సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం
హుబ్లీ: పహల్గాం దాడి జరిగింది కన్నడ వల్లే అని అర్థం వచ్చే రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనునిగంపై కన్నడ సినీ రంగం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సోనూ నిగం హుబ్లీలోని ప్రముఖ సిద్ధారూఢ మఠం సన్నిధికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధారూఢ, గురునాథరూఢ స్వాముల సన్నిధిలను దర్శనం చేసుకున్న సోనూ నిగం అక్కడ కూర్చొని 10 నిమిషాల పాటు ధ్యానం కూడా చేశారు. అనంతరం మఠం ట్రస్ట్ ప్రముఖులు సిద్ధారూఢ విగ్రహాన్ని ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ నిగం ఆదివారం హుబ్లీకి రాగా సోమవారం ఉదయమే సిద్ధారూఢ మఠాన్ని దర్శించుకున్నారు.
ఆలయంలో అపవిత్రత.. దోషులను శిక్షించండి
సాక్షి,బళ్లారి: ఇటీవల నగరంలోని నాగలకెరె ప్రాంతంలోని పురాతనమైన ఆంజనేయస్వామి దేవస్థానంలో కొందరు దుండగులు మాంసం ముక్కలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఆలయ ప్రాంగంలోకి విసిరిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, భజరంగదళ్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం వీహెచ్‌వీ, భజరంగదళ్ ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ చేపట్టారు. అనంతరం సంఘాల నేతలు మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమాలు చేస్తూ హిందువుల ధార్మిక భావనలను దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. వీహెచ్‌వీ జిల్లా కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రముఖులు గోవర్ధన్, వినోద్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవకు పదవి ముఖ్యం కాదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేవదుర్గ భవనంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆశయ సాధనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. తనను ఎన్నుకున్న వారికి రుణపడి ఉంటామన్నారు. ఉద్యోగులకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యారత్న, సేవా భూషణ్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో నాగేష్ గౌడ, ప్రేమలత రెడ్డి, చంద్రశేఖర్ పాటిల్, సురేష్, బోరేగౌడ, చరణ్‌రాజ్, విశ్వనాథ, బసవరాజ్‌లున్నారు.
విద్యార్థులను ఉత్తమ
పౌరులుగా తీర్చిదిద్దాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని మడ్డిపేటె ప్రాథమికోన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయిని రూపా పేర్కొన్నారు. నగరంలో గురువందన కార్యక్రమంలో అవార్డును అందుకొని ఆమె మాట్లాడారు. వి ద్యార్థులు పాఠ్యాంశాలకు తోడు పాఠ్యేతర విషయాలను మననం చేసుకోవాలని కోరారు. జ్ఞాన సముపార్జనకు విద్య, సాహిత్యం చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు.
సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం
సిద్ధారూఢ సన్నిధిలో సోనూ నిగం


