50వ పుట్టినరోజు: రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ | Aishwarya Rai Special Birthday Wishes To Abhishek Bachchan On His 50th Birthday, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

50వ పుట్టినరోజు: రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్

Feb 5 2026 11:29 PM | Updated on Feb 6 2026 6:22 PM

Abhishek Bachchan 50th birthday: Aishwarya Rai special wishes

ముంబై: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

అభిషేక్ చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ఐశ్వర్య, “Happy HAPPY 50th Birthday dearest Babyyy-Papa with lots of love, peace, happiness, contentment and best health. God Blesssss. Stay Golden… Shine on Love” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదే సందర్భంగా సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా స్పందించారు. “అభిషేక్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు అతనికి మరింత ధైర్యం, శక్తి ఇస్తాయి” అని పేర్కొన్నారు.

అభిషేక్ బచ్చన్‌కు సినీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. నటుడు జాకీ ష్రాఫ్ వీడియో సందేశం ద్వారా “Big Hugs” అంటూ అభినందనలు తెలిపారు. రితేష్ దేశ్‌ముఖ్, “నువ్వు నాకు అన్నయ్యలాంటివాడివి. నీకు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం కలగాలి” అంటూ భావోద్వేగ సందేశం పంపారు. అజయ్ దేవగన్ మాత్రం హాస్యంగా, “Happy Birthday Abbas Ali… I mean @bachchan” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉండగా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. “మా వివాహంపై వస్తున్న రూమర్స్ అన్నీ పూర్తిగా అబద్ధాలు. వాటిని కావాలని కొందరు వ్యాప్తి చేస్తున్నారు. ఆమెకు నా గురించి తెలుసు, నాకు ఆమె గురించి తెలుసు. మేము ప్రేమతో, స్థిరమైన కుటుంబంగా ముందుకు సాగుతాం.. అదే ముఖ్యమైనది” అని స్పష్టం చేశారు. దీంతో వారి జంటపై వస్తున్న రూమర్స్‌కు వీరిద్దరూ మరోసారి చెక్‌ పెట్టారు.

మొత్తంగా అభిషేక్ బచ్చన్ 50వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబం, సినీ ప్రముఖులు, అభిమానులు అందించిన ప్రేమాభిమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement