breaking news
Chandrababu Naidu
-
‘బాబుకు డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య’
సాక్షి, నెల్లూరు: ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. లేని స్కామ్‌ను ఉన్నట్టుగా చూపించి వైఎస్సార్సీపీని అప్రతిష్టపాల్జేసే కుట్ర జరుగుతోందని, లిక్కర్ స్కామ్ అంటూ చెబుతున్న లెక్కల్లో భారీ తేడాలే అందుకు నిదర్శనమన్నారు.ఎన్నికల ముందు లక్ష కోట్లుగా చెప్పిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు రూ.3 వేల కోట్లకు చేరిందని.. కానీ, దానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని గుర్తు చేశారు. సిట్ దర్యాప్తు పేరుతో వ్యక్తులను ఒత్తిడికి గురిచేసి, ప్రలోభపెట్టి వాంగ్మూలాలు తీసుకుంటున్నారని తెలిపారు. సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు నడిపించే కుట్ర చేస్తున్నారని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా..:ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతున్న ప్రతిసారీ ప్రజల దృష్టి మళ్లించేందుకు లిక్కర్ కేసును తెరపైకి తెస్తున్నారు. ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ రూ.లక్ష కోట్లు అని చెప్పిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్ రూ.44 వేల కోట్లు, టీడీపీ నేతలు రూ.33 వేల కోట్లు, అసెంబ్లీ శ్వేతపత్రంలో రూ.18 వేల కోట్లు, చివరకు సిట్ రూ.3 వేల కోట్లు అంటోంది.ఒకే కేసులో ఇన్ని రకాల లెక్కలు రావడం వెనుక వాస్తవాలు లేవనే విషయం స్పష్టమవుతోంది. రూ.3 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి అక్రమ లావాదేవీని కూడా నిర్దిష్ట ఆధారాలతో చూపలేకపోయారు. రెండేళ్లుగా దర్యాప్తు సాగుతున్నా కొత్త పాత్రలు, కొత్త వాంగ్మూలాలతో కేసును సాగదీస్తున్నారు.సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి కేసును నడిపించే ప్రయత్నం:సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఆయన 2025 ఫిబ్రవరి 21న దర్యాప్తు అధికారి ముందు, ఫిబ్రవరి 25న మేజిస్ట్రేట్ ముందు, జూలై 16న మరోసారి, తాజాగా మరో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన చెబుతున్న భారీ మొత్తాల చెల్లింపులను స్వయంగా చూశారా? సంబంధిత వ్యక్తులతో సమావేశాల్లో పాల్గొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 57 మంది వ్యక్తులు, సంస్థలను కేసులోకి లాగి 17 మందిని అరెస్ట్ చేశారు. పలువురికి బెయిల్ వచ్చింది. కుటుంబ సభ్యులను బెదిరించడం, ప్రలోభ పెట్టడం వంటి పద్ధతులతో వాంగ్మూలాలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.దర్యాప్తు పేరుతో ఒత్తిళ్లు.. హైకోర్టు వరకు వెళ్లిన బాధితులు:దర్యాప్తు అధికారుల మాట విన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మ్యాన్‌కు జీతం పెంపు, ప్రమోషన్లు ఇచ్చిన వ్యవహారం ఉంది. మరో గన్‌మ్యాన్ వాస్తవాలు చెప్పినందుకు థర్డ్ డిగ్రీకి గురై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వెంకటేష్ నాయుడిని కూడా తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వాలని డబ్బులు ఇస్తామంటూ ప్రలోభపెట్టిన విషయాన్ని కోర్టులో వెల్లడించారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని ఫార్మ్‌హౌస్‌లో రూ.11 కోట్ల నగదు వ్యవహారంలోనూ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంలో ఆలస్యం జరిగింది. ఇలాంటి పరిణామాలన్నీ దర్యాప్తు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.ఇదీ చదవండి: ‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’ -
పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు
-
ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో.. బాబు డ్రామా పీక్స్: కేకే రాజు ఫైర్
సాక్షి, విశాఖపట్నం: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో చంద్రబాబు మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారని, ఏడు కెమెరాలు, ఏడుగురు డైరెక్టర్లతో కార్యక్రమాన్ని షోగా మార్చారని విమర్శించారు. పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోందని పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం పలు జీవోలు జారీ చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల కోసం 39, 40, 41, 42 జీవోల ద్వారా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ కార్యక్రమం ద్వారా పేదలకు ఇళ్లపై హక్కులు కల్పించామని అన్నారు. 100 గజాల్లోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉచితంగా హక్కులు కల్పించినట్లు తెలిపారు.100 నుంచి 200 గజాల ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వ ధరలో 50 శాతం రాయితీతో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి ఇళ్లపై హక్కులు కల్పించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధమైన పట్టాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన పట్టాలకే మళ్లీ పట్టాలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలు వసూలు చేశారని కేకే రాజు ఆరోపించారు.ఇదీ చదవండి: సిట్ కొత్త కథ.. మరో కట్టుకథేనా? -
‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో వాగ్దానాలు సహజమే. కానీ, జనం గొంతెండుతుంటే ’భవిష్యత్తులో సముద్రాన్నే తీసుకొస్తా’ అంటూ గ్రాఫిక్స్ చూపించడం బహుశా చంద్రబాబుకే చెల్లుతుందేమో! సమస్యను ప్రపంచం మీదకు నెట్టేయడం, తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేదికగా ఆయన చేసిన ప్రసంగం సగటు విశాఖ వాసిని విస్మయానికి గురిచేసింది. ఈ గారడీ మాటల వెనుక ఉన్న అసలు వాస్తవాలు చూస్తే.. చంద్రబాబువి మాటలా.. మాయలా.. అనే సందేహం కలగక మానదు. గుక్కెడు నీళ్లడిగితే.. గోదావరి చూపించారు! ప్రస్తుతం విశాఖ ప్రజలు తాగునీటి కోసం కటకటలాడుతున్నారు. బిందెలు పట్టుకుని వీధుల్లో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం నుంచి తక్షణ ఉపశమనం ఆశిస్తుంటే.. సీఎం మాత్రం వింత వాదన తెరపైకి తెచ్చారు. ’నీటి సమస్య ఇక్కడే కాదు, ప్రపంచమంతా ఉంది’ అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. పోనీ అక్కడితో ఆగారా? అంటే అదీ లేదు. వచ్చే ఏడాది విశాఖకు ఎన్ని టీఎంసీలు కావాలంటే అన్ని గోదావరి జలాలు తీసుకొస్తామని గొప్పలు చెప్పారు. ప్రాణం పోతున్నవాడికి.. ‘ఆగు నాయనా.. వచ్చే ఏడాది నీకోసం పెద్ద బావి తవ్విస్తా’ అన్నట్లుగా ఆయన తీరు ఉందంటూ జనం మండిపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ఏడాది క్రితమే హెచ్చరించినా పట్టించుకోని బాబు.. ఇప్పుడే తీరిగ్గా సమీక్షలు చేశానంటూ చేతులు దులుపుకోవడం గమనార్హం. పంచగ్రామాలకు.. ’షరతులు వర్తిస్తాయి’ వ్యాపార ప్రకటనల్లో ఆఫర్‌ను పెద్ద అక్షరాలతో చూపించి, కింద కంటికి కనిపించని అక్షరాలతో ‘షరతులు వర్తిస్తాయి’ అని ముద్రించినట్లుగా ఉంది పంచగ్రామాల భూముల వ్యవహారం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 12 వేల మందికి త్వరలోనే పట్టాలు ఇచ్చేస్తామని వేదిక మీద ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఆ ప్రాంత ప్రజలు సంతోషించేలోపే.. ‘అయితే.. ఈ సమస్య కోర్టులో ఉంది కాబట్టి మా వంతు ప్రయత్నిస్తాం’ అంటూ క్షణాల్లో మాట మార్చేశారు. ముందుగా ఆకాశమంత ఆశలు రేపి, మరుక్షణమే కోర్టుల సాకుతో పాతాళానికి తొక్కేయడం పంచగ్రామాల ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఉక్కు భూముల వేలం కనిపించలేదా? విశాఖ సభ ద్వారా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ భవితవ్యంపై సీఎం స్పష్టమైన భరోసా ఇస్తారని కార్మికులు ఆశించారు. కానీ, ప్లాంట్ భూములు ఇప్పుడు బహిరంగంగా వేలంలోకి వెళ్తుంటే.. దీనిపై ఆయన కనీసం పల్లెత్తు మాట మాట్లాడకపోవడం ఉక్కు సంఘాలను ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రస్తుత సంక్షోభంపై స్పందించకుండా, ఎప్పుడో ఇచ్చిన ప్యాకేజీ గురించి గొప్పలు చెప్పుకుంటూ తనను తానే కీర్తించుకున్నారు. మొత్తంగా.. విశాఖ సభలో చంద్రబాబు ప్రసంగం సమస్యలను పక్కదారి పట్టించే ‘పొలిటికల్ స్క్రీన్ ప్లే’లా సాగింది. నగరంలో తాగునీరు, పంచగ్రామాల భూములు, స్టీల్‌ప్లాంట్ వంటి కీలక అంశాలపై తక్షణ పరిష్కారాలను గాలికొదిలేసి, తప్పులను ఇతరుల మీదకు నెట్టేసి, భవిష్యత్తు గురించి భ్రమలు కల్పించడంలో తనను మించిన వారు లేరని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.ఇదీ చదవండి: శు‘భ్రమే’.. అది సిత్రమే! -
శు‘భ్రమే’.. అది సిత్రమే!
ముఖ్యమంత్రి చంద్రబాబు తన నటనాచాతుర్యంతో అందరినీ విస్మయపరిచారు. విశాఖ సముద్రతీరం వేదికగా.. ఏడు హై ఎండ్ కెమెరాలు, ఓ డ్రోన్ కెమెరా సాక్షిగా శనివారం హంగామా చేశారు. సామాన్యులను అనుమతించకుండా చిత్రీకరించిన టోటల్ ఎపిసోడ్‌ను రక్తికట్టించారు. ప్రత్యేకంగా చల్లిన చెత్తను ఎత్తి.. మూడు మురి మిక్చర్ బండ్లతో అందంగా ముస్తాబు చేసిన సెట్లో కాసేపు మాటామంతీ సాగించారు. జీవీఎంసీ కార్మికులు.. ముందే అద్దంలా శుభ్రం చేసిన సాగర తీరంలో స్వేదబిందువులు చిందించి నవ్వులు పండించారు. సన్ని‘వేశాల’ చిత్రీకరణ పూర్తికాగానే ప్యాకప్ చెప్పేసి కాన్వాయ్‌లో మాయమైపోయారు. ఇంకేముంది.. ఆ వెంటనే అధికారులు, పారిశుధ్య కార్మికులతో పాటే మురి మిక్చర్ బండ్లు మాయం.. ఆఖరికి బాబూ.. నిన్ను చూసి.. మైమరిచి.. శు‘భ్రమే’.. అది సిత్రమే అని పాడుకోవడం విశాఖ వాసి వంతైంది. శనివారం తెల్లవారుజామునే జీవీఎంసీ కార్మికుల కష్టంతో అద్దంలా తయారైన విశాఖ బీచ్ సీఎం ఏరడం కోసం ప్రత్యేకంగా చెత్త, ఖాళీ బాటిళ్లు, కవర్లు చల్లుతున్న కార్మికులు ఏడు కెమెరాలు రోలై.. డ్రోన్ కెమెరా పైకెగరగానే షాట్‌కు సిద్ధమైన సీఎం చంద్రబాబు స్లోమోషన్లో చెత్తను ఎత్తుతూ.. బాబు ఫొటో షూట్ మురి మిక్చర్ బండ్ల సెట్ వద్ద మహిళతో మాటామంతి బాబు వెళ్లిపోగానే మురి మిక్చర్ బండిని ఎత్తేస్తున్న కార్మికులు ChandrababuChandrababu -
మీరు చేసిన అలిగేషన్స్ నిజం కాకపోతే నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటో తెలుసా..
-
కరువు ప్రకటనపై దిగివచ్చిన బాబు సర్కార్
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనకు బాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండలాల వారీగా నష్టాల అంచనాకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 24లోగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాన్ని కరువు కమ్మేసినా బాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య తీరును ఎండగట్టారు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మొద్దునిద్ర వీడకపోతే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనపై కసరత్తు ప్రారంభించింది. 54.3 శాతం లోటు వర్షపాతం..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20కి 54.3 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రకటన చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ముందస్తు కరువు పరిస్థితుల అంచనా చేపట్టాలని సూచించింది. కరువు ప్రాంతంగా గుర్తించేందుకు వర్షాభావంతో పాటు వ్యవసాయ పంటలు, భూస్థితి తదితరాలపై చూపిన ప్రభావాన్ని కూడా లెక్కించాలని ఆదేశించింది. ఏ మండలంలో వర్షాభావం ఎక్కువగా ఉంది? ఎక్కడ సాగు దెబ్బతింది, ఏఏ పంటలు ఏంత మేర ఎండిపోయాయి? దిగుబడులు ఏ మేరకు తగ్గే పరిస్థితి ఏర్పడిందో పక్కాగా డేటా సేకరించాలని స్పష్టం చేసింది. ఈ నెల 24లోగా జిల్లాల వారీగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. నగరాలు, పట్టణాలు, మండలాలకు సంబంధించి నిర్దేశిత నమూనాల్లో కరువు ప్రతిపాదనలను పంపించాలని సూచించింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు నమోదైన వర్షపాతంతో పాటు పొడి వాతావరణం ప్రభావ సూచికల వివరాలను పరిగణనలోకి తీసుకుని అంచనా వేయాలంది. కరువు ప్రతిపాదనలలో క్షేత్రస్థాయి వాస్తవ నివేదికను కూడా పొందుపర్చాలని ఆదేశించింది. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయి ఫొటోల ద్వారా నమోదు చేయాలని పేర్కొంది. ఆ ఫొటోలను, వివరాలను జిల్లా స్థాయిలో భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. మండలాల వారీగా జిల్లాల నుంచి అందే ప్రతిపాదనల ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈనెల 30లోగా అన్నీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. -
‘ఈ కీలుబొమ్మ సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ప్రజలు తీవ్ర నీటి కొరతతో అల్లాడుతున్న పరిస్థితుల్లో ఉంటే నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమస్యపై స్పందించకుండా రాజకీయ విమర్శలకే వేదికను ఉపయోగించుకున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు.విశాఖలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్, గృహ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉద్యోగుల తొలగింపులు, ప్లాంట్ భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.నగరంలో మూడు, నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉందని, ట్యాంకర్ల ద్వారా కూడా నీరు దొరకడం లేదని ప్రచార కార్యక్రమాలను, రాజకీయ విమర్శలు పక్కనపెట్టి తక్షణమే విశాఖ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా విలువైన భూములను అనామక కంపెనీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:విశాఖ నీటి సమస్యపై సీఎం సమాధానం చెప్పాలిముఖ్యమంత్రి విశాఖపట్నానికి వచ్చినప్పుడు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై మాట్లాడతారని ఆశించాం. కానీ విశాఖలో నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. మూడు రోజుల నుంచి నాలుగు రోజులకోసారి నీరు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుందామన్నా దొరకడం లేదు. పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు అందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.ముఖ్యమంత్రి వచ్చినప్పుడు రేపటి నుంచి నీటి సమస్య తీరుతుందని, ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారని ప్రజలు ఎదురుచూశారు. కానీ ఆ సమస్యను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై, వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రభుత్వం విశాఖ ప్రజలకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు అని ప్రజలు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది.విశాఖ భూములపై ఎన్నో ప్రశ్నలు2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బినామీలకు కట్టబెడుతున్నారు. ఊరూ పేరు లేని కంపెనీలకు వందలాది ఎకరాలు ఇచ్చారు. వాటిలో ఒక్క కంపెనీ అయినా నిర్మాణం చేపట్టిందా? స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చిన కంపెనీల్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీలుగా కనిపిస్తున్నాయి.విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్‌కు దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. విశాఖకు నీరు కూడా అందకుండా పోతే పెట్టుబడిదారులు ఈ నగరం వైపు ఎందుకు చూస్తారు? విశాఖను అభివృద్ధిని పణంగా పెట్టి మరీ అమరావతిని ప్రమోట్ చేసుకోవాలన్న ఆలోచన రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది కాదు.స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలివిశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1,000 కోట్లు ఇచ్చాం. రూ.10 వేల కోట్లు ఇచ్చాం. రూ.20 వేల కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ డబ్బులు ఎందుకోసం ఇచ్చారు? బ్యాంకు రుణాలు చెల్లించకపోతే ప్లాంట్ వేలానికి వెళ్లే పరిస్థితిని నివారించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసి ఉంటే, దాన్ని కార్మికులను, ప్లాంట్‌ను ఉద్ధరించినట్లు చెప్పుకోవడం ఏమిటి? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో 6,500 మందిని ఎందుకు తొలగించారు?పర్మినెంట్ ఉద్యోగులకు ఎందుకు వీఆర్ఎస్ ఇచ్చారు? ఈ రెండున్నరేళ్లలో కాంట్రాక్ట్, పర్మినెంట్ ఉద్యోగులు కలిపి దాదాపు 10 నుంచి 12 వేల మందిని తొలగించిన అంశానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నాలుగున్నర నెలలుగా కార్మికులకు జీతాలు లేవు. ప్లాంట్ భవిష్యత్తు ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేకపోతే ఇప్పటివరకు ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేదు? కార్మికులకు ఎందుకు భరోసా ఇవ్వలేదు?ఇళ్ల పట్టాల పేరుతో డ్రామా వద్దుఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వం పేద కుటుంబాలకు భూములు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. విశాఖ నగరంలో సుమారు 1.30 లక్షల కుటుంబాలకు సొంత స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునే కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు. పేదల సొంత ఇంటి కలను ఆపేశారు.2019లో జీవో 463 ద్వారా అర్హులైన బీపీఎల్ కుటుంబాలకు ప్రభుత్వ భూములను రూపాయికే రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించాం. 2021లో జీవో 225, 2023లో మరిన్ని రాయితీలు, జీవో 60 ద్వారా పట్టాలు పొందిన వారికి హక్కులు కల్పించాం. గాజువాక హౌస్ కమిటీ సమస్యకు కూడా జీవోలు తీసుకొచ్చి పరిష్కారం చూపాం. వీటి ద్వారా మా ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లను భరించి పేద కుటుంబాలకు ప్రయోజనం కల్పించింది. ఇప్పుడు అదే కార్యక్రమాలను కొత్తవిగా చూపించుకోవడం ఎన్నికల స్టంట్ తప్ప మరొకటి కాదు.ముందు ప్రజల దాహం తీర్చండిప్రజలకు సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విశాఖ ప్రజలు పెన్షన్లు వద్దు, మహిళలకు ఇస్తామన్న రూ.1,500 వద్దు, పిల్లలకు ఇస్తామన్న రూ.15 వేలు వద్దు, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేలూ వద్దు.. కనీసం గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ముడసర్లోవ, మేదరగడ్డ, రైవాడ రిజర్వాయర్లు ఎండిపోయాయి. తాడిపూడి నుంచి నీరు రావడం లేదు. పోలవరం నీరు అనకాపల్లి వరకు వచ్చిందని చెబుతున్నారు. మరి ఆ నీరు విశాఖకు ఎందుకు రాలేదు? ఈ సమస్యపై ఒక్క మంత్రి అయినా సమీక్ష నిర్వహించారా?వచ్చే ఏడాది వర్షాలు పడతాయని చెప్పడానికి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకోలేదు. కరవు పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, నగరానికి నీరు ఎలా అందించాలి, పరిశ్రమలకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. రాజకీయ విమర్శలు మానేసి తక్షణమే విశాఖ ప్రజల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టాలని గుడివాడ్ అమర్నాథ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు -
విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు
విశాఖలో నీటి కొరత ఉందని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఏడాదికి నీటి కొరత లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది తప్ప, వచ్చే ఏడాది నుంచి నీరు సరఫరా చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. విశాఖలో మంచి నీటి సమస్యతో గత కొంత కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో నీటి సమస్య లేదని చెబుతున్న కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్న విషయం తెలిసిందే. సీఎం వ్యాఖ్యలతో విశాఖ నగరంలో నీటి సమస్య ఉందని వాస్తవం బయటపడింది. -
జగన్ పై భారీ కుట్ర! బాబు ప్లాన్ బట్టబయలు
-
కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: సనాతన ధర్మ పరిరక్షకులమని గొప్పలు చెప్పుకునే కూటమి పార్టీల నేతలు, కనీసం హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి నీళ్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పలుచోట్ల నిమజ్జనానికి నీళ్లు లేక విగ్రహాలను ఎండిన కాలువలు, వాగుల్లో అలానే వదిలిపెడుతున్న హృదయ విదారక దృశ్యాలు చూస్తే ప్రతి హిందువు హృదయం కలుక్కుమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల హిందుత్వం ఇప్పుడు ఎక్కడికి పోయిందని, కనీసం నిమజ్జనానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. మరోవైపు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత నిస్సిగ్గుగా మాట్లాడిన పచ్చి అబద్ధాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాలతో నడుస్తున్న సిట్ నివేదిక ద్వారా తేలిపోయాయని స్పష్టం చేశారు.ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారికి వత్తాసు పలికిన ఎల్లో మీడియా తమ ముఖాలను ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. చేసిన మహా పాపానికి వెంకటేశ్వరస్వామి వారికి, భక్తులకు కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలని, లేనిపక్షంలో ఆ ఏడుకొండలవాడి శాస్తి తప్పదని వెల్లంపల్లి తీవ్రంగా హెచ్చరించారు.వినాయక చవితిపైనా కూటమి నిర్లక్ష్యంవినాయక చవితి అనేది పసిపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి హిందువు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భక్తులు మండపాలు వేసి పూజలు చేసుకుంటే, కనీస ఏర్పాట్లు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసింది. వెన్నుపోటు పాలనలో ఆదిదేవుడైన గణనాథుడికి కూడా తీరని అపచారం జరుగుతోంది.ఎండిన కాలువల్లో గణనాథులు..అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం వద్ద హెచ్ఎల్సీ కాలువలో నీరు లేక, ఎల్లనూరు ప్రాంతంలో చిత్రావతి పరిసరాల్లో నీటి కొరత వల్ల పూజలు అందుకున్న విగ్రహాలను మట్టిలో, ఎండిన కాలువల్లో వదిలేయాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి, అధికారులకు ముందే తెలుసు. అటువంటప్పుడు నిమజ్జనం కోసం ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న కుంటలు, కాలువలు ఎందుకు తవ్వించలేదు?. నిమజ్జనానికి నీళ్లు వదలాలనే కనీస జ్ఞానం చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి లేదా?.ఇళ్లల్లో పూజలు.. వీడియోలకే పరిమితమైన నేతలుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని, నాలుగు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వదిలేస్తే గొప్ప హిందూ భక్తులు అయిపోతారా? ఊర్లలో సామాన్య ప్రజలు వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు, నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయనే సోయి ఈ పాలకులకు ఏమాత్రం లేదు. ఉచిత కరెంటు ఇస్తున్నామంటూ పందిళ్లపై వందల కొద్దీ ఆంక్షలు పెట్టి భక్తులను తీవ్రంగా వేధించారు.వైజాగ్‌లో పోలీసుల వేధింపులు..విశాఖపట్నంలో భక్తులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మండపాలు వేసుకుంటే, పోలీసులు వెళ్లి బెదిరించి మండపాలు తీసేయమంటున్నారు. ఒకపక్క సకల శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో నీతులు చెబుతుంటే, గ్రౌండ్లో మాత్రం అన్నదానాలు, పూజలు చేసుకోకుండా ట్రాఫిక్ పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. కూటమిలో ఉన్న బీజేపీ నేతలను సూటిగా అడుగుతున్నాను.. జై శ్రీరామ్, జై గణేష్ అనే మీరు, మీ ప్రభుత్వంలో గణనాథుడికి జరుగుతున్న ఈ ఘోర అవమానంపై ఎందుకు నోరు మెదపడం లేదు?.సిట్ నివేదికతో బట్టబయలైన లడ్డూ అసత్యాలుకలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అత్యంత దిగజారి విష ప్రచారం చేశారు. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, బాత్రూములు కడిగే కెమికల్స్ కలిపారంటూ సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అయోధ్య రామాలయానికి పంపిన లక్ష లడ్డూలపై కూడా విషం చిమ్మి దేశవ్యాప్తంగా భక్తులను క్షోభకు గురిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న సిట్ ఇచ్చిన నివేదికలో ఎక్కడా జంతువుల కొవ్వు గానీ, కల్తీ గానీ జరిగినట్లు తేలలేదు.పవన్ కళ్యాణ్ దీక్షల డ్రామాలు.. ఎల్లో మీడియా విషంసనాతన ధర్మం అంటూ 11 రోజులు దీక్షలు చేసి, దుస్తులు మార్చి, గుడి మెట్లు కడిగి మీడియా ముందు ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? రాజకీయ స్వార్థం కోసం, వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచానికి ఒడిగడతారా? తిరుపతి లడ్డూపై పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించిన ఏబీఎన్, టీవీ5 లాంటి ఎల్లో మీడియా ఇప్పుడు ఎక్కడ దాక్కుంటుంది?కొండపైకి నడిచి వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందే..ల్యాబ్‌కు పంపిన ఆ నెయ్యి ట్యాంకర్లు, శాంపిల్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అయినవన్న విషయం స్పష్టమైందని వెల్లంపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో చేసిన ఘోర అపచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు, ఎల్లో మీడియా చెంపలు వేసుకోవడంతో పాటు.. తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి, స్వామివారి పాదాల చెంత సాష్టాంగపడి భక్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని.. దేవుడే తగిన శాస్తి చేస్తాడని హెచ్చరించారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు -
వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, కరువు మండలాలను ప్రకటించాలని జగన్ డిమాండ్ చేసిన మరుసటి రోజే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన సీఎం.. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు శనివారం స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై వైఎస్ జగన్ ఈ నెల 17న పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జరిగిన ఈ సమీక్షలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. కరువు మండలాలను ప్రకటించకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.వైఎస్ జగన్ ఫైర్రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి కొరత, వ్యవసాయ సంక్షోభంపై జగన్ సమీక్షించారు. కరువు కాలంలో రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. ఎల్‌నినో కంటే ‘ఎల్లో నినో’తోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జూన్ నుంచి వర్షపాతం లోటు కొనసాగుతున్నప్పటికీ కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే సాగు గణనీయంగా తగ్గిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.చంద్రబాబు ప్రకటనఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. సెప్టెంబర్ 24 నాటికి జిల్లా స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, సెప్టెంబర్ 29 నాటికి రాష్ట్రస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సూచించారు.రాష్ట్రంలో 513 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారుల నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పంటల పరిస్థితి, వర్షపాతం లోటు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.హైరిస్క్ కేటగిరీలో 1,357 ఆర్ఎస్కేలురాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పరిస్థితులపై ప్రభుత్వం రిస్క్ ఆధారిత అంచనాలు చేపట్టింది. 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటలను హైరిస్క్ కేటగిరీలో గుర్తించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఖరీఫ్‌లో వర్షపాతం లోటు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తాగునీటి సమస్యపైనా సమీక్షఇదిలా ఉండగా.. సాగుతో పాటు తాగు నీటి విషయంలోనూ జగన్ వార్నింగ్ పని చేసింది. విశాఖపట్నంలో తాగునీటి సమస్యపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులతో పాటు తాగునీరు, సాగునీటి లభ్యతపై కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.ఇదీ చదవండి: బొత్స కూతురికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్ -
బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని రోజా పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నం చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇకనైనా ఆపాలని ఆమె అంటున్నారు.శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేల నిజం నిర్ధారణ. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకితం అంటగట్టే ప్రయత్నం చేసిన కళంకితులు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలి. పచ్చి పాలు లాంటి మనసు… pic.twitter.com/TLc3MprUnB— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026‘‘పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదు. అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైంది’’ అని ఆర్.కే. రోజా తన పోస్టులో పేర్కొన్నారు.ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్లో రోజా ప్రశ్నించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు @ncbn గారూ? ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా?#NoAnimalFatInTTDLaddu… pic.twitter.com/i4Z1JjtQOd— Roja Selvamani (@RojaSelvamaniRK) September 19, 2026 -
లడ్డూ నెయ్యి వివాదంలో కీలక ట్విస్ట్.. జంతు కొవ్వుపై దర్యాప్తులో క్లారిటీ
-
బాబు కరువు.. ఊర్లకు ఊర్లు ఖాళీ
కర్నూలు: ఇళ్లకు తాళాలు పడ్డాయి.. వీధులు బోసిపోయాయి.. రచ్చబండలు నిర్మానుష్యంగా మారాయి.. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కరువయ్యారు.. దేవాలయాల్లో పూజ లు చేసేవారు కనిపించడం లేదు.. ఏ ఊరిని చూసినా ఏమున్నది గర్వకారణం.. పంటలు చేతికి రాక.. అప్పులు తీర్చలేక రైతులకు వలసబాటే మిగిలింది. పనుల కోసం వ్యవ సాయ కూలీలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడంతోపాటు కరువులో సహాయక చర్యలను విస్మరించింది. ఫలితంగా పిల్లాపాపలు, వృద్ధులతో ఊరూరా ప్రజలు వలస వెళ్తూ కనిపిస్తున్నారు. ఇక్కడే ఎక్కువ కాలం పస్తులతో ఉండలేమని మూటాముల్లె సర్దుకుని పయనమవుతున్నారు. పలకరించే వారు కరువు.. హాలహర్వి మండలంలోని పలు గ్రామాల్లో పలకరించే ప్రజలు కరువయ్యారు. కుల, మతాలకు అతీతంగా కలసి మెలసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలు ఇళ్లకు తాళాలను వేసి బతుకు బండిని లాగించేందుకు దూర ప్రాంతాలకు వెళ్లారు. విరుపాపురం, బల్గోట, గ్రామాల్లో 20 కుటుంబాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఏడురోజుల వ్యవధిలోనే వసలబాట పట్టారు. ఆయా గ్రామాల్లో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలసి విద్యార్థులు వలస వెళ్లిపోవడంతో ప్రభుత్వ పాఠశాల్లో హాజరు శాతం తగ్గిపోయింది. నిర్మానుష్యంగా విరుపాపురం కనిపించని సీజనల్ వసతిగృహాలు వలస వెళ్లే విద్యార్థుల కోసం సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఎంపీడీఓలు, విద్యా శాఖ అధికారులు సమాచారాన్ని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పలేకపోయారు. సీజనల్ వసతి గృహాలు ఎక్కడా కనిపించకపోవడంతో వ్యవసాయకూలీల వెంట చిన్నారులు వలసబాట పట్టాల్సి వచ్చింది. హాలహర్వి మండలంలో 26 ఎంపీపీ పాఠశాలలు, ఎనిమిది జెడ్పీహైసూ్కళ్లు ఉన్నాయి. మొత్తం 3,600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. హాలహర్వి మండలం విరుపాపురం గ్రామ ఎంపీపీ పాఠశాలలో ఒకటో తరగతిలో 21 మందికిగాను నలుగురు ఉన్నారు. రెండో తరగతిలో 16 మందికి గాను నలుగురు, మూడో తరగతిలో 19మందికి గాను ఏడుగురు హాజరవుతున్నారు. ఇక నాలుగో తరగతిలో 15 మందికి గాను ఐదుగురు ఉన్నారు. ఐదో తరగతిలో 20 మందికిపైగా విద్యార్థులను తల్లిదండ్రులు వారి వెంట వలస వెళ్లారు.బువ్వ దొరక్క వలస ఉన్న రెండు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరానికి రూ. 25 వేలు ఖర్చు చేశా. వర్షాల్లేక పంట ఎదుగుదల లేదు. ఇక్కడే ఉంటే మా కుటుంబంలో ఉన్న నలుగురు పస్తులతో ఉండాలి. బువ్వ దొరక్కపోవడంతోనే తెలంగాణకు వెళ్లక తప్పడంలేదు. – రామకృష్ణ, విరుపాపురం గ్రామస్తుడు విద్యార్థుల సంఖ్య తగ్గింది పిల్లలతో కలసి వలసలు వెళ్లవద్దని తల్లిదండ్రులకు చెప్పాం. చదువుకోకుంటే చిన్నారుల బంగారు భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందని తెలిపాం. అయినా ఎవరూ వినడం లేదు. విద్యార్థులతో కలసి వలస వెళ్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. – కమల్ తేజ, విరుపాపురం గ్రామ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు ఇదీ చదవండి: దళితులంటే సునీతమ్మకు నచ్చదా? -
తిరుమల పవిత్రతను చంద్రబాబు మంటగలుపుతున్నారు
తిరుపతి మంగళం : శ్రీవారి పాదాల చెంత, హోమ యాగాదులు నిర్వహించాల్సిన ప్రాంతంలో ‘గో’ మాంసాన్ని వండి, వడ్డించే ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేపట్టడంపై వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత పవిత్రమైన ఈ ప్రాంతంలో ఇలాంటి హోటల్ నిర్మాణం వద్దని అందరూ చెబుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం కమీషన్ల కక్కుర్తితో తన పంతాన్ని వీడకుండా అనుమతులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. అలిపిరి సమీపంలోని టీటీడీ స్థలంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న భూమన శుక్రవారం అక్కడికి వెళ్లి నిర్మాణ పనులను చూసి ఆవేదనకు గురయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ భక్తుడు, ధర్మాత్ముడు శ్రీ వేంకటేశ్వరస్వామికి ఈ స్థలాన్ని కానుకగా అందించారని గుర్తు చేశారు. రూ. 3 వేల కోట్ల విలువైన ఈ స్థలాన్ని ఓ హోటల్‌కు అప్పనంగా ఎలా ఇచ్చేస్తారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడినని, తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని అన్నారు. టీటీడీ స్థలాన్ని చట్ట వ్యతిరేకంగా మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పెడచెవినపెట్టి ఆ స్థలాన్ని హోటల్‌కు అప్పగించారని మండిపడ్డారు. 140 కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో గో మాంసం వండివార్చడంతో పాటు మసాజ్ చేసే స్పా సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి పవిత్రతను చంద్రబాబు మంటగలపక ముందే పూజ్యనీయులైన గురువులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించి అడ్డుకోవాలని ఆయన అభ్యర్థించారు. శ్రీవారి భక్తుడిగా, టీటీడీ మాజీ ఛైర్మన్‌గా దీనిపై తాను కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు. -
నాడు హేమాహేమీలు.. నేడు బ్యాక్ బెంచర్లు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు చంద్రబాబు పక్కన కూర్చొని టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్ నేతలను ఇప్పుడు పట్టించుకునే వారే లేకుండాపోయారు. తమకు పదవులు దక్కకపోగా, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ సన్నిహితులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, తొలిసారి గెలిచిన వారు కీలక పదవుల్లో కూర్చొని హవా చెలాయిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు తమ సత్తా, విలువ ఏపాటిదో తెలిసొస్తుందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలో సీనియర్ల దుస్థితికి యనమల రామకృష్ణుడు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఆయనకు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రి పదవి దక్కింది. ఆరి్థక మంత్రిగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాంటి నేత ఇప్పుడు 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ఏ పదవీ లేకుండా మిగిలిపోయారు. తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందని బహిరంగంగా చెప్పుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన సానా సతీష్ కు మాత్రం రెండోసారి రాజ్యసభ సీటు కట్టబెట్టారు. తన సమకాలికుడిని, కష్టకాలంలో అండగా నిలిచిన సహచరుడిని చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది. నాడు మంత్రులు.. నేడు ఎమ్మెల్యేలు 2014–19లో చంద్రబాబు కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన చాలా మంది ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. నాడు డిప్యూటీ సీఎంగా, హోం మంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప ఇప్పుడు పెద్దాపురం ఎమ్మెల్యే మాత్రమే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోగా, ప్రాధాన్యతే లేకుండా పోయింది. వ్యవసాయ మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిదీ అదే పరిస్థితి. సోమిరెడ్డిని కొత్త కమిటీల్లో జాతీయ అధికార ప్రతినిధిగా నియమించి అవమానించారనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న నేతకు ఇప్పుడు టీవీ డిబేట్లలో పార్టీ వాణి వినిపించే బాధ్యత అప్పగించారు. పార్టీలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు నుంచి పలుమార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రలకు కూడా మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. మరికొందరి పరిస్థితి ఇంకా అవమానకరంగా మారింది. పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే టికెట్‌ను వదిలేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను కావాలని పక్కన పెట్టేశారు. ఆయన్ను టీడీపీ ఇన్చార్జి పదవి నుంచి కూడా పక్కకు తప్పించారు. గతంలో జల వనరుల మంత్రిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు గత ఎన్నికల్లో టికెట్టే దక్కలేదు.కొత్త వారికి మాత్రం కిరీటాలుసీనియర్లను అవమానకరంగా పక్కనపెడుతూ.. కొత్త వారికి మాత్రం కిరీటాలు పెడుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు నేరుగా కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. ఫిరాయింపు నేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్‌సభలో పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చారు. పార్టీ కమిటీల్లోనూ లోకేశ్ కోటరీకే పదవులు దక్కాయి. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేశ్ ముగ్గురూ లోకేశ్‌కు అనుయాయులే. జాతీయ ఉపాధ్యక్షుల్లో సానా సతీష్ , పీతల సుజాత, బుద్ధా వెంకన్న, నూకసాని బాలాజీ, బి.రాంగోపాల్ రెడ్డిలు లోకేశ్ సిఫార్సులతోనే పదవులు దక్కించుకున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్ , చింతకాయల విజయ్ను రాజ్యసభకు పంపారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి, క్లిష్ట సమయాల్లో చంద్రబాబు వెంట ఉన్న వారంతా ఇప్పుడు బ్యాక్ బెంచీలకు పరిమితమయ్యారు. తొలిసారి మంత్రులైన వారు రెండేళ్లయినా ఇంకా శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. లోకేశ్ చుట్టూ ఉన్న కొద్ది మంది కోటరీ వ్యక్తులకే పదవులు వరిస్తున్నాయని వారు లోలోపల రగిలిపోతున్నారు. -
ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు
-
బొత్స అంటే బ్రాండ్..! స్పీచ్ ఇరగదీసిన బొత్స అనూష
-
లోకల్ ఎన్నికల్లో ఒక్కొక్కడికి.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో TDP జలీల్ ఖాన్
-
చంద్రబాబుకు జలీల్ ఖాన్ అల్టిమేటం
విజయవాడ: ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు కేవలం చిన్న చిన్న నామినేటెడ్ పోస్టులతో మాత్రమే సరిపెడుతున్నారన్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు జలీల్‌ఖాన్ అల్టిమేటం జారీ చేశారు. ఈసారి కచ్చితంగా విజయవాడ మేయర్ సీటు ముస్లింలకే ఇవ్వాలన్నారు. ‘విజయవాడ మేయర్‌గా మైనార్టీలకు అవకాశం కల్పించాలి. మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ అయితే నా కుమార్తెకు అవకాశం ఇవ్వాలి. బీజేపీ మైనార్టీల ఇంపార్టెన్స్ ను గుర్తించింది. కానీ చంద్రబాబు వైఖరి నాకు నచ్చడం లేదు. అనుభవం ఉండి కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదు. విజయవాడలో పార్టీ గెలవాలన్నా...పార్టీ క్యాండెట్ గెలవాలన్నా మైనార్టీల సహకారం అవసరం. ముస్లింలకు మేయర్‌గా అవకాశం ఇస్తే పోటీ ఉండదు. నాకు ఊహతెలిసినంత వరకూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్ ముస్లింలకే ఇచ్చేవారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోనే ముస్లింలకు ఎమ్మెల్యే సీటు లేకుండా చేశారు. ఆ రోజే నాకు బాధ కలిగినా నాలోనే దాచుకున్నా. ముస్లింలకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు ...రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం లేదు. చిన్న చిన్న నామినేటెడ్ పదవులతో సరిపెట్టేస్తున్నారు. 2019లో నా కుమార్తెను కోరి తెచ్చుకున్నారు. ఇండిపెండెంట్‌ను బరిలోకి దించి నా కుమార్తెను ఓడించారు. నా కుమార్తె ఓటమిలో కూడా కుట్ర జరిగిందికానీ నేను పేర్లు చెప్పలేదు ... చెప్పినా ఉపయోగం ఉండదని చెప్పలేదు. టీడీపీలోయాక్షన్ ఉండదరు..రియాక్షన్ అసలే ఉండదు’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’ -
‘చంద్రబాబు ఆ ఆలోచన నుంచి బయటకు రావాలి’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని.. కృష్ణా, గోదావరి నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ఫలితంగా రాష్ట్ర మంతటా రైతులకు అన్యాయం జరిగిందని.. వ్యవసాయం దండుగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయట పడాలన్నారు. ఇంకా అదే ఆలోచనలో ఉన్నందునే రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.‘‘శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే పంట భూములన్నీ బీడులుగా మారాయి. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తే రైతుల కష్టాలు, కన్నీళ్ళు కనపడతాయి. ఇది ఎల్‌నినో కాదు.. ముమ్మాటికీ ఎల్లోనినోనే. తీవ్ర కరువు ఏర్పడినా ఎల్లో మీడియా చంద్రబాబుకు భజన చేస్తోంది. శ్రీశైలానికి భారీగా వరద అనీ, జలకళతో రాయలసీమ రిజర్వాయర్లు అంటూ వార్తలు రాశారు. అంత జలకళ ఉంటే.. మరి గ్రేటర్ రాయలసీమకు నీళ్లు ఎందుకు ఇవ్వటం లేదు?..కనీసం ఆరుతడి పంటలకు కూడా ఎందుకు నీరివ్వటం లేదు?. శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటిమట్టం నీరు ఉన్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎందుకు నీరు ఇవ్వటం లేదు?. రాయలసీమ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఇంత కక్ష చంద్రబాబూ?. శ్రీశైలంలో 840 అడుగులకు చేరితే ఇక పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇవ్వలేరు. అనాలోచిత నీటి నిర్వహణ కారణంగానే నీటి ఎద్దడి. నెల్లూరు బ్యారేజి కింద వేలాది ఎకరాల వరి పైరు ఎండిపోతోంది. శ్రీశైలం కింద సాగు చేసే రైతులు పూర్తిగా నష్టపోయారు..వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అయినా పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టును సైతం చివరికి రిజర్వాయర్ నుండి బ్యారేజిగా మార్చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నీటి విడుదల చేయించాలి. ఎండిపోతున్న చీనా చెట్లు, అరటి తోటలు, వరిపైరు, శనగ తోటలు కనపడటం లేదా?. రోడ్డున పడుతున్న రైతుల కష్టాలు కనపడటం లేదా?. కర్ణాటక, తెలంగాణాలో సాగు నీరు ఇస్తుండగా లేనిది ఏపీలో ఎందుకు ఇవ్వరు?. చంద్రబాబు రాయలసీమలోని పొలాలు చూస్తే రైతుల కష్టాలు కనపడతాయి?. వ్యవసాయం దండగ అనే ఆలోచనలో నుండి చంద్రబాబు బయటకు రావాలి’’ అని శైలజానాథ్ హితవు పలికారు.ఇదీ చదవండి: ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం -
పోలీసుల ముందే బాబు పరువు తీసిన CITU నాయకులు
-
‘ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడను’
సాక్షి, గుంటూరు: రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఈ నెల 20 తేదీన గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న సమావేశానికి ఏర్పాట్లను నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా, వనమా బాల వజ్రబాబు, మాజీ కార్పొరేటర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 76 వార్డులు ఉన్నాయి. రేపు సమష్టిగా పార్టీ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఐక్యంగా రాబోయే ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలతో ఈ కూటమి సర్కార్ పోటీ పడలేకపోతోంది. రాబోయే ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోం. పోలీసులతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తే సహించం’’ అంటూ అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.దొంగ ఓట్లు ఉండటానికి వీల్లేదు. రాబోయే ఎన్నికల్లో ఒకరు ఒక ఓటు మాత్రమే వేయాలి. రెండో ఓటు వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన నేను భయపడను. చెప్పాలి అనుకున్నది మేము ధైర్యంగా చెప్తాము. తండ్రి కొడుకులు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఆఫర్ -
కూన రవికుమార్ DSC దందాను ఆధారాలతో బయటపెట్టిన చింతాడ
-
మంత్రి రవికుమార్ అడౌన్..డౌన్..!
ప్రకాశం (అద్దంకి): వినాయక విగ్రహం నిమజ్జనానికి డీజేకి పోలీసులు పర్మిషన్ లేదన్నారు.. పర్మిషన్ ఇచ్చేదాకా కదలం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్ డౌన్..డౌన్.. నారా లోకేష్ వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రవికుమార్ వస్తాడో రండి... అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. సంతమాగులూరు మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. గ్రామంలో తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో డీజేకి అనుమతివ్వాలంటూ పోలీలసుల వద్దకు వెళ్లారు. డీజేకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో.. తమకు అనుమతివ్వాల్సిందేనని, ఎందుకివ్వరని పోలీసులను నిలదీశారు. ఎవరికీ అనుమతివ్వం, ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్ అని పోలీసులు చెప్పడంతో నడిరోడ్డుపై పచ్చకండువాలతో టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి రవికుమార్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఊరుకోకుండా నారా లోకేష్ వస్తాడో, చంద్రబాబు వస్తాడో, రవికుమార్ వస్తాడో రావాలని, అప్పటి వరకూ కదిలేది లేదని నినాదాలు చశారు. రెండు వర్గాల్లో ఒక వర్గానికే అనుమతివ్వడంతో వివాదం... మక్కెనవారిపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన రెండువర్గాల వారు వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందులో ఒక వర్గానికి డ్యాన్స్‌కు, డీజేకి అనుమతిచ్చి రెండో వర్గానికి ఇవ్వలేదు. దీంతో రెండో వర్గం వారు ధర్నాకు దిగారు. సీఐ మాత్రం డ్యాన్స్‌లు మామూలేగానీ.. డీజేలకు ఎవరికీ అనుమతివ్వలేదని చెప్పుకొచ్చారు. టీడీపీ శ్రేణుల కోసం దిగొచ్చిన మంత్రి... సొంత పార్టీ శ్రేణుల నుంచి డీజే విషయంలో నిరసన సెగ తగలడంతో స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. హోంమంత్రితో మాట్లాడి ఎస్పీ ద్వారా నిబంధనలకు లోబడి తక్కువ సౌండ్‌తో డీజే పెట్టుకునే విధంగా అనుమతులివ్వమని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ వారు కోరిన విధంగా ప్రభుత్వం నడుస్తుందా? వారు ఏది కోరితే అది చేస్తారా? అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదేం పరిపాలన అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
పింఛన్ దారులు తాగుబోతులా! కలెక్టర్ల ముందు బాబు నవ్వులపాలు
-
ఏపీ సరిహద్దులు దాటిన రెడ్ బుక్ అరాచకం
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ పాలనలో రెడ్ బుక్ అరాచకం ఏపీ సరిహద్దులు దాటింది. ఏకంగా జాతీయ స్థాయి జర్నలిస్టులకూ రెడ్‌బుక్ ఆగడాలు తప్పడం లేదు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ వరకూ రెడ్‌బుక్ వేధింపులు వెళ్తడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.పలు వార్తలు, వీడియోలకు సంబంధించి ఆమె పోస్టులను తొలగించాలంటూ ఎఫ్‌బీఐ పేరుతో ఎక్స్‌కు ఏపీ పోలీసుల ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, గుంటూరులో ఎఫ్‌బీఐ ఎప్పుడు పెట్టారంటూ ప్రముఖుల విమర్శలు కురిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పీవీ రమేష్ సహా పలువురు రిటైర్డ్ ఆఫీసర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. Hi @APPOLICE100. Is this your job? To send takedown requests on stories? That too about some low-level TDP guy. Shame. Use your time to actually help people instead https://t.co/7KlsfzhUi3 pic.twitter.com/ZxT5vq0gGY— Dhanya Rajendran (@dhanyarajendran) September 17, 2026Also please note that the Andhra cop has claimed to be FBI https://t.co/8XjBY2R9Jj— Dhanya Rajendran (@dhanyarajendran) September 17, 2026ఇదీ చదవండి: కరువు ముందే తెలిసినా కళ్లు మూసుకున్నారు: వైఎస్ జగన్ -
బాబూ.. వాటర్‌మ్యాన్ బిరుదుకు ఇంతే క్వాలిఫికేషనా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మాన్ ఎప్పుడు అయ్యారు? వాటర్ మాన్ అంటే రాష్ట్రానికి పుష్కలంగా నీటిని అందించిన వ్యక్తి అన్నమాట. నిజంగా ప్రాజెక్టులు నిర్మించి, ఏపీలో కరువు పరిస్థితిని పారదోలి ఉంటే ఆయన అందుకు అర్హుడు అయి ఉండేవారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న అభిప్రాయం ఉంది.అయినా ప్రాజెక్టులు ఎవరు నిర్మించినా, నీటిని కొంతమేర విడుదల చేసే అవకాశం వచ్చినంతవరకు క్రెడిట్ తీసుకుంటే ఆక్షేపణ లేదు. కాని మొత్తం ప్రాజెక్టులన్నీ ఆయనే పూర్తి చేశారేమో అన్న విధంగా ప్రచారం చేసుకోండం, దానికి తోడు వాటర్ మాన్ పదాన్ని ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాడింది కనుక ఆయనకు సన్మానాలు, అభినందనలు, స్టాండింగ్ ఒవేషన్లు ఇప్పించడం మరీ కృతకంగా ఉన్నట్లు అనిపిస్తుది. పార్టీపరంగా ఏదో చేసుకుంటే చేసుకున్నారులే అనుకోవచ్చు. కాని ఏకంగా అధికారిక సమావేశంలో ఐఏఎస్ అధికారులంతా పాల్గొన్న కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వాటర్ మాన్ అంశాన్ని ప్రస్తావించి చప్పట్లు కొట్టించారు. దానికి చంద్రబాబు మురిసిపోయారు.ఇది ఒక రకంగా అతి ప్రచారంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఐఏఎస్‌లలో చాలామంది సీనియర్లు గత పాతికేళ్లుగా ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని పనిచేసి ఉంటారు. వారందరికి వాస్తవ పరిస్థితి తెలియకుండా ఉండదు కదా! వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయం, ఆ సమయంలో చంద్రబాబు వాటిపై విమర్శలు చేయడం, పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, అంతేకాక పోలవరం కాల్వలను వైఎస్ తవ్విస్తుంటే తీవ్రంగా అభ్యంతరం తెలిపి, ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోల రూపంలో నిక్షిప్తం అయి ఉన్నాయి.అలాగే వెలిగొండ ప్రాజెక్టు టెక్నికల్‌గా సాధ్యం కాదని కొంతకాలం, నిధులు లేవని మరికొంతకాలం చంద్రబాబు కాలయాపన చేసిన అంశంపై వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. అయినా అదృష్టం కొద్ది నీటిని విడుదల చేసే అవకాశం పొందారు. కాని వెలిగొండ ప్రాజెక్టు నీరు నల్లమలసాగర్‌లోకి రావడానికి అవసరమైన టన్నెల్స్ తవ్వకం, ఫీడర్ కాల్వ ఏర్పాటు, డామ్ నిర్మాణం మొదలైనవన్నిటిని చేపట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదా!ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్నెల్స్‌ను పూర్తి చేసి ఆరంభించిన సంగతి తెలియదా! నిర్వాసితులకు పెండింగులో ఉన్న పునారావాస చర్యలను అరకొరగా చేపట్టి, హడావుడిగా నీళ్లను వదలితే వాటర్ మాన్ అయిపోతారా? అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా, గ్రావిటీ ద్వారా కాకుండా లిప్ట్ ద్వారా నీటిని కాల్వలోకకి తోడితే వాటర్ మాన్ అయిపోయినట్లేనా? ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక కథనాన్ని ఇస్తూ అందులో వాటర్ మాన్‌గా పేర్కొంది.సాధారణంగా వార్త ఇవ్వడం తప్పుకాదు. కాని అతిశయోక్తులతో, లేని బిరుదులు ఆపాదించి స్టోరీలు ఇస్తే ఆ పత్రిక విమర్శలకు గురి అవుతుంది. చంద్రబాబుకు ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలో అంతవరకు కాకుండా, మొత్తం ఏపీకి ఈయనే వాటర్ మాన్ అన్నచందంగా వార్త ఇస్తే జనం నమ్ముతారా? కాకపోతే టీడీపీ ప్రచారానికి వాడుకోవచ్చు. ఒకపక్క ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విశాఖ నగరంలో సైతం తాగు నీటి కష్టాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఏభై శాతం పైగా వర్షపాతం లోటు ఉందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. వరి వేసుకోవద్దని సలహాలు ఇచ్చారు. రైతులు నానా అవస్థలు పడుతున్న టైమ్ లో చంద్రబాబును వాటర్ మాన్ అని పొగిడితే కాస్త ఎబ్బెట్లు అనిపించదా!ఇదీ చదవండి: కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు నిజానికి భారీ ప్రాజెక్టులపైనే నమ్మకం లేదు. ఆ మాట ఆయన దాచుకోకుండానే గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు వడ్డీ వీరభద్రరావు, ఎర్రా నారాయణస్వామి వంటివారు పోలవరం ప్రాజెక్టుపై ఉద్యమం చేస్తుంటే వారిని చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. ఆయన చెరువుల పూడిక తీయడం, పట్టణాలలో ఇంకుడు గుంతలు వంటివాటిపైనే ఎక్కువగా కేంద్రీకరించేవారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఈ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకాలు వేసి వదలివేసేవారు.నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి తదితరుల సమయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు వంటి ప్రాజెక్టులు రాకపోతే ఉమ్మడి ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అంతకు ముందు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉండి విజయవాడవద్ద బారేజీ నిర్మించారు. ఆంగ్లేయుడైన కాటన్ దొర తొలుత కృష్ణా, గోదావరి నదులపై డామ్లు నిర్మించారు.ఆ తర్వాత కాలంలో భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టును చేపట్టారు. అలాగే హంద్రీ-నీవా, గాలేరు-నగరి మొదలైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి 48 ప్రాజెక్టులకు జీవం పోశారు. ఆయన చొరవ లేకపోతే పోలవరం, పులిచింతల, వెలిగొండ, పోతిరెడ్డిపాడు విస్తరణ మొదలైన ప్రాజెక్టులు ఉండేవి కావేమో! వైఎస్ ఆర్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ను విస్తరిస్తున్నప్పుడు కృష్ణా డెల్టాకు అన్యాయం జరుగుతోందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు విజయవాడలో ధర్నా చేయడానికి చంద్రబాబు అంగీకారం ఉందా? లేదా? అలాగే జగన్ పాలనలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను చేపడితే, దానిని వ్యతిరేకించడమే కాకుండా, తెలంగాణ సీఎం కోరారని దానిని నిలుపుదల చేయించింది ఈయన కాదా! అయినా వాటర్ మాన్ అని పిలిపించుకుంటే ఏమి చెబుదాం.అవన్ని ఎందుకు! చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంకు జగన్ టైమ్‌లో కదా నీరు వచ్చింది. అప్పటికే సుమారు 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోలేదు? కేవలం నీటిని విడుదల చేస్తేనే వాటర్ మాన్ అయిపోతే ప్రాజెక్టులు ఒక రూపానికి తీసుకువచ్చిన ఇతర ముఖ్యమంత్రులు ఏమి అవుతారు? అసలు వాటర్ మాన్‌గా ప్రసిద్ది చెందిన రాజేంద్రసింగ్ గురించి ఏమి చెప్పుకోవాలి. ఏడారిలో పచ్చదనం సృష్టించిన ఆయన ఘనత తెలియదా! మంత్రి కేశవ్‌కు ఈ విషయాలేవి తెలియక కాదు. కాని చంద్రబాబు మెప్పు పొందడానికి, టీడీపీ ప్రచారానికి ఇది ఉపయోగపడవచ్చు. అంతే తప్ప ఆయన చెప్పింది పూర్తి వాస్తవం కాదు.ఈ పాతికేళ్లలో ఏడెనిమిది సార్లు కరువు పరిస్థితులు ఏర్పడితే అందులో ఐదారుసార్లు చంద్రబాబు పాలనలోనే అని గణాంకాలు ఇస్తూ ఎల్లో మీడియాలోనే ఒక కథనం వచ్చింది. 2014 టరమ్‌లో రెయిన్ గన్స్ ద్వారా కరువు నివారిస్తామంటూ సుమారు 400 కోట్లు వ్యయం చేశారు. ఆ తర్వాత ఆ రెయిన్ గన్స్ ఏమయ్యాయో తెలియదు. ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ 2004 కి ముందు చంద్రబాబు కొంత హడావుడి చేసి చాలా ఖర్చు చేశారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా పెట్టారు. కాని అది సఫలం అయి ఉంటే దానిని ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించడం లేదు? పోలవరం ప్రాజెక్టును జాప్యం చేసి, పట్టిసీమ వద్ద లిఫ్ట్ పెట్టామని చెబితే సరిపోతుందా? ఆ లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు వైఎస్ నిర్మించిన కాల్వలలోనే ప్రవహిస్తున్నది.ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రతినిధికి అన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆ పత్రికలో వాటర్ మాన్ అని రాసేస్తే అయిపోతుందా!అన్ని విషయాలు విశ్లేషించాలి కదా! ఈ మధ్య అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ కథనం అంటూ ఒక దానిని ప్రచారం చేశారు. అందులో వాస్తవాలకన్నా అతిశయోక్తులే ఎక్కువగా కనిపించాయి. దాంతో అంతర్జాతీయ పత్రికలైనా, జాతీయ పత్రికలైనా మేనేజ్ మెంట్‌కు అతీతం కావు అన్న భావన ఏర్పడింది.తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ఆయా యూనివర్శిటీలు ఆసక్తి చూపినా తాను ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారట. గతంలో ఒకసారి చికాగోకు చెందిన ఒక యూనివర్శిటీ ఆయనకు డాక్టరేట్ ప్రకటించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాని ఆ తర్వాత ఆ యూనివర్శీటీ స్థితిగతులపై అనేక విమర్శలు వచ్చాయి. వీటిని పక్కనబెడితే ఏపీలో కరువును శాశ్వతంగా నివారించే దిశగా ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్దితో చర్యలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఎవరూ అడగకుండానే ఐఏఎస్ లైనా, మరెవరైనా చప్పట్లు కొడతారన్న సంగతి గ్రహించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏపీలో ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్... సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
"ఎల్ నినో కాదు... 'ఎల్లో నినో ఎఫెక్ట్'.”
-
చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును రహస్యంగా కలిశారు. ఈ భేటీలో రాజశేఖర్‌రెడ్డి సోదరుడైన శివప్రకాష్ రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డికి ఈ స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబుకు ఎంతగా ఉపయోగపడకపోతే ఆయనను కలసి జెడ్పీ ఛైర్మన్ పదవి అడగగలుగుతారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుతో సునీత దంపతుల రాజకీయ బంధం బట్టబయలయ్యిందని వారు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయం బయటపడడంతో కడప జిల్లా కూటమిలోనూ అలజడి మొదలైంది. ఇన్నాళ్లూ పార్టీలో పనిచేసిన వారిని కాదని బయటివారికెలా ఇస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో తరచూ భేటీలు.. ఈసారి పదవి కోసం సునీత దంపతులు మొన్నటి వరకు చంద్రబాబును కలిసి ఏంచేయాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనే దానిపై సలహాలు, సూచనలు తీసుకుని అమలు చేసేవారు. ఈసారి మాత్రం నేరుగా జెడ్పీ ఛైర్మన్ పదవి కోసమే వెళ్లారు. మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాం కాబట్టి తమకు జెడ్పీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ చంద్రబాబు రాజకీయ అవసరాలకు ఉపయోగపడిన దానికి బదులుగా ఇప్పుడు పదవి అడుగుతున్నారన్నది దీంతో స్పష్టమైంది. కడప టీడీపీలో అలజడి.. పార్టీలో లేనివారికి పదవా? సునీత దంపతులు జెడ్పీ ఛైర్మన్ పదవి అడిగిన విషయం తెలియడంతో వైఎస్సార్ కడప జిల్లా కూటమి నేతలు మండిపడుతున్నారు. ఆ పదవి కోసం ఇప్పటికే కూటమిలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఒకవైపు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి వర్గం.. మరోవైపు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం ఆ పదవిని కోరుకుంటున్నాయి. తమ వర్గంలో ఒకరికి సీటు ఇప్పించుకోవాలని ఎవరికి వారు ప్రయతి్నస్తున్నారు. ఈ దశలో సునీత రంగ ప్రవేశం చేసి ఆ పదవిని ఎగరేసుకుపోవాలని చూస్తుండటం వారికి మింగుడుపడటం లేదు. అసలు పార్టీలోనే లేనివారు జెడ్పీ ఛైర్మన్ పదవి ఎలా అడుగుతారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు జెడ్పీ ఛైర్మన్ పదవి ఇస్తే కుదరదని తేల్చిచెబుతున్నట్లు తెలిసింది. కార్యకర్తలు కష్టపడితే పదవులు మాత్రం సిఫార్సులతో వచ్చినవారికి అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బాహాటంగానే విమర్శిస్తున్నారు. వివేకా హత్యను సునీత రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న కడప టీడీపీలో ఈ వ్యవహారం చిచ్చు రాజేసింది. జగన్‌పై బురద జల్లేందుకు ఇన్నాళ్లూ సునీతను ఉపయోగించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో పడినట్లు తెలిసింది. ఆమె కోరిక తీరిస్తే జిల్లా టీడీపీ శ్రేణుల ఆగ్రహం తప్పదు. కాదంటే ఇన్నాళ్లూ సాగిన ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం బెడిసికొడుతుంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కనపెడితే ఒక్క విషయం మాత్రం తేలిపోయింది. సునీత పోరాటం వెనుక ఉన్నది రాజకీయ ఎజెండా. ఆ ఎజెండాకు అండగా నిలిచింది చంద్రబాబు. -
కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!
-
ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడికి సంబంధించి జిల్లాల వారీగా స్థానిక పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ వర్షపాతం లోటులోనే ఉన్నాయన్నారు. ‘‘688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో 75 శాతం వర్షపాతం లోటు. సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు...చిత్తూరులో 58.5 శాతం, వైఎస్సార్ కడపలో 57 శాతం వర్షపాతం లోటు. తూర్పుగోదావరిలో 57 శాతం, మార్కాపురం–నంద్యాలలో 56 శాతం చొప్పున వర్షపాతం లోటు. విశాఖపట్నంలో 54 శాతం, అనంతపురంలో 51 శాతం వర్షపాతం లోటు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకుపైగా నష్టపోయారు. సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా 56.4 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదు. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటను బట్టి రైతులు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోయారు. కంది, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయిపండ్ల తోటలు కూడా కరువు దెబ్బకు ఎండిపోతున్నాయి. శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదు. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సింది. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్‌లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం పూర్తి సామర్థ్యంపై ప్రభుత్వం రాజీపడుతోంది. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ల పేరుతో ప్రచారం కాకుండా శాశ్వత సాగునీటి పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.‘‘వరుస వర్షపాతం లోటు కనిపిస్తున్నా కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదు?. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలి. కరువు ప్రభావిత రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలి. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలి. రైతుల నుంచి వసూలు చేసిన పంటల బీమా ప్రీమియాన్ని తిరిగి చెల్లించాలి. గతంలో రైతులకు రావాల్సిన రూ.3 వేల కోట్ల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం ఇవ్వాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం ఇవ్వాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘ఉచిత పంటల బీమా కొనసాగి ఉంటే రైతులకు Prevented Sowing సహా బీమా రక్షణ ఉండేది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించాలి. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లలో రూ.60 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ. 19 వేలే. బకాయి పడ్డ రూ. 41 వేలు కూడా రైతులకు ఇవ్వాలి. కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులైన రైతులకు మూడేళ్లలో ఎగ్గొట్టిన రూ. 60వేలు ఇవ్వాలి. తుఫాన్ల వల్ల రైతులకు పెండింగ్‌లో ఉన్న పంటల బీమా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ప్రకటించాలి...ఇన్పుట్ సబ్సిడీ కింద సుమారు రూ. 6 వేల కోట్లు రైతులకు అందించాలి. సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేయాలి. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన సున్నా వడ్డీ బకాయిలన్నీ రైతులకు చెల్లించాలి. పశుగ్రాసాన్ని ముందుగానే సమీకరించి కరువు జిల్లా రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలి. కరువు కారణంగా వ్యవసాయ కూలీలు వలస వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలి. కరువు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల కోసం కేంద్రాన్ని వెంటనే అదనపు పనిదినాలు కోరాలి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే చెల్లించాలి...ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వల్ల రైతు, పేద కుటుంబాలపై అదనపు భారం పడకూడదు. విద్యా దీవెన–వసతి దీవెన కింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.9 వేల కోట్లను విడుదల చేయాలి. కరువు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు ఉచిత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలి. గ్రామాల్లో విద్యుత్ కోతలు లేకుండా చూడాలి. రైతులకు ప్రకటించిన ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను కోతలు లేకుండా అందించాలి. బోర్ల కింద ఉన్న పంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి...ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలి. ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలి. పండ్ల తోటలకు నీటి ట్యాంకర్ల ఖర్చుపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలి. ముఖ్యంగా చీనీ సహా శాశ్వత పండ్ల తోటలను కాపాడేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పరిస్థితి తీవ్రతను బట్టి కరువు ప్రభావిత ప్రాంతాల్లో తాను కూడా పర్యటిస్తానన్న వైఎస్ జగన్.. రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందన్నారు. ‘‘ప్రతి జిల్లాలో కరువు పరిస్థితులపై పార్టీ నాయకులు అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జిల్లాల వారీగా రైతుల ప్రత్యేక డిమాండ్లను కూడా ప్రభుత్వానికి సమర్పించాలి. రైతుల సమస్యలపై వైయస్సార్సీపీ నాయకులు క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలి. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు ఇవ్వాలి. కరువు సమస్యలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. దీనికి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలి. రైతులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ప్రశ్నిస్తే అకౌంట్ క్లోజ్!‘‘ఎల్‌నినో ప్రభావం వస్తుందని ఫిబ్రవరి 4నే చంద్రబాబు చెప్పారు. తెలిసినా ఆ తర్వాత చేసిన కార్యాచరణ మాత్రం సున్నా. ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల తీవ్రత పెరిగింది. వర్షపాతం లోటు కనిపిస్తున్నా స్విచ్‌లు నొక్కడం, లాకులు ఎత్తడం, ఫొటోలకు పోజులివ్వడమే చేశారు. మీ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేలకుపైగా నష్టపోయారు. చంద్రబాబు పుణ్యాన రైతులకు ఉచిత పంటల బీమా రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నది ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు... ‘ఎల్లో నినో ఎఫెక్ట్’. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగిన సమయంలో ఇవ్వకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారు...పులిచింతల ఎగువ, దిగువన తెలంగాణ లిఫ్టులు కడుతున్నా చంద్రబాబు కనీసం నోరు మెదపడం లేదు. రైతుల కోసం చంద్రబాబు మనసు పెట్టి పనిచేస్తున్నారనే భావన ఎక్కడా కనిపించడం లేదు. పోలవరం పూర్తి స్థాయి నీటిమట్టంపై రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటున్నారు. గతంలోనే ఉన్న పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్టులను ఆపరేట్ చేసి కొత్తగా తానే నీళ్లు తెచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు...ఒకవైపు పోలవరంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని వదులుకుంటూ, మరోవైపు లిఫ్టుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు వరుసగా వర్షపాతం లోటు కనిపిస్తున్నప్పుడు కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?. కర్ణాటక ముందుగానే కరువు ప్రకటించింది; చంద్రబాబు ప్రభుత్వం ఆ పని కూడా చేయలేకపోయింది. కరువు వస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదు; పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదు; ఉపాధి హామీ అదనపు పనిదినాల కోసం డిమాండ్ కూడా పెట్టలేదు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఇదీ చదవండి: సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్ -
పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
-
సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
సాక్షి, విజయవాడ: సాక్షి టీవీ దెబ్బకు కూటమి సర్కార్ మరోసారి దిగొచ్చింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీని మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానంపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నియామకాల్లో అక్రమాలకు ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నిరుద్యోగుల తరఫున ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను తిరిగి ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త జీవోతో ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి టీవీ కథనాల నేపథ్యంలో కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. దీంతో, జీవో మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. కూటమి సర్కార్ పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టే విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రసారాలు చేసిన సాక్షి టీవీ.. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేసింది. ఈ వ్యవహారంలో సాక్షి టీవీపై మంత్రి అచ్చెన్నాయుడు గతంలో విమర్శలు చేసి అబాసుపాలయ్యారు. తాజాగా నియామక ప్రక్రియపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాక్షి టీవీ చెప్పిందే నిజమని ప్రభుత్వం అంగీకరించింది.ఏపీపీఎస్సీ ద్వారానే నియామకాలు..ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించనున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇదీ చదవండి: బాబు సర్కార్ మరో 2000 కోట్ల అప్పు -
ఆంధ్రా డీఎస్సీ - అమెరికా FBI..అతి తెలివి సరిహద్దులు దాటింది
-
FBI ముసుగులో చంద్రబాబు సర్కార్... ఇంటర్నేషనల్ లెవెల్ లో పరువు పాయె
-
తాత వయసొచ్చిన నేను జెన్ జీ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా..! చంద్రబాబుపై కొండా రాజీవ్ ఫైర్
-
'శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు'.. చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం
-
కలెక్టర్ల సదస్సా.. ఏకపాత్రాభినయమా? చంద్రబాబు తీరుపై చర్చ!
ఏపీలో మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశాలు పెట్టి ఏం సాధిస్తున్నట్లు?. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంటల తరబడి ఇచ్చే స్పీచ్‌లను గమనిస్తే, ఒకసారి అంతా బాగుందని చెబుతారు. మరో సారి కలెక్టర్లు, ఐఏఎస్‌లు సరిగా పనిచేయడం లేదని అంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదలివేస్తుంటారని కూడా ఆయనే చెబుతారు. 12 గంటలపాటు కూర్చోలేరా? అని ప్రశ్నించి అధికారులందరిని ఆశ్చర్యపరుస్తారు. ఏవేవో ర్యాంకులు అంటారు. ఫైళ్ల క్లియరెన్స్ అంటారు. ఒక మంత్రి మొదటి స్థానంలో ఉన్నారంటారు. తదుపరి ఆ మంత్రి ఏమి తెలియకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రే మందలిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మండంగా అమలు చేస్తున్నామని, లక్షన్నర కోట్లు వ్యయం చేశామని చెబుతారు. అదెలాగో స్కీములవారీగా వివరణ ఇవ్వరు. అందులో నిజం అంత ఎన్నది ప్రజలు లెక్కవేసుకోవాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి చర్చించరు!అప్పట్లో చంద్రబాబు ప్రకటించిన వివిధ స్కీములకు ఏడాదికి లక్షన్నర కోట్ల వ్యయం అవుతుందని ఆనాటి సీఎం జగన్ చెబితే, తమకు సంపద సృష్టించడం తెలుసునని అన్నారు. ఈ రెండేళ్లలో ఇన్నిసార్లు కలెక్టర్ల సదస్సులు జరిగాయి కదా! ఎంత మేర సంపాదన సృష్టించింది లెక్కలు చెప్పి ఉండవచ్చు కదా! లేదా తాను చేసిన 3.90 లక్షల కోట్ల అప్పే సంపద అని అనుకోమంటారా!. మరోవైపు పెన్షన్దారులలో అనర్హుల పేరుతో ఏరివేయాలని అంటారు. చివరికి పెన్షన్ దారులను తాగుబోతులుగా అభివర్ణిస్తారు. మద్యం షాపులను ఇష్టారాజ్యంగా సిండికేట్లకు ఇచ్చి బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెడతారు. ఎంఆర్పీ మించి ధరకు అన్ని చోట్ల అమ్ముతున్నా,చర్యలు ఉండవుకాని, కలెక్టర్ల సదస్సులో మాత్రం హుంకరిస్తుంటారు.ఎన్నికలకు ముందు సాయంత్రం పూట ఒక పెగ్గు వేసుకుంటే తప్పేముందని,నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఆయనే హామీ ఇచ్చిన సంగతి మర్చిపోయి ఉండవచ్చు. డిఎస్సిని బాగా చేశామని అంటారు. అక్రమాలు బయటపడడంతో డిఎస్సి నిర్వహణ అంతా అధికారులే చూసుకున్నారని చెప్పేస్తారు.చంద్రబాబు చెప్పే అనేక అంశాలలో ఒకదానితో మరొకటి పొంతన ఉండదన్న భావన ఉంది.గత కలెక్టర్ల సమావేశాలలో వచ్చిన సమస్యలే మళ్లీ,మళ్లీ వస్తుంటాయి. అంతా ఏకపాత్రాభినయంగా సాగిపోతున్నట్లు అనిపిస్తుందని కొందరు అదికారులు వ్యాఖ్యానిస్తుంటారు. కొందరు అధికారులను ఆయన కావాలని అవమానించేలా మాట్లాడారన్న అభిప్రాయం కలుగుతోందన్న ప్రచారం ఐఏఎస్ వర్గాలలో జరుగుతోంది.వీరిని స్కూల్ పిల్లల మాదిరిగా ట్రీట్ చేయడం, తమాషాలు చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.ఎవరి పని తీరైనా నచ్చకపోతే వారిపై చర్య తీసుకోవచ్చు.లైవ్ లో టీవీ ప్రసారాలు జరుగుతున్నప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ఇలా బహిరంగంగా మాట్లాడితే అదికారులలో నైతిక స్థైర్యం దెబ్బతినదా అన్నది ప్రశ్న. అధికారులు కొందరు సమావేశాలకు రాకపోవడంతో ఆయనకు కోపం వచ్చింది. అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి కదా! మంత్రులు, ఐఏఎస్ లు అంతా రావల్సిందేనట.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశాలకు రాకపోయినా, ఈ సదస్సులకు హాజరుకాకపోయినా ఇలాగే ప్రశ్నిస్తున్నారా అని ఐఏఎస్ లు గుసగుసలాడుకున్నారట. ఐఏఎస్ లు ఈ చెవితో విని ,ఆ చెవితో వదలివేస్తున్నారని చంద్రబాబే చెప్పిన తర్వాత ఈ సదస్సులకు ఉన్న విలువ ఏమిటో అర్ధం అవుతూనే ఉంది.12 గంటలు కూర్చోవాల్సిందేనని సీఎం ఆదేశిస్తే, బయటకు వెళ్లిన తర్వాత అదికారులు ఏలా ఫీల్ అవుతారో ఊహించుకోపోవచ్చు. ఇదంతా లాఫింగ్ స్టాక్ అవుతుందని గమనించాలి.సుదీర్ఘంగా మాట్లాడడం అలవాటు చేసుకుని గంటల తరబడి ప్రసంగాలు చేస్తే ఎంత ఐఏఎస్ లైనా ఎలా భరించగలుగుతారు? నిజానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెంపొందిన ఈ రోజుల్లో రెండు రోజుల పాటు ఇలా కలెక్టర్ల సదస్సులు పెట్టడం అవసరమా?కాదా?అన్న చర్చ ఉంది.అసలు సమావేశాలు వద్దని ఎవరూ అనరు.కాని అవి అర్ధవంతంగా లేకపోతే రెండు రోజుల ఖర్చు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు కదా అన్నది కొందరి అభిప్రాయం. రాజకీయ పాలన చేయాలని ఐఏఎస్ లకు,ఐపిఎస్ లకు చెప్పిన తర్వాత ఇంక వారు చేసే సాధారణ పాలన ఏమి ఉంటుంది?తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు చెప్పిన పనులు చేయడమే కదా రాజకీయ పాలన అంటే!ప్రత్యర్ధి రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఎలాంటి పనులు జరగకూడదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పిన తర్వాత కలెక్టర్లు నెత్తి,నోరు కొట్టుకోవడం తప్ప ఏమి ఉంటుంది?గంటల తరబడి ఉప్యాసాలు ఇచ్చేసి ,ఎవరైనా అధికారులు సమస్యలు చెప్పబోతే వారిని డబాయిస్తే అవి ఎలా పరిష్కారం అవుతాయి.గత సమావేశంలో కూడా అటవీ శాఖ,పర్యావరణ సమస్యలు వచ్చాయి. దానికి చంద్రబాబు ఇచ్చిన చిట్కా ఏమిటో తెలుసా!కాసేపు అటవీ,పర్యావరణ అధికారులు కళ్లు మూసుకోవాలట.అప్పుడు పనులు చేసుకోవాలట. సంబంధిత చట్టాలు చేసింది ఎవరు?వాటిని అమలు చేయవద్దని చెబుతున్నదెవరు? పెన్షన్ల ను,ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఇచ్చేసిందట.సాచ్యురేషన్ మోడ్ లో గత ప్రభుత్వం వివిధ స్కీములను అమలు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు గుప్పించి,కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత దానిని చంద్రబాబు తప్పుపడుతున్నారు.అది సరికాదని అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేసి ఉండాలి కదా!రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపి స్థానిక ఎన్నికలకు ముందు పెన్షన్లు ఇవ్వడంలోకాని, అనర్హతతో రద్దు చేసే ఆలోచనకాని ఎందుకు చేస్తున్నట్లు?ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తమకు కావల్సినవారికే పెన్షన్ దరఖాస్తులు అప్ లోడ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే వైఎస్సార్సీపీ మద్దతుదారుల పెన్షన్లు రద్దు చేయడానికి ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలట. అదేమిటో అర్ధం కాదు.ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వారు బతుకుతారు. వారిలో అర్హులైనవారికి పెన్షన్లు,ఇళ్లు వంటివాటిని ప్రభుత్వాలు మంజూరు చేస్తాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల పేరుతో వీటిని తగ్గించాలని చూస్తున్నారా అని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.దీనికి ఎల్లో మీడియా పెట్టిన హెడింగ్ ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు చీలిపోవాలా?దీనిని చంద్రబాబు ఆచరించి చూపారా అని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు.కుటుంబం ఒక యూనిట్ అయితే పెన్షన్లు, ఇళ్లు తదితర అన్నీ స్కీములలో లబ్దిదారులు బాగా తగ్గిపోతారన్నమాట.ప్రస్తుతానికి లబ్దిదారులను యధాతధంగా కొనసాగిస్తామని అంటున్నా,దానికి గ్యారంటీ ఏమి ఉంటుంది. కొంతమందికి ఒక విధానం, మరికొందరికి ఇంకో విధానం ఉంటుందా? ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద కుటుంబంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఎలా చెప్పారు?అప్పుడు ఉమ్మడి కుటుంబం గురించి ఆలోచించలేదా?యధా ప్రకారం వైఎస్సార్సీపీపైన పరోక్ష విమర్శలు చేయడం, ప్రభుత్వంలో జరుగుతున్న స్కామ్ లను వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ,లేదా మరికొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా అధికారులను పురికొల్పడం కోసం కలెక్టర్ల సమావేశాలు పెట్టాలా? ఇప్పటికే పోలీసు, అధికార యంత్రాంగం ద్వారా అన్ని కుట్రలు చేస్తున్నారు కదా! పైళ్ల క్లియరెన్స్ అంటూ లెక్కలు చెప్పడం ఆయనకు ఎప్పటి నుంచో అలవాటే. దాదాపు ప్రతి రోజు ఆయా జిల్లాలకు వెళ్లి సభలు పెట్టి అధికారులకు ర్యాంకులు ఇస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ ర్యాంకులు అంటూ కధ నడపడం దేనికి?. విశేషం ఏమిటంటే చంద్రబాబేమో అన్ని పనులు చేసేయాలని హుకుం జారీ చేస్తుంటారు.ఇదీ చదవండి: వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?ఆర్ధిక మంత్రి కేశవ్ ఏమో బడ్జెట్ తో సంబంధం లేకుండా మితిమీరి ప్రతిపాదనలు వస్తుంటే ఒత్తిడి అవుతోందని అంటున్నారు.నిధులు ఇచ్చినా,ఇవ్వకపోయినా పనులు జరగాలంటే అది ఎలా అవుతుంది. చివరికి అసలు విషయం ఏమిటంటే తమది రాజకీయ పాలన కనుక కూటమి నేతలకు అధికారుల వద్దకు వస్తే గౌరవించాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రజలు ఎవరు వచ్చినా, ఏ రాజకీయ పార్టీవారు వచ్చినా మర్యాద ఇవ్వండి అని చెప్పవలసిన చంద్రబాబు ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం అనిపించదా!అయినా ఆయన తప్పులేదనుకోవాలి.రాజకీయ పాలన చేస్తామని ఆయన చెబుతుంటే జనం నిలదీయనంతకాలం ఇలాంటి నేతలు ఇలాగే పాలన చేస్తారు.-కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు సర్కారు మరో రూ.2,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట వివిధ సంస్థల ద్వారా అప్పులు చేయడాన్ని చంద్రబాబు సర్కారు నిరంతరంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్లు టర్మ్ రుణం తీసుకునేందుకు అనుమతిస్తూ ఆ మొత్తానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ హామీ రుణం మొత్తం కాలపరిమితి వరకు వర్తిస్తుంది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ చెల్లింపుల షెడ్యూల్‌తోపాటు వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం కాలం వంటి వివరాలను సమర్పించాలి. ఏపీపీఎఫ్సీఎల్ తన సొంత వనరుల నుండే రుణ సేవా బాధ్యతలను నిర్వహించాలి.రుణమొచ్చన సంస్థకు చెల్లించాల్సిన బాధ్యతలను తీర్చడంలో విఫలమైన సందర్భంలో మాత్రమే ఈ ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. హామీ ఇచి్చన మొత్తంపై ఐదు శాతం హామీ కమీషన్‌ను చెల్లించాలి. -
CBIకి దిక్కు లేదు కానీ FBI అంటా... వాడిని ఎవరికైనా చూపించండి రా..!
-
ప్రైవేటుకు ‘పవర్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ రంగం ప్రైవేటుపరానికి చంద్రబాబు సర్కారు పన్నాగం పన్నుతోంది. దీనిలో భాగంగా రాజధాని అమరావతిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రీన్‌ఫీల్డ్ నగరాల్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ(అండర్ గ్రౌండ్ కేబుల్) ఏర్పాటు, స్మార్ట్ గ్రిడ్ నిర్వహణ నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం వరకూ అనుభవం ఉన్న అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, జాయింట్ వెంచర్లుగా ఏర్పడిన సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చునని పేర్కొంది. 2022–23 నుంచి 2024–25 వరకు మూడేళ్లలో సగటున రూ.వెయ్యి కోట్ల చొప్పున లావాదేవీలు నిర్వహించి ఉండి.. రూ.200 కోట్ల మేర నగదు నిల్వలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే బిడ్లు దాఖలుకు అర్హత ఉంటుందని షరతు విధించింది. బిడ్ దాఖలుచేసే సంస్థలను గత రెండేళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వంగానీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఉండకూడదని స్పష్టం చేసింది. ముందే ఎంపిక చేసిన సంస్థకే రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను కట్టబెట్టడానికి ముఖ్యనేత రంగం సిద్ధం చేశారన్న వాదన విద్యుత్‌రంగ నిపుణుల నుంచి వినిపిస్తోంది. రాజధానిని ప్రయోగశాలగా మార్చి.. ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు.. అప్పట్లో నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి 54 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం ముసుగులో అస్మదీయులకు ధారాదత్తం చేశారు. అప్పట్లోనే విద్యుత్ రంగాన్ని పైవేటీకరించేందుకు అడుగులు వేశారని.. తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గారని విద్యుత్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జెన్కో, ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలు(ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్)లతో కూడిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి సీఎం చంద్రబాబు రాజధానిని ప్రయోగశాలగా మార్చి ఆటలాడుతున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్థిర, నిరంతర విద్యుత్ సరఫరా ముసుగులో.. స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో భాగంగా రాజధాని అమరావతి నగరాన్ని నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. రాజధాని ప్రాంతంలో 2047 నాటికి జనాభా 1.40 కోట్లకు చేరుతుందని.. రాజధాని నగరం అమరావతిలోనే 20 లక్షల మంది నివసిస్తారని.. 12.80 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. అమరావతి 2047 నాటికి ఏకంగా 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) ఆరి్థక వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతోంది. నివాస, వాణిజ్య, ఐటీ, ఆస్పత్రులు, విద్యా సంస్థలు భారీ ఎత్తున వస్తాయని.. వాటికి అనుగుణంగా సుస్థిరమైన, అంతరాయం లేని స్మార్ట్ విద్యుత్ సేవలను అందించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొంటోంది. ఈ ముసుగులోనే విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు అడుగులు వేసింది. ఈ మేరకు సీఆర్డీఏతో నోటిఫికేషన్ జారీచేయించింది. అక్టోబర్ 12 వరకూ ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చని సీఆర్డీఏ పేర్కొంది. అక్టోబర్ 13న బిడ్‌ను తెరిచి.. ఎల్–1గా నిలిచిన సంస్థకు రాజధాని విద్యుత్ రంగం పనులను కట్టబెట్టేందుకు సీఆర్డీఏ షెడ్యూలు విడుదల చేసింది. రూ.వేల కోట్లతో బలోపేతం చేసిన వ్యవస్థ నామమాత్రపు ధరకే.. వేలాది కోట్ల రూపాయలను అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి రాజధానిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్డీఏ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు వాటిని పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ప్రైవేటు సంస్థకు నామమాత్రపు ధరకే కట్టబెట్టనుంది. రాజధాని ప్రాంతం ప్రస్తుతం ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో ఉంది. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ దగ్గర నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వసూలు చేసే బాధ్యత వరకూ ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. ఆ తర్వాత వేలాది కోట్ల రూపాయల వ్యయంతో బలోపేతం చేసిన ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఏపీఎస్పీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో నిర్మించిన విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను దశలవారీగా నామమాత్రపు ధరకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సర్కార్ అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై బాదుడే బాదుడు..కారి్మకులకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తే.. వాటిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుందని విద్యుత్ ఉద్యోగ, కారి్మక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా పెంచేయడానికి ఆస్కారం ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొత్తగా కనెక్షన్ మంజూరు చేయడానికి.. రీకనెక్షన్ ఇవ్వాలన్నా భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తాయనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీంటినీ ఒకేసారి ప్రైవేటుపరం చేస్తే అటు ఉద్యోగులు.. ఇటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించే తొలుత రాజధానిలో విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ తొలి అడుగు వేసిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను విజయవంతంగా ఎంపిక చేసిన సంస్థకు కట్టబెట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే సర్కార్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
ప్చ్.. మళ్లీపోయింది!
సాక్షి, అమరావతి: విద్యుత్ కోతలతో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జనం అల్లాడుతున్నారు. వేసవిని తలపిస్తూ విద్యుత్ కోతల తీవ్రత పెరుగుతున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు సరఫరాలు నిలిపివేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం (సెప్టెంబర్ 15న) విద్యుత్ డిమాండ్ 264.521 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరగా, అధికారిక లెక్కల్లోనే 7.03 ఎంయూల లోడ్ రిలీఫ్ (విద్యుత్ కోత) నమోదైంది. వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోవాల్సిన దుస్థితి వచ్చింది. విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా అందించలేకపోతున్న ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు విద్యుత్ పొదుపు పాటించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వినియోగదారులకు పలు విజ్ఞప్తులు చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే అధికారిక గణాంకాల్లో మాత్రం మొత్తం డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేస్తున్నట్లు చూపుతుండడం... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉండడం గమనిస్తున్న ప్రజలు, ప్రభుత్వ వైఖరితో మరింత అసహనానికి గురవుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సబ్స్టేషన్లను సైతం ముట్టడించే పరిస్థితి ఏర్పడింది. అన్నదాత ఆవేదన వ్యవసాయానికి రోజుకు 9 గంటల సరఫరా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో రోజుకు 5 నుంచి 7 గంటలు, ఇతర ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని అన్నదాతలు చెబుతున్నారు. ఈ సరఫరాను కూడా రెండు, మూడు విడతలుగా ఇస్తున్నారు. రాత్రివేళ రెండు గంటలు సరఫరా ఇవ్వడంతో చీకట్లో పొలాలకు వెళ్లలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీంతో ఆ సమయంలో కరెంటు ఇచ్చినా అది వృథా అవుతుందని అంటున్నారు. పగటి పూట ఇచ్చే కొద్ది గంటల సరఫరాతోనే పొలాన్ని తడుపుకుంటున్నారు. పగలు ఒకే విడతలో 9 గంటలు విద్యుత్ సరఫరా వ్యవసాయానికి అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెండుమూడు రోజులకే బొగ్గు నిల్వలు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అత్యంత దారుణంగా పడిపోయాయి. విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రం (వీటీపీఎస్)లో 2.87 రోజులకు, రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ)లో 2.56 రోజులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయి. ఈ థర్మల్ కేంద్రాల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కృష్ణపట్నంలో 11.23 రోజులు, హిందూజాలో 5.99 రోజులు, సెయిల్‌లో 16.56 రోజులకు సరిపడా బొగ్గు ఉంది. కానీ ఇది ఏమాత్రం సరిపోదు. థర్మల్ కేంద్రాల్లో కనీసం 15 రోజుల నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు లేకపోతే ఉత్పత్తి చాలా కష్టం. ఏ కారణం చేతనైనా రోజువారీ బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడితే థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి ఒక్క సారిగా కుప్పకూలుతుంది. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ డిమాండ్‌కు తగిన ఉత్పత్తి రాష్ట్రంలో లేదు. పోనీ ముందస్తు ప్రణాళికలు ఏవైనా వేశారా అంటే అదీ లేదు. కాగితాల్లో తప్ప ఆచరణలో ఎలాంటి ప్లానింగ్ అమలు చేయకపోవడంతోపాటు పెరిగిన డిమాండ్‌ను తగ్గట్లు విద్యుత్‌ను సమకూర్చలేక రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. బహిరంగ మార్కెట్ నుంచి 40 ఎంయూల నుంచి 50 ఎంయూల వరకూ ప్రతి రోజూ విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ఇందుకు మొత్తం రూ.28.415 కోట్లు నుంచి రూ.35 కోట్ల వరకూ ఖర్చవుతోంది. ఇందులో డే ఎహెడ్ మార్కెట్ ద్వారా 29.270 ఎంయూలను యూనిట్‌కు సగటున యూనిట్ రూ.5.774 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రియల్ టైమ్ మార్కెట్లో 6.960 ఎంయూలకు యూనిట్‌కు రూ.9.994 చొప్పున అత్యధిక ధర చెల్లిస్తున్నారు.వాటిని వాడకండి: పృధ్వీతేజ్ వాషింగ్ మెషిన్లు, ఐరన్ బాక్సులు, బ్యాటరీ చార్జింగ్‌లు వంటివి పగటిపూట మాత్రమే వాడుకుంటే గ్రిడ్‌పై భారం తగ్గుతుందంటూ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ వీడియో బుధవారం సందేశాన్ని విడుదల చేశారు. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు అవసరం లేని మెషిన్లు, విద్యుత్ ఉపకరణాలు వినియోగం తగ్గించుకోవాల్సిందిగా ఆయన కోరారు. కొంచెం ఎక్కువే చెప్పండి: మంత్రి ఆదేశాలు విద్యుత్ కోతలపై ప్రజలకు నిరంతరం సమాచారం అందించాలని, ఎంత సేపు విద్యుత్ కోత విధిస్తున్నామనే వివరాలను, ఆయా వేళలను ముందుగానే చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ కోతలు, సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కాల్ సెంటర్‌కు అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటన్నిటికీ సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందని వినియోగదారులు అడిగితే, అవసరమైతే కాస్త ఎక్కువ సమయమే చెప్పమని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. బొగ్గు నిల్వలపై దృష్టి సారిస్తున్నామని, బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు అనుమతించామని మంత్రి చెప్పారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన విలేకరులకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై మంత్రి వివరణ ఇచ్చారు. ప్రజావ్యతిరేకత తీవ్రమవకుండా ‘చిట్కాలు’ విద్యుత్ శాఖ చెబుతున్నదాని కంటే ఎక్కువగానే రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో అనధికార విద్యుత్ కోతలు, నిర్వహణ పేరుతో వారంలో ఒకటి రెండు రోజులు వ్యవసాయానికి నిలిపివేయడం వంటి చర్యల ద్వారా డిమాండ్‌ను కంట్రోల్ చేస్తున్నారు. కోతలు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి విధించడం లేదు. అలాగే ఒకేసారి ఎక్కువ సమయం కూడా సరఫరా తీసేయడం లేదు. అలా చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కొద్ది కొద్ది సమయాలు, వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో సరఫరా ఆపుతున్నారు. ఎవరైనా కాల్ సెంటర్‌కి ఫోన్ చేసి అడిగితే నిర్వహణ, సాంకేతిక సమస్యలను సాకుగా చూపిస్తున్నారు. -
కొండపైనా క్రెడిట్ కొట్టేశారు!
తిరుమల: తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చేపట్టి, అధిక భాగం పూర్తి చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపట్ల భక్తులు, ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మ్యూజియం పనులకు అప్పుడే శ్రీకారం శ్రీవారి ఆలయ చరిత్ర, కళా సంపదను భక్తులకు పరిచయం చేసేలా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. 2023లోనే టీటీడీ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. మ్యూజియం ఆధునీకరణకు టీసీఎస్ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ రూ.20 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చాయి. మొత్తం రూ.145 కోట్ల ప్రాజెక్టులో 19 గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లోనే టీటీడీ వెల్లడించింది. అన్నమయ్య రాగి రేకులు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి తదితర చారిత్రక వస్తువులను ప్రదర్శించేలా గ్యాలరీలను రూపొందించే పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై, 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులకు ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ల సమయం పట్టింది. దీనిని విస్మరించి, మ్యూజియం అభివృద్ధి మొత్తం బాబు ప్రభుత్వంలోనే జరిగినట్లుగా చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్యోగుల ఇళ్ల స్థలాలపైనా అదే చర్చ టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2022లోనే వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 300.22 ఎకరాల భూమిని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందుకోసం రూ.61.63 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు టీటీడీ అప్పట్లోనే వెల్లడించింది. 2023 ఆగస్టులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి భూమిని కూడా పరిశీలించారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు 35/55 అడుగుల చొప్పున స్థలాలు కేటాయించే ప్రణాళికను అప్పట్లోనే ప్రకటించారు. లేఅవుట్, కచ్చా రోడ్లు, టౌన్ ప్లానింగ్ అనుమతుల కోసం కూడా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లుగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లతో మౌలిక వసతులు కలి్పస్తామని చంద్రబాబు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ‘పోలీసింగ్’... మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
శ్రీవారి వద్ద సేవే చేయాలి.. ఉద్యోగం కాదు
తిరుమల : శ్రీవారి వద్ద సేవ చేయాలే తప్ప ఉద్యోగాలు కల్పించే సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మారకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అంతవరకే ఇస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే టీటీడీ ఆదాయంలో 100 శాతం జీతాలకే వెళ్లిపోతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. వైద్య, విద్యారంగాల్లో పనిచేసే వారిని కూడా సేవకులుగా మార్చి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. తిరుపతికి స్కైవాక్.. 50 ఎకరాల్లో పార్కింగ్.. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఆ ప్రాంతాన్ని అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల తిరుపతిలో సేకరించిన 50 ఎకరాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చాలన్నది తమ ఆలోచన అని ∙తెలిపారు.రూ.3,165 కోట్ల అన్నదానం కార్పస్ ఫండ్.. టీటీడీలోని ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు దాదాపు రూ.3,165 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని సీఎం వెల్లడించారు. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. 65 ఆలయాలకు ఏ, బీ, సీ కేటగిరీలు.. టీటీడీ ఆధ్వర్యంలోని 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములు తదితర వివరాలను ఆన్లైన్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలకు నీటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు.. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ఉన్నాయి.సీఎం వ్యాఖ్యలపై టీటీడీ సిబ్బంది ఫైర్!సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల నియామకాలపై సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు ఉండవు.. అవసరం మేరకే ఉంటాయి.. శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వచ్చే ఆదాయం వంద శాతం ఉద్యోగుల జీతాలకే వెళ్తుంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. ఉద్యోగాల విషయంలో ఇలా మాట్లాడటాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగానికి బదులు ‘సేవ’?.. రాష్ట్రంలో ప్రభుత్వంతో సమాంతరంగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది. టీటీడీలో శాశ్వత, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద సుమారు 15 వేల నుంచి 16 వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం. టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి వివిధ రూపాల్లో జీవనోపాధి లభిస్తుంది. అటువంటి ధార్మిక సంస్థలో ఉద్యోగావకాశాలకు గండికొట్టేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఇటు టీటీడీలోనూ.. అటు జనంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం, విద్య తదితర రంగాల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీచేయడం కంటే ఇప్పటికే ఉన్న శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమాల్లో వినియోగించుకోవాలన్న దిశగా సీఎం వ్యాఖ్యలు ఉండడంపై టీటీడీ ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
జెండా, పార్టీ ని లాక్కున్నోడికి ఏపీ కి FBI తీసుకురావడం కష్టమా..?
-
ఫేక్ FBI ప్లాన్ రివర్స్.. పరువు పోగొట్టుకున్న అబ్బాకొడుకులు
-
చంద్రబాబూ.. మీ పాలనలో పోలీసింగ్ అంటే ఇదేనా?: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ పోలీసులు ఎఫ్‌బీఐ పేరును వాడటంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబూ రాష్ట్రం పరువు తీయవద్దంటూ హితవు పలికారు. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరిందంటూ ధ్వజమెత్తారు.‘రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ఎఫ్బిఐ పేరును వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు. చంద్రబాబూ.. మీ పాలనలో ఇదేనా పోలీసింగ్ అంటే?. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వమే స్వయంగా చేస్తున్న వ్యవహారమా?. ‘ఎక్స్’లోని పోస్టులను తొలగించాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు తమను ‘ఎఫ్‌బీఐ’గా పేర్కొనడం అత్యంత దారుణం. ఇది మన రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా దిగజార్చే హేయమైన చర్య.ఆ మెయిల్స్ అన్నీ ఏపీ పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచే వచ్చాయని ‘ఎక్స్’ ధృవీకరించింది.ఆ మెయిల్ పంపిన ఇన్స్పెక్టర్ తాను ‘ఎఫ్‌బీఐ’ అధికారినని ఎలా చెప్పుకున్నారు?.అసలు ఆ మెయిల్ పంపాలని ఆదేశించింది ఎవరు?‘ఎఫ్‌బీఐ’ పేరు ఎందుకు దుర్వినియోగం చేశారు?. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు..‘ఎక్స్’ను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారా?అమలు చేయని సూపర్ సిక్స్ హామీలు, డీఎస్సీ కుంభకోణం, అమరావతి నిర్మాణంలో దోపిడీ, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలు, వేధింపులపై పోస్టులు పెడితే ఎందుకు తొలగిస్తున్నారు?. పోలీసు యూనిఫాం అనేది చట్టాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించింది. అంతేగానీ మీ రాజకీయ సెన్సార్షిప్ను అమలు చేయడానికి కాదు.రాజకీయ ప్రయోజనాల ఏకంగా ఎఫ్‌బీఐ పేరును వాడటం ఏపీకి అవమానం. దీని వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ విశ్వసనీయత తీవ్రంగా దెబ్బ తిన్నది.విమర్శకుల గొంతు నొక్కేందుకు ఉపయోగిస్తున్న మీ అధికారాన్ని,గత ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీల అమలుకు వినియోగించండి. ఇంకా తీవ్ర కరువుతో నష్టపోయిన రెతులను ఆదుకోవటానికి వాడండి. యువతకు ఉద్యోగాలు కల్పించండి. అలా నిజమైన అభివృద్ధి చేసి చూపండి. ఇకనైనా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఈ సామాజిక మాధ్యమాల యుగంలో వాస్తవాలను దాచి పెట్టడం సాధ్యం కాదు. ప్రజలకు మంచి చేసే విషయంలో మీ పనితీరును చూపండి.ఆ ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. అంతేతప్ప, ఇలా సెన్సార్షిప్, వేధింపులతో కాదు’’అని వైఎస్ జగన్ ఎక్స్‌లో తెలిపారు. .@ncbn గారి పాలనలో రాష్ట్రంలో ‘రెడ్ బుక్ పాలన’ అంతర్జాతీయ స్థాయికి చేరింది. రాష్ట్ర పోలీసులు నకిలీ గుర్తింపుతో ఏకంగా అమెరికాకు చెందిన ‘ఎఫ్‌బీఐ’ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) పేరును ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిజమైన ముప్పు.చంద్రబాబు గారూ, మీ పాలనలో ఇదేనా…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2026 ఇదీ చదవండి : చంద్రబాబు సర్కార్ బండారం బట్టబయలు -
కానిస్టేబుల్ నోటిఫికేషన్ తో గుట్టురట్టిన అసలు కథ
-
డీఎస్సీ స్కామ్‌లో అడ్డంగా దొరికిన బాబు సర్కార్
సాక్షి, అమరావతి: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో చంద్రబాబు సర్కార్ అడ్డంగా దొరికేసింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌తో గుట్టురట్టు అయ్యింది. పరీక్ష లేకుండానే ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసింది. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా టీచర్ పోస్టులు కట్టబెట్టింది.అయితే, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రాత పరీక్ష పెట్టిన ప్రభుత్వం.. ఫిజికల్ టెస్టుతో పాటు రాత పరీక్షలోనూ అర్హత తప్పనిసరి చేసింది. జీవో 25 ప్రకారం రాత పరీక్ష తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ ఇచ్చింది. టీచర్ పోస్టులకు పరీక్ష లేకుండా.. కానిస్టేబుల్ పోస్టులకు పరీక్ష పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డీఎస్సీ స్కామ్‌కు ఇదే సాక్ష్యమని బాధిత అభ్యర్థులు అంటున్నారు.ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
‘మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: మోసాలు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా పెన్షన్లు ఇస్తానంటూ మోసానికి దిగారని.. దశల వారీగా పెన్షన్లు ఇస్తానంటూ మభ్యపెట్టటం మొదలు పెట్టారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘66 లక్షల మందికి వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు ఇచ్చారు. చంద్రబాబు 59 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. రెండేళ్లలోనే చంద్రబాబు 6.5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఈ రెండేళ్లుగా పడిన బకాయితో కలిపి పెన్షన్లు ఇవ్వాలి’’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘‘వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన ఇళ్లనే చంద్రబాబు ఆపేశారు. ఇప్పుడు కొత్తగా ఐదు లక్షల మందికి ఇళ్లు మంజూరు చేస్తామంటున్నారు. అసైన్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు అదే మోసానికి దిగారు. 20 ఏళ్లుగా అసైనీలుగా ఉన్న వారికే జగన్ పూర్తి హక్కులు కల్పించారు...చంద్రబాబు వచ్చాక ఆ జీవోని అమలు చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు అవే భూములను తాను ఫ్రీహోల్డ్ చేయబోతున్నట్లు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. చుక్కల భూములు, 22ఏ భూముల సమస్యలకు కూడా వైఎస్ జగన్ హయాంలో పరిష్కారం చూపారు. భూ సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ చేసిన కృషి మరెవ్వరూ చేయలేదు’’ అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో మరో రిక్రూట్మెంట్లో గోల్మాల్! -
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది. మంత్రి లోకేశ్ పర్యటనతో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఆ పార్టీలో వీసమెత్తు పలుకుబడి లేదని విస్పష్టమైంది. పార్టీలో జిల్లా నుంచి మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతుల మాటకే ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇకపై నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌కు సైతం తన ముఖం చూపించుకోలేని ఘోర పరాభవాన్ని చవిచూశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలనే తృష్ణతో లోకేశ్ బుధవారం నెల్లూరు, కోవూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ఆయన్ను తన నియోజకవర్గ పరిధి నుంచి మాగుంట లేఅవుట్ రోడ్డులోని కార్యాలయం మీదుగా పర్యటనకు తొలుత రూట్ మ్యాప్ సిద్ధం చేశా రు. సుమారు 10 వేల మందితో ఘన స్వాగతం పలికి, తన పలుకుబడిని పెంచుకోవాలని నాలుగు రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం దక్కించుకోవాలని కోటంరెడ్డి కంటున్న కలలు భగ్నమే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆఖరి క్షణంలో ఝలక్ అయితే లోకేశ్ పర్యటనలో నెల్లూరు రూరల్ ఊసేలేకుండా ఆఖరి క్షణంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నేరుగా మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో.. ఆ తర్వాత కోవూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కకు తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. ఇది కోటంరెడ్డికి జరిగిన ఘోర పరాభవంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మేయర్ స్థానం విషయమై ఇటు మంత్రి నారాయణ, అటు వేమిరెడ్డి దంపతులతో విభేదించిన శ్రీధర్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసి అణచివేసేందుకే అనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి లోకేశ్ పర్యటనలో పాల్గొంటారా? ముఖం చాటేస్తారా? అనే విషయంపై చర్చ నడుస్తోంది. బోసిపోయిన ఎమ్మెల్యే కార్యాలయం లోకేశ్ పర్యటన పర్యటన నేపథ్యంలో హడావుడి చేసిన కోటంరెడ్డి క్యాడర్ ఆఖరి క్షణంలో మార్పు చేయడంపై భగ్గుమంటుంది. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు రచ్చరచ్చ చేయడంతో వారిని నాయకులు సముదాయించే ప్రయత్నం చేశా రు. జరిగిన అవమానం, క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. హడావుడిగా కనిపించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంలో క్యాడర్ సైతం ముఖం చాటేయడంతో బోసిపోయింది. కోటంరెడ్డి ఇక ఒంటరేనా? రాజకీయంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒంటరి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ అండతో ఎదిగిన కోటంరెడ్డి తన బలంగా భ్రమించారు. అడ్డగోలుగా చెలరేగిపోతున్న ఆయన్ను కట్టడి చేసిన నేపథ్యంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని దూషిస్తూ పచ్చ కండువా కప్పుకొ న్నారు. అప్పటి నుంచి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై స్థాయిని మరిచి తరచూ ప్రేలాపణలతో చెలరేగిపోయారు. తాజాగా దగా డీఎస్సీపైనా లోకేశ్‌ను వెనకేసుకు వస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. అప్పటి వరకు కోటంరెడ్డిని అభిమానించిన ఆ పార్టీ శ్రేణులు సైతం ఈ పరిణామాలతో ఛీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సైతం బెదిరించి ఇదే తన బలమంటూ.. పేట్రేగిపోతున్నారు. తాజా పరిణామాలతో కోటంరెడ్డికి అధికార పార్టీలో కనీస స్థాయి పలుకుబడి లేదని స్పష్టం కావడంతో క్యాడర్ సైతం మౌనం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో.. -
మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి నీళ్లే తాగిస్తారా? బాబు, పవన్ పై రెచ్చిపోయిన మహిళలు
-
జెన్‌జీ గొంతు నొక్కే యత్నం!.. యువత ప్రశ్నిస్తే.. కోచింగ్ సెంటర్లపై కొరడా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖ్యంగా జెన్‌జీ గొంతు నొక్కేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన జీవో 9ని బయటకు తీసింది. దానిని ఉపయోగించి రాష్ట్రంలో ప్రస్తుతం విస్తరిస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ జీవోలోని అంశాలను లోతుగా పరిశీలిస్తే ఇటు విద్యార్థులను, అటు కోచింగ్ సెంటర్లను కట్టడి చేయడానికి అవసరమైన నిబంధనలన్నీ ఉన్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరుద్యోగ యువత నుంచి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. దాంతో యువతను కట్టడి చేయడానికి మార్గాలను అన్వేషించడం మొదలయ్యింది. అందులో భాగంగానే జీవో 9ను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. విద్యార్థుల రక్షణ, మానసిక ఆరోగ్యం కోసం గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ జీవో జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నా... ఈ జీవో 9ను అడ్డం పెట్టుకుని జెన్‌జీ గొంతులను అణిచి వేసేందుకు చంద్రబాబు సన్నద్ధమవుతున్నారని అర్థమవుతోంది. రాజకీయ ఆందోళనలు, నిరసనల్లో విద్యార్థులు పాల్గొనేలా కోచింగ్ సెంటర్లు ప్రేరేపించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మంగళవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రగిలిపోతున్న యువత... సూపర్ సిక్స్‌లో భాగంగా నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఎన్నికల ముందు రెండు హామీలను ఇచ్చారు. ఆ హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతీ, యువకులను మోసం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే అప్పటి వరకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే 18 ఏళ్లు నిండిన 60 ఏళ్లలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సర్కారు మోసం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఆందోళన బాటపడుతున్నారు. ఇటీవల కాకినాడలో పోలీసు ఉద్యోగాల ఆశావహులు, కోచింగ్ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యంతో వయసు పెరిగిపోతోందని, కోచింగ్ ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలంటూ ధర్నా నిర్వహించారు. అలాగే రాష్ట్రంలోని పలు చోట్ల నిరుద్యోగ యువత ఆందోళనలు ప్రారంభించడంతో చంద్రబాబు సర్కారు నిరుద్యోగ యువతను అణిచి వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని, రాజకీయ కుట్రలకు వేదిక అవుతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు. పేరుకే సమీక్ష.. కఠిన చర్యలకు ఆదేశాలు రాష్ట్రంలో విస్తరిస్తున్న నిరుద్యోగుల ఆందోళననలను ఎలాగైనా అణచివేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఆందోళనలకు, నిరసనలకు దిగేలా పురికొల్పుతున్నాయని ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కొన్ని కోచింగ్ సెంటర్లు అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్లు సమావేశంలో చర్చకు వచ్చిందని అధికారులంటున్నారు. కోచింగ్ సెంటర్లు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం... ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు.. జీవో 9 దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, హాస్టళ్లలో విద్యార్ధుల రక్షణ, మానసిక ఆరోగ్య కోసం సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జీవో 9 జారీ చేసింది. విద్యార్థుల భద్రత, సంక్షేమంతో పాటు కౌన్సిలింగ్ వేధింపులు నివారణకు, మౌలిక సదుపాయాలకు రాజ్యాంగంలోని 141 ఆరి్టకల్ ప్రకారం మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాస్థాయి పర్యవేక్షక కమిటీలు ఏర్పడతాయి. కలెక్టర్, ఎస్పీ, డీఈవోలతోపాటు మరికొందరు అధికారులు, న్యాయవాది, సామాజికవేత్త ఈ కమిటీలలో సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లపై వచ్చే ఎలాంటి ఫిర్యాదులనైనా ఇవి స్వీకరించి సుమోటోగా విచారణ జరపవచ్చు. ఎవరినైనా సరే విచారణకు పిలవవచ్చు. ప్రశ్నించవచ్చు. సాక్ష్యాధారాల కోసం ఆదేశించవచ్చు. కోచింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ మొదలు రోజువారీ నిర్వహణ వరకు అనేక నిబంధనలు ఉన్నాయి. వాటిలో దేనినైనా పాటించలేదంటూ చర్యలు చేపట్టవచ్చు. ఇప్పుడు ఇదే జీవోను ఉపయోగించుకుంటోంది. జెన్‌జీ గొంతులు వినపడకుండా నులిమేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. -
లోకేష్ బాబే DSC దొంగ..! DSC అక్రమాలపై YSRCP మరో ఉద్యమం
-
చంద్రబాబు ఎలాంటివాడో నా కంటే వంశీకే బాగా తెలుసు కొడాలి నాని సెటైర్లు అదుర్స్
-
DSCఅక్రమాలపై మరోసారి బాబుపై జగన్ ప్రశ్నల వర్షం
-
జగన్ పర్యటనలో ఆ జనాన్ని చూస్తే నాకు.. సాకే శైలజానాథ్ రియాక్షన్
-
త్వరలోనే వంశీ విశ్వరూపాన్ని చూస్తారు వల్లభనేని వంశీ పై పేర్ని నాని కామెడీ
-
చంద్రబాబు UCCకి ఓకే? బీజేపీ కిషోర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ మరోసారి ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల మీద విశ్వసనీయత పోతే.. నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయంటూ సోమవారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘లక్షలాది మంది అభ్యర్థులు తమ జీవితాన్ని.. కుటుంబాల కష్టార్జితాన్ని ఉద్యోగ పరీక్షల కోసం ఖర్చు చేస్తున్నారు. వారికి కావాల్సింది ఒక్కటే.. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా.. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం. వ్యవస్థే విఫలమైతే దెబ్బతినేది కేవలం పరీక్ష ఫలితాలు కాదు.. మొత్తం నియామక ప్రక్రియపై యువత పెట్టుకున్న నమ్మకం.చంద్రబాబూ.. న్యాయం చేయడం మీకు ఒక ఆప్షన్ కాదు.. ప్రభుత్వపరంగా మీ బాధ్యత. కష్టపడి చదివిన అభ్యర్థుల శ్రమకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీపై లేదా?.వారి భవిష్యత్తుకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం మీకు లేదా? డీఎస్సీలో బయటపడిన స్కాంకు మీరు బాధ్యత వహిస్తారా? లేదా? నిరుద్యోగుల కలలతో ఆడుకోవడం కాదు..వారి కష్టానికి న్యాయం చేయండి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. 𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱!Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters… pic.twitter.com/hyYMHwsYEK— YS Jagan Mohan Reddy (@ysjagan) September 14, 2026 -
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో కూటమి రైతుల జీవితాలతో చెలగాటం
-
గిరిజనులంటే లెక్కలేదా? పోలవరం జిల్లా గొల్లగుప్ప వలసలో దయనీయ పరిస్థితులు
-
వైఎస్ జగన్ అడిగింది లోకేష్‌కు అర్థం కాలేదా?
ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చర్చల సవాళ్లను వదలి, ఇక బెదిరింపుల పర్వంలోకి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎంత షాడో ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నప్పటికీ లోకేష్ వ్యాఖ్యలు దుందుడుకుతనంగా ఉండడం బాగోలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా నిర్దిష్టమైన అభియోగాలతో, ఆధారాలతో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందిన వైనం, కొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించడం తదితర విషయాలను జగన్ ప్రస్తావించారు.దానికి సమాధానంగా లోకేష్ ఏమి మాట్లాడారో చూడండి. డీఎస్సీపై జగన్ విషం కక్కుతున్నారట. వారి ఉపాధ్యాయుల జోలికి వస్తే చర్యలు తప్పవట. నియామకాలు ఆపాలని 300 కేసులు వేసినా కోర్టు తప్పుపట్టలేదట. డీఎస్సీకి, ఏపీపీఎస్సీ తేడా తెలుసా అని మరోసారి జగన్‌ను లోకేష్ పిచ్చి ప్రశ్న వేశారు. ఇక్కడే ఈయన బలహీనత తెలిసిపోతుంది. జగన్ అడుగుతున్నదేమిటి? లోకేష్ చెబుతున్నదేమిటి? కోర్టులు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని ఎక్కడ చెప్పాయో తెలియదు. మీ పత్రిక విలేకర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని, కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారని, దారుణమైన ఆరోపణ చేశారు.నిజంగా అలాంటిది ఒక్కటి జరిగినా ఈపాటికి ఎన్ని కేసులు పెట్టి ఉండేవారో కదా! రెడ్ బుక్ పేరుతో ఎంతమందిపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టించింది ప్రజలకు తెలియదా! టీచర్ల జోలికి ఎవరు వెళ్ళారు? ఎవరు దాడులు చేశారు? టీచర్లను రెచ్చగొట్టి ఏవైనా తప్పుడు కేసులు పెట్టించి, ప్రశ్నించే మీడియాను భయపెట్టడం ద్వారా డీఎస్సీ స్కామ్ వివరాలు బయటకు రాకుండా చూడాలన్నది మంత్రిగారి ఉద్దేశం ఏమో తెలియదు. కాని ఆ వ్యూహం అన్నిసార్లు పనిచేయదు కదా!స్పోర్ట్స్ కోటా అవకతవకల గురించి అడుగుతుంటే, వివరణ ఇవ్వకుండా టీచర్ల ఎంపిక మొత్తాన్ని వైఎస్సార్సీపీ తప్పుపడుతున్నట్లు లోకేష్ ప్రకటన చేయడం ఏమిటి? పనిలో పని స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా చెప్పారు. కోర్టులో అసలు కేసే విచారణ లేకుండా చేసుకుని, ఇలా క్లీన్ చిట్ అని మాట్లాడడం ప్రజలను ఫూల్స్‌ను చేయడం కాదా? లోకేష్ చెబుతున్నట్లు డీఎస్సీపై జగన్ విషం కక్కలేదు. పరీక్షలలో జరిగిన అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అక్రమాలు అర్హులైన కొందరు అభ్యర్ధుల పాలిట విషతుల్యంగా మారాయని చెప్పారు.అది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అసలు పరీక్షలు రాయకుండానే టీచర్ పోస్టులు ఇవ్వాలని జీఓలు ఇవ్వడం, ఆ తర్వాత పని పూర్తి అయ్యాక పరీక్షలు లేకుండా టీచర్ల ఎంపిక జరగరాదని ఉత్తర్వులు ఇవ్వడం నిజమా? కాదా? ప్రశ్న పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ ఒక వ్యక్తి చేతిలోనే ఎందుకు పెట్టారు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వస్తే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? స్పోర్ట్స్ కోటాలో 372 మందికి పరీక్ష లేకుండానే పోస్టులు ఇచ్చి, తదుపరి గేట్లు మూసేశారా?లేదా? అసలు క్రీడలే జరగలేదు కాని, కొందరు అందులో భాగస్వాములైనట్లు నకీలీ సర్టిఫికెట్లు తెచ్చారా? లేదా? అధికారులు మీడియా అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలే పరిస్థితిని ఎదుర్కుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వారు అధ్బుతంగా సమాధానం చెప్పారని ఎందుకు ప్రచారం చేస్తున్నారు?అక్రమాలు జరిగాయని అధికారులు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అంటున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుందని ఒకసారి, పరీశీలిస్తామని మరోసారి, తమకు కుల సర్టిఫికెట్లతో సంబంధం లేదని, రెవెన్యూ శాఖ పరిధిలోనివని ఇంకొకసారి అధికారులు చెప్పారా? లేదా? అధికారులు ఏడుసార్లు వెరిఫై చేశామని అన్నారు. అయినా ఇన్ని ఇన్ని అవకతవకలు ఎలా జరిగాయి? అవన్ని బయటకు వచ్చాయి కదా! ఇవన్ని ఎందుకు! జగన్ వేసిన ప్రశ్నలకు వరసగా జవాబులు ఇవ్వగలిగితే సరిపోతుంది కదా!ఇదీ చదవండి: క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!అభ్యర్థులు పలువురు తమకు అన్యాయం జరిగిందని, ఆధారాలతో సహా మీడియాకు చెబుతున్నారే! వారిని అధికారులు పిలిచి ఎందుకు విచారణ చేయడం లేదు?వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికే భయపడుతన్నట్లు కనిపించడం లేదా! పరీక్షలు లేకుండా టీచర్ల పోస్టులు ఏమిటని వేరే కేసులో సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వం చూడలేదా? కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సిలో తప్పు జరగలేదని చెబుతూనే మొత్తం ప్రక్రియ అంతా అధికారులే చేశారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఊహించినట్లుగానే ఈ మొత్తం ఎపిసోడ్‌ను అధికారుల మీద నెట్టివేయడం కాదా? అంతకుముందు లోకేష్‌ను అభినందిస్తున్నానని పలు సభలలో చెప్పిన చంద్రబాబు ఈసారి అధికారుల ప్రస్తావన ఎందుకు తెచ్చారు?పవన్ కళ్యాణ్ ఉద్యోగ పత్రాల పంపిణీ కార్యక్రమంలో లేకపోయినా ఎందుకు ఆయన కూడా ఉన్నట్లు చెప్పుకోవల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు దీనిపై స్పందించ లేదు? జనసేన, టీడీపీ మధ్య డీఎస్సీ అక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయా? లేదా? వాటిని అదుపు చేయడానికి రెండు పార్టీలు ప్రయత్నించాయా?లేదా? అసలు ఏ తప్పు లేకపోతే సాక్షి మీడియాను నియంత్రించాలని ఎందుకు చూస్తున్నారు. సాక్షి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాతో పాటు, కొంతమంది స్వతంత్రంగా వీటిపై చేసే విశ్లేషణల వీడియోలను పోలీసుల ద్వారా ఎందుకు తొలగింపచేస్తున్నారు? డీఎస్సీ స్కామ్‌పై సాక్ష్యాలతో సహా కథనాలు ఇచ్చిన ఒక ప్రముఖ టీవీకి చెందిన సంపాదకుడు ఎందుకు రాజీనామా చేశారన్న చర్చ జరుగుతోందా? లేదా?ఇవన్ని గమనిస్తే డీఎస్సీలో ప్రభుత్వం తప్పు చేసిందన్న అభిప్రాయం బలపడడం లేదా? ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఎంత వంత పాడుతున్నా, టీచర్ల పేరుతో ర్యాలీలు తీయించినా, డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థులు వెనక్కి తగ్గడం లేదు కదా! అన్నిటిని మించి జగన్ చేసిన ఒకే ఒక్క సవాల్.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండింటిపైన సీబీఐ విచారణ జరపాలన్నదానిపై ఎందుకు నోరు మెదపడలేకపోతున్నారు?తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని లోకేష్ భయపడుతున్నట్లు అవడం లేదా? విషం కక్కారా? లేక అమృతం తాగారా? అన్నది కాదు సమస్య. అక్రమాలు జరిగాయా? లేదా? అన్నది తేల్చాలా? ఆ ధైర్యం చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు? మొదట బుకాయింపు, ఆ తర్వాత తడబాటు, తదుపరి సెంటిమెంట్, ఇప్పుడు భయంతో డబాయింపు, కేసుల బెదిరింపు, మొత్తం అధికారులపై నెట్టేసి కుమారుడిని రక్షించే యత్నం... ఇవన్ని ఏమి చెబుతున్నాయి. అన్ని వేళ్లు లోకేష్ వైపు చూపుతున్నాయని జగన్ చెబుతున్నది వాస్తవమే అనిపించదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఒక టీచర్ పోస్టు.. ఆరు మలుపులు!
సాక్షి, అమరావతి: ఒక ఉపాధ్యాయ పోస్టు నియామకంపై అధికారుల వివరణలు మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ టీచర్ అభ్యర్థుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ పోస్టుకు సంబంధించిన టెట్ మార్కులు, ఏడు దశల అర్హత పరిశీలన, డీఈవో ప్రకటన, అభ్యర్థి మళ్లీ టెట్ రాయడం వంటి అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు.తొలి మలుపు: 65 మార్కులతో ఏడు దశల పరిశీలన అభ్యర్థికి 65 టెట్ మార్కులు ఉన్నట్లు చూపించి, ఏడు దశల పరిశీలన అనంతరం ఉపాధ్యాయ పోస్టు ఇచ్చారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాతే నియామకం జరిగిందని చెబుతున్నప్పుడు, ఆ పరిశీలనలో అభ్యర్థి అర్హతను ఎలా నిర్ధారించారో వెల్లడించాలని ప్రశ్నించారు. రెండో మలుపు: అనర్హుడని డీఈవో ప్రకటన అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అర్హత లేకపోతే ఏడు దశల పరిశీలనలో ఆ విషయం ఎందుకు బయటపడలేదని నిలదీశారు. ‘‘ఆ ఏడు దశల్లో అసలు ఏం వెరిఫై చేశారు?’’ అన్నది టీచర్ అభ్యర్థులకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అని పేర్కొన్నారు.మూడో మలుపు: ఉద్యోగం ఎలా వచ్చిందో అభ్యర్థికే తెలియదా? తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని సదరు అభ్యర్థే చెప్పినట్లు వైఎస్ జగన్ ప్రస్తావించారు. నియామకం పొందిన అభ్యర్థి నుంచి కూడా అలాంటి సమాధానం వచ్చిందంటే, పోస్టు భర్తీ ప్రక్రియపై తలెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.నాలుగో మలుపు: తెరపైకి 2018 టెట్ 77 మార్కులు తాజాగా అధికారులు మరో వివరణ ఇచ్చారని, అభ్యర్థి 2018లో రాసిన టెట్‌లో 77 మార్కులు సాధించినట్లు ధ్రువీకరించారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ మార్కులు అప్పటి నుంచే రికార్డుల్లో ఉంటే నియామక సమయంలో ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. 77 మార్కులతో అర్హత ఉందని ఇప్పుడు చెబుతున్నప్పుడు ముందుగా అనర్హుడని డీఈవో ఎందుకు ప్రకటించారని అడిగారు. ఈ వివరణ ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఐదో మలుపు: ఎస్జీటీ పోస్టుకు ‘రాంగ్ పేపర్’? 77 మార్కులు పేపర్ 2బీలో వచ్చినవిగా చెబుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అది స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్ కాగా, ఎస్ జీటీ పోస్టుకు పేపర్–1ఏ అవసరమని గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఏడు దశల అర్హత పరిశీలనను ఎలా దాటారని ప్రశ్నించారు.ఆరో మలుపు: ఉద్యోగం వచ్చాక మళ్లీ టెట్ ఎందుకు? ఉద్యోగం పొందిన తర్వాత కూడా అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 2018లో సాధించిన 77 మార్కులే ఎస్జీటీ పోస్టుకు అర్హత కల్పించాయని అధికారులు చెబుతున్నట్లయితే, అభ్యర్థి మరోసారి టెట్‌కు హాజరు కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలి ఒకే పోస్టుపై వరుసగా వస్తున్న ఈ వివరణల మధ్య నియామక ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరిగిందని ఎలా చెప్పగలరని సీఎం చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం డీఎస్సీ కుంభకోణానికి దారితీయలేదా అని నిలదీస్తూ, దీనికి నైతిక బాధ్యత వహించరా అని నిలదీశారు. అభ్యర్థుల సందేహాలను తీర్చేలా మార్కులు, వర్తించే టెట్ పేపర్, అర్హత పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సర్కారు రాజకీయం వల్ల సీమకు తాగునీటి ప్రమాదం
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాయలసీమ, నెల్లూరు, వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 119.5 టీఎంసీల నీరు ఉండగా, ఇన్‌ఫ్లో పూర్తిగా ఆగిపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం కూడా అర టీఎంసీ నీటిని తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 3.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉన్నా కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోవడం సరికాదన్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, నిప్పుల వాగు ద్వారా నీటిని రాయలసీమలోని ప్రధాన ప్రాజెక్టులకు, సోమశిలకు నీరు విడుదల చేయాలన్నారు. నెల్లూరు జిల్లా రైతులకు సాగునీరు, తాగునీరు, చెన్నైకి ఇవ్వడానికి సరిపడా నీరు సోమశిలలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, తిరుమలకు కూడా నీరు ఇవ్వడం దుర్భరంగా మారనుందన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చి ఉంటే శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు 90 టీఎంసీల నుంచి 30 టీఎంసీల వరకు పడిపోయినా నీటిని తీసుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ అవసరాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు.తిరుపతిలోనే ‘నైలిట్’ కార్యాలయం పెట్టాలి తిరుపతి నైలిట్ సెంటర్ భవితవ్యంపై ప్రభుత్వం, అధికారులు చేస్తున్న ప్రకటనలు సమస్యను పరిష్కరించకపోగా మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయని పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నైలిట్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తే తిరుపతి నైలిట్ సెంటర్ తన ప్రాధాన్యత కోల్పోతుందన్నారు. విశ్వవిద్యాలయ క్యాంపస్ కార్యాలయాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రశ్నలు
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. అసలు చంద్రబాబు ఇచ్చే వివరణలే మరిన్ని ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. డీఎస్సీలో అక్రమాల ట్విస్టులను వివరిస్తూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ట్విస్ట్ 1: 65 మార్కులు → 7 దశల వెరిఫికేషన్..65 మార్కులు టెట్‌లో వచ్చినా టీచరు పోస్టు ఇచ్చారు.అంతకుముందు ఆ అభ్యర్థి 7 దశల వెరిఫికేషన్ ఎలా పూర్తి చేశాడు?ట్విస్ట్ 2: ఆ అభ్యర్థి అనర్హుడని డీఈవో తేల్చారుమరి ఆ 7 దశల్లో అసలు ఏం వెరిఫై చేసినట్టు?ట్విస్ట్ 3: ఉద్యోగం వచ్చింది... కానీ ఎలా వచ్చిందో అతనికే తెలియదు!మరి ఏడుసార్లు చేసిన వెరిఫికేషన్‌లో ఏం తేల్చారు?ట్విస్ట్ 4: సడన్‌గా తెరపైకి వచ్చిన 77 మార్కులు2018లో రాసిన టెట్‌లో అతనికి 77 మార్కులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు.ఆ 77 మార్కులు అప్పటికే రికార్డుల్లో ఉంటే..అంతకుముందే వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?డీఈవో అతన్ని అనర్హుడిగా ఎందుకు ప్రకటించారు?ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే ఈ వివరణ ఎందుకు బయటకు వచ్చింది?ట్విస్ట్ 5: “రాంగ్ పేపర్” ట్విస్ట్77 మార్కులు వచ్చినట్లు చెబుతున్నది పేపర్ 2లోకానీ SGT పోస్టుకు అవసరమైన టెట్ కేటగిరీ Paper-I-A.మరి అవేమీ చూడకుండానే అతను 7 దశల వెరిఫికేషన్‌ను ఎలా దాటాడు?ట్విస్ట్ 6: ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ టెట్ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ రాశాడు.2018లో వచ్చిన 77 మార్కులతోనే అతనికి అర్హత ఉంటే..మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇప్పుడు అన్నింటికంటే పెద్ద ప్రశ్నలు:ఇదేనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియ?ఇలాంటి వ్యవహారాలే డీఎస్సీ స్కామ్‌కు అవకాశం కల్పించలేదా?చంద్రబాబూ.. ఇప్పటికైనా ఈ స్కాంలకు మీరు నైతిక బాధ్యత వహిస్తారా? లేదా? 𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!@ncbn Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants.𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄… pic.twitter.com/MP38UWEkxD— YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2026 -
‘చంద్రబాబు.. వెన్నుపోటు మ్యాన్, మోసాల మ్యాన్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని, ప్రజలకు గుక్కెడు నీరు కూడా అందించలేని స్థితి నెలకొందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల్లో భారీ ప్రచారం చేసుకుంటోందని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విశాఖను గతంలో వైఎస్ జగన్ విశ్వనగరంగా తీర్చిదిద్దితే.. కూటమి పాలకులు వినాశన నగరంగా మార్చారని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందడం లేదు. పోలవరం నీళ్లు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. నగరంలో తాగునీటి కోసం ప్రజలు రోడ్లపై ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీతో నీరు రాకపోయినా, పురుషోత్తపట్నం నుంచి పాత పంపులు, మోటార్లతో నీటిని తరలించి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.విశాఖలో వందల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కట్టబెడుతున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “99 పైసలకు పిల్లాడికి కనీసం చాక్లెట్ వస్తుందా? అలాంటిది వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు. చంద్రబాబు వాటర్ మ్యాన్ కాదు.. ‘వెన్నుపోటు మ్యాన్’, ‘మోసాల మ్యాన్’ అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో నీటి సమస్య మరింత తీవ్రమైందని, నీటి సరఫరాలో కనీస ప్రణాళిక, భవిష్యత్ అవసరాలపై ముందుచూపు కనిపించడం లేదని విమర్శించారు. నీటి సమస్యపై ముందస్తు ప్రణాళిక ఉన్నప్పటికీ అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. డబ్బులు చెల్లించినా ట్యాంకర్లు సకాలంలో రాని పరిస్థితి ఉందని, విశాఖలో మట్టి మాఫియాను మించి ‘నీటి మాఫియా’ తయారైందని ఆరోపించారు.పోర్టు కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన అధికారులు ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కార్మికులను రోడ్డున పడేసి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. విశాఖలోని సుమారు 20 లక్షల మంది ప్రజల నీటి అవసరాలను తీర్చలేని పాలకులు మాటల్లో మాత్రం కోటలు దాటుతున్నారని అన్నారు. స్థానిక ఎంపీకి ప్రజల నీటి కష్టాల కంటే బీచ్ షాక్స్, భూములపైనే ఆసక్తి ఉందంటూ విమర్శించారు. నీటి సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే విశాఖ ప్రజలతో కలిసి మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజకీయాలు, కక్ష సాధింపులు పక్కనపెట్టి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పాలకులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ -
‘చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వాటర్ మెన్ కాదు.. క్వార్టర్ మెన్.. మంచి నీరు ఇవ్వలేదు.. మందు మాత్రం ఇస్తున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ (ఆదివారం) విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, వరుదు కళ్యాణి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు.ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. మూడు రోజులకు ఒకసారి మంచి నీరు ఇస్తున్నారు.. వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. మంచి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత.. పోతే ఎంత? ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలంలో మంచి నీటి పరిస్థితి ఏమిటి? మంచి నీటి సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ అయితే వైఎస్సార్సీపీది వెన్ను చూపని పార్టీ. యాదవ సామాజిక వర్గానికి సాధారణ మహిళను జీవీఎంసీ మేయర్‌గా వైఎస్ జగన్ చేశారు.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను చంద్రబాబు మేయర్ పీఠం నుంచి దించేశారు. చంద్రబాబు నైజం యూజ్ అండ్ త్రో పాలసీ...రుషి కొండపై భవనం కడితే తప్పుడు ప్రచారం చేశారు. కూటమి పాలనలో విశాఖ నగరంలో కొండలను పిండి చేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కానీ ఎకరా భూమి 99 పైసలకు ఇచ్చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చేవాడు వాటర్ మ్యాన్ నా? చంద్రబాబు చేసిన మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్లాలి. పెన్షన్లు తీసుకొనే వారిని చంద్రబాబు తాగు బోతులుగా చిత్రీకరిస్తున్నారు. పేకాట ఆడే వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు’’అని కన్నబాబు దుయ్యబట్టారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం రూ.2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు చేయాలి. మూడేళ్లలో కేవలం 32 వేల కోట్ల ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుడులా పని చేయాలి. కూటమికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి. స్థానిక సమస్యలు మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించాలి. చెప్పిన హామీలు కంటే ఎక్కువగా వైఎస్ జగన్ అమలు చేశారు. విశాఖకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. యాదవులకు విశాఖ మేయర్ పదవి వైఎస్ జగన్ ఇచ్చారు. జీవీఎంసీలో కీలకమైన పదవులు బడుగు బలహీన వర్గాలు వారికి ఇచ్చారు’’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ? -
అంబేద్కర్ కోనసీమలో చంద్రబాబుకు బిగ్ షాక్.. ముగ్గురు TDP అధ్యక్షులు రాజీనామా
-
ఏడు దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబూ?
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామక ప్రక్రియలో ఏడు దశల వెరిఫికేషన్ అంటే ఇదేనా చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై ఆయన మరోసారి ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘వెరిఫికేషన్.. నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్’ అంటూ జగన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందని చెప్పారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ నిలదీశారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కారు ఆటలాడుతోందని అన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల కెరీర్లు మీకు అపహాస్యంగా మారాయా అని మండిపడ్డారు. ‘ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడంలేదు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలింది. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారు? ఇది స్కామ్ కాదా? దీనికి మీరు నైతిక బాధ్యత వహించరెందుకు’ అని వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుని నిలదీశారు. స్కిల్ కేసులో క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం చంద్రబాబు చేసిన స్కామ్‌లో ఆయనే సొంతంగా క్లీన్ చిట్ ఇప్పించుకుని భుజాలు ఎగరేసుకుంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఫేస్బుక్లో ఈమేరకు ఒక పోస్టు చేశారు. ‘అధికారులను బెదిరించి తనపై ఉన్న కేసుల పని పూర్తి చేసుకుని క్లీన్చిట్ అని చెప్పడం దౌర్భాగ్యం. తన మీద కేసులు తానే కొట్టేయించుకుంటున్నాడు. ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి. ఇప్పుడు కూడా డీఎస్సీ కేస్‌ని నిర్వీర్యం చేసే పని చేస్తున్నాడు. అయినా స్కిల్ కేసులో తనకు క్లీన్చిట్ వచ్చిందని చెప్పుకోవడం ఎంతటి దౌర్భాగ్యం’ అని వైఎస్ జగన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. -
రాబడి రూ.45,169 కోట్లు.. రుణాలు రూ.55,534 కోట్లు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆదాయానికి మించి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్నుల రాబడిని మించి అప్పులు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో రాష్ట్ర పన్నుల రాబడి రూ.45,169 కోట్లుగా ఉందని జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ రుణాలు రూ.55,534 కోట్లు. అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడిని మించి ఏకంగా రూ.10,365 కోట్లు అప్పు చేశారు. ఐదు నెలల్లో సగటున నెలకు రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ అప్పు చేస్తున్నారు. అయితే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం నెలకు సగటున దాదాపు రూ.9,000 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేయడమేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆస్తులు, అప్పుల నిష్పత్తిపై ప్రతికూలత భారీ అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆస్తుల కల్పనపై మాత్రం అంతంతమాత్రంగానే వ్యయాలు చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు క్యాపిటల్ వ్యయం రూ.16,001 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. పైగా ఈ వ్యయాల్లో అత్యధిక భాగాన్ని ఫలితంలేని రంగాలకు బాబు ప్రభుత్వం మళ్లిస్తోంది. దీంతో అప్పులు పెరిగిపోయి, ఆస్తుల నిష్పత్తి తగ్గిపోనుంది. అప్పులు చేయకుండా సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా అప్పులు చేయడమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు. పైగా గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు మంగళం పాడటమే కాకుండా తాను ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా చంద్రబాబు అమలు చేయడం లేదు. భారీగా అప్పులు చేస్తున్నా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి తిలోదకాలు ఇచ్చేసి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పేరుతో ప్రైవేట్‌పరం చేస్తున్నారు. -
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని మేం ధైర్యంగా చెబుతున్నాం. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో వైఎస్సార్సీపీ జిల్లా విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలోను, బయట చాలెంజ్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ఎందుకు చాలెంజ్ చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై తప్పుగా మాట్లాడితే కేసులు పెడతామంటూ అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. నారా లోకేశ్ నీతిమంతుడైతే తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. 2006లో వోక్స్వ్యాగన్ అంశంలో తనపై ఆరోపణలు వచ్చాయని, తానే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకుని నిజాయితీని నిరూపించుకున్నట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థపై నమ్మకంపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిస్థితిలోనూ రైతులకు ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం: కన్నబాబుపార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షలు కాదు ఫలితాలు కావాలంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా అదే చెబుతోందన్నారు. ఉదయం ఇచ్చిన పింఛన్ డబ్బులు సాయంత్రానికి మద్యం తాగేస్తున్నారని, ఎవరికి పింఛన్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వెరిఫై చేయాలని చెప్పడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా పింఛన్లు ఇస్తామని రెండున్నరేళ్ల తరువాత ప్రకటించి, పింఛన్ల కోసం కుటుంబాలు విడిపోయాయా లేదా అని సర్వే చేయాలనడం సరికాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటింటికీ మద్యం సరఫరా చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ ఉంటోందన్నారు.డీఎస్సీలో పేకాట ఆడినవారికి ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పడం విచారకరమన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులుగా సర్టిఫికెట్లు జారీచేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నా«థ్, పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
మందు 'బాబుకు పండగ'
ఎన్నికల హామీలకు మంగళం పాడిన నారా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న బెల్ట్ దుకాణాలు, అనధికార మద్యం విక్రయాలతో మందుబాబులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుల్లవుతుంటే, ఇవి చాలవన్నట్టు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. దీని ద్వారా ఇకపై దుకాణాల వద్దే ‘సిట్టింగ్’ను అధికారికం చేయడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త విధానం గాంధీ జయంతికి ముందు రోజు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, అమరావతి: తాజాగా మద్యం షాపులకు పర్మిట్ రూమ్‌ను తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తెచ్చింది. దీంతో ఊరూరా బార్ అనే కొత్త పంథాకు ప్రభుత్వం తెరతీసినట్టయింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2026–27 ఎక్సైజ్ పాలసీ, దాని అమలుకు తెచ్చిన నిబంధనల సవరణలను పరిశీలిస్తే మద్యం విక్రయాలను భారీగా పెంచి మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెట్టేలా ఉంది. మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే పర్మిట్ రూమ్ ఉండి తీరాలని తాజాగా విడుదల చేసిన జీఓ ఎంఎస్ నెంబర్ 580లో పేర్కొన్నారు. పర్మిట్ రూమ్ లైసెన్స్ పొందకుండా ఏ షాపు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని రూల్ 14లో స్పష్టం చేశారు. పాలసీ మార్గదర్శకాల జీవో 579లోనూ ఇదే నిబంధనను పునరుద్ఘాటించారు. దీంతో రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాలను అక్టోబరు 1వ తేదీ నుంచి నుంచి ఊరూ–వాడా– బార్లుగా మారే అవకాశం కల్పించారు. నాడు వైఎస్ జగన్ నియంత్రిస్తే.. నేడు బాబు విస్తరిస్తున్నారు మద్యం వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికార బెల్ట్ షాపులతోపాటు పర్మిట్ రూమ్‌లనూ పూర్తిగా ఎత్తివేశారు. మద్యం షాపుల సమీపంలో కూర్చొని తాగే ఏర్పాటునూ రద్దు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా మద్యం విక్రయాలతోపాటు వినియోగాన్ని విస్తరించేలా పాలసీలు తెస్తోంది. 2025 ఆగస్టు 12న జీవో 273 ద్వారా అవసరమైన చోట అనే పేరుతో పర్మిట్ రూమ్‌లను తిరిగి తెచ్చారు. అప్పుడు శాఖాపరంగా పరిశీలించి పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తే.. ఇప్పుడు పర్మిట్ రూమ్ ఉంటేనే మద్యం షాపు లైసెన్స్ రెన్యువల్ అనే మెలికపెట్టడం గమనార్హం. దీని వల్ల మండల కేంద్రాలు, నగర పంచాయతీలు, పట్టణ కాలనీల్లో ఇలా మద్యం దుకాణం ఉన్న ప్రతిచోటా అక్కడే కూర్చొని మందు తాగే గది తప్పనిసరిగా ఉండనుంది. ఆదాయమే అసలు లక్ష్యం.. టీడీపీ సిండికేట్‌కు అక్రమ ఆదాయమే అసలు లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తోంది. మద్యం షాపులకు పర్మిట్ రూమ్ పేరుతో 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో ఏడాదికి రూ.5 లక్షలు, ఆపైన ఉన్న చోట రూ.7.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలోని 3,736 మద్యం షాపులకు పర్మిట్ రూమ్ తప్పనిసరి చేయడంతో రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజారోగ్యం, మహిళల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతలు గురించి ప్రభుత్వ పాలసీలో పట్టించుకోలేదు. రెన్యువల్ పేరుతో మరో రూ.వెయ్యి కోట్లు ఇప్పుడు మద్యం షాపుల లైసెన్స్ మరో ఏడాదిపాటు రెన్యువల్ చేయడం వల్ల ప్రభుత్వానికి 38 శాతం అదనంగా ‘రెన్యువల్ ఆర్ఈటీ‘ చెల్లించాలి. ఓపెన్ కేటగిరీలో జనాభాను బట్టి రూ.23 లక్షలు, రూ.27.2 లక్షలు, రూ.35.5 లక్షలు. రిజర్వ్డ్ కేటగిరీలో రూ.11.5 లక్షల నుంచి రూ.17.8 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 3,736 ఓపెన్ షాపుల్లో 340 రిజర్వ్డ్ షాపుల లెక్క తీసేస్తే రెన్యువల్ ఆర్ఈటీ రూపంలో రూ.వెయ్యి కోట్లు వరకు ఆదాయం వస్తుందని అంచనా.మరింత పేట్రేగిపోనున్న టీడీపీ సిండికేట్.. ఇప్పటికే టీడీపీ సిండికేట్ మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.20లకు పెంచి విక్రయిస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా రెన్యువల్ పేరుతో అదనంగా లైసెన్స్ ఫీజు, పర్మిట్ రూమ్‌కు ట్యాక్స్ వంటి కారణాలు చూపి మద్యం ధరలను అనధికారికంగా మరింత పెంచి విక్రయించే ప్రమాదం లేకపోలేదు. -
మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు వైరల్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: మరోసారి తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జనసేన కార్యకర్తలను కూలీలుగా చూడొద్దని చంద్రబాబును బొలిశెట్టి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బలంగా ఉన్నచోట్ల మనమే పోటీ చేద్దామని జనసేన శ్రేణులకు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.కాగా, స్థానిక ఎన్నికలపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశంలో బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన చోట జనసేన సైనికులను తొక్కేస్తున్నారు.. జనసేన గెలిచిన చోట మాత్రం టీడీపీ వాళ్లను మనం గౌరవిస్తున్నాం’ అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు.టీడీపీ నాయకులు మనల్ని తొక్కేస్తున్న విషయం మన పార్టీ నాయకులకు కూడా తెలుసని, వారి తీరుపై తాను సీఎం చంద్రబాబుతో కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడతానని అన్నారు. ‘మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. మీరే పవన్ కళ్యాణ్‌కు బలం, మాకు బలగం. ఈ రెండున్నరేళ్లు మీ బాధను చూశాం. ఇక నుంచి మీరు బాధపడకుండా చూసుకోవాలి్సన బాధ్యతను జనసేన తీసుకుంటుంది’ అని చెప్పారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. జనసేన అనుబంధ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: ఆయన మనకెందుకు? -
అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారు బాబుపై TJR సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్
-
ప్రభుత్వ ఉద్యోగులంటే మీకెందుకు ఇంత చిన్న చూపు
-
అందుకే కలెక్టర్లను చంద్రబాబు బెదిరిస్తున్నారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ లెవల్‌కు చేరిందని.. అందుకే కలెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా ఐఏఎస్ సునీతను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని.. స్కిల్ కేసులో సునీత నిజాలు మాట్లాడారన్న కోపంతో చంద్రబాబు ఉన్నారన్నారు.‘‘చంద్రబాబు ఒత్తిడి చేయటం వలనే తాను సంతకాలు చేసినట్టు సునీత చెప్పారు. అందుకే తాను స్కిల్ కేసులో ఇరుక్కున్నానని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతిసారీ సునీతను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక దళిత ఐఏఎస్ అధికారిణిపై చంద్రబాబు నోరు పారేసుకోవటం సరికాదు. ఆమె తన బాధను మిగతా అధికారులతో చెప్పుకుంది. స్పోర్ట్స్ కోటాలో నారా లోకేష్ తన మనుషులకు అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఆధారాలన్నీ బయట పడినా.. చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ టీజేఆర్ నిలదీశారు.‘‘డీఎస్సీ అక్రమాలను అధికారుల మీదకు నెట్టేశారు. అందుకే చంద్రబాబు మాటలు నమ్మి సంతకాలు చేయవద్దని పదేపదే చెప్పాం. మా పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ జైలుకు వెళ్లటం ఖాయం. నీట్ పేపర్ లీక్‌తో కేంద్రమంత్రి రాజీనామా చేశారు. మరి నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు?. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో అధికారులు బాధ్యులు కావద్దు. ఐఏఎస్ అధికారిని సునీత లాగా స్ట్రాంగ్‌గా నిలబడాలి...ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలు పడవని ముందే ప్రపంచమంతా తెలుసు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేయటం సబబు కాదు. చంద్రబాబు చెప్పిన పెట్టుబడులు, ఉద్యోగాల లెక్కలన్నీ పచ్చి అబద్దాలు. రాష్ట్ర ప్రజలను దగా చేశారు. పెన్షనర్లను తాగుబోతులనటం దుర్మార్గం. వృద్దులు, వికలాంగులను తాగుబోతులు అంటూ అవహేళన చేయటం తగదు. ఆ మాటలను చంద్రబాబు వెంటనే వెనక్కు తీసుకోవాలి’’ టీజేఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్ -
బాబాయ్ స్వర్గంలో.. కూతురు బాబు పక్కన.. గొడ్డలి టీడీపీ ఆఫీసులో ఇప్పుడు చెప్పండి గొడ్డలి పార్టీ ఎవరిదో
-
కుటుంబాలను విడదీసే చరిత్ర చంద్రబాబుది: అమర్నాథ్
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని ఎవరూ టచ్ చేయలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం అని ప్రశంసించారు.విజయనగరం జిల్లాలో నేడు వైఎస్సార్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘విజయనగరం జిల్లా కార్యకర్తలు బొత్స 2.O కోసం ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదు. వైఎస్సార్ అభిమానులను, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారు. చంద్రబాబుకి కుటుంబాలను విడదీసే చరిత్ర ఉంది. అన్ని కుటుంబాల్లో ఇది జరగొచ్చు.కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని టచ్ చేయలేరు. లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని, చంద్రబాబు అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుంది. ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరిగిన అధికారులు, రేపు గాడిద చుట్టూ తిరిగాం అని అనుకునే రోజు వస్తుంది. బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వ విద్యాలయం. ఎంతో మందిని సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఆయనది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమర్నాథ్.. చిన్న శ్రీను అంశం మాట్లాడుతుండగా బొత్స మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఇదీ చదవండి: ఆయన మనకెందుకు.. టీడీపీలో కొత్త చర్చ -
బాబు ఫ్రస్టేషన్.. ఏపీ పెన్షనర్లకు బిగ్ షాక్.. కొత్త టెన్షన్!
-
వెన్నుపోటు పార్టీ అంటేనే క్రెడిట్ చోరీ: కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడిందని కాకాణి ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన మంచి పనులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములకు సర్వహక్కులు కల్పించేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. పేదవాడికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు 13 మంది ST, SC ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కమిటీ వేశారు. చుక్కల భూముల సమస్యను చంద్రబాబు పరిష్కరించలేక పోయారు. కాన్నీ, మేము దానికి శాశ్వత పరిష్కారం చూపాము. నిషేధిత జాబితా నుంచి అడ్డంకులు లేని భూములను తొలగించాం. మేము తీసుకొచ్చిన విధానంతో రైతులకు మేలు జరిగింది. వైఎస్ జగన్‌కి మంచి పేరు రాకూడదనే రీ వేరిఫికేషన్ పేరుతో 27 నెలలు కాలయాపన చేశారు అని మండిపడ్డారు. ఇదీ చదవండి: ఆ ఆటలేంటి చంద్రబాబు?: వైఎస్ జగన్ సీరియస్ -
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
నాని అయిపోయాడు, వంశీ అయిపోయాడు.. నెక్స్ట్ జైలుకు నన్నే..
-
ప్రెస్ మీట్ నుంచి సెల్ఫీ వీడియోల వరకు వచ్చారంటేనే అర్థమైపోతుంది
-
ఏమైనా మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టండి... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిస్తే ఎవరికీ ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేద్దాం..
-
అధికారులు తస్మాత్ జాగ్రత్త.. కొడుకు పాపాలన్నీ మీ మీదకు నెట్టేస్తున్నాడు
-
వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చింది
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హౌస్ మ్యాపింగ్ పేరుతో పేదలకు ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు ఇచ్చేసిందని, డబ్బులు కూడా అలాగే ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. నాటి సర్కారు ఇచ్చిన హౌస్ మ్యాపింగ్ ఆదేశాలను వెంటనే రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల జారీకి ముందే కుటుంబం యూనిట్‌గా మ్యాపింగ్ చేయాలన్నారు. తమ ప్రభుత్వం ఉమ్మడి, పెద్ద కుటుంబాలకే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తుందని, చిన్న కుటుంబాలను వారి ఆర్థిక స్థితిని బట్టి మెరిట్ ఆధారంగా చూస్తామని ఆయన చెప్పారు. పెద్ద కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఆ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇదే ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని సీఎం తేల్చిచెప్పారు. రెండో రోజు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి ముఖ్యమంత్రి వివిధ అంశాలపై మాట్లాడుతూ.. రేషన్, పెన్షన్లు, ఇళ్ల కోసం కుటుంబాలను చిన్న కుటుంబాలుగా విభజించడం సరికాదన్నారు. (అంటే.. పేద వర్గాలను పెద్ద, చిన్న కుటుంబాలుగా వర్గీకరిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయాలనే ఎత్తుగడ సీఎం మాటల్లో స్పష్టంగా కనిపించింది). ఈ సమయంలో ఐఏఎస్ అధికారి కె. భాస్కర్ జోక్యం చేసుకుని ఒకే వ్యక్తి ఉన్న కుటుంబాలు 30 లక్షల యూనిట్లున్నాయని, వారికి ఇచ్చే ప్రయోజనాలకు హాని కలగకుండా చూడాలన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఉన్న వారిని కొనసాగిస్తూనే కుటుంబం యూనిట్‌గా మ్యాపింగ్‌తో హేతుబద్దీకరణ చేయాలన్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘రేషన్ కార్డులివ్వండి, అంతేగానీ.. దానికోసం కుటుంబాలను విడదీయవద్దని సూచించారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం అందించేలా చూడాలన్నారు. అవసరమైతే పది మంది గల పెద్ద కుటుంబాలకు ఒక కేజీ రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. లబ్దిదారులు తాగుడుకు అలవాటుపడుతున్నారేమో చూడండి.. ప్రతీనెలా 1వ తేదీన పేదల సేవలో భాగంగా అందిస్తున్న డబ్బులను లబ్ధిదారులు సది్వనియోగం చేసుకుంటున్నారా లేక తాగుడుకు అలవాటు పడుతున్నారా చూడండి. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ రూపొందించాలి. పీ–4 కార్యక్రమం మొక్కుబడిగా చేస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సరిగ్గా పనిచేయని వారిని పక్కన పెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నెలలో నాలుగుసార్లు గ్రామాలకు వెళ్లాలి. ఇంకా కొంతమంది కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడంలేదు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపులేదు. దీనిని తేలికగా తీసుకుంటే కఠినంగా ఉంటాం. ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నారు. ఫోన్ లేకుండా రాలేరా? ఏసీ రూమ్‌ల్లో కూర్చుని ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోకపోతే జెన్‌జీకే కాదు అందరికీ కడుపు మండుతుంది. అప్పుడు జెన్‌జీ లాంటి ఉద్యమాలు వస్తాయి. సరైన న్యాయం జరగలేదనిపిస్తే ఎవరైనా ప్రశ్నిస్తారు. ఫైళ్ల పరిష్కారంలో కొంతమంది మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు మూడ్రోజులకు పైగా సమయం తీసుకుంటున్నారు. వాట్సాప్ మెసేజ్‌లు చూస్తారు గానీ ఫైళ్లు చూడలేరా? ఫైళ్లన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలి. నెలరోజుల్లో భౌతిక ఫైళ్లకు ముగింపు పలకాలి. కొంతమంది శాఖాధిపతులు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారికెంత ధైర్యం? ఫోన్ లేకుండా 12 గంటలు సమావేశానికి హాజరుకాలేరా? గైర్హాజరైన వారి నుంచి వివరణ తీసుకోండి. చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటా. ఇక ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గించాలి.. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంతా కాగితాలకే పరిమితమైంది. విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలి. అలాగే, వైద్య రంగంలో సంజీవని పథకాన్ని అమలుచేయడం ద్వారా ఆ రంగం బడ్జెట్లో రూ.5,000 కోట్లు తగ్గించాలి. జిల్లా కలెక్టర్లు సోలార్‌రూఫ్ టాప్ పథకం ‘సూర్యఘర్’ ద్వారా ఎన్ని ఎక్కువ ఇన్స్టలేషన్లు చేయిస్తే విద్యుదుత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుంది. -
మళ్లీమళ్లీ అవే మాటలు..
సాక్షి, అమరావతి: గతేడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కావేరి బస్సు కాలిపోయి 19 మంది సజీవదహనమైతే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలై, 28 మంది గాయపడితే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అంటూ సీఎం మళ్లీ అదే ప్రకటన చేశారు. గత కలెక్టర్ల సమావేశంలోను రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చేశారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలోను అదే పాట పాడారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నది వీటిని గమనిస్తే అర్థమవుతోంది. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెబుతున్న సీఎం.. ఆ ప్రమాదాల నివారణకు ఆచరణలో కనీస చర్యలు కూడా తీసుకోవడంలేదన్నది తేటతెల్లమవుతోంది. ప్రమాదాలు జరిగినప్పడు, అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఊకదంపుడు మాటలు తప్ప.. ఆచరణలో అడుగు ముందుకు వేయడంలేదు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో రోడ్డు భద్రత కమిటీలు పనిచేయడంలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు భద్రత కమిటీలను నియమిస్తున్నట్టు రవాణాశాఖ ఉత్తర్వులు ఇచ్చినా.. అవి ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలే లేవు. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రమాద ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అవేవీ ఎక్కడా పనిచేస్తున్నట్లు కనిపించడంలేదు. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.40 కోట్లతో రోడ్డు భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంది. పోలీసుశాఖకు రూ.20 కోట్లు, రవాణాశాఖకు రూ.20 కోట్లు చొప్పున కేటాయించిన ఈ నిధులతో స్పీడ్‌గన్స్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఎందుకు అమలవలేదన్నది సీఎంకే తెలియాలి. ప్రతిసారి రోడ్డు ప్రమాదాల విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితమవుతున్న విషయం తాజాగా కలెక్టర్ల సమావేశంలో మరోసారి స్పష్టమైంది. సోషల్ మీడియాను కట్టడి చేయాలి రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని, ప్రమాద ప్రాంతానికి అంబులెన్స్‌లు ఎంత సమయానికి చేరుకోగలుగుతున్నాయనేది విశ్లేషించాలని సూచించారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించే లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ లోతుగా అధ్యయనం చేయాలని, పోలీసులు వాటిని కట్టడి చేయాలని చెప్పారు. సైబర్ టెక్నాలజీలో నిపుణుల్ని సీఐడీలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలు 29.2శాతం దిగివచ్చాయన్నారు. -
పెట్రోల్ బాటిళ్లతో ఏఎన్ఎంల ఆందోళన
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గర్భిణుల వసతిగృహాలను మూసివేసి తమను విధుల నుంచి తొలగించారని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఎన్ఎంలు నినదించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. సూసైట్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. జాయింట్‌కలెక్టర్(జేసీ), ఐటీడీఏ పీఓ వైశాలి తమ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ముఖంచాటేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏఎన్ఏంలను వారించారు. పెట్రోల్బాటిళ్లను లాక్కున్నారు. అసలేం జరిగిందంటే.. గతంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలలో గిరిజన గర్భిణుల వసతి గృహాలను అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆధ్వర్యంలో ప్రారంభించారు. వాటి వల్ల గిరిజనుల్లో మాతా శిశు మరణాలు తగ్గాయి. గత ప్రభుత్వం హయాం వరకూ ఇవి సజావుగా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే.. జిల్లాలో ఈ రెండు వసతి గృహాలను మూసివేశారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు హాస్టళ్ల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని పోరుబాట పట్టారు. గత నెలలో పార్వతీపురం ఐటీడీఏ వద్ద బైఠాయించిన సమయంలో పీఓగా ఉన్న జేసీ వైశాలి రెండువారాల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో ఓసారి మంత్రి సంధ్యారాణి నుంచి అనుమతి పత్రం తీసుకురావాలని సూచించడంతో ఏఎన్ఎంలు అది తీసుకొచ్చారు. అయినా తమను విధుల్లోకి తీసుకోకపోవడంతో గత సోమవారం పీజీఆర్ఎస్లో విన్నవించుకున్నారు. దీంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు రెండుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా జేసీ కిందికి దిగి రాలేదు. డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురిలను ఏఎన్ఎంల వద్దకు పంపారు. వారు సర్దిచెప్పే యత్నం చేసినా ఏఎన్ఎంలు వినలేదు. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
కాలువలకు నిధులు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ చేసిన మరో ద్రోహం బహిర్గతమైంది.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల (ఉప కాలువలు, పిల్ల కాలువలు) పనులకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్ నోరుమెదపడం లేదు. ఓ వైపు 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామంటూ పదే పదే ప్రకటిస్తున్న చంద్రబాబు సర్కార్ ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టే ఆలోచన కూడా చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లతో కాకుండా కనిష్ఠ నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు.. అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ 2024, ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన పనులు పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. అందులో డిస్ట్రిబ్యూటరీల పనుల అంచనా వ్యయాన్ని మినహాయించడం గమనార్హం. డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.5,338.5 కోట్లు అవసరం. అంటే.. ఆ భారం కూడా రాష్ట్ర ఖజానాపై పడినట్లేనని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు 2023లో ప్రతిపాదనలు..పోలవరం కుడి కాలువ పొడవు 178.812 కిలో మీటర్లు ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు. పోలవరం ఎడమ కాలువ పొడవు 212.32 కి.మీ.లు. ప్రవాహ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు. కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు.. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు వ్యయం అవుతుందని 2023లో పోలవరం ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను తయారుచేసిన పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలుమార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ అప్పట్లోనే తుది దశకు చేరుకుంది. కానీ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్ నోరుమెదపకపోవడం గమనార్హం. జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా కుడి, ఎడమ కాలువలతోపాటు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తేనే సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు పోలవరం ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. అప్పుడే పోలవరం ఫలాలు రైతులకు అందుతాయి. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా రైతులకు ద్రోహం చేస్తోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. కరిగిపోతున్న స్వప్నం..గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ పనులు చేపట్టారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 322 టీఎంసీలను వినియోగించుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ.. నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్‌ను చంద్రబాబు సర్కార్ బ్యారేజ్‌గా మార్చేసింది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.30 వేల కోట్లకుపైగా అవసరం. ఆ భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. ఇక 2017, ఆగస్టు 17న నాటి చంద్రబాబు సర్కార్ కేంద్రానికి పంపిన డీపీఆర్–2లో చేసిన తప్పిదాల వల్ల కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వను పరిమితం చేయడం వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ, ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టు బెంచ్ విషయంలో మరోసారి మోసపోం
కర్నూలు(సెంట్రల్): హైకోర్టు బెంచ్ విషయంలో 2014 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని, మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని కర్నూలు న్యాయవాదులు తేల్చి చెప్పారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మీదేవి, వై.జయరాజు, మురళీ మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదే హామీని ఇచ్చి కాలం గడిపేశారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాలం వెళ్లదీస్తుండడంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నారు. సర్క్యూట్ బెంచ్‌ను ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని, శాశ్వత హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
గళమెత్తిన ‘జెన్’తరంగం
తిరుపతి సిటీ: విద్యాబుద్ధులు నేర్పిన ఎస్వీ యూనివర్సిటీకే వెన్నుపోటు పొడుస్తూ, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు విశ్వవిద్యాలయాలను తనకు జన్మనిచ్చిన తిరుపతి జిల్లా నుంచి సీఎం చంద్రబాబు అమరావతికి తరలించడంపై విద్యార్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. సీఎం అసంబద్ధ విధానాలపై గళమెత్తారు. శుక్రవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వద్ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) క్యాంపస్ తరలింపునకు వ్యతిరేకంగా పార్టీల కతీతంగా జెన్‌జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొని చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. కాక్రోచ్ ప్లకార్డులు చేతబూని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి తదితరులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీయ యువత ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగుపరడానికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పోరాడి మరీ నైలెట్ కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతికి తీసుకొచ్చామని వివరించారు.కానీ చంద్రబాబు ఇప్పుడు ఈ క్యాంపస్‌ను అమరావతికి తరలించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తిరుపతి జిల్లా నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీలనూ తరలించి తిరుపతి యువతకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైలెట్ క్యాపంస్ను శాశ్వతంగా తిరుపతిలోనే ఉంచాలని, దీనికి 15 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. తీవ్ర ప్రతిఘటన తప్పదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో మాజీ మేయర్ డాక్టర్ శిరీషా, 16 విద్యార్థి, యువజన సంఘాల నేతల పాల్గొన్నారు. -
ఇచ్చింది రెండు.. మెలికెలు మెండు..
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎట్టకేలకు రెండు డీఏలు మంజూరు చేసినా, బకాయిల చెల్లింపును మాత్రం 2027, 2028 సంవత్సరాలకు వాయిదా వేసింది. పెరిగిన డీఏ అక్టోబర్‌లో చేతికి వస్తుంది కానీ ఇన్నాళ్లూ ఆపిన బకాయిల కోసం మాత్రం నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ శుక్రవారం నాలుగు జీవోలు జారీ చేసింది. 2024 జూలై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం డీఏ పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో డీఏ 37.31 శాతం నుంచి 41.86 శాతానికి చేరింది. పెన్షనర్లకూ ఇవే రేట్లలో డీఆర్ పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన డీఏ, డీఆర్‌ను సెప్టెంబర్ జీతం, పెన్షన్‌తో కలిపి ఇవ్వనున్నారు. 2025 జూలై నుంచి గడువు తీరిన డీఏల ఊసే లేదు.26 నెలల నిరీక్షణచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడువు తీరిన తొలి డీఏ 2024 జూలై 1 నాటిది. దాన్ని ఇవ్వడానికి సర్కారుకు 26 నెలలు పట్టింది. 2025 జనవరి డీఏకు మరో 20 నెలలు పట్టింది. ఇంతకాలం ఆపిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా ఒక్కో డీఏ బకాయిలను నాలుగు విడతలుగా, రెండు డీఏలకు కలిపి మొత్తం ఎనిమిది విడతల్లో ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. తొలి విడత 2027 ఏప్రిల్‌లో మొదలై, చివరి విడత 2028 జూలైలో ముగుస్తుంది. మొదటి డీఏకు సంబంధించి 2024 జూలై నుంచి 2026 ఆగస్టు వరకు 26 నెలల బకాయిలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా 10 శాతం మాత్రమే 2027 ఏప్రిల్‌లో ఇస్తారు. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున మూడు విడతల్లో 2027 జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండో డీఏ పరిస్థితి ఇంకా దారుణం. 2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు 20 నెలల బకాయిల్లో తొలి విడత 10 శాతం 2028 జనవరిలో ఇస్తామంది. మిగతా 90 శాతాన్ని 30 శాతం చొప్పున 2028 మార్చి, మే, జూలై నెలల్లో ఇస్తామని తెలిపింది. అంటే 2025 జనవరిలో అందాల్సిన డబ్బు పూర్తిగా చేతికి రావాలంటే 2028 జూలై దాకా ఆగాల్సిందే.ఓపీఎస్ ఉద్యోగులకు చేతికి పైసా రాదుపాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోని ఉద్యోగులకు రెండు డీఏల బకాయిలూ, ఎనిమిది విడతలూ జీపీఎఫ్ ఖాతాలోకే వెళ్తాయి. రిటైరయ్యే వారు మినహా మిగతా వారికి నగదుగా ఒక్క రూపాయి కూడా అందదు. సీపీఎస్ ఉద్యోగులకు ఒక్కో డీఏలో తొలి విడత 10 శాతం బకాయిలు ప్రభుత్వ వాటాతో కలిపి వారి సీపీఎస్ పెన్షన్ ఖాతా (ప్రాన్)లోకి వెళ్తాయి. అంటే ఆ మొత్తం వెంటనే చేతికి రాదు. మిగతా మూడు విడతల 90 శాతం మాత్రమే నగదుగా ఇస్తారు.రిటైర్ అయినవారికి, త్వరలో రిటైర్ కానున్న వారికి మాత్రం బకాయిలను జీపీఎఫ్‌లో వేయకుండా నగదుగా ఇస్తారు. 2024 జూలై నుంచి 2027 ఏప్రిల్ మధ్య రిటైరయ్యే వారికి మొదటి డీఏ బకాయిలు నగదుగా అందుతాయి. 2025 జనవరి నుంచి 2027 డిసెంబర్ మధ్య రిటైరయ్యేవారికి రెండో డీఏ బకాయిలు నగదుగా అందుతాయి. అయితే ఈ నగదు ఏ నెలలో ఇస్తారో జీవోలో చెప్పలేదు. ఇప్పటికే చనిపోయిన ఉద్యోగుల బకాయిలను వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు.పెన్షనర్లకూ వాయిదాలేపెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకూ ప్రభుత్వం ఇదే ఎనిమిది విడతల షెడ్యూల్ పెట్టింది. వయసు మీద పడిన పెన్షనర్లు డీఆర్ బకాయిల కోసం 2028 జూలై వరకు ఎదురుచూడాల్సిందే. అదే సమయంలో గడువు తీరిన డీఏల ప్రస్తావనే చేయలేదు. 2025 జనవరి డీఏ బకాయిల గురించే పేర్కొన్నారు. -
మందు బిళ్ల.. జేబు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉచిత వైద్యం దూరం.. ఉచిత మందులూ కరువే! ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి పేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కనీసం మందు బిళ్లలు కూడా ఇవ్వకుండా జనం జేబులు గుల్ల చేయిస్తోంది. ప్రభుత్వాస్పత్రులను మందులకు కూడా దిక్కులేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసింది. ప్రాణాంతక జబ్బుల బారిన పడిన రోగులు ప్రతి నెలా ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు. వైద్య సేవల కోసం ప్రాణ భయంతో ప్రైవేట్ ఆస్పత్రులు, మందుల షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పాటు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే కుట్రలు చేస్తోంది. ఏఐ డాక్టర్.. డిజిటల్ వైద్యం.. టెలి మెడిసిన్.. ఆధునిక వైద్య సేవలంటూ సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించిన సర్వే బయటపెట్టింది. మందులు బయట కొనుక్కోవాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాసిచ్చిన చీటీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సిన మందులకూ గతి లేదని వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు కనీసం మందులకు కూడా దిక్కులేని దుస్థితి నెలకొన్నట్లు ఈ ఏడాది జనవరి–జూలై మధ్య స్వయంగా ప్రభుత్వమే నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి కావడం ప్రభుత్వ వైద్య రంగం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సొంత జిల్లాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ప్రైవేట్ మెడికల్ షాపుల బాట.. ప్రజలకు ఉచితంగా వైద్యం, మందులు అందించాల్సిన ప్రభుత్వం.. రోగుల చేతికి చీటీలు ఇచ్చి ప్రైవేట్ మెడికల్ షాపుల బాట పట్టిస్తోంది. ఇది పేదల జేబులకు పెను భారంగా మారుతోంది. ప్రాణాంతక జబ్బుల బారిన పడి దినదిన గండంగా గడుపుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వెళ్లిన రోగులపై మందుల కొనుగోళ్ల రూపంలో అదనంగా రూ.వేలల్లో భారం పడుతోంది. సీఎం, వైద్యశాఖ మంత్రి సొంత జిల్లాల్లో దారుణం.. పేద రోగులకు ఉచితంగా మందుల పంపిణీ విషయంలో సీఎం, వైద్య శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలోని రుయా, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా జీజీహెచ్ల్లోని సేవలపై రోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.అనంత జీజీహెచ్‌లో వైద్యులు రాసిన ఉచిత మందులు అందడం లేదని రోగులు చెబుతున్నారు. ప్రివెంటివ్ కేర్‌లో అత్యంత కీలకమైన పీహెచ్‌సీల్లో తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లి, అనంతపురం జిల్లాలోని యాడికి పీహెచ్‌సీల్లో సేవలు దారుణంగా ఉన్నట్లు 60 శాతం మంది రోగులు పేర్కొన్నారు. ఘోరమైన పనితీరులో సీఎం, వైద్య శాఖ మంత్రి జిల్లాల్లోని పీహెచ్‌సీలు టాప్ 20లో నిలిచాయి. పెద్ద జబ్బులు.. రోగుల బాధలు» ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత మందులు అందుబాటులో లేకపోవడంతో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఇతర పెద్ద జబ్బుల బారినపడ్డ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్సార్ జిల్లా కడపలోని వైఎస్సార్ క్యాన్సర్ సెంటర్లో రోగులకు ఉచిత మందులు అందడం లేదు. దీంతో బయటే కొనుగోలు చేస్తున్నారు. » అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పలాస రీసెర్చ్ సెంటర్‌ను బాబు సర్కార్ గాలికి వదిలేసింది. ఇక్కడ కిడ్నీ బాధితులకు ఉచిత మందులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కిడ్నీ రోగులు ప్రైవేట్‌లో మందుల కొనుగోళ్ల కోసం నెలకు రూ.15 వేల మేర చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.» కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి చేసిన మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల బోధనాస్పత్రులను ప్రభుత్వం అంపశయ్య ఎక్కించింది. ఎనిమిది నెలలుగా పులివెందుల జీజీహెచ్‌లో రోగులకు ఉచిత మందులు అందక అల్లాడుతున్నారు. మదనపల్లెలో రోగులు మందుల చీటీలతో ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ బాట పడుతున్నారు. » సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌లో వరుసగా మే, జూన్, జూలై నెలల్లో రోగులకు ఉచిత మందులు అందని దుస్థితి. గుంటూరు శ్వాసకోశ ఆస్పత్రిలో రోగులకు ప్రభుత్వం మందులు ఇవ్వకుండా బయట కొనుగోలు చేయాలని సూచించింది.» విశాఖ ఈఎన్టీ ఆసుపత్రిలో రోగులకు ఉచిత మందులు అందలేదు. ఇక్కడి ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో జనవరిలో సగం మంది రోగులు మందులు అందక బయట కొనుగోలు చేయాల్సి వచ్చింది. -
డీఎస్సీ పారదర్శకమైతే జీవోలు ఎందుకు మార్చారు?
సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానమా? దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు? అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీలో అక్రమాలకు ద్వారాలు తెరవలేదా..? జరిగిన పరిణామాలకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా..?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సూటి ప్రశ్నలు సంధించారు. నియామకాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశం ఉంటే.. అర్హత పరీక్ష అవసరం లేదంటూ జీవోలు ఎందుకు జారీ చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాత పరీక్ష ఆధారిత నియామక విధానాన్ని తిరిగి తీసుకొచ్చేలా నిబంధనలు ఎందుకు మార్చారని నిలదీశారు. ఈ పరిణామాలను నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియగా ఎలా పరిగణిస్తారని జగన్ ప్రశ్నించారు. డీఎస్సీ కుంభకోణానికి ఈ విధానాలు అవకాశం కల్పించలేదా? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తాను మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు? » డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు? » అర్హత పరీక్ష నిబంధన తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా? » నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించడంపై చంద్రబాబు సమాధానం చెప్పరా? -
మద్యం షాపులు మళ్లీ టీడీపీ సిండికేట్‌కే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం షాపులను మళ్లీ టీడీపీ సిండికేట్‌కే చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3,736 మద్యం దుకాణాలను మరో ఏడాదిపాటు కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి ఎక్సైజ్ షాప్స్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. అవసరమైతే ఇదే పద్ధతిని మరో ఏడాది కొనసాగించేలా వెసులుబాటు కల్పించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను దక్కించుకోవడంలో టీడీపీ సిండికేట్ దందా సాగించిన విషయం తెలిసిందే. మద్యం షాపులను ఎవరూరు దక్కించుకున్నా.. వాటిని టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ మద్యం షాపులకు వేలం నిర్వహిస్తే వేరొకరు పోటీకి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం టీడీపీ వాళ్లకే కొనసాగించేలా పాత షాపులను మరో ఏడాదిపాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఇవ్వడం గమనార్హం. లైసెన్సుల రెన్యువల్‌కు 38 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను నూతన ఎక్సైజ్ పాలసీపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏడాది పాటు కొత్త పాలసీ అమలులో ఉంటుంది. మొత్తం 3,736 దుకాణాల్లో 3,396 ఓపెన్ కేటగిరీలో ఉండగా, 340 దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. ప్రస్తుత లైసెన్సుదారులకు తమ దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పాటు రెన్యువల్ చేసుకునేందుకు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నులో 38 శాతానికి సమానమైన రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును చెల్లించాలి. దీంతోపాటు వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్ను, వర్తించే పర్మిట్ రూమ్ రిటైల్ ఎక్సైజ్ పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్నును మొదటి విడత వార్షిక రిటైల్ ఎక్సైజ్ పన్నుతో కలిపి ఒకేసారి చెల్లించాలి. 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఓపెన్ కేటగిరీ దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను రూ.23 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.27.2 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35.5 లక్షలుగా నిర్ణయించారు. గీత కులాలకు కేటాయించిన దుకాణాలకు ఇవే కేటగిరీల్లో వరుసగా రూ.11.5 లక్షలు, రూ.13.6 లక్షలు, రూ.17.8 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుత లైసెన్సుదారులు రెన్యువల్ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎవరైనా లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోతే ఆ దుకాణాన్ని కొత్తగా డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయిస్తారు. కొత్తగా డ్రా ద్వారా కేటాయించిన దుకాణాలకు రెన్యువల్ రిటైల్ ఎక్సైజ్ పన్ను వర్తించదు. అమ్ముడుపోని, కేటాయించని దుకాణాలను అవసరాన్ని బట్టి తిరిగి నోటిఫై చేయడం, ప్రాంతాల వారీగా హేతుబద్దీకరించడం, మార్చడం వంటి చర్యలు చేపట్టేందుకు కూడా పాలసీలో అవకాశం కల్పించారు. మద్యం సరఫరా వ్యవస్థపై డిజిటల్ నిఘా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి నగరంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతి ఉండదు. హైవేలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంది. -
మీ మామ బాగోతాలివిగో..
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామగారిని కీర్తిస్తూ పెట్టిన ఆ పోస్ట్‌లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో బ్రహ్మాండంగా పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగోతాలు అంటూ మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి మూడేళ్లయిన సందర్భంగా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. ‘నిజం గెలిచింది’ నినాదంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై నాగేశ్వరరావు ఇలా స్పందించారు. రెండెకరాల నుంచి.. సంపన్న సీఎం దాకా.. ‘రెండో, ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకొచ్చారు’ అని చంద్రబాబుపై నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన్ని నిస్వార్థ’ అవినీతిపరుడు అంటూ ఎద్దేవా చేశారు. ‘అగౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు’ అంటూ సంబోధించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషిచేసిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్ అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు, తెలుగు ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు. విభజనకు లిఖితపూర్వక అంగీకారం ‘అంతే కాదు తల్లీ.. మీ మామగారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటూ మూడో అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుజాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన టీడీపీని ఎన్టీఆర్ నుంచి గుంజుకోవడమే కాకుండా, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు లిఖితపూర్వకంగా అంగీకరించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన ఘనుడంటూ విమర్శించారు. ‘సృజనాత్మక భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?’ అంటూ బ్రాహ్మణిని నాగేశ్వరరావు ప్రశ్నించారు. -
మద్యం సిండికేట్‌కి చంద్రబాబు సర్కార్ దాసోహం
సాక్షి, విజయవాడ: మద్యం సిండికేట్‌కి చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. వేలం లేకుండానే మద్యం షాపుల రెన్యూవల్‌కు నిర్ణయం తీసుకుంది. టీడీపీ లిక్కర్ సిండికేట్‌కి చంద్రబాబు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వేలం లేకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ చక్రం తిప్పింది.స్థానిక ఎన్నికల కోసం టీడీపీ నేతలకు మద్యం షాపులు రెన్యూవల్ చేస్తూ.. ఏపీలో 3,736 మద్యం షాపులు కొనసాగించాలని నిర్ణయించింది. విచ్చల విడిగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చేసింది. ప్రిన్సిపాల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. -
‘డీఎస్సీ అక్రమాలకు సీఎంగా బాబు నైతిక బాధ్యత వహించరా?’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాల అంశానికి సంబంధించి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబూ.. డీఎస్సీ నియామకాలను నిజంగా నిష్పక్షపాతంగా..పారదర్శకంగా నిర్వహించాలన్నదే మీ ఉద్దేశమైతే అర్హత పరీక్ష అవసరం లేకుండా జీవోలు ఎందుకు జారీ చేశారు?. క్వాలిఫైయింగ్ పరీక్ష నిబంధనను పక్కనపెట్టి నియామకాలను ఎందుకు చేపట్టారు?.డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ పాత విధానాన్ని ఎందుకు అమలు చేశారు?. డీఎస్సీ సమయంలో ఒక విధానం.. నియామకాలు పూర్తయ్యాక మరో విధానం.. దీన్ని నిష్పక్షపాత, పారదర్శక నియామక ప్రక్రియ అని ఎలా అంటారు?అర్హత పరీక్ష నిబంధనను తొలగించడం ద్వారా డీఎస్సీ అక్రమాలకు ద్వారాలు తెరవలేదా?.నిబంధనలను మార్చి అక్రమాలకు అవకాశం కల్పించిన దానిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నైతిక బాధ్యత వహించరా?’అంటూ ధ్వజమెత్తారు. .@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old… pic.twitter.com/vzDTCvOwGE— YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2026ఇదీ చదవండి : ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్ -
ఆ విషయాన్ని ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసి.. ప్రశ్నిస్తే దొంగ ఏడుపులా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.కాగా, నిన్న(గురువారం) ప్రెస్మీట్లో మెగా డీఎస్సీ కుంభకోణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ మరోసారి ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీలతో టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, నిజాయతీపరులైన అభ్యర్థులను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దగా చేశారని నిప్పులు చెరిగారు.ఆ అక్రమాలను రుజువులతో సహా వెలుగులోకి తెచ్చామని.. వాటి ఆధారంగా తాను సంధించిన నాలుగు ప్రశ్నలకు ఇంతవరకూ తండ్రీ, కుమారులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?’
సాక్షి, కృష్ణా జిల్లా: ‘టైమ్, డేట్ చెప్పమన్న లోకేష్ ఎక్కడున్నాడు?. తప్పులు చేసి అధికారుల మీద నెట్టేస్తున్నారు. జీవో ఇచ్చింది ఎవరు? అధికారులకు ఏంటి సంబంధం?. తండ్రి కొడుకుల వేషాలు చూడలేకపోతున్నామంటూ కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇవాళ మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఉప్పాల రాము, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తి, జడ్పీచైర్ పర్సన్ ఉప్పాల హారిక, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మొద్దని.. ఎవరినైనా లోబరచుకుంటాడన్నారు. దొంగ తెలివితేటలున్న వ్యక్తి చంద్రబాబు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. అక్టోబర్ 2 నుంచి ఏ క్షణమైనా మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి చంద్రబాబు మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం లేదు. చంద్రబాబుకు కూటమి చీలిపోతుందనే భయం పట్టుకుంది. అందుకే పంచాయతీల కంటే ముందు మున్సిపాల్టీలకు ఎన్నికలు పెడుతున్నాడు. పోలీసులను అడ్డంపెట్టుకుని మున్సిపాల్టీలను గెలవాలనుకుంటున్నాడు’’ అని పేర్ని నాని మండిపడ్డారు. -
1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో
-
దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్
-
అమరావతిలో వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం: వడ్డే
సాక్షి, విజయవాడ : అమరావతిలో ఎయిర్ పోర్టు కోసం 19 వేల ఎకరాలు తీసుకోబోతున్నారని.. భూ సేకరణకు అంతే లేకుండా పోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు భూ దాహానికి పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియడం లేదన్నారు.‘‘99 పైసలకే వెయ్యి కోట్ల భూములు టీసీఎస్‌కు కట్టబెట్టారు. కాగ్నిజెంట్‌కు వెయ్యి కోట్ల విలువైన 22 ఎకరాలను కట్టబెట్టారు. కాగ్నిజెంట్‌కు అమెరికా ప్రభుత్వం మొట్టికాయలు వేసింది. తప్పు చేస్తున్నారని కాగ్నిజెంట్‌పై అమెరికా కేసులు పెట్టబోతోంది. నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి చట్టం అనుమతించదు చంద్రబాబు. అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో ఉల్లంఘటనలకు ప్రయత్నించారు. 1921 ఎకరాల్లో సింగపూర్ సంస్థ స్టార్టప్ సెంటర్ పెడతామన్నారు. ఒక్క ఇటుకరాయి కూడా వేయకుండా పోయారు’’ అని శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.ఎన్జీటీ తీర్పుకు వ్యతిరేకంగా నదిలోకి కరకట్ట జరపాలని చూస్తున్నారు. కరకట్టకు కొన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కొండవీటి వాగులో నీరు ఎత్తిపోయడానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఇప్పుడు మరో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అమరావతిలో కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది’’ అని శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చంద్రబాబు చెల్లికి టీటీడీ భూములు.. నాగార్జున యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
క్రెడిట్ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు. తొలుత ఎస్ఈఆర్టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్‌లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.రాజమండ్రి పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.వైఎస్ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్‌కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు చెప్పవలసి వచ్చింది.జగన్ టైమ్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్‌తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్‌లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్‌కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్‌పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బ్రహ్మానందంకు భాస్కర్ అవార్డు.. బాబుకు వాటర్ మెన్ అవార్డు రెండూ ఒక్కటే..!
-
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో తవ్వేకొద్దీ స్కామ్‌లే.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
అబద్ధాలకు అంతే లేదా?
సాక్షి, అమరావతి: కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల సమక్షంలో భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న దొంగలెక్కల చిట్టా బయటపడింది. చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికి వచ్చిన అంకెలు చెబుతూ జనాన్ని నిత్యం తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఈ సదస్సులో బహిర్గతమైంది. 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల విషయంలో చంద్రబాబు ఒకలెక్క చెబుతుంటే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరోలెక్క చెప్పి అధికారులే నివ్వెరపోయేలా చేశారు. 22ఏ నుంచి 16 లక్షల ఎకరాలు తొలగించామని బుధవారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం పండువారికోటలో జరిగిన సభలో సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని 28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని సెలవిచ్చారు. అంటే 24 గంటల వ్యవధిలో 12 లక్షల ఎకరాలు అదనంగా పుట్టుకొచ్చాయి. ఆ భూములు ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో ఆ దేవుడికే ఎరుక. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భూముల గణాంకాలను వాస్తవాలతో సంబంధం లేకుండా నోటికొచ్చినట్లు ప్రకటించడంపై అధికారవర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు 22ఏ జాబితాలో ఉన్న తమ భూములకు విముక్తి కల్పించాలని వేలాదిమంది కలెక్టరేట్లు, అధికారుల చుట్టూ తిరుగుతుంటే వారిని పట్టించుకోకుండా లక్షల ఎకరాలను తొలగించేసినట్లు చెప్పుకోవడం ఏమిటో రెవెన్యూ వర్గాలకే అంతుబట్టడంలేదు. 28 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని చెప్పిన మంత్రి అనగాని అసలు సత్యాన్ని ఆ ప్రసంగంలోనే బయటపెట్టారు. రెండేళ్లలో 22ఏ నుంచి తొలగించాలని 28,790 ఎకరాలకు దరఖాస్తులు వస్తే వాటిలో 1,100 ఎకరాలు తొలగించామని చెప్పారు. నిజంగా 28 లక్షల ఎకరాలను తొలగించి ఉంటే ఈ 28 వేల ఎకరాల కోసం రైతులు ఇంకా దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నకు జవాబు లేదు. ఫ్రీహోల్డ్ భూములపై పగ సాధింపు ఎందుకు? ఫ్రీహోల్డ్ భూముల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం తమ బండారాన్ని బయటపెట్టుకుంది. దశాబ్దాలుగా సాగుకే పరిమితమై భూమిపై ఎలాంటి హక్కులు లేని పేద అసైన్డ్ రైతులకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. దీంతో 27.40 లక్షల ఎకరాల అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. 2024 ఎన్నికల నాటికి 13.59 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ కాగా, సుమారు 20 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు తమ భూములకు యజమానులయ్యారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం వాటిలో అక్రమాలు జరిగాయంటూ 22ఏ జాబితాలో పెట్టేసింది. వాస్తవానికి 13.59 లక్షల ఎకరాల్లో క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకే. దీన్ని నిర్ధారించింది టీడీపీ కూటమి ప్రభుత్వమే. కేవలం 1.8 శాతం భూములను సాకుగా చూపి మిగిలిన 98 శాతానికిపైగా భూములను 22ఏ జాబితాలో పెట్టేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టారు రెండేళ్లుగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణల మీద విచారణలు నిర్వహించారు. పలుమార్లు వెరిఫికేషన్ చేశారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణ జరిపించారు. ఆ సంఘం డజనుసార్లు సమావేశమైనా అక్రమాలు లేకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. నిజానికి రెవెన్యూశాఖ విచారణలోనే సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగానే ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది. మిగిలిన 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెబుతున్నా, ఆ ఉల్లంఘనలు ఏమిటన్నది ఇప్పటికీ కచ్చితంగా తేల్చలేకపోయారు. ఇప్పుడు మంత్రి అనగాని మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాలకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. సక్రమం అయితే ఇన్నాళ్లు ఎందుకు ఆపినట్లు? ఆ 9 లక్షల ఎకరాలు నిబంధనల ప్రకారమే ఉన్నాయని ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే తేలిపోయింది. అయినా వాటిపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించారు. కేవలం వైఎస్ జగన్ హయాంలో ఆ రైతులకు భూములపై హక్కులు వచ్చాయనే కారణంతోనే వాటిని ఇంతకాలం 22ఏ జాబితాలో ఉంచారు. రైతుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఫ్రీహోల్డ్ చేస్తామని చెబుతున్నారు. ఇంతకాలం రిజి్రస్టేషన్ కాక, రుణం రాక, భూమి అమ్ముకోలేక లక్షలాది కుటుంబాలు పడిన కష్టానికి, నష్టానికి ఎవరు జవాబుదారీ అన్నదానిపై మాత్రం నోరు మెదపడంలేదు. తప్పు ఒప్పుకోవడం మానేసి.. ఇప్పుడు తామే హక్కులు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం క్రెడిట్ చోరీగాక మరేమిటని రైతుసంఘాలు ప్రశి్నస్తున్నాయి.మిగిలిన 4 లక్షల ఎకరాలపై అనుమానాలు మిగిలిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. రెండేళ్లలో అనేక వెరిఫికేషన్లు, అధికారుల కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలు జరిగినా ఉల్లంఘనలు ఏమిటో తేల్చలేకపోయిన ప్రభుత్వం ఇంకెంతకాలం విచారణ పేరుతో కాలయాపన చేస్తుందన్నది ప్రశ్న. 9 లక్షల ఎకరాలపై నిర్ణయం తీసుకోగలిగినప్పుడు 4 లక్షల ఎకరాలపై ఎందుకు తీసుకోలేకపోతున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములను అధికారపార్టీ నేతలు చేజిక్కించుకునే ఎత్తుగడ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాలుష్య నియంత్రణ ‘గాలికి’..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై సీఎం చంద్రబాబు నిత్యం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో గడప దాటడంలేదు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనాన్ని, వైఫల్యాలను బట్టబయలు చేశాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక నగరమైన విశాఖపట్నం, సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, రాయలసీమ ముఖద్వారం కడప బాగా వెనుకబడ్డాయి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) అమలుతీరు కాగితాలకే పరిమితమైందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. రాష్ట్రం మొత్తం మీద కేవలం గుంటూరు నగరానికి మాత్రమే (195 మార్కులతో జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్) చెప్పుకోదగ్గ చోటుదక్కింది. మిగిలిన ప్రధాన నగరాల్లో గతేడాది కంటే దారుణమైన ర్యాంకులు వచ్చాయి. 2025తో పోలిస్తే 2026 నాటికి ర్యాంకులు, మార్కులు భారీగా పడిపోయాయి.పారిశ్రామిక సిరి ’వైజాగ్’ బేజార్.. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్ లాంటి విశాఖపట్నం వాయు కాలుష్య నివారణలో ఘోరంగా ఫెయిలైంది. 2025లో 177.6 మార్కులతో 17వ ర్యాంకులో ఉన్న ఈ నగరం.. ఏడాదిలో 172 మార్కులతో 21వ స్థానానికి పడిపోయింది.కడపలో 11 స్థానాల పతనం వైఎస్సార్ కడప నగర పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 11 ర్యాంకులు దిగజారి 34వ స్థానానికి పడిపోయింది. గతేడాది 168 మార్కులు సాధించిన ఈ నగరం, ఈసారి కేవలం 144 మార్కులకే పరిమితమైంది.వెనకడుగులో రాజమండ్రి, ఒంగోలు.. ఇక చారిత్రక నగరం రాజమండ్రి సైతం 12వ ర్యాంకు నుంచి 14వ స్థానానికి దిగజారింది. ఒంగోలు నాలుగు స్థానాలు నష్టపోయి 25వ ర్యాంకుకు పడిపోయింది. అనంతపురం ఒక ర్యాంకు మెరుగైనా మార్కులు (146.5 నుంచి 144కి) తగ్గడం గమనార్హం. కర్నూలు (29వ ర్యాంకు) ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుంది. రాజధాని విజయవాడకు దక్కని ‘టాప్–3’ గౌరవం.. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ గతేడాది 13వ స్థానం నుంచి 8వ స్థానానికి (186 మార్కులు) కొంత మెరుగైనప్పటికీ, జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో మాత్రం నిలవలేకపోయింది. కాకపోతే విజయవాడలోని 60వ వార్డు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం, కొన్ని నిర్దిష్ట వార్డులకు నగదు పురస్కారాలు దక్కడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. 726 వార్డులకుగాను పరిశీలనకు 39 వార్డులే.. ఇక వార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా 726 వార్డులు సర్వేక్షణ పరిధిలోకి వచ్చాయి. వీటిలో 39 వార్డులను రాష్ట్రస్థాయి సమీక్షకు ఎంపిక చేశారు. సంబంధిత ప్రాంతీయ పురపాలక అధికారులు కూడా ఈ వార్డులను తనిఖీ చేశారు. వార్డు స్థాయిలో విజయవాడ 60వ వార్డు జాతీయంగా రెండో ర్యాంకు సాధించడంతోపాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరులోని కొన్ని వార్డులకు రాష్ట్రస్థాయిలోనూ నగదు పురస్కారాలు లభించాయి. ఇంత పెద్ద సంఖ్యలో నగరాలు, వార్డులు సర్వేక్షణలో పాల్గొన్నప్పటికీ.. ప్రధాన నగరాలు ఎందుకు జాతీయ స్థాయిలో అగ్రస్థానాల్లో నిలవలేకపోయాయి? అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. కాగితాల్లోనే చర్యలు.. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో బయోమాస్, మున్సిపల్ వ్యర్థాల దహనం నియంత్రణ, రోడ్డుపై దుమ్ము తగ్గింపు, నిర్మాణ వ్యర్థాలు, వాహన.. పరిశ్రమల ఉద్గారాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన వంటి అంశాలకు మార్కులు కేటాయిస్తారు. వీటిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారికంగా చెబుతున్నా.. కొన్ని ప్రధాన నగరాల స్కోర్లు, ర్యాంకులు మాత్రం వెనుకబడటం గమనార్హం. ప్రత్యేకించి విశాఖపట్నం వంటి పారిశ్రామిక నగరం 21వ స్థానానికి, కడప 34వ స్థానానికి పడిపోవడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో చంద్రబాబు సర్కారు లోపాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, ఒంగోలు వంటి నగరాల వైఫల్యాలు ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతున్నాయి. -
రాజకీయ పాలన కావాలి
సాక్షి, అమరావతి: తనకు రాజకీయ పాలన కావాలి తప్ప, బ్యూరోక్రటిక్ పాలన అవసరంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి స్పష్టంచేశారు. గత ఎన్నికల ముందు చెప్పింది చేశానని.. మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లాల్సి ఉందని, సమస్యలు నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినా లేదా తప్పుడు ప్రచారం చేసినా సరైన సమయంలో స్పందించకపోతే ప్రభుత్వం పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రెండ్రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సునుద్దేశించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు గుర్తు పెట్టుకునేలాగ కలెక్టర్ల పాలన ఉండాలన్నారు. ప్రభుత్వం పాలసీ ఇస్తుందని, దాన్ని మంత్రులు, అధికారులు అమలుచేస్తారని, వాటిపై తప్పుడు ప్రచారాన్ని మంత్రులు, అధికారులు ఖండించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించాలా అంటూ సీఎం అసహనం వ్యక్తంచేశారు. డీఎస్సీ రిక్రూట్మెంట్లో క్రీడా కోటా కింద మూడు శాతం రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చామని, దాన్ని అధికారులు అమలుచేశారని.. అయితే, దానిపై తప్పుడు ప్రచారం చేస్తే ఆ ప్రచారం తప్పు అని చెప్పకపోతే శిక్ష మనకు పడుతుందన్నారు. పాలనలో మరింత వేగం పెంచాలన్నారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. సీఎంఓకు, సీఎస్‌కు సమస్యలను చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను తీసుకురావాలన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. గ్రోత్ ఇంజన్లను గుర్తించి సంపద పెంచాలి ప్రతి నియోజకవర్గానికి 10–15 ప్రాజెక్టులను ప్రాధాన్యతగా గుర్తించి అభివృద్ధి చేయాలి. జిల్లాల్లో గ్రోత్ ఇంజన్లను గుర్తించి దానికి అనుగుణంగా సంపద, ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలి. 2027 నాటికి భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేసే బాధ్యత మనందరిది. ప్రస్తుతం 13.44 శాతం వృద్ధి నమోదైంది. దీనిని 15 శాతం దిశగా తీసుకెళ్లాలి. కుటుంబ యూనిట్‌గా ఆధార్ అనుసంధానం చేయాలి. దీంతో అర్హులెవరో అనర్హులెవరో తేలుతుంది. పెన్షన్ కోసం, ఇంటి కోసం కుటుంబాలను విడతీస్తున్నాం. ఇక నుంచి పెద్ద కుటుంబాలకే ప్రోత్సాహం. ఏడుగురుంటే మూడు, నాలుగు బెడ్ రూమ్‌ల ఇళ్లు కట్టిస్తాం. ఏడాదిలోగా అర్హులకు ఇళ్ల స్థలాల ఇవ్వాలి. సెల్ టవర్లకు అవసరమైన భూములను కలెక్టర్లు సకాలంలో ఇవ్వడంలేదు. పనితీరు చూపకపోతే ఆ పదవికి పనికిరారు. జెన్‌జీ ఆలోచనలకు అనుగుణంగా నాయకత్వం ఉండాలి.54% లోటు వర్షపాతంఈ ఏడాది రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కరువు నేపథ్యంలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తరువాత పశుగ్రాసం, జీవనోపాధికి పెద్దపీట వేయాలి. వర్షాభావంవల్ల మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారు. ఉల్లి ధరలతో ప్రభుత్వాలే కూలిపోయాయి. వర్షాల్లేవని భూములను బీడుగా వదిలేయవద్దు. ప్రకృతి వ్యవసాయం విధానంలో తక్కువ నీటితో పండే పంటలను, బహుళ పంటల విధానాన్ని అమలుచేయాలి. ఇక పంటల బీమా ఏ పంటకు చేస్తే ఆ పంటకే వర్తిస్తుందని, వేరే పంట వేస్తే వర్తించదని, అసలు పంట వేయకపోతే కూడా బీమా వర్తించదని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే వారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయికి వెళ్లి గ్రామాల్లో పర్యటించాలని చంద్రబాబు చెప్పారు. -
టీటీడీ భూమిలో చెల్లెలికి చంద్రబాబు కానుక
తిరుపతి మంగళం: టీటీడీకి సంబంధించిన విలువైన స్థలానికి ముఖ్యమంత్రి సమీప బంధువు(చెల్లెలి) పేరుతో నివేశన పట్టా మంజూరు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సుమారు రూ.60 లక్షల విలువైన రెండున్నర సెంట్ల స్థలానికి పట్టా మంజూరు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలం అనంతగురప్పగారిపల్లికి చెందిన ఎం.చెంచయ్యనాయుడు భార్య ఎం.బేబీ పేరుతో తిరుమలనగర్ పంచాయతీ పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 1/1లో రెండున్నర సెంట్ల స్థలానికి ఈ నెల 9న నివేశన పట్టా మంజూరు కావడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఆ స్థలం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సీఎం కార్యాలయం ఆదేశాలతోనే.. పట్టా మంజూరు విషయంలో సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతోనే తిరుపతి అర్బన్ తహసీల్దారు పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అర్బన్ తహసీల్దార్ కూడా స్పష్టంచేస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ ఉత్తర్వులతో పట్టాలిచ్చామని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీకి సంబంధించిన భూమిలో వ్యక్తిగతంగా నివేశన పట్టా ఎలా మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ స్థలంలో పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఇచ్చినా టీటీడీ తీర్మానం ఇచ్చినట్లు ఏమైనా పత్రాలు ఉన్నాయా? అంటూ అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను, టీడీపీ నాయకులనూ ప్రశ్నించారు. ఎం.బేబీ పేరిట తిరుపతి అర్బన్ తహసీల్దార్ మంజూరు చేసిన పట్టా పట్టా ఇచ్చిన స్థలంలోకి వెళ్లిన బేబీ పట్టా మంజూరైన స్థలంలో ప్లాటు శుభ్రం చేసేందుకు చంద్రబాబు సోదరి బేబీ వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 1/1లోని స్థలం టీటీడీకి చెందినదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించబోమని స్థానికులు స్పష్టం చేశారు. ఆ స్థలం కమ్యూనిటీ భవనం, పిల్లల ఆట స్థలంగా ఉపయోగించుకోవడానికి టీటీడీకి విన్నవించుకున్నామని స్థానికులు వివరించారు. బేబీకి మద్దతుగా కొందరు టీడీపీ నేతలు అక్కడికి వచ్చినప్పటికీ స్థానికులు వెనక్కి తగ్గలేదు.సామాన్యులకే నిబంధనలా.. సీఎం బంధువులకు లేదా.. ? నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితా, నిబంధనలు, రికార్డుల పేరుతో పట్టాలు మంజూరు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించిన స్థలానికి సీఎం బంధువు పేరుతో పట్టా ఎలా మంజూరైందని ప్రశ్నిస్తున్నారు.‘సామాన్యులకు ఒక న్యాయం.. సీఎం బంధువులకు మరో న్యాయమా?’ అంటూ నిలదీస్తున్నారు. పట్టా మంజూరుకు ఏ నిబంధన వర్తించిందో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 1/1లోని భూమి వాస్తవ యాజమాన్యం, రెవెన్యూ రికార్డులు, టీటీడీ రికార్డులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. బేబీ పేరుతో పట్టా మంజూరుకు ఎవరు సిఫార్సు చేశారు? ఏ నిబంధనల ప్రకారం పట్టా ఇచ్చారు? సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే ఇచ్చేస్తారా ? ఈ పట్టా చెల్లుబాటవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఆ పట్టాను రద్దు చేసి భూమిని టీటీడీ ఆ«దీనంలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. -
అబద్ధాలు.. డ్రామాలు.. డైవర్షన్లు
అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా.మా హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారో చెక్ చేసుకోండి... ఎక్కడా తేడా చూడలేదు.మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు.సాక్షి, అమరావతి: ‘డైవర్షన్..డ్రామాలు..అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బతుకు.. అధికారులను బెదిరించి.. భయపెట్టి..ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను కొట్టేయించుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పైగా తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకునే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయాడు. తమ అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు బయటపడిన ప్రతీసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామాలు ఆడడం చంద్రబాబుకే చెల్లింది‘ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణాలు చేస్తూ.. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలిస్తుండటంపై సాక్ష్యాధారాలతో ఇదేమిటని ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగుతారు. ఇలా అయితే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఎలా ఏర్పడుతుంది. లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చుకుంటూ పోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలి. డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణ జరపాలి, ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంది.’ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..పరీక్ష రాయకుండానే ఉద్యోగాలిస్తే ప్రశ్నించకూడదా? నువ్వు పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇస్తానంటున్నావు. నీకు నచ్చిన వారికి డబ్బులు తీసుకొని స్కామ్‌లు చేస్తూ ఉద్యోగాలు ఇస్తున్నావు. అర్హత ఉండాలి కదా? ఎలాంటి అర్హత లేకుండా నీకు నచ్చాడని, నీకు డబ్బులు ఇచ్చాడని నీ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎలా? ఇదేమిటని ప్రశ్నిస్తే తప్పవుతుందా? ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు పారదర్శకంగా ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. అలా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలిచ్చే సమయంలో ఒకటి రెండు తప్పిదాలు జరిగితే పొరపాటు చేశావ్ లే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కావాలనే పెద్ద మోసం చేసినట్టు స్పష్టంగా కన్పిస్తోంది. ఏ పరీక్ష రాయకుండానే 372 పోస్టులు ఇచ్చేందుకు స్కెచ్ వేశావు. ఉద్యోగాలకు పరీక్షలు రాయనవసరం లేదని ఏకంగా నువ్వు జీవోలు ఇచ్చావు. ఇదే రీతిలో మిగిలిన ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకోవాలనుకున్నావ్. ఇది తప్పు కాదా? పైగా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా? డైవర్షన్.. డ్రామాలు.. అబద్ధాలు.. ఇదే చంద్రబాబు బ్రతుకు చంద్రబాబు అనే వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు..డైవర్షన్ మీద డైవర్షన్..ఒక డ్రామా చేస్తాడు. డీఎస్సీ స్కామ్–1 కానీ, డీఎస్సీ స్కామ్–2 కానీ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా నేను చూపించాను. పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్తశుద్ధితో సమాధానాలు చెప్పాలి. కానీ మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు కూడా కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో అనుమానాస్పదం (సస్పెక్ట్) అని రాశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అరెస్ట్ చేయలేదని వాళ్ల రిపోర్టులే చెబుతున్నాయి. కానీ అరెస్ట్ చేసినట్టు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపినట్టు అసెంబ్లీలోనే అడ్డంగా బొంకేస్తున్నారు. పైగా అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం చెప్పించారు.. ఏడుసార్లు వెరిఫికేషన్ తర్వాతే ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మేము ఆధారాలతో బయటపెడుతున్నాం.. కాబట్టి దిక్కుతోచని, తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పులను ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. నిరుద్యోగ జీవితాలతో చెలగాటాలా? డీఎస్సీ కుంభకోణంపై పోరాటం ఇంత పెద్దది కాకపోతే..జగన్ అనే వ్యక్తి ప్రశ్నించకపోతే డీఎస్సీ మాదిరిగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కు వర్తింపచేసేవారు. పరీక్షలు లేకుండానే టీచర్ పోస్టులు కట్టబెట్టిన వీళ్లు ఏపీపీఎస్సీలో కూడా పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు అమ్మేసుకోవాలని చూశారు. అటవీ శాఖలోని 814 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే అందులో 40 స్పోర్ట్స్ కోటా పోస్టులను పరీక్ష లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా భర్తీ చేసేందుకు డీఎస్సీలో ఉపయోగించిన జీవో నెం.4నే ఇక్కడ వర్తింపచేయాలని చూశారు. డీఎస్సీలో అక్రమాలు బయటపడగానే ఇవి కూడా వెలుగులోకి వస్తాయనే భయంతో రిక్రూట్‌మెంట్‌ను మధ్యలో ఆపేశారు. ఈ 40 పోస్టుల జాబితా బయటపడితే తమ బాగోతం కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో మిగిలిన 774 పోస్టుల భర్తీని నిలిపివేశారు. లక్షలమంది పిల్లలు పోటీ పరీక్షల కోసం జీవితాలను ఫణంగా పెట్టి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతారు. లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. ఇంత కష్టపడితే చివరకు స్కామ్‌లతో ఇష్టారాజ్యంగా నచ్చిన వాళ్లకు లంచాలు తీసుకుని నియామకాలు చేస్తూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెడుతూ సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మకానికి ప్రభుత్వ ఉద్యోగాలు అనే ధోరణి కొనసాగితే డీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తారా? ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం ఎందుకనే నిర్లిప్త వైఖరి వారిలో రాదా? ఏదైనా ఫర్ సేల్ అంటే ఇక చదువులు ఎందుకు? కష్టపడడం ఎందుకు? ఏమిటీ జీవితం అనిపించదా? అని ప్రశ్నిస్తున్నా. పాలకులుగా ఉన్న మనం ఏం చేస్తా ఉన్నాం. పరిపాలన అంటే ఇదేనా?ఎలాంటి ఆరోపణ లేకుండా లక్షల ఉద్యోగాలిచ్చాం.. మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. పారదర్శకతకు అత్యంత పెద్ద పీట వేశాం.. ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా రాలేదు. ఎలాంటి ఆరోపణలు రాలేదు. కావాలంటే చూసుకోండి. చెక్ చేసుకోండి..సచివాలయాల ఉద్యోగాల్లో ఎంతమంది టీడీపీకి చెందిన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడా తేడా చూడలేదు. ప్రభుత్వం అనేది ఉద్యోగార్థుల్లో నమ్మకం కల్గించేలా ఉండాలి. అర్హత లేని వారికి ఉద్యోగాలు అమ్ముకునే విధానాన్ని ఒప్పుకుంటే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద వారికి నమ్మకం ఎలా ఉంటుంది? దీన్ని మార్చాలి. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే డీఎస్సీ స్కామ్‌పై పారదర్శకంగా సీబీఐ విచారణకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. మా డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో ఇప్పటికే వివిధ రూపాల్లో పోరాటాలు చేశాం. మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు అన్ని రకాల వేదికలపైనా పోరాటాలు కొనసాగిస్తాం. నిజంగా సిగ్గుతో వాళ్లు తలదించుకోవాలి.. డీఎస్సీ స్కామ్‌పై మీరు లేవనెత్తిన అంశాలపై బీజేపీ, జనసేన ఎందుకు స్పందించడం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఈ ప్రశ్నను మీరు వాళ్లను అడగాలి. డీఎస్సీ స్కామ్ విషయంలో జగన్ ఏమైనా విషయాలు తప్పుగా చెబుతున్నారా. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడా ? జగన్ చెప్పే విషయాలు లాజికల్‌గా లేవా ? అని వాళ్లను ప్రశ్నించాలి. జగన్ చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని అనిపిస్తా ఉన్నప్పుడు నోరు మెదపాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉన్న ఎవరికైనా ఖచ్చితంగా రావాలి. సాక్ష్యాలు, ఆధారాలతో పక్కాగా దొరికిపోయిన తర్వాత కూడా జనసేన, బీజేపీ నేతలు ప్రశ్నించకుండా ఇలాంటి చంద్రబాబును సపోర్టు చేస్తున్నందుకు, ఇలాంటి వ్యవస్థను బలపరుస్తున్నందుకు వాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ.. చంద్రబాబు తనపై నమోదైన కేసులు కొట్టేయించుకుంటూ తనకు తానుగా క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టించి, ప్రలోభాలకు గురిచేస్తూ తనపై నమోదైన కేసులను మూయించుకుంటున్నారు ఇది జగమెరిగిన సత్యం. ప్రభుత్వం తన చేతుల్లో ఉంది. అధికారులందరూ ఆయన కింద పని చేస్తున్నవారే. తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్నారు. డీఎస్సీ పై నమోదైన కేసులను కూడా ఇదే రీతిలో నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వంలో రిపోర్టింగ్ అథారిటీ ఎవరు.. చంద్రబాబు నాయుడే. అందుకే తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయించుకుంటూ తనకు క్లీన్ చిట్ వచ్చిందని తనకు తానుగా చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. -
సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్ నిలిపివేత
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. సాక్షి టీవీ సోషల్ మీడియా మరో అకౌంట్‌ను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. డీఎస్సీపై వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టిన వెంటనే వీడియోలను తొలగించారు. ఫేక్ అకౌంట్లతో మెటాకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. మరో వైపు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి ప్రభుత్వం.. 20కిపైగా వైఎస్సార్సీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు కూడా బ్లాక్ చేయించింది.సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు వెనుక ఏపీకి చెందిన సైబర్ అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఎస్సీ స్కామ్ వార్తలు పెట్టినందుకే సోషల్ మీడియా అకౌంట్ల బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. పత్రికా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర హక్కును కాల రాస్తోంది.ఇదీ చదవండి: జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్ -
మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్
-
దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్
-
నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్
-
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
జగన్ దెబ్బకు బాబుకు బీపీ హై వెలుగులోకి కీలక ఆధారాలు
-
7 స్టెప్స్ వెరిఫికేషన్.. ఇది వీళ్ల బండారం..జగన్ సంచలన వ్యాఖ్యలు
-
రాజీనామా చేసే వరకు వదిలిపెట్టను జగన్ మాస్ వార్నింగ్
-
చంద్రబాబుది టెన్షనా.. ఫ్రస్టేషనా?
బహుశా దేశంలో ఎక్కడా ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితి ఉండదేమో! గొడ్డలి పార్టీ, వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శలు చేసుకునే రాజకీయం ఏపీలో సాగుతోంది. దీనికి 50 ఏళ్ల రాజకీయ చరిత్రతో , సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన కారణం కావడం అత్యంత శోచనీయం. అంతేకాదు.. తనది పొలిటికల్ గవర్నెన్స్, అంటే రాజకీయ పాలన అని బహిరంగంగా చెబుతున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈయనే కావచ్చు. ఆయనే చంద్రబాబు నాయుడు. వయసు రీత్యా కూడా ఆయన ఏపీలో ఉన్న రాజకీయవేత్తలలోకల్లా పెద్దవారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ సమయంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విన్యాసాలు ఏపీ సమాజానికి ఎంత ప్రయోజనం అన్న ప్రశ్న వస్తుంది. పోనీ ఆయన చెప్పే విషయాలలో నిజాలు ఉంటే అదో రకం. సత్యాసత్యాలతో నిమిత్తం లేకుండా ఆయన మాట్లాడేస్తుంటారు. దీనిని బట్టి ఆయన ఏదో టెన్షన్ లోనో, లేక ఫ్రస్టేషన్ లోనో ఉన్నారేమో అన్న భావన పలువురిలో కలుగుతుంది.పైకి అభివృద్దిలో ప్రజాప్రతినిధుల పాత్ర, విజన్ అంటూ మాటలు చెబుతూ, ఆచరణలో ప్రత్యర్ధి పార్టీల మద్దతుదారులకు వారికి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం చేయకపోవడం రాజకీయ పాలన అన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు, ఇతర అధికార పార్టీ నేతలు వ్యవస్థలపై పెత్తనం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినా ఎవరూ నోరెత్తకపోవడం అన్నమాట. ఇది సరైన విధానమేనా అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకాలు చేసిన సంగతి ప్రజలు మర్చిపోతారా? ఈ సారి పేరు మార్చి పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రజలను పీడిస్తుంటే గమనించలేరా!వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికి పదిహేనేళ్లుగా రాజకీయాలలో ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ పార్టీ ఇప్పుడు సడన్ గా గొడ్డలి పార్టీ ఎలా అయింది.అదేమిటంటే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉదహరిస్తారు. దానిని జగన్‌కు ఆపాదించాలని విశ్వయత్నం చేస్తుంటారు. ఇందులో నిజం ఏమిటి? అసలు జగన్‌కు ఆ కేసుతో సంబంధం లేదని సీబీఐ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత కూడా చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారో అర్ధం కాదు.ఈ కేసులో స్వయంగా గొడ్డలితో నరికానని చెప్పిన ఒక నిందితుడికి పరోక్షంగా టీడీపీ ఎందుకు మద్దతు ఇస్తోంది? అంటే అప్పుడు గొడ్డలి పార్టీ అని దేనిని అనాలి? అతనికి టీడీపీ తరపున వాదించే లాయర్ ఎందుకు పనిచేస్తున్నారు? అలాగే వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా రకరకాల పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఆమెకు కూడా టీడీపీ సహకారం ఎందుకు ఇస్తోంది? పైగా వివేకా హత్య కేసు జరిగింది 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే కదా! అప్పటి పోలీసు అధికారులు ఎందుకు జగన్‌పై అభియోగాలు మోపలేకపోయారు? అప్పటి సిట్ నివేదిక ఏమి చెబుతోంది?ఇవన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ఐదేళ్ల తర్వాత గొడ్డలి పార్టీ అని మాట్లాడడం ద్వారా తన స్థాయిని తాను తగ్గించుకున్నట్లు అనిపించదా! పోనీ మరికొన్ని ఇతర హత్య కేసులు చూస్తే ఎందరు టీడీపీవారు అందులో భాగస్వాములుగా ఉన్నరన్న అభియోగాలు ఎన్ని ఉన్నాయి? ఉదాహరణకు వంగవీటి రంగా హత్య కేసులో నిందితులు టీడీపీ వారా, కారా? వారిలో కొందరు ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు? స్వయంగా రంగా కుమారుడు గతంలో ఏ ఆరోపణ చేసింది గుర్తు లేదా? అంతెందుకు కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలు ఎన్ని? ఉదాహరణకు వినుకొండలో రషీద్ హత్య, పల్నాడులో సాల్మన్ హత్య.. ఇలా పలు ఘటనలలో నిందితులు టీడీపీవారే కదా! మరి టీడీపీ గొడ్డలి పార్టీ లేక కత్తుల పార్టీ అవుతుందా?కొన్నాళ్లపాటు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. కొన్నిసార్లు మాత్రం జవాబు ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీని బూడిద పార్టీ అని అంటే, మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ అని అన్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ అనే నిందితుడిని చిత్రహింసలు పెట్టడంతో చనిపోయాడు. తదుపరి అతని బూడిద కూడా లేకుండా చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని వారు ఈ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత టిడిపికి వెన్నుపోటు పార్టీ అని నామకరణం చేసి అలాగే పిలవడం ఆరంభించారు. జగన్ కూడా మీడియా సమావేశాలలో అదే పేరుతో సంబోధిస్తున్నారు.వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అనడానికి ఆధారాలు లేవు కాని, టీడీపీని వెన్నుపోటు పార్టీ అనడానికి అవసరమైన అన్ని ప్రాతిపదికలు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా చంద్రబాబును ఆయన మామగారైన ఎన్.టి.రామారావే ఏ వ్యాఖ్యలు చేసింది వారు ప్రస్తావిస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన ఘట్టాన్ని ఉదహరిస్తున్నారు. ఆయా ఎన్నికలలో ఎన్నిరకాల హామీలు ఇచ్చి, వాటిని ఎగవేయడం ద్వారా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు కూడా చేస్తున్నారు. 2014 లో ఇచ్చిన హామీలనే కాకుండా, 2024 లో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయల ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి ఇస్తామని తెలిపారు. బీసీలతో సహా బలహీనవర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ ఇచ్చారు.ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి, వాటిని ఎగవేయడం ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచినట్లేనని వైఎస్సార్సీపీ నేతల విమర్శ. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి టీడీపీలో ఉండదు. కాకపోతే తమ మీడియా బలంతో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమింప చేసే యత్నం జరగవచ్చు. కాని వాటిని ఎల్లవేళలా నమ్మరు కదా! ఇంతకుముందు వైఎస్సార్‌సీపీవారు తెలుగుదేశం పార్టీని పేరు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శలు చేసేవారేమో! కాని చంద్రబాబు వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తుండడంతో, జగన్ తో సహా పార్టీ నేతలంతా టీడీపీని వెన్నుపోటు పార్టీ అని పిలుస్తున్నారు. చిత్రమేమిటంటే చంద్రబాబు తాము క్రిమినల్స్‌తో పోరాటం చేస్తున్నామని వైఎస్సార్సీపీని ఉద్దేశించి మీడియా సమావేశాలలో అంటారు. తీరా చూస్తే ఏపీలో అత్యధికంగా 79 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్స్ కేసులు ఉన్నాయి. కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు కదా! అంతేకాదు.. చంద్రబాబుపైనే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది.జగన్ వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారట. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించిన తర్వాత కేసులు వచ్చాయే తప్ప ముందు కాదు కదా! ఆ కేసులు పెట్టడానికి కాంగ్రెస్‌తో కలిసింది తెలుగుదేశం పార్టీనే కదా ! పారిశ్రామికవేత్త జిందాల్‌పై కేసు పెట్టాలని యత్నించి కూటమి సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది. నటి జత్వాని కేసులో ఐపీఎస్‌లపై తప్పుడు కేసులు పెట్టినట్లు సర్కారే అంగీకరించింది కదా! మరి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుతో పాటు కొందరు అధికారులు అరెస్టు అయ్యారు కదా! దాని గురించి ఏమి చెబుతారు! అనవసరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే టీడీపీ కార్యకర్తలు నమ్మినట్లు నటిస్తారేమో కాని, వారికి కూడా అసలు విషయాలు తెలియకుండా ఉంటాయా? ఏది ఏమైనా చంద్రబాబు తన హోదాకు తగిన రీతిలో హుందాగా వ్యవహరించి, సరైన పద్దతిలో ప్రసంగాలు చేయకపోతే ఆంధ్ర సమాజానికి తీరని నష్టం చేసిన వారవుతారేమో!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్
-
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్
-
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్‌జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్‌గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్‌కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్‌ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్‌జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్‌లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
DSC స్కాంలో తవ్వేకొద్ది అక్రమాలు.. ఒక్కొక్కటి బయటపడుతుంటే బాబుకు బీపీ పెరుగుతోంది
-
డీఎస్సీ స్కామ్‌తో చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. సుదీర్ఘంగా ఈ కుంభకోణంపై కొత్త విషయాలతో మాట్లాడారాయన.డీఎస్సీ కుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయి. స్కామ్ జరిగిందని ఎవరైనా ఆధారాలు చూపిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. వాళ్లను జైల్లో పెడుతున్నారు. జర్నలిస్టులు కొందరు వాస్తవాలు బయటపెడితే.. వాళ్లపైనా తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించాం. నా ప్రశ్నలకు చంద్రబాబు, నారా లోకేశ్ దగ్గరి నుంచి సమాధానమే లేదు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రం తయారీ.. పర్యవేక్షణ ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే డీఎస్సీ స్కామ్‌కు ద్వారాలు తెరిచారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా బుల్డోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్‌ర్యాంకర్ పేరు ఎందుకు లేదు?. సెకండ్ లిస్ట్‌లో అతని పేరు ఎందుకు మాయమైంది?. అతని డీఎస్సీ లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారు. ఎందుకు అతన్ని వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు?. కోర్టుకు ఆ ఫస్ట్ ర్యాంకర్ ఎందుకు వెళ్లాడు?. స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నంలోనే ఇదంతా చేశారు అని వైఎస్ జగన్ అన్నారు. స్పోర్ట్ కోటాలో పరీక్షే లేకుండా 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారు. అందుకోసం ప్రత్యేక జీవోలు రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చేశారు. డీఎస్సీ ఉద్యోగాల కోసం జరిగిన బేరసారాల ఆడియో, వీడియోలు బయటకు వచ్చాయి. తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది స్కామ్‌ను దాచిపెట్టే ప్రయత్నం కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
ఒక అడుగు వెనక్కి వేశామంటే అది భయపడి అనుకున్నారా? అంబటి ఫైరింగ్ స్పీచ్
-
టీడీపీ ఆఫీస్ కు దస్తగిరి.. బాబును కలవడం వెనుక ట్విస్ట్..
-
DSCలోనే కాదు.. ఫేక్ సర్టిఫికెట్లతో మెడికల్ సీట్లు..
-
అమలాపురం మున్సిపల్ కమిషనర్ ను అవమానించిన చంద్రబాబు
-
బాబుకు బిగ్ షాక్.. DSC స్కామ్ లో పెద్ద తలకాయలు
-
బీసీల ఉద్ధారకుడు వైఎస్ జగనే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఉత్తరాంధ్రలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో 60 నుంచి 70 శాతం మంది బీసీలే. వారి సంఖ్యను కలిపేసి రాష్ట్రంలో బీసీల నిష్పత్తిని చూపిస్తున్నారు. అసలు అన్ని కులాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కప్పిపుచ్చి, ఒక్క బీసీలకే 34 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే కల్పించినట్లు మసిపూసి మారేడుకాయ చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో బీసీలకు ఎన్నికలకు ముందు తాయిలాలు తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినా బీసీల సర్వతోముఖాభివృద్ధి ఎలా చేయాలో చేసి చూపించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. బీసీల ఉద్ధారకుడు ఆయన మాత్రమే. బీసీల కోసం చంద్రబాబు చేసింది శూన్యం. టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకొనే నైతికహక్కు చంద్రబాబుకు లేనేలేదు’ అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన బుధవారం న్యూఢిల్లీలో ‘సాక్షి’తో మాట్లాడారు. బీసీల కృతజ్ఞత సభ అంటూ నర్సీపట్నంలో పుష్పాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేయించుకున్నంత మాత్రాన బీసీల ఉద్ధారకులు అయిపోరని చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో, రాజకీయ సభల్లో ఇచ్చే హామీల కన్నా, అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించారనేదే ఒక పార్టీ తమది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి ప్రామాణికం అవుతుందని చెప్పారు. అలా చెప్పుకోదగిన ప్రయోజనమేదైనా చంద్రబాబు చేశారేమో చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏయే ప్రయోజనాలు కల్పించారో చెప్పడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయన్నారు.చట్టసభల్లో బీసీలకు జగన్ పెద్దపీటవిభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు చట్టసభల్లో పెద్దపీట వేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని చెప్పారు. ఒకేదఫా నలుగురు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారని గుర్తుచేశారు. అది చాలా గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా ఆ స్థాయిలో బీసీలను రాజ్యసభకు పంపారా? అని ప్రశ్నించారు. ‘శాసనమండలిలో 2023లో 18 స్థానాలు ఖాళీ అయితే, 11 మంది బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు.మొత్తం 44 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల్లో 19 మంది బీసీ నాయకులే. గతంలో ఎప్పుడూ బీసీలకు అంత పెద్దసంఖ్యలో ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్రెడ్డి 25 లోక్‌సభ స్థానాలకుగాను 11 చోట్ల బీసీలకే టికెట్ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 48 చోట్ల బీసీ అభ్యర్థులనే నిలబెట్టారు. మొత్తం బీసీలకు 59 సీట్లు అంటే దాదాపు చట్టసభల్లో 30 శాతం రిజర్వేషన్లు ఆయన చెప్పకుండానే ఇచ్చారు’ అని వివరించారు. ఇలా బీసీలకు చట్టసభల్లో అగ్రస్థానం కల్పించి, తమ అభిప్రాయాలను, నిర్ణయాలను గళమెత్తి చెప్పడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కేబినెట్లో బీసీ మంత్రులెందరు? తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే పూర్వం ఎన్.టి.రామారావు బీసీ పట్ల కాస్త ఉదారంగా ఉండేవారని చెప్పారు. కానీ చంద్రబాబుకు మాత్రం ఎన్నికల్లో భారీ హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనబెట్టేసే చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులిచ్చారో చూస్తే అసలు విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారని గుర్తుచేశారు. బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏది? రాష్ట్రంలోని బీసీలకు ఏంకావాలో చూడాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏనాడూ లేదని విమర్శించారు. ఉదాహరణకు బీసీల్లో ఒకరైన లక్షలాదిమంది మత్స్యకారులు సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఈ రాష్ట్రాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారంటే చంద్రబాబు తన 20 ఏళ్ల పాలనలో వారి అభివృద్ధికి ఏం చేసినట్లని ప్రశ్నించారు. వారికోసం ఒక్క ఫిషింగ్ హార్బర్‌ను కూడా నిర్మించలేదన్నారు. జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం తలపెట్టారని గుర్తుచేశారు. వాటిలో కొన్ని నిర్మాణం పూర్తికాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆపేశారని విమర్శించారు. బీసీల విద్యకు జగన్ ప్రాధాన్యం తరతరాలుగా వ్యవసాయం, చేతివృత్తుల్లోనే ఉన్న బీసీలు పారిశ్రామికీకరణ తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ఉన్న ఏకైక మార్గం విద్య మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ, పేద కుటుంబాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసే పాలసీలనే అమలుచేస్తున్నారని విమర్శించారు. అందుకు భిన్నంగా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మాత్రమే పేద కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను చేరువచేసే ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి వంటి సంక్షేమ పథకాలను చేపట్టారని గుర్తుచేశారు. వారి పేదరికం ఏరోజూ వారి చదువుకు అడ్డుకాకుండా చేయగలిగిన ఘనత వైఎస్ కుటుంబానికి దక్కుతుందన్నారు. చంద్రబాబు ఆ పథకాలను నీరుగారుస్తూ తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. బీసీల అభివృద్ధి జగన్ పాలనతోనే తెలిసిందిఅంతవరకు బీసీలకు చిన్నచిన్న తాయిలాలతోనే చంద్రబాబు పాలన సాగిందని, జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి ఇంత చేయవచ్చా అని తెలిసిందని చెప్పారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల్లో ఎక్కువమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలేనన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 వేల ఎకరాలను సేకరించి, దాదాపు 30 లక్షలమంది మహిళలకు ఇచ్చిన ఇళ్లపట్టాల్లో ఎక్కువ లబ్దిపొందింది బీసీ సామాజికవర్గాలేనని చెప్పారు. మరి చంద్రబాబు గత రెండేళ్ల పాలనలో పేదవారి కోసం ఒక్క సెంటు భూమి అయినా సేకరించారా? అని ప్రశ్నించారు. ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు మాత్రం రూపాయికి, పావలాకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. తాము పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదని, కానీ భూపంపిణీ విధానమే సరైంది కాదని చెబుతున్నామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలను కూడా వ్యాపార, వాణిజ్య, ఐటీ, పారిశ్రామికరంగాల్లో ప్రోత్సహించే చర్యలనే ఏ ప్రభుత్వమైనా చేపట్టాలన్నారు. ఆ పనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని చెప్పారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో బీసీలే కాదు అన్ని సామాజికవర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారనే మాట వినిపిస్తోందని తెలిపారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారుమళ్లీ ఇప్పుడు స్థానికసంస్థల ఎన్నికలు వస్తున్నాయనగానే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తున్నారని ధర్మాన ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ఇంకా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను మళ్లీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. చంద్రబాబు గారడీ మాటలపై బీసీలను చైతన్యం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత ఐదు రీజియన్ల వారీగా, తర్వాత దఫాలో 25 జిల్లా కేంద్రాల్లో, 175 నియోజవర్గాల వారీగా ఈ సభలు నిర్వహిస్తామని వివరించారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందీ, చంద్రబాబు పాలనలో ఏం మోసం జరిగిందీ వివరిస్తామన్నారు. ఏ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలో, బీసీల నుంచి ఎలాంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాలో నిర్ణయిస్తామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. -
కళ్లార్పకుండా ‘కహానీలు’
సాక్షి, అమరావతి : తాను చేయని పనిని చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఎక్కడలేని ‘తెలివితేటలు’ ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే, 22–ఏ భూములకు విముక్తి, పట్టాదారు పాసుపుస్తకాల ఘనత తనదేనని నోటికొచ్చినట్లు అలవోకగా అబద్ధాలు వల్లెవేస్తున్నారు. తాను వ్యతిరేకించిన కార్యక్రమాన్ని తానే ప్రారంభించినట్లు, తాను 22–ఏలో పెట్టిన భూములకు తానే విముక్తి కల్పించినట్లు నిస్సిగ్గుగా అవాస్తవాలు మాట్లాడుతూ కళ్లార్పకుండా కహానీలు చెబుతుండడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ బాబు తెచ్చారా?.. రాష్ట్రంలో భూముల రీసర్వే మొదలైంది 2020 డిసెంబర్ 21న. అప్పటి ఉమ్మడి కృష్ణాజిల్లా తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సర్వే కోసం దేశ చరిత్రలో తొలిసారిగా 14 వేల మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. 3,240 జీఎన్ఎస్ఎస్ రోవర్లు, వందలాది డ్రోన్లు, నాలుగు హెలికాప్టర్లు, రెండు విమానాలు, 70 కార్స్ స్టేషన్ల నెట్‌వర్క్‌తో అనేక వ్యయ ప్రయాసలతో ఏర్పాటుచేశారు. మొత్తం 2.47 కోట్ల సర్వే నంబర్లలోని భూమిని కొలిచి కొత్తగా 86,80,246 ఎల్పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నంబర్లు జారీ చేశారు. 13,500 గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీఎం నెంబర్లు వచ్చింది అప్పుడే. 30 లక్షల మంది రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన భూహక్కు పత్రాలు ఇచ్చారు. పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్, ప్రతి భూమికీ జియో హద్దులు, ప్రతి పార్సిల్కూ ఐడీ నంబరు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్.. ఇలా ఇప్పుడు చంద్రబాబు చెప్పుకుంటున్న ప్రతిదీ అప్పటిదే. 2022 సెపె్టంబర్లో జారీ అయిన పాస్ పుస్తకాలపై ఆ క్యూఆర్ కోడ్ ఇప్పటికీ ఉంది. రైతుల చేతుల్లో ఆ సాక్ష్యం ఉండగా చంద్రబాబు కళ్లార్పకుండా చెబుతున్న అబద్ధాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.రీ సర్వే ఆపేస్తానని.. క్రెడిట్ దోపిడీ..రీసర్వే వల్ల రైతులకు నష్టమని, మీ భూములు ఎక్కడున్నాయో తెలుసుకుని ఆక్రమించడానికే ఈ సర్వే అని.. ఇక మీ భూములు మీవి కావని, తాము అధికారంలోకి రాగానే రీసర్వేను ఆపేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు ఊరూవాడా హోరెత్తించారు. అయితే, అధికారంలోకి వచ్చాక ఏడాది పాటు రీసర్వేను నిజంగానే నిలిపివేశారు. ఆ తర్వాత అదే చంద్రబాబు రాష్ట్రంలో రీసర్వే అద్భుతంగా జరిగిందని కేంద్రానికి లేఖ రాసి రూ.500 కోట్ల రాయితీని సిగ్గులేకుండా తెచ్చుకున్నారు. ఆ డబ్బు వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన పనికి. ఇలా ఢిల్లీలో గొప్పలకు పోవడం.. రాష్ట్రంలో బురదజల్లడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి.. చంద్రబాబు వచ్చాక ఒక్క గ్రామంలో కూడా రీసర్వే పూర్తికాలేదు.రాజముద్ర వేసి తానే చేశానంటే సరా?.. ఇక పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చానని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. పుస్తకంలో రైతుకు ఉపయోగపడేది బొమ్మ కాదు, క్యూఆర్ కోడ్, జియో హద్దులు, ఎల్పీఎం నంబరు. ఆ మూడూ ఎక్కడివో బాబుకు బాగా తెలుసు. లోగో మార్చడం సంస్కరణ కాదు. అలాగే, స్టిక్కర్ మార్చి చరిత్ర సృష్టించినట్లు డప్పు కొట్టుకోవడం ఆయన అవివేకం. జగన్ హయాంలో పాతిన సర్వే రాళ్లపై నవరత్నాల లోగో ఉందని, సీఎం ఫొటో ఉందని ఆయన ఇప్పటికీ విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిజానికి అది వాటర్‌మార్క్ లోగో మాత్రమే. సర్వే ఎప్పుడు జరిగిందో, ఏ ప్రామాణికతతో జరిగిందో శాశ్వతంగా గుర్తుండేందుకు వేసిన ముద్ర. అది తప్పయితే ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంప్లెట్ల నుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు?.22–ఏ నుంచి 16 లక్షలు ఎకరాలు తీసేశారా? మరోవైపు.. 16 లక్షల ఎకరాలను 22–ఏ జాబితా నుంచి తొలగించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు అసలు వాటిని అందులో పెట్టింది తానేననే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే.. 2024లో అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో 20 లక్షల ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టింది సాక్షాత్తు చంద్రబాబే. అందులో 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనాధీనం భూములు ఉన్నాయి. అనేక విచారణల తర్వాత ఆ భూములన్నీ సక్రమమేనని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో.. తప్పు ఒప్పుకోవడం మానేసి, ఇప్పుడు వాటిని తొలగిస్తూ తానే విముక్తి కల్పించానని సిగ్గులేకుండా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇక జగన్ హయాంలో ఏకకాలంలో వేల గ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడం లేదు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్వే బృందాలను కుదించి, రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుతున్నారు. పైగా.. ఇప్పుడు ఆటో మ్యుటేషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా అది రీ సర్వేలో భాగంగానే గతంలోనే మొదలైందన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. మార్చిలోగా అన్ని భూ సమస్యలకు పరిష్కారమా? ఇదిలా ఉంటే.. మార్చిలోపు రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేస్తానని చంద్రబాబు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. గడచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క భూ సమస్యను పరిష్కరించలేక ప్రతీ సమావేశంలోనూ అధికారులపై నిందలు వేస్తున్నారు. పీజీఆర్ఎస్లో ఏడు లక్షలకు పైగా భూ సమస్యలపై అర్జీలు వస్తే 6.20 లక్షలు పరిష్కరించేసినట్లు ప్రకటించుకున్నారు. అందులో ఒక్క శాతం సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోకపోయినా అయినట్లు మెసేజ్‌లు పంపారు. అయితే, మార్చికల్లా చంద్రబాబు చూపే పరిష్కారం కూడా ఇలాగే ఉంటుందని జనం ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఇలా ప్రతీనెలా ‘మీ భూమి–మీ హక్కు’ పేరుతో ఓ సభ.. అదే అబద్ధాల ప్రసంగం చేయడం ఆయనకు అలవాటుగా మారింది. కానీ, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరిగే పీజీఆర్ఎస్కు వచ్చే ఫిర్యాదులు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా.. ఒక్కటీ పరిష్కారం కావడంలేదు. అయినా చంద్రబాబు మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. -
స్కామ్‌పై సర్కారు సైలెన్స్!
సాక్షి, అమరావతి: ‘‘అర్హత లేనివారికి టీచర్ పోస్టులా? అనర్హులను ఎందుకు నియమిస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా చెలగాటమాడతారు? అడ్డదారి నియామకాలతో తరతరాల భవిష్యత్తు నాశనమే. నిర్దేశిత అర్హతలు లేనివారిని నియమిస్తే.. అలాంటి వారిని సర్వీసులో కొనసాగించొద్దు..’’ ఉపాధ్యాయుల నియామకాలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలివీ! » మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఉమ్మడి ప్రకాశం జిల్లా పుల్లల చెరువు జడ్పీ స్కూల్ టీచర్ పీవీసీహెచ్ బసవేశ్వరరావు 2015లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో చాంపియన్ షిప్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాడు. అయితే ఆయన చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేదని.. తమ వద్ద అలాంటి సమాచారం ఏదీ లేదని ఏపీ ఖోఖో అసోసియేషన్ స్వయంగా శాప్‌కు సమాచారం ఇచ్చినా టీచర్ పోస్టు కట్టబెట్టారు. » 2013లో ఖమ్మంలో రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సీనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించినట్టు సర్టిఫికెట్ సమర్పించిన ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం పొందింది. అయితే తాము అలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని జూడో అసోసియేషన్ (తెలంగాణ) రాష్ట్ర కార్యదర్శి కైలాష్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ‘బోగస్’ గుట్టురట్టు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం స్పోర్ట్స్ కోటాను కొల్లగొట్టేందుకు పెద్దగా పరిచయం లేని మార్షల్ ఆర్ట్స్ క్రీడ ’కురాష్ ’ను తెరపైకి తెచ్చారు. 2016 నుంచి 2023 మధ్య ఏకంగా 1,500 వరకు నకిలీ సర్టిఫికెట్లతో సాగించిన భారీ కుంభకోణాన్ని ఇటీవల పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. జరగని పోటీలను జరిగినట్లుగా చూపిస్తూ, మహిళల ఈవెంట్లలో పురుషుల పేర్లు చేర్చడంతోపాటు జిల్లా పేర్లను మార్చి జారీ చేసిన ఈ బోగస్ సర్టిఫికెట్లతో ఇప్పటికే 71 మంది (పోలీస్, ఇతర విభాగాల్లో) ఉద్యోగాలు పొందగా, ఎంపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల్లోనూ వీటితో లబ్ధి పొందారని దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌కు సంబంధించి అసోసియేషన్ కార్యదర్శి, అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. భవిష్యత్‌లో మోసాలను అరికట్టేందుకు డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్‌చెయిన్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీలో ఎదురు దాడి...! మెగా డీఎస్సీ 2025 అక్రమాలు కళ్లకు కట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా బాధిత అభ్యర్థులు బయటకు వస్తున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా బుకాయిస్తూ ఎదురుదాడికి దిగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. యువగళం దళానికి టీచర్ పోస్టులు కట్టబెట్టింది. అందుకోసం ఏకంగా కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కేటగిరీలో దొడ్డిదారిన కట్టబెట్టింది. అక్రమాలకు గేట్లు ఎత్తి ఆ తర్వాత జీవోలు మార్చేసింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, రోడ్డెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఏకంగా కులం, మతం కూడా మార్చేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించిన దుర్గయ్యకు పోస్టు ఇవ్వలేదు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిని టీచర్లుగా నియమించారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్‌కు ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాంటి అక్రమాలు వరుసగా వెలుగు చూశాయి. పలువురు అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో తమకు సంబంధం లేదని స్వయంగా ఆయా అసోసియేషన్లే ప్రకటించాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కారు చలించకపోవడం.. స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై తేల్చేందుకు మహారాష్ట్ర తరహాలో డిజిటల్ వెరిఫికేషన్, బ్లాక్ చెయిన్ లాంటి విధానాలను తేకపోవడం మెగా డీఎస్సీ స్కామ్‌కు పక్కా నిదర్శనమని విద్యావేత్తలు, రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించడంతోపాటు విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని సూచిస్తున్నారు.స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామ్‌కిషోర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు నెల్లూరు (టౌన్): మెగా డీఎస్సీలో ఎక్కువ మంది స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని రాష్ట్ర జూడో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది అసలు క్రీడాకారులే కాదు. నిజమైన క్రీడాకారులు ఈ విషయాన్ని బయట చెప్పుకోలేరన్నారు. ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు... ‘కర్నూలు జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ జూడో ఫేక్ సర్టిఫికెట్లతోనే ఉద్యోగం పొందారు. 2018లో నెల్లూరులోని ఇన్ఫాంట్ జీసస్ స్కూల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్ పెట్టారు. అయితే ఇస్మాయిల్ ఆ పోటీల్లో పాల్గొనలేదు. ఆ సమయంలో నేనే నెల్లూరు జిల్లా జూడో ప్రెసిడెంట్‌గా ఉన్నా. ఏ ఛాంపియన్షిప్ జరిగినా జిల్లా అసోసియేషన్ దగ్గర ఒక రికార్డు, జిల్లా శాప్ కార్యాలయంలో ఒక రికార్డు, రాష్ట్ర శాప్ కార్యాలయంలో ఇంకో రికార్డు కలిపి మొత్తం 3 రికార్డులు ఉంటాయి. కానీ, వీటిని ట్యాంపర్ చేసి పేర్లు మార్చారు. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మెగా డీఎస్సీలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌కు కొరియర్లో లేఖలు పంపా. అక్రమాలు బయట పెట్టానన్న అక్కసుతో నన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ అక్రమాలపై కోర్టులో కూడా కేసులు వేశా. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని రామకిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. -
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
సాక్షి, గుంటూరు: చంద్రబాబు పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నాబత్తుని శివకుమార్, అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్ర బాబు, నియోజకవర్గ పరిశీలకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బయటపడకుండా చంద్రబాబు, లోకేష్ పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు. టీడీపీ వెన్నుపోటు పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సిందే.. గెలవాల్సిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వైఎస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తే.. కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు.మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో ఉన్న పార్టీలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెమీ ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు మిమ్మల్ని గెలిపిస్తారు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నాయకులను గెలిపించాలి. పార్టీ జెండా మోసిన ప్రతి వ్యక్తి మా మా బిడ్డ లాంటి వాళ్లే. -
అరెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తే పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని, వారి భాషలోనే అంతకన్నా బలంగా సమాధానం ఇస్తామని.. తమ హుందాతనాన్ని చేతకానితనంగా భావించవద్దని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహనం నశించేలా తమను రెచ్చగొడితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సంబంధించిన అంశాలపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.2014 నుంచి 2019 మధ్య కాలంలో ఫైబర్ నెట్, ఇసుక, మద్యం, అమరావతి భూములు, స్కిల్ డెవలప్మెంట్ వంటి అనేక స్కామ్‌లకు పాల్పడి, కోట్లు కొల్లగొట్టి, జైలుకు వెళ్లి మెడికల్ బెయిల్‌పై బయటికి వచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్టస్ పేరుతో ఆ కేసులను కొట్టేయించుకున్న విధానంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మా సహనాన్ని తక్కువ అంచనా వేయొద్దు:వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేస్తే చూస్తూ ఊరుకోం. మా హుందాతనం చేతకానితనం అనుకోవద్దు. మీరు రాళ్లు వేస్తే మేము బండలు వేయగలం. మీరు పూలు పెడితే మేము పుష్పగుచ్ఛాలు ఇవ్వగలం. మీరు బూతులు తిడితే మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము హుందాగా మాట్లాడుతున్నామంటే చేతకాక కాదు. మాపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయంగా విమర్శిస్తే రాజకీయంగానే సమాధానం ఇస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనే దానిపై మాట్లాడాలి.కానీ చంద్రబాబు మాట్లాడటం మొదలుపెడితే బూతులు, అబద్ధ ప్రచారం, విషప్రచారం తప్ప మరేమీ కనిపించడం లేదు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిపై వ్యక్తిగతంగా, నీచంగా మాట్లాడటం సరైంది కాదు. ముఖ్యమంత్రి అనే స్థాయిని చంద్రబాబు మర్చిపోకూడదు.2014 నుంచి 2019 మధ్య ఫైబర్‌నెట్, ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. స్కిల్ కేసులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణలతో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే కోర్టు జైలుకు పంపింది. అలాంటిది కేసులు, అరెస్టులు, రిమాండ్లకు సంబంధించిన విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఏ విధమైన రాజకీయ సంస్కతి? తప్పు చేయకుండా ఒక సిద్ధాంతం కోసం పోరాడి జైలుకు వెళ్లినవాళ్లు గొప్పగా చెప్పుకుంటారు.కానీ తన అరెస్టును చంద్రబాబు సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు. స్కిల్ కేసులో అరెస్టు కాబటి జైల్లో ఉండొచ్చిన చంద్రబాబు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాడు? ఆయన మెడికల్ గ్రౌండ్స్‌పై బెయిల్ వచ్చాడే కానీ కేసుల్లో నిజాయితీ పరుడిగా నిర్ధారణ కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ పేరుతో తొలగించేసుకుంటున్నాడు.ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తనపై ఉన్న కేసులను తొలగించుకోవడానికా? లేక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. కేసుల విషయంలో కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే నిర్ణయాలపై కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలి.లోకేశ్ బాగోతం బయట పెట్టమంటారా?వైఎస్ జగన్ చదువుల కోసం అమెరికా వెళ్లి హోమ్‌సిక్‌తో తిరిగి రావడం ఏమైనా పెద్ద తప్పా? చదువు కోసం అమెరికా వెళ్లి తల్లిదండ్రులను విడిచి ఉండలేక తిరిగి రావడాన్ని కూడా రాజకీయ విమర్శగా ఉపయోగించుకోవడం అన్యాయం. అప్పట్లో వైఎస్సార్.. చంద్రబాబు వ్యాఖ్యలకు ఇచ్చిన సమాధానం ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న చంద్రబాబు.. ముందుగా తన కుటుంబానికి సంబంధించిన ఆరోపణలపై సమాధానం చెప్పాలి. నారా లోకేష్‌కు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇతరుల వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే ముందు తన కుటుంబంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనాలు అన్నీ మర్చిపోయారు, తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకోవద్దు.దస్తగిరి టీడీపీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు?వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి టీడీపీ కార్యాలయంలో ఏం పని? ఆయనకు న్యాయ సహాయం ఎవరు అందించారు? ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత వైఎస్ జగన్ గురించి మాట్లాడాలి. మేము హుందాగా మాట్లాడుతున్నాం. అంతే తప్ప, అది తమ బలహీనత కాదన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని వీరశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్
-
రోజులన్నీ ఒకేలా ఉండవు.. చంద్రబాబు లాంటోడే జైలుకు వెళ్ళాడు నువ్వెంత
-
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కామ్ నుంచి డీఎస్సీ వరకు అవినీతి, అక్రమాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా సంబరాలు చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్‌కు పరిపాటిగా మారిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. చంద్రబాబుపై స్కిల్ కేసు పెట్టింది వైఎస్ జగన్ కాదు.. ఈడీ పెట్టింది. కానీ తనపై వైఎస్ జగన్ కేసులు పెట్టించాడంటూ అన్యాయంగా మాట్లాడుతున్నారు. అనారోగ్య సమస్యలు చూపించి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ నరేంద్ర మండిపడ్డారు.‘‘అధికారులను భయపెట్టి తనపై ఉన్న కేసులను వెనక్కి తీసుకునేలా చేసుకుంటున్నారు. తనపై కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం సిగ్గుచేటు. చంద్రబాబు నేరం చేసినట్లు ఛార్జ్ షీట్ లో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం మారిన తరువాత వరుసగా కేసులు క్లోజ్ అవుతున్నాయి. స్కిల్ కేసులో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. స్కిల్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటున్నారు. ఆ లెటర్ బయట పెట్టగలరా?.సిద్ధార్థ లూథ్రాకి ఏ అధికారంతో ఏపీ పోలీసు అధికారులతో సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారంలోకి రాకుండా ఉంటే జీవిత కాలం జైల్లో ఉండే కేసులు ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ జైలుకి వెళ్ళడం ఖాయం’’ అని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. -
సెప్టెంబర్‌లోనే నా పాదయాత్ర రాసిపెట్టుకోండి హిస్టరీ రిపీట్ చేద్దాం
-
కూటమి పాలనలో ‘ధరల’ పిడుగు.. ఇదేనా చంద్రబాబు, పవన్‌ల సంపద సృష్టి?
శాసనసభ ఎన్నికలకు ముందు నిత్యావసర సరుకుల ధరలపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏమిటి?ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అసాధారణ రీతిలో ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే ఏ సాకులు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. అందుకు ఎల్లో మీడియా బాండ్ బాజా వాయిస్తోంది. ధరల నియంత్రణకు ఏమి చేస్తున్నది మాత్రం తెలియడం లేదు.ధరాఘాతానికి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలోనే ధరలు ఎలా పెరిగాయో గమనించండి. సన్నబియ్యం ధర 2024 ఏప్రిల్ లో కిలో 40 నుంచి 45 రూపాయలు ఉండగా, ఈ ఏడాది ఆగస్టులో ఇదే బియ్యం ధర 70 నుంచి 80 రూపాయలవరకు ఉన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వంట నూనెలు అప్పట్లో 90 నుంచి 106 రూపాయల వరకు ఉంటే, ఇప్పుడు 170 నుంచి 195 రూపాయల వరకు ఉంది. అంటే ఏకంగా అరవై నుంచి తొంభై రూపాయల వరకు పెరగడం అసాధారణమని చెప్పాలి. పంచదార ధర కిలోకి పాతిక నుంచి 30 రూపాయల వరకు పెరిగింది. ఉల్లి ధర సుమారు 40 రూపాయలు, ఎండు మిర్చి ధర సుమారు 150 నుంచి 200 రూపాయలకు పైగా పెరగడం ఆందోళన కలిగించే అంశమే. వినియోగదారులపై ఒకరకంగా ధరల పిడుగుపడిన చందమే అనిపిస్తుంది. కందిపప్పు, చింతపండు వంటి సరుకుల ధరలు కూడా బాగా పెరిగాయి.ఇక ఇసుకను ఉచితం అన్నప్పటికీ, ఇళ్ల నిర్మాణం చేసుకునేవారు లారీకి 20 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. మద్యం ధరలు పెరగనే పెరగవు అన్నట్లుగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో మద్యం ధరలు సైతం పెరుగుతున్న తీరుపై మద్యం ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల బాదుడు కూడా గణనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ చార్జీలు కూడా 15 శాతం వరకు పెరిగినట్లు చెబుతున్నారు.పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వీటి ధర పెరిగినప్పుడల్లా ప్రభుత్వానికి అదనంగా వాట్ రూపేణా ఆదాయం సమకూరుతోంది.ఆయా వస్తువుల ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయాలు కూడా అధికం అవుతాయి. అయినా ఏపీలో అప్పులు మాత్రం నానాటికి పెరుగుతున్నాయే తప్ప, అదుపులో ఉండడం లేదు. ఈ ఇరవై ఆరు నెలల్లోనే ఏపీలో అన్ని రకాల అప్పులు కలిసి 3.86 లక్షల కోట్లకు చేరాయి.ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అని అంతా వ్యంగ్యంగా అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులకు సంబంధించి అసలుతో పాటు వడ్డీలు చెల్లించవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంటుంది. అమరావతి పేరుతో ఇప్పటికే ఏభైవేల కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. అప్పులన్నిటిని ఏమి చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేసి ఉంటే అందరికి తెలిసేది. కానీ అప్పుల వినియోగంపై ఎవరూ ప్రభుత్వ పక్షాన వివరణ ఇవ్వడం లేదు.ఇంత అప్పు చేసినా ఆయా చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు జల జీవన్ కాంట్రాక్టర్లు ధర్నా చేసినా ఫలితం దక్కినట్లు లేదు. ఏలూరులో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్ల వాచ్మన్లు ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నది వారి ఆవేదనగా ఉంది. జూనియర్ డాక్టర్ లు తమ స్టైపండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే ఆంధ్ర సమాజం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోతోందా అన్న సందేహాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో అవినీతి మాత్రం దూసుకుపోతోందని సెంటర్ ఫర్ లిబర్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ సైతం కొందరు ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణల వల్ల ఎన్డీఏ పనులు ప్రజలలోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాల గురించి రాయాలంటే చాంతాడంత లిస్టు అవుతుంది.ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌లు ఏమని ప్రచారం చేశారో గుర్తు చేసుకోండి.పెట్రోల్,డీజిల్ పై వ్యాట్ అధికంగా ఉందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని తగ్గిస్తామని, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు తగ్గిపోతాయని ప్రచారం చేశారు. కర్నాటకలోని కొన్ని బంకుల వద్దకు వెళ్లి పోటోలు దిగి, అప్పటి జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు నాయుడు అయితే ధరల రెక్కలు విరిచివేస్తామని ఊదరగొట్టారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. సీన్ కట్ చేస్తే, కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్క వస్తువు ధర తగ్గలేదు సరికదా.. పెక్కింటి ధరలు అమాంతంగా దాదాపు రెట్టింపు అయ్యాయి.ఇదే టైంలో రైతులకు న్యాయం జరిగిందా అంటే అది లేదు. పంటలు చేతికి వచ్చినప్పుడు ధరలు పడిపోయి వారంతా తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతుల చేతుల నుంచి పంట వ్యాపారుల వద్దకు చేరాక మాత్రం రేట్లు పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణమన్న భావన ఉంది. ఇలాంటి సమయాలలో విజిలెన్స్ అధికారులు తగు చర్యలు తీసుకుని ధరలను నియంత్రిస్తారు. కాని ఇప్పుడు అది ఎంతవరకు జరుగుతోంది తెలియదు. చంద్రబాబు, లోకేశ్‌లు తమ వాగ్దానం ప్రకారం వ్యాట్ ను తగ్గించి ఉండవచ్చు. అది వారి చేతిలో పని. ఎన్నికల హామీ కూడా ఉన్నందున వారు ఆ పని చేసి, సరుకుల ధరలు తగ్గించడానికి ప్రయత్నించి ఉంటే కాస్త పేరు వచ్చేది. కానీ వారు ఆ పని చేయడం లేదు. అంటే ఇక్కడ కూడా ప్రజలను ఢోకా చేసినట్లే కదా అన్న విమర్శను విపక్షం చేస్తోంది.అయితే ఎల్లో మీడియా ఈ ధరల సమస్యను పక్కదారి పట్టించడానికి తంటాలు పడుతోంది. ఇదంతా కరువు వల్ల, యుద్దం వల్ల అని ప్రచారం ఆరంభించాయి. లేకుంటే వ్యాపారుల తీరుతో కష్టాలు వస్తున్నాయని టిడిపి మీడియా అంటోంది. వారిని కంట్రోల్ చేయవలసిన ప్రభుత్వం వైఫల్యం చెందినట్లే కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని సలహా ఇవ్వలేకపోయింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండేళ్లపాటు కరోనా సంక్షోభం ఉన్నా, అప్పట్లోనే ఉక్రెయిన్- రష్యా యుద్దం ఆరంభమైనా, ఏ మాత్రం కనికరం లేకుండా ఎల్లో మీడియా ప్రభుత్వంపై పలు వ్యతిరేక కథనాలు రాసి ప్రజలను రెచ్చగొట్టే యత్నం చేసేవి. చంద్రబాబు, లోకేష్ తదితరులు అచ్చంగా అదే పనిలో ఉండేవారు. అప్పటికన్నా పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గానే ఉన్నా ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని అనుకుంటే ధరల బారిన పడి ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి తను పడుతున్న కష్టం తెలియదా!కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు


