నేడూ టీ–20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం | India vs New Zealand T20I: Phase-2 Ticket Sales to Begin in Visakhapatnam | Sakshi
Sakshi News home page

నేడూ టీ–20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం

Jan 25 2026 8:22 AM | Updated on Jan 25 2026 8:22 AM

India vs New Zealand T20I: Phase-2 Ticket Sales to Begin in Visakhapatnam

విశాఖ స్పోర్ట్స్‌: వైజాగ్‌ వేదికగా జరగనున్న భారత్‌–న్యూజిలాండ్‌ టీ–20 మ్యాచ్‌కు సంబంధించి రెండో దశ టికెట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్‌లతో పాటు కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251 కాగా, ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా.. టీ–20 సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనుండగా, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మ్యాచ్‌ ప్రారంభం కానుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement