అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత కుర్రాళ్లు మళ్లీ అదరగొట్టారు. అద్భుత ఆటతో అండర్–19 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో పాటు కెప్టెన్ ఆయుశ్ మాత్రే రాణించడంతో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ యువ జట్టును ఓడించింది.
భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311పరుగులకు ఆలౌటైంది.
భారత్ అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఇది ఆరో సారి కావడం విశేషం.
ఈ టోర్నీలో ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్ అజేయంగాముగించింది.


