breaking news
Karnataka News
-
ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి బుల్లెట్ బైక్‌లో ఇంటికి వస్తున్న టెక్కీ.. కొంతసేపట్లో ఇంటికి చేరుకోనుండగా కిందపడి దుర్మరణం చెందాడు. కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడని తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు, అయితే విధి చిన్నచూపు చూసి శోకం మిగిల్చింది. వివరాలు.. తాడిపత్రి పట్టణంలో కడవ చలపతి, జయమ్మ దంపతులు ఉంటున్నారు. చలపతి ఓ గ్రానైట్ షాపులో గుమాస్తా పని చేసేవాడు. వీరికి ఒక కుమారుడు బాలాజీ (26), కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు బాలాజీ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత 3 ఏళ్లుగా చైన్నెలో కాగ్నిజెంట్‌లో పనిచేస్తూ ఏడాది నుంచి బెంగళూరులో టెక్ మహీంద్రలో ఉద్యోగంలోకి మారాడు. ఏడాదికి రూ. 14 లక్షల వేతనం వచ్చేది. వర్క్ ఫ్రం హోం అని.. 15 రోజులు ఆఫీసులో, 15 రోజులు వర్క్ ఫ్రం హోం కింద విధులు నిర్వహించాలి, వర్క్ ఫ్రం హోం రావడంతో శనివారం తెల్లవారు జామున బెంగళూరు నుంచి బుల్లెట్ ద్విచక్ర వాహనంలో ఇంటికి బయల్దేరాడు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం – తాడిపత్రి హైవేలో అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాలు కాపాడలేక పోయింది. పెళ్లి చేద్దామనుకుంటిమే స్థానికులు చూసి జేబులో ఉన్న వివరాల ప్రకారం తండ్రి చలపతికి కాల్చేసి చెప్పగా పరుగున వచ్చారు. విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి బోరుమని విలపించాడు. కుమారునికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంకా కొన్ని రోజులు ఆగండి నాన్నా, మంచి జీతం వస్తుంది, అప్పుడు చేసుకుంటానని చెప్పిన మాటలు తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. వర్క్ ఫ్రం హోం ఉందని చెప్పి ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు వెల్లిపోయావా అంటూ కుమారున్ని పట్టుకుని రోదించడం చూసి అందరూ కంటతడి పెట్టారు. బైక్ ప్రమాదంలో టెక్కీ దుర్మరణం బెంగళూరు నుంచి తాడిపత్రికి వెళ్తుండగా ఘటన -
కారుపై కూలిన చెట్టు
కృష్ణరాజపురం: చలిస్తున్న కారుపై భారీ వృక్షం పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. వివరాలు.. శుక్రవారం సాయంత్రం బెంగళూరు శేషాద్రిపురం లా కాలేజీ వద్ద ఉన్న పెద్ద చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. రోడ్డు మీద వెళ్తున్న కారు మీద పడిపోయింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు, డ్రైవర్ కూడా సురక్షితంగా తప్పించుకున్నాడు. అలాగే చెట్టు కొమ్మలు తగిలి 3 విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి.20న బోనాల జాతర బొమ్మనహళ్లి: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలు బెంగళూరు నగరంలో జూలై 20వ తేదీన జరగనున్నాయి. తెలంగాణవాసులతో పాటు తెలుగు ప్రజలు అందరూ పాల్గొనాలని కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. బెంగళూరు కళ్యాణ నగరలో ఉన్న ఓంశక్తి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు జరుగుతాయని చెప్పారు. పసికందును అమ్మేసిన తండ్రి ● అప్పులు తీర్చడానికి అకృత్యం యశవంతపుర: మైక్రో ఫైనాన్స్‌లో సహా పలు చోట్ల చేసిన అప్పులు తీర్చడానికి ఓ తండ్రి 20 రోజుల బిడ్డను అమ్మిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా దాండేలి తాలూకా దేశపాండే నగరలో జరిగింది. శిశువును రూ. 3 లక్షలకు అమ్మారు. వివరాలు.. జూన్ 17న వసీం చందు పటేల్ భార్య మోహీన్ దాండేలి ప్రభుత్వ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. వసీం అనేక చోట్ల అప్పులు చేశాడు. తీర్చాలని ఒత్తిడి అధికమైంది. అప్పులు తీర్చే శక్తి లేని వసీంకు కిరాతకమైన ఆలోచన వచ్చింది. భార్యకు తెలియకుండా శిశువును అమ్మకానికి పెట్టాడు. బెళగావి జిల్లా అనగోళకు చెందిన నూరు మహమ్మద్ అబ్దుల్ మజీద్ (47), కిశన్ ఐరేకర్ (42) అనేవారు శిశువును కొనుగోలు చేశారు. కొడుకు కనిపించకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి అంగనవాడి కార్యకర్తకు చెప్పగా, ఆమె దాండేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో శిశువును తండ్రే అమ్మినట్లు తేలింది. కొనుగోలుచేసిన వారి కోసం గాలిస్తున్నారు. భార్య ముక్కును కొరికేశాడు దొడ్డబళ్లాపురం: అప్పు కంతు కట్టలేదనే కోపంతో భర్త, భార్య ముక్కును కొరికేసిన వింత సంఘటన దావణగెరెలో వద్ద జరిగింది. జిల్లాలో చన్నగిరి తాలూకా మంటరగట్టలో విజయ్, భార్య విద్య జీవిస్తున్నారు. వీరు ధర్మస్థలం స్వసహాయ సంఘంలో రూ.2 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే విద్య సరిగా కంతులు కట్టడం లేదని భర్త గొడవపడ్డారు. కోపం పట్టలేక ఆమె ముక్కును కొరికివేశాడు. దీంతో ముక్కు కొంతభాగం తెగిపోయింది. ఇరుగుపొరుగు విద్యను ఆస్పత్రికి తరలించారు, ఆమె చికిత్స పొందుతోంది. చన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
రిఫైనరీలో గ్యాస్ లీక్
● ఇద్దరు ఉద్యోగులు మృతి యశవంతపుర: మంగళూరు రిఫైనరీ, పెట్రో కెమికల్స్ సంస్థ (ఎంఆర్‌పీఎల్)లో గ్యాస్ పంపిణీ ప్రాంతంలో ట్యాంక్ నుంచి హానికర గ్యాస్ లీక్ కావటంతో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సీనియర్ ఆపరేటర్లు యూపీవాసి దీప చంద్ర (33), కేరళవాసి బిజిల్ ప్రసాద్ (33) మృతులు. సాధారణ తనిఖీల కోసం ట్యాంక్ ప్లాట్ఫారం ఎక్కారు. లీకైన వాయువులను పీల్చడంతో ఇద్దరు ట్యాంక్‌పైనే సృహతప్పి పడిపోయారు. వారిని రక్షించడానికి యత్నించిన మూడో ఆపరేటర్ వినాయక్ మైగేరి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అందరినీ ఆస్పత్రికి తరలించగా పై ఇద్దరూ చనిపోయారు. సంస్థ ఉన్నతాధికారులు ఘటనాస్థలిని పరిశీలించి, ఆస్పత్రికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు లీక్ కారణంగా ప్రమాదం జరిగినట్లు నగర పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు.వైద్యం చేయించలేక కూతురి హత్య ● తండ్రికి జీవితఖైదు యశవంతపుర: 11 ఏళ్ల కూతురికి పురుగుల మందు తాగించి హత్య చేసిన తండ్రికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.17 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా హెమ్మాడి గ్రామానికి చెందిన నాగరాజ పూజారి ఆర్థిక సమస్యలతో భార్య, పిల్లలపై దైహికంగా, మానసికంగా వేధించేవాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న కుమార్తె నయన (11)కు వైద్యానికి చాలా ఖర్చవుతోందని నిత్యం గొడవపడేవాడు. ఇది తట్టుకోలే భార్య భర్తను, కూతుర్ని వదిలేసి పుట్టింటికి వెళ్లింది. 2019 జనవరి 9న తాగిన మత్తులో నాగరాజు.. నయనకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. యల్లాపుర పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన జిల్లా కోర్టు జడ్జి ఈ మేరకు తీర్పు వెలువరించారు. తప్పుడు ఆరోపణలతో ఈడీ సోదాలు ● ఎమ్మెల్యే సుబ్బారెడ్డి భాగ్యనగరం (బాగేపల్లి): విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా ఆ మొత్తం ఆస్తులను అఫిడివిట్ ద్వారా ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని బాగేపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.ఎన్.సుబ్బారెడ్డి అన్నారు. తన నివాసాల్లో ఈడీ సోదాల తరువాత శనివారం బాగేపల్లికి వచ్చి సన్నిహితులతో సమావేశమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాపై ఓడిపోయిన అభ్యర్థి నకిలీ ఆరోపణలతో కేసులు పెట్టి, ఈడీకి ఫిర్యాదు చేశారన్నారు. దాడుల్లో ఈడీ అధికారులు కోరిన సమాచారం అంతా ఇచ్చానన్నారు. నేను విదేశాల్లో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినా మొత్తం ఆస్తులకు ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధమని ఈడీకి చెప్పానన్నారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాల్సిన అవసం నాకు లేదు. సంవత్సరానికి రూ. 130 కోట్ల టర్నోవర్ ఉన్న వ్యాపారనేత్తని, నా పిల్లలు లగ్జరీ కార్లు కలిగి ఉండడం తప్పా అని ప్రశ్నించారు. ఠాణాలో హల్చల్.. కటకటాలపాలు యశవంతపుర: వంచన కేసులో అరెస్టయిన మహిళకు మద్దతుగా వచ్చిన ఓ వ్యక్తి ఠాణాలో హల్‌చల్‌చేసి కటకటాల పాలయ్యాడు. బెంగళూరు బసవేశ్వరనగర ఠాణాలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. సవిత అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె పలువురి నుంచి డబ్బు వసూలు చేసినట్లు కేసులున్నాయి. సవిత వద్దనున్న ఇంటి తాళం కోసం నిందితుడు యోగానంద (52) వచ్చాడు. ఇంటి తాళం ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. దీంతో యోగానంద రెచ్చిపోయాడు, తాను న్యాయవాదినని, ప్రొఫెసర్‌నని, చాలామంది రాజకీయ నాయకులు తెలుసు, మీ సంగతి తేలుస్తానని అరుస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేశారు. -
యువకుడి దారుణ హత్య
శివమొగ్గ : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన శివమొగ్గ నగర శివారులోని బొమ్మనకట్టే లేఔట్‌లోని ఇ బ్లాక్‌లోని ఒక ఇంటి ఆవరణలో జరిగింది. హతుడిని బొమ్మనకట్టే ప్రాంతానికి చెందిన పవన్(28)గా గుర్తించారు. అతను టైల్స్ అచ్చువేసే పని చేసేవాడు. గురువారం రాత్రి పవన్.. శివకుమార్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు అక్కడే మద్యం సేవించి భోజనం చేశారు. ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్‌తో పవన్‌పై దాడి చేశారు. తీవ్ర గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ సంతోష్‌కుమార్, సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వినోభానగర్ పోలీసులు పవన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. -
సిరిగంధం అలంకరణ
బొమ్మనహళ్లి: ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామదేవత మారెమ్మదేవిని విశేషంగా అలంకరించారు. అర్చకులు వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం సిరిగంధంతో అలంకరించి పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని నిమ్మదొప్పెలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భట్కళ పట్టణం పేల్చేస్తామని బెదిరింపు బనశంకరి: ఉత్తరకన్నడ జిల్లా భట్కళ పట్టణం పేల్చేస్తామని దుండగులు భట్కళ శహర పోలీస్‌స్టేషన్‌కు గురువారం ఉదయం 10.30 గంటలకు ఇ–మెయిల్ పంపారు. దీంతో పోలీసులు బస్టాండ్, రైల్వేస్టేషన్‌తో పాటు ప్రముఖ స్థలాల్లో బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు కనబడకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కలప గోదాము దగ్ధం దొడ్డబళ్లాపురం: కలప గోదాము అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన నెలమంగల తాలూకా కెంపలింగనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి మార్గంలో మహేశ్ అనే వ్యక్తి ప్లైవుడ్ గోడౌన్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే లక్షల విలువ చేసే సరుకు కాలిపోయింది. నెలమంగల రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సిద్దరామయ్యే సీఎంగా కొనసాగుతారు ● మంత్రి కేహెచ్ మునియప్ప కోలారు: రాబోయే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యే కొనసాగుతారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పు గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ఓడీసీ సలహా మండలిలో పలువురు నాయకులు ఉన్నారు. సిద్దరామయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయనను కూడా చేర్చుకుని బాధ్యతలు అప్పగించారన్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని పలువురు స్వామీజీలు అంటుండడంపై మంత్రి స్పందిస్తూ ముఖ్యమంత్రి కావాలని ఆయన శ్రేయోభిలాషులు ఆకాక్షించడంలో తప్పు లేదు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీగా లేదన్నారు. ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకులపై దాడులు నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. దురుద్దేశ పూర్వకంగానే ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది బీజేపీకి శోభను తీసుకు రాదు, ఇలా చేయవద్దని తాను చాలా సార్లు చెప్పానన్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట్ల రైల్వే ఎఫ్ఓబీ(ఫ్లైఓవర్ బ్రిడ్జి) నిర్మాణాలతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి బళ్లారికి ప్రత్యేక రైలులో విచ్చేశారు. ఈ సందర్భంగా బళ్లారి రైల్వే స్టేషన్లో మాజీ మంత్రి శ్రీరాములు, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, రైల్వే క్రియాశీల సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి తదితరులు కలుసుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరస్వామి జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. రైల్వే స్టేషన్లలో సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లపై మంత్రికి విన్నవించారు. సమితి అందజేసిన మనవి పత్రానికి సానుకూలంగా స్పందించి వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైలు మార్గాలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని మోతీ సమీపంలో బ్రిడ్జి వెడల్పు చేయాలని, కనకదుర్గమ్మ ఆలయం వద్ద మయూర హోటల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, రేడియో పార్కు సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని, గుగ్గరహట్టి వద్ద ఫ్లైఓవర్, బైపాస్ వద్ద, దరోజీ సమీపంలో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని సమితి విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే ఎఫ్ఓబీల ఏర్పాటుకు చర్యలు కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమణ్ణ -
మాజీ ఎమ్మెల్సీ తిప్పణ్ణ కన్నుమూత
సాక్షి,బళ్లారి: సీనియర్ న్యాయవాది, మాజీ విధాన పరిషత్ సభ్యుడు, మాజీ అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తదితర ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన సీనియర్ రాజకీయ దురంధరుడు ఎన్.తిప్పణ్ణ(97) ఇక లేరు. ఆయన శుక్రవారం నగరంలోని తన నివాస గృహంలో వయస్సు రీత్యా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొందిన ఈయన అంచెలంచెలుగా ఎన్నో పదవులు చేపట్టారు. రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, మచ్చలేని నాయకుడుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించి, సభాపతిగా కూడా పని చేశారు. 2012 నుంచి అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నో సంవత్సరాలు సేవలందించారు. వీరశైవ లింగాయత్ సమాజంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పేదలకు తనదైన సేవలు అందించేవారు. విద్యాభివృద్ధికి ఇతోధిక కృషి వీరశైవ విద్యావర్ధక సంఘానికి అధ్యక్షుడుగా పని చేసి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నో సంవత్సరాల పాటు న్యాయవాదిగా కూడా పని చేయడంతో జిల్లా కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లో కూడా తిప్పణ్ణ ఒక వెలుగు వెలిగారు. ఆయన సొంత ఊరు చిత్రదుర్గ జిల్లా తురువనూరు కాగా ఆయన అంత్యక్రియలు తురువనూరులో శనివారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు ఉన్నారు. ఎన్.తిప్పణ్ణ మృతిపై కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నగర ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈయన మృతి జిల్లాకు తీరని లోటు అని, జిల్లాభివృద్ధికి తన వంతు కృషి చేశారని, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపించేవారని కొనియాడారు. -
పనికి తగ్గ వేతనం అందించాలి
సాక్షి,బళ్లారి: నగర స్వచ్ఛతకు పాలికె సిబ్బంది చేస్తున్న కృషి శ్లాఘనీయం అని,అలాంటి వారికి పనికి తగ్గవేతనం అందించాలని మాజీ మంత్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. బళ్లారి మహానగర పాలికె ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ధర్నా, ఆందోళన కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొని వారికి మద్దతుగా నిలిచారు. సమావేశంలో గంటకు పైగా ధర్నాలో పాల్గొని పాలికె సిబ్బంది సమస్యలు,వాటి పరిష్కారం కోసం సుదీర్ఘంగా చర్చించారు. పాలికె సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సంబంధిత మంత్రి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. తక్కువ జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న పాలికె పారిశుధ్య కార్మికుల పని తీరు శ్లాఘనీయం అన్నారు. తన వంతుగా పాలికె సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు కాని, అంతకన్నా ఎక్కువగా ఖర్చు, బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్లు వెంకట రమణ, పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, హనుమంతప్ప, ఆందోళనకారులు పాల్గొన్నారు. తక్కువ జీతాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు కార్మికులకు మాజీ మంత్రి శ్రీరాములు సంఘీభావం -
ఘర్షణ కేసులో 20 మంది అరెస్ట్
హుబ్లీ: మంటూరు రోడ్డు అరళికట్టె వీధిలో రెండు గుంపుల మధ్య జరిగిన ఘర్షణపై మూడు ప్రత్యేక కేసులను నమోదు చేసుకొని 20 మందిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. జిలాని, జాధవ్‌ల మధ్య పరస్పరం మాటా మాటా పెంచుకున్న ఫలితంగా సెటిల్మెంట్, మంటూరు రోడ్డులకు చెందిన రెండు గుంపులు కత్తులు, హాకీ స్టిక్‌లు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘర్షణలో మంజునాథ, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేశాయి. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బందిపై కూడా దాడి చేశారు. పోలీసులు విధులను అడ్డుకున్న ఆరోపణలపై కూడా వీరిపై కేసు దాఖలైంది. సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి వివరాలను సేకరించాం. కేసులో రౌడీషీటర్లు కూడా పాలు పంచుకున్నారు. త్వరలో వారిపై కూడా గూండా చట్టంతో పాటు సరిహద్దుల నుంచి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ కేసులకు సంబంధించి గణేష్, శుభం, పవన్, వినాయక, గౌతమ్, అశ్వథ్, రాఘవేంద్ర, విశాల్ తదితర 20 మందిని అరెస్ట్ చేశామన్నారు. చిన్న కారణానికి గొడవ.. యువకుడికి కత్తిపోటు హుబ్లీ: ధార్వాడలో హావేరి పేట కంటి గల్లిలో చిన్న కారణంతో ఓ యువకుడిపై కత్తితో పొడిచిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ వీధికి చెందిన మల్లిక్‌కు రాఘవేంద్ర వెన్నెముకపై చాకుతో పొడిచాడు. ఈ క్రమంలో చాకులోని చివరి భాగం వెన్నులో విరిగి మిగిలి పోయింది. తక్షణమే రాఘవేంద్రను చికిత్స కోసం హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. నిందితుడు మల్లిక్ పరారయ్యాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ధార్వాడ ఉపనగర పోలీసులు తెలిపారు. అంతేగాక రాఘవేంద్ర ఇంటికి వెళ్లిన కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ రాఘవేంద్ర, మల్లిక్ ఇద్దరు స్నేహితులు. కట్టడ కార్మికులుగా పని చేసే వారు. మల్లిక్ రాఘవేంద్ర సోదరుడికి డబ్బులు ఇచ్చాడు. ఈ విషయమై వారి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. శుక్రవారం మల్లిక్ ఇంటికి వచ్చిన వేళ డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఉండలేదు. దీంతో రాఘవేంద్ర, మల్లిక్ మధ్య మాటామాటా పెరిగిన పర్యవసానంగా మల్లిక్ రాఘవేంద్ర వెన్ను భాగంలో పొడిచి పరారయ్యాడని, నిందితులు ఒక్కరా, ఇద్దరా అనేది దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు తెలిపారు. నగరసభ అధ్యక్షురాలికి కాంగ్రెస్ మోసం రాయచూరు రూరల్: రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఆధారంగా అధ్యక్షురాలైన నగరసభ అధ్యక్షురాలు నరసమ్మకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాదిగ రిజర్వేషన్ పోరాట ఐక్య వేదిక అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షురాలు నరసమ్మతో లేఖ రాయించుకున్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టడం తగదన్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించడాన్ని ఖండించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికలు రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని విమర్శించారు. అధ్యక్షురాలు నరసమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, మంత్రి బోసురాజు మాదిగలకు, మైనార్టీలకు మోసం చేశారని, తిరిగి నరసమ్మకు అధ్యక్ష పదవిని అప్పగించాలన్నారు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంతో చర్చిస్తామన్నారు. యల్లమ్మ సన్నిధిలో వ్యక్తిపై దాడి హుబ్లీ: బెళగావి జిల్లా సవదత్తి తాలూకాలోని రేణుకా యల్లమ్మ ఆలయంలో శ్రీరామ సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సదరు సేన జిల్లాధ్యక్షుడిపై మారణాయుధాలతో దాడి చేసినట్లు సవదత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ధార్వాడ జిల్లాధ్యక్షుడు అణ్ణప్పపై ఈ దాడి జరిగింది. అణ్ణప్ప తన భార్య, పిల్లలతో ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా అణ్ణప్ప భార్య తన బిడ్డకు ప్రసాదం తినిపిస్తుండగా దేవాలయంలో బయట తిండి పదార్థాలు తినిపించరాదని హోంగార్డు సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో ఆమె బయటకు వచ్చి బిడ్డకు తిండి పదార్థాలు తినిపించారు. దీంతో పోలీస్ సిబ్బంది అసభ్యంగా తిట్టగా దీన్ని ప్రశ్నించిన అణ్ణప్పపై తీవ్రంగా దాడి చేసినట్లు సవదత్తి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దుకాణాలపై అధికారుల దాడులు● విషపూరిత పదార్థాల స్వాధీనం రాయచూరు రూరల్: విషపూరితమైన పదార్థాలను విక్రయిస్తున్న దుకాణాలపై ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు జరిపారు. శుక్రవారం మాన్విలోని ఇస్లాంపురలో ఖాళీ స్థలంలో ఉంచిన ప్రాణ హానికారకమైన విషంతో కూడిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతర, దర్గా, ఉరుసు ఇతర ఉత్సవాల్లో మసాలా వంటి పదార్థాల్లో విష పదార్థాలను కలుషితం చేసి లడ్డూ, కారాలు ఇతర పదార్థాలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తీయడానికి ప్రయత్నం చేస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. 967 కేజీల మిశ్రిత మసాలా పౌడర్, 152 కేజీల ఎర్ర బ్యాళ్లు, 220 కేజీల పసుపు, రంగు రంగుల బ్యాళ్లు, బొప్పాయి విత్తనాలు, చెక్క, కొబ్బరి పుడి, 842 కేజీల కలుషిత ఆహార పదార్థాలను సీజ్ చేసి వాటిని ఎఫ్ఎస్ఎల్ ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ నిర్మాణ పనులకు భూమిపూజ
హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో పోస్ట్‌మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ శ్రీనివాస్ భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో కొత్త దేవరాజ అరసు పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కూడ్లిగి నియోజకవర్గంలోని 14 హాస్టళ్లలో కానాహొసహళ్లి విద్యాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కేకేఆర్డీబీ నిధుల మంజూరుతో ప్రీమెట్రిక్ బాలికల హాస్టల్ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. కొత్త మొరార్జీ పాఠశాల ఏర్పాటుకు కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం శివపుర సమీపంలో 9 ఎకరాల భూమిని గుర్తించారన్నారు. కూడ్లిగి టీపీ ఈఓ నరసప్ప, బీసీఎం జిల్లా అధికారి శశికళ, ఉపాధ్యక్షుడు లక్ష్మీ రజనీకాంత్, జుట్టలింగనహట్టి బొమ్మన్న, ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, బళెగార జగదీష్, కేజీ కుమార్ గౌడ, హులికెరె మారెప్ప, సూర్యప్రకాష్, జి.ఓబన్న, హొన్నూరస్వామి, దర్నీరు రంగన్న, మాజీ ఉపాధ్యక్షుడు హెచ్ దురుగేశ పాల్గొన్నారు. -
మౌలిక సౌకర్యాల కోసం ఆందోళన
బళ్లారిఅర్బన్: కోళూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో ఆ జీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సంస్థ జిల్లాధ్యక్షుడు కే.ఈరణ్ణ మాట్లాడుతూ కోళూరు ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి వరకు 200 మందికి పైగా పేద రైతుల పిల్లలైన విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలకు ప్రభుత్వ స్థలంలో సొంత భవనం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరుగుదొడ్లు లేనందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఆ పాఠశాల పక్కన ఉన్న స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించాలి. భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల వ్యవస్థ కల్పించాలని సీఆర్పీ అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. దీనిపై సీఆర్పీ అధికారులు స్పందిస్తూ మూడు నెలల్లో పాఠశాలకు సొంత భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీడీఓ కూడా తాగునీటి వసతితో పాటు 15 రోజుల్లో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. సంస్థ వైస్ చైర్ పర్సన్ ఎం.శాంతి, జిల్లా కార్యదర్శి కంబళ్లి మంజునాథ్, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలి
● మౌలిక సదుపాయాల కల్పన అవసరం ● పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు సాక్షి,బళ్లారి: నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టాలని మాజీ మేయర్, ప్రస్తుత బళ్లారి మహానగర పాలికె ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీంబాబు సూచించారు. పౌరుల భాగస్వామ్యం, సామూహిక నాయకత్వం ద్వారా నగరాభివృద్ధి ఎలా సాధించాలన్న అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. పెరుగుతున్న నగరాలు, నగర నాయకులు శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలోని ఇండియా హాబిట్యాక్ సెంటర్లో ప్రజాగ్రహ సంబంధిత సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాల అభివృద్ధితో పాటు భారత్ అభివృద్ధి పథంలో సాగేందుకు దేశ బంగారు భవితను రూపొందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారన్నారు. సమావేశంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికై న 30 మందికి పైగా నగర నాయకులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధ్యక్షులు, మేయర్లు పాల్గొనడం హర్షణీయమన్నారు. -
గన్‌తో బెదిరించి నగల దోపిడీ
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో దోపిడీదారులు రెచ్చిపోయారు. పట్టపగలు జువెలరీ దుకాణంలోకి చొరబడి 3కేజీల బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. కలబుర్గి పట్టణంలోని సరాఫ్ బజార్లో జువెలరీ దుకాణం ఉంది. ముసుగలు ధరించిన దుండగులు లోపలకు చొరబడి గన్లు చూపించి సిబ్బందిని బెదిరించారు. అనంతరం బంగారు ఆభరణాలను మూటగట్టుకొని ఉడాయించారు. సుమారు 3కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయినట్టు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ద్వారా దొంగల ఆనవాళ్లను గుర్తించి గాలింపు చేపట్టారు. -
తుంగభద్ర హెచ్ఎల్సీకి నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయం నుంచి కుడి ఎగువ కాలువ(హెచ్ఎల్సీ)కు తుంగభద్ర మండలి అధికారులు గురువారం నీటిని విడుదల చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసే ముందు మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్ క్రస్ట్‌గేట్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం క్రస్ట్‌గేట్లను స్విచాన్ చేసి పైకెత్తి తొలుత 100 క్యూసెక్కుల మేర నీటిని కాలువకు వదిలారు. అనంతరం నీటి సామర్థ్యాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ కోటా కింద 500 క్యూసెక్కుల వరకు నీటిని వదులుతామన్నారు. జెస్కాం అధికారిపై దాడి.. వ్యక్తి అరెస్ట్ రాయచూరు రూరల్: జిల్లాలో జెస్కాం అధికారిపై దాడి చేసిన వ్యక్తిని దేవదుర్గ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. దేవదుర్గ తాలూకా మసరకల్ జెస్కాం ఇంజినీర్ మిథున్‌పై కరడిగుడ్డ రాజకుమార్ దాడి చేశారు. అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని పట్టుకున్నారు. కరడిగుడ్డలో ఇంటికి దొంగతనంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. మరో వైపు జీపీ అధ్యక్షురాలి బంధువు అంటూ అన్ని పనుల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇంజినీర్ తప్పుబట్టారు. దీంతో తనపై దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. నిధుల సద్వినియోగానికి సూచన రాయచూరు రూరల్: జిల్లాలో అధికారులు ఎస్సీపీ, టీఎస్పీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లాధికారి నితీష్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ జనాభాకు తగ్గట్లుగా లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలన్నారు. క్రీడా శాఖ నుంచి అథ్లెటిక్ పోటీలను ఏర్పాటు చేయాలన్నారు. యువకులు మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అధికారులు నవీన్ కుమార్, వీరేష్ నాయక్, చంద్రకళ, శ్రీదేవి, రాజేంద్ర, రవిలున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరిట రూ.6.15 లక్షల వంచన హుబ్లీ: వాట్సాప్‌లో వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి ఆ సదరు వ్యక్తి రూ.6.15 లక్షలు వంచించారు. పింటో బాధితుడు. క్రైం బ్రాంచ్ ముంబై నుంచి మాట్లాడుతున్నామని చెప్పి మీ పైన మనీ ల్యాడరింగ్ కేసులు ఉన్నాయని చెప్పి భయ పెట్టి బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకొని ఆ నగదును ఆన్లైన్ కేటుగాళ్లు బదలాయించుకున్నట్లు బాధితుడు పింటో స్రైబర్ క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని నమ్మించి ఓ వ్యక్తికి ఆన్లైన్ కేటుగాళ్లు యాప్ డౌన్లోడ్ చేయించి రూ.4.83 లక్షలను వంచించారు. ప్రసన్న అనే వ్యక్తి బాధితుడు. ప్రసన్నకు ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు అప్ డేట్ చేయించక పోతే మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని ఆన్లైన్ కేటుగాళ్లు ఫోన్లో బెదిరించారు. ఆ మేరకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్మును కేటుగాళ్లు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారని బాధితుడు విద్యానగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. సదరు విద్యార్థినికి అసభ్యంగా సైగలు చేసిన ఆరోపణలపై ఓ యువకుడిపై విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని సాయినాథ్‌గా గుర్తించారు. కేఎంసీ ఆస్పత్రి వెనుక ప్రాంతంలో విద్యార్థిని వెళుతుండగా నిందితుడు అసభ్యంగా సైగలు చేసి వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆంగ్ల బడుల మంజూరు తగదు రాయచూరు రూరల్: ప్రభుత్వ కన్నడ పాఠశాలల్లో ఆంగ్ల భాషను బోధించేందుకు ఆంగ్ల భాష పాఠశాలలను మంజూరు తగదని కన్నడ మిత్ర కూట పేర్కొంది. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బషీర్ హొసమని మాట్లాడారు. రాష్ట్రంలో 4143 ఆంగ్ల మాధ్యమ భాష పాఠశాలకు అనుమతివ్వడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నడ భాష పాఠశాలలకు ప్రాధాన్యత కల్పించకుండా ఆంగ్ల భాషా పాఠశాలలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
రాష్ట్రంలో కొనసాగుతున్న బాల్య వివాహాలు ● నాలుగేళ్లలో 2,165 పెళ్లిళ్లు ● త్వరలో బాల్య వివాహ నిషేధ చట్టానికి కొత్తగా సవరణలు ● రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న సర్కార్
సాక్షి బెంగళూరు: బాల్యంలోనే మూడుముళ్ల రూపంలో బాలల స్వేచ్ఛకు సంకెళ్లు పడుతన్నాయి. వారి భవిత ఎండమావులుగా మారుతోంది. భవిష్యత్ అంధకారమవుతోంది. కలలు కళ్లలవుతున్నాయి. విరిసీ విరియని... తెలిసీ తెలియని వయస్సులోనే పసిమొగ్గలకు మాంగల్యం తుంతునానేనా అని అంటున్నారు. యుక్త వయస్సు రాకుండానే తాళిబొట్టు మెడలో వేస్తున్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది. బాల్యంలోనే వివాహాలతో జరిగే అనర్థాలపై అధికారులు ఎంతగానో అవగాహన కలిగిస్తున్నా దురాచారాలను నిలువరించడం సాధ్యపడడం లేదు. ఈ క్రమంలో బాల్య వివాహాల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కొత్తగా బాల్య వివాహ నిషేధ సవరణ చట్టం –2025ను తీసుకొచ్చేందుకు అడుగులు వేసింది. రానున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చి ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 2021–2022 నుంచి 2024–2025 వరకు మొత్తం 2,165 బాల్య వివాహాలు జరిగినట్లు మహిళ, శిశు సంక్షేమ శాఖ తెలిపింది. 2021–22లో 418, 2022–23లో 328 బాల్య వివాహాలు జరిగాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023–24లో బాల్య వివాహాలు మరింతగా పెరిగాయి. ఆ ఏడాది 719కి బాల్య వివాహాలు పెరిగాయి. ఇక 2024–25 ఏడాదిలో మరో 700 జరిగాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలనలో రెండేళ్లలో 1,416 బాల్య వివాహాలు జరిగాయి. 2024–25 ఏడాదిలో 700 బాల్య వివాహాలు జరిగాయి. మొత్తం 3,049 బాల్య వివాహాల గురించి ఫిర్యాదులు అందితే అందులో 2,349 వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఇందులో అత్యధికంగా శివమొగ్గ జిల్లాలో 79 బాల్య వివాహాలు జరిగాయి. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మిహెబ్బాళ్కర్ సొంత జిల్లా బెళగావిలో 78 బాల్య వివాహాలు జరిగాయి. రాష్ట్రంలో ఈ బెళగావి జిల్లా బాల్య వివాహాల అంశంలో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్రదుర్గ (74), బాగలకోటె (60), సీఎం సొంత జిల్లా మైసూరు (60), మండ్య (57) ఉన్నాయి. నిశ్చితార్థం చేసిన వాళ్లకు జైలు శిక్ష రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లులో బాల్య వివాహం జరిగించడమే కాదు..నిశ్చితార్థం చేసినా నేరంగా పరిగణించేలా రూపొందించనున్నారు. బాలబాలికలకు నిశ్చితార్థం చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష అంతేకాకుండా రూ. లక్ష వరకు జరిమానా విధించేలా ఈ కొత్త సవరణ చట్టాన్ని తీసుకురానున్నారు. కేంద్ర చట్టంలో బాల్య వివాహం జరిగిస్తేనే నేరంగా భావించేవారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ కొత్త చట్టం ద్వారా నిశ్చితార్థం చేసినా వారిని నిందితులుగా చేర్చేలా సన్నాహకాలు చేస్తున్నారు.కేంద్ర చట్టంలో సవరణకు ఏర్పాట్లు ఇటీవలే కేంద్రంలో బాల్య వివాహా నిషేధ చట్టం –2006ను అమలు చేస్తున్నారు. దీనికితోడు బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు 2021 నుంచి పార్లమెంట్లో ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాల్య వివాహా నిషేధ సవరణ బిల్లు–2025పై కసరత్తు చేస్తోంది. కేంద్ర బాల్య వివాహ నిషేధ చట్టం–2006లో కొన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపనుంది. ప్రస్తుత రాష్ట్ర బిల్లులో కేంద్ర మూల చట్టంలో కొత్త సెక్షన్లు అయిన 9ఏ, 13ఏను కూడా చేర్చనున్నట్లు తెలిసింది. అలాగే కేంద్ర చట్టం సెక్షన్ 10ని కూడా సవరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా కట్టుదిట్టంగా బాల్య వివాహ నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి వాటిని నియంత్రించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. -
గజలక్ష్మీదేవిగా చాముండేశ్వరి
మైసూరు : మూడవ ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలోని చాముండికొండ భక్తజనసంద్రమైంది. ఉదయం 7 గంటల నుంచి చల్లటి చిరు జల్లుల వర్షం పడుతున్నా ఏమాత్రం వెనుకంజ వేయకుండా వేలాది మంది భక్తులు క్యూలో నిలబడి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకొని పునీతులు అయ్యారు. కర్ణాటకతోపాటు చట్టు పక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. చిత ప్రవేశంతో పాటు రూ.300, రూ.2000 టికెట్ కొనుగొలు చేసి క్యూలో వెళ్లి ఆమ్మవారిని దర్శించుకున్నారు. అనేక మంది మహిళలు, యువతులు,1001 మెట్లకు పసుపు కుంకుమ పెడుతూ మెట్లు ఎక్కుతు పైకి రావడం కనిపించింది. ప్రత్యేక పూజలు... నాడ శక్తి దేవత శుక్రవారం గజలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచే ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి రుద్రాభిషేకం, పంచామృ అభిషేకం, కుంకుమార్చన, ఏకాదశ పుష్పార్చన, సహస్ర నామార్చన నిర్వహించారు. తెలుపు రంగు, నేరేడు రంగు చీర ధరించి ప్రత్యేకమైన గజలక్ష్మీదేవి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయం మొత్తం వివిధ రకాల రంగు రంగుల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్, మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, ఎంపీ బీ.వై.రాఘవేంద్ర, గ్యారెంటీ పథకాల అమలు సమతి ఆధ్యక్షుడు హెచ్ఎం.రేవణ్ణ, ఎమ్మెల్యే ఏ.మంజు, కొత్తూరు మంజునాథ్, బాలకృష్ణ, ఎమ్మెల్సీ శరవణ, నటుడు వశిష్ట సింహ, నటి కారుణ్య, కలెక్టర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సిమా లాట్కర్తో పాటు అనేక మంది ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. కొండకు పోటెత్తిన భక్తజనం -
రైతుల డిమాండ్ల పరిష్కారంపై సీఎం నాటకాలు
మైసూరు : బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి రైతుల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాటకాలు ఆడుతున్నారని బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు నగరంలోని జిల్లా విలేకరుల భవనంలో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, దళిత సంఘర్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఆయన మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బెంగళూరు నగరంలో రైతు ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సమావేశం నిర్వహించగా దేవనహళ్లి తాలూకాలోని 13 గ్రామాల్లో 1,777 ఎకరాల భూ స్వాధీనాన్ని వెనక్కు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారన్నారు. చట్టపరంగా రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి ఈనెల 15వ తేదీ వరకు సమయం కోరిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అక్కడ రక్షణ శాఖ, ఎయిరోస్పేస్ కారిడార్లను ఏర్పాటు చేయడానికి కేంద్రాన్ని అనుమతి కోరారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో రక్షణ కారిడార్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అనుమతి అడగటం ఏ ఉద్దేశంతో అని ప్రశ్నించారు. రక్షణ శాఖ, ఎయిరో స్పేస్ కారిడార్‌కు కేంద్రం నుంచి అనుమతి లేకపోతే రైతుల నుంచి భూమిని ఎందుకు స్వాధీనం చెసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం -
శారీరక దృఢత్వం.. అదే ఆరోగ్య సూత్రం
హుబ్లీ: పోలీస్ శాఖకు స్థూలకాయం తలనొప్పి తెప్పిస్తోంది. కొందరు పోలీస్ సిబ్బంది ఇంతింత పొట్టలతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో వారి పొట్టలను కరిగించేందుకు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషరేట్ దేహదండన శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా బొజ్జదేహాలు ఉన్న సిబ్బందికి వాటిని కరిగించే ప్రక్రియ మొదలైంది. విధుల్లో ఉన్న పోలీసులు ఫిట్ అండ్ ఫైన్(శారీరకంగా దృఢంగా)గా కనిపించడానికి జంట నగరాల్లో డ్యూటీలో ఉన్న 98 పోలీస్ సిబ్బందిని స్థూలకాయలుగా గుర్తించారు. బాడీ మాథ్ ఇండెక్స్(బీఎంఐ) పరీక్ష ద్వారా అలాంటి వారిని గుర్తించి మూడు నెలల లోపల స్థూలకాయం తగ్గించాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు. గోకుల్ రోడ్డు కొత్త సీఏఆర్ మైదానంలో శాఖ సిబ్బందికి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు శారీరక వ్యాయామాలు చేయించి దేహం తూకం తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సూచన మేరకు జంట నగరాలలో 19 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. తొలి దశలో 65 మందికి.. బీఎంఐ పరీక్షల్లో 30 కన్నా ఎక్కువ మార్కులు ఉన్న స్థూలకాయం, ఎక్కువ తూకం ఉన్న 25 మంది ఏఎస్ఐలు, 74 మంది హెడ్ కానిస్టేబుళ్లను గుర్తించారు. తొలి దశలో 65 మంది సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. యోగా, పరుగు, నడక, ఇతర వ్యాయామాల ద్వారా తూకం తగ్గించుకోవడానికి శారీరక కసరత్తులు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు శిబిరం ప్రారంభం అవుతుంది. 50 ఏళ్లకు మించిన వారు 5 కిలోమీటర్ల దూరం నడవాలి. అంత కన్న తక్కువ వయస్సు గల వారు 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 8 గంటలకు ఫలాహారం, మధ్యాహ్నం 1 గంటకు ఆరోగ్యం గురించి నిపుణులైన వైద్యులు క్లాసులు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి పరుగు, నడక ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు యోగా నేర్పిస్తారు. ఓ నెల పాటు జరిగే శిబిరం ఇది. బియ్యంతో చేసిన అన్నం మినహాయించి కొర్రబియ్యం, ఎర్రబియ్యం, జొన్నలతో చేసిన భోజనం వడ్డిస్తారు. జొన్నలు, రాగుల రొట్టె, అలాగే మజ్జిగ, సాంబార్ ఇస్తారు. పోలీస్ శాఖలో దృఢకాయం తప్పనిసరి ఈ విషయమై పోలీస్ కమిషన్ శశికుమార్ మాట్లాడుతూ శిబిరంలో 65 మంది సిబ్బంది పాల్గొనగా వీరిలో కొందరు 4 నుంచి 11 కేజీల వరకు తూకాన్ని తగ్గించుకున్నారన్నారు. సిబ్బంది సానుకూల దృక్పథంతో స్పందిస్తున్నారు. తమ శాఖలో చేరాలంటే దృఢకాయం తప్పనిసరి. అయితే వివిధ కారణాల వల్ల శారీరక తూకం పెరుగుతోంది. అలాంటి స్థూలకాయ దేహం కలిగిన వారికి గుర్తించి శిబిరానికి పంపిస్తున్నాం. పోలీస్ శాఖలో ఫిట్నెస్ చాలా ముఖ్యమన్నారు. బహిరంగ స్థలాల్లో, నిందితులను పట్టుకోవడంలో ఫిట్నెస్ ఉపయోగపడుతుంది. తొలిదశలో 90 కేజీలపై ఉన్న పురుషులు, 70 కేజీల పైన ఉన్న మహిళా సిబ్బందిని గుర్తించి ప్రభుత్వ ఆదేశం మేరకు శిబిరానికి పంపించాం. ప్రతి రోజూ యోగా, ఏరోబిక్, క్రికెట్, నడక, లాఠీ డ్రిల్, వెపన్ డ్రిల్, జిమ్‌లో కసరత్తులు చేయిస్తున్నాం. పథ్యం తప్పనిసరిగా పాటించాలి. మరో బ్యాచ్‌కు సరిపడేంత సిబ్బంది ఉన్నారు. వారికి కూడా శిబిరానికి పంపుతాం. దీంతో వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్థూలకాయ దేహదండన ప్రారంభం ఇకపై పోలీసులు చెమటోడ్చక తప్పదు -
ధర్మస్థల సంస్థ సేవలు ప్రశంసనీయం
బళ్లారిఅర్బన్: డాక్టర్ వీరేంద్ర హెగ్డే, హేమావతి దంపతులు స్థాపించిన ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు వృద్ధులకు, దివ్యాంగులకు నెలవారి పింఛన్ పంపిణీ, నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం పేద విద్యార్థుల విద్య, ఆర్థిక సహాయం, ఆలయాల నిర్మాణాలకు తగిన సహాయం అందించడం తదితర ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని 22వ వార్డు కార్పొరేటర్ కే.హనుమంతప్ప ప్రశంసించారు. ఆ వార్డు పరిధిలో సదరు బీసీ ట్రస్ట్ డివిజన్ గాంధీనగర్‌లో దృష్టిహీన దివ్యాంగుడైన బీ.లింగన్నకు నెలవారి పింఛన్ ఆదేశ ప్రతిని పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ సంస్థ సమాఖ్య చైర్పర్సన్ వనిత, సూపర్వైజర్ సంజీవ్, సంఘం సభ్యులు, ఆ ప్రాంత ప్రముఖులు, మహిళా జ్ఞాన వికాస సమన్వయ అధికారిణి ఆశా, స్థానిక సేవా ప్రతినిధి దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులకు జెడ్పీ సీఈఓ క్లాస్
రాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగులకు, అధికారులకు, సిబ్బందికి క్లాస్ తీసుకున్నారు. బుధవారం అకస్మాత్తుగా కార్యాలయంలో విధులకు హాజరైన వారి పని తీరును జెడ్పీ సీఈఓ పరిశీలించారు. వారానికి ఒకసారి స్వచ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని, రికార్డులను భద్రపరుచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రైలు కింద పడి తల్లీబిడ్డల ఆత్మహత్య దొడ్డబళ్లాపురం: రైలు కింద పడి తల్లీ, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకాలోని తుంగభద్ర నది వంతెన వద్ద చోటు చేసుకుంది. గంగనరసి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(65), గౌరమ్మ(45) ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీ, కుమార్తె. రైలు పట్టాలపై పడుకుని ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కుల దూషణ కేసుకు భయపడి యువకుడు ఆత్మహత్య
● కొడుకు మృతి వార్త తెలిసి గుండెపోటుతో తండ్రి మృతి ● యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో విషాద ఛాయలు సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో ఓ యువకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో సదరు యువకుడు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మరణ వార్త తెలిసిన వెంటనే తండ్రి గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లా వడగేరా పట్టణంలో జరిగింది. వివరాలు.. తమ పొలానికి వెళ్లడానికి దారి వదలాలని మహబూబ్(19) అనే యువకుడు తన పక్క పొలం వారితో ఏర్పడిన వివాదంలో దళితుడు నింగప్పను కులం పేరుతో దూషించాడని కేసు నమోదైంది. దీంతో యువకుడు మహబూబ్ తాను జైలుకు పోవాల్సి వస్తుందనే భయంతో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విని తండ్రి సయ్యద్ అలీ(50)కి గుండెపోటు రావడంతో అతనిని కలబుర్గిలోని జయదేవ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనతో వడగేరా పట్టణంలో విఽషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులను శిక్షించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లాధ్యక్షుడు మల్లనగౌడ డిమాండ్ చేశారు. అంబేడ్కర్ ప్రతిమపై దాడి.. నిందితుల్ని బంధించరూ రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హరివిలో అంబేడ్కర్ ప్రతిమపై దాడి చేసిన వారిని బంధించాలని అంబేడ్కర్ సేన అధ్యక్షుడు విశ్వనాథ్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం అంబేడ్కర్ ప్రతిమను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. వేడుకగా దిండి ఉత్సవాలు రాయచూరు రూరల్ : భావసార క్షత్రియ సమాజంచే గురు పౌర్ణిమ ఉత్సవాల్లో భాగంగా భంగికుంటలో దిండి ఉత్సవాలు, ఆషాఢ మాసోత్సవం జరిగాయి. గురువారం నగరంలోని పాండురంగ విఠల్ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. భంగికుంట నుంచి ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సమాజం అధ్యక్షుడు శ్రీనివాస్ పతంగి, జయంత్ రావ్ పతంగి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు రుణాలకు గ్యారెంటీ సొమ్ము జమ తగదు
రాయచూరు రూరల్: ప్రజలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీల ద్వారా అందించే సొమ్మును జమ చేసుకోవడం తగదని పంచ గ్యారెంటీల అమలు సమితి జిల్లాధ్యక్షుడు పామయ్య మురారి పేర్కొన్నారు. బుధవారం జిల్లా పంచాయతీ జలనిర్మల సభాంగణంలో జరిగిన పంచ గ్యారెంటీల అమలు సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పంచ గ్యారెంటీల నుంచి మహిళల బ్యాంక్ పొదుపు ఖాతాలకు డబ్బులు పడిన వెంటనే బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని జమ చేసుకునే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. గృహలక్ష్మితో పాటు వితంతు, దివ్యాంగ, వృద్ధాప్య పింఛన్ పథకాల నుంచి వచ్చే నిధులను బ్యాంక్ అధికారులు జమ చేసుకోకుండా ఖాతాదారులకు అందించాలన్నారు. సమావేశంలో సభ్యులు శంకరగౌడ, నజీర్ పంజాబి, బసవరాజ్, అధికారులు చంద్రశేఖర్, హుడేద్, నవీన్ కుమార్, హరీష్, గవిసిద్దప్పలున్నారు. -
జీవితాన్ని తీర్చిదిద్దేది గురువులే
● మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సాక్షి,బళ్లారి: ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేది గురువులేనని, అలాంటి గురువులను మరువకుండా జీవితాంతం గుర్తుకు పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పరమ పవిత్రమైన గురుపౌర్ణమి సందర్భంగా తనకు విద్యను బోధించిన గురువుల చెంతకు వెళ్లి వారికి పాదాభివందనం చేసి, తన గురు భక్తిని చాటుకున్నారు. నగరంలో తనకు విద్యను నేర్పించిన మూలా శ్రీనివాస్, రామచంద్రప్ప, కాండ్ర శ్రీరాములు, సరళ తదితరులను కలిసి, వారిని శాలువాతో సన్మానించి, పూలమాలలు వేసి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు దేశంలో అత్యున్నత పదవులను అలంకరించిన వారికి కూడా గురువులు ఉంటారన్నారు. జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే జీవితాన్ని ఇచ్చేది గురువులేనన్నారు. అనంతరం ఆయన షిర్డీసాయి బాబా ఆలయాల్లో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి,బళ్లారి: పరాసుర మహర్షి, మత్య్సగంధికి జన్మించిన కారణజన్ముడు, మహాభారతాన్ని రచించిన మహానుభావుడు, వేదవేదాంగాలను ఔపోసన పట్టిన వ్యాసుడు పుట్టిన రోజున జరుపుకునే గురుపౌర్ణమి వేడుకలు గురువారం రోజున గురు పౌర్ణమి రావడం గురు భక్తులకు మరింత పరమపవిత్రం కావడంతో నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని విశాల్నగర్లో షిర్డీలో వెలసిన శ్రీ షిర్డిసాయి బాబా ఆలయం తరహాలో నిర్మించిన సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నదానం చేపట్టారు. ఆలయ ధర్మకర్త కుమారస్వామి ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో వద్ద రక్తదాన శిబిరంతో పాటు అన్నదానం నిర్వహించారు. ఆలయంలో శ్రీ షిర్డిసాయిబాబాను దర్శించుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. అలాగే కోట ప్రాంతంలో వెలసిన శ్రీషిర్డిసాయిబాబా ఆలయం, పటేల్‌నగర్‌లో వెలసిన శ్రీ షిర్డిసాయిబాబా ఆలయంతో పాటు శ్రీ గురురాఘవేంద్ర స్వామి ఆలయాల్లో కూడా భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఆయా ఆలయాల వద్ద అన్నదాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ భక్తిని చాటుకున్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్ : నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లోని సాయి బాబా ధ్యాన మందిరంలో గురువారం ప్రత్యేక పూజలను సాయి బాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని నిర్వహించారు.కాకడ హారతి, మహారుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్యనారాయణ పూజలు, పల్లకీ సేవలు, ధూప హారతి, అన్న దాసోహ కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా రాజేష్ మడివాళ, ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు. గురువందన ఉత్సవాలను నగరంలోని గురు పీఠానికి చెందిన కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యులు అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ చేశారు. తాలూకాలోని మిట్టి మల్కాపూర్ సిద్దారూఢ మఠంలో గురు పౌర్ణిమ ఉత్సవాల్లో గురువును ఆరాధించి, పూజలు చేశారు. మంత్రాలయంలో.. మంత్రాలయ మఠం భక్త జనంతో కిక్కిరిసిపోయింది. గురువారం గురు పౌర్ణమి కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. మంత్రాలయ మఠంలో రాఘవేంద్రస్వాముల పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం రాత్రి మంత్రాలయ మఠంలోకి భక్తులు రావడంతో మంత్రాలయం మఠం జనసందోహంతో కిక్కిరిసింది. రాయల వారిని దర్శనం చేసుకోవడానికి ఆరేడు గంటల పాటు సమయం పట్టిందని భక్తులు పేర్కొన్నారు. ముఖ ద్వారం నుంచి రాయల ప్రాంగణం వరకు భక్తుల సందోహం కనిపించింది. సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆలయంలో ప్రదక్షిణం చేశారు. హొసపేటెలో.. హొసపేటె: గురుపౌర్ణమి సందర్భంగా గురువారం నగరంలో సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువ జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకున్నారు. నగరంలోని టీబీ డ్యాం రహదారిలో ఉన్న సాయిబాబా మందిరం, రైల్వే స్టేషన్ రహదారి, హంపీ రహదారిలో కొండనాయకనహళ్లిలో ఉన్న సాయిబాబా ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడికి పూజలు చేశారు. విజయనగర జిల్లా వ్యాప్తిలో ఉన్న కూడ్లిగి, హడగలి, కొట్టూరు, హరపనహళ్లి, హగరిబొమ్మనహళ్లి తాలూకాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు చేరుకుని సాయిబాబాను దర్శించుకున్నారు. ఆలయాలకు భారీగా పోటెత్తిన భక్తులు జోరుగా అన్నదానం, రక్తదాన శిబిరాలు -
హడపద అప్పణ్ణ తత్వాలు ఆచరణీయం
బళ్లారి రూరల్ : ప్రతి ఒక్కరూ శివశరణ హడపద అప్పణ్ణ తత్వాలను అనుసరించాలని దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ్ విఠల్‌రావ్ తెలిపారు. ఆయన గురువారం దావణగెరె జెడ్పీ కార్యాలయంలో అప్పణ్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బసవణ్ణ సిద్ధాంతాలను, ప్రజలకు బోధించిన తత్వాలను ఆచరిస్తూ ప్రసిద్ధిగాంచిన అప్పణ్ణ మనందరికీ ఆదర్శప్రాయుడని తెలిపారు. దుడా అధ్యక్షుడు దినేశ్ కె.శెట్టి, ఉపవిభాగాధికారి సంతోష్ పాటిల్, కన్నడ సంస్కృతి శాఖ సహాయ సంచాలకుడు రవిచంద్ర, దుడా సభ్యులు వాణి బక్కేశ్, బసాపుర శశిధర్ పాల్గొన్నారు. గొప్ప పండితుడు హడపద అప్పణ్ణ హొసపేటె: 12వ శతాబ్దపు గొప్ప పండితుడు, బసవణ్ణ సన్నిహితుడు హడపద అప్పణ్ణ అని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప అన్నారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక సంస్కరణల కోసం కులం, మతం రంగు, వర్గం లేని సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారన్నారు. కన్నడ సంస్కృతి శాఖ అధికారి సిద్దలింగేష్ తదితరులు పాల్గొన్నారు. దావణగెరె జెడ్పీ సీఈఓ గిత్తె మాధవ్ విఠల్‌రావ్ -
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
హుబ్లీ: బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కే.బాలవీరారెడ్డికి ద్రోణాచార్య పురస్కార్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా బెంగళూరులో న్యూ హోరిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రజతోత్సవాల సందర్భంగా బాలవీరారెడ్డికి విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తిస్తు ద్రోణాచార్య పురస్కార్ అవార్డును ప్రదానం చేశారు. ఆ విద్యా సంస్థ స్థాపకుడు డాక్టర్ మోహన్ మంగనాని మాట్లాడుతూ డాక్టర్ బాలవీరారెడ్డి విద్యా రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయం అని, ఆయన ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని అభిలషించారు. ప్రముఖులు మధు పండిత్దాస్ ఇస్కాన్, ప్రొఫెసర్ టీజీ సీతారాం, రేణుకా మంగనాని, వైస్ చైర్పర్సన్, ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్ పాల్గొన్నారు. తల్లే మొదటి గురువు హొసపేటె: తల్లే మొదటి గురువు, ఇంట్లో తల్లిదండ్రులు బోధించే సంస్కారం పిల్లలకు చాలా ముఖ్యం, దీనిని అందరూ అర్థం చేసుకుంటే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అరవింద్ కులకర్ణి అన్నారు. గురువారం నగరంలోని ఫ్రీడం పార్క్‌లో పతంజలి యోగా సమితి జనని వివిధోద్దేశ సహకార సంఘం సహకారంతో నిర్వహించిన గురు పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేద వ్యాసుడు గొప్ప గురువు. మానవాళి ప్రయోజనం కోసం అఖండమైన, అనంతమైన వేదాలను రచించిన వ్యక్తి ఆయన అన్నారు. వేదాల సారాంశం ప్రజలకు మరింత సులభంగా అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఆయన 18 పురాణాలు, మహాభారతాన్ని రచించారన్నారు. రిమ్స్‌లో శిశువుల అపహరణ.. వ్యక్తి అరెస్ట్ రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల, పరిశోధన కేంద్రంలో శిశువులను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి రిమ్స్‌లోకి వెళ్లి శరణప్ప చీర కట్టుకొని వార్డులో తిరుగుతున్న వ్యక్తిని విచారించారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాక పోవడంతో మార్కెట్ యార్డు పొలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ రాయచూరు రూరల్: నగరసభ ఇంచార్జి అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం నగరసభ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం ఆదేశించింది. అధ్యక్షురాలు నరసమ్మ అనారోగ్యం కారణంగా మూడు నెలల సెలవు పెట్టడంతో సమీర్ బాధ్యతలు స్వీకరించారు. మూడు నెలల్లో నగరసభ ఎన్నికల రానుండడంతో అధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించామని చెప్పుకొని ఓట్లను రాబట్టడానికి ఈ పని చేశారని రాజకీయ నేతలు విశ్లేషణల్లో చెప్పారు. వైభవంగా గురు వందన ఉత్సవాలు రాయచూరు రూరల్ : నగరంలో గురువందన ఉత్సవాలు వైభవంగా జరిపారు. గురువారం సోమవారపేటె మఠంలో గురు వందన కార్యక్రమాలను మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య నెరవేర్చారు. గురు పీఠానికి శిష్య గణం అభిషేకం, పాదుకా పట్టాభిషేకం, జలాభిషేకం, పుష్పాలంకరణ నెరవేర్చారు. భక్తులు తులాభారం నిర్వహించారు. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ తదితరులను సన్మానించారు. -
శ్రీశైల జగద్గురువును దర్శించుకున్న గాలి జనార్దనరెడ్డి
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా సాక్షి,బళ్లారి: పవిత్ర వ్యాసపూర్ణిమను పురస్కరించుకుని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి శ్రీశైల జగద్గురువులను దర్శించుకున్నారు. గురువారం గురపౌర్ణమి సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్రతో కలిసి పరమపూజ్య శ్రీశైల జగద్గురువులు డాక్టర్ చెన్న సిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా గాలి జనార్దనరెడ్డి మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని మన పురాణ, ఇతిహాసాలు ఘోషిస్తున్నాయన్నారు. మన పూర్వీకుల నుంచి కూడా గురువుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గురువు లేనిదే ఎవరూ ఏదీ సాధించలేరన్నారు. గురువుకు గులాం అయ్యే వరకు మోక్షం దొరకదన్న పెద్దల వాక్కు నూటికి నూరు పాళ్లు కచ్చితం అన్నారు. అలాంటి పరమ పవిత్రమైన గురుపౌర్ణమి రోజు సాక్షాత్తు శ్రీశైల జగద్గురువులను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. -
యరగేరాను తాలూకాగా ప్రకటించండి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలున్నాయన్నారు. యరగేరా వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందన్నారు. రాయచూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేరా పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి జిల్లాధికారి నితీష్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బసవరాజ్, మహబూబ్ పటేల్, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు. -
సీఎం కుర్చీ పంపకం ఉత్తిదే
హస్తిన టూర్‌ని సీఎం సిద్దరామయ్య అనువుగా మలచుకున్నారు. రెండున్నరేళ్ల పాటు ఒక్కొక్కరు ముఖ్యమంత్రిగా ఉండాలన్న నియమం ఏదీ లేదని కుండబద్ధలు కొట్టారు. పైగా పోటీదారు డీకే శివకుమార్‌కు ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదని చెప్పి తనకెవరూ పోటీ కాదని సంకేతాలిచ్చారు. ఈ పరిణామాలతో హస్తం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో? అనే చర్చకు బీజం పడింది. శివాజీనగర: 5 సంవత్సరాలూ నేనే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటాను అని సీఎం సిద్దరామయ్య ఢిల్లీలో తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానని అన్నారు. జూలై 2న చెప్పినప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవి పంపకాలు చేసుకోవాలేది మాట్లాడుకోలేదన్నారు. తానే ముఖ్యమంత్రి కు ర్చీలో ఉంటానని చెప్పడం ద్వారా డీకేశి, ఆయన అనుచరుల ఆశలపై నీళ్లు చల్లారు. మాది హైకమాండ్ ఆధారంగా నడిచే పార్టీ, 2023 సమావేశంలో రెండున్నరేళ్ల సీఎం కుర్చీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. తాము చెప్పిన దానిని అనుసరించాలని హైకమాండ్ ఆదేశించింది, వారు ఏమి చెప్పినా దానిని తాము అనుసరించాలి. నేను అదే చేస్తారు, డీకే శివకుమార్ కూడా అనుసరిస్తారని సిద్దు చెప్పడం ద్వారా మరో మాటకు తావు లేదని స్పష్టీకరించారు. సీఎం కావాలని డీకే కూడా కోరుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించగా, డీకే కూడా సీఎం ఆకాంక్షి. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే సీఎం కుర్చీ ఖాళీగా లేదని ఆయన నోటి నుంచే చెప్పారు. సీఎం పదవి గురించి సుర్జేవాలా ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. డీకే శివకుమార్‌కు మద్దతు పలికే కొందరు ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఉంటారు. అయితే అధిక సంఖ్యలో లేరు అని తెలిపారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని సిద్దు పరోక్షంగా ప్రకటించారు. దీంతో సీఎం మార్పు చర్చలకు పుల్‌స్టాప్ పెట్టారు. ఇప్పుడేం చేయాలి.. డీకేశి ఐదేళ్లూ నేనే పదవిలో ఉంటా సీఎం సిద్దరామయ్య ప్రకటన ఢిల్లీలో కన్నడ రాజకీయం డీకేశి శిబిరంలో నిరుత్సాహం నేను డ్రామాలు ఆడను: హోంమంత్రి సీఎం పదవి మార్పు వార్తలు, పార్టీ పరిణామాల మీద హోంమంత్రి పరమేశ్వర్ కొత్తగా స్పందించారు. మీరు చెప్పినట్లుగానే డ్రామా జరుగుతూ ఉంది. అంతే తప్ప ఇంకేమీ లేదు అని అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. అనవసరంగా డ్రామా కంపెనీని పెట్టడం నాకు ఇష్టం లేదని అన్నారు. సీఎం రేసు, ఢిల్లీ టూర్లో తాను లేకపోవడం గురించి ఇలా చెప్పారు. సీఎం మార్పు గురించి తరచూ చర్చించడం, ఏదో ఒకటి చెప్పడం సరికాదు, హైకమాండ్ అన్నింటినీ గమనిస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నిర్ణయాలను తీసుకొంటుందన్నారు. ఇక పోస్టు మార్పు లేనట్టేనా? సీఎం సిద్దరామయ్య విస్పష్ట ప్రకటన రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఆయన అభిమాన ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగించగా, డీకేశి వర్గంలో నిరుత్సాహం చోటుచేసుకుంది. సీఎం ఆ మాటను బెంగళూరులో చెప్పి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఢిల్లీలో, రాహుల్‌గాంధీ, ఖర్గే తదితర అగ్రనేతలతో సమావేశం తరువాత అంత స్పష్టంగా చెప్పారంటే, ఇక డీకేశికి ఈ దఫా ముఖ్యమంత్రి పదవి దక్కడం సులభం కాదని రెండు వర్గాలు భావిస్తున్నాయి. సీఎం సిద్దరామయ్య ఎంతో ప్లాన్‌గా ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకుని డీసీఎంకు చెక్ పెట్టినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. డీకే ఇంకా స్పందించినట్లు లేదు. -
మోక్షదాతా.. గురుదేవా, పాహిమాం
బనశంకరి: గురు పౌర్ణమి సందర్భంగా గురువారం బెంగళూరుతో సహా ప్రముఖ దేవస్థానాల్లో విశేష పూజలు, ఉత్సవాలు జరిగాయి. సరస్వతీ, వినాయక, విష్ణు, పరమేశ్వర, రాఘవేంద్రస్వామి, వ్యాస– వాల్మీకి, సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తజనం బారులు తీరి దర్శించుకున్నారు. బెంగళూరులో వివిధ ఆలయాలలో అభిషేకం, మహామంగళ హారతి, పల్లకీ సేవలు, సత్యనారాయణస్వామి పూజలు చేపట్టారు. విజయనగరలో బసవేశ్వర సుజ్ఞాన మండపంలో ఇష్టలింగ మహాపూజ చేశారు. చామరాజపేటే శృంగేరి శంకర మఠంలో పూజలు, ప్రవచనాలు జరిగాయి. మల్లేశ్వరంలోని సాయిబాబా మందిరంలో, 15వ క్రాస్‌లోని షిరిడి సాయి ఆలయంలో, వాసవి మందిరం, జక్కూరు సాయిబాబా గుడి తదితర చోట్ల భక్తులు వెల్లువెత్తారు. భక్తిశ్రద్ధలతో గురు పూర్ణిమ -
●హరోం హర.. చామరాజేశ్వర
ఆషాఢ మాసం, గురు పూర్ణిమ సందర్భంగా చామరాజనగరలో చరిత్ర ప్రసిద్ధ చామరాజేశ్వర ఆలయ రథోత్సవం గురువారం వేలాదిమంది భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల జిల్లా నుంచే కాకుండా కేరళ, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకించి నూతన దంపతులు ఎక్కువగా పాల్గొని స్వామిని సేవించారు. తెల్లవారుజాము నుంచి పూజలు చేసి ఉదయం 11.30 గంటల నుంచి 12.15 గంట శుభ కన్యా లగ్నంలో తేరు ఉత్సవాన్ని జరిపారు. మైసూరు: వాహనం బోల్తా.. కూలీలకు గాయాలు మాలూరు : పికప్ వాహనం బోల్తాపడి 11 మంది కూలీలు గాయపడిన ఘటన మాలూరు – మాస్తి మెయిన్ రోడ్డులో రాజేనహళ్లి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. తాలూకాలోని లక్కూరు ఫిర్కా డీఎన్ దొడ్డి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని బండహట్టి గ్రామానికి చెందిన 11 మంది కూలీలు కొత్తమిర పీకడానికి బొలెరోపికప్ వాహనంలో వెళ్తుండగా రాజేనహళ్లి క్రాస్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. గాయపడిన కూలీలను నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కూలీలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
గ్రెనేడ్ పేల్చి ఉగ్రవాదిని తప్పించాలి
బనశంకరి: కటకటాల్లోని ఉగ్రవాదులతో కుమ్మక్కయిన బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు మానసిక వైద్యుడు నాగరాజ్, ఏఎస్ఐ చాంద్‌పాషా, అనుమానిత ఉగ్రవాది తల్లి ఫాతిమాను ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ చేపట్టారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాది నాసీర్ తప్పించుకోవడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. గ్రెనేడ్ నాసీర్ ను బయటికి తీసుకురావడానికి ప్లాన్ వేశారని ముగ్గురు నిందితులు తెలిపారు. ఎన్ఐఏ తాజా దాడులతో ఈ కుట్ర విఫలమైంది. నాసీర్ గత 2009 నుంచి పరప్పన జైలులో ఖైదీగా ఉన్నాడు. అతన్ని తప్పించడానికి ఉగ్రవాదులు రెండుసార్లు విఫలయత్నం చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. కోర్టుకెళ్లే సమయంలో.. దీనికి ఏఎస్ఐ చాంద్‌పాషా ప్రముఖ సూత్రధారి. పోలీసులు ఏఎస్ఐ చాంద్‌పాషాకు నాసీర్ ను కోర్టుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కోర్టుకు తీసుకెళ్లే దారిలో ఉగ్రవాదులు గ్రెనేడ్ పేల్చి పోలీసుల దృష్టి మళ్లించి నాసీర్‌ను తీసుకుపోవాలన్నది కుట్ర. ఫాతిమా, పరారీలో ఉన్న ఆమె కొడుకు జునైద్ దీనిపై చర్చించుకున్నారు. జునైద్ ద్వారా కుట్రదారులకు గ్రెనేడ్ పంపారు. 2023లో సీసీబీ కొడిగేహళ్లి జునైద్ తదితరుల ఇంట్లో తనిఖీలు చేయగా నాలుగు గ్రెనేడ్లు లభించడం కుట్రకు ఊతమిచ్చింది. ఉగ్రవాదులు ఏం చేయాలన్నా చాంద్‌పాషా సహాయం చేశారు. అనుచరుల కుట్ర గుట్టురట్టు ఎన్‌ఐఏచే ముగ్గురు నిందితుల విచారణ -
హఠాత్తుగా కారు దగ్ధం
శివమొగ్గ: హైవేలో వెళ్తున్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ నగర శివార్లలోని త్యావరెకొప్ప పులి సింహధామం వద్ద బుధవారం రాత్రి జరిగింది. శివమొగ్గవాసి వీరేష్ హుండై ఐ20 కారులో ఇంటి నుంచి తోటకు వెళుతుండగా ఆకస్మికంగా కారులో పొగ వ్యాపించింది. వెంటనే కారును రోడ్డు పక్కన నిలపగా మంటలు ఎగసిపడి కాలిపోయింది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు దాదాపుగా కాలిపోయింది. తుంగానగర పోలీసులు పరిశీలించారు. మంటలకు కారణాలేమిటి? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. గజ దాడిపై జనాందోళన దొడ్డబళ్లాపురం: అడవి ఏనుగు దాడిలో రైతు కాలు విరిగిన సంఘటన కనకపుర తాలూకా నారాయణపుర గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (45) పొలంలో పని చేస్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవి ఏనుగు తొండంతో కొట్టి తొక్కింది. రైతు కాలు విరిగి గాయాలపాలయ్యాడు. స్థానికులు అతనిని కాపాడి తీసుకొచ్చారు, శ్రీనివాస్‌ను రోడ్డుమీదే పడుకోబెట్టి ఆందోళన చేశారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చి బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. న్యూస్‌రీల్ -
మనిషికేల భేదభావాలు?
చింతామణి: సూర్యుడు అందరికీ సమానంగా ఎండ ప్రసాదిస్తాడు, ప్రకృతికి భేదభావం లేదు, కానీ మానవునిలోనే భేదం వుంది, దీంతో మానవుడు సామరస్యంగా ఉండాలంటే గురుచింతన అవసరమని కై వార ధర్మాధికారి జయరాం అన్నారు. గురువారం కై వారం మఠంలో సంగీతోత్సవాలు మూడవ రోజుకు చేరుకోగా రాష్ట్రంతో పాటు తెలుగు ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలు వచ్చారు. భగవంతుని నామస్మరణం చేయడం ద్వారా భక్తులు పావనమవుతారని యోగినారేయణ తాతయ్య కీర్తనల్లో బోధించారని గుర్తుచేశారు. గురు పూర్ణిమ కావడంతో యోగి నారేయణ తాతయ్య మూల విరాట్టుకు అభిషేకం, రాజోపచార తదితర సేవలను నిర్వర్తించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలాపనలు, సంగీత కచేరీలు భక్తులను మైమరిపించాయి. యోగి నారేయణ తాతయ్య బాటలో సాగుదాం -
రీల్స్ సైకో
శివాజీనగర: సిలికాన్ సిటీలో రోడ్లపై వెళ్తున్న మహిళలు, యువతుల ఫోటోలు, వీడియోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో పోస్టు చేస్తున్న పోకిరీని పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల రీతిలో చిత్రీకరించి పోస్టులు పెట్టేవాడు. చర్చ్ స్ట్రీట్, కమర్షియల్ స్ట్రీట్ సహా జనసమ్మర్ధ ప్రాంతాలలో ఈ అకృత్యానికి పాల్పడుతున్న గురుదీప్ సింగ్ (26) ని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ మేనేజ్మెంట్ చేసి నిరుద్యోగిగా తిరిగే గురుదీప్ సిటీలో కేఆర్ పురంలో సోదరుని ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఓ యువతి తన వీడియోలను ఇన్‌స్టాలో చూసి కంగుతిని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో పోలీసులు అతని ఇన్‌స్టా ఖాతాను పరిశీలించగా చాలామంది మహిళలు, యువతుల వీడియోలు దర్శనమిచ్చాయి. వాటి మీద అసభ్య కామెంట్లు కూడా ఉన్నాయి. యువతి ఆక్రోశం నా అంగీకారం లేకుండా చిత్రీకరించాడు, ఆ పోస్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదని యువతి వాపోయింది. ఆ వీడియో కింద అశ్లీల వ్యాఖ్యలు వస్తున్నాయి అని గోడు వెళ్లబోసుకుంది. పోకిరీ ఎక్కువగా చర్చ్ స్ట్రీట్‌లో అమాయకునిలా తిరుగుతూ చిత్రీకరిస్తూ ఉంటాడని గుర్తించారు. బాధితురాలు తన పోస్టును బెంగళూరు సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వీధుల్లో మహిళల వీడియోలు తీసి పోస్టింగ్ -
బాలికపై లైంగికదాడి, హత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో దారుణం సంభవించింది. రామనగర జిల్లా తావరెకెరెలో బాలిక మీద ఓ దుండగుడు అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. వివరాలు.. కొప్పళ నుంచి పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబం తావరెకెరెలో నివసిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు వెళ్లిన సమయంలో బాలిక (14) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు యల్లప్ప ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడు. తరువాత గ్యాస్ సిలిండర్‌తో కొట్టి బాలికను హత్య చేసి పరారయ్యాడు. సిలిండర్‌ను తీసికెళ్లి పక్క గ్రామంలో విక్రయించాడు. యల్లప్ప రాయచూరు నుంచి జీవనోపాధికై ఇక్కడకు వచ్చాడు. గార పని చేస్తూ తరచూ హతురాలి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను పలకరించేవాడు. అదే సమయంలో బాలికపై కన్నేసి ఘోరానికి ఒడిగట్టాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక ఘోరం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగుడు బైక్‌పై రావడం, వెళ్లడం కనిపించింది. యల్లప్పను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తావరకెరెలో ఘోరం నిందితుడు వలస కూలీ -
గుండెపోటుతో మహిళ మృతి?
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లిలోని ఒక దుకాణంలో కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. మృతురాలిని హరపనహళ్లి తాలూకాలోని దిద్దగితాండా నివాసి జయాబాయి(52)గా గుర్తించారు. ఆ మహిళ కుప్పకూలిన వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే జయాబాయి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించి ఉంటుందని అనుమానిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం రాయచూరు రూరల్: గ్రామాల్లో మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత కల్పిస్తామని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా మలయాబాద్లో కేకేఆర్డీబీ నుంచి విడుదలైన రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో తాగునీటి సౌకర్యాల కల్పన పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో విద్య, అరోగ్య రంగాలకు ప్రాముఖ్యత కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ యాదవ్, ఆంజనేయలున్నారు. నగరసభ అధ్యక్షుడిగా నియామకం రాయచూరు రూరల్: నగరసభ అధ్యక్షుడిగా సాజిద్ సమీర్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఏడాది క్రితం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నరసమ్మ స్థానంలో ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సాజిద్ సమీర్ మూడు నెలల కోసం అధ్యక్ష పదవిలో కొనసాగడానికి అధిష్టానం అనుమతించినట్లు సమాచారం. -
నేడు గురు పౌర్ణమి వేడుకలు
బళ్లారిఅర్బన్: గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం బాబాకు అలంకరణ, ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతపూజలను అర్చకులు నరసింహ స్వామి నిర్వహించారని దేవస్థాన ధర్మకర్త నామాల కుమారస్వామి తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలకు నగరంలోని షిర్డీ సాయిబాబా ఆలయాలు ముస్తాబయ్యాయి. అనంతపురం రోడ్డులో ఎంజీ సమీపంలోని విశాల్నగర్లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం తెల్లవారు జాము నుంచి కాకడ హారతి, గణపతి పూజ, సాయిబాబాకు పంచామృత, క్షీరాభిషేకం, అలంకరణ, భక్తి గీతాలు, కీర్తనలు, అర్చనలు, లఘు హారతి, మహామంగళ హారతి అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. యువతీ యువకులైన భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఆలయం వద్ద భక్తులకు అనుకూలం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. కాగా నగరంలోని కౌల్‌బజార్ షిర్డీ సాయిబాబా ఆలయంలో, కోటలో వెలసిన షిర్డీసాయి బాబా ఆలయంలో, పటేల్ నగర్లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు జరుపుకునేందుకు భక్తులకు ఏర్పాట్లు చేశారు. ముస్తాబైన షిర్డీ సాయిబాబా ఆలయాలు -
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని సంయుక్త కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్లుగా వేతనాలు ఇవ్వాలని, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి పలికి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకొని, పెంచిన ధరలను తగ్గించాలన్నారు. -
సంచార నియమాలు పరిశీలించిన కలెక్టర్
బళ్లారి రూరల్ : పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రమాదాలు అధికమౌతున్న నేపథ్యంలో దావణగెరె జిల్లాధికారి ట్రాఫిక్ కంట్రోలర్‌గా మారారు. దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి బుధవారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డెంటల్ కళాశాల రోడ్డు, బాయ్స్ హాస్టల్, స్పోర్ట్స్ హాస్టల్, ఎంసీసీ, బీ బ్లాక్, శ్యామనూరు వర్తుల రోడ్లలో వాహనాలను పరిశీలించి నేమ్‌ప్లేట్ లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారులకు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ నియమాలు, వాహనాల నేమ్ప్లేట్లు, హెల్మెట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాధికారి వెంట ట్రాఫిక్ పోలీసు అధికారులు ఉన్నారు. నేమ్ ప్లేట్ లేని 30 వాహనాల స్వాధీనం చోదకులకు కోర్టు ద్వారా నోటీసులుఇవ్వాలని అధికారులకు సూచన -
పారిశుధ్య కార్మికుల ర్యాలీ
హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దళిత హక్కుల కమిటీ కార్యకర్తలు విశ్వవిద్యాలయంలోని క్రియాశక్తి భవనం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత కమిటీ నేత జంబయ్య నాయక్ మాట్లాడుతూ వందలాది ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు కన్నడ విశ్వవిద్యాలయం స్థాపన కోసం తమ భూములను చాలా తక్కువ ధరకు ఇచ్చారు. మరికొందరు తమ భూములను ఉచితంగా ఇచ్చారు. అటువంటి ఎస్సీ, ఎస్టీ పేద రైతులు, వారి పిల్లలు, బంధువులు, వెనుకబడిన తరగతులు, దళిత సమాజానికి చెందిన 48 మంది గత 15–20 ఏళ్లుగా పారిశుధ్య కార్మికులుగా తక్కువ వేతనాలకు కన్నడ విశ్వవిద్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరు గత 11 నెలలుగా వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం వినతిపత్రాన్ని వర్సిటీ వైస్ ఛాన్సలర్ పరశివమూర్తికి అందజేశారు. -
డీకే శివకుమార్ సీఎం కాలేరు
బళ్లారి అర్బన్: సీఎం సిద్దరామయ్య సీజనల్ పొలిటీషియన్తో పాటు మేధావి రాజకీయ నాయకుడని, ఆయన ఎట్టి పరిస్థితిలోను తాను అట్టిపెట్టుకున్న సీఎం స్థానాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేరు, దీంతో డీకే.శివకుమార్ సీఎం అయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం చెప్పారు. ఆయన తమ నివాసంలో స్థానిక మీడియాతో మాట్లాడారు. గతం 30 నెలల నుంచి కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉంది. వీరి హయాంలో ఏ అభివృద్ధి జరగలేదు. కేవలం గ్యారెంటీ గ్యారెంటీ అంటూ తమ ప్రభుత్వానికి గ్యారెంటీ లేకుండా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. డీకే.శివకుమార్ సీఎం కుర్చీ కోసం, అలాగే సీఎం సిద్దరామయ్య ఆ పదవిని కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారన్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని సిద్దు సర్కారుపై శ్రీరాములు మండిపడ్డారు. దళిత సీఎం పేరుతో డీకేశికి చెక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుర్జేవాలా గత వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు. సీఎం మార్పు డిమాండ్ తీవ్రత పెరగడంతో రాష్ట్ర రాజకీయాలను అతుకుల బొంతలా మార్చి వెళ్లిపోయారన్నారు. శివకుమార్ సీఎం కుర్చీ కోసం పరితపిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి అనివార్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న శ్రీరాములు, ఇది తాను చెప్పే జోస్యం కాదు, నగ్న సత్యం అని అభివర్ణించారు. దళిత సీఎంను తెరపైకి తెచ్చి శివకుమార్‌ను అణచివేసే కుట్ర జరిగిందన్నారు. దళిత సీఎంకు తమ అభ్యంతరం ఏమీ లేదు. అయితే కుర్చీల కొట్లాటలో రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదన్నారు. తమ స్వపక్ష ఎమ్మెల్యేలే సర్కారును నిధుల కోసం దేబిరించే పరిస్థితి గత 30 నెలల్లో చాలాసార్లు చూశామన్నారు. పలువురు ఎమ్మెల్యేలు గ్యారెంటీలను పక్కన పెట్టి తమకు నిధులు ఇవ్వాలని వేడుకుంటున్నారన్నారు. రాష్ట్ర ఖజానా దివాలా రాష్ట్రానికి ఈ దుర్గతి రాకుండా ఉండాల్సింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు షూ, సాక్స్ ఇవ్వడానికి ప్రభుత్వం దాతలను వెతుకుతోందన్నారు. అలాగే అజీమ్ ప్రేమ్‌జీ ఇచ్చిన గుడ్లను వారానికి 6 రోజుల పాటు పంపిణీ చేయకుండా కేవలం మూడు రోజులకే పరిమితం చేశారన్నారు. దాతలు ఇచ్చిన నిధులను కూడా స్వాహా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 10 పాలికె ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవన్నారు. దీంతో సదరు ఉద్యోగులు గత రెండు రోజుల నుంచి ఆందోళన చేపట్టారన్నారు. అన్ని శాఖలు కూడా దివాలా తీశాయన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాక పోతే రాజీనామా చేస్తే తాము ఎన్నికలకు సిద్ధం అన్నారు. పార్టీ ప్రముఖులు వీరశేఖర్‌రెడ్డి, ఓబులేష్, భీమన్న, కార్పొరేటర్లు రేణుక మల్లనగౌడ, కే.హనుమంతప్ప, గుడిగంటి హనుమంతప్ప, వెంకటరామిరెడ్డి, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు జోస్యం మధ్యంతర ఎన్నికలకు మేం సిద్ధం -
దైన్యంగా కాలువలు
నిండుగా జలాశయాలు.. రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకోవాలనే ఆశలు అడియాసలు కానున్నాయి. రాయచూరు జిల్లాలోని సింధనూరు, మాన్వి, రాయచూరు తాలూకాల్లో తుంగభద్ర ఎడమ కాలువ, కృష్ణా నదిపై నిర్మించిన నారాయణపూర్ డ్యాం నుంచి రాయచూరు, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో నారాయణపుర కుడి, ఎడమ గట్టు కాలువలున్నాయి. గత కొన్నేళ్ల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు, ప్రజలు దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్న నీటి వనరులను వినియోగించుకొని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. జలాశయాల కింద ఆయకట్టు చివరి భూముల రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారైంది. పంట భూములు కళ్ల ముందే బీళ్లుగా మారడంతో రైతులు తల్లడిల్లి పోతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికలతో కాలువలు పూడిపోయాయి. జిల్లాకు వర్షాభావం శాపమైతే, పాలకుల శీతకన్ను కాలువల పాలిట శాపమైంది. జిల్లాకు వరప్రసాదమైన తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల ఆధునికీకరణ పేరుతో ప్రతి ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చైనా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా ఉండిపోయాయి. కాలువకు నీరు వదిలిన మొదట్లోనే కాలువలకు గండ్లు పడడం, ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులకు గురి కావడం షరామామూలైంది. నిర్లక్ష్యానికి నిదర్శనంగా నాసిరకం పనులు తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల ఆధునికీకరణల పేరుతో చేపట్టిన పనులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కాలువలపై జంగిల్ కటింగ్, పూడికతీత వంటి పనులు చేసినట్లు కాంట్రాక్టర్లు రికార్డులు చూపించి సొమ్ములను స్వాహా చేస్తున్నారు. తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో రాయచూరు తాలూకాలో 99, 101, 102 డిస్టిబ్యూటర్ల వద్ద తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. నారాయణపుర కుడి కాలువ పరిధిలో లింగసూగూరు, దేవదుర్గ తాలూకాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మమదాపుర, మర్చటహాళ్లలో పీస్ వర్క్‌ల పేరుతో పనులు చేపట్టారు. కాలువల స్వరూపం మారింది. కొన్ని చోట్ల బండలు తీసి నల్లమట్టిని కప్పి పూడికను తీసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఏడాది కాలువ చివరి ఆయకట్టు భూములకు నీరందడం గగనమని రైతులు వాపోయారు. పనులు నాసిరకంగా జరిగినా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. కాంట్రాక్టర్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కమీషన్ ఇవ్వడం వల్ల పనుల్లో పర్యవేక్షణ లోపించిందని రైతులు ఆరోపిస్తున్నారు. పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర, కృష్ణా నదులు ఈసారైనా చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందేనా? వర్ణనాతీతంగా కళ్యాణ కర్ణాటక రైతుల బాధలు -
రాయచూరు జెడ్పీ సీఈఓగా నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండే కలబుర్గి డివిజనల్ విద్యా శాఖ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో కారవార జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ఆయన విధులకు హాజరయ్యారు. జిల్లాలో భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా కాడ్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం భారత జ్ఞాన విజ్ఞాన సమితి, వాసవి వనితా సేవా సమితి ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వాసవి వనితా సేవా సమితి కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి కల్పించిన యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారత జ్ఞాన విజ్ఞాన సమితి సంచాలకుడు హఫీజుల్లా, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు రూ.2.5 కోట్ల భూమి దానం హొసపేటె: ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం కోసం ఒక రైతు కోట్ల విలువైన భూమిని దానంగా ఇచ్చిన ఘటన తాలూకాలోని హంపనకట్టెలో జరిగింది. గ్రామంలో ఎల్కేజీ, యూకేజీ నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో తాలూకాలో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. పాఠశాలలోని 14 గదుల్లో 750 మందికి పైగా పిల్లలు చదువుకోవాల్సి ఉంది. విద్యార్థులకు సరైన పాఠశాల భవనం, గదులు లేకుండా పోవడంతో స్థల యజమాని అమరేష్గౌడ పాఠశాల నిర్మాణం కోసం రూ.2.5 కోట్ల విలువైన ఒక ఎకరం భూమిని దానంగా ఇచ్చారు. -
చెరసాలలో ఉగ్రవాదులతో కుమ్మక్కు
బనశంకరి: ప్రమాదకర లష్కరే తోయిబా ఉగ్రవాదులతో ఓ పోలీస్ అధికారి, మానసిక వైద్యుడు, మహిళ కుమ్మక్కయ్యారు, వారి చేతిలో పావులుగా మారి దేశద్రోహానికి పాల్పడ్డారు, ఇది సినిమా కథ కాదు, బెంగళూరులో పేరుమోసిన పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న దందా. చివరకు ఎన్ఐఏ దాడుల్లో ముగ్గురు దుండగుల గుట్టు రట్టయింది. నాసీర్ నెట్వర్క్ మంగళూరు కుక్కర్బాంబ్, శివమొగ్గ ఉగ్రకార్యకలాపాలు, బెంగళూరులో కెఫె పేలుడుతో పాటు అనేక ఉగ్రవాద ఘటనలతో ప్రముఖ లష్కరే ఉగ్రవాది టి.నాసీర్కు సంబంధాలున్నాయి. అతనితో లింకులు ఉన్న వైద్యుడు, ఏఎస్ఐ, మరో మహిళను ఎన్ఐఏ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఉగ్రవాద కేసుల్లో నాసీర్ ఈ జైల్లోనే జీవితఖైదును అనుభవిస్తున్నాడు. పరప్పన జైలులో పనిచేసే మానసిక వైద్యుడు డాక్టర్ నాగరాజ్, జైలులోని ఏఎస్ఐ చాంద్‌పాషాలతో అనుమానిత ఉగ్రవాది తల్లి అనీశ్ ఫాతిమాతో నాసీర్ నిత్యం టచ్‌లో ఉన్నట్లు కనిపెట్టారు. ఇలా నాసీర్ ఊచల మధ్య నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడైంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలో స్లీపర్ సెల్స్‌తో సంబంధాలు కొనసాగిస్తూ బెంగళూరులో పెద్దఎత్తున విధ్వంసక చర్యలకు కుట్రపన్నాడనేది సమాచారం. గతంలో అరెస్టయిన ఉగ్ర అనుమానితులు జునైద్, మహమ్మద్ హర్షద్‌ఖాన్, సుహైల్, ఫైజల్, జాహిద్ తబ్రేజ్, ముదాసీర్ లకు కూడా డాక్టర్ నాగరాజ్, చాంద్‌పాషా, అనీస్ ఫాతిమా సహాయం చేస్తున్నారు. వీరూ పరప్పన జైల్లోనే ఉన్నారు. ఏఎస్ఐ చాంద్‌పాషా.. 2022 నుంచి నాసీర్‌తో ఏఎస్ఐ చాంద్‌పాషా కుమ్మక్కయ్యాడు. నాసీర్‌ను జైలు నుంచి వాయిదాల కోసం ఏయే కోర్టుకు తీసుకెళతారు అనే సమాచారం అతని సంబంధీకులకు లీక్ చేసేవాడు. పరారీలోనున్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ తల్లి అనీస్ ఫాతిమా, నిరంతరం నాసీర్‌తో సంప్రదించేది. ఉగ్రవాదులకు నిధులు, శిక్షణ గురించి మాట్లాడుకునేవారు. ఆమె ఈ సమాచారాన్ని విదేశాల్లో ఉన్న కుమారుడు జునైద్ కు తెలిపేది. నాగరాజు.. జైల్లో మొబైల్ వ్యాపారం డాక్టర్ నాగరాజ్ నాలుగైదేళ్ల నుంచి పరప్పన జైలులో మానసిక వైద్యునిగా పనిచేస్తూ అక్రమాలకు నాంది పలికాడు. అతని అసిస్టెంట్ పవిత్ర కూడా తోడైంది. నాసీర్ తో పాటు ఖైదీలకు మొబైల్ స్మగ్లింగ్ చేసేవాడు. పవిత్ర పరారీలో ఉంది. నాగరాజు పరప్పన జైలులోకి దొంగచాటు మొబైల్‌ఫోన్స్ తీసుకెళ్లి రూ.10 వేల మొబైల్ ను రూ.50 వేలకు ఖైదీలకు విక్రయించేవాడు. ఇలా లక్షలాది రూపాయలను సంపాదించాడు. మొబైల్ కొనుగోలుదారుల నుంచి వాటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. దేశాన్ని అస్థిరపరిచేలా పరప్పన జైలు లోపల సాగుతున్న కార్యకలాపాలను చూసి ఎన్ఐఏ అధికారులే దిగ్భాంత్రికి లోనయ్యారు. 6 రోజుల కస్టడీ నాగరాజ్ , చాంద్‌పాషా, అనీస్ ఫాతిమా ఇళ్లు, సంబంధీకుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు సాగిస్తోంది. ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఉపకరణాలు, పుస్తకాలు, సీడీలు వంటి సామగ్రిని సేకరిస్తోంది. ఈ ముగ్గురినీ అనుమానిత ఉగ్రవాదులుగానే పేర్కొన్నారు. బుధవారం నగరంలోని సిటీ సివిల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 6 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ఆదేశించింది. విచారణలో మరిన్ని నిజాలు వెల్లడి కావచ్చు. పరప్పన జైలు మానసిక వైద్యుడు, పోలీసు అరెస్టు అనుమానిత ఉగ్రవాది తల్లి కూడా ఎన్ఐఏ కార్యాచరణలో గుట్టురట్టు -
ఎమ్మెల్యేపై భార్య, కూతురు ఫిర్యాదు
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్పై ఆయన భార్య, కుమార్తె కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలాను భార్య మాళవిక సోలంకి, కుమార్తె నిషా కలిశారు. యోగేశ్వర్ తమను ఎంతో వేధింపులకు గురిచేస్తున్నారని, కేసులు పెడుతూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడని తెలిపారు. ఆయన చర్యలతో తాము మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామని, తమకు పార్టీ తరఫున న్యాయం చేయాలని కోరారు. కాగా యోగేశ్వర్ కుటుంబ కలహాలు గతంలోనూ రచ్చకెక్కాయి. ఎన్నికల సమయంలో ఆయన కూతురు తండ్రిపై పోటీకి సై అన్నారు. యోగేశ్వర్ శీలాకుమారి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. లంచగొండి పట్టివేత కోలారు: నివేశనానికి ఈ–ఖాతా చేసివ్వడానికి వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ముళబాగిలు నగరసభ ఎస్డిఎ ప్రశాంత్ లోకాయుక్త కు చిక్కారు. ఇతనిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. నేర్నహళ్లి గ్రామానికి జయరాం అనే వ్యక్తి ఇంటి ఈ–ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ పని చేసివ్వడానికి ఎస్డిఎ ప్రశాంత్ రూ.6 వేల లంచం అడిగాడు. దీంతో జయరాం లోకాయుక్త అధికారులకు సమాచారమిచ్చాడు. బుధవారం ఆఫీసులో రూ.5 వేలు ముడుపు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త ఇన్స్పెక్టర్ అంజనప్ప, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. బైక్‌లు ఢీ, హెచ్ఎం దుర్మరణం శివమొగ్గ: రెండు బైక్‌లు ఎదురెదురు ఢీకొనడంతో ప్రధానోపాధ్యాయుడు మరణించగా, మరొకరికి గాయాలైన ఘటన జిల్లాలోని హొసనగర తాలూకా రిప్పన్పేటె పట్టణంలోని శివమందిరం వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. మృతుడు అరసాళు గ్రామానికి చెందిన టీ.మంజయ్య (59) కాగా, కోటెతారిగ ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో విధులు ముగించుకుని మంజయ్య బైక్‌పై ఇంటికి వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైకిస్టు ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మంజయ్యను స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజురెడ్డి సందర్శించి పరిశీలించారు. మంజయ్య మృతితో ఉపాధ్యాయులు, విద్యార్థులు విషాదానికి లోనయ్యారు. మహిళపై సామూహిక అత్యాచారంబనశంకరి: స్నేహితుల ఇంటికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన నగరంలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. దొడ్డనాగమంగల సాయి లేఔట్లో స్నేహితుని ఇంటికి వచ్చిన మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మహిళ వద్ద డబ్బు, మొబైల్ లాక్కుని ఉడాయించారు. ఈ ఘటన మూడురోజుల కిందట జరగ్గా, బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పౌర కార్మికులకు వాయనం మైసూరు: శ్రీదుర్గా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా మైసూరు చాముండి కొండలో శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిళా పౌర కార్మికులకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమతో వాయనం సమర్పించారు. వారి సేవలను అభినందించారు. షేర్ల పేరుతో రూ.34 లక్షల మస్కా శివమొగ్గ: షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని వాట్సాప్‌కు వచ్చిన సందేశాన్ని నమ్మి ఓ వ్యక్తి లక్షలాది రూపాయలను కోల్పోయిన ఘటన శివమొగ్గ నగరంలో వెలుగు చూసింది. వివరాలు.. బీబీ రోడ్డు నివాసి, 30 ఏళ్ల బాధితుని మొబైల్‌కు సైబర్ నేరగాళ్ల నుంచి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు గడించవచ్చని అందులో ఉంది. దీనిని నమ్మిన బాధితుడు దశల వారీగా వంచకుల బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ద్వారా మొత్తం రూ.34.16 లక్షలను బదలాయించాడు. త్వరలోనే భారీ లాభం చూపిస్తామని నమ్మించారు. అయితే అతని నంబరును బ్లాక్ చేసి అందుబాటులో లేకుండాపోయారు. ఈ మోసంపై శివమొగ్గ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. -
ఉగ్రవాదులకు సిమ్ కార్డులు
కోలారు: కోలారు తాలూకా భట్రహళ్లి నివాసి సతీష్ గౌడ అనే వ్యక్తి కోసం ఎన్ఐఎ అధికారులు బుధవారం రావడం కలకలం రేపింది. అతడు లేకపోవడంతో విచారణకు రావాలంటూ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న మొబైల్ సిమ్ కార్డును గతంలో సతీష్‌గౌడ యాక్టివేషన్ చేసిచ్చాడనే ఆరోపణలున్నాయి. నిందితుడు భట్రహళ్లిలోని భార్యతో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. బెంగుళూరు కోరమంగలలోని ఓ ప్రైవేటు టెలికాం కంపెనీలో పనిచేశాడు, అప్పుడు ఇతడు యాక్టివేట్ చేయించిన సిమ్ కార్డులనే ఉగ్రవాదులు ఉపయోగించారని 2023లో ఎన్ఐఎ అధికారులు గుర్తించి సతీష్గౌడకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి విచారణకు వచ్చారు. నా భర్త అమాయకుడు ఎన్ఐఎ అధికారులు వస్తున్నట్లు తెలిసి సతీష్‌గౌడ ఇంటి పరారైనట్లు తెలిసింది. దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీచేసిన ఎన్ఐఎ అధికారులు బెంగళూరు ఇందిరనగరలో ఉన్న ఎన్ఐఎ ఆఫీసుకు రావాలని నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సతీష్‌గౌడ భార్య హేమావతి.. నా భర్త ఏ తప్పు చేయలేదు. కంపెనీ వారు రోజూ కొన్ని సిమ్‌లు యాక్టివేట్ చేయాలని టార్గెట్ ఇచ్చేవారు, కంపెనీ చెప్పినట్లు చేశాడు, ఆ కంపెనీలో ఉద్యోగం వదిలిన తరువాత వేరే కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడే ఏ పనీ లేకుండా ఇంట్లో ఉంటున్నారని తెలిపింది. నిరపరాధి అయిన భర్త అరెస్టు చేస్తారనే భయంతో ఫోన్ కూడా స్విఛాప్ చేసుకుని ఎక్కడికి వెళ్లారో తెలియదని విలపించింది. టెలికాం సంస్థ మాజీ ఉద్యోగి కోసం ఎన్ఐఏ గాలింపు -
సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్సార్
బనశంకరి: ఆరోగ్యశ్రీ రూపకర్త, జలయజ్ఞ ప్రదాత, సంక్షేమ పథకాల సారథి దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్ట్‌లో కేక్ కట్ చేసి వృద్ధులకు, పిల్లలకు అందజేశారు. పిల్లలు, విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు అందజేసి, అన్నదానం నిర్వహించారు. అందరి జీవితాల్లో వెలుగు వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, జలయజ్ఞంతో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. ఫీజు రీఇంబర్స్మెంట్ పథకంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని, అన్నివర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత నేత డాక్టర్ వైఎస్సార్ ఒక్కరే అని కొనియాడారు. పాల్గొన్న నేతలు ఈ కార్యక్రమంలో కడప జిల్లా వైఎస్సార్సీపీ ఐటీవింగ్ అధ్యక్షుడు కుమారస్వామిరెడ్డి, వైఎస్సార్‌ీసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ లయన్ భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఐటీవింగ్ రాష్ట్ర ప్రతినిధి జగన్ పూసపాటి, ఐటీ వింగ్ రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తంబళ్లపల్లి ఐటీవింగ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కర్ణాటక డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామ్ సుదేశ్రెడ్డి, రామ్ పులివెందుల, సతీశ్‌చంద్ర, విజయరాఘవరెడ్డి, కేశవరెడ్డి, పూల సురేంద్రరెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. కాగా, పలుచోట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు మహా నేత జయంతిని జరిపించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బెంగళూరులో ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పాల్గొన్న ఐటీ వింగ్ సభ్యులు, అభిమానులు -
సివిల్స్ కలలు భగ్నం
● గుండెపోటుకు యువతి బలి హుబ్లీ: సివిల్స్ పరీక్షల్లో పాస్ కావాలి, ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలనేది ఆమె కల. కానీ మాయదారి గుండెపోటు ఆ కలల్ని ఛిద్రం చేసింది. బుధవారం ధార్వాడ పురోహిత నగరలో జీవిత కుసగూర (26) అనే విద్యావంతురాలు ఆకస్మికంగా మరణించింది. ఉదయం ఇంట్లో ఉండగా తల తిప్పినట్లుగా ఉందని చెబుతూ కూర్చుండిపోయింది. కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే శ్వాస వదిలింది. ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గుండెపోటుతో మరణించిందని ప్రకటించారు. ఎంఎస్సీ అగ్రిక ల్చర్ చదువుతున్న జీవిత యూపీఎస్ఈ పరీక్షలు రాసి ఐఏఎస్ అధికారి కావాలని కలలు కంది. ఈమె తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. బిడ్డ చిరుప్రాయంలోనే మృత్యువాత పడటంతో కన్నీటి సంద్రంలో మునిగి పోయారు. -
సంబరంగా ఆషాఢ గోరింటాకు పండుగ
సాక్షి,బళ్లారి: నిత్యం పని ఒత్తిడితో బిజిబిజీగా గడిపే మహిళలందరూ కలిసికట్టుగా ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ఆషాఢ మాసంలో నిర్వహించే గోరింటాకు పండుగను నగరంలోని ఎంఆర్వీ లేఅవుట్లోని డాక్టర్ సతీష్‌రెడ్డి ఇంటి సమీపంలో ప్రధాన రహదారిలో మహిళలకు పెద్ద సంఖ్యలో సంప్రదాయబద్ధంగా గోరింటాకును తయారు చేసుకుని, ఒకరికొకరు గోరింటాకు అంటించుకుని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా ఎంఆర్వీ లేఅవుట్, హరిప్రియ లేఅవుట్, హెచ్ఎంటీ లేఅవుట్లకు చెందిన మహిళలు మాట్లాడుతూ మన సంస్కృతి వారసత్వాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. మహిళలకు గోరింటాకు పండుగ అంటే ఎంతో ఇష్టమన్నారు. అందరం కలిసి మెలసి ఒకే చోట చేరి పండుగ చేసుకోవడంతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. -
ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం
రాయచూరు రూరల్: తాలూకా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో శిశువుల మార్పిడి చోటు చేసుకుంది. సింధనూరు తాలూకా గాంధీనగర్‌కు చెందిన రేవతి అస్పత్రిలో మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఈ విషయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు రేవతి ఆస్పత్రిలో మగ పిల్లవాడికి జన్మనివ్వలేదు, ఆడ శిశువుకు జన్మనిచ్చావంటూ ఆమెకు ఆడ శిశువును అందించడంతో ఆమె దిగులు చెందింది. తనకు పుట్టిన శిశువు మగ బిడ్డని చెప్పిన వైద్యులు, నర్సులు అర గంటలోనే శిశువులను మార్పు చేశారని, తనకు న్యాయం చేయాలని డీఎన్ఏ పరీక్ష ద్వారా తమకు మగ బిడ్డను ఇవ్వాలని వాదిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సింధనూరు తాలూకా ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తున్నట్లు వారు ఆరోపించారు. తాగుడుకు డబ్బివ్వనందుకు భార్య హత్య●నిందితునికి యావజ్జీవ కారాగారం, రూ.50 వేల జరిమానా సాక్షి,బళ్లారి: తాగుడుకు డబ్బులు ఇవ్వనందుకు భార్యను చంపిన భర్త కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ కలబుర్గి ఐదవ జిల్లా సెషన్స్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. వివరాలు.. కలబుర్గి తాలూకా కురనళ్లి గ్రామానికి చెందిన మహంతప్పకు అదే గ్రామానికి చెందిన మల్కప్ప కట్టెమని కుమార్తె సంగీతను ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే తాగుడుకు బానిసైన మహంతప్ప ప్రతి నిత్యం డబ్బుల కోసం భార్యను వేధిస్తుండేవాడు. 2023లో డిసెంబర్ 26న భార్యాభర్తల మధ్య గొడవ పతాకస్థాయికి చేరడంతో తాగుడుకు డబ్బులు ఇవ్వనందుకు మహంతప్ప భార్యను కొట్టి చంపాడు. ఈ ఘటనపై భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయస్థానం నిందితుడికి పైమేరకు జైలు శిక్ష విధించింది. రాయచూరు వర్సిటీకి రూ.34 కోట్ల విడుదలరాయచూరు రూరల్: ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయానికి రూ.34 కోట్ల నిధులు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి విడుదల అయ్యాయని ఆ వర్సిటీ వైస్ చాన్సలర్ శివానంద కెళగినమని తెలిపారు. మంగళవారం వర్సిటీ సభాభవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీ పరిధిలో 56,343 మంది విద్యార్థులున్నారన్నారు. 20 శాఖలు పని చేస్తున్నాయన్నారు. 80 మంది అతిథి అధ్యాపకులు, 90 మంది తాత్కాలిక ఉద్యోగులు కూడా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త కోర్సులను ప్రవేశ పెడతామన్నారు. రిజిస్ట్రార్లు చెన్నప్ప, జ్యోతి డీ.ప్రకాష్, ఆర్థిక అధికారి వెంకటేష్, సుయమీంద్ర కులకర్ణిలున్నారు. వీధి కుక్కలు, పశువుల బెడద అరికట్టరూ రాయచూరు రూరల్: నగరంలో అధికమైన వీధి కుక్కలు, పఽశువుల బెడద నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్టూడెంట్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) డిమాండ్ చేసింది. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మీర్జా హసన్ బేగ్ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు పిల్లలను కరుస్తున్నాయని ఆరోపించారు. రహదారుల్లో ఆవులు విశ్రమించడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతూ నగరసభ అధికారికి వినతిపత్రం సమర్పించారు. అక్బర్, మతీన్, తౌసిఫ్, మహ్మద్ ఫారూక్, సైదాబేగం, షేక్, ఎం.గౌస్లున్నారు. నగర బీజేపీ అధ్యక్షుడుగా నియామకంబళ్లారి టౌన్: నగర బీజేపీ నూతన అధ్యక్షుడుగా మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ నేత అరుణ్ షాపూర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వెంకటరమణ మాత్రమే నామినేషన్ సమర్పించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు అనిల్ నాయుడు, ఎమ్మెల్సీ సతీష్, నాయకులు కేఎస్ దివాకర్, ఓబుళేసు ఆధ్వర్యంలో బాధ్యతలను స్వీకరించారు. -
నలుగురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్
హుబ్లీ: కలబుర్గి జిల్లా శహాబాద్ నగరం ధక్కా తాండాలో బంగారు ఆభరణాలు దోపిడీ చేసిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను శహాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 135 గ్రాముల బంగారు ఆభరణాలు, 550 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు మొత్తం కలిపి రూ.8.95 లక్షల విలువ చేసే ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీకి వాడిన 5 చాకులను కూడా జప్తు చేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. శహాబాద్ ధక్కా తాండా నివాసి రవిశంకర్ రాథోడ్ (42), అక్కలకోటె శివాజీ నగర తాండా నివాసి మహదేవ రాథోడ్(38), క్యాదపుర తాండా నివాసి శివకుమార్ రాథోడ్(25), అనగేరి గోపాలనాయక్ (30) అరెస్ట్ అయిన నిందితులు. మరో నిందితుడు సునీల్ బాబు రాథోడ్ తప్పించుకొని పరారు కాగా అతడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టామన్నారు. చీరలతో చేతులు, కాళ్లు కట్టి.. గత నెల 22న రాత్రి 1.30 గంటలకు శహాబాద్ నగర ధక్కా తాండా హనుమంత పాండు పవార్ ఇంట్లోకి చొరబడిన హనుమంత, ఆ ఇంట్లో ఉన్న వారిని చీరలతో చేతులు, కాళ్లు కట్టి చాకులు, కత్తులు చూపించి ఇంట్లో ఉన్న సదరు మొత్తం రూ.15,26,500 విలువ చేసే ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. ఘటనపై శహాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. దర్యాప్తు కోసం ఏఎస్పీ మహేష్ మేఘణ్ణవర, డీఎస్పీ శంకర్‌గౌడ పాటిల్, సీఐ నటరాజ్ నేతృత్వంలో ఎస్ఐ శమరాయ, ఏఎస్ఐలు మల్లికార్జున, గుండప్ప, సిబ్బంది నాగేంద్ర, మల్లికార్జున, బలరామ, సంతోష, హుస్సేన్‌పాషా తదితరులతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈ నెల 3న మహారాష్ట్రలోని అక్కలకోటె వద్ద హైవేలో నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా ఇంతకు ముందు జేవర్గి తదితర చోట్ల దోపిడీ కేసులు నమోదు అయ్యాయని వివరించారు. కాగా ఈ బందిపోటు దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన శ్వానదళ బృందం సేవలను ఎస్పీ ప్రశంసించారు. మహిళ ఆత్మహత్య మరో ఘటనలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. హుబ్లీ కృష్ణాపుర వీధి నివాసి మహిజబీన్ బంకాపుర(39) తన ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులను తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తులో ఉందని మహిళా స్టేషన్ పోలీసులు తెలిపారు. రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం కలబుర్గి జిల్లా ఎస్పీ అడ్డూరు శ్రీనివాసులు వెల్లడి -
రేపు సాయి మందిరంలో ప్రత్యేక పూజలు
రాయచూరు రూరల్: నగరంలోని పబ్లిక్ గార్డెన్స్‌లోని సాయిబాబా ధ్యాన మందిరంలో ఈనెల 10న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు సాయిబాబా ధ్యాన మందిరం ట్రస్టీ కిరణ్ ఆదోని తెలిపారు. మంగళవారం సాయిబాబా మందిరంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుపౌర్ణిమ సందర్భంగా 6 గంటలకు కాకడ హారతి, మహా రుద్రాభిషేకం, పుష్పాభిషేకం, సాయి సత్యనారాయణ పూజలు, పల్లకీ సేవలు, ధూపహారతి, అన్న దాసోహ కార్యక్రమాలను చేపడతారన్నారు. విలేఖర్ల సమావేశంలో ప్రవీణ్ ప్రభ శెట్టర్, కేశవమూర్తి, ఈరన్న, అన్వర్ పాషా, తానాజీలున్నారు. శాంతించిన తుంగభద్ర ● జలాశయానికి తగ్గిన వరద నీరు హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్యాంకు వస్తున్న వరదనీరు నిలకడగా ఉంది. మంగళవారం డ్యాంలో నీటి నిల్వ 75.594 టీఎంసీలకు చేరుకోగా డ్యాం వద్ద 16 క్రస్ట్‌గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి దిగువకు సుమారు 49 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.83 అడుగులు, ఇన్‌ఫ్లో 52 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 61,145 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలిరాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ. దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేర తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగాన సౌకర్యాలున్నాయని వివరించారు. యరగేర నుంచి 2 కి.మీ దూరంలో 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందన్నారు. రాయచూరు నుంచి మంత్రాలయం, కర్నూలు, విజయవాడ, గుడివాడ, బెంగళూరు, ద్రాక్షారామ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. విలేఖర్ల సమావేశంలో బసవరాజ్, మహబూబ్ పటేల్, విద్యానంద రెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు. జిల్లాధికారికి అభినందన పత్రంరాయచూరు రూరల్: రాయచూరు జిల్లాధికారి నితీష్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందన పత్రం లభించింది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు సంబంధించి జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాధికారి సర్వేలో పథకాలను ప్రజలకు సక్రమంగా అందజేయడంలో తీసుకున్న చొరవకు అభినందనలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ లేఖ రాశారు. భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృ వందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో చూపిన చొరవకు ఈ అభినందన పత్రం అందించారు. చెత్త బట్వాడాపై అవగాహన హొసపేటె: 31వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తారిహళ్లి జంబునాథ వార్డులో తిరుగుతూ చెత్త పారవేయడానికి ఉచితంగా డస్ట్‌బిన్(చెత్తబుట్ట)లను పంపిణీ చేసి చెత్త విలేవారి గురించి అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను ఇంట్లోనే వేరు చేసి చెత్త వాహనానికి ఇవ్వాలని ఆయన అన్నారు. వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి ప్రాథమిక కర్తవ్యం అని, ప్రజలు సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికీ, అంతస్తుకు వెళ్లి తడి, పొడి చెత్త కోసం వేర్వేరుగా చెత్త బుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. 13న జమ్ముకశ్మీర్ ఆందోళనలో పాల్గొంటాం హుబ్లీ: జమ్ముకశ్మీర్‌లో 5 లక్షల మంది హిందువులు పునర్నివసించేలా డిమాండ్ చేస్తూ ఈ నెల 13న జమ్ములో జరుగనున్న ప్రపంచ స్థాయి హిందూ పర సంఘాల సమావేశంలో శ్రీరామ సేన పాల్గొంటుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హుబ్లీలో నేహా హిరేమఠ హత్య జరిగి ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. -
జెడ్పీ సీఈఓ రాహుల్ కలబుర్గికి బదిలీ
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా పంచాయతీ ముఖ్య కార్య నిర్వహణాధికారి రాహుల్ తుకారాం పాండేను కలబుర్గి డివిజన్ విద్యా శాఖ కమిషనర్‌గా బదిలీ చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ప్రధాన కార్యదర్శి మహంతేష్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాయచూరు జెడ్పీ సీఈఓగా కారవార జెడ్పీ సీఈఓగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్ కుమార్‌ను నియమించారు. బాగల్కోటె జెడ్పీ సీఈఓగా కలబుర్గి డివిజనల్ విద్యా శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకాష్‌ను నియమించారు. యాదగిరి జిల్లాధికారిణిగా విధులు నిర్వహిస్తున్న సుశీలను కలబుర్గి డివిజనల్ కేఎస్ఆర్టీసీ ఎండీగా, యాదగిరి జిల్లాధికారిగా అటల్ జన స్నేహి డైరెక్టర్ బీహెచ్.నారాయణరావ్ను, బాగల్కోటె జెడ్పీ సీఈఓ శశిధర్ కురేరాను బెంగళూరు కేయూఐడీబీ ఎండీగా బదిలీ చేశారు. -
లంచగొండి మంత్రి రాజీనామా చేయాలి
బళ్లారిటౌన్: మఠాలకు మంజూరైన నిధుల విడుదలకు 20 నుంచి 25 శాతం లంచం డిమాండ్ చేసిన మంత్రి శివరాజ్ తంగడిగి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ వైఎం సతీష్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 2022లో నాగప్రసన్న విశ్వ గాణిగర ట్రస్ట్ అభివృద్ధికి అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై రూ.3.5 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.2 కోట్లు ఆనాడే విడుదల అయ్యాయని, మిగిలిన రూ.1.5 కోట్లు బాకీ ఉండగా ఈ ప్రభుత్వంలో వాటి విడుదల కోసం కాలయాపన చేశారన్నారు. దీనిపై ఈఏడాది మార్చిలో కోర్టును ఆశ్రయించగా నెలలోగా మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని, ఆలస్యం అయితే 6 శాతం జరిమానాతో కలిపి చెల్లించాలని కూడా ఆదేశించిందన్నారు. అయితే కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా సాగదీస్తూ వస్తున్నారన్నారు. ఇందులో 25 శాతం కమీషన్ ఇస్తేనే నిధులు ఇస్తామని మంత్రి సహచరులు అంటున్నారన్నారు. ఆనాడే నిధుల విడుదల మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి రూ.1.5 కోట్లు, గవియప్ప సర్కిల్ వద్ద గల శ్రీరామ మందిరం కోసం రూ.50 లక్షలను ఆనాడే మంజూరు చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు సగం మొత్తం మాత్రమే విడుదల చేసి మిగిలిన మొత్తాన్ని విడుదల చేయడానికి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఇటీవల దేవస్థానం కోసం రూ.5 కోట్ల నిధులు సమకూర్చినట్లు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ నిధులు ఏయే దేవస్థానాలకు ఇచ్చారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్‌నాయుడు, రాయకులు కేఎస్ దివాకర్, వెంకటరమణ, ఓబుళేసు తదితరులు పాల్గొన్నారు. -
పేదల గుండెచప్పుడు వైఎస్సార్
సాక్షి,బళ్లారి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదల గుండెల్లో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ఆర్ అభిమానులు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గాంధీభవన్‌లో, అనాథ ఆశ్రమంలో వైఎస్ఆర్ వీరాభిమాని నరాల రోసిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనాథల మధ్య వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారికి అన్నదానం చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి పథకాల రథసారథిగా గుర్తింపు పొందిన మహానేతను యావత్ఽ దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఆయన పాలనను అనుసరించారని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో కూడా కొన్ని పథకాలను అమలు చేశారన్నారు. పేదల కష్టాలను పాదయాత్రల్లో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారన్నారు. అప్పట్లో ఉన్న రైతుల విద్యుత్ బకాయిలను కూడా మాఫీ చేశారన్నారు. అదో అద్భుతమైన చరిత్ర అని, ఆ తొలి సంతకం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్ చలువే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నారంటే అది వైఎస్సార్ చలువేనని అన్నారు. ఆయన పథకాలను అన్ని రాష్ట్రాలకు చెందిన సీఎంలు అనుసరిస్తున్నారని కొనియాడారు. ఒక్క ఉచిత విద్యుత్ పథకమే కాకుండా ఆరోగ్యశ్రీ, 108, పేద విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, వృద్ధాప్య ఫించన్, జలయజ్ఞం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం, పంటల బీమా ద్వారా రైతులకు మేలు చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో ఎన్నెన్నో పథకాలను అమలు చేయడంతో రెండుసార్లు ఒంటి చేత్తో ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. మహానేత జనం మధ్యలో లేకపోయినా ఆయన చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలతో జనం నుంచి దూరం చేయలేరన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా పేదల సంక్షేమం కోసం పరితపించారన్నారు. ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారన్నారు. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎందరో జీవిస్తున్నారన్నారు. బళ్లారి నగరంలో ప్రాథమిక విద్యాభ్యాసం, కర్ణాటకలోని కలబుర్గిలో ఎంబీబీఎస్ పూర్తి చేశారన్నారు. వైఎస్సార్ బంధం విడదీయలేనిది ఉమ్మడి ఏపీతో పాటు కర్ణాటకతో కూడా వైఎస్సార్ బంధం విడదీయలేనిదన్నారు. అలాంటి మహానేత అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి అని, కోట్ల మందిలో అలాంటి గొప్ప గుణం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఒకరు పుడతారని, ఆ వ్యక్తే వైఎస్సార్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో పని చేశారన్నారు. అందరికీ ఆయన రోల్‌మాడల్‌గా నిలిచారన్నారు. అలాంటి సమర్ధవంతమైన పాలన అందించడంతోనే ఆయన అడుగుజాడలను పాలకులు అనుసరించారన్నారు. ఒకవేళ ఆయన పథకాలను ఎవరైనా జనం నుంచి దూరం చేస్తే వారికి రాజకీయ పుట్టగతులు కూడా ఉండవన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి సాధ్యం కాదని, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకునే పరిస్థితి వస్తుందని హేళన చేసిన అప్పటి సీఎం, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తున్నారంటే అది మహానేత వైఎస్సార్ ముందు చూపేనన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు మోహన్ కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ, అభివృద్ధి పథకాల సారథి వైఎస్సార్‌ను అనుసరించిన దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు -
డిమాండ్లు తీర్చాలని పాలికె ఉద్యోగుల ధర్నా
హుబ్లీ: వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పాలికె ఉద్యోగులు మంగళవారం సామూహికంగా విధులకు గైర్హాజరు కావడం ద్వారా ఆందోళన చేపట్టారు. 7వ వేతన కమిషన్ సౌకర్యాన్ని విస్తరించాలి. పాలికె బృందం నియామక నియమాలను సవరించాలి. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పాలికె సిబ్బందికి ఆరోగ్య జ్యోతి, ఆరోగ్య సంజీవిని అమలు చేయాలి. ఉద్యోగులకు పదోన్నతిని ఇవ్వాలి. పాలికె ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడా కూటమి నిర్వహించాలి. టీజీ ఐడీ, జీపీఎస్ సౌలభ్యాన్ని పాలికె సిబ్బందికి విస్తరించాలని సదరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. -
రేణుకాస్వామి హత్య తరహాలో కలబుర్గిలో దారుణహత్య
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్రదుర్గ జిల్లా రేణుకాస్వామి హత్య ఘటన మరువక ముందే అలాంటిదే ఓ హత్య కలబుర్గి జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కలబుర్గిలో అశ్వని అనే మహిళను రాఘవేంద్ర అనే వ్యక్తి వేధించడంతో ఆమె తన స్నేహితుడు గురురాజ్‌కు తెలియజేయడంతో గురురాజ్‌తో పాటు ఆయన ముఠా రాఘవేంద్ర(39)ను కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి హత్య చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఏ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థినుల సత్తా బళ్లారిటౌన్: గత నెలలో భారతీయ చార్టెర్డ్ అకౌంటెంట్స్ సంస్థ నిర్వహించిన సీఏ పరీక్షల ఫలితాలు ఈ నెల 5న విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో గ్రామీణ విద్యార్థినులు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సిరుగుప్ప తాలూకా హచ్చొళ్లికి చెందిన నీలమ్మ, బసవరాజ్ గౌడల పుత్రిక ఎం.శిల్ప, బళ్లారి తాలూకా బెళగల్‌కు చెందిన మమత, మంజునాథ్గౌడల పుత్రిక పవిత్ర సీఏ ఫైనలియర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించారు. వీరిరువురు కన్నడ మీడియంలోనే ప్రాథమిక, హైస్కూల్ విద్యను చదివి సీఏ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. గత ఐదేళ్లుగా వివిధ దశల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇక ఫైనలియర్లోను ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థినులను స్థానిక సీనియర్ చార్టెర్డ్ అకౌంటెంట్ సిరిగేరి పన్నారాజు అభినందించారు. -
మొహర్రంలో అపశ్రుతి
● గుండెపోటుతో వ్యక్తి మృతి రాయచూరు రూరల్: మొహర్రం వేడుకల్లో అగ్నిగుండంలో దిగి తిరిగి బయటికొచ్చి కూర్చొన్న నిమిషానికే ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి యాదగిరి తాలూకా శెట్టిగెరెకు చెందిన హళ్లప్ప పూజార్(44) అనే వ్యక్తి మొహర్రం పండుగ సందర్భంగా ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం నెరవేర్చారు. రాత్రి వేళ నిప్పుల్లో దిగి గడ్డపై కూర్చొన్న వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. రైతుల సమస్యలపై స్పందించండి రాయచూరు రూరల్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సత్వరం స్పందించాలని ఎమ్మెల్సీ వసంత కుమార్ సూచించారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో జిల్లాధికారి నితీష్‌ని కలిసి ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వానలు కురవక బీడు పడ్డాయన్నారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న తాలూకాల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల కొరత రాకుండా చూడాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ, నారాయణపుర కుడి కాలువల కింద సక్రమంగా ఆయకట్టు చివరి భూములకు నీరందేలా చూడాలన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవరాజ పాటిల్, మురళి యాదవ్, కరీంలున్నారు. -
నాటక, సంగీత బృందాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
హొసపేటె: వీధి నాటకాలు, జానపద సంగీత బృందాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి కళా బృందాలను ఎంచుకోవడానికి సమాచార, ప్రజా సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. వీధి నాటకం, జానపద సంగీత కార్యక్రమాల నిర్వహణను సులభతరం చేయడానికి ప్రతి జిల్లా నుంచి 3 వీధి నాటకాలు, 3 జానపద సంగీత కళా బృందాలను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే బృందాలు రిజిస్టర్డ్ సంస్థలై ఉండాలి. నిబంధనల ప్రకారం ప్రతి వీధి నాటక బృందంలో 8 మంది కళాకారులు ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉండాలి. ఒకరు షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన కళాకారిణి అయి ఉండాలి. ప్రతి జానపద సంగీత కళా బృందంలో ముగ్గురు కళాకారులు ఉంటారు. వారిలో ఒకరు మహిళ అయి ఉండాలి. ఒకరు షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన కళాకారిణి అయి ఉండాలి. కళా బృందాలను ఎంపిక చేయడానికి జిల్లా స్థాయిలో కన్నడ, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వ్యవసాయ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 2025 ఆగస్టు 12న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ ఏకకాలంలో జరుగుతుంది. అనుభవానికి 10 మార్కులు, కళాత్మక వ్యక్తీకరణకు 10 మార్కులు, సృజనాత్మకత ప్రదర్శనకు 10 మార్కులు ఇవ్వడం ద్వారా కళా బృందాలను ఎంపిక చేస్తారు. జిల్లాలోని అర్హత కలిగిన కళా బృందాలు విజయనగరలోని సమాచార, ప్రజా సంబంధాల శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి నిర్దేశిత దరఖాస్తు ఫాంను పొంది, దానిని నింపి 2025 ఆగస్టు 5లోపు సమర్పించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ సీనియర్ ఏడీ ధనుంజయప్ప తెలిపారు. -
గుండెపోట్ల నియంత్రణపై గురి
బనశంకరి: రాష్ట్రంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలను అరికట్టడానికి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు వార్షిక నియమిత ఆరోగ్య పరీక్షల పథకాన్ని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. పలు జిల్లాలలో ప్రజల హఠాన్మరణాలకు కారణమైన హృద్రోగాలను అత్యవసర రోగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. గుండెపోట్లపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి అందించిన నివేదికను మంత్రి స్వీకరించి మాట్లాడారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఏడాదికి ఒకసారి గుండె పరీక్షలు చేయిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులు, కంట్రాక్టు కార్మిలకులకు ఏడాదికి ఒకసారి హృద్రోగ, బీపీ, క్యాన్సర్ లాంటి రోగాల పరీక్షలు చేయిస్తామని తెలిపారు. గుండెపోట్లకు ప్రజల జీవనశైలి కారణమని, కోవిడ్ టీకాలు కారణం కాదన్నారు. కోవిడ్ టీకా ప్రజలకు మంచి జరిగిందని, ప్రాణాలు మిగిలాయని చెప్పారు. గుండెజబ్బులను అత్యవసర రోగంగా ప్రకటించామని, ఎవరైనా గుండెపోటుతో మరణిస్తే కచ్చితంగా పోస్టుమార్టం జరపాలని చెప్పారు. విద్యార్థులకు ఈ పరీక్షలు చేయాల్సిందే ● గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కేఎస్.రవీంద్రనాథ్ నేతృత్వంలో బృందం ప్రభుత్వానికి 6 సిఫార్సులు చేసింది. యువత కోసం గుండె నిఘా కార్యక్రమం, పోస్టుమార్టం ఆధారిత నివేదికను నమోదు చేయాలి. ● 10 వ తరగతి అంటే 15 ఏళ్లకు పైబడిన అందరికీ గుండె జబ్బులు ఉన్నాయా అనేది పరీక్షలు చేయాలి, అధిక బరువు, ఊబకాయం, బీపీ, అధిక కొవ్వు, ఇన్సులిన్ తదితర పరీక్షలను తప్పనిసరిగా చేయాలి. ● వీటితో పాటు గుండె రక్తనాళాల రోగాలు ఉంటే ప్రారంభంలోనే గుర్తించి వాటి పరిష్కారానికి వైద్యం, జీవనశైలి మార్పుల గురించి ప్రజల్లో ఆరోగ్య అభియాన చేపట్టాలని సలహా ఇచ్చింది. ● ఆటలు, వ్యాయామం వంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం, ధూమపానం నిలిపివేయడం, చక్కెర, ఉప్పు వాడకం తగ్గించడం ముఖ్యమని తెలిపింది. తగినంత నిద్రపోవాలని, ఒత్తిడిని తగ్గించాలని సలహా ఇచ్చింది. ● కోవిడ్–19, టీకా ప్రభావంపై అధ్యయనం చేయడానికి కేంద్ర సంస్థల పరిశోధనా నివేదికలను పరిశీలించాలని తెలిపింది. విద్యార్థులకు, ఉద్యోగులకు ఏటా వైద్య పరీక్షలు ఆరోగ్యమంత్రి దినేశ్ గుండూరావు -
నిండుగా భద్ర జలాశయం
శివమొగ్గ: జిల్లాలోని భద్ర డ్యాం తొణికిసలాడుతోంది. పూర్తిగా నింపడానికి ఇంకా 15 అడుగులు మాత్రమే బాకీ ఉంది. సోమవారం ఉదయం నాటికి నీటి మట్టం 171 అడుగులకు చేరింది. డ్యాం గరిష్ట స్థాయి 186 అడుగులు. ఇన్‌ఫ్లో 20,626 క్యూసెక్కులు ఉంటే, 5,198 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజు ఆనకట్ట నీటి మట్టం 131.10 అడుగులు మాత్రమే ఉండింది. ఈసారి వర్షాలు ముందే కురవడంతో ప్రవాహం ఇనుమడించింది. జిల్లాలో ప్రధాన జల విద్యత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం కూడా గరిష్టస్థాయికి చేరుకొంది. వర్షం తగ్గడంతో తుంగ, భద్ర, లింగనమక్కి డ్యాంలకు ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గింది. -
రూ.200 వంచన, 30 ఏళ్ల తరువాత అరెస్టు
యశవంతపుర: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 30 ఏళ్ల క్రితం రెండు వందలు తీసుకొన్నాడో వ్యక్తి. కానీ పని చేసిపెట్టలేదు. బాధితుడు అప్పట్లో ఫిర్యాదు చేశాడు. నిందితున్ని ఉత్తర కన్నడ జిల్లా శిరసి పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. వివరాలు.. వెంకటేశ్ వైద్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కేశవమూర్తి రావ్ రూ. 2 వందలు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాలేదు. నిరాశచెందిన వెంకటేశ్ 1995 ఫిబ్రవరి 18న శిరసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తరువాత రావు పరారయ్యాడు. ఇటీవల శిరసి సీఐ మంజునాథగౌడ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలించగా ఈ ఫిర్యాదు బయటకు వచ్చింది. పోలీసులు ముమ్మరంగా గాలించి నిందితుడు రావును అరెస్ట్ చేశారు. -
కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: కలుషిత నీరు తాగి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన యాదగిరి జిల్లా సురపుర తాలూకా తిప్పనట్టిగి గ్రామంలో జరిగింది. కలుషిత నీరు తాగడంతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గ్రామంలో వాంతులు, విరేచనాలు ఎక్కువగా కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అయితే చికిత్స ఫలించక దేవికమ్మ హట్టి(48), వెంకమ్మ(60), రామణ్ణ పూజారి(50) అనే ముగ్గురు సోమవారం ఆస్పత్రుల్లో చికిత్స పొందినా పరిస్థితి విషమించి మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు తాగడం ద్వారా వాంతులు, విరేచనాలు కావడంతో గ్రామంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి భేటీ ఈ విషయం తెలుసుకుని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపుర, జిల్లా వైద్యాధికారి తదితరులు గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటి సరఫరా ఎక్కడ జరిగిందో, ఎలా పంపిణీ చేశారో ఆరా తీశారు. గ్రామంలో ముగ్గురు మృతి చెందడం తమను ఎంతో కలిచి వేసిందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించి కాపాడుతామన్నారు. గ్రామంలో ఉన్న పరిస్థితిని చక్కబెట్టాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులు కలిసి తమ సమస్యలను వివరించారు. కలుషితనీరు సేవించడం వల్లనే సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీరు అందించాలని విన్నవించారు. గ్రామస్తుల మనవిని మంత్రి విన్న తర్వాత గ్రామంలో రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరి జిల్లాలో కలకలం రేపిన ఘటన సురపుర తాలూకా తిప్పనట్టిగిలో విషాదఛాయలు -
రేబీస్‌పై జాగృతి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో రేబీస్ నిర్మూలన కోసం జాగృతి చేపడతామని ఆరోగ్య విభాగం ప్రత్యేక కమిషనర్ వికాస్ కిశోర్ తెలిపారు. సోమవారం జునోసిస్ డే సందర్భంగా రేబీస్ జాగృతి పోస్టర్లను విడుదల చేశారు. జంతువుల నుంచి వివిధ రోగాలు మనుషులకు వ్యాపిస్తాయని, కుక్కలు కరిస్తే రేబీస్ వస్తుందని, కుక్కలకు యాంటి రేబీస్ వ్యాక్సీన్లను వేయించాలని తెలిపారు. 2030 నాటికి బెంగళూరును రేబీస్ రహితనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ పరవళ్లు
రాయచూరు రూరల్: మహారాష్ట్రలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాంకు వరద పోటెత్తుతోంది. దీంతో డ్యాం నుంచి 25 గేట్లను పైకెత్తి లక్షా 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి, బాగల్కోటె, విజయపుర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, రాయచూరు జిల్లాల్లో నదీ తీరం వెంట లోతట్టు ప్రాంతాలు, ఆలయాలు నీటమునిగాయి. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా హూవిన హడగి వద్ద గడ్డెగూళి బసవేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు ఆల్మట్టి డ్యాంకు పోటెత్తుతున్న వరద లక్షా 12 వేల క్యూసెక్కుల నీరు విడుదల -
రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత
రాయచూరు రూరల్: నగరంలో కోటలు, రాజ కాలువల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కోటలు, రాజ కాలువల పని తీరును పరీశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధులతో చారిత్రక కట్టడాలను సంరక్షించి, రాజ కాలువల్లో పేరుకు పోయిన పూడికతీతకు చర్యలను ముందుకు కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, జిల్లాధికారి నితీష్, కమిషనర్ జుబీన్ మహాపాత్రో, శాంతప్ప, జయన్న, సాజిద్ సమీర్, బసవరాజ్ పాటిల్‌లున్నారు. వైద్యుడు దేవుడితో సమానం రాయచూరు రూరల్: సమాజంలో వైద్యుడు దేవుడితో సమానమని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ సీఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రైవేట్ హోటల్లో కళాసంకుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యుల దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి ఆయన మాట్లాడారు. వైద్యో నారాయణ హరి అనే పదానికి కట్టుబడి వైద్యులు రోగులకు తమదైన శైలిలో ఉత్తమ వైద్య సేవలను అందించాలన్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, రిమ్స్ అధికారి రాహుల్, రేఖ, మారుతి, వెంకటేష్, శైలేష్ కుమార్, మనోహర్ పత్తార్, కృష్ణ, అమరేగౌడలున్నారు. పౌష్టికాహారంతో ఆరోగ్యం రాయచూరు రూరల్: పని ఒత్తిడిలో ఆరోగ్యం కాపాడుకోవాలని, ఉత్తమ ఆరోగ్యానికి పౌష్టికాహారం ముఖ్యమని మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ సీఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో మానవుడు ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు పాటించాలన్నారు. నేటి సమాజంలో పని ఒత్తిడి వల్ల రక్తపోటు, సుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రజలు డబ్బు సంపాదించాలనే యావలో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత, అనిరుధ్, మనోహర్ పత్తార్, పాటిల్‌లున్నారు. వీధి కుక్కలు, పశువుల బెడద అరికట్టండి రాయచూరు రూరల్: నగరంలో అధికమవుతున్న వీధి కుక్కల స్వైర విహారం, రహదారుల్లో పడుకున్న పశువుల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరసభ కార్యాలయంలో నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రోతో కలిసి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో రోజుకు రోజుకు అధికమైన కుక్కల బెడదతో పిల్లలను కరవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. వేశ్యావాటికపై దాడి.. ఆరుగురు మహిళల అరెస్ట్ రాయచూరు రూరల్: నగరంలో ప్రైవేట్ వసతి గృహంలో వేశ్యావాటిక నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి జరిపి ఆరుగురు మహిళలు, మేనేజర్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ సాబయ్య తెలిపారు. తాలూకాలోని కుకనూరు క్రాస్ వద్ద లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రకాష్ డంబళ్ తెలిపారు. కార్మికుల సమస్యలు తీర్చరూ రాయచూరు రూరల్: జిల్లాలో కట్టడ కార్మికుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని కట్టడ కార్మికుల సంఘం అధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. కట్టడ కార్మికులకు విద్యార్థి వేతనాలు, వివాహ సహాయధనం, పెన్షన్, వైద్య, అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని కోరుతూ కార్మిక అధికారి ఆరతికి వినతిపత్రం సమర్పించారు. -
మరుపురాని మహానాయకుడు వైఎస్సార్
సాక్షి,బళ్లారి: పువ్వు పుట్టగానే పరమళిస్తుందని పెద్దలు అంటారు. మహానుభావులు, మహానేతలు కూడా చిన్నప్పటి నుంచి అందరికీ కన్నా భిన్నంగా ఉంటూ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం చరిత్ర ఆధారాల ద్వారా ఎందరో మహానుభావుల గురించి అవగతం అవుతుంది. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రాజకీయ నేతల్లో ప్రముఖ వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు. ఆయన బళ్లారిలో చదువుతున్న రోజుల్లోనే చిన్నప్పటి నుంచి విభిన్నమైన వ్యక్తిత్వంతో పలువురికి సేవ చేయాలనే తపన, చురుకుదనం, తోటి విద్యార్థులకు అండగా ఉంటూ ఇలా చెప్పుకుంటూ ఎన్నో సుగుణాలు కలిగిన మహానేత వైఎస్సార్ బళ్లారిలో చదవడంతో ఆయనకు నాయకత్వ లక్షణాలు సేవాగుణం బళ్లారి నుంచి బీజం పడింది. 1958లో తండ్రి రాజారెడ్డి బళ్లారిలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న సమయంలో ఆయన బళ్లారిలో ఫ్యామిలీ పెట్టారు. అదే సందర్భంలో వైఎస్సార్‌తో పాటు ఆయన సోదరుడు, సోదరిని కూడా బళ్లారిలో విద్యాభ్యాసం చేయించారు. వైఎస్ రాజారెడ్డి సంతానంలో అందరి కంటే ఎంతో తెలివిపరుడుగా వైఎస్సార్ చిన్నప్పటి నుంచి తన ప్రతిభను చూపేవారు. పేద విద్యార్థులకు చేదోడుగా.. ఈనేపథ్యంలో హాస్టల్లో ఉన్నప్పుడు కూడా తోటి విద్యార్థులకు ఎంతో అండగా ఉండటమే కాకుండా పేద విద్యార్థులకు ఫీజులు కూడా చెల్లించేవారని, తండ్రి రాజారెడ్డి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్లో ఆయన తోటి విద్యార్థులకు ఫీజులు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తోటి మిత్రులు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చిన దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏపీలోనే కాకుండా కర్ణాటకలో కూడా వైఎస్సార్‌పై జనంలో చెరగని ముద్ర ఉంది. ముఖ్యంగా బళ్లారి జిల్లాతో వైఎస్సార్‌కు విడదీయరాని బంధం ఉంది. ఆయన 7వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీతో పాటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే బళ్లారిలో ఆరు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు. అనంతరం డిగ్రీ బళ్లారి నగరంలోని వీరశైవ కళాశాలలో చదువుతుండగానే కర్ణాటకలోని గుల్బర్గా(కలబుర్గి)లో ఎంబీబీఎస్ సీటు రావడంతో అక్కడ చదివి డాక్టర్ అయ్యారు. ఎంబీబీఎస్ కూడా కలబుర్గిలో పూర్తి చేయడంతో ఆయన విద్యాభాస్యం దాదాపు కర్ణాటకలోనే కొనసాగిందని చెప్పవచ్చు. పాత మిత్రులను ఏనాడూ మరువలేదు సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగిన సంఘటనలు ఎన్నటికీ మరిచిపోయేందుకు వీలు ఉండదు. అదే విధంగా మహానేత వైఎస్సార్ కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా చిన్ననాటి మిత్రులను, చదివిన పాఠశాలను ఆయన ఎప్పుడూ గుర్తు చేసుకునేవారట. అంచెలంచెలుగా స్వశక్తితో ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ రథసారథిగా పేరు తెచ్చుకుని భూమి, ఆకాశం ఉన్నంత వరకు ఆయన పేరును మరిచిపోలేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన గత జ్ఞాపకాలను చెరగని విధంగా నెమరువేసుకుంటున్నారు. ఇప్పటికీ బళ్లారిలోని ఆయన స్నేహితులు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం, పరిచయాలను మరవలేకపోతున్నారు. వైఎస్సార్‌లో చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు, పది మందికి సేవ చేసే గుణం, నమ్మకం, స్నేహానికి ప్రతిరూపంగా, నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికై నా సిద్ధపడే ధీరత్వం ఉండేదని ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. బళ్లారితో వైఎస్సార్ బంధం విడదీయరానిది నాయకత్వ లక్షణాలకు బళ్లారి నుంచే బీజం హాస్టల్, పాఠశాలల్లో చురుకుగా ఉండేవారు నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం -
నేడు బెంగళూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు
బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సమర్థనం ట్రస్టు కార్యాలయంలో కేక్ కట్ చేసి పేదలు, వృద్ధులు, పిల్లలకు అన్నదానం నిర్వహిస్తారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ వింగ్టీమ్ విజ్ఞప్తి చేసింది. హాజరయ్యేవారు పండ్లు, బిస్కెట్లు తీసుకువచ్చి వృద్ధులకు, పిల్లలకు అందజేయవచ్చని పేర్కొంది. వివరాలకు 9035193106, 9945207998, 9703518965 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భార్యకు డీఎస్పీ వేధింపులు బనశంకరి: ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇంట్లో భార్యను వేధింపులకు గురిచేశాడో డీఎస్పీ. బెంగళూరులో డీఎస్పీ శంకరప్ప పై కేసు నమోదైంది. కాలేజీకి వెళ్లే కుమారుడు ఉన్నప్పటికీ మరో మహిళతో శంకరప్ప అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేయసాగాడు. భార్య ప్రశ్నించడంతో ఆమెను కొట్టి వేధించేవాడు. మరింత కట్నం తేవాలని బెదిరించడంతో పాటు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని భార్య డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈశాన్య విభాగం మహిళా పోలీస్టేషన్లో శంకరప్ప పై కేసు నమోదైంది. టూరిస్టు బస్సు బోల్తా ● 13 మందికి గాయాలు మైసూరు: చామరాజనగర జిల్లాలోని యళందూరు తాలూకాలోని బిళిగిరి రంగనబెట్టలో ఆలయ దర్శనం చేసుకొని టూరిస్టులు తిరిగి వస్తుండగా వారి మినీ బస్సు పల్టీ కొట్టింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దర్శనాల తరువాత అడ్డదారిలో వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న మహిళలు, చిన్నారులు గాయపడ్డారు. వారిని యళందూరు తాలూకా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తుమకూరు నుంచి టూర్‌కి వచ్చారని తెలిసింది. రెండు బైక్‌లు ఢీకొని దగ్ధం ● ఇద్దరు మృతి మైసూరు: డెలివరీ బాయ్ అతివేగంగా మరో బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మైసూరులోని బన్ని మండపంలోని ఎన్.ఆర్. మొహల్లా నెల్సన్ మండేలా రోడ్డులో జరిగింది. బైక్‌లు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. చామరాజనగర నివాసి, వ్యాపారి సయ్యద్ షెరాన్ (30), ఎంఎస్ కార్తీక్ (42) డెలివరీ బాయ్ మృతులు. సోమవారం తెల్లవారుజామున కస్టమర్లకు ఆహారం తీసుకెళ్తూ వేగంగా బైక్ నడుపుతున్నాడు. ఘటనాస్థలిలో సయ్యద్ బైక్‌ని ఢీకొన్నాడు. ఇద్దరూ గాయాలతో అక్కడే చనిపోగా మంటలు చెలరేగి వాహనాలు దగ్ధమయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనైతిక దందా గుట్టురట్టు మైసూరు: మైసూరులో వ్యభిచార ముఠా గుట్టురట్టయింది. ఇద్దరు యువతులను కాపాడి, నలుగురు పురుషులను అరెస్టు చేశారు. ఈ దందా నడుపుతున్న ప్రధాన నిందితుడు మంజు, మరొకరిని పట్టుకున్నారు. జయపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో దాసనకొప్పలులోని ఒక ఇంట్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అమాయక యువతులను డబ్బుతో ప్రలోభపెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే ఒడనాడి సేవా సంస్థ సిబ్బంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తరువాత పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి యువతులను కాపాడి, నిందితులకు బేడీలు వేశారు. వారి నుంచి కొంత డబ్బు, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. -
ఆరోగ్యానికి పొగబెడుతోంది
సాక్షి, బెంగళూరు: మొబైల్ఫోన్లు, సోషల్ మీడియాకు తీవ్రంగా అలవాటు పడిన యువతలో మరో దురలవాటు కూడా విస్తరిస్తోంది. అదే ధూమపానం. ఇలా పొగాకు వినియోగం కారణంగా క్యాన్సర్, క్షయ, ఇతర రోగాలు వస్తాయని ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా యువతలో మార్పు కనిపించడం లేదు. విచారకర అంశం ఏంటంటే 18 ఏళ్లలోపు బాలలు కూడా ఎక్కువగా ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వాడడం. ప్రపంచవ్యాప్తంగా 13–15 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ప్రతి 10 మందిలో ఇద్దరు పొగాకు ఉత్పత్తులు సేవిస్తున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ప్రపంచ యువ పొగాకు సమీక్ష –2019 ప్రకారం భారతదేశంలో 8 నుంచి 9 శాతం మంది పాఠశాల విద్యార్థులు ధూమపానం, పొగాకు వాడకం సాగిస్తున్నట్లు తెలిసింది. 2016–17 సమీక్షలో ఇది 11. 9 శాతంగా ఉంది. అప్పటితో పోలిస్తే కాస్త తగ్గినా ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో 3వ స్థానం ● ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ వయోజన పొగాకు సమీక్ష 2016–17 ప్రకారం కర్ణాటకలో 22.8 శాతం మంది యువత పొగాకు ఉత్పత్తులను సేవిస్తున్నట్లు తెలిసింది. ● ఈ లెక్క ప్రకారం సుమారు 1.17 కోట్ల మంది బీడీ, సిగరెట్, గుట్కా వంటివి నిత్యం వాడుతున్నారు. అందులో 8.8 శాతం మంది ధూమపానం, 16.3 శాతం మంది పొగ రహితంగా పొగాకు వినియోగం చేస్తున్నారు. ● అన్ని వయసులవారిలో 23.9 శాతం మంది పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. అంటే ఎవరో సిగరెట్ తాగుతుంటే ఆ పొగను ఇతరులు కూడా పీల్చడం. దీని వల్ల కూడా పొగ తాగినన్ని ఇబ్బందులు వస్తాయి. క్షయ వ్యాధికి ఊతం దేశంలో పొగాకు ఉత్పత్తులను సేవిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉండడం గమనార్హం. కర్ణాటకలో 38 శాతం టీబీ మరణాలు కేవలం పొగాకు ఉత్పత్తుల సేవనం వల్ల జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పొగరాయుళ్లలో క్షయ వ్యాధి వ్యాప్తి మూడు రెట్లు ఎక్కువగా, ఆ మరణాలు కూడా అంతే అధికంగా ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తగ్గని పొగాకు వాడకం బాలలు, టీనేజీకి అలవాటే ధూమపానం ఉచ్చులో 22.8 శాతం యువత నివారణ చర్యలు చేపడుతున్నా.. కోట్పా చట్టం కింద, పబ్లిక్ ప్రాంతంలో ధూమపానం చేస్తే రూ. 200 నుంచి రూ. 1000 వరకు జరిమానా వసూలు చేస్తారు. పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే వారి కనీస వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచారు. హుక్కా బార్లను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరం వరకు పొగాకు విక్రయాలు జరపరాదు. పతి ఏటా పోలీసు, కోట్పా తనిఖీ బృందాల ద్వారా సుమారు 2 లక్షల కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. -
డి గ్యాంగ్ తరహాలో దాడి
దొడ్డబళ్లాపురం: సినీ నటుడు దర్శన్, ఆయన అనుచరుల చేతిలో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకు గురైన కేసు గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడకు అశ్లీల మెసేజ్‌లు పంపడంతో అతన్ని పిలిపించి హత్య చేశారని కేసు నమోదైంది. అదే మాదిరి సంఘటన తాజాగా ఒకటి జరిగింది. బెంగళూరు వద్ద నెలమంగల తాలూకా సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. వివరాలు.. బాధితున్ని కుశాల్‌గా గుర్తించారు. లవర్‌ను మార్చేయడంతో.. కుశాల్ రెండేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె మరొకరితో ప్రేమాయణం ఆరంభించింది. ఆ కోపంతో యువతికి అశ్లీల మెసేజ్‌లు పంపించాడు. సదరు యువతి తన స్నేహితులకు విషయం చెప్పింది. వారంతా కలిసి కారులో కుశాల్‌ను కిడ్నాప్ చేసి ఆలూరు వద్ద నిర్జన ప్రదేశంలోని తీసికెళ్లి నగ్నంగా చేసి చావబాది వీడియో తీశారు. ఇది కూడా దర్శన్ కేసు వంటిదే అవుతుందని నిందితులు గొప్పలు చెప్పుకున్నారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్నాడు. ఈ కేసులో హేమంత్, యశ్వంత్, శివశంకర్ , శశాంక్గౌడతో పాటు మొత్తం 8మందిని సోలదేనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. నెలమంగల వద్ద రౌడీయిజం బాధితునికి తీవ్ర గాయాలు 8 మంది అరెస్టు -
అలరించిన నాటకం
గౌరిబిదనూరు: సందేశాత్మక నాటకాలు సమాజ పరివర్తనకు దోహద పడతాయని మాజీ మంత్రి, డా హెచ్ఎన్ ప్రాధికారం అధ్యక్షుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి హెచ్ ఎన్ కళా భవనంలో ఐశ్వర్య కళానికేతన్ కళాకారులచే నాటకోత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంగమాణిక్య ప్రహసన నాటక ప్రదర్శన ఆహూతులను అలరించింది. శివశంకరరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో టీవీలు, మొబైల్ఫోన్లు వచ్చి నాటకకళ సమాజానికి దూరమవుతూ ఉంది, ఆ కళను రక్షించడానికి కళాకారులు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఆరోగ్యంతోనే బలమైన భారత్: గవర్నర్ దొడ్డబళ్లాపురం: ఆరోగ్య భారతం– బలమైన భారతం అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ అలవరవచుకోవాలని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. బెంగళూరులో సోమవారంనాడు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్యుల సమ్మేళనం గవర్నర్ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో వైద్యం వేల సంవత్సరాల పురాతనమైనది, ఇది మన సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమై ఉందన్నారు. చరక, సుశ్రుత, ధన్వంతరి లాంటి మహా ఋషులు వైద్యాన్ని ఆధ్యాత్మిక, విజ్ఞాన దృష్టికోణంతో చూశారన్నారు. ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, యోగ, సిద్ధ, యునాని, హోమియోపతి , అలోపతి లాంటి వివిధ రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యులు వైజ్ఞానిక దృష్టికోణంతో ఆలోచిస్తే నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్,హృద్రోగం,షుగర్ తదితర రోగాలను తరిమికొట్టవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంకల్పం చేయాలని, జీవన శైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. నవమాసాలు మోసి.. ప్రాణాలు తీసింది దొడ్డబళ్లాపురం: చంటి బిడ్డను చూసుకోవడం కష్టంగా ఉందని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నవమాసాలు మోసి కన్న శిశువును నీళ్లు కాచే అండాలో ముంచి హత్య చేసిన దారుణ సంఘటన నెలమంగల తాలూకా విశ్వేశ్వరపురలో చోటుచేసుకుంది. స్థానికంగా పవన్, రాధ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఒకటిన్నర నెల మగబిడ్డ ఉన్నాడు. పేదరికం వల్లనో, మరో కారణం చేతో తల్లి రాధ.. శిశువును నీళ్లు కాచే అండాలో ముంచి ప్రాణాలు తీసింది. స్థానికులు చూసి నెలమంగల పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించి రాధను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. చిక్కిన చిరుతతుమకూరు: సుమారు నెలరోజుల నుంచి 7 గ్రామాల ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న మూడు నాలుగు చిరుతలలో ఒకటి ఎట్టకేలకు బోనులో పడింది. జిల్లాలో అంచె కొప్పలు గ్రామంలో ఉన్న తోటలో అటవీ సిబ్బంది పెట్టిన బోనులో చిక్కింది. రెండురోజుల కిందట కొన్నిచోట్ల బోనులు ఏర్పాటుచేశారు. ఆదివారం రాత్రి ఆహారంకోసంవచ్చిన చిరుత ఓ బోనులోకి చిక్కింది. సోమవారం ఉదయం దానిని చూసి అటవీ సిబ్బందికి అప్పగించారు. గ్రామాల పరిసరాల్లో చిరుతల సంచారం పెరగడంతో మహిళలు, పిల్లలు భయపడుతున్నారు. గ్రామస్తులు గుంపులుగా రాత్రివేళ గస్తీ తిరుగుతున్నారు. మరో మూడు చిరుతలు ఉన్నాయని, వాటిని కూడా బంధించాలని ప్రజలు కోరారు. ప్రకాశ్‌రాజ్‌పై మంత్రి ధ్వజం యశవంతపుర: దేవనహళ్లిలో భూస్వాధీనం వద్దని నటుడు ప్రకాశ్‌రాజ్ రైతులకు మద్దతు పోరాటం చేస్తున్నారు. అలాగే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌కు వెళ్లి అక్కడి రైతుల తరఫున కూడా పోరాడాలని పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. దీనికి స్పందించిన ప్రకాశ్‌రాజ్ తాను తమిళనాడు రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే పాల్గొన్నట్లు తెలిపారు. పంజాబ్, హరియానా రైతుల ఆందోళనలకు మద్దతు ఇచ్చానన్నారు. దేవనహళ్లి రైతుల ఆందోళనలో ప్రకాశ్ రాజ్ పాల్గొనడంపై మంత్రి మండిపడ్డారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకొంటారని ధ్వజమెత్తారు. -
ఫేక్ న్యూస్‌తో పత్రికా రంగానికి చేటు
బళ్లారిటౌన్: ఊహాజనిత వార్తలు, ఫేక్ న్యూస్, ఆధునిక పరిజ్ఞాన దుర్వినియోగం వల్ల సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మాధ్యమ సలహాదారుడు కేవీ.ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయం ఆవరణలోని గాంధీభవన్‌లో కర్ణాటక రాష్ట్ర వర్నింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పత్రికా దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఊహాగాన వార్తలతో కొంత మంది సంతోష పడవచ్చని, అయితే ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఫేక్ న్యూస్‌లను సమర్థించుకోవడం, సోషల్ మీడియా ద్వారా రాజకీయ నేతలను ఎద్దేవా చేయడం సరికాదన్నారు. రాజ్యాంగ పరిధిలో పని చేయాలి విలేకరులు రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సి ఉంటుందన్నారు. తప్పుడు వార్తలను నియంత్రించేందుకు త్వరలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొనేలా యోచిస్తున్నట్లు తెలిపారు. గతంలో విలేకరులు ఎంతో ప్రామాణికతతో పని చేసేవారన్నారు. అయితే నేడు ఆ ప్రామాణికత మృగ్యం అవుతోందని విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగం విలువలను కాపాడే రీతిలో పని చేస్తున్న పార్ట్‌టైమ్ గ్రామీణ విలేకరులకు కూడా బస్సు పాస్ సదుపాయాన్ని కల్పించామన్నారు. మాధ్యమ సంజీవిని పథకాన్ని అమలు చేశామన్నారు. విలేకరులకు స్థలాలు అందిస్తాం విలేకరులకు స్థలాలు అందించే ప్రయత్నం కూడా చేస్తామని హామీ చేశారు. రాష్ట్రంలో సమాచార శాఖకు 14 కొత్త వాహనాలు అందిస్తున్నట్లు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ తమ చిరకాల విలేకరులకు బస్సు పాస్ సదుపాయం కోసం చేసిన పోరాటం, కృషి ఫలించిందన్నారు. రానున్న రోజుల్లో పార్ట్‌టైమ్ విలేకరులకు కూడా పింఛన్ కల్పించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దశల వారీగా విలేకరుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. సమాజంలో బ్లాక్ మెయిల్ విలేకరుల మాఫియా, తప్పుడు వార్తలు రాసేవారు ఈ పత్రికా రంగం నుంచి దూరం ఉంటే మంచిదన్నారు. ప్రామాణిక విలేకరులకు గుర్తింపు తద్వారా ప్రామాణిక విలేకరులకు ఎంతో గుర్తింపు వస్తుందన్నారు. దావణగెరె యూనివర్సిటీ పత్రికోద్యమ నేత శివకుమార్ కణసోగి మాట్లాడుతూ నేటి పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఉపన్యసించారు. అనంతరం 10వ తరగతి, పీయూసీల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఇటీవల క్రికెట్ పోటీల విజేత జట్టుకు ట్రోఫీని అందజేశారు. మేయర్ ముల్లంగి నందీష్, జిల్లా ఇన్చార్జి మంత్రి కార్యదర్శి లక్ష్మీనారాయణ, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్, సోమశేఖర్ కెరెగోడు, జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, వార్తాధికారి బీవీ.తుకారాం, కార్యవర్గ సభ్యుడు వీరభద్రగౌడ పాల్గొన్నారు. సమాజంపై ప్రమాదకర ప్రభావం సీఎం మీడియా అడ్వైజర్ ప్రభాకర్ -
తొలి ఏకాదశి వైభవం
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం మొహర్రంను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మత భేదభావాలను మరిచి పాల్గొన్నారు. పీర్ల దేవుళ్లను అలంకరించి ఊరేగింపులు నిర్వహించారు. వీధివీధినా భక్తులు చక్కెర చదివింపులు జరిపించారు. తెల్లవారుజామున అగ్ని గుండంలో పీర్ల స్వాములను ఎత్తుకుని నడిచారు. ఉత్తర కర్ణాటకతో పాటు చిక్కమగళూరులోనూ మొహర్రంను ఆచరించారు. కొన్నిచోట్ల ముస్లింలు రక్త తర్పణం నిర్వహించారు. –యశవంతపురమాలూరు: తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామంలో ఉన్న పురాణ ప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు తరలివచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. పూలతో స్వామి వారిని సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి పూజలను ప్రారంభించారు. మూల విగ్రహానికి పంచామృత అభిషేకం, వేద మంత్ర పారాయణం తదితరాలు గావించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం వరుసలు కట్టారు. ప్రధాన అర్చకులు ఎన్ శ్రీధర్ నేతృత్వంలో పూజలు నిర్వహించారు. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. అగర ఆలయంలో..బొమ్మనహళ్లి: పవిత్ర తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా బెంగళూరు బొమ్మనహళ్ళి అగరలో చరిత్ర ప్రసిద్ధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజామునే అభిషేకం, అలంకారాలు గావించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన ఓవర్టేక్
హుబ్లీ: బైక్‌ను బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన హుబ్లీ తాలూకా కుసుగల్ గ్రామం బ్యాహట్టి రోడ్డు శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది. నవళగుంద తాలూకా అళగవాడి నివాసి బసవరాజ్ అళగవాడ గ్రామం నుంచి హుబ్లీ వైపు బైక్‌పై వెళ్తూ బస్సును ఓవర్ టెక్ చేసేందుకు యత్నించి అదుపు తప్పి పడిపోయాడు. తలపై బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. యువతకు అర్థమయ్యేలా రచనలురాయచూరు రూరల్: యువతకు అర్థమయ్యేలా రచనలు చేయాలని సీనియర్ సాహితీ వేత్త శాశ్వతయ్య ముకుందమఠ్ అన్నారు. కవి తిమ్మయ్య శెట్టి రచించిన దైవం, ఏనుగుకు అంగి పుస్తకాలను కన్నడ భవనంలో జిల్లా, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. భావితరాలకు కూడా ఇప్పటి రచనలు ఉపయోగపడాలన్నారు. దొంగల అరెస్ట్, నగలు స్వాధీనం హుబ్లీ: చోరీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. కుందగోళ తాలూకా గుడగేరి శ్రీధర్(27), హేమంత(34) గడిఫేర్నడేస్ (31)అనే నిందితులను హుబ్లీ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తారిహళ గ్రామంలో సైదుసాబ్ నదాఫ్ ఇళ్లలోకి చొరబడి నగలు దోచుకున్నారు. అంచటగేరి మంజునాథ ఇంట్లో రూ.42 లక్షల విలువైన వస్తువులు చోరీ చేశారని ఎస్ఐ సచిన్ అలమేళకర తెలిపారు. దొంగలను అరెస్ట్ చేయడంలో ఏఎస్ఐ హొన్నప్పన్నవర, సిబ్బంది మల్లిగేవాడ, సంతోష్ చవాన్, గిరిష, విశ్వనాథ చాకచక్యంగా వ్యవహరించారన్నారు. వీధిశునకాల దాడిలో బాలుడికి గాయాలురాయచూరురూరల్: వీధి శునకాలు దాడి చేయడంతో నాలుగేళ్ల బాలుడు గాయపడ్డాడు. నగరంలోని 8వ వార్డు అంద్రూన్ కిల్లాలో రోహన్(4) అనే బాలుడు తన ఇంటి వద్ద ఆడుకుటుండగా శునకాలు దాడి చేశాయి. ముఖం, శరీరంపై పలుచోట్ల గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం బైరూన్ కిల్లా, యల్బీఎస్ నగర్, అరబ్ మోహాల్లో వీధి శునకాలు దాడి చేసి పదిమందిని గాయపరిచాయి. అయినా కుక్కలను నియంత్రించడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి రాయచూరురూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సింధనూరు తాలూకా తుర్విహళ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండా గ్రామం వద్ద జరిగింది. దేవీ క్యాంప్‌నకు చెందిన కరణ కుమార్(27), సిందనూరుకు చెందిన రమేష్(28)లు బైక్‌పై వెళ్తుండగా గుండా గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందారు. మృతదేహాలను సింధనూరు ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సుజాత తెలిపారు. అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలు రాయచూరురూరల్: మోహర్రం వేడుకల్లో అపశృతి జరిగింది. లింగసూగురు తాలూకా యరగుంటిలో శనివారం అగ్నిగుండం వెలిగించారు. అక్కడ అలాయ్ తొక్కుతుండగా హన్మంత్ నాయక్ అనే వ్యక్తి కాలుజారి గుండంలోకి పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. యోగాతో ఆరోగ్య సంరక్షణ రాయచూరురూరల్: యెగాద్వారా ఆరోగ్యాలను పరిరక్షించుకోవచ్చని పతంజలి యోగా సంచాలకుడు విఠోభరావ్ అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని మహిళా సమాజ్‌లో పతంజలి యోగా సంస్థ, సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఏర్పాటు చేసిన యోగా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యోగా, ధ్యానంతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. యోగాను రోజువారి జీవితంలో భాగం కావాలన్నారు. -
రెండు సర్కిళ్ల అభివృద్ధికి చర్యలు
రాయచూరు రూరల్: నగరంలోని అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ సర్కిళ్లను అధునాథనంగా అభివృద్ధి చేస్తామని కకలెక్టర్ నితీష్ అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయుల విగ్రహాలు, రాజ్యంగ పుస్తకం, పార్లమెంట్ నమూనాను 3డీ సాంకేతికతతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ పార్క్, బారికేడ్ గోడ, అంబేడ్కర్ భవనం నిర్మాణాలు, అందోళన కార్యక్రామాలకు స్థలం కేటాయించాలని సంఘం సభ్యులు కోరారు. సభలో ఎస్పీ పుట్ట మాదయ్య, కమిషనర్ జుబీన మోహపాత్రో, చిదానంద, పరుశురామ్, బసవరాజ్, బీ మయ్య, వసంత్ కుమార్, విశ్వనాథ్, విరుపాక్షి పాల్గొన్నారు. -
ద్విభాషా విధానంపై సందిగ్ధం
బనశంకరి: కర్ణాటకలో విద్యా వ్యవస్థలో అనేక ఏళ్లుగా ద్వి భాషా విధానం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. హిందీ భాష కు అడ్డుకట్ట వేయాలంటే కన్నడ, ఇంగ్లీష్ భాషలు మాత్రమే చాలునని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాల్లో ద్విభాషా విధానం అమలులో ఉంది. కన్నడనాట కూడా అమలు చేయాలని భాషావేత్తలు, కన్నడ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం సిద్దరామయ్య స్పందన పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై ప్రామాణికంగా పనిచేస్తున్నానని, కులమత తారతమ్యంలేని సమాజమే కువెంపు ఆశయమని ఆయన అన్నారు. కానీ నేడు విద్యా విధానంలో వైజ్ఞానికత లోపిస్తోందని చెప్పారు. ఆదివారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో కువెంపు విచారక్రాంతి అనే పుస్తకాన్ని సిద్దరామయ్య విడుదలచేసి మాట్లాడారు. రాజకీయంగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. ద్విభాషా విధానంలో తన అభిప్రాయమే ప్రభుత్వ అభిప్రాయమన్నారు. కానీ సిద్దరామయ్య గట్టి నిర్ణయం తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. ద్విభాషా విధానంలో విద్యాబోధన చేయాలని సోషల్ మీడియాలో కన్నడిగులు డిమాండ్ చేశారు. అమలు చేయాలని డిమాండ్లు -
తీర జిల్లాల్లో తగ్గని వానలు
యశవంతపుర: కోస్తా జిల్లాలలో భారీ వానలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటక జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. చిక్కమగళూరు జిల్లా బాళెహొన్నూరు, కళస, కొప్ప, మూడిగెరె, ఎన్ఆర్పురలో భారీగా వానలు పడుతున్నాయి. చెరువు, కుంటలు నిండిపోయాయి. చార్మాడి ఘాట్ రోడ్డులో జలపాతాలు మొదలయ్యాయి. ఎత్తైన కొండల నుంచి వాననీరు ఉవ్వెత్తున దూకుతోంది. గాలీవానకు ఆదివారం ఉదయం కారవారలో సుభాష్ సర్కిల్లో స్కూటరిస్టుపై చెట్టు పడిపోయింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలు తగిలాయి. ప్రాణాపాయం నుంచి బయటపడింది. కృష్ణా, ఉపనదులు తీవ్రం బయలుసీమ జిల్లాలైన తుమకూరు, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామాంతర, మండ్య, మద్దూరు, చిత్రదుర్గ, దావణగెరెలో ఆకాశం మేఘావృతమైంది. మహారాష్ట్ర, పశ్చిమ కనుమలలో వర్షాల వల్ల బెళగావి ప్రాంతంలో కృష్ణాతో పాటు ఉపనదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. కృష్ణానదిలో 1.06 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వేదగంగా, దూద్‌గంగా నదులు నిండి జోరందుకున్నాయి. వీటి కింది ఉన్న 8 జలాశయాలు పూర్తిగా నిండిపోగా, పరిసరాల్లో ఆలయాలు నీట మునిగాయి. బెంగళూరులో జల్లు వాన బనశంకరి: ఆదివారం బెంగళూరు నగరంలో కొన్నిచోట్ల జల్లులతో కూడిన వర్షం కురిసింది. వీకెండ్ మోజులో ఉన్న నగరవాసులకు బ్రేక్ ఇచ్చింది. జక్కూరు, చౌడేశ్వరినగర, విజ్ఞాననగర, అగర, హెచ్‌ఎస్‌ఆర్‌లేఔట్, కోరమంగల, ఆర్ఆర్ నగర, సంకేనహళ్లి, సంపంగి రామనగర, రాజగోపాల నగర, కేఆర్.పురం, కొడిగేహళ్లి, బాణసవాడి, జ్ఞానభారతి, హెమ్మెగెపుర తదితర 81 వార్డుల్లో జల్లు వర్షం కురిసింది. -
గుండెపోటుతో పలువురు మృతి
కాఫీనాడు చిక్కమగళూరు జిల్లాలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. మూడిగెరె తాలూకా భారీబైలుకు చెందిన మీనాక్షి (27), బి.హొసహళ్లిలో సుమిత్రేగౌడ (75) మృతులు. మీనాక్షి రెండు రోజుల నుంచి లో బీపీతో బాధపడుతోంది. ఎద నొప్పి ఎక్కువ కావడంతో శనివారం సాయంత్రం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. వర్షాల వల్ల రోడ్డుపై చెట్టు కూలడంతో ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమైంది. దారిలో మీనాక్షి చనిపోయింది. ఇక సుమిత్రేగౌడ ఇంటిలో ఉండగా గుండెపోటు వచ్చి కుప్పకూలి చనిపోయారు. ఇక హాసన్ జిల్లాలో గుండెజబ్బు మరణాలు తగ్గడం లేదు. ఆదివారం ఉదయం హొళెనరసీపుర తాలూకా ఐచనహళ్లికి చెందిన ఆనంద్ (44) ఎదలో నొప్పిగా ఉందని భార్యకు చెప్పాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. హాసన్‌లో బెంగళూరు వాసి... కారులో ఉండగా గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన హాసన్‌లో జరిగింది. బెంగళూరు జయనగరకు చెందిన రంగనాథ్ (52) భార్య పిల్లలతో కలిసి ధర్మస్థలకు కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం మధ్యాహ్నం హాసన్ జిల్లా కలెక్టరేటు వద్ద వస్తుండగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు ఈసీజీ తీస్తున్న సమయంలో గుండె ఆగి మరణించారు. కళ్లముందే ఇంటి పెద్ద చనిపోవడంతో భార్యపిల్లలు గుండెలవిసేలా రోదించారు. -
రోడ్లు కావాలంటే గ్యారంటీలు బంద్ చేయాలి
సాక్షిబళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదుఉ గ్యారెంటీ పథకాల వల్ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, సీఎం ఆర్థిక సలహదారుడైన బసవరాజ్ రాయరెడ్డి అన్నారు. రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా యర్వనికలో హైస్కూల్ భవన కట్టడ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ పొలాలనికి రోడ్డు నిర్మించాలని ఓ రైతు విజ్ఞప్తి చేయగా ఆయన పైవిధంగా స్పందించారు. బియ్యం వద్దు, గృహలక్ష్మి వద్దంటే ఆ డబ్బుతో అభివృద్ధి పనులను చేపడుదాం. రోడ్లు బాగుపడాలంటే బియ్యంతో పాటు అన్ని గ్యారెంటీలు బంద్ అవుతాయని పేర్కొన్నారు. రోడ్డు కావాలంటే బియ్యం తదితరాలు బంద్ చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సలహా ఇస్తానని ఆయన సూచించారు. సాక్షత్తు సీఎం సలహాదారుడైన బసవరాజ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా రాయరెడ్డి వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తు గ్యారెంఈ పథకాలు మార్చే ప్రశక్తే లేదన్నారు. ఇవి పేదల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన బసవరాజ్ రాయరెడ్డి వ్యాఖ్యలు -
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
రాయచూరు రూరల్: ఏకాదశి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రభుత్వ ఉద్యాన వనంలో విఠలరుక్మిణి అలయంలో పాండురంగ, రుక్మిణి స్వామివార్లకు విశేష అలంకరణలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారు, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈనెల 18న ప్రత్యేక ఆషాఢ మాస ఉత్సవాలు చేపడుతామని అలయ కమిటీ తెలిపింది. నగరేశ్వరాలయంలో పాండురంగ, రుక్మిణి దేవి ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం ఊంజల్ సేవలు నిర్వహించారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్రాయచూరు రూరల్: మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ నితీష్, శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ పుణ్యస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జగ్జీవన్ రామ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహనికి కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతి, కుల, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు కృషి చేయడంతోపాటు దేశంలో మరిత విప్లవాన్ని సృష్టించిన మహాన్ మేధావి జగ్జీవన్‌రామ్ అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండ్వే, అసిస్టెంట్ కమిషనర్ గజానన, సాంఘిక శాఖ అధికారి చిదానంద, నగరసభ కమిషనర్ జుబీన్ పాత్రో, తహసీల్దార్ సురేష్‌వర్మ, రాజేంద్ర జాలదార్ పాల్గొన్నారు. పెరుగుతున్న పశువుల చోరీలు హుబ్లీ: ధార్వాడ తాలూకా హొసవాళ, రామపుర గ్రామాలలో పశువులు, మేకలు, గొర్రెల చోరీ ఘటనలు పెరుగుతున్నాయి. ఇంటి ముందు కట్టేసిన మేకలు, పొట్టెళ్లు, పశువులను దుండగులు చోరీ చేసి ఉడాయిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవారి ఇళ్లపై కన్నేసిన దొంగల ముఠాలు బైక్‌పై వచ్చి పొట్టెళ్లను చోరీ చేస్తున్నారు. దీంతో మేకల కాపరులు, పాడి రైతులు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారు. హొసవాళ గ్రామంలో వాసు ఉళికేరి అనే వ్యక్తికి చెందిన ఆవును, అదే గ్రామానికి చెందిన దాదాపీర దొడ్డమని ఇంటి ముందు కట్టిన పొట్టెళ్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు వాపోయారు. పట్టపగలే బైక్ మీద పొట్టెళ్లను తరలిస్తున్న దృశ్యం బేలూరులోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ దృశ్యాలతోసహా సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చినా స్పందన లేదని పొట్టేళ్ల యజమాని వాపోతున్నాడు. రంగసిరి కార్యక్రమాలు పట్టణాలకూ విస్తరించాలి రాయచూరురూరల్: సమాజానికి నిస్వార్థంతో సేవలు అందించినప్పుడే సార్థకత ఉంటుందని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అన్నారు. పండిత సిద్దరామ జం బలదిన్ని రంగ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన రంగసిరి సాంస్కృతిక కార్యక్రమాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో అదరణ కలిగిన రంగసిరి కార్యకలాపాలను పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేయాలన్నారు. రంగస్వామి, నాగవేణి, పవన్ పాటి ల్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, శ్రీనివాస్, గోవిందు, బిరదార్ పాల్గొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శనం హుబ్లీ: లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలు మానవజాతిని సరైన మార్గంలో నడిపిస్తాయని సింధనూరు గేట్సే మనె ప్రార్థన మందిరం దైవజనులు హరీష్ అన్నారు. సింధనూరు సమీపంలోని దుర్గ క్యాంప్‌లో సీనియర్ ఫాస్టర్ ఏసు రత్నం సారథ్యంలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక ప్రార్థన కూటమిలో ఆయన పాల్గొని బైబుల్లోని సందేశాలను వినిపించారు. ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవులు ఆచరించి తమ జీవితాలను సార్థకంచేసుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన దైవ సేవ అని ఆయన వివరించారు. -
సమస్యల వలయంలో తారానాథ ఆస్పత్రి
సాక్షి,బళ్లారి: మొండి వ్యాధులను సైతం ఇట్టే నయం చేయడంలో రాష్ట్రంలోని పేరుగాంచిన ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఒకటైన బళ్లారిలోని తారానాథ ఆస్పత్రిని సమస్యలు చుట్టుముట్టాయి. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు కొరవడటం రోగులకు శాపంగా మారింది. ఈ ఆస్పత్రికి బళ్లారి జిల్లాతో పాటు, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు, ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. వంద పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తారానాథ ఆస్పత్రిలో ఆయుర్వేద కళాశాల కూడా ఉంది. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, మరో వైపు వైద్య సేవలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. సిబ్బంది కొరతపై పలుమార్లు అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఏటేటా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. బోధన సిబ్బంది 52 మంది ఉండాల్సి ఉండగా, అందులో సగం కూడా వైద్య సిబ్బంది లేరు. ఫలితంగా ఇటు వైద్య సేవలు, అటు బోధన సేవలు రెండింటికీ సమస్యగా పరణమించింది. 20 మందికి పైగా నర్సులు అవసరం ఉండగా,13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది కొరతతో ఒక్కోసారి నర్సుల పని కూడా తామే చేయాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక విధానం ద్వారా మసాజ్ చేయడంతోపాటు, స్టీం బాత్ సౌకర్యంకూడాఉంది. వనమూలికలతో తయారు చేసిన మందులతో పలు నొప్పులకు మసాజ్ చేసిన తర్వాత స్టీం బాత్ చేయించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. పక్షవాత బాధితులకు మసాజ్ చేసి చికిత్సలు చేస్తుంటారు ఆస్పత్రిలో విద్యుత్ సమస్య కూడా ఉంది. జనరేటర్ సౌకర్యం సరిగా లేకపోవడంతో విద్యుత్‌కోతల సమయంలో రోగులు ఇబ్బందులు పడుతుంటారు. సిబ్బంది కొరతతో రోగులకు ఇక్కట్లు విద్యుత్ కోతలు ..జనరేటర్ అంతంత మాత్రమే -
2 నెలలు మృత్యువుతో పోరాడి..
శివమొగ్గ: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఏఎస్ఐ రెండు నెలలకు పైగా మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. వివరాలు.. శివమొగ్గ జిల్లాలో ఆనవట్టి ఠాణాలో ఏఎస్ఐ బసవరాజప్ప (50) ఏప్రిల్ నెల 30వ తేదీన రాత్రి బైక్‌లో శిరాళకొప్పకు వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బసవరాజప్పని ప్రజలు ఆస్పత్రిలో చేర్పించారు. కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ఎంత చికిత్స చేసినా ఆయన కోలుకోలేదు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను ఇటీవల శికారిపుర పట్టణంలో ఉన్న ఇంటికి తీసుకుని వచ్చారు. శనివారం రాత్రి కన్నుమూశారు. లాడ్జిలో ఎస్ఐ ఆత్మహత్య ●● 6 రోజుల తరువాత వెలుగులోకి ● తుమకూరులో సంఘటన తుమకూరు: తుమకూరు నగరంలోని ఓ లాడ్జిలో దావణగెరెకు చెందిన ఎస్ఐ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఎస్ఐ నాగరాజు (35) దావణగెరె ఎక్స్టెన్షన్ ఠాణాలో ఎస్ఐగా పనిచేసేవారు. ఆదివారం లాడ్జ్ గదిలో నుంచి దుర్వాసన రావడంతో సిబ్బంది వెళ్ళి చూడగా విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలించగా 2 పేజీల డెత్‌నోట్ లభించింది. ఈ నెల 1వ తేదీన నాగరాజు లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఎస్ఐ అని చెప్పి రూంని తీసుకున్నారు. గదిలోకి వెళ్ళిన నాగరాజు మళ్లీ బయటికి రాలేదు. లాడ్జ్ సిబ్బంది ఫోన్ చేసినా స్పందన లేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సమస్యలే కారణమని డెత్‌నోట్‌లో రాసినట్లు తెలిసింది. కారు– బస్సు ఢీ, ముగ్గురు దుర్మరణం దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్టీసీ బస్సు కారు– ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో కారులో ఒకే కుటుంబానికి ముగ్గురు మృతిచెందిన సంఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా మురగుండి గ్రామం వద్ద జరిగింది. కల్బుర్గి జిల్లా అఫ్జల్పురకు చెందిన గిరీష్, రాహుల్, సంగు అమరగొండ మరణించారు, రాధిక అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరంతా కొల్హాపుర మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్ర్టీసీ బస్సు ఢీకొంది. కారు గుర్తుపట్టలేనంతగా తుక్కు తుక్కయింది. అథణి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేస్తమా.. తిరిగి రావా! ●● ఎద్దు సమాధి చెంత శునకం ఘోష మైసూరు: పిచ్చి కుక్క కరిచి రేబిస్ వ్యాధితో మరణించిన మైసూరులో మేటగళ్లి మహాలింగేశ్వర ఆలయ వృషభం మిత్రుడు, వీధి శునకం ఆవేదన చెప్పనలవి కాదు. తన మిత్రుడు సమాధి నుంచి వస్తాడా.. అని అక్కడే వేచిచూస్తోంది. అది చూసి గ్రామస్తులకు కంటనీరు ఆగడం లేదు. ఆలయ ఎద్దుకు రేబీస్ సోకి వారం కిందటే చనిపోవడం, గ్రామస్తులు ఎద్దును ఆలయం పక్కనే ఖననం చేసి సమాధి నిర్మించడం తెలిసిందే. బసవతో బంధాన్ని పెంచుకొన్న శునకం అక్కడే తిరుగాడుతోంది. ఆదివారం జరిగిన సమారాధనలో శునకం కూడా పాల్గొంది. సమాధి దగ్గర ఉంచిన ఎద్దు చిత్రపటం ముందు బాధతో కూర్చుంది. -
రూ.40 కోట్లు చీట్..ఫండ్
బనశంకరి: చిట్‌ఫండ్ అంటే చీటింగ్ల మాదిరిగా మారాయి. అవసరానికి ఆదుకుంటుంది అని ఆశపడి చిట్టీలు కట్టి వందలాది ప్రజలు మోసపోయారు. ఈ ఘటన బెంగళూరు పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు..జరగనహళ్లి నివాసులైన సుధా, సిద్దాచారి దంపతులు 20 ఏళ్లుగా చీటీల వ్యవహారాలు నడుపుతున్నారు. ఆ కుటుంబం వద్ద 600 మందికి పైగా స్థానిక ప్రజలు చీటీలు కట్టారు. ఈ మొత్తం రూ.40 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రూ.5 లక్షల నుంచి 10 లక్షల చీటీలు నడిపేవారు. అర్ధరాత్రి పరార్ సుధా, ఆమె భర్త సిద్దాచారి గత ఏడాదినుంచి ఖాతాదారులకు చీటీల డబ్బు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుధా దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా ఇటీవల అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని పరారయ్యారు. అంతకుముందు బ్యాంకులో తమ బంగారు ఆభరణాలను విడిపించుకున్నారు. ఇంట్లోనే మొబైల్‌ఫోన్‌ను వదిలిపెట్టి విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించారు. దంపతులు అదృశ్యం కావడంతో వందలాది మంది చీటీదారులు లబోదిబోమన్నారు. ఇంటి అవసరాల కోసం కట్టామని, ఎంతో నష్టపోయామని, న్యాయం చేయాలని విలపిస్తున్నారు. పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు పిర్యాదు చేశారు. వంచక దంపతుల పోలీసులు గాలిస్తున్నారు. బెంగళూరు పుట్టేనహళ్లిలో మోసం 600 మంది లబోదిబో -
నకిలీ రికార్డులతో ఆస్తుల విక్రయాలు
రాయచూరు రూరల్: దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రజల ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించి విక్రయించి భారీ కుంభకోణానికి తెరదీశారు. దీంతో నగరంలో అస్తులు కలిగిన వారు నగరసభ కార్యాలయానికి వెళ్లి అస్తులు తమపేరు మీద ఉన్నాయో, లేదో అని చూసుకుంటున్నారు. అక్రమార్కులు ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాల నకళ్లను సేకరించి వాటిని ఒరిజనల్‌గా చూపుతూ ఇళ్ల స్థలాలను అమాయకులకు కట్టబెట్టారు. రాయచూరు, సిరివార, లింగసూగురు తాలుకాలో ఇలా అనేక మందికి చెందిన ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించారు. బాధితుల ఫిర్యాదుతో 36 మందిపై పోలసులు కేసు నమోదు చేశారు. అంజినేయ్య, సంతోష్ శాన్బోగ, సబ్ రిజిస్ట్రార్, ఎఫ్డీపీ నారాయణ, రాజు, నగరసభ యస్డీసీ నరసింహులు, డి,డి,రైటర్ లోక్‌నాథ్ రెడ్డి, రామప్ప, మారెప్ప, ప్రసాద్, మసూదవలీ, అక్షయ్ భండారి, మహ్మద్ ముజాయిద్, విద్యా సురేస్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వారం రోజుల్లో నివేదికలు అందించాలని అదేశించినట్లు వివరించారు. రాయచూరు జిల్లాలో భారీ కుంభకోణం 36 మందిపై కేసులు -
సిద్దుకు పదవిపై గందరగోళం!
దొడ్డబళ్లాపురం: ఏఐసీసీ ఓబీసీ జాతీయ విభాగంలో సీఎం సిద్దరామయ్య నియామకం గురించి కొంత గందరగోళం అలముకొంది. ఆయన అందులో సభ్యునిగా ఉండగా, ఇప్పుడు అధ్యక్షున్ని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆదివారం సీఎం మాట్లాడుతూ జూలై 15న ఓబీసీ సభను నిర్వహించాలని తనకు సూచించారన్నారు. అధ్యక్ష పదవి గురించి సమాచారం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ స్పష్టతనిస్తూ మండలిలో సీఎం సిద్ధరామయ్య సభ్యుడు మాత్రమేనని, అధ్యక్షునిగా డా.అనిల్ జైహింద్ ఉన్నారని, ఆయన నేతృత్వంలోనే 15న బెంగళూరులో ఓబీసీ సభ జరుగుతుందని తెలిపింది. ఆ భేటీకి వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది వరకూ ముఖ్య నేతలు హాజరవుతారు. కెనాల్లోకి బైక్ పల్టీ, ఇద్దరు జలసమాధి మండ్య: బైక్ అదుపుతప్పి విశ్వేశ్వరయ్య కెనాల్ (వీసీ)లో పడడంతో ఇద్దరు మరణించారు. మండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని హోసగావి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకాకు చెందిన రామన్న (70), మద్దూరువాసి భరత్ (19), ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మోపెడ్‌లో వెళ్తున్నారు. బైకు నడుపుతున్న రామన్న అదుపు తప్పడంతో అడ్డుగోడను ఢీకొని కాలువలోకి పడిపోయారు. ఈత రాకపోవడంతో పాటు గాయాల పాలై అక్కడే చనిపోయారు. సాయంత్రం కొందరు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. అన్నదాత ఆత్మహత్య మైసూరు: మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని బిలికెరె హోబ్లిలోని శ్రావణహళ్లి గ్రామంలో అప్పుల బాధతో రైతన్న ప్రాణాలు తీసుకున్నాడు. పుట్టస్వామాచారి (50) అనే రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. పొగాకు, ఇతర పంటల సాగు కోసం రూ. 20 లక్షల అప్పులు తీసుకొన్నాడు. మైక్రో ఫైనాన్స్ నుంచి రూ. 9 లక్షల రుణం తీసుకొన్నాడు. కొన్నిరోజులుగా రుణదాతలు రైతు ఇంటికి వచ్చి చెల్లించాలని గొడవలు చేయడంతో విరక్తి చెందాడు. ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబీకులు మైసూరులోని కేఆర్ నగర ఆస్పత్రిలో చేర్పించగా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమాజానికి పాత్రికేయుల సేవలు అపారం
హొసపేటె: స్థిరమైన సమాజాన్ని నిర్మించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని కొప్పళ గవి మఠం జగద్గురు అభినవ గవిసిద్దేశ్వర మహాస్వామీజీ అన్నారు. నగరంలోని సాయిలీల కళా మందిరంలో కర్ణాటక యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల దినోత్సవం, ప్రతిభా పురస్కారం, సీనియర్ విలేకరులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. టీవీ, మొబైల్, సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలను కొనుగోలు చేసి చదివే వారి సంఖ్య తగ్గుతోందన్నారు. జిల్లాధికారి దివాకర్ మాట్లాడుతూ విలేకరులు సమాజంలో ఉన్న ఒడిదొడుకులను అధికారుల దృష్టికి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని తెలిపారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ పాత్రికేయుల నూతన భవన నిర్మాణం చేపడుతామన్నారు. అనంతరం పది, పీయూసీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. పది వేలు చొప్పున నగదును జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ తరఫున ఆయన పీఏ లక్ష్మీ నారాయణ అందజేశారు. జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూర్, కార్యదర్శి లోకేష్, ఎస్పీ శ్రీ హరిబాబు, హుడా అధ్యక్షులు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, జిల్లాధ్యక్షుడు సత్యానారాయణ, కార్యదర్శి లక్ష్మణ, వెంకోబి తదితరులు పాల్గొన్నారు. -
ముదగల్‌లో పీర్ల దేవుళ్ల ఊరేగింపు
రాయచూరు రూరల్: ముదగల్‌లో నిర్వహించే మొహర్రం వేడుకలు హిందూ, ముస్లింల భావైక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఏటా మొహర్రం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పీర్ల దేవుళ్లను ఇరాన్ దేశం నుంచి ముదుగల్‌కు తీసుకోచ్చి కొలువుదీర్చినట్లు భక్తుల నమ్మకం. మొహర్రం సందర్భంగా కొలువు దీర్చిన పీర్లను దర్శించుకునేందుకు స్థానికులతోపాటు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. శనివారం రాత్రి అగ్నిగుండం వెలిగించగా భక్తులు అందులోకి కొబ్బరి, చక్కెర వేసి మొక్కులు తీర్చుకున్నారు. ముస్లింలతోపాటు హిందువులు పీర్ల దేవుళ్ల చావడి వద్ద ఆలం తొక్కుతూ ఆనందంలో మునిగిపోతున్నారు. శాంతియుతంగా ఆచారించాలి మోహర్రంను శాంతియుతంగా అచరించాలని జిల్లా ఎస్ప పుట్ట మాదయ్య సూచించారు. లింగసూగురు తాలుకా హట్టి, ముదుగల్, సింధనూరు తాలూకా క్యాంప్ సిరవారలో మొహర్రంను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలని సూచించారు. హొసపేటె: పీర్ల పండుగను నగర వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పీర్ల మందిరానికి వెళ్లి చెక్కర, బెల్లం పొడిని చదివించారు. చిత్తవాడిగి, రామటాకీస్, అజాడ్ నగర్ తదితర చోట్ల పీర్ల దేవుళ్లను కూర్చోపెట్టారు. -
ఎల్లో లైన్లో మెట్రో రైళ్లను నడపాలి
యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రో ఎల్లో లైన్లో రైలు మార్గం నిర్మాణాలను సత్వరమే పూర్తి చేసి ఆర్వీ రోడ్డు– బొమ్మసంద్ర రూట్లో సర్వీసులను ప్రారంభించాలని నగర బీజేపీ నాయకులు శనివారం లాల్బాగ్ పార్కు ముందు ఆందోళన చేశారు. ఎంపీలు తేజస్వీ సూర్య, పీసీ మోహన్, ఎమ్మెల్యే రామమూర్తి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఎంఆర్సీఎల్ సంస్థ బెంగళూరు ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ మార్గంలో మెట్రో రైలును ప్రారంభిస్తే 10 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సిల్క్ బోర్డ్ వద్ద ప్రజలు బస్సుల కోసం గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోందని చెప్పారు. నెల రోజుల్లో పూర్తి చేస్తాం ఆగస్ట్ 15లోపు బెంగళూరు సొరంగ మార్గంలో రైలు సంచారాన్ని ప్రారంభించనున్నట్లు బీఎంఆర్సీఎల్ ఎండి మహశ్వర్రావ్ తెలిపారు. బీజేపీ నిరసనపై ఆయన స్పందిస్తూ ఎల్లో మార్గంలో మెట్రో సంచారానికి మూడు కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. భద్రతా తనిఖీలు, మిగిలిన పనులను నెల రోజులలో పూర్తి చేసి త్వరలోనే మెట్రో సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. జయనగరలో వంతెనను నిర్మించాలని డిమాండ్లు వచ్చాయన్నారు. బీజేపీ ఎంపీల ధర్నా -
అధ్వానంగా కార్యాలయ ఆవరణ
సాక్షి,బళ్లారి: కన్నడ భాష పరిరక్షణకు నగరంలోని అనంతపురం రోడ్డు(రాజ్కుమార్రోడ్డు)లో ఏర్పాటు చేసిన కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణ అధ్వానంగా తయారైంది. జిల్లాధికారి బంగ్లా పక్కానే ఉన్న ఈ కార్యాలయంలో పరిసరాల్లో చెత్తా చెదారం చేరిది. ఇక్కడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండటంతో వందలాది మంది విద్యార్థులు, నగర వాసులు వచ్చి జ్ఞానార్జన పొందుతుంటారు. ఇదే ఆవరణలో నగరవాసులు ఏదయం, సాయంత్రం వాకింగ్‌కు వస్తుంటారు. స్వచ్ఛత కరువు కావడంతో వ్యాహాళికి వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇదే కార్యాలయ ఆవరణలో అధునాతన భవనాలు నిర్మించారు. వాటిని వినియోగించకుండా వృథాగా వదిలేశారు అక్కడి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. మంచినీటి సంపు క్లీన్ చేయకపోవడంతో అందులో చెత్తాచెదారం పడిపోయింది. మరుగుదొడ్లు కూడా దుస్థితికి చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయని వ్యాహాళికి వచ్చినవారు వాపోతున్నారు. కన్నడ సంస్కృతి శాఖ కార్యాలయ ఆవరణంలో సమస్యలపై సామాజిక కార్యకర్త వెంటకరెడ్డి మాట్లాడుతూ కన్నడ సంస్కృతిశాఖ కార్యాలయ ఆవరణంలో నెలకొన్న దుస్థితికి అధికారికి చెబితే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని సూచించారు. వృథాగా భవనాలు ఆవరణలో పారిశుధ్య లోపం వ్యాహాళికి వస్తే కంపు, దుర్వాసన స్వాగతం పట్టించుకోని అధికారులు -
పరిసరాలను సంరక్షించాలి
రాయచూరు రూరల్: పరిసరాల సంరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని గ్రీన్ సంచాలకుడు ఈరన్న పిలుపునిచ్చారు. భోళమాను దొడ్డి ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో వేడిమినుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఇంటిి ముందు మొక్కలు పెంచి సంరక్షించాలన్నారు. పీర్ల దేవుళ్లకు హిందువులే అర్చకులు రాయచూరు రూరల్: ఆ గ్రామంలో మైనార్టీలు లేకపోయినా పీర్ల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. హిందువులే పీర్ల దేవళ్లకు పూజలు నిర్వహిస్తారు. మతసామరస్యానికి ప్రతీక అయిన ఈ గ్రామం కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని యాదగిరి జిల్లా సురుపుర తాలూకాలో ఉంది. తళవార గ్రామంలో మైనార్టీలు ఒక్కరు కూడా లేరు. ఊరంతా హిందువులే. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి పండుగలతో పాటు వందేళ్లుగా మొహర్రంను ఆచరిస్తున్నారు. ఆరు రోజలు పాటు జరిగే మొహర్రం వేడుకల్లో హసేని, సయ్యద్ ఖాసీం, లాలసాబ్, మౌలాలీ పీర్లను కొలువు దీర్చి పూజలు చేస్తారు.ఈ గ్రామంలోని హిందువులతోపాటు పక్క గ్రామాలనుంచి హిందు, ముస్లింలు వచ్చి ఇక్కడ పీర్ల దేవుళ్లను దర్శించుకొని స్వామివారికి చక్కెర, కొబ్బెర చదివిస్తారు. ఈ ఏడాది కూడా మొహర్రం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ద్విభాషా విధానం అమలు చేయాలి రాయచూరు రూరల్: రాష్ట్రంలో విద్యాశాఖలో ద్విభాష విధానాన్ని అమలు చేయాలని కరవే డిమాండ్ చేసింది. జిల్లాదికారికార్యాలయం వద్ద శనివారం అందోళన చేపట్టిన అధ్యక్షుడు గంగణ్ణ మాట్లాడుతూ ప్రస్తుతం త్రిభాషా సూత్రం వల్ల విద్యార్థులు హిందీ భాషలో అధికశాతం ఉత్తీర్ణులు కాలేక పోతున్నారన్నారు. 1968లో తమిళనాడు హిందీభాషను రద్దు చేయగా మహారాష్ట్రలో కూడా హిందీని తొలగించారన్నారు. కర్ణాటకలో కూడా హిందీని రద్దు చేసి ద్విభాషా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. రోటరీ సేవలు విస్తరింపజేస్తాం రాయచూరురూరల్: రోటరీ క్లబ్ సేవలు విస్తరింపజేస్తామని జిల్లా రోటరీ గవర్నర్ తిరుపతి నాయుడు అన్నారు. నగరంలోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో శనివారరం జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో ఇప్పటికే గణనీయమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఇతర రంగాల్లో కూడా సంస్థ సేవలు అందించాల్సి ఉందన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగికి రక్తస్రావం ●● జిమ్స్ ఆస్పత్రిలో ఘటన హుబ్లీ: కలబుర్గి జిమ్స్ ఆస్పత్రిలో మరో నిర్లక్ష్య ఘటన వెలుగు చూసింది. ఐసీయూలో ఉన్న రోగికి గ్లూకోజ్ పైపు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. జిల్లాలోని మెలకుంద గ్రామ నివాసి సిద్దన్న నాలుగు రోజుల క్రితం విషం సేవించి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని జిమ్స్ ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో ఉంచారు. ఆయనకు పెట్టిన గ్లూకోజ్ పైపు పక్కకు తొలగిపోవడంతో రక్తస్రావమైంది. అయినా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయన ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయగా సిద్దన్నకు గుండెపోటు వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితుడు కుటుంబ సభ్యులు వాపోయారు. -
బస్సు పల్టీ.. 25 మందికి గాయాలు
మండ్య: వేగంగా వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట పొలంలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో సమారు 25 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మండ్య తాలూకాలోని శివళ్ళి, హాడ్యా గ్రామాల మధ్య జరిగింది. మండ్య నుంచి శివళ్ళి మీదుగా పాండవపురకు వెళుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపుతప్పి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. స్థానికులు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. నకిలీ హెల్మెట్లపై కొరడా దొడ్డబళ్లాపురం: ఊరూ పేరూ లేని నకిలీ హెల్మెట్లు, నాసిరకం హెల్మెట్లను అమ్ముతున్న షాపులపై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు దాడి చేశారు. బెంగళూరులో శనివారంనాడు 19 చోట్ల తనిఖీలు చేసి, 6 దుకాణదారులకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించారు. సిద్ధయ్య రోడ్డు, కలాసిపాళ్య, లాల్ బాగ్ రోడ్డు, మాగడి రోడ్డు, సుమనహళ్లి, విజయనగర, దాసరహళ్లి, నాగరభావి, ఔటర్ రింగ్ రోడ్డుల్లో దాడులు చేపట్టారు. నోటీసులు ఇచ్చి కోర్టులో జరిమానా కట్టాలని సూచించారు. పెద్దసంఖ్యలో నకిలీ హెల్మెట్ల స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ హెల్మెట్లు ధరించిన 38 బైకిస్టులకు కూడా జరిమానాలు వేశారు. సగం హెల్మెట్లు, ఐఎస్ఐ మార్కులేని హెల్మెట్లు ఉపయోగిస్తున్నవారికి కూడా ఫైన్ వేశారు. తుపాకీతో ఎమ్మెల్యే పుత్రుని హల్చల్ దొడ్డబళ్లాపురం: జాతరలో పోలీసుల ముందే ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా లక్ష్మిదేవి జాతరలో చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహొళి కుమారుడు సంతోష్ జార్కిహొళి కాల్పులు జరిపాడు. జాతరలో సంతోష్ కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకుని పిస్టల్ తీసి గాల్లోకి కాల్చాడు. కాల్పుల శబ్ధాలకు జనం భయపడిపోయారు. ఈ దృశ్యాలు వైరల్ కాగా, అతని అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసుల ముందు కాల్పులు జరిపినా వారు పట్టించుకోలేదని, శాంతిభద్రతలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నించారు. -
ఆన్లైన్లో రెవెన్యూ పత్రాలు తీసుకోవచ్చు
● దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి వెల్లడి బళ్లారి రూరల్ : భూ సంరక్షణ యోజనలో రెవెన్యూ పత్రాలను ప్రజలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి జి.ఎం.తెలిపారు. శనివారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటుచేసిన పత్రికాసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.1.13 కోటి రెవెన్యూ పత్రాలు స్కానింగ్ చేశామన్నారు. ప్రజలకు డిజిటల్ రూపంలోనే పత్రాలు అందుతాయని తెలిపారు. పాత పాణి, ముటేషన్, ల్యాండ్గ్రాంట్ రిజిస్ట్రేషన్ తదితర భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దావణగెరె తాలూకా కార్యాలయంలో 52,80765, హరహర తాలూ కాలో 1106372, జగుళూరు1323129, హొన్నాళి,11,51723 పత్రాలను స్కానింగ్ చేసినట్లు తెలిపారు. తాలూకా కార్యాలయాల్లో ప్రజలు తమ భూమి పత్రాలను తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అపర జిల్లాధికారి శీలవంత శివకుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రాజానాయక్ తాసిల్దార్ ఎం.బి.అశ్వథ పాల్గొన్నారు. -
ఇప్పుడు సాకారమైంది
పలువురు స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ 1960 ల నుంచి వంతెన నిర్మాణం కోసం కోరుతున్నామని, ఇప్పుడు సాకారమైందని సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి సిగందూరులోని చౌడేశ్వరి దేవస్థానానికి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నది వల్ల చుట్టూ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు వంతెన నిర్మాణం వల్ల దూరం గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. అలాగే చుట్టుపక్కల శరావతి నది బ్యాక్‌వాటర్‌లో ఉండే దీవుల గ్రామాల ప్రజలకు కూడా సాగర్ పట్టణానికి వెళ్లడానికి రవాణా సౌకర్యం మెరుగవుతుంది. ప్రస్తుతం నదిలోని తీర గ్రామాలు, ద్వీప గ్రామాలకు వెళ్లడానికి పెద్ద పెద్ద ఫెర్రీలను వాడుతున్నారు. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలను కూడా అందులోనే తరలిస్తుంటారు. ఫెర్రీ ప్రయాణం ఎంతో వ్యయ ప్రయాసలతో పాటు ప్రమాదాలతో కూడుకున్నది కావడం గమనార్హం. -
స్వామీ వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి
రాయచూరు రూరల్: నగరంలోని సర్వోదయ పాఠశాలలో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వామీ వివేకానంద పుణ్యరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్వామి రావ్ మాట్లాడారు. విద్యార్థులు వివేకానందను ఆదర్శంగా తీసుకోవాన్నారు. ఆయన జీవితచరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాఘవేంద్ర, ప్రవీణ్, డాక్టర్ అనంద్ పడ్నిస్, హన్మంతరావ్, రామరావ్, వినోద్, జానకి, దానమ్మ, అశ్విని, సంతో్స్ కుమార్, నివేదిత, శ్రీపాద, గురురాజ, వినోద సాగర్, ఉమా, నరసింహమూర్తి పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కేజీఎఫ్: కార్మిక సంఘాలు అన్నీ ఐకమత్యంగా వస్తే బిజిఎంఎల్, బిఈఎంఎల్ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీ ఎం.మల్లేష్‌బాబు తెలిపారు. శనివారం నగరంలోని ఉరిగాం అతిథి గృహంలో కెజీఎఫ్ ఉళిసోణ ఎకతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు గత 25 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తామని, ఇందుకు కార్మిక సంఘాలు కూడా సహకారం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి కూడా తీసుకు వెళ్లామని, అయితే కార్మికులు పలు సమస్యలపై పట్టు విడవకపోవడం వల్ల పరిష్కారం కావడం లేదన్నారు. బిజిఎంఎల్ కార్మికులకు ఇళ్లు సొంతం కావాలంటే అదనంగా ఉన్న ఇళ్లను వాపసు చేయాల్సి ఉంటుందన్నారు. జేడీఎస్ నాయకులు సిఎంఆర్ శ్రీనాథ్, బణకనహళ్లి నటరాజ్, సేవ్ కేజీఎఫ్ కార్యదర్శి దయానంద తదితరులు పాల్గొన్నారు. -
ఆయుర్వేద శిబిరాల నిర్వహణ అభినందనీయం
రాయచూరు రూరల్: నగరంలోని పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల భవనంలో శనివారం రస కౌశల్య శిబిరాలను ఏర్పాటు చేశారు. శిబిరాలను రాజీవ్‌గాంధీ ఆరోగ్య వర్సిటీ ప్రిన్సిపాల్ బీఏస్ సవడి ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ ఆవరణలో 250 ఔషధ మొక్కలు నాటి పంచకర్మ తదితర ఆయుర్వేద విధానాలతో రోగులకు వైద్యం అందిస్తుండటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అయుర్వేదం ద్వారానే అన్ని రోగాలకు మందులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కేశవ రెడ్డి, శివకుమార్, ఆయూష్ అధికారి శంకర గౌడ, మహేశ్వర స్వామి, పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్ పాల్గొన్నారు. -
శరావతి నదిపై మెగా వంతెన
శివమొగ్గ: దేశంలో ఆతి పెద్దదైన కేబుల్ వంతెనల్లో రెండవదిగా పేరుపొందిన బ్రిడ్జి శివమొగ్గ జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైంది. శరావతి నది మీద ఉంది, ఇక్కడి ప్రజలకు అనేక సంవత్సరాల స్వప్నమైన వంతెన ఇది. శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకాలోని సిగందూరు వంతెనను జూలై 14వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందని జిల్లా ఎంపీ బీ.వై.రాఘవేంద్ర తెలిపారు. శనివారం శివమొగ్గ నగరంలోని తమ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ. 473 కోట్ల ఖర్చుతో నిర్మాణమైందని, 14న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని తెలిపారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. సిగందూరు చౌడేశ్వరి దేవి వంతెన కళస వద్ద సాగర తాలూకాలో అంబరగొండ్లు– కళసవల్లి అనే ఊర్ల మధ్య ఈ వంతెన నిర్మాణమైంది. ఇక్కడ శరావతి నది వల్ల ఏడాదిలో చాలా నెలలు రోడ్లు మునిగిపోతాయి. తెప్పలు, పడవలే శరణ్యం. ఎన్నో ఏళ్లుగా తమకు వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 17 పిల్లర్లతో దీని పొడవు 2.44 కిలోమీటర్లు. రెండు లేన్లతో పాటు ఫుట్‌పాత్‌లు ఉన్నాయి. సిగందూరులోని ప్రఖ్యాత చౌడేశ్వరి దేవి దేవస్థానాన్ని గౌరవిస్తూ వంతెనకు ఆమె పేరునే పెట్టారు. దీనికి 2018లో నితిన్ గడ్కరీనే శంకుస్థాపన చేయడం గమనార్హం. ఈ తరహా బ్రిడ్జి కర్ణాటకలో ఇదే మొదటిదని నిపుణులు తెలిపారు. వంతెన నిర్మాణం ఘనత తమదంటే తమదని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారు. 2.44 కి.మీ. పొడవుతో నిర్మాణం శివమొగ్గ జిల్లాలో వినూత్న కేబుల్ బ్రిడ్జి 14న ప్రారంభోత్సవం -
మధుమేహం, ధూమపానం, బీపీ..
బనశంకరి/ యశవంతపుర: రాష్ట్రంలో రోజురోజుకు గుండెపోటు మరణాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖకు టెక్నికల్ కమిటీ నివేదిక అందజేయగా, అందులోని అంశాలపై చర్చ ఆరంభమైంది. బెంగళూరు జయదేవ హృద్రోగ ఆసుపత్రి డైరెక్టర్ రవీంద్రనాథ్, ఇతర నిపుణులు నివేదికను అందజేశారు. పలు జిల్లాల్లో గుండెపోటుతో ఆస్పత్రుల్లో చేరిన 251 మంది ఆరోగ్య పరీక్షల వివరాలను పొందుపరిచారు. ఇందులో 87 మంది రోగులకు షుగర్ ఉన్నట్లు తెలిసింది. 102 మందిలో బీపీ, 35 మందిలో అధిక కొలె స్ట్రాల్ ఉంది. 40 మందిలో గుండె సంబంధ రోగాలు ఉన్నట్లు కనిపెట్టారు. 251 మందిలో 111 మంది ధూమపానం చేస్తుండగా, 19 మందిలో కోవిడ్ హిస్టరీ ఉంది. 77 మందిలో ఎలాంటి రోగాలు లేవు. 30 ఏళ్ల కంటే తక్కువ ఉన్న 12 మంది హృద్రోగుల గురించి అధ్యయనం చేశారు. 31 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 66 మంది హృద్రోగులను పరిశీలించారు. 41 నుంచి 45 ఏళ్ల వయసున్న 172 మంది హృద్రోగులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. చిక్కమగళూరులో లారీ డ్రైవర్.. గుండెపోటు ఘటనలు హాసన్ పొరుగున ఉన్న చిక్కమగళూరును చుట్టుముట్టాయి. గుండెపోటుతో రెండురోజుల క్రితం 29 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అలాగే శుక్రవారం రాత్రి అజ్జంపుర పట్టణంలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ సగీర్ అహ్మద్ (45) భోజనం చేస్తుండగా ఎదలో నొప్పి అని చెప్పాడు. క్షణాల్లోనే కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో పోలీసు... బెళగావి జిల్లా గోకాక్‌లో ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు. ఎఎస్ఐ మీరానాయక్ (55), హుబ్లీ పోలీసు స్టేషన్లో పని చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గోకాక్ గ్రామదేవత జాతర బందోబస్తులో ఉన్నారు. గోకాక్ పట్టణంలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో పోలీసులకు వసతి కల్పించారు. శనివారం తెల్లవారుజామున మీరానాయక్కు గుండెపోటు వచ్చింది, వెంటనే పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలో మరణించారు. మృతదేహానికి గోకాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. డ్యూటీకి వెళ్లి కానరాని లోకాలకు చేరడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటు కారణాలపై కమిటీ నివేదిక -
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
● కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ సాక్షి,బళ్లారి: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌లాడ్ పేర్కొన్నారు. నగరంలోని వాల్మీకి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికుల సంక్షేమానికి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసేవారే కాకుండా ఇతర అసంఘటిత రంగాల్లో పనిచేసేవారికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో 1.06 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వారికి ఐడీకార్డులు పంపిణీ చేశామని, ప్రమాదంలో మృతి చెందితే బీమా కింద రూ. లక్ష అందజేస్తారన్నారు. డీజిల్, పెట్రోల్ సెస్ ద్వారా ఒకశాతం కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని సీఎంను కోరామన్నారు. రూ.150 కోట్లు లభించే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. కార్మికులు లేకపోతే అభివృద్ధి జరగదని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎంపీ తుకారం మాట్లాడుతూ కార్మికుల హిత రక్షణ కోసం మంత్రి సంతోష్‌లాడ్ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, గణేష్ ,అధికారులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. -
మృతదేహంతో నిందితుడి ఇంటిఎదుట ధర్నా
హుబ్లీ: హాసన్ జిల్లా హరసికెరి రైల్వే పట్టాలపై రక్త గాయాలతో మృతి చెందిన నవ వివాహితది హత్య అని ఆరోపిస్తూ మృతురాలికుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. వివరాలు....దావణగెరి జిల్లా చెన్నగిరి తాలూకా అనజి గ్రామ నివాసి విద్య (24)కు ఆరు నెలల క్రితం ఇదే తాలూకా సోమలాపుర గ్రామ నివాసి, కానిస్టేబుల్ శివుతో వివాహమైంది. దంపతులు బెంగళూరులో నివసించే వారు. అకస్మికంగా విద్య కనిపించకుండా పోవడంతో భర్త శివు గత నెల 30 బెంగళూరు శంకరపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు హాసన్ జిల్లా అరసికెరె రైల్వే పట్టాలపై విద్య రక్తగాయాలతో కనిపించగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమెది సహజ మరణం కాదని, కట్నం కోసం వేధించి హత్య చేశారని ఆరోపిస్తూ భర్త శివు, ఆయన తల్లి గాయత్రమ్మ, తండ్రి గుడప్ప, చెల్లెలు శిల్పపై హరసికెర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆమెకు అంత్యక్రియలు చేయాలంటే తొలుత నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు శివు ఇంటి ఎదుట ధర్నా చేశారు. నిందితుడు శివును అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు నిర్వహించారు. -
కంప్లి వంతెన అంచులకు వరద నీరు
హొసపేటె: తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా కంప్లి–గంగావతి మధ్య కంప్లి పట్టణ సమీపంలో ఉన్న వంతెన అంచులను తుంగభద్ర జలాలు తాకాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయంలో 80 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో పైనుంచి వచ్చిన నీటిని యథాతథంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం 70వేల క్యూసెక్కులు నదికి విడుదల చేయడంతో వరద పోటెత్తింది. ఫలితంగా వంతెన నీట మునిగింది. వంతెనపై వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. వరద నీటి ఉధృతిని మున్సిపల్ అధ్యక్షుడు భట్టా ప్రసాద్, ముఖ్య అధికారి బి.మల్లికార్జున, పీఐకేబీ వాసుకుమార్ పరిశీలించారు. నదిలోకి లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ నీరు ప్రవహిస్తే, కంప్లి–గంగావతి లింక్ వంతెన మునిగిపోవడంతోపాటు ఆలయం, కోట ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. -
రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు కల్పించండి
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వే స్టేషన్లో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని దక్షణ మధ్య రైల్వే బోర్డు సలహా కమిటీ సభ్యులు డిమాండ్ చేిశారు. ఈమేరకు సభ్యులు చంద్ర శేఖర్, మారెప్ప, సిద్దలింగయ్య స్వామిలు శనివారం స్టేషన్ మేనేజర్‌తో సమావేశమై చర్చించారు. ఫ్లాట్‌ఫారంలో టైల్స్ తొలగిపోయాయని, వాటిని మార్చాలన్నారు. ప్లాట్‌ఫారంపై అపరిశుభ్రత నెలకొందని, లగేజి గది, మహిళల విశ్రాంతిగది, స్టేషన్లో కుక్కులు సంచరిస్తున్నాయన్నారు. దివ్యాంగులకు సదుపాయాలు లేవన్నారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కొల్హాపూర్ రైలును పునః ప్రారం భించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు హేమరాజ గౌడ, అమరనాథ్ పాల్గొన్నారు. -
కళ్యాణ కర్ణాటకను కరుణించని వరుణుడు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీప్ సీజన్ ఆరంభమై నెల రోజలు గడిచినా చుక్కవాన లేదు. దీంతో రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. ఎటు చూసినా ఖాళీ భూములు దర్శనం ఇస్తున్నాయి. కళ్యాణ కర్ణాటకలో కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలు ఉన్నాయి. వర్షాభావంతో విత్తనమే పడలేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా మేఘాల జాడ కూడా కనిపించకపోవడంతో అన్నదాతలు నిర్వేదంతో ఉన్నారు. రాయచూరు జిల్లాలో 5.4 లక్షల హెక్టార్లలో విత్తనం పడాల్సి ఉండగా ఇప్పటివరకు 25వేల హెక్టార్లో మాత్రమే విత్తనం చేశారు. పత్తి, కంది, సూర్యకాంతి, సజ్జ పంటలు అక్కడక్కడ సాగయ్యాయి. వర్షం లేక అవికూడా మొక్కలు వాడుముఖం పట్టాయి. విత్తనం వేయని రైతులు వరుణుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు శూన్యం అన్నదాతల్లో నిర్వేదం బీళ్లతను తలపిస్తున్న పొలాలు -
వీసీగా శివానంద కెళిగన మని
రాయచూరు రూరల్: నగరంలోని మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్గ శివానంద కెళిగన మని నియమితులయ్యారు. ఈమేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. మెరుగైన సేవలు అందించండి హొసపేటె: ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉద్యోగులు వినియోగించుకొని ప్రజలకు మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే గవియప్ప సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన రెవెన్యూ ఉద్యోగులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రజలకు సత్వరం సేవలు అందించవచ్చన్నారు. తహసీల్దార్ శృతి పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. చిత్రదుర్గం జిల్లా మదకరిపుర సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బచ్చబోరనహట్టి గ్రామానికి చెందిన రమేష్(35) ఇతను బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి పడి మృతి చెందాడు. బెంగళూరులోని బెంగళూరుఉ– మైసూరు సర్కిల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహమ్మద్ హజార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్‌లో వెళ్తూ కేఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
8న సిలికాన్ సిటీలో వైఎస్సార్ జయంతి వేడుకలు
బనశంకరి: పేదల పెన్నిధి, అపరభగీరథుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ సమర్థనం ట్రస్టు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఐటీ విభాగం బెంగళూరు టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సమర్థనం ట్రస్టు కార్యాలయంలో కేక్ కట్ చేసి పేదలు, వృద్ధులు, పిల్లలకు అన్నదానం నిర్వహిస్తారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీ వింగ్టీమ్ విజ్ఞప్తి చేసింది. హాజరయ్యేవారు పండ్లు, బిస్కెట్లు తీసుకువచ్చి వృద్ధులకు, పిల్లలకు అందజేయవచ్చని పేర్కొంది. వివరాలకు 9035193106, 9945207998, 9703518965 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
పేదలకు నోటీసులు తగదు
రాయచూరు రూరల్: నగరంలో మావినకెరె చెరువు గట్టుపై నివాసం ఉంటున్న పేదలకు నోటీసులు అందజేయడం తగదని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లాదికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు జైభీమ్ మాట్లాడారు. మావినకెరె చెరువు గట్టును కబ్జా చేసిన పేదలకు వారం రోజుల్లో స్థలాలను ఖాళీ చేయాలని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. 1999లో 14 మంది నగరసభలో ఆస్తి పన్ను కట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గురువారం సాయంత్రం స్థలాలను ఖాళీ చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
తుంగభద్ర వరద యథాతథం
సాక్షి,బళ్లారి/హొసపేటె: గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటివారంలోనే తుంగభద్రమ్మ కళకళలాడుతోంది. డ్యాంలోకి రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతుండటంతో డ్యాం వద్ద 20 క్రస్ట్‌గేట్లను రెండు అడుగులు మేర పైకెత్తి నదికి సుమారు 60 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరందించే ఉమ్మడి ప్రధాన జలాశయమైన తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో ఆ మూడు రాష్ట్రాలకు చెందిన ఆయకట్టు రైతులు సకాలంలో పంటలను సాగు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. డ్యాం నుంచి నదికి నీరు వదిలిన తరుణంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ సమీపంలోని పురంధర దాస మంటపం నీట మునిగింది. తుంగభద్ర డ్యాంకు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో అనుకున్న సమయం కన్నా ముందుగానే డ్యాం నిండిపోయింది. గత ఏడాది 19వ నంబరు క్రస్ట్‌గేటు కొట్టుకుపోగా, అనంతరం తాత్కాలికంగా మరమ్మతులు చేసి స్టాప్‌లాగ్ గేటును అమర్చిన సంగతి విదితమే. లోతట్టుకు పొంచి ఉన్న ముప్పు అయితే గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో అన్ని క్రస్ట్‌గేట్లను పూర్తిగా మార్చాలని నిపుణులు సూచించినందున తుంగభద్ర డ్యాంలో గరిష్ట నీటి నిల్వను 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించి వరద నీటిని నదికి వదులుతున్నారు. దీంతో నదిలోకి భారీ స్థాయిలో నీరు చేరుతోంది. డ్యాంలో ప్రస్తుతం 75 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలారు. ఏ క్షణంలోనైనా వరద నీరు మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే నదికి భారీగా నీరు వదలడంతో పురంధర దాస మంటపం మునిగిపోయిన నేపథ్యంలో మరింత నీటి ప్రవాహం పెరిగితే కంప్లి, గంగావతి తాలూకాల్లో నదీ తీర ప్రాంతాల్లో పంటలు నీటమునిగే ప్రమాదం ఉంది. ప్రతి ఏటా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలకు ఈ ప్రాంతాల్లో పంటలు నీటమునిగేవి. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో డ్యాంలోకి భారీ స్థాయిలో నీటి ప్రవాహం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 75.837 టీఎంసీలు, నీటిమట్టం 1624.80 అడుగులు, ఇన్‌ఫ్లో 35,052 క్యూసెక్కులు ఉందని బోర్డు అధికారులు తెలిపారు. టీబీ డ్యాం వద్ద 20 క్రస్ట్‌గేట్ల ఎత్తివేత 60 వేల క్యూసెక్కులు నదికి విడుదల హంపీలో పురంధర మంటపం మునక వరద నీటితో తుంగభద్ర డ్యాంకు జలకళ -
పంచ గ్యారెంటీలకే సమయం లేదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచ గ్యారెంటీల అమలుకే సమయం లేదు, ఇక అభివృద్ధి ఎక్కడ ఉందని, ముఖ్యమంత్రి పదవికి ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర జనతాదళ్(ఎస్) యువ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం బీదర్ జిల్లాలో ప్రజలతో జనతాదళ్ జాతా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పదవికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య పగటి కలలు కంటున్నారన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు మిన్నంటాయన్నారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలు బట్టబయలు అవుతున్నాయన్నారు. మధ్యవర్తుల ఆధారంగా కమీషన్ల దందాలతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో విప్లవం జరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదన్నారు. రైతులు పండించిన వరి, జొన్న పంటలకు రక్షణ కల్పించలేదన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తరుణంలో కుమారస్వామి మామిడి, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండెప్ప కాశంపూర్, వెంకట్రావ్ నాడగౌడ, హన్మంతప్ప ఆల్కోడ, మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్, చంద్రశేఖర్, రశ్మి రామేగౌడలున్నారు. ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవికి దోబూచులాట యువ జేడీఎస్ నేత నిఖిల్ కుమారస్వామి -
కొనసాగిన ఆటోల తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలో నాలుగో రోజు 200 ఆటోలను తనిఖీ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. శుక్రవారం పోలీస్ స్టేన్లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేని వాటిని చెక్ చేసి సీజ్ చేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో వీటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.70 వేలు వసూలు చేశామన్నారు. ఆగస్టు ఒకటో తేదీలోగా ఆటోడ్రైవర్లు, యజమానులు తమ రికార్డులను సరి చేసుకోవాలన్నారు. ఎస్పీని బదిలీ చేయొద్దురాయచూరు రూరల్: యాదగిరి జిల్లా ఎస్పీ ప్రథ్వీశంకర్ను బదిలీ చేయవద్దని మాజీ మంత్రి రాజుగౌడ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణ, మట్కా, జూదం, ఇతరత్ర అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారని, అలాంటి నిజాయితీ అధికారిని బదిలీ చేయకుండా యాదగిరి జిల్లాలోనే కొనసాగించాలని, ప్రామాణికతతో విధులు నిర్వహించే అధికారులను బదిలీ చేయవద్దని కోరినట్లు తెలిపారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనరాయచూరు రూరల్: నగరంలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సోదరులు నిరసన తెలిపారు. శుక్రవారం హాజీ కాలనీలో మైనార్టీ సోదరులు నమాజ్ అనంతరం మూకుమ్మడిగా ప్రార్థనలు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి తీసుకున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ రెండు గంటల పాటు నిరసన ప్రదర్శనను జరిపారు. అసంఘటిత కార్మికులకు స్మార్ట్కార్డ్లు హొసపేటె: రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన 35 లక్షల మంది కార్మికులను గుర్తించి, ఉచితంగా నమోదు చేయించి వారికి స్మార్ట్ కార్డ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని కార్మిక శాఖ మంత్రి, సంఘటిత కార్మికుల సామాజిక భద్రతా మండలి అధ్యక్షుడు సంతోష్‌లాడ్ అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని మల్లిగె హోటల్లో ఏర్పాటు చేసిన అసంఘటిత కార్మికులకు స్మార్ట్ కార్డ్‌ల పంపిణీ, వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచ గ్యారంటీల అమలుపై విపక్షాలు చేసిన అన్ని ఆరోపణలకు కేవలం రెండు నెలలకే గ్యారెంటీ పథకాలను అమలు చేసి తగిన జవాబు చెప్పామన్నారు. రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి నేరుగా రూ.60 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.3 లక్షల కోట్లను ఇచ్చే దేశంలోని ఏకై క సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, లతా మల్లికార్జున, జిల్లాధికారి దివాకర్, హుడా అధ్యక్షుడు ఇమామ్, నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ ఆస్పత్రి డైరెక్టర్‌గా డాక్టర్ ఈశ్వర్ హొసమని హుబ్లీ: కర్ణాటక మెడికల్ కళాశాల(కేఎంసీ) పరిశోధన సంస్థ ఆస్పత్రి ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎఫ్ కమ్మరా శుక్రవారం డాక్టర్ ఈశ్వర్‌కు బాధ్యతలను అప్పగించారు. ఆ మేరకు ప్రభుత్వం ఆకస్మికంగా ఆదేశాలను వెల్లడించింది. శస్త్ర చికిత్స విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ హొసమని సదరు ఆస్పత్రి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ కళాశాలలోనే ఎంబీబీఎస్, ఎంఎస్ చదివిన ఆయన 2006 నుంచి ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. -
కారు లారీని ఢీకొని దంపతుల మృతి
● ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణ శివార్లలో జాతీయ రహదారి–50లోని జెస్కాం కార్యాలయం ముందు కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. వివరాలు.. బాగల్కోటె జిల్లాలోని శెట్టిహాళు గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ ముత్తప్ప పూజార్(35), అతని భార్య రేణుక(30), పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ఘటన చోటు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తల్లీకుమారుల అదృశ్యంహొసపేటె: నగరంలోని 22వ వార్డు ఆశ్రయ కాలనీలో తల్లీకుమారులు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ తెలిపారు. ముంతాజ్‌బేగం(42), ఆమె కుమారుడు వసీం అక్రం(13) గత నెల 13న తప్పిపోగా, మహిళ తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, గుండ్రని ముఖం, 5.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి కన్నడ, ఉర్దూలో మాట్లాడుతుంది. గోధుమ, తెల్ల రంగు పూల డిజైన్ చీర ధరించింది. ఆమె వీపుపై కుడి వైపున ఒక నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన బాలుడు తెలుపు రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి, నీలి రంగు ముఖం, 4.1 అడుగుల ఎత్తు, నల్లటి జుట్టు కలిగి, కన్నడ, ఉర్దూలో మాట్లాడతాడు. అతను తెల్లటి టీ షర్టు, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని కుడి చేతిపై నల్లటి మచ్చ ఉంది. తప్పిపోయిన తల్లీ కుమారుల ఆచూకీ ఏమైనా తెలిస్తే హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ లేదా 9480807700 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. నాణ్యతగా నిర్మాణ పనులతోనే జాప్యంబళ్లారి అర్బన్: నగరంలో ప్రగతి పథంలో సాగుతున్న వివిధ నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం జరగడం లేదని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే సమయం పడుతోందని, ఈ విషయంలో విపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. గాంధీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఏ పనులు కూడా కావాలని ఆలస్యం చేయడం లేదన్నారు. అన్నీ అనుకున్న గడువులోనే పూర్తి చేస్తామన్నారు. సుధా క్రాస్ రైల్వే వంతెన పనులు నిలిచి పోయాయన్నారు. ఆ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించడంతోనే తాత్కాలికంగా పనులను నిలిపి వేశారన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలు రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల గురించి స్పందించిన ఆయన సీఎం, కేపీసీసీ అధ్యక్షుల గురించి మాట్లాడేంత స్థాయికి తాను ఇంకా ఎదగలేదన్నారు. అలాగే ఏ మంత్రి పదవిని తాను కోరుకోలేదన్నారు. ఒకటి, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశించడం సరికాదన్నారు. ఇంట్లో చోరీకి దొంగల యత్నం హొసపేటె: దొంగలు ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటెలోని సంక్లాపురలో జరిగింది. దొంగల కదలికలు అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పద్మావతి అనే మహిళకు చెందిన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి యత్నించినా ఎలాంటి విలువైన వస్తువులు లేదా డబ్బు కనిపించక పోవడంతో వట్టి చేతులతో వెనుతిరిగారు. హొసపేటె రూరల్ స్టేషన్ పోలీసులు ఇంటిని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించరూరాయచూరు రూరల్: నగరంలో మరుగుదొడ్లు నిర్మించాలని దళిత మౌళిక సౌకర్యాల హక్కుల పోరాట సమితి సేవకుడు శరణ బసవ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరసభ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. దేవినగర్, బుద్ధనగర్ మురికి వాడల్లో 1200 మంది పేద కార్మికులు నివసిస్తున్నారని, కనీసం 5 చోట్ల మరుగుదొడ్లు నిర్మించి నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ నగరసభ అధికారికి వినతిపత్రం సమర్పించారు. -
కళలు, కళాకారులను కాపాడుకోవాలి
బళ్లారి అర్బన్: కళలు, కళాకారులను పరిరక్షించుకొని వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హచ్చొళ్లి వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ హెచ్‌కే.సిద్దయ్య స్వామి పేర్కొన్నారు. సిరుగుప్ప తాలూకా కుడుదరహాళ గ్రామం దేవి పుణ్య ఆశ్రమం, ఎళెవాళ సిద్దయ్య స్వామి బయలురంగ మందిరంలో హంద్యాళ మహాదేవ తాత కళా సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన నాటక హబ్బ–2025 సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేడు డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని చాలా మంది కలలు కంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత యువతలో కళలు, సంస్కృతిని పరిరక్షించడంలో మహాదేవతాత కళా సంఘం కృషి ప్రశంసనీయం అన్నారు. ఆ సంఘం అధ్యక్షుడు, సీనియర్ కళాకారుడు పురుషోత్తం హంద్యాళ్ మాట్లాడుతూ మానవ సంబంధాలు జీవితంలో అవిభాజ్య అంగం అన్నారు. మానసిక భావనాత్మక యోగ క్షేమాలు, పరస్పర సహకారంతో జీవితం నిర్వహణకు సంబంధాలు చాలా ముఖ్యం అన్నారు. ఆశ్రమ పీఠాధ్యక్షుడు డాక్టర్ శివకుమార్ తాతతో సంబంధాలు స్వచ్ఛంద అవగాహన, వ్యక్తిత్వ ఎదుగుదలకు దోహద పడుతాయన్నారు. కార్యక్రమంలో కుమార్ ప్రసాద్ సంగీతం అందించగా, సిరిగేరి ధాత్రి రంగ సంస్థ కళాకారుల బృందం సంబంధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రముఖులు బీ.వెంకటేష్, కాసింసాబ్, జ్ఞానరెడ్డి, పాలాక్షి గౌడ, బుశప్ప తదితరులతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
ఆగని హృదయాఘాతం
యశవంతపుర/ దొడ్డబళ్లాపురం: రాష్ట్రవ్యాప్తంగా గుండెపోటు విషాదాలు ఏమాత్రం తగ్గడం లేదు. హాసన్, మండ్య, బెంగళూరు ప్రాంతాల్లో శుక్రవారం ఐదుమంది కన్నుమూశారు. గత 45 రోజుల నుంచి హాసన జిల్లాలోనే గుండెపోటు మరణాల సంఖ్య 34కు పెరిగింది. హాసన్‌లో యువకుడు... ● హాసన్‌కు సమీపంలోని చిక్కకొండ చిట్నిహళ్లి గ్రామంలో మదన్ (21) అనే యువకుడు గుండె పట్టుకుని చనిపోయాడు. తల్లితో కలిసి చన్నపట్టణలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల చిక్కకొండలోని బావ ఇంకికి వచ్చారు. గురువారం రాత్రి ఎదలో నొప్పి అంటూ కుప్పకూలిపోయాడు. ● హాసన్ జిల్లా ఆలూరు తాలూకా కల్లహళ్లి గ్రామానికి చెందిన రాజమ్మ జూన్ 14న ఇంటిలో వంట పని చేస్తుండగా కిందపడి చనిపోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ● హాసన్ నగరానికి చెందిన బీఎం విమల (55) అనే మహిళ కొప్పలో ఇంటిలో పని చేస్తుండగా గురువారం రాత్రి గుండెనొప్పి వచ్చింది. కుటుంబ తక్షణం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ● మండ్య జిల్లా మళవళ్లి తాలూకా బాళెహొన్నగ గ్రామంలో శిల్పా (45) ఇంట్లో పాత్రలను శుభ్రం చేస్తుండగా గుండెపోటుతో మరణించింది. ధర్నాకు వస్తూ రైతు నేత... దేవనహళ్లి తాలూకాలో భూస్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారంనాడు బెంగళూరులో జరుగుతున్న రైతుల పోరాటంలో పాల్గొనడానికి వస్తున్న రైతు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన బెంగళూరులో క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ సర్కిల్లో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా కురుబరహుండి గ్రామం నివాసి అయిన రైతు నేత ఈశ్వర్ (40), ధర్నాలో పాల్గొనడానికి ఫ్రీడంపార్క్ కు వస్తున్నాడు. రైలులో వచ్చిన ఈశ్వర్ ఫ్రీడం పార్క్‌కు వస్తూ సర్కిల్లో కుప్పకూలిపోయాడు. రైతులు అతన్ని శేషాద్రిపురం కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక చనిపోయాడు. రైతులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. రైతు నాయకుడు ఈశ్వర్ (ఫైల్) రాష్ట్రంలో మరో ఐదుమంది తుదిశ్వాస నిరసనకు వస్తూ రైతునేత హఠాన్మరణంకోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు: కమిటీ రాష్ట్రంలో జరుగుతున్న గుండెపోటు మరణాలకు, కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సాంకేతిక సలహా మండలి నివేదిక ఇచ్చింది. 10 మంది నిపుణులు కలిగిన కమిటీ ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కోవిడ్‌కు గురైన వారిలో స్వల్ప హృదయ సమస్యలు తలెత్తాయని, అయితే గుండెపోటుకు ఆ వ్యాక్సిన్ కారణం కాదని పేర్కొన్నారు. కోవిడ్ సోకిన వారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కనిపించినట్టు తెలిపారు. 15 ఏళ్ల వయసు నుంచి పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ చేయాలని, అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని సూచించారు. పాఠ్య పుస్తకాల్లో కూడా గుండెపోటుకు గురించి పాఠ్యాంశం చేర్చాలని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని తప్పనిసరిగా నిషేధించాలని, గుండె సమస్యల రిజిస్టర్ ను ప్రారంభించాలని తెలిపారు. గుండెపోటుతో చనిపోయినవారికి పోస్టుమార్టం నిర్వహించి గుర్తించిన అంశాలను నమోదు చేయాలని, జిల్లా ఆస్పత్రులలో రక్తాన్ని పలుచన చేసే ట్యాబ్లెట్లు నిల్వ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. -
తుంగ..భద్ర గలగలా పరవళ్లు
యశవంతపుర/ శివమొగ్గ: కరావళి– మలెనాడు ప్రాంతాలలో భారీగా వానలు పడుతున్నాయి. తుంగానదీ నీటి మట్టం విపరీతంగా పెరిగింది. చిక్కమగళూరు జిల్లా శృంగేరి కెరెకట్ట ప్రాంతంలో పడుతున్న వానలతో శృంగేరి శారద మఠం గాంధీ మైదానం నీటితో నిండిపోయింది. ముందు జాగ్రత్తల్లో భాగంగా బ్యారికేడ్‌ను వేసి వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఎడతెరిపిలేని వానలతో తుంగా నదీ అపాయకర స్థాయిలో ప్రవహిస్తోంది. కళస తాలూకా చన్నహడ్లు గ్రామం వద్ద మట్టి చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. హిరైబెలు మల్లేశనగుడ్డతో పాటు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లాలో కొప్ప, శృంగేరి, ఎన్‌ఆర్‌పుర, మూడిగెరె తాలూకాలలో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. వాహనాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అహితకర ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు చర్యలను చేపట్టారు. 8 జిల్లాల వ్యాప్తిలో శనివారం రాత్రి వరకు భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, హాసన్, కొడగు, శివమొగ్గ, బెళగావి జిల్లాల పరిధిలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. శివమొగ్గ జిల్లాలో బడులకు సెలవులిచ్చారు. తుంగ, భద్ర నదులు కలిసి మరింత ఉధృతరూపం దాల్చాయి. పోటెత్తిన తుంగా నది పరివాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తున్న కారణంగా శివమొగ్గ తాలూకాలోని గాజనూరులోని తుంగా జలాశయం ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆనకట్ట ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకొన్నందున నీటిని భారీగా వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 77 వేల క్యూసెక్కుల వదిలినట్లు ఆనకట్ట ఇంజనీర్ తిప్పనాయక్ తెలిపారు. దీంతో దిగువన తుంగా నది పోటెత్తుతోంది. నీటి విడుదల వల్ల శివమొగ్గ నగరం గుండా వెళ్లే తుంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కోర్పలయ్య గుడిసె దగ్గర ప్రమాద స్థాయిని ప్రదర్శించే కట్ట మీదుగా నీరు వెళ్తోంది. లోతట్టు ప్రాంతాలలోకి నీరు చొరబడే ప్రమాదం ఉంది, నీరు చేరికతో తుంగభద్ర నది జోరు మీదుంది. శివమొగ్గ వద్ద తుంగ డ్యాం నుంచి భారీగా నీటి విడుదలతుంగా డ్యాం నుంచి 77 వేల క్యూసెక్కుల విడుదల -
జై మాతా చాముండేశ్వరి
మైసూరు: ఆషాఢ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా మైసూరు నగరంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధ చాముండికొండ పైన వెలసిన నాడిన శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. సిరులు కురిపించే లక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. గత శుక్రవారం సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడిన భక్తులు ఈ వారం సజావుగానే అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. పూలతో అమ్మవారి ముఖం, త్రిశూలం, ఓం స్వస్తిక్ చిత్రటాలను రూపొందించారు. తెల్లవారుజామునే దేవాలయం ప్రధాన అర్చకులు శశిశేఖర్ దీక్షిత్ ఆధ్వర్యంలో చాముండేశ్వరి దేవికి పంచామృతాలతో అభిషేకం చేసి మహా మంగళ హారతి ఇచ్చారు. గర్భగుడిలోను వివిధ పూలతో అలంకరించారు. పలు రాష్ట్రాల నుంచి రాక రాష్ట్రం నుంచే కాకుండా కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పోటెత్తారు. భక్తులకు సాధారణ దర్శనంతో పాటు రూ 2 వేల టికెట్, రూ.300 టికెట్ల ద్వారా దర్శనాలు కల్పించారు. మైసూరు నగరంలోని లలిత మహాల్ మైదానం నుంచి భక్తులకు ఉచిత బస్సులను నడిపారు. ప్రముఖుల పూజలు డిప్యూటీ సీఎం డీ శివకుమార్, వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి, మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, కొందరు ఎమ్మెల్యేలు, అలాగే ప్రముఖ నటుడు దర్శన్ తదితరులు విశేష పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆషాఢ శుక్రవారం పోటెత్తిన భక్తులు -
వీడియో కాల్ చేసి.. ఆత్మహత్య
● సహజీవనంలో విషాదం యశవంతపుర: నేటి రోజుల్లో సహ జీవనం వెంట పరుగులు తీస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడగు జిల్లా విరాజపేటలో జరిగింది. వివరాలు.. స్థానిక గాంధీనగరలో ఉండే సాగర్ (30) కరెంటు స్తంభాలను నాటే పని చేస్తున్నాడు. ఆటో కూడా నడిపేవాడు. ఓ మహిళతో అక్రమ సంబంధం ఏర్పడి సహజీవనం సాగిస్తున్నారు. అతడు తరచూ మద్యం తాగి రావడంతో ఆమె గొడవ పడేది. రెండు రోజుల క్రితం ఇలాగే పోట్లాట జరిగింది. ఊరికి వెళ్లివచ్చిన సాగర్ మహిళ లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె స్పందించలేదు. ఆ సమయంలో ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ప్రియురాలు దూరమైపోతుందనే భయంతో వీడియో కాల్ చేసి ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించినా పట్టించుకోలేదు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కొడుకు ఇంటికి రాగా సాగర్ శవమై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బావిలోకి పడ్డ నక్క
గౌరిబిదనూరు: తాలూకా కడబూరు సమీపంలో రామకృష్ణారెడ్డి పొలంలోని బావిలోకి గురువారం రాత్రి ఓ నక్క పడిపోయింది. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు నక్కను చూసి అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీ సిబ్బంది వచ్చి నక్కను తీసుకెళ్లి సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టారు. భార్య దెబ్బలకు భర్త హతం ● బెంగళూరులో ఘటన దొడ్డబళ్లాపురం: భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. సీఎం మార్పు వారి వ్యవహారం: కుమార మండ్య: ముఖ్యమంత్రిని మారుస్తారా... వేరేవారు ముఖ్యమంత్రి అవుతారా అనే విషయం నాకు అనవసరం. అదంతా కాంగ్రెస్ వ్యవహారం, నేను తల బద్ధలు కొట్టుకోవాల్సిన పని లేదు అని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి అన్నారు. శుక్రవారం మండ్య నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సీఎం మార్పు జరుగుతుందని వస్తున్న వార్తలతో తనకు సంబంధం లేదన్నారు. జేడీఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిఖిల్ త్వరలో రాష్ట్రమంతటా పర్యటిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది హైకమాండ్లు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. గంగమ్మకు బిస్కెట్ల శోభ చింతామణి: పట్టణం వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి ఆషాడ మాస రెండవ శుక్రవారం సందర్భంగా బిస్కెట్లతో వినూత్నంగా అలంకరించారు. అర్చకులు సురేష్ ఉదయమే అమ్మవారికి అభిషేకం, అలంకారం జరిపి, విశేష పూజలను నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళా భక్తులు దర్శించి తరించారు. -
రాత్రంతా కావేరి నదిలో చిక్కి..
మండ్య: భూమి మీద నూకలు మిగిలి ఉంటే ఎంత ఆపద వచ్చినా ప్రాణాలు పోవంటారు. అలాంటిదే ఈ సంఘటన. ఆత్మహత్య చేసుకోవడానికి కావేరి నదిలోకి దూకిన యువతి ఒకరు ప్రవాహంలో ఉన్న చెట్టుకు చిక్కుకొని రాత్రి మొత్తం కొట్టుమిట్టాడింది. చివరకు ప్రజలు, పోలీసులు ఆమెను కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ ఆశ్చర్యకర సంఘటన మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని మహాదేవపుర గ్రామంలో జరిగింది. ఇంట్లో గొడవపడి వివరాలు.. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో నివసించే పవిత్ర (19), ఓ కాలేజీలో ఎల్ఎల్బీ చదువుతోంది. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఏదో గొడవ జరిగింది. ఇంటి నుంచి బయటికి వచ్చి మైసూరులో ఉన్న బంధువుల ఇంటికని బయల్దేరింది. అయితే శ్రీరంగపట్టణానికి వచ్చి మహాదేవపుర గ్రామానికి వెళ్లింది. అక్కడ వంతెన పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న కావేరి నదిలోకి దూకింది. ప్రవాహంలో చాలా దూరం కొట్టుకొని వెళ్ళి ఓ చోట చెట్టుకు చిక్కుకుంది. రాత్రంతా అలాగే ఉండిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను చూసిన ప్రజలు వెంటనే అరికెరె పోలీసులకు, ఫైర్ సిబ్బందికి తెలిపారు. నది మధ్యలో చెట్టుకు చిక్కిన పవిత్రను కాపాడి ఆస్పత్రిలో చేర్పించి ఆమె కుటుంబానికి సమాచారమిచ్చారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువతి అనూహ్యంగా బయటపడిన వైనం -
బెంగళూరుపై సైబర్ పడగ
బనశంకరి: సైబర్ వంచనలపైపోలీసు శాఖ ప్రజలను జాగృతి చేస్తున్నా మోసాలు ఆగడం లేదు. ప్రజల అత్యాసే వారికి అస్త్రంగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో సైబర్ వంచనలు పెరిగిపోతున్నాయి. సైబర్ వంచకులు ఎక్కడో మారుమూల కూర్చొని ల్యాప్‌టాప్ ముందేసుకొని ప్రజల బ్యాంకు ఖాతాలకు కన్నం వేస్తున్నారు. 2024లో ఒకే ఏడాదిలో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2.914.97 కోట్లు సైబర్ వంచకుల అకౌంట్లకు బదిలీ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మొత్తం 6,11,688 కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. నగదు పోగొట్టుకున్న బాధితుల నుంచి వెనక్కివచ్చింది కేవలం 20 శాతం కంటే తక్కువగా ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. అనేక రూపాల్లో మోసాలు పెట్టుబడి, ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, పేమెంట్, భూమి, ముందస్తు నగదు చెల్లింపు, సోషల్ మీడియా, ఓఎల్ఎక్స్, బిజినెస్ అవకాశం, ప్రకటనలు, గిప్టు, ఏపీకే, మ్యాట్రిమోనియల్తో పాటు వివిధ పేర్లతో వంచకులు కస్టమర్లను వంచనకు తెగబడుతున్నారు. ప్రభుత్వానికి సీఐడీ నివేదిక.... సైబర్ నేరాలపై అధ్యయనం చేసిన సైబర్ నేరాల విబాగం శిక్షణ, పరిశోధన కేంద్రం(సీఐడీ) ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సైబర్ కేసుల్లో అక్రమ నగదు బదిలీకి నకిలీ అకౌంట్లు వినియోగిస్తున్నారు. వంచనకు సంబంధించి నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్బీ)లో నమోదైన ఫిర్యాదులతో పాటు బ్యాంకింగ్ రంగంలో నియంత్రణకు రాని వంచనల గురించి నివేదిక అందించింది. బెంగళూరు నగరంలోనే అధికం... బెంగళూరు నగరంలో అత్యధికంగా సైబర్ వంచన కేసులు నమోదయ్యాయి. వివిధ సైబర్ పోలీస్ స్టేషన్లతో పాటు మొత్తం 19 స్టేషన్లలో 4,092 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా మొత్తం రూ.664 కోట్లు దోచేశారు. సైబర్ నేరాల్లో 42.9 శాతం బెంగళూరు నగరంలో నమోదు కాగా ప్రైవేటు బ్యాంకుల్లో తెరిచిన నకిలీ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.1,859.9 కోట్లు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఫేక్ అకౌంట్ల నుంచి రూ.948 కోట్లు వంచనకు గురైంది. రాష్ట్రంలో ఒకే ఏడాది రూ.2,914 కోట్లు దోచారు ఉద్యాన నగరిలో రూ.664 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు బెంగళూరు మహానగరంలో 4092 ఎఫ్ఐఆర్లు నమోదు -
కరావళి, మలెనాడులో కుంభవృష్టి
బనశంకరి: కరావళి, మలెనాడు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి, హొసనగర, సాగర తాలూకాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కొడగుకు భారీ వర్ష సూచన కొడగు జిల్లాలో భారీ గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వంకలు, వాగులు ఏరులై ప్రవహిస్తున్నాయి. నదుల్లో నీటిమట్టం పెరిగింది. జనజీవనం స్తంభించింది. అంగన్వాడీ, పాఠశాలలు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. చిక్కమగళూరు జిల్లాలోని 5 తాలూకాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్‌ఆర్‌పుర, కొప్ప, శృంగేరి, కళస, మూడిగెరె తాలూకాల్లో అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లాధికారి మీనా నాగరాజు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో కారవార తాలూకా కద్ర సమీపంలో కొడసహళ్లి ఆనకట్టకు వెళ్లే రోడ్డులో గురువారం భారీ వర్షాలతో కొండచరియ విరిగిపడింది. ఘటనాస్థలానికి అధికారులు వెళ్లి పరిశీలించి జేసీబీలతో మట్టిని తొలగిస్తున్నారు. ముంగారు వర్షాల నేపథ్యంలో కళ్యాణ కర్ణాటక జీవనాడి తుంగభద్రా జలాశయం నిండుతోంది. జలాశయంలోకి భారీ స్థాయిలో నీరు చేరింది. 80 టీఎంసీల నీరు నిల్వ చేరింది. 34 వేల క్యూసెక్కులకు ఇన్‌ఫ్లో పెరిగింది. 20 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. దక్షిణ కన్నడలోనూ వర్షాలు దక్షిణకన్నడ జిల్లా సుబ్రమణ్య, కడబ, సుళ్య తాలూకా కుక్కే సుబ్రమణ్యలో వర్షాలు కొనసాగుతున్నాయి. కుక్కే సుబ్రమణ్యలో కుమారధార స్నానఘట్టం నీట మునిగిపోయింది. వర్షాల నేపధ్యంలో కడబ, సుళ్య తాలూకాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, పీయూ కాలేజీలకు సెలవు ప్రకటించారు. కరావళి, మలెనాడు, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, హాసన, బెళగావి, ధారవాడ, హావేరి జిల్లాలకు ఎల్లోఅలర్ట్ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో 6 రోజుల వరకు మబ్బులతో కూడిన వాతావరణం ఉండగా, సాధారణ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రదేశాల్లో వర్షం కంటే గాలి వేగం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. విరిగి పడుతున్న కొండచరియలు నీట మునిగిన కుమారధార స్నానఘట్టం జనజీవనం అస్తవ్యస్తం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు -
నవ వరుడి విషాదాంతం
● వివాహమైన 24 గంటల్లోనే ఆత్మహత్య ● మృతుడు జిల్లా ఆస్పత్రి ఉద్యోగి కోలారు : వివాహమై 24 గంటల్లోనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన బుధవారం రాత్రి కోలారులో జరిగింది. బంగారుపేటె తాలూకా నాయకరహళ్లి గ్రామానికి చెందిన హరీష్‌బాబు(33) కోలారు జిల్లా ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. జిల్లాస్పత్రిలోనే పని చేస్తున్న గాంధీనగర నివాసి అయిన శివరంజని కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈమేరకు బుధవారం రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కాని బుధవారం రాత్రి ఆస్పత్రి ఈఎన్టీ గదిలో ఉరి వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
టాస్క్‌ఫోర్స్ యాక్షన్ పోలీసులకు శిక్షణ
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లాతో పాటు మూడు జిల్లాల పరిధిలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసుశాఖ అడుగులు వేస్తోంది. ఇటీవల కొత్తగా స్పెషల్ టాస్కఫోర్స్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది, అధికారులకు దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. మతఘర్షణలు, ఉద్రిక్తత పరిస్థితులు నేలకొన్న ఘటనలో ఈ భద్రతదళాన్ని ఉపయోగించుకుంటారు. ఇందులో భాగంగా అపరేషన్ వింగ్‌లో 95 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. ఈ దళంలో ఇంటెలిజెన్స్‌తో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘాను నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. రైలు ఇంజిన్‌లో మంటలు● ప్రయాణికులు సురక్షితం దొడ్డబళ్లాపురం: చలనంలో ఉండగా రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ వద్ద గురువారం చోటుచేసుకుంది. మైసూరు నుంచి రాజస్థాన్‌లోని ఉదయపురకు వెళ్తున్న రైలు చెన్నపట్టణ తాలూకా వందారగుప్పె వద్ద రాగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ ముందు భాగంలో దట్టమైన పొగ కమ్ముకుంది. లోకోపైలట్ చాకచక్యంతో వెంటనే రైలు నిలిపివేశాడు. ప్రయాణికులను కిందకు దింపారు. అగ్నిమాపకదళం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అనంతరం రైలు ముందుకు కదిలింది. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మారెమ్మదేవికి వెన్నతో అలంకరణ బొమ్మనహళ్లి : బొమ్మనహళ్లి నియోజకవర్గం హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు పరంగిపాళ్య గ్రామంలో గ్రామ దేవత మారెమ్మదేవికి ఆషాఢ మాసం సందర్భంగా గురువారం విశేష అలంకరణ చేశారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం వెన్నతో ప్రత్యేక అంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వృద్ధ మహిళా రైతు ఆత్మహత్య మండ్య : రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం శ్రమించినా పంటలు చేతికందక అప్పుల ఊభిలో కూరుకుపోయిన వృద్ధ మహిళా రైతు బలవన్మరణం చెందింది. ఈఘటన మండ్య జిల్లా మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జవనమ్మ(75)కు భర్త చనిపోయాడు. దీంతో తనకున్న మూడు ఎకరాల పొలంలో సొంతంగా పంటలు సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం మహిళా స్వయం సేవా సంఘం, సహకార సంఘం, ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపు రూ.9 లక్షల మేర అప్పులు చేసింది. అయితే ప్రకృతి విపత్తులతో పంట చేతికందలేదు. అప్పులు తీరే మార్గం కనిపించక పురుగులమందు తాగింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రైతుల భూములు లాక్కోవడం అన్యాయం
బనశంకరి: దేవనహళ్లి చుట్టుపక్కల 13 గ్రామాల రైతుల 1,777 ఎకరాల భూములను లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కులో రైతులు చేపట్టిన పోరాటానికి సాహితీవేత్తలు, కన్నడ సినీ రంగం కళాకారులు, రైతు ఉద్యమనాయకుడు రాకేష్ టికాయత్, దర్శన్పాల్, సామాజిక కార్యకర్త హీరేమఠ్ తదితర ప్రముఖులు మద్దతు పలికారు. ధర్నానుద్దేశించి సాహితీవేత్త రహమత్ తరీకెరె మాట్లాడుతూ ఇది రైతుల పోరాటం మాత్రమే కాకుండా కన్నడిగుల పోరాటమన్నారు. రైతులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వీటిపై చర్చించకుండా భూమి ఎలా లాక్కోవాలని ఆలోచిస్తుందని ప్రశ్నించారు. ఈనెల 4న రైతుల తరఫున తీర్మానం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటుడు కిశోర్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందన్నారు. అన్నదాతపై దాడి చేసి చిన్న రైతుల చేతిలో ఉన్న భూమిని లాక్కుంటున్నారన్నారు. రైతుల భూములను పరిశ్రమలకు ఇవ్వడం కుదరదన్నారు. రచయిత కవిరాజ్ మాట్లాడుతూ రైతుల భూమిని లాక్కోవడం సరికాదన్నారు. ఇది కార్పొరేట్ లాబీ అని తెలుస్తోందని, దీనిపై తీవ్రపోరాటం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పోరాటదారులు శివసుందర్, సాహితీవేత్తలు కేపీ.సురేశ్, వీరసంగయ్య, బీటీ.లలితానాయక్, నూర్శ్రీధర్, వీ.నాగరాజ్, గురుప్రసాద్ కెరగోడు, బడగలపుర నాగేంద్ర, కేవీ.భట్, డైరెక్టర్ రాజేంద్రసింగ్‌బాబు, టీఎన్.సీతారాం, నాగతిహళ్లి చంద్రశేఖర్, విజయలక్ష్మీ సింగ్, గిరీశ్ కాసరవళ్లి, నటుడు ప్రకాష్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలకు మద్దతు పలికిన సాహితీవేత్తలు, సినీ కళాకారులు -
బాలున్ని కిడ్నాప్ చేసి హత్య
కెలమంగలం: పాఠశాలకు వెళ్లిన 13 ఏళ్ల బాలున్ని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం తమిళనాడులోని క్రిష్ణగిరి తాలూకా కేంద్రం అంచెట్టి సమీపంలో జరిగింది. అంచెట్టి సమీపంలోని మావనట్టి గ్రామంలో శివరాజ్, మంజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రోహిత్(13)అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు అదే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం బాలుడు పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని సీసీటీవీ కెమెరా పుటేజ్‌లను పరిశీలించారు. కొందరు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసినట్లు కనిపించగా అంచెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం వరకు బాలుడి జాడలేదు. పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తూ బాలుడి తల్లిదండ్రులు, బంధువులు పోలీస్‌ష్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. కాగా అంచెట్టికి ఐదు కిలోమీటర్ల దూరంలో బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా రోహిత్ విగతజీవిగా కనిపించాడు. బాలుడు హత్యకు గురైనట్లు నిర్ధారించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అదే ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద అనుమానాస్పదంగా కారు కనిపించగా సోదా చేశారు. బాలుడి కిడ్నాప్‌నకు ఈ కారు ఉపయోగించినట్లు తేలింది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజు పరిశీలించారు. బాలుడి హత్యకు కారణాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అంచెట్టి సమీపంలో ఘోరం -
విదేశీ పండ్లకు భలే గిరాకీ
సాక్షి, బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో రోజురోజుకు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా మన ప్రాంతాల్లో మామిడి, బొప్పాయి, అరటి, జామ, సపోట, ఖర్బూజ, యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, మోసంబి తదితర పండ్ల తోటలను రైతులు అష్టకష్టాలతో పండిస్తుంటారు. ఆ పండ్ల తోటలను పండిన రైతులకు కూడా గిట్టుబాటు ధర లేక చాలా మంది పండ్ల తోటల పెంపకంపై నిరాసక్తత చూపుతున్న సందర్భాలు కోకొల్లలు. అయితే ఏటేటా విదేశాల్లో పండుతున్న పండ్లను మన ప్రాంతాల్లో కూడా పండిస్తూ రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇక్కడ భూమి అనువైనది కాదని రైతులు అనుకొనేవారు. అయితే కర్ణాటకలోని ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నారు. విదేశీ పండ్లతో ఆరోగ్యానికి మేలు విదేశీ పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుందని చెబుతుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 200లకు పైగా వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతున్నారు. మెక్సికో దేశం నుంచి డ్రాగన్ ప్రూట్స్, మలేషియా నుంచి రంభుటాన్, దురియన్ పండ్ల తోటలు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలో విజయనగర, బళ్లారి ప్రాంతాల్లో డ్రాగన్ ప్రూట్ ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. డ్రాగన్ప్రూట్కు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో రంభుటాన్ పండ్ల తోటలను అధికంగా పండిస్తున్నారు. కాఫీ తోటలకు పేరు గాంచిన హాసన, శివమొగ్గ జిల్లాల్లో కూడా బటర్ప్రూట్స్ తోటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా విదేశీ పండ్ల తోటలను విస్తృతంగా సాగు చేస్తుండటంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేస్తూ రైతులకు తోడ్పాటును అందిస్తున్నారు. వివిధ జిల్లాల్లో సాగు వివరాలు హగరిబొమ్మనహళ్లి తాలూకాలో డ్రాగన్ ప్రూట్స్‌ను, దక్షిణ కన్నడ జిల్లాలో వక్క, టెంకాయ తోటల మధ్యన రంభుటాన్, మ్యాంగోస్టిన్ పండ్ల తోటలను అధికంగా సాగు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో విదేశీ పండ్ల తోటలను సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొన్నారు. డ్రాగన్, అవకాడొ ఎక్కువగా సాగు చేయగా స్ట్రాబెర్రీ, నకడెమియా తదితర విదేశీ పండ్లు కూడా వందలాది ఎకరాల్లో కనిపిస్తున్నాయి. డ్రాగన్ ప్రూట్స్ బళ్లారి, విజయనగర, చామరాజ నగర్, బీదర్ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. డ్రాగన్ ప్రూట్స్‌తో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఈ పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు కొత్త కొత్త పంటలను సాగు చేయడంపై అనుభవం పెంచుకొంటున్నారు. ఎంతో రుచి, ఆరోగ్యం, చూసేందుకు కనువిందుగా కనిపించే విదేశీ పండ్లు మార్కెట్లో విస్తృతంగా కనిపిస్తున్నాయంటే ఇక్కడి రైతులు కూడా సాగు చేయడంతో ఎప్పటికప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయని పండ్ల అమ్మకందారులు పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం దక్షిణ కన్నడ, ఉడిపిలో విస్తృతంగా పండించే రంభుటాన్ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ జిల్లాల్లో 155 ఎకరాల్లో సాగు చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను రైతులు అర్జిస్తున్నారు. అవకాడొ పండ్లను రాష్ట్రంలో ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని గదగ్, హావేరి జిల్లాలతో పాటు మైసూరు జిల్లాలో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. ఈ పండ్ల తోటల పెంపకం రైతులను ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు దోహదం చేస్తున్నాయి. రైతులు ఉత్సాహంతో విదేశాల్లో పండించే పండ్లను సైతం ఇక్కడ పండిస్తున్నప్పటికీ సరైన మార్గదర్శనం, పరిశోధనలు లేకపోవడంతో రైతులు నష్టాలను కూడా చవిచూస్తున్నారు. అయితే రంభుటాన్, లిచ్చి తదితర పండ్లకు రోజు రోజుకు మంచి గిరాకీ లభిస్తోందని రైతులు అంటున్నారు. మన దేశంలో పండించే పండ్లతో పాటు విదేశాల్లో పండించే పండ్లకు మంచి గిరాకీ వస్తుండటంతో రైతులు వాటిని సాగు చేసేందుకు ఏటా ఆసక్తిని పెంచుకొంటున్నారు. కొడగు జిల్లాలో జర్ముప్లాసంను కూడా సాగు చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో విదేశీ పండ్ల తోటల సాగు ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు. పండ్ల తోటల పెంపకంపై రైతుల ఆసక్తి వివిధ దేశాల పండ్లు కర్ణాటకలో లభ్యం -
మూడో రోజున 75 ఆటోలు సీజ్
రాయచూరు రూరల్: నగరంలో మూడవ రోజున కూడా తనిఖీ చేసి 75 ఆటోలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి అనుమతులు లేని వాటిని తనిఖీ చేశామన్నారు. నగరంలో 80 శాతం ఆటోలకు బీమా ఇతర పత్రాలు లేవన్నారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.50 వేలు వసూలు చేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో దాఖలాలు పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. -
అతిథి అధ్యాపకులపై జీఓని రద్దు చేయాలి
బళ్లారిఅర్బన్: అతిధి లెక్చరర్లకు విధుల పెంపుతో పాటు మిగిలిన అదనపు పని భారాన్ని కొత్త వారికి కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసి అప్పగించాలి. ముఖ్యంగా గత జూన్ 25న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాల అతిథి లెక్చరర్ల సంఘం జిల్లాధ్యక్షుడు డాక్టర్ దుర్గప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ లెక్చరర్లను ఎటువంటి పక్షపాతం చూపకుండా యథా విధిగా కొనసాగించాలి. ఇప్పటికే కొందరు లెక్చరర్లు వయోవిరమణ అంచులో ఉన్నారని, అలాంటి వారికి రూ.25 లక్షల మొత్తాన్ని, సేవా భద్రతను కల్పించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, పీఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఎట్టి పరిస్థితిలోను తమను వీధుల పాలు చేయరాదని ఆయన మొర పెట్టుకున్నారు. ఈ విషయంలో లెక్చలర్లందరికీ న్యాయం చేయాలని దుర్గప్ప కోరారు. సంఘం కార్యదర్శి డీ.సిద్దేశ్, సహకార్యదర్శి రుద్రప్పమని, టీ.జయరాం, శివకుమార్ అంగడి, సంధ్యాబాయి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్: బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడ్స్ వాహనం బావిలోకి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బీదర్ తాలూకా గోడంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడ్స్ వాహనం ఉన్నఫళంగా బావిలోకి బోల్తా పడింది. గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తున్న గోడంపల్లికి చెందిన లక్ష్మీకాంత్ అలియాస్ కాంత మహారాజు(45), రవి(18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో అర్జున్, ప్రజ్వల్, పవన్, సంగమేష్ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో పడిపోయిన వాహనం కింద పడి మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వివరాలు సేకరించి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. మరణంలోనూ వీడని తల్లీకుమారుడి బంధం బీదర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావిలోకి గూడ్స్ వాహనం బోల్తా పడిన నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్న రవి(18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అదే గోడంపల్లి గ్రామానికి చెందిన శారదాబాయి(70) అనే మహిళ తన కుమారుడు మృత్యువాత పడ్డాడని తెలిసి, బాధ భరించలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే రోజు తల్లీ, కుమారుడు కూడా మృతి చెందడంతో మరణంలో కూడా వారి బంధం వీడలేదని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. బావిలో బోల్తా పడిన గూడ్స్ వాహనం ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు -
జలవనరుల గణన సక్రమంగా నిర్వహించండి
హొసపేటె: జిల్లాలో జల వనరుల గణనను అధికారులు సరైన పద్ధతిలో నిర్వహించి గణాంకాలను అందించాలని అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప సూచించారు. జిల్లాధికారి కార్యాలయ హాలులో గురువారం జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జల వనరుల శాఖ కేంద్ర సురక్షిత మైనర్ ఇరిగేషన్ డేటా సమన్వయ పథకం కింద ప్రతి ఐదేళ్లకు ఒకసారి మైనర్ ఇరిగేషన్ గణన నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని మైనర్ ఇరిగేషన్, జలవనరుల గణనను సక్రమంగా నిర్వహించాలి. జిల్లా స్థాయిలో జనాభా గణన పనులను నిర్వహించే సూపర్వైజర్లు, తాలూకా స్థాయిలో రెవెన్యూ శాఖలోని గ్రామ అకౌంటెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు జనాభా గణన పని విధానంపై సరైన శిక్షణ ఇవ్వాలి. రెవెన్యూ, ఆర్థిక, గణాంక విభాగం, చిన్న నీటిపారుదల, భూగర్భ జల అభివృద్ధి విభాగం, పెద్ద, మధ్య తరహా నీటిపారుదల విభాగం, వ్యవసాయం, ఉద్యానవన శాఖ, స్థానిక సంస్థలతో సహా వివిధ విభాగాల సమన్వయంతో జనాభా గణన క్షేత్రస్థాయి పనిని నిర్వహించాలని ఆయన అన్నారు. జెడ్పీ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అన్నదాన స్వామి, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ తిమ్మప్ప, మైనర్ ఇరిగేషన్, భూగర్భ జలాల అభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.వెంకటేష్, ఉద్యానవన శాఖ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ కేఎం.రమేష్ సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
దూద్‌సాగర్.. సందర్శకులపై నజర్
హుబ్లీ: కర్ణాటక సరిహద్దు సమీపంలోని గోవాలోని దూద్‌సాగర్ జలపాతం ప్రస్తుతం నిండుకుండలా ప్రవహిస్తోంది. పర్యాటకులను రారమ్మని పిలుస్తోంది. అయితే పర్యటనకు వెళ్లిన వారు అక్కడి కొన్ని సూక్ష్మ ప్రాంతాల్లో నియమాలను ఉల్లంఘించి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు సందర్శకులు తప్పకుండా తగిన నియమాలను పాటించాలని, ముఖ్యంగా సొరంగాలు, లోయలు, అడవి జంతువుల వల్ల అపాయం ఉందని సూచించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది నిఘాలో సందర్శకులు నియమాలను పాటించాలి. క్యాసల్రాక్ రైల్వే స్టేషన్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించరాదు. అలా అక్రమంగా ప్రవేశించిన 21 మందిని అరెస్ట్ చేసి వీరిపై కేసులు దాఖలు చేశారు. అరెస్ట్ అయిన వారిని బెయిల్‌పై విడుదల చేసి జరిమానా విధిస్తూ హుబ్లీ ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ రైల్వే కోర్టు ఈ మేరకు ఆంక్షలు విధించింది. సందర్శకులు యశ్వంత్‌పుర–వాస్కో ఎక్స్‌ప్రెస్ ద్వారా ఘటన స్థలానికి వచ్చి రైలు పట్టాల పొడవునా నడుచుకుంటూ జలపాతం వద్దకు వెళ్లే వారు. భద్రత కారణాలతో దీన్ని కట్టుదిట్టంగా నిషేధించారు. సందర్శకులు రైలు పట్టాలపై నడవరాదని హుబ్లీ నైరుతి రైల్వే పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. -
తుంగభద్ర పరవళ్లు
● 20 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల ● లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక జారీ హొసపేటె: తుంగభద్ర డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం నుంచి అదనపు నీటిని క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం డ్యాం వద్ద 20 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర పైకెత్తి డ్యాం నుంచి సుమారు 59 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. అధికారికంగా తెరిచిన 20 క్రస్ట్‌గేట్ల నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్న అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. తుంగభద్ర నది ఒడ్డున, పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరించారు. నదిలోకి ఎవరూ చేపల వేటకు దిగవద్దని మత్స్యకారులకు సూచించారు. పరివాహక ప్రాంతంలో మంచి వర్షాలు కురుస్తున్నందున డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రస్తుతం నదిలోకి అదనపు నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి డ్యాంకు మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉన్నందున నదిలోకి మరింత నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా గురువారం డ్యాంలో నీటిమట్టం 1625.55 అడుగులకు, నీటి నిల్వ 78.31 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 34,625 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 59,611 క్యూసెక్కులు ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి నిల్వ కేవలం 8.782 టీఎంసీలు మాత్రమే ఉందేదని మండలి వర్గాలు తెలిపాయి. స్లో పాయిజన్ ఇచ్చి భర్త హత్య● వీడియో సాక్ష్యం ఉన్నా భార్యని అరెస్ట్ చేయని పోలీసులు హుబ్లీ: భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి భార్యను హత్య చేసిన ఘటన యాదగిరి జిల్లా గురుమట్కల్లోని గడ్డి మొహల్లో జరిగింది. మృతుడిని మహమ్మద్ అలీగా గుర్తించారు. భార్యే స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏడాదిన్నర క్రితం భర్తకు దగ్గు ఉందంటూ స్లో పాయిజన్ ఇచ్చి భార్యే భర్తను హత్య చేసింది. అయితే భర్త చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన తమ్ముడు మహమ్మద్ ఇక్బాల్‌కు ఈ వీడియో దృశ్యాలను పంపించారు. తనను సక్రమంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. భోజనం పెట్టేది కాదు, విషం పెట్టినట్లుగా అనుమానం ఉందని మృతుడు చెప్పినట్లుగా వీడియో దృశ్యాలు నమోదయ్యాయి. ఘటనపై మహమ్మద్ అలీ తల్లి గురుమట్కల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి పరిశీలించారు. అంతేగాక వీడియో సాక్ష్యం ఉన్నా పోలీసులు మాత్రం బాధ్యురాలైన భార్యను అరెస్ట్ చేయడం లేదని, తనకు న్యాయం చేయాలని మృతుడి తల్లి జిల్లాధికారికి విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్ రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రితీష్ కుమార్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జిల్లా ఇంచార్జి కార్యదర్శులను నియమిస్తూ ప్రభుత్వ పరిపాలనాధికారి మమత శర్మ ఆదేశాలు జారీ చేశారు. కొప్పళ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మోహన్ రాజ్, విజయ నగర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా సమీర్ శుక్లా, బీదర్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రందీప్, బళ్లారి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా త్రిలోక చంద్ర, యాదగిరి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మనోజ్ జైన్, కలబుర్గి జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా పంకజ్ కుమార్ పాండే, బాగల్కోటె జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా మహ్మద్ మోసిన్, విజయపుర జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా ఉజ్జవల్ కుమార్ ఘోష్, గదగ్ జిల్లా ఇంచార్జి కార్యదర్శిగా రమణ దీప్ చౌదరిలు నియమితులయ్యారు. వచనానంద స్వామి పూర్వాశ్రమ సోదరుడు మృతిహుబ్లీ: హరిహర పంచమసాలి పీఠం జగద్గురువు వచనానంద స్వామి పూర్వాశ్రమం సోదరుడు అయిన అశోక్ దుండప్ప (45) రోడ్డు ప్రమాదంలో మరణించారు. బెళగావి జిల్లా అథణి తాలూకా తాంవశి గ్రామానికి చెందిన అశోక్ దుండప్ప బుధవారం రాత్రి అథణి నుంచి తాంవశికి వెళుతుండగా ఆయన ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో ఈ ప్రమాదం వా టిల్లింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను అక్కడి కమ్యూనిటీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందారు. అథణి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ గేమ్‌తో రూ.18 లక్షలు హుష్‌కాకి● యువకుడి ఆత్మహత్య సాక్షి, బళ్లారి: నేటి యువత చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఫోన్ ఫీవర్ పట్టుకోవడంతో ఆన్లైన్ గేమ్‌లు కూడా కుప్పతెప్పలుగా వస్తున్నాయి. దీంతో ఆ గేమ్‌లు ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దావణగెరె జిల్లాలో ఆన్లైన్ గేమ్‌లు ఆడి ఏకంగా ఓ యువకుడు రూ.18 లక్షలు కోల్పోయాడు. దావణగెరె నగరంలోని సరస్వతి కాలనీకి చెందిన శశికుమార్(25) అనే యువకుడు ఆన్లైన్ గేమ్ ద్వారా రూ.18 లక్షలు పోగొట్టుకోవడంతో యువకుడు చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆన్లైన్ గేమ్‌లు బంద్ చేయాలని పాలకులు మాటలకే పరిమితం అవుతున్నారు. ఫోన్లో యథేచ్చగా ఆన్లైన్ గేమ్‌లు సాగుతుండటంతో పలు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
సీఎం నచ్చజెప్పడంతో విధులకు హాజరు
హుబ్లీ: వీఆర్ఎస్ కోరుతూ సమర్పించిన ధార్వాడ ఏఎస్పీ నారాయణవీ భరమనికి సీఎం ఫోన్ చేసి నచ్చజెప్పడంతో గురువారం ధార్వాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని తన కార్యాలయంలో యథావిధిగా విధులకు ఆయన హాజరయ్యారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడతో చర్చించిన తర్వాత తన కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన భావనలను తన సీనియర్ అధికారులకు తెలియజేశాను. సీనియర్ అధికారులు కూడా తనతో మాట్లాడారు. తాను క్రమశిక్షణ కలిగిన శాఖలో ఉన్నాను. సీఎం, హోం మంత్రి తనతో మాట్లాడారు. తాను ఎప్పుడూ కూడా మీడియాతో మాట్లాడలేదు. విధులకు హాజరవుతున్నానన్నారు. కాగా ఆయనకు ఫోన్ చేసిన సీఎం వీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని వాపస్ తీసుకోండి. తాను ఆ రోజు ఉద్దేశ పూర్వకంగా ఆ విధంగా నడుచుకోలేదు. మిమ్మల్ని అగౌరవ పరచాలన్న ఉద్దేశం తనకు లేదని ఏఎస్పీకి నచ్చజెప్పారు. కాగా ఈ ఘటనపై విధాన సౌధలో ఎమ్మెల్యే అశోక్ పఠాన్ మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య ఆయన్ను కొట్టడానికి ప్రయత్నించలేదు. మనిషి అన్న తర్వాత సహజంగానే కోపం వస్తుంది అంతే.. అంటూ ఘటనను సమర్థించుకున్నారు. వీఆర్ఎస్ నిర్ణయం మార్చుకున్న ఏఎస్పీనారాయణ భరమని -
రేపు ఆయుర్వేద కౌశల్య శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 5న అయుర్వేద రస కౌశల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పూర్ణిమా ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గురువారం కళాశాల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వనమూలికల ద్వారా రస కౌశల్య శిబిరాన్ని రాజీవ్‌గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ బీఎస్ సవది ప్రారంభిస్తారన్నారు. కళాశాల ఆవరణలో 250 ఔషధ మొక్కలను నాటుతారన్నారు. పంచకర్మ పద్ధతిలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి అన్ని విధాలుగా సౌకర్యాలను సమకూర్చామన్నారు. కేశవరెడ్డి, శివకుమార్, ఆయుష్ అధికారి శంకరగౌడ, మహేశ్వరస్వామిలతో పాటు రాష్ట్ర నలు మూలల నుంచి 300కు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్‌లున్నారు. జెడ్పీ సీఈఓకు సర్కార్ అభినందన పత్రంరాయచూరు రూరల్: రాయచూరు జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండేకు రాష్ట్ర ప్రభుత్వం అభినందన పత్రం జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లాలకు జరిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనాధికారి సర్వే పథకాలను ప్రజలకు సక్రమంగా అందచేయడంలో తీసుకున్న చొరవకు అభినందనలను తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ లేఖ రాశారు. భూసార పరీక్షలు, ప్రధానమంత్రి కృషి సంచయిని, మాతృవందనం, జాతీయ వ్యవసాయ వికాస్, నరేగ, తోటల పెంపకం, వివిధ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించడంలో చూపిన చొరవకు అభినందనపత్రం అందించారు. హళకట్టి ఆశయాలు అనుసరణీయం రాయచూరు రూరల్: వచన సాహితీవేత్త హళకట్టి ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ీతహసీల్దార్ సురేష్ వర్మ అన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో వచన సాహితీవేత్త హళకట్టి జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న సాహిత్యాన్ని కాపాడుకోవాలన్నారు. వైద్యుడి బదిలీ రద్దుకు వినతి హొసపేటె: నగరంలోని వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సోమశేఖర్ కబ్బేరను ఎట్టి పరిస్థితిలోనూ బదిలీ చేయరాదని డిమాండ్ చేస్తూ భగత్‌సింగ్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో గురువారం విజయనగర జిల్లాధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖాధికారి డాక్టర్ శంకర్ నాయక్, ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ హరిప్రసాద్‌లకు వినతిపత్రాన్ని అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం.సంతోష్ కుమార్‌తో పాటు నాయకులు, రక్తదాతలు ఎస్.విజయ్‌కుమార్, సీ.ప్రకాష్, హనుమంతప్ప, చెన్నబసవనగౌడ, బీఎస్.రుద్రప్ప, ఎం.సుభాష్, కే.పునీత్‌కుమార్, వెంకటేష్ కులకర్ణి, ఫయాజ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి సమావేశం దోహదం హొసపేటె: ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను వినడానికి, పరిష్కారాలను సూచించడానికి నగరంలో ఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ శ్రీహరిబాబు మాట్లాడుతూ ఫిర్యాదు సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో నెలకొకసారి, జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిషనర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీల కోసం జిల్లా అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, సమావేశం దృష్టికి తెచ్చిన తర్వాత కూడా పరిష్కారం దొరకడం లేదని దళిత నాయకులు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మంజునాథ్, కూడ్లిగి డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, దళిత, వాల్మీకి సమాజ నేతలు పాల్గొన్నారు. -
బాగేపల్లి.. భాగ్యనగర
చిక్కబళ్లాపురం: బెంగళూరు రూరల్ జిల్లాను ఇక మీదట బెంగళూరు ఉత్తర జిల్లా అని పిలవాలి, అలాగే చిక్కబళ్లాపురం జిల్లాలో కర్ణాటక ముఖద్వారంగా పేరుపొందిన బాగేపల్లి పట్టణాన్ని భాగ్యనగరగా పేర్కొనాలి. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బుధవారం ఇక్కడి ప్రముఖ పర్యాటక స్థలమైన నంది కొండపై మంత్రిమండలి సమావేశం జరిగింది. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు తరలివచ్చారు. కొండపై సభా భవనంలో కేబినెట్ భేటీ సాగింది. తరువాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం, మంత్రులు వివరించారు. బెంగళూరు నగర విశ్వవిద్యాలయం పేరును మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ విశ్వవిద్యాలయంగా మార్చినట్లు తెలిపారు. ఎత్తినహొళె నీటి ప్రాజెక్టును వేగవంతం చేసి మరో రెండు సంవత్సరాలలో కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు ఉత్తర జిల్లాకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. 8 టీఎంసీలు ఏ మూలకు సరిపోతాయని విలేకరులు ప్రశ్నించగా, అన్ని వనరుల నుంచి సేకరించి అందిస్తామని సీఎం చెప్పారు. కేసీ వ్యాలీ నీటిని తాగరాదు కేసీ వ్యాలీ, హెచ్ఎన్ వ్యాలీ పథకం ద్వారా కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాలలో చెరువులు, భూగర్భ జలాల వృద్ధి కోసం శుద్ధీకరించిన మురుగునీటిని వదులుతున్నారు, ఈ నీటిని ఎలా తాగాలి, ఆరోగ్య సమస్యలు వస్తాయి అని విలేకరులు ప్రస్తావించారు. జిల్లా మంత్రి ఎంసి సుధాకర్ స్పందిస్తూ, ఈ నీరు తాగడానికి కాదు, అంతర్జలాల పెంపునకు మాత్రమే అని, ఆ నీటిని వదిలే చెరువుల నీటిని తాగరాదని తెలిపారు. చిక్కబళ్లాపురంలో ఎపిఎంసి హైటెక్ పూల మార్కెట్‌ను రూ.141 కోట్ల ఖర్చులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు రూరల్.. ఉత్తర జిల్లా కేబినెట్ భేటీలో పేర్ల మార్పు నంది హిల్స్ మీద సమావేశం బెంగళూరు వర్సిటీకి మన్మోహన్సింగ్ పేరుభోగనందీశ్వరుని దర్శనం నంది హిల్స్ దిగువన ఉన్న నంది గ్రామంలో చరిత్ర ప్రసిద్ధ భోగనందీశ్వర ఆలయంలో సీఎం, మంత్రులు విశేష పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకున్నారు. పార్వతీదేవి ఆలయం ముందు గ్రూప్ ఫోటో తీసుకొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లూ తానే సీఎం అని, మీకు అనుమానం వద్దని సిద్దరామయ్య అన్నారు. బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని అన్నారు. నందికొండలో మంత్రి మండలి సమావేశం అన్నది ఈ ప్రాంతానికి లాభం దృష్టితో చూడరాదన్నారు. రాబోయే రోజులలో బిజాపూర్ లో కేబినెట్ నిర్వహించే యోచన ఉందని చెప్పారు. సీఎం టూర్ సందర్భంగా నంది హిల్స్ కు పర్యాటకులను నిషేధించారు. -
ఆషాఢమాస పూజలు
కోలారు: తాలూకాలోని బిదరహళ్లి క్రాస్ వద్ద ఉన్న అశ్వర్థకట్ట వద్ద నిర్మించిన మహాగణపతి, లక్ష్మీనరసింహ, పంచముఖి ఆంజనేయస్వామి, ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో బుధవారం ఆషాఢమాసం పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీదేవి అమ్మవారికి విశేష అర్చనలు చేశారు. వివిధ దేవతలకు ఫల పంచామృత అభిషేకం, అలంకారం, సహస్ర కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు దొడ్డబళ్లాపురం: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కూడా సీఎంని చేయాలని రామనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ మరోసారి డిమాండ్ చేశారు. రామనగరలో బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఇంతకుముందు ఇదే ప్రకటన చేసినందుకు పార్టీ నుంచి నోటీసులు వచ్చాయని, వివరణ ఇచ్చానని తెలిపారు. ఒకవేళ తమ నాయకుడు డీకే శివకుమార్ చర్యలు తీసుకుంటే శిరసావహిస్తానన్నారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని వివరణ ఇచ్చానన్నారు. అయితే తన మాదిరిగా మాట్లాడిన అందరికీ నోటీసులు ఇవ్వలేదని వాపోయారు. సీఎం సిద్దరామయ్య బాగా పరిపాలిస్తున్నారని చెప్పారు. కారు పల్టీ, మహిళ మృతి శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకా మాలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మందగడ్డె 17వ మైలురాయి వద్ద బుధవారం వర్షం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారు తీర్థహళ్లి నుండి శివమొగ్గ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ పక్కన ఉన్న నీటి గుంతలోకి పడిపోయింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మహిళ (59)ను వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయింది. మృతురాలు కుందాపూర్ తాలూకావాసిగా గుర్తించారు. డ్రైవర్‌తో సహా కారులో ఉన్న మిగతా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. రైలు పట్టాలపై పోలీసు భార్య శవం ● 6 నెలల కిందటే పెళ్లి యశవంతపుర: పెళ్లియిన ఆరు నెలలకే నవ వివాహితకు నూరేళ్లు నిండాయి. ఆమె అనుమానాస్పదంగా మరణించిన ఘటన హాసన జిల్లా అరసికెరె తాలూకాలో జరిగింది. వివరాలు.. దావణగెరె జిల్లా చన్నగిరికి చెందిన విద్య (23)కు అరసికెరె సోమలాపురవాసి శివుతో పెళ్లయింది. శివు పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తూ బెంగళూరు శంకరపురలో నివాసం ఉంటున్నారు. జూన్ 30న విద్యా అదృశ్యమైంది. భర్త శంకరపుర పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంగళవారం సాయంత్రం విద్యా శవం అరసికెరె రైల్వే ట్రాక్ వద్ద కనిపించింది. ఆమె అరసికెరెకు ఎందుకు వెళ్లిందో, ఎలా మరణించిందో అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ ఆమె ఇల్లు విడిచి వెళ్తే పుట్టింటికి వెళ్లాలి కదా అనే అనుమానాలున్నాయి. పెళ్లయినప్పటి నుంచి విద్యను భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమ కూతురుని అత్తింటివారు హత్య చేశారని విద్య తల్లిదండ్రులు విలపించారు. అరసికెరె రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పొంగిన భక్తిరసం చింతామణి: ఆషాడమాస పూజల సందర్భంగా పట్టణంలో డబుల్ రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో వైష్ణవి భజన మండలి మహిళలు శ్రావ్యంగా దాసర కృతులను ఆలాపన చేశారు. ఆరు గంటలపాటు ఏకధాటిగా గురురాఘవేంద్రులను కీర్తిస్తూ పాటలను ఆలపించారు. భక్తులు తన్మయులయ్యారు. -
వీటి వల్లే హాసన్‌లో గుండెపోట్లు
బనశంకరి: హాసన్ జిల్లాలో 42 రోజుల్లో 26 మంది గుండెపోటుతో మృత్యవాతపడ్డారు. ఇందులో యువతీ యువకులు, బాలలు కూడా ఉండడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో 12 మంది బెంగళూరు జయదేవ ఆసుపత్రి నిపుణులతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. నిపుణులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ధూమపానం, మద్యపానం, ఊబకాయం, ఎక్కువగా మాంసం తినడం, ఫాస్ట్ ఫుడ్ అలవాటు వల్ల మరణాలు సంభవించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మేక, పొట్టేలు వంటి రెడ్ మీట్ సేవనంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలని నిపుణులు నిర్ణయించారు. ఇప్పుడు కేవలం వారంరోజుల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను సర్కారును అందజేయనున్నారు. మహిళలు, పిల్లల మరణాలకు? అయితే మహిళలు, బాలలకు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉండవు, మాంసాహారం కూడా పరిమితంగా ఆరగిస్తారు. వారికెందుకు గుండెపోట్లు వచ్చాయో ప్రస్తావించలేదు. నిపుణులు సాధారణ కారణాలనే చూపడం గమనార్హం. కోవిడ్ జబ్బుకు గురికావడం, అలాగే కోవిడ్ వ్యాక్సీన్లు ఆకస్మిక మరణాలకు కారణాలని జిల్లాలో వదంతులున్నాయి. టీవీలు, సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. కానీ వ్యాక్సిన్లతో సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. గుండె మరణాలకు కారణాలు ఇంకా నిగూఢంగానే ఉన్నాయి. మద్యం, మాంసం, ధూమపానం కారణాలు కావచ్చు నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక -
జేడీఎస్ నిరసన
యశవంతపుర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి, పాలనా వైఫల్యం అధికమైందని ఆరోపిస్తూ బెంగళూరు నగర జేడీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఫ్రీడం పార్క్‌లో జరిగిన నిరసనలో నేతలు, కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యారంటీ పథకాల ద్వారా గద్దెనెక్కిన సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అరోపించారు. గ్యారంటీలను కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.పేలుళ్లకు కుక్కలు బలి చింతామణి: గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందులను వేటడానికి గాను అమర్చిన పేలుడు పదార్థాలను రెండు కుక్కలు కొరకడంతో పేలి తలలు నుజ్జయి చనిపోయాయి. ఈ సంఘటన తాలూకాలో బట్లపల్లి పోలీసు స్టేషన్ పరిదిలోని వై.గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామ శివార్లోని నారప్ప తోట దగ్గర కుక్కల కళేబరాలను చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్థల పరిశీలన జరిపిన పోలీసులు అడవి జంతువుల కోసం ఎవరో ఈ పేలుడు పదార్థాలను ఉంచారని, వాటిని కుక్కలు తినే వస్తువులని కొరకడంతో పేలిపోయినట్లు తెలిపారు. ప్రజలకు ఏమీ జరగలేదని తెలిపారు. పేలుడు పదార్థాలను పెట్టిన వారి కోసం గాలిస్తున్నారు. గుండెపోట్లతో ధార్వాడలో ఇద్దరు.. హుబ్లీ: రాష్ట్రంలో హాసన్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో గుండెపోటు మరణాలు మిస్టరీగా మారడం తెలిసిందే. తాజాగా ధార్వాడలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. నవలగుంద పట్టణ నివాసి ముత్తప్ప శంక్రప్ప పూజార (44), అదే తాలూకాలోని యమనూరు నివాసి కేబుల్ ఆపరేటర్ ఫక్కీరప్ప బణగార (45)గా గుర్తించారు. సోమవారం రాత్రి నిద్రలోనే కన్నుమూశారు. ఒకప్పుడు ఉమ్మడి ధార్వాడ జిల్లాలో భాగమైన హావేరిలో కూడా ఇద్దరు గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. అది మోదీ వైఫల్యం: సుర్జేవాలా బనశంకరి: ఉగ్రవాదులను కాపాడే పాకిస్తాన్ కు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అధ్యక్ష పదవి లభించడం తీవ్ర విషయమని ఏఐసీసీ నేత, రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్ సుర్జేవాలా అన్నారు. బుధవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు అవకాశం తప్పించకుండా ప్రధాని మోదీ తప్పు చేశారన్నారు. మోదీ దేశ విదేశాల్లో పర్యటనలకు రూ.8 వేల కోట్లు ఖర్చుచేశారని, కానీ ఏ దేశం మద్దతును సంపాదించారని అన్నారు. పహల్గాం దాడి సమయంలో పాకిస్తాన్ కు వేర్వేరు దేశాలు మద్దతు ఇచ్చాయని, కానీ భారత్‌కు చుట్టుపక్కల ఉండే దేశాలు సైతం అండగా నిలవలేదని, ఇది మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ వైఫల్యమని దుయ్యబట్టారు. -
అద్దె భూతం.. నగరజీవి సతమతం
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో ఇంటి అద్దెలు భగ్గుమంటాయన్నది తెలిసిందే. ఈ వార్తలు ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. బెంగళూరుకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించేవారికి వారి జీతాల కంటే అద్దెలు ఎక్కువగా ఉన్నాయా అనిపించేలా ఇంటి బాడుగలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఆస్తుల యజమానులకు కాసుల పంట పండుతోంది. 6 నెలల్లో 15 శాతం పెరుగుదల ఈ ఏడాదిలో తొలి ఆరు నెలలు ముగిశాయి. అదే సమయంలో ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ఎక్కువగా బాడుగలు ఉన్న నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదని ఇక్కడి అద్దెదారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే బెంగళూరు ఇంటి అద్దెల్లో 15.7 శాతం మేర పెంపుదల నమోదైంది. నెలకు రూ. లక్ష పైనే ఆధునిక సౌకర్యాలతో లేఔట్లు, అపార్టుమెంట్లు, విల్లాలు ఐటీ కంపెనీలకు సమీపంగా ఉండడం పేరుతో ఇంటి అద్దెలను పెంచడం పరిపాటైంది. అద్దెదారుల నుంచి 20–25 శాతం మేర పెంచి రెంట్లను వసూలు చేస్తున్నారు. ఐటీ కారిడార్‌కు సమీపంలోని మంచి ఇంటి అద్దె ఎంత తక్కువ అనుకున్నా రూ. 1 లక్ష నుంచి 2.5 లక్షల వరకూ ఉంటోంది. ఐటీ ఉద్యోగుల జీతాలు సగం వరకు ఈ ఇంటి రెంట్లకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరి నియంత్రణలో ఉండడం లేదు. డిపాజిట్‌కు అయితే పరిమితి అనేది లేకుండా పోయింది. అత్యధిక వేతనాలు పొందుతున్న ఐటీ, బీటీ నిపుణులు సైతం అమ్మో అనాల్సిందే. నెలకు రూ. 2 లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగులు నెలకు కనీసం రూ. 1.2–1.5 లక్షల మేర అద్దెలు కట్టాల్సి వస్తుంది. అద్దెల భూతంపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. కెనడవాసి విస్మయం నగర అద్దెల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కఠిన వాస్తవాలు జోక్‌ల రూపంలో వస్తుంటాయి. క్యాలెబ్ ఫ్రైసెన్ అనే కెనడాకు చెందిన వ్యక్తి బెంగళూరు దొమ్మలూరు డైమండ్ డిస్ట్రిక్ట్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో బాడుగకు దిగాడు. అద్దె వివరాలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసినవారు కళ్లు తేలేయాల్సిందే. నెల బాడుగ ఎంతంటే రూ. 1.75 లక్షలు, సెక్యురిటీ డిపాజిట్ రూ. 19.25 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు. ఆ డిపాజిట్‌తో లగ్జరీ కారునే కొనొచ్చని, మామూలు ఊళ్లలో ఇల్లే కొనుగోలు చేయవచ్చని నెటిజన్లు అనేక రకాలుగా పేర్కొన్నారు. బెంగళూరులో భగ్గుమంటున్న బాడుగలు భారీ వేతనజీవులకూ తప్పని కష్టం బెంబెలెత్తిపోతున్న ఐటీ ఉద్యోగులు -
రాజధానిలో భారీ వర్షం
బనశంకరి: కొన్నిరోజుల విరామం తరువాత రాజధాని బెంగళూరులో బుధవారం జోరు వర్షం కురిసింది. మహదేవపుర, ఆర్ఆర్.నగర, బొమ్మనహళ్లి, యలహంక వలయ పరిదిలో వర్షం పడటంతో చల్లని వాతావరణం నెలకొంది. జక్కూరు, హొరమావు, ఉళ్లాల, దొడ్డ బిదరకల్లు, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, మడివాళ, లాల్బాగ్, జక్కసంద్ర తో పాటు 37 వార్డుల్లో వర్షం కురిసింది. కొన్ని లోతట్టు ప్రదేశాల్లో వర్షం నీరుచేరింది. పలు కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే చిక్కమగళూరు నగరంలో వర్షం పడింది. కరావళి, మలెనాడు, ఒళనాడు జిల్లాల్లో పెద్ద వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. -
పాఠశాలల్లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలి
రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సమితి డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవన వనంలో ఆయుర్వేద ఉద్యమం చేపట్టిన అధ్యక్షుడు హఫీజుల్లా మాట్లాడారు. సర్కార్ సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని కోరారు. విద్యా రంగం పురోభివృద్ధికి సర్కార్ కమిటీలను ఏర్పాటు చేసి దానిని కార్య రూపంలోకి తేవాలన్నారు. సర్కారీ బడుల్లో బెంచీలు, విద్యుత్, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, తాగునీరు, క్రీడా సౌకర్యాలు విద్యార్థులకు ప్యాడ్లు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాదికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
అంగన్వాడీ సరుకుల అక్రమ నిల్వ పట్టివేత
హుబ్లీ: అంగన్వాడీల్లో చిన్నారులకు అందించే పౌష్టిక ఆహారాన్ని అక్రమంగా ఓ గోడౌన్లో నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు, ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి రూ.1,83,072 విలువ చేసే ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కలఘటిగి తాలూకా యలవదాళ నివాసి, అంగన్వాడీలకు ఆహార సామగ్రి సరఫరా చేసే చంద్రకాంత్ వడ్డరకర అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. బెల్లం 147 కేజీలు, బియ్యం 882 కేజీలు, పిల్లల ఆహార కుస్తీ కిట్ 1058 కేజీలు, మిల్లెట్ లడ్డు మిశ్రమం 679 కేజీలు, గోధుమ నూక 566 కేజీలు, మిల్లెట్ లాడ్ 1411 కేజీలు, రవ్వ 1608 కేజీలను పట్టుకున్నారు. ఇవి ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేసి అంగన్వాడీ చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందిస్తారు. ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచారన్న ఆరోపణలపై కలఘటిగి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ శ్రీశైల కౌజలిగి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా ఈ అక్రమ నిల్వపై దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తాలూకా పీడీపీఓ విద్యా బడిగేర్ ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంతో అవమానం.. వీఆర్ఎస్కు ఏఎస్పీ వినతి హుబ్లీ: కార్యక్రమం వేదికపై సీఎం సిద్దరామయ్య చేతిలో అవమానానికి గురైన ఏఎస్పీ నారాయణ భరమని స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెళగావిలో జరిగిన కార్యక్రమ వేదికపై సీఎం సిద్దరామయ్య ఏఎస్పీ నారాయణ భరమనిని కొట్టేంత పని చేశారు. ఈ ఘటనతో మనోవేదనకు గురై ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా ఆయన చేసిన ఈ విజ్ఞప్తిపై సీఎం సమక్షంలోనే నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో నారాయణ కొంచెం శాంతించినట్లుగా చెబుతున్నారు. కాగా ఈ అధికారి వీఆర్ఎస్ నిర్ణయంతో ప్రభుత్వంపై కాసింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండనుందని భావిస్తున్నారు. రాయల విగ్రహం పేరుతో రూ.లక్ష దోపిడీరాయచూరు రూరల్: మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వాముల విగ్రహం ఏర్పాటు విషయంలో చందాలు ఇవ్వాలంటూ ఏకంగా భక్తులకు రూ.1.15 లక్షల నిధులు డ్రా చేసుకొని ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగల్ మాట్లాడుతూ మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల 253 అడుగుల విగ్రహాన్ని సురేష్ అనే వ్యక్తి రామనగర వద్ద బెంగళూరు–మైసూరు జాతీయ రహదారిపై నిర్మిస్తున్నట్లు తెలిపారు. 96119 09961కు భక్తులు రూ.1.15 లక్షలు ఫోన్‌పే ద్వారా డబ్బులు వేయించుకొని అనంతరం ఫోన్ ఎత్తకుండా పోవడంతో సైబర్ నేర పరిశోధన కేంద్రానికి కేసు బదిలీ చేశామన్నారు. భక్తులు ఎవరి మాటలకు, దుష్ప్రచారాలకు తలొగ్గకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండో రోజూ కొనసాగిన తనిఖీలురాయచూరు రూరల్: నగరంలో రెండో రోజు 300 ఆటోలను చెక్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఈరేష్ నాయక్ వెల్లడించారు. బుధవారం మహిళా కళాశాల వద్ద ఆటో డ్రైవర్లకు లైసెన్సులు, పర్మిట్లు, ఆర్సీ, ఇతర బ్యాడ్జీలు, ఆటోలకు ఎలాంటి పర్మిషన్లు లేవని తేలిందన్నారు. వాటన్నింటిని తనిఖీ చేసి సీల్ వేశామన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో వీటిని పరిశీలించిన అనంతరం ఆటోలను యజమానులకు అప్పగిస్తామన్నారు. నగరంలో దాదాపు 80 శాతం ఆటోలకు ఇన్సూరెన్సులు, ఇతరత్ర పత్రాలు లేవని అన్నారు. ఆశా కార్యకర్తల ధర్నా రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. కేంద్ర సర్కార్ ఇచ్చే ప్రోత్సాహ ధనాన్ని కలిపి వేతనాలు చెల్లించాలని వివరించారు. భవిష్యత్తులో 40 వేల మంది అశా కార్యకర్తలకు నెలకు రూ.15 వేలు చొప్పున గౌరవ వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం స్పందించాలన్నారు. తొలగించిన ఆశా కార్యకర్తలు, సూపర్ వైజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. నెల నెలా తప్పకుండా వేతనాలు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా జేగరకల్‌లో మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలని, ప్రహరీ నిర్మించాలని సమాజ సేవకురాలు విద్యా పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనం వద్ద ఖాళీ చెంబులతో చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. 2024–25వ సాలులో గ్రామంలో రూ.20 వేలతో నిర్మించిన మహిళల మరుగుదొడ్లకు నీటి వ్యవస్థ కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు. వెంటనే నీరు, ప్రహరీ వ్యవస్థను కల్పించాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆల్మట్టి డ్యాం నుంచి 8న కాలువలకు నీరురాయచూరు రూరల్: బాగల్కోటె జిల్లా ఆల్మట్టి డ్యాం నుంచి ఈనెల 8న ఆయకట్టు కాలువలకు నీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆర్.బీ.తిమ్మాపూర్ ప్రకటించారు. మంగళవారం బెంగళూరు వికాససౌధలో యాదగిరి, బాగల్కోటె, విజయపుర, రాయచూరు జిల్లాల ఎమ్మెల్యేలు, కేబీజీఎన్‌ఎల్ అధికారులతో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా సమితి సమావేశంలో మంత్రి పైవిధంగా ప్రకటించారు. కృష్ణా ఆయకట్టు ప్రాంత పరిధిలోని కాలువలకు 120 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారన్నారు. వార బందీ పద్ధతి ద్వారా నీటి విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో మంత్రి శరణ బసప్ప దర్శనాపూర్, ఎమ్మెల్సీ అజయ్ సింగ్, శాసన సభ్యులు కరెమ్మ, వజ్జల మానప్ప, జేటీ పాటిల్, ఽశరణేగౌడ బయ్యాపూర్, మోహన్రాజ్లున్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారంరాయచూరు రూరల్: నగరంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వసంత కుమార్ శ్రీకారం చుట్టారు. బుధవారం 4వ వార్డులో ఎంఎల్ఏడీపీ ద్వారా రూ.లక్ష, రూ.25 లక్షల కేకేఆర్డీబీ నిధులతో హైటెక్ వంట గది, అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ జరిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రజాక్ ఉస్తాద్, ఈశప్ప, మురళీ యాదవ్, రమేష్, శ్రీనివాస్, ఉస్మాన్, హసన్లున్నారు. గురుకుల పాఠశాలను కొనసాగించాలిరాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఏఐడీఎస్ఓ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షులు అయ్యాళప్ప మాట్లాడారు. సర్కార్ ప్రస్తుతం ఉన్న వెనుక బడిన వర్గాల బాలికల గురుకుల పాఠశాలకు పదోన్నతిని కల్పిస్తూ దానిని రద్దు చేయడాన్ని ఖండించారు. 2025–26లో 40 మంది బాలికలు 8వ తరగతిలో చేరారని, వారి భవిష్యత్తు కోసం మళ్లీ బీసీ బాలికల గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా విద్యా శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నిరుద్యోగికి రూ.9.25 లక్షల బురిడీ హోసూరు: పెద్ద మొత్తంలో జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని పట్టభద్రున్ని నమ్మించి రూ. 9.25 లక్షల నగదును స్వాహా చేశారు ఫేస్బుక్ మోసగాళ్లు. వివరాల మేరకు సూళగిరి ప్రాంతానికి చెందిన యువకుడు (24) బి.కాం చదువుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫేస్బుక్లో వెలువడిన ఓ ఉద్యోగ ప్రకటనను చూసి వారిని సంప్రదించాడు. ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తామని, ఇందుకుగాను వివిధ రుసుముల కింద రూ. 9.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మి చెప్పిన బ్యాంకు ఖాతాకు నగదును జమ చేశాడు. కాలం గడిచిపోతున్నా ఉద్యోగం ఇప్పించకపోవడంతో వారి నంబర్‌కు సంప్రదించగా స్విచ్ఆఫ్ రావడంతో లబోదిబోమంటూ క్రిష్ణగిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కార్మికులకు పని గంటలు తగ్గించాలి
రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని జాయింట్ కార్మిక సంఘాల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. బుధవారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పనికి తగ్గట్టుగా వేతనాలు, పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జారీ చేసిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.36 వేలు, రూ.26 వేలు చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ పద్ధతికి స్వస్తి చెప్పి వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.9 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మాని పెంచిన ధరలను తగ్గించాలన్నారు. -
హైకోర్టు సూచనతో నాగేంద్రకు బిగ్‌షాక్
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బళ్లారి జిల్లా నుంచి ఏకై క మంత్రిగా కేబినెట్లో చోటు దక్కించుకోవడంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుని, జిల్లాలో తిరుగులేని నాయకుడుగా ఎమ్మెల్యే బీ.నాగేంద్ర ఎదిగారు. అయితే వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరగడం, ఆ శాఖకు ఆయన మంత్రిగా ఉండటంతో పాటు ఆయన ప్రమేయంతోనే అవినీతి జరిగిందనే ఆరోపణలపై మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. కంచే చేను మేసిన చందంగా తన వర్గానికి చెందిన వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టడంతో రాష్ట్రంలో కలకలం రేపింది. పట్టుమని ఏడాది పాటు కూడా మంత్రిగా పని చేయని నాగేంద్ర అవినీతి ఊబిలో కూరుకుపోయారు. గోరు చుట్టుపై రోకటి పోటులా.. జైలుకు కూడా వెళ్లి వచ్చిన తర్వాత ఇందులో తన తప్పేమీ లేదని, తిరిగి మంత్రి పదవిని చేపడతానని ఆయన తన వర్గీయులతో పదే పదే చెబుతున్న తరుణంలో గోరు చుట్టుపై రోకటి పోటులా హైకోర్టు సూచనతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల మేర అవినీతి జరిగిన తర్వాత ఆ నిధులను 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారి లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు ఖర్చు పెట్టారనే ఆరోపణలు కూడా ఉండటంతో పాటు ఎస్ఐటీ అధికారులు ఆ మేరకు విచారణ కూడా చేస్తున్నారు. బీజేపీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే. నాగేంద్ర ప్రమేయంతో అవినీతి జరిగిందని, దానిపై ఆయన జైలుకు వెళ్లిన తరుణంలో పార్టీ ఆయనకు అండగా ఉంది. మళ్లీ మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ కూడా సానుకూలంగా ఉండటంతో ఖచ్చితంగా నాగేంద్రకు మంత్రి పదవి దక్కుతుందని జిల్లాలో ముఖ్యంగా ఆయన అనుచరవర్గాల్లో చర్చ నడుస్తోంది. సీబీఐ ఎంట్రీతో అక్కమార్కుల్లో దడ అయితే బ్యాంకు విచారణకే పరిమితమైన సీబీఐతో సమగ్ర తనిఖీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్ యత్నాళ్, రమేష్ జార్కిహోళి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్ఐటీ, ఈడీ విచారణ చేస్తున్న తరుణంలో హైకోర్టు సూచనతో సీబీఐ కూడా ఎంట్రీ ఇస్తుండటంతో అవినీతిలో కూరుకుపోయిన వారి గుండెల్లో దడ మొదలైంది. ఎస్ఐటీ నుంచి క్లీన్చిట్ పొందిన నాగేంద్ర మళ్లీ మంత్రి అవుతానని కలలు కంటున్నారు. అయితే సీబీఐ విచారణకు రానుండటంతో ఏం జరుగుతుందోనని చర్చనీయాంశంగా మారింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఇప్పటికే మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల గోల్‌మాల్‌లో ఎవరెవరి పాత్ర ఉందో నిధులు స్వాహా చేసిన నేతలకు తెలుసు. ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీబీఐ తనిఖీ చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మళ్లీ మంత్రి అయ్యే యోగం ఇప్పట్లో లేనట్లేనా? సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని ఎస్ఐటీకి ఆదేశం వాల్మీకి మండలి అవినీతి కుంభకోణం కేసులో మలుపు -
గడువుకు ముందే తుంగభద్ర తుళ్లింత
సాక్షి, బళ్లారి/హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డ్యాం క్రస్ట్‌గేట్లలో ఆరు క్రస్ట్‌గేట్లు పైకెత్తి నదికి సుమారు 14,136 క్యూసెక్కుల నీరు వదిలారు. బుధవారం తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారి ఓఆర్కే రెడ్డి, ఎస్ఈ నారాయణనాయక్, ఎస్డీఓ జ్ఞానేశ్వర్ తదితరులు క్రస్ట్‌గేట్లకు పూజలు చేసి నదికి నీరు వదిలారు. డ్యాం ప్రస్తుత గరిష్టనీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారం వచ్చేలోపు 80 టీంఎంసీలు నీరు చేరడంతో పాటు డ్యాం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం డ్యాంలోకి ఇన్‌ఫ్లో కూడా 30 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో ముందుస్తు చర్యలతో డ్యాం క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యాంలో 77.144 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నది ద్వారా కిందకు వదిలే విధంగా గేట్లను ఎత్తారు. మరమ్మతుల్లో లోపం.. రైతులకు శాపం గత ఏడాది 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయినప్పుడు తాత్కాలికంగా స్టాప్‌లాగ్ గేటును అమర్చి ఖరీఫ్‌తో పాటు రబీకి కూడా నీరందించారు. అయితే డ్యాంకు ఉన్న 33 గేట్లను మరమ్మతులు చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. అయినా పాలకులు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు శాపంగా మారింది. రబీలో కాలువలకు నీరు నిలుపుదల చేసిన తర్వాత క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించడంతో ఈ ఏడాది డ్యాంలో 100 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు కుదించే పరిస్థితి ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. డ్యాం క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేసే విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకుని, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసి ఉంటే 80 టీఎంసీలకు చేరుకున్న తర్వాత వదిలే అవకాశం ఉండేది కాదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నీరు ఎలాంటి ఢోకా లేకపోయినా రబీ పంటపై స్పష్టత కనిపించక పోవడంతో ఆయకట్టు రైతుల్లో ఈసారి ఒకే పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డ్యాంకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో అదనపు నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1625.20 అడుగులు, ఇన్‌ఫ్లో 32,767 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 13,670 క్యూసెక్కులుగా ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపారు. జలాశయం వద్ద ఆరు క్రస్ట్‌గేట్లు ఎత్తి నీరు విడుదల డ్యాంలో గరిష్ట నీటి నిల్వను 80 టీఎంసీలకు కుదించిన వైనం క్రస్ట్‌గేట్లు బలంగా లేనందున ముందుగానే గేట్ల ఎత్తివేత డ్యాం చరిత్రలో జూలై 2 నాటికి గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి -
సర్కారు బడులు అభివృద్ధి కావాలి
బళ్లారి అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు కొనసాగి, అభివృద్ధి చెందాలి, అలాగే ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా సమాన పాఠశాలలు అభివృద్ధి చెందాలని రాష్ట్ర పాఠశాలల అభివృద్ధి, పర్యవేక్షణ సమితుల సమన్వయ వేదిక నేతలు వీపీ నిరంజనారాధ్య, జేవీ మంజునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలల అభివృద్ధికి వారు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా విద్యా హక్కు చట్టం–2009ను పూర్తిగా పరిణామాత్మకంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఈ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. నర్సరీ నుంచే ఇంగ్లిష్ మీడియం అమలుకు స్వస్తి చెప్పి విద్యా హక్కు చట్టం ప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే బోధించాలన్నారు. త్రిభాష సూత్రానికి బదులు ద్విభాష సూత్రాన్ని అమలు చేయాలి. ఆంగ్ల భాషను ఓ భాషగా ప్రభుత్వ స్థాయిలో బోధించడానికి నిపుణులైన ఆంగ్ల భాష ఉపాధ్యాయులను నియమించాలి. భాషను పరిణామాత్మకంగా బోధించడానికి అవసరమైన వనరులు అలాగే శిక్షణ ఇవ్వాలన్నారు. కన్నడను పాలన భాషగా మరింత పరిణామాత్మకంగా అమలు చేయడానికి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదివిన విద్యార్థులకే ప్రభుత్వ ఉద్యోగాలు, రిజర్వేషన్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మొత్తం 15 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించినట్లు వారు తెలిపారు. -
ఆస్పత్రి ఉన్నా వైద్యులు లేరన్నా.!
రాయచూరు రూరల్: రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వారికి వైద్యం, ఆరోగ్యం లభించడం మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా మారింది. రాయచూరు నుంచి 15 కి. మీ.దూరంలో ఉన్న ఉడుంగల్ ఖానాపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు. అయితే విధులు మాత్రం ఇద్దరే నిర్వహిస్తున్నారు. 24 గ్రామాల ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు కల్పించాల్సిన వైద్యులు, సిబ్బంది విధులకు రాకుండా చక్కర్లు కొడుతున్నారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, అతిసార వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న తరుణంలో వైద్యులు తమకేమీ పట్టనట్లు సొంత పనుల్లో మునిగారు. ఉడుంగల్ ఖానాపుర ఆస్పత్రిలో 19 మంది ఉండగా, ఆరుగురు ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 10 మంది సొంత పనుల్లో జిల్లా కేంద్రంలో ఉంటారు. వైద్యులు 15వ తేదీ నుంచి విధులకు గైర్హాజరయ్యారు. ప్రతినిత్యం 40 మందికి పైగా రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. అయినా రోగులకు ఇంతవరకు ఆస్పత్రిలో డాక్టర్ ఎవరో తెలియదని గ్రామస్తులు వాపోయారు. 24 గ్రామాల ప్రజలకు అందని వైద్యం విధులకు వైద్యులు, సిబ్బంది డుమ్మా -
చివరి భూములకు ఈసారైనా నీరందేనా?
రాయచూరు రూరల్: మూడు దశాబ్దాల నుంచి వర్షాభావంతో జిల్లా రైతులు తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్నారు. ఉన్న నీటి వనరులు వినియోగించుకోలేని రైతులను ఆదుకోవాలన్న ధ్యాస అధికారులకు, ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోంది. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల కింద రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారింది. పంట భూములు తమ కళ్ల ముందే బీళ్లుగా మారుతుంటే రైతులు తల్లడిల్లుతున్నారు. పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన స్థితిలో కాలువలు ఉన్నాయి. జిల్లాకు వర్షపాతం ఒక శాపమైతే, పాలకుల శీతకన్నుతో ఎడమ కాలువ ఆధునికీకరణ పేరుతో రూ.కోట్లాది నిధుల విడుదల జరిగినా పనులు మాత్రం సక్రమంగా జరగకుండా పోయాయి. కాలువలకు నీరు వదిలితే ఏ క్షణంలోనైనా గండ్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాలువలకు ఇరువైపుల కట్టలకు ఉన్న సిమెంట్ కాంక్రీట్ జారిపోయింది. అక్కడక్కడ నాపరాళ్లు పగిలిపోయాయి. ఎర్రమట్టి కుదించుకు పోయింది. 99, 102వ డిస్ట్రిబ్యూటరీల కింద మమదాపుర, మర్చటహాళ్, నెలెహాళ్, మటమారి, ఆశాపుర, దిన్ని, యరగేర, మంజర్ల తదితర ప్రాంతాల్లో ఉపకాలువలకు నీరందడం కష్టమైంది. కాలువ గట్లు బలహీన పడిన వైనం పట్టించుకోని అధికారులు, పాలకులు -
నేడు తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి కర్ణాటక కోటా కింద కొప్పళ, రాయచూరు జిల్లాలకు నీరందించే తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ(ఎల్‌బీఎంసీ)కు నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఈనెల 10న హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యాంకు మంగళవారం ఇన్‌ఫ్లో 33,916 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాంలో నీటిమట్టం కూడా క్రమంగా పెరిగింది. జలాశయానికి ఎగువన శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, ఆగుంబె, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.38 అడుగులు, నీటినిల్వ 74.486 టీఎంసీలు ఉండగా ఔట్‌ఫ్లో 2,388 క్యూసెక్కులుగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నదికి టీబీ డ్యాం నుంచి నీరు తుంగభద్ర జలాశయంలోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో 33,916 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ద్వారా నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం జలాశయంలో 71.790 టీఎంసీల నీరు నిల్వ చేరింది. నిపుణుల సలహా ఆధారంగా జలాశయం క్రస్ట్‌గేట్లు మార్చక పోవడంతో ఈ సంవత్సరం జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించారు. తుంగా, భద్ర నుంచి పెద్ద మొత్తంలో నీరు విడుదలైతే జలాశయం నుంచి నదిలోకి మరింత ఎక్కువగా నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల అధికారులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డు ఎస్ఈ నారాయణ నాయక్ హెచ్చరిక సందేశాన్ని పంపారు. 10న ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీలకు టీబీ డ్యాం నుంచి నీటి విడుదల -
9న దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన
హుబ్లీ: డీ క్రియేషన్స్ వారి దూర తీరయాన చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఈనెల 9న సాయంత్రం 4 గంటలకు ధార్వాడ పద్మ థియేటర్లో ఏర్పాటు చేశామని ఆ చిత్ర దర్శకుడు మన్సూరే తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇది ప్రేమ కథ అని, హీరోగా విజయ్ కృష్ణ, హీరోయిన్గా ప్రియాంక కుమార్ నటించారని తెలిపారు. శృతి హరిహరన్, శరత్ లోహితాశ్వ, సుధా బెళవాడి, అరుణ్‌సాగర్, శోభరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. కార్తీక్, భక్కేష్ సంగీత దర్శకత్వం నిర్వహించారు. బెంగళూరు, ఉడిపి, కుందాపుర, గోవాల్లో షూటింగ్ చేశామన్నారు. ప్రత్యేక ప్రదర్శన బెంగళూరు, మైసూరుకు మాత్రమే పరిమితం అయిందన్నారు. అయితే కన్నడ సినీ రంగానికి ఉత్తర కర్ణాటక ఇచ్చిన సేవలు అనన్యం అని, అందుకే ధార్వాడలో ఈ ప్రత్యేక ప్రదర్శన చేశామన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్, పంపిణీదారులు రవిచంద్ర రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వృక్ష సంపద భద్రతకు చర్యలు చేపట్టండి బళ్లారి అర్బన్: మొహర్రం పండుగ వేళ జిల్లా వ్యాప్తంగా ఆయా తాలూకాల పరిధిలో అగ్నిగుండం తయారీ కోసం వృక్షాలను నాశనం చేయరాదు. ఎండుకట్టెలతో పండుగను జరుపుకొనేలా అవగాహన కల్పించాలని, ఎట్టిపరిస్థితిలోను పచ్చని చెట్లను నాశనం చేయకుండా చర్యలు చేపట్టాలని జిల్లాధికారికి కర్ణాటక రక్షణ వేదిక బళ్లారి జిల్లా శాఖ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. మొహర్రం పండుగ మతాల మధ్య సామరస్యానికి ప్రతీక అన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారన్నారు. ఈ పండుగ సందర్భంగా పచ్చని చెట్లు చేమలకు హాని వాటిల్లకుండా పోలీసులు సంబంధిత అధికారులు పండుగ నిర్వాహకులకు అవగాహన కల్పించి వారిని చైతన్య పరచాలని సంస్థ అధ్యక్షుడు పంపనగౌడ కోరారు. లింగేశ్వర్, అంజినమ్మ, ఆంజినేయ, శేఖర్, హులిగప్ప తదితరులు పాల్గొన్నారు. కవి మృతికి సంతాపం రాయచూరు రూరల్: నగరంలో సీనియర్ కవి బీ.వీ.వాల్మీకి నాగేంద్ర అకాల మృతికి రంగస్థల కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు మంగళవారం కన్నడ భవనంలో జరిగిన సమావేశంలో సీనియర రంగస్థల కళాకారుడు హక్కి మాట్లాడుతూ రంగాయణ, కళా రంగం, కవిత్వంలో రాటు దేలిన నాగేంద్ర వాల్మీకిగా పేరొందారని అభివర్ణించారు. కార్యక్రమంలో అయ్యనగౌడ, వెంకటేష్, బషీర్ అహ్మద్, నరేంద్ర రంగస్వామిలున్నారు. ఆ ప్రకటన ఖండనీయం హొసపేటె: సోషలిజం, లౌకికవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని ఆర్ఎస్ఎస్కు చెందిన దత్తాత్రేయ హొసబాళె చేసిన ప్రకటనను అఖిల భారత బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసోసియేషన్ నాయకుడు ఎం.కరుణానిధి తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సంఘ్ పరివార్ తన రహస్య ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. అంబేడ్కర్ పేరును ముందుకు తేవడం ద్వారా దేశ ప్రజల్లో కుల విద్వేషాన్ని నాటడానికి కూడా ప్రయత్నిస్తోందన్నారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు 1946 డిసెంబర్ 13న ఒక సంకలిత తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, అది 1947లో ఆమోదం పొందిందన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగంలో చేర్చారన్నారు. అనంతరం అసోసియేషన్ నాయకుడు మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా కుల రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.