India vs New Zealand
-
ఎవరూ ఊహించని నిర్ణయం.. రోహిత్ వ్యూహం భేష్: పాక్ దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై పాకిస్తాన్ మాజీ సారథి వకార్ యూనిస్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హిట్‌మ్యాన్ అనుసరించిన వ్యూహాలు అమోఘమని కొనియాడాడు. కీలక మ్యాచ్‌లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని జట్టును విజేతగా నిలిపాడని ప్రశంసించాడు. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఈ వన్డే టోర్నమెంట్లో.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. అజేయ చాంపియన్గాగ్రూప్ దశలో మూడింటికి మూడు (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్) గెలిచిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక ఫైనల్లో కివీస్ (India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్‌ను ముందుగా బౌలింగ్‌కు పంపడమే మ్యాచ్‌కు టర్నింగ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మను తప్పక అభినందించాలన్నాడు. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘కుల్దీప్ను ముందుగా పంపడమే ఈ మ్యాచ్‌లో కీలకంగా మారింది.ఎవరూ ఊహించని నిర్ణయంరోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ప్రత్యర్థి జట్టు అస్సలు ఊహించి ఉండదు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ 20- 25 ఓవర్ల తర్వాతే బౌలింగ్‌కి వస్తాడు. కాబట్టి న్యూజిలాండ్‌కు ఇది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.కుల్దీప్ ఇంత ముందుగా వస్తాడని కివీస్ ఓపెనర్లు అస్సలు ఊహించి ఉండరు. అక్షర్ లేదా జడేజా వస్తారని వాళ్లు అనుకుని ఉంటారు. అయితే, ఇక్కడే రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. అద్భుతమైన వ్యూహంతో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు’’ అని వకార్ యూనిస్ కొనియాడాడు.అతడి రాకతో కివీస్ కుదేలుకాగా కివీస్‌తో ఫైనల్లో రోహిత్ శర్మ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పదకొండో ఓవర్లోనే బరిలోకి దించాడు. తన తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్ రచిన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసిన కుల్దీప్.. పదమూడో ఓవర్లో కేన్ విలియమ్సన్(11) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. దీంతో భారత్‌కు శుభారంభం లభించింది. ఈ మ్యాచ్‌లో ఉత్తమంగా (10-0-40-2) రాణించిన కుల్దీప్ యాదవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో టాస్ ఓడిన ఇండియా తొలుత బౌలింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైఖేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాల కారణంగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు. పేసర్ మహ్మద్ షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(76) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్ -
టీమిండియాకు అదనపు ప్రయోజనం.. ఆ విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో టీమిండియా ఒకే వేదికపై ఆడటంపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్ తదితరులు భారత జట్టుకు అదనపు ప్రయోజనాలు చేకూరాయని వ్యాఖ్యానించారు. ‘హోం అడ్వాంటేజ్’మరోవైపు.. రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి తర్వాత ప్రొటిస్ స్టార్ డేవిడ్ మిల్లర్ (David Miller) కూడా ఇదే మాట అన్నాడు. ఈ సందర్భంగా తాను ఫైనల్లో న్యూజిలాండ్‌కే మద్దతు ఇస్తానని కూడా మిల్లర్ పేర్కొన్నాడు. తాజాగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ‘హోం అడ్వాంటేజ్’పై స్పందించాడు. మిగతా జట్లతో పోలిస్తే రోహిత్ సేనకు కొంతమేర లాభం చేకూరిందని.. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు మేలు జరిగిందన్న వాదనలతో తాను ఏకీభవిస్తానని తెలిపాడు. న్యాయంగానే గెలిచారుఅదే సమయంలో.. భారత జట్టు ఈ టోర్నీలో ఎలాంటి మోసానికీ పాల్పడలేదని.. న్యాయంగానే వాళ్లు గెలిచారని స్టార్క్ వ్యాఖ్యానించడం విశేషం. ‘‘ఒకే స్టేడియంలో తమ మ్యాచ్‌లన్నీ ఆడటం వల్ల కలిగే లాభాల గురించి రోజూ చర్చ జరుగుతూ ఉంది. అయితే, ఇండియా మాత్రం దుబాయ్ తమకు తటస్థ వేదిక అని వాదించేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోంది.ఏదేమైనా టీమిండియా నిజాయితీగా ఈ టోర్నీలో గెలిచింది. ఎందుకంటే.. మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలంగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయితే, ఈ టోర్నీ విషయంలో వాళ్లపై వస్తున విమర్శలు సబబే అనిపిస్తోంది. సెమీ ఫైనల్ ఆడేందుకు న్యూజిలాండ్ పాకిస్తాన్‌కు వెళ్లింది.ఆ తర్వాత వెంటనే ఫైనల్ కోసం దుబాయ్‌కు వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశమే అయినప్పటికీ వాళ్లూ టీమిండియాతో ఆడేందుకు దుబాయ్‌కు రావాల్సి వచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా ఈ విషయంపై మాట్లాడాడు. అప్పటికప్పుడు విమాన ప్రయాణం చేయడం సులువు కాదని.. తమకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పాడు.ఆ విమర్శలతో ఏకీభవిస్తాఏదేమైనా ఒక జట్టు ఎలాంటి ప్రయాణాలు లేకుండా.. ఒకే చోట ఉండి ఆడటం వల్ల కచ్చితంగా లాభపడుతుంది. కాబట్టి.. నేను ఈ విషయంలో టీమిండియాపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలతో కచ్చితంగా ఏకీభవిస్తా’’ అని స్టార్క్ ఫెంటాస్టిక్స్టీవీతో పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడకు పంపేందుకు నిరాకరించింది.భద్రతా కారణాల వల్ల తమకు తటస్థ వేదికపై ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీని కోరగా.. ఇందుకు సమ్మతి లభించింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోనే రోహిత్ సేన తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు దుబాయ్- పాకిస్తాన్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఇక ఈ వన్డే టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసింది.సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా అవతరించింది. ఇక ఈ టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం విశేషం.ఆ సత్తా భారత్‌కు మాత్రమే ఉందిఈ నేపథ్యంలో స్టార్క్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, రిజర్వ్ పూల్ సత్తా అసాధారణమని ప్రశంసించాడు. ఒకేరోజు టీ20, వన్డే, టెస్టు మ్యాచ్‌లను ఆడే సత్తా భారత్‌కే ఉందని చెప్పాడు. ‘మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు జట్లను ఒకేరోజు మైదానంలో దింపగలిగే సామర్థ్యం ప్రపంచ క్రికెట్లో ఒక్క భారత దేశానికి మాత్రమే ఉంది.ఆసీస్‌తో టెస్టు, ఇంగ్లండ్‌తో వన్డే, దక్షిణాఫ్రికాతో టీ20 ఆడగలదు. ఇదేదో ఆషామాషీగా కాదు! అంతర్జాతీయ క్రికెట్ పోటీకి ఏమాత్రం తగ్గకుండా మూడు టీమిండియా జట్లు ఆడగలవు. ఈ సామర్థ్యం, సత్తా మరే దేశానికి లేదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. ప్రపంచ లీగ్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రగామిగా వెలుగొందడం వల్లే ఇంతటి అనుకూలతలు వచ్చాయా అన్న ప్రశ్నకు స్టార్క్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.కేవలం ఐపీఎల్ వల్ల కాదు..ఇండియన్ ప్రీమియర్ ‘ఒక్క ఐపీఎల్ వల్లే ఈ సానుకూలతలని నేననుకోను. మేమంతా (క్రికెటర్లందరూ) కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుతున్నాం. కానీ భారత క్రికెటర్లు మాత్రం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి మరవొద్దు. ఇక్కడ చూడాల్సింది అనుకూలతలు కావు. రిజర్వ్ బెంచ్ సత్తా. భారత క్రికెట్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడే బలగం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.రోజు రోజుకీ పోటీ క్రికెటర్లు దీటుగా తయారవుతున్నారు. ఐపీఎల్ ఒక పెద్ద టోర్నీ. కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ అంతకుమించిన ప్రతిభ కూడా ఉంది. అదే భారత క్రికెట్ బలగం అవుతోంది’ అని చెప్పాడు. మిగతా క్రికెటర్లు ఏడాదికి ఐదారు లీగ్‌లు ఆడుతున్నారని, మరి వారి దేశాల్లోనూ, ఆయా దేశాల్లోనూ లీగ్‌లు జరుగుతున్నప్పటికీ ఒక్క ఐపీఎల్‌కు పరిమితమైన దేశంలోనే పెద్ద సంఖ్యలో క్రికెటర్లు వెలుగులోకి రావడం గొప్ప విశేషమని స్టార్క్ వివరించాడు.చదవండి: BGT: ‘నేను జట్టులో ఉంటే కచ్చితంగా గెలిచేవాళ్లం.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రెడీ’ -
CT 2025: రికార్డులు బద్దలు.. సరికొత్త చరిత్ర! ఏకంగా 11 వేల కోట్లకు పైగా..
భారత్‌లో క్రికెట్ ఓ ‘మతం’ లాంటిది.. వేదిక ఏదైనా టీమిండియా ఆడుతోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ఆ వెసలుబాటు లేని వాళ్లకు డిజిటల్ మీడియా రూపంలో ప్రత్యామ్నాయం ఉండనే ఉంది. ఇక ఇటీవల జరిగిన మెగా ఐసీసీ ఈవెంట్ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జియోహాట్‌స్టార్(JioHotstar)లో ప్రత్యక్ష ప్రసారం అయిన విషయం తెలిసిందే.11 వేల కోట్ల నిమిషాలకు పైగాఈ నేపథ్యంలో తాజాగా ఈ టోర్నమెంట్ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ వన్డే టోర్నీకి 540.3 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక వాచ్ టైమ్ ఏకంగా 11 వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదు కావడం విశేషం. అంతేకాదు.. ఓవరాల్‌గా 6.2 కోట్ల మంది వ్యూయర్స్ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్ వెల్లడించింది.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. నాటి ఫైనల్లో టీమిండియాపై గెలిచి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది. అయితే, అప్పటి నుంచి సుదీర్ఘకాలం పాటు ఈ టోర్నీని వాయిదా వేశారు. ఈ క్రమంలో 2025లో తిరిగి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్(Pakistan) ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది.కాగా పాకిస్తాన్లో 1996 తర్వాత ఓ ఐసీసీ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్లో మొదలైన ఈ వన్డే ఈవెంట్ మార్చి 9న భారత్- న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్‌తో ముగిసింది. హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ఇక ఈ టోర్నమెంట్లో రోహిత్ సేన ఆది నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్... సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.తద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరింది. మరోవైపు.. ఈ వన్డే టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టును చిత్తు చేసి గెలుపు నమోదు చేయడం విశేషం. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆసీస్‌పై రన్నరప్ టీమిండియా ప్రతీకారం తీర్చుకోవడం కూడా హైలైట్‌గా నిలిచింది.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న చాంపియన్స్ ట్రోఫీ-2025ని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్ రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్' 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా.. జియోహాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. అత్యధిక వ్యూస్ ఆ మ్యాచ్కేకాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి.కాగా మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్షిప్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గోవా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.ఇక ఈ మెగా టోర్నీలో గెలవడం ద్వారా భారత్ ఖాతాలో ఏడో ఐసీసీ టైటిల్ చేరింది. 1983 వన్డే వరల్డ్‌కప్, 2002లో శ్రీలంకతో కలిసి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచకప్, 2025 చాంపియన్స్ ట్రోఫీలను భారత్ గెలుచుకుంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పాల్గొన్నాయి. దుబాయ్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి ఇందుకు వేదికలు.చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా? -
అతడు అద్భుతం.. కానీ ఆ విషయంలో అసంతృప్తి: భారత మాజీ బ్యాటర్
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముంబైకర్ ఇప్పటికైనా తనలోని నైపుణ్యాలను గుర్తించాడని.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో అతడు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని కొనియాడాడు.అయితే, న్యూజిలాండ్(India vs New Zealand)తో ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ అవుటైన తీరు మాత్రం తనకు నచ్చలేదంటూ దిలీప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కేఎల్ రాహుల్(KL Rahul) ఆట తీరును సైతం ఈ మాజీ బ్యాటర్ ప్రశంసించాడు. అంతేకాదు.. ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న సెలక్టర్ల నిర్ణయం సరైందని నిరూపితమైందంటూ మేనేజ్మెంట్ వ్యూహాలను మెచ్చుకున్నాడు.కాగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ మార్చి 9న ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడిఈ నేపథ్యంలో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆఖరిగా న్యూజిలాండ్‌పై జయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీస్ చేరి.. అక్కడ ఆస్ట్రేలియాను ఓడించింది.ఈ క్రమంలో ఫైనల్లోనూ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌పై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ అజేయంగా నిలిచి చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయాల్లో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 243 పరుగులు చేసి.. భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. తనకు అచ్చొచ్చిన ఐదో స్థానంలో కాకుండా ఆరో స్థానంలో ఆడాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ కోసం తన నంబర్‌ను త్యాగం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 140 పరుగులు చేసిన ఈ కర్ణాటక ఆటగాడు.. ముఖ్యంగా ఆసీస్‌తో సెమీస్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.అయ్యర్ అద్భుతంఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ అద్భుతంగా ఆడాడు. కానీ ఫైనల్లో అతడు అవుటైన విధానం నాకు అసంతృప్తిని మిగిల్చింది. తను ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయంతో ముగించి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇప్పటికైనా అతడు తన నైపుణ్యాలను గుర్తించి.. అందుకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు.ఇక కేఎల్ రాహుల్ గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘ఆరో నంబర్లో వచ్చి కూడా కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినా.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ల కోసమని అక్షర్ పటేల్‌ను రాహుల్ స్థానమైన ఐదో నంబర్లో పంపడం నాకేమీ నచ్చలేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపాడు.సెలక్టర్లకు క్రెడిట్ ఇవ్వాలిఅదే విధంగా.. ‘‘టీమిండియా విజయంలో సెలక్టర్లకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ శర్మ వైఫల్యం తర్వాత కూడా అతడిని కెప్టెన్‌గా కొనసాగించారు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లను ఆడించాలన్న వారి నిర్ణయం కూడా సరైందని నిరూపితమైంది’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశంసించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరిలో సుందర్ ఒక్కడే పూర్తిస్థాయిలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదిలా ఉంటే.. కివీస్‌తో ఫైనల్లో మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా షాట్‌కు యత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాం: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్(Kamran Akmal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ‘డి’ స్థాయి జట్లపై కూడా తమ ప్రధాన జట్టు గెలవలేకపోతోందని.. ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని మండిపడ్డాడు. టీమిండియా, న్యూజిలాండ్ లాంటి జట్లను చూసి రిజ్వాన్ బృందం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. ఒక్క విజయం లేకుండానేఇతర దేశాల్లో ప్రతిభ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తే.. పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఇందుకు విరుద్ధమని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిస్తూ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే వెనుదిరిగింది.గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా(Team India) చేతుల్లో ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిగా బంగ్లాదేశ్‌పై అయినా గెలవాలని ఉవ్విళ్లూరింది. అయితే, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో గెలుపున్నదే లేకుండా నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఛీ.. ‘డి’ జట్లను కూడా ఓడించలేకపోతున్నాంఈ క్రమంలో మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... ‘‘మా దేశానికి వచ్చిన ‘డి’ స్థాయి(చిన్న జట్లను అన్న ఉద్దేశంలో) జట్లను కూడా పాకిస్తాన్ తమ పూర్తి స్థాయి జట్టుతో ఓడించలేకపోయింది. మన జట్టు బాగా ఆడి గెలిస్తేనే గౌరవం, మర్యాద ఉంటాయి’’ అని రిజ్వాన్ బృందం ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.అదే విధంగా.. ‘‘టీమిండియా వరుసగా ఐసీసీ ఈవెంట్లు గెలుస్తోంది. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. ఒక్క సిరీస్ ఓడిపోగానే ఆ జట్ల బోర్డులు మార్పులు చేసుకుంటూ వెళ్లవు. మరింత ఉత్సాహంతో తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపుతాయి. వాళ్లు మళ్లీ గెలుపుబాట పట్టేలా చేస్తాయి.కానీ మన పరిస్థితి వేరు. ఒక్కటి ఓడితే.. వరుసగా ఇక పరాజయాలే. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం వల్ల మనకు ఎంత డబ్బు వచ్చిందనేదే మనకు ప్రధానం. కానీ ఆటలో గెలవాలి. గౌరవప్రదంగా ముందుకు వెళ్లాలని మాత్రం ఉండదు’’ అంటూ కమ్రాన్ అక్మల్ పాక్ బోర్డు తీరును కూడా తప్పుబట్టాడు.పాక్ క్రికెట్ ‘ఐసీయూ’లో ఉందిఇదిలా ఉంటే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలి ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాల వల్ల ప్రస్తుతం జట్టు పరిస్థితి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని అతను ఘాటుగా వ్యాఖ్యానించాడు. శస్త్రచికిత్స చేసి కోలుకునే పరిస్థితి నుంచి కూడా ఇప్పుడు చేయిదాటిపోయిందని అతను అన్నాడు. ముఖ్యంగా జట్టులో షాదాబ్ ఖాన్ ఎంపికను అతను తీవ్రంగా విమర్శించాడు.గత టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన షాదాబ్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయడంతో పాటు వైస్ కెప్టెన్‌గా కూడా నియమించారు. ‘ఏ ప్రాతిపదికన షాదాబ్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. దేశవాళీలో అతను ఏమాత్రం ప్రదర్శన ఇచ్చాడని ఎంపిక చేశారు.టోర్నీకి ముందు అంతా సన్నాహకాల గురించి మాట్లాడతారు. చిత్తుగా ఓడిపోగానే శస్త్రచికిత్స అవసరమంటారు. ఇప్పుడు అది కూడా సాధ్యం కాదు. పాక్ క్రికెట్ ఐసీయూలోకి చేరింది. బోర్డు విధానాలు, నిర్ణయాల్లో నిలకడ లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చడం తప్ప బోర్డు అధికారులకు జవాబుదారీతనం లేదు. వాళ్ల ఉద్యోగాలు కాపాడుకోవడానికి అంతా ఆటగాళ్లను బలి పశువులను చేస్తారు’ అని అఫ్రిది అభిప్రాయ పడ్డాడు. చదవండి: అదే జరిగితే బుమ్రా కెరీర్ ముగిసినట్లే: కివీస్ మాజీ పేసర్ స్ట్రాంగ్ వార్నింగ్ -
రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.లక్నో కెప్టెన్‌గా..ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు. గత డిసెంబర్లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!? -
అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) టెస్టుల్లో పునరాగమనంపై దృష్టి సారించాడు. దేశవాళీ టోర్నమెంట్లలో తాను అద్భుతంగా రాణించానని.. అందుకే తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడతాననే ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023 తర్వాత క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడనే కారణంతో బీసీసీఐ(BCCI) శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నిబంధనలను గాయం సాకు చూపి తప్పించుకున్నాడని భావించిన బోర్డు.. అయ్యర్ వార్షిక కాంట్రాక్టును రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై తరఫున దేశీ బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.ఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్.. ఈ వన్డే టోర్నీలో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 243 పరుగులు సాధించాడు. తద్వారా ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో న్యూజిలాండ్ స్టార్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రచిన్ రవీంద్ర(263) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.ఇదిలా ఉంటే.. వన్డేల్లో తానేంటో మరోసారి నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీమిండియా టెస్టు రీఎంట్రీకి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘టెస్టుల్లో పునరాగమనం చేయాలని ఉంది. వీలైనంత ఎక్కువగా క్రికెట్ ఆడాలని భావిస్తున్నా.నేను ఉత్తమంగా రాణించానుదేశవాళీ టోర్నమెంట్లో నేను ఉత్తమంగా రాణించాను. అయితే, నా చేతుల్లో ఏమీ లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి పదే పదే ఆలోచించను. దాని వల్ల అనసవరంగా నా మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది.అనుకున్నది జరుగకపోతే మానసికంగానూ కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తా. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా. సమయం వచ్చినపుడు అవకాశం అదే తలుపుతడుతుంది. ముందుగా చెప్పినట్లు నేను భవిష్యత్తు, గతం గురించి ఎక్కువగా ఆలోచించే మనిషిని కాను. ప్రస్తుతం నేను ఇలా ఉండటానికి కారణం అదే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా చివరిసారిగా అయ్యర్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా టీమిండియా తరఫున 14 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 811 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ నాటికి!?ఇందులో ఓ శతకం కూడా ఉంది. ఇక తాజా రంజీ ట్రోఫీ సీజన్లో శ్రేయస్ అయ్యర్.. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనే ఏకంగా 480 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా జూన్‌లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా స్టోక్స్ బృందంతో టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ నాటికి అయ్యర్ పునరాగమనం చేసే అవకాశాలు లేకపోలేదు.చదవండి: CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
CT: ఇండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత జట్టు ‘బలం’ ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(Michael Vaughan) తలవంచాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడిన అతడే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప జట్టు అని భారత్‌ను కొనియాడాడు. ‘హోం అడ్వాంటేజ్’ అంటూ విమర్శలుచాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో రోహిత్ సేనకు ‘హోం అడ్వాంటేజ్’ ఉంటుందని విమర్శించిన వాన్.. ఇప్పుడు ద్వితీయ శ్రేణి జట్టుతోనే టీమిండియా టైటిల్ గెలవగలదని కితాబు ఇచ్చాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలు కాగా.. టీమిండియా భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల ఇతర జట్లతో పోలిస్తే భారత్‌కు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని.. అలవాటైన స్టేడియంలో ఆడటం వారికి సానుకూలాంశమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు విమర్శించారు.అంతేగాక.. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం ఇతర జట్లు పాకిస్తాన్- దుబాయ్(Dubai) మధ్య ప్రయాణాలు చేయడం కూడా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు. వేదిక ఏదైనా టీమిండియాకు తిరుగు లేదంటూ సునిల్ గావస్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విమర్శలను తిప్పికొట్టారు.ఏదేమైనా గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజేతగా అవతరించింది.టీమిండియా-‘బి’ టీమ్ కూడా ఫైనల్ చేరేదిఈ నేపథ్యంలో మైకేల్ వాన్ భారత జట్టు ఆట తీరును కొనియాడాడు. అదే విధంగా.. భారత్ ‘బెంచ్ స్ట్రెంత్’ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇండియా అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. ఈ విజయానికి వారు అర్హులు. టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే.. ఇండియా చాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది.జైస్వాల్, వర్మ, శర్మ, స్కై, పంత్, రెడ్డి, సుందర్, చహల్, అర్ష్‌దీప్, బుమ్రా, బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా ఫైనల్‌కు చేరేది. టైటిల్ కూడా గెలిచేది. వైట్‌బాల్ క్రికెట్లో వారి బెంచ్ బలానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు’’ అని మైకేల్ వాన్ ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చాడు.అతడు దూరం.. వారు బెంచ్‌కే పరిమితంకాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కాగా.. యశస్వి జైస్వాల్‌ను ఆఖరి నిమిషంలో తప్పించి వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఇక ఈ జట్టులో రిషభ్ పంత్‌కు స్థానం దక్కినా.. వికెట్ కీపర్ కోటాలో కేఎల్ రాహుల్‌ను తుదిజట్టులో ఆడించారు. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌లదీ ఇదే పరిస్థితి.ఇక వీరితో పాటు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయిలతో కూడిన జట్టు కూడా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరేదంటూ మైకేల్ వాన్ పేర్కొనడం విశేషం.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు -
ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్(KL Rahul)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడాడని.. భారత్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలవడంలో అతడి పాత్ర మరువలేనిదని కొనియాడాడు. తన ‘శత్రువు’ని జయించి రాహుల్ తన విలువేమిటో మరోసారి చాటుకున్నాడని ప్రశంసించాడు.వికెట్ కీపర్ బ్యాటర్‌గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా, మిడిలార్డర్లో నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా యాజమాన్యం చెప్పినట్లుగా నడుచుకునే క్రమంలో ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందో అతడికే తెలియని పరిస్థితి.కూల్‌గా, పక్కా ప్రణాళికతోముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అతడి సేవలను వాడుకున్న తీరు దారుణమని నవజ్యోత్ సింగ్ సిద్ధు లాంటి వాళ్లు బీసీసీఐని విమర్శించడం గమనార్హం. అయితే, కేఎల్ రాహుల్ మాత్రం తాను ఏ స్థానంలో ఆడినా కూల్‌గా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో భారత్ విజయం సాధించడానికి.. విరాట్ కోహ్లితో పాటు ఈ కర్ణాటక బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్ కూడా ప్రధాన కారణం. సెమీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో వచ్చి 34 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక న్యూజిలాండ్‌తో ఫైనల్లోనూ అతడు అదరగొట్టాడు. 33 బంతుల్లో 34 పరుగులు సాధించి.. మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో రాహుల్ రాణించాడు.అయితే, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాటి ఫైనల్లోనూ అర్ధ శతకం సాధించాడు. అయితే, 107 బంతుల్లో కేవలం 66 పరుగులే చేయడంతో.. భారత్ ఓటమికి అతడి స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కారణమని కొంతమంది విమర్శించారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో అతడు తన శైలిని మార్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ సరైన షాట్ల ఎంపికతో పరుగులు రాబట్టి.. టీమిండియా గెలుపుల్లో భాగమయ్యాడు.ఏకైక ‘శత్రువు’ను అతడు జయించేశాడుఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ కేఎల్ రాహుల్ గురించి మాట్లాడాడు.‘‘వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ నుంచి రాహుల్ ‘స్లో ఇన్నింగ్స్’ భారం మోస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ఆ ఇన్నింగ్స్ తాలూకు చేదు అనుభవం తనను వేటాడుతూ.. పదే పదే పాత గాయాన్ని గుర్తు చేస్తుందని చెప్పాడు.ఇక ఇప్పుడు సెమీస్, ఫైనల్లో అతడి ప్రదర్శన వల్ల కచ్చితంగా సంతృప్తి పడి ఉంటాడు. నిజానికి కేఎల్ రాహుల్‌కు బౌలర్లు ‘శత్రువులు’ కారు. అతడికి ఉన్న ఏకైక ‘శత్రువు’ అతడి మెదడే. తన ఆలోచనా విధానం వల్లే అతడు ఒత్తిడిలో కూరుకుపోయి ఉంటాడు.అయితే, ఇప్పుడు ఆ భారాన్ని జయించి.. సంయమనం పాటిస్తూ చక్కటి షాట్లతో అలరించాడు. అతడి ప్రయాణం గొప్పగా సాగుతోంది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఇన్నింగ్స్ ఆడి 140 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 97.90. ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనూ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం సంపాదించాడు.చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు View this post on Instagram A post shared by ICC (@icc) -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్‌లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించిన దుబాయ్ పిచ్‌పై ఆల్‌రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్‌తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్‌తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి!
తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer). ప్రస్తుతం తన కాళ్లు నేలమీద నిలవడం లేదని.. ఇంతకంటే గొప్ప భావన మరొకటి ఉండదంటూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్ల సంతోషం చూసి తన మనసు గాల్లో తేలిందని ఉద్వేగానికి లోనయ్యాడు.అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరంకాగా వన్డే ప్రపంచకప్-2023లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలతో సెంట్రల్ కాంట్రాక్టు(BCCI Cetral Contract) కూడా కోల్పోయాడు. అయితే, ఈ ముంబైకర్ తనకు ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని తనను తాను సరిదిద్దుకున్నాడు.తప్పులు సరిదిద్దుకుని..బోర్డు ఆదేశాలను పాటిస్తూ ముంబై తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగిన శ్రేయస్.. కఠినశ్రమ, అంకితభావంతో తనను నిరూపించుకున్నాడు. వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ ఈ ముంబై ఆటగాడు... దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిచాడు. రంజీల్లో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు.అంతేకాదు.. ఐపీఎల్-2024(IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సూపర్ ఫామ్‌తో పరుగులు రాబట్టాడు. తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా విరాట్ కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకుని జట్టుకు విజయాలు అందించాడు.జట్టుకు వెన్నెముకలా నిలిచిఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపికైన జట్టులో స్థానం సంపాదించిన శ్రేయస్ అయ్యర్ ఇక్కడా అద్బుతంగా రాణించాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. ఈ వన్డే టోర్నమెంట్లో మొత్తంగా టీమిండియా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి శ్రేయస్ 48.60 సగటుతో 243 పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.20 పరుగుల తేడాతో..తద్వారా ఈ టోర్నీలో టీమిండియా తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయస్ అయ్యర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన రచిన్ రవీంద్రకు 20 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. రచిన్ రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించి ఓవరాల్‌గా అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. శ్రేయస్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించడంలోనూ శ్రేయస్ అయ్యర్‌ది కీలక పాత్ర. కివీస్ విధించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ శుబ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లి(1) రూపంలో కీలక వికెట్లు కోల్పోయిన వేళ.. రోహిత్ శర్మ(76)తో కలిసి శ్రేయస్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 48 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. తద్వారా మరో ఓవర్ మిగిలి ఉండగానే రోహిత్ సేన టార్గెట్ పూర్తి చేసి నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.మాటలకు అందని అనుభూతిఅనంతరం చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు ట్రోఫీతో పాటు విన్నింగ్స్ మెడల్స్ అందించారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఈ అనుభూతిని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నేను గెలిచిన మొదటి ఐసీసీ ట్రోఫీ ఇదే. ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఫైనల్ వరకు మా జట్టు జైత్రయాత్ర అమోఘం.నిజం చెప్పాలంటే.. నేను ఒత్తిడిలోనే మరింత గొప్పగా రాణించగలను. సవాళ్లను ఎదుర్కోవడం నాకు భలే మజాను ఇస్తుంది. ఈ టోర్నమెంట్లో నాకు అద్భుత ఆరంభం లభించింది. దానిని అలాగే కొనసాగించాను. అయితే, భారీ స్కోర్లు సాధించలేకపోయాను. అయినప్పటికీ జట్టు విజయాలకు నా ప్రదర్శన దోహదం చేసింది కాబట్టి ఆనందంగానే ఉన్నాను. ఇంతకంటే సంతృప్తి, సంతోషం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ -
CT 2025 Final: ముగింపు వేడుకలో ఒక్క పాకిస్తాన్ ప్రతినిధి కూడా లేడు.. కారణం ఏంటి..?
20 రోజుల పాటు సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిన్నటితో (మార్చి 9) ఫైనల్‌తో ముగిసింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.కాగా, నిన్నటి ఫైనల్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా పోడియంపై ఒక్క పాకిస్తాన్ ప్రతినిథి కూడా కనపడకపోవడం చర్చనీయాంశంగా మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి పోడియంపై ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్‌మీడియా వేదికగా లేవనెత్తాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడమేంటని ప్రశ్నించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నాడు.వాస్తవానికి భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు టోర్నీ ఆతిథ్య దేశ హోదాలో పాకిస్తాన్ నుంచి ఒక్కరైనా హాజరు కావాల్సి ఉండింది. అయితే అలా జరగలేదు. ముగింపు వేడుకకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి ఉన్నా రాలేదు. బదులుగా, పాకిస్తాన్ లెగ్ మ్యాచ్‌లు నిర్వహించిన టోర్నీ డైరెక్టర్ సుమైర్ అహ్మద్‌ను పంపారు. ప్రోటోకాల్ ప్రకారం ముగింపు వేడుకల్లో పోడియంపైకి బోర్డు ద్వారా ఎన్నికైన సభ్యులు లేదా డైరెక్టర్లను మాత్రమే అనుమతిస్తారు. సుమైర్ అహ్మద్ పీసీబీ ఉద్యోగి మాత్రమే కావడంతో అతన్ని పోడియంపైకి అనుమతించలేదు. దుబాయ్ లెగ్‌కు బాధ్యత వహించిన మరో టోర్నమెంట్ డైరెక్టర్ ఆండ్రీ రస్సెల్‌ను కూడా పోడియంపైకి పిలువ లేదు. మొత్తంగా పాకిస్తాన్ ప్రతినిథి లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ ముగింపు వేడుక ముగిసింది.ముగింపు వేడుకలో ఐసీసీ తరఫున చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్ రోజర్ ట్వోస్ పాల్గొన్నారు.ఇదిలా ఉంటే, ఉత్కంఠగా సాగిన నిన్నటి ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) రాణించారు. రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఎక్కడైనా టీమిండియాదే గెలుపు!.. ఇచ్చిపడేసిన పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్
టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం(Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. వేదిక ఏదైనా రోహిత్ సేనకు తిరుగులేదని.. అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధిస్తున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఎల్లవేళలా తమ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగిందని ప్రశంసించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి టైటిల్ సాధించింది.బీసీసీఐ అనుసరించిన విధానాల వలనే..అయితే, ఒకే వేదికపై ఆడటం భారత్‌కు సానుకూలంగా మారిందనే విమర్శల నేపథ్యంలో పాక్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ వసీం అక్రం తనదైన శైలిలో స్పందించాడు. బీసీసీఐ అనుసరించిన విధానాలే టీమిండియా జైత్రయాత్రకు కారణమని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ప్రస్తుత భారత జట్టు ప్రపంచంలోని ఏ వేదికపై ఆడినా కచ్చితంగా గెలుస్తుంది.ఒక్క ఓటమి కూడా లేకుండాదుబాయ్లో ఆడినందుకు టీమిండియా లాభపడిందని చాలా మంది అంటున్నారు. కానీ పాకిస్తాన్లో ఆడినా రోహిత్ సేన టైటిల్ గెలిచేది. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత జట్టు కూడా అన్ని టీమ్స్ మాదిరే వివిధ వేదికలకు ప్రయాణాలు చేసింది. మరి అజేయంగానే చాంపియన్‌గా నిలిచింది కదా! ఒక్క ఓటమి కూడా లేకుండా ట్రోఫీని ముద్దాడింది.ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టుకు నిలకడకు ఇది నిదర్శనం. రోహిత్ శర్మ నాయకత్వ పటిమకు ఇదో కొలమానం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌లో కనీవినీ ఎరుగని రీతిలో 3-0తో వైట్‌వాష్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది.అంతకు ముందు శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. ఇలాంటి సమయాల్లో బోర్డుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కెప్టెన్, కోచ్‌లను తొలగించాలనే డిమాండ్లు వస్తాయి. అయితే, బీసీసీఐ మాత్రం తమ సారథికి, శిక్షకుడికి అన్ని వేళలా పూర్తి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గ ఫలితాన్ని చాంపియన్స్ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా పొందింది’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.మూడోసారి ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసంకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మూడోసారి(2002, 2013, 2025) ఈ ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(40 బంతుల్లో 53 నాటౌట్) రాణించడం ద్వారా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకం(83 బంతుల్లో 76)తో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒక్క విజయం కూడా లేకుండా నిష్క్రమించడం గమనార్హం.చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్ TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఆ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడలేదు: భారత మాజీ క్రికెటర్ వ్యంగ్యాస్త్రాలు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)ని టీమిండియా అజేయంగా ముగించింది. గ్రూప్ దశలో మూడింటికి మూడూ గెలిచిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి పరిపూర్ణ విజయంతో చాంపియన్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. ఒకే వేదికపై ఆడిన తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ వన్డే టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వగా.. టీమిండియా మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికపైన తమ మ్యాచ్‌లు ఆడింది. దుబాయ్(Dubai)లోనే ఈ ఐదు మ్యాచ్‌లలో ప్రత్యర్థులతో తలపడింది.అదనపు ప్రయోజనం అంటూ విమర్శలుమరోవైపు.. రోహిత్ సేనతో మ్యాచ్‌లు ఆడేందుకు ఆయా జట్లు పాకిస్తాన్- దుబాయ్ మధ్య ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకే మైదానంలో ఆడటం భారత్‌కు అదనపు ప్రయోజనాలను చేకూర్చిందని ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాల మాజీ క్రికెటర్లు టీమిండియా విజయాలను విమర్శించారు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ అవతరించిన అనంతరం.. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టు విజయాలను ఉటంకిస్తూ.. ‘‘కేవలం ఐసీసీ టైటిళ్ల విషయంలోనే కాదు.. టీమిండియా ఎన్ని ఐసీసీ మ్యాచ్‌లు గెలిచిందో కూడా చూడాలి. చెంపపెట్టు లాంటి సమాధానంగత ఆరేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌కు అద్బుత రికార్డు ఉంది. మరొక్క మాట.. ఈ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో మాత్రం ఆడినవి కాదండోయ్!’’ అంటూ విమర్శకులను ఉద్దేశించి మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా విజయాలను తక్కువ చేసి మాట్లాడుతున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు అంటూ అభిమానులు మంజ్రేకర్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు.కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ వరకు అజేయంగా ఉన్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2024లో అన్ని మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లోనూ ఓటమన్నదే లేకుండా ముందుకు సాగి ట్రోఫీని ముద్దాడింది. అరుదైన రికార్డులుఈ మూడు ఈవెంట్లలో రోహిత్ సేన మొత్తంగా 24 మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా 23 గెలిచింది. ఒక మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియాతో చేతిలో పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను కూడా భారత్ సాధించింది. ఈ వన్డే టోర్నమెంట్లో ఇప్పటి వరకు మొత్తంగా 34 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఇరవై మూడింట గెలిచి.. ఎనిమిది ఓడింది. మూడింట ఫలితాలు రాలేదు. ఇక ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టూ కూడా ఈ టోర్నీలో పదిహేను కంటే ఎక్కువ విజయాలు సాధించకపోవడం గమనార్హం.అంతేకాదు.. ఒక వేదికపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగానూ భారత్.. న్యూజిలాండ్ రికార్డును సమం చేసింది. దుబాయ్‌లో ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్‌లు ఆడి పదింట గెలిచింది. న్యూజిలాండ్ గతంలో డునెడిన్‌లో పదింటికి పది మ్యాచ్‌లలో విజయం సాధించింది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 👉కివీస్ స్కోరు: 251/7 (50)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచి చాంపియన్‌గా భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 76)చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్TEAM INDIA ARE CHAMPIONS AGAIN! 🏆🇮🇳#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy2025 pic.twitter.com/Uh6EZWFfSL— Star Sports (@StarSportsIndia) March 9, 2025 -
ఛాంపియన్స్‌గా భారత్.. చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్! వీడియో
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత టీమిండియా వశమైంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే స్టేడియంలో ఉన్న భారత అభిమానలతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. ఫైనల్ పోరులో కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. టీమిండియా గెలిచిన వెంటనే మైదానంలో వచ్చి సందడి చేశాడు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన చిన్నపిల్లాడిలా డ్యాన్స్ చేస్తూ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.సహచర కామెంటేటర్లు వారి సెల్ఫోన్లలో అద్బుత క్షణాలను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ప్లేయర్లు కూడా ట్రోఫీని అందుకున్నాక తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అలరించారు.కాగా భారత్‌కు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో శ్రీలంకతో ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్న భారత జట్టు.. ఆ తర్వాత 2013, 2025లో ఛాంపియన్స్‌గా నిలిచింది. అదేవిధంగా తొమ్మిది నెలల వ్యవధిలో భారత్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం గమనార్హం.ఇక ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. Sunil Gavaskar after India won champions trophy 😂😂😂I think now we can understand his harsh criticism of players pic.twitter.com/rWNsT8k47b— Chintan Patel (@Patel_Chintan_) March 9, 2025 -
అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) గెలవాలన్న న్యూజిలాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. పాతికేళ్ల క్రితం ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుని 2025 ఫైనల్లో కివీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమని కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సహచర ఆటగాళ్లను అభినందించాడు. ఈ టోర్నమెంట్ తమకు చేదు-తీపిల కలయికగా మిశ్రమ అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన ఈ మెగా వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. ఈ క్రమంలో లీగ్ దశలో మూడింటికి మూడూ గెలిచి సెమీస్‌కు చేరిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌పై గెలుపొందింది. మరోవైపు.. గ్రూప్ దశలో కేవలం టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అయితే, 49వ ఓవర్ వరకు ఫలితం తేలకుండా న్యూజిలాండ్ బౌలర్లు అడ్డుపడటం... ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరును ప్రస్తావిస్తూ సాంట్నర్(Mitchell Santner) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆఖర్లో మాకు మిశ్రమ అనుభూతి లభించింది. అయితే, ఫైనల్లో పటిష్ట జట్టు చేతిలో ఓడిపోయినందువల్ల పెద్దగా బాధపడాల్సిన పనిలేదు.మ్యాచ్ ఆసాంతం మేము టీమిండియాను సవాల్ చేయగలిగాం. అది మాకు సంతృప్తినిచ్చింది. ఒకటీ రెండు చిన్నతప్పుల వల్ల మ్యాచ్ మా చేజారింది. ఏదేమైనా ఈ జట్టును చూసి నేను గర్విస్తున్నాను. టోర్నీ ఆసాంతం మా వాళ్లు అద్భుతంగా ఆడారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో మా జట్టు సమతూకంగా ఉంది. ఇలాంటి జట్టుకు కెప్టెన్‌గా ఉండటం అంత తేలికేమీ కాదు. నాకైతే ఈ టోర్నీ అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది.ముందుగా చెప్పినట్లు మేము బలమైన జట్టు చేతిలో ఓడిపోయాం. ఇంకో 20 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. అయితే, రోహిత్ శర్మ(Rohit Sharma) తన అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఫైనల్ వరకు మా ఆటతీరు అద్బుతంగా సాగింది. టైటిల్ పోరులోనూ మేము ఆఖరి వరకు పోరాడటం గర్వకారణం’’ అని 33 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రచిన్ రవీంద్ర(37),గ్లెన్ ఫిలిప్స్(34) ఫర్వాలేదనిపించగా.. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో కివీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకోగా.. పేసర్లలో షమీ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనను దూకుడగా ఆరంభించిన భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(83 బంతుల్లో 76, 7 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత అర్ధ శతకం సాధించగా.. శ్రేయస్ అయ్యర్(48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9 నాటౌట్) రాణించారు. కివీస్ బౌలర్లలో మైకేల్‌బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్‌రెండేసి వికెట్లు కూల్చగా.. రచిన్ రవీంద్ర, కైలీ జెమీసన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. సిరీస్ ఆసాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ శర్మ -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు!
రోహిత్ శర్మ.. ఈ పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం తొమ్మిది నెలల వ్యవదిలోనే భారత జట్టుకు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించిన లీడర్ అతడు. రోహిత్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడింది.న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. మూడో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఈ విజయంతో పాతికేళ్ల కిందట కివీస్ చేతిలో పరాభావానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో యావత్తు దేశం మొత్తం సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రధాని నుంచి సామన్య మానవుడి వరకు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.భారత కెప్టెన్ రోహిత్ శర్మది కీలకపాత్ర. రోహిత్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శన పరంగా అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్.. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు..👉ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ పోరులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ జట్టు కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.👉అదేవిధంగా భారత్‌కు అత్యధిక ఐసీసీ టైటిల్స్‌ను అందించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2007, వన్డే ప్రపంచకప్-2011, ఛాంపియన్స్ ట్రోఫీ-2013లను భారత్ కైవసం చేసుకుంది. ధోని మొత్తంగా భారత్‌కు మూడు టైటిల్స్‌ను అందించగా.. రోహిత్ రెండు టైటిల్స్‌ను సాధించాడు.👉పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వైట్‌బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కు చేరింది. చివరి మూడు టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయింది.అది కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ఆ తర్వాత రెండు టోర్నీలను టీమిండియా ఆజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సంటేజి 90 శాతంగా ఉంది. రోహిత్ తర్వాతి స్ధానాల్లొ పాంటింగ్(88 శాతం), గంగూలీ(80శాతం) ఉన్నారు.చదవండి: కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్ శర్మ -
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు శుభం కార్డ్ పడింది. ఈ మెగా టోర్నీ విజేతగా భారత్(Teamindia) నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత జట్టు.. రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన రోహిత్ సేన.. ఫైనల్లోనూ అదే జోరును కనబరిచి పుష్కరకాలం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి భారత్‌కు తీసుకొచ్చింది. భారత్ చివరగా 2013లో ధోని సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోగా.. మళ్లీ రోహిత్ శర్మ నాయకత్వంలో తిరిగి సాధ్యమైంది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ ఎంత ప్రైజ్‌మనీని గెల్చుకుంది, రన్నరప్‌గా న్యూజిలాండ్ ఎంత మొత్తం దక్కించుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.విజేతకు ఎంతంటే?ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు 2.4 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) అందుకుంది. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన కివీస్‌కు 1.12 మిలియన్ డాలర్ల (రూ.9.72కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. సెమీఫైనల్లో ఓటిమిపాలైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లకు 560,000 డాలర్లు (రూ.4.86కోట్లు) లభించాయి. ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1.2 కోట్లు) దక్కించుకున్నాయి. గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు (సుమారు రూ. 33 లక్షలు) అందనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. అంటే ఈ మెత్తాన భారత్‌కు రూ. 21 కోట్లపైనే అందింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్‌ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన..
విశ్వవేదికపై మరోసారి భారత జెండా రెపరెపలాడింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత క్రికెట్ జట్టు నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది.ఈ విజయంతో ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో వేసుకుంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే రిటైర్మెంట్ వస్తున్న వార్తలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హిట్‌మ్యాన్.. ఇప్పటిలో రిటైర్ అయ్యే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు.ఇప్పుడే కాదు.."చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు.సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు.ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుంది. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతోంది అని 38 ఏళ్ల రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా రోహిత్, కోహ్లి ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగే అవకాశముంది.భారత్ ఆల్‌రౌండ్ షో..ఈ ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్‌వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 34 నాటౌట్) కీలక నాక్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర, జెమీసన్ చెరో వికెట్ సాధించింది.చదవండి:మా స్పిన్నర్లు అద్భుతం.. ఆ ఇద్దరు సూపర్.. అతడు నాణ్యమైన బౌలర్: రోహిత్ -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
IND Vs NZ: చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ (ఫొటోలు)
-
Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్ -
మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమం
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైన క్యాచ్ నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో గ్లెన్ ఫిలిప్స్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడిన షాట్‌ను (కవర్స్ దిశగా) ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి పట్టేసుకున్నాడు. ఈ క్యాచ్‌ను ఫిలిప్స్ సైతం నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టిన తర్వాత కింద కూర్చుని క్యాచ్ పట్టానా అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. What a magnificent catch by GLENN PHILLIPS 🤯👏👏👏#INDvsNZ #ChampionsTrophyFinal pic.twitter.com/1CxjG3QYiw— INNOCENT EVIL ⁶𓅓 (@raju_innocentev) March 9, 2025ఈ క్యాచ్‌ను చూసి గిల్ నోరెళ్లపెట్టాడు. ఈ క్యాచ్ తర్వాత దుబాయ్ స్టేడియంలో నిశ్శబ్దం ఆవహించింది. అప్పటిదాకా భారత్‌కు సపోర్ట్ చేసిన ప్రేక్షకులు ఫిలిప్స్ క్యాచ్ చూసి షాక్‌లో ఉండిపోయారు. అస్సలు సాధ్యంకాని క్యాచ్‌ను పట్టడంతో అభిమానులు ఫిలిప్స్‌కు జేజేలు పలుకుతున్నారు. ఈ క్యాచ్‌ను సంబంధించిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఫిలిప్స్ మనిషా లేక పక్షా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫిలిప్స్ ఇదే టోర్నీలో విరాట్ కోహ్లి క్యాచ్‌ను (గ్రూప్ దశ మ్యాచ్‌లో) కూడా ఇలాగే నమ్మశక్యంకాని రీతిలో పట్టుకున్నాడు. ఆ క్యాచ్‌ను ఇది తలదన్నేలా ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్న నానుడుని ఫిలిప్స్ నిజం చేస్తాడేమో చూడాలి.ఫిలిప్స్ పట్టుకున్న క్యాచ్ ఆషామాషీ వ్యక్తిది కాదు. గిల్ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు. అదీ కాక భారత్ అప్పటిదాకా బాగా స్కోర్ చేసి విజయం దిశగా దూసుకుపోతుండుంది. ఫిలిప్స్ క్యాచ్‌తో భారత్ డిఫెన్స్‌లో పడింది. పుండుపై కారం చల్లినట్లు గిల్ (31) ఔటైన పరుగు వ్యవధిలోనే భారత్ అత్యంత కీలకమైన విరాట్ కోహ్లి (1) వికెట్ కూడా కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత క్రీజ్‌లో కుదురుకుపోయిన రోహిత్ శర్మ (76) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయినట్లైంది. శ్రేయస్ అయ్యర్ (35), అక్షర్ పటేల్ (13) భారత ఇన్నింగ్స్‌ను చక్కద్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 35 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 161/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. -
CT 2025 Final: తొలి హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత్ ముందు ఫైటింగ్ టార్గెట్‌ను (252) ఉంచింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో రాణించారు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది.అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. రోహిత్ కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మకు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లోనూ రోహిత్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ.18 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 103/0గా ఉంది. రోహిత్‌తో (62 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) పాటు శుభ్‌మన్ గిల్ (46 బంతుల్లో 29; సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 32 ఓవర్లలో 149 పరుగులు చేయాలి.ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో రోహిత్ శర్మ స్కోర్లు.. 69*(62), 2025 CT 9(5), 2024 T20 WC47(31), 2023 ODI WC43(60), 2023 WTC15(26), 2023 WTC30(81), 2021 WTC34(68), 2021 WTC0(3), 2017 CT29(26), 2014 T20 WC9(14), 2013 CT30*(16), 2007 T20 WC -
CT 2025 Final: రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఫైనల్ మ్యాచ్‌లో జడ్డూ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన తర్వాత విరాట్ కోహ్లి అతన్ని భావోద్వేగంతో హగ్ చేసుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. విరాట్.. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్ తర్వాత స్టీవ్ స్మిత్‌ను కూడా ఇలాగే హగ్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ తర్వాత జడేజా కూడా రిటైర్ అవుతాడని సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.Kohli hugged Smith - Retirement Kohli hugged jadeja - Retirement??#Indvsnz #Indvsnzfinal pic.twitter.com/DtKFESNFii— भाई साहब (@Bhai_saheb) March 9, 2025కాగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో జడేజా ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ కీలకమైన టామ్ లాథమ్ వికెట్ తీసి తన కోటా 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జడేజా మిడిల్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో జడేజా మొదటి మ్యాచ్ నుంచి ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో జడేజా 5 మ్యాచ్‌ల్లో 4.36 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత జడేజాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఒకవేళ జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నిజంగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత స్పిన్నర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో జడేజా సహా భారత స్పిన్నర్లంతా చెలరేగినా న్యూజిలాండ్ బ్యాటర్లు మంచి స్కోర్‌నే చేశారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్‌ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్‌ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్‌పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్‌పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
వారెవ్వా కుల్దీప్.. దెబ్బకు రవీంద్ర ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న ఫైనల్లో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కుల్దీప్ బౌలింగ్ ఎటాక్‌లోకి వచ్చిన తొలి బంతికే భారత్‌కు వికెట్ అందించాడు. అప్పటివరకు దూకుడుగా ఆడుతున్న కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్రను కుల్దీప్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి రచిన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతిని రవీంద్రకు గూగ్లీగా సంధించాడు. ఆ డెలివరీని రచిన్ బ్యాక్‌ఫుట్‌పై నుంచి ఆఫ్‌సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో రవీంద్ర ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ వికెట్‌తో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. రవీంద్ర 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. కాగా కుల్దీప్ తన తరవాతి ఓవర్లో కేన్ విలియమ్సన్‌ను కూడా బోల్తా కొట్టించాడు. విలియమ్సన్.. కుల్దీప్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి కివీస్.. 3 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy Final: రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనేDC Blood Kuldeep Yadav got 2 wickets.KL Rahul and Kuldeep Yadav duo will gonna cook all thye ipl teams pic.twitter.com/EzuPwtBuVN— KL'sGIRL (@Silverglohss_1) March 9, 2025 -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.ఆజేయంగా భారత్..ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్‌కు చేరింది. లీగ్ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్‌ను ఓడించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్‌పై భారత్ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లుఫైనల్ మ్యాచ్‌కు తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Champions Trophy: ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం2025 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేయగా.. భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ (76) శుభారంభం అందించారు. రోహిత్.. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. చివర్లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. అక్షర్ ఔట్203 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో రూర్కీకి క్యాచ్ ఇచ్చి అక్షర్ పటేల్ (29) ఔటయ్యాడు. 44 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 212/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 36 బంతుల్లో 40 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్183 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టే క్రయంలో శ్రేయస్ అయ్యర్ (48) ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో రచిన్ క్యాచ్ పట్టడంతో శ్రేయస్ పెవిలియన్ బాటపట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 68 బంతుల్లో 69 పరుగులు చేయాలి. 38.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 183/4గా ఉంది.జాగ్రత్తగా ఆడుతున్న శ్రేయస్, అక్షర్252 పరుగుల ఛేదనలో స్వల్ప వ్యవధిలో గిల్, విరాట్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (47), అక్షర్ పటేల్ (17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ భారత్‌ను విజయతీరాలవైపు తీసుకెళ్తున్నారు. 37 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 176/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 78 బంతుల్లో 76 పరుగులు చేయాలి. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్252 పరుగుల ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం అనంతరం భారత్ 17 పరుగుల వ్యవధిలో మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన భారత్.. 122 పరుగుల వద్ద రోహిత్ శర్మ (76) వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటిదాకా చాలా జాగ్రత్తగా ఆడిన రోహిత్.. పరుగులు అస్సలు రాకపోవడంతో ఒత్తిడికి లోనై భారీ షాట్‌కు ప్రయత్నించాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చిన రోహిత్ బంతి కనెక్ట్ కాకపోవడంతో స్టంపౌటయ్యాడు. పరుగు వ్యవధిలో గిల్, కోహ్లి వికెట్లు కోల్పోయిన టీమిండియాపరుగు వ్యవధిలో టీమిండియా రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 105 పరుగుల వద్ద గిల్, 106 పరుగుల వద్ద కోహ్లి ఔటయ్యారు. అప్పటిదాకా గెలుపుపై ధీమా ఉన్న టీమిండియా ఒక్కసారిగా ఇద్దరు స్టార్ల వికెట్లు కోల్పోవడంతో డిఫెన్స్‌లో పడింది. గిల్‌ను సాంట్నర్.. కోహ్లిని బ్రేస్‌వెల్ ఔట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యంకాని రీతిలో క్యాచ్ పట్టడంతో గిల్ పెవిలియన్ బాట పట్టగా.. కోహ్లిని బ్రేస్‌వెల్ వికెట్ల ముందు దొరికించుకున్నాడు. 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసిన టీమిండియా252 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 17 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసుకుంది. భారత్ వికెట్ నష్టపోకుండా ఈ మార్కును తాకింది. రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 68 పరుగులతో, గిల్ 27 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 152 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ 252 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 65/0గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాలి.టార్గెట్ 252.. ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ252 పరుగుల ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించాడు. రోహిత్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 7 పరుగులు చేసి రోహిత్‌కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్ 59/0గా ఉంది. మిచెల్, బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీలు.. టీమిండియా టార్గెట్ 252ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి టీమిండియా ముందు 252 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి టీమిండియాకు ఫైటింగ్ టార్గెట్‌ను నిర్దేశించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. విరాట్ కోహ్లి సూపర్ త్రో.. సాంట్నర్ రనౌట్విరాట్ కోహ్లి సూపర్ త్రోతో మిచెల్ సాంట్నర్‌ను (8) రనౌట్ చేశాడు. 239 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్45.4వ ఓవర్: 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో డారిల్ మిచెల్ (63) ఔటయ్యాడు. ఔట్ కాకముందు మిచెల్ షమీ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాడు.డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్37.5వ ఓవర్: డేంజరెస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 38 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 165/5గా ఉంది. డారిల్ మిచెల్‌కు (44) జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. నిలకడగా ఆడుతున్న మిచెల్, ఫిలిప్స్లాథమ్ వికెట్ పడ్డ తర్వాత న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. డారిల్ మిచెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (28) నిలకడగా ఆడుతున్నారు. 36 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 156/4గా ఉంది. కివీస్ నాలుగో వికెట్ డౌన్..టామ్ లాథమ్ రూపంలో న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్లెన్ ఫిలిప్స్ వచ్చాడు. 26 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 116/4నిలకడగా ఆడుతున్న మిచెల్, లాథమ్..22 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మిచెల్(18), టామ్ లాథమ్(14) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.విలియమ్సన్ ఔట్..కేన్ విలియమ్సన్ రూపంలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన విలియమ్సన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి టామ్ లాథమ్ వచ్చాడు. 15 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 82-3కివీస్ స్పిన్ మ్యాజిక్.. రవీంద్ర క్లీన్ బౌల్డ్రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన రవీంద్ర.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి డార్లీ మిచెల్ వచ్చాడు. 11 ఓవర్లకు భారత్ స్కోర్: 73/3వరుణ్ మ్యాజిక్.. కివీస్ తొలి వికెట్ డౌన్న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన విల్ యంగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కేన్ విలియమ్సన్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర 34 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.దూకుడుగా ఆడుతున్న రచిన్..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి కివీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(16), విల్ యంగ్(8) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్ధానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.తుది జట్లున్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిమరి కాసేపటిలో టాస్..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో టాస్ పడనుంది. ఇరు జట్లకు టాస్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు తమ ఆస్తశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో ఇరు జట్లు తలపడుతున్నాయి.హెడ్ టు హెడ్ రికార్డ్..ఇప్పటివరకు భారత్-న్యూజిలాండ్ జట్లు ముఖాముఖి 119 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 61 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. ఓ మ్యాచ్ టై అయింది. -
ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమైంది. ఈ ఫైనల్ పోరుకు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది.హెన్రీ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డ ఈ కివీ స్పీడ్ స్టార్ ఇంకా కోలుకోపోయినట్లు తెలుస్తోంది. అతడు భుజం నొప్పి కారణంగా అతడు ఎక్కువగా ప్రాక్టీస్‌లో కూడా పాల్గోకపోయినట్లు సమాచారం.నెట్ ప్రాక్టీస్‌లో హెన్రీ కేవలం ఏడు బంతులు మాత్రమే సంధించినట్లు రేవ్‌స్పోర్ట్స్ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. హెన్రీ అందుబాటుపై ఇప్పటివరకు న్యూజిలాండ్ జట్టు మెనెజ్‌మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి అతడు మ్యాచ్‌లో ఆడే సూచనలు కన్పించడం లేదు.ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి. అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్ధానంలో జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: IML 2025: యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్‌కు చేరిన టీమిండియా -
న్యూజిలాండ్‌తో ఫైనల్.. రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌కు సర్వం సిద్దమైంది. దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య తుది పోరుకు తెరలేవనుంది. 25 ఏళ్ల తర్వాత.. ఐసీసీ వన్డే టోర్నీ టైటిల్ ఫైట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆఖరిగా తలపడిన ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో భారత్‌ను 4 వికెట్ల తేడాతో కివీస్ ఓడించింది. దీంతో నేడు జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఎలాగైనా ఓడించి తమ 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు కివీస్ జట్టు సైతం గతంలో తరహాలోనే మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లు సమవుజ్జీలగా ఉండడంతో ఈ టైటిల్ పోరు అభిమానులను ఆఖరివరకు మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.రోహిత్ మరో కప్‌ను అందిస్తాడా?కాగా భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023, వన్డే వరల్డ్ కప్-2023, టీ20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. మరుసటి ఏడాది జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా అద్బుతం చేసింది.టీ20 వరల్డ్‌కప్-2024 విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధిస్తే వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పకోనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బీసీసీఐతో హిట్‌మ్యాన్ మాట్లాడాడని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశానికి కూడా రోహిత్ గైర్హజారీ అయ్యాడు. రిటైర్మెంట్కు సంబంధించిన ప్రశ్నలను నివారించేందుకే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హిట్‌మ్యాన్ హాజరు కాలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే గిల్ మాత్రం డ్రెసింగ్ రూమ్‌లో ఏ ఆటగాడి రిటైర్మెంట్ గురించి చర్చ జరగడం స్పష్టం చేశాడు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడా లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడో? ఆదివారం తేలిపోనుంది.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌దే'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకునేందుకు సిద్దమయ్యాయి. 12 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా ఊవ్విళ్లరూతోంది.ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆజేయంగా నిలిచిన భారత జట్టు.. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించాలని తహతహలాడుతోంది. మరోవైపు కివీస్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచించింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది.ఆ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవడానికి భారత్‌కు ఇదే సరైన అవకాశం. ఇక టైటిల్ పోరు నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 20 ఓవర్లు పాటు బ్యాటింగ్ చేస్తే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని చోప్రా జోస్యం చెప్పాడు. అదేవిధంగా హిట్‌మ్యాన్ కెప్టెన్సీపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ దిట్ట. గత మూడు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో అతడి కెప్టెన్సీలో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల ఖాతాలో నాలుగు ఐసీసీ ట్రోఫీలు చేరుతాయి.ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్లగా వారిద్దరూ నిలుస్తారు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ దూకుడుగానే ఆడుతాడు. పవర్‌ప్లేలో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో కాస్త ఎక్కువ సేపు అతడు ఆడితే బాగుంటుంది. రోహిత్ 20 ఓవర్లు ఆడితే భారత్‌దే ఛాంపియన్స్ ట్రోఫీ అని"చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.కాగా రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీలో పర్వాలేదన్పిస్తున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే తన లభించిన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లగా రోహిత్ మలచలేకపోతున్నాడు.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ.చదవండి: Champions Trophy final: 'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు' -
'వరుణ్ కాదు.. అతడితోనే న్యూజిలాండ్‌కు ముప్పు'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టికర్పించాలని పట్టుదలతో ఉంది.ఇప్పటివరకు భారత్-కివీస్ రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ-2000, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2021 ఫైనల్లో కివీస్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది. ఇక ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్రాలను సిద్దం చేసుకున్నాయి.మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు కూడా స్పిన్నర్లను నెట్స్‌లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. న్యూజిలాండ్ అయితే ప్రత్యేకంగా శశ్వత్ తివారీ అనే ఓ స్పిన్నర్‌ను నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసి మరి ప్రాక్టీస్ చేసింది.వరుణ్ కాదు.. అతడితోనే ముప్పు?అయితే న్యూజిలాండ్ టీమ్ ఆందోళన చెందుతుంది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోసం కాదంట. రవీంద్ర జడేజా వంటి ఎడమచేతి వాటం స్పిన్నర్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారు సిద్దమవుతున్నారంట. ఈ విషయాన్ని స్వయంగా కివీస్ నెట్‌బౌలర్‌గా ఉన్న శశ్వత్ తివారీ వెల్లడించాడు."ఈ రోజు న్యూజిలాండ్ జట్టుకు నెట్స్‌లో చాలా సమయం పాటు బౌలింగ్ చేశాను. వారు రవీంద్ర జడేజాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్నారు. జడేజా బౌలింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయి. అతడు చాలా వేగంతో బంతిని స్పిన్ చేస్తాడు. ఆ స్పీడ్‌ను అలవాటు చేసుకునేందుకు నన్ను 18 యార్డ్స్ నుంచి బౌలింగ్ చేయమన్నారు.నేను వారి చెప్పినట్లగానే ఆ పాయింట్ నుంచి బౌలింగ్ చేశారు. కొద్దిసేపు వారు ప్రాక్టీస్ చేశారు. కానీ బంతి చాలా త్వరగా డెలివరీ అవుతుండడంతో 22 గజాల నుంచే తిరిగి బౌలింగ్ చేయమని చెప్పారు. వారు ముఖ్యంగా ఎడమచేతి వాటం బౌలర్లపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ప్రాక్టీస్‌లో స్పిన్‌ను ఎదుర్కొవడంలో వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు.కానీ భారత జట్టులో టాప్-క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి భారత స్పిన్నర్ల నుంచి మరోసారి వారికి కఠిన సవాలు ఎదురు కానుంది" అని శశ్వత్ తివారీ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో చక్రవర్తి 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో అతడి నుంచి మరోసారి కివీస్‌కు ముప్పు పొంచి ఉందని అంతా భావిస్తున్నారు.చదవండి: చాంపియన్ నువ్వా.. నేనా -
Champions Trophy 2025 Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.విజేతకు భారీ ప్రైజ్మనీఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($2.24 మిలియన్) లభిస్తాయి. ఫైనల్లో ఓడిపోయిన జట్టు రూ. 9.74 కోట్లు ($1.12 మిలియన్) పొందుతుంది.సెమీఫైనలిస్టులకు కూడా భారీ ప్రైజ్‌మనీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలిస్ట్‌లకు కూడా భారీ ప్రైజ్‌మనీ లభించనుంది. సెమీస్‌లో ఓడిన జట్లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రూ. 4.87 కోట్లు ($5,60,000) చొప్పున పొందుతాయి. ఈసారి గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్‌మనీ లభిస్తుంది.ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు రూ. 3.04 కోట్లు ($3,50,000) లభిస్తాయి. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లకు సుమారు రూ. 1.22 కోట్లు ($1,40,000) లభిస్తాయి. ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ సుమారు రూ. 60 కోట్లు ($6.9 మిలియన్లు) కేటాయించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది 53 శాతం అధికం.అజేయ భారత్ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.రెండోసారిఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ సాధించిన రెండో టైటిల్ కూడా భారత్‌పైనే (ఫైనల్స్) కావడం గమనార్హం. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఐసీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడంతో భారత అభిమానులు ఆందోళన పడుతున్నారు. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు విరాట్‌కు గాయం..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయమైనట్లు తెలుస్తుంది. ఇవాళ (మార్చి 8) ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ గాయపడినట్లు జియో న్యూస్ తెలిపింది. నెట్స్‌లో ఓ పేసర్‌ను ఎదుర్కొనే క్రమంలో విరాట్ మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన అనంతరం విరాట్ ప్రాక్టీస్‌ను ఆపేసినట్లు తెలుస్తుంది. విరాట్ గాయానికి ఫిజియో చికిత్స చేశాడని సమాచారం. చికిత్స తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లకుండా మైదానంలోనే సహచరులతో గడిపినట్లు తెలుస్తుంది. విరాట్ గాయంపై కోచింగ్ స్టాఫ్‌ను ఆరా తీయగా తీవ్రమైంది కాదని పేర్కొన్నట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో విరాట్ మోకాలికి కట్టు కట్టుకుని తిరిగినట్లు జియో న్యూస్ పేర్కొంది. విరాట్ గాయం గురించి తెలిసి అభిమానులు తొలుత ఆందోళన చెందారు. విరాట్ గాయంపై టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫైనల్లో విరాట్ ఎంత కీలకమైన ఆటగాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవేళ స్వల్ప గాయమైనా ముందు జాగ్రత్త చర్చగా విరాట్‌ను ప్రాక్టీస్ చేయనిచ్చి ఉండరు. ఈ టోర్నీలో విరాట్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో విరాట్ దాయాది పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసి భారత్‌ను గెలిపించాడు. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా విరాట్ సెంచరీ చేసుండాల్సింది. అయితే తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌ను ఫైనల్లోనూ కొనసాగించి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్లో విరాట్ మంచి ఇన్నింగ్స్ ఆడితే భారత విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. దుబాయ్ పిచ్‌లకు విరాట్ అలవాటు పడ్డాడు కాబట్టి ఫైనల్లో తప్పక రాణిస్తాడని అంతా అనుకుంటున్నారు.కాగా, దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. భారత్.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌నూ సూపర్ విక్టరీలు సాధించి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను న్యూజిలాండ్‌పై అంత మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌ను గ్రూప్ దశలో ఓడించినప్పటికీ.. ఫైనల్లో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదు. ఐసీసీ ఈవెంట్లలో (అన్ని ఫార్మాట్లలో) న్యూజిలాండ్ భారత్‌తో ఆడిన 16 మ్యాచ్‌ల్లో పదింట గెలిచింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌పై న్యూజిలాండ్‌కు మరింత ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐసీసీ నాకౌట్స్‌లో భారత్, న్యూజిలాండ్ నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. 3 మ్యాచ్‌ల్లో కివీస్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి. న్యూజిలాండ్ తమ చరిత్రలో గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లు భారత్‌పైనే (ఫైనల్స్‌లో) సాధించినవే కావడం గమనార్హం. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ తమ రెండో ఐసీసీ టైటిల్‌ను 2021లో సాధించింది. 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. -
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్‌ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్‌మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్‌మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్‌మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. -
'రోహిత్, కోహ్లి కాదు.. ఫైనల్లో అతడే గేమ్ ఛేంజర్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్‌కు టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్‌లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్‌లో కన్పిస్తున్నారు.అయితే బ్లాక్ క్యాప్స్‌ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
రోహిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది.. అతడు చాలా గ్రేట్: గంభీర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మపై హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు.రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని గంభీర్ తెలిపాడు. కాగా రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఫైనల్‌కు చేరడంలో కోచ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం, వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకురావడం వంటివి గంభీర్ తీసుకున్న నిర్ణయాలే. అయితే వైట్‌బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా, కోచ్‌గా అదరగొడుతున్న రోహిత్-గంభీర్ జోడీ.. రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా తమ మార్క్ చూపించలేకపోయారు.న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఘోర పరాభావం తర్వాత వీరద్దరూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచి విమర్శించిన వారితోనే శెభాష్ అన్పించుకోవాలని వీరు భావిస్తున్నారు."రోహిత్ శర్మ తనొక కెప్టెన్ అని, అన్ని అధికారాలు ఉన్నాయని ఎన్నడూ భావించలేదు. అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అతడితో నాకు బలమైన అనుబంధం ఉంది. మంచి మనసు ఉన్న వారు మంచి నాయకుడిగా కూడా మారుతారు. అందుకే ఐపీఎల్లో అతడు కెప్టెన్‌గా అన్ని టైటిల్స్ సాధించగలిగాడు.భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అయితే చరిత్ర ఎప్పుడు గతంగానే ఉంటుంది. ఇప్పుడు మా ముందు కొత్త సవాలు ఉంది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అతడు బ్యాటర్ గానే కాకుండా సారథిగా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలడని ఆశిస్తున్నాను" అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత హిట్‌మ్యాన్ భారత వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలిగే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? -
పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో తలపడేందుకు భారత్, న్యూజిలాండ్ సంసిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఈ టోర్నమెంట్ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. ఈ ఫైనల్ కి ముందు రెండు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్ గ్రూప్ దశ మ్యాచ్‌లోభారత్ ఇప్పటికే కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి కొద్దిగా పైచేయి తో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు సాధించగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ని అద్భుతంగా నిలువరించడం తో భారత్ విజయం సాధించింది.పాతికేళ్ల క్రితం... భారత్ ని దెబ్బతీసిన న్యూజిలాండ్అయితే భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి. గతంలో అక్టోబర్ 15, 2000న కెన్యా రాజధాని నైరోబిలోని జింఖానా క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ జట్టు భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ ని ఎగరేసుకుపోయింది. కెప్టెన్ సౌరవ్ గంగూలీ అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్లకు 264 పరుగులు చేసింది. గంగూలీ మరియు సచిన్ టెండూల్కర్ 26.3 ఓవర్లలో తొలి వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యంతో పునాది వేశారు. టెండూల్కర్ 69 పరుగుల వద్ద రనౌట్ కావడంతో ఈ భాగస్వామ్యం తెగిపోయింది. అయితే, గంగూలీ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు, 130 బంతుల్లో 117 పరుగులు చేసి భారత్ కి ఆశలు రేకెత్తించాడు. అయితే అల్ రౌండర్ క్రిస్ కైర్న్స్ విజృంభించి 113 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచి కివీస్ కి విజయాన్ని చేకూర్చాడు.రోహిత్ కి కలిసిరాని టాస్భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కి మాత్రం ప్రస్తుతం టాస్ కలిసి రావట్లేదు. రోహిత్ వరుసగా గత 14 వన్డే మ్యాచ్ లలో టాస్ గెలవలేక పోయాడు. 2023 నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌తో ప్రారంభమైన ఈ టాస్ పరాజయాల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే భారత్ మాత్రం ఈ 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించింది, నాలుగింటిలో ఓటమి పాలయింది ఒక మ్యాచ్ (శ్రీలంకతో)తో టై గా ముగిసింది.ప్రస్తుత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక గా ఆడుతున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లోని ఇంతవరకూ జరిగిన నాలుగు మ్యాచ్ ల లో టాస్ ఓడిపోయింది, అయినప్పటికీ అన్ని మ్యాచ్ లలో విజయం సాధించింది. అందువల్ల టాస్ భారత్ విజయావకాశాల పై ప్రభావం చూపించలేదన్నది వాస్తవం. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులు రెండవ స్థానంలో బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ అలాంటిదేమీ ఈసారి కనిపించలేదు. భారత్ మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి ఛేజింగ్ చేస్తూ మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక్కడి వాతావరణం లో మంచు ఎక్కువగా లేకపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. రాత్రులు వాతావరణం చల్లగా ఉండటంతో, టోర్నమెంట్లో మంచు పెద్ద పాత్ర పోషిస్తుందని భావించారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు.వరుణ్ చక్రవర్తి కీలకం"ఈ సమయంలో ఈ మైదానంలో కొంచెం ఎక్కువ మంచు ఉంటుందని నేను అనుకున్నాను. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. కాబట్టి టాస్ నిజానికి పెద్ద అంశం కాదని నేను భావిస్తున్నాను" అని న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. "ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు వెళుతున్నప్పుడు ఎవరు టాస్ గెలుస్తారనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక భారత్ అభిమానులైతే రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచ్‌ల లో టాస్ ఓడిపోయాడని నిద్ర మానుకోవాల్సి పని లేదు." అని హెస్సన్ వ్యాఖ్యానించాడు. ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?సరిగ్గా పాతికేళ్ల క్రితం క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాజయం చవిచూసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా? 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోర పరాజయాన్నిభారత్ అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇన్నేళ్లకు ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ శర్మ బృందానికి అవకాశం కలిగింది. భారత్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది మరియు టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. రోహిత్ బృందం ఈ విజయ్ బాటను కొనసాగించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మరి ఈ ఫైనల్లో ఏమి జరుగుతుందో చూద్దాం.!చదవండి: భారత తుదిజట్టులో ఓ మార్పు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికే: రవిశాస్త్రి -
భారత తుదిజట్టులో ఓ మార్పు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ వారికే!
భారత్- న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటు చేసుకోవచ్చని అంచనా వేశాడు. పిచ్ పరిస్థితికి తగ్గట్లుగా టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేశాడు.అయితే, ఎవరిపై వేటు వేస్తారు? ఎవరిని తీసుకువస్తారన్న విషయంపై మాత్రం రవిశాస్త్రి స్పష్టతనివ్వలేకపోయాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ మార్చి 9న దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగుస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ సహా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి రోహిత్ సేన.. సౌతాఫ్రికాను చిత్తు చేసి సాంట్నర్ బృందం టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడగా.. కివీస్‌కు కూడా ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి తమకూ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు.భారత తుదిజట్టులో ఓ మార్పుఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు వాడిన పిచ్‌నే భారత్- కివీస్ ఫైనల్‌కు తిరిగి ఉపయోగించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఫైనల్ మ్యాచ్‌లో భారత తుదిజట్టులో ఓ మార్పు చోటుచేసుకున్నా ఆశ్చర్యం లేదు. పిచ్ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం ఉంటుంది.టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన పిచ్ ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమైనది. మళ్లీ అలాంటి హోరాహోరీ చూడాలని ఉంది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్స్‌మెన్‌కి దాదాపు ఐదు రోజుల విరామం లభించింది. 280- 300 పరుగుల మేర రాబట్టగలిగే పిచ్ తయారు చేసి ఉండవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు.ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వారికేఇక ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఆల్‌రౌండర్ ఉండబోతున్నాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా అంచనా వేశాడు. ‘‘అక్షర్ పటేల్ లేదంటే రవీంద్ర జడేజా టీమిండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవబోతున్నారు. ఒకవేళ న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటే మాత్రం నేను గ్లెన్ ఫిలిప్స్ వైపు మొగ్గుచూపుతాను. అతడు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో 4- 50 పరుగులు రాబట్టగలడు. ఒకటీ లేదా రెండు వికెట్లు తీసి ఆశ్చర్యపరచనూగలడు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆసీస్‌తో సెమీస్ ఆడిన భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND vs NZ: ‘అండర్డాగ్స్ అని మర్చిపోండి.. అతడి దూకుడుకు కళ్లెం వేస్తే..’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను చిత్తు చేసి టాపర్‌గా సెమీస్ చేరిన రోహిత్ సేన.. కీలక పోరులోనూ తన సత్తా చాటింది. వన్డే ప్రపంచకప్-2023 విజేత ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్లో భారత జట్టుపై కివీస్(India vs New Zealand)దే పైచేయి అయినా.. దుబాయ్‌లో ప్రేక్షకుల మద్దతు మాత్రం రోహిత్ సేనకే లభించనుంది. అయితే, టీమిండియా ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. తమదైన రోజున న్యూజిలాండ్‌ను ఆపడం ఎవరితరం కాదు. ఈ విషయాన్ని కివీస్ జట్టు గుర్తించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) అంటున్నాడు.అండర్డాగ్స్ అని మర్చిపోండిభారత్- న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్న తరుణంలో కివీస్‌కు అక్తర్ కీలక సూచనలు చేశాడు. ‘‘మీరు టీమిండియాతో ఆడుతున్నామన్న విషయాన్ని మర్చిపోండి. మీరు అండర్‌డాగ్స్‌గా పరిగణింపబడతారనే అంశాన్నీ విస్మరించాలి. మీ జట్టు బాగా లేదని భావించవద్దు.సాంట్నర్‌కు గెలుస్తామనే నమ్మకం ఉంది. కెప్టెన్‌గా అతడు టైటిల్ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి కివీస్ ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇక భారత్‌తో మ్యాచ్ విషయంలో మీకు అతిపెద్ద సవాలు రోహిత్ శర్మ.అతడి దూకుడుకు కళ్లెం వేస్తేపవర్ ప్లేలో గనుక అతడికి అవకాశం ఇస్తే పరిస్థితి చేజారినట్టే. ఏమాత్రం దయ చూపకుండా అతడు దూకుడుగా ముందుకుపోతాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. సాంట్నర్‌ను అటాక్ చేస్తాడు. కెప్టెన్‌గా తన జట్టులో ఆత్మవిశ్వాసం నింపాలంటే బ్యాటర్‌గానూ రాణించాలని అతడికి తెలుసు.70 శాతం టీమిండియాకే అవకాశంఓపెనర్గా తనదైన ముద్ర వేసి నిష్క్రమించాలనే కోరుకుంటాడు. కాబట్టి అతడి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఇక ఫైనల్ విజేతపై అంచనా గురించి చెప్పాలంటే 70 శాతం టీమిండియాకే అవకాశం ఉంది. వాళ్ల బ్యాటర్లు పరిణతితో ఆడుతున్నారు. స్పిన్నర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, న్యూజిలాండ్ తమ శాయశక్తులు ఉపయోగిస్తే మాత్రం మరోసారి టైటిల్ గెలిచే అవకాశం లేకపోలేదు’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ గేమ్ ఆన్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోండిఇదే షోలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. ‘‘స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ చక్కటి సమన్వయంతో ముందుకు సాగటమే భారత బ్యాటర్ల గొప్ప లక్షణం. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పగలిగితే బౌలర్లపై ఒత్తిడి ఉండదు.ఇక సెమీస్‌లో స్మిత్ భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడిన విధానం కివీస్ బ్యాటర్లకు స్ఫూర్తిదాయకం. గ్యాప్స్‌లో షాట్లు బాదుతూ హాఫ్ సెంచరీ(73)తో రాణించాడు. ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్లూ అదే చేయాలి’’ అని షోయబ్ మాలిక్ సూచనలు చేశాడు. కాగా 2000 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై గెలుపొంది టైటిల్ గెలిచిన న్యూజిలాండ్... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(2023)లోనూ టీమిండియా ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
శుబ్‌మన్ గిల్‌కు ప్రమోషన్.. ఏకంగా రూ. 7 కోట్ల జీతం!?
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఈ లిస్ట్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం.అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశీవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను ధిక్కరించడంతో బీసీసీఐ అయ్యర్‌పై వేటు వేసింది. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని రంజీల్లో ఆడిన శ్రేయస్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. తన అద్బుతప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తిరిగి మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.గిల్‌కు ప్రమోషన్.. కోహ్లి, రోహిత్‌కు డిమోషన్మరోవైపు అద్బుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill)కు సైతం ప్రమోషన్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ కేటగిరిలో ఉన్నాడు. ఇప్పుడు అతడిని టాప్ గ్రేడ్(ఏ ప్లస్)కు ప్రమోట్ చేయాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించుకున్నారంట. కాగా ప్రస్తుతం ఏ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఉన్నారు. అయితే అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన కోహ్లి, రోహిత్ శర్మ, జడేజా కాంట్రాక్లు మారనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సీనియర్ త్రయాన్ని ఏ ప్లస్ నుంచి ఏ గ్రేడ్‌కు డిమోట్ చేసే అవకాశముంది. వీరిస్ధానాల్లో గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఏ ప్లస్ కేటగిరిలో చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.కివీస్‌తో ఫైనల్ పోరు..ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు కివీస్ కూడా భారత్‌ను ఓడించి రెండోసారి ఈ మెగా టోర్నీ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.చదవండి: CT 2025: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే? -
నాణ్యమైన క్రికెటర్.. ఏ స్థానంలోనైనా అతడు ఆడతాడు: టీమిండియా కోచ్
భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కర్ణాటక ఆటగాడి బ్యాటింగ్ స్థానాన్ని పదే పదే మార్చడం.. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి భారత మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. స్పేర్ టైర్ కంటే కూడా దారుణంగా మేనేజ్మెంట్ అతడి సేవలను వాడుకుంటోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) స్పందించాడు. జట్టులో తన పాత్ర పట్ల కేఎల్ రాహుల్ సంతృప్తిగా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. కాగా 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆరంభంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.అనంతరం ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను మిడిలార్డర్‌కు డిమోట్ చేశారు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా(India vs Australia)తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ ఓపెనర్‌గా పంపారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవలి వన్డే సిరీస్‌లో ఒక్కోసారి ఆరో స్థానంలో ఆడించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఇదే కొనసాగిస్తున్నారు. వీలునుబట్టి ఐదో స్థానంలో కూడా ఆడిస్తున్నారు.అయితే, ఇలా పదే పదే తన బ్యాటింగ్ ఆర్డర్ మారుతున్నా కేఎల్ రాహుల్ సంతోషంగానే ఉన్నాడని కోచ్ సితాన్షు కొటక్ చెప్పడం విశేషం. ‘‘అతడు ఓపెనింగ్ చేయగలడు. నాలుగు లేదంటే ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. డిమాండ్‌ను బట్టి ఆరో స్థానంలోనూ ఆడతాడు.జట్టుకు ఏది అవసరమో అది చేస్తాడుపరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవడం అతడికి ఇష్టం. జట్టులో తన పాత్ర పట్ల అతడు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాడు. రాహుల్ వంటి నాణ్యమైన బ్యాటర్ ఆరో స్థానంలో అందుబాటులో ఉండటం జట్టుకు అదనపు ప్రయోజనం.బ్యాటింగ్ ఆర్డర్ మార్పుల గురించి నేను తనతో మాట్లాడినపుడు తనకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు. జట్టుకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా వన్డేల్లో ఐదో స్థానంలో వచ్చి ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. 1299 పరుగులు సాధించాడు. సగటు 56.47. ఇందులో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో రాహుల్ ఏడుసార్లు బ్యాటింగ్ చేసి 160 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఇదిలా ఉంటే.. కివీస్‌తో టైటిల్ పోరు గురించి సితాన్షు కొటక్ మాట్లాడుతూ.. ‘‘సీనియర్లు, యువ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. వాళ్లంతా కలిసికట్టుగా ఉంటూ.. ఆట గురించి చర్చిస్తూ ఉంటారు. ఏ జట్టుకైనా ఇంతకంటే విలువైన, గొప్ప విషయం మరొకటి ఉండదు.రోహిత్, విరాట్, హార్దిక్, షమీ, జడేజా.. జట్టులో ఉండటం సానుకూలాంశం. వాళ్లలో చాలా మందికి 15- 20 ఏళ్ల అనుభవం ఉంది. యువ ఆటగాళ్లు సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఫైనల్ విషయంలో మా జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదు’’ అని పేర్కొన్నాడు.చదవండి: CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్ -
IND Vs NZ: భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు.. బ్యాటర్లకు చుక్కలే! ఎందుకంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)లో ఫైనల్ పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడాలని భారత జట్టు భావిస్తుంటే.. మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో టీమిండియాను ఓడించాలని కివీస్ పట్టుదలతో ఉంది. ఇక ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ ఏర్పాటు పూర్తి అయింది. గ్రూపు స్టేజిలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్‌నే తుది పోరుకు కూడా క్యూరేటర్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.ఈ మెగా టోర్నీలో భారత్ ఆడిన తమ నాలుగు మ్యాచ్‌లు వేర్వేరు పిచ్‌లపైనే ఆడింది. ఎందుకంటే ఒక్కసారి ఉపయోగించిన పిచ్‌ను మళ్లీ ఉపయోగించాలంటే కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్లాన్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్‌తో లీగ్ మ్యాచ్ ఆడి రెండు వారాలు పూర్తి కావడంతో ఆ పిచ్‌పై మళ్లీ ఆడేందుకు భారత్ సిద్దమైంది. కాగా ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ 244 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.కివీస్‌కు మరోసారి..కాగా ఈ వికెట్ మరోసారి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మణికట్టు స్పిన్నర్లు బంతితో మ్యాజిక్ చేశారు. ఆ మ్యాచ్‌లో ఇంకా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లేడు. అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాక భారత స్పిన్ విభాగం మరింత పటిష్టంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ ఏకంగా 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడి స్పిన్ దాటికి కివీలు విల్లవిల్లాడారు. ఈ క్రమంలో మరోసారి న్యూజిలాండ్‌కు వరుణ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అయితే ప్రత్యర్ధి జట్టులో కూడా మెరుగైన స్పిన్నర్లు ఉన్నారు.కెప్టెన్ మిచెల్ శాంట్నర్, బ్రెస్‌వెల్ వంటివారు బంతితో అద్భుతాలు చేయగలరు. వీరికి తోడు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లకు కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తాఉంది. దీంతో మరోసారి బ్యాటర్లకు స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది.కివీస్‌దే పైచేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజిలాండ్-భారత జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా కివీసే విజయం సాధించింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను బ్లాక్ క్యాప్స్ చిత్తు చేసింది.చదవండి: రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే... -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు కోహ్లిని ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు
భారత్, న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో 95 పరుగులు చేస్తే వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమిస్తాడు. సచిన్ వన్డేల్లో న్యూజిలాండ్‌పై 1750 పరుగులు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 1656 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో (ఫైనల్లో) విరాట్ సెంచరీ సాధిస్తే.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్, వీరేంద్ర సెహ్వాగ్ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరూ వన్డేల్లో న్యూజిలాండ్‌పై చెరో 6 సెంచరీలు బాదారు.ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 128 పరుగులు చేస్తే.. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ 657 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 530 పరుగులు ఉన్నాయి.ఈ మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీ చేస్తే ఐసీసీ వన్డే నాకౌట్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన నిలుస్తాడు. సచిన్ ఐసీసీ నాకౌట్స్‌లో ఆరు అర్ద సెంచరీలు చేయగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో ఐదు అర్ద శతకాలు ఉన్నాయి.ప్రస్తుతం విరాట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే పైన ఉన్న మూడు రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో విరాట్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 72.33 సగటున, 83.14 స్ట్రయిక్‌రేట్‌తో 217 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఫైనల్లో విరాట్ సెంచరీ చేస్తే వన్డేల్లో 52వ శతకం.. ఓవరాల్‌గా 83వ శతకం అవుతుంది.విరాట్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీమిండియాకు కృష్ణార్జులు లాంటి రోహిత్, కోహ్లి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించాలని యావత్ భారతం ఆశిస్తుంది.టీమిండియాకు చెడు సూచకంఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు చెడు సూచిస్తుంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న ప్రతిసారి భారత్‌కు అపజయమే ఎదురైంది. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు సార్లు ఎదురెదురుపడ్డాయి. తొలిసారి ఈ ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఎడిషన్ ఫైనల్లో తలపడ్డాయి. నాడు న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి పోటీపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
Ind vs NZ: ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు! కానీ ‘టై’ అయితే.. విజేతగా ఎవరు?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) తుది అంకానికి చేరుకుంది. మొత్తం ఎనిమిది జట్లు భాగమైన ఈ వన్డే టోర్నమెంట్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) ఫైనల్‌కు చేరుకున్నాయి. టైటిల్ కోసం దుబాయ్ వేదికగా ఆదివారం ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్ భారత జట్టుపై మెరుగైన రికార్డు కలిగి ఉంది.పాతికేళ్ల క్రితం అలా2000లో చాంపియన్స్ ట్రోఫీ(నాడు ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) తుదిపోరులో టీమిండియాపై గెలుపొంది న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. అనంతరం 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో కోహ్లి సేనను ఓడించడంతో పాటు.. 2023 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship) ఫైనల్లోనూ టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ఎగురేసుకుపోయింది.ఈ క్రమంలో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. సెమీస్ మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక తాజా చాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ గ్రూప్ దశలోనూ రోహిత్ సేనదే సాంట్నర్ బృందంపై పైచేయిగా ఉంది. గ్రూప్-‘ఎ’ నుంచి పోటీపడ్డ ఈ రెండు జట్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరుకున్నాయి. అయితే, గ్రూప్ దశలో ఆఖరిదైన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి టాపర్‌గా నిలిచింది.అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరగా.. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి టీమిండియాతో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఇరుజట్ల మధ్య ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?మరి ఒకవేళ సమవుజ్జీల మధ్య టైటిల్ పోరు ‘టై’గా మారితే పరిస్థితి ఏంటి?.. సూపర్ ఓవర్లోనూ ఇద్దరూ సరిసమానంగా ఉంటే విజేతగా ఎవరిని నిర్ణయిస్తారు? అనే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.మరి ఇందుకు సమాధానం ఏమిటంటే.. ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చడం పరిపాటే. అయితే, సూపర్ ఓవర్లోనూ రెండు జట్లు సమానంగా ఉంటే.. విజేత తేలేంత వరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. 2019 వరల్డ్‌కప్ ఫైనల్ విన్నర్‌ను తేల్చిన విధానంపై విమర్శలు రాగా.. ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.అప్పట్లో వివాదంనాడు ఫైనల్లో న్యూజిలాండ్- ఇంగ్లండ్ మ్యాచ్‌ను ‘టై’ చేసుకున్నాయి. అదే విధంగా సూపర్ ఓవర్లోనూ నువ్వా-నేనా అన్నట్లు తలపడి.. మళ్లీ ‘టై’ చేశాయి. దీంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ తీరుపై విమర్శలు రాగా.. ఇకపై ఐసీసీ టోర్నీల్లో ఒకవేళ మ్యాచ్ ‘టై’ అయితే.. విజేత తేలేంత వరకు సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.ఇక దుబాయ్‌లో వర్షం ముప్పులేదు. కానీ ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. 2002లో వరణుడి కారణంగా ఫైనల్ మ్యాచ్ సాగే వీలు లేకపోవడంతో భారత్- శ్రీలంకను టైటిల్ విజేతగా ప్రకటించారు. నిజానికి అప్పుడు రెండురోజుల్లో 110 ఓవర్ల ఆట పూర్తైనా.. ఆపై కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
‘ఆ ఇద్దరు రాణిస్తే ట్రోఫీ మనదే.. కివీస్ ప్రధాన టార్గెట్ అతడే’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)ఫైనల్లో టీమిండియా- న్యూజిలాండ్(India vs New Zealand) అమీతుమీ తేల్చుకోనున్నాయి. పాతికేళ్ల తర్వాత మరోసారి ఈ రెండు జట్లు ఈ మెగా వన్డే టోర్నీ టైటిల్ పోరులో తలపడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాడు కివీస్ టీమిండియాపై పైచేయి సాధించి ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలవగా.. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈసారి ఫైనల్ మామూలుగా ఉండబోదని ఇరుజట్ల అభిమానులు ఈ రసవత్తర పోరు కోసం ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడేటైటిల్ సమరంలో టీమిండియా తరఫున మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అవుతాడని అంచనా వేసిన ఈ మాజీ ఓపెనర్.. శుబ్‌మన్ గిల్ కూడా కీలకం కాబోతున్నాడని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈసారి కివీస్ బౌలర్లు ప్రధానంగా శ్రేయస్ అయ్యర్‌నే టార్గెట్ చేస్తారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి మాత్రమే 30 కంటే తక్కువ పరుగులు చేశాడనుకుంటా. అదొక్కటి మినహా ప్రతిసారీ అతడు కివీస్‌పై బాగానే రన్స్ రాబట్టాడు. కాబట్టి ఈసారి అతడినే ఎక్కువగా టార్గెట్ చేస్తారనిపిస్తోంది.మిడిల్ ఓవర్లలో వాళ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. మిచెల్ సాంట్నర్, బ్రాస్‌వెల్ లేదంటే రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్.. ఈ నలుగురే ఎక్కువగా బరిలోకి దిగవచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కదా! అందుకే అతడిని త్వరగా పెవిలియన్‌కు పంపేందుకు ఈ స్పిన్ బౌలర్లు ప్రయత్నిస్తారు. అతడిపైనే దృష్టి పెడతారు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో ఆటంటే శ్రేయస్‌కు మజాకాగా న్యూజిలాండ్‌తో వన్డేల్లో ఇప్పటి వరకు ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్.. సగటున 70.38తో 563 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇక కివీస్‌పై శ్రేయస్ అత్యల్ప స్కోరు 33. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా స్పందించాడు.ఇక ఓపెనింగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడం ద్వారా ఈ ఐసీసీ టోర్నీలో గిల్ బిగ్బ్యాంగ్తో ముందుకు వచ్చాడు. పాకిస్తాన్‌పై కూడా మెరుగ్గా ఆడాడు. అయితే, ఆ తర్వాత అతడు కాస్త వెనుకబడ్డాడు. ఫైనల్లో బ్యాట్ ఝులిపిస్తేనే జట్టుకు, అతడికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరో విరాట్ కావాలంటే గిల్ ఫైనల్లో తన ముద్రను వేయాలి. శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ గనుక రాణిస్తే చాంపియన్స్ ట్రోఫీ మనదే అని రాసిపెట్టుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. డబుల్ సెంచరీ వీరుడుకాగా కివీస్‌పై గిల్‌కు కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు కివీస్‌పై పదకొండు ఇన్నింగ్స్‌లో అతడు 592 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. హైదరాబాద్‌లో 2023లో డబుల్ సెంచరీ(208) కూడా కివీస్‌పైనే సాధించాడు. చదవండి: కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై? ఆటగాడిగా కొనసాగింపు? బీసీసీఐ నిర్ణయం? -
Mohammed Shami: ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆల్ ఇండియా ముస్లి జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు. అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్ అయి ఉండి.. మ్యాచ్ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్ తాగడం సరికాదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫరాంగి మాహిల్ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్ స్పష్టం చేశారు.షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదుఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.దేశానికే మొదటి ప్రాధాన్యం బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.చాంపియన్స్ ట్రోఫీతో బిజీకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్ గెలవాలి: మిల్లర్ -
కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై?.. బీసీసీఐ నిర్ణయం ఏమిటి?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందిఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు. అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే. అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్‌కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్‌కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.కోహ్లి గురించి కూడా చర్చ.. కానీఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరొందాడు.ఏకైక సారథిగా అరుదైన ఘనతగతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చారు. అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఇక ఇటీవల ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో విజయానంతరం గంభీర్‌కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
IND vs NZ: ఇది సరికాదు!.. ఫైనల్లో కివీస్ గెలవాలి: సౌతాఫ్రికా స్టార్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో తన మద్దతు న్యూజిలాండ్ జట్టుకేనని సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) అన్నాడు. టైటిల్ పోరులో తలపడే టీమిండియా- కివీస్ రెండూ పటిష్ట జట్లే అయినప్పటికీ తాను మాత్రం సాంట్నర్ బృందం వైపే ఉంటానని స్పష్టం చేశాడు. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం మిల్లర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ పట్ల అతడికి ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan) వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాతో మ్యాచ్‌ల కోసం గ్రూప్-‘ఎ’లో భాగమైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పాక్ నుంచి దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక రోహిత్ సేన సెమీస్ చేరడంతో గ్రూప్-బి నుంచి పోటీదారు ఎవరన్న అంశంపై ముందే స్పష్టత లేదు కాబట్టి ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా కూడా అరబిక్ దేశానికి రావాల్సి వచ్చింది.అయితే, గ్రూప్ దశలో ఆఖరిగా కివీస్‌పై విజయం సాధించిన భారత్.. గ్రూప్-ఎ టాపర్‌గా నిలవగా.. గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దుబాయ్‌లోనే ఉండిపోగా.. సౌతాఫ్రికా వెంటనే న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడేందుకు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చింది.ఈ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. ‘‘మా షెడ్యూల్ ఏమాత్రం బాగా లేదు. దుబాయ్‌కి ప్రయాణం గంటా 40 నిమిషాలే కావచ్చు. కానీ మేం వెళ్లక తప్పలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఆ రోజే సిద్ధమై సాయంత్రం దుబాయ్‌కు వెళ్లాం. సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాకిస్తాన్‌కు వచ్చాం’ అని మిల్లర్ అన్నాడు.ఇక ఫైనల్లో టీమిండియా- కివీస్ తలపడనున్న తరుణంలో.. ‘‘ప్రతి ఒక్క జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నిజానికి టీమిండియాతో మేము మరోసారి ఫైనల్ ఆడే పరిస్థితి ఉంటే ఎంతో బాగుండేది. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు. ఏదేమైనా ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్క ఆటగాడు కఠినశ్రమకు ఓర్చి అంకితభావంతో పనిచేస్తాడని చెప్పగలను. భారత్, న్యూజిలాండ్‌లు పటిష్టమైన జట్లే అయినా.. నిజాయితీగా చెప్పాలంటే.. నేను మాత్రం కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా’’ అని డేవిడ్ మిల్లర్ పేర్కొన్నాడు.కాగా రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. లాహోర్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ రికార్డు స్థాయిలో నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. దీంతో డేవిడ్ మిల్లర్ వీరోచిత, విధ్వంసకర శతకం వృథాగా పోయింది. మిల్లర్ 67 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా- సౌతాఫ్రికా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ప్రొటిస్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రోహిత్ సే న ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక... ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో చేతులెత్తేసి చోకర్స్‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా ఖాతాలో ఉన్న ఏకైక ఐసీసీ టైటిల్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే. 1998లో ప్రొటిస్ జట్టు విజేతగా నిలిచింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శనతో సెమీస్, ఫైనల్ చేరినా ఇంత వరకు ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. -
Axar Patel: ‘అక్షరా’లా అమూల్యం.. భారత జట్టులో స్థానం సుస్థిరం
అక్షర్ పటేల్ భారత జట్టు తరఫున 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే పదేళ్ల కాలంలో కేవలం 14 టెస్టులు, 57 వన్డేలు, 60 టి20లు మాత్రమే ఆడగలిగాడు. తనలాంటి లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కలగలిసిన సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా నీడలోనే అతను ఎక్కువ కాలం ఉండిపోవడమే అందుకు కారణం. జడేజా ఏదో కారణంతో జట్టుకు దూరమైతే తప్ప అక్షర్‌కు అవకాశం దక్కకపోయేది. కానీ గత ఏడాది కాలంలో పరిస్థితి మారింది. వన్డేలు, టి20ల్లో చక్కటి ప్రదర్శనలతో అతను జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. జడేజాతో పోలికలు వచ్చినా సరే... తనదైన శైలిలో రెండు విభాగాల్లోనూ వైవిధ్యాన్ని కనబరుస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ పోరు... 34 పరుగులకే జట్టు రోహిత్, పంత్, సూర్యకుమార్ వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో తీవ్ర ఒత్తిడి మధ్య ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగాడు. మరో ఎండ్‌లో కోహ్లిలాంటి దిగ్గజం ఉండగా అక్షర్ కీలక బాధ్యతలు తన భుజాన వేసుకున్నాడు. పాండ్యా, దూబే, జడేజాలాంటి ఆల్రౌండర్లను కాదని అక్షర్‌పై నమ్మకంతో కోచ్ ద్రవిడ్ ముందు పంపించాడు. దూకుడుగా ఆడి సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టే ఉద్దేశంతో వచ్చిన అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లితో కలిసి అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఇందులో కోహ్లి 23 బంతుల్లో ఒక్క బౌండరీ లేకుండా 21 పరుగులు చేస్తే... అక్షర్ ఒక ఫోర్, 4 సిక్స్‌లతో 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. చివరకు భారత్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో ఈ ఇన్నింగ్స్ విలువేమిటో అందరికీ తెలిసింది. ఆ మ్యాచ్ టీమిండియాలో అక్షర్ స్థాయిని పెంచింది. ఇప్పుడు దాదాపు ఏడాది కాలంగా అది కనిపిస్తోంది. 2021లో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ కోసం భారత్‌కు వచ్చింది. ఈ సిరీస్‌లో జడేజా గైర్హాజరులో 3 టెస్టులు ఆడిన అక్షర్ కేవలం 10.59 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. నిజానికి ఈ ప్రదర్శన అతనికి టెస్టు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేయాలి. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా అవకాశాలే తప్ప రెగ్యులర్‌గా బరిలోకి దిగలేదు. అలాంటి సమయంలో అక్షర్ వన్డేలు, టి20లపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. జడేజాతో పోలిస్తే అక్షర్ బంతిని ఎక్కువ టర్న్ చేయలేడు. అందుకే టెస్టులతో పోలిస్తే వన్డే, టి20లకు అవసరమైన నైపుణ్యాలను సానబెట్టుకున్నాడు. బౌలింగ్‌కు కాస్త పేస్ జోడించి ‘ఆర్మ్ బాల్’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే శైలితో ఫలితం సాధించాడు. దీని వల్ల కొన్నిసార్లు బ్యాటర్‌కు భారీ షాట్ ఆడే అవకాశం వచ్చినా... అదే ఉచ్చులో ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్‌కు అవకాశం ఉంటుంది. ఆ్రస్టేలియాతో సెమీఫైనల్లో మ్యాక్స్‌వెల్ వికెట్ దీనికి చక్కటి ఉదాహరణ. ఇదే సమయంలో తన బ్యాటింగ్‌లో మరింత సాధన చేశాడు. పరిమిత ఓవర్లలో భారీ షాట్లతో పరుగులు రాబట్టడంలో తన ప్రత్యేకత చూపించాలని అతను భావించాడు. అన్నింటికి మించి జడేజాతో ఫీల్డింగ్ విషయంలో సహజంగానే పోలిక వచ్చింది. ఇందులోనూ ప్రత్యేక సాధన చేసి తాను ఫీల్డింగ్‌లోనూ చురుకైన వాడినేనని నిరూపించుకోవడం అతనికి వన్డేలు, టి20ల్లో మరిన్ని అవకాశాలు కల్పించింది. టి20 వరల్డ్ కప్‌లో అందరికీ సూర్యకుమార్ క్యాచ్ బాగా గుర్తుండిపోవచ్చు. అంతకుముందు ఆసీస్‌తో మ్యాచ్‌లో మార్ష్ క్యాచ్‌ను బౌండరీ వద్ద అక్షర్ ఒంటిచేత్తో అందుకున్న తీరు అద్భుతం. ఇక జడేజా రిటైర్మెంట్తో టి20ల్లో అతని స్థానం సుస్థిరమైంది. బ్యాటర్‌గానే తన కెరీర్ మొదలు పెట్టిన అక్షర్ తనలోని అసలైన బ్యాటర్‌ను గత కొంత కాలంగా బయటకు తెచ్చాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా అతని దానికి పూర్తి న్యాయం చేకూరుస్తున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అతనికి అలాంటి అవకాశం ఇచ్చింది. వాటిని చాలా వరకు అక్షర్ సమర్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు భారత జట్టు అవసరాలరీత్యా అతనికి ఐదో స్థానంలో ఆడే అవకాశం దక్కుతోంది. వన్డేల్లో రాహుల్‌కే కీపర్‌గా తొలి ప్రాధాన్యత లభిస్తుండటంతో పంత్‌కు చోటు ఉండటం లేదు. దాంతో టాప్–6లో అంతా కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అక్షర్‌ను మేనేజ్మెంట్ ఐదో స్థానంలో పంపిస్తోంది. అది చక్కటి ఫలితాలను కూడా అందించింది. అక్షర్ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ అంశం అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే తీరు. ముఖ్యంగా డీప్ మిడ్ వికెట్ మీదుగా స్లాగ్ స్వీప్‌తో అతను పెద్ద సంఖ్యలో పరుగులు రాబడుతున్నారు. అలవోకగా సిక్స్‌లు కొడుతున్న అతని నైపుణ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. టి20 వరల్డ్ కప్ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతను తొలిసారి ఐదో స్థానంలో ఆడాడు. అక్షర్ వరుసగా 44, 52, 41 నాటౌట్, 8, 42, 27 పరుగులు సాధించాడు. ఒక బ్యాటర్‌గా చూస్తే ఇవన్నీ అద్భుత గణాంకాలు కాకపోయినా... ఆల్‌రౌండర్ కోణంలో, పైగా తక్కువ స్కోర్ల మ్యాచ్‌లలో ఈ స్కోర్లన్నీ అమూల్యమైనవే. ఇప్పుడు టీమిండియాలో అన్ని విధాలా ఆధారపడదగ్గ ప్లేయర్‌గా మారిన అక్షర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించగలడు. -
Champions Trophy 2025: ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించబోయే అంపైర్ల పేర్లను ఐసీసీ ఇవాళ (మార్చి 6) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ అనుభవజ్ఞులైన మ్యాచ్ అఫీషియల్స్‌ను ఎంపిక చేసింది. ఈ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వ్యవహరించనున్నారు. థర్డ్ అంపైర్‌గా జోయల్ విల్సన్ విధులు నిర్వహించనున్నాడు. ఫోర్త్ అంపైర్‌గా కుమార ధర్మసేన.. మ్యాచ్ రిఫరీగా రంజన్ మదుగలే వ్యవహరించనున్నారు. ఫైనల్ మ్యాచ్ అంపైర్లలో పాల్ రీఫిల్ సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో సెమీస్‌లో ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించగా.. ఇల్లింగ్‌వర్త్, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌కు ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. నాలుగు సార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన ఇల్లింగ్‌వర్త్.. 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లోనూ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు. ఇల్లింగ్‌వర్త్.. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌కు కూడా ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరగా.. న్యూజిలాండ్ రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో (2019-2021) రెండో సారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తాము గెలిచిన రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
CT 2025 Final IND vs NZ: విజేతను తేల్చేది ఆ ఇద్దరే!
ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) క్రికెట్ టోర్నమెంట్లో టీమిండియాను ఢీ కొట్టేందుకు న్యూజిలాండ్ సిద్ధంగా ఉంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టులోని భారత సంతతి బ్యాటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra), మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) సెంచరీలు సాధించారు.రికార్డ్-బ్రేకర్ల మధ్య ఉత్కంఠమైన పోటీఇక టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌కు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఓ ఆసక్తికర పోటీ చూడబోతున్నాం. ఫ్యాబ్ ఫోర్లో భాగమైన కేన్ విలియమ్సన్ , విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అనేక రికార్డులు బద్దలు కొడుతున్నారు. మార్చి 9 ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈ ఇద్దరు గొప్ప బ్యాటర్ల మధ్య జరిగే పోటీని ప్రధాన పోరుగా అభివర్ణించవచ్చు.ఎందుకంటే జట్టులో వీరిద్దరిదీ బాధ్యత ఒక్కటే. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక వైపు దృఢంగా నిలబడడం లేదా కాపు కాయడం. పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం. దీని ద్వారా ప్రత్యర్థి బౌలర్లకు బ్యాటర్‌పై పట్టు సాధించుకుండా నిరోధించడం. ఇందుకోసం వీరిద్దరూ ఆఖరి ఓవర్ వరకూ బ్యాటింగ్ చేయాలని చూస్తారు. విజేతను తేల్చేది ఆ ఇద్దరే!ఈ ప్రయత్నం లో వీరిద్దరూ సఫలమైతే వారి జట్టుకి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరూ వారి జట్లలో ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థమైపోతుంది.ఇక మంగళవారం దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఆడిన తీరు అందరికీ తెలిసిందే. కోహ్లీ ఎంతో నింపాదిగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముక గా నిలిచాడు. కోహ్లీ.. శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్‌లతో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.కివీస్ విజయంలో కేన్ పాత్రదక్షిణాఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా కేన్ అదే రీతిలో ఆడాడు. విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఇద్దరూ సెంచరీలు సాధించి తమ జట్టు 362/6 పరుగుల భారీ స్కోరును చేరుకోవడానికి సహాయపడ్డారు. రవీంద్ర 108 పరుగులు చేయగా, విలియమ్సన్ తన 102 పరుగులు సాధించాడు. ఈ జంట రెండవ వికెట్‌కు ఏకంగా 164 పరుగులు జోడించి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.ఈ ఇన్నింగ్స్ లో భాగంగా 34 ఏళ్ల కేన్ విలియమ్సన్ 19000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డును సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా ఖ్యాతి వహించాడు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (432 ఇన్నింగ్స్), బ్రియాన్ లారా (433 ఇన్నింగ్స్) తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో ఈ రికార్డ్ ని వేగవంతంగా సాధించిన వారిలో విలియమ్సన్ నాలుగో వాడు. ఈ ఘనతను నమోదు చేయడానికి న్యూజిలాండ్ దిగ్గజం 440 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. అతను వన్డే ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్ల ల లో 16వ స్థానంలో ఉన్నాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీభారత్ ‘రన్ మెషిన్’గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 301 వన్డే మ్యాచ్‌ల్లో సగటు 58.11 సగటుతో 14,180 పరుగులు చేశాడు, ఇందులో 51 సెంచరీలు మరియు 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ స్ట్రైక్ రేట్ 93.35.వన్డేల్లో కేన్ విలియమ్సన్ఎప్పడూ ప్రశాంతంగా, నిబ్బరంగా బ్యాటింగ్ చేసే విలియమ్సన్ 172 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 49.47 సగటు తో 81.72 స్ట్రైక్ రేట్‌తో 7,224 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు మరియు 47 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ ఇద్దరు స్టార్లలో ఎవరు ఫైనల్లో పైచేయి సాధిస్తారన్న దాని పైనే టైటిల్ విజేత నిర్ణయించబడుతుందనడం లో సందేహం లేదు. గణాంకాల ఆధారంగా చుస్తే విరాట్ కోహ్లీ మరింత ఆధిపత్యం చెలాయించే అవకాశం కనిపిస్తుంది. కానీ మ్యాచ్ ఫైనల్ మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగడం ఖాయం. మరి ఫైనల్ మ్యాచ్ లో వీరిద్దరి లో ఎవరు మెరుస్తారో మ్యాచ్ రోజున స్పష్టంగా తెలుస్తుంది.చదవండి: అతడిని స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడుతున్నారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
వాళ్లిద్దరు అద్భుతం.. టీమిండియాపై ఒత్తిడి పెంచాం: సాంట్నర్ వార్నింగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. సమిష్టి ప్రదర్శనను సౌతాఫ్రికా(New Zealand vs South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువచ్చింది. తొలుత భారీ స్కోరు చేయడంతో పాటు దానిని కాపాడుకోవడంలోనూ సఫలమై అత్యద్భుత విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra- 101 బంతుల్లో 108)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102) శతకాలతో చెలరేగగా.. డారిల్ మిచెల్(37 బంతుల్లో 49), గ్లెన్ ఫిలిప్స్(27 బంతుల్లో 49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో న్యూజిలాండ్ ఏకంగా 362 పరుగులు సాధించింది. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్(17) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా అర్ద శతకం(71 బంతుల్లో 56) చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్ కూడా హాఫ్ సెంచరీ(66 బంతుల్లో 69) రాణించాడు.మిల్లర్ విధ్వంసంవీరంతా స్లో ఇన్నింగ్స్ ఆడగా డేవిడ్ మిల్లర్ మాత్రం ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లో పది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. యాభై పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమిపాలైన ప్రొటిస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. న్యూజిలాండ్- టీమిండియాతో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయానంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టును ప్రశంసిస్తూనే భారత్‌తో మ్యాచ్‌కు తాము సంసిద్ధంగానే ఉన్నామనే సంకేతాలు ఇచ్చాడు. ‘‘పటిష్ట జట్టుతో పోటీపడి గెలవడం సంతోషంగా ఉంది. తదుపరి టీమిండియాతో ఆడబోతున్నాం.రచిన్ , విలియమ్సన్ అద్భుతంగ్రూప్ దశలోనూ రోహిత్ సేనను మీ ఢీకొట్టాం. అయితే, ఈసారి ఫైనల్ వేరుగా ఉంటుంది. మాకైతే కాస్త విరామం దొరికింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెడతాం. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఆడిన తీరు అద్భుతం.అయితే, ఇక్కడ 320 పరుగుల స్కోరు సరిపోదని మేము భావించాం. కనీసం 350 రన్స్ దాటితేనే మ్యాచ్ మా చేతుల్లో ఉంటుందని భావించాం. రచిన్- విలియమ్సన్ భారీ భాగస్వామ్యం ఇందుకు బాటలు వేసింది.అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు వికెట్లు తీయడం కలిసివచ్చింది. అయినా సరే సౌతాఫ్రికా మాకు సవాలు విసిరింది. ఎట్టకేలకు విజయం మాత్రం మమ్మల్నే వరించింది’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఒత్తిడిలోకి నెట్టగలిగాముఇక టీమిండియా చేతిలో గత మ్యాచ్‌లో ఓటమి గురించి ప్రస్తావిస్తూ.. ‘‘దుబాయ్‌లో మేము ఓడిపోయాం. అయితే, అక్కడే మ్యాచ్‌లు ఆడుతున్న వారిని మేము ఒత్తిడిలోకి నెట్టగలిగాము. టాపార్డర్‌ను మా వాళ్లు పడగొట్టారు’’ అంటూ తాము తక్కువేమీ కాదన్నట్లుగా రోహిత్ సేనకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. కాగా దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది. చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనంSouth Africa's last man standing! 👊David Miller is keeping the fight on from one end ⚔#ChampionsTrophyOnJioStar 👉 #SAvNZ | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start watching FREE on JioHotstar pic.twitter.com/EkhEIpvEI0— Star Sports (@StarSportsIndia) March 5, 2025 -
25-30 పరుగులు చేస్తే చాలా?: గంభీర్‌కు టీమిండియా దిగ్గజం కౌంటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఫైనల్లో దూకుడు వద్దని.. సంయమనంతో ఆడాలని సూచించాడు. అదే విధంగా.. రోహిత్ బ్యాటింగ్ శైలిని సమర్థిస్తూ హెడ్‌కోచ్ గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని సన్నీ కుండబద్దలు కొట్టాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే.తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను టీమిండియా.. రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించాయి. ఈ క్రమంలో దుబాయ్‌లో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా- న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వన్డే టోర్నమెంట్‌కు ఆతిథ్యం దేశం పాకిస్తాన్ అయినప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోన్న విషయం తెలిసిందే.ఒక్క ఫిఫ్టీ కూడా లేదుగ్రూప్ దశలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన భారత్.. సెమీస్‌లోనూ సత్తా చాటి అజేయంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అంతాబాగానే ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాత్రం ఇంత వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన రాలేదు. నాలుగు మ్యాచ్‌లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా... 41(36 బంతుల్లో), 20(15 బంతుల్లో), 15(17 బంతుల్లో), 28(29 బంతుల్లో).దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్, భవిష్యత్‌పై విమర్శలు రాగా.. గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. అద్భుతమైన టెంపోతో ఆడుతున్న హిట్‌మ్యాన్ జట్టుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడని పేర్కొన్నాడు.గంభీర్ వ్యాఖ్యలతో ఏకీభవించని గావస్కర్ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌గా అతడు జట్టును ప్రభావితం చేస్తున్నాడన్నది నిజమే. అయితే, బ్యాటర్‌గా 25-30 పరుగులు మాత్రమే చేస్తే తన ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా ఉంటాడా? ఓ బ్యాటర్‌గా అదొక లోటే.జట్టుపై నీ ఆట తీరుతో ప్రభావం చూపడం ఎంత ముఖ్యమో.. బ్యాటర్‌గా ఓ 25 ఓవర్ల పాటు క్రీజులో నిలబడితే మరింత గొప్పగా ప్రభావితం చేయవచ్చు. ఏడు, ఎనిమిది, తొమ్మిది ఓవర్లపాటే ఆడితే మజా ఏం ఉంటుంది?వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట.. కానీదూకుడుగా ఆడటం మంచిదే కావొచ్చు. కానీ.. కొన్నిసార్లు అది బెడిసికొట్టవచ్చు. నిజానికి రోహిత్ గనుక 25- 30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. టీమిండియా సగం ఇన్నింగ్స్ తర్వాత 180- 200 పరుగులకు చేరుకుంటుంది. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకునే సత్తా రోహిత్‌కు ఉంది. అతడొక ప్రతిభావంతుడైన బ్యాటర్.వైవిధ్యభరిత షాట్లు ఆడటంలో దిట్ట. అయితే, గత వన్డే వరల్డ్‌కప్ నుంచి రోహిత్ శైలి పూర్తిగా మారిపోయింది, దూకుడుగా ఆడేందుకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఈ విషయంలో విజయవంతమైనా.. కీలక మ్యాచ్‌లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడటం మంచిది’’ అని న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు ముందు గావస్కర్ రోహిత శర్మకు సూచించాడు.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డుఇదిలా ఉంటే.. నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ జట్టును ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీలు.. అదే విధంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఈ ఘనత సాధించాడు.చదవండి: ‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్ -
‘లాహోర్‌లో ఫైనల్ జరిగితే బాగుండేది’.. బీసీసీఐ స్ట్రాంగ్ రియాక్షన్
టీమిండియా విజయాలను తక్కువ చేసే విధంగా మాట్లాడేవారికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) నిర్ణయానుసారమే భారత్ దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతోందన్నారు. గెలుపు కోసం పిచ్‌లపై ఆధారపడే దుస్థితిలో టీమిండియా లేదని.. వేదిక ఒకటే అయినా వేర్వేరు పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని శుక్లా పేర్కొన్నారు.అజేయంగా ఫైనల్కుఅదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ఫైనల్ లాహోర్‌లో జరిగితే బాగుండేదన్న పాకిస్తాన్ జర్నలిస్టు ప్రశ్నకు రాజీవ్ శుక్లా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడేలా రోహిత్ సేనకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ నుంచి పోటీపడిన టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. కానీ, ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియాకు అదనపు ప్రయోజనాలు చేకూరుతున్నాయని ఇంగ్లండ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు ప్రముఖంగా గళం వినిపించారు.ఐసీసీ నిబంధన ప్రకారమేఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు హాజరైన రాజీవ్ శుక్లా పైవిధంగా స్పందించారు. అదే విధంగా.. భారత్- పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘భారత ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటాము. పాక్ క్రికెట్ బోర్డు కూడా వారి ప్రభుత్వం చెప్పినట్లే చేస్తుంది.ఇరుజట్లు.. ఒకరి దేశంలో మరొకరు ఆడితే చూడాలని భారత్- పాక్ అభిమానులు కోరుకుంటున్నారని మాకు తెలుసు. అయితే, పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఐసీసీలో ఒక నిబంధన ఉంది. ప్రభుత్వాల సమ్మతితోనే బోర్డులు ముందుకు వెళ్లాలి. బీసీసీఐ, పీసీబీ ఆ నిబంధనను పాటిస్తున్నాయి.అయితే, భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రతీ దేశం దాయాదుల పోరుకు ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇదొక శుభపరిణామం. టోర్నీ సజావుగా సాగేలా చేశారు’’ అని రాజీవ్ శుక్లా పీసీబీని ప్రశంసించారు.ఆసీస్ ఓడిపోయింది కదా!ఇక లాహోర్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగితే బాగుండేది కదా అని ఓ పాకిస్తాన్ జర్నలిస్తు రాజీవ్ శుక్లాను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరన్నట్లు జరగాలంటే ఆస్ట్రేలియా గెలిచి ఉండాల్సింది. కానీ వాళ్లు ఓడిపోయారు కద! అందుకే ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోనే జరుగబోతోంది’’ అని రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు.ఇక ఆసియా కప్ షెడ్యూలింగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఆసియా క్రికెట్ మండలి నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. ఆసియా కప్ గురించి చర్చించేందుకు కూడా నేను ఇక్కడకు వచ్చాను. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ విషయంలో సహకరిస్తున్నారు’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్... గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడగా.. భారత్- న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా సెమీస్ చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను కివీస్ ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
టీమిండియాతో ఫైనల్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్(IND vs NZ) అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది కివీస్.అయితే ఈ తుదిపోరుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ(Matt Henry) గాయం బారిన పడ్డాడు. లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో హెన్రిస్ క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో వచ్చినప్పటికి తన సెకెండ్ స్పెల్‌లో కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ మాత్రమే వేశాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన హెన్రీ.. 43 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం హెన్రీ గాయంపై కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సైతం కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. "హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, అతడి గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి అన్నట్లు శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి.అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వ్యవహరించిన తీరును కివీస్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తప్పుబట్టాడు. వికెట్ కోసం అప్పీలు చేసే క్రమంలో జడ్డూ ప్రవర్తించిన విధానం సరికాదని.. అంపైర్ అతడికి హెచ్చరికలు జారీ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి మ్యాచ్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్‌తో తలపడిన విషయం తెలిసిందే.శ్రేయస్ అద్భుత అర్ధ శతకందుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్(India vs New Zealand) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(15), శుబ్‌మన్ గిల్(2), విరాట్ కోహ్లి(11) విఫలం కాగా.. మిడిలార్డర్ రాణించింది.నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధ శతకం(98 బంతుల్లో 79) సాధించగా.. అక్షర్ పటేల్(42), హార్దిక్ పాండ్యా(45) రాణించారు. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిగతా వారిలో కైలీ జెమీసన్, విలియం ఓ రూర్కీ, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ సాధించారు.విలియమ్సన్ హాఫ్ సెంచరీఇక 250 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసి కివీస్ జట్టు ఆలౌట్ అయింది. రచిన్ విఫలం(6) కాగా.. విలియమ్సన్ హాఫ్ సెంచరీ(81) చేయగా.. ఓపెనర్ విల్ యంగ్(22), మిచెల్ సాంట్నర్(28) మాత్రమే ఇరవై పరుగుల మార్కు అందుకోగా.. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు.భారత బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించగా.. కుల్దీప్ యాదవ్ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. పేసర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్‌ను అవుట్ చేసే క్రమంలో జడేజా వ్యవహరించిన తీరును కామెంటేటర్ సైమన్ డౌల్ విమర్శించాడు.కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన జడ్డూ రెండో బంతిని అద్భుతంగా సంధించాడు. అతడి స్పిన్ మాయాజాలంలో చిక్కుకున్న లాథమ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం కాగా.. బంతి అతడి తొడకు తాకింది. లేదంటే బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టేదే. ఈ నేపథ్యంలో అంపైర్ లాథమ్‌ను లెగ్ బిఫోర్ వికెట్‌గా ప్రకటించగా అతడు పెవిలియన్ చేరాడు.ఇదేం పని? ఆటగాడు ఇలా చేయొచ్చా?అయితే, లాథమ్ విషయంలో జడేజా పిచ్ మధ్య వరకు వచ్చి అప్పీలు చేయడం సరికాదంటూ సైమన్ డౌల్ కామెంట్రీలో పేర్కొన్నాడు. ‘‘అతడు ఏం చేశాడో చూడండి. ఆటగాళ్లు ఇలా చేయవచ్చా? అతడిని అంపైర్ హెచ్చరించి ఉండాల్సింది’’ అని డౌల్ అభిప్రాయపడ్డాడు. అసలు ఆటగాడు పిచ్ మధ్యలోకి రావడం ఏమిటంటూ అసహనం వెళ్లగక్కాడు. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఇక అంతకుముందు ఇదే గ్రూపులో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లను టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే. ఇదే జోరులో... దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్‌లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకువెళ్లాలని పట్టుదలగా ఉంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్‌ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్‌గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్‌కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్‌గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025 -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ స్టేజిని భారత్ విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ విజయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) స్పిన్ మాయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.అతడిని ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చక్రవర్తి ఓవరాల్‌గా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన వరుణ్..అంతర్జాతీయ వన్డేల్లో మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్న భారత బౌలర్‌గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన మూడో వన్డేలో కేవలం 4 పరుగులిచ్చి 6 వికెట్లతో చెలరేగాడు.తాజా మ్యాచ్‌తో బిన్నీ అల్‌టైమ్ రికార్డును చక్రవర్తి అధిగమించాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్‌గా ఈ తమిళనాడు స్పిన్నర్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఈ ఫీట్‌ను అందుకున్నారు.సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ..ఇక మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి 2023 వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి బదలు తీర్చుకోవాలని కసితో రోహిత్ సేన ఉంది. ప్రస్తుతం భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. అయితే సెమీస్‌లో కూడా నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందా లేదా హర్షిత్ రాణాను మళ్లీ తుది జట్టులోకి తీసుకువస్తుందో వేచి చూడాలి.కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రాణాకు విశ్రాంతి ఇచ్చిన టీమ్ మెనెజ్‌మెంట్.. వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చింది. అయితే జట్టులోకి వచ్చిన వరుణ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం నలుగురు స్పిన్నర్లతో భారత్ ఆడింది. మొత్తం నలుగురు స్పిన్నర్లు కూడా తమ మార్క్‌ను చూపించారు. దీంతో తుది జట్టు కూర్పు భారత్‌కు సవాలుగా మారింది. అంతకు తోడు మహ్మద్ షమీ కూడా అంత రిథమ్‌లో కన్పించడం లేదు. మరి భారత జట్టు మెనెజ్‌మెంట్ ఏమి నిర్ణయం తీసుకుంటుందో మరో 24 గంటలకు వేచి చూడక తప్పదు.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్ -
కుప్పకూలిన న్యూజిలాండ్..44 పరుగులతో టీమిండియా గెలుపు (ఫొటోలు)
-
Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ
చాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్‌లలో 229, 242 పరుగుల లక్ష్యాలను భారత్ అలవోకగా ఛేదించింది. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. న్యూజిలాండ్ పదునైన బౌలింగ్ ముందు భారీ స్కోరు చేయడం కష్టంగా మారింది. టాప్–3 బ్యాటర్లు 30 పరుగులకే వెనుదిరగ్గా... చివరకు టీమిండియా 249 పరుగులకే పరిమితమైంది. ఈ స్కోరును నిలబెట్టుకోగలదా అనే సందేహాలు... అయితే మన స్పిన్నర్లు విన్నర్లుగా మారారు... భారత స్పిన్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడిన కివీస్ ఓటమిని ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆడిన ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి ముందుండి నడిపించగా... కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజయంలో తలా ఓ చేయి వేశారు. ఇక భారత జట్టుకు అసలైన సవాల్ మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రూపంలో ఎదురవుతోంది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే వన్డే మ్యాచ్‌లో తలపడనుండగా... బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఎదుర్కొంటుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ లీగ్ దశను అజేయంగా ముగించింది. సెమీఫైనల్ స్థానం ఖాయమైపోయిన తర్వాత ఆడిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలిచిన టీమిండియా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అయ్యర్, అక్షర్ నాలుగో వికెట్‌కు 22.4 ఓవర్లలో 98 పరుగులు జోడించారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (120 బంతుల్లో 81; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/42) తన కెరీర్లో రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మంగళవారం ఇదే మైదానంలో జరిగే తొలి సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ బుధవారం లాహోర్‌లో జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్ ‘బి’ టాపర్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. కీలక భాగస్వామ్యం... హెన్రీ, జేమీసన్ స్వింగ్ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో ఆరంభంలో పరుగులు చేయడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 15 పరుగుల వ్యవధిలో గిల్ (7 బంతుల్లో 2), రోహిత్ (17 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కోహ్లి (14 బంతుల్లో 11; 2 ఫోర్లు) వెనుదిరిగారు. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కోహ్లి బలంగా షాట్ కొట్టగా... గాల్లోకి ఎగురుతూ గ్లెన్ ఫిలిప్స్ అత్యద్భుతంగా క్యాచ్ అందుకున్న తీరు హైలైట్‌గా నిలిచింది. తన 300వ వన్డేలో తక్కువ స్కోరుకే అవుటై కోహ్లి నిరాశగా మైదానం వీడాడు. 30/3 వద్ద ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు అయ్యర్, అక్షర్ ప్రయత్నించారు. క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఆడటంతో ఒక దశలో వరుసగా 51 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే ఆ తర్వాత స్కోరు వేగం కాస్త పెరిగింది. రూర్కే ఓవర్లో 3 ఫోర్లు కొట్టి ధాటిని ప్రదర్శించిన అయ్యర్ 75 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌ను అవుట్ చేసి రచిన్ ఈ జోడీని విడదీయగా... 10 పరుగుల వ్యవధిలో అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 23; 1 ఫోర్) పెవిలియన్ చేరారు. జడేజా (20 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే చివర్లో పాండ్యా మెరుపు బ్యాటింగ్‌తో భారత్ 250 పరుగులకు చేరువగా రాగలిగింది. జేమీసన్ ఓవర్లో పాండ్యా వరుసగా 4, 4, 6 బాదాడు. భారత్ ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ హర్షిత్ రాణాకు విశ్రాంతినిస్తూ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంది. విలియమ్సన్ మినహా... ఛేదనలో కివీస్‌కు సరైన ఆరంభం లభించలేదు. అక్షర్ చక్కటి క్యాచ్‌తో రచిన్ రవీంద్ర (12 బంతుల్లో 6)ను అవుట్ చేయడంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం లేకపోయింది. ఒకవైపు విలియమ్సన్ పట్టుదలగా నిలబడినా... మరో ఎండ్‌లో బ్యాటర్లంతా వరుస కట్టి పెవిలియన్ చేరారు. భారత స్పిన్నర్ల బంతులను అర్థం చేసుకోలేక వరుసగా నలుగురు బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరడం విశేషం. మిచెల్ (35 బంతుల్లో 17; 1 ఫోర్), లాథమ్ (20 బంతుల్లో 14), ఫిలిప్స్ (8 బంతుల్లో 12; 1 సిక్స్), బ్రేస్‌వెల్ (3 బంతుల్లో 2) విఫలం కాగా... మరో ఎండ్‌లో 77 బంతుల్లో విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తయింది. 40 ఓవర్లలో కివీస్ స్కోరు 165/6. మరో 60 బంతుల్లో 85 పరుగులు చేయాలి. చేయాల్సిన రన్‌రేట్ పెరిగి పోతుండగా ఒత్తిడిలో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్ అక్షర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు వ్యక్తిగత స్కోర్లు 1, 32, 68 వద్ద రాహుల్ (రెండు), వరుణ్ క్యాచ్‌లు వదిలేయడంతో విలియమ్సన్ బతికిపోయాడు. మాజీ కెప్టెన్ అవుటవ్వడంతో కివీస్ గెలుపుపై ఆశలు వదిలేసుకుంది. చివర్లో కెపె్టన్ మైకేల్ సాంట్నర్ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా లాభం లేకపోయింది. 54 పరుగుల తేడాతో ఆ జట్టు చివరి 6 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) జేమీసన్ 15; గిల్ (ఎల్బీ) (బి) హెన్రీ 2; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 11; అయ్యర్ (సి) యంగ్ (బి) రూర్కే 79; అక్షర్ (సి) విలియమ్సన్ (బి) రచిన్ 42; రాహుల్ (సి) లాథమ్ (బి) సాంట్నర్ 23; పాండ్యా (సి) రచిన్ (బి) హెన్రీ 45; జడేజా (సి) విలియమ్సన్ (బి) హెన్రీ 16; షమీ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 5; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 249. వికెట్ల పతనం: 1–15, 2–22, 3–30, 4–128, 5–172, 6–182, 7–223, 8–246, 9–249. బౌలింగ్: హెన్రీ 8–0–42–5, జేమీసన్ 8–0–31–1, రూర్కే 9–0–47–1, సాంట్నర్ 10–1–41–1, బ్రేస్‌వెల్ 9–0–56–0, రచిన్ 6–0–31–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) వరుణ్ 22; రచిన్ (సి) అక్షర్ (బి) పాండ్యా 6; విలియమ్సన్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 81; మిచెల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 17; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (ఎల్బీ) (బి) వరుణ్ 12; బ్రేస్‌వెల్ (ఎల్బీ) (బి) వరుణ్ 2; సాంట్నర్ (బి) వరుణ్ 28; హెన్రీ (సి) కోహ్లి (బి) వరుణ్ 2; జేమీసన్ (నాటౌట్) 9; రూర్కే (బి) కుల్దీప్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 205. వికెట్ల పతనం: 1–17, 2–49, 3–93, 4–133, 5–151, 6–159, 7–169, 8–195, 9–196, 10–205. బౌలింగ్: షమీ 4–0–15–0, పాండ్యా 4–0–22–1, అక్షర్ 10–0–32–1, వరుణ్ 10–0–42–5, కుల్దీప్ 9.3–0–56–2, జడేజా 8–0–36–1. -
CT 2025: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్‌కు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్‌లో ఫలితంతో రెండో సెమీస్‌లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్‌లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్‌పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
CT 2025: ఐదేసిన వరుణ్.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.రాణించిన శ్రేయస్, హార్దిక్, అక్షర్తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.ఐదేసిన వరుణ్250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి భారత్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. వీరందరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, బ్రేస్‌వెల్ 2, మ్యాట్ హెన్రీ 2, విలియమ్ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (28) బ్యాట్ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
Champions Trophy 2025: ఎవరికీ సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ బౌలర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఇవాళ (మార్చి 2) తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే ఈ మెగా టోర్నీలో భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8-0-42-5) నమోదు చేసిన కివీస్ బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు5/42 - మాట్ హెన్రీ, 20254/25 - నవీద్-ఉల్-హసన్, 20044/36 - షోయబ్ అక్తర్, 20044/62 - డగ్లస్ హోండో, 2002ఈ మ్యాచ్‌లో హెన్రీ కీలకమైన శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా వికెట్లతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వికెట్లు తీశాడు. స్కోర్ 15 పరుగుల వద్ద ఉండగానే గిల్‌ను ఔట్ చేసిన హెన్రీ భారత్‌ను తొలి దెబ్బ తీశాడు. అనంతరం గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్‌ను ఔట్ చేసి టీమిండియా కష్టాలను మరింత అధికం చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ను ఔట్ చేసి భారత్ భారీ స్కోర్ చేయకుండా కళ్లెం వేశాడు. ఒక్కో పరుగు కీలకమైన తరుణంలో స్ట్రయిక్ రొటేట్ చేస్తున్న రవీంద్ర జడేజాను ఔట్ చేశాడు. చివరిగా షమీని ఔట్ చేసి కెరీర్లో మూడో ఐదు వికెట్ల ఘనతను నమోదు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.అనంతరం 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉంది. ఆ జట్టు 37 ఓవర్ల అనంతరం సగం వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 78 బంతుల్లో 91 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కేన్ విలియమ్సన్ (76) క్రీజ్‌లో పాతుకుపోయాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. విలియమ్సన్కు జతగా బ్రేస్‌వెల్ క్రీజ్‌లో ఉన్నాడు. -
Champions Trophy 2025: టీమిండియా మేనేజర్ ఇంట విషాదం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆర్ దేవరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దేవరాజ్ తల్లి కమలేశ్వరి ఇవాళ (మార్చి 2) ఉదయం మృతి చెంచారు. దీంతో దేవరాజ్ భారత బృందాన్ని వదిలి హైదరాబాద్‌కు బయల్దేరారు. దేవరాజ్ తిరిగి టీమిండియాతో కలుస్తారా లేదా అన్నది అస్పష్టంగా ఉంది. మంగళవారం జరిగే సెమీఫైనల్ ఫలితంపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది. దేవరాజ్ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దేవరాజ్ తల్లి మృతి పట్ల హెచ్‌సీఏ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో తెలిపింది. దేవరాజ్ ఇటీవలే టీమిండియా మేనేజర్ ఎంపికయ్యారు.ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) మాత్రమే రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
CT 2025, IND VS NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని ఘనత సొంతం
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) ఖాతాలో మరో వరల్డ్ రికార్డు (World Record) చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో 300 వన్డేల మైలురాయిని తాకిన విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100కు పైగా టెస్ట్‌లు, 100కు పైగా టీ20లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో ఏ ఇతర క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు. విరాట్ ఇప్పటివరకు 300 వన్డేలు, 123 టెస్ట్‌లు, 125 టీ20లు ఆడాడు. భారత్ తరఫున 300 వన్డేలు ఆడిన ఏడో క్రికెటర్‌గా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌కు ముందు సచిన్ టెండూల్కర్ (463), ఎంఎస్ ధోని (350), రాహుల్ ద్రవిడ్ (344), మహ్మద్ అజారుద్దీన్ (334), సౌరవ్ గంగూలీ (311), యువరాజ్ సింగ్ (304) భారత్ తరఫున 300 వన్డేల మైలురాయిని తాకారు.కాగా, విరాట్ తన 300 వన్డేలో కేవలం 11 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని క్యాచ్‌తో విరాట్‌ను పెవిలియన్‌కు పంపాడు. గత మ్యాచ్‌లో విరాట్ పాకిస్తాన్‌పై సూపర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విరాట్ 52 పరుగులు చేసుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కేవాడు. ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఛాంపియన్స్ ట్రోఫీలో 13 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు చేశాడు. ప్రస్తుతం (ఈ మ్యాచ్‌తో కలుపుకుని) విరాట్ ఖాతాలో 662 పరుగులు ఉన్నాయి (ఛాంపియన్స్ ట్రోఫీలో).ఓవరాల్‌గా విరాట్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో సచిన్ (18426), సంగక్కర (14234) మత్రమే విరాట్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. విరాట్ ఇప్పటివరకు 288 ఇన్నింగ్స్‌లు ఆడి 14096 పరుగులు చేశాడు. విరాట్ ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. పాక్‌పై సెంచరీతో వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య 51కి చేరింది. ప్రపంచ క్రికెట్లో ఇన్ని సెంచరీలు (50కిపైగా) ఎవరూ చేయలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్రీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ సెమీస్‌లో ఏ జట్టును ఢీకొట్టబోతుందో తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్‌లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. గెలిస్తే ఆస్ట్రేలియాను ఢీకొట్టాల్సి ఉంటుంది. -
CT 2025, IND VS NZ: గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్.. కోహ్లికి ఫ్యూజులు ఔట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరుగతున్న మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పరుగులు నియంత్రించడంతో పాటు పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. కివీస్ స్టార్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్ పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కెరీర్లో 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లిని ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc)కోహ్లి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌ను ఫిలిప్స్ నమ్మశకంకాని క్యాచ్‌గా మలిచాడు. కుడివైపు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. కోహ్లి ఆడిన షాట్‌కు ఫిలిప్స్ సెకెన్ల వ్యవధిలో రియాక్టయ్యాడు. ఈ క్యాచ్‌ను చూసి కోహ్లి సహా మైదానంలో ఉన్న వారంతా నివ్వెరపోయారు. కోహ్లి సతీమణి అనుష్క అయితే తలపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో మరో అద్భుతమైన క్యాచ్ కూడా నమోదైంది. రవీంద్ర జడేజాను కేన్ విలియమ్సన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మ్యాట్ హెన్నీ (8-0-42-5) ఐదేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించారు. భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరూర్కీ -
Champions Trophy 2025: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయంన్యూజిలాండ్పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విలియమ్సన్కు మిగతా కివీస్ బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో వరుణ్‌తో పాటు కుల్దీప్ (2), హార్దిక్ పాండ్యా (1), అక్షర్ పటేల్ (1), రవీంద్ర జడేజా (1) వికెట్లు తీశారు.అంతకుముందు భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్.. ఆస్ట్రేలయాతో తలపడనుంది. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తివరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్ హెన్రీ (2) వికెట్ ఈ మ్యాచ్‌లో వరుణ్‌కు ఐదవది. విరాట్ కోహ్లి క్యాచ్ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.సాంట్నర్ క్లీన్ బౌల్ట్.. వరుణ్ ఖాతాలో నాలుగో వికెట్న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్ చివరి ఆశాకిరణం మిచెల్ సాంట్నర్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ విలియమ్సన్ ఔట్169 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ కేన్ విలియమ్సన్ (81) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విలియమ్సన్ స్టంపౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. బ్రేస్‌వెల్ ఔట్.. వరుణ్ ఖాతాలో మూడో వికెట్159 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ (2) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డేంజర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరుసటి బంతిరే డేంజర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. ఫిలిప్స్‌ను వరుణ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35.4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 151/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 86 బంతుల్లో 99 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్133 పరుగుల వద్ద (32.2 ఓవర్లు) న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా కీలకమైన టామ్ లాథమ్ (14) వికెట్ తీశాడు. లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 117 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్జడేజా బౌలింగ్‌లో బౌండరీతో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్‌కు వన్డేల్లో ఇది 47వ హాఫ్ సెంచరీ. కేన్ తన హాఫ్ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. మ్యాజిక్ చేసిన కుల్దీప్.. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్93 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ డెలివరీతో డారిల్ మిచెల్‌ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 104/3గా ఉంది. కేన్ విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ విలియమ్సన్కు (19) జతగా డారిల్ మిచెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టడంతో రచిన్ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్ యంగ్‌కు (10) జతగా కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు.రాణించిన శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (కోహ్లి), కేన్ విలియమ్సన్ (జడేజా) పట్టిన క్యాచ్‌లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్246 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ సింగిల్స్ తీయకుండా ఓవరాక్షన్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు (17) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్128 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్న అక్షర్ పటేల్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో అక్షర్ ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అక్షర్‌ను పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్‌కు (51) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 127/3గా ఉంది. శ్రేయస్ 51, అక్షర్ పటేల్ 42 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (35 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జేమీసన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే -
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే
Updates:పీకల్లోతు కష్టాల్లో టీమిండియాటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్మూడో వికెట్‌గా వెనుదిరిగిన విరాట్‌కోహ్లి(11) ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేనాటికి భారత్ స్కోర్ 44-3తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్‌టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(2) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మాట్ హెన్రీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 15/1. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.యువ పేసర్ హర్షిత్ రాణాకు మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు కివీస్ కూడా ఓ మార్పుతో ఆడుతోంది. డెవాన్ కాన్వే స్ధానంలో డార్లీ మిచెల్ జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి ఇది 300వ వన్డే కావడం విశేషం.తుది జట్లుభారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కేచదవండి: 'ఐపీఎల్‌ను బాయ్‌కట్ చేయండి'.. భారత్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్ -
IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్.. స్టార్ ప్లేయర్లకు రెస్ట్! విధ్వంసకర వీరుడి ఎంట్రీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత క్రికెట్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్దమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది.ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు మెనెజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లను కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు."కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ తమ తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు ఆడే అవకాశం ఇవ్వండి. మొదటి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ బెంచ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నించిండి. గెలిస్తే ఆస్ట్రేలియాతో ఆడుతారు. లేదంటే దక్షిణాఫ్రికాతో తలపడతారు. అంతేతప్ప ఓడినంతమాత్రాన భారత జట్టుకు పెద్దగా నష్టం లేదు. కాబట్టి నావరకు అయితే తుది జట్టులో మార్పులు చేస్తే బెటర్" అని మంజ్రేకర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా కివీస్‌తో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చోటు చేసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి మెనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులో వచ్చే అవకాశముంది. అదేవిధంగా కేఎల్ రాహుల్ స్ధానంలో రిషబ్ పంత్ జట్టులోకి రానున్నట్లు సమచారం.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
మళ్ళీ కోహ్లి హవా ... ఒక్క మ్యాచ్ తో మారిన తీరు
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వరుకూ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్ పై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఘోర వైఫల్యం ఇందుకు ప్రధాన కారణం. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఒక్క మ్యాచ్ తో పరిస్థితి అంతా మారిపోయింది. గత ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, భారత్ బ్యాటింగ్ లో తన మునుపటి వైభవాన్ని పునరుద్ధరించుకున్నాడు.పాకిస్తాన్ మ్యాచ్ అంటే విజృంభించి ఆడే కోహ్లీ ఇవేమీ కొత్తేమీ కాదు. అయితే న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ కోహ్లీ కి చాల ప్రత్యేకం. ఇది కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. ఈ మైలురాయిని చేరుకున్న భారత్ ఆటగాళ్లలో కోహ్లీ ఏడవ వాడు. గతంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని వంటి హేమాహేమీలు ఈ రికార్డ్ సాధించిన వారిలో ఉన్నారు.రికార్డుల వేటలో కోహ్లి..కోహ్లీ తన 300వ వన్డేకు చేరుకుంటున్న తరుణంలో, భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్‌పై కోహ్లీ ప్రభావం ఎంత ఉందో మాటల్లో చెప్పడానికి చాలా కష్టం అని రాహుల్ ప్రశంసలతో ముంచెత్తాడు. రాహుల్ కోహ్లీని తానూ క్రికెట్లో ఎల్లప్పుడూ ఆరాధించే "ముఖ్యమైన సీనియర్ ఆటగాడు" అని ప్రశంసించాడు. "300 వన్డే మ్యాచ్‌లు... కోహ్లీ భారత క్రికెట్‌కు ఎంత గొప్ప సేవకుడో వ్యక్తీకరించడానికి మాటలు సరిపోవు" అని రాహుల్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.కోహ్లీ ఈ మ్యాచ్ తో మరో రికార్డ్ సాధించాలన్న ఆశయంతో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ న్యూజిలాండ్‌పై 3000 కంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. గతంలో సచిన్ టెండూల్కర్ (3345), రికీ పాంటింగ్ (3145), జాక్వెస్ కల్లిస్ (3071) మరియు జో రూట్ (3068) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. న్యూజిలాండ్‌పై కోహ్లీ ఇంతవరకూ 55 వన్డే మ్యాచ్‌ల్లో 47.01 సగటుతో 2915 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కోహ్లీ పై బ్రేస్‌వెల్ ప్రశంసలు "ఇది చాలా పెద్ద విజయం" అని ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ సైతం కోహ్లీ మైలురాయి గురించి ప్రశంసలు గుప్పించాడు. "ఒక క్రికెటర్ కెరీర్లో 300 వన్డే మ్యాచ్ లు ఆడటం చాల గొప్ప విషయం. అదీ ఒకే ఫార్మాట్లో. కోహ్లీ తన తన కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడనే దానికి ఇది నిదర్శనం అని నేను భావిస్తున్నాను." అని బ్రేస్‌వెల్ వ్యాఖ్యానించాడు.2023 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీతో కలిసి బ్రేస్‌వెల్ ఆడాడు. అతనికి కోహ్లీ గురించి ప్రత్యక్ష అవగాహన ఉంది. "ఆర్సిబిలో అతను ప్రతి మ్యాచ్‌కు ఎలా సిద్ధమయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను. భారత్ జట్టు లో చాల మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అందులో కోహ్లీ ఒకడు. భారత్ తో ఎదురయ్యే సవాలు ఎదుర్కోవటానికి మేము ఏంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం," అని బ్రెసెవెల్ అన్నాడు.న్యూజిలాండ్ రికార్డ్ ఐసిసి టోర్నమెంట్లలో న్యూజిలాండ్ భారత్ పై ఆధిపత్యం చెలాయించింది. హెడ్-టు-హెడ్ రికార్డ్ లో న్యూజీలాండ్ 10-5 ( డబ్ల్యూ టి సి ఫైనల్‌తో సహా) తో ఆధిపత్యం లో ఉంది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అయితే భారత్ 60-58 తో ఆధిక్యంలో ఉంది. న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో భారత్ సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ ఆడటం అనుమానంగానే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ కాలి మడమ నొప్పితో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.ఈ కారణంగా షమీ స్థానంలో ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను భారత్ ఈ మ్యాచ్ లో ఆడించే అవకాశముంది. న్యూజిలాండ్ లైనప్‌లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం కూడా ఇందుకు ఒక కారణం. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ పర్యవేక్షణలో అర్ష్‌దీప్ 13 ఓవర్లు ఫుల్ రన్-అప్‌తో బౌలింగ్ చేయగా, షమీ 6-7 ఓవర్లు మాత్రమే కుదించబడిన రన్-అప్‌తో బౌలింగ్ చేశాడు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మూడవ ఓవర్ వేసిన వెంటనే షమీ ఫిజియోల నుండి తన కుడి కాలుకు చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమైన సెమీ-ఫైనల్స్‌కు ముందు భారత్ షమీకి విరామం ఇచ్చే అవకాశం లేకపోలేదు.చదవండి: యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరి లీగ్ మ్యాచ్ సమరానికి సిద్దమైంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఇరు జట్లు లీగ్ స్టేజిని విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. కాగా ఈ మ్యాచ్‌తో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. కాగా ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేరిట ఎన్నో అద్భుతమైన రికార్డులను లిఖించుకున్నాడు.ఇప్పటివరకు భారత జట్టు తరపున 299 వన్డేలు ఆడిన కోహ్లి.. 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి.300 కంటే ఎక్కువ వన్డేలు ఆడిన భారత ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ – 463 మ్యాచ్లుఎంఎస్ ధోని – 350 మ్యాచ్లురాహుల్ ద్రవిడ్ – 344 మ్యాచ్లుమహమ్మద్ అజారుద్దీన్ – 334 మ్యాచ్లుసౌరవ్ గంగూలీ – 311 మ్యాచ్లుయువరాజ్ సింగ్ – 304 మ్యాచ్లువరల్డ్ రికార్డుపై కన్ను..అదేవిధంగా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో 300 వన్డేలు, 100 టెస్టులు, 100 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించనున్నాడు. విరాట్ ఇప్పటివరకు 299 వన్డేలు, 123 టెస్టులు, 125 టీ20లు ఆడాడు. సంగర్కరకు చేరువలో కోహ్లి..కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కింగ్ కోహ్లి మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి మరో 149 పరుగులు చేస్తే శ్రీలంక కుమార్ సంగక్కర(14234)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 463 మ్యాచ్‌లు ఆడి 18426 పరుగులు చేశాడు. సచిన్ కంటే కోహ్లి ఇంకా 4,341 పరుగులు వెనకబడి ఉన్నాడు. చదవండి: Champions Trophy: టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే? -
టీమిండియా కోసం.. అన్ని జట్లు దుబాయ్‌లోనే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరినప్పటికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.ఆదివారం న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ తర్వాతే సెమీస్‌లో ఎవరి ప్రత్యర్ధి ఎవరన్నది తేలనుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్నది నేడు ఖారారు కానుంది. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది. కివీస్‌తో చివరి పోరులో భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్ సేన మంగళవారం తొలి సెమీఫైనల్ ఆడుతుంది.ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్ మైదానంలో ప్రాక్టీస్ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.ఇక కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఓమార్పుతో బరిలోకి దిగింది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్. న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై -
Champions Trophy: సెమీస్ సన్నాహకం
భారత్, న్యూజిలాండ్ వన్డేల్లో చివరిసారిగా గత వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో కూడా భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాలు అందుకుంది. అంతకు ముందు కివీస్‌తో వరుసగా మూడు వన్డేల్లో కూడా టీమిండియాదే పైచేయి. అయితే ఫార్మాట్లు వేరైనా ఇటీవల మన గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజాగానే ఉంది. ఇరు జట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆ సిరీస్‌లో ఆడినవారే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో తమ సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ కోణంలో ఇది నామమాత్రపు మ్యాచే అయినా సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఇది ఉపయోగపడనుంది. ఇరు జట్ల సెమీస్ ప్రత్యర్థి ఎవరో కూడా ఈ మ్యాచ్‌తోనే తేలనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత్, న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ నెగ్గిన టీమ్‌లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. పంత్‌కు చాన్స్! గత రెండు మ్యాచ్‌లలో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి భారత జట్టు లక్ష్యాలను సునాయాసంగా ఛేదించింది. మన ప్రదర్శనను బట్టి చూస్తే అంతా ఫామ్‌లో ఉండటంతో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ అవకాశం ఇచ్చే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. వికెట్ కీపర్‌గా రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైంది. కారు ప్రమాదం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత పంత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే గత ఏడాది ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత ఒకే రోజు విరామంతో సెమీఫైనల్ ఆడాల్సి ఉండటంతో ప్రధాన పేసర్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం కూడా ఉంది. అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడవచ్చు. కివీస్ టాప్–8లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ స్థానంలో సుందర్ జట్టులోకి రానున్నాడు. పంత్ బరిలోకి దిగితే అక్షర్ బ్యాటింగ్ అవసరం కూడా టీమ్‌కు అంతగా ఉండకపోవచ్చు. మరో వైపు కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతని వన్డే ప్రదర్శనను అంచనా వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌పరంగా రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్‌లతో టాప్–4 పటిష్టంగా ఉండగా పాండ్యా, జడేజా అదనపు బలం. అదే జట్టుతో... న్యూజిలాండ్ కూడా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. రచిన్, యంగ్, లాథమ్ ఇప్పటికే సెంచరీలు సాధించగా, కాన్వే కూడా ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ బ్యాటర్ విలియమ్సన్ వైఫల్యమే కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో కీలక మ్యాచ్‌లలో భారత్‌పై రాణించిన రికార్డు ఉన్న మాజీ కెపె్టన్ తన స్థాయికి తగినట్లు ఆడితే టీమ్‌కు తిరుగుండదు. ఫిలిప్స్‌లాంటి ఆల్‌రౌండర్ జట్టుకు మరింత కీలకం. జేమీసన్, రూర్కే, హెన్సీలతో పేస్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. కివీస్ స్పిన్ కూడా చాలా బలంగా ఉండటం విశేషం. సాంట్నర్, బ్రేస్‌వెల్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా కివీస్ కూడా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, సుందర్, రాణా, వరుణ్, అర్ష్ దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), కాన్వే, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షసూచన ఏమాత్రం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. కోహ్లి @300 భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 299 వన్డేల కెరీర్లో కోహ్లి 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లికి ముందు భారత్ నుంచి సచిన్, ధోని, ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, యువరాజ్ 300 వన్డేలు ఆడారు. -
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాపర్‌గా లీగ్ స్టేజిని ముగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గుడ్ న్యూస్ అందింది.తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ గాయం కారణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న రోహిత్.. తిరిగి మళ్లీ నెట్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు."రోహిత్ శర్మ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నెట్స్‌లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా అతడు భాగమయ్యాడు. అతడికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు. మరోవైపు జ్వరం బారిన పడిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు శనివారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవచ్చు.తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌కు కొనసాగించే అవకాశముంది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.భారత తుది జట్టు (అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. -
IND vs NZ: కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా అతడు!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ ఐసీసీ వన్డే టోర్నమెంట్లో ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న రోహిత్ సేన.. న్యూజిలాండ్‌తో ఆదివారం నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రోహిత్‌కు రెస్ట్ ఇవ్వడమే మంచిదిపాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ పిక్కల నొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైదానం వీడి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ ఫీల్డింగ్‌కు వచ్చాడు. అయితే, నొప్పి ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దుబాయ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.సెమీస్ మ్యాచ్ మార్చి 4, 5 తేదీల్లోనే జరుగనున్న తరుణంలో రోహిత్‌కు విశ్రాంతిన్విడమే మంచిదని యాజమాన్యం కూడా భావిస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గిల్‌తో పాటు ఓపెనర్‌గా రాహుల్అయితే, గిల్ జ్వరంతో బాధపడుతున్నాడని వార్తలు రాగా.. ఆప్షనల్ నెట్ సెషన్లో అతడు గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో వాటికి చెక్ పడింది.ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గనుక దూరమైతే గిల్‌కు ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి కివీస్ కూడా భారత్‌తో పాటు సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 2 నాటి మ్యాచ్‌లో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సెమీ ఫైనల్ బరిలో దిగాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఆధారంగానే గ్రూప్-‘ఎ’ విజేతతో పాటు సెమీస్ ప్రత్యర్థి ఎవరన్నది తేలనుంది.కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలైంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటంతో పాటు.. తమ మధ్య ఆఖరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాక్- బంగ్లా కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించాయి. ఇక గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ ఇంటిబాటపట్టింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్‌లో ఆడుతోంది.చదవండి: అఫ్గన్ చేతిలో ఓటమి.. బట్లర్ సంచలన నిర్ణయం?! -
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు.. పంత్కి ఛాన్స్!
న్యూజిలాండ్(India vs New Zealand)తో వన్డే నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓపెనింగ్ జోడీ మారవచ్చని.. అదే విధంగా.. కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు జట్టులో దక్కవచ్చని అంచనా వేశాడు. అయితే, తాను మాత్రం ఇలాంటి మార్పులు వద్దనే సూచిస్తానని పేర్కొన్నాడు.సెమీస్‌లో భారత్, కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కలిసి గ్రూప్-‘ఎ’లో ఉంది. ఈ క్రమంలో లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా జయభేరి మోగించింది. మరోవైపు.. న్యూజిలాండ్ కూడా ఈ రెండు జట్లపై గెలిచి భారత్‌తో పాటు సెమీస్ చేరింది.రోహిత్ శర్మ దూరం?ఈ క్రమంలో లీగ్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్‌లో భారత్- కివీస్ ఆదివారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు సెమీస్‌కు సన్నాహకంగా మారనుంది. ఇందులో గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని భారత్- న్యూజిలాండ్ పట్టుదలగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్ సందర్భంగా పిక్కల్లో నొప్పితో బాధపడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.అదే విధంగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా మార్పులు చేయబోతోందా? రోహిత్ శర్మ ఇందులో ఆడకపోవచ్చు. మహ్మద్ షమీ కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌లకు అవకాశంకేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాబోతున్నాడు. రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈసారి తుదిజట్టులో చోటు దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇలా జరగొచ్చు. లేదంటే జరగకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం భారత్ గత రెండు మ్యాచ్‌లలో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లాలి.గెలుపు మనకు ఓ అలవాటుగా మారినప్పుడు.. అదే జట్టును కొనసాగిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాంపియన్స్ ట్రోఫీలో జడ్డూ గత మ్యాచ్‌లలో పెద్దగా వికెట్లు తీయలేదు. అయినా సరే అతడిని కొనసాగించాల్సిందే. జడ్డూను కాదని వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చే ఆలోచన కూడా యాజమాన్యానికి ఉండి ఉండవచ్చు.జడ్డూనే ఆడించాలిలేదా.. కివీస్ జట్టులో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ కాబట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించే యోచనలో ఉండొచ్చు. కానీ జడ్డూనే ఆడించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే.. అతడు తదుపరి సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి సమయంలో విశ్రాంతి పేరిట పక్కనపెట్టకూడదు’’ అని అభిప్రాయపడ్డాడు.ఒకవేళ తుదిజట్టులో మార్పు చేయాలని భావిస్తే షమీని తప్పించి అర్ష్‌దీప్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగానే ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొమ్మిది ఓవర్ల కోటా వేసిన స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 37 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం ఏడు ఓవర్లలోనే 40 రన్స్ ఇచ్చిన జడ్డూ ఒక వికెట్ తీయగలిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో అవకాశం దక్కించుకున్న రిషభ్ పంత్‌కు మాత్రం తుదిజట్టులో ఆడే ఛాన్స్ రావడం లేదు. అయితే, కివీస్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉంటే మాత్రం.. రాహుల్ ఓపెనర్‌గా వస్తే.. పంత్‌కు చోటు దక్కవచ్చు.బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో ఆడిన భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్‌కు గాయం! గిల్‌కు జ్వరం?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్‌పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్‌లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్‌తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్‌కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్‌కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్‌కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్‌లో మాత్రం పాల్గోలేదని క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్‌ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్నెస్గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సూపర్ ఫామ్‌లో గిల్..కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్‌పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బ్యాట్‌ను ఝలిపించాడు. ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ తిరిగి జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు మోర్కల్ వ్యక్తిగత కారణాల రీత్యా తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బంగ్లాతో మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ కోచ్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే తన తండ్రి హఠాన్మరణం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన మోర్కల్.. దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు అతడి నేతృత్వంలో భారత ఫాస్ట్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్‌లో భారత పేస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. ఇక భారత్‌కు మరో శుభవార్త కూడా అందింది.పంత్ ఫుల్ ఫిట్..నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పంత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు మూడు రోజుల పాటు ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో పంత్ తన ప్రాక్టీస్‌ను తిరిగి మొదలు పెట్టాడు. కాగా కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్ తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కివీస్‌తో మ్యాచ్‌కు కూడా పంత్‌ను పక్కనే పెట్టే అవకాశముంది. ఇక మార్చి 2న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడతోంది. ఇప్పటి ఈ రెండు జట్లు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి.చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత జట్టు అదరగొడుతోంది. ఈ వన్డే ఫార్మాట్ టోర్నమెంట్లో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడ్డ టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా సమిష్టిగా రాణించి దాయాదిపై విజయం సాధించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి లీగ్ దశలో భాగంగా చివరగా పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆదివారం తలపడనుంది. ఇక తొలి రెండు మ్యాచ్‌లలోనూ భారత్ ఒకే జట్టుతో ఆడింది. ఈ నేపథ్యంలో కివీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో మాత్రం ఒక మార్పు చేస్తే బాగుంటుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డారెన్ గాఫ్ అన్నాడు.షమీ లేకపోయినాకివీస్తో మ్యాచ్‌లో భారత తుదిజట్టు గురించి తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘షమీకి విశ్రాంతినివ్వాలి. పాకిస్తాన్‌పై అద్భుత విజయంతో టీమిండియా విశ్వాసం రెట్టింపు అయింది. వారి బ్యాటింగ్ లైనప్ బాగుంది.కాబట్టి దుబాయ్‌లో మరో స్పిన్నర్‌ను అదనంగా తుదిజట్టులో చేర్చుకోవచ్చు. లాహోర్ మాదిరి దుబాయ్ పిచ్ మరీ అంత ఫ్లాట్‌గా కూడా ఏమీ లేదు. ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.అంతేకాదు.. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉన్న కారణంగా షమీ లేకపోయినా పెద్దగా ఆందోళనపడాల్సిన పనిలేదు. నాకు తెలిసి న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఈ ఒక్క మార్పు చేస్తుంది. షమీని పక్కనపెట్టి మరో స్పిన్నర్‌ను ఆడిస్తుంది’’ అని డారెన్ గాఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసిన షమీ.. 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. చీలమండ గాయం తాలుకు నొప్పి తిరగబెట్టడంతో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా కాసేపు అతడు విశ్రాంతి తీసుకున్నాడు.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతపై తన అంచనా తెలియజేస్తూ.. ‘‘టీమిండియా పటిష్టంగా ఉంది. ఇందులో సందేహం లేదు. వన్డేల్లో ఇటీవల ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన విధానం అద్బుతంగా అనిపించింది.టైటిల్ ఫేవరెట్ టీమిండియానేఇక ఇండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి టోర్నీలో ఎవరు విజేతగా అవతరిస్తారని అడిగితే మాత్రం నేను టీమిండియానే ఎంచుకుంటాను. బ్యాటింగ్‌లో భారత్ అదరగొడుతోంది. ప్రపంచస్థాయి బౌలర్, ప్రధాన పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టుతో లేకపోయినా ఆ ప్రభావం పడకుండా సమిష్టిగా రాణిస్తోంది. అందుకే నా టైటిల్ ఫేవరెట్ టీమిండియానే’’ అని ఇంగ్లండ్ మాజీ పేసర్ డారెన్ గాఫ్ చెప్పుకొచ్చాడు.కాగా బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో టీమిండియా ఒక స్పెషలిస్టు స్పిన్నర్(కుల్దీప్ యాదవ్), ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు(అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా), ఒక పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్(హార్దిక్ పాండ్యా), ఇద్దరు పేసర్ల(హర్షిత్ రాణా, మహ్మద్ షమీ)లతో బరిలోకి దిగింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లలో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.బెంచ్: రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టువిల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒరూర్కీ, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, మార్క్ చాప్మన్, జాకొబ్ డఫీ.చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది.ఐపీఎల్‌తో రీఎంట్రీఇదిలా ఉంటే.. కమిన్స్ ఐపీఎల్-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాను.వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో చరిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్‌లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
ఒకవేళ అదే జరిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్!
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు తన ప్రయాణం ఆరంభంలోనే మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అతడి నేతృత్వంలోనే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో తొలిసారి వైట్ వాష్‌కు గురై ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.దీంతో గంభీర్‌కు అందరికి టార్గెట్‌గా మారాడు. గంభీర్ లేనిపోని ప్రయోగాల కారణంగానే భారత్ ఓడిపోయిందని పలువురు మాజీలు కూడా విమర్శించారు. అదేవిధంగా ఈ ఘెర ఓటములపై బీసీసీఐ కూడా గంభీర్ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రూపంలో గంభీర్‌కు మరో కఠిన సవాలు ఎదురుకానుంది. బీజీటీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.అదే జరిగితే గంభీర్ పోస్ట్ ఊస్టింగ్!?భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బీజీటీలో ఆసీస్‌ను 4-0 తేడాతో ఓడించాలి. అయితే హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవితవ్యం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితాలపై ఆధారపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచినట్లయితే టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తప్పించాలని బీసీసీఐ భావిస్తుందంట. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. రెడ్ బాల్ క్రికెట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ స్టాప్‌ను నియమించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే భారత టెస్టు హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీయస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. లక్ష్మణ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: IND vs SA: సంజూతో గొడవ పడ్డ సౌతాఫ్రికా ప్లేయర్.. ఇచ్చిపడేసిన సూర్య! వీడియో -
'రూమ్‌లో కూర్చుంటే కుదరదు'. భారత ప్లేయర్లపై కపిల్‌దేవ్ ఫైర్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత బ్యాటర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. కివీస్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు సైతం కివీస్ బౌలర్ల ముందు తేలిపోయారు.ఫలితంగా స్వదేశంలో తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్ అయ్యి ఘోర ఆప్రతిష్టతను భారత జట్టు మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు. భారత బ్యాటర్లు మెరుగుపడడానికి నిరంతరం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మార్గమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.రూమ్‌లో కూర్చుంటే కుదరదు.."క్రికెట్ బేసిక్స్‌కి తిరిగి వెళ్లండి. ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టండి. అంతే తప్ప రూమ్‌లో కూర్చుని మెరుగవుతామంటే కుదరదు. ప్రస్తుతం మీకు గడ్డుకాలం నడుస్తోంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచిది" అని క్రికెట్ నెక్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ పేర్కొన్నాడు.కాగా కివీస్ టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నద్దమవుతోంది. వచ్చే వారం ఆస్ట్రేలియాకు రోహిత్ సేన పయనం కానుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టురోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
కోహ్లి ఎవరో తెలియదు.. అయినా బిల్డప్? అంత చీప్‌గా కనిపిస్తున్నానా?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి పుట్టినరోజు(నవంబరు 5) సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రికెట్ కింగ్ విజయాలను కీర్తిస్తూ.. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలను కొనియాడుతూ విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ జాబితాలో ఇటాలియన్ ఫుట్‌బాలర్ అగతా ఇసబెల్ల సెంటాసో(Agata Isabella Centasso) కూడా చేరిపోయింది.అయితే, కోహ్లికి బర్త్‌డే విషెస్ తెలిపినందుకు ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కోహ్లి అభిమానులుగా చెప్పుకొనే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అగతాను కించపరిచే విధంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ ఆరాధ్య ఆటగాడిని విస్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ఇటలీ అభిమాని నుంచి విరాట్ కోహ్లికి హ్యాపీ బర్త్డేఅసలేం జరిగిందంటే.. కోహ్లి పుట్టినరోజును పురస్కరించుకుని.. ‘‘ఇటలీ అభిమాని నుంచి విరాట్ కోహ్లికి హ్యాపీ బర్త్‌డే. ఆల్ ది బెస్ట్’’ అంటూ ట్వీట్ చేసిన అగతా.. టీమిండియా జెర్సీ ధరించిన ఫొటో షేర్ చేసింది. ఇందుకు బదులుగా.. ఓ నెటిజన్.. ‘‘అసలు నీకు క్రికెట్ గురించి, కోహ్లి గురించి ఏమీ తెలియదు!అంత చీప్‌గా కనిపిస్తున్నానా?అయినా సరే.. కోట్ల సంఖ్యలో ఉన్న భారతీయుల్లో పాపులర్ అవడానికి ఈ ట్వీట్ చేశావు! వెల్ డన్!’ అంటూ విద్వేషం ప్రదర్శించాడు. అగతా ఇందుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘నా మీద అంత దురభిప్రాయం ఉంటే.. ఇంకా నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నీ నెగటివిటీని ఇక్కడ కాకుండా మరెక్కడైనా ప్రదర్శించు’’ అని సమాధానమిచ్చింది.ఎందుకిలా చేస్తున్నారు?అంతేగాకుండా.. ‘‘నేను విరాట్ కోహ్లి లేదంటే క్రికెట్ గురించి పోస్ట్ పెట్టిన ప్రతిసారీ ఎవరో ఒకరు ఇలా నెగటివ్‌గా స్పందిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నమస్తే’’ అంటూ అగతా తన ఆవేదనను వ్యక్తం చేసింది.గడ్డు పరిస్థితులుకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి నిరాశపరిచాడు. బంగ్లాపై 6, 17, 47, 29(నాటౌట్) పరుగులు స్కోరు చేశాడు.అదే విధంగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. 0, 70, 1, 17, 4, 1 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో రాణిస్తేనే అతడిని జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీలు సైతం డిమాండ్ చేస్తున్నారు.చదవండి: Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్ చేసిన అనుష్క@imVkohli, happy birthday from a fan in Italy. All the best to you 🇮🇳🏏 pic.twitter.com/wIk1UXO3eR— Agata Isabella Centasso (@AgataCentasso) November 5, 2024 -
BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. ఆ టెక్నాలజీ మాత్రం వాడదు!
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. ముంబై.. వాంఖడే మైదానం.. రిషభ్ పంత్ ఇంకాసేపు క్రీజులో నిలబడితే చాలు.. టీమిండియా గెలవడం ఖాయం.. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో పంత్ వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడం అందరికీ షాకిచ్చింది.నిజానికి ఫీల్డ్ అంపైర్ పంత్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. అజాజ్ వేసిన బంతి పంత్ బ్యాట్‌ను కాకుండా ప్యాడ్లను తాకిందనే ఉద్దేశంతో.. అజాజ్ అప్పీలు చేసినా అంపైర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. పంత్ సైతం అదే ధీమాతో క్రీజులో నిలబడి చిరునవ్వులు చిందించాడు.అయితే, కివీస్ మాత్రం రివ్యూకు వెళ్లింది. అందులో బంతి బ్యాట్ అంచును తాకినట్లుగా కనిపించింది. అయితే, అదే సమయంలో బ్యాట్ ప్యాడ్లను తాకిన తాకిందని పంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ బంతి బ్యాట్‌ను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయంటూ థర్డ్ అంపైర్ పంత్‌ను అవుట్‌గా ప్రకటించాడు.కానీ పంత్ మాత్రం మైదానాన్ని వీడేందుకు ఇష్టపడక కాసేపు ఫీల్డ్ అంపైర్లతో వాదించి.. ఇక లాభం లేదనుకుని పెవిలియన్ చేరాడు. పంత్ నిష్క్రమణ తర్వాత భారత్ ఓటమి ఖారారై.. కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో పంత్ అవుటైన తీరు విస్తృతంగా చర్చకు వచ్చింది.ఈ క్రమంలోనే చాలా మంది హాట్‌స్పాట్ టెక్నాలజీ విషయాన్ని తెరమీదకు తెచ్చారు. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)లో ఈ సాంకేతికతను కూడా బీసీసీఐ చేర్చుకుని ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.హాట్‌స్పాట్ టెక్నాలజీ అంటే ఏమిటి?ఫ్రెంచ్ శాస్త్రవేత్త నికోలస్ బియాన్ హాట్‌స్పాట్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రక్షణ దళాలు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వీలుగా ఈ సాంకేతికతను రూపొందించారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. చీకట్లో, పొగ కమ్ముకున్న సమయంలో యుద్ధ ట్యాంకులు, విమానాల కదలికలను పసిగట్టడం కోసం దీనిని వాడతారు.క్రికెట్లో హాట్స్పాట్ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య 2006-07 నాటి యాషెస్ సిరీస్ సందర్భంగా క్రికెట్లో హాట్‌స్పాట్ టెక్నాలజీని తొలిసారిగా ఉపయోగించారు. ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా బంతి బ్యాటర్‌కు శరీరానికి తగిలిందో లేదో పరిశీలించే వీలు కలుగుతుంది. డీఆర్ఎస్ను మరింత సరళతరంగా, కచ్చితంగా మార్చేందుకు ఈ సాంకేతికతను వాడారు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, యూఏఈలలో కూడా ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని ఉపయోగించారు.ఇది ఎలా పనిచేస్తుందంటే?బౌలర్ సైడ్ రెండు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలను అమరుస్తారు. బంతిని బ్యాటర్ శరీరాన్ని లేదంటే ప్యాడ్‌ను తాకినపుడు వెలువడ్డ ఉష్ణోగ్రత ఆధారంగా నెగటివ్ ఇమేజ్ ద్వారా ఏ పాయింట్లో బంతి తాకిందో గుర్తిస్తారు. బంతి బ్యాట్ అంచును తాకిందా లేదంటే ప్యాడ్‌ను తాకిందా అనేది దీని ద్వారా స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.కచ్చితత్వం ఎంత?హాట్‌స్పాట్ చుట్టూ కూడా వివాదాలు ఉన్నాయి. 2011లో భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినపుడు ఈ టెక్నాలజీ వాడగా.. ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. వీవీఎస్ లక్ష్మణ్ అవుట్ కాకుండా లైఫ్ పొందిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ సాంకేతికతను తప్పుబట్టాడు. ఇక టూల్ ఇన్వెంటర్ వారెన్ బ్రెనాన్ సైతం పూత ఉండే బ్యాట్ల విషయంలో ఈ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.ఇండియాలో ఎందుకు వాడటం లేదు?హాట్‌స్పాట్ టెక్నాలజీ ఖరీదైనదని బీసీసీఐ, బ్రాడ్కాస్ట్ వర్గాలు అంటున్నాయి. ఒక్క కిట్ కోసం రోజుకు పది వేల అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. ఇంతచేసినా కచ్చితమైన ఫలితాలు పొందలేమని పేర్కొంటున్నాయి. అందుకే ఈ టెక్నాలజీని ఇండియాలో వాడటం లేదని.. స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్స్ కూడా వీటి వినియోగాన్ని ఆపేశాయని తెలిపాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం హాట్‌స్పాట్ టెక్నాలజీని ఇంత వరకు ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం విశేషం.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
అతడు క్రీజులో ఉన్నంతవరకూ మేము భయపడ్డాము: అజాజ్ పటేల్
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా వైట్‌వాష్ అయినప్పటికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అద్బుత ఇన్నింగ్స్‌లతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ విరోచిత పోరాటం కనబరిచాడు.బంతి గింగరాల తిరుగుతున్న చోట కివీస్ స్పిన్నర్లను పంత్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట పంత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓ దశలో భారత్‌ను గెలిపించేలా కన్పించిన పంత్.. ఓ వివాదస్పద నిర్ణయంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. దీంతో 25 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ ముగిసి రెండు రోజులు అవుతున్నప్పటికి పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. అతడి సాహసోపేత ఇన్నింగ్స్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. పంత్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంట. ఈ విషయాన్ని స్వయంగా ముంబై టెస్టు హీరో అజాజ్ పటేల్ చెప్పుకోచ్చాడు.అజాజ్ పటేల్ తాజాగా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించినప్పుడు న్యూజిలాండ్ జట్టు భయపడిందా అన్న ప్రశ్న అజాజ్‌కు ఎదురైంది. అవును రిషబ్ క్రీజులో ఉన్నప్పుడు మేముంతా చాలా భయపడ్డాము అని అజాజ్ పటేల్ బదులిచ్చాడు.ఈ సిరీస్‌లో రిషబ్ పంత్‌ను ఎక్కువగా టార్గెట్ చేశాం. అతడు క్రీజులో ఉన్నప్పుడు ఏ బౌలర్‌కు భయపడడు. ఏది ఏమైనా తన ఆట ఆడుతుంటాడు. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడానికే ప్రయత్నిస్తాడు. అతడు త్వరగా ఔట్ అయితే ఏ సమస్య లేదని అజాజ్ పటేల్ అదే ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
Ind vs Aus: నిద్రపోయిన దిగ్గజానికి మేలుకొలుపు: ఆసీస్ స్టార్ పేసర్
భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. క్రికెట్ దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, అనిల్ కుంబ్లే తదితరులు న్యూజిలాండ్ చేతిలో ఓటమిని తట్టుకోలేక.. టీమిండియా వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు.తొలిసారి -0-3తో వైట్వాష్కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఓడి.. వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా భారత క్రికెట్ చరిత్రలో ఈ చెత్త ఘనత సాధించిన తొలి జట్టుగా రోహిత్ సేన నిలిచింది.ఫలితంగా ఘోర అవమానం మూటగట్టుకోవడంతో పాటు.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలనూ సంక్లిష్టం చేసుకుంది. తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టులు కచ్చితంగా గెలవాల్సిన స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో గావస్కర్ వంటి విశ్లేషకులు ఇక మనం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు వదిలేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపుఈ నేపథ్యంలో ఆసీస్ పేసర్ హాజిల్‌వుడ్ స్పందించిన తీరు మాత్రం వైరల్‌గా మారింది. ‘‘నిద్రపోయిన దిగ్గజానికి ఇదో మేలుకొలుపు. అయితే, వారు దీని నుంచి ఎలా బయటపడతారో చూద్దాం’’ అని హాజిల్‌వుడ్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా 3-0తో గెలవడం కంటే.. 0-3తో ఓడిపోవడమే వారికి మంచిదని అతడు అభిప్రాయపడ్డాడు.కివీస్‌తో సిరీస్‌లో చాలా మంది బ్యాటర్లు విఫలమయ్యారని.. అయితే ఒకరిద్దరు మాత్రం అద్భుతంగా ఆడారని కొనియాడాడు. అయితే, ప్రస్తుతం టీమిండియాతో పోటీ ఎలా ఉండబోతుందో అంచనా వేయలేమని.. ఏదేమైనా ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా వస్తాయని హాజిల్‌వుడ్ ధీమా వ్యక్తం చేశాడు.టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా ఇక ఇండియాలో ఒక్క టెస్టు గెలవడమే కష్టమని.. అలాంటిది క్లీన్‌స్వీప్‌తో కివీస్ ఆటగాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని హాజిల్‌వుడ్ కొనియాడాడు. అయితే, భారత జట్టును తక్కువ అంచనా వేయబోమని.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత టీమిండియా మరింత స్ట్రాంగ్‌గా తిరిగివస్తుందని పేర్కొన్నాడు. కాగా నవంబరులో రోహిత్ సేన ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది. ఇందులో నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: 'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే' -
'బుమ్రా, గిల్ కాదు.. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ అతడే'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.ఫలితంగా తొలిసారి సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ గురైంది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెస్టులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం అసన్నమైంది అని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.అయితే రోహిత్ శర్మ భవితవ్యం త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫలితంపై ఆధారపడి ఉంది. ఒకవేళ భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించికపోతే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీజీటీ తర్వాత ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తదుపరి భారత టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు చేపడతాడని కైఫ్ జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టులో రిషబ్ పంత్ మాత్రమే టెస్ట్ కెప్టెన్‌గా పోటీలో ఉన్నాడు. భారత టెస్టు కెప్టెన్ అయ్యే అన్ని రకాల ఆర్హతలు పంత్‌కు ఉన్నాయి. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టుకు తన వంతు న్యాయం చేస్తున్నాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా పంత్‌కు ఉంది.ఇప్పటికే ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్‌లు ఆడాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికా వంటి విదేశీ పిచ్‌లపై కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అది స్పిన్ ట్రాక్, పేస్ ట్రాక్ అయినా పంత్ ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు" అని తన ఇనాస్టా లైవ్‌లో పేర్కొన్నాడు.కాగా ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఓసారి రోహిత్ గైర్హజరీలో జట్టును కూడా బుమ్రా నడిపించాడు. ఈ క్రమంలో బుమ్రాను కాదని పంత్‌ను రోహిత్ వారసుడిగా కైఫ్ ఎంచుకోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.చదవండి: Paris Olympics 2024: ఆమె మగాడే.. సంచలన విషయాలు వెలుగులోకి!.. భజ్జీ రియాక్షన్ -
Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు. నేను వంద శాతం న్యూజిలాండ్వాడినేచిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనుఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు. చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా -
రోహిత్ శర్మ చెత్త రికార్డు
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 1969 తర్వాత టెస్ట్ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్‌గా అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.1969లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత జట్టు ఒకే ఏడాది నాలుగు టెస్ట్‌ల్లో ఓటమిపాలైంది. తాజాగా రోహిత్.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ చెత్త రికార్డును సమం చేశాడు. రోహిత్ సారథ్యంలోని టీమిండియా.. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌కు గురైంది.సొంతగడ్డపై అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న భారత కెప్టెన్లు..మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ-9రోహిత్ శర్మ-5విరాట్ కోహ్లి-3కాగా, న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. పూణేలో జరిగిన రెండో టెస్ట్‌లో 113 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. -
టీమిండియాను పాక్ కూడా ఈజీగా ఓడిస్తుంది: వసీం అక్రమ్ ఎగతాళి
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0తో భారత జట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత తొలిసారి సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచంలోనే స్పిన్‌కు బాగా ఆడుతారని పేరొందిన భారత బ్యాటర్లు.. ఇప్పడు అదే స్పిన్‌ను ఆడేందుకు భయపడుతున్నారు. ముంబై 147 పరుగుల స్వల్ఫ లక్ష్యాన్ని కూడా భారత్ చేధించలేక చతికలపడింది. కివీస్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 9 వికెట్లు కివీ స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. అయితే ఇదే అవకాశంగా తీసుకుని భారత జట్టును ఇంగ్లండ్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఎగతాళి చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్‌లు భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ కూడా ఓడిస్తుంది?మెల్బోర్న్ వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో అక్రమ్,మైఖేల్ వాన్లు కామేంటర్లగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా వాన్ మాట్లాడుతూ.."పాకిస్తాన్-భారత్ మధ్య టెస్టు సిరీస్ జరిగితే చూడాలనుకుంటున్నాను' అని అన్నాడు. అందుకు బదులుగా అక్రమ్ "నిజంగా అలా జరిగితే చాలా బాగుంటుంది. ఇది రెండు దేశాల మధ్య స్నేహ బంధాన్ని పెంచుతుంది" అని సమాధానమిచ్చాడు. ఇక్కడవరకు అంతే బాగానే చివరిలో అక్రమ్, వాన్ తన వక్ర బుద్దిని చూపించుకున్నారు. "ఇప్పుడు స్పిన్పిచ్లపై టీమిండియాను పాక్ ఓడించగలదు" అని వాన్ వ్యాఖ్యనించాడు. అక్రమ్ కూడా అందుకు అంగీకరించాడు."భారత్ స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతంది. కాబట్టి టర్నింగ్ వికెట్లపై టీమిండియాను ఓడించే అవకాశముంది. న్యూజిలాండ్ భారత జట్టును వారి స్వదేశంలోనే 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది" అని అక్రమ్ రిప్లే ఇచ్చాడు. కాగా వీరిద్దరి కామెంట్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. ముందు మీ జట్టు సంగతి చూసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. సొంతగడ్డపైనే ఇంతటి ఘోర అవమానం.. ఇకపై..
దూకుడుకు మారుపేరు.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆటగాడు.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త.. ఇలాంటి వ్యక్తి హెడ్‌కోచ్‌గా వస్తే జట్టు విజయపథంలో నడవడం ఖాయం.. గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడు కాగానే అతడి అభిమానులతో పాటు విశ్లేషకులూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇవి.అందుకు తగ్గట్టుగానే శ్రీలంక పర్యటనలో భాగంగా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్‌ను.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో హెడ్‌కోచ్‌గా గంభీర్‌కు శుభారంభం లభించింది. కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుతో ఉన్నా వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూసింది.సొంతగడ్డపై ఘోర అవమానంఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో, టీ20 సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ.. న్యూజిలాండ్ రూపంలో ఎదురైన కఠిన సవాలును గౌతీ అధిగమించలేకపోయాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా సొంతగడ్డపై టీమిండియా కివీస్‌తో టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది.ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో పిచ్‌ను తప్పుగా అంచనావేసి తొలుత బ్యాటింగ్ చేయడం, పుణెలో స్పిన్ పిచ్ రూపొందించి బొక్కబోర్లా పడటం.. ముంబై టెస్టులోనూ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకోవడం..కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గంభీర్‌పై విమర్శల కారణమైంది. ఇక కివీస్ చేతిలో ఈ ఘోర ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ అవకాశాలనూ దెబ్బతీసింది.గంభీర్ చేసిన తప్పులు ఇవేఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గనుక జట్టు ప్రదర్శన ఇలాగే సాగితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయం. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని రోహిత్ ఎంత చెబుతున్నా... మేనేజ్మెంట్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది. చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ప్రధాన ప్లేయర్లే తడబడుతున్న సమయంలో సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపిన మేనేజ్మెంట్... మిడిలార్డర్లో అనుభవమున్న ‘లోకల్ బాయ్’ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపింది.ఆ విషయంలో ద్రవిడ్ పర్ఫెక్ట్ఇవే కాకుండా గతంలో ద్రవిడ్ ప్రాక్టీస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేవాడని పలువురు ప్లేయర్లు అభిప్రాయపడగా... గంభీర్లో ఆ తీవ్రత లోపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు హెడ్ కోచ్ గంభీర్‌లకు అగ్ని పరీక్షగా నిలువనుంది.రెక్కలు కత్తిరించేందుకు సిద్ధం!ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. గంభీర్ ‘ అధికారాల రెక్కలు’ కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై అతడిని సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లకు లేని వెసలుబాటును బీసీసీఐ గౌతం గంభీర్‌కు కల్పించింది.నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోచ్‌లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. కానీ.. ఆస్ట్రేలియా పర్యటనకు పంపే జట్టు విషయంలో ఈ రూల్‌ను మినహాయించారు. హెడ్‌కోచ్‌ను మీటింగ్‌కు అనుమతించారు’’ అని పేర్కొన్నాయి. అయితే, స్వదేశంలోనే గంభీర్ అంచనాలు తప్పి.. ఘోర అవమానం ఎదురైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌కు రూ. 50 కోట్లు!?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైన విషయం విధితమే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఓటమి చవిచూసినప్పటకి.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాత్రం తన విరోచిత పోరాటంతో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి, గిల్, జైశ్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకున్న విలవిల్లాడిన చోట రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ భారత్ డగౌట్లో ఆశలు రేకెత్తించాడు. కానీ అనూహ్యంగా పంత్ ఔట్ కావడంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ సిరీస్ అసాంతం పంత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 89.38 స్ట్రైక్ రేటుతో పంత్ 261 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ బ్యాటింగ్ టెక్నిక్‌ను బాసిత్ అలీ మెచ్చుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంత్ రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోతాడని అలీ జోస్యం చెప్పాడు.రూ. 50 కోట్లు ఇవ్వాలి.."రిషబ్ పంత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ వికెట్‌పై మిగితా ప్లేయర్లంతా ఇబ్బంది పడితే పంత్ ఒక్కడే ప్రత్యర్ధి బౌలర్లను ఎటాక్ చేశాడు. అతడు ప్లాట్ పిచ్‌పై ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. అతడి షాట్ సెలక్షన్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే.అతడు ఎటువైపు ఆడాలనుకుంటే ఆటువైపు ఈజీగా షాట్లు ఆడాడు. మిగితా ఆటగాళ్లు పంత్‌లా ఆడలేకపోయారు. రిషబ్ తొలి ఇన్నింగ్స్‌లో 60, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. అతడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోతాడు. పంత్ రూ.25 కోట్లకు అమ్ముడుపోతాడని అంతా అనుకుంటున్నారు.కానీ నావరకు అయితే పంత్‌కు రూ. 50 కోట్లు ఇచ్చి తీసుకున్నా తప్పులేదు అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది? -
టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు టీమిండిచా మోకరిల్లింది. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్లో సొంతగడ్డపై రెండు కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో తొలిసారి వైట్‌వాష్‌కు గురై ఘోర అవమానాన్ని రోహిత్ సేన ఎదుర్కొంది. ఈ సిరీస్ అసాంతం భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకిల పడింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఘోర పరభావంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ ఓటమితో భారత జట్టు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సచిన్ అభిప్రాయపడ్డాడు."స్వదేశంలో 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మింగుడు పడని విషయం. కచ్చితంగా టీమిండియా ఈ ఓటుములపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఘోర పరభావానికి ప్రిపరేషన్ లోపమా, పేలవమైన షాట్ ఎంపికనా, లేక మ్యాచ్ ప్రాక్టీస్ లోపమా? కచ్చితంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. శుబ్‌మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అతడు పూర్తిగా భిన్నంగా కన్పించాడు. పంత్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. అతడి బ్యాటింగ్‌ను చూస్తే వేరే పిచ్‌పై ఆడినట్లు అన్పించింది. పంత్ సింప్లీ సూపర్బ్ అంటూ" ఎక్స్‌లో లిటల్ మాస్టర్ రాసుకొచ్చాడు.చదవండి: Wriddhiman Saha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ -
టీమిండియా వైట్ వాష్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్, రోహిత్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. బెంగళూరు, పుణేల వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు.. ఇప్పుడు వాంఖడేలోనే అదే తీరును పునరావతృం చేసింది. కివీస్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఒక్క రిషబ్ పంత్ మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. దీంతో స్వదేశంలో తొలిసారి రెండు కంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై ఘోర ఆ ప్రతిష్టతను రోహిత్ సేన మూటకట్టుకుంది.రహానే పోస్ట్ వైరల్.. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే షేర్ చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఓటమి అనంతరం తను వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో రహానే షేర్ చేశాడు. అందుకు హద్దులను దాటి ముందుకు వెళ్లండి అంటూ ఆర్ధం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు. కాగా రహానే భారత జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిపైనే అయింది. రహానే జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి తన ఫిట్నెస్ను ఏ మాత్రం కోల్పోలేదు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రహానే బిజీబిజీగా ఉన్నాడు. రంజీ సీజన్ 2024-25లో ముంబై కెప్టెన్‌గా రహానే వ్యవహరిస్తున్నాడు. సారధిగా రహానే గతేడాది ముంబై జట్టును రంజీ చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ముంబైకు ఇరానీ కప్-2024ను కూడా అందించాడు. రహానే చివరగా భారత్ తరపున గతేడాది వెండీస్పై ఆడాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ -
చాలా బాధగా ఉంది.. ఓటములకు నాదే బాధ్యత: రోహిత్ శర్మ
సొంతగడ్డపై టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది. ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా మూడు మ్యాచుల్లోనూ ఓడి.. వైట్ వాష్‌కు గురైంది. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల టార్గెట్ ను కూడా టీమిండియా ఛేజ్ చేయలేకపోయింది. దీంతో 25 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.పంత్(64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లేదంటే భారత్ కనీసం 100 పరుగుల మార్క్ కూడా దాటలేకపోయింది. కాగా స్వదేశంలో రెండు కంటే ఎక్కువ టెస్టుల్లో టీమిండియా ఇలా వైట్ వాష్ కావడం చరిత్రలోనే తొలిసారి. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని శర్మ అంగీకరించాడు.పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ"ఈ పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా కెరీర్లో ఇదే అధమ దశ. టెస్టు సిరీస్ పరాజయానికి కెప్టెన్‌గా పూర్తి బాధ్యత నాదే. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను కోల్పోయాం. మా స్థాయికి తగ్గ క్రికెట్‌ను ఆడలేదు. బెంగళూరు, పుణే టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో తగిన స్కోర్లు చేయలేక వెనుకబడ్డాం.మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం బాధిస్తోంది. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. సారథిగానూ జట్టును విజయం దిశగా నడిపించలేకపోయా. న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌కు క్లిష్టతరమైన పిచ్‌పై యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చక్కటి ప్రదర్శన కనబర్చారు.ఇక నా దృష్టి అంతా ఆ్రస్టేలియా సిరీస్‌పైనే. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్‌పై సిరీస్‌లు గెలిచాం. ఈసారి కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తామనే నమ్మకముంది అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం -
IND VS NZ 3rd Test: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్‌లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్ పటేల్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, ఆకాశ్‌దీప్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90), రిషబ్ పంత్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు.28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తలో వికెట్ పడగొట్టారు. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 121 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6 వికెట్లు పడగొట్టగా.. ఫిలిప్స్ 3 వికెట్లతో తీశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(64) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
పరాభవం... పరిపూర్ణం
టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా అతిపెద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. 1933 నుంచి సుదీర్ఘ ఫార్మాట్ ఆడుతున్న భారత జట్టు... 91 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అన్నింటా ఓడిపోయి మొదటిసారి క్లీన్ స్వీప్‌నకు గురైంది. 147 పరుగుల లక్ష్యఛేదనలో రిషబ్ పంత్ మినహా మిగిలిన వారంతా విఫలమవడంతో టీమిండియాకు ఘోర పరాజయం తప్పలేదు. రోహిత్ బృందం స్వయంకృత అపరాధాలకు మూల్యం చెల్లించుకుంటే... ఇప్పటి వరకు భారత్‌లో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన న్యూజిలాండ్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేసి కొత్త చరిత్ర లిఖించింది. గత పర్యటనలో వాంఖడే టెస్టులోనే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి రికార్డుల్లోకెక్కిన ఎజాజ్ పటేల్ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఈ ఫలితంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ముంబై: సొంతగడ్డపై తిరుగులేని టెస్టు రికార్డు ఉన్న భారత జట్టుకు అనూహ్య పరాభవం ఎదురైంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకుంటుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మూడో టెస్టులో చివరకు భారత జట్టు 25 పరుగుల తేడాతో పరాజయం పాలవగా... న్యూజిలాండ్ 3–0తో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత పర్యటనకు ముందు శ్రీలంక చేతిలో 0–2తో సిరీస్ కోల్పోయి వచ్చిన న్యూజిలాండ్... స్టార్ ఆటగాళ్లతో నిండిన టీమిండియాపై ఒక టెస్టు మ్యాచ్ గెలవడమే గొప్ప అనుకుంటే... వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టి కొత్త చరిత్ర లిఖించింది. ఊరించే లక్ష్యఛేదనలో టాపార్డర్ మరోసారి విఫలమవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఓవర్‌నైట్ స్కోరు 171/9తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ మరో మూడు పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 147 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 29.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (57 బంతుల్లో 64; 9 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే అర్ధశతకంతో ఆకట్టుకోగా... మిగిలిన వాళ్లంతా పెవిలియన్‌కు వరుస కట్టారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 6, గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు పడగొట్టారు. వాంఖడే స్టేడియంలో ఆడిన రెండు టెస్టుల్లోనే ఎజాజ్ పటేల్ 25 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌లోని ఓ వేదికపై ఓ విదేశీ బౌలర్‌కు ఇదే అత్యుత్తమ రికార్డు. గతంలో ఇంగ్లండ్ స్టార్ ఇయాన్ బోథమ్ వాంఖడేలోనే రెండు మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 11 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, విల్ యంగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. కొంతే కొండంతై.. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్... రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌ను మెరుగ్గానే ఆరంభించినా... ఆ తర్వాత నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మరుసటి ఓవర్లో గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఎజాజ్ పటేల్... తన తదుపరి ఓవర్లో కోహ్లిని బుట్టలో వేసుకున్నాడు. తదుపరి ఓవర్లో జైస్వాల్ కూడా వెనుదిరగగా... సర్ఫరాజ్ ఖాన్ ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఫలితంగా 7.1 ఓవర్లలోనే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను పంత్ తీసుకున్నాడు. పంత్ ఒంటరి పోరు.. అత్యవసరమైన స్థితిలో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించిన పంత్ మరోసారి తుదికంటా పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి సహచర ఆటగాళ్లు నిలవలేకపోతున్న చోట ఎజాజ్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఖాతా తెరిచిన రిషబ్... మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతున్నా మొండిగా క్రీజులో నిలిచాడు. ఫిలిప్స్ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన పంత్.. ఆ తర్వాత మరో రెండు బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించే పనిలో పడ్డాడు. ఆరో వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం జడేజా అవుట్ కాగా... ఆ తర్వాత సుందర్ అండగా పంత్ ముందుకు సాగాడు. ఈ క్రమంలో పటేల్ ఓవర్లో రెండు ఫోర్లతో 48 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.లంచ్ విరామానికి టీమిండియా 92/6తో నిలిచింది. ఆ తర్వాత ఎజాజ్ పటేల్ భారత్‌కు భారీ షాక్ ఇచ్చాడు. తన ఓవర్లో రెండు ఫోర్లు బాదిన పంత్‌ను కీపర్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపాడు. మొదట అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూకు వెళ్లిన కివీస్ ఫలితం రాబట్టింది. పంత్ అవుటయ్యాక భారత్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. 1 స్వదేశంలో భారత జట్టు మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం ఇదే తొలిసారి. 2000లో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0–2తో కోల్పోయిన టీమిండియా... 1980లో ఇంగ్లండ్ చేతిలో 0–1తో ఓడింది. సొంతగడ్డపై ఒక సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఓడటం 1983 తర్వాత ఇదే తొలిసారి. 1 ఒక టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే మొదటిసారి.31- 1 సొంతగడ్డపై 200 పరుగులలోపు లక్ష్యఛేదనలో భారత్ విఫలమవడం ఇదే తొలిసారి. గతంలో 31 సార్లు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన భారత్ ఈసారి విఫలమైంది.2 ఓవరాల్‌గా టెస్టుల్లో భారత జట్టు ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోరు ఇది. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 81 పరుగులకు ఆలౌటైంది.5 స్వదేశంలో అత్యధిక టెస్టు పరాజయాలు మూటగట్టుకున్న సారథుల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరాడు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ కెపె్టన్‌గా స్వదేశంలో 9 మ్యాచ్‌లు ఓడగా... రోహిత్ 5 మ్యాచ్‌ల్లో పరాజయం పాలయ్యాడు. అజహరుద్దీన్, కపిల్‌దేవ్ 4 ఓటములతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235; భారత్ తొలి ఇన్నింగ్స్: 263; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 174; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) ఫిలిప్స్ 5; రోహిత్ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 11; గిల్ (బి) ఎజాజ్ 1; కోహ్లి (సి) మిచెల్ (బి) ఎజాజ్ 1; పంత్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 64; సర్ఫరాజ్ (సి) రచిన్ (బి) ఎజాజ్ 1; జడేజా (సి) యంగ్ (బి) ఎజాజ్ 6; సుందర్ (బి) ఎజాజ్ 12; అశి్వన్ (సి) బ్లన్‌డెల్ (బి) ఫిలిప్స్ 8; ఆకాశ్‌దీప్ (బి) ఫిలిప్స్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (29.1 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–18, 4–28, 5–29, 6–71, 7–106, 8–121, 9–121, 10– 121. బౌలింగ్: హెన్రీ 3–0–10–1; ఎజాజ్ 14.1–1–57–6; ఫిలిప్స్ 12–0–42–3. ఓటమికి బాధ్యత నాదే... ఈ పరాజయాన్ని జీర్ణించుకోవడం కష్టం. నా కెరీర్లో ఇదే అధమ దశ. టెస్టు సిరీస్ పరాజయానికి కెపె్టన్‌గా పూర్తి బాధ్యత నాదే. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాం. గెలుస్తామనుకున్న మ్యాచ్‌ను కోల్పోయాం. మా స్థాయికి తగ్గ క్రికెట్‌ను ఆడలేదు. బెంగళూరు, పుణే టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ల్లో తగిన స్కోర్లు చేయలేక వెనుకబడ్డాం. మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించి కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం బాధిస్తోంది. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. సారథిగానూ జట్టును విజయం దిశగా నడిపించలేకపోయా. న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్‌కు క్లిష్టతరమైన పిచ్‌పై యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇక నా దృష్టి అంతా ఆ్రస్టేలియా సిరీస్‌పైనే. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టి ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్‌పై సిరీస్‌లు గెలిచాం. ఈసారి కూడా మెరుగైన ఆటతీరు కనబరుస్తామనే నమ్మకముంది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడింది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్, గిల్, సర్ఫరాజ్, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఆరేసిన అజాజ్ పటేల్..మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.ఇదే తొలిసారి..భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వరకు ఏ జట్టు చేతిలో కూడా టీమిండియా స్వదేశంలో వైట్ వాష్‌కు గురువ్వలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భారత జట్టును వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబర్ 1- 5)వేదిక: ముంబై, వాంఖడే స్టేడియంటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 263న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 174భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 121ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్ ఓటమి -
ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ శుభారంభం అందిస్తాడని భావించారు. కానీ రోహిత్ అందరి ఆశలను అడియాశలు చేశాడు. కివీ పేసర్ మాట్ హెన్రీ బౌలింగ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి రోహిత్ తన వికెట్‌ను కోల్పోయాడు.ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్..రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తన ఫేవరేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. తొలి ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ అద్బుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసేందుకు హెన్రీ మళ్లీ ఎటాక్‌లో వచ్చాడు. అయితే సరిగ్గా ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తన కెప్టెన్సీ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లాథమ్ లాంగ్ ఆన్, మిడ్-ఆన్ మధ్యలో ఫీల్డర్‌ను ఉంచి రోహిత్‌కు పుల్ షాట్ ఆడేందుకు అవకాశమిచ్చాడు.ఈ నేపథ్యంలో మూడో ఓవర్ ఆఖరి బంతిని హెన్రీ బ్యాక్ఆఫ్ది లెంగ్త్ బాల్‌గా హిట్‌మ్యాన్‌కు సంధించాడు. దీంతో ఆ బంతిని రోహిత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.దీంతో మిడ్-వికెట్లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ షాట్ ఆడాల్సిన అవసరం ఏముందని పోస్టులు పెడుతున్నారు.ఇక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(23), జడేజా(5) ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి. pic.twitter.com/TumJQ3gaS1— viratgoback (@viratgoback) November 3, 2024 -
IND vs NZ 3rd Test: ముంబై టెస్టులో టీమిండియా చిత్తు..
వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. క్రీజులో అజాజ్ పటేల్(7), ఓ రూర్కే ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ మరో వికెట్ పడగొడితే కివీస్ ఇన్నింగ్స్ ముగుస్తుంది. టీమిండియా బౌలింగ్ ఎటాక్‌ను జడేజా ఆరంభించాడు. -
వాంఖడేలో అంత ఈజీ కాదు.. అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఎంతంటే?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జూలు విధిల్చింది. తొలి రెండు టెస్టుల్లో విజయాలను నమోదు చేసిన కివీస్‌కు ఓటమి రుచి చూపించేందుకు భారత జట్టు సిద్దమైంది.రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశారు. బంతిని గింగరాల తిప్పుతూ కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా, అశ్విన్ మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఛేజింగ్ అంత ఈజీ కాదు..ఇక కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా ఒక్క వికెట్ పడగొట్టాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్, ఓ రూర్కీ ఉన్నారు. త్వరగా వికెట్ పడగొట్టి 150 పరుగుల ఆధిక్యంలోపు కివీస్‌ను కట్టడి చేయాలని టీమిండియా భావిస్తోంది.అయితే వాంఖడేలో 150 పరుగుల లక్ష్యం చేధన కూడా అంత సులువు కాదు. ఎందుకంటే వాంఖడే పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు చాలా కఠినంగా ఉంటాయి. వాంఖడే వికెట్ మ్యాచ్ జరుగుతున్న కొద్దీ బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది.అంతేకాకుండా బంతి కూడా ఎక్కువగా టర్న్ అయ్యే అవకాశముంది. కాగా ఇటీవల కాలంలో స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కివీస్ స్పిన్నర్లు చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. న్యూజిలాండ్ జట్టులో అజాజ్ పటేల్, ఇష్ సోధీ వంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. భారత్ సునాయసంగా లక్ష్యాన్ని చేధించాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. రోహిత్ శర్మ, జైశ్వాల్ కచ్చితంగా తమ బ్యాట్లకు పని చెప్పాల్సిందే.అత్యధిక టార్గెట్ ఛేజింగ్ ఎంతంటే?ఇక వాఖండేలో విజయవంతమైన అత్యధిక ఛేదన 163 పరుగులు. 2000లో భారత్ నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఇంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. చివరగా 2021లో 540 పరుగుల లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది. అంతకంటే ముందు 2013లో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 187కే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. 2004లో ఆస్ట్రేలియా 107 పరుగులను ఛేదించలేక 93 రన్స్‌కే కుప్పకూలింది. స్పిన్నర్ల వలలో చిక్కుకుని కంగారులు విల్లవిల్లాడారు. ఈ వేదికలో టీమిండియాకు కూడా ఓసారి ఘోర పరభావం ఎదురైంది. 2006 ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 313 పరుగుల ఛేదనలో 100 పరుగులకే కుప్పకూలింది. -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.అశ్విన్ అరుదైన రికార్డు..ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్? -
నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా? కసి తీర్చుకున్న అశ్విన్! వీడియో
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితో మ్యాజిక్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ సాధించలేకపోయిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తాచాటాడు. తన క్యారమ్ బంతులతో కివీస్ బ్యాటర్లను అశ్విన్‌ను బోల్తా కొట్టించాడు. రచిన్ రవీంద్ర, విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి కీలక వికెట్లను పడగొట్టి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 16 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 63 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.ప్రతీకారం తీర్చుకున్న అశ్విన్..ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్‌ను అశ్విన్ ఔట్ చేసిన విధానం గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. కివీస్ ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన అశ్విన్‌ను ఫిలిప్స్ టార్గెట్ చేశాడు. ఈ క్రమంలో తొలి మూడు బంతుల్లో ఫిలిప్స్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అశూపై పైచేయి సాధించినట్లు ఫిలిప్స్ థీమాగా కన్పించాడు. కానీ అశ్విన్ మాత్రం దెబ్బతిన్న సింహంలా అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.ఓ సంచలన బంతితో ఫిలిప్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్‌కు సదరు కివీ బ్యాటర్ దగ్గర సమాధానమే లేకుండాపోయింది. అతడిని బౌల్డ్ చేసిన వెంటనే అశ్విన్ గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నా బౌలింగ్‌లోనే సిక్సర్లు కొడతావా అన్నట్లు ఫిలిప్స్ వైపు చూస్తూ అశ్విన్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.పట్టు బిగించిన భారత్..ఇక ముంబై టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఆటగాడు విల్ యంగ్(51) సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి A special effort to dismiss Glenn Phillips 🔥Ashwin takes Phillips as New Zealand loses their 6th wicket. Lead is 103 now. #INDvNZ #ashwin #IndiaVsNewZealand #3rdtest #Mumbai #bcci pic.twitter.com/BbNWJ2ylBR— Abhinandan Bhattacharjee (@Abhi11590) November 2, 2024 -
ముంబై టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటిన భారత స్పిన్నర్లు.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మయాజాలానికి బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు జడేజా 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ చెరో మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు పేసర్ ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో మాట్ హెన్రీ(10), ఓ రూర్కే ఉన్నారు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(51) హాఫ్ సెంచరీ సాధించాడు.263కు భారత్ ఆలౌట్..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60) హాఫ్ సెంచరీలతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడితో పాటు హెన్రీ, ఫిలిప్స్, సోధీ ఒక్క వికెట్ సాధించారు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs UAE: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి -
'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన భారత బ్యాటర్లు.. ఇప్పుడు వాంఖడే వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో అదే తీరును కనబరిచారు.శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60),సుందర్(38) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. దీంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ను ఏకంగా 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు టీమిండియా మెన్‌జెమెంట్ పంపించింది. అంతకంటే ముందు సర్ఫరాజ్ స్ధానంలో మొదటి రోజు ఆటలో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మెన్‌గా ప్రమోట్ చేసింది. కానీ సిరాజ్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆటలో కూడా సర్ఫరాజ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదు. అతడి కంటే ముందు పంత్, జడేజాలను జట్టు మెన్‌జెమెంట్ బ్యాటింగ్‌కు పంపిచారు.ఇక 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్.. ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గంభీర్‌లపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశాడు.అదొక చెత్త నిర్ణయం.."సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన మొదటి మూడు టెస్టుల్లో మూడు అర్ధశతకాలు సాధించాడు. బెంగుళూరు టెస్టులో సూపర్ సెంచరీ(150)తో చెలరేగాడు. స్పిన్‌కు అద్భుతంగా ఆడుతున్నాడు.రైట్ అండ్ లెఫ్ట్ కాంబనేషన్ను కొనసాగించడానికి అతడిని డిమోట్ చేశారా? అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎందుకు మార్చారు? ఈ విషయం నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. ఏకంగా అతడిని 8వ స్ధానానికి నెట్టేశారు. ఏమైనప్పటికీ భారత జట్టు మెన్‌జెమెంట్ ఓ చెత్త నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో మంజ్రేకర్ మండి పడ్డాడు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్‌మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు' -
పంత్ అవుట్.. గిల్ సెంచరీ మిస్.. భారత్ స్కోరెంతంటే?
న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా మెరుగైన స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగుల వద్ద నిలిచింది. కాగా కివీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 0-2తో చేజార్చుకుంది.ఈ క్రమంలో ముంబై వేదికగా శుక్రవారం మొదలైన మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలన్నా.. కివీస్ చేతిలో వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలన్నా భారత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.తొలిరోజు కివీస్ 235 పరుగులకు ఆలౌట్ ఇక వాంఖడే వేదికగా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయగలిగింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు తొలి రోజే.. తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయింది.రోహిత్, కోహ్లి ఫెయిల్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(18) మరోసారి విఫలమయ్యాడు. ఇక జైస్వాల్ వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. విరాట్ కోహ్లి(4) రనౌట్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది.ఫలితంగా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 86 పరుగులే చేసింది. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో శనివారం నాటి ఆట మొదలుపెట్టి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించారు. కివీస్ బౌలర్లపై అటాక్ చేస్తూ ఇద్దరూ అర్ధ శతకాలు సాధించారు.గిల్‌కు టెస్టుల్లో ఏడో ఫిఫ్టీగిల్ 66 బంతుల్లో యాభై పరుగులు పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే, ఇష్ సోధి బౌలింగ్‌లో పంత్(60) లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరగగా.. భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 𝐒𝐡𝐚𝐚𝐧𝐝𝐚𝐫 𝐉𝐚𝐛𝐚𝐫𝐝𝐚𝐬𝐭 𝐙𝐢𝐧𝐝𝐚𝐛𝐚𝐝 🙌 #INDvNZ #IDFCFirstBankTestTrophy #JioCinemaSports #ShubmanGill pic.twitter.com/SujiHXhlOw— JioCinema (@JioCinema) November 2, 2024 ఇక శనివారం భోజన విరామ సమయానికి టీమిండియా 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 70, జడేజా 10 పరుగులతో ఆడుతున్నారు. కాగా కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే టీమిండియా ఇంకా 40 పరుగులు వెనుకబడి ఉంది. గిల్ సెంచరీ మిస్‌అయితే, లంచ్ తర్వాత గిల్ 90 పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద అవుయ్యాడు. అంతకంటే ముందు రవీంద్ర జడేజా(14), సర్ఫరాజ్ ఖాన్(0) వికెట్లను భారత్ కోల్పోయింది. 53.2 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమిండియా 227 పరుగులు చేసింది.టీమిండియా-న్యూజిలాండ్ మూడో టెస్టుప్లేయింగ్ ఎలెవన్ టీమిండియారోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: IPL 2025: మన లీడర్.. మన కెప్టెన్.. రీటైన్ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరు? -
Ind vs NZ: గిల్ ఫిఫ్టీ.. పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. దూకుడుగా భారత్
టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా మూడో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్‌నైట్ స్కోరు 86/4తో శనివారం ఆట మొదలుపెట్టిన భారత్ పటిష్ట స్థితిలో నిలవాలంటే కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.గేర్ మార్చిన గిల్, పంత్శుక్రవారం ఆట పూర్తయ్యేసరికి ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసిన పంత్.. 31 పరుగులతో ఉన్న గిల్ శనివారం గేర్ మార్చారు. కివీస్ బౌలింగ్‌పై ఆది నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో గిల్ 66 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే గిల్ 46 పరుగుల వద్ద ఉండగా.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫిలిప్స్ వేసిన బంతిని గిల్ లాంగాన్ మీదుగా తరలించగా.. ఫీల్డర్ చాప్మన్ క్యాచ్ పట్టేందుకు వచ్చి విఫలమయ్యాడు. దీంతో గిల్‌కు లైఫ్ లభించింది. పంత్ మెరుపు హాఫ్ సెంచరీఇక రిషభ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగి మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 36 బంతుల్లోనే యాభై పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ క్రమంలో 31 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 74 పరుగులు వెనుకబడి ఉంది.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియాకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ మూడూ గెలవడం ఖాయమని.. రోహిత్ సేన సులువుగానే ఫైనల్‌కు చేరుతుందని సిరీస్ ఆరంభంలో అంతా అనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి.బెంగళూరు, పుణెలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో రెండింటిలో ఓటమి తప్పలేదు. ఫలితంగా పన్నెండేళ్ల తర్వాత భారత్ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోయింది. దీంతో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.తొలిరోజు ఆటలో రాణించిన జడ్డూ, వాషీ..కానీ.. ఇక్కడా టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. తొలిరోజు బౌలర్లు శుభారంభం అందించినా.. బ్యాటర్లు దానిని నిలబెట్టలేకపోయారు. కాగా వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుత రీతిలో రాణించి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు.జడ్డూ ఐదు, వాషీ నాలుగు వికెట్లు తీయగా.. పేసర్ ఆకాశ్ దీప్(ఒక వికెట్) కూడా తన వంతు సహకారం అందించాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.ఆ ఆనందం కాసేపట్లోనే ఆవిరిభారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే కెప్టెన్, రోహిత్ శర్మ(18 బంతుల్లో 18)పెవిలియన్ చేరాడు. ఆది నుంచే దూకుడుకనబరిచిన అతడు.. కివీస్ ఫీల్డర్ల తప్పిదాల వల్ల రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయినప్పటికీ అగ్రెసివ్‌గా ఆడి పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ జైస్వాల్(30)ను బౌల్డ్ చేసి.. ఈ జోడీని విడదీశాడు. అయితే, ఇక్కడే టీమిండియా మేనేజ్మెంట్ ఓ ప్రయోగం చేసింది. నాలుగో నంబర్లో నైట్‌వాచ్‌మన్‌గా పేసర్ మహ్మద్ సిరాజ్‌ను పంపించింది.ఆఖరి 15 నిమిషాల్లో అంతా తలకిందులుజైస్వాల్ స్థానంలో సిరాజ్ క్రీజులోకి వచ్చీ రాగానే.. అజాజ్ పటేల్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఎదుర్కొన్న తొలి బంతికే సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి(4).. రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. ఫలితంగా టీమిండియా 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కంటే 149 పరుగులు వెనుకబడి ఉంది. రిషభ్ పంత్ ఒకటి, శుబ్‌మన్ గిల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిజానికి శుక్రవారం 4. 45 నిమిషాల వరకు టీమిండియాదే పైచేయి. కానీ పదిహేను నిమిషాల్లోనే అంతా తారుమారైంది. జైస్వాల్, సిరాజ్, కోహ్లి అవుటైన తర్వాత కివీస్ పటిష్ట స్థితికి చేరుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉కివీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్👉తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 86/4 (19)తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్న్యూజిలాండ్ టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓ రూర్కీ. చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమిInd vs NZ: చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి! -
చెప్పినా వినని సర్ఫరాజ్ ఖాన్.. రోహిత్‌కు వార్నింగ్.. ఆఖరికి!
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన పని వల్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశానికి లోనయ్యాడు. అంపైర్లతో చిన్నపాటి వాగ్వాదానికి దిగాడు. అయితే, సర్ఫరాజ్‌ను సమర్థించే క్రమంలో ఆరంభంలో కాస్త దూకుడు ప్రదర్శించిన రోహిత్.. తర్వాత చల్లబడ్డాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరు, పుణెలలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పర్యాటక కివీస్ జట్టు రోహిత్ సేనకు ఊహించని షాకిచ్చింది. రెండింటిలోనూ ఘన విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియాకు టెస్టు సిరీస్‌లో ఓటమిని రుచిచూపించింది.ఆరంభం బాగున్నాఫలితంగా అవమానభారంతో కుంగిపోయిన టీమిండియా ముంబైలో జరుగుతున్న మూడో టెస్టులో గెలుపొంది.. పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది. Washington bowls a jaffa to castle Latham 🤌 Don't miss LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/BY5BeQRJ08— JioCinema (@JioCinema) November 1, 2024 ఆరంభంలోనే పేసర్ ఆకాశ్ దీప్ డెవాన్ కాన్వే(4) వికెట్ తీసి బ్రేక్ ఇవ్వగా.. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరో ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్(28), స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5)ను పెవిలియన్‌కు పంపాడు.సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ సూపర్ హాఫ్ సెంచరీలతో రాణించి.. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగుల మెరుగైన స్కోరు సాధించేలా చేశారు. అయితే, ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చిన వేళ సర్ఫరాజ్ ఖాన్ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్‌కు ముందు బౌలర్ బంతిని రిలీజ్ చేసే సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్.. బ్యాటర్‌కు మరీ దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అప్పుడు క్రీజులో ఉన్న డారిల్ మిచెల్ సర్ఫరాజ్ వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటుందని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కనిపించింది.రోహిత్‌కు వార్నింగ్ఈ క్రమంలో అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ సర్ఫరాజ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పిలిచి.. మాటలు తగ్గించాలని సూచించాడు. దీంతో అసహనానికి లోనైన రోహిత్ అంపైర్‌తో కాసేపు వాదించాడు. ఆ తర్వాత మిచెల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడాడు. దీంతో మిచెల్ సైతం రోహిత్ వ్యాఖ్యలతో అంగీకరించినట్లుగా తిరిగి తన బ్యాటింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ కంటే ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్pic.twitter.com/H0G7GazjgE— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 1, 2024 -
నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రనౌట్ అయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ సైతం కోహ్లి తీరును విమర్శిస్తున్నారు. ‘‘నీలాంటి దిగ్గజ ఆటగాడు కూడా ఇలా చేస్తే.. జట్టుకు నీతో ఏం ఉపయోగం?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన కోహ్లి.. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17, 47, 29(నాటౌట్) పరుగులు స్కోరు చేశాడు. బలహీన ప్రత్యర్థిపై కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. ఈ సిరీస్‌లో భారత్ గెలిచింది కాబట్టి కోహ్లి విఫలమైనా పెద్దగా నష్టం జరుగలేదు.ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపుఅయితే, న్యూజిలాండ్‌తో టెస్టుల్లోనూ కోహ్లి ఆట తీరు మారలేదు. బెంగళూరులో తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్ 70 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపు.. పుణెలో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫెయిల్ అయ్యాడు.ఆ మ్యాచ్‌లో కోహ్లి సాధించిన స్కోర్లు 1, 17. ఇక ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలై.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నాటి మూడో టెస్టు మొదలైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది పర్యాటక కివీస్ జట్టు.ఆది నుంచే ఎదురుదెబ్బలుభారత బౌలర్ల విజృంభణ కారణంగా 235 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి.ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(18) దూకుడుగా ఆడి తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. జైస్వాల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ కాగా.. భారత్ ఒక్క బంతి వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.హెన్రీ డైరెక్ట్ త్రో.. కోహ్లికి షాక్ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడాల్సిన కోహ్లి ఊహించని రీతిలో రనౌట్ అయ్యాడు. భారత ఇన్నింగ్స్ పందొమ్మిదవ ఓవర్లో రచిన్ రవీంద్ర వేసిన మూడో బంతిని షాట్ ఆడిన కోహ్లి.. సింగిల్ కోసం గిల్‌ను పిలిచాడు. ఇద్దరూ క్రీజును వీడిన సమయంలో.. బంతిని అందుకున్న ఫీల్డర్ మ్యాట్ హెన్రీ కోహ్లి వస్తున్న నాన్ స్ట్రైకర్ ఎండ్ వికెట్ల వైపు బాల్ త్రో చేశాడు. నేరుగా అది వికెట్లను గిరాటేయడంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికి కోహ్లి డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. కేవలం నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి అవుట్ కాగా టీమిండియా కష్టాల్లో పడింది.ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 86 రన్స్ స్కోరు చేసింది. గిల్ 31, రిషభ్ పంత్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..!There was never a run but Virat Kohli thinks he is the fittest and he should take a risk.Run-out in test cricket is the worst thing, he could have avoided that single.There was a whole day left to score runs.pic.twitter.com/QRyi86oG35— Sujeet Suman (@sujeetsuman1991) November 1, 2024 -
ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్‌ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!
వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్‌దే పైచేయి... కానీ తర్వాతి 8 బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్‌తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లి రనౌట్ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్ నిరాశగా ఆటను ముగించింది. అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్‌లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (38 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్ ఒక మార్పు చేసింది. బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించగా... న్యూజిలాండ్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్ హీరో సాంట్నర్ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్ టీమ్ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్ ఎంచుకుంది. భారీ భాగస్వామ్యం... కివీస్ ఇన్నింగ్స్ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్‌లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్ టామ్ లాథమ్ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్‌తో పాటు రచిన్ రవీంద్ర (5)లను సుందర్ క్లీన్»ౌల్డ్ చేయడంతో 72/3 వద్ద కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్‌డెల్ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్ ఎట్టకేలకు సుందర్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి రనౌట్... రోహిత్ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ బ్లన్‌డెల్ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. ఎజాజ్ బౌలింగ్‌లో అనవసరపు రివర్స్ స్వీప్‌నకు ప్రయత్నించి జైస్వాల్ బౌల్డ్ కాగా... నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన సిరాజ్ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్‌కు మరో షాక్ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్‌కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (బి) సుందర్ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 4; యంగ్ (సి) రోహిత్ (బి) జడేజా 71; రచిన్ (బి) సుందర్ 5; మిచెల్ (సి) రోహిత్ (బి) సుందర్ 82; బ్లన్‌డెల్ (బి) జడేజా 0; ఫిలిప్స్ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్ (ఎల్బీ) (బి) సుందర్ 7; రూర్కే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్: సిరాజ్ 6–0–16–0, ఆకాశ్‌దీప్ 5–0–22–1, అశ్విన్ 14–0–47–0, వాషింగ్టన్ సుందర్ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (బ్యాటింగ్) 31; సిరాజ్ (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; కోహ్లి (రనౌట్) 4; పంత్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్ 7–1–33–2, ఫిలిప్స్ 4–0–25–0, రచిన్ 1–0–8–0. -
జడేజా సూపర్ డెలివరీ.. కివీస్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో కలిపి ఆరు వికెట్లే తీసిన జడ్డూ.. మూడో టెస్టులో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ముంబై మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పిన్ బౌలర్.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు.క్రీజులో పాతుకుపోయిన న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్(71)ను అవుట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపిన జడ్డూ.. టామ్ బ్లండెల్(0), గ్లెన్ ఫిలిప్స్(17)ల వికెట్లు కూడా తానే దక్కించుకున్నాడు. అదే విధంగా టెయిలెండర్లు ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0)లను అవుట్ చేసి ఐదు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు.అయితే, వీరందరిలోకెల్లా బ్లండెల్‌ను జడేజా అవుట్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా కివీస్ ఇన్నింగ్స్‌లో 45వ ఓవర్‌ను జడ్డూ వేశాడు. ఆ ఓవర్లో రెండో బంతికి విల్ యంగ్‌ను పెవిలియన్‌కు పంపిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్.. ఐదో బంతిని అద్భుత రీతిలో సంధించాడు.ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్లండెల్ జడేజా సూపర్ డెలివరీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో జడ్డూ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించి బ్లండెల్ విఫలమయ్యాడు. రెప్పపాటులో బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో బిక్కముఖం వేశాడు. నిజానికి బ్లండెల్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా ఇలాగే జరిగేది.. జడ్డూ వేసిన బంతి అలాంటిది మరి! ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా కివీస్‌తో బెంగళూరు, పుణెలలో జరిగిన టెస్టుల్లో జడ్డూ మూడేసి వికెట్లు తీశాడు. ఇక ఈ రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ముంబైలో జరుగుతున్న తాజా టెస్టులో గెలిస్తేనే క్లీన్‌స్వీప్ పరాభవం నుంచి తప్పించుకోవడంతో పాటు.. రోహిత్ సేనకు డబ్ల్యూటీసీ ఫైనల్ లైన్ ఈజీగా క్లియర్ అవుతుంది.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు కట్టడి చేసింది. తొలిరోజే న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు జడేజాకు ఐదు, వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే, బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(18), యశస్వి జైస్వాల్(30) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరగా.. నాలుగో స్థానంలో వచ్చిన పేసర్ మహ్మద్ సిరాజ్ డకౌట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లి(4) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 19 ఓవర్లలో 86 పరుగులు చేసిన టీమిండియా.. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.చదవండి: IND A vs AUS A: సెంచరీకి చేరువైన సాయి సుదర్శన్Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 -
టీమిండియా స్పిన్నర్ల ప్రతాపం.. తొలిరోజే కివీస్ ఆలౌట్
న్యూజిలాండ్‌తో మూడో టెస్టును టీమిండియా మెరుగ్గా ఆరంభించింది. ముంబైలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలిరోజే కివీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్‌పై రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. అయితే, బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. పుణె మ్యాచ్‌లోనూ ఘోర పరాభవం పాలైంది. కివీస్ చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయితద్వారా సొంతగడ్డపై పన్నెండేళ్ల తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన తొలి భారత జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సాఫీగా చేరాలన్నా.. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలన్నా ఈ మ్యాచ్‌లో గెలవడం రోహిత్ సేనకు అత్యంత ముఖ్యం. లంచ్‌కు ముందు ఇలాఈ నేపథ్యంలో శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టిన కాసేపటికే ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి పేసర్ ఆకాశ్ దీప్ శుభారంభం అందించగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), రచిన్ రవీంద్ర(5) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్నాడు.జడేజా విశ్వరూపంలంచ్ బ్రేక్‌కు ముందు వీరిద్దరు కలిసి మూడు వికెట్లు తీయగా.. భోజన విరామం సమయం తర్వాత మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం ప్రదర్శించాడు. విల్ యంగ్(71) రూపంలో తొలి వికెట్ దక్కించుకన్న జడ్డూ.. ఆ తర్వాత టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ల పనిపట్టాడు.Jadeja stuns the Kiwis with a double strike 💥 Catch LIVE action from the 3rd #INDvNZ Test, on #JioCinema, #Sports18 and #ColorsCineplex!#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/Gyy3vZgTz2— JioCinema (@JioCinema) November 1, 2024 అదే విధంగా ఇష్ సోధి(7), మ్యాట్ హెన్రీ(0) వికెట్లను కూడా జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. వాషీ డారిల్ మిచెల్(82), అజాజ్ పటేల్(7)లను కూడా అవుట్ చేసి మొత్తంగా తన వికెట్ల సంఖ్యను నాలుగుకు పెంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(71), డారిల్ మిచెల్(82) మినహా భారత స్పిన్నర్ల ప్రతాపం ముందు కివీస్ బ్యాటర్లంతా తలవంచారు. దీంతో 65.4 ఓవర్లలో న్యూజిలాండ్ 235 పరుగులు(తొలి ఇన్నింగ్స్) చేసి తొలిరోజే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో జడ్డూ ఐదు, వాషీ నాలుగు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాకూ ఆదిలోనే ఎదురుదెబ్బఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారత కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దూకుడుగా ఆడిన రోహిత్ 18 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబరు 1- 5)👉వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235 రన్స్.. ఆలౌట్.చదవండి: చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
IND Vs NZ: రెచ్చిపోయిన సుందర్.. లంచ్ విరామం సమయానికి కివీస్ స్కోర్ ఎంతంటే..?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ స్టార్ బ్యాటర్లు టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్రను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. డెవాన్ కాన్వేను (4) ఆకాశ్‌దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లంచ్ విరామం సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. విల్ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) క్రీజ్‌లో ఉన్నారు.WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!- First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.Akash Deep traps Conway. 🔥 pic.twitter.com/tuTjqKupDf— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. బుమ్రా ఔట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 1) మొదలుకానున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇదివరకే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం -
కివీస్‌తో మూడో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్‌ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్‌కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్‌లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు. హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. మూడో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ నేరుగా చెప్పనప్పటికీ.. వర్క్ లోడ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో సైతం బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఆకాశ్‌దీప్, మొహ్మద్ సిరాజ్ నెట్స్‌లో లాంగ్ స్పెల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.మూడో టెస్ట్‌లో ఇద్దరు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో ఆడిన స్పిన్నర్లే మూడో టెస్ట్‌లోనూ కొనసాగవచ్చు. మూడో టెస్ట్ కోసమని హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను బెంచ్‌కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు. మూడో టెస్ట్‌లో టీమిండియా ఒక్క మార్పు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుమ్రా స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగవచ్చు.న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం భారత జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
Ind vs NZ: టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలం: గంభీర్
న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు విఫలమైన తీరు మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేసింది. బెంగళూరు మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ కావడం సహా.. పుణెలోనూ నామమాత్రపు స్కోర్లు(156, 245) చేయడం విమర్శలకు తావిచ్చింది. మఖ్యంగా.. రెండో టెస్టులో కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన భారత బ్యాటర్ల కారణంగా ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.పరువు కోసం.. ఫైనల్ కోసంపన్నెండేళ్ల తర్వాత తొలిసారి టీమిండియా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైంది. జూనియర్లతో పాటు సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ బౌలింగ్‌లో తడబడ్డారు. భారత బ్యాటర్ల పుణ్యమా అని అతడు తన టెస్టు కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(13/157) నమోదు చేశాడు.ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. కివీస్‌తో కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని కఠినంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భారత బ్యాటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలంముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. అందుకే చాలా మంది బ్యాటర్లు డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే, విజయవంతమైన ఆటగాళ్లలో ఫార్మాట్లకు అతీతంగా మూడింటిలో స్ట్రాంగ్‌గా డిఫెన్స్ చేసుకునే వారే ఎక్కువ.వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటానికి ఉన్న ప్రాధాన్యాన్ని మనం మరచిపోకూడదు. ప్రతిసారి ఆటగాళ్లకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. తద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. టెస్టుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ దూకుడు తగ్గించి ఆచితూచి ఆడాలని పరోక్షంగా బ్యాటర్లకు హితవు పలికాడు.బుమ్రా ఆడకపోవచ్చుఅదే విధంగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఆడకపోవచ్చని గంభీర్ సంకేతాలు ఇచ్చాడు. కివీస్ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనున్న నేపథ్యంలోనే మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవంబరు 1 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా నామమాత్రపు మూడో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ -
అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్ క్లారిటీ
న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ గురించి తాము ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ముంబై మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. అదే విధంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించాడు. రోహిత్ సేనకు ఊహించని షాకులుగొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో ఫామ్‌లేమితో సతమతమయ్యారన్న అభిషేక్ నాయర్.. రోహిత్- కోహ్లి తిరిగి పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేనకు ఊహించని షాక్ తగిలింది.బెంగళూరులో కివీస్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్.. పుణెలో 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఫలితంగా స్వదేశంలో టీమిండియా పన్నెండేళ్ల టెస్టు సిరీస్ జైత్రయాత్రకు తెరపడింది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబై వేదికగా జరుగనున్న మూడో టెస్టు భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే గెలిచి తీరాలి లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలి.జట్టులో మార్పులేమీ లేవుఈ నేపథ్యంలో యువ పేసర్ హర్షిత్ రాణాను మూడో టెస్టులో బరిలోకి దించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వీటిని ఖండించాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జట్టులో మార్పులేమీ లేవు. ఎవరినీ కొత్తగా చేర్చడం లేదు. ప్రతీ వారం.. ప్రతీ రోజు మాకు కీలకమే. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ మీదే ఉంది’’ అని అభిషేక్ నాయర్ తెలిపాడు.ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం ఉందిఅదే విధంగా.. కివీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్- కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘ప్రస్తుతం వాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓపికపట్టాలి కూడా! గొప్ప గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగా లేకపోవచ్చు. అయితే, త్వరలోనే తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉంది’’ అని అభిషేక్ నాయర్ విరాహిత్ ద్వయాన్ని సమర్థించాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్‌లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్‌గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్‌లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్‌లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్‌లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్‌ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
స్మృతి సెంచరీ.. కివీస్‌ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్‌డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్‌తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్‌లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?
హర్షిత్ రాణా త్వరలోనే టీమిండియా అరంగేట్రం చేయనున్నాడా? ఆస్ట్రేలియాతో సిరీస్ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తనవంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైనా ఇంత వరకు అరంగేట్రం చేయలేదు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్న టెస్టు జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు హర్షిత్ రాణా. భారత-ఎ జట్టులో భాగమైన యువ క్రికెట్లరు ఇప్పటికే ఆస్ట్రేలియాకు వెళ్లగా హర్షిత్ మాత్రం రంజీ మ్యాచ్ కోసం భారత్‌లోనే ఉన్నాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన హర్షిత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మొత్తంగా ఏడు వికెట్లు తీయడంతో పాటు ధనాధన్ హాఫ్ సెంచరీ(4 ఫోర్లు, 3 సిక్స్‌లు- 59 రన్స్)తో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణాను కివీస్‌తో మూడో టెస్టులో బరిలోకి దించాలని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.ఆకాశ్ దీప్‌పై వేటు?ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం సహా ఫామ్‌లేమితో సతమతమవుతున్న మహ్మద్ సిరాజ్‌ను పక్కనపెట్టాలనే యోచనలో కోచ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్‌ను తప్పించి హర్షిత్ రాణాను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రత్యర్థి బ్యాటర్ ఎంతటి ఘనుడైనా తనదైన శైలిలో బంతులు విసురుతూ వికెట్లు పడగొట్టగల సత్తా ఈ స్పీడ్‌స్టర్ సొంతం.అప్పుడు వాషీ.. ఇప్పుడు రాణాఇక కేకేఆర్ మెంటార్‌గా హర్షిత్‌ను దగ్గరగా గమనించిన గంభీర్.. ఈ ఢిల్లీ పేసర్‌కు కివీస్‌తో మూడో టెస్టులో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో రోహిత్ సేన ఇప్పటికే రెండు ఓడిపోయింది. సిరీస్ కోల్పోయినా పరువు నిలబెట్టుకోవాలంటే నవంబరు 1 నుంచి ముంబైలో జరిగే ఆఖరి టెస్టులో గెలుపు తప్పనిసరి!ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసిన చేసిన విషయం తెలిసిందే. పుణె టెస్టులో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పదకొండు వికెట్లతో సత్తా చాటాడు. ఇప్పుడిక హర్షిత్ రాణా వంతు వచ్చిందేమో?!చదవండి: గంభీర్ సర్ వల్లే ఆరోజు అలా.. టెస్టుల్లోనూ రాణిస్తా: నితీశ్ రెడ్డి -
Ind vs NZ: కివీస్‌తో మూడో టెస్టు.. ప్లాన్ ఛేంజ్.. ‘పిచ్’ మారింది!?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాభవం పాలైన టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. మరోవైపు పిచ్ విషయంలోనూ మేనేజ్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. వాంఖడే వికెట్ తొలిరోజు బ్యాటర్లకు పూర్తిగా అనుకూలించేలా రూపొందించారని వార్తలు వినిపిస్తున్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో భారత్‌కు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఒకటి, ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం మూడు గెలిస్తేనే తప్ప టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం కాదు. కాబట్టి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మిగిలిన మ్యాచ్ గెలిస్తేనే.. ఆస్ట్రేలియాలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టగలదు.తొలిరోజు వారికే అనుకూలం!అందుకే ఏ రకంగా చూసినా న్యూజిలాండ్‌తో ఆడబోయే మూడో టెస్టు భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాంఖడేలో స్పోర్టింగ్ ట్రాక్ తయారుచేయించినట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం పిచ్ మీద కాస్త పచ్చిక ఉంది. తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తోంది. రెండో రోజు నుంచి బంతి కాస్త టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది’’ అని విశ్వసనీయవర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా బెంగళూరు, పుణె టెస్టులో పిచ్ స్పిన్ బౌలింగ్‌కు బాగా అనుకూలించింది. ముఖ్యంగా రెండో టెస్టులో కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఏకంగా పదమూడు వికెట్లు కూల్చి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ తమ స్పిన్‌తో ఆకట్టుకున్నప్పటికీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 113 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్న ఆఖరి టెస్టులో గెలిస్తేనే రోహిత్ సేన పరువు నిలుస్తుంది. చదవండి: IPL 2025: వాషింగ్టన్ సుందర్ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు -
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్ తొలి రెండు టెస్ట్‌లకు కూడా దూరమయ్యాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ దృష్ట్యా విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్మెంట్ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్ కోసం భారత్‌కు రావడం లేదని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోకి తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1న ప్రారంభం కానుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నర్ -
మరీ స్కూల్ పిల్లల్లా ఆడారు: పాక్ మాజీ బ్యాటర్ విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్
భారత క్రికెట్ జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్ సేన మరీ స్కూల్ పిల్లల్లా ఆడిందని.. వీరిని ‘పేపర్ టైగర్స్’ అనాలంటూ విమర్శించాడు. అయితే, టీమిండియా అభిమానులు సైతం.. ‘‘మా జట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ షెహజాద్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. కాగా భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 46 పరుగుల(తొలి ఇన్నింగ్స్)కే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అనంతరం పుణె వేదికగా రెండో టెస్టులోనూ 113 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఫలితంగా 0-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. తద్వారా పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌లో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ సైతం స్పందించాడు. భారత జట్టుపై న్యూజిలాండ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. రోహిత్ సేన పేపర్‌పై మాత్రమే పటిష్టంగా కనిపిస్తుందని.. మైదానంలో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడటం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగాఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో.. ‘‘న్యూజిలాండ్ ఇండియాకు వచ్చి టీమిండియానే ఈ స్థాయిలో ఓడించింది. ఏదో చిన్న జట్టుతో పోటీపడ్డట్లుగా సునాయాస విజయం సాధించింది. ఇప్పటి నుంచి టీమిండియాను చాలా మంది పేపర్ టైగర్స్ అంటారు.మొదటి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్ అయినపుడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రతి ఒక్కరికి చెడ్డరోజు ఒకటి ఉంటుందని చెప్పాడు. మేము కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తాం. కానీ.. రెండో టెస్టులో మీరేం చేశారు? పూర్తిగా ఓటమికి సిద్ధపడ్డట్లే కనిపించారు. బయటివాళ్ల మాటలు పట్టించుకోమని రోహిత్ శర్మ అంటున్నాడు.కానీ.. ఈ రెండు టెస్టులను చూస్తే మీరు ఒత్తిడికి గురవుతున్నారని స్పష్టమైంది. ఏదో స్కూల్ పిల్లలు ఆడుతున్నట్లుగా ఆడారు’’ అని అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ బదులిస్తూ.. ‘‘పాకిస్తాన్ వరుస ఓటముల తర్వాత ఒక్క సిరీస్ గెలిచింది. మీ సంగతి ఏమిటి?మరి మీ జట్టు చిత్తుగా ఓడినపుడు మీరెందుకు ఇలా మాట్లాడలేదు. టీమిండియా తిరిగి పుంజుకుంటుంది. అయినా.. మా జట్టు ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరింది. ఈసారి కూడా టైటిల్ పోరుకు చేరువైంది. మరి మీ సంగతి ఏమిటి?’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. కాగా సొంతగడ్డపై చిత్తుగా సిరీస్‌లు ఓడిన పాకిస్తాన్ ఇటీవల ఇంగ్లండ్‌పై 2-1తో టెస్టు సిరీస్ గెలిచిన విషయ తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నవంబరు 1 నుంచి ముంబైలో మూడో టెస్టు మొదలుకానుంది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
Ind vs NZ 3rd Test: బుమ్రాను జట్టు నుంచి తీసేయండి!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇక ముందు మరింత జాగ్రత్తగా అడుగువేయాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు గెలవడం సహా ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై డీకే తన అభిప్రాయం పంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విరామం ఇవ్వాలని మేనేజ్మెంట్కు సూచించాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్కుఈ క్రమంలో నవంబరు 1 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లనుంది.ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికీ నా మెదడు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నామమాత్రపు మూడో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో ఇప్పుడే చెప్పలేం.బుమ్రా స్థానంలో సిరాజ్ రావాలిఅయితే, నా దృష్టిలో మాత్రం బుమ్రాను తప్పించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకురావాలి. ఎందుకంటే.. బుమ్రాకు ఇప్పుడు విశ్రాంతి అత్యవసరం. మిగతవాళ్లందరినీ కొనసాగించడమే మంచిది. గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదు. బుమ్రాకు మాత్రం రెస్ట్ కావాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఈ పేస్‌గుర్రానికి బ్రేక్ ఇస్తే మంచిదని డీకే ఈ సందర్భంగా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుందన్న అంచనాల నడుమ టీమిండియా ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లలో ఆ ఒక్కరు ఎవరన్నది శుక్రవారం తేలుతుంది. కాగా కివీస్‌తో బెంగళూరు టెస్టులో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. పుణె టెస్టులో మాత్రం ఖాతా తెరవలేదు.చదవండి: IPL 2025: నికోలస్ పూరన్‌కు 18 కోట్లు..! -
‘రోహిత్ గొప్ప నాయకుడు.. ఆసీస్‌తో తొలి మ్యాచ్ ఆడకపోయినా..’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప నాయకుడని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. సహచర ఆటగాళ్ల పట్ల సారథి వ్యవహరించే తీరే అన్నికంటే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. కివీస్‌కు 0-2తో సిరీస్ సమర్పించుకుంది. దీంతో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌ల విజయాల(18) పరంపరకు బ్రేక్ పడింది. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ స్పందించాడు. ‘‘క్రికెటర్లుగా మేము కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాం. గెలుపే మా లక్ష్యం. ఇక రోహిత్ గురించి చెప్పాలంటే.. అతడొక గొప్ప నాయకుడు. మ్యాచ్‌లు గెలిచామా? ఓడిపోయామా? అన్న ఫలితంతో సంబంధం లేకుండా.. ఒక జట్టును తీర్చిదిద్దడంలో కెప్టెన్‌గా తన వంతు పాత్ర చక్కగా పోషిస్తాడు.సహచర ఆటగాళ్లతో అతడి బంధం ఎలా ఉందనేదే ముఖ్యం. అవసరమైన వేళ వాళ్లకు అండగా ఉన్నాడా? లేడా అన్నది కూడా ప్రధానం’’ అని శిఖర్ ధావన్ రోహిత్ శర్మను కొనియాడాడు. ఇక కివీస్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ ఆసీస్‌తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో టీమిండియా గొప్పగా రాణిస్తుంది. రోహిత్ తొలి మ్యాచ్ ఆడతాడా? లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో లేనట్లయితే కచ్చితంగా ఆటగాళ్లు అతడి కెప్టెన్సీని మిస్సవుతారు.అయితే, రోహిత్ లేకపోయినా జట్టులోని ప్రతి ఆటగాడు తమ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ప్రస్తుత టీమ్ ఆసీస్‌లోనూ బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నామమాత్రపు మూడో టెస్టు ముంబై వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా వెళ్తుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. టీమిండియాలో కీలక మార్పు..?
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా కీలక మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని వాంఖడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా చేస్తే స్పెషలిస్ట్ పేసర్‌గా బుమ్రా ఒక్కడికే అవకాశం దక్కుతుంది. అదనపు స్పిన్నర్ కోటాలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రావచ్చు. అక్షర్‌కు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నందున్న మేనేజ్మెంట్ ఇతనివైపే మొగ్గు చూపుతుంది. ఒకవేళ అక్షర్ తుది జట్టులోకి వస్తే ఆకాశ్‌దీప్‌పై వేటు పడుతుంది. ఆకాశ్‌దీప్ రెండో టెస్ట్ మొత్తంలో కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయితే అతను బంతిని కూడా పట్టుకోలేదు. వాంఖడే ట్రాక్ ఇంచుమించు పూణే పిచ్ మాదిరే ఉండే అవకాశం ఉన్నందున టీమిండియా తప్పక నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ పేరును సైతం పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. అయితే కుల్దీప్కు గజ్జల్లో గాయమైందని ప్రచారం జరుగుతుంది. ఈ కారణంగానే అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఎంపిక చేయలేదని తెలుస్తుంది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ముడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో మూడో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
అహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్ (41), మ్యాడీ గ్రీన్ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్ తలో మూడు వికెట్లు.. ఏడెన్ కార్సన్, జెస్ కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రాధా యాదవ్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్‌ప్రీత్ కౌర్ 24, జెమీమా రోడ్రిగెజ్ 17, తేజల్ హసబ్నిస్ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్ 29 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో
మహిళల క్రికెట్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ సెన్సేషన్ క్యాచ్ నమోదైంది. టీమిండియా ప్లేయర్ రాధా యాదవ్ నమ్మశక్యం కాని రీతిలో ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను గతంలో యువరాజ్ సింగ్ పట్టిన ఓ సెన్సేషన్ క్యాచ్‌తో పోలుస్తున్నారు.RADHA YADAV WITH A STUNNER. 🤯pic.twitter.com/CuvFs7nAc3— Mufaddal Vohra (@mufaddal_vohra) October 27, 2024కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 41 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 191/4గా ఉంది. సుజీ బేట్స్ (58), జార్జియా ప్లిమ్మర్ (41), లారెన్ డౌన్ (3), బ్రూక్ హ్యాలీడే (8) ఔట్ కాగా.. సోఫీ డివైన్ (60), మ్యాడీ గ్రీన్ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, ప్రియా మిశ్రా, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఎల్లిస్ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్ బోణీ విజయం -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా కెప్టెన్ రీఎంట్రీ
అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది.అదేవిధంగా యవ పేసర్ ప్రియా మిశ్రా ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు రేణుకా సింగ్, హేమలతకు భారత జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైంది.ఆమెతో పాటు మోలీ పెన్ఫోల్డ్ కూడా రెండో వన్డేకు దూరమైంది. ఈ క్రమంలో వీరిద్దిరి స్ధానాల్లో జట్టులోకి తహుహు, జోన్స్ వచ్చారు. కాగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రాన్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, లారెన్ డౌన్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్ -
గౌతం గంభీర్ కీలక నిర్ణయం!?
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 టీమిండియా కోల్పోయింది. దీంతో సొంతగడ్డపై 12 ఏళ్ల భారత టెస్టు సిరీస్ విజయాల పరంపంరకు బ్రేక్ పడింది. అంతేకాకుండా ఈ ఓటమితో భారత్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కూడా సన్నగిల్లాయి. ఇక తొలి రెండు టెస్టుల్లో ఓటమి చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు సిద్దమైంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ నేపథ్యంలో భారత జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకోవాల్సింది.నో ఛాయిస్..!న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుకు ముందు ప్రతీ ఒక్కరూ ట్రైనింగ్ సెషన్లో కచ్చితంగా పాల్గోవాలని టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తమ ఆటగాళ్లకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏ ఒక్కరూ మినహాయింపు కాదని గంభీర్ స్పష్టం చేశాడంట. కాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు పుణే నుంచి ఆదివారం(ఆక్టోబర్ 27) ముంబైకి చేరుకోనుంది. ఆటగాళ్లకు టీమ్ మేనేజ్మెంట్ రెండు రోజుల విశ్రాంతిని కేటాయించినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పాల్గోనుంది. ఈ రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాక్టీస్ క్యాంపులో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించనున్నారు. స్పిన్నర్లను ఎదుర్కొవడంతో తడబడుతున్న భారత జట్టు.. ఈ సన్నాహాక క్యాంపులో ఆ ఆంశంపై దృష్టిసారించే అవకాశముంది.చదవండి: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
చాలా బాధగా ఉంది.. కానీ అతిగా పోస్టుమార్టం చేయనక్కర్లేదు: రోహిత్ శర్మ
సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. వరుసగా 18 సిరీస్‌ల విజయాలతో దూసుకెళుతున్న రోహిత్ సేన దూకుడుకు కివీస్ బ్రేక్‌లు వేసింది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఈ పరాభావన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌కు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటో ఓసారి పరిశీలిద్దాం.ఓటమిపై మీ స్పందన ఏంటి?ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం నన్ను బాధించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యాము. కానీ ఈ ఓటమిపై మరీ ఎక్కువగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఇదే బ్యాటర్లు మాకు ఎన్నో సిరీస్‌లలో విజయాలను అందించారు. ఇటువంటి సమయంలోనే కాస్త భిన్నంగా ఏమి చేయగలమో ఆలోచించాలి. కచ్చితంగా తదుపరి మ్యాచ్‌లో మేము పుంజుకుంటామన్న నమ్మకం ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్ మాకంటే బాగా ఆడింది. వారు ఈ విజయానికి అర్హులు అని రోహిత్ బదులిచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుపై మీ అభిప్రాయం?డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మ్యాచ్‌లో ఓటమిపై నేను ఆలోచిస్తున్నాను. నిజంగా ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామనేది వాస్తవం. ఒక మ్యాచ్‌లో గెలిస్తే ఆ క్రెడిట్ టీమ్ మొత్తానికి దక్కుతుంది. అదే ఓడిపోయినప్పుడు కూడా ఆ బాధ్యతను జట్టు మొత్తం తీసుకోవాలి. సమిష్టి వైఫల్యం కారణంగానే మేము ఓటమి ఓడిపోయాం. అంతే తప్ప కేవలం ఒకరిద్దరిపైనే నెపం నెట్టడం సరికాదు. మేము ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాం. మాకు ఆ సిరీస్ కీలకం కానుంది. తొలిసారి ఆసీస్‌తో టెస్టులు ఆడనున్న ఆటగాళ్లకు నేను అన్ని విధాలగా సపోర్ట్‌గా ఉంటాను. అక్కడ గెలవడమే మా లక్ష్యమని రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత జట్టు..ఈ ఘెర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై భారత్ టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే పుణే టెస్టులో రోహిత్ సేన పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 245 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయారు. లక్ష్య చేధనలో యశస్వీ దూకుడుగా ఆడి అభిమానుల్లో గెలుపుపై ఆశలను పెంచాడు. కానీ మిగితా బ్యాటర్లు చేతులేత్తేయడంతో టీమిండియా ఓటమి చవిచూసింది. జైశ్వాల్ 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో యశస్వీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.జైశ్వాల్ అరుదైన ఘనత.. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో 30 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదిన తొలి భారత ప్లేయర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. 2024 ఏడాదిలో జైశ్వాల్ ఇప్పటివరకు 32 సిక్స్‌లు కొట్టాడు.ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జైశ్వాల్ రెండో స్ధానంలో నిలిచాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ (33 సిక్స్‌లు) పేరిట ఉంది. ఈ కివీ దిగ్గజం 2014లో 33 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు యశస్వీ మరో రెండు సిక్స్‌లు బాదితే మెక్కల్లమ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. కివీస్‌తో జరిగే మూడో టెస్టులో ఈ రికార్డు బద్దులు అయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: ‘కివీ’ చేతుల్లో ఖేల్ ఖతం! -
కోపంతో ఊగిపోయిన విరాట్ కోహ్లి! బ్యాట్‌తో ఏమి చేశాడంటే? వీడియో
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో రోహిత్ సేన కోల్పోయింది.కాగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే రెండో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 13 వికెట్లతో తమ జట్టుకు భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన సహనాన్ని కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్‌పై కోహ్లి సీరియస్ అయ్యాడు. తన ఔట్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని విరాట్ వ్యతిరేకించాడు.అసలేం జరిగిందంటే?భారత ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేసిన సాంట్నర్ బౌలింగ్‌లో చివరి బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. దీంతో కివీస్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ ఇల్లింగ్ వర్త్ ఔట్ అని చేతి వేలు పైకెత్తాడు. అయితే బంతి స్టంప్స్‌ను మిస్ అవుతుందని భావించిన కోహ్లి.. వెంటనే రివ్యూ కోరాడు. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్‌గా తేలింది. ఈ క్రమంలోనే అంపైర్‌పై కోహ్లి అగ్రహం వ్యక్తం చేశాడు. అతడి వైపు సీరియస్‌గా చూస్తూ కోహ్లి మైదానాన్ని వీడాడు.అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్రమంలో ఐస్ బ్యాక్స్‌కు తన బ్యాట్‌తో కోపంతో బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.Dear bro Virat Kohli, The bat is hit over the ball, not over this water box.🤬 #INDvNZ pic.twitter.com/FZshuZIkzL— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 26, 2024చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ -
టీమిండియాకు ఏమైంది..? 12 ఏళ్ల తర్వాత తొలిసారి! కారణాలు ఇవే?
సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు న్యూజిలాండ్ భయాన్ని పరిచయం చేసింది. గత 12 ఏళ్లగా టెస్టు క్రికెట్లో స్వదేశంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ దూకుడుకు కివీస్ కళ్లెం వేసింది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.స్వదేశంలో చివరగా 2012లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. మళ్లీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత రెడ్ బాల్ సిరీస్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. ఈ సిరీస్ ఓటమితో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో సొంత గడ్డపై ప్రత్యర్ధులను చిత్తుచేసే భారత్‌కు ఇప్పుడు ఏమైందన్న చర్చ క్రీడావర్గాల్లో మొదలైంది. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ టీమిండియా కోల్పోవడానికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం. ఓటమి కారణాలు ఇవే..బ్యాటింగ్ ఫెయిల్..టీమిండియా సిరీస్‌ను కోల్పోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫలమ్యనే చెప్పుకోవాలి. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఒక్క సర్ఫరాజ్ ఖాన్,రిషబ్ పంత్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు పుణే టెస్టులో కూడా అదే పరిస్థితి. రెండు ఇన్నింగ్స్‌లలో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకులేకపోయారు.మొదటి టెస్టులో కివీస్ పేసర్ల దాటికి 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్నర్ల ముందు బ్యాట్లెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత్ విల్లాడింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు సైతం చెత్త షాట్లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు. కనీసం ఒక్కరు కూడా కివీస్ బౌలర్లను అడ్డుకుని భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమిని శాసించాడు.నో డిఫెన్స్, ఓన్లీ హిట్టింగ్..ముఖ్యంగా ప్రస్తుత భాత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్కరికి కూడా టెస్టు క్రికెట్ ఆడే సహనం లేదు. ఒకప్పుడు సంప్రదాయ క్రికెట్ అంటే రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా వంటి ఆటగాళ్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయేవారు. వారిని పెవిలియన్‌కు పంపేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. క్రీజులోకి వచ్చామా వన్డే, టీ20 తరహాలో ఆడామా అన్నట్లు భారత బ్యాటర్ల తీరు ఉంది. హిట్టింగ్ చేసే ప్రయత్నంలో తమ వికెట్లను కోల్పోతున్నారు. అంతేకాకుండా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్లో రాణించాలంటే భారత జట్టు కచ్చితంగా స్పిన్ బలహీనతను అధిగిమించాలి.కొంపముంచిన పిచ్..పుణే టెస్టులో భారత్ ఓటమికి మరో కారణం పిచ్. సాధారణంగా పుణే పిచ్ అటు పేస్ బౌలింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ కివీస్‌పై పూర్తిగా స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూసింది. పుణే వికెట్‌ను స్పిన్‌కు అనుకూలించేలా తయారు చేశారు.కానీ భారత్ అనుకున్నది ఒక్కటి.. అయింది ఒక్కటి. కివీస్‌ను స్పిన్‌తో దెబ్బకొట్టాలని భావించిన టీమిండియా.. అదే స్పిన్ ట్రాప్‌లో చిక్కుకుని విల్లవిల్లాడింది. భారత బ్యాటర్లకంటే న్యూజిలాండ్ ప్లేయర్లే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని కివీస్ అందుకుంది. -
కివీస్ సరికొత్త చరిత్ర.. రోహిత్ చెత్త రికార్డు
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయపరంపరకు కళ్లెం పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో రోహిత్ సేన 113 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఫలితంగా గత 18 టెస్టు సిరీస్‌లలో టీమిండియా సాగించిన జైత్రయాత్రకు బ్రేక్ పడింది. కివీస్ సరికొత్త చరిత్రఅంతేకాదు.. పుణె టెస్టు ఓటమితో రోహిత్ సేన ఖాతాలో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. స్వదేశంలో కివీస్ జట్టు చేతిలో భారత్‌కు ఇదే తొలి పరాజయం. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కూడా!.. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ భారత్‌లో మొట్టమొదటి సిరీస్ గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా కివీస్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో రోహిత్ సేనపై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన కివీస్.. తాజాగా పుణె టెస్టులో 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పదమూడు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టు విశేషాలుభారత్లో పర్యాటక జట్ల టెస్టు సిరీస్ విజయాలు👉ఇంగ్లండ్- ఐదుసార్లు👉వెస్టిండీస్- ఐదుసార్లు👉ఆస్ట్రేలియా- నాలుగుసార్లు👉పాకిస్తాన్- ఒకసారి(1986/87)👉సౌతాఫ్రికా- ఒకసారి(1999/00)👉న్యూజిలాండ్- ఒకసారి(2024/25)ఒక క్యాలెండర్ ఇయర్లో టీమిండియా ఓడిన అత్యధిక మ్యాచ్‌లు👉1969- నాలుగు(ఆస్ట్రేలియా చేతిలో మూడు, న్యూజిలాండ్ చేతిలో ఒకటి)👉1983- మూడు(వెస్టిండీస్ చేతిలో మూడు)👉2024- మూడు(న్యూజిలాండ్ చేతిలో రెండు, ఇంగ్లండ్ చేతిలో ఒకటి).కపిల్ దేవ్, అజారుద్దీన్‌తో పాటు రోహిత్రోహిత్ శర్మ ఇప్పటి వరకు సొంతగడ్డపై 15 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కివీస్ చేతిలో ఓటమితో తాజాగా అతడి ఖాతాలో నాలుగో పరాజయం నమోదైంది. అంతకు ముందు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా ఇరవై టెస్టుల్లో సారథ్యం వహించి నాలుగేసి మ్యాచ్‌లు ఓడిపోయారు. ఈ జాబితాలో అత్యధికంగా 9 టెస్టు పరాజయాల(ఇరవై ఏడింట)తో మన్సూర్ అలీ పటౌడీ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు. చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్‌తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్..