ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్‌ సీరియస్‌ | Hyderabad CP VC Sajjanar Serious On Woman Social Media Reel For Risking Kids Lives, Video Went Viral | Sakshi
Sakshi News home page

ఓ తల్లి మూర్ఖత్వంపై సజ్జనార్‌ సీరియస్‌

Feb 7 2026 2:37 PM | Updated on Feb 7 2026 2:55 PM

Hyderabad CP VC Sajjanar Serious On Social Media Reel

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో రీల్స్‌ పిచ్చితో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఫేమ్‌ అవడం, వ్యూస్‌ పిచ్చిలో పడిపోయి.. ఏం చేస్తున్నారో తెలియక కొన్ని పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ తన్న బిడ్డల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. బావిపై నిలుచుని ప్రమాదకరంగా వీడియో తీసింది. ఈ వీడియోపై హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీపీ సజ్జనార్‌ ట్విట్టర్‌ వేదికగా వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా..‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!. కన్న బిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యా సదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి అంటూ హెచ్చరించారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement