టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు.
కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్‌కు ముందు సూర్యకుమార్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్‌ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు.


