ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ జయంత్యుత్సవం
రాయగడ: సదరు సమితి కొల్లిగుడ వద్ద గల జిస్ట్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఆదివారం ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ 138వ జయంతోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రారంభగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుహరో మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ ఆదర్శనీయుడని కొనియాడారు. అనంతరం శ్లోకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు కొనసాగాయి. కొరాపుట్, గజపతి తదితర జిల్లాల నుంచి ఆయన ఆదర్శనీయులు కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద బజార్‌ను కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సురేష్ చంద్ర లెంక, దేవారజ్ మల్లిక్, బిక్రమ్ నాయక్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.
‘కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం’
కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్‌కు చెందిన కొరాపుట్ ఎంపీ ఎంపీ సప్తగిరి ఉల్క ప్రకటించారు. ట్రంప్ టారిఫ్స్ పై నష్ట పోయిన రంగాలకు చేయూత లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి రంగంపై చేయూత లేదని అన్నారు. మధ్య, పేద తరగతులకు ఎలాంటి సహకారం అందలేదన్నారు. ఏడు రైళ్ల కారిడార్లలో ఒడిశాకు చోటు కల్పించలేదని పేర్కొన్నారు.
బడ్జెట్ బాగుంది
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల దేశం ముందుకు వెళ్తుందని బీజేపికి చెందిన నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి ప్రకటించారు. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధించాలంటే ఇలాంటి బడ్జెట్ ఉండాలన్నారు.
శ్రీజగన్నాథ మందిరానికి రూ.3లక్షల విరాళం
పర్లాకిమిడి: రాజవీధిలో శ్రీజగన్నాథ మందిర పునర్నిర్మాణం కోసం బట్టగౌడవీధికి చెందిన స్వర్గీయ లోకనాథ బెహారా కుమారుడు కాళీచరణ్ బెహారా రూ.3లక్షల 101 విరాళంగా ఆదివారం మందిరం ట్రస్టీకి అందజేశారు. ఈ విరాళం అందజేతలో వార్డు కౌన్సిలరు సంజుక్తా బెహారా, రాజుబెహారాలు ఉన్నారు.
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ జయంత్యుత్సవం
ఘనంగా ఠాకూర్ అనుకూల చంద్రదేవ్ జయంత్యుత్సవం


