breaking news
Nalgonda
-
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్‌రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్‌రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
విశిష్ట మహిళా రత్న అవార్డుకు శివలీల ఎంపిక
కనగల్ : మండల కేంద్రానికి చెందిన మదర్‌థెరిసా అవార్డు గ్రహీత డాక్టర్ కంబాల శివలీల విశిష్ట మహిళారత్న బెస్ట్ సర్వీస్ అవార్డు – 2026కు ఎంపికయ్యారు. తన న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను తేజోద్భావం సేవ ట్రస్ట్ చైర్మన్ కె.గాయత్రి గుర్తించి ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేశారు. ఈ అవార్డును ఆగస్టు 14వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దకాకానిలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. అవార్డుకు ఎంపికై న కంబాల శివలీలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో శ్రీరామ్‌కు స్వర్ణంమిర్యాలగూడ టౌన్ : హనుమకొండలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి 12వ తెలంగాణ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026 పోటీల్లో దామరచర్ల మండలం బొత్తలపాలెం మోడల్ స్కూల్ విద్యార్థి ఆర్.శ్రీరామ్ ప్రతిభ కనబరిచాడు. లాంగ్ జంప్ విభాగంలో 6.55 ఫీట్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించాడు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోతురాజు నరహరి, ఉపాధ్యాయులు సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలినాంపల్లి: కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. నాంపల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సీపీఐ ప్రజాచైతన్య యాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య యాత్ర నిర్వస్తోందన్నారు. సెప్టెంబరు 1న నిర్వహించే చలో ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లిలో సీపీఐలో చేరిన పలువురికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆర్.అంజయ్యచారి, సుదనబోయిన రమేష్, నేతాళ్ల రాజు, చెల్లం పాండురంగారావు, జగన్, ముదిగొండ మురళీకృష్ణ, వెంకటయ్య, పల్లె సైదులు, సత్తయ్య, నేరెళ్ల సైదులు, గిరి స్వామి, రేవెల్లి సర్పంచ్ బట్టు శ్రీను, కానుగుల మహేష్, మోగుదాల సైదమ్మ, బుషిపాక యాదయ్య, వంగూరి సాయిలు, పల్లేటి దశరథ, చెన్నోజు వెంకటాచారి పాల్గొన్నారు. రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగ విరుద్ధంనల్లగొండ టౌన్ : మతం పేరుతో దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ హక్కులను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని యూడీసీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంసన్, పెదమాము డేవిడ్‌రాజు అన్నారు. సోమవారం నల్లగొండలో వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆగస్టు 10వ తేదీని దళిత క్రైస్తవుల బ్లాక్ డేగా ప్రకటించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, దళితులందరికీ సమానంగా రాజ్యాంగబద్ధమైన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో క్రిస్టఫర్, ఆదిమల్ల ప్రభుదాస్, దుబ్బ ఎబినేజరు, రాజు, దుబ్బసి ప్రేమ్‌కుమార్, ఎలీషా, ప్రవీణ్, వరకుమార్, లంక ఎలీషా, దుబ్బ డేవిడ్, మద్దెల చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వరుణుడు కరుణించి రైతులు మురవాలని పూజలు
25 కిలోలు.. రూ.1900 నాణ్యమైన పాత సన్న బియ్యం 25 కిలోల బస్తా ధర రూ.1,750 నుంచి రూ.1,900 వరకు పలుకుతోంది. మరింత అభివృద్ధి చేయాలి కాంగ్రెస్ పాలనలో యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోనాగార్జునసాగర్ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో.. సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు. 11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు విజయవిహార్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది. కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛరణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు వీక్షించేలా ఎల్ఈడీ తెరలు యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. పూజల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, మందుల సామేలు, మురళీనాయక్, రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, దేవాదాయ శాఖ డైరెక్టర్ హన్మంతరావు, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భవానీశంకర్ పాల్గొన్నారు. ఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు. వరుణయాగం సాగిందిలా..పెద్దవూర : వేకువజామున 4.05 గంటలకు గోపూజతో మహా వరుణయాగం ప్రారంభమైది. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్యెల్యే పద్మావతి దంపతులు యాగం ప్రారంభం నుంచి యాగ క్రతువులో పాల్గొన్నారు. 4.45 గంటలకు శాంతి మంత్ర పఠనం గావించారు. 6.30 గంటల వరకు విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచకం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, అఖండ దీపారాధనలు చేశారు. 6.30 నుంచి 9 గంటల వరకు అంకురారోహణం, చతుర్ మండల స్థాపనాలు, సర్వదాభద్ర మండల స్థాపనలు చేశారు. 11.45 గంటల వరకు అన్ని దేవాలయాల రుత్వికులతో లక్ష వరుణ జపాలు, లక్ష రుశ్యశృంగ జపం, క్షీరతర్ఫణం చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వేద పండితులతో చతుర్వేద పారాయణం, శాతానువాక, వారానువాక పారాయణం నిర్వహించారు. 3.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి దంపతులు యాగశాల వద్దకు వచ్చారు. 3.25 గంటలకు పూర్ణాహుతి సమర్పణ, హారతి. 3.46 గంటలకు యాదాద్రి దేవస్థానం సిద్దాంతి సత్యనారాయణ శర్మ ప్రసంగంతో మహా వరుణయాగం ముగిసింది. -
1,59,280 ఓట్లు గల్లంతే!
నల్లగొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 13,56,973 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 89.50 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. మరో 1,59,280 ఫారాలు.. అంటే 10.50 శాతం డిజిటలైజేషన్‌కు నోచుకోలేదు. డిజిటలైజ్ కాని 1,59,280 ఫారాల భవితవ్యం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓట్లు తొలగిపోతాయని తెలుస్తోంది. 1,714 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పూర్తి.. జిల్లాలో మొత్తం 1,812 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 1,714 పోలింగ్ స్టేషన్లలో 100 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు మొత్తం జిల్లాస్థాయిలో 1,59,280 ఫారాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రోగ్రెస్ రిపోర్టు వెల్లడించింది. యూఈఎఫ్గా నమోదు ఇంటింటి సర్వే సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మృతి చెందినవారు లేదా అందుబాటులో లేని ఓటర్ల కారణంగా ఏయే ఇళ్లకు, వ్యక్తులకు ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదో, ఇచ్చిన ఫారాలు తిరిగి రాలేదో.. ఆ వివరాలను ఎన్నికల యంత్రాంగం యూఈ ఎఫ్‌గా కింద లెక్కించింది. ఈ జాబితాలో 1,59,280 ఓట్లు ఉన్నా యి. ఈ ఓట్లకు సంబంధించిన కారణా లు తదుపరి పరిశీలనలో తేలనున్నాయి. ఫ ముగిసిన సర్ ప్రక్రియ.. ఫ 15.16 లక్షల ఓటర్లలో 13.56 లక్షల ఫారాల డిజిటలైజ్ ఫ 10.50 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పెండింగ్ జిల్లాలో సర్ ప్రక్రియ ఇలా.. నియోజకవర్గం మొత్తం ఓటర్లు డిజిటలైజ్ శాతం పెండింగ్ దేవరకొండ 2,69,098 2,32,197 86.29 36,901 నాగార్జునసాగర్ 2,34,722 2,13,407 90.92 21,315 మిర్యాలగూడ 2,40,574 2,09,003 86.88 31,571 నల్లగొండ 2,49,571 2,17,494 87.15 32,077 మునుగోడు 2,63,757 2,46,509 93.46 17,248 నకిరేకల్ 2,58,531 2,38,363 92.20 20,168 మొత్తం 15,16,253 13,56,973 89.50 1,59,280 -
యునాని.. ఎప్పుడు కూలునోనని!
మాడుగులపల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ యునాని వైద్యశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఎప్పుడు కూలిపోతుందోనని అక్కడ వైద్యసేవలు పొందుతున్న రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిత్యం బిక్కుబిక్కుమంటూ భయాందోళనతో గడుపుతున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని తొలగించి కొత్త భవ నం నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. పైకప్పునకు కర్రలే ఆసరా.. మాడుగులపల్లిలోని ప్రభుత్వ యునాని వైద్యశాలలో ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. సంబంధిత వైద్య విధానంలో ఆమోదం పొందిన మందులను రోగులకు అందిస్తున్నారు. అయితే, వైద్యం అందించాల్సిన భవనం పరిస్థితే అత్యంత దయనీయంగా మారింది. ఐదు దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా మిద్దె గదులతో ఈ భవనాన్ని నిర్మించారు. కాలక్రమేణా సరైన నిర్వహణ లేకపోవడంతో గోడలు, పైకప్పు బలహీనంగా మారాయి. ప్రస్తుతం భవనం పైకప్పు, గోడల నుంచి ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపడుతున్నాయి. పైకప్పు కూలకుండా అడుగడుగునా కర్రలతో ఆసరా ఇచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు విద్యుత్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వర్షమొస్తే నరకయాతనే.. వర్షం వచ్చిన సమయంలో భవనం లోపలికి నీరు చేరుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే ప్రజలు సైతం భవ నం పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నా రు. మరోవైపు రోగులకు చికిత్స అందించే సమయంలో వైద్యసిబ్బంది కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే.. ముందుగా సురక్షితమైన భవనం, అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి రాకముందే అధికారులు స్పందించి శిథిల భవనాన్ని వెంటనే ఖాళీ చేయించి, ప్రత్యామ్నాయంగా సురక్షితమైన భవనంలోకి ఆస్పత్రిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. భయాందోళనలో రోగులు, వైద్య సిబ్బంది ఫ కర్రల సాయంతో నిలబడ్డ పైకప్పు ఫ మాడుగులపల్లిలో శిథిలావస్థకు చేరుకున్న భవనం -
రోడ్డు విస్తరణ చేపట్టాలని నిరాహార దీక్ష
నార్కట్‌పల్లి : మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య నూకల వెంకటనారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి స్పందించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని.. లేకుంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేడబోయిన శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ నడింపల్లి శ్రవణ్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మునుకుంట్ల గణేశ్, మండల ప్రధాన కార్యదర్శి బిల్లకంటి శ్రీకాంత్, పాలకూరి రమేష్, కొరివి శంకర్, పసునూరి సంపత్, తరాల శ్రీనివాస్, పాల్వాయి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్లగొండలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అనంతరం నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, నలపరాజు సైదులు, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, కొండా అనురాధ, కొండ వెంకన్న, అద్దంకి నరసింహ, గంజి రాజేష్, కత్తుల యాదయ్య, సుంకరబోయిన వెంకన్న, సాగర్ల మల్లయ్య, నర్సిరెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు కురవాలి.. ప్రాజెక్టులు నిండాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో క్రతువులు నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం పూర్ణాహుతి సమర్పించారు. ‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి..’అని ప్రార్థించారు. బ్రహ్మ ముహూర్తంలో.. సోమవారం ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ప్రారంభ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమ గుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు యాగశాలలోకి వచ్చిన సీఎం దంపతులు..3:24 గంటలకు పూర్ణాహుతి సమర్పించారు. ‘కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళను సంతరించుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి..’అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కృష్ణమ్మ ఒడ్డున మార్మోగిన వేదఘోష సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే.. నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోమవారం తెల్లవారుజాము నుంచే వేద మంత్రాలు మార్మోగాయి. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేద పారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు, వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది. వరుణారాధనతో విజయపురికి ప్రాచీన అనుబంధం మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేద పండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన, ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహించారు. రోజంతా వరుణ యాగం కొనగసాగగా, మధ్యాహ్నం 3.24 గంటలకు మహా పూర్ణాహుతితో ముగిసింది. -
సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్రానికి అరిష్టం
హాలియా : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. వ్యవసాయానికి 18 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసగించాడని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి నెలకొందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాశీకి వెళ్లి గంగా నదిలో పుణ్యస్నానం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ వచ్చి వరుణయాగంలో పాల్గొనాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రధాన సెంటర్లో గంటకు పైగా రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విషయం తెలుసుకున్న హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ అక్కడికి చేరుకుని భగత్‌తో మాట్లాడారు. విద్యుత్ సక్రమంగా అందేలా ఆ శాఖ అధికారులతో మాట్లాడతామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫ విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని హాలియాలో రాస్తారోకో -
ఎండిన వాగు.. తేలిన మోటార్లు
పెద్దవూర : ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పెద్దవూర ‘పెద్దవాగు’ పూర్తిగా ఎండిపోయింది. నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టే ఈ వాగు.. గుర్రంపోడ్, పీఏపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోకి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ వాగు నిత్యం నీటితో కళకళలాడుతూ ఉండేది. దీంతో రైతులు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. పానగల్లు చెరువు తాగునీటి అవసరాల కోసం పదిహేను రోజులుగా ఏఎమ్మార్పీ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఈ వాగులో కొద్దిపాటి జలాలు ప్రవహించాయి. ఆ నీటిని చూసి కొందరు రైతులు మోటార్లతో వరినాట్లు వేయగా, మరికొందరు నాట్లకు సిద్ధమయ్యారు. కానీ, ప్రస్తుతం వాగు పూర్తిగా ఎండిపోయి మోటార్లు బయటకు తేలడంతో నాట్లు వేసిన పంటలు సైతం ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బట్టుగూడెం వంతెన వద్ద వాగు ఎండిపోవడంతో తేలిన మోటార్లు -
యాగాలతో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులు ఎందుకు?
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పెద్దవూర: యాగాలతో వర్షాలు కురిస్తే కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టడం ఎందుకని.. నెలకు రెండు యాగాలు చేస్తే సరిపోతుంది కదా అని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పెద్దవూరలో నిర్వహించిన సీపీఎం నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ జలాశయంలో పేరుకుపోయిన పూడికను తీసివేస్తే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. నికర జలాలను ఎలా వాడుకోవాలో చూడాలని, యాగాలు కాదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పన్నెండున్నర ఏళ్ల పాలనలో కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 10వ తేదీన జరిగే జైల్‌భరోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చినపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, ఎండీ.సలీం, కొండేటి శ్రీను, కె.ఆనంద్, మహేష్, వరలక్ష్మి, రాములు, దుబ్బ రామచంద్రయ్య, శ్రీను, కోటేష్, వెంకటయ్య, రవినాయక్, కృష్ణ, బషీర్, మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, గురువయ్య, నాగార్జున, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు
నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల నుంచి నీరు ఇచ్చే పరిస్థితి లేదని.. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌లో ఉందని.. శ్రీశైలం నుంచి నీరు వచ్చినప్పటికీ సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదని.. అందువల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా ఉండాలన్నారు. 1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి వేయాలి జిల్లాలో పంట మార్పిడిలో భాగంగా ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేశారని తెలిపారు. దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో ఆరుతడి పంటలు వేయించాలని అధికారులను ఆదేశించారు. రెండు పంటలు వరి వేస్తే భూములు సారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటలు పండించాలని, ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు 5 వేల యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అధికారులు కోరగా, తక్షణమే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. 15లోగా ఆరుతడి పంటలు వేయాలి : కలెక్టర్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 15 వరకు మాత్రమే ఆరుతడి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, మార్కెట్ చైర్మన్లు శేఖర్‌రెడ్డి, జూకూరి రమేష్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. శ్రీశైలం డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ నుంచి సాగునీరు అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 9 వేల ట్రాన్స్ఫార్మర్లపై ఉన్న ఓవర్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన విద్యుత్ సామగ్రిని తెప్పిస్తామన్నారు. ఫ సాగర్‌లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే.. ఫ కష్టకాలంలో రైతులకు అధికారులు అండాగా ఉండాలి ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలి
దేవరకొండ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమించిన బహుజన వీరుడు పండుగ సాయన్న 166వ జయంతిని జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బహుజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వర రావు, భాస్కరాచారి, వెంకటేష్, భిక్షమయ్య, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలిమర్రిగూడ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలను మరింత బలోపేతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీపుజాత, బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి హక్కుల కోసం ఐక్యంగా పోరాడేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వాటి పరిష్కారం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, బుడిజపాక జగన్, చెల్లం పాండురంగారావు, ఆకుల రఘుమయ్య, ఎరుకల నిరంజన్, జక్కలి అంజయ్య, కొట్టాల సర్పంచ్ కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, సత్యం, కొట్టం యాదయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
వర్షాలు కురవాలని యాగం
నాగార్జునసాగర్ : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులకు మేలు కోరుతూ ప్రభుత్వం వరుణయాగానికి శ్రీకారం చుట్టిందని సాగర్ ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టే వరుణయాగం ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్‌తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి లభ్యత తక్కువగా ఉందని.. వరుణయాగంతో వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తారన్న విశ్వాసం ఉందన్నారు. కార్యక్రమంలో సూర్యపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు. సాగర్‌లో ఏర్పాట్లను పరిశీలిన ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్ -
వర్గీకరణతో మాలలకు అన్యాయం
నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణ అనంతరం మాలలు, మాల అనుబంధ కులాలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని జాతీయ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. ఎస్సీ రోస్టర్ విధానాన్ని సవరించకపోతే ఆగస్టు 31న మాలల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామన్నారు. నల్లగొండలోని క్లాక్‌టవర్ వద్ద మాలమహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలి సైదులు అధ్యక్షతన నిర్వహించిన మహా ధర్నాలో పిల్లి సుధాకర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం గ్రూప్–3లోని మాల, అనుబంధ కులాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాల జేఏసీ కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించుకునేందుకు మాలలు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కొండబాబు, జిల్లా అధ్యక్షుడు బోగరి విజయ్, నల్లవెల్లి నల్లల కనకరాజు, మేడి అంజయ్య, వెన్న రాజు, బుట్టి సత్యనారాయణ, సర్వే సార్, గోరేటి రమేష్, కట్ట వినయ్, చింతమల్ల విజయ్‌కుమార్, వల్లం రవి, రాగుల రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, మణెమ్మ, రావుల శ్రీనివాస్, గాజుల భాస్కర్ పాల్గొన్నారు. ఫ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ -
సమస్యలపై పోరాటమే బీజేపీ లక్ష్యం
చండూరు : ప్రజా సమస్యలపై పోరాడడమే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం చండూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను స్థానిక ఎమ్మెల్యేలు.. బీజేపీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు మంజూరు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేయాలని లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త ప్రజాక్షేత్రంలో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అదికారంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, భూతరాజు శ్రీహరి, దోనూరి వీరారెడ్డి, కర్నాటి ధనుంజయ, కోమటి వీరేశం, బొమ్మరబోయిన రాజు, జక్కల రాజు, సోమ నరసింహ, వరికుప్పల గిరి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహా వరుణయాగం అంటే...
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న మహావరుణ యాగంపై రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాలతోపాటు రైతుల్లోనూ ఆసక్తి ఏర్పడింది. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సనాతన హిందూ ధర్మంలో యజ్ఞయాగాదులకు అత్యున్నత స్థానం ఉండగా, వేదకాలం నుంచి వరుణ దేవుడి ఆరాధన ఉంది. ఋగ్వేదం ప్రకారం వరుణుడు కేవలం వర్షానికే కాకుండా రుతం (విశ్వ నియమం), సృష్టి సమతుల్యతను కాపాడే సర్వోన్నత చక్రవర్తిగా వర్ణించారు.యాగంలో భాగంగా 108 మంది రుత్వికులు ఏకధాటిగా చేసే వేదమంత్రాల ఉచ్ఛారణ ఒక గొప్ప తపస్సే. వర్ష పాశుపత మంత్రాలు, ’కరీరీ ఇష్టి’వంటి శక్తివంతమైన వైదిక సూక్తాలను జపించడం ద్వారా వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. మన ఇతిహాసాల ప్రకారం కరువు వచి్చనప్పుడల్లా రాజులు, మహర్షులు వరుణ యాగాలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. కృత్రిమ వర్షాల కోసం చేసే ‘క్లౌడ్ సీడింగ్’(కెమికల్స్ చల్లడం) ప్రక్రియకు, మన వేదాల్లోని ’కరీరీ ఇష్టి’విధానానికి దగ్గరి పోలికలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం మేరకు..కరీరీ ఇష్టి అంటే వర్షాన్ని రప్పించే అద్భుత క్రతువు. కృష్ణ యజుర్వేదంలోని మైత్రాయణీ సంహిత ఆధారంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పుడు వర్షాల కోసం చేసే అత్యంత శక్తివంతమైన వైదిక యాగమే ఈ ’కరీరీ ఇష్టి’.కృష్ణ వర్ణ సిద్ధాంతం: ఈ క్రతువులో ఉపయోగించే ప్రతి వస్తువు నలుపు రంగులో (కృష్ణ వర్ణం) ఉంటుంది.. ఋత్వికులు ధరించే వస్త్రాలు, హోమ ద్రవ్యాలు, చివరికి అగ్నికి సమర్పించే వెదురు, బియ్యంతో చేసిన అన్నం కూడా నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలను ఆకర్షించడానికి ఇవి దోహద పడతాయని భావిస్తారు.కరీర ఫల ఆహుతి: ’కరీర’అనే ఒక ప్రత్యేకమైన అడవి పొద పండ్లను ఎండబెట్టి, వాటిని హోమ గుండంలో ప్రత్యేక మంత్రాలతో ఆహుతి ఇస్తారు. దీని వల్ల వాతావరణంలో తక్కువ పీడనం ఏర్పడి, మేఘాలు త్వరగా వర్షిస్తాయని నమ్ముతారు.వర్ష పాశుపత హోమం శివుని అత్యంత ఉగ్ర రూపమైన ’పాశుపత’తత్వాన్ని ప్రకృతి అనుకూలతకు మళ్లించే ప్రక్రియే ఈ హోమం. జల స్వరూప శివారాధన ద్వారా అభిషేక ప్రియుడు. లయకారుడైన పరమశివుడిని శాంతింపజేసి, ప్రకృతిలో సమతుల్యతను తీసుకురావడానికి రుత్వికులు ’పాశుపతాస్త్ర మంత్రాలు’జపిస్తూ ఈ హోమం చేస్తారు. పర్జన్య శాంతివేదాల ప్రకారం వర్షాన్నిచ్చే మేఘ రూప దేవతను ’పర్జన్యుడు’అంటారు. ’పర్జన్య సూక్తం’పఠిస్తూ హోమం చేయడం ద్వారా ఆకాశంలో మేఘ గర్జనలు మొదలై, పిడుగుల వంటి నష్టం కలగకుండా శాంతమైన, మేలు చేసే వర్షాలు కురుస్తాయి. ఈ రెండు విశిష్ట ప్రక్రియల ద్వారా గాలిలోని తేమ శాతం పెరిగి, స్థానిక వాతావరణం చల్లబడి, ఆ పరిసర ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఆశిస్తారు.ఉపయోగించే మూలికలువరుణ వృక్ష మూలిక: ఇదే ఈ యాగంలో ప్రధాన ద్రవ్యం. వరుణ బెరడును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో దీనిని మూత్ర, కిడ్నీ సంబంధ వ్యాధుల నివారణిగా వాడుతారు. యాగంలో ఈ వృక్షం ఎండిన కొమ్మలు, బెరడును హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు. కృష్ణ తిలాలు: ఈ యాగంలో నలుపు రంగు ద్రవ్యాలకు ప్రాధాన్యం. నల్ల నువ్వులతో హోమం చేయడం ద్వారా వాతావరణంలో దట్టమైన సానుకూల ధూమం (పొగ) ఏర్పడి మేఘాలను ఆకర్షించడానికి తోడ్పడుతుందని నమ్ముతారు. సుగంధి వేళ్లు (వట్టివేరు): వాతావరణాన్ని చల్లబరచడానికి, వర్షపు మేఘాలకు అవసరమైన తేమను ప్రసాదించడానికి వట్టివేరును ఆహుతిగా ఇస్తారు. యాగ సమిధిలు: యాగశాలలో 11 హోమకుండాల్లోప్రత్యేకమైన నవగ్రహ, యాగ సమిధలను ఉపయోగిస్తారు. అందులో మర్రి, జువ్వి, రావి, మేడి, ఉత్తరేణి, జమ్మి తదితర పంచక్షీర వృక్షాలు, నవధాన్యాలు, ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. -
చేనేత రంగాన్ని ఆదరించాలి
నల్లగొండ టూటౌన్ : స్వాతంత్య్ర పోరాటంలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రాముఖ్యత సంతరించుకున్న చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి హైదరాబాద్ రోడ్డులోని రాఘవేంద్ర కాలనీ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమానికి ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని, ఆ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేలా ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందని, ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ గోవిందయ్య, కర్నాటి వెంకటేశం, దుడుకు లక్ష్మీనారాయణ, గంజి మురళి, దత్తగణేష్, పి.సత్యనారాయణ, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలి
చండూరు : ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సీపీఐ ప్రజా చైతన్య యాత్రను శుక్రవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి.. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర విధానాల వల్ల పేద ,మధ్య తరగతి ప్రజలపైన తీవ్ర భారం పడుతోందని, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న చైతన్య యాత్రలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, మాజీ సర్పంచ్‌లు బోయపల్లి భిక్షమయ్య, బోయపల్లి జంగయ్య, మండల కార్యదర్శి నలపరాజు సతీష్, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, బరిగల వెంకటేశ్, కర్నాటి వెంకటేశం, తిప్పర్తి రాములు, జగన్, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
కుంటలో అడ్డగోలుగా తవ్వకం
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో దర్వేశిపురం వెళ్లే దారిలో ప్రధాన రహదారి వెంట ఉన్న కుంటలో మట్టి తవ్వకం అడ్డగోలుగా సాగుతోంది. రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలు కుంట స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. మట్టి తవ్వకానికి ఇరిగేషన్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సి ఉన్నప్పటికీ, సదరు కాంట్రాక్టర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. కుంటలో దాదాపు 20 ఫీట్ల లోతు వరకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే కాంట్రాక్టర్ ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏజెన్సీ ఎంపిక వివాదాస్పదం!
నల్లగొండ టూటౌన్ : అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేయడంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీని ఎంపిక చేయకుండా.. టెండర్ తెరిచి కొన్ని ఏజెన్సీలను తిరస్కరించిన తరువాత మళ్లీ ధ్రువపత్రాలు సమర్పించాలని 20 రోజుల పాటు గడువు పొడిగించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై సమాధానాలు చెప్పకుండా సంబంధిత అధికారులు నీళ్లు నములుతున్నారు. గడువు పొడగింపు ఉద్దేశం వెనుక వారికి అనుకూలమైన ఏజెన్సీ కోసం యూనివర్సిటీ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యూనివర్సిటీ అధికారుల తీరు, అక్రమాలపై కొందరు ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ ఎంపిక కోసం నోటిఫికేషన్.. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఎంపిక చేయడానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారులు జూన్ 18వ తేదీన టెండర్ కం నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్ వేయడానికి జూన్ 27వ చివరి గడువు.. కాగా 10 మంది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వారు టెండర్లు దాఖలు చేశారు. ఆగస్టు 4వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తామని టెండర్ దాఖలు చేసిన వారికి యూనివర్సిటీ అధికారులు 3వ తేదీన సమాచారం ఇచ్చారు. మొత్తం 10 మంది టెండర్లు వేయగా అందులో ధ్రువపత్రాలు సరిగా లేవని ముగ్గురి టెండర్లను యూనివర్సిటీ అధికారులు తిరస్కరించారు. మిగిలిన ఏడుగురిలో ఆరుగురు జీఎస్టీకి సంబంధించిన పత్రం పెట్టకపోవడంతో వారికి కూడా అర్హత లేదని సంబంధిత అధికారులు తేల్చేశారు. మిగిలిన ఆ ఒక్క ఏజెన్సీకి అన్ని ధ్రువపత్రాలు ఉన్నట్లు తేల్చారు. కానీ ఆ ఏజెన్సీకి టెండర్ ఇవ్వలేదు. దీని వెనుక మంత్రాంగం నడిపిస్తున్న అదృశ్య శక్తులు ఎవరనే ప్రశ్నలు ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి వారిని సన్మానర్గంలో నడిపించాలన్సిన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కూడా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తీరు మార్చుకోకపోతే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ అర్హత లేదని పలు టెండర్లు తిరస్కరించి.. మళ్లీ గడువు పొడిగింపు ఫ అనుకూల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం అడ్డదారులు ఫ ఎంజీ యూనివర్సిటీలో మారని అధికారుల తీరుయూనివర్సిటీ అధికారులు పెట్టిన నిబంధనలను వారే ఉల్లంఘించారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్ ఓపెన్ చేసిన తరువాత ధ్రువపత్రాలు సమర్పించాలని గడువు పొడిగించడం చట్ట విరుద్ధం. నిబంధనల ప్రకారం నాకే టెండర్ ఇవ్వాలి. కొందరు అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించడం మంచిదికాదు. – చిక్కుళ్ల శంకరయ్య, శ్రీరామలింగేశ్వర మ్యాన్‌పవర్ సప్లయర్స్ -
అధ్యాపకులు నిరంతరం నేర్చుకోవాలి
నల్లగొండ టూటౌన్ : మారుతున్న విద్యారంగానికి అనుగుణంగా అధ్యాపకులు నిరంతరం నేర్చుకోవాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మదన్ మోహన్ మాలవ్య టీచర్ ట్రైనింగ్ సెంటర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వారం రోజులు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించి, బోధనా ప్రక్రియలో సాంకేతికతను అనుసందానం చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని కోరారు. విద్యారంగంలో వేగంగా వస్తున్న మార్పులను గమనించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రశాంతి, ఢిల్లీ నుంచి ఫ్రొఫెసర్ శంకర్, ప్రొఫెసర్ అమిత్, డాక్టర్ ఎం.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీగా శ్రీనివాస్రెడ్డినల్లగొండ టూటౌన్ : స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీగా మిర్యాలగూడ బకల్‌వాడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నామి రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి పి.సుశీందర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత కార్యదర్శి విమల పదవికాలం ముగియడంతో శ్రీనివాస్‌రెడ్డిని నియమించామని, ఈయన నియామకం రెండు సంవత్సరాలు పాటు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్రీడాభివృద్ధి కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. యూడీసీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నికరామగిరి(నల్లగొండ): యునైటెడ్ దళిత క్రిస్టియన్స్ ఫెడరేషన్ (యూడీసీఎఫ్) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నల్లగొండ పట్టణంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా డిఐ.సామ్సన్, ఉపాధ్యక్షుడిగా జేపీ సాల్మన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా పి.డేవిడ్‌రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డి.ఎబినేజర్, సలహాదారుగా పి.జేమ్స్, కోశాధికారిగా ఆదిమల్ల ప్రభుదాసును, పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటంమిర్యాలగూడ : ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో కొన్నింటినే అమలు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రాజెక్టులను పట్టించుకోకుండా అంతర్గత గొడవలతో సమయం వృథా చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈనెల 10న చేపట్టే జైల్ భరోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, వరలక్ష్మి, మల్లు గౌతంరెడ్డి, పాండు, ఎర్రనాయక్, సైదులు, అరుణ, నాగమణి, గోవర్ధన, సైదమ్మ ఉన్నారు. -
ముగిసిన వృత్యంతర శిక్షణ
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రభుత్వ అర్థశాస్త్ర అధ్యాపకులకు మూడు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారం ముగిసింది. రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ షేక్ జానీ పాషా, డీఆర్పీ గోలి సైదులు ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రిన్సిపాల్ సుధారాణి బోధనాభ్యసన సామగ్రి, పటాల రూపకల్పనలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ శిక్షణ అధ్యాపకుల నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తుందని మాస్టర్ ట్రైనర్ షేక్ జానీ పాషా తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్, ప్రిన్సిపాల్ మెరుగు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ సంస్కృతికి చేనేత ప్రతీక
నల్లగొండ : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీక అని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో చేనేతకు శతాబ్దాల చరిత్ర ఉందని, ఇది కేవలం వ్యాపార వృత్తి మాత్రమే కాకుండా సూక్ష్మ నైపుణ్యం, ఓర్పు, క్రమశిక్షణ, సమన్వయంతో కూడిన గొప్ప కళ అన్నారు. ఆగస్టు 17 నుంచి అమల్లోకి రానున్న చేయూత పింఛన్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వ్యక్తిత్వ వికాస పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు, నేతన్నలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, చేనేత సంఘం చైర్మన్ రాపోలు దత్త గణేష్, మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, ప్రసాద్, యాదగిరి, శ్రీనివాస్, గంజి మురళి, సత్యనారాయణ, చేనేత కళాకారులు, అధికారులు పాల్గొన్నారు. -
న్యాయస్థానంలో ఆటల పోటీలు
రామగిరి (నల్లగొండ) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని (ఆగస్టు 15) పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. రోజువారీ విధినిర్వహణ, కేసుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పోటీల అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు, జడ్జి సాయి సేరణ్ తేజ్ ఇతర సిబ్బందితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సతీష్‌కుమార్, అశోక్‌కుమార్, గేమ్స్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ఐలేష్, మందడి నగేష్, జనిగల రాములు, గిరి లింగయ్యగౌడ్, కీసర శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు వెంకటరెడ్డి, ప్రసాద్, నవీన్, నిఖిల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, గీతన్నల చైతన్య బస్సుయాత్ర రథసారథులు ఎంవీ.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గీత కార్మికులల ఉపాధి, సంక్షేమం.. వృత్తి ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ అమరుల యాదిలో పేరుతో చేపట్టిన గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం నకిరేకల్‌కు చేరుకుంది. ఆ సందర్భంగా స్థానిక మెయిన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. గీత కార్మికులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా రూ.20 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి ఈ యాత్రకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చౌగోని సీతారాములు, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్‌గౌడ్, మండల అధ్యక్ష, కార్యదర్శులు పోటిచేటి వీరయ్య, గుడుగుంట్ల బుచ్చిరాములు, ఆ సంఘం నాయకులు ఎరుకలి అంజయ్య, దోరేపల్లి ఎల్లయ్య, అంతగి వెంకటయ్య, గుండగోని జంగయ్య, వెంకట్, నర్సింగ్ జానయ్య, పోలగాని వెంకన్న, తండు సుధాకర్, అంతటి రాములు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండకు చేరిన చైతన్య యాత్ర నల్లగొండ టౌన్ : గీతన్నల చైతన్య బస్సుయాత్ర గురువారం సాయంత్రం నకిరేకల్ నుంచి నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆ సందర్భంగా ఆ సంఘం నాయకులు గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, వెంకటేశ్వర్లు -
2028 మార్చి వరకు ఎంఎంటీఎస్ పనులు
సాక్షి, యాదాద్రి: ఘట్కేసర్ నుంచి వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ పనులను 2028 మార్చి 28 నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు వెల్లడించారు. గురువారం జిల్లాలోని యాదాద్రి(రాయగిరి) రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అమృత్ పథకంలో భాగంగా యాదాద్రి స్టేషన్ వద్ద కొనసాగుతున్న పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్, రాయగిరి రైల్వే స్టేషన్లో విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్ వెంట జరిగే అదనపు ట్రాక్ నిర్మాణ పనులు నెమ్మదిగా చేస్తామన్నారు. భవిష్యత్తులో కాజీపేట వరకు ఫోర్ లేన్, ట్రాక్ పనులు కూడా చేపడతామని స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట భక్తులను దృష్టిలో ఉంచుకుని రాయగిరి వద్ద అన్ని హంగులతో యాదాద్రి స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు నెలల్లో ఈ యాదాద్రి స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు యాదాద్రి స్టేషన్లో వర్షం నీరు స్టేషన్ రూప్ పై నుంచి చుక్కలుగా పడడం చూసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ అడిషనల్ డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడు -
వినికిడి లోపం సర్టిఫికెట్లపై వేట!
శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వినికిడి వైకల్యం పేరుతో నకిలీ లేదా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పెన్షన్లు పొందుతున్నారనే అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక సోషల్ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో హైరిస్క్‌గా గుర్తించిన లబ్ధిదారులపై వైద్యపరమైన పునఃపరిశీలన నిర్వహించి, నిజమైన అర్హులకే పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50 మందికి మళ్లీ పరీక్షలు ఈ ప్రత్యేక పరిశీలనలో భాగంగా నల్లగొండ జిల్లాలో వినికిడి లోపం ఆధారంగా దివ్యాంగ పెన్షన్ పొందుతున్న 50 మంది హైరిస్క్ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వైకల్య ధ్రువీకరణ పత్రాలు, వైద్య నివేదికలు, పెన్షన్ అర్హతలను మరోసారి పరిశీలించనున్నారు. అర్హతలేని వారు వికలాంగు పెన్షన్ పొందకుండా చర్యలు తీసుకోనున్నారు. బెరా పరీక్షే తుది ఆధారం రీవెరిఫికేషన్లో భాగంగా నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బ్రేయిన్స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ (బెరా) పరికరంతో వినికిడి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నివేదిక ఆధారంగానే వినికిడి వైకల్యం శాతాన్ని నిర్ధారించి, దివ్యాంగ పెన్షన్‌కు అర్హత ఉందా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నల్లగొండతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాల లబ్ధిదారులకు కూడా ఇదే కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నారు. 31లోగా ప్రక్రియ పూర్తి జిల్లాలో ఎంపిక చేసిన 50 మంది లబ్ధిదారుల రీవెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. పునఃపరీక్షలు పూర్తయిన అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. తద్వారా అక్రమాలను అడ్డుకుని సంక్షేమ ఫలాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిట్ చేపట్టారు. ఫ దివ్యాంగ పెన్షన్లలో అక్రమాలను అరికట్టేలా ప్రభుత్వం నిర్ణయంఫ 50 మంది లబ్ధిదారులపై సోషల్ ఆడిట్ ఫ ఈ నెలాఖరులోగా రీవెరిఫికేషన్ పూర్తికి ఆదేశాలు -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి
నల్లగొండ : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నల్లగొండలోని కలెక్టరేట్లో నిర్వహించిన వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం ఈ నెలతో పాటు సెప్టెంబర్ తొలి వారంలోనూ తగినంత వర్షపాతం నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలయ్యే పరిస్థితులు కూడా కనిపించడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణను నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో అడవి పందులు, ఇతర వన్యప్రాణుల ఇబ్బందులు తక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాంజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్‌లో వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. రాత్రి సమయంలో నిలిపే వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, హెచ్చరిక లైట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు సూచనలు చేశారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించాలన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా ఆక్రమణలను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఎంజీయూ సెక్యూరిటీ ఆఫీసర్ పదవీ కాలం పెంపు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బేగ్ పదవీకాలం ఏడాది పాటు పొడిగిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బేగ్ 2027 జూలై 16వ తేదీ వరకు విధుల్లో కొనసాగనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి మునుగోడు : పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతాను గురువారం మునుగోడులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను, తిరిపారి వెంకటేశ్వర్లు, బి.లాలు, గోసుకొండ లింగయ్య, ఈదులకంటి కై లాష్ గౌడ్, గట్టుపల్లి నర్సిరెడ్డి, ముత్తయ్య పాల్గొన్నారు. కేంద్రమంత్రి రాజీనామా అన్ని వర్గాల విజయంచండూరు : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశంలోని ప్రజాస్వామ్య శక్తుల విజయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం చండూరులో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మృతి చెందిన 22 మంది విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో తీవ్రవాదులు ఉన్నారని అమిత్ షా అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, నాయకులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, ఏర్పుల యాదయ్య, సాగర్ల మల్లేష్, జెర్రిపోతుల ధనుంజయ, ముత్తులింగం, కర్నాటి సుధాకర్, లింగయ్య, లింగస్వామి, శ్రీను, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మూసీకి 2,183 క్యూసెక్కుల వరద కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం
రామగిరి (నల్లగొండ) : సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (అదనపు డీజీపీ) సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ బెటాలియన్‌లో సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, క్రమశిక్షణ, ఆధునికీకరణ, శిక్షణ అనే నాలుగు ప్రధాన సూత్రాలతో బెటాలియన్లు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 12వ బెటాలియన్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన బెటాలియన్‌గా రూపుదిద్దుకోవాలన్నారు. సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి, వారి కోసం మెరుగైన వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. కమాండెంట్ కె.వీరయ్య ఆధ్వర్యంలో బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన నూతన ధోబీ రూమ్, ఆధునికీకరించిన యూనిట్ హాస్పిటల్, జిమ్, ఓపెన్ జిమ్, లైబ్రరీ, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, మినరల్ వాటర్ ప్లాంట్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే రూమ్‌ను ఆయన పారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, టి.సురేష్ బాబు, ఏఓ దయాకర్, మినిస్టీరియల్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ -
చిరస్మరణీయులు జయశంకర్, గద్దర్
నల్లగొండ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేర్లు ప్రపంచం ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి.. వారి చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి వారి ఆకాంక్షను సాకారం చేయడంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపించారన్నారు. తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినప్పుడే జయశంకర్ ఆశయాలు నెరవేరినట్లవుతాయన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తన పాటల ద్వారా ఊపిరిపోశారని కొనియాడారు. సొరంగం పూర్తయితే డెడ్‌స్టోరేజీ నుంచీ నీరు ఎస్ఎల్బీసీ సొరంగ పనులు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా బ్రాహ్మణవెల్లెంల వరకు సాగునీరు రప్పించి నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. కరువు పరిస్థితిలో కూడా శ్రీశైలం డెడ్‌స్టోరేజీ నుంచి ఎస్ఎల్బీసీ ద్వారా నీరందేలా ప్రాజెక్టును రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్అలీ పాల్గొన్నారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంలో వేర్వేరుగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్ఓ దశరథ్, సమాచార శాఖ సహాయ సంచాలకుడు యు.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు, ఆర్ఐలు, మినిస్టీరియల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు
మోత్కూరు : తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం భర్తను బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మోత్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం ఇందిరానగర్ కాలనీకి చెందిన గజ్జెల్లి మనోహర్, ప్రభావతి భార్యాభర్తలు. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మనోహర్‌ను బుధవారం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు స్టేషన్ ఎదుట తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు మనోహర్‌ను అడ్డుకొని 108 అంబులెన్స్‌లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు. -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున ఆయన్ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్‌గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్‌తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రామగిరి(నల్లగొండ) : ప్రజలు, యువత, విద్యార్థులు అందరం కలిసి మాదక ద్రవ్య సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరాలు మారేకొద్దీ పిల్లల ఆట పాటలు, వ్యసనాలు కూడా మారుతున్నాయని చెప్పారు. ఇప్పుడు మందు, సిగరెట్‌తో పాటు సామాజిక మాధ్యమాల వ్యసనం, డిజిటల్ వ్యసనం, డ్రగ్స్ వినియోగం పెరిగిందన్నారు. ఒకప్పుడు డబ్బున్న వారికి మాత్రమే డ్రగ్స్ అందుబాటులో ఉండేవని, ఇప్పుడు కిరాణాషాపులో కూడా దొరుకుతున్నాయని ఇందుకు వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ చుట్టు పక్కల ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకొమ్మని బలవంతపెట్టినా, అమ్మినా 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 97 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2047 భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశం ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ముందు డ్రగ్స్‌ను దూరం పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఇలాంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏఎస్పీ రమేష్ విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, నల్లగొండ ఇన్చార్జి రాజయోగి ధనలక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఎంహెచ్ఓ కె.రాహుల్, జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్.మదన్మోహన్, ఎన్జీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్, మోనిక, ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ సుధాకర్, వెంకట్‌రెడ్డి, అనిల్‌కుమార్, కోటయ్య, మల్లేశం, శివరాణి, సావిత్రి, శిరీష పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఏఐకేఎస్ మహాసభలను జయప్రదం చేయండి
మిర్యాలగూడ : నల్లగొండలోనవంబర్ 18, 19, 20, 21 తేదీల్లో జరిగే 36వ ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభలను జయప్రదం చేయాలని ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో ఆయన ఇంటింటికి వెళ్లి మహాసభల కరపత్రాన్ని అందించి మాట్లాడారు. ఈ మహాసభలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రైతు ఉద్యమ నాయకులు వస్తారని, వారు రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చర్చించబోయే విషయాలు భవిష్యత్‌లో రైతు హక్కుల సాధనకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, కందుకూరి రమేష్, నాగరాజు, సైదాచారి, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయాలి
నల్లగొండ : ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎత్తిపోతల పథకాల భూసేకరణ, చెల్లింపులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. పెండ్లిపాకల రిజర్వాయర్‌కు సంబంధించి ఎస్డీసీ యూనిట్ –1 కింద ప్రక్రియను త్వరితగతిన చేపట్టి చెల్లింపులు పూర్తిచేయాలన్నారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులపై దృష్టి సారించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాల కింద సేకరించిన భూముల రికార్డులను అన్నిస్థాయిలో భద్రపరచాలన్నారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్‌కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిష్టారాంపల్లి, అంబాభవాని ఎత్తిపోతల పథకాల భూ సేకరణపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్ఓ దశరథ్, స్పెషల్ కలెక్టర్ రమాదేవి, ఆర్డీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
6.2 మి.మీ సగటు వర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 6.2 మిల్లీమీటర్లు సగటు వర్షం కురిసింది. కనగల్ 32.5 మిల్లీమీటర్లు, చండూరు 30.7, దామరచర్ల 20.7, నిడమనూరు 18.0, మునుగోడు 16.6, త్రిపురారంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం కురిసిన వర్షాలు పత్తి చేలకు జీవం పోసినట్లు అయ్యింది. ఆరుతడి పంటలు సాగుచేయాలికొండమల్లేపల్లి : రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. మంగళవారం కొండమల్లేపల్లి కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటల సాగు చేయాలని సూచించారు. అనంతరం చింతచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని పూల్సింగ్తండాలో రైతులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన అధికారి శేఖర్, శ్రీలక్ష్మి, రవినాయక్, జానకిరాములు రైతులు ఉన్నారు. శిక్షణతో వ్యాపార అభివృద్ధినల్లగొండ : గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న చిన్న తరహా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి శిక్షణ వేదికగా పని చేస్తుందని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని టీటీడీసీ జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఓరియంటేషన్ అండ్ ప్లానింగ్ వర్క్‌షాప్‌లో కాయన మాట్లాడారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అమలు చేస్తున్న ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ శిక్షణపై ఆయన వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్యంపై శిక్షణ ఇచ్చి వారు మార్కెట్లో నిలదొక్కుకునేలా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ ఎం.శ్రవణ్‌కుమార్, ఎం.మాధవి, సునీత, వీరయ్య, డీపీఎంలు రామలింగయ్య, శ్రీనివాస్, సోమయ్య, భాషపాక చంద్రశేఖర్, మధుసూదన్‌రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. 7న హైదరాబాద్‌లో ధర్నానల్లగొండ : హైదరాబాద్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సుధాకర్‌రెడ్డి కోరారు. నల్లగొండలోని స్వాతంత్య్ర సమరయోధుల భవన్లో మంగళవారం పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. ఆరు విడతలుగా రావాల్సిన డీఏ, డీఆర్‌లను ఇవ్వాలని, మార్చి 2024 నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు రావాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, జంగయ్య, పాండరీ, దుర్గయ్య పాల్గొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలిమాడుగులపల్లి : సహకార బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకోవాలని జిల్లా సహకార బ్యాంక్ ఈఓ శంకర్రావు, జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్ జివి.రమేష్, నాబార్డ్ డీడీఎం వినయ్‌కుమార్, కోఆపరేటీవ్ బ్యాంకు ప్రతినిధి కృష్ణలత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో మాడుగులపల్లి, కుక్కడం గొర్రెల కాపరులు, పాడి రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాడి పరిశ్రమ అభివృద్ధి, లాభసాటి గొర్రెలు, మేకల కొనుగోలు, వాటి నిర్వహణకు అందించే రుణాలపై అవగాహన కల్పించారు. పశుగ్రాసం పెంపకం, పశువుల ఆరోగ్య సంరక్షణ, ఆధునిక పద్ధతుల అమలుతో పశుసంపదను అభివృద్ధి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉరిబండి శ్రీనివాస్‌యాదవ్, సైదులుయాదవ్, సర్పంచ్ అరూరి నరేష్, పశువైద్యాధికారి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేస్కేల్.. పోరుబాట
గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న తమకు పే స్కేల్ అమలు చేయడం ద్వారా న్యాయం చేయాలి. సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా జీవో జారీ చేయాలి. పేస్కేల్.. మా 20 ఏళ్ల ఆకాంక్ష. దాన్ని నెరవేర్చి ఆదుకోవాలి. – నర్సింహాచారి, వీబీజీ రాంజీ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నల్లగొండ : గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని వీబీ జీ రాంజీ (గత ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు పే స్కేల్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జూలై 27 నుంచి విధులకు హాజరవుతూనే పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా శాఖకు సేవలందిస్తున్న తమకు ఇప్పటికీ పే స్కేల్ అమలు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వివక్ష.. 2006లో జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా వివిధ హోదాల్లో ఎంపికై న ఉపాధి హామీ ఉద్యోగులు 20 ఏళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని డీఆర్డీఏలో హ్యూమన్ రిసోర్స్ పాలసీ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో పనిచేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు గత ప్రభుత్వం పే స్కేల్ అమలు చేసింది. కానీ ఉపాధి హామీ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ పే స్కేల్ వర్తింపజేయకపోవడం వివక్షకు నిదర్శనమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నెరవేరని హామీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచింది. 2024 ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రకటన జీవో రూపంలో వెలువడకపోవడంతో ఉద్యోగులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పనులు.. ఉద్యోగులు విధులకు హాజరవుతూనే పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో జిల్లాలో పలు ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జాప్యమవుతున్నాయి. వన మహోత్సవం కార్యక్రమాల అమలు మందగించింది. జలసిరి కార్యక్రమం నిర్వహణపై కూడా సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగం తగ్గిందని అధికారులు అంటున్నారు. చర్చలపై ఆశలు.. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 6న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తే ఉద్యమం విరమించే అవకాశం ఉందని, ఒకవేళ విఫలమైతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో వీబీజీ రాంజీ ఉద్యోగులు ఇలా.. ఏపీఓలు 25 ఈసీలు 26 టీఏలు 136 సీవోలు 64 హెచ్ఆర్ మేనేజర్ 1 ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 సీడీసీఎల్ ఆర్సీలు 2 మొత్తం 255 సమ్మెలో వీబీజీ రాంజీ ఉద్యోగులు ఫ జూలై 27 నుంచి ‘పెన్‌డౌన్ – షట్‌డౌన్’ ఫ 6న కమిషనర్‌తో చర్చలు.. ఫ విఫలమైతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక -
ఆరేళ్లలో 12 మంది కమిషనర్లు మారారు!
నేను సోమవారమే విధుల్లో చేరారు. అవినీతి ఆరోపణల విషయం నాకేమీ తెలియదు. వస్తున్న ఫిర్యాదులపై తగు విచారణ జరిపిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తా. – కోటేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్, నందికొండ నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో వరుస వివాదాలు, తరచూ కమిషనర్ల బదిలీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై వస్తున్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ ఏర్పడిన ఆరేళ్ల కాలంలోనే ఏకంగా 12 మంది కమిషనర్లు మారడం ఇక్కడి పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో ఆది నుంచి అక్రమాలే.. మున్సిపాలిటీ ప్రారంభ దశ నుంచే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కొందరు కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరిట భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు అవే తరహా అక్రమాలు పునరావృతమవుతున్నాయి. గతంలో కమిషనర్‌గా పనిచేసిన దండు శ్రీను, పారిశుద్ధ్య కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నిధుల్లో సుమారు రూ.12 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది ఒత్తిడితో అందులో కొంత మొత్తం తిరిగి జమ చేసినప్పటికీ, పూర్తిస్థాయి విచారణ నివేదికను ఇప్పటికీ బహిర్గతం చేయలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకే పోస్టులో ఇద్దరు ఉద్యోగులు.. తాజాగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సైదులు కేవలం 57 రోజుల వ్యవధిలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. జూన్ 27న చింతలపాలెంకు చెందిన మండాది కాశయ్యకు కంప్యూటర్ ఆపరేటర్‌గా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నెల కూడా గడవకముందే జూలై 24న కాశయ్యను విధులనుంచి తప్పుకోవాలని మౌఖికంగా ఆదేశించి, అదే పోస్టులో అశోక్‌రెడ్డి అనే వ్యక్తిని కూర్చోబెట్టారు. ప్రస్తుతం ఆయనే విధులు నిర్వహిస్తున్నారు. వివాదాస్పదమైన నియామకం ఈ పోస్టు వెనుక పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే పోస్టులో పనిచేసిన ధనావత్ సురేష్ రూ.3 లక్షల లంచం ఇచ్చి చేరాడని, ఆయన రాజీనామా చేసే సమయంలో కాశయ్య నుంచి రూ.1 లక్ష తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాాశయ్య నియామకం వేళ.. ఆయన ఇచ్చిన రూ.లక్షతో కలిపి కమిషనర్, కొందరు స్థానిక నాయకులకు రూ.5 లక్షల వరకు ముట్టినట్లు చర్చ నడుస్తోంది. అంతలోనే కాశయ్యను తొలగించి అశోక్‌రెడ్డిని నియమించడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు నీళ్లు! సాధారణంగా మున్సిపాలిటీల్లో అవుట్సోర్సింగ్ నియామకాలను ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీ ద్వారా, కలెక్టర్ ఆమోదంతో చేపడతారు. వేతనాలు కూడా సదరు ఏజెన్సీ ద్వారానే చెల్లిస్తారు. కానీ, ఏజెన్సీ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, కలెక్టర్‌కు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనరే నేరుగా నియామక ఉత్తర్వులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అక్రమాలపై మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫ ఒకే పోస్టుకు నెల రోజుల వ్యవధిలో ఇద్దరి నియామకం ఫ రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఫ బాధ్యతలు స్వీకరించిన 57 రోజులకే కమిషనర్ బదిలీనందికొండ మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జోక్యంతో కమిషనర్ సైదులను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయానికి బదిలీ చేసినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవినీతి జరిగినట్లు ఆరోపణలు, అవుట్ సోర్సింగ్ నియామకాలు, పీఎఫ్ నిధుల దుర్వినియోగం, ఒకే పోస్టులో ఇద్దరికి ఉద్యోగం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారంతోపాటు ఉద్యోగం ఇస్తామన్న హామీని నిలబెట్టుకుని న్యాయం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాలకు చెందిన వైటీపీఎస్ భూబాధిత కుటుంబాలు సోమవారం ప్లాంట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులకు జూలకంటి రంగారెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. భూబాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, 270 మంది గిరిజన రైతు కుటుంబాలు ఉపాధి అవకాశాలు వస్తాయనే ఆశతో తమ పంట పొలాలను ప్లాంట్‌కు ఇచ్చారని తెలిపారు. నిర్వాసితుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసేంతవరకు అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వినోద్‌నాయక్, దయానంద్, పాపానాయక్, జానకిరాంరెడ్డి, భూబాధితులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
తగ్గిన వరి.. పుంజుకున్న పత్తి
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా పడిపోగా, పత్తి పంట మాత్రం కొంత ఊరటనిచ్చే స్థాయిలో ముందుకు సాగుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జూన్‌లో కురిసిన చినుకులతో రైతులు ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. అయితే, జూలై నెల మొత్తం తీవ్ర లోటు వర్షపాతం నమోదు కావడంతో వరి నాట్లు ముందుకు సాగలేదు. భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు తగ్గడం, నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల లేకపోవడం వరి సాగును దెబ్బతీసింది. వరి సాగు డీలా.. పత్తికే మొగ్గు! వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ సీజన్లో మొత్తం 12 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో వరి 5,46,165, పత్తి 6,47,689 ఎకరాల్లో సాగవుతుందని భావించారు. కానీ ఎల్‌నినో ప్రభావం, ఎండల వల్ల పరిస్థితి మారింది. ఇటీవల కురిసిన అడపాదడపా చిరుజల్లులతో ప్రస్తుతం 3,15,182 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడిని తట్టుకునే పత్తి పంటను రైతులు ఎక్కువగా ఆశ్రయించారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 5,97,677 ఎకరాలకు చేరుకుని అంచనాలకు దగ్గర్లో నిలిచింది. కంది, పెసర, మినుము పంటలతో కలిపి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 9,27,855 ఎకరాల్లో సాగు నమోదైంది. జిల్లా అంతటా వేసిన పత్తి చేలు ఇటీవల కురిసిన చిరుజల్లులకు మంచిగా పెరుగుతున్నాయి. నెలలో రెండుమూడు వర్షాలు కరిస్తే పత్తికి డోకా ఉండదు. రైతులకు అశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నీటి లభ్యత లేని రైతులు అరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలు. ఉల్లోజు వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఫ వర్షాభావంతో తలకిందులైన వానాకాలం సాగు అంచనాలు ఫ ఎండిపోతున్న బోర్లు.. ప్రాజెక్టుల నుంచి రాని సాగునీరు ఫ పత్తికి ప్రాణం పోసిన చిరుజల్లులు -
5 నుంచి బీటెక్ తరగతులు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం, పీజీ మూడో సెమిస్టర్ తరగతులు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు శాతం నియమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరు కావాలని సూచించారు. పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణనల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన అంశాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది బాధితులు వినతులు అందజేశారు. సంబంధిత పోలీస్ అధికారులు ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని వివిధ విభాగాల్లో 2024–25, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్డీ నోటిఫికేషన్‌ను అడ్మిషన్స్ డైరెక్టర్ ఆకుల రవి సోమవారం విడుదల చేశారు. కామర్స్‌లో 1, ఇంజనీరింగ్, టెక్నాలజీలో 13, బిజినెస్ మేనేజ్మెంట్లో 18, బయో కెమిస్ట్రీలో 5, కెమిస్టీలో 31, మ్యాథ్స్‌లో 8, ఎకనామిక్స్‌లో 6, ఇంగ్లిష్‌లో 2 భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఎంజీ యూనివర్సిటీలో సంప్రదించాలని సూచించారు. ప్రొఫెసర్ బెల్లి యాదయ్యకు సన్మానంనకిరేకల్ : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫసర్ డాక్టర్ బెల్లి యాదయ్యను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నాగు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి బెల్లి యాదయ్య అంచలంచెలుగా ఎదిగారని చెప్పారు. కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, జి.శ్రీనివాస్, హరిత, ఉపేందర్, రవీందర్, ఉదయ్‌కుమార్, సుభాషిణి, వెంకన్న, సుదర్శన్, వెంకట్‌రెడ్డి, కార్తిక్ పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్లునకిరేకల్ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించిందని మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకు వెంకటనారాయణ తెలిపారు. నకిరేకల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.23 కోట్లు కేటాయించడం ద్వారా మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. ఈ నిధులు మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి ప్రత్యేక చొరవతోనే సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి, సాదుల నర్సయ్య, సూర శంకర్, మాదాసు చంద్రశేఖర్, వెంకన్న, లక్ష్మీవెంకటయ్య, అజయ్‌కుమార్, వీరయ్య, కోట్ల సైదులు పాల్గొన్నారు. -
6 నుంచి ప్రజా చైతన్య యాత్రలు
నల్లగొండ టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లందుకుకల్పించేందుకు సీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నిర్ణిత గడువులోగా వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, నల్పరాజు రామలింగయ్య, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, అంజాచారి, బంటు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
నిడమనూరు : వర్షాభావాన్ని ఆసరా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్‌కో అక్రమార్కులపై చర్యల్లో భాగంగా మరో ఇద్దరిపై వేటు పడింది. ముకుందాపురం సెక్షన్లో తుమ్మడం ఆర్టిజన్‌గా విధులు నిర్వహిస్తున్న మదనాచారి(రాము) జూనియర్ లైనమన్ నాగయ్య సస్పెన్షన్ చేస్తూ మిర్యాలగూడ డీఈ శ్రీనివాసచారి ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్టర్లపై చర్యలు ఉండేనా..! విద్యుత్ అధికారులకు అక్రమాలకు విద్యుత్ కాంట్రాక్టర్ల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిడమనూరు మండలంలో 26 మందికిపైగా కాంట్రాక్టర్లు ఉండగా.. ముగ్గురు, నలుగురికి మాత్రమే కాంట్రాక్టు పనులను ఇస్తున్నారని తెలిసింది. గతేడాది ముప్పారం వద్ద ఒక విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడి మృతికి కారణమైన లైన్‌మన్‌కు మూడు రోజులకే పోస్టింగ్ తెచ్చుకున్నారని.. ఇలా కాంట్రాక్టర్ల జోక్యంపై కూడా చర్యల తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రుద్రమదేవి శిలాశాసనం సందర్శననకిరేకల్ : మండలంలోని చందుపట్లలో రుద్రమదేవి విగ్రహం పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక వివేకానంద యువజన మండలి సభ్యులు వినతి మేరకు రాణి రుద్రమదేవి శిలా శాసనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సివిల్ ఇంజనీర్ శివం కంబోజ్, డిప్యూటీ మేనేజర్ ఆళ్ల కృష్ణరావు, సీనియర్ అసోసియేట్ గోశిక సాయికుమార్ సోమవారం సందర్శించారు. అధికారుల బృందం సోమవారం సందర్శించింది. శాసనంతో పాటు విగ్రహన్ని పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. వారి వెంట సర్పంచ్ లతావెంకటాచారి, కోటేష్, శంకర్ తదితరులు ఉన్నారు. -
క్యాష్ లెస్.. పేపర్ లెస్..
నీలగిరి కార్పొరేషన్లో సేవలు ఇక సులభతరంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్లో క్యాష్‌లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేసేందుకు కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు తదితర వాటిని పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఏ ఒక్క సెక్షన్లో కూడా నగదు రూపంలో డబ్బులు తీసుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించడంతో పూర్తిస్థాయిలో డిజిటల్ లావాదేవీలు అమలు చేస్తున్నారు. సీఎస్సీతో పెరగనున్న జవాబుదారీతనం.. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇక నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి అధికారుల కోసం తిరగకుండా సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) తీసుకువచ్చారు. దీనిని అమలు చేయడం ద్వారా అధికారులు, సిబ్బందిలో జవాబు దారీతనం పెరగనుంది. నగర ప్రజలు భవన అనుమతులు, వీధి దీపాలు, రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సమస్య తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు నేరుకు ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు విభాగాల్లో దరఖాస్తులు ఇస్తూ వచ్చారు. ఇక నుంచి సిటిజన్ సర్వీస్ సెంటర్లో ఫిర్యాదు ఇస్తే.. అక్కడ వెంటనే ఆన్లైన్ చేసి సంబంధిత విభాగాల వారికి పంపాల్సి ఉంటుంది. ఆ సమస్యను సంబంధిత సెక్షన్ అధికారి పరిష్కరించి సీఎస్సీ లాగిన్‌కు పంపుతారు. దీనిని సీఎస్సీ నిర్వాహకుడు ఫిర్యాదుదారుడి సెల్‌కు మెసేజ్ వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు తిరగకుండా జనం ఒక్కచోట ఫిర్యాదు చేస్తే చాలు సమస్యకు పరిష్కారం చూపుతారు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేమో వివరంగా ఫిర్యాదుదారుడికి రాత పూర్వకంగా తెలియజేస్తారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో క్యాష్ లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేయడం ద్వారా నగర ప్రజలకు పారదర్శకమైన సేవలు అందనున్నాయి. చిల్లర సమస్యకు చెక్ నగదు రూపంలో పన్నులు వసూలు చేయడం ద్వారా కొన్ని సార్లు మున్సిపల్ సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది వచ్చినప్పుడు నోట్లను సరిగా లెక్కించకపోవడం, ఒక్కోసారి తక్కువ డబ్బు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో సిబ్బంది జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పడనుంది. చిల్లర సమస్యకు సైతం ఇబ్బంది లేకుండా పోతుంది. ఫ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం ఫ ప్రతీ ఫిర్యాదు ఆన్లైన్ -
ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి పెట్టాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలవద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు 81, ఇతర అధికారులకు 57.. మొత్తం 138 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి సోమవారం మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వివిద శాఖల అధికారులతో సమీక్షించార. మండలాల ప్రత్యేక అధికారులు హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థలన తనిఖీ చేసిన నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
‘నాకు సొంత ఇల్లే లేదు’.. భారీ మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముందస్తుగా హామీ ఇస్తేనే తాను పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు.ప్రజల పూర్తి మద్దతు, నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ నిబద్ధతను,ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ.. తనకు నల్లగొండలో సొంత ఇల్లు గానీ, తన సొంత గ్రామంలో ఎలాంటి భూములు గానీ లేవని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తాను స్వార్థం కోసం కాకుండా, కేవలం ప్రజల సేవ కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.నల్లగొండ పట్టణాభివృద్ధిపై తనకున్న లక్ష్యాన్ని చాటిచెప్పిన ఆయన, నల్లగొండను సాధారణ పట్టణంలా కాకుండా ఒక అత్యాధునిక నగరంగా, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నల్లగొండను కార్పొరేషన్‌గా మార్చామని, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు. -
నిజమైన సే్నహితులు కరువయ్యారా..!
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా చిలుకూరు గ్రామ పరిధిలో బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతిచెందారు. దోస్త్.. మేరా దోస్త్ఐదుగురి అరెస్టు చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ తెలిపారు.- 8లోఆదివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2026సాక్షి నెట్వర్క్: రక్తసంబంధం కాకపోయినా.. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే ఆత్మబంధువే స్నేహితుడు. నిస్వార్థమైన స్నేహానికి హద్దులుండవు. అవసరమైనప్పుడు ముందుడి నడిపించడమే కాకుండా వెనకుండి వెన్నుతట్టి నడిపించేవాడే స్నేహితుడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ హితుడు తప్పకుండా ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో స్నేహితుడి పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్నేహితుడి ప్రాధ్యాతను గుర్తిస్తూ.. ఆ బంధాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఐదు ముఖ్యపట్టణాల్లో వివిధ వయస్సులున్న 200 మంది అభిప్రాయాన్ని ‘సాక్షి’ సేకరించింది. దీనిలో పలు ఆసక్తికలిగిన అంశాలు వెలుగు చూశాయి. స్నేహితుల దినోత్సవ సాక్షిగా నేడు నిజమైన స్నేహితులు కువయ్యారనే అభిప్రాయం కాస్తా ఆందోళన కలిగిస్తుంది. స్నేహితుల ఎంపికలో డబ్బుకు, చదువుకన్నా వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం గమనించదగ్గవ విషయం. సామాజిక మాధ్యమాల ప్రభావంతో స్నేహితులతో గడిపే సమయం తక్కువైందని సాయంత్రం కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పుకొనే స్నేహితులు కనుమరగయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 1. నేటి రోజుల్లో నిజమైన స్నేహితులున్నారని మీరు భావిస్తున్నారా? 2. స్నేహితుల ఎంపికలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు..? 61 వ్యక్తిత్వానికిలేరుఅవును 903. స్నేహితుల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారా? 49ఫ స్నేహితుల ఎంపికలో వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఫ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కలుసుకోవడం తక్కువే.. ఫ ‘సాక్షి’ సర్వేలో వెల్లడి చదువుకు -
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనుల్లో వేగం
పామాయిల్ క్రషింగ్ యూనిట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఇతర నిర్మాణ పనులన్నింటినీ మిషనరీ బిగింపు పనులన్నింటినీ త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది మార్చి నుంచి పామాయిల్ క్రషింగ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీనివల్ల పామాయిల్ తోటలు ఉన్న రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. – యాదగిరి, డీజీఎం ప్లాంటేషన్ తెలంగాణ యూనిట్ నల్లగొండ అగ్రికల్చర్: అనుముల మండలం యాచారం గ్రామంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆయిల్ పామ్ క్రషింగ్ యూనిట్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు పనుల్లో వేగం పెంచారు. రైతులకు తప్పనున్న కష్టాలు.. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగవుతుండగా, ప్రస్తుతం అవి కాపు దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాంత రైతులు తమ పామాయిల్ గెలలను విజయవాడ సమీపంలోని అంబాపురం ఫ్యాక్టరీకి తరలించి విక్రయించాల్సి వచ్చేది. యాచారంలో ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రైతుల రవాణా వ్యయం, కష్టాలు తప్పుతాయి. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. భూముల ధరల కారణంగా కొంత జాప్యం జరిగింది. అయితే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పతంజలి సంస్థపై ఒత్తిడి తీసుకురావడంతో రెండు నెలల క్రితం పనులు తిరిగి ఊపందుకున్నాయి. పాసెసింగ్ యంత్రాలు వచ్చాయి వచ్చే ఏడాది మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాసెసింగ్ ప్రారంభించాలని కలెక్టర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీంతో గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం గల ఈ యూనిట్ సివిల్ పనులను సంస్థ ముమ్మరం చేసింది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రాసెసింగ్‌కు సంబంధించిన యంత్రాలు సైట్‌కు చేరుకున్నాయి. త్వరలోనే మిషనరీ బిగింపు పనులు చేపట్టనున్నారు. టన్ను ధర రూ. 23,700 ప్రస్తుతం మార్కెట్లో పామాయిల్ గెలకు టన్నుకు రూ.23,700 వరకు పలుకుతోంది. ప్రస్తుతం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పామాయిల్ తోటల నుంచి దాదాపు పదివేల టన్నుల దిగుబడి వస్తోందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఐదు వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని జిల్లా ఉద్యానవన శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వ రాయితీలు అందించడం, స్థానికంగానే ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుండటంతో రైతులు సైతం ఈ సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఈ క్రషింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయితే యాచారం, పరిసర గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 100 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇచ్చేందుకు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సన్నద్ధమవుతోంది. కొనసాగుతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రాసెసింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిఫ రూ.100 కోట్ల వ్యయంతో, 39 ఎకరాల్లో ఏర్పాటు ఫ గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఫ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి.. ఫ పామాయిల్ రైతులకు తప్పనున్న రవాణా కష్టాలు -
ఉపయోగపడని ఆక్సిజన్ ప్లాంట్
దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో సగటున రోజకు 600 వందల మంది రాగా, జూలైలో ఏడెనిమిది వందలు పెరిగింది. కరోనా సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ వినియోగంలో లేకుండాపోయింది. ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రకాల ఇంక్షన్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదని రోగులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రిలోనూ రోగుల సంఖ్య పెరిగింది. జూన్ నెలలో 5825 మంది రోగులు ఆసుపత్రికి రాగా, జూలైలో 6826 మంది ఆసుపత్రికి వచ్చారు. -
మిర్యాలగూడ ఆస్పత్రిలో సమస్యలెన్నో..
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి గతంలో 250 నుంచి 300 వచ్చే రోగుల సంఖ్య ప్రస్తుతం 400కు పైగా చేరింది. వైద్యులు సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన కొందరు వైద్యులు 12గంటలు కూడా కాకముందే బయట ఉన్న తమ ప్రైవేటు క్ల్టినిక్లకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో 20 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏరియా ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం లేదు. ఆస్పత్రిలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉంది. ఓపీ సమీపంలో ఉండే వాష్‌రూంలో దుర్గంధం వెదజల్లుతోంది. రోగులకు వడ్డించే అన్నం మొనూ ప్రకారం ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. నాకు జ్వరం, జలుబు ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందేమో చూసేందుకు ఎక్స్‌రే తీయించాలని చెప్పారు. కానీ, ఆసుపత్రిలో ఎక్స్ రే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక బయట ప్రైవేట్ ల్యాబ్‌లోనే డబ్బులు పెట్టి తీయించుకోవాల్సి వచ్చింది. – కోరె లక్ష్మమ్మ, కత్తాల్గూడ, నల్లగొండ -
న్యాయమూర్తి చొరవతో వితంతువుకు పింఛన్
దేవరకొండ : దేవరకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి అనిత చొరవతో ఓ నిరుపేద వితంతువుకు ఎట్టకేలకు పింఛన్ మంజూరైంది. పీఏపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన దంపతులు పోలగోని అచ్చమ్మ, కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. అచ్చమ్మ భర్త ఆరేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అచ్చమ్మ పేరిట ఎలాంటి భూమి లేదు. వితంతు పింఛన్ కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో గతేడాది ఆమె దేవరకొండ కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. దరఖాస్తును పరిశీలించిన న్యాయమూర్తి అనిత.. ఆమెను అర్హురాలిగా గుర్తించి, పింఛన్ మంజూరు చేయాలని పీఏపల్లి ఎంపీడీఓ ద్వారా కలెక్టర్‌కు ప్రత్యేక సిఫార్సు (స్పెషల్ రిక్వెస్ట్) చేశారు. విచారణ చేపట్టిన అధికారులు అచ్చమ్మకు పెన్షన్ మంజూరు చేశారు. శనివారం దేవరకొండ కోర్టు ఆవరణలో అచ్చమ్మకు పోస్టాఫీస్ పింఛన్ బుక్‌ను జడ్జి అందజేశారు. న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని జడ్జి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీఎస్ హరీష్‌బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి స్నేహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి ఉమామహేష్, వనం జగదీష్, న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రమేష్, రియాజుద్దీన్, రాములు, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో ‘ఎస్ఎల్బీసీ’ పూర్తిచేస్తాం
ఫ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తిప్పర్తి: రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం పనులు పూర్తి చేసి, జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం తిప్పర్తి మండలంలోని పజ్జూరు, యర్రగడ్డలగూడెం, వెంకటాద్రిపాలెం, ఇండ్లూరు, మామిడాల, గోదావరిగూడెం, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పజ్జూరు గ్రామంలో రూ.30కోట్లతో విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యర్రగడ్డలగూడెంలో విద్యుత్, డ్రెయినేజీ, తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో రూ.3కోట్లతో సబ్‌స్టేషన్ మంజూరు చేస్తామని తెలిపారు. బోర్లు వేయిస్తామని, డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా వెంకటాద్రిపాలెంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇండ్లూరులో రూ.50లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మామిడాలలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్కర ణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ గిరిధర్, ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్, ఈఈ శ్రీధర్‌రెడ్డి, జిల్లా, మండల స్థాయి నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. కలసికట్టుగా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి రామగిరి (నల్లగొండ): కలసికట్టుగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం పావురాలగూడెంలో రూ.1.35 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. చిన్న సూరారం మహిళా సంఘాలకు రూ.3 కోట్లు, పెద్ద సూరారానికి రూ. 2.5 కోట్లు, చందనపల్లి సంఘాలకు రూ. 1.5 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్న సూరారం – పెద్ద సూరారం గ్రామాల మధ్య గోదాం లేదా రైస్ మిల్లు నిర్మాణం కోసం 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. పావురాలగూడెంలో చౌకధరల దుకాణాన్ని మంజూరు చేస్తూ, తక్షణమే డీలర్‌ను నియమించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
మర్రిగూడ: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన ఘటన మర్రిగూడ మండలంలోని ఖుదాబాక్షపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంత మల్లేష్ పంచాయతీ కార్యదర్శి ప్రసన్నబాబు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి గ్రామ కంఠానికి చెందిన 188 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కార్యదర్శి ప్రసన్నబాబు తన సంతకం ఫోర్జరీ చేయడంపై శనివారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. సర్వేకు సహకరించాలి మునుగోడు: ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వివాదాలను పూర్తిగా పరిష్కరించేందుకు చేపట్టిన భూ రీసర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో చేపడుతున్న రీసర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై రీసర్వేతో కలిగే లాభాలను వివరించారు. రీసర్వే తో ప్రతి రైతు భూమికి హద్దులు పక్కాగా నిర్ణయించబడతాయన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైతే కొనేళ్ల కాలంగా కబ్జా కలిగి సాగుచేసుకుంటున్నారో వారికే హక్కులు దక్కుతాయని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఆస్తికి పక్కాగా హద్దులు నిర్ణయించబడతాయన్నారు. సమావేశంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ నరేష్, ఆర్ఐ వంశీప్రసాద్, సర్వేయర్ అరుణజ్యోతి, జీపీఓ లింగయ్య, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మరమ్మతులు చేపట్టాలి డిండి: మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–1 లో పెచ్చులూడిన ప్రదేశమంతా వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పనులు పూర్తయ్యేంత వరకు విద్యార్థులను ఇతర భవనానికి మార్చాలని జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి శనివారం దేవరకొండ సీడీపీఓకు ఆదేశాలు జారీ చేశారు. ‘శిథిల భవనం.. భయం భయం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా సంక్షేమ అధికారులు స్పందించారు. డిండిలోని అంగన్వాడీ కేంద్రం – 1 భవనానికి మరమ్మతులు చేపట్టడంతోపాటు దర్గా బజారులో అద్దె భవనంలో కొనసాగుతున్న మరో అంగన్వాడీ కేంద్ర నూతన భవన ఏర్పాటుకు పంచాయతీరాజ్ ఇంజనీర్‌తో సమన్యయం చేసుకుని నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మూసీకి 1203 క్యూసెక్కుల ఇన్ఫ్లోకేతేపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం ఎగువ నుంచి మూసీకి 1203 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు వెయ్యి క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో రావడం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా.. శనివారం సాయంత్రం నీటిమట్టం 638.30 అడుగులకు చేరుకుంది. పంటల సాగు కోసం మూసీ కుడి, ఎడమ కాల్వకు 325 క్యూసెక్కుల చొప్పున మొత్తం 650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.84 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
దేవరకొండ : మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొండభీమనపల్లి రైతువేదికలో ఆయా మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, వీఓఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాల రికార్డులు, లెక్కలను ప్రతి నెలా అత్యంత పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. సభ్యులు తీసుకున్న రుణాల రికవరీ, బ్యాంకు లింకేజీల చెల్లింపులు సకాలంలో జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రగతి వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని, సభ్యులు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ శ్రావణ్, ఆర్ఎం శ్రీలేఖ, డీపీఎంలు రామలింగయ్య, మోహన్‌రెడ్డి, వీరయ్య పాల్గొన్నారు. -
మూసీకి 965 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : ఎగువన వర్షాలు కురుస్తుండడంతో మూసీ ప్రాజెక్టుకు శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ ఏడాది జూలై మాసంలో మూసీ ప్రాజెక్టు నీటిమట్టం 642 (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) అడుగులకు చేరడంతో అధికారులు ఆయకట్టులో పంటల సాగుకు 20 రోజుల కిత్రం నీటిని విడుదల చేశారు. అయితే నెల రోజుల నుంచి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేకపోవడంతో పాటు, కాల్వలకు నీటిని విడుదల చేస్తుండడంతో నీటిమట్టం 638 అడుగులకు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శుక్రవారం 965 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మూసీ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 324 క్యూసెక్కుల చొప్పున మొత్తం 648 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 2.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ప్రారంభం కావడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ : చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు ముద్ర రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ముద్ర పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగతంగా, సంఘాలుగా లేదా క్లస్టర్ల రూపంలో కూడా ఈ రుణాలను పొందే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలోని చేనేత కళాకారుల సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చండూరు మాజీ జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం చేనేత రంగ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, చేనేత సహాయ సంచాలకుడు గోవిందయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
యూరియా అమ్మలేం
గట్టుప్పల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లు యూరియా బుకింగ్ నిలిపేశాయి. పీఏసీఎస్‌లకు యూరియా రవాణా చార్జీల చెల్లింపు నిలిపివేస్తున్నట్లు తాజాగా (జూలై 14న) మార్క్‌ఫెడ్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నిర్ణయంతో పీఏసీఎస్‌లకు నష్టం వస్తుందని.. యూరియా అమ్మలేమని పదిరోజులుగా జిల్లా వ్యాప్తంగా 43 పీఏసీఎస్‌లు బుకింగ్ నిలిపి వేశాయి. 14న మార్కెఫెడ్ నుంచి ఉత్తర్వులు యూరియా దిగుమతికి అవసరమైన రవాణా చార్జీలను ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ చెల్లిస్తోంది. యూరియా దిగుమతి రవాణా చార్జీలను మీరే భరించాలని జూలై 14న మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు ఉత్తర్వులు అందాయి. రవాణా చార్జీలు భరించి మార్క్‌ఫెడ్ నుంచి యూరియా తీసుకుని ఎమ్మార్పీకి విక్రయిస్తే.. రూ.లక్షల్లో వచ్చే నష్టం మేం భరించలేమని సహకార సంఘాల సీఈఓలు అంటున్నారు. ఇప్పటికే చండూరు, మర్రిగూడెం, మునుగోడు ప్రాంతాలకు చెందిన సహకార సంఘాలు యూరియా బుకింగ్ బంద్ చేశాయి. రైతులకు ఇబ్బందులు రెండు, మూడు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతోరైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. పత్తి చేలలో గుంటకలు తోలుకుని.. యూరియా పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. యూరియా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినా.. నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పంటలకు సమయానికి యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.ఫ పీఏసీఎస్‌లపై రవాణా చార్జీల భారం మోపిన మార్క్‌ఫెడ్ ఫ నష్టపోతామంటున్న సీఈఓలు ఫ యూరియా బుకింగ్ నిలిపివేసిన సొసైటీలు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా బస్తా రూ.252.43(కంపెనీల బట్టీ ఎక్కువ, తగ్గుదల)కు లభ్యమవుతుంది. రవాణా చార్జీలను మార్క్‌ఫెడ్ భరిస్తుంది. దీంతో పీఏసీఎస్‌లు రైతులకు (ఎమ్మార్పీకి) రూ.267కు విక్రయిస్తున్నాయి. ఇందులో లారీ నుంచి యూరియా (450 బస్తాలు) దిగుమతికి హమాలీ చార్జీ(బస్తాకు రూ.10 చొప్పున)4,500 ఖర్చవుతాయి. లారీ యూరియా రూ.267కు విక్రయిస్తే పీఏసీఎస్‌కు రూ.2,056.50 మిగులుతాయి. ప్రస్తుతం రవాణా చార్జీలు రద్దుతో మార్క్‌ఫెడ్ నుంచి సహకార సంఘాలకు యూరియా దిగుమతి చేసినందుకుగాను లారీ ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీ రూ.20 వేలు (దూరాన్ని బట్టి మారుతుంది) అంటే ప్రతి లారీ యూరియా ఎమ్మార్పీకి అమ్మితే పీఏసీఎస్‌లకు రూ.17,943.50 నష్టం వస్తుంది. -
రక్తశుద్ధికి యాతన
అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేని డయాలసిస్ పడకలునల్లగొండ టౌన్ : మారుతున్న జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధిన బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా డయాలసిస్ కోసం రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం డయాలసిస్ రోగుల సంఖ్య పెరగడంతో అవి సరిపోవడం లేదు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద డయాలసిస్ చేస్తున్నా.. కొందరు వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 డయాలసిస్ కేంద్రాలను ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. 726 మంది రోగులకు నాలుగు షిఫ్టుల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కొందరికి ప్రతి రోజూ, మరికొందరికి రెండు మూడు రోజులకు, ఇంకొందరికి వారంలో రెండు సార్లు, వారానికి ఒక సారి చొప్పున డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది రోగులు డయాలసిస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఆ కేంద్రంలో ప్రస్తుతం డయాలసిస్ పొందే రోగి చనిపోతేనే వెయిటింగ్లో ఉన్న వారికి డయాలసిస్ చేసే పరిస్థితి ఉంది. వెయిటింగ్ లేకుండా డయాలసిస్ చేయాలంటే ఆయా కేంద్రాల్లో పడకల స్థాయిని, మిషన్లను పెంచాల్సిందే. ఆర్థికంగా భారం మూత్రపిండాలు చెడిపోయిన వారికి తప్పని సరిగా డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుద్ది చేయాల్సి ఉంటుంది. కానీ డిమాండ్ మేరకు పడకలు లేని కారణంగా డయాలసిస్ రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి చేయించుకుంటున్నారు. దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం రోగుల డిమాండ్‌కు తగ్గట్టుగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.డయాలసిస్ కేంద్రాల సేవలు ఇలా.. ఆస్పత్రి పడకలు రోగులు వెయిటింగ్ జీజీహెచ్ 15 135 0 దేవరకొండ 5 50 10 మిర్యాలగూడ 10 92 0 నాగార్జునసాగర్ 5 40 0 మర్రిగూడ 5 30 0 సూర్యాపేట 7 60 0 హుజూర్నగర్ 9 80 0 కోదాడ 5 52 10 చౌటుప్పల్ 5 50 0 భువనగిరి 8 90 0 రామన్నపేట 5 47 0 ఫ పెరుగుతున్న రోగుల సంఖ్య ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ద్వారా డయాలసిస్ ఉమ్మడి జిల్లాలో ఉన్న డయాలసిస్ కేంద్రాల ద్వారా 24 గంటలు పనిచేస్తూ రోగులకు మెరుగైన సేవలను అందిస్తున్నాం. ఎక్కడా రోగులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని సేవలను అందజేస్తున్నాం. – మహ్మద్ అఖిల్, డయాలసిస్ కేంద్రాల ఉమ్మడి జిల్లా మేనేజర్ -
నేడు, రేపు జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించి ప్రజలను కలుస్తారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులతో సమీక్షించనున్నారు. శాఖాపురంలో వైద్యశిబిరంనిడమనూరు : మండలంలో శాఖాపురంలో అధికారులు శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది జ్వర పీడితులు వైద్యం పొందారు. 17 మందికి సాదారణ రక్త పరీక్షలు నిర్వహించి, అనుమానిత 3 రక్త నమూనాలను నల్లగొండ ల్యాబ్‌కు పంపించారు. 150 ఇళ్లలో ఆశ కార్యకర్తలు జ్వర సర్వే చేశారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిలని డీఎల్పీఓ రాఘవరావును డీపీఓ ఆదేశించారు. శనివారం డీఎల్పీఓ గ్రామంలో పర్యటించి మురుగు కాల్వల పూడికతీత, ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సైదులు, సర్పంచ్ చేకూరి సూర్యానారాయణ స్థానికులు ఉన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వాలు విఫలండిండి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర మహాసభలో ఉపాధి, విద్య, వైద్యం, యువత హక్కులపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెపాపరు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఎనమల, బుచ్చిరెడ్డి, మైనొద్దీన్, కనకాచారి, శైలేష్, ప్రేమ్‌కుమార్ వినయ్, కళ్యాణ్ పాల్గొన్నారు. పోస్టాఫీస్‌ల ద్వారా మెరుగైన సేవలు చిట్యాల : తపాల శాఖలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు వేగవంతమైన సేవలను అందించాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్(సీపీఎంజీ) డీఎస్‌వీఆర్.మూర్తి సూచించారు. చిట్యాల పోస్టాఫీస్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తపాలా సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు చేరవేసేలా బ్రాంచ్ పోస్ట్మాస్టర్లు పనిచేయాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అందుగుల మల్లయ్య నామినీ అందుగుల రోహిణమ్మకు తపాల శాఖ ద్వారా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ పోస్టాఫీసుల సూపరిండెండెంట్ నరేంద్రబాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ జేనేద్రకాంత్, సునిల్‌కుమార్, రాజశేఖర్, రమేష్, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగింది నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడం, జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయానికి రోజుకు 14 నుంచి 16 గంటల వరకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పెద్దఎత్తున కొత్త బోరు బావులు తవ్వడంతో విద్యుత్ లైన్లపై అదనపు లోడ్ పడుతోందని.. అక్కడక్కడా తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖ పరంగా ఎలాంటి తప్పిదం, నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. -
తేలనున్న ట్రేడ్స్ లైసెన్స్ లెక్క
ఫ నగరంలో భారీగా పెరిగిన వ్యాపార సముదాయాలు ఫ రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ట్రేడ్ లైసెన్స్‌లు ఫ వివరాల సేకరణలో వార్డు ఆఫీసర్లు నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగరంలో ఇటీవల కాలంలో కార్పొరేట్ మాల్స్, కాలనీల్లో వాణిజ్య వ్యాపార దుకాణాలు, హాస్పిటల్స్ భారీగా పెరిగినాయి. హైదరాబాద్ నగరం నుంచి కార్పొరేట్ మాల్స్ నీలగిరి నగరానికి భారీగా తరలిరావడంతో ప్రధాన రహదారుల వెంట సాధారణ వ్యాపార దుకాణాలు కాలనీల్లోకి మార్చారు. మాల్స్, హాస్పిటల్స్ భారీగా వెలియడంతో కిరాయి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దాంతో అంత కిరాయి చెల్లించలేని స్థానిక వ్యాపారులు కాలనీల్లోకి దుకాణాలను మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు. దాంతో నీలగిరి నగరంలో వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగానే పెరిగినట్లు తెలుస్తున్నా రికార్డుల్లో మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇటీవల కొత్తగా వచ్చిన కార్పొరేషన్ కమిషనర్ ట్రేడ్ లైసెన్స్‌పై నజర్ పెట్టడంతో లెక్కల్లో తక్కువ ఉన్నట్లు తేలింది. దాంతో ట్రేడ్ లైసెన్స్‌పై పక్కా వివరాలు సేకరించాలని నిర్ణయించారు. డివిజన్ల వారీగా వివరాల సేకరణ నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్ మాల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, దుకాణాలు, కాలనీల్లో ఉన్న వాణిజ్య వ్యాపార దుకాణాలు తదితర వాటి వివరాలను వార్డు ఆఫీసర్ల ద్వారా సేకరిస్తున్నారు. వారం రోజుల పాటు అన్ని డివిజన్లలో వ్యాపార దుకాణాలను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ వివరాలు కూడా తీసుకుంటారు. డివిజన్లో ఎన్ని వాణిజ్య వ్యాపార దుకాణాలు ఉన్నాయి, ఎన్ని దుకాణాలకు ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నాయి, ఉంటే ఎలాంటి వ్యాపారం, దానికి ట్రేడ్ రుసుం ఎంత వేశారనే వివరాలను వార్డు ఆఫీసర్లు సేకరించనున్నారు. ప్రస్తుతం 2,600 వరకు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నట్లు వివరాలు ఉన్నాయి. డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్నందున వాణిజ్య వ్యాపార దుకాణాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలో వాణిజ్య దుకాణాల సంఖ్య ఎక్కువగా పెరిగితే మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదాయం కూడా భారీగా సమకూరనుంది. నగరంలో వాణిజ్య దుకా ణాల వివరాలు సేకరించా లని నిర్ణయించాం. ట్రేడ్ లైసెన్స్ దుకాణాలను గుర్తించడానికి డివిజన్ల వారీగా వివరాలు సేకరిస్తున్నాం. ట్రేడ్ లైసెన్స్ లేనివి గుర్తించి లైసెన్స్ జారీ చేస్తాం. ప్రతి వ్యాపారి కచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. – వంశీకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ -
సమాజంలో పోలీసుల పాత్ర కీలకం : ఎస్పీ
నల్లగొండ: సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. ఆయన ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. పదవీ విరమణ పొందిన వారిలో పోలీసు అధికారులు ఏఎస్ఐ ఎన్.ప్రభాకర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.మోహన్‌రావు, హెడ్ కానిస్టేబుల్ ఎండి.హిదాయత్ అలీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, ఏఓ శివప్రసాద్, ఆర్ఐ సంతోష్, ఆర్ఎస్ఐ జంగయ్య, జయరాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యంకట్టంగూర్ : వర్షపు నీటి ఒడిసి పట్టేలా గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తూ నాణ్యతతో చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి ఎంపీడీఓ, ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశమై మాట్లాడారు. తెలంగాణ జలసిరి జల సంచయ్, జన భాగీదారి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియ, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం, మెడికల్ క్యాంపును పరిశీలించారు. 108 అంబులెన్స్‌లో మందులు, రికార్డులను, స్టాక్ రిజిస్టర్లను, కేసుల వివరాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ అంజన్‌రెడ్డి, వైద్యాధికారి జమున, జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రదీప్‌కుమార్, కస్తూర్బా విద్యాలయం ఎస్ఓ నీలాంబరి, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఓ కడెం రాంమోహన్, అంబులెన్స్ సిబ్బంది మహేష్, గాలిబ్, ఈఎంటీ శ్రీనివాస్, శివాని ఉన్నారు. వీబీజీ రామ్‌జీ పనులు వేగవంతం చేయాలిరామగిరి(నల్లగొండ): వీబీజీ రామ్‌జీ పథకం కింద చేపట్టిన ఉపాధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతం చేయాలని అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. నల్లగొండ మండలం పెద్ద సూరారంలో గురువారం ఆయన పర్యటించారు. జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. పాఠశాలలో మొక్కలు నాటా రు. వీబీజీ రామ్‌జీ పనులపై గ్రామస్తులతో చర్చించారు. ఆయన వెంట ఎంపీఓ షేక్ ఇస్మాయిల్, కార్యదర్శి అనిల్‌కుమార్ ఉన్నారు. అబార్షన్ కిట్లు నిల్వ ఉంచిన మెడికల్ ఏజెన్సీ సీజ్నల్లగొండ టౌన్: నల్లగొండలోని ప్రకాశం బజార్లో శ్రీలక్ష్మీ మెడికల్ ఏజెన్సీలో గురువారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా 113 అబార్షన్ కిట్లు నిల్వ ఉంచినందుకు అధికారులు వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వీటన్నింటిని పరీక్షల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపినట్టు తెలి పారు. కార్యక్రమంలో ఏడీ వి.రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆ ఊర్లకు 25 ఏళ్లకు బస్సొచ్చింది
హాలియా: అనుముల మండలంలోని ఐదు గ్రా మాలకు గురువారం ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభమైంది. మండలంలోని హజారిగూడెం, నాయుడుపాలెం, చల్మారెడ్డిగూడెం, కొట్టాల, సూరేపల్లి గ్రామాలకు 25 ఏళ్ల క్రితం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అనంతరం నుంచి బస్సు రావడం లేదు. దీంతో 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పలు గ్రామాల సర్పంచ్‌లు సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి దేవరకొండ బస్ డిపో మేనేజర్ విజయకుమార్‌తో మాట్లాడడంతో సూరేపల్లి నుంచి హైదరాబాద్ వరకు బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ గ్రామాలకు బస్సు రావడంతో ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అనుముల మండల అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ యాదవ్, డిపో మేనేజర్ విజయకుమార్, నాయకులు పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
గోరింటా పండిందిఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్: బెంగళూరులో ఆగస్టు 7న జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు కోరారు. గురువారం నల్ల గొండలో మహా సభల పోస్టర్ ఆవిష్కరించి మా ట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయాలన్నారు. అనంతరం మనుమ య సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చొల్లేటి రమేష్, గుంటోజు వెంకటాచారిని సన్మానించారు. కార్యక్రమంలో కాసోజు విశ్వనాథం, కంది సూర్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్, చిక్కుళ్ల రాములు, నకిరేకంటి కాశయ్య గౌడ్, పసుపులేటి సీతారాములు, జెల్లా ఆదినారాయణ, కె.సత్యనారాయణ, కాసోజు శంకరాచారి, జంగాచారి, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.‘సర్’ను పకడ్బందీగా చేపట్టాలిఫ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మిర్యాలగూడ : మూడు రోజులే గడువు ఉన్నందున ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, నల్లగొండ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్చార్జి బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. గురువారం మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సర్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లడారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేత, కే.శ్రీనివాస్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇన్చార్జి షబ్బీర్‌అలీ, నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు. అర్హులంతా ఓటు హక్కు పొందాలి దేవరకొండ: అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, పార్లమెంట్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం దేవరకొండలోని ఎమ్మెల్యే నివాసంలో సర్‌పై డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌తో కలిసి కాంగ్రెస్ శ్రేణులకు నిర్వహించిన సమావేశంలో వారు మాట్ల్లాడారు. సమావేశంలో మార్కెట్ చైర్పర్సన్ జమునమాధవరెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్, పున్న శైలజ వెంకటేష్, వెంకటయ్య, వేణుధర్‌రెడ్డి, సర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.నల్లగొండ: భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. గురువారంహైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం నల్లగొండలోని కలెక్టరేట్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్ రూమ్‌లో సమాచారం అందించేందుకు ఫోన్ నంబర్ 18004251442ను అందుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్ఓఆర్ దశరథ, సీపీఓ శ్రీనివాస్ నాయక్, డీఏఓ వినోద్ కుమార్, ఉద్యానశాఖ అధికారి టి.శేఖర్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు నిడమనూరు : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటల సాగు మేలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. గురువారం ఆయన నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో కంది పంట సాగు పరిశీలించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను కలెక్టర్ విన్నవించారు. వెనిగండ్ల గ్రామానికి చెందిన పలువురు బాధితులు భూ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి.శేఖర్, ఏడీఏ సరిత, వ్యవసాయాధికారి మునికృష్ణయ్య, ఏఈ కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
అద్దె భవనాల్లో, శిథి లావస్థకు చేరిన ఇళ్లలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. – చంద్రకళ, సీడీపీఓ, దేవరకొండ డిండిలోని ఎంఆర్సీ భవనం సమీపంలో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు దాటింది. ఇంకా పూర్తి కాలేదు. అధి కారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – సత్యవాణి, అంగన్వాడీ టీచర్, డిండి -
సీఎంఆర్ ధాన్యం అక్రమాలకు పడని అడ్డుకట్ట
సాక్షి ప్రతినిది, నల్లగొండ : రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. 2022–26 యాసంగి సీజన్‌కు సంబంధించి ఆ ధాన్యాన్ని మరాడించి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఆరు మిల్లులు బియ్యం ఇవ్వకుండా వందల కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. అధికారుల ప్రత్యక్ష తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. వారికి నోటీసులు ఇచ్చినా కూడా బియ్యాన్ని తిరిగి ఇవ్వలేదు. మిల్లులో ధాన్యం నిల్వ కూడా లేకపోవడంతో అధికారులు ఆరుగురు మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో కొందరు జైలుకు కూడా వెళ్లారు. అయినా మరికొందరు మిల్లర్లు అదే బాటలో ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టిన వానాకాలం ధాన్యం వానాకాలం–2025–26 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి పంపండం లేదు. కావాలనే మిల్లర్లు జాప్యం చేస్తుండటంతో అనుమానం వచ్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల సంయుక్తంగా జిల్లాలోని మూడు రైస్ మిల్లుల్లో అకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉండాల్సిన ధాన్యం కంటే భారీగా నిల్వలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మూడు మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ● డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రికార్డుల ప్రకారం ధాన్యం లేదు. ఉండాల్సిన ధాన్యం కంటే 4790 క్వింటాళ్ల ధాన్యం తక్కువగాా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ● కనగల్ మండలం పర్వతగిరిలోని వెంకటసాయి రైస్ మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 1405 క్వింటాళ్ల ధాన్యం లోటు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఆ మిల్లు యజమానిపైన అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ● చింతపల్లి మండలం నర్సర్లపల్లి గ్రామంలోఉన్న వెంకటసాయి రైస్ మిల్లులో కూడా విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఉండాల్సిన ధాన్యంతో పోల్చి చూస్తే 1,113 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మిల్లు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫ ధాన్యం మింగిన వారిని జైలుకు పంపుతున్నా.. కొందరి మిల్లర్లలో కానరాని మార్పు ఫ జిల్లాలోని మూడు మిల్లులపై క్రిమినల్ కేసులు ఫ అక్రమాలు తేల్చిన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కొందరు రైస్ మిల్లర్ల తీరు మారడం లేదు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం ఇవ్వకుండా.. ధాన్యం పక్కదారి పట్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఇంకా కొందరు మిల్లర్లలో మార్పు రావడం లేదు. తాజాగా విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసి మూడు మిల్లుల్లో ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నందున ఎప్పటికప్పుడు మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. -
శిథిల భవనం.. భయం భయం
డిండి : మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గ్రామాల్లో అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిండి మండలంలో మొత్తం 73 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 32 కేంద్రాలు సొంత భవనాల్లో.. 14 కేంద్రాలు అద్దెలో, మరో 27 కేంద్రాలు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మొత్తం 1,303 మంది పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్వాడీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిండిలోని ఎంఆర్సీ భవనం సమీపంలో అంగన్వాడీ భవనం పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లు అయినా పూర్తి కాలేదు. సింగరాజుపల్లిలో మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. శిథిల భవనాల్లో నడిచే కేంద్రాల్లో సిబ్బంది భయం భయంగా గడుపుతున్నారు. -
అంచనాలు తప్పిన సాగు
నల్లగొండ అగ్రికల్చర్ : వానాకాలం సీజన్ ఆరంభమై 50 రోజులు దాటినా జిల్లాలో చెరువులు, కుంటలు నిండే స్థాయిలో వర్షాలు కురవలేదు. కేవలం చిరుజల్లులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముసురుతో కూడిన వానలు మాత్రమే వచ్చాయి. దీంతో వానాకాలం సాగు కష్టతరంగా మారింది. జూన్మాసంలో కురుసిన ముసురు వర్షాలకు రైతులు పత్తిగింజలు పెట్టుకున్నారు. అవి మొలకెత్తిన నాటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు వాడుపడుతున్నాయి. మరోవైపు గత వానాకాలంలో ఈ నెలాఖరు వరకు 3 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా ఈసారి 81,123 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. 13,336 ఎకరాల్లో వరినార్లు పోసుకున్నారు. 6,78,750 ఎకరాల్లోనే పంటలు.. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో వివిధ సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో వరి 5,46,165 ఎకరాల్లో పత్తి 6,47,689 ఎకరాల్లో ఇతర పంటలు కలిపి మొత్తం 12 లక్షల ఎకరాల వరకు సాగవుతాయని లెక్కలు వేసింది. కానీ, వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో కేవలం 81,123 ఎకరాల్లో వరినాట్లు వేసుకోగా పత్తి 5,79,283 ఎకరాల్లో, జొన్న 11, కంది 2224, పెసర 64, వేరుశనగ 7, ఆముదం 12 ఎకరాల్లో సాగు చేశారు. పత్తిని రైతులు అంచనాకు కొంత తక్కువ సాగు చేసినప్పటికీ వర్షాలు లేక ఎదుగుదల తగ్గిపోయింది. వర్షాలు కురిస్తే గుంటకలు తోలి ఎరువులు పెడితే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. 15 మండలాల్లో లోటు వర్షం.. జిల్లాలో ఇప్పటి వరకు 15 మండలాల్లో లోటు వర్షం కురిసింది. జూలై మాసంలో ఇప్పటి వరకు 109.5 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 49.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 11 మండలాల్లో సాధారణ వర్షం నమోదవగా.. శాలిగౌరారం, నకిరేకల్, తిప్పర్తి, నల్లగొండ, అనుముల హాలియా, నిడమనూరు, మిర్యాలగూడ, తిరుమలగిరి సాగర్, పీఏ పల్లి, నేరేడుగొమ్ము, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో లోటు వర్షం కురిసింది. కేతేపల్లి మండలంలో దుర్భిక్ష పరిస్థితి నెలకొనగా చిట్యాల, దామరచర్ల, అడవిదేవులపల్లి, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో అధిక వర్షం కురిసింది. పరిస్థితి ఇలాగే ఉంటే వేసిన పంటలు కూడా చేతికి వస్తాయో రాదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్ మొత్తం వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులు ఆరుతడి మాత్రమే సాగు చేసుకోవాలి. కంది, పెసర, మినుము, నువ్వులు వంటి మెట్ట పంటలను సాగు చేసుకుంటే మంచిది. విత్తనాలు అందబాటులో ఉన్నాయి. – వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఫ ఎల్‌నినోతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఫ 15 మండలాల్లో లోటు వర్షం ఫ వాడిపోతున్న పత్తి చేలు.. 90 వేల ఎకరాలు దాటని వరి నాట్లు -
‘మధ్యాహ్నం’పై ధరల భారం
మార్కెట్లో పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచాలి. ప్రభుత్వమే అన్నిరకాల సరుకులు సరఫరా చేస్తే ఏజెన్సీలపై భారం పడకుండా ఉంటుంది. ప్రతి నెలా జీతాలు, బిల్లులు చెల్లించాలి. – పద్మ, మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకురాలుఫ మార్కెట్ రేట్లకు అనుగుణంగా చార్జీలు పెంచని ప్రభుత్వం ఫ అప్పుల పాలవుతున్నామని ఏజెన్సీ నిర్వాహకుల ఆవేదననల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీలపై ఆర్థికభారం పడుతోంది. మార్కెట్లో ధరలకు ప్రభుత్వం చెల్లించే మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంటోంది. దాంతో తాము అప్పుల పాలవుతున్నామని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగన ధరలతో పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్డు కూడా పెట్టలేకపోతున్నామని చెబుతున్నారు. 77,422 మంది విద్యార్థులు.. జిల్లా వ్యాప్తంగా 1230 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 77,422 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠ శాలల్లో మొత్తం 1,230 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ఓ నిర్వాహకురాలితో పాటు హెల్పర్లు ఇద్దరు చొప్పున వంట చేస్తూ మధ్యాహ్న భోజనం అందజేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు. నిర్వాహకులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం ఇస్తోంది. బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తూ.. ఖర్చులకు ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 లు, 6,7,8వ తరగతి వారికి రూ.10.17, 9, 10వ తరగతి వారికి రూ.13.17 చొప్పున ఇస్తోంది. ప్రస్తుత ధరలు చూస్తే ఈ మొత్తం వారికి మాత్రం పరిపోవడం లేదు. వారానికి మూడు గుడ్లు.. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారంలో మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి నెలకు 12 గుడ్లు పెట్టాల్సి ఉంది. జిల్లాలోని 77,422 మంది విద్యార్థులకు ఒక్క నెలకు 9 లక్షల 29 వేలు గుడ్లు వడ్డించాలి. ప్రభుత్వం ఇస్తున్న గుడ్డుకు ఇస్తున్న ధర రూ.6 లు, కాగా మార్కెట్లో ధర రూ.8లు ఉంది. దాంతో ఏజెన్సీ నిర్వాహకులపై అదనంగా నెలకు రూ.18,58,128 అదనపు భారం పడుతోంది. పెరుగుతున్న ధరలతో సతమతం.. కొంతకాలంగా మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు మండిపడుతున్నాయి. వంట గ్యాస్, కూరగాయలు, నూనె ధరలు మండిపోతుండటంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సతమతం అవుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు, ఏజెన్సీ ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం మెనూ ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికల కోసమే ఆర్బాటాలు
నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ప్రజలను మభ్యపెట్టడం కోసం ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామంటు ప్రభుత్వం ఆర్బాటం చేస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. నకిరేకల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండగ సందర్భంగా గతేడాది వచ్చిన చీరలను నకిరేకల్‌లో ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని.. అవీ కూడా కేవలం సమబావన సంఘాల మహిళలకు యూనిఫాం మాదిరిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. అంతటా ఇందిరమ్మ ఇళ్లు వస్తే నకిరేకల్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో తన హయాంలో 100 పడకల వైద్యశాల భవనాన్ని పూర్తిచేస్తే ప్రజలకు అందుబాటులోకి తేవడంలో జాప్యం చేస్తున్నారని విమర్శించారు. అమృత్ స్కీం కింద గతంలో నిధులు తేస్తే.. ఆ పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యారన్నారు. చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతుంటే.. కనీసం వాటిని నింపాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. సమావేశంలో మార్కెట్ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ తలారి బలరాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, గుండగోని జంగయ్యగౌడ్, పేర్ల క్రిష్ణకాంత్, పెండెం సదానందం, గుర్రం గణేష్, పల్లె విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
ముంపు బాధితులకు అండగా ఉంటాం
ఫ కలెక్టర్ చంద్రశేఖర్ మర్రిగూడ : మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్ సమీపంలో ముంపు బాధితులు సొంతంగా నిర్మించుకున్న గృహాలను పరిశీలించారు. రిజర్వాయర్ ముంపునకు గురైన మొత్తం 287 కుటుంబాలకు గాను ప్రభుత్వం గతంలో చింతపల్లి వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే చింతపల్లి వద్ద కేటాయించిన ప్లాట్లకు నంబర్ల కేటాయింపు, స్థలాల అప్పగింతలో ఆలస్యం కావడంతో 54 మంది బాధితులు శివన్నగూడెం వద్ద ఒక ప్రైవేట్ వెంచర్లో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కలెక్టర్‌కు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వెంచర్లో ఇండ్లు నిర్మించుకున్నందున తమకు ఇందిరమ్మ గృహాల కింద ఇచ్చే రూ.5 లక్షల సాయాన్ని మంజూరు చేయాలని కోరారు. ఆర్అండ్ఆర్ సమస్యలను తీర్చాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన కోర్టు ఉత్తర్వుల ప్రకారం వివాదస్పద భూమి విషయాన్ని 10 నుంచి 15రోజుల్లో అవార్డు పూర్తి చేసి, మిగిలిన 32 మందికి కూడా ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుల సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట దేవరకొండ ఆర్డీఓ శ్రీదేవి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో జి.చినమునయ్య, సర్పంచ్ రాపోలు యాదగిరి తదితరులు ఉన్నారు. -
విదేశీ ఒప్పందాలతో వ్యవసాయం దివాలా
మిర్యాలగూడ : విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశీయ వ్యవసాయం దెబ్బతిని రైతాంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఎంసీపీఐయూ పొలిట్‌బ్యూరో సభ్యుడు వల్లెపు ఉపేందర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక, ప్రజా సంఘాలను కలుపుకోని దేశ వ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. వస్కుల సైదమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మోర్తాల చందర్రావు, నార్ల చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, వనం సుధాకర్, కుంభం సుకన్య, గోనె కుమారస్వామి, రమేష్, సాంబయ్య, హంసారెడ్డి, బాబు, అరుణ్‌కుమార్, తిరుపతి, వెంకన్న, రవి, నర్సయ్య, రాగసుధ, అనిల్‌కుమార్, గడ్డం, మురళి, దానయ్య, వెంకటేష్, కాశి, సాగర్, రవీందర్, సావిత్రి, సంధ్య, రాజేష్‌నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యుడు ఉపేందర్‌రెడ్డి -
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచాలి
రామగిరి(నల్లగొండ) : ప్రతి విద్యార్థి ఆశించిన స్థాయిలో అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని డీఈఓ సుశీందర్‌రావు అన్నారు. చర్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో నల్లగొండ మండల ఎస్టీజీ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండో రోజైన బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందుగానే గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నూతన బోధనా పద్ధతులను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె.అరుంధతి, ఆర్పీలు శ్రీనివాస్, నాగయ్య, క్రాంతి, రవి, ఉమ తదితరులు పాల్గొన్నారు. నిడమనూరు : అర్హులు ఓటుహక్కు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు కృషిచేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత అన్నారు. బుధవారం నిడమనూరు మార్కెట్లో కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలతో సమావేశమయ్యారు. నిడమనూరు మండలంలో 35,731 ఓటర్లు ఉండగా, 33,137 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ దరఖాస్తులు డిజిటలైజ్ అయ్యాయని పార్టీ అధ్యక్షుడు నర్సింగ్ విజయ్‌కుమార్ డీసీసీ అధ్యక్షుడు కై లాష్నేతకు తెలిపారు. 91 శాతం ఎన్యుమరేషన్ డిజిటలైజ్ చేయడానికి సహకరించిన బీఎల్ఏలను కై లాస్ నేత అభినందించారు. కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, కాంగ్రెస్ నిడమనూరు మండల అధ్యక్షుడు నర్సింగ్ విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ సత్యం, పార్టీ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగుల శీను, నాయకులు ముంగి శివమారయ్య, కొండా శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు బుర్రి వెంకన్నయాదవ్, నాయకులు కృష్ణ, నరేష్, పోలె రవి ఉన్నారు. సినారె సాహిత్యం.. నైతిక విలువల దీపికరామగిరి (నల్లగొండ) : ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం నైతిక విలువలతో కూడుకున్నదని, సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ కౌండిన్య అన్నారు. బుధవారం నల్లగొండ ఎన్జీ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సినారె జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలను, సృజనాత్మక రచనల విశిష్టతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. సినారె రాసిన పాటలను స్వయంగా పాడి వినిపించి అలరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ సినారె మాటా పాట రెండూ తెలుగు జాతిని పరవశింపజేశాయని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల తెలుగు శాఖాధిపతి శ్రీధర్, అధ్యాపకులు సైదులు, భూపాల్, అంజయ్య పాల్గొన్నారు. -
అరకకు తగ్గని ఆదరణ
తిరుమలగిరి (సాగర్) : వ్యవసాయ రంగంలోకి ఎన్ని అత్యాధునిక యంత్రాలు వచ్చినా, ట్రాక్టర్ల వినియోగం పెరిగినా.. పత్తి సాగులో మాత్రం కాడెద్దులదే కీలక పాత్ర. పొలం చదును చేయడం, విత్తనాలు వేయడం నుంచి కలుపు తీయడం వరకు ఎద్దులను ఉపయోగించడం గ్రామాల్లో పరిపాటి. వర్షాధారంగా పత్తి సాగుచేసే రైతులు.. చేనులో కలుపు నివారణ కోసం గుంటక తోలడానికి నేటికీ అరకపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో అరకకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. పెరిగిన డిమాండ్.. కొరతతో ఇబ్బందులు ఒకప్పుడు గ్రామాల్లో రైతులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ, కలిసికట్టుగా పనులు చేసుకునేవారు. కానీ.. పశుగ్రాసం కొరత, కూలీల సమస్యలకు తోడు ప్రభుత్వం నుంచి యంత్రాలపై రాయితీలు అందుతుండటంతో ట్రాక్టర్ల వినియోగం పెరిగింది. పశువుల పెంపకాన్ని రైతులు భారంగా భావించడంతో గ్రామాల్లో కాడెద్దుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా 10 నుంచి 15 మందికి మించి ఎద్దులున్న రైతులు కనిపించడం లేదు. అయితే, పత్తిలో కలుపు తీసేందుకు చిన్న, సన్నకారు రైతులకు ఎద్దులే కీలకం కావడంతో.. ఆ కొద్దిమంది రైతులకే చేతినిండా పని దొరుకుతోంది. ఎకరాకు వెయ్యి రూపాయలు.. కాడెద్దుల కొరత తీవ్రంగా ఉండటంతో అరక అద్దెలు కూడా భారీగా పెరిగాయి. పత్తిలో గుంటక తోలేందుకు గత ఏడాది ఎకరాకు రూ.800 తీసుకోగా, ఈ ఏడాది దానిని రూ.1,000కి పెంచారు. ఒక్కో రైతు రోజుకు సుమారు 3 నుంచి 4 ఎకరాల్లో గుంటక తోలుతారు. గుత్తా పద్ధతిన అయితే కనీసం మూడు ఎకరాలు పూర్తి చేస్తారు. ఈ లెక్కన కాడెద్దులు ఉన్న రైతులు రోజుకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు సంపాదిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతులకు అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అత్యాధునిక యంత్రాలు ఎన్ని వచ్చినా కాడెడ్లకే డిమాండ్ తగ్గుతున్న పశుసంపద.. ఎద్దులున్న రైతులకు చేతినిండా పని ఎకరాకు గుంటుక తోలితే రూ.1,000 రోజుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఆదాయం -
హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
కట్టంగూర్ : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. కట్టంగూర్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించి మాట్లాడారు. పెండింగ్ కేసు వివరాలను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్స్పాట్ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించడంతో పాటు ప్రజల్లో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట శాలిగౌరారం రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
తిరుగులేని సంస్థగా భారతి సిమెంట్
వలిగొండ : సిమెంట్ రంగంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపు భారతి సిమెంట్ ఎదుగుతుందని ఆ సంస్థ చీఫ్ మేనేజర్ మార్కెటింగ్ అధికారి నాగేశ్వరరావు అన్నారు. వలిగొండ మండలం మత్స్యగిరి ఆలయ సమీపంలోని ఓ రిసార్ట్‌లో మంగళవారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని అన్నారు. భారతి సిమెంట్ ఉత్పాదన 12 దేశాలలో విస్తరించిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్ సర్వీస్ చాలా వేగంగా ఉంటుందని, అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్, కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ సునీల్, మార్కెటింగ్ అధికారి రజనీకాంత్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ శ్రీధర్, డీలర్ హరిబాబు, భవన నిర్మాణ కార్మికులు నరసింహ, పోలెపాక శంకర్, శ్యామల మల్లేశం, సారయ్య, లక్ష్మణ్, మల్లేశం, రామచంద్రం, జహంగీర్, మధు పాల్గొన్నారు. -
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ‘తెలంగాణ జలసిరి’
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. భూగర్భ జలాల పెంపు, నీటి వృథా నివారణ, గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఇంటింటి ఇంకుడు గుంత, ప్రతి పొలంలో ఫామ్‌పాండ్, ప్రతి ఊరికి ఊర కుంట అనే నినాదంతో ఆరు రకాల నీటి సంరక్షణ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో కనీసంగా ఐదు ఫామ్పాండ్లు, 200 ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు అవసరమైన చోట కమ్యూనిటీ ఇంకుడు గుంతలను తవ్వించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర పెద్ద భవనాల పైకప్పులపై పడే వర్షపు నీటిని ప్రత్యేక ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించేలా రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల వర్షపు నీరు వథా కాకుండా భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుంది. డ్రెయినేజీల చివర ఇంకుడు గుంతలు గ్రామాల్లోని డ్రెయినేజీ కాలువల చివరి భాగాల్లో కూడా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయనున్నారు. మురుగునీటిని శుద్ధి ప్రక్రియ అనంతరం భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడటంతో పాటు దోమల వ్యాప్తి తగ్గి భూగర్భ జలాలు కూడా పెరగనున్నాయి. జలసిరితో నీటి భద్రతే లక్ష్యం తెలంగాణ జలసిరి కార్యక్రమం ద్వారా ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడం, భూగర్భ జలాలను పెంపొందించడం, రైతులకు సాగునీటి భద్రత కల్పించడం, గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి బహుముఖ ప్రయోజనాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఫ నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ఫ ‘ఇంటింటికీ ఇంకుడు గుంత, పొలాలకు పంట కుంట, ఊరూరా ఊరకుంట’ నినాదం ఫ ప్రతి గ్రామంలో ఐదు ఫామ్‌పాండ్స్, 200 ఇంకుడు గుంతలనిర్మాణమే లక్ష్యం ఫ భూగర్భ జలాల పెంపు.. పరిశుభ్రంగా మారనున్న పల్లెలు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి వర్షపు నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుంది. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. – శేఖర్‌రెడ్డి, డీఆర్డీఓ -
సైద్ధాంతిక ప్రమాణాలు కలిగిన ఏకై క పార్టీ బీజేపీ
హుజూర్నగర్ : దేశంలో సైద్ధాంతిక ప్రమాణాలు కలిగిన ఏకై క పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జనసంఘ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యావంతులు, దేశం కోసం పనిచేయాలనుకునే వారు ఎంతో మంది బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దేశాన్ని ఎందరో విదేశీయులు వందల సంవత్సరాలు పరిపాలించినప్పటికీ హైందవ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని మార్చలేకపోయారని పేర్కొన్నారు. విదేశీ శక్తులు మన దేశంలో రాజకీయ అస్థిరత కోసం ఫండింగ్ కూడా పంపిస్తున్నారని ఆరోపించారు. సర్ కార్యక్రమం గురించి కొన్ని పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అలాంటి వారి వల్ల దేశంలోని శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దేశ సేవ కోసం ముందుకు వచ్చే వారిని కార్యకర్తలు గుర్తించి వారిలో జాతీయ భావాన్ని పెంపొందించి, కొత్త వాళ్లను పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచన చేయాలని కోరారు. త్వరలో తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రానుందని చెప్పారు. ఈ సందర్భంగా జనసంఘ్‌లో పనిచేసిన వారిని, ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారిని, కరసేవలకు వెళ్లి జైలుపాలైన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి, ఆరోగ్య భారతి ప్రాంత సభ్యులు డాక్టర్ రంగాచార్యులు, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ అంకతి అప్పయ్య, జిల్లా నాయకులు చందా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బా భాగ్యరెడ్డి, నాయకులు కొండ హరీష్‌గౌడ్, కవితారెడ్డి, కడెం రామచంద్రయ్య, కనగాల వెంకట రామయ్య, నూనె సులోచనతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
యువ జీవితాల్లో ‘కారు’ చీకట్లు
గచ్చిబౌలి, బొమ్మలరామారం : ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని కారు ఢీకొనడంతో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలానికి చెందిన యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన ముత్యాల రవీందర్‌రెడ్డి కుమార్తె ప్రణీతరెడ్డి(20) హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే మండలం నాయకునితండాకు చెందిన కానావత్ హఠ్యానాయక్ కుమారుడు సురేందర్(22) స్వగ్రామంలోనే డెయిరీ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరు గతంలో కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల క్రితం సురేందర్ స్విఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్ వద్ద తన స్నేహితురాలైన ప్రణీతరెడ్డిని కారులో పికప్ చేసుకున్నాడు. సాయంత్రం వట్టినాగులపల్లి నియోపోలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సురేందర్, ప్రణీతరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కారు లారీ కింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. కారును క్రేన్ సహాయంతో పక్కకు తీసి మృతదేహాలను వెలికితీశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీతరెడ్డి, సురేందర్ మృతితో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్ కారు బొమ్మలరామారం మండలానికి చెందిన యువతి, యువకుడు దుర్మరణం -
ఆరుతడి పంటలు వేసుకోవాలి
రామగిరి(నల్లగొండ) : ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్వహించిన శ్రీరైతు నేస్తం 100వ ఎపిసోడ్ఙ్ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరవగా, నల్లగొండ మండలం దోమలపల్లి రైతువేదిక నుంచి కలెక్టర్, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు. దీని ప్రభావంతో నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ కాల్వలకు నీరు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. సెప్టెంబర్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీపై బిందు సేద్యం (డ్రిప్) పరికరాలను అందజేస్తోందని, రైతులు ఉద్యాన పంటలు, కూరగాయలతో పాటు సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల సాగును చేపట్టాలని కోరారు. అనంతరం కలెక్టర్ పలు గ్రామాల్లో పర్యటించారు దీపకుంటలో డ్రాగన్ ఫ్రూట్ తోటను సందర్శించి, సాగు విధానాలు, దిగుబడి, మార్కెటింగ్ అవకాశాలపై రైతులతో మాట్లాడారు. కంచనపల్లిలో కంది పంటను పరిశీలించి, సాగులో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. చర్చించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, జిల్లా హార్టికల్చర్ డీడీ శేఖర్ పాల్గొన్నారు. బీఎల్ఓల విధులను పర్యవేక్షించాలి నల్లగొండ : సర్ ప్రక్రియలో బీఎల్ఓలు చేస్తున్న పనులను తహసీల్దార్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సర్‌పై ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. వీఐపీ ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, లైసెన్స్డ్ సర్వేయర్లు ఈ నెల 25లోపు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించొద్దు
నల్లగొండ టౌన్ : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, వాటికి సహకరించినా పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. నల్లగొండలోని ఐఎంఏ హాల్లో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రైవేట్ వైద్య సంస్థ చెల్లుబాటు అయ్యే నమోదు ధ్రువీకరణతోనే సేవలు అందించాలని, కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక భద్రత, చట్టపరమైన రికార్డుల నిర్వహణ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆరోగ్య విద్య విస్తరణాధికారి అంజయ్య గౌడ్ వైద్య చట్టాలు.. వాటిని ఉల్లఘిస్తే జరిగే పరిణామాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.నగేష్, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్, కార్యదర్శి డాక్టర్ విజయ్‌కుమార్, కె.ప్రవీణ్, వసంతకుమారి, ఎ.పుల్లారావు, పివిఎన్.మూర్తి పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతంమిర్యాలగూడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక ఓంకార్ స్పష్టం చేశారు. మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్య, వైద్యం, ఆర్థిక వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలను విస్మరిస్తోందని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, మోర్తాల చందర్రావు, చంద్రశేఖర్, వస్కుల మట్టయ్య, కుంభం సుకన్య, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, సంగతి సాంబయ్య, వరికుప్పల వెంకన్న, అరుణ్‌కుమార్, హంసారెడ్డి, తిరుపతి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సంస్థాగత కమిటీ నియామకాలు నల్లగొండ టూటౌన్ : బీజేపీ సంస్థాగత కమిటీలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి ఉదయ్ ప్రతాప్ జీ ఆమోదంతో ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా వరికుప్పల గిరి, సోషల్ మీడియా కన్వీనర్‌గా కర్నాటి శివ, బీజేపీ చండూరు పట్టణ అధ్యక్షుడిగా బత్తురాజు శ్రీహరిని నియమించారు. ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. -
గురువు స్థానం అత్యున్నతమైనది
నకిరేకల్ : భారతీయ సంస్కృతిలో గురువు స్దానం అత్యున్నతమైనదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని ఐశ్వర్య సాయి మందిరంలో మంగళవారం సాయంత్రం వ్యాస మహర్షి గొప్పతనం, చతుర్వేదాలపై ఆయన తన ప్రవచనాలను భక్తులకు వినిపించారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే శక్తి గురువుకు ఉందన్నారు. మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలను మానవాళికి అందించిన వేద వ్యాసుడే జగద్గురువని పేర్కొన్నారు. అందుకే ఆయన జన్మదినమైన గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటామని వివరించారు. శ్రీసాయి లీలామతం భక్తి మార్గమన్నారు. షిర్డీ సాయిబాబా అవతార విశేషాలను, ఆయన అందించిన శ్రద్ద విశ్వాసం, ఓర్పు, సందేశాలను భక్తులకు వివరించారు. సాయిబాబా చూపిన సమతా భావం, మానవతా దృక్పథం నేటి సమాజానికి ఎంతో ఆదర్శమన్నారు. సమాజంలో ప్రతిఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఈ సందర్బంగా ఐశ్వర్యసాయి మందిరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి దాచేపల్లి శ్రీనివాస్, గోదాదేవి, దాచేపల్లి సాకేత్‌కుమార్ భావన సహకరించారు. ఈ కార్యక్రమంలో సాయి మందిరం ట్రస్ట్ చైర్మన్ తొనుపునూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, కోశాధికారి బాణాల రాంరెడ్డి, మాజీ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు, ఆలయ పూజారి దుర్గి మురళీధర్ శర్మ, ట్రస్ట్ ప్రతినిధులు రాపోలు రఘునందన్, మంజుల, నోముల గోవిందరాజులు, వలిశెట్టి స్వప్న, బ్రహ్మదేవర వేణు, ఉప్పల వెంకటరమణ, వలిశెట్టి భిక్షమయ్య, ద్యాస పద్మ, కందగట్ల మమత, సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు -
వర్మీ కంపోస్ట్‌తో భూమికి ఎంతో మేలు
గుర్రంపోడు : హరిత విప్లవం పుణ్యమా అని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటి ద్వారా దిగుబడి సాధించే క్రమంలో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పెంచారు. కాలక్రమంలో వాటి దుష్ఫలితాలను గ్రహించి, తిరిగి సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేసుకోవడం రైతులకు ఎంతో లాభదాయకం. దీని తయారీ విధానంపై అనుముల ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి అందిస్తున్న సూచనలు ఆయన మాటల్లోనే.. వ్యర్థాల నుంచే నాణ్యమైన ఎరువు.. వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో తయారయ్యే వర్మీ కంపోస్టును అత్యుత్తమ సేంద్రియ ఎరువుగా చెప్పవచ్చు. పాక్షికంగా కుళ్లిన వ్యర్థాలను వానపాములు తిని, విసర్జించిన పదార్థాన్నే వర్మీ కంపోస్టు అంటారు. తయారీ విధానం ఇలా..u అందుబాటులో ఉన్న స్థలం, వ్యర్థాలను బట్టి 3 అడుగుల వెడల్పు, కావలసినంత పొడవుతో బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. u వర్షం, నేరుగా పడే సూర్యరశ్మి, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ కోసం బెడ్లపైన తాటాకుల పందిరి లేదా రేకులతో కప్పు నిర్మించాలి. u బెడ్ అడుగు భాగంలో సిమెంట్ ఫ్లోర్ లేదా పేడతో గట్టిగా అలికిన నేల ఉండేలా చూసుకోవాలి. u ముందుగా అడుగు భాగం నుంచి 10సెం.మీ. ఎత్తు వరకు పాక్షికంగా కుళ్లిన వ్యర్థాలను వేసి, పలుచగా నీరు చల్లాలి. ఆ తర్వాత 15 నుంచి 30 సెం.మీ. మందంతో సేంద్రియ వ్యర్థాలు, కుళ్లిన కూరగాయలు తదితరాలను వేయాలి. దీనిపైన మరోసారి నీరు చల్లి, వరిగడ్డి లేదా పాత గోనె సంచులతో కప్పి ఉంచాలి. u ప్రతిరోజూ కొద్దిగా నీరు చల్లుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత చదరపు మీటరుకు 1,000 వానపాముల చొప్పున వదలాలి. మధ్యమధ్యలో బెడ్‌ను నెమ్మదిగా కదిలిస్తూ ఉండాలి. u బెడ్లో వేసిన వ్యర్థాలు తేలికగా, నల్లగా, వాసన లేకుండా మట్టిలా మారితే వర్మీ కంపోస్టు తయారైనట్లు గుర్తించాలి. ఈ దశలో నీరు చల్లడం ఆపేస్తే.. వానపాములన్నీ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఆ తర్వాత పైన ఉన్న ఎరువును జల్లెడ పడితే నాణ్యమైన వర్మికంపోస్టు లభిస్తుంది. కింద మిగిలిన వానపాములను మరో బెడ్‌లోకి మార్చుకోవచ్చు. u సేంద్రియ వ్యర్థాలు వేసేటప్పుడు అందులో ప్లాస్టిక్ కవర్లు, గాజు పెంకులు లాంటివి లేకుండా చూసుకోవాలి. u బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.వర్మీ కంపోస్టుతో ఉపయోగాలుu నేలలో సేంద్రియ కర్బనం శాతం పెరుగుతుంది. u భూమి భౌతిక, రసాయన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. u భూసారాన్ని పరిరక్షిస్తూ, పంట ఉత్పాదకతను పెంచుతుంది. u భూమిలో గాలి ప్రసరణ, తేమను నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. u మొక్కలు పోషకాలను సులభంగా గ్రహించేందుకు తోడ్పడుతుంది. u పండ్ల తోటల్లో అయితే చెట్టుకు 5 కిలోలు, పూల కుండీల్లో 250 గ్రాముల చొప్పున ఈ ఎరువును వాడుకోవచ్చు. అనుముల ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి సూచనలు -
నాలుగు బుట్టల్లో..
చెత్త సేకరణ.. ఫ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కేంద్రం అడుగులు ఫ ముందుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఫ ఆగస్టు నుంచి నూతన విధానం అమలు మిర్యాలగూడ : పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకుగాను ఇక నుంచి నాలుగు రకాల బుట్టల్లో చెత్త సేకరించనున్నారు. అన్ని వ్యర్థాలు ఒకేచోట ఉండడం, డంపింగ్ యార్డులో తగులబెట్టడంతో విషవాయువులు ప్రబలి సమీప ప్రాంతాల వారు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ –2026కు అనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రతి ఇంటికి నాలుగు బుట్టలు అందజేయనున్నారు. చెత్తను తడి, పొడి, శానిటరి వేస్ట్, ప్రమాదకరమైన వ్యర్థాలుగా విభజించి నాలుగు బుట్టల్లో సేకరించనున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, 869 గ్రామపంచాయతీలో కార్యక్రమం అమలు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు బుట్టల ప్రతిపాదనతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలుగనుంది. పర్యావరణాన్ని కాపాడేలా.. జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రస్తుతం తడి, పొడి చెత్త కలిపి ఇవ్వడంతో పర్యావరణానికి హాని కలుగుతుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు బుట్టల ద్వారా ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి అందించాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త, శానిటరీ, ఎలక్ట్రికల్ వ్యర్థాలు, హానికర చెత్తను సేకరించిన అనంతరం డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువు, పొడి చెత్తను స్క్రాప్ డీలర్లకు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీ, పంచాయతీకి వినియోగించనున్నారు. శానిటరి వ్యర్థాలను ప్రజలకు దూరంగా డంప్ చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. హనికరమైన వ్యర్థాలను ప్రత్యేక విధానంలో పారబోయనున్నారు. చెత్త సేకరణకు సైతం మున్సిపాలిటీ వాహనాలు నాలుగు భాగాలుగా చేసి ఆ వ్యర్థాలను అందులో వేసుకుని డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు.. పట్టణాల్లో, గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకుగాను ప్రథమంగా ఒక వారం పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటివారంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ప్లాస్టిక్ కవర్లను తగ్గించేందుకు ఇంటి నుంచే గన్ని బ్యాగులు, టిఫిన్ బాక్స్‌ల ద్వారా మాంసం, టిఫిన్లు తదితర గృహ అవసరాల నిమిత్తం అందులోనే తీసుకురావాలి. గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ప్లేట్లు, గ్లాస్‌లకు బదులుగా స్టీల్ ప్లేట్లు జగ్గులు, గ్లాస్లు వాడాలని అవగాహన కల్పిస్తారు. ఆకుపచ్చ బుట్టలో తడి చెత్త అయిన వంటింటి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, ఆహార అవశేషాలు, పూలు, టీ, కాఫీ పొడులు (వీటిని కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు) నీలం బుట్టలో పొడి చొత్త అయిన ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహ పదార్థాలు (వీటిని రీసైక్లింగ్‌కు పంపిస్తారు) ఎరుపు రంగు బుట్టలో శానిటరి ప్యాడ్లు, డైపర్లు, వైద్య చికిత్సకు వాడిన వస్తువులు, వీటిని పేపర్‌తో కప్పి ఇవ్వాలి. (వీటిని సురక్షితంగా నాశనం చేస్తారు) నలుపు రంగు బుట్టలో రసాయనాలు, హానికర వ్యర్థాలైన బల్బులు, బ్యాటరీలు, మందులు, ఈ– వేస్ట్, పంచ్ స్ప్రేలు, పెయింట్లు తదితరాలు (వీటిని ప్రత్యేక విధానంలో పారబోస్తారు) -
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారుల దాడులు
● 180 కేజీల నల్లబెల్లం, 40 కేజీల పటిక స్వాధీనం కొండమల్లేపల్లి : మండల పరిధిలోని మేఘ్యతండా, పన్నితండా, ఆంగోత్తండా, కేశ్యతండా, దేవరకొండ మండలంలోని మర్రిచెట్టుతండాలలోని గుడుంబా స్థావరాలపై మంగళవారం దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 180 కేజీల నల్లబెల్లం, 40 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నారు. నాలుగు లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇద్దరిని అరెస్టు చేసి, ముగ్గురిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో నల్లగొండ ఎకై ్సజ్ ఎస్ఐ, నాంపల్లి ఎకై ్సజ్ ఎస్ఐ, దేవరకొండ ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి రవాణా కేసులో ఇద్దరికి జైలు శిక్షఖమ్మంలీగల్ : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో సూర్యాపేటకు చెందిన ఆలేటి గణేష్, బట్టు హరీష్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పుల్లబత్తుల పొగడ కృష్ణఅర్జున్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు.. 2022 ఏప్రిల్ 10న ఖమ్మం కొత్త బస్టాండ్ వద్ద అప్పటి ఖమ్మం–1 ఎకై ్సజ్ సీఐ రాజు, ఎస్సైలు రవి, షేక్ రబ్బానీ తనిఖీ చేపట్టారు. ఈక్రమాన ద్విచక్ర వాహనంపై ఏడు కేజీల గంజాయి తరలిస్తూ సూర్యాపేటకు చెందిన కానుక్కుర్తి సాయినవీన్, నేరెళ్ల శ్రీరాములు, గణేష్, హరీష్ పట్టుపడ్డారు. కేసును ఎకై ్సజ్ అధికారులు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ ధాఖలు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం సాయినవీన్, శ్రీరాములుకు పదేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 12న న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. అయితే, అప్పుడు పరారీలో గణేష్, హరీష్‌కు సైతం అదే శిక్ష విధిస్తూ న్యాయమూర్తి పొగడకృష్ణ అర్జున్ మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరుపున ఏపీపీ జమ్ముల శరత్‌కుమార్‌రెడ్డి వాదించారు. ఆదర్శ రైతు పద్మారెడ్డికి ఘన సన్మానం చందంపేట : కుంకుడు రైతుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన పద్మారెడ్డి తన వ్యవసాయ భూమిలో కుంకుడుతో పాటు 40 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా ఉన్న ఐసీఏఆర్–కేంద్ర సిట్రస్ పరిశోధనా సంస్థ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మజాతి (సిట్రస్) పంటల అభివృద్ధికి శ్రమించిన రైతులను సత్కరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సిట్రస్ సాగులో పద్మారెడ్డి విశిష్ట సేవలను గుర్తిస్తూ నాగపూర్‌లోని ఐకార్ కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అకోలాలోని పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ వైస్ చాన్స్‌లర్ శరద్ ఆర్ గడఖ్ చేతుల మీదుగా పద్మారెడ్డి ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయన క్షేత్రంలో ఉన్న 40 ఏళ్ల నాటి బత్తాయి తోట దేశంలోనే ఓ రికార్డు కావడం విశేషం. -
‘రిజిస్ట్రీ’కి రైతుల వెనుకడుగు
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రిజిస్ట్రీ ప్రారంభించి 14 నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటి వరకు 70 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డులో 11 అంకెల యూనిక్ ఐడీ కేటాయించనుంది. కేంద్ర పథకాలకు యూనిక్ నంబర్ తప్పని సరి జిల్లాలో 5,68,711 మంది రైతులకు గాను.. 3,90,786 మంది రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఇంకా 1,77,925 మంది రైతులు నమోదు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్‌కార్డ్, ఫసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి. భవిష్యత్‌లో ఎరువులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఈ నెల 31 వరకు గడువు ఉన్నందున రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ కోరుతుంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. దీంతో రైతుల భూముల వివరాలు, నేల స్వభావం, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలు ఇలా రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. వివరాలన్నీ ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తుండడంతో ఒక్క క్లిక్‌తో రైతుల వివరాలు చూసే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ 70 శాతమే.. ఫ ప్రభుత్వ పథకాలు అందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి ఫ 31తో ముగియనున్న గడువు ఫార్మర్ రిజిస్ట్రీ వివరాలుమొత్తం రైతులు 5,68,711 మంది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నవారు 3,90,786 చేసుకోనివారు 1,77,925 -
పాడి పరిశ్రమతోనే అధిక లాభాలు
డిండి : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా పశుపోషణలో రైతులు మెలకువలు పాటించాలని జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రమేష్ సూచించారు. మంగళవారం డిండి మండల పరిధిలోని గోనకొల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులోఆయన మాట్లాడారు. వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పశువైద్యాధికారులు ధనలక్ష్మి, నాగయ్య రైతులకు పలు సూచనలు చేసి ఉచితంగా ఖనిజ లవణ మిశ్రమాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజేందర్‌రెడ్డి, రవి, తేజునాయక్, విజయేందర్‌రెడ్డి, రైతులు రాములు, రాకేష్‌రెడ్డి, నిరంజన్, చంద్యానాయక్, శివ, జనార్దన్‌రెడ్డి, లక్ష్మయ్య, గోపాల మిత్రలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ బకాయిల వసూళ్లలో మొదటి స్థానం
చిట్యాల: విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం చిట్యాల మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మూడు రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలనివ్వడంతో, నల్లగొండ డివిజన్‌లోనే చిట్యాల మొదటి స్థానంలో నిలిచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. చిట్యాల మండల వ్యాప్తంగా సుమారు 55 లక్షల రూపాయలకుపైగా, చిట్యాల మున్సిపాలిటీలో రూ.21 లక్షల 70 వేల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఎస్ఈ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టి, బకాయిల వసూలుకు ఇన్‌చార్జ్‌లను నియమించి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిట్యాల మండలంలో ఈ నెల 23, 24, 27 తేదీల్లో బకాయిల వసూలు ఇన్చార్జ్, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి కె.భిక్షపతి కార్యాచరణ చేపట్టారు. చిట్యాల మున్సిపాలిటీలో మూడు రోజుల్లోనే 11 లక్షల 60 వేల రూపాయల విద్యుత్ బకాయిలను వసూలు చేశారు. సోమవారం ఏడీఏ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో లైన్మెన్ ఈశ్వర్ వినియోగదారులను స్వయంగా కలిసి బకాయిలు వసూలు చేశారు. -
సబ్స్టేషన్లను ఆధునీకరిస్తాం
నిడమనూరు : విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సబ్స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి సబ్‌స్టేషన్‌లో సోమవారం ఆయన రికార్డులను, బ్రేకర్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు. కొత్తగా తుమ్మడం సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిచామని, స్థలం కేటాయిస్తే, వెంటనే నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో రైతుల నుంచి ఎవరైనా వసూళ్లకు పాల్పడితే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట డీఈ శ్రీనివాస్‌చారి, సబ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఉన్నారు. -
ఉద్యమకారుల ఎంపికను ప్రారంభించాలి
రామగిరి (నల్లగొండ) : తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ.. ఉద్యమకారుల ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, దక్షిణ తెలంగాణ ఇన్చార్జి తోట నరసింహాచారి, రాష్ట్ర కార్యదర్శి కర్ణ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, చర్చలు, సమావేశాల పేరిట కాలయాపన చేస్తోందన్నారు. టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరికొండ మధు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తలారి యాదగిరి, చెంగలి జంగయ్య, రేకల భిక్షం, ప్రకాష్, కట్ట శ్రీనివాస్, చంద్రయ్య, కత్తుల దాస్, శ్రీనివాస్, కృష్ణ, నగేష్, అప్పారావు, రాజు పాల్గొన్నారు. -
కాన్పుకెళ్తే కోతే..
ఐదేళ్లలో ప్రసవాల వివరాలు ఇలా.. సంవత్సరం ఆసుపత్రి సిజేరియన్ సాధారణం 2022–23 ప్రభుత్వ 7877 5714 ప్రైవేటు 8234 1846 2023–24 ప్రభుత్వ 6195 6025 ప్రైవేటు 7904 1723 2024–25 ప్రభుత్వ 5505 5071 ప్రైవేటు 7938 1812 2025–26 ప్రభుత్వ 5760 4309 ప్రైవేటు 7763 1652 2026–27 ప్రభుత్వ 1592 1228 (ఇప్పటివరకు) ప్రైవేటు 1696 317 నల్లగొండ టౌన్ : జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నప్పటికీ సిజేరియన్లకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యుల నిర్లక్ష్య వైఖరితో పాటు త్వరగా పని ముగించాలనే ధోరణితో సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా.. సిజేరియన్లనే చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో అలాంటి పరిస్థితులు కనపడటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్‌లో ఇష్టారాజ్యం.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోపంతో పాటు ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన మాస్ మీడియా విభాగం ఉన్నప్పటికీ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ప్రైవేట ఆసుపత్రుల్లో సాధారణ కాన్పుకై తే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు, సిజేరియన్ చేస్తే రూ.60 వేల వరకు బిల్లులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు అయితే బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు దంపతులు తమ బిడ్డ మంచి ముహూర్తాల్లో జన్మించాలని, ఇంకొందరు పురిటి నొప్పులు భరించలేరనే భావంతో ఉండడం ప్రైవేట్ ఆసుపత్రులకు కలిసి వస్తోంది. బిడ్డ ఉమ్మ నీరు తాగి ప్రాణా పాయ స్తితిలో ఉన్నప్పుడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే సీజేరియన్ చేయాలనే నిబంధనలు ఉన్నా.. ఎక్కడా అమలు కావడం లేదు. సీజేరియన్ వల్ల తల్లి ఆరో గ్యం త్వరగా దెబ్బతినడమే గాక బిడ్డపై ప్రభావం పడుతుందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. ఫ సిజేరియన్లకే వైద్యుల మొగ్గు ఫ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అదే తీరు ఫ తగ్గిన సాధారణ ప్రసవాలుఆసుపత్రులలో తప్పనిసరిగా సాధారణ ప్రసవాలకే మొగ్గు చూపాలి. నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్ చేస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. – డాక్టర్ కె.రాహుల్, డీఎంహెచ్ఓ -
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డీఈఈసెట్ స్పాట్ కౌన్సిలింగ్రామగిరి(నల్లగొండ) : డీఈఈసెట్ – 2026 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఎల్ఈడీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సిలింగ్ ఫేజ్ – 2 నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహ తెలిపారు. నల్లగొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో మిగిలిన 2 సీట్ల భర్తీ కోసం ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 30న సంబంధిత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తారని వెల్లడించారు. కళాశాలల వారీగా ఖాళీ సీట్ల వివరాల కోసం అభ్యర్థులు డీఈఈసెట్ 2026 అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాంనార్కట్పల్లి : అమరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దామని అరుణోదయ సాంస్క్రతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. సోమవారం నార్కట్‌పల్లి మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో పజ్జూరి కృష్ణారెడ్డి, భరత్, రాజుల వర్థంతుల సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ప్రభుత్వాలను విమర్శించే ప్రతి ఒక్కరిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. అమెరికాతో భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొమ్మకంటి కొమురయ్య, ఇప్ప రామకృష్ణ, బంటు రామలింగయ్య, గొండ్యాల సైదులు, పల్లెబోయిన జానీ, బొడ్డు నాగరాజు, బాలస్వామి, గోపి, మామిడి ఎల్లయ్య, బాబు, లింగయ్య, మల్లేష్, వెంకన్న, రాము, లింగయ్య, బుచ్చయ్య, వెంకన్న, సత్తయ్య, ఉపేంద్ర, పోతుల రమేష్, రాకేష్ పాల్గొన్నారు. సమ్మె ఒప్పందాలను అమలు చేయాలిరామగిరి(నల్లగొండ) : ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడంతో పాటు పెండింగ్ అలవెన్సులు, పీఆర్సీ ఏరియర్స్, సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని సీఐటీయూ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కోశాధికారి కె.ఎస్.రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కుదిరిన ఒప్పందాలను ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని కోరారు. 2026 మే 21న జరిగిన చర్చల ప్రకారం అలవెన్సులను 80 శాతం పెంచి, ఈ జూలై జీతాల నుంచే చెల్లించాలి. కార్యక్రమంలో డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, సీఐటీయూ నల్లగొండ పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, ఫెడరేషన్ రీజియన్ ఉపాధ్యక్షులు కె.చంద్రమౌళి, శ్యాంసుందర్, సిహెచ్.రేవతి, పి. వెంకటేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 119 దరఖాస్తులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు 77, ఇతర శాఖలకు సంబంధించి 42 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల నెలవారీ ప్రగతి నివేదికలను ఆగస్టు 3లోగా జిల్లా ప్రణాళిక అధికారి (సీపీఓ)కి సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ–సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, భూ– భారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములను గుర్తించి పరిరక్షించే చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డిప్యూటీకలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో ‘బిల్ వన్’
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీలోని ప్రజలకు పన్నుల చెల్లింపు సేవలు సులభతరం చేసేందుకు పురపాలక శాఖ నూతన సాంకేతిక పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు వేర్వేరుగా చెల్లించే ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ రుసుమును ఒక్కటిగా కలిపి ఒకే వేదికపై చెల్లించేలా బిల్వన్ పేరుతో కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఇటీవల హైదరాబాద్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవి లాంఛనంగా ప్రారంభించగా ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో బిల్ వన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి మూడు బిల్లులు చెల్లించేలా.. గతంలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటే వేర్వేరు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చేది. కొత్తగా తెచ్చిన ‘బిల్ వన్’ ఏకీకృత విధానంతో మూడు రకాల బకాయిలు ఒక్క సమాచారంతోనే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. ఏకకాలంలోనే చెల్లించే వెసులుబాటు కలగడంతో వినియోగదారులకు సమయం, శ్రమ ఆదా కానున్నాయి. వాయిదాల సదుపాయం.. శ్రమ తగ్గిన సిబ్బంది ఏకీకృత బిల్లు మొత్తం ఒకేసారి చెల్లించడం భారం అనుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే, నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే నిబంధనల ప్రకారం పన్నుపై వడ్డీ భారం పడనుంది. మరోవైపు ఈ విధానం వల్ల మున్సిపల్ సిబ్బందికి కూడా ఊరట లభించింది. గతంలో ఒక్కో బిల్లు వసూలు కోసం వేర్వేరుగా ఇంటింటికి లేదా దుకాణాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇకపై ఒకేసారి ప్రక్రియ పూర్తి కానుందని అంటున్నారు. దీంతో మిగిలిన సమయాన్ని పట్టణ పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులకు వినియోగించే అవకాశం లభించింది. ఆన్లైన్లో చెల్లించే విధానం ఇలా.. ● తెలంగాణ పురపాలక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని బీఎల్వన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ● మీ ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా అసెస్మెంట్కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ● సెల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయగానే, సదరు ఆస్తి లేదా షాపునకు సంబంధించిన ఆస్తి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయిల సమగ్ర వివరాలు కనిపిస్తాయి. అక్కడి నుంచే నేరుగా డిజిటల్ విధానంలో చెల్లింపు పూర్తి చేయవచ్చు. ఫ ఒకేసారి ఇంటి పన్ను, నల్లా బిల్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపు ఫ పన్నుల చెల్లింపు సులభతరం చేసేలా కొత్త విధానం -
మద్దతు ధర కల్పించడంలో విఫలం
మిర్యాలగూడ : రైతులు పండించే పంటలకు మద్తు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని అన్నారం గ్రామంలో నాట్లు వేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన నల్లగొండలో నవంబర్ నెలలో రైతు సంఘం జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ సభలకు రైతులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మంగారెడ్డి, రవినాయక్, అప్పారావు, కాంతారెడ్డి, ఉమాకాంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కోటిరెడ్డి, బెనర్జీ, కన్యానాయక్, తదితర రైతులు పాల్గొన్నారు. -
1.80 ఓట్లు తొలగింపే!
లక్షల నల్లగొండ, మిర్యాలగూడ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ చివరి దశకు చేరింది. ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్ఓలకు అందిచేందుకు ఆగస్టు 3వరకు గడువు ఉండగా.. ఆలోగానే డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఇప్పటి వరకు జిల్లాలో 87.93 శాతం ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ఫారాలు తిరిగి తీసుకోవడంతో పాటు వాటిని ఆన్లైన్ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. కొందరికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో రెండు చోట్లా ఓట్లు ఉండడంతో వాటిని సరిచేసి ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే ముసాయిదా జాబితాలోంచి సుమారు 1.80 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 13,33,184 మంది వివరాలు డిజిటలైజేషన్ జిల్లాలో 15,16,253 మంది ఓటర్లలో 13,33,184 మంది (87.93శాతం) వివరాలను బీఎల్వోలు ధ్రువీకరించారు. ఈ ప్రక్రియలో వేలాది మంది ఓటర్లు మరణించడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారడం, మరోచోట ఓటు నమోదు చేసుకోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా పరిశీలించిన వివరాల ప్రకారం 30,169 మంది ఓటర్లు మరణించినట్లు, 67,412 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు గుర్తించారు. అలాగే 15,047 మంది ఇప్పటికే మరోచోట ఓటర్లుగా నమోదు అయ్యారు. వీరితో పాటు 3,223 మంది అసలు రెమ్యునరేషన్ ఫారం తీసుకునేందుకు ఇళ్ల వద్దే లేరు. 218 మంది ఇతర కారణాల కింద నమోదయ్యారు. మరో 67,000 మంది రెమ్యురేషన్ ఫారాలు ఇంకా తిరిగి ఇవ్వలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్నింటిని పరిశీలించి ఈ ఓట్లను తొలగించే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ముందంజ జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు నియోజవర్గాలు ఉండగా అందులో ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టడంలో నాగార్జునసాగర్ ముందంజలో ఉంది. ఆ ప్రాంతంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలు ఉండడం వల్ల సర్ ప్రక్రియలో విజయవంతంగా సాగింది. రెండవ స్థానంలో నకిరేకల్ నియోజకవర్గం ఉంది. మూడవ స్థానంలో మిర్యాలగూడ, నాలుగవ స్థానంలో దేవరకొండ, ఐదవ స్థానంలో నల్లగొండ, ఆరవ స్థానంలో మునుగోడు ఉన్నాయి. మ్యాపింగ్ ప్రక్రియలో ఇబ్బందులు సర్ ప్రక్రియ మొదలైన తరువాత 2002, 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంది. 2002లో ఓటర్ల పేర్లు తప్పులు దొర్లడం వల్ల ఇప్పుడున్న ఓటర్లు ఆ ఓటును మ్యాపింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్ఓలకు సరైన అవగాహన లేకపోవడంతో తప్పుల తడకగా ఆన్లైన్ మ్యాపింగ్ చేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై ఎన్నికల, రెవెన్యూ శాఖ అధికారులు సమగ్రంగా ఓటర్ల జాబితాను డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. 12 మండలాల్లో 90శాతం పూర్తి.. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో గల 37 మండలాల్లో అత్యధికంగా 90 శాతం డిజిలైజేషన్ ప్రక్రియ 12 మండలాల్లో పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మాడుగులపల్లి(నాగార్జునసాగర్ పరిధి) 94.98, గుడిపల్లిలో 91.04, గుర్రంపోడులో 90.48, , నిడమనూరు 90.35, తిరుమలగిరి(సాగర్) 91.31, మాడుగులపల్లి(మిర్యాలగూడ) 91.89, వేములపల్లి 91.89, చండూరు 92.43, గట్టుప్పల్ 91.04, మునుగోడు 91.88, చిట్యాల 92.33, కట్టంగూరులో 92.10 ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయింది. జిల్లాలో 87.93 శాతం పూర్తయిన సర్ ప్రక్రియ ఫ ఎన్యుమరేషన్ పూరించి ఇవ్వనివారు 67 వేల మంది ఫ ఫారాలు ఇచ్చేందుకు వచ్చే నెల 3 వరకు గడువు ఫ అన్నీ పరిశీలించి ముసాయిదా జాబితా సిద్ధం చేయనున్న అధికారులువివరాలు ఇలా.. మొత్తం ఓటర్లు 15,16,253డిజిటలైజేషన్ 13,33,184 (87.93%) మృతులు 30,169 శాశ్వతంగా వలసలు 67,412డబుల్ ఓటర్లు 15,047శాశ్వతంగా షిఫ్ట్ అయినవారు, మృతుల వివరాలు ఇలా.. నియోజవర్గం శాశ్వతంగా షిఫ్ట్ మృతులు నల్లగొండ 14,393 4,087 నాగార్జునసాగర్ 13,531 3,511 నకిరేకల్ 11,164 6,445 దేవరకొండ 10,810 6,911 మిర్యాలగూడ 10,169 4,837 మునుగోడు 7,345 4,378 -
న్యాయం చేయండి లేదా కారుణ్య మరణానికి అనుమతించండి
ఫ ఆర్డీఓకు వృద్ధురాలి వినతి వేములపల్లి : తమ ఆస్తి తమకు అందేలా న్యాయం చేయండి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు గగ్గినపల్లి అనసూయ సోమవారం ప్రజావాణిలో మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డికి వినతిపత్రం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. గగ్గినపల్లి అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా ఇద్దరికి తమ భూమిని సమానంగా పంచి వృద్ధాప్య వైద్య ఖర్చుల కోసం, తమ జీవనోపాధి కోసం 3.11ఎకరాల భూమిని ఉంచుకుని తమ బాధ్యతలు చూసుకుంటున్న మనుమడికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిలో తమకు వాటా కావాలంటూ పెద్ద కుమారుడు, కోడలు, వారి కుమారుడు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. కదల్లేని స్థితిలో వీల్ చైర్లో ఉన్న తన భర్త బుచ్చిరెడ్డిపై గతంలో చెప్పుతో దాడి చేయగా కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాలేదు. నాటి నుంచి కేసును ఉపసంహరించుకోవాలని లేకపోతే ట్రాక్టర్‌తో తొక్కి చంపుతామంటూ బెదిరిస్తుండడంతో వేములపల్లి పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని ఆర్డీఓను వేడుకున్నారు. -
కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!
గ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు.. కానీ వారి లక్ష్యాలు మాత్రం ఆకాశాన్ని దాటాయి. దేశ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘విక్రమ్–1’ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికుడి కుమారుడైన నార్కట్‌పల్లికి చెందిన ప్రజ్ఞాపురం వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా వ్యవహరించగా.. సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడి బిడ్డ, సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంధం లక్ష్మీనాథ్ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ ఇంజనీర్‌గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. డీఆర్డీవోలో విశేష అనుభవం గడించి, ప్రస్తుతం స్కైరూట్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఈ యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం.నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞాపురం రవి వెంకట్‌పటేల్, సృజన దంపతుల కుమారుడు వంశీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో వంశీ క్యాడ్ ఇంజనీర్‌గా తన వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సుమారు నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి, వివిధ హోదాల్లో పని చేసి సాధించిన ఈ చరిత్రాత్మక ఘటనలో నిపుణులైన బృందంతో పాటు వంశీ కూడా భాగస్వామి కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. వంశీ తండ్రి రవి వెంకట్‌పటేల్ ఆర్టీసీలో కండక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించి, స్క్వాడ్ ఇన్చార్జ్గా ఉద్యోగ విరమణ పొందారు. వంశీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను నల్లగొండలోనే ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ (2014) పూర్తి చేశారు.డీఆర్డీవో నుంచి స్కైరూట్ వరకు..బీటెక్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)లో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ద్రవ చోదక వ్యవస్థ (లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్) విభాగంలో ఇంటిగ్రేషన్, డిజైన్ పనుల్లో సంపాదించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2025 జనవరి 2న హైదరాబాద్‌కు చెందిన ‘సై్కరూట్ ఏరోస్పేస్’ ప్రైవేట్ సంస్థలో క్యాడ్ ఇంజనీర్‌గా చేరారు. ఆ అనుభవంతోనే ‘విక్రమ్–1’ రాకెట్ తయారీలో క్యాడ్ ఇంజనీర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి, రాకెట్ విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లోనూ సేవలందించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు.ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్ కేబుల్ హెర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్.. తండ్రి స్థానిక ఓ సిమెంట్ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్ వరకు స్థానిక సీతా పబ్లిక్ స్కూల్లో చదివిన లక్ష్మీనాథ్.. ఇంటర్, బీటెక్ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. బీటెక్ తర్వాత డీఆర్డీఓలో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు.స్కైరూట్ ఏరోస్పేస్లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్–1 (మిషన్ ఆగమన్)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్ పేర్కొన్నారు. -
చెర్వుగట్టు.. అగ్నిగుండం!
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. 17 దుకాణాలు దగ్ధంనార్కట్పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు అగ్నిగుండంగా మారింది. ఆదివారం తెల్లవారు జామున పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు ఎదురుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణా సముదాయంలో ఓ షాపు ఎదుట ఉన్న రేకుల షెడ్డుకు కరెంటు స్తంభం నుంచి వచ్చే తీగల ద్వారా షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మంటలు అంటుకుని మొత్తం 17 దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.3కోట్ల ఆస్తి నష్టం కలిగింది. కళ్లెదుటే ప్లాస్టిక్ సామగ్రి బుగ్గిపాలవుతుండడంతో షాపుల నిర్వాహకులు ఏమీ చేయలేదని నిస్సహాయ స్థితిలో మిగిలారు. తెల్లవారుజామున ఓ వ్యక్తి గమనించడంతో..రంగా శ్రవణ్ అనే దుకాణాదారుడు ఆదివారం తెల్లవారు జామున మూత్రవిసర్జన కోసం లేచాడు. షాపు ఎదుట బొమ్మల సామగ్రికి మంటలు చెలరేగడం గమనించాడు. తక్షణమే ఇంటి వెనకాల ఉన్న వారికి ఫోన్ చేసి నిచ్చెన సాయంతో బయటికి వచ్చారు. ఆ దుకాణం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వారు వెనుక నుంచి బయటకు వచ్చేశారు. వరాల సతీష్ అనే వ్యక్తి సర్పంచ్ నేతగాని కృష్ణ, పలువురి దుకాణదారులకు విషయం తెలపడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు, ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సుధాకర్, ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాదారులను అప్రమత్తం చేశారు. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే దుకాణల్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జేసీ ప్రేమ్‌కుమార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులందరికీ తక్షణ సాయంగా ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొరాయించిన ఫైరింజన్చెర్వుగట్టులో ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం ఇచ్చిన 45 నిమిషాలకు నల్లగొండ నుంచి వచ్చిన ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో ఫైరింజన్ మొరాయించింది. అప్పటికే మంటలు ఎక్కువై సమీపంలో ఉన్న అన్ని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. తక్షణమే నకిరేకల్, రామన్నపేట నుంచి వచ్చిన ఫైరింజన్‌తో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. 30 ఫీట్లు ముందుకు జరగడం వల్లే ప్రమాదం! గ్రామ పంచాయతీ నుంచి లీజుకు తీసుకున్న షటర్ నుంచి దుకాణాదారులు దాదాపు 30 ఫీట్లు ముందుకు రేకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో కరెంట్ స్తంభం నుంచి షాపులకు వచ్చిన కరెంట్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రథమంగా రేకుల షెడ్డులో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కవర్లకు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్ల ఆస్తి.. కట్టుబట్టలతో మిగిలిన బాధితులు కళ్లెదుటే బుగ్గిపాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత తెల్లవారకముందే.. కాలిపోయిన కలలుఅధికారుల నిర్లక్ష్యం వల్లే షాపులు దగ్ధం బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. సంఘటన జరిగిన వెంటనే ఫైరింజన్ సిబ్బంది, పోలీసులు సంఘటనా చేరుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ఫైరింజన్ సకాలంలో రాకపోవడం, తీరా వచ్చాక ఫైరింజన్ మొరాయించడంతో ప్రమాదం నష్టం భారీగా జరిగిందని తెలిపారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కల్తీ అల్లంపేస్ట్ పట్టివేత
రామన్నపేట: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్లం పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకుని, తయారీ యూనిట్‌పై రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రామన్నపేటలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. ఆ వ్యాన్‌లో పెద్దమొత్తంలో 360 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి ఉన్న అల్లం పేస్ట్ లభ్యమైంది. దీంతో వాహన డ్రైవర్ శ్యామల సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ లభ్యమైన అల్లంపేస్ట్‌ను కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలోని యూనిట్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంబంధిత తయారీ కేంద్రంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ అల్లం పేస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో మూడు డ్రమ్ముల్లో నిల్వ చేసిన ఉన్న అల్లంపేస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూనిట్ నిర్వాహకుడు దామోదర్‌రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి, ఎస్ఐ సతీష్ తెలిపారు. -
ప్రత్యామ్నాయ పంటలు శరణ్యం
గుర్రంపోడు, హుజూర్నగర్ : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులకు ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాభావ పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, కంది, పెసర్లు, మినుములు, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి మాధవరెడ్డి సూచిస్తున్నారు. కంది జూలై చివరి వారం వరకు కంది విత్తనాలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా ఆగస్టు మొదటి వారం వరకు కూడా కొన్ని స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. జొన్న ఖరీఫ్‌లో జూన్ నుంచి జూలై చివరి వరకు జొన్న పంటను సాగు చేయొచ్చు. వర్షాధారంగా ఈ పంట సాగు ఎంతో అనుకూలం. తక్కువ నీటితో సాగవుతుంది. ఎండను తట్టుకునే పంట, పశువులకు మంచి పశుగ్రాసం కూడా లభిస్తుంది. వర్షాధాన ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న మంచి ఎంపిక. ఆముదం నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఆముదం వరికి మంచి ప్రత్యామ్నాయం. జూలై నెలాఖరు వరకు తగిన వర్షం కురిసినప్పుడు విత్తుకోవచ్చు. ప్రారంభ దశలో తేమ అవసరం కాగా తర్వాత తక్కువ నీటితో పంట బాగా పెరుగుతుంది. అపరాలుప్రొటీన్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాల పంటలైన పెసర్లు, మినుములు సాగుకు అనుకూలం. జూలైలో కురిసే వర్షాలకు విత్తుకోవచ్చు. తక్కువ నీటితో సాగుతోపాటు నేలలో నత్రజని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి. నువ్వులునువ్వుల పంటను ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు విత్తుకోవచ్చు. ఇందులో శ్వేత, రాజేశ్వరి, జెసీఎస్ 1020 అనే రకాలు మంచి దిగుబడులనిస్తాయి. నువ్వులను విత్తుకునేటప్పుడు రైతులు సాలుకు సాలుకు మధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీ మీటర్లు ఉండేలా విత్తుకోవాలి. మొక్కజొన్న మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే మొక్కజొన్న రకాలలో స్వల్పకాలిక రకాన్ని ఎంచుకోవడం మంచిది. చిరుధాన్యాలైన సజ్జ, రాగి, కొరన్రు ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి హుజూర్నగర్ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వరి సాగు కష్టతరమవుతుందని, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని హుజూర్‌నగర్‌లోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆపత్కాల పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
సాగర్ల సత్తయ్యకు ఉత్తమ కథా పురస్కారం
చిట్యాల: వికారాబాద్‌కు చెందిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఠాగూర్ శంకర్ సింగ్ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన కథ ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సేవా సదనంలో ఆదివారం నిర్వహించిన దాశరథి, సినారే జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సత్తయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేసి సత్తయ్యను సన్మానించారు. కార్యక్రమంలో అనంత సాహిత్య వేదిక వ్యవస్థాపకులు దోరవేటి, తుల్జారాం సింగ్ ఠాగూర్, బీపీ నర్సింహులు గుప్తా, గంటా మనోహర్‌రెడ్డి, తలారి ఆశీర్వాదం, కమేలేష్, మహమ్మద్ షరీఫ్, వడిచర్ల సత్తయం, కడియాల మధుసూదన్‌రావు, జానకి రామారావు, కోల్లా భాస్కర్‌రావు పాల్గొన్నారు. బీబీనగర్ మండల వాసికి కార్మికరత్న అవార్డుభువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలానికి చెందిన కార్మిక నాయకుడు గాదె నరేందర్‌రెడ్డి జాతీయ కార్మికరత్న అవార్డు అందుకున్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ఆయన చేసిన కృషికిగాను ఆదివారం హైదరాబాద్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ పాల్గొన్నారు. తాజ్పూర్ గ్రామ వాసికి ఆదర్శ స్వర్ణనంది అవార్డుభువనగిరి: మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త, ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత ర్యాకల శ్రీనివాస్ ఆదర్శ స్వర్ణనంది అవార్డు అందుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవకుగాను హైదరాబాద్‌కు చెందిన ఆదర్శ కళానిలయం వారు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈసందర్భంగా ఆదివారం యాదరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు. రేషన్ బియ్యం పట్టివేతరాజాపేట : అక్రమంగా వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. రాజాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఫోర్ వీలర్ వాహనాన్ని తనిఖీ చేయగా 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. ఈమేరకు రేణికుంట గ్రామానికి చెందిన జగదీష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
టైరు పేలి కారు బోల్తా
కోదాడరూరల్ : కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని డీమార్ట్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో యాదగిరిగుట్ట దైవదర్శనానికి బయలుదేరారు. కోదాడకు చేరుకున్నాక కారు టైరు పేలడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బటయపడిన కొద్దిసేపటికి సీఎన్జీ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. స్వల్పంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
డీపీఓగా వనం తరుణ్ చక్రవర్తి
నల్లగొండ : నల్లగొండ జిల్లా పంతాయతీ అధికారిగా వనం తరుణ్ చక్రవర్తి నియమితులయ్యారు. నేరుగా నియమితులైన జిల్లా పంచాయతీ అధికారుల (డీపీఓలు) పోస్టింగ్‌లలో మార్పులు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణలో ఉన్న అధికారులకు మిగిలిన శిక్షణ కాలాన్ని రద్దు చేసి, రెగ్యులర్ డీపీఓలుగా విధులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వనపర్తి జిల్లాలో శిక్షణ పొందుతున్న వనం తరుణ్ చక్రవర్తికి నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారిగా (డీపీఓ) పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య తెలిపారు. నదుల్లో నీటి వాటాను సాధించాలినల్లగొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న నీటిని అంచనా వేసి మనకు రావాల్సిన వాటాను తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు, నాలుగు లేబర్ కోడ్స్, వ్యవసాయ నల్ల చట్టాలను దొంగ చాటున తీసుకొచ్చిందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కరువు అంచనాలను వేయాలని కోరారు. వ్యవసాయ రంగ పరిస్థితులను చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు రాజీలేని పోరాటంరామగిరి (నల్లగొండ) : ఆర్టీసీ పరిరక్షణతో పాటు కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తున్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్)ను రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు పిలుపునిచ్చారు. నల్లగొండ డిపోలో రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కే.ఎస్.రెడ్డి, రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్, కోశాధికారి బైరు శ్రీకాంత్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, ఎం.సి.మౌళి, నరసింహయ్య, గద్దర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యతతో న్యాయవ్యవస్థ బలోపేతంరామగిరి(నల్లగొండ) : న్యాయశాఖ ఉద్యోగులు బలంగా ఉంటేనే దేశంలో న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అఖిల భారత న్యాయశాఖ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సంఘం ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో విశేష సేవలందించిన ఎస్వి.సుబ్బయ్య, రమణారావుల కృషిని కొనియాడారు. దేశవ్యాప్తంగా న్యాయశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సేవా నిబంధనల సవరణ, సమాన వేతనం, పదోన్నతులు, బదిలీలు, వైద్య సదుపాయాల కల్పనపై జాతీయ స్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయశాఖ ఉద్యోగుల ఐక్యతే తమ అసలైన బలమని, ఉద్యోగుల హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. -
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం సంప్రదాయంగా చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు జరిపించారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజ లను భక్తుల మధ్యన జరిపారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
నరసింహకు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు
మర్రిగూడ : మండలంలోని రాంరెడ్డిపల్లి సర్పంచ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు లపంగి నరసింహ జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ –2026 అవార్డును అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఈ అవార్డు వ్యక్తిగతంగా తనకు వచ్చిన గౌరవం మాత్రమే కాదని, రాంరెడ్డిపల్లి ప్రజల విశ్వాసానికి, గ్రామాభివృద్ధికి, ప్రజాసేవకు దక్కిన గుర్తింపు అన్నారు. -
రైతు చెంతకు విత్తనం
నల్లగొండ అగ్రికల్చర్ : ఎల్‌నినో ప్రభావం వల్ల సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భజలాలు అడిగంటాయి. ప్రాజెక్టులకు నీరురాక, విద్యుత్ ఉత్పత్తికూడా చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రత్యామ్నాయ పంటలైన కంది, పెసర, మినుములు, నువ్వులు, మొక్కజొన్న పంటలవైపు రైతులను మళ్లించడానికి వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా నెల 27 నుంచి 29 వరకు రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహిస్తోంది. 33 రైతు వేదికల్లో విత్తన మేళా.. జిల్లాలో 140 రైతు వేదికలు ఉన్నప్పటికీ.. 33 మండలాల్లోని 33 రైతు వేదికల్లో విత్తన మేళాల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో టీఎస్ సీడ్స్ కార్పొరేషన్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, ప్రైవేట్ విత్తన కంపెనీల డీలర్లు భాగస్వాములు కానున్నారు. వీరు కంది, పెసర, మినుములు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న మొదలైన పంటల విత్తనాలను రైతులకు విక్రయించనున్నారు. ఫ నేటి నుంచి 29 వరకు 33 రైతు వేదికల్లో విత్తన మేళా ఫ ఆరుతడి పంటల విత్తనాలు విక్రయం రైతు వేదికలలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని రకాల కంపెనీలు, తెలంగాణ, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యామ్నాయ ఆరుతడి విత్తనాలు అందుబాటులో ఉంచుతాం. రైతులు వాటనికి కొనుగోలు చేసి సాగు చేసుకోవాలి. – ఉల్లోజు వినోద్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి -
ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్ ‘విక్రమ్–1’ ప్రైవేట్ ఆర్బిటాయ్ రాకెట్ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్ కేబుల్ హెర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్.. తండ్రి స్థానిక ఓ సిమెంట్ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్ వరకు స్థానిక సీతా పబ్లిక్ స్కూల్లో చదివిన లక్ష్మీనాథ్.. ఇంటర్, బీటెక్ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. బీటెక్ తర్వాత డీఆర్డీఓలో ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు. స్కైరూట్ ఏరోస్పేస్లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్ కేబుల్ హర్నెస్ డిజైన్, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్–1 (మిషన్ ఆగమన్)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్ పేర్కొన్నారు. -
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
నల్లగొండ : నల్లగొండలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు, వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులు, కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన బి.గోపయ్యచారి సతీమణి పి.శారద, మిఠ శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు నర్సింహారెడ్డి–మణెమ్మ, లాన్స్ నాయక్ షేక్ ఇమామ్ తండ్రి షేక్ అహ్మద్, యుద్ధంలో గాయపడిన శ్రీధర్‌రెడ్డిని నల్లగొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యర్రమాద శ్రీనివాసులు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు సంది పాపిరెడ్డి, కె.వెంకటాచారి, సంది శ్రీనివాస్‌రెడ్డి, కత్తి భాస్కర్‌రెడ్డి, బొల్లేపల్లి సత్యనారాయణరాజు, జి.రాములు, కె.కోటేష్, మహ్మద్ అబ్దుల్ సమీర్ పాల్గొన్నారు. -
టీజీసీజీటీఏ జిల్లా కమిటీ ఎన్నిక
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీజీటీఏ) జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో బి.వీరన్న ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరించగా, కడారు సురేందర్‌రెడ్డి ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా కె.ప్రవీణ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగు కోటయ్య, కోశాధికారి ఇ.రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నూతన జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బెల్లి యాదయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారామ్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ఉన్నత విద్యా రంగంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అరవింద, వెంకటకృష్ణ, ఈ.రాంరెడ్డి, సిహెచ్.అజయ్ కుమార్, కె.ప్రవీణ్‌రెడ్డి, హరిత, ఎం.వెంకటరెడ్డి, కె.శివరాణి, గంజి శ్రీనివాస్, శ్రీనివాసచారి పాల్గొన్నారు. -
చెర్వుగట్టులో షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానం వద్ద ఆదివారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ అయి 17 వస్తు విక్రయ దుకాణాలు ఆహుతయ్యాయి. ఈ సంఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. చెర్వుగట్టు గ్రామ పంచాయతీ దుకాణాల సముదాయం వద్ద భక్తులకు విక్రయించేందుకు బొమ్మలు, వివిధ ప్లాస్టిక్ వస్తువుల దుకాణాలున్నాయి.ఆ షాపుల ముందు ఏర్పాటు చేసిన రేకులకు స్తంభం నుంచి వచ్చే వైర్ ద్వారా ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక షాపులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వరుసగా ఉన్న 17 షాపులు, తోపుడు బండ్లకు ఒకదాని వెంట మరోదానికి అంటుకుని కాలి బూడిదయ్యాయి. విషయం తెలిసిన వెంటనే నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సురేశ్, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. నల్లగొండ, రామన్నపేట, నకిరేకల్ నుంచి అగ్నిమాపక వాహనాల ద్వారా ఉదయం 5.30 గంటల వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. బాధితులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటన స్థలానికి విచ్చేసి బాధితులకు తక్షణ సాయంగా రూ.20 వేల చొప్పున అందజేశారు. నష్టం జరిగిన దుకాణదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలసి ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు త్వరలో తగిన న్యాయం చేస్తామన్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా పరామర్శించారు. -
4న ‘చేనేత’ అవగాహన సదస్సు
నల్లగొండ టౌన్ : నూతనంగా ఎన్నికై న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులకు హైదరాబాద్‌లో ఆగస్టు 4న చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. శనివారం నల్లగొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం.. చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం నిరంతరాయంగా ఉద్యమిస్తోందన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న చేనేత సదస్సుకు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ముషం రవి, గంజి రమేష్, గంజి రమేష్, రాపోలు శేషమ్మ, రాపోలు గణేష్, చిట్టిపోలు రమేష్, కటకం వెంకటేశ్వర్లు, రాపోలు భిక్షం, గంజి వెంకమ్మ, రాపోలు శ్రీను, దేవలపల్లి సత్తయ్య పాల్గొన్నారు. ‘జలసిరి’తో భూగర్భ జలాల పెంపుచిట్యాల : భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమం చేపట్టిందని స్టేట్ ఎస్బీఎం(స్వచ్చ భారత్ మిషన్) కో ఆర్టినేటర్ శ్రీధర్ పేర్కొన్నారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో శనివారం జలసిరి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విబీజీ–రాంజీ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఫాం ఫాండ్లు, నీటి కందకాలను, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. ఈ పనులకు ప్రభుత్వమే నిధులు కేటాయింస్తుందని తెలిపారు. ఈ పనుల ద్వారా కరువు పరిస్థితుల్లో భూగర్భ జలాలు పెంపొందడంతో పాటు గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి అవకాశాలు పెరుగుతా యని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పాండు, సర్పంచ్ అందె ఆండాలు రాములు, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేష్, క్యూసీ వినోద్‌కుమార్, జక్కల సీనయ్య, బాతరాజు శోభ, సింగిరెడ్డి శోభారాణి, మేడి శైలజ పాల్గొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలిపెద్దఅడిశర్లపల్లి : ప్రతి ఇంటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్ వద్ద జలసిరిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 2 ఊట కుంటలు, 5 కమ్యూనిటీ సోక్ ఫీట్లు, 10 బోర్వేల్ రీచార్జ్ నమూనాలు, 5 ఫారం ఫౌండ్స్, రూప్‌టాప్ రీచార్జ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ రమావత్ చిరంజీవి, ఎంపీడీఓ చంద్రమౌళి, ఈసీ రాజు తదితరులు ఉన్నారు. -
అంబులెన్స్‌లను సద్వినియోగం చేసుకోవాలి
శాలిగౌరారం : ప్రభుత్వం నడిపిస్తున్న 108, 102 అంబులెన్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ అన్నారు. శాలిగౌరారం పీహెచ్సీ ఆవరణలో ఉన్న 108, 102 అంబులెన్స్‌లను ఆయన శనివారం తనఖీ చేశారు. ఈ సందర్భంగా 108 వాహనంలోని అత్యవసర మందులు, వైద్య పరికరాలు, స్టాక్ రిజిస్టర్, కేసుల రికార్డులను పరిశీలించారు. మండలం నుంచి వచ్చే అత్యవసర వైద్య కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వైద్యాధికారి సూర్యశిల్పతో సమావేశమయ్యారు. -
మాజీ సైనికుడి భూమి మాయం..
మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన ఓ మాజీ సైనికుడు తనకు భూమిని కేటాయించాలని 2021లో అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరగగా.. 2024లో మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో సర్వే నంబర్ 174లో మూడు ఎకరాల మేరా ఏనెను సర్వే చేశారు. ఏనెకు సంబంధించిన రిపోర్ట్‌ను సంబంధిత సబ్ కలెక్టర్ పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపారు. జిల్లాలో కలెక్టర్లు మారడంతో ఆ రిపోర్ట్‌ను అనుమతించేందుకు రెండేళ్లు సమయం పట్టింది. తీరా ప్రస్తుత కలెక్టర్ పరిశీలించి మూడు నెలల క్రితం సీసీఎల్ఏకు నివేదిక సమర్పించారు. ఇప్పటికే ఆ భూమి సగానికి పైగా కబ్జాకు గురైంది. ఆ భూమిని చదును చేసుకుని పొలాలుగా మార్చారు. దేశానికి సేవ చేసిన సైనికుడికి దక్కాల్సిన భూమి మొత్తం ఆక్రమణకు గురైంది. నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో ప్రభుత్వ, ఈనామ్, సీలింగ్ భూములు వేలాది ఎకరాల సారవంతమైవి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పనికిరాని ఏనెను కేటాయించడం.. అది కూడా ఆక్రమణకు గురికావడంపై మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
సమగ్ర విచారణ తర్వాతే పోస్టుల భర్తీ
మిర్యాలగూడ : అంగన్వాడీల పోస్టుల భర్తీ విషయంలో సమగ్ర విచారణ జరిపిన తరువాతనే అర్హులైన అభ్యర్థులతో పోస్టుల భర్తీ చేస్తామని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అన్నారు. శనివారం ‘సాక్షి’లో ‘అంగన్వాడీ పోస్టుల్లో.. అక్రమాల భర్తీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు, రిజర్వేషన్లలో తిలోదకాలు, సర్టిఫికెషన్ల పరిశీలనలో ఆ దరఖాస్తులను ఆమోదించినట్లు వచ్చిన కథనంలో వాస్తవాలను విచారిస్తామన్నారు. సీతా రాంపురం సెక్టార్లో ఎస్సీ గ్రూప్–1కు కేటా యించిన పోస్టులకు ఎస్సీ గ్రూప్–2, 3 వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తేలితే సంబంధిత తహసీల్దార్ ద్వారా వాస్తవాలను ధ్రువీకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నా రు. ఆ ఏరియాలో ఎస్సీ గ్రూప్–1 అభ్యర్థి లేని పక్షంలో ఎస్సీ గ్రూప్–2 దరఖాస్తు చేసుకోవచ్చని, వారు కూడా లేనిపక్షంలో ఎస్సీ గ్రూప్ –3 వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి
నల్లగొండ టూటౌన్ : సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నల్లగొండను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రూ.65 కోట్లతో నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్యతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో మేయర్, కార్పొరేటర్లతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్లై ఓవర్‌పై ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌కు దీటుగా నల్లగొండ నగరాన్ని మోడల్ కార్పొరేషన్‌గా సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. నార్కట్‌పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై నేరుగా వాహనాలు ప్రయాణించేందుకు ఫ్లై ఓవర్ నిర్మించామని తెలిపారు. ఈ ఫ్లై ఓవర్‌ను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా తీర్చిదిద్దామని, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఛాయా సోమేశ్వర స్వామి, మహనీయుల చిత్రాలతో సుందరీకరించినట్లు తెలిపారు. రూ.750 కోట్లతో చేపట్టిన నల్లగొండ ఔటర్‌రింగ్ రోడ్డు పనులు 50 శాతం పూర్తయ్యాయని, రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మాణం, తదితర పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అమృత్ పథకం కింద రూ.300 కోట్లతో తాగునీటి ట్యాంకులు, యూజీడీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటికి అదనంగా రూ.300 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. 24/7 తాగునీటి సరఫరా పైలెట్ ప్రాజెక్టుగా నల్లగొండను ఎంపిక చేసి రూ.290 కోట్లతో ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించే కార్యక్రమం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమేర్, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు గుమ్మల జానకి, పెరిక స్వాతి, బొడ్డుపల్లి లక్ష్మి, శంకర్, కేసాని వేణుగోపాల్‌రెడ్డి, ఇబ్రహీం, పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నంరాజు, అబ్బగోని రమేష్, వంగూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం -
శాకంబరీ నమోస్తుతే..
కాల్వపల్లి శివారులో ఆక్రమణకు గురైన గుట్టనిడమనూరు : వర్షాలు పడాలి, కృష్ణమ్మ వరద పావాలి, సాగు సాగాలని ఆకాంక్షిస్తూ నిడమనూరు మండలంలోని నారమ్మగూడెం గ్రామంలో మహిళలు బొడ్రాయికి, శివలింగానికి శాస్త్రోక్తంగా పూజలు చేసి జలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లభారెడ్డి, మాజీ సర్పంచ్ దుబ్బాకుల రాంరెడ్డి, గోవింద్‌రెడ్డి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, రమణారెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నల్లగొండ : జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా 80.08 శాతం మాత్రమే పూర్తయింది. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం ఈ–కేవైసీని తప్పనిసరి చేసింది. ప్రారంభంలో వేగంగా సాగిన ఈ ప్రక్రియ తర్వాత మందగించింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80.08 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయింది. మిగిలిన వారు ఈ నెల జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం 16,45,775 యూనిట్లు జిల్లాలోని 33 మండలాల్లో మొత్తం 16,45,775 యూనిట్లు ఉండగా, ఇప్పటివరకు 13,17,995 మంది మాత్రమే ఈ–కేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా 3,27,780 మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఈ–కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. డీలర్లు షాపులు తెరిచి ఉంచాలి.. ఈ నెల రేషన్ బియ్యం పంపిణీ పూర్తయిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని రేషన్ డీలర్లు దుకాణాలను తెరిచి లబ్ధిదారుల ఈ–కేవైసీని చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) వెంకటేశం ఆదేశించారు. రాబోయే రేషన్ పంపిణీకి ముందే జిల్లాలో 100 శాతం ఈ–కేవైసీ పూర్తి చేయాలని, ఇందుకు మండల తహసీల్దార్లు కూడా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.బోగస్ కార్డులపై ఫోకస్.. ఈ–కేవైసీ ప్రక్రియ ద్వారా ఇప్పటికే పలువురు బోగస్ లబ్ధిదారులను గుర్తించడంతోపాటు మరణించిన వారి పేర్లను కార్డుల నుంచి తొలగించారు. ఇంకా ఈ–కేవైసీ చేయించుకోని వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండొచ్చు, మరికొందరు అర్హులు కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువులోగా ఈ–కేవైసీ పూర్తి చేయని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూలై 31వ తేదీలోగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలి. గడువు దాటితే రేషన్ సదుపాయాలు కోల్పోయే అవకాశం ఉంది. మిగిలిన లబ్ధిదారులు వెంటనే సమీప రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలి. – వెంకటేశం, డీఎస్ఓ -
చట్టాలు, సాంకేతికతపై అవగాహన అవసరం
రామగిరి (నల్లగొండ) : ఆధునిక సమాజంలో వేగంగా మారుతున్న నేరాల స్వభావాన్ని ఎదుర్కొనేందుకు న్యాయవాదులు నిరంతరం నూతన చట్టాలు, సాంకేతిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలని హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డి.బాలకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, నల్లగొండ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆధునిక నేరాలు, క్రిమినల్ న్యాయవ్యవస్థ, నూతన సవాళ్లు, న్యాయపరమైన స్పందనలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ నేటి రోజుల్లో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లు, కత్రిమ మేధస్సు దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లు, డేటా చోరీ, ఆన్లైన్ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల పరిణామానికి అనుగుణంగా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ఆధునికీకరణ చెందాలన్నారు. ప్రస్తుత క్రిమినల్ ట్రయల్స్‌లో డిజిటల్ సాక్ష్యాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, ఫోరెన్సిక్ విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు కీలకపాత్ర పోషిస్తున్నాయని, వీటి సేకరణ, సంరక్షణ, కోర్టులో ఆమోదయోగ్యతపై న్యాయవాదులకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. శిక్షలతో పాటు వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయం, నిందితుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జిల్లా అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, మునగాల నారాయణరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్, కార్యదర్శి బి.అశోక్‌కుమార్, న్యాయవాదులు జి.వెంకటేశ్వర్లు, జి.జవహర్లాల్, భువనగిరి రవి, గుర్రం వెంకట్‌రెడ్డి, నాంపల్లి నరసింహ, ఎన్.భీమార్జున్‌రెడ్డి, నాగిరెడ్డి, పందుల సైదులు, నాంపల్లి భాగ్య, బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ : పేదలను ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను విన్న అనంతరం మంత్రి పలువురు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొందరి బాధితుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో భూ ఆక్రమణలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయి. మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి మండలాల్లో గుట్టలు కబ్జాదారుల పాలవుతున్నాయి. వందల ఎకరాల్లో వెలిసిన గుట్టలు, ఏనెలను యథేచ్చగా తవ్వి మట్టి దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ భూములను చదును చేసి ఆక్రమిస్తున్నారు. ఒకవైపు భూమి కబ్జా, మరోవైపు మట్టిదందా నిరంతరంగా సాగుతుండడంతో భవిష్యత్‌లో గుట్టలు కనుమరగయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటిని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మాజీ సైనికుడికి కేటాయించిన భూమి కూడా ఆక్రమణకు గురికావడం విస్మయం గొల్పుతోంది. రాత్రింబవళు మట్టి దందా.. దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలను అభివృద్ధి పనుల పేరుతో తవ్వి మట్టి దందా చేస్తున్నారు. గుట్టలను తవ్వి టిప్పర్ల ద్వారా రాత్రింబవళ్లు వెంచర్లకు, ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారు. స్థానికులు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ● గతంలో అవంతీపురం, ఆలగడప గ్రామాల్లోని గుట్టలతోపాటు కొత్తగూడెం శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 34, 36, 38లలో ఏనెను తొలగించి మట్టిని తరలించినట్లు స్థానికులు అంటున్నారు. ● దామరచర్ల మండలం రాళ్లవాగుతండా వద్ద అద్దంకి– నార్కట్‌పల్లి రహదారికి ఆనుకుని ఉన్న గుట్టను కనుమరుగు చేశారు. ● ప్రస్తుతం మిర్యాలగూడ మండలం కాల్వపల్లి శివారులోని సర్వే నంబర్ 198లో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న గుట్టలను కొన్ని రోజులుగా తవ్వి పొలాలుగా మార్చుతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఒక గుట్టలో 50 ఎకరాల మేరకు తవ్వకాలు చేపట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఫ ఏనెలు, గుట్టలను తవ్వి చదును చేస్తున్న ఆక్రమణదారులు ఫ మట్టి దందా చేస్తూ రూ.లక్షల్లో సంపాదన ఫ ఓ మాజీ సైనికుడికి కేటాయించిన భూమి కూడా కబ్జా ఫ పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
కోమటిరెడ్డి బ్రదర్స్‌తో అదే చెప్పా: ఎమ్మెల్యే సామెల్
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్‌లో తుంగతుర్తి పంచాయితీ మరోసారి తీవ్ర విభేదాలను బయటపెట్టింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా పర్యటనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. తనకు టికెట్ ఇచ్చింది రాజగోపాల్‌రెడ్డి కాదని, ఏఐసీసీ అని స్పష్టం చేశారు.తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో రాజగోపాల్‌రెడ్డి పాత్ర లేదని ఎమ్మెల్యే సామెల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టికెట్ నా చేతిలో లేదు.. రాజగోపాల్‌రెడ్డి చేతిలో అంతకన్నా లేదు. ఏఐసీసీ నాకు టికెట్ ఇచ్చింది. నన్ను గెలిపించింది రాజగోపాల్‌రెడ్డి కాదు.. పార్టీ’’ అని పేర్కొన్నారు.‘నాకు తెలియకుండా ఎలా?’తన నియోజకవర్గంలోకి రావాలంటే కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని సామెల్ అన్నారు. ‘‘నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవం ఉండాలని పేర్కొన్నారు. ‘పార్టీలో నేనే ముందున్నా’కాంగ్రెస్‌లో తానే ముందునుంచి ఉన్నానని ఎమ్మెల్యే సామెల్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు తన కేడర్ ఎంతో కష్టపడిందని, అయితే ఇప్పుడు అదే కేడర్ బాధపడుతోందని అన్నారు. ‘‘మునుగోడులో ఆయన్ను గెలిపించినందుకు నా కార్యకర్తలు బాధపడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి గతంలో తన గెలుపుపై వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘నేను గెలుస్తా అని గతంలో రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారు’’ అని విమర్శించారు.కులాల ఓట్లపై ఆసక్తికర వ్యాఖ్యలుఎన్నికల సమయంలో సామాజిక వర్గాల ఓట్లపై కూడా సామెల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజగోపాల్‌రెడ్డికి మాదిగలు ఓటు వేశారు.. నాకు రెడ్లు ఓటేశారు’’ అని అన్నారు.‘ఎన్నిసార్లు కలిసినా రోడ్లు ఇవ్వలేదు’గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ‘‘నేను ఎన్నోసార్లు కలిశాను. రోడ్లు కావాలని అడిగాను. చివరకు అటెండర్‌తో ఫోన్ చేయించినా వెళ్లి కలిసేవాడిని’’ అని పేర్కొన్నారు.కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యాఖ్యలుకోమటిరెడ్డి సోదరులు నియోజకవర్గ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని తాను చెప్పినట్లు సామెల్ వెల్లడించారు. ‘‘కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఇన్వాల్వ్ కానివ్వొద్దని చెప్పా. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇకనైనా అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు. మొత్తంగా మునుగోడు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సామెల్, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయాలను మరింత వేడెక్కించాయి. -
విద్యార్థులకు యూనిఫాం అందజేయాలి
నల్లగొండ : ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా విద్యార్థులకు యూనిఫాం అందించాలని కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యూనిఫామ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికను అందించాలని ఆదేశించారు. రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేసుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులపై రైతులు, ప్రజలు, జిల్లా అధికారులు ప్రజలకు తెలిసే విధంగా సమాచారం అందించాలని సీపీఓ శ్రీనివాస్‌నాయక్‌ను ఆదేశించారు. 45 రోజులకోసారి సర్పంచ్‌లతో మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి శంకరనాయక్కు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమకరణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు పాల్గొన్నారు. ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలినల్లగొండ టౌన్: జాతీయ ఎస్సీ–ఎస్టీ హబ్ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్విని యోగం చేసుకోవాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మనో రమ హోటల్లో కేంద్రం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వ్యవస్థాపక అవగాహన – ప్రత్యేక విక్రేత అభివృద్ధి’ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ హైదరాబాద్ హెడ్ ఎస్.సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా జాతీయ ఎస్సీ–ఎస్టీ హబ్‌తో భాగస్వామ్యంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ జనరల్ మేనేజర్ జి.సతీష్‌కుమార్, కె.బి.వెంకట్ పాల్గొన్నారు. హైదరాబాద్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్రామగిరి (నల్లగొండ) : నల్లగొండ నుంచి హైదరాబాద్ (దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్) మార్గంలో ఎలక్ట్రిక్ డీలక్స్ బస్సుల్లో ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. www.ts.srtcbus.in వెబ్సైట్ లేదా టీజీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా.. ప్రయాణ తేదీ, నచ్చిన సీటును సెలెక్ట్ చేసుకుని, వివరాలు నమోదు చేసి.. నిర్ణీత రుసుం చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యానికి భవిష్యత్‌లో మరిన్ని సర్వీసులకు విస్తరిస్తామని డిపో మేనేజర్ రమణ తెలిపారు. -
పొదుపుగా వాడితేనే భవిష్యత్తు
నల్లగొండ టూటౌన్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో తాగునీటి ప్రాజెక్టులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా నల్లగొండ నగరానికి తాగునీరందించే ఉదయం సముద్రం నీటిని పొదుపు చేయకుండా ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి నీటి వృథాను ఎవరు కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో తాగునీటిని పొదుపుగా వాడుకోవాల్సిన జనం అవగాహన లేకుండా ఇంట్లో వాడకంతో పాటు ఆరుబయట కడగడం, ర్యాంపులను, వాహనాలను సైతం కృష్ణాజాలాలతోనే శుభ్రపరుస్తూ తాగునీటిని వృథా చేస్తున్నారు. జూలై చివరి వారానికి వచ్చినా కనీసం ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కురవలేదు. దీంతో రానున్న రోజుల్లో కరువు ఎంతటి తీవ్రంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది. పొదుపు మంత్రం పాటించని కార్పొరేషన్ తాగునీటిని పొదుపుగా వాడుకోవాలనే దానిపై నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కాలనీల్లో ప్రజలకు తాగునీటి పొదుపు గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నా యంత్రాంగం దానిపై దృష్టి పెట్టలేదు. నగరంలోని మర్రిగూడ, చర్లపల్లి, శాంతినగర్, ఆర్టీసీ కాలనీ, పాత బస్తీలో కొన్ని కాలనీలు, శ్రీనగర్ కాలనీ, రవీంద్రనగర్, శివరాంగనర్, సావర్కర్‌నగర్, పద్మావతీ కాలనీ, డీవీకే రోడ్డు ప్రాంతంలో కొన్ని కాలనీలు, గొల్లగూడ, బీటీఎస్ తదితర ప్రాంతాల్లో తాగునీటిని ఎక్కువగా దుబారా చేస్తున్నట్లు తెలిసింది. కొందరు సంపులకు మోటార్లు వేసి ట్యాంక్‌లోకి ఎక్కించి అన్నింటికి కృష్ణాజలాలు వాడుతూ తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నారు. మరికొందరు సంప్ నిండిన తరువాత కూడా నల్లా బంద్ చేయకపోవడంతో డ్రెయినేజీలోకి వృథాగా పోతున్నాయి. ఇలాంటి వాటిపై ముందుగానే మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను అరికట్టకపోతే రానున్న రోజుల్లో తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. 2.45 లక్షల జనాభాకు 37 ఎంఎల్డీ నీరు నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2.45 లక్షల జనాభా ఉంది. ఈ జనాభా కోసం ప్రతిరోజూ పానగల్ ఉదయ సముద్రం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ప్లాంట్ నుంచి 37 మిలియన్ లీటర్స్ ఫర్డే (ఎంఎల్డీ) తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో దాదాపు 20నుంచి 30 శాతం వరకు నీరు వృథా చేస్తున్నారని అంచనా. తాగునీటిని ప్రతిరోజూ గంట పాటు సరఫరా చేస్తున్నారు. ఇకనుంచి నీటి పొదుపు కోసం సమయం కూడా తగ్గించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తాగునీటిని వృథా చేయవద్దని తమ సిబ్బంది ద్వారా ప్రచారం చేయిస్తున్నాం. నీటిని వృథా చేస్తే కనెక్షన్ కట్ చేస్తాం. తాగునీటిని దుబారా చేయకుండా అవసరం మేరకే వాడుకోవాలి. – దిలీప్ భార్గవ్, ఏఈ, నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ నగరంలో తాగునీటి వృథా నిత్యకృత్యం ఫ ర్యాంపుల నుంచి వాహనాలు కడిగేదాకా కృష్ణానీరే వాడకం ఫ నీటి పొదుపు చర్యలపై అవగాహన కల్పించని కార్పొరేషన్ యంత్రాంగం ఫ తేరుకోకపోతే మున్ముందు తాగునీటికి కటకటే.. డివిజన్లు 48జనాభా 2.45లక్షలు రోజు నీటి సరఫరా 37ఎంఎల్డీ -
కొలికి్కరాని కమిటీలు
మిర్యాలగూడలో కాంగ్రెస్ మండల, పట్టణ కార్యవర్గాలు పెండింగ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం దాదాపు పూర్తి దశకు చేరుకున్నా.. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇంకా కొలిక్కి రాలేదు. అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను పూర్తి చేసిన పార్టీ నాయకత్వం మిర్యాలగూడ విషయంలో మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. స్థానిక ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కమిటీలు ప్రకటించడంతో అక్కడి నాయకులు సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుండగా, మిర్యాలగూడలో మాత్రం నియామకాలు ఆలస్యం కావడంతో పార్టీ కార్యకలాపాలు కూడా కొంత మందగించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మండల కమిటీలను పూర్తి చేశారు. కానీ, జిల్లా కార్యవర్గంలోకి తీసుకోవాల్సిన నేతల జాబితా సిద్ధం చేయలేదు. మిర్యాలగూడలో ఎందుకీ జాప్యం..? మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లకా్ష్మ్రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌తో పాటు ఇతర ముఖ్య నాయకుల మధ్య కమిటీల కూర్పుపై పూర్తిస్థాయి అవగాహన కుదరలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పదవుల కేటాయింపు, సామాజిక సమీకరణలు వంటి అంశాల్లో భిన్నాభిప్రాయాలు రావడంతో తుది జాబితా సిద్ధం కావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్ని మండలాల అధ్యక్ష పదవులు తన అనుచరులకే ఇవ్వాలని పట్టుపడతుండగా, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తన వర్గం వారికి కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ వేర్వేరుగా కమిటీల జాబితాలు ఇచ్చారు. ఆ జాబితాలను డీసీసీ అధ్యక్షుడు.. టీపీసీసీకి పంపారు. మార్కెట్ కమిటీ కూడా వాయిదానే.. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం కూడా ఇప్పటికీ ఖరారు కాలేదు. పాలకవర్గం రిజర్వేషన్‌ను ప్రకటించిన వెంటనే నియమిస్తే ఇప్పటికే ఒకసారి పదవీకాలం కూడా పూర్తయ్యేది. నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పదవి కావడంతో ఒకరికి అవకాశం కల్పిస్తే మరొకరు పార్టీకి దూరమవుతారేమోననే ఆలోచనతో నియామకంలో జాప్యం చేస్తున్నారని, ఈ ఆలోచన ప్రక్రియతో ఆశావహులు గందరగోళంలో పడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కమిటీల కూర్పు విషయంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కై లాష్‌నేత మధ్యే మార్గాన్ని టీపీసీసీకి ప్రతిపాదించినట్లు తెలిసింది. ముఖ్యంగా నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీలోకి తీసుకునే 10 – 15 మంది నాయకుల్లో 20 శాతం (ఇద్దరి నుంచి ముగ్గురిని) ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అనుచరులను, 10 శాతం (ఒకరు లేదా ఇద్దరిని) ఎంపీ అనుచరులను, 70 శాతం (ఏడుగురు నుంచి పది మందికి పైగా) ఎమ్మెల్యే అనుచరులకు స్థానం కల్పించేలా ప్రతిపాదించారు. మిర్యాలగూడ పట్టణంతోపాటు, ఒక మండలం అధ్యక్ష స్థానాన్ని ఎమ్మెల్సీ అనుచరులకు ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఫ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ముఖ్య నేతల మధ్య కుదరని సయోద్య ఫ వేర్వేరుగా జాబితాలను ఇచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫ ఇద్దరి జాబితాలను టీపీసీసీకి పంపించిన డీసీసీ అధ్యక్షుడు -
మెడికల్ వ్యర్థాలు చెత్తలో కలపొద్దు
నల్లగొండ టూటౌన్ : బయో మెడికల్ వ్యర్థాలను సాధారణ చెత్తలో కలపడం నేరమని నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వైద్యులతో శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్స్, డెంటల్ క్లినిక్‌లు, వెటర్నరీ ఆసుపత్రుల నుంచి వెలువడే బయో మెడికల్ వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.ప్రదీప్‌రెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ ప్రదీప్ పాల్గొన్నారు. -
విద్యార్థి సంఘాల నిరసన
నల్లగొండ టౌన్ : ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో రాసారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్, ఇందూరి సాగర్, ముదిగొండ మురళికృష్ణ, అంజన్ కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల భర్తీ!
అంగన్వాడీ పోస్టుల్లో.. మిర్యాలగూడ : అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుతున్నాయి. పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లా ర్యాండమ్‌గా రిజర్వేషన్లు కేటాయించగా.. నిబంధనల ప్రకారం ఆయా ప్రాజెక్ట్ అంగన్వాడీ సెంటర్ సర్వే పరిధిలో ఉన్న అభ్యర్థి నుంచి దరఖాస్తులను స్వీకరించాలి. కానీ, ఆ ప్రాంత పరిధి కాకుండా పట్టణం, మండల వ్యాప్తంగా వేరే ప్రాంతాల్లో నివసించేవారు పోస్టు ఖాళీగా ఉన్న ప్రాంతానికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రాలను సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఏమీ పరిశీలించకుండానే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ఐసీడీఎస్ అధికారులు కూడా అక్కడి ఓటరు, స్థానిక నివాసి కాకపోయినప్పటికీ కేవలం నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారి దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. దీంతో స్థానిక ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, అనుముల, దామరచర్ల, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి పరిధిలో 2,093 కేంద్రాలు ఉన్నాయి. 1923 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 170 టీచర్ పోస్టులు, 756 ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా.. మొదటి విడతలో 140 టీచర్లు, 197 ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత నెల 25న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 10తో దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా ఇటీవల దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఎస్సీ కేటగిరీలో అందరూ దరఖాస్తు ప్రధానంగా రిజర్వేషన్ విషయంలో అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఓటరు, స్థానిక నివాసి కాకపోయినప్పటికీ కేవలం నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారి దరఖాస్తులకు ఐసీడీఎస్ అధికారులు ఆమోదం తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ అయిన పోస్టులకు ఎస్టీలు దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ గ్రూప్–1, 3 రిజర్వ్ అయిన పోస్టులకు మాత్రం ఎస్సీలోని అన్ని కేటగిరివారు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అంగన్వాడీలో టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేస్తాం. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశాం. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి సెంటర్ పరిధిలో స్థానికంగా ఉన్న దరఖాస్తుదారులను పిలిచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తాం. – వేణుగోపాల్‌రావు, సీడీపీఓ, మిర్యాలగూడ ఫ రిజర్వేషన్లకు తిలోదకాలు ఫ సరిఫికెట్ల పరిశీలనలో ఆ దరఖాస్తులను ఆమోదించిన అధికారులు ఫ స్థానికులకు తీరని అన్యాయం సెంటర్ సర్వే పరిధిలోని మహిళ అయి ఉండాలి. ఆ మహిళ ఆ ప్రాంత కోడలు అయి ఉండాలి ఆ ప్రాంతంలో అత్యాచారానికి, నిర్బంధానికి గురైన, వితంతువు ఉంటే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ ప్రాంతంలో ఓటు హక్కుతోపాటు ఆధార్‌కార్డులో అడ్రస్ ఖచ్చితం అయి ఉండాలి కనీసం ఆ ప్రాంతంలో ఆరు నెలల పాటు నివాసం ఉండి ఆ ప్రాంత ప్రజలకు తెలిసినవారై ఉండాలి కేటాయించిన రిజర్వేషన్‌కు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతతోపాటు సామాజిక, ప్రభుత్వం అమలు చేస్తున్న పల్స్‌పోలియో, ఇతర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. -
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు
నల్లగొండ : బీఎల్ఓలపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని.. అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నామిరెడ్డి వెంకటరమణ అన్నారు. ఇటీవల ఒక సమావేశంలో బీఎల్ఓలను అవమానపరిచేలా ముఖ్యమంత్రి మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అనుచితంగా మాట్లాడడంపై అంగన్వాడీ కార్యకర్తలు, బీఎల్ఓలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, బీఎల్ఓలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం లేదని, కేవలం జీతాలు, సంక్షేమ పథకాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు. కార్యక్రమంలో బుర్రి సునీత, శశికళ, పుష్పకళ, సరోజ, కవిత, మౌనిక, రాములమ్మ, రాజ్యం, అరుణ, ఉష శ్రీ, గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
చెరువు కబ్జాపై లోకాయుక్త విచారణ
మిర్యాలగూడ : దామరచర్ల మండల కేంద్రంలోని నాగుల చెరువు శిఖం భూమి కబ్జా ఆక్రమణలపై లోకాయుక్త ప్రత్యేక బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో విచారణ, సర్వే చేపట్టింది. సమాచార హక్కు సంరక్షణ చట్టం కమిటీ ప్రతినిధి, ఫిర్యాదుదారు ధీరావత్ శ్రీనునాయక్ చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త ఇన్వెస్టెంగ్ ఆఫీసర్ ఇస్మాయిల్, నల్లగొండ డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) వెంకటేశ్‌ప్రసాద్, జిల్లా ఏడీ సర్వేయర్ దేవరాజ్ విచారణ చేపట్టారు. సర్వే నంబర్ 1152లో ఉన్న నాగులచెరువు శిఖం భూమి పూర్తి సేత్వార్ విస్తీర్ణం 95.27ఎకరాలు కాగా ప్రస్తుతం చెరువు కట్టతో కలిపి కేవలం 66.34ఎకరాలు మాత్రమే ఉందని, సుమారు 30.13 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని మాయమైందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిషన్ కాకతీయ రెండవ విడత కింద 2016లో సుమారు రూ.50లక్షలతో 95.27ఎకరాల పూర్తి విస్తీర్ణానికి అభివృద్ధి పనులు చేపట్టినట్లు నీటి పారుదల శాఖ రికార్డులు తెలుపుతున్నప్పటికీ తరువాత వచ్చిన నివేదికల్లో 30.13 ఎకరాల భూమి ప్రస్తావన లేకపోవడాన్ని గుర్తించారు. 95.27ఎకరాల పూర్తి విస్తీర్ణాన్ని స్పష్టంగా గుర్తిస్తూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై పూర్తి సమాచారంతో కూడిన సమగ్ర నివేదికలను ఆగస్టు 16లోగా సమర్పించాలని లోకాయుక్త ప్రత్యేక బృందం నీటి పారుదల, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీశైలం, తహసీల్దార్ జవహర్లాల్, ఆర్ఐ సుందర్‌సింగ్, సర్వేయర్ శోభన్, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. నిడమనూరులో విజిలెన్స్ బృందం.. నిడమనూరు : నిడమనూరు మండలంలోని ప్రభుత్వభూములు, గుట్టల తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీంచారు. వెనిగండ్ల సర్వే నంబర్ 99లో, నిడమనూరు సర్వే నంబర్ 291, 292, ఊట్కూరు సర్వే నంబర్ 442లో తవ్వకాలు పరిశీలించి, ఫొటోలు తీసుకొన్నారు. ఎంత విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారని సర్వేయర్‌ను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్వేయర్ గాయత్రి, ఆర్ఐ సైదులు, జీపీఓ సైదులు ఉన్నారు. -
పోలీస్‌శాఖపై విశ్వాసం పెంచాలి
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ చందంపేట : విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను సమర్థంగా అమలు చేస్తూ పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం ఆయన చందంపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్, రికార్డుల నిర్వాహణ, కేసుల నమోదు, కేసుల దర్యాప్తు, పురోగతి, స్టేషన్ ఆస్తుల సంరక్షణ, సిబ్బంది హాజరు, ఆయుదాల నిర్వాహణ తదితర అంశాలను పరిశీలించారు. అలాగే డిజిటల్ రికార్డుల నిర్వాహణ, పోలీసు సిబ్బందికి అందజేసిన కిట్లను పరిశీలించారు. రౌడీషీటర్, అనుమానిత వ్యక్తుల కదలికపై నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్బీ సీఐ నాగరాజు, సడీఆర్బీ సీఐ శ్రీనునాయక్, డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్ఐ లోకేష్, నేరెడుగొమ్ము ఎస్ఐ నాగేంద్రబాబు, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం
నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దానిని వెంటనే రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి డిమాండ్ చేశారు. 22 రోస్టర్ విధానాన్ని సవరించి, ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని కోరుతూ బుధవారం మాల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోస్టర్ విధానాన్ని సవరించి 1 నుంచి 16 రోస్టర్ పాయింట్లలో మాలలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్ష అనంతరం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, జిల్లా అధ్యక్షుడు నగేష్, రాజారావు, అనిల్, లింగమయ్య, బేరా బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయానికి
పట్టా వచ్చిన వేళ.. ఆనంద హేళనల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల మొదటి స్నాతకోత్సవం బుధవారం నల్లగొండలోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సందర్భంగా పట్టాలు పొందిన ఆనందంలో క్యాప్‌లను గాల్లోకి ఎగురవేపి, తోటి విద్యార్థులతో సెల్ఫీలు దిగారు.ఫ ఆరుతడి పంటలు వేసుకోవాలంటున్న ప్రభుత్వం ఫ విత్తనాలను అందుబాటులో ఉంచడంలో విఫలం ఫ జిల్లాలో 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఫ అందుబాటులో ఉన్నవి 212 క్వింటాళ్లే.. -
రాహుల్‌గాంధీ అరెస్టుకు కాంగ్రెస్ నిరసన
నల్లగొండ : లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్‌గాంధీని అక్రమంగా అరెస్టు చేసి గాయపరిచిన మోదీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేత ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నల్ల రిబ్బన్స్ ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కై లాష్‌నేత మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ అనేకమంది మరణానికి కారణమైన నీట్ ప్రశ్నపత్రాలు లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రం లీకేజీపై పార్లమెంట్లో చర్చ జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు ముంతాజ్ అలీ, సిరాజ్ ఖాన్, గోపిశెట్టి రాంబాబు, కుకుడాల బాలకృష్ణ, ఏళ్ల రవీందర్‌రెడ్డి, మేకల రాజేందర్‌రెడ్డి, జడల చిన్నమల్లయ్య, చింత ధనుంజయ్, మధు, ప్రసాద్, పోకల దేవదాస్, కట్టం వెంకన్న, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, సంతోష్‌రెడ్డి, మనోహర్, నలపరాజు సీనయ్య, కాటం వెంకన్నగౌడ్, సురేష్‌గౌడ్, వేముల గోపినాథ్, సైదులు, మాదగోని వెంకన్న, ఇందనూరి శ్రీను, ఎండీ.ఫిరోజ్, గడ్డం దామోదర్ పాల్గొన్నారు. -
24న మెగా జాబ్ మేళా
నల్లగొండ : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 24న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయని, ఎంపికై న వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్ఎస్సీ, డిగ్రీ, ఐటీఐ, బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీఎస్సీ నర్సింగ్, డీ/బీ/ఎం అర్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చరి తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. వివరాలకు 08682–223362, 7893420435 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారంనిడమనూరు : రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిడమనూరు మండలంలోని బొకమంతలపహాడ్లో నిర్వహిస్తున్న రీ సర్వేను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 32 మండలాల్లో 70 గ్రామాల్లో రోవర్ సాయంతో రెవెన్యూ టీమ్‌లు రీ సర్వే చేస్తున్నాయన్నారు. రీ సర్వేతో భూమి హక్కులు డిజిటల్ రూపంలో, ప్రతి భూమి హక్కుదారుడి డిజిటల్ పార్సల్ అందజేస్తామన్నారు. రీ సర్వే చేపడుతున్న గ్రామంలో మొదట గ్రామ హద్దులు, గ్రామ కంఠం ప్రభుత్వ భూముల సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. బొకమంతలపహాడ్లో రీసర్వేపై తహసీల్దారు కృష్ణయ్య, సర్వేయర్ గాయత్రితో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మారపు వెంకన్న, డీటీ సైదులు, నజీర్, జీపీవో సైదులు ఉన్నారు. జిల్లా గ్రంథాలయంలో దాశరథి జయంతిరామగిరి(నల్లగొండ) : నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్ దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తన కవిత్వాన్నే ఆయుధంగా మలచిన మహనీయుడు దాశరథి అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, కవి యాదగిరిరెడ్డి, రాజేష్, శ్రీనివాస్, కుసుమ, శారద, మల్లేష్, శ్రీను పాల్గొన్నారు. -
న్యాయవాదుల హక్కుల కోసం పనిచేస్తా
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదుల హక్కుల సాధనకు కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సామల రాంరెడ్డి స్పష్టం చేశారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికై న తర్వాత బుధవారం నల్లగొండ వచ్చిన ఆయనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ ఆకవరపు సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సామల రాంరెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకారం అందించిన నల్లగొండ బార్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. యువ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, లీగల్ ఎడ్యుకేషన్ సెమినార్లు నిర్వహించడంతో పాటు, మహిళా న్యాయవాదుల వృత్తిపరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. కార్యక్రమంలో నల్లగొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.అశోక్‌కుమార్, ఉపాధ్యక్షులు స్వామిగౌడ్, నూకల సంధ్యారాణి, జాయింట్ సెక్రెటరీ అమరావతి, కార్యవర్గ సభ్యులు జనిగల రాములు, జి.కిషోర్, స్వామిదాస్, అక్కినపల్లి మురళీధర్‌రావు, రామచంద్రరావు, జవహర్లాల్, జి.మోహన్, వెంకట్రాంరెడ్డి, అనంతుల శంకరయ్య పాల్గొన్నారు. -
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు వెనుకడుగు
ఫ జిల్లాలో ఇప్పటికీ 30 శాతమే పూర్తి ఫ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు ఫ అపోహలు వీడాలంటున్న వైద్యులుహెచ్పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అపోహలు ఉన్నాయి. వాటిని యుక్త వయసు బాలికల తల్లిదండ్రులు నమ్మవద్దు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ విధిగా తమ పిల్లలకు వేయించాలి. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ రాహుల్, డీఎంహెచ్ఓ నల్లగొండ టౌన్, కొండమల్లేపల్లి : గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నిరోధానికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్లో జిల్లా వెనుకంజలో ఉంది. వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు జిల్లాలో 30 శాతమే పూర్తయింది. 14 నుంచి 15 ఏళ్లలోపు వయస్సు కలగిన బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా 470 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 19,600 మంది 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనాలు వేసింది. వారందరికీ ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. మూడు నెలల క్రితం మహిళా దినోత్సవ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం 6,000 మంది బాలికలకు మాత్రమే అంటే కేవలం 30.61 శాతమే మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ.. జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రులు మర్రిగూడ సీహెచ్‌సీ, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు 30.61 ఒక శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి చేశారంటే ప్రజల్లో వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అవగాహన కల్పిస్తుందో స్పష్టమవుతోంది. మిగతా జిల్లాల్లో 70 నుంచి 80 శాతం వరకు టీకాలు పూర్తి అయినప్పటికీ కేవలం నల్లగొండ జిల్లాలోని 30.61 శాతానికి నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవగాహన కల్పించడంలో విఫలం ప్రతి సంవత్సరం చిన్నారుల ఆరోగ్యం కోసం విధిగా నిర్వహించే టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ విరివిగా అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో పల్స్ పోలియోపై గాని ఇతర టీకాల కార్యక్రమంపై గానీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వచ్చిన బడ్జెట్‌తోనే తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ బయట మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అత్యంత ఖరీదైన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై కూడా బాలికలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. టీకాలు వేయాల్సిన విభాగం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే భావన ప్రజల్లో నెలకొంది. కొండమల్లేపల్లి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో వ్యాక్సిన్ వేసుకున్న బాలికలు నల్లగొండలో టీకాలు వేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది -
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం
నల్లగొండ : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నల్లగొండలో డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో నీలగిరి జిల్లా మహిళా కిసాన్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన సందర్శించి ఆయన మాట్లాడారు. మహిళలు డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతున్న 50 మంది మహిళలతో మాట్లాడారు. డ్రోన్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ నైపుణ్యం సాధించాలని కోరారు. మహిళలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా తామే డ్రోన్ యూనిట్ల యజమానులుగా మారాలన్నారు. శిక్షణ పొందుతున్న ఆపరేటర్ విజయలక్ష్మి మాట్లాడుతూ సొంతకాళ్లపై నిలబడానికి సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మీరాయి సంస్థ స్థో విజయ్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సతీష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, ఏపీడీ శ్రవణ్‌కుమార్, శ్రీలేఖ, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
సీజనల్ వా్యధులపై అప్రమత్తం
నల్లగొండ టౌన్ : సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. టైఫాయిడ్, అతిసారా, మలేరియా, డెంగీ, చికున్ గున్యా తదితర వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. గతేడాది జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఏఏ వ్యాధులు ఎక్కువగా నమోదయ్యాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. జ్వర పీడితులకు అవసరమైన పరీక్షలు చేయటంతో పాటు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ప్రత్యేకంగా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు వారి పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా ప్రజలు అనారోగ్యాల పాలైతే వెంటనే ఆ గ్రామానికి చేరుకుని ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు.. స్లమ్ ఏరియాలను హైరిస్క్ ప్రాంతాలుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రధానంగా రైస్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఎక్కువ కాలుష్యాన్ని వెదజలే పరిశ్రమల ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే నిర్వహిస్తోంది. అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేస్తోంది. అవసరమైతే వారికి వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ అందుబాటులోని వైద్య సేవల కోసం ఏరియా ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. ఆరు సంవత్సరాలుగా సీజనల్ వ్యాధుల సంఖ్య ఇలా.. సంవత్సరం డెంగీ మలేరియా చికున్‌గున్యా 2021 57 1 – 2022 136 5 – 2023 241 4 4 2024 357 2 8 2025 45 2 0 2026 13 1 0 మొత్తం 846 14 12 ఫ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ ఫ కొనసాగుతున్న ఫీవర్ సర్వే ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఆవరణలో పూల కుండీలు, టైర్లు ఇతర వస్తువుల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు జాలి ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. మూడు రోజులు జ్వరం తగ్గకుండా ఉంటే ఒంటినొప్పులు, నీరసం, కడుపునొప్పి, బీపీ వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి తగిన వైద్య సేవలను పొందాలి. – డాక్టర్ రాహుల్, డీఎంహెచ్ఓ -
నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలి
రామగిరి(నల్లగొండ) : నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సీనియర్ న్యాయవాదులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జి.మోహన్ అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల బ్యానర్ ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా పోరాడుతున్న విద్యార్థి లోకానికి తమ సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈ కుట్రలో పాల్గొన్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ముట్టడికి బయలుదేరిన నిరసనకారులపై పోలీసులు తలలు పగిలేలా లాఠీఛార్జ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. జి.వెంకటేశ్వర్లు, అనంతుల శంకరయ్య మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షల్లో లీకేజీలు జరగడం వల్ల విద్యా వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దర్శనం నర్సింహ, కట్టా అనంతరెడ్డి, గుర్రం వెంకట్‌రెడ్డి, బ్రహ్మచారి, భువనగిరి రవి, నర్సాజి, నాగిరెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, కిషోర్‌కుమార్, పందుల సైదులు, అన్నపూసల ఐలేష్, పజ్జూరి స్వామిగౌడ్, శేఖర్, ఎన్.రాములు, సంద యాదయ్య, ఆవుల ప్రేమసుందర్, దున్న లింగస్వామి, బరిగల సైదులు, బి.వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, వెంకట్ ముదిరాజ్, శంకర్ ముదిరాజ్, సాయి పాల్గొన్నారు. ఫ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన -
రైతుల చూపు.. ఆరుతడి వైపు
బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం, ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వ్యవసాయశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రైతులు ఈ వానాకాలం సాగు విధానాన్ని మార్చుకుంటున్నారు. గతంలో ప్రధానంగా వరిపైనే ఆధారపడిన రైతులు ఈసారి ఆరుతడి పంటలు, ముఖ్యంగా కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇప్పటికే వర్షాధారంగా సాగు చేసే పత్తి విస్తీర్ణం అనేక మండలాల్లో పెరిగింది. నీటి లభ్యతపై స్పష్టత వచ్చే వరకు వరి నాట్లను వాయిదా వేస్తూ ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుంటున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులు చేసిన సేద్యాన్ని పరిశీలిస్తే వరి సాగు అంచనాలు గణనీయంగా తగ్గగా, పత్తి సాగు ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదవుతోంది. వరి సాగుకు వెనుకడుగు ఎల్‌నినో ప్రభావంతో రైతులకు వరిసాగుకు వెనకడుగు వేస్తున్నారు. కనగల్ మండలంలో ప్రతి ఏటా 40 వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఈసారి అది 20 వేల ఎకరాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నల్లగొండ మండలంలో గత ఏడాది 39 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 30 వేల ఎకరాలకు తగ్గే పరిస్థితి ఉంది. మిర్యాలగూడ, త్రిపురారం మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. నల్లగొండ, చింతపల్లి, దేవరకొండ, కొండమల్లేపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, నిడమనూరు, అనుముల, పెద్దవూర, తిరుమలగిరి, డిండి, వేములపల్లి, చిట్యాల తదితర మండలాల్లో కంది సాగు పెరుగుతోంది. అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి తదితర మండలాల్లో పెసర సాగు కూడా ప్రారంభమైంది. ఆయిల్‌పామ్ తోటల విస్తరణ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ బత్తాయి, నిమ్మ, మామిడి, ఆయిల్‌పామ్ తోటల విస్తీర్ణం జిల్లాలో స్థిరంగా కొనసాగుతోంది. అనుములలో సుమారు 5 వేల ఎకరాలు, పెద్దవూరలో 7,752 ఎకరాలు, నిడమనూరులో 3,800 ఎకరాలు, తిప్పర్తిలో 900 ఎకరాలు, తిరుమలగిరిలో 725 ఎకరాలు, చిట్యాల, కనగల్, మరికొన్ని మండలాల్లోనూ తోటలు సాగువుతున్నాయి. ఆయిల్‌పామ్ సాగు కూడా అనుముల, పెద్దవూర, తిప్పర్తి, నిడమనూరు తదితర మండలాల్లో విస్తరిస్తోంది.వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఆరుతడి పంట వేశా. గతేడాది సాగు చేసిన పత్తిలో అంతర పంటగా కంది వేశా. ఇప్పుడు ఒక ఎకరం మొత్తంలో కంది సాగు చేశా. మరో రెండెకరాల్లో వేరుశనగ వేశాను. ఈ పంటలకు పెట్టుబడితో పాటు కూలీల అవసరం తక్కువే. – పొలం ఈశ్వరయ్య, డిండి వరిసాగు చేయడానికి నీరు సరిపోవడంలేదు. దీంతో మూడెకరాల్లో దోసకాయ వేశాను. మరో ఆరెకరాల్లో దోస, వంకాయ సాగు చేయడానికి దుక్కి దున్ని సిద్ధం చేస్తున్నా. వర్షాలు లేకపోవడంతో వరిసాగు మానేసి కూరగాయల సాగు ఎంచుకున్నా. – కట్టా జగన్‌రెడ్డి, సిలార్మియాగూడెం, తిప్పర్తి మండలం నాకున్న 9 ఎకరాల్లో ఏటా వరి సాగు చేసేవాన్ని. వరి వేయాలంటే అధిక నీరు కావాలి. వర్షాభావ పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టాను. తక్కువ నీటి అవసరం ఉంటుందని అధికారులు చెప్పారు. – కోయగూర అంజిరెడ్డి, పగిడిమర్రి, కనగల్ మండలం ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన ఉన్నా వెంకటేశ్వర్లు. తనకున్న 8 ఎకరాలతోపాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. వరి వేద్దామని దుక్కి దున్నినా వర్షాలు లేకపోవడంతో 15 ఎకరాల్లో కంది చల్లారు. మిగతా 5 ఎకరాల్లో బోర్ల కింద వరి సాగు చేస్తున్నాడు.ఫ వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్నాయ పంటల సాగు ఫ తగ్గిన వరిసాగు.. పెరుగుతున్న కంది ఫ పత్తి వైపు రైతుల ఆసక్తి ఫ ఎల్‌నినో ప్రభావంతో సాగు విధానాన్ని మార్చుకుంటున్న రైతులు -
పీఆర్ఏఎన్తో న్యాయ సహాయం
రామగిరి (నల్లగొండ) : ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించడం, సామాజిక న్యాయ సాధనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘ప్రాజెక్ట్ పబ్లిక్ రిడ్రెస్సల్ అసోసియేటెడ్ నెట్వర్క్’ (పీఆర్ఏఎన్) రూపొందించినట్లు నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్లగొండ ప్రాజెక్ట్ అసోసియేట్ దాసరి అభిషిక్త మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం, ప్రాథమిక పరిశీలన, చట్టపరమైన సలహాలు ఇవ్వడం, జిల్లా న్యాయ సేవల సంస్థకు రిఫర్ చేయడం, కౌన్సెలింగ్, మధ్యవర్తిత్వం, సమస్య పరిష్కారమయ్యే వరకు ఫాలో అప్ సేవలను అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అన్నారు. ప్రజలకు ప్రాజెక్ట్ సేవలను నేరుగా చేరవేయడం, అవగాహన సదస్సులు నిర్వహించడం, ఫిర్యాదుల సమన్వయంలో భాగస్వామ్య బాధ్యతలు వహిస్తుందని చెప్పారు. న్యాయ సహాయం లేదా ఫిర్యాదుల పరిష్కారం కోసం అవసరమైన బాధితులు, ప్రజలు 93815 92181 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ -
భూ రీ సర్వే పరిశీలన
కనగల్ : మండలంలోని జంగమయ్యగూడెం గ్రామంలో భూ రీ సర్వేను అసిస్టెంట్ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయా అని సర్పంచ్ నల్లబోతు నిర్మలను అడిగారు. వ్యవసాయ సీజన్ కావడంతో ఉపాధి పనులను నిలిపివేశారని సర్పంచ్ వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ మర్రి యాదగిరి, సర్వేయర్ మధు, జీపీఓలు పద్మ, సూరారం జనార్దన్, జూనియర్ అసిస్టెంట్ లతీఫ్ పాల్గొన్నారు. -
తాగునీటి కొరత రాకుండా చూడాలి
నల్లగొండ : జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలను వారానికి రెండుసార్లు సందర్శించి నివేదికలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీలు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. మునుగోడు ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున బోర్లు మరమ్మతులు చేసి ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావ పాల్గొన్నారు. ప్రమాదాల నియంత్రణే లక్ష్యం జాతీయ రహదారులపై ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో స్పెషల్ సీఎస్, రవాణా రోడ్డు భవనాల శాఖ వికాస్‌రాజ్ హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. జాతీయ రహదారుల వెంట పోలీస్, రవాణాశాఖ అధికారులు నిత్యం పెట్రోలింగ్ చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్ల వివరాలు మ్యాపింగ్ చేసి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ, జిల్లా రవాణా అధికారి శ్రీవాణి పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో వేగం పెంచాలి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారంలోగా జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ 90 శాతానికి చేరుకోవాలన్నారు. సర్ ఎన్యుమరేషన్ ఫారంలో ఆధార్ నంబరు నమోదు చేయడం కేవలం ఐచ్చిక మాత్రమే అని, తప్పనిసరి కాదన్నారు.ఫ కలెక్టర్ చంద్రశేఖర్ -
ఆపన్నులకు అండగా ‘కై ండ్‌నెస్ వాల్’
నల్లగొండ : ఒకరు ఇచ్చే చిన్న సహాయం మరొక కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని.. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అదనపు ఎస్పీ జి.రమేష్ అన్నారు. మంగళవారం నల్లగొండలో ‘నవయువ ఫౌండేషన్’ ఏర్పాటు చేసిన ‘కైండ్‌నెస్ వాల్’ (మానవత్వపు గోడ)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను పారేయకుండా, అవసరమైన వారికి అందించే గొప్ప ఆలోచనతో ‘కైండ్‌నెస్ వాల్’ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం చిన్నారులకు పాత బొమ్మలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శివరాంరెడ్డి, పెట్రోల్ బంక్ ఇన్చార్జ్ బి.సంతోష్ (ఆర్ఐ), కె.నాగరాజు (ఆర్ఎస్ఐ), విజయ, ఫౌండేషన్ సభ్యులు కె.విష్ణువర్ధన్ రెడ్డి, ఎం.హరీష్, వి.మనీష్ కుమార్‌రెడ్డి, ఎం.గోపీనాథ్ రెడ్డి, పి.లక్ష్మీ ప్రసన్న, సంధ్య, బి.చందు, అమూల్య, వంశీ, హరినాథ్‌రెడ్డి ఉన్నారు. -
టీజీసీజీటీఏ కార్యవర్గాల ఎన్నిక
రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం (టీజీసీజీటీఏ) ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో యూనిట్ స్థాయి ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అన్ని కళాశాలల యూనిట్ కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) నల్లగొండ యూనిట్ ప్రెసిడెంట్‌గా ప్రొఫెసర్ టి.అరవింద, సెక్రటరీగా ఈ.రాంరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎస్.రాజారామ్, హాలియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎండీ.హసేన, సెక్రటరీగా డాక్టర్ జి.యాదగిరి, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా భీమార్జున్‌రెడ్డి, సెక్రటరీగా డాక్టర్ బి.రవీందర్‌ని ఎన్నుకున్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా కె.ప్రవీణ్‌రెడ్డి, సెక్రటరీగా కె.హరిత, నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రెసిడెంట్‌గా కె.శివరాణి, సెక్రటరీగా ఎం.వెంకట్‌రెడ్డి, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఎన్ఎల్.నీలిమ, సెక్రటరీగా డాక్టర్ రవీందర్రావును ఎన్నుకున్నారు. -
ప్రభుత్వవిప్ వేముల వీరేశంకు మంత్రి హోదా
నకిరేకల్ : ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే వేముల వీరేశంను మార్చిలో ప్రభుత్వ విప్‌గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు మంత్రి హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ జీఓ ఆర్టీ నంబర్ 1064 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయనకు ప్రభుత్వ విప్ పదవీకాలం ముగిసే వరకు రాష్ట్ర మంత్రులకు కల్పించే ప్రొటోకాల్ నిబంధనలు వర్తించనున్నాయి. రాష్ట్రంలోని అన్ని శాఖలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, సంబందిత విభాగాలు అవసరమైన ప్రొటోకాల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశించింది. ఎడమకాల్వ లైనింగ్ పనుల పరిశీలననిడమనూరు : సాగర్ ఎడమకాల్వ సీసీ లైనింగ్ పనులను క్వాలిటీ కంట్రోల్, ఎన్ఎస్పీ అధికారులు మంగళవారం పరిశీలించారు. ప్రధాన కాల్వ 37.5 కిలోమీటరు వద్ద సీసీ పనుల నాణ్యతను పరిశీలించారు. సీసీ పనుల్లో రెండు రకాల కంకర, రాక్ సాండ్, ఫ్లై యాష్ వాడుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాక్‌సాండ్, ఇసుక 4:3 నిష్పత్తిలో వాడుతున్నట్లు అధికారులకు వివరించారు. ఇసుక వాడకం పెరగాలని అధికారులకు సూచించారు. క్యూరింగ్‌పై శాంపిళ్లు సేకరించారు. పరిశీలనలో క్వాలిటీ నియంత్రణ అధికారులతోపాటు డీఈ స్వామి, గోపినాథ్, ఏఈ అశోక్ ఉన్నారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు నకిరేకల్ : నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం–1, కామర్స్–2, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 చొప్పున మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 28న నల్లగొండలోని ఎన్జీ కళాశాలో జరిగే ఇంటర్వ్యూకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. దేశ రాజకీయాలను శాసించేది యువతే..నల్లగొండ టౌన్ : దేశ రాజకీయాలను శాసించే శక్తి యువతరంలోనే ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం సీసీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ ఉద్యోగ పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు, అన్నమల్ల నవీన్, యషబోయిన మల్లేశం, గడ్డం నవీన్, బండారు శంకర్, జూలూరు వెంకటాచారి, దశరథ, బాబి పాల్గొన్నారు. -
కుక్కను వెతికిపెడితే రూ.10వేల బహుమతి
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్‌కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం. -
ఆ హోటల్ వద్ద ఆగితే అంతే..!
నల్గొండ జిల్లా: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్ దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి రాత్రివేళ హైదరాబాద్‌కు వెళ్లే ప్రైవేట్, ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు టీ, టిఫిన్ కోసం ఈ హోటల్ వద్ద ఆపుతుంటారు. దీంతో అక్కడే మాటువేస్తున్న దోపిడీ దొంగలు పక్కా స్కెచ్‌తో ప్రయాణికుల సొమ్మును దోచేస్తున్నారు. హైవేపై ఎన్నో హోటళ్లు ఉన్నప్పటికీ.. కేవలం ఈ హోటల్ వద్దే పదేపదే దొంగతనాలు జరుగుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లలో నాలుగు.. గడిచిన నాలుగేళ్లలో ఆ హోటల్ ఆవరణలోనే నాలుగు భారీ చోరీలు జరిగాయి. 2022 నవంబర్ 22న విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును హోటల్ వద్ద ఆపగా.. ఓ ప్రయాణికుడికి సంబంధంచిన కిలో 300 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. అదేవిధంగా 2023 జూలై 26న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుడికి చెందిన రూ.28 లక్షల నగదును ఈ హోటల్ వద్దే దొంగలు అపహరించారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఇప్పటికీ దొరకలేదు. 2025 ఫిబ్రవరి 9న ఈ హోటల్ వద్ద ఆపిన బస్సులో నుంచి రూ.25 లక్షలు చోరీ చేసి కారులో పారిపోతున్న ముఠాను అప్పటి ఎస్ఐ క్రాంతికుమార్ సీసీ కెమెరాల ఆధారంగా మధ్యప్రదేశ్‌కు వెళ్లి పట్టుకున్నారు. రికవరీ చేసిన నగదును బాధితుడికి అప్పగించారు. తాజాగా ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈ హోటల్ వద్ద ఆగగా.. ఓ ప్రయాణికుడు రూ.9లక్షల నగదు ఉన్న బ్యాగును పక్కన పెట్టుకుని టిఫిన్ చేస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా బ్యాగును లాక్కొని అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కారులో పరారయ్యారు. సినిమా ఫక్కీలో చోరీ..ఈ దోపిడీ ముఠాలు పక్కా ప్రణాళికతోనే సినిమా ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దొంగలు ముందుగానే కారులో వచ్చి హోటల్ వద్ద మాటు వేస్తున్నారు. బస్సులు ఆగగానే ప్రయాణికులను గమనిస్తూ, నగదు లేదా నగలు ఉన్న బ్యాగులను టార్గెట్ చేస్తున్నారు. తరచూ ఆ హోటల్ వద్ద పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలువరుస చోరీల నేపథ్యంలో çహోటల్ వద్ద పోలీసులు సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. తాజాగా జరిగిన దోపిడీపై నార్కట్‌పల్లి సీఐ సిరికొండ సురేష్, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీసీఎస్ సమన్వయంతో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. హోటల్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, జిల్లా సరిహద్దుల్లోని నాలుగు టోల్ ప్లాజాల డేటా, మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయులు
మర్రిగూడ : పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు మర్రిగూడ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. మర్రిగూడ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. కాగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ముప్పును నివారించేందుకు ఎంఈఓ జి.శారద అనుమతితో రిసోర్స్ పర్సన్ ఉదావత్ లచ్చిరాం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రాజాపేటతండా సర్పంచ్ కొడాల వెంకట్‌రెడ్డి కాంప్లెక్స్‌కు అవసరమైన 50 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ బాటిళ్లను విరాళంగా అందించారు. దీంతో శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరు స్టీల్ ప్లేట్లలో భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం జటావత్ రూప్సింగ్, లచ్చిరాం, వెంకటేశ్వర్లు, రజనీకాంత్, నాగేంద్ర, బాలరాజు, శ్రీశైలం, వెంకటయ్య, ఉపేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మూసీ మత్స్య సంఘం ఎన్నిక
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్ సహకార సొసైటీ చైర్మన్, ఇతర పదవుల ఎన్నికల ప్రక్రియ సోమవారం ముగిసింది. అలువాల వెంకటస్వామి చైర్మన్‌గా రెండవసారి ఎన్నికయ్యారు. సెక్రటరీ ఇతర పదవులను తన ప్యానెల్‌కు దక్కించుకున్నారు. 13 మంది డైరెక్టర్ల ఎన్నిక మూసీ మత్స్య సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. మూసీ ప్రాజెక్టు పరిధిలోని నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 13 డైరెక్టర్ పదవులకు గాను 43 మంది పోటీ పడ్డారు. గత నెల 25వ తేదీన నకిరేకల్ మండలం ఓగోడులో ఓటింగ్ నిర్వహించారు. 13 మంది డైరెక్టర్లుగా విజయం సాధించారు. వీరిలో ఆ సంఘం మాజీ చైర్మన్లు అలువాల వెంకటస్వామి ప్యానల్లో ఏడుగురు, సాదుల నర్సయ్య ప్యానల్లో ఐదుగురు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. చైర్మన్ పదవిని దక్కించుకనేందుకు రెండు ప్యానళ్లు వ్యూహలు రచించాయి. చైర్మన్, ఆఫీస్ బేరర్ల ఎన్నిక కోసం రెండు దఫాలు తేదీలు ప్రకటించినా.. వివిధ కారణాలతో ఎన్నిక వాయిదా పడింది. బాలెట్ పద్ధతిన చైర్మన్ ఎన్నిక నల్లగొండ పట్టణంలోని మహిళా ప్రాంగణంలో సోమవారం మూసీ మత్స్య సంఘం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఈ ఎన్నిక సమావేశానికి హాజరయ్యారు. చైర్మన్ పదవుల కోసం అలువాల వెంకటస్వామి, సాదుల నర్సయ్య నామినేషన్లు వేయగా రహస్య బ్యాలెట్ పద్దతి ద్వారా అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. అలువాల వెంకటస్వామికి ఎనిమిది ఓట్లురాగా.. సాదుల నర్సయ్యకు ఐదు ఓట్లు వచ్చాయి. దీంతో చైర్మన్‌గా అలువాల వెంకటస్వామి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా భూపతి జానకిరాములు, కార్యదర్శిగా అంబటి అంజమ్మ, సభ్యులుగా పేరెల్లి అంజయ్య, గోడ్డెటి చంద్రమ్మ, సాదుల నర్సయ్య, భూపతి శ్రీనివాస్, అల్లి రామ్మోహన్‌రాజు, బత్తిని సైదులు, గొడ్డెటి రవి, వెలుగు సైదులు, ఈదుల సరేష్, మాద లక్ష్మీనారాయణ నియామకం అయ్యారు. ఎన్నికై న నూతన పాలకవర్గానికి సహకార అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికై న పాలకవర్గం గడువు 2031 జూన్ 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఫ చైర్మన్‌గా అలువాల వెంకటస్వామి ఫ తొమ్మిదేళ్ల తర్వాత పాలకవర్గం


