొమ్మాళీ, మోహానాకు చెందిన శివరాం మండళ్, జాజ్‌పూర్ జిల్లాకు చెందిన శుభ్రాంశు నాయక్, హెచ్.ఎస్.రామక్రిష్ణ (జాజ్‌పూర్ జిల్లా) బెల్లగ ఉపాధ్యాయులు నవంబర్ 26 నుంచి డిసెంబర్ పదో తేదీ వరకూ శిక్షణ పొందుతున్న సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాలు వారిని అభినందించారు. 9 ఎకరాల వరి కుప్పలు దగ్ధం కొరాపుట్: ఆరుగాలం రైతు సాగు చేసుకున్న తొమ్మిది ఎకరాల వరికుప్పలు అగ్నికి ఆహుతైంది. ధాన్యంతోపాటు ట్రాక్టర్ కూడా బూడిదైంది. నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి దుంగియాడిగి గ్రామంలో సోమవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. అన్నదమ్ములైన గాంధీరాం గొండో, బాబుదాస్ గొండో, రోహిత్ గొండోకి చెందిన వరి పంట కోసి ట్రాక్టర్లో తరలించడానికి సిద్దం చేశారు. ఇదే సమయంలో అనుకొని విధంగా అగ్ని మంటల రేగాయి. ఇదే ప్రమాదంలో వరిని తరలించడానికి సిద్ధంగా ఉంచిన ట్రాక్టర్ కూడా దగ్ధమైంది. కేవలం ఖరీఫ్ పంట మీదే ఆధారపడిన బాధిత రైతులు ఏడాది కష్టం మట్టిలో కలసి పోయిందని రోదిస్తున్నారు. -
మ్యాచ్‌కు రెడీ
● నేడు భారత్, దక్షిణాఫ్రికా టీ–20 మ్యాచ్ భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియంలో మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు టీ–20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల క్రికెటర్లు ప్రాక్టీసు మ్యాచ్‌లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్, సాయంత్రం 5.30 గంటలకు దక్షిణాఫ్రికా ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లు తిలకించేందుకు స్టేడియం 6, 7 నెంబర్ల గ్యాలరీల్లోకి ప్రేక్షకులకు అనుమతించారు. ముందు నుంచే సన్నద్ధం దక్షిణాఫ్రికాతో జరిగే టీ–20 సిరీస్ ఓపెనర్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీ–20 ప్రపంచ కప్ – 2024 తర్వాత నుంచే సన్నాహాలు ప్రారంభించిందని తెలిపారు. అవసరమైతే తప్ప టీ – 20 జట్టులో పెద్ద మార్పులు చేసేది లేదని ప్రీ–మ్యాచ్ విలేకర్ల సమావేశంలో ఆయన ప్రకటించారు. బారాబటితో మంచి అనుభవం గతంలో బారాబటి స్టేడియంలో ఐపీఎల్, దేశీయ క్రికెట్ రెండింటినీ అనుభవించామని, మైదానం పరిస్థితుల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. ఇక్కడ మంచి అనుభవం ఉందని, పిచ్ భిన్నంగా ప్రవర్తిస్తుందని తెలిపారు. కానీ పరిస్థితులకు అనుగుణంగా బాగా అలవాటు పడ్డామని అని ధీమా వ్యక్తం చేశారు. హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. ఎంపికకు అందుబాటులో ఉన్నారని కెప్టెన్ ఽధ్రువీకరించారు. భారీ జనసమూహం అంచనా 45,000 మందికి పైగా ప్రేక్షకులను ఆకర్షించనున్న హై ప్రొఫైల్ ఓపెనర్ మ్యాచ్‌కు ముందు సోమవారం బారాబటి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్టు క్రీడాకారులు ప్రాక్టీస్ చేశారు. మొదటి సారిగా బారాబటి ఎర్ర నేల పిచ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించనుంది. క్లాక్ టవర్ దగ్గర ప్రాక్టీస్ స్ట్రిప్‌లు కూడా ఆటగాళ్ల అనుకూలతకు సహాయపడటానికి అదే మట్టిని ఉపయోగించారు. మ్యాచ్ డే ఏర్పాట్లు రెండు జట్లు మే ఫెయిర్ హోటల్లో కట్టుదిట్టమైన భద్రతలో బస చేస్తున్నాయి. భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ మ్యాచ్ డే బాధ్యతలపై అధికారులకు వివరణాత్మక బ్రీఫింగ్ నిర్వహించారు. ప్రేక్షకుల నిర్వహణ, ఆటగాళ్ల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. భద్రతా కార్యకలాపాల కోసం మొత్తం 50 ప్లటూన్ల పోలీసులు, 300 మందికి పైగా అధికారులను మోహరించారు. భువనేశ్వర్, కటక్ మార్గంలో భద్రతను కఠినతరం చేశారు. అదనంగా ప్రముఖుల రక్షణ బృందాలను నియమించారు. క్రికెటర్లు, అధికారులు సకాలంలో నిరంతరాయంగా రాకపోకలకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేశారు. -
సంక్షోభానికి కారణం కేంద్రమంత్రే
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: గడచిన కొన్ని రోజులుగా దేశంలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని, ఈ స్థితికి కారణం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడేనని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ్మోహన్నాయుడు అతి పిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి చేపట్టారని, ఉత్తరాంధ్రకు, జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని ఆశించినా ఇలా అప్రతిష్ట మూటగట్టారని అన్నారు. జాతీయ స్థాయి మీడియాలో సైతం రీల్స్ మీమ్స్ పబ్లిసిటీ చేసుకునే వ్యక్తిగా నిలిచారని తెలిపారు. ఇండిగో విమానయాన సంక్షోభంపై ప్రధానమంత్రి అధ్యక్షతన నిర్వహించిన హై లెవెల్ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిని పిలవకపోవడం సిగ్గుచేటని తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంలో కూడా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని లీగల్ సమస్యలను పరిష్కరించి 2300 ఎకరాల భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ తిప్పి నిర్మాణాన్ని జీఎంఆర్‌కు అప్పగించారని గుర్తు చేశారు. కానీ అక్కడ కూడా రామ్మోహన్ నాయుడు అంతా తమ ఘనతే అన్నట్టు రీల్స్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కింజరాపు కుటుంబ సభ్యులు ఎన్నో పదవులు అనుభవించినా జిల్లాకు చేసిందేమిటని ప్రశ్నించారు. సమావేశంలో బూర్జ మండలపార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, పార్టీ నాయకులు బొడ్డేపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా యువకుడు మృతి
● హత్య చేశారని తల్లిదండ్రుల ఆరోపణ నరసన్నపేట/టెక్కలి రూరల్: మండలంలోని చోడవరం వద్ద లుకలాం – కొమనాపల్లి రహదారి పక్కన వంశధార కాలువలో కోటబొమ్మాళి మండలంలోని తాడిపర్తి సమీప గోపాలపురం గ్రామానికి చెందిన మన్నేల సాయికుమార్ (21) అనుమానాస్పదంగా మృతి చెందాడు. ద్విచక్ర వాహన ప్రమాదంగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నా.. తమ కుమారుడిని చెన్నాపురానికి చెందిన కర్రి రాజు తదితరులు హత్య చేశారని తల్లిదండ్రులు మన్నేల అప్పన్న, సావిత్రిలు ఆరోపిస్తున్నారు. దీంతో అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఇన్చార్జి ఎస్ఐ రంజిత్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. చోడవరం వద్ద వంశధార కాలువలో బుల్లెట్ బండి, దాని కింద సాయికుమార్ మృతదేహం సోమవారం ఉదయం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఇన్చార్జి ఎస్ఐ రంజిత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతిపై అనుమానాలు సాయికుమార్ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత బంధువులు హత్యగా అనుమానించారు. పళ్లు విరిగి ఉన్నాయని, నడుముపై తాడు గుర్తులు ఉన్నాయని తండ్రి అప్పన్న తెలిపారు. కర్రి రాజు తో తమకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. రెండు నెలల క్రితం 90 గొర్రెలు కర్రి రాజుకు విక్రయించామని, దానికి సంబంధించి రూ.13 లక్షలు ఇవ్వాల్సి ఉందన్నారు. అడ్వాన్స్‌గా రూ.50 వేలు ఇచ్చి మిగిలిన మొత్తం ఇవ్వకుండా వాయిదాలు వేస్తున్నారని.. ఈ డబ్బు కోసమే ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్రి రాజు అతని స్నేహితులు పిట్ట శ్రీను, పిట్ట గంగడులతో కలిసి హతమర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి పొలంలో గొర్రెల మందను కర్రి రాజు వేశారని, అక్కడే సాయికుమార్‌కు భోజనం పెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోనే కాలువలో మృతదేహం ఉండడంతో వారిపై అనుమానంగా ఉందని తెలిపా రు. కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ మాట్లాడుతూ మృతదేహంపై ఎటువంటిగాయాలు లేవని ప్రమా దంగానే భావిస్తున్నామని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల ఆరోపణలను పరిగణలోనికి తీసుకొని అనుమానాస్పదంగా కేసు నమోదు చేశా మన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. -
వార్షికోత్సవ వైభవం
రాయగడ: సాహిత్యం, కళారంగాలు ముందుకు సాగాలంటే యువత ఆసక్తి కనబరచాలని ప్రముఖ కవి, రచయిత విశాఖపట్నంకు చెందిన డాక్టర్ కేజీ వేణు అన్నారు. స్థానిక సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవం కోదండ రామమందిరంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రవాసంలో ఒక తెలుగు సంస్థ ఏర్పాటు చేసి నిరాటకంగా 30 వసంతాలు నడపడం అంటే సామాన్య విషయం కాదని అన్నారు. ఈ సందర్భంగా తల్లి, తండ్రి, గురువు పై వినిపించిన స్వీయ కవితలు అబ్బుర పరిచాయి. స్పందన నృత్య పాఠశాల చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. పట్టణంలో ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయని, అయితే స్పందన వంటి సాహితీ, సాంస్కృతిక సంస్థ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని గుర్తింపు తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయమని రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్ అన్నారు. తాను కూడా నటుడినేనని తెలిపారు. 30 ఏళ్ల కిందట ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు స్వర్గీయ జీఆర్ఎన్ ఠాగూర్ ద్వారా ఆవిర్భవించిన స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించిందని ఆ సంస్థ అధ్యక్షులు గుడ్ల గౌరీశంకర్ ప్రసాద్ అన్నారు. ఆయన అనంతరం న్యాయవాది స్వర్గీయ మాధవ రావు కుముంధాన్ చేతుల మీదుగా ఇన్నాళ్లు ఈ సంస్థ నడిచిందని, ఆయన తరువాత తనకు ఈ సంస్థలో స్థానం లభించడం గర్వంగా ఉందన్నారు. స్పందన సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న నృత్య పాఠశాల కేవలం ఐదుగురితో మొదలైందని, ఇప్పుడు యాభై మంది ఉన్నారని తెలిపారు. అంతకు ముందు సంస్థ కార్యదర్శి డాక్టర్ తులసీ దాస్ మాట్లాడుతూ స్పందన వార్షిక నివేదికను చదివి వినిపించారు. వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థకు చెందిన నృత్య పాఠశాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సందన సంస్థ ఆవిర్భవించినప్పటి నుంచి సభ్యులుగా క్రియాశీల పాత్ర పొషిస్తున్న పిల్లల శంకరరావు, కవి ,రచయిత భళ్లమూడి నాగరాజు, డాక్టర్ తులసీ దాస్ తదితరులను సంస్థ ఘనంగా సన్మానించింది. -
ఎం.వి–26 గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
● రెండు గ్రామాల మధ్య ఘర్షణలు ● 70కు పైగా మంటల్లో కాలిపోయిన ఇళ్లు ● భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు మల్కనగిరి: జిల్లాలోని కొరుకొండ సమితి ఎం.వి–26 గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎంవి–26 గ్రామంలో గల సుమారు 70కు పైబడిన ఇళ్లు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసు బలగాలు భారీగా మోహరించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 163 సెక్షన్‌ను అమలు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొరుకొండ సమితి పరిధిలో గల రకూల్‌గుడ గ్రామానికి చెందిన లక్కీపొడియాని (85) అనే ఆదివాసీ వృద్ధ మహిళను కొంతమంది గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి ఆమె తలను వేరుచేశారు. మృతదేహాన్ని సమీపంలో గల పోటేరు నదిలో పడేశారు. ఈ నెల 5వ తేదీన పొలం పనుల్లో నిమగ్నమైన లక్కీపొడియాని హత్య ఘటనపై బాధిత కుటుంబీకులు కొరుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోటేరు నదిలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తలలేని మహిళ మృతదేహాన్ని శనివారం గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ మృతదేహం తమ గ్రామానికి చెందిన లక్కీపొడియానిదే అయి ఉంటుందని, మిగతా శరీర భాగం లభించేంత వరకు పోస్టుమార్టం చేయకూడదని రకూల్‌గుడ గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. ఎంవి–26 గ్రామంలోని కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని భావించి మరణాయుధాలతో దాడి చేసి, గ్రామంలో ఉన్న అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కనిపించిన వాహనాలను దగ్ధం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అనంతరం 163 సెక్షన్‌ను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ మాఝి రంగంలోకి దిగారు. ఆందోళనకారులతో మాట్లాడారు. ఘర్షణలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళనకారులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరి మాటలను పట్టించుకోని ఆందోళనకారులు తమకు న్యాయం జరిగేవరకు ఆందోళనను కొనసాగిస్తామన్నారు. ఎం.వి–26 గ్రామస్తుల నిరసన.. తమ గ్రామంపై రకూల్‌గుడ గ్రామస్తులు దాడి చేసి తీరని నష్టం చేకూర్చారని నిరసిస్తూ ఎంవి–26 గ్రామస్తులు సోమవారం నిరసన చేపట్టారు. సుమారు రెండు వేల మందికి పైగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా దాడిలో నష్టపోయిన బాధిత కుటుంబీకులకు తగిన న్యాయం చేయాలని కోరారు. -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన బొయిపరిగుడ సమితి దొరాగుడ పంచాయతీ లెపాగుడ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి మఝిగుడ ధనుర్జయ మఝి అని తెలిసింది. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లభించిన వివరాల ప్రకారం లెపాగుడ గ్రామం కళాశాల విద్యార్థి బికాశ ఖొర తన స్నేహితునితో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ముండగుడ వంతెన వైపు బయలు దేరారు. అక్కడ నుంచి పొద్దుపోయిన తర్వాత వంతెన నుంచి తిరిగి వస్తుండగా లెపాగుడ గ్రామంలో ఒక బైక్ బికాశ బైక్‌ను ఢీకొనగా బికాశ్ తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ప్రమాదంలో బికాశ్ బైక్ వెనుక కూర్చుని వస్తున్న మఝిగుడ వాసి ధనుంజయ మఝి, బికాశ్ బైక్‌ను ఢీకొన్న డుమురిగుడ వాసి ధనుర్జయ నాయిక్ కూడా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన వారిని బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడ నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ధనుర్జయ మఝి మరణించాడు. బొయిపరిగుడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మరణించిన ధనుంజయ మఝి మృత దేహానికి పోస్టు మార్టం జరిపి అనంతరం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. -
147 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని మునిగుడలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి కలెక్టర్ అశుతోష్ కులకర్ణి హాజరయ్యారు. సమితిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 147 వినతులను స్వీకరించారు. ఇందులో 109 వ్యక్తిగత సమస్యలు, 38 గ్రామ సమ్యలుగా గుర్తించారు. ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.95 వేల సహాయాన్ని అందించారు. ముగ్గురుకి రెడ్ క్రాస్ నిధి నుంచి రూ.25 వేల సహయాన్ని అందజేశారు. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని, పలువురు అధికారులు హాజరయ్యారు. సైబర్ మోసాలపై అప్రమత్తం రాయగడ: స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో సైబర్ మోసాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్ఐసీ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ మిథేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆన్లైన్ యుగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే డబ్బులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. తెలియని నంబర్లను రిసీవ్ చేసుకోవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతుందన్నారు. అనసవరమైన యాప్‌లు డౌన్లోడ్ చేయడం వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ కుమార్ సాహు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ఇద్దరికి గాయాలు
పలాస: శాసనాం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. రాయగడకు చెందిన సవర సునీల్‌కుమార్ స్నేహితుడు ఈశ్వరరావుతో కలిసి బైకుపై బరంపురం వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఘనంగా ఆరుద్ర నక్షత్ర పూజలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడి వీధిలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు ఆరవల్లి శ్రీరామ్మూర్తి శర్మ, అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. నక్కవీధిలోని ఉమాజఠలేశ్వరస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అశ్వినీకుమార్, మహేష్ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి. -
విద్య నైతిక నాయకత్వానికి పునాది
భువనేశ్వర్: పట్టభద్రులుగా ఉత్తీర్ణత వాస్తవ జీవితంలో తీసుకునే నిర్ణయాలు, సమర్థమైన బాధ్యతల నిర్వహణలో తేటతెల్లం అవుతుందని, అధునాతన సాంకేతికతలతో శర వేగంగా మారుతున్న భావి ప్రపంచంలోకి అడుగిడుతున్న గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు ఏ రంగంలోనైనా నిజాయితీ, క్రమశిక్షణతో వృత్తి నైపుణ్యం చాటుకోవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ప్రబోధించారు. స్థానిక బిర్లా గ్లోబల్ యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రతిభావంతులైన విద్యార్థులకు డిగ్రీలు, పతకాలను అందజేశారు. పరిశ్రమల పురోగతికి దోహదపడే సాంకేతికత మానవ లక్షణాలను భర్తీ చేయలేదని గవర్నర్ అన్నారు. రాగల సమీప భవిష్యతులో సానుభూతి, సృజనాత్మకత, నైతిక విలువలు వ్యక్తులను విభిన్నంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాధనాలు, ఆటోమేషన్, నిరంతర సవాళ్లతో కూడిన ప్రపంచంలోనికి విద్యార్థులు ప్రవేశిస్తున్న తరుణంలో విద్యను ఉపాధికి సోపానంగా కాకుండా జీవితాంతం నేర్చుకోవడానికి, నైతిక నాయకత్వానికి పునాదిగా వినియోగించుకోవాలని ప్రేరేపించారు. వృత్తి రంగం ఎంపికలో పరిసరాలకు అనుగుణంగా సామాజిక దృక్పథం ప్రామాణికంగా పరిగణించి వినయం, నిజాయితీ, క్రమశిక్షణ మార్గదర్శకాలుగా తదుపరి దశ జీవనానికి శ్రీకారం చుట్టాలని ప్రోత్సహించారు. వైఫల్యం దృఢ సంకల్పంతో తిరిగి ఎదగడానికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యంతో నిజమైన నాయకత్వం ఆవిష్కరిస్తుంది. ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎదుగుదలకు అవకాశాలుగా మలచుకుని ముందుకు సాగాలని అభినందించారు. భారతదేశంలోని కెపిఎంజి విద్య, నైపుణ్య అభివృద్ధి, ప్రభుత్వం, ప్రజా సేవల జాతీయ నాయకుడు నారాయణ రామస్వామి, బిర్లా గ్లోబల్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కులభూషణ్ బలూని, బిర్లా గ్లోబల్ విశ్వవిద్యాలయం గవర్నర్ల బోర్డు సభ్యుడు డాక్టర్ పి. కె.మిశ్రా తదితరులు ప్రసంగించారు. -
పుణ్యక్షేత్రాల సందర్శనలో హైకోర్టు జడ్జి
శ్రీకాకుళం/గార/శ్రీముఖలింగం: ఆంధప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ కుటుంబసమేతంగా ఆదివారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మంలోని కూర్మనాథస్వామి, శ్రీముఖలింగంలోని మధుకేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయకంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.అనురాగ్, బి.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు కంచిలి: బూరగాం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్ పూర్ణమహి ఠాకూర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కంచిలి ఎస్ఐ పి.పారినాయడు స్థానిక విలేకర్లకు ఆదివారం వివరాలు వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల లోడ్‌తో ఇచ్ఛాపురం వైపు నుంచి పలాస వైపు వస్తున్న ఠాకూర్ బూరగాం వద్ద ఆగాడు. బహిర్భూమికి కోసం రోడ్డు దాటుతుండగా మరో లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఠాకూర్ తలకు బలమైన గాయం కావడంతో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పశువులు పట్టివేత రణస్థలం : జె.ఆర్.పురం రామతీర్థాలు కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఆరు పశువులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు తరలిస్తున్న పశువులను పట్టుకుని గుర్ల మండలం గుజ్జింగివలస గోశాలకు తరలించారు. ఇద్దరు నిందితులపై జె.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలుసోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎకై ్సజ్ సీఐ రమణ హెచ్చరించారు. ‘బెల్టు తీెసేదెప్పుడో’ శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి స్పందించి కొర్లాం జాతీయ రహదారి వద్ద పలు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఏడు మద్యం సీసాలతో పట్టుబడిన పుణ్యవతిపై కేసు నమోదు చేశారు. దాబాల్లో మద్యం సేవించేందుకు అనుమతించే నిర్వాహకులు, అనదికార మద్యం దుకాణాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డాబాలు వద్ద మద్యం అనుమతి లేదు అనే బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. రణస్థలం: జీరుపాలెంలో ఆదివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మైలపల్లి కోర్లమ్మ, చిలకమ్మకు చెందిన రెండు పూరిళ్లు కాలిపోయాయి. ముందుగా కోర్లమ్మ ఇంట్లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చిలకమ్మ ఇంటికి అంటుకున్నాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అప్పటికే గృహోపకరణాలు కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షలు 60 వేలు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని జీరుపాలెం సర్పంచ్ మాగుపల్లి రాముడు కోరారు. రణస్థలం అగ్నిమాపక అధికారులు ఇళ్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ యాళ్ల పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ సెట్ అర్హత లేకపోయినా ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన మినహాయింపులకు అనుగుణంగా అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు వివరించారు. వివరాలకు మెడికల్ బయోటెక్నాలజీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.ప్రదీప్(8985745820), ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.రామకృష్ణ (9030768474)ను సంప్రదించాలని కోరారు. -
బీఎస్ఎఫ్ మారథాన్
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉత్సాహంగా..జయపురం: భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 61 వ ప్రతిష్టాపన దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆదివారం బీఎస్ఎఫ్ కొరాపుట్ 180 వ బెటాలియన్ జయపురంలో బీఎస్ఎఫ్ రన్ పేరుతో మారథాన్ పరుగు పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పట్టణంలోని విద్యార్థులు పాల్గొన్నారు. జయపురం విక్రమ్ విశ్వవిద్యాలయ క్రీడా మైదానానికి ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది విద్యార్థులు చేరుకున్నారు. పది కిలోమీటర్ల పోటీలో మొదటి ముగ్గురు విజేతలకు రూ.15వేలు, రూ.10వేలు, రూ. 5వేలు చొప్పున అందజేశారు. ఐదు కిలోమీటర్ల పోటీలోనూ నగదు బహుమతులు అందజేశారు. బహుమతుల ప్రధాన ఉత్సవంలో కొరాపుట్ బీఎస్ఎఫ్ 180 సెక్టర్ డీఐజీ సత్యవాద కాంచి ప్రసంగిస్తూ 1965 లో భారత్– పాకిస్థాన యుద్ధం జరిగిన తరువాత బీఎస్ఎఫ్ ఏర్పాటు జరిగిందని వెల్లడించారు. 10 కిలోమీటర్ల మారథాన్‌లో ప్రథమ బహుమతి అశోక్ దండసేన, ద్వితీయ బహుమతిని రశ్మి రంజన్, మూడో బహుమతిని పవన్ కుమార్ యాదవ్ గెలుచుకున్నారని, బాలికల గ్రూపులో ప్రథమ స్థానం సుశ్మిత టిగ్గ, ద్వితీయ స్థానం దయామణి హరిజన్, తృతీయ స్థానం అంజళీ తడింగి పొందారని వెల్లడించారు. 5 కిలోమీటర్ల మారథాన్ పరుగు పోటీల్లో దయానిధి ముండ ప్రథమ స్థానం పొందగా, దలమణి చిగున్ ద్వితీయ స్థానం, రవి ముదులి తృతీయ స్థానం పొందారు. విద్యార్థినుల్లో అంజన గొరడ ప్రథమ స్థానం, చాందిణి బీసీ నాయిక్ ద్వితీయ స్థానం, పూర్ణి మల్లిక్ తృతీయ స్థానం పొందారని తెలిపారు. -
చొయితీ ఉత్సవాలు
ఆదివాసీల సంస్కృతికి అద్దం పట్టేలా ● రామనగుడ సమితి చైర్మన్ రబి నారాయణ గొమాంగోరాయగడ: అవిభక్త కొరాపుట్ జిల్లాలో అత్యధిక శాతం మంది నివసిస్తున్న ఆదివాసీ, హరిజనుల సంస్కృతికి అద్దం పట్టేవే లోకమహోత్సవ ఉత్సవాలని రామనగుడ సమితి చైర్మన్ రబి నారాయణ గొమాంగో అన్నారు. సమితి స్థాయి చొయితీ ఉత్సవాలు రామనగుడలో ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నవరంగపూర్, కొరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాల్లో లోక్మహోత్సవాలు విభిన్న పేర్లతో నిర్వహిస్తున్నారని అన్నారు. రాయగడలో జరిగే ఉత్సవాలకు చొయితీగా నామకరణం చేసి ఉత్సవాలను ప్రతీ ఏడాది నిర్వహించి ఆదివాసీ, హరిజన ప్రజల భాష, సంస్కృతి, వారి కళలను పరిరక్షించేందుకు ఎంతో ప్రయాసపడుతుండటం అభినందనీయమన్నారు. అనంతరం సమితి కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు కొనసాగి వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు కలశలతో తీసుకువచ్చిన శుద్ధజలాలను ఊరేగింపుగా వేదికవద్దకు తీసుకువెళ్లారు. ర్యాలీలో ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో, ఆటపాటలతో, నృత్యాలతో పాల్గొని ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. తహసీల్దార్ ప్రాణక్రిష్ణ మహాపాత్రో, రామనగుడ సమితి సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. -
సందడిగా పథ్ ఉత్సవాలు
● మల్కన్‌గిరిలో ఆధ్యాత్మిక వాతావరణంమల్కన్గిరి: మాల్యవంత్ మహోత్సవాన్ని మరింత ఉత్సవంగా మార్చేందుకు మల్కన్‌గిరిలో పథ్ ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. చల్లని ఉదయం వేళ నగరమంతా నృత్యం, గానం, ఉల్లాసంతో సదడి చేసింది. ముందున్న మాల్యవంత్ మహోత్సవానికి ముందుగా పట్టణంలో ఈ పథ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ ప్రారంభించగా.. కలెక్టర్ కార్యాలయం నుంచి డీఎన్‌కే క్రీడా మైదానం వరకూ సాగింది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి తంగులు, ఆదనపు కలెక్టర్ సోమనాథ ప్రదాన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేదబర్ ప్రధాన్, జిల్లా పరిషత్ ముఖ్య అభివృద్ధి అధికారి, కార్యనిర్వాహక అధికారి నరేష్ చంద్ర శబర్, ఉప కలెక్టర్ అశ్ని ఏఎల్, అటవీ విభాగం అధికారి సాయికిరణ్, బీఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రవిమిశ్రా తదతరులు హాజరయ్యారు. నగరవాసులు పథోత్సవాన్ని ఆనందంగా ఆస్వాదించారు. అనంతరం రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలతో యువత ఉత్సాహాంగా నృత్యాలు చేశారు. వేదికపై గిరిజన కళా సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పథ్ ఉత్సవంలో నృత్యం, గానం, స్కేటింగ్, ఫాస్ట్ఫుడ్స్, రంగవల్లులు, యోగా వివిధ క్రీడా ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ రంగుల ముగ్గులు, చిత్రలేఖనం ప్రత్యేక ఆకర్షణనగా నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. బోర్డర్ సెక్యూరిటీ దళం నిర్వహించిన డాగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పథ ఉత్సవాలలో పోలీసు శాఖ ‘ఆర్జీ జుంకార్’బృందం మెలోడి ప్రదర్శన ఆకట్టుకున్నాయి. -
రాష్ట్రంలో దట్టమైన పొగమంచు
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి వాతావరణం వణికిస్తోంది. దట్టమైన పొగ మంచు కమ్మిన వాతావరణంలో చలి గాలులు గజగజలాడిస్తున్నాయి. అనేక జిల్లాల్లో రాగల 2 రోజుల్లో దట్టమైన పొగమంచు, శీతల గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు సమాచారం జారీ చేసింది. ఈ వాతావరణ పరిస్థితులు దైనందిన జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ప్రయాణానికి అంతరాయం కలిగిస్తుంది. పసుపు హెచ్చరిక ఈ నెల 8న సుందర్‌గఢ్, కంధమల్, కొరాపుట్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ అయింది. ఆయా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. అంగుల్, ఝార్సుగుడ, ఖుర్ధా మరియు జగత్సింగ్పూర్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రత ఉంటుందని సమాచారం. ఈ నెల 9 మంగళవారం కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయని వాతావరణ శాఖ సమాచారం. సుందర్‌గఢ్, కంధమల్, కొరాపుట్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్మి ఉంటుంది. అంగుల్, ఝార్సుగుడ, ఖుర్ధా మరియు జగత్సింగ్పూర్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా. ఈ ప్రాంతాల నివాసితులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తెల్లవారు జామున పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ పేర్కొంది. చలిగాలుల ప్రభావంతో గత 24 గంటల్లో పది చోట్ల ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అయినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సమాచారం. గత 24 గంటల్లో జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సిమిలిగుడలో 7.5 డిగ్రీలు, దారింగ్బాడిలో 8 డిగ్రీలు, రౌర్కెలాలో 8.1 డిగ్రీలు, ఫుల్బాణిలో 8.5 డిగ్రీలు, ఝార్సుగుడలో 8.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. కటక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌కు దిగజారింది. -
ఆదిత్యాలయంలో భక్తుల రద్దీ
శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 10 నుంచి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ మంచినీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.5,57,100, విరాళాలు, ప్రత్యేక పూజల టికెట్ల విక్రయాల ద్వారా రూ.550,925, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.270 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో వెల్లడించారు. కాగా, స్వామివారిని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ దర్శించుకున్నారు -
● ఉత్సాహంగా కవి సమ్మేళనం
● ఆలోచింపజేసిన కవితలురాయగడ: సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకుని కవులు, రచయితలు రచించిన కవితలు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయని ప్రముఖ రచయిత్రి, రాయగడలోని అటానమస్ కళాశాల తెలుగు అధ్యాపకురాలు టి.జ్యోతి అన్నారు. స్వాగత్ లైన్‌లోని శ్రీకోదండ రామ మందిరం ప్రాంగణంలోని సమావేశం హాల్లో ఆదివారం స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కవి సమ్మేళన కార్యక్రమం సంస్థ సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ.. కవితల్లో ఆవేదన, ఆలోచన, వర్ణన, అభ్యుదయ భావాలు, తల్లిదండ్రులపై ఉన్న ప్రేమతో పాటు 30 వసంతాల స్పందనను వర్ణిస్తు అనుభవాలు రంగరించి రాసినవిగా ఉన్నాయని ఆభిప్రాయపడ్డారు. సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరీశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. స్పందన సంస్థ ఆవిర్భవించిన అనంతరం కవులకు, రచయితలకు ఎంతో ప్రోత్సాహం లభించిందని అన్నారు. అనంతనం అతను రచించిన స్వీయ కవితను చదివి వినిపించారు. కవులు గణపతిరావు, భళ్లమూడి నాగరాజు, బాలక్రిష్ణ పట్నాయక్, కేకేఎం పట్నాయక్, కిశోర్‌కుమార్, భళ్లమూడి నాగేశ్వరరావు, తాళ్లపూడి గౌరీ, పీఎంజీ శంకరరావు, చిన్నారి చక్రధర్, డాక్టర్ బాబూరావు మహాంతి, సింగిడి రామారావు, విశాఖపట్నం నుంచి వచ్చిన లహరి పత్రిక సంపాదకులు బలిజేపల్లి గౌరీజెన్న, పిల్లల శంకరరావు, తెలుగు అధ్యాపకుడు భాస్కరచంద్ర గుప్తా తదితరులు స్వియ కవితలు చదివి వినిపించారు. కవులను, ముఖ్యఅతిథి జ్యోతిని సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. విశ్రాంత అధ్యాపకుడు గిరీష్ పట్నాయక్ ప్రార్థన గీతం ఆలపించగా, సాహితీ విభాగం కార్యదర్శి సింగిడి రామారావు సమావేశాన్ని పరివేక్షించారు. అధికసంఖ్యలో సాహితీ అభిమానులు హాజరయ్యారు. -
మౌలిక సౌకర్యాలు కల్పించాలని వినతి
రాయగడ: సమస్యలతో సతమతమవుతున్న తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధి గొరఖ్‌పూర్ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు తహసీల్దార్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. సమస్యల గురించి పట్టించుకోకపొతే తామంతా కలిసి ఈ నెల ఎనిమిదో తేదీన రాస్తారోకో చేపడతామని వినతిపత్రంలొ పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో మంచినీరు, రహదారి, మోబైల్ టవర్ వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఈ సమస్యలకు సంబంధించి పలుసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై న తమ సమస్యలు పరిష్కరించకపొతే ఆందోళన చేపట్టడం తప్పదని హెచ్చరించారు. వివాహిత ఆత్మహత్య రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కుచేయచిపొదొరి పంచాయతీలోని కంపర గ్రామానికి చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సమా చారం తెలుసుకున్న దొరాగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కాసీపూర ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. కంపర గ్రామానికి చెందిన యోజేష్ ఖొసల భార్య అనీషా ఖొర ఇంట్లోని ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గది తలుపులు మూసి వేసి ఉండటంతో అనుమానించిన కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి లోపలకు వెళ్లి చూసేసరికి వేలాడుతూ అనీషా కనిపించడంతో కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు, బైకు ఢీ● ఇద్దరికి తీవ్ర గాయాలురాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి చిన్న కుజేంద్రీ సమీపంలో కారు, బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు తగిలిన వారిలో చిన్న కుజేంద్రీ గ్రామానికి చెందిన సిధు పతిక, గిరిధర్ గొమాంగోలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం తరలించారు. ఇదిలాఉండగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పగాయాలలో బయటపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా బైకు నుజ్జునుజ్జయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అపూర్వ కలయిక.. పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో 1986 విద్యా సంవత్సరం పూర్వవిద్యార్థులు ఆదివారం ఆత్మీయకలయికను ఏర్పా టు చేసుకున్నారు. దీనికి రాయఘడ బ్లాక్ గండాహాతి జలపాత ప్రాంతం వేదికై ంది. ఈ సందర్భంగా చదువుకున్న రోజులను పూర్వవిద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గ్రూపుఫొటోలు తీసుకొని మురిసిపోయారు. క్విజ్, డ్యాన్స్ పోటీలు నిర్వహించి ఆనందంగా గడిపారు. కాశీనగర్ సమితి మాజీ చైర్మన్ ఛిత్రి సింహాద్రి, కులవర్థనరావు, ప్రిన్సిపాల్ బినోదినీ, సైన్స్ కళాశాలకు చెందిన మనోజ్పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
టీ–20 మ్యాచ్‌కు మూడంచెల భద్రత
భువనేశ్వర్: ఈ నెల 9న కటక్ బారాబటి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ–20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా బారాబటి స్టేడియం సందర్శించి భద్ర తా ఏర్పాట్లు సమీక్షించారు. స్టేడియం లోపల, పరిసరాల్లో క్రికెటర్ల భద్రత, రద్దీ నియంత్రణ తదితర శాంతిభద్రతల నిర్వహణ కోసం సమగ్ర భద్రత సన్నద్ధతను డీజీపీ పరిశీలించారు. మ్యాచ్ ఆద్యంతాలు మూడు అంచెల భద్రతా వ్యవస్థను మోహరించినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రవేశం, నిష్క్రమణ పాయింట్ల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు, సీసీటీవీ నిఘా, విధ్వంస నిరోధక చర్యలు, పోలీసుల మోహరింపు, రెండు జట్ల క్రీడాకారులు, అధికారుల రాకపోకల్లో ప్రత్యేక నియమావళిపై వివరణాత్మక చర్చించారు. క్షేత్ర స్థాయి లో ఏర్పాట్లు సమీక్షించిన డీజీపీ మాట్లాడుతూ ప్రేక్షకుల పూర్తి సహకారంతో ఈ మ్యాచ్ నిర్వహణ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రద్దీ నివారణ దృష్ట్యా చివరి నిమిషం వరకు నిరీక్షించకుండా ప్రేక్షకులు 3 నుంచి 4 గంటలు ముందుగానే రావాలని తెలిపారు. మ్యాచ్ శాంతియుతంగా, సురక్షితంగా, క్రమశిక్షణతో జరిగేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని హామీ ఇచ్చారు. సమీక్షలో పోలీస్ కమిషనర్ ఎస్. దేవ్ దత్తా సింగ్, అదనపు కమిషనర్ నరసింహ భోల్, కటక్ డీసీపీ ఖిలారి రిషికేశ్ ద్యాండియో, సీనియర్ పోలీసు అధికారులు, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కల్యాణమస్తు..!
భువనేశ్వర్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది. మహిళల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సుభద్ర యోజన తర్వాత ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన ప్రవేశపెట్టడం విశేషం. పెళ్లి సందర్భంగా యువతులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం లభిస్తుంది. అయితే ఈ పథకం స్వల్ప కాలిక పథకంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల కూతురు పెళ్లిని సాంస్కృతిక రీతిలో సామాజిక గౌరవంతో జరిపించేందుకు చేయూతనివ్వడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. నిర్ధిష్టమైన మార్గదర్శకాలతో అర్హులైన యువతులకు పెళ్లి సందర్భంగా ఈ పథకం కింద రూ.51,000ల ఆర్థిక సాయం అందజేస్తారు. కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం 2025 – 2026 నుంచి 2029 – 2030 వరకు అమలులో ఉంటుంది. ఒక కుటుంబంలో ఒకరికే.. ఒక కుటుంబంలో ఒకే యువతి పెళ్లి కోసం ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన ప్రయోజనం కల్పిస్తారు. ఈ పథకం లబ్ధి పొందాలంటే వధూవరులు ఇరువురూ ఒడిశా స్థిర నివాసితులై ఉండాలి. వధువు వయస్సు 18 నుంచి 35 ఏళ్లు, వరుడి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. సాధారణంగా తొలిసారి వివాహానికి ఈ సాయం అందజేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వితంతు పునర్వివాహానికి కూడా ఈ పథకం ఆదుకుంటుందని స్పష్టం చేయడం విశేషం. ఇతర రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వివాహ సాయం పొందినవారిని ఈ పథకం నుంచి మినహాయిస్తారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఈ పథకం వర్తిస్తుంది. జిల్లావారీగా పథకం ప్రయోజనం కల్పిస్తారు. జిల్లాలకు కేటాయించిన పరిమితిలో సాయం మంజూరు పరిశీలిస్తారు. జిల్లా బడ్జెట్ లభ్యత ప్రకారం సాయం అందజేస్తారు. అర్హత కలిగిన జంటలు ప్రత్యక్షంగా లిఖితపూర్వక అభ్యర్థనతో జిల్లా కార్యాలయంలో లేదా అధీకృత సంస్థల ఆధ్వర్యంలో దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముగించి తుది ఆమోదం కోసం జిల్లా స్థాయికి సిఫారసు చేస్తారు. ఐఏఎస్ అధికారులు మరియు జిల్లా అధికారులు వివాహ వేడుకల్లో సాంస్కృతిక పద్ధతుల ఆచరణను పర్యవేక్షిస్తారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి పథకం ప్రయోజనం పొందేందుకు చట్టపరంగా వివాహం నమోదు (రిజిస్ట్రేషన్) తప్పనిసరి. ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన సాయం 3 వర్గాల కింద మంజూరు చేస్తారు. సింహభాగం రూ.36,000లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద పొదుపు ఖాతాకు బదిలీ చేస్తారు. పెళ్లి కానుక (చీర, గాజులు, పట్టీలు, మట్టెలు) కింద రూ.10,000లు, మిగిలిన రూ.6,000 పెళ్లి వేదిక తదితర ఏర్పాట్లు కోసం విడుదల చేస్తారు. అల్ప ఆదాయం, నిలువ నీడ లేని వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. పునర్వివాహం కోరుకునే వితంతువులు, దివ్యాంగులు, పీవీటీజీలు, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) వర్గాలకు సాయం మంజూరులో ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ వర్గాలకు చెందిన వారికి మొదట వచ్చిన వారికి తొలి అవకాశం ప్రామాణికంగా పరిగణించి పరిశీలిస్తారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వ సాయం ముఖ్యమంత్రి కన్య వివాహ యోజనతో మేలు వధువుకు రూ.51,000ల ప్రయోజనం -
కళలకు హృదయ స్పందన..!
రాయగడ: స్థానిక రామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం కవి సమ్మేళనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థ అధ్యక్షుడు గుడ్ల గౌరీ శంకర్ ప్రసాద్ తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా కవి, రచయిత విశ్రాంత ప్రొఫెసర్ (విశాఖపట్నం) డాక్టర్ కేజీ వేణు, గౌరవ అతిథిగా రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్‌లు పాల్గొంటారన్నారు. సాయంత్రం స్పందన నృత్య పాఠశాలకు చెందిన విద్యార్థులు, కళాకారులచే వివిధ సాంసృతిక కార్యక్రమాలు జరుగుతాయని, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, కళాకారులు, పట్టణ ప్రముఖులు హాజరవ్వాలని కోరారు. స్పందన ఆవిర్భావం సాహితీ ప్రియుడు, కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు దివంగత జీఆర్ఎన్ ఠాగూర్ స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థకు ఊపిరిపోశారు. అప్పట్లో కేవలం 18 మంది సభ్యులతో ఆవిర్భవించిన ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. న్యాయవాది కొత్తకోట ఆనందరావు కుముంధాన్ సంస్థకు ఆయువుపట్టుగా వ్యవహరించారు. ఆయన హయాంలో కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సంస్థను ముందుకు నడిపించారు. ఆయన మరణానంతరం స్పందన సంస్థ బాధ్యతలను గుడ్ల గౌరీ శంకరరావు స్వీకరించి.. ఇప్పటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ సంస్థను నడిపిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను అధిరోహించి సంస్థను కాపాడుకుంటున్నారు. సంస్థ ఆవిర్భవించి 30 ఏళ్లు కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన మాటల్లో చెప్పారు.అదృష్టంగా భావిస్తున్నాను సాహిత్యం, కళారంగంపై నాకు ఎంతో ఆసక్తి ఉంది. అందువల్ల ఈ సంస్థను ముందుకు నడిపించాలనే ఉద్ధేశంతో నడుం బిగించాను. సంస్థకు చెందిన ఎంతోమంది సభ్యులు నాకు అండగా ఉండడం.. అన్ని రంగాల్లో సహకరించడంతో మూడు పదుల వసంతాలను నేడు జరుపుకునే సౌభాగ్యం కలిగింది. అయితే సాహితీ రంగం కనుమరుగువుతున్న నేపథ్యంలో దానిని బతికించేందుకు సంస్థ ఆవిర్భావకర్త జీఆర్ఎన్ ఠాగూర్ నడుం బిగించి సంస్థకు ఊపిరిపోశారు. దానిని పరిరక్షించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నాను. – గుడ్ల గౌరీ శంకర్ ప్రసాద్, స్పందన అధ్యక్షుడు స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థకు 30 ఏళ్లు 18 మందితో ప్రారంభమై కళాకారులకు ప్రోత్సాహం ఎంతో మందికి ఉన్నత స్థాయి గుర్తింపు -
ఫోన్ ఎందుకు కొన్నావని మందలించినందుకు..
● జె.ఆర్.పురంలో బాలుడు అదృశ్యం రణస్థలం: ఇంట్లో తెలియకుండా సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన కుమారుడిని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన దంగుడుబియ్యపు టోనీష్ అనే విద్యార్థి ఇంట్లో నుంచి పారిపోయాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం పాత కుంకాం గ్రామానికి చెందిన సతీష్ వృత్తిరీత్యా జె.ఆర్.పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కుమారుడు టోనీష్ ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు దాచేసి సెల్‌ఫోన్ కొనుక్కున్నాడు. టోనీష్ వద్ద సెల్ ఉందని, తలగడ కింద పెట్టుకుని వాడుతున్నాడని తల్లి గమనించింది. వెంటనే భర్త సతీష్‌కు చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో శనివారం ఉదయం స్కూల్‌కని బయలుదేరిన టోనీష్ సైకిల్, బ్యాగ్ ప్రైవేటు స్కూల్ సమీపంలో ఉంచేసి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 9842302369, 9000519420 నంబర్లకు తెలియజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉప ఎన్నికలో బణిత కందులియ విజయం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంధ్రా సమితి అధ్యక్ష పదవికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బణిత కందులియ తన ఏకై క ప్రత్యర్థి బీజేడీ సమర్ధించిన చంద్రిక కందలియపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించింది. గత సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పోరజపై సభ్యులు అవిశ్వాస తీర్మానం తీసుకు రావడంతో అక్టోబర్ 3వ తేదీన పదవికి రాజీనామా చేసిక విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి శనివారం ఉప ఎన్నిక జరిగింది. కుంధ్రా సమితిలోని 16 గ్రామ పంచాయతీల సమితి సభ్యుల్లో 15 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సమితి సభ్యులు వేసిన 15 ఓట్లలో ఒక ఓటు చెల్లలేదు. మిగతా 14 ఓట్లలో చంద్రిక కందాలియకు 6 ఓట్లు.. బణితా కందాలియకు 8 ఓట్లు వచ్చాయి. దీంతో బణిత కందాలియ గెలిపొందినట్లు ఉన్నికల అధికారి పట్నాయిక్ ప్రకటించారు. దీంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. -
పెట్టుబడులకు ప్రాధాన్యం
విద్యుత్ రంగంలో● సీఎం మోహన్ చరణ్ మాఝీ ● పూరీలో గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్భువనేశ్వర్: పూరీలో జరిగిన గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్–2025 (జీఈఎల్–2025)ను ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శనివారం ప్రారంభించారు. క్లీన్ ఎనర్జీ రంగంలో స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడానికి ఇది తొలి అంతర్జాతీయ చొరవ కావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం మోహన్‌చరణ్ మాఝీ మాట్లాడుతూ.. సదస్సు కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు, పరిశోధకులు, సంస్థలు మరియు ప్రపంచ విద్యుత్ నిపుణులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి విద్యుత్ రంగంలో స్వావలంబన మరియు స్థిరత్వ సాధనకు వినూత్న ప్రయత్నంగా పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ సరఫరా గొలుసును కీలక అంశంగా పరిగణిస్తుందన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం విద్యుత్ రంగంలో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవసరాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. శిలాజ విద్యుత్ (ఫాసిల్ ఎనర్జీ) ఉత్పత్తి మరియు వినియోగ వ్యయాన్ని తగ్గించి 2036 నాటికి రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందన్నారు. 2014కి ముందు దేశవ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పాదన కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం నిత్యకృత్యంగా మారిందన్నారు. గత దశాబ్ధంలో ఈ పరిస్థితి మెరుగుపడి గత 11 సంవత్సరాల్లో భారతదేశ విద్యుత్ రంగం వేగవంతమైన వృద్ధిని సాధించిందన్నారు. సమగ్ర అభివృద్ధికి విద్యుత్ ఉత్పత్తితో విద్యుత్ పంపిణీకి మౌలిక సదుపాయాలు కూడా అవసరం. నిండుకుంటున్న నిక్షేపాలు ప్రస్తుతం భారతదేశంలో బొగ్గు వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి 51 శాతానికి పరిమితం అయింది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఒడిశా విద్యుత్ ఉత్పాదన రంగంలో స్థిరంగా ముందుకు సాగేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. 2070 నాటికి జీరో కార్బైన్ ఎమిషన్ దీర్ఘకాలిక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వం నిబద్ధతతో కొనసాగుతందని సీఎం ప్రకటించారు. పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర పునరుత్పాదక విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ పునరుత్పాదక విద్యుత్ ఉత్పాదనలో ఒడిశా పురోగతిని అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి 1 లక్ష 50 వేల సౌర గృహాలకు ఆమోదం ప్రకటించారు. దీనివలన రాష్ట్రంలో 7 నుంచి 8 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. 2014లో 2.8 గిగా వాట్లకు పరిమితమైన జాతీయ సౌర విద్యుత్ సామర్థ్యం నేడు 130 గిగా వాట్లకు ఎదిగిందన్నారు. ఈ సందర్భంగా బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి సర్ టోనీ బ్లెయిర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒడిశాను అభినందించారు. ఒక ప్రభుత్వం చర్య తీసుకున్నప్పుడు ఇంధన పరివర్తన జరగదని, కానీ అనేక ప్రభుత్వాలు కాలక్రమేణా ఒకే దిశలో పనిచేసినప్పుడు, ఇంధన పరివర్తన ప్రయత్నం విజయవంతమవుతుందని ఆయన అన్నారు. ఇదే గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమ్మిట్ ఉద్దేశ్యంగా ఆయన పేర్కొన్నారు. భారీ పెట్టుబడులే లక్ష్యం ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ మాట్లాడుతూ 2030 నాటికి పునరుత్పాదక శక్తిని ఉపయోగించడం ద్వారా పరిశ్రమ మరియు వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2036 నాటికి ఒడిశా 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి, క్లీన్ ఎనర్జీ ఉత్పాదన మరియు గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రముఖ కేంద్రంగా మారడానికి ఒడిశా ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి ఆశిష్ సూద్, రాజస్థాన్ విద్యుత్ విభాగం మంత్రి హీరా లాల్ నగర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రఽముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశాల్ కుమార్ దేబ్, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సీనియర్ ఎనర్జీ అడ్వైజర్ పియరీ నోఝెల్, ఐఐటీ కాన్పూర్ సెంటర్ ఫర్ ఎనర్జీ రెగ్యులేషన్ అండ్ ఎనర్జీ అనలిటిక్స్ ల్యాబ్ హెడ్ ప్రొఫెసర్ అనుప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


