అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్‌.. భారీ దొంగతనం | Karnataka Woman Reports Jewellery Theft From Baggage During US Trip On Bengaluru–Abu Dhabi Flight | Sakshi
Sakshi News home page

అమెరికా ప్రయాణంలో కర్ణాటక మహిళకు షాక్‌.. భారీ దొంగతనం

Feb 4 2026 8:19 AM | Updated on Feb 4 2026 9:57 AM

Karnataka woman reports jewellery theft from baggage during US trip

అబుదాబి: విమాన ప్రయాణంలో అమెరికాకు చెందిన ఓ వృద్ధురాలికి షాకింగ్‌ ఘటన ఎదురైంది. విమాన ప్రయాణం సందర్బంగా తన లాగేజీలోని బంగారం, వజ్రాలు మాయం కావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

క‍ర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన శాంత రమేష్ కాశింకుంటి (62) కుటుంబ సభ్యులు.. నవంబర్ 15, 2025న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అమెరికాకు ప్రయాణించారు. బెంగళూరు నుండి ఆకాష్ ఎయిర్‌లైన్స్‌లో అబుదాబి చేరుకున్నారు. అయితే, బెంగళూరు విమానాశ్రయంలోని చెక్-ఇన్ కౌంటర్‌లో అన్ని పత్రాలను ధృవీకరించిన తర్వాత వారు తమ లగేజీని అప్పగించారు. అయితే, వారు అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తమ బ్యాగ్‌లోని విలువైన వస్తువులు పోయినట్టు వారు గుర్తించారు.

కాగా, తమ సూట్‌కేస్‌కు డ్యామేజీ లేకుండా, ఓపెన్‌ చేయకుండానే తమ వస్తువులు మాయం కావడంపై ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక, వారి లగేజీలో 790 గ్రాముల బంగారం, రూ.8 లక్షల విలువైన వజ్రాభరణాలు, అమెరికన్ డాలర్లు ఉన్నట్టు బాధితులు చెప్పుకొచ్చారు. వెంటనే ఈ విషయాన్ని అబుదాబి అధికారులకు, ఆకాష్‌ ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చామని, కానీ సరైన స్పందన రాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత జనవరి 7, 2026న భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం బాధితులు కర్ణాటక పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బెంగళూరు విమానాశ్రయ పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. భద్రతా సిబ్బందిని ప్రశ్నించడంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో పోలీసులు జనవరి 31న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement