చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..! | Mumbai Police register case against Dhurandhar 2 team | Sakshi
Sakshi News home page

Dhurandhar-2 Movie: చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!

Feb 3 2026 3:53 PM | Updated on Feb 3 2026 3:58 PM

Mumbai Police register case against Dhurandhar 2 team

రణ్‌వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్‌కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్‌ రింకు రాజ్‌పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.

ఈనెల 1వ తేదీన షూటింగ్‌లో సంజయ్ దత్‌ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను  పోలీసులు  గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్‌లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్‌లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.

ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement