ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లకు 'స్ట్రేంజర్ థింగ్స్' గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. 2016 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. ఐదు సీజన్లుగా వచ్చింది. నాలుగు సీజన్లకు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ రెండు నెలల క్రితం రిలీజైన చివరిదైన ఐదో సీజన్‌కి మిశ్రమ స్పందన వచ్చింది. ఏదైతేనేం సిరీస్‌ని ముగించేశారు. అయితే ఇదే సిరీస్‌లోని పాత్రలని తీసుకుని యానిమేషన్ సిరీస్ రూపొందించారు. తాజాగా టీజర్ రిలీజ్ చేసి స్ట్రీమింగ్ ఎప్పుడో కూడా ప్రకటించేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)
1984-89 మధ్య కాలంలో హాకిన్స్ అనే ఊరిలో జరిగిన వింత సంఘటనలు, వింత ప్రాణులని ఐదారుగురు పిల్లలు, మరికొందరు కుర్రాళ్లు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? చివరకు వాటిని ఎలా అంతం చేశారు? అనే స్టోరీతో 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్ తీశారు. ఇప్పుడు యానిమేషన్ సిరీస్ విషయానికొచ్చేసరికి దాదాపు అదే కాన్సెప్ట్ తీసుకున్నారు. పాత్రలు పాతవే ఉన్నప్పటికీ.. వాటికి డబ్బింగ్ చెప్పిన యాక్టర్స్ మారిపోయారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. చూస్తుంటే.. మేకర్స్ ఈ సిరీస్‌ని ఇప్పట్లో వదిలేలా లేరుగా అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)


