యాక్సిడెంట్‌లో కారు దగ్ధం
యశవంతపుర: కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో పల్టీ పడి మంటల్లో చిక్కుకుని ఒకరు చనిపోయారు, ఈ ఘటన హాసన్ జిల్లా అరసికెరె తాలూకాలో జరిగింది. హరనహళ్లికి చెందిన మంజునాథ్ (30), నవీన్, పవన్ కారులో వెళ్తూ ముందు వెళ్లే కారును ఓవర్‌టేక్ చేయబోయి వేగంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టారు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. మంజునాథ్ మరణించగా, మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాణావర పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళ దుర్మరణం, జనం ఆగ్రహం
గూడ్స్ వ్యాన్ ఢీకొని స్కూటర్‌పై వెళ్తున్న మహిళ మరణించిన ఘటన చిక్కమగళూరు జిల్లా అరిశినగుప్పె గ్రామం వద్ద జరిగింది. సోమవారం రాత్రి స్థానికురాలు చంద్రిక (40) స్కూటీపై వెళుతుండగా వ్యాన్ ఢీకొనడంతో ఆమె అక్కడే చనిపోయారు. ఘటనాస్థలిని ఎమ్మెల్సీ సీటీ రవితో పాటు చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు పరిశీలించారు. వ్యాన్ డ్రైవర్‌ను జనం పట్టుకుని చితకబాదారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో చంద్రిక మృతి చెందినట్లు స్థానికులు ఆరోపించారు. తమ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవంటూ ఎమ్మెల్సీ సీటీ రవితో యువకులు గొడవకు దిగారు.
ఓ యువకుడు మృతి


