Karnataka Latest News
-
పరిసరాల శుభ్రతతో మలేరియాకు అడ్డుకట్ట
హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మలేరియాను నివారించవచ్చని కూడ్లిగి టీహెచ్ఓ ప్రతీప్‌కుమార్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా కూడ్లిగి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పతి ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి మలేరియా అని, దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవం, దోమ తెరలు వినియోగించడం ద్వారా మలేరియాకు దూరంగా ఉండచవ్చన్నారు. అనంతరం రాఘవేంద్ర పారామెడికల్ విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్రలేఖనాల ద్వారా అవగాహన కల్పించారు. సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్లు జగదీష్, వహాబ్, గురుమూర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ కే.సునీత, మహేష్, మలేరియా సూపర్ వైజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలను ముంచిన అకాల వర్షం
సాక్షి,బళ్లారి: అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందివచ్చిన పంట వర్షార్పణ అయ్యింది. జిల్లాలోని సిరుగుప్ప, కంప్లి, విజయనగర జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుంగభద్ర ఆయకట్టు కింద రబీలో సాగైన వరి పంట నేలకొరిగింది. దాదాపు 75శాతం మేర వరి కోతలు జరిగాయి. రైతులు వరిధాన్యాన్ని పొలాల్లోనే కుప్పలుగా వేసి ఆరబెట్టారు. మార్కెట్‌కు తరలించాల్సిన సమయంలో వర్షం కురవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వడగండ్ల ధాటికి వడ్లు నేలరాలాయి. పొలాల్లో ఎటు చూసినా వడ్లు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఆరటి తోటలు కూడా కుప్పకూలిపోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కపాడుకున్న పంటలు కళ్లెదుటే వర్షార్పణం కావడంతో అన్నదాత కన్నీరు పెట్టారు. ప్రభుత్వం పంటనష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. రాయచూరులో భారీ వర్షం రాయచూరురూరల్: ఎండలతో సతమతమవుతున్న రాయచూరు వాసులకు ఊరట కలిగించేలా రాయచూరు నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. కూర గాయల మార్కెట్, బంగీకుంట, మచ్చి బజార్, బైరూన్ కిల్లా ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి పోటెత్తింది. ఏపీఎంసీలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయ. గుంజహళిలో వడగండ్ల వర్షం కురిసింది. పెనుగాలులతో గంట పాటు విద్యుత్ సరఫరాలో నిలిచిపోయింది. వారం రోజలుగా వేసవి ఎండల తీవ్రత పెరిగింది. రోజూ 40 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు తల్లడిల్లి పోయారు. ప్రస్తుతం గంటపాటు వర్షం పడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈదురుగాలులు, వడగండ్ల వర్షం పలు గ్రామాల్లో నెలకొరిగిన వరిపంట నేలపాలైన అరటిపంటలు -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రాయచూరురూరల్: సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటలో కొండపై ఉన్న ఆలయంలో శనివారం రాత్రి దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్ని కట్టడాలను తొలగించారని సీఐ ఉమేష్ తెలిపారు. శబ్దాలు విన్న స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు ఉడాయించారేని తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గనుల శాఖ అధికారిణిపై సస్పెన్షన్ వేటు రాయచూరు రూరల్: జిల్లాగనుల శాఖాధికారిణి పుష్పాను సస్పెండ్ చేస్తు జిల్లాధికారి నీతీష్ అదేశాలు జారీ చేశారు. గత నెలలో మాన్వి తాలూకా చీకల పర్విలో అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్లు, జేసీబీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జిల్లా గనుల శాఖాధికారిణి పుష్పా తనకు ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండిపోయారని, కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని ఆరోపణలు వచ్చాయి. అక్రమ రవాణా, తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా సదరు అధికారిణి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిర్ధారించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్ చూడొద్దంటావా? ●● భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచిన భార్య హుబ్లీ: మొబైల్ ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పినభర్తపై భార్య కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్ నిత్యం సెల్‌ఫోన్ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరీ సొత్తు అప్పగింత రాయచూరు రూరల్: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్ నుంచి తీన్‌కందిల్ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐ నరమమ్మ పాల్గొన్నారు. పీఏబీఆర్‌లో తగ్గిపోయిన నీటిమట్టం కూడేరు: కూడేరు మండలం పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్ డ్యాం)లో ఇన్‌ఫ్లో లేక అవుట్ ప్లో ఉండడంతో నీటి మట్టం బాగా తగ్గి పోయింది. ఆదివారం నాటికి పీఏబీఆర్ డ్యాంలో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికార వర్గాలు వెల్లడించాయి. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, సత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కులు వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. లీకేజీ, నీటి ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కులు వరకు బయటకు వెళుతోంది. వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
రాయచూరు రూరల్: కశ్మీర్‌లోని పహల్గాంలో కాల్పులు జరిపి అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యరగేర వాసులు డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో అసువులబాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి భజరంగి, యరగేరి గ్రామస్తులు ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ న్విహించారు. మృతులకు సంతాపం సూచకంగారెండు నిమిషాల మౌనం పాటించారు. భజరంగి అధ్యక్షుడు పవన్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్రం సర్కార్ ఈ వి షయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఊరి శిక్షలు వేయలన్నారు. ర్యాలీలో సంతోష్ రెడ్డి, రాము, ఉదయ్ కుమార్, ఆకాష్ రెడ్డి, ప్రవీణ కుమార్ పాల్గొన్నారు. -
యువత ఉద్యోగ దాతలుగా ఎదగాలి
హుబ్లీ: యువత ఉద్యోగం సంపాదించడానికి బదులుగా స్వంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ దాతలు కావాలని ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి, ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్‌లు సూచించారు. హుబ్లీ రోటరీ క్లబ్, ఉద్యోగ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కేఎల్ఈ సంస్థ సీసీ జాబిన్ సైన్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను వారు ప్రారంభించి మాట్లాడారు. డిగ్రీ పూర్తి అయ్యాక విద్యార్థులు ఉద్యోగ సాధనకు ఎంతో ఎంతో శ్రమ పడుతారన్నారు. దొరికిన ఉద్యోగం తీసుకొని అక్కడే నైపుణ్యాన్ని సాధించి ఇతర కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలకు కృషి చేస్తుంటారన్నారు. అయితే స్వతహాగా పరిశ్రమలు ఏర్పాటు చేసి మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.మేళా నిర్వహకులు ఎమ్మెల్సీ ఫ్రొసిసర్ ఎస్వీ సంకనూరు మాట్లాడుతూ గదగ, ధార్వాడ, హావేరిలలో ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాను. ఆ మేరకు గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. కెనరా బ్యాంక్ ప్రాంతీయ చీఫ్ నజల్ సమీర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మంజునాథ హొసమని, కేఎల్ఈ సంస్థ డైరెక్టర్ శంక్రన్న మునవళ్లి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాపుగౌడ పాటిల్, కార్యదర్శి ఏవీ సంకనూర, ప్రిన్సిపల్ డాక్టర్.సంధ్య కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు. -
శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి
హొసపేటె: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని అంజుమాన్ ఖిద్దత్ ఇస్లాం సమితి, ముస్లిం సమాజం తీవ్రంగా ఖండించింది. హోస్పేట్‌కు చెందిన అంజుమాన్ ఖిద్మత్ ఇస్లాం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలోని జైభీమ్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి పహల్గాం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కమిటీ అధ్యక్షులు హెచ్ఎన్ మొహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు, అన్ని జాతులకు వెలుగునిచ్చే ఒక వనం లాంటిదన్నారు. శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదులను శిక్షించాలన్నారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. ఉగ్రవాద వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాయకులు నజీమ్, ఫజ్లుల్లా, రెహ్మత్, వాఖ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు దాదాఫీర్ బావు, అంజుమాన్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎంఎం, ఫిరోజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి నిల్వకు శీతల గోదాముల కొరత
రాయచూరు రూరల్: ఎండు మిర్చి అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. మార్కెట్‌కు తీసుకెళ్తే ఆశించిన ధరలు ఉండవు. నిల్వ చేద్దామంటే శీతల గోదాముల కొరత, పొలాలు, ఇళ్ల వద్ద నిల్వ చేసుకుంటే వర్షాలకు పంట తడిసిపోతుందనే భయం. ఇలా మిర్చి రైతు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాడు. రాయచూరు, యాదగిరి, విజయపుర, బాగల్ కోటె, గదగ్, కొప్పల్ జిల్లాల్లో మిర్చి పంట లక్షల ఎకరాల్లో సాగైంది. రెండేళ్ల క్రితం మిరప మంచి ధర పలికింది. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపారు.అయితే గత ఏడాది నుంచి ధరలు పతనం అయ్యాయి. దీంతో చోలా మంది రైతులు మిర్చిని గోదాముల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఈ ఏడాది సాగైన మిర్చి పంట నిల్వ చేసేందుకు గోదాముల కొరత ఏర్పడింది. మరో వైపు యజమానులు గోదాముల అద్దె పెంచారు. దీంతో మిర్చిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏ గోదాము వద్దకు వెళ్లినా స్థలం లేదని చెబుతున్నారు. గత్యంతరం లేక పొలాల వద్ద మిర్చిని రాసులుగా పోసి ప్లాస్టిక్ తారపాళ్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు. అయితే పెనుగాలు, వడగండ్ల వర్షాలు కురిస్తే మిర్చి మొత్తం తడిసిపోయి కాయలు నల్లరంగులో మారుతుంది. అలాంటి పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకురారు. వచ్చినా తక్కువ ధరకు అడుగుతారు. ప్రభుత్వం అవసరమైన మేర గోదాములు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తెది కాదు. ఇదిలా ఉండగా గతంలో కోల్డ్ స్టోరేజలో బస్తాకు రూ.30 అద్దె ఉండగా నేడు రూ.వందకు పెంచారు. అసలు ధరలే పడిపోగా అద్దెలు పెంచడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని శీతల గోదాములు ఏర్పాటు చేయాలని, అద్దెలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అద్దె ధరలు పెంచిన యజమానులు పొలాల వద్దనే మిరప నిల్వలు వర్షాలతో తడిసి అన్నదాతలకు నష్టాల -
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
హుబ్లీ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన ధార్వాడ కామనకట్టి పంచకచేరి వీధిలో జరిగింది. ధార్వాడ తాలూకా చిక్కమల్లిగవాడ గ్రామానికి చెందిన కల్లప్ప గూళాప్ప కలయ్యనవర (59) పంచకచేరి వీధిలో ఉంటున్నాడు. ఈయన ఈనెల 13న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా జాడ కనిపించలేదు. దీంతో భార్య గంగుకల్లయ్య ధార్వాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ, హిందీ, మరాఠీ బాష తెలిసిన తన భర్త ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 08362233512, లేక పోలీస్ కంట్రోల్ రూంలో తెలియజేయాలని ఆమెతో పాటు పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. బస్సు ఢీకొని బైకిస్టు మృతి హుబ్లీ: తాలూకాలోని కుసుగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాలూకాలోని ఇంగళహళ్లి గ్రామానికి చెందిన రవిబాళెకాయి (32) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్‌లో వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని హుబ్లీ గ్రామీణ పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రవి బాళెకాయి మృతికి మాజీ మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప సంతాపం వ్యక్తం చేశారు. సభ్యుడిగా నియామకం రాయచూరు రూరల్: హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్ సభ్యుడిగా గీరీష్ కనకవీడును నియమిస్తు కేంద్ర సర్కార్ అదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న గీరీస్ మరో మూడేళ్ల పాటు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలి రాయచూరురూరల్: కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలని గంగాధరప్ప పిలుపు ఇచ్చారు. సరస్వతి దాసప్ప శైణీ ప్రతిష్టాన, కలాకుంచ సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో అదివారం దావణగేరలోని చెన్నగిరి విరూపాక్షప్ప కల్యాణ మంటపంలో జరిగిన సరస్వతి సాధక సిరిజాతీయస్థాయి అవార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటికీ తెలుగు, కన్నడ భాషలను కలిపి మాట్లడుతున్నారన్నారు. కన్నడ భాషను పరిరక్షించి భావితరాలకు అందించాలన్నారు. రాష్ట్ర సుగమ సంగీత సంస్థ అధ్యక్షుడు నాగరాజ్, నాగరత్న, సంగీత, అశా అడిగి, జ్యోతి గణేష్ శైణై, మంజునాథ్, సాలిగ్రామ గణేష్ శైణై, రాఘవేంద్ర, ఉమేష్ పాల్గొన్నారు. ఈత కొలనుల్లో సందడి సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు రావడంతో నగరంలో విద్యార్థులు, యువతతో స్విమ్మింగ్‌పూల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్మిమ్మింగ్‌పూల్స్ రద్దీగా ఉంటున్నాయి. నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ,ప్రైవేటు వారు ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. ఫీజు చెల్లించి పూల్‌లో జలకాలు ఆడవచ్చు. దీంతో పాటు ఈత నేర్పే కోచ్‌లకు కూడా గిరాకీ పెరిగింది. ఈత అనేది అందరూ నేర్చుకోవాలని, ఆరోగ్యానికి, ప్రాణరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. 10 రోజుల్లో ఈత పూర్తిగా నేర్చుకోవచ్చునని,ఈత,నీరు అంటే భయం తొలగిపోతుందని చెప్పారు. కేంద్ర భద్రతా దళం వైఫల్యంతోనే ఉగ్రదాడులు రాయచూరురూరల్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు కేంద్ర భద్రతా దళం వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉగ్రప్ప ఆరోపించారు. అ దివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కశ్మీరుకు 200 కేజీల్ ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
వెలుగు చూసిన పాలెగార్ల శాసనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దు గ్రామమైన నుంకనహళ్లిలో గూడేకోటే చివరి గవర్నర్ ఇమ్మడి బొమ్మల నాయక, ముమ్మడి బొమ్మల నాయకకు సంబంధించిన శాసనం వెలుగు చూసినట్లు చరిత్ర అధ్యాపకుడు హెచ్ఎం.తిప్పేష్ తెలిపారు. నుంకనహళ్లి లోయలో తూర్పు ముఖంగా ఉన్న ఒక రాతిపై 15 పంక్తులలో ఇమ్మడి బొమ్మల, గుడేకోటే చివరి గవర్నర్ అని రాసి ఉందని పేర్కొన్నారు. 1833లో భట్టార్ సత్యప్ప కుమారుడు మచ్చగిరికి చేసిన భూ దానం ఇందులో పేర్కొనబడిందన్నారు. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే తల్లిని ధిక్కరించినట్లే, బ్రాహ్మణుడిని ధిక్కరిస్తే ఆవును చంపినట్లే శిక్షించబడతావు అని శాసనంలో ఉందన్నారు. అదేవిధంగా శాసనంలో గాడిద చిత్రం ఉందని, ఇది ఒక శాపానికి సంబంధించిన చిహ్నమన్నారు. మొళకాల్మూర్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల చరిత్ర ప్రొఫెసర్ యోగానంద, మిథిక్ సొసైటీ శాసన నిపుణుడు శశికుమార్ నాయక్, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ షెజేశ్వర్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ ఆర్.మంజన. చరిత్ర విద్యార్థులు, స్థానికుల సహకారంతో ఈ శాసనాన్ని గుర్తించినట్లు తెలిపారు. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
మండ్య: వేసవి అధిక ఉష్ణోగ్రతలా, లేక యాంత్రిక లోపాలా తెలియదు కానీ వాహనాలు రోడ్డుపై తగలబడిపోతున్నాయి. ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బెంగళూరు– మంగళూరు హైవేలో కదబహళ్ళి టోల్ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఉడుపి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న రేష్మా ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పసిగట్టిన డ్రైవర్ బస్సును నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. 20 మంది ప్రయాణికులు ఉండగా అందరూ దిగిపోతున్న సమయంలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. బిండిగనవిళె పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదైన కారు దొడ్డబళ్లాపురం: వెళుతున్న కారులో మంటలు చెలరేగి నడిరోడ్డులో కాలిబూడిదైన సంఘటన గదగ్ శివారులో చోటుచేసుకుంది. ఈరన్న అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మారుతి బ్రిజా కారులో వెళ్తుండగా ఇంజిన్ భాగం నుంచి అగ్నికీలలు చెలరేగాయి. కారును నిలిపివేసి ఉన్నవారంతా దిగి దూరంగా పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మండ్య జిల్లాలో ప్రమాదం -
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు
మైసూరు: పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు, బదులుగా దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంపొందించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. శనివారం మైసూరులోని తమ నివాసం ముందు, తరువాత పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. కశ్మీరు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన టోపీ పెట్టిందని ఎద్దేవా చేశారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీపై మండిపడ్డారు. పాకిస్తానీలను సాగనంపాల్సిందే రాష్ట్రంలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో వివరాలు సేకరించి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సీఎం అన్నారు. పాకిస్తానీయులను దేశం నుంచి పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ చర్యకు తమ మద్దతు ఉందని చెప్పారు. గ్యారంటీలను ఆపం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ పథకాలను ఆపబోమని, వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఎం అన్నారు. జిల్లాలోని పిరియాపట్టణలోని తాలూకా క్రీడాంగణంలో ఏర్పాటు చేసిన రూ.439 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం గావించారు. కశ్మీర్ దాడి కేంద్ర నిఘా వైఫల్యమే సీఎం సిద్దరామయ్య ధ్వజం -
ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ
బనశంకరి: బంగారం, నగదు చీటింగ్ కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ నివాసాల్లో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో పలు సాక్ష్యాధారాలు, డిజిటల్ పరికరాలతో పాటు రూ.2.25 కోట్ల నగదు పట్టుబడింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా సరైన సంజాయిషీ ఇవ్వకపోవడంతో విచారణ చేపట్టడానికి అరెస్ట్ చేశారు. ఐశ్వర్యగౌడను బెంగళూరు ప్రత్యేక ఆర్థిక విభాగం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈడీ అధికారులు తెలిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోదరినంటూ చెప్పుకుని పలు బంగారం షాపుల నుంచి కోట్లాది రూపాయల విలువచేసే బంగారు నగలను తీసుకుని నగదు ఎగ్గొట్టినట్లు కేసులున్నాయి. ఐశ్వర్యగౌడను ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. సైకో అరెస్టు ● యువతి, స్నేహితునిపై దాడి బనశంకరి: ప్రేమించాలని వేధించి యువతి, ఆమె స్నేహితునిపై దాడి చేసిన సైకో ని నగరంలో బనశంకరి పోలీసులు అరెస్ట్‌చేశారు. 21 ఏళ్ల యువతి, ఆమె స్నేహితునిపై ఈ నెల 8వ తేదీన దేవేగౌడ పెట్రోల్‌బంక్ వద్ద కట్టర్‌తో దాడికి పాల్పడిన శ్రీకాంత్ (45) నిందితుడు. కమలానగరలో శ్రీకాంత్ నివాసంలో సదరు వివాహిత యువతి ఏడాదిపాటు అద్దెకు ఉండింది. వివాహితుడైన శ్రీకాంత్ తనను ప్రేమించాలని ఆమెను సతాయించేవాడు. దీంతో యువతి తన భర్తకు చెప్పి బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీకాంత్ ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. యువతి ఇంటిని ఖాళీ చేసి కురబరహళ్లిలో చేరింది. మూడు నెలల నుంచి శ్రీకాంత్ యువతిని వెంబడించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లేవాడు. 8వ తేదీన పెట్రోల్ బంక్ వద్ద బస్టాప్‌లో ఆమె స్నేహితునితో కూర్చుని ఉంది. శ్రీకాంత్ వెళ్లి అతన్ని ప్రేమిస్తున్నావా అని యువతి, ఆమె స్నేహితుని చెంపలపై కొట్టాడు. కటర్‌తో ఇద్దరి ముఖంపై దాడిచేసి ఉడాయించాడు. పోలీసులు శనివారం శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. సిద్దు సీఎం.. కర్ణాటక దౌర్భాగ్యం ● అశోక్ మండిపాటు శివాజీనగర: పాకిస్తాన్‌తో యుద్ధం అనివార్యం కాదన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యల మీద బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. సిద్దరామయ్య ముస్లిం ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు, అలాగైతే దాడుల్లో చనిపోయినవారి ప్రాణానికి విలువ లేదా? దేశానికి ఏమైనా ఫర్వాలేదు, ఓట్లు వస్తే చాలు అనే మనస్తత్వం ఆయనది అని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, రెండుసార్లు సీఎం అయిన సీఎం సిద్దరామయ్యకు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం లేకపోవటం కర్ణాటక దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. పాక్ ఉగ్రవాదుల దాడి భారతదేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి సవాల్‌గా మారిందన్నారు. ఇటువంటి సమయాలలో పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తానీ అక్రమ వలసదారులు దర్జాగా తిరుగుతున్నారు. ముందు వారిని గుర్తించి, ఇక్కడి నుండి వెళ్లగొట్టి కన్నడిగుల క్షేమాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సంబంధం లేని అంశాలపై జోక్యం చేసుకోవద్దని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొడుకుచే టోల్‌గేటు ధ్వంసం రాయచూరు రూరల్: మా అమ్మ చెబితే పట్టించుకోరా, మీకెంత ధైర్యం అని రాయచూరు– దేవదుర్గ మధ్యనున్న టోల్ గేట్‌ను ఎమ్మెల్యే కుమారుడు ధ్వంసం చేశాడు. వివరాలు... కాకర వద్ద గల టోల్గేట్ ఉండగా, వాహనదారులు టోల్ ఫీజులను చెల్లించడం కష్టంగా ఉందని, దానిని తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హైవే అధికారులకు సూచించారు. టోల్ గేట్‌ను తీసివేయడం కుదరదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పుత్రుడు సంతోష్ నాయక్, ఆమె సోదరుడు తిమ్మారెడ్డి నాయక్‌ల ఆధ్వర్యంలో యువకులు టోల్ గేట్ ఆఫీసు, అందులోని కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని అధికారి నవీన్ కుమార్ గబ్బూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కేసు నమోదు చేశారు. -
ఏటీఎం బందిపోట్లపై కాల్పులు
యశవంతపుర: కలబుర్గి నగరంలో కాకడె సర్కిల్లోని ఎటీఎంను దోచుకొని పరారైన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి బంధించారు. నిందితులు తస్లీం (28), షరీఫ్ (22) గాయపడ్డారు. వీరి స్వస్థలం హరియానా కాగా దేశమంతటా తిరుగుతూ నగదు దొంగతనాలకు పాల్పడేవారు. శనివారం ఉదయం బేలూరు క్రాస్ సమీపంలో నిందితులు కారుతో ఉన్నట్లు తెలిసి సబ్ అర్బన్ స్టేషన్ సీఐ సంతోష్ తట్టెపల్లి, ఎస్ఐ బసవరాజు వెళ్లి నిందితులు లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే నిందితులు చాకుతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. వారితో కలిసి కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 9న రూ.20 లక్షల లూటీ ఏటీఎంలను దోచుకెళ్లడంలో ఈ ముఠా ఆరితేరినది. ఈ నెల 9న గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి కాకడె సర్కల్‌కు సమీపంలోని ఎస్బీఎం ఏటీఎంను బద్దలు గొట్టి రూ. 20 లక్షల డబ్బును దోచుకెళ్లారు. అప్పటినుంచి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇంతలో మరో ఏటీఎంను లూటీ చేయాలని నగరానికి వచ్చారని పోలీసు కమిషనర్ శరణప్ప తెలిపారు. కాల్పుల్లో గాయాలైన నిందితులు షరీఫ్, తస్లీంలను జిమ్స్ ట్రామా కేర్ సెంటర్లో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. దాడిలో మంజు, ఫిరోజ్, రాజ్‌కుమార్ అనే పోలీసులకు కూడా రక్తగాయాలు కాగా ఆస్పత్రిలో చేరారు. తస్లీంపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 8 కేసులు, షరీఫ్‌పై 3 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. కలబుర్గిలో కలకలం ఇద్దరు దొంగలకు, ముగ్గురు పోలీసులకు గాయాలు -
కలబుర్గిలో ఐదుగురు పాకిస్తానీలు
యశవంతపుర: కలబుర్గి లో ఐదుమంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని అశోక్‌నగర ఠాణా పరిధిలో వీరు నివాసం ఉన్నట్లు తెలిసి పోలీసులు విచారణ చేపట్టారు. కలబుర్గిలోనే 9 మంది నివాసం ఉన్నట్లు తేలిందని పోలీసు కమిషనర్ శరణప్ప విలేకర్లకు తెలిపారు. వీరిలో ఇద్దరు దీర్ఘకాల వీసాపై ఉండగా, మిగిలినవారు విజిటర్ వీసాపై వచ్చి మకాం వేసినవారని చెప్పారు. భారత్‌కు వచ్చిన మరో ఇద్దరు అమెరికాకు వెళ్లిపోయారన్నారు. ఉగ్రవాద దాడులు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను గుర్తించి వారి దేశానికి పంపించవలసి ఉంది. రిక్కీ గన్‌మ్యాన్ అరెస్టు దొడ్డబళ్లాపురం: రిక్కీ రై పై కాల్పుల ఘటనలో పోలీసులు గన్‌మెన్ మోనప్ప విఠల్ ను అరెస్టు చేసారు. విఠల్‌ను అరెస్టు చేసిన పోలీసులు రామనగర జేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా విచారణ కోసం 10 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది. ఏప్రిల్ 22న విఠల్‌ను స్టేషన్ తీసుకువచ్చి విచారించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విఠల్ కోలుకున్నాక అరెస్టు చేయడం జరిగింది. అతని వద్ద ఉన్న గన్ స్వాధీనం చేసుకుని పరీక్షించగా బుల్లెట్ల లెక్కలో తేడా కనిపించింది. రిక్కీ రై వద్ద ఉన్న గన్మెన్ల నుంచి మొత్తం 7 గన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎవరి గన్ నుండి ఫైరింగ్ జరిగింది అని కనుక్కునేందుకు ల్యాబ్‌కు తరలించారు. -
రన్య రావుచే 100 కేజీల పసిడి స్మగ్లింగ్
బనశంకరి: మార్చి 3వ తేదీన రాత్రి దుబాయ్ నుంచి రూ.17 కోట్ల విలువచేసే 14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో నటీనటులు రన్యరావ్, కొండూరు తరుణ్ రాజు కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రన్యరావ్, ఆమె స్నేహితుడు బెయిల్ పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్.విశ్వజిత్శెట్టి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆమెను డీఆర్ఐ అరెస్టు చేసి విచారించి, తరువాత తరుణ్‌రాజును నిర్బంధించడం తెలిసిందే. ప్రస్తుతం వారు పరప్పన జైలులో రిమాండులో ఉన్నారు. కేసు వాదనల్లో డీఆర్ఐ పలు కొత్త అంశాలను బయటపెట్టింది. రన్య సుమారు 100 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. సాక్ష్యాలు లభించాయి రన్య అరెస్ట్ అక్రమమని, బెయిల్ మంజూరు చేయాలని, అధికారులు కస్టమ్స్ నిబంధనలను పూర్తిగా అతిక్రమించారని ఆమె న్యాయవాది వాదించారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన డీఆర్ఐ తరఫు న్యాయవాదులు రన్యరావు దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చి తరుణ్రాజుకు ఇవ్వగా, అతడు సాహిల్ జైన్ అనే వ్యాపారికి అప్పగించాడని తెలిపారు. రన్య 100 కిలోల బంగారం అక్రమ రవాణా చేసినట్లు సాక్ష్యాలు లభించాయని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని, రన్యరావు, తరుణ్‌రాజును మరింతగా విచారించాలని కింది కోర్టుకు మనవి చేశామని తెలిపారు. ఇద్దరు కలిసి 31 సార్లు దుబాయికి వెళ్లారని, 25వ సారి ఒకేరోజు దుబాయ్‌కి కి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. రన్యరావుకు పోలీసు భద్రతను ఎందుకు ఇచ్చారు అనేది విచారిస్తున్నామని, ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించి జడ్జి, బెయిలును నిరాకరించారు. హైకోర్టులో డీఆర్ఐ వాదనలు రన్య, తరుణ్రాజుకు బెయిలు తిరస్కృతి -
హత్య కేసులో జైలుశిక్ష
కెలమంగలం: వివాహేతర సంబంధం గొడవతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరుమందికి జైలు శిక్ష విధిస్తూ హోసూరు కోర్టులో తీర్పునిచ్చారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా కెలమంగలం సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజ (38). ఇతని భార్య పచ్చియమ్మ (30). వీరి బంధువు ధర్మపురి జిల్లా ఎర్రపట్టి గ్రామానికి చెందిన విజి (19). విజితో పచ్చియమ్మకు వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకొన్న రాజ గత 2016లో బంధువులు ముత్తప్ప (55), మురుగేష్ (24), జగధీష్ (21), ముత్తు (23), మల్లేష్ (21), పొన్నుస్వామి (27)తో కలిసి విజిని హత్య చేశారు. ఈ ఘటనపై కెలమంగలం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నిందితులు ముత్తప్ప, జగదీష్‌లు గతంలో చనిపోయారు. నేరం రుజువు కావడంతో మిగతా 6 మందికి జీవితఖైదును విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
బాదామి పుష్కరిణి.. నిత్య జలతరంగిణి
రాయచూరు రూరల్: వందలాది సంవత్సరాల నుంచి నీరు ఎండిన దాఖలాలు లేవు. ఉత్తర కర్ణాటకలోని బాదామిలో నిత్యం జలతరంగంతో కళకళలాడుతున్న పుష్కరిణి అందరినీ ఆకట్టుకుంటోంది. మహాకోటేశ్వర పుణ్య తీర్థంలో ఎల్లప్పుడూ జలం ఊరుతూనే ఉంటుంది. చాళుక్య రాజులు నిర్మించిన చారిత్రక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మహాకోటేశ్వర పుణ్యతీర్థం చెప్పుకోదగింది. మహాకోటేశ్వర ఆలయంలో రెండు పుణ్య స్నానాలు ఆచరించే తీర్థాలున్నాయి. వానల కొరత కారణంగా తాలూకాలోని చెరువులు, బావులు ఎండినా బాదామి బనశంకరిలోని రెండు పుష్కరిణిల్లో నీరు అందుబాటులో ఉన్నాయి. ఆరో శతాబ్దంలో చాళుక్య దొరలు మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయం పరిధిలో రెండు పుణ్య స్నానాలు ఆచరించడానికి పుష్కరిణిలను ఏర్పాటు చేశారు. విష్ణు పుష్కరిణిలో భూగర్భ జలం నిరంతరం ఊరుతుంది. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ పుష్కరిణిలో ఉత్తర దిక్కున చతుర్మఖ బ్రహ్మ దేవాలయం, వాయువ్య దిక్కున ఈశ్వరుడి విగ్రహాలను ఈత కొడుతూ వెళ్లి దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. చిన్న పుష్కరిణిని కాశీ హొండ అంటారు. చిన్న పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అనంతరం విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. చిన్న పుష్కరిణి కాశీ హొండలో ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పున నీరు పైకి ఎగజిమ్ముతాయి. ఆ నీటిని రైతులు కాలువ ద్వారా వినియోగించుకొని చెరుకు, అరటి, కొబ్బరి, వక్క, మామిడి, నిమ్మ, వేరుశనగ, ఇతర పంటలను పండిస్తారు. ఎల్లప్పుడూ ఊరుతున్న జలం నీరు ఎండిన దాఖలాలు లేవు -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ విజేత
హుబ్లీ: నగరంలోని అక్షయ కాలనీ నివాసి డాక్టర్ ఇషికాసింగ్ తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో 206వ ర్యాంక్ సాధించడం ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టారు. రాజనగర కేంద్రీయ విద్యాలయంలో ఎస్ఎస్ఎల్సీ, గ్లోబల్ పీయూ సైన్స్ కళాశాలలో చదివిన ఇషికా 2023లో కేఎంసీ ఆస్పత్రిలో డిస్టింక్షన్‌తో ఎంబీబీఎస్ ఉత్తీర్ణురాలయ్యారు. ఇక యూపీఎస్సీ పరీక్ష కోసం ఏడాది పాటు మాత్రమే ఆన్లైన్లో సదరు పరీక్షకు శిక్షణ తీసుకున్నారు. దీంతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. ఈమె తండ్రి రాజేష్‌సింగ్ వ్యాపారవేత్త కాగా తల్లి కిరణ్‌సింగ్ హిందీ లెక్చరర్. ఈ సందర్భంగా పీయూఎస్సీ విజేత డాక్టర్ ఇషికాసింగ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, సోదరుడు రిషిత్ సింగ్ ఆశయం, ప్రోత్సాహం వల్ల తాను ఈ స్థాయికి చేరానన్నారు. తాను ఐఎఫ్ఎస్ లేదా ఐఏఎస్ కావాలని కల కన్నానన్నారు. ఈ రెండింటిలో ఏది వచ్చినా తనకు సంతోషమేనన్నారు. యూపీఎస్సీ సాధనకు నిరంతర అధ్యయనం అవసరం అన్నారు. కోచింగ్ ఉన్నా మన అధ్యయనంపై సదా జాగరూకతతో ఉండాలన్నారు. ప్రశ్న పత్రికల అవలోకనం, ఎప్పటికప్పుడు పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అన్నది అలవరుచుకోవాలన్నారు. దీంతో మనలోని దౌర్భల్యాలు తెలుస్తాయి. సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు. యూపీఎస్సీ ఆశావహులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. హుబ్లీ డాక్టర్‌ను వరించిన 206వ ర్యాంక్ -
అభివృద్ధి పనుల పరిశీలన
రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నగరసభ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నేత రవి బోసురాజు పరిశీలించారు. శనివారం కేఈబీ కాలనీలో నగరసభ సభ్యులు జయన్న, రమేష్, దరూరు బసవరాజ్, శ్రీనివాసరెడ్డి పర్యటించి జరుగుతున్న పనులను తిలకించారు. త్వరితగతిన పనులు ముగించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అదే విధంగా 9, 10, 11వ వార్డుల్లో పర్యటించి అధ్వానంగా మారిన మురుగు కాలువలు, రహదారులను పరిశీలించారు. గుండెపోటుతో పురసభ అధికారి మృతి సాక్షి,బళ్లారి: లంచం తీసుకుంటూ పట్టుబడిన పురసభ ముఖ్యాధికారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా పురసభ ముఖ్యాధికారి తిమ్మరాజు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఈనెల 20న లంచం తీసుకుంటున్న కేసులో అరెస్ట్ అయ్యారు. బీ ఖాతా చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటుండటంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న తిమ్మరాజు గుండెపోటుతో మరణించారు. ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి ●● ఇద్దరి పరిస్థితి విషమం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని బణవికల్లు గ్రామ సమీపంలోని 50వ నంబరు జాతీయ రహదారిపై రాళ్లతో నిండిన ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఖాదర్ బాషా(32)గా గుర్తించారు. కొప్పళ జిల్లాలోని హర్లాపుర గ్రామం నుంచి దావణగెరె జిల్లాలోని డొణేహళ్లి గ్రామానికి రాతి స్తంభాలను ట్రాక్టర్ తీసుకెళ్తోంది. ఈ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీలో బండలపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై రాళ్లు పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో హైవే సహాయ బృందం, టోల్ సిబ్బంది, కానాహొసహళ్లి పీఎస్ఐ సిద్రామ క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కానాహొసహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాటికాపరుల నిరసన రాయచూరు రూరల్: శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాటికాపరుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం రాయచూరు తాలూకా శాఖవాది గ్రామపంచాయతి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు పంచాయితీల నుంచి పరికరాలు, దుస్తులు, షూ, సాక్సులు, చేతులకు గ్లౌజ్‌లు, ఇతర పరికరాలను అందించకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. త్వరితగతిన కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రతి కోర్ ఇంజినీర్‌కు ఉద్యోగావకాశాలు హొసపేటె: ప్రతి కోర్ ఇంజినీర్ కోసం 30 ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ విద్యార్థులు తమ ఇంజినీరింగ్ విద్య ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలని ధార్వాడ గ్లోబల్ ఇన్ఫోటెక్ టెక్నికల్ డైరెక్టర్ అనిల్ ఘాస్టే అభిప్రాయపడ్డారు. శుక్రవారం హొసపేటె ప్రౌఢదేవరాయ సాంకేతిక విద్యా కళాశాలలో మెకానికల్ విభాగం ద్వారా ఐక్యూఏసీ సహకారంతో కళాశాల అబ్దుల్ కలాం సెమినార్ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఆటో డెస్క్ ప్యూజన్–360పై వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం సాఫ్ట్వేర్లు మీరు నేర్చుకుంటే వారు నిజమైన ఇంజినీరు కాదు, ఇంజినీరింగ్ ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో కోర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ఐదు రెట్ల డిమాండ్ ఉందన్నారు. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం) పరిశ్రమలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ నిపుణుల కోసం ఒకటిన్నర లక్షల ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రోహిత్, ఉపన్యాసకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి కాంగ్రెస్, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి సంతాప ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ వసంత కుమార్, రవి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్ సంచాలకులు మునిరెడ్డి మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. తీన్ కందిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీనివాసరెడ్డి, శాలం, రజాక్ ఉస్తాద్, బసవరాజ్ పాటిల్ ఇటగి, రాజశేఖర్ రామస్వామి, ప్రేమలతలున్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలి హొసపేటె: ఉగ్రదాడిని ఖండిస్తూ పునీత్‌కుమార్ సర్కిల్లో సీపీఐ(ఎం) తాలూకా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్.యల్లాలింగ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల నిర్మూలనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్) పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంకుచితంగా ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కశ్మీర్‌లోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలన్నారు. పర్యాటకుల కుటుంబాలు చెప్పినట్లుగా అక్కడి ముస్లిం సమాజం రక్షణ కోసం నిలుస్తోందన్నారు. ఈ విషయంలో మత ఘర్షణలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన భార్య, పిల్లల ముందే తనను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించరాదన్నారు. కానీ దేశంలోకి చొరబాట్ల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సమాచారం ఉందా? అక్కడ రక్షణ దళ అధికారులను ఎందుకు మోహరించలేదు? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలు ఏ.కరుణానిధి, జంబయ్య నాయక్, బిసాటి మహేష్, యల్లమ్మ, సిద్దలింగప్ప, ఉమామహేశ్వర, ఈడిగర మంజునాథ, వి.స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా నివారణపై జాగృతి జాతా
హొసపేటె: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవంపై జాగృతి జాతాను నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా ఆర్సీహెచ్ఓ అధికారి డాక్టర్ జంబయ్య నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. దోమ కాటుకు వ్యతిరేకంగా నివారణ చర్యలుగా దోమతెరలు, వేప పొగను ఉపయోగించాలని సూచించారు. దోమల బెడదను అరికట్టి మలేరియా వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని కోరారు. అదే విధంగా నీరు నిల్వ చేయకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ర్యాలీని ఆస్పత్రి ఆవరణ నుంచి ప్రారంభించి ప్రముఖ వీధుల గుండా బయలుదేరి అంబేడ్కర్ సర్కిల్ వరకు చేపట్టారు. జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఎం.దొడ్డమని, వైద్యులు సతీష్, బసవరాజ్, జిల్లా ఆరోగ్య ఇన్స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మలేరియాను పారదోలదాం రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ నోడల్ అధికారిణి సంధ్య పిలుపునిచ్చారు. ఆమె రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి అవగాహన పెంచుకుని దాని నియంత్రణకు ముందుకు రావాలన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు
బళ్లారిటౌన్: ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఎస్‌యూసీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.సోమశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ 78వ సంస్థాపన దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతదేశం కూడా పలు సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. కమ్యూనిస్ట్‌లు, మార్కిస్ట్‌లు ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను తమ జీవితంలో అలవరుచుకోవాలన్నారు. ఈ సిద్ధాంతాన్ని కామ్రేడ్ శివదాస్ ఘోష్ ప్రతిపాదించేవారని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా మతతత్వ పెట్టుబడిదారుల నియమాలను పాటిస్తోందన్నారు. కార్మికులు, రైతుల హక్కులపై దాడులు చేస్తోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుబడిదారుల పరంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నియమాలను పాటిస్తూ ధరల పెంపుతో పేదలు, సామాన్య వర్గాల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, జిల్లా సమితి సభ్యులు మంజుల, ఏ.దేవదాసు, సోమశేఖర్‌గౌడ, ప్రమోద్, శాంత, గోవింద, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వంచన, బెట్టింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
కోలారు : వేర్వేరు కేసుల్లో నాగేంద్ర ప్రసాద్, సయ్యద్ సాధిక్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోలారుకు చెందిన నాగేంద్ర ప్రసాద్ ఇదే నగరంలోని కారంజికట్టకు చెందిన వెంకటాచలపతిని సంప్రదించి తక్కువ ధరకు ఇంటి నివేశసం ఇప్పిస్తానని నమ్మ బలికి రూ. 50 లక్షలు తీసుకున్నాడు. స్థలం ఇప్పించకపోవడంతో నగదు వెనక్కు ఇవ్వాలని వెంకటాచలపతి డిమాండ్ చేశాడు. దీంతో నాగేంద్ర ప్రసాద్ తాళం వేసిన పాత ట్రంకు పెట్టెను ఇచ్చి అందులో డబ్బు, బంగారం ఉందని నమ్మించాడు. దానిని తెరిస్తే ఈడి, లోకాయుక్త దాడులు చేస్తారని భయ పెట్టాడు. అయితే ఇదంతా మోసం అని తెలుసుకున్న వెంకటాచలపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగేంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్దారుడి పట్టివేత ముళబాగిలు పట్టణంలోని నూగల బండ నివాసి సయ్యద్ సాదిక్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా ముళబాగిలు సీఈఎన్ పోలీసులు దాడి చేశారు. అతని వద్దనుంచి రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలో ఉన్న 32 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కన్నడలో మాట్లాడమన్నందుకు ప్రయాణికునిపై దాడి
సాక్షి,బళ్లారి: ఇటీవల కర్ణాటకలో పలు జిల్లాల్లో కన్నడలో మాట్లాడమన్నందుకు దాడులు జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెళగావి జిల్లాలో బస్సు కండక్టర్‌పై మరాఠీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మైసూరు నుంచి బయలుదేరిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో యలహంక సమీపంలో టికెట్ కలెక్టర్ ప్రయాణికుని వద్దకు వచ్చి టికెట్ అడిగారు. మహమ్మద్ బాషా అనే ప్రయాణికుడిని హిందీ, ఇంగ్లిష్‌లో టికెట్ అడిగినందుకు కన్నడలో మాట్లాడాలని సూచించడంతో మాటామాటా పెరిగింది. టికెట్ కలెక్టర్‌కు కోపం రావడంతో ప్రయాణికుడిపై దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కొప్పళలో ఆందోళన చేసి కర్ణాటకలో కన్నడలో మాట్లాడమని చెప్పడం తప్పా? అని ఆందోళనకారులు ప్రశ్నించారు. సైకిల్ ఇవ్వనందుకు చిన్నారి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: ప్రతి రోజు కలిసి ఆడుకుంటూ ఆనందంగా గడిపే ఇద్దరు చిన్నారుల్లో ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు పోలీసు స్టేషన్ పరిధిలో గోపాల్, రుద్రమ్మ దంపతుల కుమార్తె స్పందన (11) తన స్నేహితురాలు ఆడుకునేందుకు సైకిల్ ఇవ్వలేదని మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి పట్టణంలోని అక్కివీధి నివాసి బాహుబలి వసుపాల ఉపాధ్యే (59) అనే వ్యక్తి పనికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఘటనపై బంధువులు కలఘటిగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. నిందితుల అరెస్ట్‌కు డిమాండ్ రాయచూరు రూరల్: వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘం నాయకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గవిగట్టలోని తన భార్యను పిలుచుకు రావడానికి సిరవార తాలూకా హొక్రాణి నుంచి గత నెల 13న వెళ్లిన గూళప్ప అనే వ్యక్తిని భార్య తరపు బంధువులు చితక బాదడంతో అక్కడికక్కడే మరణించాడన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు. తాగునీటి సరఫరా కోసం ధర్నా హుబ్లీ: ఽదార్వాడ నగరంలోని వార్డుల్లో సజావుగా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు ధార్వాడలో ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం, హెస్కాం, ఎల్ఎన్టీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్ శివు హిరేమఠ మాట్లాడుతూ ఇంతకు ముందు నీటిని రెండు రోజులకు ఓ మారు వదిలేవారు. ఇప్పుడేమో 7, 8 రోజులు గడిచినా తాగునీరు సరఫరా కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా నీటిని సరఫరా చేయలేదు. సవదత్తి జాక్వెల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అందుకే నీటి సరఫరా సక్రమంగా కావడం లేదని ఎన్ఎన్టీ కంపెనీ వారు సాకులను చూపుతున్నారని అన్నారు. కొన్ని వార్డుల్లో 24 గంటలు నీటి సరఫరా వసతి ఉన్నా సజావుగా నీరు రావడం లేదు. అధికారులు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. తక్షణమే నీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్‌లాడ్ వినతిపత్రాన్ని స్వీకరించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని వార్డుల్లో సజావుగా నీటి సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు సురేష్ బేదర, శంకర సేళకే, జ్యోతి పాటిల్, లక్ష్మీ హిండసగేరి, సీబీ కోటబాగి, నీలవ్వ అరవళద తదితరులు పాల్గొన్నారు. -
అలరిస్తున్న పెయింటింగ్స్ ప్రదర్శన
బనశంకరి: మలెనాడుకు చెందిన వర్ధమాన కళాకారుడు కోటెగద్దె రవి గీసిన పెయింటింగ్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. బనశంకరి రెండోస్టేజ్ పెడలిటస్ ఆర్ట్ గ్యాలరీలో స్పిరిచువల్ జర్నీ ఆఫ్ ఇండియా పేరుతో విభిన్న రకాల పెయింటింగ్స్ ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తోంది. ఆధ్యాత్మికతను ఇతివృత్తంగా చేసుకుని కళాకారుడు కోటెగద్దె రవి తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పతంజలి మహర్షి, మధ్వాచార్యులు, రామానుజాచార్య, బసవణ్ణ, అక్కమహాదేవి, అల్లమప్రభు, ధన్వంతరి తదితరుల పెయింటింగ్స్ ను ఎంతో అద్భుతంగా గీశారు. అంతేగాక సెమి అబ్స్ట్రాట్ స్టైల్ పెయింటింగ్‌ను నవ్యంగా గీశారు. భారతదేశంలో ఆధ్యాత్మికత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తుల పెయింటింగ్స్ ను తనదైన శైలిలో రూపకల్పన చేశారు. -
కావేరి హారతికి రూ.92 కోట్లు
మండ్య : దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన కావేరి హారతికి సుమారు రూ.92 కోట్లను ప్రత్యేక పథకంలో మంజూరు చేశామని, దీనికి మంత్రి మండలిలో ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకున్నామని, త్వరలో ప్రత్యేక సమితిని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ అన్నారు. మండ్యలోని కేఆర్ఎస్కు వచ్చి జలాశయం వద్ద నడుస్తూ పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశం, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరి హారతి కర్ణాటక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రజలు కూడా వచ్చి కావేరి పూజలో పాల్గొనవచ్చన్నారు. కావేరి హారతిని ఒకేసారి సుమారు 10 వేల మంది పాల్గొని చూసే ఆవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని రోజులు హారతి ఇవ్వాలి అనేది రాబోయే రోజుల్లో బెంగళూరులో అధికారులతో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. కావేరి హారతి కార్యక్రమానికి వచ్చె ప్రజలు కార్యక్రమం మొత్తం ముగిసే వరకు ఉండి అనంతరం వారు వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం రెవిన్యూ, దేవదాయ, పర్యాటక, నీటిపారుదల, బెస్కాంతో పాటు ఇతర అనేక శాఖల అధికారులతో కూడిన సమితిని ఏర్పాటు చేసి మరో రెండు మూడు రోజుల్లో నమూనా మొత్తం సిద్ధం చేస్తామన్నారు. కేఆర్ఎస్, బృందావనం అభివృద్ధి కోసం ఇప్పటికే టెండర్ పిలిచామన్నారు. కేఆర్ఎస్ పరిధిలోని సుమారు 4 పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తామన్నారు. డీసీఎం డీ.కే.శివకుమార్ -
వారేమైనా అంత నిజాయితీపరులా?
మైసూరు: బీజేపీ నాయకులపై ఎందుకు ఈడీ అధికారులు దాడి చేయడం లేదు, వారేమైనా అంత నిజాయితీపరులా? అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈడీపై మండిపడ్డారు. శుక్రవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర బెట్టలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైన, ఎమ్మెల్యేల పైన దాడి చేస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై కేంద్రం ఒత్తిడి మేరకే దాడి జరిగిందని ఆరోపించారు. నా అధికారం మరింత పదిలం చామరాజనగర జిల్లాకు ముఖ్యమంత్రిగా వస్తే అధికారం కోల్పోతారనే పుకార్లు, అనేక మూఢనమ్మకాలు కూడా ఉన్నాయన్నారు. కాని తాను చామరాజనగరకు వచ్చిన ప్రతిసారి తన అధికారం మరింత బలపడుతోందని అన్నారు. సీఎం అయిన తర్వాత 20 సార్లకు పైగా చామరాజనగరకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. అయినా తన అధికారం మరింత పదిలమైంది తప్ప ఇబ్బందులు కలుగలేదన్నారు. తాను రెండోసారి ముఖ్యమంత్రిని కూడా అయ్యానన్నారు. మలెమహాదేశ్వరునికి వెండిరథ సేవ, పూజ చేశానన్నారు. గురువారం రాత్రి ఇక్కడ బస చేసి శుక్రవారం తెల్లవారు జామున మలెమహదేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత స్వామి వెండిరథ పూజలో పాల్గొన్నానన్నారు. ప్రజలు తనకు కానుకగా ఇచ్చిన వెండిని వెండి రథ సేవకు సమర్పించానన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపాటు మలెమహదేశ్వరునికి సీఎం వెండిరథ సేవ చిన్నారికి నామకరణం చేసిన ముఖ్యమంత్రి -
ప్రతిరోజు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి
బెంగళూరు దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు సుమారు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో మళ్లీ నగరంలో వాహనాల సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే నత్తనడక సంచార రద్దీ కలిగిన నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. నగరవాసులు తమ ప్రయాణ సమయంలో సగానికి పైగా సమయం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో వాహనాల రద్దీలో కోల్పోతున్నారు. దీంతో పాటు నగరవాసులు ఏడాదికి 260 గంటలు రోడ్లలోనే గడిపే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు ఢిల్లీలో లభించే వేలాది వాహనాలు బెంగళూరు రోడ్లపైకి వస్తే ఇక్కడ పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది. -
విహారయాత్రలో విషాదం
● ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతి ● ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం యశవంతపుర: విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు తమిళనాడుకు చెందిన మెడికల్ విద్యార్థులు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద మెడికల్ విద్యార్థులు కాంజిమోళి, సింధుజా మృతి చెందారు. విద్యార్థులను రక్షించటానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. జోరుగా అలలు రావటంతో రక్షించటానికి సాధ్యం కాలేదు. మృతులు తమిళనాడులోని తిరుచ్చి మెడికల్ కాలేజీలో చివరి సంవత్సరం మెడిసిన్ చదువుతున్నట్లు తెలిసింది. అనంతరం తీర రక్షణ దళం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. గోకర్ణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. సీసీబీ పోలీసుల కస్టడీకి ఓంప్రకాష్ సతీమణి బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకేసులో కటకటాల పాలైన ఆయన సతీమణి పల్లవిని సీసీబీ పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పల్లవిని మే 3 తేదీవరకు కస్టడీకి ఇవ్వాలని ఓంప్రకాష్ హత్యకేసు దర్యాప్తు చేపడుతున్న సీసీబీ ఏసీపీ దర్మేంద్ర నేతృత్వంలోని బృందం బెంగళూరు 39 ఏసీఎంఎంకోర్టుకు విన్నవించింది. దీంతో పల్లవిని 7 రోజులు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఓంప్రకాష్ హత్యకేసులో ఏ2 ఆరోపిగా ఉన్న కుమార్తె కృతి మానసిక అస్వస్థతకు గురికావడంతో నిమ్హాన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఒకే నెలలో శ్రీకంఠేశ్వరునికి రూ.2.59 కోట్ల కానుకలు మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజనగూడులో వెలిసిన శ్రీకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలోని హుండీల్లో భక్తుల నుంచి వచ్చిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో స్వామివారికి నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీతో పాటు సుమారు రూ.2.59 కోట్లు కానుకలుగా వచ్చాయి. శ్రీకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దాసోహ భవనంలో ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి సీసీ టీవీ కెమెరాల పకడ్బందీ నిఘా మధ్య హుండీల్లోని కానుకలను లెక్కించారు. ఆలయ హుండీల్లో 2 కోట్ల 59 లక్షల 46 వేల 79 రూపాయల నగదు, 103 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండితో పాటు అరబ్ ఎమిరేట్స్ 15, యూరో 1, సౌదీ అరేబియా 1, మలేషియా 1, కెనడా డాలర్ 1, ఒమన్ 2, ఇంగ్లండ్ పౌండ్లు 2, అమెరికా డాలర్ 1తో కలిపి మొత్తం 24 కరెన్సీ నోట్లు స్వామివారికి కానుకగా లభించాయని ఆలయ ఈఓ జగదీష్ కుమార్ తెలిపారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఎవరు అడిగారు? ● స్మార్ట్‌మీటర్ల ధరకు సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు బనశంకరి: కొత్తగా నిర్మించిన ఇంటికి స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్ చేసిన బెస్కాం ఇచ్చిన లేఖపై స్టే ఇచ్చిన హైకోర్టు స్మార్ట్ మీటర్లు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై మండిపడింది. స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్ చేస్తూ దొడ్డబళ్లాపుర అసిస్టెంట్ ఇంజినీర్ జయలక్ష్మి ఇచ్చిన లేఖను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం లేఖపై స్టే ఇచ్చింది. అంతేగాక ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ హైకోర్టు ధర్మాసనం వీటన్నింటికీ ఉచిత గ్యారంటీలతో తలెత్తే సమస్యలపై ప్రశ్నించింది. ఉచితంగా విద్యుత్ కావాలని ఎవరు అడిగారు. పేదలకు ఒక్కసారిగా ఈవిధంగా ధర పెంచితే ఎక్కడికి వెళ్లాలి. అందరూ అధిక మొత్తంలో డబ్బులిచ్చి స్మార్ట్‌మీటర్లు అమర్చుకోవాలంటే పేదలు ఏం చేయాలంటూ ప్రశ్నించింది. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, బెస్కాం తరఫున న్యాయవాదికి నోటీస్ జారీ చేసి విచారణ జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. -
మధుమేహంపై అవగాహన కల్గిస్తాం
రాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన కల్గింపనున్నట్లు రిసెర్చి సొసైటీ స్టడీ ఆఫ్ డయాబిటీస్ ఆఫ్ ఇండియా కర్ణాటక(ఆర్ఎస్ఎస్డీఐ) చాప్టర్ అధ్చక్షుడు డాక్టర్ బసవరాజ్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో జీవన విధానంలో, ఆహార పదార్థాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మధుమేహ వ్యాధి వ్యాపిస్తోందన్నారు. భవిష్యత్తులో 9, 10, 11, 12వ తరగతులు విద్యనభ్యశించే విద్యార్థులకు మధుమేహ వ్యాధిపై ముమ్మర ప్రచారం చేపడుతామన్నారు. ఈ విషయంలో శనివారం రిమ్స్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని రిమ్స్ డీన్ రమేష్, భారతీయ వైద్యకీయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చినివాలర్, హరి ప్రసాద్, నేహా, మంజునాథ్, సంజీవ్చెట్టి, మనోహర్, కార్తీక్ పాల్గొంటారన్నారు. మహాలింగ, రామకృష్ణ ఎస్ఎస్ రెడ్డి, నాగభూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణకు శిబిరాలు దోహదం
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు వేసవి శిబిరాలు దోహదపడతాయని హైదరాబాద్ కర్ణాటక ఆందోళన సమితి అధ్యక్షుడు రజాక్ ఉస్తాద్ పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రంగ కనసు చిణ్ణర చిలిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాలూకాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పెయింటింగ్, పాటలు పాడటం, కథలు చెప్పడం, చిత్రలేఖనం, సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహనకు క్రమశిక్షణ సోపానమన్నారు. నేటి సమాజానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యం రాయచూరు రూరల్: నేటి సమాజంలో సాహిత్యానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యమని ఎంపీ ప్రకాష్ కళాశాల అధికారి మల్లన గౌడ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ ప్రకాష్ కళాశాల ఆవరణలో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, సేవా ఎంపీ ప్రకాష్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కన్నడ సాహిత్యం కేవలం కన్నడ భాష, భూమి, జలం కోసం ప్రయత్నిస్తే విప్లవ సాహిత్యం మను ధర్మం, అన్యాయం, దౌర్జన్యం, అవినీతి, అసమానత, కుల మత తేడాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావాలను గురించి వివరించిందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు వెంకటేష్, రేఖ, శివ శంకర్, పరశురామ్, రాజశ్రీ, రూప, బసవరాజ్ మల్లికార్జున, అక్షయ్, ప్రాణేష్లున్నారు. కోటల సంరక్షణకు ప్రణాళిక రచించండి రాయచూరు రూరల్: నగరంలోని చారిత్రక కోటల సంరక్షణ, నవీకరణకు పథకం రూపొందించాలని జిల్లాధికారి నితీష్ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు సూచించారు. నగరంలోని మక్కా దర్వాజ, కాటే దర్వాజలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అవసానపు అంచున వున్న కోటలను అభివృద్ధి పరచడానికి తోడు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించాలన్నారు. కోట బయట, లోపల, పైభాగాల్లో పర్యటించి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు రాజేంద్ర, ఈరణ్ణ బిరాదార్, మహేష్లున్నారు. -
పొలంలో యువకుడి దారుణ హత్య
సాక్షి,బళ్లారి: పొలంలో పని చేస్తున్న ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా నరోణలో జరిగింది. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న చెన్నవీర(26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే నరోణ పోలీసులు హుటాహుటిన చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. కలబుర్గిలో కలకలం రేపిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిస్తోల్‌తో కాల్చుకుని యువకుడు బలవన్మరణం సాక్షి,బళ్లారి: తండ్రి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో తలకు కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం విజయపుర నగరంలో జరిగింది. అక్కడి శికారిఖానాలో నివాసం ఉంటున్న మాజీ కార్పొరేటర్ ప్రకాష్ మీర్జా కుమారుడు ఆశారాం మీర్జా(22) అనే యువకుడు తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీని తీసుకుని బెడ్రూంలో తలలోని కణతకు కాల్చుకుని కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. తుపాకీతో యువకుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలియగానే డీఎస్పీ, సీఐ, ఎస్ఐ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి హుబ్లీ: హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి గ్రామంలో ఓ మహిళ శవంగా లభ్యమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని కుందగోళకు చెందిన పుష్పా బిళేబాల(30)ను మృతురాలిగా గుర్తించారు. మహిళ భర్త రామజ్జ గురువారం కుందగోళ నుంచి తాలూకాలోని జుండూర గ్రామానికి పెళ్లి కార్యం కోసం భార్యను తీసుకెళ్లి ఇంగళహళ్లిలో వదిలి వచ్చాడు. సాయంత్రం భారీగా వర్షం పడటంతో పిడుగు పడి మృతి చెంది ఉండవచ్చని ఆ మహిళ తండ్రి విరుపాక్షప్ప దయన్నవర హుబ్లీ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాగులో వృద్ధురాలి మృతదేహం కాగా మరో ఘటనలో ఓ వృద్ధురాలి శవం నగరంలోని నారాయణ చోప దగ్గర కర్కివాగులో లభించింది. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న ఈమె గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కర్కివాగు వరద ప్రవాహంలో శవం కొట్టుకొచ్చింది. ఈమె ఆచూకీ లభించలేదు. శవాన్ని కేఎంసీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొన్నట్లు కసబాపేట పోలీసులు తెలిపారు. డిపో మేనేజర్ వేధింపులతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం రాయచూరు రూరల్: ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులను భరించలేక ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి రాయచూరు జిల్లా లింగసూగూరు ఆర్టీసీ డిపోలో జరిగింది. వివరాలు.. లింగసూగూరు ఆర్టీసీ డిపోలో హైదరాబాద్ వెళ్లి వచ్చే బస్సుకు అబ్దుల్ శిరూరు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి కండీషన్ లేని పాత బస్‌ను అప్పగించి బలవంతంగా అదే డ్యూటీని వేసి అదే బస్సుకు వెళ్లాలని డిపో మేనేజర్ రాహుల్ హునసూరే సూచించాడు. పైగా కిలోమీటర్ పర్ లీటర్(కేఏంపీఎల్)ను తేవాలని ఒత్తిడి చేయడమేగాక నానా విధాలుగా వేధిస్తుండటంతో పాటు మానసికంగా బెదిరిస్తున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో మనస్తాపం చెందిన అబ్దుల్ శిరూరు డిపో మేనేజర్ ముందే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని సహోద్యోగులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. నరేగ పనులపై పర్యవేక్షణరాయచూరు రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న నరేగ పనులపై పర్యవేక్షణకు కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకంలో జరుగుతున్న పనులపై పరిశీలిస్తున్న నేపథ్యంలో జెడ్పీ ప్రణాళికాధికారి శరణ బసవ, శివశంకర్, అవనేంద్ర కుమార్ పీడీఓ, కార్యదర్శులపై మస్కి తాలూకా పామన కల్లూరు, చించిరమడిలో దాడులు చేశారు. కవితాళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
సాక్షి,బళ్లారి: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున నగరంలో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగరంలోని ముస్లిం మత పెద్దలు, గురువులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ఉగ్రవాదుల తీరుపై మండిపడ్డారు. హత్యలు చేయమని ఏ ధర్మం(మతం)లోను బోధించలేదన్నారు. అలాంటిది దేశంలో హింసను రేకెత్తిస్తున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించాలన్నారు. ప్రధాని, కేబినెట్ మంత్రులు ఈ విషయంలో తీసుకునే ఎలాంటి నిర్ణయానికై నా తామందరం కలిసికట్టుగా మద్దతు ఇస్తామన్నారు. దేశంలో శాంతిని కాపాడానికి, దేశంలో ఉగ్రవాదుల ఏరివేతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కశ్మీరులో జరిగిన హింస యావత్ ముస్లిం సమాజాన్ని కూడా కలిిచి వేసిందన్నారు. అమాయకులను దారుణంగా హత్య చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పార్టీలకు, మతాలకు అతీతంగా దారుణాలను ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. దాదాపు 30 మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని అన్నారు. మన భారతదేశం కొట్టే దెబ్బకు వారి గుండెల్లో వణుకు పుట్టాలన్నారు. దేశంలో, ప్రపంచంలోని ఉగ్రవాదులందరికి ఒక హెచ్చరిక చేయాలన్నారు. అనంతరం జిల్లాధికారి ద్వారా కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్‌ఖాన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం నేతలు పాల్గొన్నారు. పహల్గాం దాడిపై కాంగ్రెస్ నిరసన జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై విక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదుల హింసను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నగరంలోని గాంధీ విగ్రహం నుంచి రాయల్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపివేయాల్సిందేనని నేతలు సూచించారు. ఉగ్రవాదం ప్రమాదకరమైందని, అణిచివేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అమాయకులైన పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల నామరూపాల్లేకుండా చేయాలన్నారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆలస్యం చేయకుండా ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. కార్యక్రమంలో మేయర్ ముల్లంగి నందీశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కోనంకి రామప్ప, చానాళ్ వేఖర్తో పాటు కార్పొరేటర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆందోళన ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, మారణహోమాన్ని ఖండిస్తూ శుక్రవారం కలబుర్గిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భజరంగదళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లను నేలపై అతికించి నిరసన తెలియజేయడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో పాకిస్థాన్‌కు విరుద్ధంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. హిందువులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. ఉగ్రవాదం తుదముట్టించాలని, వారి మూలాలు వెతికి పట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లకు అతికించినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ ఆందోళనకారులు పాకిస్థాన్ జెండాలను నేలపై, స్టిక్కర్లను గోడలకు అతికించి నిరసన తెలుపుతామని ముందుగా తమకు తెలియజేయలేదన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో జనం రోడ్లపైకి వచ్చి మరింత నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని విచారణ చేసి విడిచి పెట్టారు. ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా శిక్షించండి హత్యలు చేయమని ఏ ధర్మమూ చెప్పదు కశ్మీరు ఘటనపై ముస్లిం నేతల డిమాండ్ -
కాలువలోకి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు దుర్మరణం
రాయచూరు రూరల్: కూలి పనులు ముగించుకొని వ్యవసాయ కూలీలు ఇంటికెళుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడ్డ ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయచూరు జిల్లాలో గురువారం సాయంత్రం మస్కి తాలూకా హాలాపూర్ వద్ద జరిగింది. ప్రతి రోజు ట్రాక్టర్లో 15–20 మంది దాకా వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి పనులు ముగిసిన తర్వాత అదే వాహనంలో తిరిగి వచ్చేవారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ అదుపు తప్పి తుంగభద్ర కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో అంబమ్మ(46) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆరుగురు కూలీలను చికిత్స కోసం కవితాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ నాయక్ తెలిపారు. ఆరుగురికి తీవ్ర గాయాలు మస్కి తాలూకాలో ఘటన -
ద్రాక్ష సాగు.. లాభాలు బాగు
సాక్షి,బళ్లారి: ఈసారి మామిడి తోటలు ఉన్న రైతులకు నష్టాలు వస్తుండటంతో పాటు కర్బూజా, పుచ్చకాయ, అరటి తదితర పండ్ల తోటలు సాగు చేసిన రైతులు కూడా పెట్టుబడులతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే ద్రాక్ష తోటలు సాగు చేసిన రైతులకు మార్కెట్లో ఽద్రాక్ష ధరలు పెరగడంతో పాటు నిలకడగా ఒకే రకమైన ధర కొనసాగుతుండడంతో గత మూడేళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ద్రాక్ష సాగు చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. ద్రాక్ష తోటల సాగుకు పెట్టిన పేరుగా నిలిచిన ఒక్క విజయపురలో దాదాపు ఒక లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసి రైతులు అక్కడ నుంచి దేశ, విదేశాలకు తాజా ద్రాక్షతో పాటు, ఎండు ద్రాక్షను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఉత్తర కర్ణాటక పరిధిలోని బెళగావిలో దాదాపు 35 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో ద్రాక్షను సాగు చేస్తుండగా, బళ్లారి, గదగ్, విజయనగర, కొప్పళ తదితర జిల్లాల్లో అక్కడక్కడ ద్రాక్ష సాగు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసిన రైతులు ఈసారి అధిక లాభాలు గడించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు రుచికరమైన, ఎంతో తియ్యనైన ద్రాక్షను పండించి మేలు చేస్తున్నారు. తాజా ద్రాక్షతో ఎండుద్రాక్ష తయారీ విజయపుర జిల్లాలో విస్తారంగా సాగు చేసిన ద్రాక్ష రైతులు తాజా పచ్చిద్రాక్షతో ఎండు ద్రాక్షను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తాజా పచ్చి ద్రాక్ష ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.60ల నుంచి రూ.100ల వరకు పలుకుతుందంటే రైతుల వద్ద ద్రాక్ష పొలాల్లో రూ.40 నుంచి రూ.50లకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మంచి లాభాలు గడించేందుకు వీలవుతోందని చెప్పవచ్చు. మూడేళ్ల నుంచి ద్రాక్ష రైతులు పెట్టుబడులతోనే సరిపెట్టుకుని ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఈసారి అనూహ్య పరిణామాలతో ద్రాక్ష పంట సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో రైతులతో పాటు వారి వద్ద పని చేసే వ్యవసాయ కూలీలకు కూడా చేతినిండా పని దొరుకుతూ ఆనందంగా ఉంటున్నారు. ఒక్క రైతులే కాదు వ్యవసాయ కూలీలు, మార్కెట్లో వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ద్రాక్ష అమ్మకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. తాజా పచ్చి ద్రాక్షతో పాటు ఎండు ద్రాక్ష తయారు చేస్తూ ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎండు ద్రాక్ష తయారు చేయడంలో కూడా విజయపుర జిల్లాకే అగ్రస్థానం దక్కింది. ఎండుద్రాక్షతో లాభాలు మెండు ఇక్కడ దాదాపు లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తుండగా, అందులో దాదాపు 80 శాతం ద్రాక్షను ఎండు ద్రాక్షగా మారుస్తున్నారు. తాజా పచ్చి ద్రాక్ష వల్ల ఒక కేజీకి రైతులకు రూ.50లు ధర లభిస్తుండగా, ఎండు ద్రాక్ష వల్ల మరింత లాభాలు అందుతున్నాయి. ఎండు ద్రాక్ష తయారీకి యంత్రాలు, అది కూడా ఒక రకమైన పరిశ్రమగా మార్చుకుని రైతులు రెండు విధాలుగా లాభాలు గడిస్తున్నారు. దాదాపు నాలుగు కేజీల తాజా పచ్చి ద్రాక్షను ప్రాసెసింగ్ చేసి, ఎండబెట్టి రుచికరమైన ఎండు ద్రాక్షిని తయారు చేస్తున్నారు. విజయపుర జిల్లాతో పాటు కర్ణాటకలో బెళగావి, బాగల్కోటె జిల్లాల్లో ఎండుద్రాక్షిని తయారీ చేస్తున్నారు. ఇక్కడ ఎండు ద్రాక్షతో పాటు వైన్ తయారీకి ఉపయోగించే రుచికరమైన ద్రాక్షను పండిస్తుండటంతో వైన్ తయారు చేసే కంపెనీలు ద్రాక్ష రైతులతో కొనుగోలు చేస్తున్నారు. వైన్ తయారీకి తాజా నల్లద్రాక్షకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి అన్ని రకాల వైరెటీ ద్రాక్షలకు మంచి ధరే పలుకుతుందని, దీంతో వైన్ తయారీ చేసేందుకు ఉపయోగించే ద్రాక్షకు కూడా మరింత గిరాకీ లభిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పెట్టుబడులు పోను ఒక ఎకరాకు దాదాపు రూ.2లక్షలకు పైగా ఆదాయం లభిస్తోందన్నారు. అధిక లాభాలు గడిస్తున్న విజయపుర రైతులు మూడేళ్ల తర్వాత మంచి లాభాలపై ఆనందం రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరిపిన వైనం -
పగిలిన పైపులు.. నీటికి తిప్పలు
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పాలకులు చెబుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అధికారులు మౌనం వహిసున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. అయినా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధిక మైంది. నగరసభ తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గురువారం తాలూకాలోని వడ్లూరు పారిశ్రామిక కేంద్రం వద్ద నీటి పైపులు పగిలి 20 అడుగుల మేర నీరు ఎగసి పడి వృథా అయ్యాయి. ప్రజలు మాత్రం నీటిని ట్యాంకర్ల ద్వారా పొందాల్సి వస్తోంది. గత రెండు రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనుల చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా నగరసభ అధికారులు తగిన చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వారం రోజులుగా సరఫరా కాని తాగునీరు వడ్లూరు వద్ద పగిలిన నీటి పైపు లైన్ మరో రెండు రోజులు నీటి సరఫరా లేదు -
అశ్రుతర్పణం
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025శివమొగ్గ/ శివాజీనగర: జమ్ముకశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు. శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్ సమీపం నుంచి బైక్ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివదేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు బైక్ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు. కశ్మీర్లో బలైన ఇద్దరు కన్నడిగుల మృతదేహాల తరలింపు బెంగళూరు, శివమొగ్గలో శోకసంద్రం గవర్నర్, సీఎం సహా ప్రముఖుల నివాళులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పాక్ ముష్కరుల అకృత్యంపై జనాగ్రహం -
అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్టలో గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దృష్ట్యా బెంగళూరు కేంద్రిత పాలనకు బదులుగా కర్ణాటక అంతటా పాలనా వికేంద్రీకరణ మోడల్‌ను అలవరచుకోవాలని ఉద్దేశించారు. అందువల్లే కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవం రోజున కలబురగిలో కేబినెట్ భేటీ నిర్వహించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ దఫా మైసూరు ప్రగతి సాధన దిశగా మలెమహదేశ్వర బెట్టలో కేబినెట్ భేటీ నిర్వహించి 82కు పైగా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మొదట జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించినవారి గౌరవార్థం సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత చర్చ ఆరంభమైంది. చిన్న నీటిపారుదల, జలవనరుల శాఖల ద్వారా 29 పనులను రూ.1,787 కోట్ల వ్యయంతో చేపట్టాలని తీర్మానించారు. దీంతో మైసూరు రెవెన్యూ విభాగంలోని జిల్లాల్లో జలాశయాలు, చెరువులు, కాలువల అభివృద్ధితో ఈ ప్రాంతంలో నీటిపారుదల కార్యకలాపాలను సమగ్రంగా చేపట్టేందుకు వీలవుతుంది. పరోక్షంగా మనిషి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు రూ.210.2 కోట్లను కేటాయించారు. ఈ ప్రాంత నగరాల్లో ప్రజలకు మంచినీటి పథకాల కోసం నగరాభివృద్ధి శాఖ నుంచి రూ.315 కోట్ల నిధులతో రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తీర్మానించారు. మైసూరు, చామరాజనగర జిల్లాల ప్రజల ఆరోగ్య రక్షణకు రూ.228 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.300 కోట్లను కేటాయించాలని తీర్మానించారు. చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకా చిక్కకల్లూరులో మంటెస్వామి, రాచప్పాజి, సిద్దప్పాజి క్షేత్రాల అభివృద్ధి ప్రాధికార ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మైసూరు ఎయిర్‌పోర్టు అప్‌గ్రేడ్ మైసూరులోని ఇలవాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాంగణం నిర్మాణం, రన్‌వే విస్తరణతో పాటు మైసూరు విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించారు. ఈ జిల్లాల్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలతో సహా మౌలిక సౌకర్యాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలను సత్వరం కార్యరూపానికి తెస్తామని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీతో పుణ్యక్షేత్రంలో అధికారుల హడావుడి నెలకొంది. ఆ దిశగా వివిధ జిల్లాల్లో కేబినెట్ భేటీలు మలె మహదేశ్వర బెట్టలో మంత్రివర్గ సమావేశం ఆ ప్రాంత ప్రగతికి పలు నిర్ణయాలు -
భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం
కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్ భూషణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్ భూషణ్ ఇంటికి ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కశ్మీర్ టూర్ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పార్టీల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు. -
రాజ్‌కుమార్ జయంతి వేడుకలు
యశవంతపుర: కన్నడ వర నట, కంఠీరవ రాజ్‌కుమార్ 96వ జయంతి వేడుకలు బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. నగరంలోని కంఠీరవ స్టూడియోలో ఆయన సమాధికి తనయుడు శివరాజ్‌కుమార్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన కన్నుమూసి 19 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అభిమానులు నివాళులు అర్పించారు. పలు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. రంఠీరవకు నివాళులు తుమకూరు: తుమకూరు నగరంలోని ఎస్ఎస్పురం మెయిన్ రోడ్డులో ఉన్న మయూర వేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్.రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. -
విలక్షణ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్
బళ్లారి టౌన్: తన అసాధారణ నటనతో విలక్షణ నటుడుగా డాక్టర్ రాజ్‌కుమార్ గుర్తింపు పొందారని అతిథులు పేర్కొన్నారు. గురువారం రాజ్‌కుమార్ ఉద్యానవనంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్ ప్రారంభించి రాజ్‌కుమార్ శిలావిగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. జాతీయ స్థాయిలో కన్నడ నాడుపై భాషాభిమానం పెంపొందించారన్నారు. తనదైన శైలి నటనతో మంచి చిత్రాల్లో నటించి అపార సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిరిగేరి పన్నారాజు మాట్లాడుతూ రాజ్‌కుమార్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు. ఏసీ పీ.ప్రమోద్, సమాచార శాఖ అసిస్టెంట్ వీసీ గురురాజ్, వీవీ సంఘం నేతలు బీ.బసవరాజు, కే.ఎర్రిస్వామి, పీ.గాదెప్ప, చంద్రశేఖర్ ఆచార్య, రసూల్ సాబ్, వివిధ కన్నడ పర సంఘాల పదాధికారులు, అభిమానులు పాల్గొన్నారు. రాజ్‌కుమార్ జీవితం ఆదర్శప్రాయం హొసపేటె: నేల, నీరు, కన్నడ భాషాభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన కన్నడ ప్రసిద్ధ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జీవితశైలి ఆదర్శప్రాయమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ 97వ జయంతిలో ఆయన పాల్గొని డాక్టర్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఉత్తమ వ్యక్తిత్వం, వినయానికి ఆదర్శవంతమైన వ్యక్తి రాజ్‌కుమార్ అని అన్నారు. ఆయన కర్ణాటక కళాకారుల సంఘాన్ని స్థాపించి కళాకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించారన్నారు. తన అభిమానులను దేవుళ్లుగా పిలిచారన్నారు. ఆయన సినిమాలన్ని సామాజిక పరివర్తనకు దోహదపడేవేనన్నారు. వారి జీవనశైలి, సరళత, వినయం నేటి యువత అలవర్చుకోవాలన్నారు. జిల్లాధికారి కార్యాలయ అధికారులు స్నేహలత, ప్రియదర్శిని, సిబ్బంది శరణప్ప హళ్లికేరి, సమాచార శాఖ సిబ్బంది, రామాంజినేయులు, అశోక ఉప్పార్, కృష్ణ స్వామి, తాయేష్, కిషోర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో... రాయచూరు రూరల్: కన్నడ మేరు నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జయంతిని ఘనంగా ఆచరించారు. గురువారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన జయంతిని తహసీల్దార్ సురేష్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష, నేల, నీటి కోసం సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహా నటుడని కొనియాడారు. కార్యక్రమంలో వార్త సమాచార శాఖాధికారి గవిసిద్దప్ప, లింగరాజ్, దండెప్ప బిరాదార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమంలో అతిథులు -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. లారీ ఢీకొని రోడ్డు దాటుతున్న యువకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా నరేంద్ర క్రాస్ వద్ద చోటు చేసుకుంది. మృతుడిని నవలగుందకు చెందిన బసవరాజ మహదేవప్ప పల్లెద(19) అనే యువకుడిగా గుర్తించారు. బసవరాజ్ రోడ్డు దాటుతున్న వేళ లారీ ఢీకొన్నట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే మరో ఘటనలో ఆటోను గూడ్స్ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా తళవాయి, కనకూరల మధ్య రోడ్డులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడిని హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామానికి చెందిన ప్రకాష్ భీమప్ప వాలికార్ (23)గా గుర్తించారు. ఆటో రిక్షాలో యల్లమ్మనగుడ్డ సన్నిధికి వెళ్లి తిరిగి వస్తుండగా మినీ గూడ్స్ లారీ ఆటోను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. అలాగే ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. వీరిని ధార్వాడ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు హుబ్లీ: ఽదార్వాడ శ్రీరామనగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ వ్యక్తికి వ్యతిరేకంగా పోక్సో కేసు నమోదైంది. మత్తు పదార్థాలను కొనుగోలు చేసి విక్రయిస్తున్న కడేదప్ప శృంగేరి(52) అనే వ్యక్తి పదేళ్ల బాలికను మాయమాటలతో మభ్య పెట్టి గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాధికారిపై సస్పెన్షన్ వేటు హొసపేటె: హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ఖాజా మొహిద్దీన్ను ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ ప్రభులింగ కావలికట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు యజమానులకు తెలియకుండా కృత్రిమ పత్రాల సృష్టి, ఆస్తి అకౌంటింగ్, పురావస్తు శాఖ బావి స్థలాల సీల్ చేయడం, అండర్ రైట్ చేసిన అనేక ప్రభుత్వ ఆస్తులకు నకిలీ పత్రాలను సృష్టించడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని మోసం చేశారని తేలడంతో శాఖాపరమైన విచారణను రిజర్వ్ చేసి, తక్షణమే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా చంద్రశేఖరపుర గ్రామంలో మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం బుధవారం సాయంత్రం లభించింది. ఎవరో మహిళ కాన్పు సమయంలో మగబిడ్డ చనిపోయాడనే విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో శిశువు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కాలువలో ఒక శిశువు మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుడేకోటె పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలోని అఫ్జల్‌పుర తాలూకా కె.గబ్బూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. మృతులను కలబుర్గిలోని మిల్లత్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కలబుర్గి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని హైదర్ దర్గాకు బంధువులతో కలిసి టవేరా వాహనంలో బయలు దేరారు. గబ్బూరు వద్ద వాహనానికి అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయిషా(70), అజ్మీర్(30), జైనబ్(2)లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పంచనామా కోసం కలబుర్గిలోని జిమ్స్‌కు తరలించారు. దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల పంపిణీకి డిమాండ్రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ పథకం(పీఎంజీఎస్‌వై)లో ఇళ్లు పంపిణీ చేయాలని నమ్మ కర్ణాటక సేనె సంఘం జిల్లాధ్యక్షుడు కొండప్ప డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికారులు ఇష్టానుసారంగా ఉన్న వారికే ఇళ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. జీపీఎస్‌ను చేయడానికి అధికారులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు లంచాలు తీసుకుంటున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు అధిక శాతం కేటాయించారని ఆరోపించారు. -
ఐశ్వర్యగౌడకు ఈడీ షాక్
బనశంకరి: ఈడీ అధికారులు గురువారం బెంగళూరులో పలుచోట్ల ఆకస్మిక దాడులను జరిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోదరినంటూ పలు నగల షోరూంల నుంచి భారీగా బంగారు నగలు కొట్టేసిన కేసులో నిందితురాలు ఐశ్వర్యగౌడకు చెందిన బెంగళూరు, మండ్య నివాసాలపై ఈడీ అధికారులు దాడిచేశారు. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలోని ఇల్లు, బెంగళూరులోని ఇళ్లలో సోదాలు జరిపి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు షాపు యజమాని ఆడియో, వీడియోలతో సహా ఆమైపె ఈడీకి ఫిర్యాదులు చేశాడు. రూ.9.82 కోట్ల విలువచేసే 14 కిలోల 660 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వలేదని చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. వినయ్ కులకర్ణి జిల్లాలో ఓ జడ్పీ సభ్యుని హత్య కేసులో నిందితునిగా ఉన్నారు. ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో ఈడీ దాడి చేసినట్లు తెలిసింది. మండ్య, బెంగళూరు ఇళ్లలో సోదాలు -
ఆగని బాలింతల మరణాలు
హొసపేటె: ప్రభుత్వ ఎంసీహెచ్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా దశమాపుర గ్రామానికి చెందిన శాంత(20) అనే బాలింత మృతి చెందింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆదివారం ఆమెకు సిజేరియన్ జరిగింది. ఆమె ఆరోగ్యకరమైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే బాలింత ఆరోగ్యం క్షీణించడంతో మరణించింది. ఆమె ఆరోగ్యంపై తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆమె మరణించినట్లు మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని, కాన్పు చేసిన కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ సింధు షా, నర్సు ఎస్జే రఘునాథ్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుంచి తొలగించామని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి(డీహెచ్ఓ) డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ తెలిపారు. డాక్టర్ సింధు షా ఉజ్జయిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్టుగా ఉన్నారు. అసైన్మెంట్ మీద ఇక్కడికి వచ్చారని, సమగ్ర దర్యాపు తర్వాతే బాలింత మృతికి కారణం తెలుస్తుందన్నారు. బాలింతకు మరేదైనా అనారోగ్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా హొసపేటెలో చోటు చేసుకున్న వైనం -
95 మంది దొడ్డవాసులు క్షేమం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని పలు గ్రామాల నుంచి మొత్తం 95 మంది కశ్మీర్‌కు టూర్క వెళ్లిన వారు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరందరూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో టూరిస్ట్ స్థలాలు చూసి శ్రీనగర్‌కు బయలుదేరారు. అక్కడ వారంతా విడిది చేయబోయే హోటల్ ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. సకాలంలో పహల్గాంకి చేరుకుని ఉంటే మారణహోం సాగిన బైసరన్‌కు వెళ్లేవారు. అయితే కశ్మీర్‌కు వెళ్తుండగా దారిలో ఒకచోట కొండచరియలు విరిగి పడడంతో ప్లాన్ మారింది. జమ్ములోని వైష్ణోదేవి ఆలయ దర్శనం చేసుకుని కులు మనాలికి వెళ్లిపోయామని తెలిపారు. 180 మంది క్షేమంగా రాక దొడ్డబళ్లాపురం: కశ్మీర్లో చిక్కుకున్న 180 మంది కర్ణాటక వాసులు గురువారం ఉదయం ప్రత్యేక విమానాల ద్వారా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తమ తమ ఊర్లకు వెళ్లిపోయారు. ఉగ్రవాదులను అంతం చేయాలి: సీఎం మైసూరు: ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ మతానికి చెందినవారైనా, తుదముట్టించాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం చోటివ్వరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్టలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అప్పటినుంచి విశ్రమించకుండా ఉండాల్సిందన్నారు. ఇప్పుడు కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడిలో అమాయకులు బలైన ఘటనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటన అత్యంత అమానుషం, హేయం అన్నారు. మరోవైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం పలు చోట్ల కాగాడాల ప్రదర్శనలు జరిగాయి. -
అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తే జైలు
బళ్లారి రూరల్: స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష తప్పదని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప వెల్లడించారు. గురువారం డీసీ కార్యాలయ ప్రాంగణంలోని తుంగభద్ర సభాంగణంలో అర్జీల స్వీకరణ, విచారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యక్తిగత కక్ష్య, స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు చేసినట్లు విచారణలో తేలితే 6 నెలల నుంచి గరిష్టంగా 3 ఏళ్లు జైలుశిక్ష తప్పదని తెలిపారు. సమాచార హక్కు, లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేసే స్వార్థపరులపై చర్యలు ఉంటాయని తెలిపారు. అవినీతిని, అవినీతిపరులను అంతం చేయడానికే లోకాయుక్త అని తెలిపారు. లోకాయుక్తగా నియమితుడైన తర్వాత తన అస్తి వివరాలను ప్రకటించానన్నారు. ఇద్దరు లోకాయుక్తలు ప్రతి జిల్లాలో 3 రోజులు పర్యటించి అధికారులపై అవినీతి ఆరోపణలు విచారించి అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సందర్భంలో 18 శాతం సాక్షరత ఉండేది, ఇప్పుడు 80 శాతం ఉంది. ఈ 80 శాతంలో 90 శాతం మంది విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదని తెలిపారు. కరోనా తరువాత మనుషుల్లో మార్పు రాకపోగా అవినీతి మరింత పెరిగిందని తెలిపారు. స్వార్థపరుల వల్లనే ప్రకృతి నాశనమై పోతోందని తెలిపారు. సమానత సాధించిన మహిళలు పురుషుల కంటే అవినీతిలో ముందంజలో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార అధ్యక్షురాలు, జిల్లా జడ్జి వేలా, జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్పీ, జిల్లా లోకాయుక్త అధికారులు పాల్గొన్నారు. అవినీతి సంపూర్ణ సంహారానికే లోకాయుక్త 90 శాతం విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదు ఉపలోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప వెల్లడి -
ఆల్మట్టిలో నీటి కొరత.. విద్యుత్ ఉత్పత్తికి వెత
రాయచూరు రూరల్: ఆల్మట్టి జలాశయంలో నీటి కొరత ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడినట్లయింది. విద్యుత్ ఉత్పత్తిలో ముందుండే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని యూనిట్లు నేడు జలక్షామంతో స్తంభించాయి. తాగునీటి అవసరాల కోసం జలాశయంలో నీటిని నిల్వ చేశారు. 510 దశ లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం కాగా కేవలం 235 దశ లక్షల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాభావంతో నీరు లేక ఉత్పత్తి స్తంభించింది. ఆల్మట్టి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 5 యూనిట్లలో 55 మెగావాట్లు, ఒక యూనిట్లో 15 మెగావాట్లతో కలిపి ఆరు యూనిట్లలో 290 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. బాగల్‌కోట 1.2, బసవన బాగేవాడి 1.2 ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేపడతారు. ఆల్మట్టి జలాశయంలో 510.96 మీటర్ల ఎత్తున 34.842 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాయచూరు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు బంద్ అయ్యాయి. వేసవి ఎండలు అధికం కావడంతో లోడ్‌షెడ్డింగ్ లేదని సర్కార్ చెబుతున్నా ఆర్టీపీఎస్లో నాలుగు యూనిట్లు బంద్ కావడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఎదురైంది. 210 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే 1, 2, 3, 6 యూనిట్లను బాయిలర్ ట్యూబ్, బంకర్ లీకేజీల కారణంగా స్తంభింప చేశారు. నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ వేయడంతో 840 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిలో కోత పడింది. -
నేత్రపర్వంగా తిరునక్షత్రం
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో సమానత్వ హరికారులు అయిన రామానుజాచార్యుల 1008వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటిరోజు గురువారం రామానుజాచార్యుల విగ్రహానికి విశేష అలంకారం, సర్వభూపాల వాహనోత్సవం కనులవిందుగా జరిగింది. శుక్రవారం హంస వాహనోత్సవం సాగుతుంది. రోజూ ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు వివిధ వాహన సేవలు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. రూ.17 వేల కోట్ల స్కాంపై లేఖ బనశంకరి: అమృత్ యోజన పథకం అమలు పేరుతో రూ.17 వేల కోట్ల నిధులను ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై ప్రధానమంత్రి, కేంద్ర గృహ నిర్మాణ నగరాభివృద్ధి శాఖమంత్రికి 7,281 పేజీలతో ఆధారాల సమేతంగా ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ చెప్పారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్రం రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ కార్యదర్శికి లేఖ రాసిందని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడం సంబంధించి వారంలోగా నివేదిక అందించాలని ఆదేశించిందని చెప్పారు. బీజేపీ ఐటీ సెల్‌పై కేసు శివాజీనగర: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు చేసిన పోస్టింగ్ గురించి బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినపుడల్లా ఉగ్రవాదుల దాడి జరుగుతోంది అని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ పోస్ట్ చేసినట్లు ఆరోపించారు. ఇది రాహుల్‌గాంధీ మీద తప్పుడు ప్రచారం చేసేలా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ మీద ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. బస్సులో కండక్టర్ వెకిలి చేష్టలు యశవంతపుర: మంగళూరు నగరంలోని ముడిపు–స్టేట్‌బ్యాంక్ మార్గంలో యువతిని లైంగికంగా వేధించిన కేఎస్ ఆర్టీసీ కండక్టర్‌ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలకోటకు చెందిన కండక్టర్ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న ముడిపు నుంచి స్టేట్ బ్యాంక్‌కు వెళుతున్న బస్సులో యువతి ఎక్కి నిద్రమత్తులోకి జారిపోయింది. ఆ సమయంలో యువతిని కండక్టర్ అసభ్యంగా తాకుతూ ఉండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. దీనిని గమనించిన నెటిజన్లు కండక్టర్ మీద మండిపడ్డారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రదీప్‌ను సస్పెండ్ చేయగా, పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీ, తండ్రీ పిల్లలకు గాయాలు చింతామణి: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి పట్టణంలోని తాలూకాఫీసు పక్కన గురువారం ఈ ప్రమాదం జరిగింది. శాంతినగరకు చెందిన సుబ్రమణి, కుమారుడు ధనుష్‌కుమార్, కూతురు శ్రావణి బైక్‌లో వెళుతుండగా ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొనింది. తండ్రి సుబ్రమణికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి కోలారు ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు ఓ మోస్తరుగా గాయాలు తగిలాయి. పట్టణంలో లారీలు, ట్రాక్టర్లు ఇష్టానుసారం సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, పోలీసులు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మారెమ్మదేవికి నువ్వుల అలంకారం బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరంగిపాళ్యలో వెలసిన గ్రామదేవత మారెమ్మదేవి అమ్మవారికి గురువారం నల్ల నువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. -
సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో సీ్త్రలకు కూడా సమాన హక్కులు అవసరమని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన అఖిల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులు ఉండాలన్నారు. జిల్లాలోని 85 మంది మహిళా ఉద్యోగుల పదాధికారుల పదగ్రహణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు రోశని గౌడ, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షురాలు విజయలక్ష్మి పాటిల్, సభ్యులు గంగమ్మ, సంగమ్మ, పార్వతి, వాణిశ్రీ తోటమ్మ, ఈరమ్మ, శ్రీదేవిలున్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లో బైసారన్, పహల్గాంల మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడి ఖండనీయమని హరిహర సేవా ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం సిరవారలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని ఒత్తిడి చేశారు. బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ రాష్ట్ర గవర్నర్‌కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఎస్‌యూసీఐ సంస్థాపక దినోత్సవం రాయచూరు రూరల్: నగరంలో ఎస్‌యూసీఐ సంస్థాపక దినోత్సవం, ప్రజా వ్యతిరేక దినోత్సవాలను ఆచరించారు. బుధవారం నగరంలోని జవహర్ నగర్ కాలనీ కార్యాలయం వద్ద శివదాస్ ఘోష్ జయంతి, ఎస్‌యూసీఐ 78వ సంస్థాపక దినోత్సవాలను నిర్వహించారు. బీజేపీ, జేడీఎస్‌ల వల్లే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, ఏపీఎంసీ, కార్మిక, విద్యుత్, కార్పొరెట్ చట్టాలను జారీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరేష్, చెన్నబసవ, అయ్యాళప్ప, వినోద్ కుమార్, బసవరాజ్, సరోజ, పీర్ సాబ్, నందగోపాల్, హేమంత్, అమోఘ, మహేష్లున్నారు. కశ్మీర్ మృతులకు సంతాపం రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నరసాపుర– బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు సేవలు హుబ్లీ: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నరసాపుర– బెంగళూరు సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ స్టేషన్ల మధ్య సంచరించే వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను వచ్చే నెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రైలు సేవలు మే 9 నుంచి జూన్ 27 వరకు, అలాగే మరో రైలును మే 10 నుంచి జూన్ 28 వరకు రాకపోకలను సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. రైలు (సంఖ్య..02811) యలహంక జంక్షన్‌కు రాత్రి 11.18 గంటలకు చేరుకొని 11.20 కు బయలుదేరుతుంది. అలాగే రైలు (సంఖ్య..02812) యలహంక జంక్షన్‌కు ఉదయం 4.50 గంటలకు చేరుకొని 4.52 గంటలకు బయలుదేరి వెళ్లనుందని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
నిప్పుల కొలిమిగా ఉత్తర కర్ణాటక
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారిగా పేరొందిన బళ్లారి జిల్లాతోపాటు కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, విజయనగర, కొప్పళ, గదగ్, బాగల్కోటె, విజయపుర, బెళగావి తదితర జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకు ఎండలు తీవ్రం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ముందుగానే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ జోరుగా వర్షాలు కూడా కురిశాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి, జొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల నేలతల్లి చల్లబడుతుందని జనం సంతోషిస్తున్న తరణంలో ఓ వైపు పంట నష్టం మరో వైపు ఎండల తీవ్రత కూడా పెరిగిపోతోంది. అత్యధికంగా కలబుర్గి జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఎండలు దాటడంతో ఎండవేడిమికి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. చల్లని పానీయాలు, పండ్లకు గిరాకీ మధ్యాహ్నం వేళలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు చల్లని పానీయాలతో కొంత సేదరుతున్నా అవి కాసేపు మాత్రమే హాయిని ఇస్తున్నాయి. యాదగిరి జిల్లాలో 44 డిగ్రీలు, బళ్లారిలో 40 డిగ్రీలు, బాగల్కోటెలో 40 డిగ్రీలు, విజయపురలో 42 డిగ్రీలు ఇలా ఉత్తర, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల పరిధిలోని జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎండలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కలబుర్గిలో విపరీతమైన ఎండలు పెరిగిపోవడంతో రోడ్లలో జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండలు పెరిగిపోవడం ఓ వైపు, అప్రకటిత విద్యుత్ కోత వల్ల ఇళ్లలో ఉండేందుకు ఫ్యాన్లు తిరగనందుకు ఉక్కపోతతో జనం పడుతున్న అవస్థలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఉక్కపోత పెరిగి పోవడం వల్ల ఇన్వర్టర్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. కలబుర్గిలో 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న ఉష్ణోగ్రతలు బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఎండ ప్రచండం -
క్వారీ గొడవ.. కాల్పుల రభస
● ఒకరికి తూటా గాయాలు దొడ్డబళ్లాపురం/ గౌరిబిదనూరు: క్వారీ మైనింగ్ విషయంలో వివాదం తలెత్తి పిస్టల్‌తో కాల్పులు జరిపిన సంఘటన చిక్కబళ్లాపురం జిల్లా మంచేనహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. సకలేశ్‌కుమార్ అనే వ్యక్తి చికెన్ రవి అనే వ్యక్తి మీద ఫైరింగ్ చేశాడు. వివరాలు.. క్వారీ కోసం మంచేనహళ్లి వద్ద సకలేశ్‌కుమార్ ఏర్పాట్లు చేసుకున్నాడు. క్రషర్ లారీలు తిరగడానికి రోడ్డు వేస్తుండగా స్థానికులతో కలిసి చికెన్ రవి అనే వ్యక్తి ధర్నా చేపట్టాడు. తన క్వారీకి అడ్డు రావద్దని అతనితో సకలేశ్‌కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సకలేశ్‌కుమార్ తలకు గాయమైంది. దీంతో పిస్టల్ తీసి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ చికెన్ రవి కాలి తొడలోకి దిగింది. జనం వెంటనే రవిని తక్షణం చిక్కబళ్లాపుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సకలేశ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ వైఎన్ నారాయణస్వామికి దగ్గరి బంధువు అవుతారు. మంచేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.నిందితులు అరెస్టు చిక్కబళ్లాపురం: జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి మాట్లాడుతూ సకలేశ్ను మంచేనహళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎంపీ కె సుధాకర్ మాట్లాడుతూ తన 50 ఏళ్ల అనుభవంలో జిల్లాలో ఎప్పుడు కాల్పుల సంఘటన ఎప్పుడూ జరగలేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇదే క్వారీ విషయం నా వద్దకు వచ్చింది, క్వారీ ఏర్పాటుకు నేను సమ్మతించలేదు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దీనికి కారణం. వారికి తెలియకుండా ఎలా జరుగుతుందని అని మండిపడ్డారు. కాల్పులను ఖండిస్తూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.నేడు మహదేశ్వర బెట్టకు సీఎం మైసూరు: సీఎం సిద్దరామయ్య గురువారం నుంచి మూడు రోజుల పాటు చామరాజనగర, మైసూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి మలెమహదేశ్వర బెట్టకు హెలికాప్టర్లో సీఎం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలపైన మలెమహదేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి ప్రాధికార సమావేశంలో పాల్గొని రాత్రికి బెట్ట మీదే బస చేస్తారు. శుక్రవారం ఉదయం బెట్టలోని సుత్తూరు శాఖామఠాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు మైసూరుకు వచ్చి ప్రభుత్వ అతిథిగృహంలో మైసూరు పాలికె అధికారులతో భేటీ అవుతారు. ఇంకా పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉగ్ర దాడిపై ఆగ్రహం తుమకూరు: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తుమకూరు నగరంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. నగర ఎమ్మెల్యే జ్యోతి గణేశ్ నేతృత్వంలో టౌన్‌హాల్ సర్కిల్లో ఆందోళన చేశారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి భయానక ఘటనలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 25న తుమకూరులో జరగాల్సిన బీజేపీ జనాక్రోశ యాత్ర వాయిదా పడింది. మృతుల గౌరవార్థం జనాక్రోశ యాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు. దొంగ అరెస్టు, అర్ధ కేజీ బంగారు నగలు సీజ్ కోలారు: కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో కలిపి మొత్తం 9 చోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 52 లక్షల విలువ చేసే 557 గ్రాముల బంగారు నగలు, కేజీ వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దొంగ బెంగళూరు బనశంకరికి చెందిన సయ్యద్ అఫ్సర్ (37) అని తెలిపారు. వరుసగా జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి దొంగను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. -
కొండచరియలు విరిగి.. ముప్పు తప్పింది
యశవంతపుర: కశ్మీరు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 13 మంది కన్నడిగులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. వీరు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి అడ్డు పడడంతో ముందుకు వెళ్లలేకపోవడం ప్రాణాలను నిలిపింది. వేసవి సెలవులు కావడంతో బాగలకోట మార్వాడీ వీధికి చెందిన కిశోర్ కాసట్ అనే వ్యాపారి బంధువులతో కలిసి 13 మంది ఈ నెల 19న జమ్ము కశ్మీర్‌కు వెళ్లారు. వైష్ణోవిదేవి ఆలయాన్ని దర్శించుకుని మంగళవారం పహల్గామ్కి బయల్దేరారు. ఆ మార్గ మధ్యలో కొండచరియలు విరిగి పడిన కారణంగా 70 కిలోమీటర్లు తిరిగి మరో మార్గంలో ఆలస్యంగా వెళ్లవలసి వచ్చింది. ఇంతలో ఉగ్రవాదుల దాడి చేశారని బాగలకోట నుంచి కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వటంతో వెనుదిరిగినట్లు తెలిపారు. శ్రీనగర్‌కు క్షేమంగా చేరుకున్నట్లు తెలిపారు. హావేరి దంపతుల అదృశ్యం కశ్మీరు పర్యటనకు వెళ్లిన హావేరి దంపతుల ఆచూకీ లభించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శిగ్గావికి చెందిన నాగరాజు దంపతులు ముంబై నుంచి విమానంలో కశ్మీర్‌కు వెళ్లారు. వారి ముబైల్ ఫోన్ స్విచాఫ్ అని వస్తోందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు శిగ్గావి పురసభలో ఉద్యోగి, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీరు కశ్మీర్‌కు వెళ్లారు. కుటుంబీకులు హావేరి జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. న్యాయం జరగాలన్న సినీలోకం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించడంపై సినిమా, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటులు శివరాజ్‌కుమార్, కిచ్చ సుదీప్, యశ్, ధ్రువ సర్జా, నటి రాధికా పండిత్‌లు ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. గుండె చలించిందని, ఉగ్రవాదులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్ ఎన్నటికీ మనదేన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని అన్నారు. బాగల్‌కోట యాత్రికులు సురక్షితం -
ముందే జాగ్రత్త పడి ఉంటే...
సాక్షి, బెంగళూరు: భార్యకు మానసిక అనారోగ్యం, ఇతరత్రా ఆస్తి గొడవలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే ఆ ఇంట ఘోరం జరిగేది కాదేమో అనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కేసులో అందరి నోటా ఇదే మాట వస్తోంది. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. వారిద్దరూ మానసిక రోగాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫ్రినియా అనే డిప్రెషన్‌తో జీవిస్తోంది. ఓం ప్రకాశ్ ఆమెకు నగరంలోని ఓ ఆస్పత్రిలో మానసిక చికిత్స కూడా అందిస్తున్నారు. వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా సమాచారం. దంపతుల మధ్య గొడవలను భార్య పల్లవి తరచూ పోలీసు అధికారులు గ్రూపుల్లో పలుమార్లు పోస్టు చేసినట్లు తెలిసింది. తన భర్త వద్ద అక్రమంగా తుపాకులు, మత్తు పదార్థాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని, లేదంటే వాటితో తనను చంపేస్తాడని పల్లవి మెసేజ్‌లు పెట్టేది. ఇది చూసి పోలీసు అధికారులు అయ్యో పాపం అని విస్తుపోయేవారు. భర్త నన్ను వేధిస్తున్నాడు, ఆయనను అదుపు చేయకపోతే తానే చంపేస్తానని ఆ గ్రూపులో పల్లవి పోస్టు చేసేదని సమాచారం. దీనిని బట్టి ఓం ప్రకాశ్‌తో పాటు, ఆయన మిత్రులు ముందే అప్రమత్తమై ఉంటే ప్రాణాలు దక్కేవి. తేలిగ్గా తీసుకోవడంతో రక్తపాతం అనివార్యమైంది.ఆత్మరక్షణ కోసమే..తుపాకీ తీసుకుని చంపేస్తానని నా భర్త బెదిరించాడు, ఆత్మరక్షణ కోసం తాము పోరాటం చేయాల్సి వచ్చిందని, భర్త కంట్లో కారం పొడి చల్లినట్లు, శరీరంపై వేడి వంటనూనె చల్లినట్లు పల్లవి చెప్పినట్లు తెలిసింది. బీరు బాటిల్‌తో కొట్టి చేతులు, కాళ్లు కట్లేసి చాకుతో పొడిచినట్లు, కొద్ది నిమిషాలకే తీవ్ర రక్తస్రావంతో మరణించాడని పోలీసుల విచారణలో పల్లవి తెలిపింది. ఇక కుమార్తె కృతిని ప్రస్తుతం పోలీసులు నిమ్హాన్స్లో చేర్పించారు. దుందుడుకుగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడడం చూసి పోలీసులు వైద్యులను ఆశ్రయించారు. నిమ్హాన్స్ వైద్యులు కృతి మానసిక ఆరోగ్యంపై పరీక్షలు చేస్తున్నారు. హత్యలో కృతి పాత్రపై కూడా లోతుగా విచారిస్తున్నారు. -
వైభవంగా కాళికా మాత జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం విశ్వ కర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మ వారికి అభిషేకం చేయించారు. అలంకరణలతో కాళికా దేవి ఆలయంలో మాతకు విశేష పూజలు జరిపి అమ్మవారి విగ్రహానికి పుష్ప వృష్టి, ప్రత్యేక అలంకార సేవలు చేసి పల్లకీ సేవల్లో ఊరేగించారు. దేవికి పూలు, పండ్లు, ధవస, ధాన్యాలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మిపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద్, శ్రీకాంత్, గిరిబాబు, వినోద్, ఆకాష్, హరిహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
కశ్మీర్లో కొప్పళవాసులు క్షేమం
హొసపేటె: జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన కొప్పళకు చెందిన 19 మంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయంపై వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి తాము సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కొప్పళ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటన్ పాషా, వ్యాపారవేత్త శివకుమార్ పవలిశెట్టర్, శరణప్ప సజ్జన్, సిద్దు గన్వారీ కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పర్యటన కోసం మంగళవారం శ్రీనగర్ బయలుదేరారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వారు తమ ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి వస్తున్నట్లు తెలిపారు. విహారయాత్రకు వెళ్లిన శివకుమార్ పవలిశెట్టర్ సోదరుడు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు, కుటుంబం వారం రోజుల పర్యటన కోసం కశ్మీర్‌కు వెళ్లారు. వారు తమకు ఫోన్ చేసి అక్కడ సురక్షితంగా ఉన్నామని చెప్పారన్నారు. ఈ ఉదయం వారు శ్రీనగర్‌లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలను పంపారు. శ్రీనగర్ పూర్తిగా మూతపడింది. తన సోదరుడు ఈ సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తారు. ఆయన మంత్రి సంతోష్‌లాడ్‌ను కలిశారు అని అన్నారు. కాటన్ పాషా కుమారుడు సుఫియాన్ స్పందిస్తూ తన తండ్రి, తల్లి, ముగ్గురు సోదరీమణులు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని విన్న తర్వాత మేం భయపడ్డామన్నారు. కొప్పళ నుండి మొత్తం 19 మంది కశ్మీర్ టూర్‌కు వెళ్లారని తెలిపారు. ఫీజుల దుర్వినియోగంపై ఎఫ్‌డీఏ సస్పెండ్ హుబ్లీ: నృపతుంగ గుట్ట పార్కులో వసూలు చేసిన ప్రవేశ రుసుము బాపతు నగదును దుర్వినియోగం చేసిన ఆరోపణలపై హుబ్లీ ప్రాంతీయ అటవీ రేంజ్ ఎఫ్‌డీఏ విశ్వనాథ్ మహాజన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ధార్వాడ డివిజన్ కార్యాలయం ద్వారా హుబ్లీ పరిధి కార్యాలయంలో 2024 జనవరి 10 నుంచి 2025 ఫిబ్రవరి 12 వరకు కార్యాలయంలో అన్ని శాఖల నిర్వహణ చేసే వారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి ఎంఎస్ రాయనగౌడ, బందోబస్తు అటవీ పాలకి సుమిత్ర బొమ్మనవాడ, సదరు గుట్టలో వసూలు చేసిన రూ.15,57,880 సేకరించి బ్యాంక్‌కు జమ చేయకుండా విశ్వనాథ్ చేతికిచ్చారు. అయితే ఇందులో రూ.8,95,470 మాత్రమే బ్యాంక్‌లో జమ చేశారు. మిగిలిన రూ.6,62,410 లను విశ్వనాథ్ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సంబంధిత అటవీ అధికారి రామలింగప్ప ఉప్పార అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై శాఖ వారు దర్యాప్తు జరిపిన ధార్వాడ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నితీష్‌కుమార్ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో డిప్యూటీ అటవీ సంరక్షణ అధికారి వివేక్ కవరి విశ్వనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెల్లడించారు. తాగునీటి ఎద్దడి నివారించండి రాయచూరు రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తాలూకా స్థాయి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైనందున మూడు నెలల పాటు ప్రజలు తాగు నీటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. తాలూకాలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అంచనాలను తయారు చేసి పరిహారం అందించాలన్నారు. జలజీవన్ మిషన్, జలధార పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన బలి, టీపీ ఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ, ఆర్‌ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతి రావ్ పతంగి, పవన్ పాటిల్‌లున్నారు. ఉగ్రదాడి నుంచి నలుగురు సురక్షితంహొసపేటె: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నుంచి నగరానికి చెందిన నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. రాజశేఖర్, అతని కుటుంబం ఈనెల 18న కశ్మీర్‌కు బయలుదేరారు. టీఎంఏఈ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ టీఎం రాజశేఖర్, ఆయన భార్య ఉమాదేవి, కుమార్తె డాక్టర్ గౌరిక, అల్లుడు దొడ్డబసయ్య సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తులో ఉన్న పహల్గాం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. రాజశేఖర్ తప్ప, కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం 2.18 గంటలకు బైసార్ సమీపంలోని దుకాణానికి కుంకమపువ్వు కొనడానికి వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా ఐదు లేదా ఆరు అడుగుల దూరంలో కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి, వారు అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోడానికి కిందకు దిగారు. శ్రీనగర్ నుండి దాదాపు 8 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా అందమైన పర్యాటక కేంద్రం. ప్రతి రోజు దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భద్రతకు సైనిక దళాలను మోహరించలేదు. ఈ ప్రదేశంలో మొబైల్ నెట్వర్క్ లేదు. చరిత్రలో ఈ ప్రదేశంలో ఎప్పుడూ ఉగ్ర దాడి జరగలేదు అని రాజశేఖర్‌ను ఫోన్లో సంప్రదించినప్పుడు తెలియజేశారు. -
అవినీతిపరులతో దేశాభివృద్ధికి అవరోధం
బళ్లారి రూరల్ : ఉగ్రవాదులు అమాయక ప్రజలకు భయభ్రాంతులు కలిగిస్తారు. అదే మన మధ్యలో ముసుగులో ఉన్న అవినీతిపరులు దేశాభివృద్ధికి అవరోధకులని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప తెలిపారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార, జిల్లా న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయవాదుల సాంస్కృతిక సముదాయ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. శాసకాంగం, న్యాయాంగం, పత్రికా రంగంలో కూడా అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన తరుణమని తెలిపారు. ప్రతిభావంతులైన న్యాయవాదులు అవినీతికి విరుద్ధంగా గొంతెత్తాలన్నారు. పల్లెపల్లెకు వెళ్లి పేదలకు, ఆసక్తి ఉన్నవారికి చట్టాలపై జాగృతి కలిగించాలన్నారు. రాజ్యాంగం జాతీయ గ్రంథమైంది. ఇందులోని నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ రక్షితి రక్షితః అన్న నానుడికి తాను శ్రీకారం చుట్టుతున్నట్లు తెలిపారు. ఉపలోకాయుక్త న్యాయమూర్తి నగరంలోని సిటీ కార్పొరేషన్, కేఎస్ఆర్టీసీ, ప్రభుత్వ జిల్లాసుపత్రి, వసతి నిలయాలు, సబ్ రిజిస్టార్ కార్యాలయం, తాలూకా కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్‌కు పైఅధికారులకు సిఫార్సు చేశారు. ఉపలోకాయుక్త వెంట ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల్లాంటివారు దావణగెరెలో ఉప లోకాయుక్త వీరప్ప ముమ్మర తనిఖీలు -
కులాల మధ్య చిచ్చుకు సర్కారు కుట్ర
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలపై ఇచ్చిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని ఎలె బిచ్చాలి, మటమారి మఠాధిపతి తప్పుబట్టారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గతంలో 27 శాతం ఉన్న జనాభాను నేడు 11 శాతానికి తగ్గించి వీరశైవ లింగాయతులున్నట్లు నివేదికలో పేర్కొనడం అపహాస్యంగా ఉందన్నారు. దీనిని నిరసిస్తూ ఈనెల 28న జిల్లాలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారన్నారు. రాజకీయ లాభం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటక మాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదికలు అందించారన్నారు. ఏనాడు ఏ అధికారి కులగణన సమీక్షకు రాలేదన్నారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, పంచాక్షరి, గురుమూర్తి, మహాలింగ, విరుపాక్ష పండితారాధ్య, వీరసంగమేశ్వర, శంభు సోమనాథ, శంభులింగ, పంపాపతి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి, శాసన సభ్యులు హంపనగౌడ, శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, బసనగౌడ, చంద్రశేఖర్, షణ్ముకప్ప, మల్లికార్జున, విజయ్ కుమార్‌లున్నారు. 28న జిల్లాలో వీరశైవ సమాజంచే పోరాటం -
ఉచితంగా మజ్జిగ పంపిణీ
బళ్లారి రూరల్ : భగభగ మండుతున్న ఎండలకు గొంతులో కాసిన్ని మంచినీళ్లు పడితే ప్రాణం కాస్త కుదుట పడుతుంది. మరి చల్లని మజ్జిగ తాగితే మరింత ఉపశమనం కలుగుతుందని భావించిన దావణగెరె స్పూర్తి సేవా ట్రస్టు దావణగెరె మహానగర పాలికె ముందు నగరవాసులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత 30 ఏళ్లుగా నగరంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ట్రస్టు ప్రముఖుడు బి.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ట్రస్టు ప్రముఖులు బెన్నళ్లి శివకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 26 నుంచి గాలికుంటు నివారణకు టీకాలుహొసపేటె: పశువుల్లో కనిపించే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి జూన్ 9 వరకు మొత్తం 45 రోజుల పాటు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పోమ్ సింగ్ తెలిపారు. పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, అన్ని స్థానిక సంస్థల్లో 7వ రౌండ్ కాళ్లు, నోటి వ్యాధికి టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదం, నోటి వ్యాధి అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది గిట్టలు గల అన్ని జంతువులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పశువులు, గేదెల పాదాలు, నోటిపై పుండ్లు ఏర్పడటం ద్వారా రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల అపారమైన బాధ, అలసట, తక్కువ పాల దిగుబడి వస్తుంది. ఈ విధంగా జిల్లాలోని 92 విభాగ సంస్థల్లో ఒకేసారి ప్రారంభిస్తారన్నారు, 45 మంది పశువైద్య అధికారులు, 10 మంది కాంట్రాక్ట్ ఆధారిత పశువైద్య అధికారులు సహా 238 మంది వ్యాక్సినేటర్లు, 81 మంది అవుట్ సోర్సింగ్, అనుబంధ కార్మికులు సహా 157 మంది విభాగ సిబ్బంది టీకా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పశువుల పెంపకందారులు, ప్రజలు ఈ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. భక్తిభావం పెంచుకోవాలిరాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావం పెంపొందించుకునేందుకు కృషి చేయాలని బాళెహొన్నూరు రంభాపురి పీఠాధిపతి పిలుపు ఇచ్చారు. బుధవారం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాలోని హుడిగిలో దిగంబర కరి బసవేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా విరుపాక్షలింగ శివాచార్య పట్టాధికార ఉత్సవాల్లో భక్తులకు ఆశీర్వచనాలు అందించి మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మధనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో పట్టాధికారం చేయించారు. శాంతమల్ల శివాచార్య, విధాన పరిషత్ సభ్యుడు చంద్రశేఖర్ పాటిల్, స్వామీజీలు, మాజీ శాసన సభ్యులున్నారు. ఎయిమ్స్ మంజూరు చేయించండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయ జనాక్రోశ యాత్రకు బదులు ఎయిమ్స్ మంజూరు చేయించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. బుధవారం బెంగళూరు విధానసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాక్రోశ యాత్ర చేపట్టడంపై ఉన్న శ్రద్ధ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయించడంపై లేదని ఆక్రోశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందన్నారు. లింగాయత్ మంత్రులు రాజీనామా చేయాలిరాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారని, కులగణనను వ్యతిరేకిస్తూ కేబినెట్లోని ఏడుగురు లింగాయత్ మంత్రులు రాజీనామా చేయాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాలపై నివేదించిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించిన అంశంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. -
ఆరో గ్యారంటీ.. ధరల పెంపు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని, ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, ఆరో గ్యారంటీ కూడా ఇస్తోందని, అదే ధరల పెంపుదల, సామాన్యుల జీవిత విధానానికి విఘాతం కలిగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన బుధవారం యాదగిరి నగరంలో జనాక్రోశ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆక్రోశం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాక్కొంటున్నారని మండిపడ్డారు. ఆరో గ్యారెంటీకి ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదని వ్యంగ్యంగా అన్నారు. దాదాపు 50కి పైగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచారన్నారు. దీంతో పేదలకు ఎంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. జనాక్రోశ యాత్రకు విశేష స్పందన ప్రతి గ్రామంలో జనం కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. తాము చేపట్టిన జనాక్రోశ యాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు రైతులు హితదృష్టితో పని చేశారని, సిద్దరామయ్య సర్కార్ ఎవరి హితదృష్టితో పని చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరో గ్యారంటీ అమలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందం పొందుతోందన్నారు. ఉగ్రవాదులు దాడులను కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కశ్మీరులో హిందువులపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్యగా, పిరికిపందలు చేసే అకృత్యం అని మండిపడ్డారు. కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటుంది ఉగ్రవాదులపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన వచ్చి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. యావత్ దేశం ఉలిక్కిపడేలా ఉగ్రవాదులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు 100 రెట్టు నష్టం వారు అనుభవిస్తారని గుర్తు చేశారు. కశ్మీరులో హిందూ పండిట్లకు కూడా అవమానం చేశారని, సైనికుల మృతి కూడా కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరులో హిందువులపై జరుగుతున్న మారణకాండకు ఖచ్చితంగా పుల్‌స్టాప్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఉగ్రవాదులకు మూలాలు లేకుండా చేయాలన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీలు చలవాది నారాయణస్వామి, రవికుమార్ పాల్గొన్నారు. ఎడమ చేత్తో ఇస్తూ కుడి చేత్తో లాక్కొంటోంది ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలి ఉగ్రవాదులు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర -
ఉగ్రదాడి పిరికిపంద చర్య
సాక్షి, బళ్లారి: కశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి హత్య చేయడం దారుణం అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం రాత్రి నగరంలోని రాయల్ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ పర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన 30 మందికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడులను కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. దేశంలో భయభ్రాంతులను సృష్టిస్తున్న ఉగ్రవాదుల దాడులను ఖండించాలన్నారు. పర్యాటక రంగానికి పేరు గాంచిన కశ్మీర్‌ను తిలకించడానికి వెళ్లిన హిందువులపై కాల్పులు జరిపి చంపడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. హిందువులపై మారణకాండపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకొని నివారిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం వారి గుండెల్లో దడ పుట్టించాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, బీజేపీ నాయకులు రామలింగప్ప, కేఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి దుర్మార్గం రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లో బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి పర్యాటకులను హతమార్చడం దుర్మార్గం, ఖండనీయమని యువజన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడారు. కశ్మీర్లో ఉన్న ఆర్టికల్–370ని రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫైజల్ ఖాన్, శాబాజ్, మధు, రషీద్, సంతోష్, అబ్దుల్, ఇస్మాయిల్, సురేష్, రఫీ, ప్రతాప్రెడ్డిలున్నారు. ఏబీవీపీ రాస్తారోకో హుబ్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటనలకు, విహారయాత్రల కోసం వెళ్లిన భారతీయులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిపై అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యానగర్‌లోని బీవీబీ కళాశాల ఎదురుగా సమావేశమైన ఏబీవీపీ కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక టైర్లకు నిప్పు పెట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. హిందువులే లక్ష్యంగా తుపాకులతో కాల్పులు జరిపి 30 మందిని హత్య చేసిన జిహాది మూకలను కూడా అదే విధంగా కాల్చి చంపాలని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తమకు న్యాయం కావాలని, జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో ఏబీవీపీ కార్యదర్శి మణికంఠ కళసా, ఏబీవీపీ ప్రముఖులు మౌనేష్గౌడ, సిద్ధార్థ కోరి, విజయ కల్లూర, నాగదత్త, దానేష్ కిత్తూర, సంజన హిరేమఠ, రక్షిత, హర్షిత, రాజేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్ ఘటన అత్యంత దారుణం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి -
కార్యాలయం తరలింపుపై నిరసన
బళ్లారి అర్బన్: బళ్లారిలోని చేనేత, జవళి శాఖ జేడీ కార్యాలయాన్ని కలబుర్గికి తరలించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. బళ్లారి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, సామాజిక పోరాట యోధుడు, ప్రముఖ సీఏ సిరిగేరి పన్నారాజ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి సారథ్యంలో గాంధీ భవన్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ఈ ఆందోళన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి బళ్లారితో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో రెడీమేడ్ పరిశ్రమ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు. బళ్లారిలో 200 వరకు గార్మెంట్ తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు. జీన్స్ గార్మెంట్స్, జీన్స్ వాషింగ్, జాబ్ వర్కింగ్ యూనిట్లు పని చేస్తున్నాయి. నగరంలో 50 వేల మందికి పైగా దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆ మేరకు ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ బళ్లారి కేంద్రంగా బళ్లారి జీన్స్ అపారల్ పార్క్ నాలుగో దశ ముండ్రగి పారిశ్రామికవాడలో, అలాగే 80కి పైగా జీన్స్ వాషింగ్ యూనిట్లు, 1000 మందికి పైగా ఉపాధికి ప్రతిపాదన ఉందన్నారు. మొత్తానికి బళ్లారి నగరంలో టెక్స్టైల్ పార్క్‌కు అన్ని విధాలుగా వసతులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు రాసిన వినతిపత్రాన్ని డీసీ కార్యాలయ ప్రతినిధికి అందజేశారు. ఆందోళనలో ప్రముఖులు మహారుద్రగౌడ, దొడ్డనగౌడ, సురేష్‌బాబు, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున, వీ.రామచంద్ర, జిల్లా కాటన్ అసోసియేషన్, గార్మెంట్స్ తయారీదారుల సంఘం, బళ్లారి జీన్స్ వాషింగ్ అసోసియేషన్, బళ్లారి టైలరింగ్ అసోసియేషన్, జిల్లా ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లాలోని వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. ఆ కార్యాలయం బళ్లారిలోనే ఉండాలి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల డిమాండ్ -
మామిడి రైతుల ఆశలు ఆవిరి
శ్రీనివాసపురం : మామిడి పండ్లతో ప్రజలు తీయని రుచులను ఆస్వాదిస్తుండగా వాటిని సాగు చేసే అన్నదాతలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరైన వాతావరణం అనుకూలించక మామిడి దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో మామిడి రైతుల్లో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్రంలో మామిడి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన శ్రీనివాసపురం తాలూకాలో ఈ సారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మామిడి దిగుబడి, విక్రయం పట్ల మామిడి ఉత్పత్తి దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 30 శాతమే దిగుబడి తాలూకాలో సుమారు 59 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి పండిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మామిడి చెట్లలో పూత అధికంగా కనిపించింది. అయితే గాలి, అకాల వానలకు పూత గణనీయంగా రాలిపోయింది. ఈ సంవత్సరం కేవలం 30 శాతం దిగుబడి మాత్రమే ఉంటుందని అంటున్నారు. సాధారణంగా మే 15 నుంచి ప్రారంభమయ్యే మామిడి మార్కెట్ వ్యవహారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. తక్కువ దిగుబడి కారణంగా మార్కెట్ కేవలం రెండు నెలలకే పరిమతమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరో వైపు ధరలు కూడా ఈసారి ఆశాజనకంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఈసారి మామిడి శ్రీనివాసపురం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉండడం వల్ల పోటీ అధికంగా ఉంటుంది. దీని వల్ల శ్రీనివాసపురం మామిడికి మంచి ధర లభించకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షానికి పూత రాలిందిమామిడి దిగుబడి ఈసారి ఆశాజనకంగా లేదు. అకాల వానలతో చాలా వరకు పూత రాలిపోయింది. అనంతరం పిందె దశలో కురిసిన వడగళ్ల వానకు సగానికి సగం కాయలు రాలిపోయాయి. దీనికి తోడు బూడిద రోగం తదితర చీడపీడలు మామిడిని పట్టిపీడిస్తున్నాయి. దిగుబడి 30 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. రమేష్, మామిడి రైతు, తొట్లి గ్రామం అకాల వర్షాలతో రాలిన పూత, పిందె ఈ ఏడాది దిగుబడి 30 శాతమే తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు అకాల వర్షాల దెబ్బ రోగాల నియంత్రణకు , అధిక దిగుబడికి రైతులు , వ్యాపారులు వివిధ రకాల మందులను చల్లారు. దీనికి లక్షల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. పలువురు వ్యాపారులు ఉత్తమ దిగుబడిని ఆశించి పూత దశలోనే మామిడి తోటలను ఖరీదు చేశారు. బంపర్ లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారుల ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉంది. ఈ సారి మామిడి దిగుబడి తగ్గించదనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది రైతులు, వ్యాపారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. -
టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం
హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ను తొలగించి శాశ్వత క్రస్ట్‌గేట్‌ను నిర్మించడానికి గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మిషనరీ కంపెనీ టెండర్ దక్కించుకొందని తుంగభద్ర మండలి ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణుడు ఈరోజు డ్యాంకు చెందిన 19వ గేట్‌ను వీక్షించారన్నారు. పక్కా పకడ్బందీగా గేట్ నిర్మాణంపై కంపెనీ దృష్టి పెట్టనుందని తెలిపారు. త్వరలోనే గేట్ నిర్మాణ పనులను కంపెనీ చేపడుతుందన్నారు. ఈ నెల 17వ ఈ– టెండర్ బిడ్‌ను తెరవగా ఒక గుజరాతీ కంపెనీ టెండర్‌ను గెలుచుకుందని తెలిపారు. 19వ గేట్ నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లను ఖర్చు చేపడుతున్నామన్నారు. ఈ కంపెనీ మైసూరులోని కేఆర్ఎస్ ఆనకట్ట గేట్లను నిర్మించిందని తెలిపారు. అలాగే తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేట్ వద్ద స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మిగతా 32 క్రస్ట్ గేట్ల నిర్మాణానికి తుంగభద్ర బోర్డు ఈ–టెండర్లను కూడా పిలిచిందన్నారు. ఈ నెల 28తో టెండర్ గడువు ముగుస్తుందని తెలిపారు. శాశ్వత గేటు నిర్మాణం గుజరాత్ కంపెనీకి అప్పగింత మిగతా 32 క్రస్ట్‌గేట్ల నిర్మాణానికి ఈ–టెండర్ల పిలుపు టీబీ బోర్డు సూపరింటెండింగ్ ఇంజినీర్ నారాయణ నాయక్ -
ఆత్మరక్షణకు కరాటే అవసరం
బళ్లారిఅర్బన్: నేటి యువతకు ఆత్మరక్షణకు కరాటే అవసరం చాలా ఉందని కర్ణాటక చరిత్ర అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్ఎం బసవరాజ్ పేర్కొన్నారు. శంకర్ కాలనీలోని విజయవిఠల కరాటే మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సన్నివేశాల్లో కరాటే నేర్చుకుంటే అలాంటి నిందితులకు భయం పుడుతుందన్నారు. ప్రస్తుతం కాలం చాలా సున్నితంగా ఉందన్నారు. ఒంటరి మహిళ తిరగాడటం చాలా కష్టమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యను నేర్చుకోవాలని సూచించారు. విజయవిఠల గత 15 ఏళ్లుగా కరాటే పాఠశాలను ప్రారంభించి పిల్లలకు ఉచితంగా కరాటే విద్యను నేర్పించడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. -
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
రాయచూరు రూరల్: చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన ఓ బాలుడు అందులో మునిగి దుర్మరణం పాలైన ఘటన సోమవారం జిల్లాలోని సిరవార తాలూకా లక్కందిన్నిలో చోటు చేసుకుంది. మృతుడిని హుసేన్(10)గా పోలీసులు గుర్తించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో స్నేహితులతో కలసి చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన బాలుడు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమను కాదందని ప్రియురాలిపై హత్యాయత్నంహొసపేటె: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ప్రేమికుడు జనసంచారం ఉన్న ప్రదేశంలో యువతిని కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన ఘటన నగరంలోని నగరసభ కార్యాలయం ముందు మంగళవారం జరిగింది. భారతి శావి (26) అనే యువతిపై ఆమె ప్రియుడు విజయభాస్కర్ దాడి చేశాడు. గత పదేళ్లుగా యువతి భారతి తన తల్లిదండ్రులతో కలసి హొససేటెలో నివసిస్తోంది. ఐదేళ్ల క్రితం ఆమెకు ఫేస్బుక్లో విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. యువతి ఇటీవల ప్రియుడిని దూరం పెట్టడం ప్రారంభించింది. తాను దూరంగా ఉండటమే కాకుండా విజయభాస్కర్ ప్రేమను తిరస్కరించింది. ప్రియుడు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి హొసపేటెకు వచ్చాడు. ప్రియురాలు బయటకు వెళుతున్న విషయాన్ని గమనించి రోడ్డు మీద వెళుతుండగా పెళ్లి చేసుకోమని బతిమాలాడు. అయితే యువతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరాలతో నిఘా పటిష్టంరాయచూరు రూరల్: నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తోడు పటిష్ట నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. సోమవారం నగరంలోని అశోక్ డిపో సర్కిల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.35 వేల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో వీటిని అమర్చారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ సణ్ణఈరణ్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్, బసవరాజ్, చాంద్ పాషాలున్నారు. వారసులకు చోరీ మొబైళ్ల అప్పగింత రాయచూరు రూరల్: నగరంలో గత నెలలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకుని విచారణ జరిపి వాటిని తిరిగి సొంతదారులకు అప్పగించారు. నగరంలో సోమవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ పుట్టమాదయ్య 25 మంది వారసులకు వాటిని అందించారు. సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్, రవి కుమార్, బసవరాజ్, శివానందలున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరగేరలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం లెనిన్ 155వ జయంతిని, సీపీఐ(ఎంఎల్) సంస్థాపన దినోత్సవం, ప్రజా వ్యతిరేక దినోత్సవాలను నిర్వహించారు. బీజేపీ, జేడీఎస్‌ల వల్లే కేంద్ర సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, ఏపీఎంసీ, కార్మిక, విద్యుత్, కార్పొరేట్ చట్టాలను జారీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో అజీజ్ జాగీర్దార్, హనీఫ్, డానియల్, ఉరుకుందప్ప, ఇబ్రహీం, ఖాలిద్, గౌస్, ఆంజనేయ, తిరుమలేష్లున్నారు. -
రచ్చకెక్కిన వీధి గొడవ
యశవంతపుర: సిలికాన్ సిటీలో వీధి గొడవ ఇప్పుడు మరో చర్చనీయాంశమైంది. వింగ్ కమాండర్ శిలాదిత్య గుప్తా వీడియోలో చెప్పినదానికి, బయట సీసీ కెమెరాల ద్వారా వెల్లడైనదానికి పొంతన లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బైయప్పనహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో భారత వాయుసేన వింగ్ కమాండర్ దాడి కేసుకు సంబంధించి రెండు వైపులా విచారణ చేస్తున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమీషనర్ బీ దయానంద తెలిపారు. వీడియోల ఆధారంగా అధిక సమాచారం సేకరిస్తామన్నారు. వింగ్ కమాండర్ చెబుతున్న మాటల్లో అనేక వ్యత్యాసాలున్నట్లు కమిషనర్ తెలిపారు. నా కొడుకునే కొట్టారు: బైకిస్టు తల్లి ఈ గొడవలో పోలీసులు అరెస్ట్ చేసిన యువకుడు వికాస్ తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుది ఎలాంటి తప్పు లేదని చెప్పారు. వికాస్ బైకు సైలెన్సర్, కారుకు టచ్ అయింది. వారు హిందీలో తిట్టారు. హిందీ అర్థం కాలేదని వికాస్ బదులిచ్చాడు, వింగ్ కమాండర్ కారు దిగి వికాస్‌ను తోసివేసి చేతిని కరిచి, శరీరాన్ని బరికాడు. బైకును ఎత్తిపడేసి కాళ్లతో తన్నాడు. పైగా మాదే తప్పని అంటున్నాడు. వింగ్ కమాండర్‌ను కూడా అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పైగా జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడని సోషల్ మీడియాలో వింగ్ కమాండర్ వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వింగ్ కమాండర్ యువకునిపై పదేపదే దాడి చేసిన దృశ్యాలు, మొబైల్‌ని విసిరిపారేయడం సీసీ కెమెరాలలో రికార్డయింది. వింగ్ కమాండర్ ప్రవర్తనపై కన్నడ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. దాడి చేసింది కాక ఆరోపణలు చేస్తున్నాడని తప్పుబట్టాయి. దాడి చేస్తున్న దృశ్యం వింగ్ కమాండర్, బైకిస్టులో ఎవరిది తప్పు? వీడియోలు, సీసీ కెమెరాలలో తలోరకం దృశ్యాలు విచారణ జరుపుతున్నాం: పోలీస్ కమిషనర్ -
గొర్రెల కాపరి ఆర్థిక మంత్రా?
మండ్య: గొర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం రాదు, ఆయనను ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని నాడు విమర్శించారు. అయితే తాను మంత్రిగా, ముఖ్యమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నాగమంగల తాలూకా దొడ్డబాల గ్రామంలో బీరదేవర జాతర మహోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తాను కురుబ కులంలో పుట్టినందుకు ఓ పత్రికలో తన గురించి గొర్రెలు లెక్క పెట్టడం రాదు, ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని రాశారని గుర్తు చేసుకున్నారు. విద్యావంతున్ని అయినందుకు తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ఒకప్పుడు శూద్రులు సంస్కృతం నేర్చుకుంటే వారి చెవిలో కాచిన సీసాన్ని పోసేవారన్నారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదన్నారు. మీ పిల్లలను విద్యావంతులను చేయకుంటే సమాజంలో మీకు గౌరవం లేదని అన్నారు. కులగణనలో తేడాలు ఉండొచ్చు కులగణనలో లోపాలుంటే సరిచేస్తాం, అభిప్రాయాలు తెలియజేయాలని కేబినెట్ మంత్రులను కోరాం, అయితే ఇంకా ఎవరూ ఇవ్వలేదు అని సిద్దరామయ్య తెలిపారు. గత సమీక్షకు, ఈ సమీక్షకు వ్యత్యాసం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. అయితే జనాభాలో హెచ్చుతగ్గుల వల్ల సర్వేలో వ్యత్యాసం అయి ఉండవచ్చన్నారు. మంత్రులు అభిప్రాయాలు తెలిపిన తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. అని నన్ను హేళన చేశారు సీఎం సిద్దరామయ్య -
జంధ్యం తొలగింపుపై ధర్నా
మండ్య: జంధ్యం ధరించిన బ్రాహ్మణ విద్యార్థులకు సీఈటీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా బ్రాహ్మణ సభ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలో ధర్నా చేపట్టారు. పరీక్ష రాయకుండా వంచితులైన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా బ్రాహ్మణ సభ అధ్యక్షుడు ప్రొఫెసర్ హెచ్ఎస్ నరసింహమూర్తి, కార్యదర్శి గోపాలకృష్ణ శైణె, పదాధికారులు ఎస్.శంకరనారాయణ శాస్త్రి, అనంత్‌కుమార్, ఎస్.శ్రీధర్, సీపీ విద్యాశంకర్ పాల్గొన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్
బళ్లారిఅర్బన్: సాఫ్ట్వేర్ కంపెనీలో పని ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన శివరామ నుంచి రూ.3.75 లక్షలను ఆన్లైన్ ద్వారా తీసుకొని మోసగించిన నిందితుడిని బళ్లారి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నివాసి కోనగుంట్ల సాయికుమార్‌గా గుర్తించారు. వై.భీమేష్కుమార్, అతడి స్నేహితుడు శివరామలకు ఆన్లైన్లో పరిచయం అయిన నిందితుడు సాయికుమార్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.3.75 లక్షలను ఆన్లైన్లో తీసుకొని తమను మోసగించినట్లుగా నిందితులిచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ డాక్టర్ సంతోష్ చవాన్, సీఐ రమాకాంత్, సిబ్బంది సుధాకర్, సురేష్, తిమ్మరాజులతో కూడిన బృందం నిందితుడు సాయికుమార్‌ను గాలించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.2.50 లక్షలను జప్తు చేశారు. కాగా నిందితుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ శోభారాణి అభినందించారు. -
ఈసారి బసవ జయంతిని ఘనంగా ఆచరిద్దాం
బళ్లారిఅర్బన్: ఈసారి ఎటువంటి నిబంధనలు లేకుండా బసవ జయంతిని వైభవంగా జరుపుకుందామని బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వీరశైవ లింగాయత ప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బసవ జయంతి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తాను చేస్తాను. నిబంధనల గురించి పట్టించుకోవద్దు, సమాజ బాంధవుల సహకారంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి బసవ జయంతిని వైభవంగా జరుపుకుందాం అన్నారు. ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. జయంతి వేడుకల ఆచరణలో తన స్వార్థం ఏమి లేదు. బసవణ్ణను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రాయబారిగా ప్రకటించడంలో సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఘనత ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు సమాజం ఆధ్వర్యంలో కూడా జయంతి జరుపుకునే దిశలో కూడా ఆలోచించాలని సూచించారు. రూ.1.5 కోట్ల నిధులతో అశ్వారూఢ బసవణ్ణ విగ్రహాన్ని కేఈబీ సర్కిల్లో ఏర్పాటు చేద్దామని, దీనికి స్థలం ఇచ్చిన గడిగి కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కమ్మరచేడు సంస్థాన కళ్యాణ స్వామి, హరగినడోణి స్వామి సాన్నిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో అల్లం ప్రశాంత్, దండిన శివానంద, చోరనూరు కొట్రప్ప, కోరి విరుపాక్షప్ప, కరేనహళ్లి చంద్రశేఖర్, నరేంద్రబాబు, టీహెచ్ఎం గురుబసవరాజ్, డాక్టర్ మహిపాల్, అసుండి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్‌లో అదనపు నియామకాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో గైర్హాజరైన అప్రెంటీస్ వైద్య విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రగతిశీల సంఘం వేదిక అధ్యక్షుడు రాజు పట్టి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గత ఏదాడి జనవరిలో త్రిశూల్ నాయక్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఏడాది పాటు అప్రెంటిస్‌గా రిమ్స్‌లో పని చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా నియమాలను గాలికొదిలి గైర్హాజరై ఐఏఎస్ కోచింగ్ కోసం న్యూఢిల్లీలో ఉన్నాడన్నారు. మరో వైపు జీవ రసాయన శాస్త్రం బోధించడానికి రిమ్స్ కళాశాలలో ట్యూటర్‌గా నెలకు రూ.40 వేల చొప్పున వేతనం పొందారని తెలిపారు. త్రిశూల్ నాయక్ తండ్రి శాసన సభ్యుడి కుమారుడు కావడంతో డీన్ రమేష్ ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. నేత్ర విభాగంలో కృష్ణయ్య ఆడియోమెట్రిగా ఉన్నా అదనంగా జిల్లాధికారి భార్య దీపికను నియమించారని ఆరోపించారు. ఈ విషయంలో అప్రెంటిస్ వైద్య విద్యార్థిపై, డీన్ రమేష్, దీపికలపై చర్యలు చేపట్టాలని ఆయన ఒత్తిడి చేశారు. సభ్యులు బేరి, నరసింహులు, చంద్రశేఖర్, భాస్కర్, శ్రీనివాసులున్నారు. -
ఎన్కౌంటర్ కేసుపై సీఐడీ ఏడీజీపీ ఆరా
హుబ్లీ: నగరంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న 5 ఏళ్ల చిన్నారిని చెరబట్టి హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితుడు రితేష్‌కుమార్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సీఐడీ ఏడీజీపీ బీకే.సింగ్ నగరానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సీఐడీ అధికారుల బృందం ఎస్పీ వెంకటేష్, ఏసీపీ శివప్రకాష్ ఆధ్వర్యంలో చురుగ్గా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగ్ సదరు అధికారులతో కేసు సమగ్ర వివరాలను సేకరించారు. అలాగే ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి కాంపౌండ్‌లో ఆటలాడుతున్న చిన్నారిని నిందితుడు చాక్లెట్ ఇస్తానని మభ్య పెట్టి ఎదురుగా ఉన్న షెడ్లోకి ఆ చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. అయితే నిందితుడిని వెంటబెట్టుకొని స్థల పరిశీలన చేసే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహిళా ఎస్ఐ అన్నపూర్ణ నిందితుడిని పారిపోవద్దు, లొంగిపొమ్మంటు హెచ్చరించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినా పట్టించుకోక పోవడంతో నిందితుడి కాలిపైన, అలాగే వెన్నుపైన రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడు హతమైన విషయం తెలిసిందే. కాగా ఏడీజీపీ రాకతో కేసు దర్యాప్తు మరింత వేగాన్ని పుంజుకుంది. -
దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి కఠోర సాధన, ప్రతిభ కలిస్తేనే విజయం వరిస్తుంది. అదే కోవలో కన్నడనాడు నుంచి పలువురు ప్రతిభావంతులు యూపీఎస్సీ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి పోస్టులకు అర్హత సాధించారు.
సాక్షి, బళ్లారి: ఢిల్లీలో మంగళవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో కన్నడ యువతీ యువకులు ర్యాంకులు సంపాదించారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా హొసపేట గ్రామానికి చెందిన సచిన్ బసవరాజు 41వ ర్యాంక్ సాధించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యునిగా పని చేస్తూ యూపీఎస్ఈ పరీక్షలు రాశారు. ఒకటి, రెండు, మూడుసార్లు పరీక్షలు రాసినా విజయం వరించలేదు. అయినా నిరాశ చెందక నాలుగోసారి జయకేతనం ఎగురవేశారు. జాతీయస్థాయిలో 41వ ర్యాంక్ సాధించిన సచిన్‌తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవం వెల్లువిరిసింది. కలెక్టర్ కావాలన్నదే తన కల అని చెప్పారు. మరో 10 మంది ర్యాంకర్లు బొమ్మనహళ్లి: కర్ణాటక నుంచి ఇద్దరు వైద్యులు టాప్– 50 ర్యాంకులు సాధించడం గమనార్హం. డాక్టర్.రంగమంజు 24వ ర్యాంకు పొందారు. మరొకరు హావేరి వాసి డా.సచిన్. రాష్ట్రం నుంచి ర్యాంకులు సాధించిన మిగతావారి వివరాలు.. ● అనుప్రియా సఖ్య–120వ ర్యాంకు ● బీ.ఎం.మేఘనా – 425 ● భరత్ సీ.యార– 567, ● డాక్టర్. భాను ప్రకాశ్– 523 ● నిఖిల్ ఎం.ఆర్– 724, ● టీ.విజయ్‌కుమార్– 894 ● హనుమంతప్ప నంది– 910 ● విశాకదకం– 962, ● సందీప్ సింగ్– 981, ● మోహన్ పాటిల్ 984 ర్యాంకు. కోలారులో మధు, మాధవి...శివమొగ్గలో వికాస్.. యూపీఎస్సీ ఫలితాల్లో కన్నడిగుల ప్రతిభ పలువురికి ఉత్తమ ర్యాంకులు కోలారు: సివిల్స్‌లో కోలారు జిల్లా యువతీ యువకులు సత్తా చాటుకున్నారు. జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకా ఉపాధ్యాయ దంపతులు రవికుమార్, నందినిల కుమార్తె మాధవి 446వ ర్యాంకును సాధించారు. ఎంబిబిఎస్ చేసిన మాధవి మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణురాలు అయింది. కోలారు తాలూకా ఇరగసంద్ర గ్రామానికి చెందిన రైతు ఆనంద్, సుశీలమ్మ కుమారుడు ఎ.మధు 544వ ర్యాంకు సాధించారు. అగ్రి బీఎస్సీ చదివిన మధు యూపీఎస్సీ పరీక్షలను ఎంచుకుని విజయం సాధించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరికొందరు ఉత్తమ ర్యాంకులను సాధించారు. శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చెందిన వికాస్ 228వ ర్యాంకును సాధించారు. అదే ఊరిలో పాఠశాల, ఇంటర్‌ను పూర్తిచేశారు. శివమొగ్గలో లెక్చరర్ అయిన విజయేంద్ర పాటిల్ , టీచర్ మహాలక్ష్మి దంపతుల కుమారుడు వికాస్. ఢిల్లీలో ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. మంచి ర్యాంకు సాధించడంతో బంధుమిత్రుల్లో సంతోషం నెలకొంది. -
జంధ్యం తొలగింపుపై నిరసన
హొసపేటె: సీఈటీ పరీక్షల సమయంలో బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం తొలగించిన సంఘటనపై హొసపేటెలోని బ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జంధ్యం తొలగింపును ఖండిస్తూ విజయనగర జిల్లాధికారి కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలో ఆందోళనకారులు మాట్లాడారు. ఆ ఘటనలతో కేవలం బ్రాహ్మణ సమాజాన్నే కాదు, మొత్తం హిందూ సమాజాన్నే అవమానించారన్నారు. ఈ ఘటనలో కేవలం అధికారులను మాత్రమే సస్పెండ్ చేశారన్నారు. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ధోరణిని వెంటనే మార్చాలి. ఉద్దేశపూర్వకంగా జంధ్యం తొలగించడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. జంధ్యం బ్రాహ్మణ సమాజం హక్కు అని పేర్కొన్నారు. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం: మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమైపె తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. రిక్కీ రై కేసులో పోలీసుల అనుమానాలు గన్‌మ్యాన్ విచారణ -
చెన్నకేశవునికి సూర్యాభిషేకం ●
● 4 ఏళ్ల తరువాత సాకారం దొడ్డబళ్లాపురం: నాలుగు సంవత్సరాల తరువాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. హాసన్ జిల్లా బేలూరులోని సుప్రసిద్ధ చెన్నకేశవస్వామి దేవాలయంలో స్వామి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. గత నాలుగేళ్లుగా వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల సూర్య కిరణాలు స్వామి విగ్రహాన్ని స్పర్శించలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో ఈ అద్భుతం జరుగుతుంది. ఈసారి మంగళవారంనాడు ఉదయం 6:10 గంటలకు దేవాలయం గోపురాన్ని తాకిన సూర్య కిరణాలు 6:15కి విగ్రహాన్ని స్పృశించాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. షేర్ల పేరుతో రూ.3 లక్షలు టోపీమైసూరు: అతి స్వల్ప సమయంలో డబ్బు సంపాదించాలని ఆశపడి లక్షలాది రూపాయలను కోల్పోయి వంచనకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి రూ.3 లక్షలను కోల్పోయిన ఘటన నగరంలో జరిగింది. నగరంలోని కేఎన్పుర నివాసికి టెలిగ్రాం ద్వారా షేర్ మార్కెట్ గురించి సందేశం వచ్చింది. దీంతో అతను వంచకులు చెప్పిన గ్రూప్‌లో చేరారు. తర్వాత దుండగులు మీరు మా ద్వారా షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆశ పుట్టించారు. వంచకుల మాటలను నమ్మిన ఆ వ్యక్తి దశల వారీగా రూ.3.05 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు జమ చేసి చివరకు మోసపోయారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుమార్తె స్నేహితురాలిపై దారుణం ●● కామాంధుడు అరెస్టు దొడ్డబళ్లాపురం: కుమార్తె స్నేహితురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపిన సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకాలో చోటుచేసుకుంది. మధు (45) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన కుమార్తె చేత ఫోన్ చేయించిన ఆమె స్నేహితురాలిని ఇంటికి రప్పించాడు. ముందు ఇద్దరికీ చాక్లెట్లు, ఇచ్చి మరిన్ని చాక్లెట్లు తీసుకురావాలని తన కుమార్తెను దుకాణానికి పంపించాడు. ఆ సమయంలో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంతలో బాలిక తల్లి ఫోన్ చేసి కుమార్తెను పంపించాలని అడిగింది, ఆమె ఆడుకుంటోందని, కొంతసేపటికి వస్తుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి బాలిక తల్లితండ్రులు మధు ఇంటికి వచ్చి చూడగా ఘోరం బయటపడింది. వారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధున్ని అరెస్టు చేశారు. దర్శన్‌కు పవిత్ర ఏమవుతారు? ●● సుప్రీం జడ్జి ప్రశ్న దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌కు హైకోర్టు కోర్టు సాధారణ బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారంనాడు విచారణ సాగింది. ఈ సందర్భంగా జడ్జి.. దర్శన్‌కు నిందితురాలు పవిత్రగౌడ ఏమవుతారని దర్శన్ వకీలు మను సింఘ్విని ప్రశ్నించారు. మిస్ట్రెస్ అవుతుందని లాయర్ తెలిపారు. మరి దర్శన్‌కు వివాహం జరిగిందా అని ప్రశ్నించగా, అవునని లాయర్ సమాధానమిచ్చారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సింఘ్వి వాదించగా, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. మిస్ట్రెస్ అంటే ఇంగ్లీష్‌లో వివాహిత పురుషునితో సుదీర్ఘ కాలంగా లైంగిక సంబంధం ఉన్న మహిళ అని అర్థం. ఈ వాదనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సీసీబీకి ఓంప్రకాష్ హత్య కేసు బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకేసు దర్యాప్తును సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు అప్పగించామని, దర్యాప్తులో హత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తాయని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే సీసీబీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఓంప్రకాష్ భార్యని అరెస్ట్‌చేసి విచారిస్తున్నారని తెలిపారు. -
అందరి కృషితో బళ్లారికే కేంద్ర కార్యాలయం
బళ్లారిఅర్బన్: ఎన్నో ఏళ్లుగా కర్ణాటక గ్రామీణ బ్యాంక్(కేజీబీ) కేంద్ర కార్యాలయం బళ్లారిలో ఉన్నా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధార్వాడ, బెంగళూరు ప్రాంతాలకు కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు రావడంతో బళ్లారిలోని వివిధ కన్నడ పర సంఘాల నాయకుల పోరాటం, ప్రజాప్రతినిధుల కృషితో కేజీబీ ప్రధాన కార్యాలయం తిరిగి బళ్లారికే దక్కిందని సహమత సంఘాల ఐక్యత అధ్యక్షుడు పన్నారాజ్ తెలిపారు. మంగళవారం రామప్ప సభాభవనంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం పదాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేజీబీ ప్రధాన కార్యాలయం బళ్లారికి తిరిగి రావడంతో సహకరించిన సంఘాల నేతలను గుర్తించి స్వీట్లను పంచి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కసాప అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, కన్నడ పర సంఘాల నేతలు టీ.శేఖర్, గడ్డం తిమ్మప్ప, మంజునాథ్, శ్రీనివాస్, పుష్ప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్ర దాడిలో ఇద్దరు కన్నడిగుల బలి
సాక్షి బెంగళూరు: జమ్ముకశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో శివమొగ్గవాసి మంజునాథ్ రావు (47)తో పాటు మరో కన్నడిగుడు మరణించాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరుకు చెందిన భరత్ భూషణ్‌గా గుర్తించారు. ఈయన మాజీ స్పీకర్ కేబీ కోళివాడ అల్లుడికి స్నేహితుడు. కాగా, జమ్మూకశ్మీర్‌లో కన్నడిగులు ఉగ్రదాడికి గురయ్యారనే వార్త విన్న వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య కార్యదర్శులు, సీనియర్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించి కన్నడిగుల కోసం తక్షణ సహాయం చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సూచనల మేరకు అధికారుల బృందం ఒకటి కశ్మీర్‌కు పయనమైంది. పోలీసులు కూడా వెళ్లారు. -
వక్ఫ్ బోర్డు బిల్లుకు సవరణపై కదం
సాక్షి,బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు తీవ్ర ఆందోళన, నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. సోమవారం నగరంలోని ముస్లిం సోదరులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. నగరంలోని మోతీ సర్కిల్ నుంచి రాయల్ సర్కిల్ వరకు వేలాది మంది ముస్లిం సోదరులు ర్యాలీగా వచ్చి ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ చేయడం దారుణం అని ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు. బీజేపీ ధోరణి కక్షపూరితం ముస్లింలపై బీజేపీ కక్షపూరిత ధోరణిలో పని చేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లును సవరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది కోట్లాది మంది ముస్లింలకు వ్యతిరేకంగా, వారికి అన్యాయం చేయడానికి చేసిన పన్నాగం అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. బళ్లారిలో ప్రారంభమైన ఆందోళనను ఢిల్లీ పెద్దల వరకు చేరుస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కచ్చితంగా మోదీకి, బీజేపీ తగిన గుణపాఠం చెబుతారన్నారు. బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే నాగేంద్ర మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లుపై సవరణకు వ్యతిరేకంగా ముస్లింలే కాకుండా హిందువులు కూడా వేలాది మంది వచ్చారన్నారు. దేశంలో హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా ఉన్నారని, అయితే బీజేపీ నాయకులు మాత్రం విడగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి కలలు సాకారం కాబోవన్నారు. హిట్లర్ తరహాలో బీజేపీ పని చేస్తోందన్నారు. లోక్‌సభ సభ్యుడు తుకారాం, డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, మైనార్టీ నేతలు హుమయూన్ ఖాన్, పాలికె కార్పొరేటర్లు పాల్గొన్నారు. వేలాది మంది ముస్లిం సోదరుల ఆందోళన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు -
పిడుగుపాటుకు 36 జీవాల మృతి
హొసపేటె: పిడుగుపాటుకు 36 గొర్రెలు మృతి చెందిన సంఘటన కొప్పళ జిల్లా యలబుర్గా తాలూకాలోని గంధాల గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. పిడుగుపాటుకు గ్రామంలోని గవిసిద్దప్ప నవలహళ్లి అనే గొర్రెల కాపరికి చెందిన 36 గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరి గవిసిద్దప్ప నవలహల్లి స్పృహ తప్పి పడిపోయాడు. పిడుగుపాటుకు గొర్రెలు చనిపోవడంతో గొర్రెల పెంపకందారుకు భారీ నష్టం వాటిల్లింది. బాధితుడు గవిసిద్దప్ప కుటుంబం పరిహారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఘటనా స్థలానికి తహసీల్దార్ బసవరాజ్ తెన్నళ్లి, పశువైద్యాధికారి సిద్దప్ప చవాన్, బేవూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహంతేష్ సజ్జన్ తదితరులు పరిశీలించి, ప్రకృతి వైపరీత్య సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కూడ్లిగి తాలూకాలో.. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలో ఆదివారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. హరవాడి గ్రామంలో పిడుగుపాటుకు 3 మేకలు చనిపోయాయి. గ్రామానికి చెందిన కుమారస్వామి తన మేకలను మేపడానికి పొలానికి వెళ్లినప్పుడు సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. మేకలు చెట్టు కింద తలదాచుకోగా ఈ సంఘటన జరిగింది. గుడేకోటె పోలీస్ స్టేషన్ అధికారులు, గ్రామ నిర్వాహకుడు, పశువైద్య అధికారి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. షాక్‌తో స్పృహ కోల్పోయిన గొర్రెల కాపరి -
పిల్లలకు ధర్మ సందేశాలు నేర్పాలి
రాయచూరు రూరల్: హిందూ వైదిక ధర్మ సందేశాలను పిల్లలకు బోధించడం మనందరి కర్తవ్వమని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం రామలింగేశ్వర ఆలయంలో జిల్లా బేడ జంగమ ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి మంత్రోపచారణ, ఇష్ట లింగపూజ, ఆచమ, అగమ, ఇతర పఠాణాలను శిబిరంలో నేర్పిన విద్య చిరకాలం గుర్తుంటుందని ప్రస్తావించారు. శిబిరంలో వీర సంగమేశ్వర స్వామి, శరణ భూపాల్ నాడగౌడ, చంద్ర శేఖర్ పాటిల్, అశోక్, సూగప్ప, శరణయ్యలున్నారు. -
కులగణన అస్త్రం బూటకం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో రెండు లక్షల జనాభాకు బదులుగా కేవలం నాలుగు వేల మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొనడం విడ్డూరంగా ఉందని మాజీ శాసన సభ్యుడు, మున్నూరు కాపు సమాజం అధ్యక్షుడు పాపారెడ్డి ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాలో 75 వేల మంది జనాభా ఉండగా కేవలం 4,280 మంది ఉన్నట్లు పేర్కొనడం తగదన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోడానికి కుట్ర పన్నారని, రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటకమాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కులగణన సమీక్షకు రాలేదన్నారు. మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. బసవరాజరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్‌రెడ్డి, కృష్ణమూర్తిలున్నారు. -
లారీ బోల్తా పడి దగ్ధం
హొసపేటె: కూడ్లిగి తాలూకా శివపుర గ్రామ సమీపంలోని జాతీయ రహదారి– 50పై వేరుశనగ లోడుతో నిండిన లారీ అకస్మాత్తుగా బోల్తా పడి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. బాగల్కోటె నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న వేరుశెనగ విత్తనాలతో కూడిన లోడు లారీ బోల్తా మంటల్లో చిక్కుకుంది. దాని సరుకు కూడా మంటల్లో కాలిపోయింది. లారీ డ్రైవర్ మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కూడ్లిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రకాష్ ఆ ప్రాంతంలో వన్‌వే ట్రాఫిక్ సులభతరానికి చర్యలు తీసుకున్నారు. బాలికపై అత్యాచారయత్నం● నిందితుని అరెస్టు హుబ్లీ: మైనర్ బాలికపై ఓ నీచుడు అత్యాచారానికి ప్రయత్నించి జైలు పాలైన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకాలోని ఐగళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాంధుడు మహంతేష్ హిప్పరిగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ కృత్యానికి పాల్పడ్డాడు. తక్షణమే బాలిక తల్లిదండ్రులకు ఘటన గురించి తెలిపింది. దీంతో వారు ఐగళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న ఐగళి పోలీసులు అతనిని కోర్టులో హాజరు పరిచి జుడీషియల్ కస్టడీకి అప్పగించారు. పంటనష్టం పరిశీలన హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ చిదానందతో సహా అధికారులు ఇటీవల ఈదురు గాలులు, వర్షాల కారణంగా దెబ్బ తిన్న పంటలను సోమవారం పరిశీలించి నష్టం అంచనా వేశారు. తాలూకాలోని అయ్యనహళ్లిలో వీరభద్రప్ప అనే రైతుకు చెందిన పంట ఈదురు గాలులకు, వర్షం కారణంగా పూర్తిగా నాశనమైంది. తన 11 ఎకరాల బొప్పాయి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినక పోయినా, ఎతైన ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు వ్యవసాయ శాఖ నుంచి లభించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంబీ.అయ్యనహళ్లికి చెందిన మరో రైతు యజమానప్ప తన భూమిలో పండిస్తున్న వర్షానికి ధ్వంసమైన డాగన్ ఫ్రూట్ పంటను వీక్షించారు. ఉద్యానవన అధికారులు మహ్మద్ సయ్యద్, గుడేకోటె విశ్వనాథ్, రైతులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు ప్రసవమైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కారవార నుంచి యాదగిరికి ఆర్టీసీ బస్సులో వస్తుండగా మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన యాదగిరి జిల్లా సురపుర తాలూకా హోంబళకల్కు చెందిన శాంభవికి రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా ముదుగల్ వద్ద బస్సులోనే ప్రసవం అయింది. అదే బస్సులో ఆశా కార్యకర్త ప్రయాణిస్తుడడంతో ప్రసవ సుగమమైంది. అనంతరం తల్లీబిడ్డను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. నరేగ పనులపై పర్యవేక్షణరాయచూరు రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న నరేగ పనుల పర్యవేక్షణకు కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. సోమవారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రగతిపై పరిశీలించింది. జెడ్పీ ప్రణాళికాధికారి శరణ బసవ ఆధ్వర్యంలో కేంద్ర బృందానికి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి కూలీలతో చర్చించారు. కర్ణాటకతో పాటు తెలంగాణ, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పర్యటించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ బాలమురళి తెలిపారు. ఆయన వెంట అధికారులు శివశంకర్, అవనేంద్ర కుమార్ పర్యటించారు. -
మాతృభాషను ఆదరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో మాతృభాషను ఆదరించాలని విధాన పరిషత్ సభ్యుడు శశీల్ నమోషి పిలుపు ఇచ్చారు. సోమవారం కలబుర్గిలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థకు చెందిన వీరమ్మ గంగసిరి మహిళా కళాశాలలో విద్యార్థులకు రెండు వారాల పాటు హిందీ భాషను నేర్పేందుకు ఏర్పాటు చేసిన తరగతులను ప్రారంబించి మాట్లాడారు. కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యోగేంద్ర మిశ్రా, రణజిత్, రాజేంద్ర కొండా, ప్రేమ చంద్ర, అంజలి, రామలింగ, మహేష్, దయానంద, కవిత, సుష్మాలున్నారు. దొంగ అరెస్ట్ హుబ్లీ: కార్వార రోడ్డులో నిలిపిన గూడ్స్ వాహనంలోని మూడు బైక్‌లతో పాటు మొత్తం రూ.15.50 లక్షల విలువ చేసే గృహ వినియోగ వస్తువులు చోరీ చేయగా సదరు నిందితుడిని అరెస్ట్ చేయడంలో పాత హుబ్లీ పోలీసులు సఫలీకృతులయ్యారు. జిల్లాలోని కుందగోళ తాలూకా రామనకొప్ప విఠల కురడి(27) అరెస్ట్ అయిన నిందితుడు. ఇద్దరు సైనికులకు చెందిన బైక్‌లు, గృహ వినియోగ వస్తువులను చైన్నె నుంచి గోవాకు వాహనంలో తరలిస్తున్నారు. ఈనెల 17న రాత్రి 10.30 గంటలకు బైపాస్ రోడ్డులో వాహనం పార్క్ చేసి డ్రైవర్ భోజనానికి వెళ్లినప్పుడు నిందితుడు చోరీ చేశాడు. ఈ ఘటనపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఏసీపీ ఉమేష్ చిక్కమఠ సారథ్యంలో చురుగ్గా గాలింపు చేపట్టిన సీఐ ఎంఎల్ సింధూర బృందం నిందితుడిని చోరీ వస్తువులతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపు బృందంలో ఎస్ఐ తాతన్నవర, విశ్వనాథ, సిబ్బంది కాళె, అభయ, బసవరాజ, రమేష్, కాళనగౌడ తదితరులు ఉన్నారు. మామిడికాయలు వదిలి పరారీ కాగా మరో ఘటనలో వేబ్రిడ్జి పైనే మామిడి కాయలు విడిచి వెళ్లిన వైనం వెలుగు చూసింది. మామిడి పండ్లను చోరీ చేసి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వ్యాపారస్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దొంగలు వేబ్రిడ్జిపైనే మామిడి కాయలను వదిలి పరారయ్యారు. ధార్వాడ కెళగేరి గుడ్డదమఠ వేబ్రిడ్జి వద్దకు తూకం చేయడానికి ముగ్గురు 5, 6 బస్తాల్లో 5 క్వింటాళ్ల మేర మామిడి పండ్లను తెచ్చారు. ఇంకా హోల్‌సేల్ మామిడి పండ్ల అంగడి తెరవలేదు. ఇప్పుడే ఎందుకు కాయలు తెచ్చారని అనుమానంతో గ్రామస్తులు ప్రశ్నించగా దొంగలు ఎక్కడ పట్టుబడతామన్న భయంతో సమాధానం ఇవ్వకుండానే తాము తెచ్చిన సరుకును అక్కడే వదిలేసి పరారయ్యారు. అధికారులపై చర్యలకు వినతి రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రాహ్మణులను అవమానించేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు చేపట్టాలని అఖల కర్ణాటక బ్రాహ్మణ మండలి మహా సభ డిమాండ్ చేసింది. సోమవారం మాన్వి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు విజయ కుమార్ మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాయడానికొచ్చిన బ్రాహ్మణ విద్యార్థులను అవమాన పరిచేలా నడుచుకున్న అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. సమాజంలో సంప్రదాయాలను కాదని పరీక్షలు రాసే సమయంలో వంటిపై ఉన్న జంధ్యాన్ని తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. న్యాయవాదుల ఆందోళన రాయచూరు రూరల్: బెంగళూరు న్యాయవాది సదాశివరెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఈనెల 16న న్యాయవాది సదాశివరెడ్డి కార్యాలయంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి గాయపరిచారన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు అధికమయ్యాయని, తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మప్ప, జగదీష్, మున్నా, వీరభద్రప్ప, రాజ్ కుమార్, శివకుమార్, సంగప్ప, గిరీష్, ఓంకార్లున్నారు. బావిలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలుర దుర్మరణం రాయచూరు రూరల్: బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బసవ కళ్యాణ తాలూకా ముచళంబ్లో జరిగింది. మృతులను ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన అవినాష్(16), బాగేష్(16)లుగా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు సెలవులు వదలడంతో స్నేహితులతో కలసి బావిలో ఈత కోసం వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సరుకు వాహనం బోల్తా.. 22 మందికి గాయాలు
హొసపేటె: కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకాలోని బాలయ్య క్యాంపునకు వెళ్తుండగా కలమంగి సమీపంలో గూడ్స్ వాహనం టైరు పేలి బోల్తా పడటంతో 22 మంది గాయపడ్డారు. బాలయ్య క్యాంపులో నూతన వధూవరులకు నీళ్లు పోసే కార్యక్రమం ఉండటంతో శనివారం ఉదయం గుమగేరా నుంచి నూతన వధూవరులతో సహా 25 మందితో వెళ్తున్న గూడ్స్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో గుమగేరా రామప్ప, మంజునాథ్, ప్రశాంత్, సరస్వతి, వైష్ణవి, దేవమ్మ, గంగప్ప, గంగమ్మ, జయశ్రీ, పూజ, నాగప్ప, చంచలమ్మ, మంజునాథ, సిద్దలింగ, పరశురామ గుమగేరా, మంజమ్మ, ద్యామమ్మ, యమనూరప్ప, దురుగప్ప, యమనూరు, నీలవ్వ, అడివెప్ప తదితరులందరికీ స్వల్ప గాయాలవడంతో వైద్యులు చికిత్స అందించారు. ఘటనపై తుర్విహాళ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
స్వయం ఉపాధి శిక్షణతో ఆర్థిక స్వావలంబన
హొసపేటె: స్వయం ఉపాఽధి శిక్షణ కేంద్రం గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని సృష్టించడం ద్వారా స్వావలంబన, ఆర్థికంగా సాధికారత సాధనకు సహాయపడిందని ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు అన్నారు. ఆయన సోమవారం నగరంలోని పుణ్యమూర్తి సర్కిల్ సమీపంలోని పాత ప్రభుత్వ బాలికల పీయూ కళాశాల ఆవరణలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణా సంస్థ విజయనగర జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణను అందిస్తోందన్నారు. మహిళలు, పురుషులకు కుట్టు శిక్షణ, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, అగర్బత్తీల తయారీ, మోటార్ రివైండింగ్, పంప్‌సెట్ మరమ్మతు, మొబైల్ మరమ్మతులపై శిక్షణ అందిస్తారన్నారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువత శిక్షణ సంస్థ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు. హొసపేటె ప్రాంతీయ కార్యాలయం జనరల్ మేనేజర్ అమిత్ గోయల్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ గిరిధర్, అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయ, మేనేజర్ ఈరన్న, లక్ష్మీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ధరలు తగ్గించాలని డిమాండ్
రాయచూరు రూరల్: పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు, పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర కార్యదర్శి వీరేష్ మాట్లాడారు. పంచ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసిందన్నారు. నేడు విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరలను తగ్గించడానికి రాష్ట్ర సర్కార్‌కు ఆదేశాలు జారీ చేయాలని, వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో పద్మ, శరణ బసవ, నరంసింహ, లక్ష్మణ, గోకారమ్మ, ఇందిర, చంద్రకళ, భీమప్ప, విజయలక్ష్మి, హులిగప్ప, మల్లికార్జునలున్నారు. -
హిజాబ్, జంధ్యం వివాదాలు వేర్వేరు
హుబ్లీ: జంధ్యం విషయాన్ని అనవసరంగా బీజేపీ నేతలు పెద్దది చేస్తున్నారు. బెళగావిలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందు నిలబడి ఆందోళన చేపట్టారని బెళగావి జిల్లా ఇన్చార్జి మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. ఆయన బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎవరికై నా అన్యాయం జరిగితే ఈ ఎమ్మెల్యేలు ఎవరూ రారు. అందరిని ఒకే దృష్టితో చూడాలంటూ బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మంత్రికి చురక వేశారు. బీజేపీ సర్కారులో హిజాబ్ వివాదం జరిగింది, ఇప్పుడేమో జంధ్యం వివాదంపై మంత్రి స్పందిస్తూ అది వేరే, ఇది వేరే. ఇది ఆకస్మికంగా జరిగింది. రెండింటినీ పోల్చడానికి కుదరదు. బీజేపీ ఆందోళన చేస్తోంది. ప్రస్తుతం వారికేమీ పని లేదు. ఈక్రమంలో నేడు బెళగావిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఆందోళనకు అందరిని పిలుచుకొని వచ్చారన్నారు. ఎవరు దోషులో వారిపై చర్యలు చేపట్టాలి. అయితే ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం అన్నారు. తొలి ఏడాది నుంచి కొత్త జిల్లాధికారి కార్యాలయ భవనం కావాలని ప్రయత్నిస్తున్నాను. మూడు దశల్లో నిర్మాణ పనులు జరుగుతాయి. ప్రస్తుతం తొలి దశ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు తాత్కాలికంగా వేరే చోటకు తరలిస్తామన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి రెండు, మూడేళ్లు పట్టవచ్చు. త్వరలో మరిన్ని పనులు జాతికి అంకితం ఇక పైవంతెన పూర్తి కావడానికి కనీసం రెండేళ్లు కావాలి. వానాకాలం గడిచాక పనులు ప్రారంభం అవుతాయి. స్మార్ట్ సిటీ పథకం కింద ఒక్కొక్కటి పూర్తవుతాయని వివరించారు. నగర కేంద్ర బస్టాండ్ ఓ నెలలో పూర్తి అవుతుందన్నారు. దానిని జూన్ 1న ప్రారంభిస్తామన్నారు. మరిన్ని పనులు జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అక్రమ ఇళ్ల గురించి ఆదివారం సీఎం అధికారికంగా ఆదేశాలను ఇచ్చారన్నారు. ఇళ్లు నిర్మించుకుంటే చాలు అలాంటి వారికి కార్పొరేషన్ కనీస వసతులను కల్పిస్తుందన్నారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి ఎటువంటి సమస్య లేదన్నారు. అయినా జాప్యం జరుగుతోందని, దీన్ని తప్పకుండా పూర్తి చేసి తీరుతామన్నారు. బెంగళూరు తరహాలో బెళగావిలో అభివృద్ధి విషయానికి సంబంధించి దీనికి చాలా సమయం పడుతోందన్నారు. బెంగళూరుకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఎదుగుతోంది. బెళగావి అభివృద్ధి 2013లో సిద్దరామయ్య ప్రభుత్వం వచ్చాకే మొదలైందన్నారు. పూర్తి అభివృద్ధికి పదేళ్ల సమయం అవసరం అన్నారు. రాహుల్ జార్కిహోళి డీడీసీ బ్యాంక్ ఎన్నికల్లో పోటీపై మాట్లాడుతూ దీనిపై ఇంకా చర్చ జరుగుతుంది. అన్ని సొసైటీలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాహుల్ రాజకీయ ప్రవేశం చేశారని ఆయన గుర్తు చేశారు. మంత్రి సతీష్ జార్కిహోళి -
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
రాయచూరు రూరల్: పాగల్ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది. పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో భయపడి గదగ్ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్ (29) డెత్‌నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయింది. ఆటల్లో ఆమె మేటి సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో డ్రిల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు. గదగ్ జిల్లాలో డ్రిల్ టీచర్ ఆత్మహత్య మాజీ ప్రియుని వేధింపులే కారణం -
క్రూరంగా హత్య చేశారు
బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకు గురయ్యే గంట ముందు వరకు వ్యక్తిగత సిబ్బందితో బాగానే మాట్లాడారు, ఇలా హత్యకు గురికావడం దురదృష్టకరమని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఓంప్రకాష్ ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఓంప్రకాష్‌కు ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడారు, సోమవారం ఇంటికి వస్తాను సార్ అని చెప్పా, వద్దు ఇంట్లో మేడం ఉన్నారని సార్ చెప్పారు అని పేర్కొన్నారు. చాలా క్రూరంగా హత్య చేశారని, గొంతు భాగంలో రెండుసార్లు పొడిచారు, మృతదేహాన్ని చూడగానే సారేనా హత్యకు గురైంది అని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి, కొడుకుతో ఉంటానని చెప్పేవారన్నారు. -
చెట్ల నరికివేతపై విచారణ
మైసూరు: మైసూరు నగరంలోని జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదురుగా ఉన్న హైదర్ అలీ రోడ్డు వెడల్పు చేయడానికి రాత్రికి రాత్రే అధికారులు 40కి పైన పెద్ద పెద్ద చెట్లను నరికివేశారు. చెట్లు నరికేందుకు పాలికే అనుమతి ఇచ్చింది. దీనిపై అటవీ అధికారులు మండిపడ్డారు. ప్రజలు పెద్దసంఖ్యలో ఆందోళనలు కూడా చేయడం మొదలైంది. దీంతో అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రె చెట్ల వ్యవహారం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు నరికివేశారో కారణాలతో నివేదిన ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే అటవీ అధికారులు విచారణ చేయాలని మంత్రి సూచించారు. మెట్రోలో గుట్కా రగడ యశవంతపుర: బెంగళూరు నమ్మ మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడు గుట్కా వేసుకోవడం, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెప్పడంతో గొడవ జరిగింది. ఈ వీడియోను బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గుట్కా సేవకునిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బీఎంఆర్‌సీఎల్‌ను డిమాండ్ చేశారు. గుట్కా వేస్తున్న ప్రయాణికున్ని తోటి ప్రయాణికులు గట్టిగా ప్రశ్నించారు. మొదట ట్రైన్ నుంచి దిగిపోవాలని సూచించారు. మెట్రోలో ఇలాంటి పని చేయవద్దని చెప్పారు. మెట్రో నాదే, నేను గుట్కా వేస్తే మీకేమి ఇబ్బంది అని అతడు ఎదురు ప్రశ్నించాడు. దీంతో అక్కడ కొంతసేపు రభస చోటుచేసుకుంది. విహారంలో విషాదం.. తండ్రీ కొడుకు జలసమాధి శివమొగ్గ: సంతోషంగా సాగిన విహారయాత్ర విషాదంగా ముగిసింది. భద్రా జలాశయం నీటిలో మునిగి తండ్రీ కుమారుడు మరణించారు. ఈ దుర్ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. భద్రావతి నగరంలో ఉన్న భూతనగుడిలో ప్లై వుడ్ షాపు యజమాని మహ్మద్ జాబీర్ (55), కుమారుడు జావేద్ (15) మృతులు. సెలవు కావడంతో కుటుంబంతో కలిసి విహారానికి భద్రా జలాశయానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి సేదదీరారు. సాయంత్రం సమయంలో జావేద్ డ్యాం గట్టున నీటిలో ఆడుకుంటూ మునిగిపోయాడు. తండ్రి జాబీర్ అతన్ని కాపాడేందుకు నీటిలోకి దిగాడు, కానీ నీటిలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కళ్లముందే ఘోరంతో ఆర్తనాదాలు చేయసాగారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి జలాశయంలో గాలింపు జరపగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. భద్రావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్‌శెట్టి టెంపుల్‌రన్ యశవంతపుర: బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి కుటుంబసమేతంగా ఉడుపి జిల్లా కాపు తాలూకా హొస మారి గుడిని దర్శించుకున్నారు. దేవస్థానంలో నూతన నిర్మాణం, శిల్పాలను చూసి అబ్బురపడ్డారు. పూజలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. దక్షిణ కన్నడ జిల్లా బప్పనాడులో జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి ఆయన తల్లితో కలిసి వచ్చారు. ముల్కికి చెందిన సునీల్‌శెట్టి హిందీ హీరోగా ఎదిగారు. కరెంటు తీగ పడి, కార్మికుడు మృతి తుమకూరు: కార్మికున్ని కరెంటు తీగ బలిగొంది. బైకు పైన వెళ్తుండగా గాలులకు కరెంటు వైరు తెగి వారి మీద పడింది. ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి కొరటిగెరె తాలూకాలోని చీళగానహళ్ళి గ్రామంలో జరిగింది. యోగీష్ (42), సీ.ఎస్.నరసింహరాజు పెయింటింగ్ పనులు చేసి జీవిస్తున్నారు. పని చూసుకుని ఇళ్లకు బయల్దేరారు. భారీగా ఈదురు గాలులు రావడంతో కరెంటు స్తంభం నుంచి వైరు తెగి సరిగ్గా వారి మీదే పడింది. షాక్ కొట్టి యోగీష్ చనిపోగా నరసింహరాజకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. కొరటిగెర పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెరుకు రైతులకు రూ.16 వేల కోట్ల చెల్లింపులు
దొడ్డబళ్లాపురం: రాష్ట్రం చెరుకు పంటలో ముందడుగు వేస్తోంది. విస్తీర్ణం, ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. 2024–25 సంవత్సరంలో రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలు చెరుకు రైతులకు రూ.16,741 కోట్ల బిల్లులు చెల్లించగా ఇంకా రూ.1,832 కోట్లు బకాయి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.3,400 మద్దతు ధర నిర్ణయించింది. ఆ ధరనే చక్కెర ఫ్యాక్టరీలు చెల్లించినట్లు సమాచారం. రాష్ట్రంలో బెళగావి, బాగలకోటె, విజయపుర, బీదర్ జిల్లాలతో పాటు కృష్ణానది తీర ప్రాంతాల్లో చెరుకు పంటను గతంలో కంటే ఎక్కువ ఎకరాల్లో పండిస్తున్నారు. బాగలకోట జిల్లాలో కొందరు రైతులు గతంలో ఎకరాకు 40 టన్నులు చెరుకు దిగుబడి తీస్తుండగా ఇప్పుడు 80 టన్నులు తీస్తున్నారు. 79 చక్కెర ఫ్యాక్టరీలు ఈ ఏడాది 90 శాతం రైతులకు చక్కెర ఫ్యాక్టరీలు బిల్లులు చెల్లించాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 79 చెరుకు ఫ్యాక్టరీలు పని చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలు అన్నీ కలిపి రోజుకి 5,60,850 టన్నుల చెరుకు ఉపయోగించి చక్కెరను ఉత్పత్తి చేస్తున్నాయి. 2024–25 ఏడాదిలో మొత్తంగా 52.20 కోట్ల టన్నుల చెరుకు ఉపయోగించాయి. దేశంలో చక్కెర ఉత్పత్తిలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. -
ముమ్మరంగా వేసవి వానలు
యశవంతపుర: పూర్వ ముంగారు వానలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో సాధారణంగా వచ్చే వర్షం కంటే ఎక్కువ కురిసింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఆదివారం వరకు మామూలు కంటే 88 శాతం ఎక్కువ వర్షం పడింది. ఆదివారం రాత్రి, సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కొనసాగవచ్చని వాతావారణ శాఖ తెలిపింది. విజయనగర జిల్లా హరప్పనహళ్లి తాలూకా ఉచ్చంగిదుర్గలో భారీ వర్షం నమోదైంది. మరోవైపు ఎండలు కూడా కొనసాగుతున్నాయి. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ తాపం మాడ్చేసింది. కరావళి, దక్షిణ ఒళనాడులో 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఎండలు కాశాయి. శివమొగ్గ విమానం బెళగావికి శివమొగ్గ: శివమొగ్గ నగరంలో కుండపోత వర్షం వల్ల విమానానికి ఆటంకం కలిగింది. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి శివమొగ్గ విమానాశ్రయానికి వచ్చిన స్టార్ఎయిర్లైన్స్ విమానం వర్షం వల్ల ల్యాండ్ కాలేకపోయింది. బెళగావి విమానాశ్రయంలో దిగింది. దీంతో 291 కిలోమీటర్ల నుంచి ప్రయాణికులు మళ్లీ శివమొగ్గకు రోడ్డు, రైలు మార్గంలో వెళ్లారు. సాధారణం కంటే అధిక వర్షం -
అత్యాశను వదిలిపెట్టాలి
● పిల్లలకు పొదుపు నేర్పాలి ● లోకాయుక్త ఎస్పీ స్నేహా సూచన మండ్య: నేడు ప్రతి ఒక్క మనిషిలోను అత్యాశ ఉండటం వల్ల దేశంలో ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోందని, ప్రజలు ఆశలను అదుపు చేయకపోతే ఏమీ సాధించలేరని రామనగర లోకాయుక్త ఎస్పీ పీవీ స్నేహా అన్నారు. మండ్య నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ పాత విద్యార్థుల సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లలు ఆర్థిక క్రమశిక్షణను నేర్చుకోవాలి. అది లేకుంటే డబ్బులను పొదుపు చేయడం కష్టమని అన్నారు. తల్లిదండ్రులు ఎంత సంపాదన చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, అందులో ఎంత పొదుపు చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది పిల్లలకు వివరించి జాగృతి కల్పించాలని సూచించారు. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని ఆమె వాపోయారు. నేటి తల్లిదండ్రులు పిల్లలు అడిగినంత డబ్బు ఇస్తున్నారని, వారు స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీని పాత స్నేహితులు, అధ్యాపకులు సన్మానించారు.స్మార్ట్ మీటర్లలో అవినీతి ● లోకాయుక్తకు బీజేపీ ఫిర్యాదు శివాజీనగర: కర్ణాటక విద్యుత్ బోర్డు (కేపీటీసీఎల్) అమర్చిన స్మార్ట్ మీటర్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై నిష్పక్షపాత తనిఖీ చేపట్టాలని బీజేపీ లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. సోమవారం బెంగళూరులో లోకాయుక్త ఎస్పీని భేటీ చేసిన ఎమ్మెల్యేలు సీ.ఎన్.అశ్వత్థనారాయణ, ఎస్.ఆర్.విశ్వనాథ్, ధీరజ్ మునిరాజు, సీ.కే.రామమూర్తి తదితర బృందం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లుంఘించి రాజశ్రీ ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్ కొనుగోలు, నిర్వహణకు అధిక ధర నిర్ధారించారు, దీంతో ఎస్కాంలు, ప్రజలకు చెందిన సుమారు 15,568 కోట్ల రూపాయలు దోపిడీ అవుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ మంత్రి కే.జే.జార్జ్ ఆధ్వర్యంలో ఇంత భారీ అక్రమాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇంటిని పడగొట్టిన ఏనుగులు మైసూరు: ఇంటిలో ఉన్నవారు బంధువుల పెళ్లికి వెళ్లారు. వచ్చేలోగా ఇల్లు ధ్వంసమై ఉండడంతో ఇదెక్కడి ఘోరం అని వాపోయారు. అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు ఈ దురాగతానికి పాల్పడడంతో కుటుంబం రోడ్డుపాలైంది. ఈ సంఘటన చామరాజనగర తాలూకాలోని మూకనపాళ్య గ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి నానక్ బాయి అనే రైతు పొలంలోకి ఏనుగులు చొరబడ్డాయి. టమాటా, బీన్స్ పంటలను ఆరగించి చెల్లాచెదరు చేశాయి. అక్కడే ఉన్న నానక్బాయి ఇంటిని పడదోశాయి. బ్యాంకు అధికారికి రూ.5.58 లక్షల బురిడీ మైసూరు: షేర్ల పేరుతో రూ. 5.58 లక్షలు మోసగించారు, బాధితుడు అన్ని ఆర్థిక వ్యవహారాలూ తెలిసిన బ్యాంకు అధికారి కావడం గమనార్హం. ఇతని టెలిగ్రాం యాప్‌కి ఓ పెద్ద సంస్థ పేరుతో మెసేజ్ వచ్చింది. తమ యాప్ ద్వారా షేర్ల కొనుగోలు చేస్తే భారీ లాభాలు వస్తాయని అందులో ఉంది. దీంతో ఆశకు పోయిన అధికారి.. చాటింగ్ ద్వారా వారిని సంప్రదించాడు. సుమారు రూ. 5.58 లక్షలను వారికి బదిలీ చేశాడు. ఆ తరువాత ఎలాంటి సమాచారం లేదు. -
బ్రాహ్మణులను అవమానిస్తే సహించం
బళ్లారిటౌన్: అల్పసంఖ్యాకులైన బ్రాహ్మణులను అవమానిస్తే సహించేలేదని, తాము కూడా పరశురాములుగా తయారు కావాల్సి ఉంటుందని బళ్లారి బ్రహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ప్రకాష్ రావ్, కార్యదర్శి బీకే.మూర్తులు హెచ్చరించారు. సంగనకల్లు రోడ్డులోని శంకరమఠంలో ఆదివారం విలేకరుల సమావేశంలో సమాఖ్య గౌరవ అధ్యక్షుడు బీకే.సుంధర్, జిల్లా ప్రతినిధి శ్రీనాథ్ తదితరులతో కలిసి మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన బ్రాహ్మణ సమాజ విద్యార్థులకు జంధ్యం తీయించి పరీక్షలు రాయించారని, తీయని వారికి పరీక్షలకు అనుమతి కల్పించలేదన్నారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. దేశంలో ఇలాంటి ఘటన మొదటగా చూస్తున్నామన్నారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలన్నారు. బాధిత విద్యార్థులకు మరోమారు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ విద్యార్థులను అవమానించిన వారిని సస్పెండ్ చేస్తే సరిపోదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో పోరాటం చేస్తామని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలంటే ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కారాదన్నారు. ఇదిలా ఉండగా కులగణనలో తమ సముదాయం కేవలం 15 లక్షల జనాభా ఉన్నట్లు తెలపడం విచారకరన్నారు. దీన్ని తాము అంగీకరించేది లేదన్నారు. ఒక్కో జిల్లాలో లక్షకుపైగా బ్రాహ్మణ జనాభా ఉందన్నారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన చిత్ర నిర్మాత అనురాగ కసప్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన తమ సముదాయానికి ఉద్యోగ, విద్య రంగంలో సరైన సదుపాయాలు లభించలేదన్నారు. మే 1,2న ఆదిశంకరాచార్య జయంతిని వైభవంగా జరపాలని తీర్మానించినట్లు తెలిపారు. మే 1న శోభయాత్ర, మే 2న జయంతి పూజ, ప్రవచన కార్యక్రమాలు లాంటివి ఉంటాయని తెలిపారు. -
పారదర్శకంగా కులగణన
సాక్షి,బళ్లారి: కులగణనలో ఏ ఒక్క కులానికీ, మతానికి అన్యాయం జరగకూడదనేది తమఅభిమతమని, ఇందులో రాజకీయాలకు తావులేదని సీఎం సిద్ధరామయ్య అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం బెళగావికి విచ్చేసిన సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కుల గణన లెక్కలు పారదర్శకంగా జరిగాయన్నారు. మంత్రివర్గ సమావేశంలో కులగణన లెక్కలను ఏ ఒక్క మంత్రి వ్యతిరేకించలేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు దాటినా పేదలు పేదరికంలోనే ఉండాలా? అని ప్రశ్నించారు. లింగాయత్, బ్రాహ్మణ, ఒక్కలిగ, జైనులు ఇలా అన్ని సముదాయాలకు సామాజికంగా, ఆర్థికంగా విద్యాపరంగా న్యాయంజరుగుతుందన్నారు. కులగణనపై రాహుల్‌గాంధీ తమకు లేఖ రాయలేదన్నారు. కులగణనను ఆయన వద్దనే ప్రస్తావించామన్నారు.ప్రతిపక్ష నేత ఆర్ ఆశోక్ ఎప్పుడూ నిజాలు చెప్పలేదని, బీజేపీ రాజకీయలబ్ధి కోసం అసత్యాలను ప్రచారం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించి కులగణనపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాహుల్‌గాంధీ ఒప్పుకున్నారు ఏ మతానికీ, కులానికీ అన్యాయం జరగదు మరోసారి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం సీఎం సిద్ధరామయ్య -
బాధిత విద్యార్థికి న్యాయం చేస్తాం
● కళాశాలలో ఉచితంగా ఇంజనీరింగ్ సీటు: మంత్రి ఈశ్వర్ ఖండ్రే సాక్షి,బళ్లారి: కేసీఈటీ పరీక్షల సందర్భంగా జంధ్యం తీయాలని ఆంక్షలు విధించడంతో పరీక్ష రాయని విద్యార్థికి న్యాయం చేస్తామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. ఆదివారం ఆయన మరోమంత్రి రహీం ఖాన్‌తో కలిసి బీదర్ జిల్లాలోని బాధిత విద్యార్థి సుచివ్రత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. విద్యార్థికి ధైర్యం చెప్పారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రం వద్ద జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా తమ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచితంగా సీటు కల్పిస్తామన్నారు. కామెడ్కే పరీక్షలు కూడా ఉన్నాయని, అందులో ఎంత ర్యాంకు వచ్చినా సీటు గ్యారెంటీ ఇస్తామన్నారు. రొటావేటర్లో నలిగి బాలుడి మృతి హొసపేటె: రొటావేటర్లో నలిగి బాలుడు మృతి చెందిన విషాద ఘటన విజయనగరం జిల్లా కూడ్లిగి తాలూకా గుడేకోట్ గ్రామంలో జరిగింది. చిచిత్రదుర్గ జిల్లా మొళకాల్మూర్ తాలూకా కేలగలహట్టికి చెందిన ఒబన్న, దీప దంపతులకు నవదీప్(5) అనే కుమారుడు ఉన్నాడు. దీప తన కుమారుడితో కలిసి గుడేకోట్లోని పుట్టింటికి వచ్చింది. శనివారం సాయంత్రం బాలుడి తాత మారెన్న పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా నవదీప్ కూడా అందులోనే కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు రొటావేటర్లో బాలుడు చిక్కుకోగా శరీరం ఛిద్రమై మృతి చెందాడు. ముక్కలైన బాలుడి మృతదేహంతో ఘటన స్థలం భీతావహంగా మారింది. బాలుడి తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గుడేకోట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వేరుశనగ లారీ దగ్ధం హొసపేటె: లారీ బోల్తా పడి మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. ఈ సంఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా శివపుర గ్రామంలో జరిగింది. వేరుశనగ లోడుతో హోస్పేట మీదుగా చిత్రదుర్గ వైపు వెళుతున్న లారీ.. శివపురం వద్దకు రాగానే బోల్తా పడింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు పూర్తిగా వ్యాపించి వాహనం దగ్ధమైంది. డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలతో బయట పడ్డాడు. కూడ్లిగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ధార్వాడలోనూ జంధ్యం తీయించారు హుబ్లీ: బీదర్, శివమొగ్గలో సీఈటీ పరీక్షల సందర్భంగా జంధ్యం వేసుకున్న విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించని ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా అలాంటి ఘటన ధార్వాడలో కూడా వెలుగు చూసింది. ధార్వాడ నగరంలో ఉరకడ్లి కళాశాల పరీక్ష కేంద్రంలో జేఎస్ఎస్ కళాశాల విద్యార్థి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆ కేంద్రం అధికారులు అభ్యంతరం తెలిపారు. జంధ్యం తీసి బ్యాగులో పెట్టుకున్న తర్వాతనే లోపలకు అనుమతించారని బాధిత విద్యార్థి తండ్రి వివేక్ హేరి తెలిపారు. ఈ ఘటనతో తన కుమారుడు షాక్‌కు గురై పరీక్షపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఉపనయం చేసి కొత్త జంధ్యం ధరింపజేశామన్నారు పెండింగ్ బిల్లుల చెల్లింపు రాయచూరురూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లలో 1566 మంది కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిందని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి భోసురాజ్ వెల్లడించారు. శనివారం సాయ్రంతం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023– 24లో 639 మందికి పూర్తిగా, 1361 మందికి కొంతమేర బిల్లులు మంజూరు చేశామన్నారు. 2025 ఫిబ్రవరిలో రూ.3,352,06 కోట్లతో పనులు జరగ్గా 267 మందికి బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి రూ.210 కోట్లు, అనకట్టల పనులకు రూ.335 కోట్లు, ఎత్తిపోతల పథకాల పనులకు రూ.252.50 కోట్ల మేర బిల్లులు మంజూరు చేసినట్లు తెలిపారు. నీటిపారుదల శాఖలో తన తనయుడు రవి జోక్యం చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తల్లిదండ్రుల చెంతకు బాలికగుంతకల్లు: తప్పిపోయిన ఓ బాలికను గుంతకల్లు రైల్వే పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపిన మేరకు... కర్ణాటకలోని గదగ్‌కు చెందిన ఎనిమిదేళ్ల వయసున్న రోకియ తప్పిపోయింది. దీంతో తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డివిజన్ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న గుంతకల్లు జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై శనివారం రాత్రి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న హుబ్లీ వైపు నుంచి వచ్చిన హంపి ఎక్స్‌ప్రెస్ (16591) రైలులోని బోగీలను పరిశీలించారు. ఓ బోగీలో దిగాలుతో కూర్చొని ఉన్న రోకియాను గుర్తించి తమ స్వాధీనంలోకి తీసుకుని సమాచారం ఇవ్వడంతో ఆదివారం ఉదయం గదగ్ పోలీసులు, తల్లిదండ్రులకు గుంతకల్లుకు చేరుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. -
విమానాన్ని మినీ బస్ ఢీ
దొడ్డబళ్లాపురం: విమానం, మినీ బస్ ఢీకొనడం ఏమిటి? విమానం గాలిలో వెళ్తుంది, మినీ బస్ భూమ్మీద ప్రయాణిస్తుంది కదా? ఇదెలా జరుగుతుంది? అని అనుకోవచ్చు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. విమానాల సిబ్బందిని వారి కార్యాలయాల నుండి ఎయిర్ బే ల వరకూ పికప్, డ్రాప్ చేయడానికి ఈ మినీ బస్‌ను ఉపయోగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో ఇది చోటుచేసుకుంది. వివరాలు... ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో ఇండిగో ఏ320 విమానాన్ని బే– 71 ఆల్ఫా వద్ద ఎయిర్‌సైడ్‌లో నిలిపి ఉంచారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన టెంపో ట్రావెలర్ ఎడమ వైపు నుంచి వస్తూ విమానం ముందు భాగం కింద నుంచి వెళ్లాలనుకుంది. కానీ విమానాన్ని ఢీకొంది. టీటీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. టీటీతో పాటు విమానానికి స్వల్ప నష్టం జరిగినట్లు తెలిసింది. ఎవరికీ హాని కలగలేదు. డైరెక్టరేట్ ఆఫ్ ఏవియేషన్ వారు దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఘటన -
తండ్రీ కూతుర్ని చిదిమిన కంటైనర్
చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని బెంగళూరు– హైదరాబాద్ హైవేలో లింగశెట్టిపురం వద్ద కంటైనర్ లారీ అదుపుతప్పి బైక్ మీద పడింది. ఈ దుర్ఘటనలో స్థానిక బండహళ్లికి చెందిన వెంకటేశ్ (40), కూతురు దీక్ష (4) దుర్మరణం చెందారు, భార్య రూప (35) తీవ్ర గాయాల పాలైంది. వివరాలు..శనివారం సాయంత్రం వీరు ఇంటి నుంచి బయల్దేరారు. ఈశా ఫౌండేషన్ రోడ్డు నుంచి రహదారి మీదకు వచ్చారు, ఓ కారు కూడా వీరి పక్కనే ప్రయాణిస్తోంది. బాగేపల్లి వైపు నుంచి వచ్చిన కంటైనర్ లారీ, ఆకస్మికంగా వచ్చిన కారును తప్పించబోయి అదుపుతప్పి ఎడమపక్కకు బోల్తా పడింది. అక్కడే బైక్‌లో వెంకటేశ్ కుటుంబం వెళ్తోంది. ముగ్గురూ కంటైనర్ కింద చిక్కారు. తండ్రీ బిడ్డ క్షణాల్లో మరణించారు. రూపాను స్థానికులు రక్షించి బెంగళూరుకు తరలించారు. చిక్కబళ్లాపురం రూరల్ పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఈశా ఫౌండేషన్ మార్గంలో వందలాది వాహనాలు సంచరిస్తూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇక్కడ అండర్‌పాస్ వంటివి నిర్మించి ప్రమాదాలను తప్పించాలని ప్రజలు కోరారు. చిక్కబళ్లాపురం వద్ద ఘోరం -
ఆనందోత్సాహాలతో ఈస్టర్
శివాజీనగర: లోక కళ్యాణార్థమై సిలువలో బలియాగం చేసిన గుడ్‌ఫ్రైడే తరువాత మూడో రోజు మరణాన్ని జయించిన యేసు ప్రభు పునరుత్థానమైన ఈస్టర్ పండుగను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఆచరించారు. బెంగళూరులో అన్ని చర్చిల్లో ఈస్టర్ వేడకలను ఆనందోత్సాహాలతో నిర్వహించారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ను పురస్కరించుకొని 45 రోజుల పాటు శ్రమదినాలుగా భావించి ఉపవాస ప్రార్థనల్లో నిమగ్నమైన క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకోవటం ద్వారా ఉపవాస ప్రార్థనలను విరమించారు. చర్చిలలో ప్రార్థనలు జరిపి, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మిస్పా తెలుగు చర్చీ పాస్టర్ రెవరెండ్ డీ. ఆండీ బెరాకా పండుగ సందేశాన్ని వివరించారు. మరియమ్మనహళ్లి కర్ణాటక కల్వరి చర్చీలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. బళ్లారి ఎల్–షడాయ్ మినిస్ట్రీస్ పాస్టర్ ద్వారకనాథ్ రావు యాదవ్ ఈస్టర్ పండుగ విశిష్టతను తెలియజేశారు. పాస్టర్ రెవరెండ్ ఎం.జక్కయ్య, సంఘ సభ్యులు ప్రార్థనలు చేశారు. చర్చిలలో విశేష ప్రార్థనలు -
వడగండ్ల బీభత్సం.. పంటలకు నష్టం
రాయచూరు రూరల్: అకాల వర్షాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వేల ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం జరిగింది. రాయచూరు, యాదగిరి, కలబురిగి జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో రాయచూరు జిల్లా యరగేర, గుంజళ్లి, ఇడపనూరు, దేవదుర్గ తాలుకా గలగ, మస్కి మెదికనాళ, మాన్వి తాలూకాలోని కవితాళ, లింగ సూగురు తాలుకా గురుగుంట, హట్టి, పామన కల్లూరు, యదగిరి జిల్లాలోని వడగేర, శహపుర, కలబుర్గి జిల్లాలోని కమలాపురలో పంటలకు నష్టం జరిగింది. వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. మిరప పంటలు నీటిలో తేలియాడాయి. పత్తి పంట దెబ్బతింది. యరగేరలో 150 మామిడి చెట్లు, శహపురలో వెయ్యి ఎకరాలలో మిరప పంట, 2500 ఏకరాలలో వరి పైరు నాశనమైంది. వడ గేరలో లక్ష్మణ్ అనే రైతుకు చెందిన 25 ఏకరాల్లోని వరి పంటను వడగళ్లు కప్పేశాయి. పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాగా బీదర్‌లో భారీ వర్షాలకు 8 వేల కోళ్లు మృతి చెందాయి. రాయచూరులోని ఆర్టీఓ సర్కిల్ వర్షం నీరు పోటెత్తి వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది. నేలకొరిగిన వరిపంట నీట మునిగిన మిరప, పత్తి పంటలు నేలపాలైన మామిడి కాయలు -
బ్రాహ్మణులను అవమానించారు
రాయచూరు రూరల్: జంధ్యం విషయంలో బ్రహ్మణులను అవమానించడం ఖండనీయమని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ అన్నారు. స్వామీజీ అదివారం మంత్రాయలంలో పాత్రికేయులతో మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాసేందుకు వచ్చిన బ్రాహ్మణ సముదాయ విద్యార్థులను జంధ్యం తీయాలని హుకుం జారీ చేయడం బ్రాహ్మణ సముదాయాన్ని అవమానించడమేనని అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని మంటగలిపారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారని అరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్వామీజీ డిమాండ్ చేశారు. ఇంట్లోకి చొరబడిన వ్యక్తికి దేహశుద్ధి హుబ్లీః ఇంట్లోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన హుబ్లీలోని షిరిడినగర్లో ఆదివారం వెలుగు చూసింది. మద్యం తాగిన మత్తులో బసవరాజు అనే వ్యక్తి సవిత అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు బసవరాజును పట్టుకొని దేహశుద్ధి చేసి అశోకనగర పోలీసులకు అప్పగించారు. నగలు, నగదు చోరీ హుబ్లీ: దొంగలు ఓ ఇంటిలో చోరిబడి నగదు,నగలు చోరీ చేశారు. ఈ ఘటన పాత హుబ్లీ గుడిహాల రోడ్డు వాణి ప్లాటులో జరిగింది. అల్లా ఉద్దీన్ అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసి వేరే ఊరికి వెళ్లాడు. పసిగట్టిన దొంగలు లోపలకు చొరబడి రూ. లక్ష నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. డీవైడర్‌ను కారు ఢీకొని బాలిక మృతి హుబ్లీః కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బాలిక మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన హుబ్లీ తాలూకాలోని తిరుమల కొప్ప గ్రామం వద్ద హైవేలో ఆదివారం చోటు చేసుకుంది. హవేరి నుంచి హుబ్లీకి వెళ్తున్న కారు అతి వేగం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న బెంగళూరుకు చెందిన అక్షర కులకర్ణి(8) తీవ్రంగా గాయపడగా ప్రాణేష్, వేదేహి తదితర ఏడుగురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్షర మృతి చెందింది. ఈ ఘటనపై హుబ్లీ గ్రామీణపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని... హుబ్లీ తాలూకాలోని హిరేసూర గ్రామం వద్ద శనివారం రాత్రి గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొని ఖాజానగర్ నివాసి బసవరాజ్ (51) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈయన నవలగుంద నుంచి హుబ్లీకి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బెళగావిలో బీసీఏ విద్యార్థిని అత్మహత్య రాయచూరు రూరల్: మైనార్టీ సముదాయ యువకుడి వేధింపులతో బీసీఏ విద్యార్థిని అత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెళగావిలో చోటు చేసుకుంది. హవేరి జిల్లా శిగ్గావి తాలుకా చిక్క మల్లూరుకు చెందిన శిల్పా(22) బెళగావి మహంతేస్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ బీసీఏ చదువుతోంది. నవీన్ యువకుడిని ప్రేమించింది. నవీన్ శిగ్గావిలో ఫర్నీచర్ దుకాణంలో పనిచేసేవాడు. ఆ దుకాణ యజమాని రంజాన్ నదాప్ శిల్పాకు ఫోన్ చేసి వేధించేవాడు. మరో వైపు నవీన్‌పై దొంగతనం కేసు పెట్టించాడు. దుకాణంలో నగదును నవీన్ చోరీ చేసి నీకు ఇచ్చాడని శిల్పాకు రంజాన్ నదాప్ ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో శిల్ప తానుంటున్న హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. వివాదాన్ని రాజేస్తున్న బీజేపీరాయచూరు రూరల్: జంధ్యం వివాదాన్ని బీజేపీ రాజేస్తోందని, దీని వెనుక బీజేపీ అధ్యక్షుడు విజేయేంద్ర హస్తం ఉందని మాజీ ఎమ్మెల్సీ అరవింద కుమార అరళి అరోపించారు. బీదర్‌లో రెండు పరీక్షలు రాసిన సుచివ్రత కులకర్ణి మూడవ పరీక్ష సమయంలో బీజేపీ జనాక్రోశ యాత్ర నేపథ్యంలో ఈ దుర్ఘటన సంభవించిందని, దీనికి బీజేపీనే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కుల గణన చేపట్టిన కారణంగా ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని మరింత రెట్టింపు చేశారన్నారు. -
జోరందుకున్న జల్లు వానలు
బనశంకరి: జూన్‌లో రుతుపవనాలను తలపించేలా ఇప్పుడే వానలు వస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు– రూరల్, దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, కొడగు, హాసన్, శివమొగ్గ, చిక్కమగళూరు, కోలారు, మండ్య, తుమకూరు, మైసూరు, చామరాజనగర, చిత్రదుర్గ, బళ్లారి జిల్లాల్లో 21, 22 తేదీల్లో వడగండ్లతో కూడిన వర్షం కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది. నగరంలో వర్షం ఆదివారం ఉద్యాననగరిలో విజయనగర, మెజస్టిక్, జయనగర, జేపీ.నగర, గోవిందరాజనగర, మల్లేశ్వరం, కోరమంగల, ఆడుగోడి, ఎలక్ట్రానిక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రజలు తడవకుండా చెట్లు, కట్టడాల్లోకి పరుగులు తీశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు గ్రామాంతర జిల్లాల్లో ఈదురుగాలులు, వానలకు పాత ఇళ్లు, షెడ్లు దెబ్బతిన్నాయి. హొసకోటే తాలూకా ఎన్.హొసహళ్లిలో వడగండ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులు కూడా తోడయ్యాయి. గాలుల ప్రభావం 24 జిల్లాలకు భారీ వర్షాలు రావచ్చని ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. 26వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు అలర్ట్ ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త సీఎస్ పాటిల్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలితో కూడిన వర్షాలు కురుస్తాయని, మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ తెలిపింది. 24 జిల్లాల్లో వారంపాటు వర్షసూచన వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ -
సస్పెన్స్.. క్రైం థ్రిల్లర్స్
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో, అందులోనూ బెంగళూరు పరిసరాల్లో గత 48 గంటల్లో అనూహ్యమైన నేర సంఘటనలు దేశమంతటా చర్చనీయాంశమయ్యాయి. జాతీయ టీవీ చానెళ్లలో చాలా సమయాన్ని ఆక్రమించాయి. దీంతో బెంగళూరు హాట్ హాట్ చర్చల్లో భాగమైంది. సినిమా స్టైల్లో మాఫియా డాన్ కొడుకుపై తుపాకులతో హత్యాయత్నం, ఆ గొడవ సద్దుమణగకముందే ఏకంగా రిటైర్డు డీజీపీ ఇంట్లోనే హత్యకు గురికావడం, అందులోనూ ఆయన భార్య, కుమార్తెను పోలీసులు అరెస్టు చేయడం హాలీవుడ్ క్రైం స్టోరీలను మించిపోయింది. రిక్కీ కేసులో ఎవరు సూత్రధారి? మాజీ మాఫియా డాన్, దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై మీద గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి కాల్పులు జరపడం సంచలనం కలిగిస్తోంది. రిక్కీని మట్టుబెట్టాలని ఫైరింగ్ చేయగా, తీవ్ర గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు తెలిసింది. సిలికాన్ సిటీతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న రియల్ ఎస్టేట్ గొడవలు, మాఫియా పోరాటాలు ఈ సంఘటనతో ఒక్కసారిగా తెర మీదకు వచ్చాయి. మొదట రియల్ ఎస్టేట్ నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందని అందరూ భావించినప్పటికీ సమయం గడిచేకొద్దీ ముత్తప్ప రై రెండవ భార్య అనురాధపై అనుమానాలు పెరుగుతున్నట్లు పోలీసు వర్గాల కథనం. ముత్తప్పరై ఇద్దరు కుమారులు, రెండవ భార్య అనురాధ పేరున తన ఆస్తులు వీలునామా రాశారు. అనురాధకు ఓ మోస్తరుగా బంగారు ఆభరణాలు, ఒక కారు, పెద్ద మొత్తంలో నగదు, హెచ్డీ కోటలో ఉన్న ఆస్తి, బెంగళూరు సహకార నగరలో ఉన్న ఒక భవంతి రాసిచ్చారు. అయితే ఆస్తిలో తనకు ఇంకా భాగం రావాలని ఆమె కోర్టుకు వెళ్లింది. రిక్కీ, అతని అన్న రాకీతో ఆమెకు గొడవలు కూడా జరిగాయి. అయితే తరువాత రిక్కీ సోదరులు రాజీ చేసుకున్నారు. వారు పరస్పరం హత్యలకు కుట్రలు చేసినట్లు కూడా వార్తలున్నాయి. ఇప్పుడీ హత్యాయత్నంతో అది బహిర్గతమైంది. రిక్కిరై సెక్యూరిటీ ఏమైంది రిక్కీ రై మీద హత్యాయత్నం తరువాత అందరిలో అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి. వేల కోట్ల రూపాయల వారసుడు, విస్తృతంగా శత్రువులను కలిగిన రిక్కీ రై అంత సులభంగా గన్ షాట్‌కి ఎలా దొరికాడు? పటిష్టమైన ప్రైవేటు భద్రత ఏమైంది? అనే సందేహాలున్నాయి. రిక్కీ రై సొంతంగా వీవీఐపీకి ఉన్నంత సెక్యూరిటీని పెట్టుకున్నాడు. గన్లు పట్టుకుని చుట్టూ బాడీగార్డులు ఉంటారు. బాడీ గార్డులు షార్ప్ షూటర్స్ అయి ఉంటారు. రిక్కిరై పై కాల్పులు జరిపిన సమయంలో కారులో ఒకరే సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. మిగతా ఇద్దరు ఎందుకు లేరనేది సందేహాస్పదమైంది. కాల్పుల వెనుక బయటి శత్రుల కన్నా లోపలి శత్రువులే ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్కీకి డిప్యూటీ సీఎం పరామర్శ రిక్కీ రై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారంనాడు ఆస్పత్రికి వెళ్లి అతనిని పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా పోలీసులు అరెస్టు చేస్తారని రిక్కీకి భరోసా ఇచ్చారు. మాఫియా నేత కొడుకుపై కాల్పులు.. ఇంట్లోనే రిటైర్డు డీజీపీ హత్య సంచలన నేరాలతో బెంగళూరులో అలజడి రిటైర్డు డీజీపీ విషాదాంతం యశ్వంతపుర: రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని సొంత భవనంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఈ ఘోరం వెలుగుచూసింది. తానే హత్య చేసినట్లు భార్య పల్లవి పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఆమె పోలీసులకు కాల్ చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో ఉన్న పల్లవితో పాటు ఆమె కూతురిని పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణంగా భావిస్తున్నారు. వీరి కుటుంబంలో స్పర్థల గురించి చుట్టుపక్కలవారితో పాటు కొందరు విశ్రాంత పోలీసు అధికారులకు కూడా తెలుసని సమాచారం. తనకు ప్రాణభయం ఉందని ఓంప్రకాశ్ స్నేహితులకు చెప్పుకుని బాధపడినట్లు తెలుస్తోంది. ఓం ప్రకాశ్ హత్యతో ఆయన సహచర రిటైర్డు ఐపీఎస్‌లు విచారానికి లోనయ్యారు. -
బొలెరో– కారు ఢీ, చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: ఉమ్మడి కర్నూలు జిల్లా రాఘవరాజుపల్లె సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం కారు, బొలేరో జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లెకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి తన కూతురు జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తుండేవాడు. చంద్రమోహన్‌రెడ్డి అమ్మవారికి మొక్కుబడి చేసే కార్యక్రమం ఉండటంతో చిన్నారి జోష్యహర్షిణిరెడ్డి తాతయ్య రిటైర్డ్ టీచర్ రామసుబ్బారెడ్డితో పాటు బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవిలను కారులో నంద్యాల నుంచి తీసుకొని బయలు దేరారు. సోమవారం పరీక్ష ఉందని తాను రానని చిన్నారి మారాం చేసింది. అయితే వెంటనే వచ్చేద్దామని బుజ్జగించి తీసుకెళ్లారు. రాఘవరాజుపల్లె శివార్లలోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లె నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలేరో వాహనం కారును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తా పడింది. కారులో ఉన్నవారంతా అందులో ఇరుక్కు పోవడంతో స్థానికులు అతికష్టంగా బయటకు తీశారు. బొలేరోలో ఉన్న అంకిరెడ్డిపల్లె యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. చిన్నారి జోష్య హర్షిణి కోమాలోకి వెళ్లిపోవడంతో చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మిగిలిన క్షతగాత్రులను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి గాయాలు -
రెడ్డి జనాభాను తక్కువ చూపితే సమరమే
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక,ఆర్థిక సర్వేలో రెడ్డి సామాజిక వర్గం జనాభా తక్కువగా ఉందనే కారణం చూపుతూ రెడ్డి ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం మీద ఉగ్ర పోరాటం చేస్తామని కర్ణాటక రెడ్డి జన సంఘం హెచ్చరించింది. నివేదిక గురించి రెడ్డి జన సంఘం డైరెక్టర్లు, బోర్డు సభ్యులు, జిల్లా, తాలూకా నాయకులు, పదాధికారులు బెంగళూరులో సమావేశమై చర్చించారు. ఆ సమావేశ వివరాలను సంఘం అధ్యక్షుడు జయరామ్‌రెడ్డి మీడియా భేటీలో వెల్లడించారు. మేమే కులగణన చేపడతాం రాష్ట్రంలో రెడ్డి సముదాయం జనాభా 35 లక్షల నుంచి 40 లక్షల వరకూ ఉందని జమరామ్రెడ్డి తెలిపారు. కులగణన నివేదికలో 7.50 లక్షలు మాత్రమే ఉందని చూపుతున్నారని చెప్పారు. మా సంఘం ద్వారా రెడ్డి జనాభా గణనను నిర్వహిస్తామని సర్కారుకు సవాల్ చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వానికి పంపుతామని అన్నారు. ప్రభుత్వం మా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోరాటం సాగిస్తామని చెప్పారు. రెడ్డి జనాభాకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, తమను బీసీలలో చేర్చాలని ఇదివరకే సీఎం సిద్దరామయ్యను కలిసి కోరినట్లు తెలిపారు. సంఘం శతాబ్ది ఉత్సవాలకు ముందే ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వెంకటశివారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి, అన్ని జిల్లాల సుమారు 450 మందికి పైగా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 40 లక్షలు ఉంటే, 7.5 లక్షలని చెప్పడం సరికాదు కులగణన నివేదికపై రెడ్డి జనసంఘం నేతల ధ్వజం బెంగళూరులో కార్యాచరణపై చర్చ -
జంట నగరాల్లో తాగునీటికి కటకట
హుబ్లీ: తాగునీటి సమస్య కేవలం గ్రామాల్లోనే కాకుండా హుబ్లీ ధార్వాడ జంట నగరాల ప్రజలను కూడా ఇబ్బంది పెడుతోంది. జనవరులు సంవృద్ధిగా ఉన్నా తాగునీటికి కటకట ఏర్పడింది. పాలికె పరిధిలో 20కు పైగా వార్డులలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మొత్తం 82 వార్డులకు గాను 12 జోన్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. సుమారు 8,9 లక్షల మంది కలిగిన జంట నగరాల పాలికెకు మలప్రభ, నీరాసాగర చెరువునీరే మూలధారం. మలప్రభ నుంచి 220 ఎంఎల్డీ, నీరసాగర చెరువు నుంచి 20 ఎంఎల్డీ కలిపి రోజూ 240 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసేవారు. అయితే ఇటీవల సరఫరాలో కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడి నీటి సమస్య ఏర్పడుతోంది. నీటి సరఫరా బాధ్యతలు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ 12 వార్డులలో మాత్రమే నీటి వసతి కల్పిస్తోంది. మరికొన్ని వార్డులలో 8, 10 రోజులకు ఓ మారు నీటిని సరఫరా చేస్తున్నారు. జాక్వెల్, పైపులైన్లలో సమస్యలు ఏర్పడి 15, 20 రోజులకు ఒక్క సారి నీటి సరఫరా అయ్యే దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. 5,6,7,8,14,39,40 నుంచి 43 వరకు, అలాగే 46వ వార్డులలో ప్రయోగాత్మకంగా నిరంతర నీటి సరఫరా ప్రాంతాలుగా ప్రకటించారు. ఈ వార్డులకు కూడా పలు సమస్యల కారణంగా కొన్ని సార్లు 2,3 రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోంది. వార్డులలో 23 అదనపు నీటి సేకరణ ట్యాంక్‌ల నిర్మాణం పనులు చేపట్టామని, అవి పూర్తయితే నీటి ఎద్దడి ఉండదని కేయూ ఐడీఎఫ్సీపీఆర్ఓ ప్రతిభ తెలిపారు. పాలికె కమిషనర్ రుద్రేష్ ఘాలి మాట్లాడుతూ కొన్ని వార్డులలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదన్నారు. నీటి నిలువ కొరతతో ఈ సమస్య ఏర్పడుతోందన్నారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. హుబ్లీ–ధార్వాడలో మిన్నంటుతున్న దాహం కేకలు నిరంతర నీటి సరఫరాలో అంతరాయం కొన్ని వార్డుల్లో పదిరోజులకోమారు నీటి సరఫరా త్వరలో సమస్యను పరిష్కరిస్తామంటున్న అధికారులు -
శాకంబరీ దేవికి అలంకారం
బనశంకరి: బనశంకరి దేవి దేవస్థానంలో వెలసిన శాకంబరీదేవి ఆదివారం కూరగాయల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. వేకువజామున సుప్రభాత సేవ, అర్చనలు గావించారు. వివిధ రకాల కూరగాయలతో రమణీయంగా అలంకరణ గావించారు. భక్తులు నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. ఎమ్మెల్యే మునిరత్న ప్రాసిక్యూషన్‌కు ఓకే బనశంకరి: బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న పై చార్జిషీట్ దాఖలైన కేసులో ప్రాసిక్యూషన్ కు విధానసభ స్పీకర్ యుటీ.ఖాదర్ అనుమతిచ్చారు. హనీట్రాప్ చేయడానికి హెచ్ఐవీ వ్యాధి కలిగిన మహిళను ఎరవేయడం, దళితులను దూషించడం అనే కేసుల్లో మునిరత్న పై కొన్ని నెలల కిందట ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో మునిరత్న పరప్పన అగ్రహార జైలులో ఉంటూ బెయిల్‌పై విడుదలై బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కులదూషణ కేసు మునిరత్నను తీవ్ర చిక్కుల్లో పడేసింది. ఆయనను విచారించవచ్చని స్పీకర్ అనుమతిచ్చారు. కులదూషణ కేసును సీఐడీ, సిట్ విచారిస్తున్నాయి. సిట్ కోర్టులో తాజాగా చార్జిషీట్‌ను వేసింది. మునిరత్న ఎమ్మెల్యేగా ఉండటంతో ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ స్పీకర్ ను అభ్యర్థించాయి. హరికథను కాపాడుకోవాలి తుమకూరు: హరికథ అనేది ఒక జాత్యాతీత కళ అని, ఈ కళకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారని, అటువంటి హరికథను కాపాడుకోవడం, దానిని మన ముందు తరాలవారికి ఆందించడం యువ కళాకారుల బాధ్యత అని సీనియర్ సుగమ సంగీత కళాకారుడు డాక్టర్.ఆర్. కే. పద్మనాభన్ అన్నారు. తుమకూరులోని కన్నడ భవనంలో జీ సోమశేఖర్ ప్రతిష్టాపణ ఆధ్వర్యంలో కర్ణాటక హరిదాస సమావేశం– 2025 వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సుగమ సంగీతం, నృత్య గమక ఇలాంటి కళల కంటే హరికథ కోసం అన్ని వర్గాల ప్రజలు తరలివస్తారని అన్నారు. గురురాజులు నాయక హరికథలో ప్రసిద్ధులని అన్నారు. నా పాటల మీద హరికథ ప్రభావం చాలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులను సన్మానించారు. సర్పాల సయ్యాట గౌరిబిదనూరు: ఇక్కడ నేషనల్ కళాశాల ఎదురుగా ఖాళీ స్థలంలో 7 పాములు ప్రజల కంట పడ్డాయి. దీంతో జనం హడలిపోయారు. వాటిలో రెండు పాములు సుమారు అర్ధ గంటకు పైబడి సల్లాపాలు సాగించడంతో జనం కుతూహలంగా చూశారు. వందలాదిమంది గుమిగూడినా పాములు పట్టించుకోకుండా సయ్యాటలో మునిగితేలాయి. పాముల గురించి సమాచారం ఇవ్వగా, అటవీశాఖ ఉద్యోగి యల్లప్ప వచ్చి ఓ పామును మాత్రం పట్టుకున్నారు. మిగతా 6 పాములు ఎటో వెళ్లిపోయాయి. పట్టణంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెత్తా చెదారం లేకుండా శుభ్రం చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. చెత్త, గుబురు మొక్కల వల్ల పాములు, కొండచిలువలు చేరే ప్రమాదం ఉందని వాపోయారు. -
ప్రేమ ఫలించాలంటే పాస్ చేయండి సారూ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పదవ తరగతి సమాధాన పత్రాలు దిద్దుతున్న అధికారులకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. బెళగావి జిల్లా చిక్కోడిలో పదోతరగతి పరీక్ష రాసిన ఓ విద్యార్థి సమాధాన పత్రానికి రూ.500 నోటు జమ చేసి ఉండటంతో కలబురిగిలో వాల్యుయేషన్ అధికారులు గమనించి కంగుతిన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలంటే ఈ నోటు తీసుకొని తనను పాస్ చేయాలని వేడుకుంటూ జవాబు పత్రంలో రాసి ఉంది. నేను పదిలో ఉత్తీర్ణుడైతేనే ప్రేమిస్తానని బాలిక చెప్పిందని ఆ చీటీలో రాశాడు. ఈ రూ.500 నోటు తీసుకొని టీ తాగాలని సూచించాడు. టెన్త్ పరీక్ష సమాధాన పత్రంతో రూ.500 నోటు జత -
కుటుంబ గొడవలా, బయటివారా?
దొడ్డబళ్లాపురం: మాజీ డాన్ కుమారునిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన బెంగళూరు చుట్టూ చాపకింద నీరులా సాగుతున్న మాఫియా కార్యకలాపాలకు అద్దంపట్టింది. ఒకప్పటి మాఫియా నేరగాడు దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై (38) పై కాల్పులు జరిపిన ఘటన బెంగళూరు సమీపంలో రామనగర తాలూకా బిడదిలో చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బిడదిలోని ఇంటి సమీపంలో కాల్పులు జరిగాయి. కారులో వెళ్తుండగా మాటువేసిన దుండగుడు కాల్పులు చేయగా వెనుక సీట్లో కూర్చున్న రిక్కీ చేయి, ముక్కు, భుజాలకు గాయాలయ్యాయి. దాడి ఇలా జరిగింది 2 రోజుల క్రితమే రష్యా నుంచి వచ్చిన రిక్కీ రై రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో బిజీగా ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి నల్ల ఫార్చూనర్ కారులో బెంగళూరుకు రావడానికి బిడదిలోని ఇంటి నుండి బయల్దేరాడు, గేట్ నుంచి ఓ వంద మీటర్లు రాగానే పొంచి ఉన్న దుండగుడు తుపాకీతో గుండ్లు కురిపించాడు. సాధారణంగా రిక్కీ రై ఎప్పుడూ తానే డ్రైవ్ చేస్తాడు. అయితే ఇప్పుడు మాత్రం వెనుక సీట్లో గన్ మ్యాన్‌తో కలిసి కూర్చున్నాడు. డ్రైవర్ బసవరాజు కాల్పుల శబ్దం వినగానే కిందకు వంగిపోయాడు. 70ఎంఎం షాట్ గన్‌తో కాల్చడం వల్ల తూటా కారు డోర్ కు తగిలి డ్రైవర్ సీట్ కుషన్‌ను చీల్చుకుని వెనుక సీట్ డోర్‌కు తగిలింది. తూటాలు తగిలి రిక్కీ రై కి ముక్కు ఛిద్రమైంది. అలాగే కుడి చేయి జబ్బ వెనుక తూటా దిగబడింది. డ్రైవర్, గన్‌మ్యాన్ సురక్షితంగా బయటపడ్డారు. రిక్కీ రై బెంగళూరులో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నాడు. ముమ్మరంగా రెక్కీ? శత్రువులు రిక్కీ కదలికలపై లోతుగా నిఘా ఉంచినట్లు వెల్లడవుతోంది. షూటర్ ఓ కాంపౌండ్ గోడ వెనుక నుంచి రంధ్రం ద్వారా కాల్చాడని అనుమానాలున్నాయి. అంత పకడ్బందీగా కాల్పులు జరిపారంటే చాలారోజులుగా రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రిక్కీ రై ఆ సమయంలోనే బయటకు వస్తాడని ఎవరు సమాచారం ఇచ్చారు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎవరు చంపాలనుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపింది షార్ప్ షూటర్లేనని తెలుస్తోంది. పలువురిపై ఫిర్యాదు హత్యాయత్నానికి సంబంధించి కారు డ్రైవర్ బసవరాజు... రిక్కీ రై మొదటి భార్య అన్నపూర్ణ, ముత్తప్ప రై మరో భార్య అనురాధ, రై ప్రత్యర్థి రాకేశ్ మల్లి, మరో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఈ హత్యాయత్నం జరిగిందని డ్రైవర్ బసవరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బిడది పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలిలో రెండు బుల్లెట్లు, ఒక మొబైల్‌ఫోన్ లభించినట్టు సమాచారం. పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది పలు సాక్ష్యాధారాలను సేకరించారు. మాజీ డాన్ ముత్తప్ప రై కొడుకు రిక్కీ రై పై దాడి బెంగళూరుకు వస్తుండగా కారు మీద ఫైరింగ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు బిడది నివాసం వద్ద అర్ధరాత్రి సంఘటన 2020లో మాజీ డాన్ ముత్తప్పరై చనిపోయాక ఆయనకు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల ఆస్తి పంపకాల్లో వివాదాలు నెలకొన్నాయి. ముత్తప్పరై తన ఇద్దరు కుమారులైన రాకి రై, రిక్కీ రై, రెండవ భార్య అనురాధ, ఇతరులకు తన ఆస్తి ఎంతెంత రావాలన్నది వీలునామా రాశారు. అయితే అనురాధ తనకు ఎక్కువ భాగం ఆస్తి రావాలని కోర్టులో కేసు వేసింది. ఈ 2024లో రాజీ చేసుకుని పరిష్కరించుకున్నారు. ఆస్తి పంపకాల గొడవలతో దాడి జరిగిందా, లేక రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల జరిగిందా అనేది విచారణ సాగుతోంది. గతంలో ముత్తప్ప రై వల్ల దెబ్బతిన్నవారు పగ తీర్చుకోవాలనుకున్నారా? అనేది సస్పెన్స్‌గా ఉంది. రామనగర ఎస్పీ శ్రీనివాస్‌గౌడ ఆధ్వర్యంలో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
ఉల్లి రైతులకు కన్నీటి పొర
దొడ్డబళ్లాపురం: ఉల్లిగడ్డలు ధరలు బాగా తగ్గిపోయాయి. సాగుచేసిన రైతులకు కూలీల ఖర్చులు కూడా దక్కడం లేదు. కోత కోసి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాట కాక, పంటను ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఉల్లి పొలాన్ని గొర్రెలు మేకలకు వదిలేశాడో రైతన్న. ఈ సంఘటన హడగలి తాలూకా ఉత్తంగి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామం నివాసి మూలిమని శరణప్ప పంటను గొర్రెలతో మేయించిన రైతు. 3 ఎకరాల పంటను గొర్రెలు ఆరగించాయి. క్వింటాలు రూ.800 మాత్రమే బెంగళూరు మార్కెట్లో క్వింటాల్ ధర రూ.800, గరిష్టమంటే రూ,1000 పలుకుతోంది. పంట కోతకోసి గ్రేడింగ్ చేసి తరలించడానికి 50 కేజీల పాకెట్‌కు రూ.300 నుంచి రూ.400 ఖర్చవుతుంది. ఇవికాకుండా ఇతర ఖర్చులు పోను ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట వీధుల్లో కేజీ ధర రూ.10– 20 మధ్య ఊగిసలాడుతోంది. విదేశాలకు ఎగుమతులు, శుభకార్యాలు తగ్గిపోవడంతో డిమాండు అంతంతమాత్రంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో మంచి ధర ఉండేది. ఇక రెండు నెలల నుంచి పొలాల నుంచి పంట ఎక్కువగా వస్తుండడంతో గిరాకీ తగ్గి ధర పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏదోరకంగా ఆదుకోవాలని ఉల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధరలు దారుణంగా పతనం గొర్రెలకు వదిలేసిన పంట -
మనవరాలిపై అఘాయిత్యం
● కామాంధుడు అరెస్టు మైసూరు: మనవరాలి వరసయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ అమానుష సంఘటన జిల్లాలోని హెచ్డీ కోటె తాలూకాలో జరిగింది. వివరాలు.. హెచ్‌డీకోటె తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన మరిగౌడ (62) నిందితుడు. మైసూరులో ఉండే భార్యాభర్తలు, 12 ఏళ్ల కుమార్తెను తీసుకుని గ్రామంలోని బంధువుల ఇంటిలో శుభకార్యానికి వచ్చారు. బాలికకు స్కూలు సెలవులు ఉండడంతో బంధువుల ఇంటిలోనే ఉంచి వెళ్లిపోయారు. బాలికకు తాత అయ్యే నిందితుడు మాయమాటలతో పాపపై అత్యాచారానికి పాల్పడటమేగాక ఈ విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత బాలిక మైసూరులోని తమ ఇంటికి చేరుకుంది. చిన్నారి విచారంగా ఉండడం గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది? అని విచారించగా, దారుణాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు గ్రామానికి వెళ్లి పోక్సో చట్టం కింద అరెస్టు చేసి తరలించారు. ఫిర్యాదు చేస్తే ఖాతా బ్లాక్ ● బీబీఎంపీ విడ్డూరం బనశంకరి: గుంతల రోడ్ల గురించి బీబీఎంపీకి ఎక్స్ అకౌంట్లో ఫిర్యాదు చేసిన మహిళ అకౌంట్ ను పాలికె సిబ్బంది బ్లాక్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నీతు అనే మహిళ కొన్ని గుంతల రోడ్లు ఫోటోలు పోస్ట్ చేసి మరమ్మతులు చేయాలని పాలికెను కోరింది. దీనిపై బీబీఎంపీ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆమె అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఈమె మాదిరిగా ఫిర్యాదులు చేసిన మరికొందరి ఖాతాలను కూడా పాలికె సిబ్బంది బ్లాక్ చేసినట్లు తెలిసింది. నగరంలో గుంతల రోడ్లే కాదు ఏ సమస్య అయినా సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పాలికె కమిషనర్ తెలిపారు. కానీ పరిష్కరించడానికి బదులు బ్లాక్ చేయడం గమనార్హం. పాలికె చర్య సబబు కాదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టుకు బీజేపీ? బనశంకరి: ఇటీవల నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో అగౌరవంగా ప్రవర్తించారని 18 బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ యుటీ ఖాదర్ 6 నెలలపాటు సస్పెండ్ చేశారు. దీనివల్ల సదరు ఎమ్మెల్యేలకు జీతభత్యాల్లో కోత పడనుంది. పలు చిక్కులు కూడా ఎదురవుతాయి. సస్పెన్షన్‌ను రద్దు చేయాలని బీజేపీ నేతలు కోరినా స్పీకర్ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టులో కేసు దాఖలు చేయాలని నేతలు ఆలోచిస్తున్నారు. చివరి అవకాశంగా సోమవారం స్పీకర్ ను కలిసి మనవి చేయాలని పార్టీ పక్ష నేత ఆర్.అశోక్ ప్రయత్నిస్తున్నారు. భేటీ తరువాత కూడా ఫలితం లేకపోతే హైకోర్టు మెట్లెక్కాలని తీర్మానించారు. ధర్మరాయస్వామి కరగ మాలూరు: పట్టణంలో కొలువైన శ్రీ ధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవాన్ని శుక్రవారం అర్ధరాత్రి అపార భక్త సమూహం నడుమ రమణీయంగా నిర్వహించారు. ద్రౌపతాంబ దేవి ఆలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసుపు వస్త్రాలను ధరించిన కరగ పూజారులు, మునిరాజ్, నాగరాజ్, అభిషేక్‌లు కరగను తలపై మోసుకుని నృత్యాలు చేస్తూ ఊరేగారు. -
జొన్నల కొనుగోలుకు గడువు పెంచాలి
బళ్లారిఅర్బన్: రబీ సీజన్లో పండించిన జొన్నలను కొనుగోలు చేయడానికి ప్రభుత్దం విధించిన గడువును విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మంత్రి కేహెచ్.మునియప్పకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. డీసీ కార్యాలయం ఎదుట ఆ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వారితో చర్చించారు. వారితో అక్కడే మంత్రి మునియప్పతో ఫోన్లో మాట్లాడారు. మంత్రి మునియప్ప ఎమ్మెల్యే కోరికపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన ఆధ్వర్యంలో డీసీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే నారాభరత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పదించారు. రైతు నేతలు మాధవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, లేపాక్షి, వీరభద్ర రెడ్డి, నేతృత్వంలో వందలాది మంది రైతులు ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి హామీతో రైతులు ధర్నాను విరమించారు. కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా -
●రాయచూరులో కుండపోత
రాయచూరు రూరల్: రాయచూరులో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రహదారులు బురద గుంటలుగా మారాయి. సుమారు గంట పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వారం రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ప్రజలు తల్లడిల్లి పోయారు. గంట పాటు వాన పడినందున ఎండ వేడిమితో ఉక్కపోత మాత్రం తగ్గలేదు. కూరగాయల మార్కెట్, బంగీకుంట, మచ్చ బజార్, బైరూన్కిల్లా ప్రాంతాల్లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. ఏపీఎంసీలో నిల్వ ఉంచిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. -
పాత్రికేయుడిపై దాడి.. అధికారిపై వేటు
రాయచూరు రూరల్: రెండు రోజుల క్రితం రాత్రి వేళ అటవీ శాఖ అధికారి పాత్రికేయుడిపై దాడి చేయడమే కాకుండా అరెస్ట్ చేసిన ఉదంతంపై అధికారిని సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి బీదర్‌లో పని మీద వెళుతుండగా రహదారిపై గస్తీలో ఉన్న అటవీ శాఖ అదికారి దస్తగిరిసాబ్ ప్రజలతో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన విలేఖరి రవి బసవరాజ్‌పై అధికారి ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సానుకూలంగా స్పందించిన మంత్రి దస్తగిరిసాబ్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డివైడర్‌ను ఢీకొని బైక్ చోదకుడు మృతి హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణం కొట్టూరు రోడ్డులోని నీలగుంద గ్రామంలో బైక్ చోదకుడు డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడిని కూడ్లిగి పట్టణంలోని బాపూజీ నగర్ నివాసి ఓబలేష్(24)గా గుర్తించారు. బైక్ చోదకుడు ఓబలేష్ తన బైక్‌లో పెట్రోల్ నింపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని, కూడ్లిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌పై అత్యాచారం.. ఒకరు అరెస్ట్ హుబ్లీ: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ధార్వాడ తాలూకా అళ్నావర పోలీసులు అరెస్ట్ చేశారు. అళ్నావర తాలూకా కుంబారకొప్ప గ్రామ నివాసి సంజయ్ మేవుండి(22) అనే నిందితుడు మైనర్ బాలికను మభ్యపెట్టి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటంతో బాధితురాలు ప్రస్తుతం గర్భవతి అయింది. కాగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. యువయాన్కు శ్రీకారం రాయచూరు రూరల్: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ పరిరక్షణ కోసం యువయాన్కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన యువయాన్లో కార్యదర్శి కొప్పర శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ అంశాల్లో రాజ్యాంగాన్ని నానా విధాలుగా వక్రీకరించడాన్ని ఖండించారు. దేశం కోసం సమర్పించిన రాజ్యాంగాన్ని విభజించడానికి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామన్నారు. రాహుల్, సోనియా రాజీనామా చేయాలి ● బీజేపీ యువ మోర్ఛా నిరసన హొసపేటె: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక అవినీతి కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్ఛా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. హొసపేటె కార్యాలయం నుండి వారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫోటోలను పట్టుకుని పునీత్‌రాజ్‌కుమార్ సర్కిల్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. బీజేపీ యువ మోర్ఛా నేత కిచిడి కొట్రేష్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఇప్పటికే చార్జిషీట్ దాఖలైందన్నారు. అందువల్ల నాయకులు ఈ కేసులో ప్రత్యక్షంగా ప్రమేయం కలిగి ఉన్నారన్నారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అలంకరణలో బనశంకరీదేవి
బనశంకరి: భక్తులకు కొంగుబంగారమైన బనశంకరీదేవి ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం చేపట్టి వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణచేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. రోడ్డుపైనే రీల్స్.. యువకుడి అరెస్ట్ యశవంతపుర: రీల్స్ కోసం రోడ్డుపై కుర్చీ వేసుకొని వీడియో తీస్తున్న నిందితుడిని బెంగళూరు ఎస్జే పార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న ప్రకాశ్ రీల్స్ వ్యామోహంలో ఎస్జే పార్క్ మొయిన్ రోడ్డుపై కుర్చీ వేసుకున్నారు. కుర్చీపై టీ తాగుతున్న మాదిరిలో ఫోజు ఇచ్చి వీడియో తీసుకున్నారు. అనంతరం రీల్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బెంగళూరు కేఆర్ మార్కెట్ పోలీసు స్టేషన్ సోషల్ మీడియా వింగ్ గమనించి ఎస్జే పార్క్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీని అధారంగా రీల్స్ ప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నెల 12న తాను అక్కడ రీల్స్ చేసినట్లు విచారణలో ప్రకాశ్ ఒప్పుకున్నారు. ప్రాణం తీసిన సూక్ష్మరుణం శివమొగ్గ: సూక్ష్మరుణ సంస్థ సిబ్బంది వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శివమొగ్గలోని గాడికొప్ప లేఔట్లో జరిగింది. గాడికొప్పలో నివాసం ఉంటున్న వినోద్‌కుమార్(35) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, తల్లి, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం సూక్ష్మరుణ సంస్థలో అప్పు తీసుకున్నాడు. అయితే కంతులు చెల్లించడంలో జాప్యం జరగడంతో సూక్ష్మరుణ సిబ్బంది ఇంటివద్దకు వచ్చి గొడవకు దిగారు. పరువు పోయిందనే మనోవేదనతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
గుజరాత్ కంపెనీకి టీబీ డ్యాం గేటు నిర్మాణ బాధ్యత
హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్ గేట్‌ను తొలగించి శాశ్వత క్రస్ట్‌గేట్‌ను నిర్మించడానికి గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీ టెండర్ దక్కించుకొందని తుంగభద్ర మండలి అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ టెండర్‌ను దక్కించుకుందని అధికారులు తెలిపారు. ఈ కంపెనీ గతంలో మైసూరులోని కేఆర్ఎస్ ఆనకట్ట గేట్లను కూడా నిర్మించిందన్నారు. తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్ వద్ద స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డ్యాం గేటు నిర్మించడంలో అనుభవం కలిగిన ఈ హార్డ్‌వేర్ టూల్స్ మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీ త్వరలో తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్ గేట్‌ను నిర్మించే పనులను ప్రారంభిస్తుందన్నారు. గత ఏడాది ఆగస్టు 10న 19వ నంబర్ గేట్ ప్రవాహ తీవ్రతకు ఊడి పోయి నీటిలో కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. అనంతరం డ్యాంలో ఉన్న నీటిని కాపాడేందుకు ఒక తాత్కాలిక స్టాప్ లాగ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ గేటు కూలి పోవడంతో సుమారు 40 టీఎంసీలకు పైగా వరకు నీరు వ్యర్థంగా నదిలోకి విడుదలైంది. తరువాత నిపుణుడు కన్హయ్య నాయుడు నాయకత్వంలో ఒక స్టాప్‌లాగ్ నిర్మించారు. ఇప్పుడు గేటుకు శాశ్వత గేటు నిర్మాణ టెండర్‌కు చర్యలు చేపట్టారన్నారు. మరో రెండు రోజుల్లో మిగిలిన 32 క్రస్ట్ గేట్లను నిర్మాణం చేయడానికి తుంగభద్ర బోర్డు ఈ–టెండర్లను కూడా పిలవనుందని తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో శాశ్వత గేటు నిర్మాణ పనులకు శ్రీకారం 32 క్రస్ట్‌గేట్ల నిర్మాణ పనులకు ఈ–టెండర్ల పిలుపునకు సన్నాహాలు -
అలరించిన కరగ ఉత్సవం
కోలారు : నగరంలోని కారంజికట్ట శ్రీధర్మరాయస్వామి పూల కరగ ఉత్సవం గురువారం రాత్రి అపార భక్త సమూహం నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. కరగ పూజారి నాగరాజ్ కుమారుడు మునిరాజు కరగ తలపై మోసుకుని చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వందలాది ఏళ్ల చరిత్ర కలిగిన కారంజికట్ట కరగ ఉత్సవాన్ని చూడడానికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. చాలా ఏళ్లుగా కరగను మోస్తూ వచ్చిన బేతమంగల నాగరాజ్ వయసు మళ్లిన కారణంగా ఆయన కుమారుడు మునిరాజు కరగను తలపై మోసే బాధ్యతను తీసుకున్నారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల మధ్య మునిరాజు నిర్వహించిన కరగ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ద్రౌపతాంబ దేవి ఆలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసుపు వస్త్రాలను ధరించిన కరగ పూజారి కరగను భక్తితో తలపై మోసుకుని వేదికపై నృత్యం చేశారు. కరగ సందర్భంగా ఆలయాన్ని, కారంజికట్ట ప్రాంతం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కరగ ఉత్సవంలో వీర కుమారుల గోవిందనామ స్మరణ మారుమోగింది. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ, అనిల్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని కరగ ఉత్సవాన్ని వీక్షించారు. -
కఠోర శ్రమే విజయానికి సోపానం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో కఠిన పరిశ్రమతో విద్యార్థుల విజయం సాధ్యమని సిద్ధారూడ అరూఢ జ్యోతి శాంతాశ్రమ మఠాధిపతి నిజానంద స్వామీజీ పేర్కొన్నారు. రాయచూరు వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో వేదాంత కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జ్ఞాన సముపార్జనకు సాహిత్యం, సంస్క్రతి, సేవలు చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగ పడే విధంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. శరణబసవ, రశ్మిరాణి, అగ్నిహోత్రి, వేదాంత కళాశాల అధికారి రాకేష్ రాజలబండి, నిఖిల్, రమేష్ నాయక్, వీరేష్, వినోద్‌లున్నారు. -
భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
శివాజీనగర: క్రైస్తవులకు పవిత్ర దినమైన శుభ శుక్రవారం(గుడ్ ఫ్రైడే)ను రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్రమంతటా ఉపవాస, ధ్యాన, ప్రార్థనలతో ఆచరించారు. ఉదయం నుంచే చర్చిల్లో ప్రార్థన, ధ్యానం, యేసు శిలువ కార్యం, ఉపదేశం జరిగింది. శివాజీనగర సెయింట్ మేరీ బసలికా, ఎం.జీ.రోడ్డులో ఉన్న సెయింట్ మార్క్స్ క్యాథడ్రల్ చర్చి, ఆల్ పీపల్స్ చర్చి, సెయింట్ థామస్ చర్చి, ఇన్ఫాంట్ జీసస్ చర్చి, సెయింట్ లుక్స్ చర్చి, సెయింట్ ప్యాట్రిక్ చర్చి, శివాజీనగర ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి, శిశు జీసస్ చర్చి వివేకానగర, మిస్పా తెలుగు చర్చి, మరియమ్మనహళ్లి కర్ణాటక కల్వరి చర్చి, అమాన్ తెలుగు చర్చితో పాటు పలు చోట్ల గుడ్‌ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చర్చి వెబ్సైట్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్లలో కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం చేశారు. భక్తులు ఇళ్లలో నుంచే ఆచరణలో పాల్గొన్నారు. యేసును గొల్గొతా కొండకు తీసుకెళ్లిన ఆనాటి దృశ్యాలను, యేసు క్రీస్తు శిలువను మోసుకొని ఊరేగించిన దృశ్యాలను కూడా ప్రదర్శించారు. ఏడు దివ్య వాక్కులు క్రీస్తు సందేశం: ఏసుక్రీస్తు శిలువ మరణాన్ని మననం చేసుకుంటూ క్రైస్తవులు శిలువపై యేసు పలికిన ఏడు దివ్య వాక్కులను అత్యంత భక్తిశ్రద్ధలతో ధ్యానించారు. గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకొని గత 40 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనల్లో నిమగ్నమైన క్రైస్తవులు శుక్రవారం ఆయా చర్చిల్లో గుడ్‌ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అత్యంత భక్తితో ఉపవాసంలో ఉంటూ చర్చిల సభ్యులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు భక్తిపాటలను ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. ఫ్రేజర్‌టౌన్‌లో ఉన్న మిస్పా తెలుగు చర్చి, మారతహళ్లి అమానా తెలుగు చర్చి, రామచంద్రపుర, మత్తికెరె, హలసూరు తదితర ప్రాంతాల్లోని చర్చిల్లో యేసు సిలువపై పలికిన ఏడు మాటలను ప్రత్యేకంగా ధ్యానించారు. మానవులు క్షమా గుణం కలిగి జీవించాలని యేసు తెలియజేసిన మాటలను వివరించారు. మిస్పా తెలుగు చర్చి పాస్టర్ రెవరెండ్ బెరాకా ఆండీ ప్రత్యేక ప్రార్థన చేశారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించిన ఏసు శిలువపై పలికిన ఏడు మాటలను ఏడుగురు పాస్లర్లు విశదీకరించారు. శిలువ శ్రమలను అనుభవిస్తూ తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండని యేసు పలికిన మొదటి మాట గురించి పాస్టర్ రెవరెండ్ డీ.బెరాకా ఆండీ వివరించారు. ఏసు క్రీస్తు సర్వమానవాళికి పాప విముక్తి కలిగించారని అమాన తెలుగు చర్చి పాస్టర్ రెవరెండ్ కే.పీ.రాజశేఖర్ తెలియజేశారు. శిలువపై ఏసుక్రీస్తు పలికిన ఏడు మాటలను ధ్యానించిన క్రైస్తవులు చర్చిల్లో సామూహిక ప్రార్థనలు -
క్రీడలతో శారీరక ఆరోగ్యం
కోలారు : యువత క్రీడల్లో విరివిగా పాల్గొనడం ద్వారా శారీరకంగా, మానసికంగా సధృఢంగా ఉండడానికి సాధ్యమని కోముల్ మాజీ డైరెక్టర్ డీవీ హరీష్ తెలిపారు. శుక్రవారం తాలూకాలోని తంబిహళ్లి గేట్లో పాలార్ క్రికెట్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన హుత్తూరు పంచాయతీ ప్రీమియర్ లీగ్ సీజన్– 2 క్రికెట్ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలను నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించవచ్చన్నారు. వారిని తగిన విధంగా ప్రోత్సహించడం ద్వారా గొప్ప క్రీడాకారులను చేయవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. వచ్చే సంవత్సరం మరిన్ని జట్లను చేర్చి క్రికెట్ పోటీలను నిర్వహిస్తామన్నారు. టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు వడగూరు వి.రాము, కురుబర సంఘం మాజీ అధ్యక్షుడు తంబిహళ్లి మునియప్ప, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సును అడ్డుకున్న ఏనుగు
కెలమంగలం: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఏనుగు అడ్డుకున్న ఘటన తమిళనాడు – కర్ణాటక సరిహద్దు ఆనేకల్ సమీపంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కే.ఆర్.పుర ప్రాంతం నుంచి గురువారం సాయంత్రం ప్రయాణికులతో కగ్గలీపురకు బయల్దేరింది. గుల్లట్టి ప్రాంతం వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఏనుగు బస్సును అడ్డగించింది. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేశారు. డ్రైవర్, కండెక్టర్ విషయాన్ని అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగును బన్నేరుగట్ట అటవీ ప్రాంతానికి మళ్లించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. బస్సుల్లో పొగాకు ప్రకటనలపై నిషేధం బనశంకరి: కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో పొగాకు, సిగరెట్, మద్యం ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు లైసెన్సుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సుల్లో పొగాకు, సిగరెట్, మద్యం ఉత్పత్తులు ప్రకటనలను పూర్తిగా తొలగించాలని ఓ వ్యక్తి ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి మనవిచేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అలాంటి ప్రకటనలు తొలగించాలని సీఎం కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక బస్సుల్లో అమర్చిన కూల్‌లిప్ ప్రకటనలను తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. కట్నం వేధింపులకు మహిళ బలి యశవంతపుర: కట్నం వేధింపులకు మహిళ బలైంది. కట్నం తీసుకురావాలని అత్తంటివారు ఒత్తిడి చేస్తుండటంతో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హాసన్ జిల్లా ఆలూరు తాలూకా కణదహళ్లి గ్రామంలో జరిగింది. హళేపాళ్యకు చెందిన రక్షిత(21) అనే యువతి, కణదహళ్లికి చెందిన పునీత్‌లు మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లయినప్పటినుంచి కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక మనో వేదనకు గురైంది. ఈక్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలూరు గ్రామాంతర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సామూహిక అత్యాచారంపై విచారణ వేగవంతం యశవంతపుర: మంగళూరులో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి ఉళ్లాల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. యువతిని డ్రాప్ చేస్తామనే సాకుతో ఆమైపె అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆటో డ్రైవర్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి ఉద్యోగం కోసం కేరళలోని ఉప్పళకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో గొడవ పడి అర్థరాత్రి మంగళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ సాయం కోరడంతో అప్పుడు ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు తాగిన మత్తులో ఎవరూ లేని చోటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. తుంగభద్రలో మునిగి ఇద్దరు దుర్మరణం ● మృతులు బెంగళూరు వాసులు రాయచూరు రూరల్: తుంగభద్ర నదిలో స్నానానికి దిగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాయచూరు తాలూకా బిచ్చాలిలో చోటు చేసుకుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం ముగించుకొని బిచ్చాలిలో వెలసిన అప్పణాచారి కట్ట, ఏకశిలా బృందావనం తిలకించడానికి వచ్చిన బెంగళూరు వాసులు నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. నది మధ్యలో పాయ ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి నీట మునిగి ప్రాణాలు వదిలారు. మృతులను బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా చినవండనహళ్లి ముత్తురాజ్ (23), మదన్(20 )లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు యరగేర పోలీసులు తెలిపారు. -
జోరందుకున్న వరి కోతలు
సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం కింద ఆయకట్టు పరిధిలో రబీ సీజన్లో సాగు చేసిన వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఆయకట్టు పరిధిలో బళ్లారి, రాయచూరు, విజయనగర, కొప్పళ జిల్లాల పరిధిలో సాగు చేసిన లక్షలాది ఎకరాల్లో వరి పంట కోతదశకు చేరుకోవడంతో ఇప్పటికే 25 శాతం వరి కోతలు పూర్తి కావడంతో పాటు కల్లాల్లో వరిధాన్యం ఆరబోసుకుని రైతులు అమ్మకానికి సిద్ధంగా ఉంచుతున్నారు. అయితే ప్రస్తుతం వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో వరి కోతలు చేస్తున్న రైతుల గుండెల్లో గుబులు నెలకొంది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటలు రైతులకు చేతికందే వరకు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు పడుతూ నష్టపోతున్న రైతులకు అకాల వర్షాలతో లబోదిబోమంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోత యంత్రాలకు డిమాండ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో వరి కోత మిషన్లకు కూడా బాగా గిరాకీ లభిస్తోంది. ఒక వైపు రైతులకు, రైతు కూలీలకు కూడా వరి కోతల వల్ల చేతి నిండా పని దొరుకుతోంది. పంట పండి చేతికందిన సమయంలో గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు, కోతకు వచ్చిన సమయంలో వర్షాలు వస్తే ఆ పంట నానిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తుంగభద్ర ఆయకట్టు కింద సాగు చేసిన వరిపంటను అష్టకష్టాలతో గట్టెక్కించుకుని, పెట్టిన పెట్టుబడులు కూడా దక్కించుకునేందుకు రైతులు పడిన బాధలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఈఏడాది డ్యాంలోకి పుష్కలంగా నీరు ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే తుంగభద్ర డ్యాంలోకి పుష్కలంగా నీరు రావడంతో పాటు సకాలంలో కాలువలకు నీరు వదలడంతో ఆయకట్టు కింద అదునులోనే వరినాట్లు వేయడంతో డ్యాంలో నీరు తగినంత ఉండటంతో వరి పంటకు నీటి సమస్య లేకపోవడంతో రైతులు అనుకున్నట్లుగా పంట కోత దశకు చేరుకోవడంతో గత 10 రోజుల నుంచి తుంగభద్ర ఆయకట్టు పరిధిలో ముమ్మరంగా వరి కోతలు జరుతున్నాయి. వరి పంట బాగా రావడంతో పెట్టిన పెట్టుబడులతో పాటు అంతో ఇంతో లాభాలు కూడా వస్తాయని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో వారం రోజుల క్రితం కూడా వడగండ్లు వానతో పలు గ్రామాల్లో వరి పంట దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ గాలి వాన, వడగండ్లతో వానలు ప్రారంభం కావడంతో వరి కోతలు చేస్తున్న రైతుల్లో మరింత భయం నెలకొంటోంది. రైతులకు తప్పని వాన కష్టాలు రెండు రోజుల నుంచి మేఘాలు కమ్ముకుని వర్షాలు అక్కడక్కడ మళ్లీ కురుస్తుండటంతో కల్లాల్లో ఆరబోసిన రైతులు వడ్లు నానకుండా అష్టకష్టాలు పడుతున్నారు. వరికోతలకు వర్షాలు వస్తే మిషన్లు పొలాల్లోకి వెళ్లేందుకు వీలు కాక పనులు ఆగిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరికోతలు కోసే యంత్రాలు వర్షంలో పని చేయడానికి అనుకూలంగా ఉండకపోవడమే కాకుండా, నేల బురదమయంగా మారడంతో వరికోత మిషన్ ముందుకు కదలడం లేదు. వర్షానికి, గాలికి వడ్లు నేలరాలుతాయనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. తుంగభద్ర ఆయకట్టు కింద వరికోతలు చేపడుతున్న రైతులకు కోతల సమయంలో వర్షాలు కురవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. వర్షానికి వడ్లు నానిపోతే మార్కెట్లో ధర పడిపోతుందనే భయం కూడా అన్నదాతల్లో నెలకొంది. పక్వానికి చేరిన రబీ సీజన్ పైరు ఏపీఎంసీలో రాశులుగా ధాన్యం -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
మండ్య : భార్యపై అనుమామానం పెంచుకొని తలపై బండరాయి వేసి కడతేర్చిన భర్త ఉదంతం మండ్య జిల్లా, శ్రీరంగ పట్టణ తాలూకా బాబురాయనకొప్పలు గ్రామంలో జరిగింది. తాలూకాలోని పి.హోసహళ్లికి చెందిన వీరభద్రాచారి కుమారుడు చంద్ర అనే వ్యక్తితో పాండవపుర తాలూకా సణబ గ్రామానికి చెందిన సౌమ్య(32)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. చంద్ర కూలీ పనులు చేసేవాడు. రెండేళ్లుగా బాబురాయన కొప్పలు గ్రామంలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన చంద్ర భార్యతో గొడవపడేవాడు. సౌమ్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయంపై గొడవపడి బండరాయిని ఆమె తలపై వేసి ఉడాయించాడు. సౌమ్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు చంద్ర కోసం గాలిస్తున్నారు. -
విలేకరిపై దాడి.. అటవీ సిబ్బంది సస్పెన్షన్
హుబ్లీ: బీదర్‌లో వార్తల సేకరణకు వెళ్లిన విలేకరి రవి బసవరాజ బాసుండేపై దాడి చేసిన అటవీ శాఖ సిబ్బంది దస్తగిరి సాబ్‌ను ఉప అటవీ సంరక్షణ అధికారి సస్పెండ్ చేస్తూ ఆదేశాలను వెల్లడించారు. సదరు అటవీ శాఖ ఉద్యోగి దస్తగిరి సాబ్ విధి నిర్వహణ వేళ ప్రజలతో వినయ విధేయతలు చూపకుండా ఇష్టమొచ్చిన రీతిలో నడుచుకుంటున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి నిజాలు వెల్లడి కావడంతో నిష్పక్షపాతంగా ఈ సస్పెన్షన్ చర్య తీసుకున్నారు. ఈ నెల 15న బీదర్ నగరంలో విలేకరిపై అటవీ సిబ్బంది దాడి గురించి క్రమశిక్షణ చర్యలు తీసుకుని నివేదికను ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆదేశించారు. విలేకరిపై దాడిని ఖండించిన కేయూడబ్ల్యూజే ఈ విషయంలో బాధ్యులపై చర్యకు డిమాండ్ చేస్తూ బీదర్‌లో విలేకరుల సంఘం ఆందోళన చేపట్టింది. ఎట్టకేలకు బాధ్యుడిపై సస్పెన్షన్ వేటు వేసినందుకు కేయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ విలేకరుల పోరాటానికి స్పందన లభించిందన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని అన్నారు. అబద్ధాలతో సర్కారు కాలయాపన హుబ్లీ: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అబద్ధాలు చెప్పి కాలయాపన చేస్తోందని రైతు నేత కోడిహళ్లి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప గతంలో వ్యవసాయ చట్టాన్ని చేసి భూమిని రైతులు కాని వారికి ఇచ్చే చట్టం తెచ్చారన్నారు. దీన్ని అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రద్దు చేస్తామని సిద్దరామయ్య హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా ఏపీఎంసీ చట్టాన్ని కూడా రద్దు చేస్తామన్నారు. అయినా ఈ కీలక అంశంపై సిద్దరామయ్య ఇప్పటికీ మాట్లాడటం లేదన్నారు. కాంగ్రెస్ కేవలం మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయడం నీచ సంస్కృతి అన్నారు. పేద దళితులను గుర్తించడం విడిచి వేరే దారిలో సర్కారు సాగుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లకు ప్రత్యామ్న్యాయ పార్టీ ఏర్పాటుపై చింతన సమావేశంలో చర్చ జరిపామన్నారు. ఈ విషయమై జనతా ప్రణాళిక రూపొందించామన్నారు. కొత్తగా రైతుల పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలోనే ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు స్వశక్తితో రాణించాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో సమాజానికి తగ్గట్లు మహిళలు కఠిన పరిశ్రమతో స్వశక్తితో రాణించాలని ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుష్మా పతంగి పిలుపునిచ్చారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మహిళలకు టైలరింగ్ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. స్వశఽక్తితో జీవితాన్ని నడపడానికి నేడు అన్ని విధాలుగా అవకాశాలున్నాయన్నారు. సమాజానికి ఉపయోగ పడే విధంగా సేవలు అందించాలన్నారు. లలిత, అనితా, భ్రమరాంబ, రత్నమాల, శ్రీదేవి, ఇందిర, ప్రతిభ, ప్రమోద్, లతాలున్నారు. ముంగారు ఉత్సవాలకు కేంద్ర మంత్రికి ఆహ్వానం రాయచూరు రూరల్: నగరంలో జూన్ నెలలో ఐదు రోజుల పాటు ముంగారు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలసి విన్నవించుకున్నారు. జూన్ 8 నుంచి 12 వరకు ముంగారు మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో ముంగారు సాంస్కృతిక ఉత్సవాలను చేపట్టడానికి సమాజం సిద్ధంగా ఉందన్నారు. ముంగారు సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించి 25 ఏళ్లు కానున్న సందర్భంగా ఉత్సవాలకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. వైభవంగా మహంతేశ్వర రథోత్సవం రాయచూరు రూరల్: తాలూకాలోని బిచ్చాలి గ్రామంలో గురువారం సాయంత్రం మహాంతేశ్వర మహాలింగ స్వామీజీ రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. ఆలయంలో బిచ్చాలి మఠాధిపతి వీరభద్ర శివాచార్య, శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సోమేశ్వర, పంచాక్షరి స్వామీజీలు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కట్టడంలో మేసీ్త్ర దంపతుల శవాలు
యశవంతపుర: నిర్మాణంలో ఉన్న కట్టడంలో దంపతులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన బెంగళూరు సంజయనగర పోలీసుస్టేషన్ డాలర్స్ కాలనీలో జరిగింది. యాదగిరికీ చెందిన మెహబూబ్ (45), భార్య పర్వీన్ (35)లు డాలర్స్ కాలనీలోని నిర్మాణంలో ఉన్న భవనం మేస్త్రి పని చేస్తూ, పర్వీన్ కూలీ పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. రంజాన్ పండుగకు యాదగిరికి వెళ్లి తిరిగివచ్చారు. మూడు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. మెహబూబ్ కోపంతో పర్వీన్‌ను గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది, మెహబూబ్ భయపడి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. మూడు రోజుల కిందటే మరణించినా, అక్కడ ఎవరూ లేని కారణంగా గుర్తించలేదు. గురువారం ఉదయం కట్టడం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంజయనగర పోలీసులు చేరుకుని పరిశీలించగా కిందపడి ఉన్న మహిళ శవం, ఉరికి వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించాయి. యాదగిరిలోని సంబంధీకులకు సమాచారం అందించి విచారణ చేపట్టారు. హత్య, అత్మహత్యగా అనుమానం -
లారీల సమ్మె సమాప్తం
● ఫలించిన చర్చలు బనశంకరి: లారీల యజమానులు, ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో లారీల సమ్మె ముగిసింది. గురువారం రవాణా మంత్రి రామలింగారెడ్డితో సంఘం నాయకులు చర్చలు సాగించారు. డీజిల్ ధర తగ్గించాలి, లారీ డ్రైవర్లపై దాడులు ఆపాలి, బెంగళూరులోకి సరుకు రవాణా లారీలను అనుమతించాలి అని పలు డిమాండ్లతో 14 అర్ధరాత్రి నుంచి లారీలను నిలిపేశారు. దీంతో సరుకురవాణా పూర్తిగా నిలిచిపోయింది. మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ లారీ యజమానులు 6 డిమాండ్లు పెట్టారని తెలిపారు. ఆన్లైన్లో జరిమానా చెల్లించే వ్యవస్థను అమలు చేస్తామని తెలిపారు. ఓటీఎస్ తరహాలో జరిమానా చెల్లింపులు కోరారని, సీఎంతో మాట్లాడతానని అన్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌ల సమస్యను మూడునెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సంఘం నేతలు తెలిపారు. అధికారులు, పోలీసుల వేధింపులపై చెప్పామన్నారు. మూడురోజుల లారీల సమ్మెతో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. -
సిద్దూ.. పద్ధతి మార్చుకో
శివాజీనగర: సీఎం సిద్దరామయ్య పేదల, దళితుల, రైతుల కన్నీరు ఏనాడైనా తుడిచారా? అభివృద్ధి పనులు చేపట్టారా? అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ప్రశ్నించారు. గురువారం బాగలకోటలో జనాక్రోశ యాత్ర నిర్వహించారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలు అధికమయ్యాయి. హిందూ మహిళలపై అవమానాలు, గోహత్యలు, లవ్ జిహాద్ పెరిగాయి, రైతులు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రూ. 3 లక్షలు చెల్లించాలి అని ఆరోపించారు. వీరశైవ మతం అని రాష్ట్రంలో నిప్పు పెట్టే పని చేశారన్నారు. ముస్లిం మహిళలకు వివాహానికి రూ.50 వేలు ఇస్తామన్నారు. హిందువుల్లో పేదవారు లేరా? ముస్లిం యువత విదేశాలలో చదివేందుకు రూ.30 లక్షలు ఇస్తామని చెప్పారు. హిందువుల్లో పేదవారు లేరా అని ప్రశ్నించారు. హిందువులను ఎందుకోసం అవమానం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనలో ఎంపీలు జగదీశ్ శెట్టర్, గోవింద కారజోళ, పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాక్రోశ యాత్రలో విజయేంద్ర -
ప్రధానీ.. అచ్చే దిన్ ఏవీ?
శివాజీనగర: కేంద్ర ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంటగ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపిందంటూ ఏకంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ ధర్నా చేశారు. గురువారం నగరంలోని ఫ్రీడం పార్కులో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ సుర్జేవాలతో పాటుగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు నిరసన నిర్వహించారు. మన్మోమోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు నిత్యావసర వస్తువుల ధర ఎంత ఉండేది, ప్రస్తుతం ఎంత అనేది తెలుసుకోవాలి. అచ్చే దిన్ వస్తాయన్నారు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని తెచ్చి జనం ఖాతాల్లోకి వేస్తామన్నారు. మూడోసారి ప్రధాని అయినా దాని గురించి మాట్లాడటం లేదు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 65 డాలర్లు ఉన్నా కూడా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడం లేదు. వీటన్నింటితో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది, అందుకే మేము ప్రజల కోసం గ్యారెంటీ పథకాలను ఇస్తున్నాము అని సీఎం, డీసీఎంలు అన్నారు. రైతు, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని, ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం, డీసీఎం ప్రశ్న ధరల పెంపుపై ఆందోళన -
కులగణన నివేదికకు బ్రేక్
సాక్షి, బెంగళూరు: అంతా అనుకున్నట్లుగానే జరిగింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం సిద్ధరామయ్య తీసుకొచ్చిన కులగణన నివేదికకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో బలమైన కుల సంఘాల హెచ్చరికలు, మంత్రుల వ్యతిరేకతే దీనికి కారణమని చెప్పుకోవచ్చు. గురువారం సాయంత్రం విధానసౌధలో కులగణన నివేదిక గురించి రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. పలువురు మంత్రులు కులగణన నివేదికను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కావాల్సిన కేబినెట్ భేటీ గంట ఆలస్యంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం అయింది. తీవ్ర భిన్నాభిప్రాయాలు సుమారు 2 గంటల పాటు సమావేశం కొనసాగింది. మంత్రుల అభిప్రాయాలను, అభ్యంతరాలను లిఖిత రూపంలో ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. పలువురు మంత్రులు బహిరంగంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు పడతామని హెచ్చరించారు. మరికొందరు మంత్రులు కాగితం మీద అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు నివేదికకు అనుకూలంగా మాట్లాడారు. సిద్ధరామయ్య ఎంత ప్రయత్నించినా ఏకాభిప్రాయం వీలుపడలేదు. మొత్తం 31 మంంది మంత్రులు పాల్గొన్నారు. మంత్రి దినేశ్ గుండూరావు, మంత్రి కె.వెంకటేశ్‌లు ముందే చెప్పి గైర్హాజరయ్యారు. ఎలాంటి తీర్మానం చేయకుండానే ముగిసింది. కేబినెట్ భేటీకి ముందు సీఎం కార్యాలయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. రాష్ట్రంలో సెగలు పుట్టించిన కుల గణన నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేక తిరస్కరిస్తుందా? అనే ఉత్కంఠ మధ్య జరిగిన కేబినెట్ భటీ ఏమీ తేల్చకుండానే ముగిసింది. నివేదికలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని ప్రముఖ కులసంఘాలు కన్నెర్ర జేయడం తెలిసిందే. ఆమోదిస్తే తమ సత్తా చూపుతామనని కూడా స్పష్టం చేశాయి. దీంతో సర్కారు వెనక్కి తగ్గింది. మంత్రిమండలి సమావేశంలో తలోమాట కొందరు మంత్రుల వ్యతిరేకత ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ మే 2న మళ్లీ భేటీ: మంత్రి సమావేశం తరువాత మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ కులగణన నివేదిక లీక్ కాలేదని, నివేదికలోని గణాంకాలు మాత్రమే మీడియాలో ప్రసారం అయ్యాయని చెప్పారు. మే 2న మరోసారి ప్రత్యేక కేబినెట్ భేటీ జరగనుందని, ఆ సమావేశంలో తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
మలె మహదేశ్వరునికి కనకవర్షం
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రక్యాత మలె మహదేశ్వర బెట్టలో వెలసిన మలెమహదేశ్వర స్వామి దేవస్థానం చరిత్రలో మొదటిసారిగా 35 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.3.26 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. గురువారం సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శాంతమల్లికార్జున స్వామీజీ సమక్షంలో దేవస్థానంలోని హుండీల లెక్కింపు జరిగింది. ఈసారి ప్రభుత్వ సెలవు రోజులు, పాదయాత్రికులు, ఉగాది, అమావాస్య జాతర మహోత్సవం, తేరు వేడుకలు ఎక్కువగా జరిగాయి దీంతో వేల పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానాన్ని సందర్శించి కానుకలు సమర్పించారు. రూ.3.26 కోట్ల నగదు, 47 గ్రాముల బంగారం, 2.2 కేజీల వెండి సొత్తు లెక్కతేలాయి. ఈ–హుండీ ద్వారా రూ.59 వేలు, 11 విదేశీ కరెన్సీ నోట్లు, చలామణిలో లేని 20 రూ.2 వేల నోట్లను హుండీలో వేశారు. 35 రోజుల్లో రూ.3.26 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించడం ఇదే ప్రథమమని ఆలయ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి ఏఈ రఘు తెలిపారు. ప్రాధికార ఉప కార్యదర్శి చంద్రశేర్ పాల్గొన్నారు. మలె మహదేశ్వర దేవస్థానం 35 రోజుల్లో 3.26 కోట్ల హుండీ ఆర్జన -
మంత్రి కారు ప్రమాదం కేసు.. లారీ డ్రైవరు అరెస్టు
దొడ్డబళ్లాపురం: గతంలో మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ కారును ఢీకొట్టి వాహనం ఆపకుండా పరారైన లారీ డ్రైవర్‌ను బెళగావి కిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన మధుకర కొండిరాయ సోమవంశీ (65) అరైస్టెన ట్రక్ డ్రైవర్. జనవరి 14న తెల్లవారుజామున మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్, ఆమె తమ్ముడు ఎమెల్సీ చన్నరాజు, గన్‌మ్యాన్ కారులో బెంగళూరు నుండి బెళగావి వెళ్తుండగా కిత్తూరు సమీపంలో వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అదుపుతప్పిన కారు రోడ్డుపక్కన చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కిత్తూరు పోలీసులు ఇన్నాళ్లపాటు విచారించి మహారాష్ట్రలో నిందితున్ని అరెస్టు చేశారు. పోలీసులపై వీలింగ్ పోకిరీల దాడి దొడ్డబళ్లాపురం: రోడ్లపై ప్రమాదకరంగా వీలింగ్ చేస్తున్న యువకులను పట్టుకోబోయిన పోలీసులపైనే దాడి చేసిన సంఘటన రామనగర పరిధిలోని యారబ్ నగరలో చోటుచేసుకుంది. రాత్రివేళ మెయిన్ రోడ్లపై కొందరు స్థానిక యువకులు, మైనర్లు వీలింగ్ చేస్తూ ఇబ్బందిపెడుతున్నారని పలుసార్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో వీలింగ్ చేస్తున్న ఆకతాయిలను పట్టుకోవడానికి ప్రయత్నించగా తిరగబడ్డారు. దీంతో తోపులాట, బాహాబాహీ జరిగింది. ప్రధాన నిందితుడు సైఫ్ ఖాన్, ఇతని తండ్రి యూసుఫ్ ఖాన్ మరియు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో తండ్రీ కొడుకులని అరెస్టు చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. గజరాజులచే సిటీ బస్ అడ్డగింత దొడ్డబళ్లాపురం: అడవిలో నుంచి రోడ్డుమీదకు వచ్చిన ఏనుగుల గుంపు బీఎంటీసీ బస్సును అడ్డగించి అటూఇటూ ఊపిన సంఘటన కనకపుర తాలూకా కగ్గలీపురలో జరిగింది. గురువారం ఉదయం కేఆర్ మార్కెట్టు నుంచి సిటీ బస్సు గుల్లహట్టి వైపు వెళ్తుండగా కగ్గలీపుర వద్ద హఠాత్తుగా ఐదారు ఏనుగులు రోడ్డుకు అడ్డంగా వచ్చాయి. బస్సును చుట్టుముట్టి తొండాలతో అటూఇటూ ఊపాయి. ఈ సంఘటనతో డ్రైవర్, కండక్టర్లతో పాటు ప్రయాణికులు భయంతో విలవిలలాడిపోయారు. కొంతసేపటికే పక్కు వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సవదత్తి ఆలయం వద్ద ఉద్రిక్తత యశవంతపుర: బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ దేవస్థానం వద్ద అక్రమంగా వెలసిన అంగళ్లును తొలగించే ప్రయత్నంలో అధికారి ఒకరు వ్యాపారులను అసభ్యంగా తిట్టడం వివాదమైంది. ఆలయ ప్రాధికారచే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అడ్డుగా ఉన్న అంగళ్లను తొలగిస్తున్నారు. గురువారం ఉదయం ప్రాధికార కమిషనర్ అశోక దుడగుంటి వచ్చినప్పుడు వ్యాపారులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అశోక దుడగుంటి అసభ్య పదాన్ని ఉపయోగించటంతో వ్యాపారులు మండిపడి ధర్నా చేశారు. కొంతసేపు దేవస్థానం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నేలకొన్నాయి. పోలీసులు వ్యాపారులకు నచ్చచేప్పి పంపారు. సీఈటీలో నకిలీ అభ్యర్థి బనశంకరి: చివరి క్షణంలో వచ్చి సీఈటీ పరీక్ష రాయడానికి ప్రయత్నించిన నకిలీ అభ్యర్థి బండారం బట్టబయలైంది. నగరంలో మల్లేశ్వరం 7వ రోడ్డు సిల్వర్ వ్యాలీ పీయూ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి గురువారం ఉదయం గణితం పరీక్ష రాయడానికి వచ్చి నేరుగా మరుగుదొడ్డిలోకి వెళ్లాడు, గంటయినా బయటికి రాలేదు. పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో వచ్చి క్యూఆర్ కోడ్ ఉన్న హాల్‌టికెట్ చూపించాడు. సిబ్బంది ఫేస్ స్కాన్ చేయగా అభ్యర్థి కాదని తేలింది. సిబ్బంది ఉన్నతాధికారులకు చెప్పేలోపు నకిలీ అభ్యర్థి ఉడాయించాడని కర్ణాటక పరీక్షా ప్రాధికార డైరెక్టర్ హెచ్.ప్రసన్న తెలిపారు. అసలు అభ్యర్థి ఫోటోపై అతని ఫోటోని అతికించాడని, ఫేస్ స్కానింగ్ వల్ల మోసం బయట పడిందని తెలిపారు. -
రెండు బైక్‌ల ఢీ.. ఇద్దరు మృతి
● మరో ఇద్దరికి గాయాలు హుబ్లీ: రెండు బైక్‌ల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా ఉండగోడ రోడ్డు మాచాపుర గ్రామం వద్ద చోటు చేసుకుంది. మృతులను కలఘటిగి తాలూకా తావరగెరె గ్రామానికి చెందిన మంజునాథ్ కల్లప్ప వాలికార(19), ధార్వాడ తాలూకా జోగెల్లాపుర గ్రామానికి చెందిన బసవరాజ్ శివప్ప సోమన్నవర(36)గా గుర్తించారు. బెళవంతర గ్రామానికి చెందిన ఆనంద నూల్వి, తావరగెరె గ్రామానికి చెందిన ప్రవీణ భజంత్రి గాయపడ్డారు. వీరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. అతివేగంగా వస్తున్న రెండు బైక్‌లు పరస్పరం ఢీకొన్న తీవ్రతకు బసవరాజ్, మంజునాథ తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే పోలీసులు, మాచాపుర గ్రామస్తులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందారు. కలఘటిగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పదవిని కాపాడుకోడానికే కులగణన అస్త్రంరాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో తన పదవిని కాపాడుకోడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య కుట్ర పన్నారని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ ఆరోపించారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు తన పదవిని రక్షించుకోవడానికి నాటకమాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కులగణన సమీక్షలకు హాజరు కాలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర్ నాయక్, త్రివిక్రం జోషిలున్నారు. అగ్నిప్రమాదాలపై తస్మాత్ జాగ్రత్త రాయచూరు రూరల్: అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక దళం అధికారి మారుతి సూచించారు. గురువారం రాయచూరు తాలూకా మర్చేడ్ గ్రామంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలంలో గడ్డి వాములకు నిప్పుంటుకోవడం, విద్యుత్ స్తంభాల్లో నుంచి మంటలు రావడం, ఇతరత్ర వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారి మహ్మద్, ముజాహిద్, ఆంజనేయలున్నారు. 23న జనాక్రోశయాత్ర రాక రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ధరల పెంపుతో వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీల కోసం ప్రజలకు ఉచితంగా ఇచ్చి వారి నుంచి వడ్డీని వసూలు చేస్తోందని విధాన పరిషత్ సభ్యుడు నవీన్ కుమార్ ఆరోపించారు. గురువారం జిల్లా బీజేపీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్‌కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9, బస్ చార్జీల ధరలు, స్టాంప్డ్యూటీలు పెంచడం తగదన్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన జనాక్రోశయాత్ర రాయచూరుకు ఈనెల 23న రానుందన్నారు. పాడి రైతులకు రూ.662 కోట్ల మేర బకాయి ఉందన్నారు. గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీయించారని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ, మాజీ ఎంపీ బీవీ.నాయక్, మాజీ శాసన సభ్యులు బసనగౌడ, గంగాధర నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, నేతలు రవీంద్ర జాలదార్, శశిరాజ్, నాగరాజ్, శంకరరెడ్డి, ఆంజనేయ, రామచంద్ర, శివకుమార్, విజయ్ కుమార్, గోపాల్‌రెడ్డి, నరసింహులున్నారు. వినూత్నం.. చలివేంద్రం రాయచూరు రూరల్: నగరసభ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో అమృత నెరళు పేరుతో వినూత్నంగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. వెదురుతో కూడిన గుడిసెల మాదిరిగా వీటిని నిర్మించారు. వేసవిలో వివిధ చోట్ల నుంచి నగరానికి వచ్చిన ప్రజల దాహార్తిని తీర్చడానికి చల్లని నీటి కుండలను ఏర్పాటు చేసి విశ్రాంతి పొందడానికి వీలు కల్పించారు. నగరంలోని ఆర్టీఓ సర్కిల్, కేఈబీ పాఠశాల, జహీరాబాద్ సర్కిల్, తీన్‌కందిల్, బస్టాండ్, గంజ్ సర్కిల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు వీటిని సద్వినియోగ పరుచుకోవాలని నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో కోరారు. -
విద్యతో పాటు నైపుణ్యం అవసరం
హొసపేటె: విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక కోర్సులను అధ్యయనం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని జీటీటీసీ కళాశాల ప్రిన్సిపాల్ డి.అంజన్‌కుమార్ అభిప్రాయపడ్డారు. హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని వాల్మీకి భవన్లో ప్రభుత్వ పరికరాలు, శిక్షణా కేంద్రం విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ఎస్ఎస్ఎల్సీ తర్వాత ఏం చదవాలి? అనే విషయంపై నిర్వహించిన విద్యా సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. మరియమ్మనహళ్లిలో స్థాపించిన కేంద్రం వ్యవస్థీకృత సాంకేతిక అధ్యయనం, మంచి బోధనను నిర్వహిస్తోందని ఆయన అన్నారు. రిసోర్స్ పర్సన్ అక్కి బసవరాజ మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్సీ అనేది విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. పీయూసీలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌లో డిగ్రీని అభ్యసించడానికి మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులను మీరు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చన్నారు. సాంకేతిక కోర్సులు చదవడం వల్ల ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ కంపెనీలతో సహా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదనంగా బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల్లో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారికి వాణిజ్య డిగ్రీలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
బోర్డు తిప్పేసిన మరో కంపెనీ
రాయచూరు రూరల్: నగరంలో ఏడాది క్రితం దర్వేశి కంపెనీ మోసం చేిసిన విషయం కనుమరుగు కాక ముందే మరో కంపెనీ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. ఈ ఘటనపై పశ్చిమ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. నిజలింగప్ప కాలనీలో లర్నింగ్ అకాడమీ ట్రేడింగ్ పేరుతో ప్రజల నుంచి సొమ్ములు సేకరించిన కంపెనీ యజమానులు దుబైకి పారిపోయారు. అంద్రూన్ కిల్లా నివాసి 2024లో 14 శాతం వడ్డీ చెల్లిస్తామని చెప్పడంతో చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టారు. గత మూడు నెలల నుంచి దుబైకి పారిపోయిన అకాడమీ భాగస్వాములు ఇబ్రహీం, నర్సి, అహ్మద్ గాజాలి, మహారాష్ట్ర అలీలు కలసి ప్రజలకు శఠగోపం పెట్టారు. ఇబ్రహీం సోదరుడు ఇస్మాయిల్ దుబై నుంచి తిరిగి రాగా ఈనెల 13న ఇంటికి వెెళ్లి డబ్బుల గురించి అడిగితే తనకు సంబంధం లేదని చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్వేశి కంపెనీలానే మరొక కంపెనీ లర్నింగ్ అకాడమీ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేసిందని బాధితుడు దస్తగిరి వాపోయారు. రూ.కోట్లాది మేర వంచన నలుగురిపై కేసు నమోదు -
మాజీ ఎమ్మెల్యే మామ కన్నుమూత
సాక్షి,బళ్లారి: నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మామ, సతీమణి విజయలక్ష్మి తండ్రి రామిరెడ్డి రామచంద్రారెడ్డి నగరంలోని అశోక్ నగర్‌లోని గాలి సోమశేఖరరెడ్డి స్వగృహంలో మృతి చెందారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.రామిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు నెల్లూరు జిల్లా ఓలిపేడు గ్రామం కాగా, ఆయనకు ఇద్దరు కుమార్తెలు విజయలక్ష్మి, సుప్రజలున్నారు. గాలి సోమశేఖరరెడ్డి సతీమణి గాలి విజయలక్ష్మి తన తండ్రికి తమ ఇంటి వద్దనే సపర్యలు చేస్తుండగా అనారోగ్యంతో మృతి చెందడంతో గాలి సోమశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. శుక్రవారం నగరంలోని హరిశ్చంద్ర ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు జరుపుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీరామ సేన ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ హుబ్లీ: విద్యార్థిని నేహా హిరేమఠకు శ్రద్ధాంజలితో పాటు న్యాయం, మహిళల స్వరక్షణ కోసం త్రిశూల దీక్ష, లవ్ జిహాద్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా శ్రీరామ సేన ఆధ్వర్యంలో నగరంలో భారీగా ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆరాధ్యదైవం సిద్దారూఢ మఠం ఆవరణలో శ్రీరామ సేన రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర కులకర్ణి ర్యాలీని ప్రారంభించారు. మఠం నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రముఖ సర్కిళ్ల మీదుగా మూరుసావిర మఠం ఆవరణకు చేరుకుంది. ర్యాలీలో విశేషంగా ఆటోలతో పాటు మంజునాథ, లోకేష్, మహంతేష్, నాగరాజ్, గుణధర్, ప్రకాష్ ఉళ్లాగడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల దరికి సంక్షేమ పథకాలురాయచూరు రూరల్: ప్రజల చెంతకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు విధులు నిర్వహించాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ సూచించారు. బుధవారం గ్రామీణ శాసన సభ్యుడి కార్యాలయంలో 28 మత్య్సకార కుటుంబాలకు కిట్లు, 31 మంది లబ్ధిదారులకు గంగా కళ్యాణ ఫథకంలో మోటారు పంప్సెట్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, రంగ బసనగౌడ, ప్రకాష్ పాల్గొన్నారు. పెంచిన ధరలు తగ్గించండి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన సామాన్యులు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని మురికివాడల క్రియా వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి అధ్యక్షుడు జనార్దన్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నాహొసపేటె: అంజుమన్ ఖిద్మత్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్ ఆస్పత్రి ప్రాంగణంలో నగర, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 140 మంది ముస్లిం సోదరుల పిల్లలకు ఉచిత సున్తీ(ఖత్నా) నిర్వహించింది. సున్తీ చేయించుకున్న పిల్లలందరికీ వైద్య సామగ్రి, పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. కమిటీ చైర్మన్ హెచ్ఎన్.మహ్మద్ ఇమాం నియాజీ మాట్లాడుతూ ఇస్లాం మతం ప్రకారం ప్రతి ముస్లిం సున్నత్ ఇబ్రహిం(సున్నతి) చేయించుకోవడం తప్పనిసరి ఆచారం అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడానికి కమిటీ ఉచిత సున్తీ నిర్వహిస్తోందన్నారు. ఈ ఏడాది 140 మందికి పైగా పిల్లలకు సున్తీ నిర్వహించామన్నారు. అంజుమన్ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ హబీబుల్లా, డాక్టర్ కలీముల్లా, ఫైరోజ్ ఖాన్, కార్యదర్శి మహ్మద్ అబూబకర్ అష్రఫీ, కో–ఆర్డినేటర్ మహ్మద్ దర్వేష్, చైర్మన్ సద్దాం హుస్సేన్‌లతో పాటు వందలాది మంది తల్లిదండ్రులు, సంఘం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
పాల డైరీ ప్రధాన కార్యాలయాన్ని తరలించాలి
హొసపేటె: పాల డైరీ ప్రధాన కార్యాలయాన్ని బళ్లారి నుంచి విజయనగర జిల్లా కేంద్రం హొసపేటెకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆల్ కర్ణాటక స్టేట్ కిసాన్ జాగృతి సంఘం ఆధ్వర్యంలో గురువారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. బసవేశ్వర సర్కిల్ నుంచి ప్రారంభించి సాయిబాబా సర్కిల్ గుండా కలెక్టరేట్ వరకు ర్యాలీని నిర్వహించారు. సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బసవరాజ్ కక్కుప్పి మాట్లాడుతూ మిల్క్ డైరీ కేంద్ర కార్యాలయం బళ్లారిలో ఉండటంతో బోర్డు డైరెక్టర్ల సమావేశాలకు కూడా అంతరాయం కలిగిందన్నారు. కేంద్ర సంఘం డైరెక్టర్ హెచ్.మరుళసిద్దప్ప మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ విజయనగర, కొప్పళ, రాయచూరు, బళ్లారి జిల్లాల అధికార పరిధికి పరిమితం అయినా అతి పెద్ద సహకారం విజయనగర జిల్లాకే దక్కిందన్నారు. వెంటనే మిల్క్ డైరీ కేంద్రాన్ని బళ్లారి నుంచి హొసపేటెకు మార్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందించారు. సంఘం పెద్దలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
ఈదురుగాలి, వాన బీభత్సం
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని నవలగుంద పట్టణంతో పాటు తాలూకాలోని కొన్ని గ్రామాల్లో బుధవారం సాయంత్రం పిడుగులు, ఉరుములతో ఈదురు గాలి వీచి భారీగా వర్షం కురిసింది. పట్టణంలోని సుడిగాలి తీవ్రతకు అక్కడక్కడ చెట్లు కూలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గాంధీ మార్కెట్లోని కూరగాయల వ్యాపారులు తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లు, శామియానాలు ఈదురుగాలికి ఎగిరిపోయాయి. తాలూకాలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొరిగిన బొప్పాయి, మామిడి హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగి తాలూకా గుడేకోట ఫిర్కాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం, వీచిన ఈదురు గాలులకు 9 ఎకరాల బొప్పాయి తోట, మామిడి పంట నాశనమైంది. గాలి, ఉరుములు, మెరుపులతో వర్షం పడటంతో బొప్పాయి తోట దెబ్బతింది. నేలబొమ్మనహళ్లి, చంద్రశేఖరపురతో పాటు వివిధ గ్రామాల్లో గాలి, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. నేలబొమ్మనహళ్లికి చెందిన రైతు సిద్దేష్ 9 ఎకరాల పొలంలో పండించిన బొప్పాయి పంట మొత్తం గాలివాన కారణంగా నాశనమై లక్షలాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లోని పండ్ల తోటలు కూడా వర్షం, ఈదురుగాలికి దెబ్బతిన్నాయి. వరుణ దేవుని ప్రకోపం ఉద్యాన పంటలకు నష్టం -
కులగణన సమీక్షను అంగీకరించం
హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడానికి సిద్ధమైన కులగణన సమీక్ష అశాసీ్త్రయమైందని, దీన్ని తాము వ్యతిరేకిస్తామని వరూరు నవగ్రహ క్షేత్రం ఏజీఎం గ్రూప్ సంస్థల అధ్యక్షులు, జాతీయ సంత ఆచార్య గురుధర నంది మహారాజ్ తెలిపారు. వరూరు క్షేత్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జైన్ సమాజం కేవలం 1,65,565 జనాభా ఉన్నట్లు పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అది సమంజసం కాదన్నారు. దీంతో జైన్ సమాజానికి అన్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల తానే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తమ సమాజ బాంధవుల సమీక్ష నిర్వహించి జూన్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానన్నారు. ప్రభుత్వం కులగణన సమీక్ష వేళ ఇప్పటి వరకు ఎవరూ తనను గాని సమాజం వారిని కాని కలవలేదన్నారు. ఇప్పుడేమో ఉన్నఫళంగా జనగణన సమీక్ష జారీ చేస్తున్నారన్నారు. దీని వల్ల జైన్ సమాజానికి తీవ్రం అన్యాయం జరుగుతుందన్నారు. తన ఆధ్వర్యంలో చేపట్టే సమీక్ష నివేదికను ప్రభుత్వం పరిగణించాలి, లేకుంటే చట్టరీత్య పోరాటం చేస్తామన్నారు. -
అధ్వానం.. ఆర్టీసీ ప్రయాణం
సాక్షి,బళ్లారి: కళ్యాణ కర్ణాటక సారిగె పరిధిలో బళ్లారితో పాటు కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కొప్పళ, విజయనగర, కలబుర్గి తదితర ఏడు జిల్లాల్లో డొక్కు బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు ఇరుకుగా ఉండటం ఓ ఇబ్బందిగా, కష్టంగా మారుతోంది. అందులోను బస్సులు మరీ అధ్వానంగా మారడంతో మరింత సమస్యగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సిద్దరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోందే కాని, ఆ బస్సుల కండీషన్ ఏ విధంగా ఉందన్న దానిపై పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు నరకయాతన అనుభవిస్తున్నారు. డొక్కుగా మారడంతో పాటు బస్సుల్లో ప్రయాణికులు కూర్చొనే సీట్లు పొడవునా ఎక్కడబడితే అక్కడ బస్సులో పగుళ్లు ఇచ్చి రంధ్రాలు దర్శనం ఇస్తున్నాయి. అక్కడ రేకులు పైకి తేలడంతో కూర్చొన్న ప్రయాణికులకు గాయాలు కూడా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషుల టికెట్లపై అధిక చార్జి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కదా అని, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి బస్సులో వెళితే డొక్కు బస్సులో ప్రయాణంతో పాటు పురుషులకు అధిక బస్సు ఛార్జీలు విధిస్తుండటంతో మరింత అసహనానికి గురవుతున్నారు. మహిళలకు ఉచితం కల్పించి పురుషుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. మహిళల టికెట్లతో వచ్చే నష్టాన్ని పురుషుల టికెట్ నుంచి వసూలు చేస్తూ, ఆ నష్టాన్ని పూడ్చుకోవడమే తప్ప డొక్కు బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేసే దిశగా సర్కార్ యోచన చేయడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చాలా వరకు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగి సీట్లు దొరక్క డబ్బు పెట్టి టికెట్ కొని నిలబడి వెళ్లాల్సి వస్తుండటంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ముఖ్యంగా బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు ఉంచాల్సిన చోట బాక్స్‌లను ఖాళీగా పెట్టారు. పేరుకు మాత్రమే ప్రథమ చికిత్స బాక్సులని బోర్డు పెట్టినా బస్సుల్లో ఆ బాక్స్‌లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఆస్పత్రికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ప్రయాణికులకు గాయాలైతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉండే ఆయిట్మెంటు కాని, నొప్పుల మాత్రలు, ఎవరికై నా బస్సుల్లో ఉన్నఫళంగా అనారోగ్య సమస్య తలెత్తితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఏదైనా మందులు ఉంటే వాటి ద్వారా కొంత ఉపశమనం పొందేందుకు వీలవుతుంది. అయితే బస్సుల్లో ఉత్త బాక్సులు ఉంచి వాటిని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఛార్జీలు ఎడాపెడా పెంచే సర్కార్ డొక్కు బస్సులను నడుపుతూ, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా కళ్యాణ కర్ణాటక పరిధిలో అధ్వానంగా ఉన్న బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఏర్పాటు చేసి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల్లో మందులు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖాళీగా ప్రథమ చికిత్స పెట్టెలు డొక్కు బస్సులుగా మారిన వైనం -
విద్యా సంస్థ మోసంపై ధర్నా
బళ్లారిఅర్బన్: కౌల్‌బజార్ జాగృతి నగర్లో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి పలువురు మహిళలను మోసగించినట్లు రాష్ట్ర ఏకీకరణ సమితి, సంగొళ్లి రాయణ్ణ సంఘం, అహింద సంఘం నేతలు ఆరోపించారు. గురువారం సదరు విద్యా సంస్థ ఎదుట బాధితురాలు రూప తదితరుల సమక్షంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. బాధితులు బీఈడీ ప్రవేశం కోసం రాయల్ విద్యా సంస్థ కళాశాల కార్యాలయానికి వచ్చి ప్రవేశాల గురించి విచారణ చేయగా సంస్థ నిర్వాహకులు అబద్ధాలు చెప్పి అడ్మిషన్లు పూర్తయ్యాయని నమ్మబలికారన్నారు. మాయ మాటలతో మభ్య పెట్టి కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయని వంచించి మహిళల నుంచి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో కట్టించుకున్నారని నేతలు ఆరోపించారు. తక్షణమే సంబంధిత విద్యా శాఖ ఉన్నతాధికారులు రాయల్ విద్యా సంస్థలో జరిగిన మోసంపై అసలు నిజాలను వెలుగులోకి తెచ్చి బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కళాశాలల నిర్వాహకుల తీరు వల్ల ఇతర విద్యా సంస్థలకు కూడా చెడ్డపేరు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవే రక్షణ సేన సమితి సంస్థాపక అధ్యక్షులు టి.శేఖర్, క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ, హితరక్షణ వేదిక జిల్లాధ్యక్షుడు బట్టి ఎర్రిస్వామి, మహిళా మండలి అధ్యక్షురాలు రూప, విద్యార్థులు మంజుల, పవిత్ర, రామాంజిని, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
అధోగతిలో వాహన చాలన శిక్షణ కేంద్రం
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆధీనంలో సర్కారీ వాహన డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రం ద్వారా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని భావించిన సర్కార్ ఆశయానికి నీళ్లు చల్లినట్లైంది. 2017లో నగరానికి మూడు కి.మీ.దూరంలోని రెవెన్యూ భూమి ఆధీనంలోని సర్వే నంబర్ 11–22లో ఐదు ఎకరాల భూమిలో రూ.8 కోట్లతో హైటెక్ పథం నిర్మాణం చేశారు. విద్యుత్ సౌకర్యం, జనరేటర్ ఏర్పాటు చేశారు. 2017లో వాహనాల ట్రైనింగ్ కేంద్రం కోసం తెచ్చిన ఉపకరణాలు, యంత్రాలు సమయం ముగిసి పోతున్నా నేటికీ ఒక్కరికి కూడా ఆర్టీఓ అధికారులు ఉపయోగించకుండా ఈ కేంద్రం వైపు కన్నెత్తి చూడక పోవడం విడ్డూరంగా ఉంది. వాహన చాలన శిక్షణ కేంద్రం చుట్టు ఏపుగ చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి పోయాయి. ఆరేళ్ల నుంచి హైటెక్ పథ కేంద్రం ఎవరో చేసిన తప్పుకు నేటికీ పనులు కూడా ప్రారంభం కావడం లేదు. సర్వేయర్, ఆర్టీఏ, కాంట్రాక్టర్లు చేసిన తప్పిదం వల్ల ఆర్టీఓ అధికారులు వాహన చాలన శిక్షణ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. కేఎస్ఆర్టీసీ అధికారులు ఆర్టీఓ అధికారులకు అప్పగించలేదు. ప్రధాన రహదారుల నిర్మాణానికి 23 సెంట్ల భూమి కావాల్సి ఉంది. ఇందుకు ఎవరో చేసిన తప్పుకు రూ.8 కోట్లతో నిర్మించిన హైటెక్ పథ సంచలనం, వాహనాల శిక్షణ కేంద్రం మరుగున పడే అవకాశశముంది. ఈ విషయంలో రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు ఆశయానికి తూట్లు నిరుపయోగంగా నిర్మాణాలు -
నేషనల్ హెరాల్డ్ కేసు కుట్రపూరితం
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశ్యంతో కుట్రపూరితంగా నేషనల్ హెరాల్డ్‌పై కేసు నమోదు చేసిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. బుధవారం కలబుర్గిలో ఉద్యోగ మేళాలో పాల్గొని ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెట్టడం, వారి ఆస్తులను అటాచ్ చేయడం, చార్జిషీట్లు వేయడం వంటి వాటికి ప్రోత్సహిస్తోందన్నారు. రాష్ట్రంలో కులగణనను నిరసిస్తూ లింగాయతులు, ఒక్కలిగులు రాజీనామా చేస్తారనే అంశంపై సీఎం స్పందిస్తూ గురువారం బెంగళూరులో మంత్రివర్గ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలు సేకరించి, చర్చ జరుపుతామన్నారు. యువనిధి పథకంలో 80 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఆశయంతో బెంగళూరు, కలబుర్గిలో ఉద్యోగ మేళాలను ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో హుబ్లీ–ధార్వాడ, మైసూరుల్లో కూడా మేళాలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, ఖనీజా ఫాతిమా, శరణ బసప్ప దర్శనాపూర్, రామలింగారెడ్డి, అజయ్సింగ్లున్నారు. ఉద్యోగ మేళాలో 200కు పైగా కంపెనీలు పాల్గొన్నాయి. కలబుర్గి నగరంలోని కే–సీఈటీ మైదానంలో జరిగిన మేళాలో 5000 మంది నిరుద్యోగులున్నారు. సోనియా, రాహుల్‌లను ఇబ్బంది పెట్టేందుకే కలబుర్గిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపణ యువనిధి పథకంలో 80 వేల మంది పేర్ల నమోదు -
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండవేడిమి అధికం అవుతోంది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అంగళ్లు మూసివేసుకొని ఇళ్లలో సేద తీరుతున్నారు. రాయచూరులో మంగళవారం 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లాధికారి నితీష్ తెలిపారు. యాదగిరిలో 44.5, బీదర్‌లో 44.4, కలబుర్గి, బాగల్‌కోటలో 43.5, విజయపుర, బెళగావి, కొప్పళ, గదగ్ల్లో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఎండ వేడిమి అధికం ఉక్కపోతతో నగర ప్రజలు విలవిల -
సమయస్ఫూర్తితో అగ్నిప్రమాదాలకు చెక్
హొసపేటె: అగ్ని ప్రమాదాలను ధైర్యం, సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలని అగ్నిమాపక అధికారి వలీ ప్రమోద్ అన్నారు. ఆయన నగరంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సంస్థ, డీఏవీ పబ్లిక్ స్కూల్ సహకారంతో నిర్వహించిన వేసవి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ధైర్యం, ఓర్పు బయటపడాలన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం వారు అగ్నిమాపక యంత్రం సహాయంతో పెద్ద మంటలను ఆర్పే ప్రదర్శనను చూపించారు. స్కౌట్ గైడ్స్ స్యయంగా అగ్నిమాపక యంత్రాలను ఎలా ఉపయోగించాలి, వాటితో మంటలను ఎలా ఆర్పాలి? అనే విషయాలపై వివరించారు. పీయూ కళాశాలలో రాష్ట్ర అవార్డు అందుకున్న గైడ్ విద్యార్థిని పూర్విని వాణిజ్య విభాగంలో రాష్ట్రంలో 6వ ర్యాంక్ సాధించినందుకు సత్కరించారు. అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిప్రసాద్ ఆనెగొంది, టీఎంఏఈఎస్ అకాడమి ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ డైరెక్టర్ చంద్రశేఖర్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పీ.మంజునాథప్ప, డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్ ఆశుతోష్, కార్యదర్శి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అప్పు తిరిగిమ్మన్నందుకు..
● మహిళ దారుణ హత్య ● చిత్రదుర్గ జిల్లాలో ఘటన సాక్షి,బళ్లారి: ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చి సమస్యలు తీర్చిన పాపానికి ఓ మహిళ దారుణహత్యకు గురైంది. చిత్రదుర్గ జిల్లా హొళల్కెరె తాలూకా రామఘట్ట గ్రామానికి చెందిన ఆశా(25) చిత్రదుర్గలో ఓ ప్రైవేటు బస్సులో కండక్టర్‌గా పని చేస్తూ జీవిస్తోంది. ఆమె తనకు తెలిసిన అనిల్ అనే వ్యక్తికి రూ.56 వేలు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు పదే పదే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ విషయమై పోలీసులు, పెద్ద మనుషుల దృష్టికి కూడా తీసుకెళ్లి పంచాయతీ చేశారు. అయినా డబ్బులు మాత్రం తిరిగి చేతికి అందలేదు. ఈ ఘటనతో ఆమెను ఎలాగైరా వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతో పథకం ప్రకారం అప్పు ఇచ్చిన ఆశాకు మాయమాటలు చెప్పి ఆమెను దారుణంగా హత్య చేసి అడవిలో పారవేశారు. ఘటనపై అక్కడి పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్ సాక్షి,బళ్లారి: దావణగెరె జల్లా చెన్నగిరి తాలూకా తావరకెరె గ్రామంలోని జామియా మసీదు సమీపంలో అక్రమ సంబంధం ఆరోపణలతో ఇద్దరు మహిళలపై తాలిబాన్ తరహాలో దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళలపై దాడి అమానవీయం అని, ఆ సంఘటనను సీరియస్‌గా తీసుకుని తనిఖీలు చేయడంతో మహిళలపై దాడికి సంబంధించిన వీడియోలు కూడా బహిర్గతం అయ్యాయి. అంతకు ముందుకు సోషల్ మీడియాలో కూడా మహిళలపై దాడి గురించి వైరల్ చేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో పాటు బుధవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతిరాయచూరు రూరల్ : విద్యుత్ వైర్ తగిలి యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన యాదగిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. యాదగిరి జిల్లా వడగేరా తాలూకాలోని బబలాది గ్రామానికి చెందిన ఖాజా పటేల్(23) మంగళవారం సాయంత్రం బబలాది నుంచి యాదగిరిలోని తన అక్క ఇంటికి వెళ్లాడు. తిరిగి గ్రామానికి వెళుతుండగా యాదగిరి మాతా మాణికేశ్వరి నగరలో జెస్కాం వైరు తెగిపోయి కిందపడిన హైటెన్షన్ వైరుపై ద్విచక్ర వాహనం వెళ్లడంతో యువకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. వక్ఫ్ బిల్లుకు సవరణపై ఆందోళన హుబ్లీ: వక్ఫ్ బిల్లుకు సవరణను వ్యతిరేకిస్తూ దివంగత ఏజే ముధోళ అభిమాని బళగ, కట్టడ, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటీయూసీ, జాతీయ అహింద సంఘం, జాతీయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సదరు బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా ఉద్దేశపూర్వకంగా మైనార్టీల భూమిని పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దీన్ని తాము సహించబోమన్నారు. రాబోయే రోజుల్లో తీవ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాబాజాన్ ముధోళ సారథ్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఏ ముధోళ, అబ్దుల్ ఖాదర్ బెటగేరి, పీర్ సాబ్ నదాఫ్, కరీం లక్కుండి, రమేష్ బోంస్లే, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. నియామకం రాయచూరు రూరల్: రాష్ట్ర వీరశైవ లింగాయత బణజిగ సమాజం కార్యవర్గ సభ్యునిగా మలకప్ప పాటిల్ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నగరానికి చెందిన పాటిల్‌ను నియమించి జిల్లాలో, రాష్ట్రంలో సమాజ ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తాగునీటి ఎద్దడి అరికట్టండి రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి ఎద్దడి రానీయవద్దని, నీటి ఎద్దడి నియంత్రణకు నగరసభ అధికారులు జాగ్రత్తలు పాటించాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులకు సూచనలు జారీ చేశారు. మంళవారం నగరసభ కార్యాలయంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైనందున నాలుగు నెలల పాటు ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు. నీటి సౌకర్యం లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. రాంపుర జలాశయం, చిక్కసూగూరు, యరమరస్ వంటి ప్రాంతాల్లోని బూస్టర్ స్టేషన్ల నుంచి నీటి పంపింగ్‌కు చర్యలు చేపట్టాలన్నారు. నగరసభ సభ్యుడు శశిరాజ్, నాగరాజ్, నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, ఆంజనేయ, శ్రీనివాసరెడ్డి, కమిషనర్ జుబిన్ మహాపాత్రోలున్నారు. దొంగ అరెస్ట్.. 5 బైక్‌లు స్వాధీనంహుబ్లీ: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ధార్వాడ తాలూకా కణవి హొన్నాపురకు చెందిన కన్మేష్ ధార్వాడ (23) నిందితుడు కాగా అతడి నుంచి రూ.2.93 లక్షల విలువ చేసే 5 బైక్‌లను జప్తు చేశారు. జిల్లాలోని కలఘటిగి పట్టణంలోని బొమ్మిగట్టి క్రాస్ దగ్గర అనుమానాస్పదంగా బైక్‌పై తిరుగుతుండగా పోలీసులు వెంటాడి హన్నెరడు మఠం దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సీఐ శ్రీశైల కౌజలిగి నేతృత్వంలో ఎస్ఐ కరిబీరప్పనవర, సిబ్బంది మహంతేష్ నానగౌడర, గోపాల పిరగి, ఎలెగార, మల్లికార్జున కార్యాచరణలో పాల్గొన్నారు. -
తక్కువ ధరకే విత్తనాలు అందించరూ
రాయచూరు రూరల్: త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాలో రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించాలని కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు శివపుత్ర గౌడ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం, ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. ఎరువులు, క్రిమి సంహారక మందుల దుకాణాల యజమానులు పత్తి విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.850 ఉంటే దుకాణాల వారు రూ.1500–రూ.2000 వరకు నల్లబజారులో విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచాలని కోరుతూ జిల్లాధికారి రితిష్‌కు, ఎస్పీ పుట్టమాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. వీరనగౌడ, ఉమాదేవి, బసవరాజ్, జయప్ప, ఆంజనేయ, మల్లేష్ నాయక్‌లున్నారు. -
మాదకద్రవ్యాల వాడకం ప్రమాదకరం
హొసపేటె: మాదకద్రవ్యాల వాడకం వైరస్‌లాంటిది, ఒకసారి సోకిన తర్వాత కోలుకోవడం కష్టం అని జిల్లా జడ్జి అబ్దుల్ రెహమాన్ ఏ.నందగాడి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని విజయనగర కళాశాలలో తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ, బార్ అసోసియేషన్, విద్యా శాఖ, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖల సహకారంతో మాదకద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఎన్డీపీఎస్ చట్టంపై నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కావడం పెరిగింది. వివిధ విభాగాలు సామాజిక బాధ్యతలో విద్యార్థుల కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి బలమైన మనస్తత్వం, శారీరక ఆరోగ్యం, మేధో ధైర్యం అవసరం అన్నారు. విద్యార్థి జీవితంలో చదవడం, జ్ఞానాన్ని సంపాదించడం వంటి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థి జీవితంలో అనుకరణ, అనుమానాస్పద మనస్తత్వం ప్రబలంగా ఉంటాయని న్యాయమూర్తి ప్రశాంత్ నాగలాపుర అన్నారు. మంచి కంటే చెడు పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, యువత మాదకద్రవ్యాల దుర్వినియోగానికి ఎక్కువగా గురవుతున్నందున అవగాహన పెంచడం సంఘసంస్థల బాధ్యత అన్నిరు. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలంటే మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలన్నారు. ఎస్పీ శ్రీహరిబాబు, వైద్యులు సోమశేఖర్ విజయనగర కళాశాల అధ్యక్షులు మేటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా సీఈటీ పరీక్షలు
సాక్షి, బళ్లారి: ీపయూసీ అనంతరం ఇంజినీరింగ్ పాటు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరడానికి నిర్వహించే కే– సీఈటీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరిగే ఈ సీఈటీ పరీక్షలు ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు కొప్పళ, విజయపుర, బాగల్‌కోట, గదగ్ తదితర జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో జరిగాయి. వేలాది మంది విద్యార్థులు కర్ణాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(కే–సీఈటీ) పరీక్షలు రాశారు. బళ్లారి నగరంలోని సరళాదేవి కళాశాల, మున్సిపల్ హైస్కూల్, బీపీఎస్సీ, వార్డ్లా తదితర తొమ్మిది సెంటర్లలో దాదాపు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు జరిగాయి. పీసీఎంసీ చదివిన విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పరీక్షలు రాయనుండగా, పీసీఎంబీ చదివిన విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ నాలుగు సబ్జెక్ట్‌లు రాయనున్నారు. నేడు మ్యాథ్స్, బయాలజీ పరీక్షలు గురువారం మ్యాథ్స్, బయాలజీ పరీక్షలు జరగనున్నాయి. పీసీఎంసీ చదివిన విద్యార్థులు సీఈటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే రాష్ట్రంలో పేరుగాంచిన ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఉండటంతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పీసీఎంబీ చదివిన విద్యార్థులు సీఈటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే ఏజీబీఎస్సీ, పారా మెడికల్ కోర్సులు చేయడానికి అర్హత సాధిస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష కేంద్రాలకు హాజరై పరీక్షలు రాశారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగియగా, రెండో రోజు సీఈటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరు పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు -
నిందితులను అరెస్ట్ చేయండి
రాయచూరు రూరల్: వరకట్నం కేసులో చిత్రహింసలకు గురి చేసి తన కుమార్తె మరణానికి కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని కళాసంకుల సంస్థ కార్యదర్శి మారుతి డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతను(22) భర్త సునీల్, కుటుంబ సభ్యులు నానా విధాలుగా చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా అదనపు వరకట్నం తీసుకురావాలని చితక బాదడంతో ఈనెల 9న రిమ్స్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా ఈనెల 12న మరణించిందన్నారు. భర్త సునీల్, కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసినా లింగసూగూరు సీఐ వారిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. సోలార్ పార్కులకు సర్కారు ప్రతిపాదనలు రాయచూరు రూరల్ : రాష్ట్రంలో 19 వేల మెగా వ్యాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం రాయచూరులో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సోలార్‌తో పాటు పవన్, గాలి మరలతో విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం టెండర్లు పిలిచినట్లు విద్యుత్ శాఖాధికారులు సమాచారం అందించారు. రాష్ట్రంలోని రాయచూరుతో పాటు బెళగావి, గదగ్, హావేరి, కొప్పళ, చిత్రదుర్గ, ఉత్తర కర్ణాటకలో విస్తరణకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో విద్యుత్ కొరత ఏర్పడినప్పుడు వీటి ద్వారా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో పథకానికి అంకురార్పణకు రంగం సిద్ధమైంది. ఆయా జిల్లాల్లో రైతులతో చర్చించి సోలార్ పార్కుల ఏర్పాటుకు భూములను గుర్తించారు. చెరువుల సంరక్షణకు సూచన రాయచూరు రూరల్: జిల్లాలో పురాతన కాలం నాటి చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. బుధవారం బీదర్ జిల్లా మన్నాళ్ల చాంగలేరే, బావగి ప్రాంతాల్లోని చెరువులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పైపులైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. 50 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలకు సర్వేలు చేయాలని ఆదేశించామన్నారు. టీబీ డ్యాం కొండపై మంటలు హొసపేటె: తుంగభద్ర డ్యాం సమీపంలో ఉన్న కొండపై ఆకస్మికంగా మంటలు ఏర్పడిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. కొండకు నిప్పు అంటుకోవడంతో కొండపై ఉన్న విండ్ పవర్ ఫ్యాన్లు దెబ్బ తిన్నాయి. అటవీ జంతువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయం గ్రహించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనాథగా హత్య కేసు నిందితుడు హుబ్లీ: ఈ నెల 13న జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు రితీష్ కుమార్ (35)కు సంబంధించి గత నాలుగు రోజుల నుంచి అతడి బంధువులెవరి ఆచూకీ తెలియలేదు. దీంతో సంబంధిత అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిందితుడిపై పోక్సో కేసు దాఖలైంది. కాగా ఈ కేసును తాజాగా మంగళవారం నుంచి సీఐడీ దర్యాప్తు చేపట్టింది. సదరు నిందితుడు గోధుమ రంగు శరీరఛాయ, పలుచని శరీరాకృతి, కోలముఖం, 5.3 అడుగుల ఎత్తు, వెడల్పైన నుదురు, కుడి చేతిపై హిందీలో ఓం నమఃశివాయ, జయ సంజయ అనే పచ్చబొట్టు ఉంది. ఇతడి ఆచూకీ తెలిసినవారు తక్షణమే 0836–2233490 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని అశోక్ నగర్ పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.