వైఫల్యాలపై నిలదీస్తాం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం: లేళ్ల అప్పిరెడ్డి | We Will Question Failures Of Chandrababu Govt: Lella Appireddy | Sakshi
Sakshi News home page

వైఫల్యాలపై నిలదీస్తాం.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాం: లేళ్ల అప్పిరెడ్డి

Feb 12 2026 5:03 PM | Updated on Feb 12 2026 5:24 PM

We Will Question Failures Of Chandrababu Govt: Lella Appireddy

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కారణంగా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని.. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల గొంతును వినిపిస్తే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందన్నారు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసు అన్నట్టుగా వ్యవహారం నడుస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో గట్టిగా నిలదీస్తాం. అన్యాయపు పోకడలను గట్టిగా ప్రశ్నిస్తామని లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.

‘‘అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్టు చేయటం నుండి మా నేతలపై అక్రమ కేసుల వరకు చర్చిస్తాం. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. మా హయాంలో నాణ్యత లేని నెయ్యి టాంకర్లను వెనక్కు పంపాం. అవన్నీ పక్కాగా రికార్డులు కూడా ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే నాణ్యత లేని నెయ్యి వచ్చినట్టు సీబిఐ కూడా చెప్పింది. వీటన్నిటి పై మండలిలో గట్టిగా ప్రశ్నిస్తాం

..సగటు హిందువు వినటానికి కూడా భయపడేలాంటి మాటలు చంద్రబాబు మాట్లాడారు. దీనిపై చంద్రబాబు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. వేల కోట్ల విలువైన భూములను తమవారికి దోచి పెడుతున్నారు. గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టారు. వీటన్నిటిపై మండలిలో చర్చిస్తాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు: లేళ్ల అప్పిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement