చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments On Chandrababu Govt Debt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే: వైఎస్‌ జగన్‌

Mar 11 2026 11:56 AM | Updated on Mar 11 2026 12:26 PM

YS Jagan Key Comments On Chandrababu Govt Debt

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమేనని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ​కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్‌ రిపోర్టు చెప్పిందన్నారు. చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయ‌న్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగాయని తెలిపారు. చంద్రబాబు ప్రతీసారి ఎన్‌బీసీని చంద్రబాబు ఉల్లంఘిస్తూనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్‌లో మోసాలు కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి. ​కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు కాగ్‌ రిపోర్టు చెప్పింది. నేను చెప్పిన విషయాలనే కాగ్‌ రిపోర్టు చెప్పింది. 2023-24లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 2,36,486 కోట్లు. 2023-24లో రాబడులు రూ.1,70,767 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు రూ.32,680 కోట్లు. ద్రవ్యలోటు రూ.62,719 కోట్లు. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,096 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వంలో రాబడులు 1,68,024 కోట్లు మాత్రమే. చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు రూ.60,285 కోట్లు.

అప్పుల్లోనూ ఉల్లంఘనలే.. 
చంద్రబాబు హయాంలో రాబడులు తగ్గాయి. రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. చంద్రబాబు వచ్చాక రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. కూటమి వచ్చాక ద్రవ్య లోటు 32.5 శాతం పెరిగింది. చంద్రబాబు పాలనంతా ఆర్థిక విధ్వంసమే. 2024-25లో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 5.89 శాతం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుల శాతం 4.1 శాతమ మాత్రమే. మేము తూచా తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. కోవిడ్‌ పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయినా అప్పులు 4.1 శాతం మాత్రమే చేశాం. ఎన్‌బీసీకి లోబడే ఎవరైనా అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు ప్రతీసారి ఎన్‌బీసీని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. 2014-19 మధ్య అనుమతించిన దాని కన్నా అధికంగా అప్పులు చేశారు. చంద్రబాబు రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు చేశారు. మా హయాంలో పరిమితి కన్నా తక్కువగా అప్పులు చేశాం. 

రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం. కరోనా పరిస్థితులు కూడా తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు రాగానే మళ్లీ సీన్‌ రివర్స్‌ అయ్యింది. 2024-25లో పరిమితికి మించి 17,953 కోట్లు అధిక అప్పులు. 20 నెలల్లో బాబు తెచ్చిన అప్పులు 3.20 లక్షల కోట్లు దాటాయి. మేము ఐదేళ్ల కాలంలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశాం. మేము ఐదేళ్లలో చేసిన అప్పు.. బాబు రెండేళ్లలోనే చేశారు. ఏపీని దోచుకుంటున్నారు కాబట్టే ఆదాయం పెరగడం లేదు.

కేంద్రానికి లేఖ రాస్తాం..
బినామీలు, ఎల్లో మీడియా సహచరులు దోచుకుంటున్నారు. విశాఖలో రూ.5000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టారు. చంద్రబాబు సమీప బంధువుకు భూములు కట్టబెట్టారు. ఇలా దోచిపెడుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. రాష్ట్ర ఖజానాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ కూడా లేదు. చంద్రబాబు పాలన చేయడం లేదు.. బిల్డప్‌ మాత్రమే. 2024-25 కాగ్‌ రిపోర్టు ప్రకారం అప్పు రూ.81,082 కోట్లు. అసెంబ్లీ సాక్షిగా రూ.60,485 కోట్లు అని బాబు తప్పుడు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు తప్పుడు సమాచారంపై కేంద్రానికి లేఖ రాస్తాం. డీవోపీటీకి, కేబినెట్‌, ఫైనాన్స్‌ సెక్రటరీలకు లేఖ రాస్తాం' అని అన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement