వసంత వల్లభుని రథ సంభ్రమం | - | Sakshi
Sakshi News home page

వసంత వల్లభుని రథ సంభ్రమం

Feb 4 2026 7:28 AM | Updated on Feb 4 2026 7:28 AM

వసంత

వసంత వల్లభుని రథ సంభ్రమం

బనశంకరి: తిరుమల వెంకటేశ్వరస్వామితో సమానమైన సిలికాన్‌ సిటీలోని వసంతపుర వసంతవల్లభరాయస్వామి దేవస్థానం బ్రహ్మ రథోత్సవం భక్తజనవాహిని మధ్య గోవింద నామస్మరణతో ఆనందోత్సాహాలతో జరిగింది. వల్లభరాయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు వీఆర్‌.రఘురామబట్టర్‌ బృందం మూలవిరాట్‌ ప్రత్యేక అభిషేకం, అర్చనలు, విశేష అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. మేళతాళాలతో స్వామివారి కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి తేరులో ప్రతిష్టించారు. వసంత వల్లభుని ఉత్సవమూర్తులను పల్లకీలో మంగళవాయిద్యాలతో ఎమ్మెల్యే ఎం.కృష్ణప్ప , ఆలయ ఈవో లక్ష్మీ, ఆలయ ప్రముఖులు కే.కుమార్‌, ఎన్‌.శ్యామణ్ణ, ఎం.నాగరత్న, బీ.సుజాత,ఎం.చేతన్‌, శ్రీనివాస్‌, కేసీ.సోమశేఖర్‌ తదితరులు తేరులో ఆసీనుల్ని చేశారు.

రథోత్సవం

రథ చక్రాలకు టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. గోవిందా, వేంకటరమణా అంటూ భక్తజనం తేరును లాగగానే రథం మీదకు అరటిపండ్లు, దవనం విసిరారు. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, ఏపీ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో కిక్కిరిసింది. జానపద కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి. స్థానికులు శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం, పానీయాలను పంపిణీ చేశారు.

వైభవంగా తేరు ఉత్సవం

తరలివచ్చిన భక్త సాగరం

వసంత వల్లభుని రథ సంభ్రమం1
1/3

వసంత వల్లభుని రథ సంభ్రమం

వసంత వల్లభుని రథ సంభ్రమం2
2/3

వసంత వల్లభుని రథ సంభ్రమం

వసంత వల్లభుని రథ సంభ్రమం3
3/3

వసంత వల్లభుని రథ సంభ్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement